బాలకృష్ణ కొత్త సినిమా.. విలన్‌గా మంచు హీరో | Manchu Manoj Will Enter In Balakrishna NBK 111 Movie | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ కొత్త సినిమా.. విలన్‌గా మంచు హీరో

Mar 6 2026 8:27 AM | Updated on Mar 6 2026 8:44 AM

Manchu Manoj Will Enter In Balakrishna NBK 111 Movie

బాలకృష్ణ- దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా పట్టాలెక్కనుందనే విషయం తెలిసిందే. ‘వీరసింహారెడ్డి’ మూవీ తర్వాత వీరి కాంబోలో ‘NBK111’(వర్కింగ్‌ టైటిల్‌) కొత్త ప్రాజెక్ట్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. ఈ మూవీని వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో మంచు మనోజ్‌ ప్రధాన విలన్‌గా నటించబోతున్నట్లు నెట్టింట వార్తలు వస్తున్నాయి. ‘మిరాయి’లో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్‌కు భారీ ఆఫర్లు వస్తున్నప్పటికీ కథ నచ్చితేనే ఓకే చెబుతున్నాడు. ఈ క్రమంలోనే బాలకృష్ణతో సినిమా ఛాన్స్‌ రావడం ఆపై స్టోరీ నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం.

ముంబై నేపథ్యంలో సాగే స్టైలిష్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ఉంటుందని సమాచారం. మార్చిలో చిత్రీకరణ ప్రారంభకానుంది. బాలయ్య గత చిత్రాల్లా కాకుండా ఇందులో ఆయన ఒకే పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే  స్టైలిష్‌గా కనిపించే విలన్‌ పాత్ర కోసం మనోజ్‌ను ఎంపిక చేశారట. అందుకు ఆయన కూడా ఒప్పుకున్నారట. గతంలో మనోజ్‌ హీరోగా నటించిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రంలో బాలకృష్ణ గెస్ట్‌ రోల్‌లో కనిపించిన విషయం తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement