డేరింగ్‌ బైక్‌ రేసర్‌ | Biker movie Grand release on April 3rd | Sakshi
Sakshi News home page

డేరింగ్‌ బైక్‌ రేసర్‌

Mar 6 2026 3:20 AM | Updated on Mar 6 2026 3:20 AM

Biker movie Grand release on April 3rd

శర్వానంద్‌ హీరోగా నటించిన చిత్రం ‘బైకర్‌’. అభిలాష్‌ కంకర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటించారు. రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రలుపోషించారు. విక్రమ్‌ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ–ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 3న రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ మూవీ గురించి ఓ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ‘‘ఈ చిత్రం డాల్బీ సినిమా, ఈపీఐక్యూ, 4డీఎక్స్, పీసీఎక్స్‌ వంటి ప్రీమియం ఫార్మాట్లలోనూ విడుదల కానుంది.

దీని ద్వారా ప్రేక్షకులకు మరింత అద్భుతమైన థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందుతుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ‘‘కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూ΄÷ందిన చిత్రం ‘బైకర్‌’. ఇందులో శర్వానంద్‌ డేరింగ్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ మోటార్‌ సైకిల్‌ రేసర్‌ పాత్రలో కనిపిస్తారు.

ఈ పాత్ర కోసం ఆయన చేసిన ఫిజికల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రతి బైక్‌ రోర్, ప్రతి ఎమోషనల్‌ సీన్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. నటుడు రాజశేఖర్‌ ‘బుల్లెట్‌ సునీల్‌’ అనే ఎక్స్‌ మోటోక్రాస్‌ లెజెండ్‌ పాత్రలో కనిపిస్తారు’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: యువరాజ్‌.

Advertisement
 
Advertisement
Advertisement