నభా నటేష్, ఐశ్వర్యా మీనన్
విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘నాగబంధం’. నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ నామా దర్శకత్వంలో ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ పతాకంపై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘నమో రే’ పాటను ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘‘అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ప్రతిబింబించే భారీ సెట్లో ఈ పాటను చిత్రీకరించాం.
ఆ నారాయణుడిని కీర్తిస్తూ సాగే ఈ ఆధ్యాత్మిక పాట ఈ చిత్రానికే ఓ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. వెయ్యి మంది డ్యాన్సర్స్ పాల్గొనగా, భారతీయ నృత్య కళల వైవిధ్యం, ఐక్యతను ప్రతిబింబించేలా అద్భుతమైన విజువల్‌తో ఈ పాట ఉంటుంది.
జునైద్ కుమార్ – అభే సంగీత సారథ్యంలోని ఈ ‘నమో రే’ సాంగ్‌కు శ్రీహర్ష ఇమాని సాహిత్యం అందించగా, సింధుజా శ్రీనివాసన్, ఐశ్వర్య దారురి ఆలపించారు. నభా నటేష్, ఐశ్వర్యా మీనన్‌ల సాంప్రదాయ వేషధారణ, నటనతో ఈ పాట విజువల్ గ్రాండియర్‌లా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది.


