మృత్యుంజయ్‌ని ఎంజాయ్‌ చేస్తారు: శ్రీ విష్ణు | Sri Vishnu About Mrityunjay Movie | Sakshi
Sakshi News home page

మృత్యుంజయ్‌ని ఎంజాయ్‌ చేస్తారు: శ్రీ విష్ణు

Mar 6 2026 12:08 AM | Updated on Mar 6 2026 12:08 AM

Sri Vishnu About Mrityunjay Movie

హుస్సేన్‌ షా కిరణ్, రమ్య గుణ్ణం, రెబా మోనికా, శ్రీ విష్ణు, సందీప్‌ గుణ్ణం

‘‘మృత్యుంజయ్‌’ మూవీ ప్రీమియర్‌ షోకి వచ్చిన వారి స్పందన చూశాను. అందరూ చాలా ఎంజాయ్‌ చేశారు. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఎంజాయ్‌ చేస్తారు. రాజమౌళిగారి నుంచి మా సినిమా ప్రమోషన్‌ స్టార్ట్‌ అయింది. ఎన్టీఆర్‌గారు ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. నానీగారు మా మూవీ చూసి, మెచ్చుకున్నారు. మంచి కంటెంట్‌ ఉన్న ఈ సినిమాని సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అని హీరో శ్రీ విష్ణు తెలిపారు.

హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వంలో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్‌ జంటగా నటించిన చిత్రం ‘మృత్యుంజయ్‌’. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్‌ బాక్స్‌ మీడియా, పిక్చర్‌ పర్ఫెక్ట్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్లపై సందీప్‌ గుణ్ణం, వినయ్‌ చిలకపాటి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా చిత్రాన్ని ప్రదర్శించారు.

అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హుస్సేన్‌ షా కిరణ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో శ్రీ విష్ణుగారు  రి΄ోర్టర్‌గా నటించారు. రెబా మోనికా పోలీస్‌ ఆఫీసర్‌గా చేశారు’’ అని చె΄్పారు. ‘‘ఈ మూవీ కోసం మా టీమ్‌ నిద్రలేని రాత్రులు గడిపి, పని చేసింది. సినిమా అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు సందీప్‌ గుణ్ణం. ‘‘ఈ సినిమా పట్ల మేం ఎంతో గర్వంగా ఉన్నాం’’ అన్నారు రెబా మోనికా జాన్‌. నటీనటులు మనీషా ఎ. దత్, రమ్య, సుదర్శన్, అయ్యప్ప శర్మ, రచ్చ రవి మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement