రాజమండ్రి కల్తీ పాల ఘటన.. మరో మహిళ మృతి | Venkata Laxmi Death In Adulterated Milk | Sakshi
Sakshi News home page

రాజమండ్రి కల్తీ పాల ఘటన.. మరో మహిళ మృతి

Mar 5 2026 1:46 PM | Updated on Mar 5 2026 1:53 PM

Venkata Laxmi Death In Adulterated Milk

సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరో మహిళ మరణించింది. లాలాచెరువుకు చెందిన వెంకటలక్ష్మి (69) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. దీంతో, కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. అయితే, అనధికారికంగా ఇప్పటివరకు పదిమంది మృతి చెందినట్టు సమాచారం.

ఇక, రాజమండ్రి కల్తీ పాల బాధితులు వరుసగా నాలుగు రోజులుగా రోజుకొకరు చొప్పున ప్రాణాలు విడుస్తున్నారు. కల్తీ పాలతో అనారోగ్యం పాలై ఇంకా 11 మంది నాలుగు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురికి వైద్యులు..వెంటిలేటర్‌పై డయాలసిస్ చేస్తున్నారు. అలాగే, మరో నలుగురికి డయాలసిస్ కొనసాగుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement