బీఆర్‌ నాయుడిని వెంటనే తప్పించాలి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు | AP Assembly Session Mar 5th Live Updates | Sakshi
Sakshi News home page

బీఆర్‌ నాయుడిని వెంటనే తప్పించాలి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు

Mar 5 2026 10:19 AM | Updated on Mar 5 2026 12:05 PM

AP Assembly Session Mar 5th Live Updates

ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్‌..

శాసనమండలి మీడియా పాయింట్..

ఉద్యోగాలపై ప్రశ్న..

  • నిరుద్యోగ యువతకు ఆర్ధిక సాయంపై సభలో ప్రశ్నించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్
  • ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్‌..
  • 5,72, 280 ఉద్యోగాలిచ్చామని మంత్రి చెబుతున్నారు
  • వైఎస్‌ జగన్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన ప్రభుత్వం ఇది
  • పట్టుమని 15 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారు
  • రాష్ట్రంలో నిరుద్యోగుల లెక్క ఏమైనా ఉందా?
  • నిరుద్యోగుల కోసం ఏమైనా కమిటీ వేశారా?
  • సాక్షాత్తూ సీఎం చంద్రబాబు 6,28,320 ఉద్యోగాలిచ్చామని చెప్పారు
  • ఉద్యోగాలపై సీఎం చెప్పింది అబద్ధమా మంత్రి చెప్పింది అబద్ధమా?
  • ఏపీలో 8.2% శాతం నిరుద్యోగం ఉందని కేంద్రం చెప్పింది
  • 20 లక్షల ఉద్యోగాలు, మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి హామీ ఏమైంది

ఎమ్మెల్సీలు భరత్, తూమాటి మాధవరావు కామెంట్స్‌..

  • టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని తక్షణమే తప్పించాలి
  • బీఆర్ నాయుడి చరిత్ర గురించి ఇందులేఖ అనే మహిళ చంద్రబాబు లేఖరాశారు
  • అలాంటి వ్యక్తిని చంద్రబాబు ఎలా చైర్మన్ గా నియమిస్తారు
  • బీఆర్ నాయుడు వంటి వ్యక్తి చైర్మన్‌గా కొనసాగడం వల్ల తిరుమల పవిత్ర దెబ్బతింటోంది
  • ఎన్నో ఫిర్యాదులు వచ్చినా బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్‌గా నియమించారు
  • అపవిత్రమైన వ్యక్తిని టీటీడీ చైర్మన్ చేయడం వల్లే తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయి
  • 30 ఏళ్ల నుంచి ఆ మహిళతో తనకు సంబంధం ఉందని బీఆర్ నాయుడు చెబుతున్నారు
  • భగవద్గీతలో ఏముందని మాట్లాడటానికి నువ్వు అసలు మనిషివేనా?
  • రెండు మీడియా సంస్థల మధ్య జరుగుతున్న యుద్ధంలో వైఎస్సార్‌సీపీని బలిచేయాలని చూస్తున్నారు
  • సోషల్ మీడియాలో మీ వీడియోలు బయటికి వచ్చాయి
  • హిందూ ధర్మాన్ని కాపాడటం కోసమే మేం పోరాడుతున్నాం
  • బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం.

ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్‌..

  • బీఆర్ నాయుడు అత్యంత కళంకితుడు
  • అలాంటి వ్యక్తిని చంద్రబాబు టీటీడీ చైర్మన్‌ను చేశారు
  • చంద్రబాబుకి హిందువులంటే గౌరవం ఉంటే బీఆర్ నాయుడిని  వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలి
  • బీఆర్ నాయుడు చాలా నీచంగా మాట్లాడుతున్నారు
  • భగవద్గీత అంటే గౌరవం లేని వ్యక్తి టీటీడీ చైర్మన్‌గా కొనసాగడానికి అర్హుడా?.
  • మీకు వ్యాపారాలే ముఖ్యమైతే తక్షణమే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయండి
  • బీఆర్ నాయుడిని చైర్మన్‌గా చేసిన తర్వాతే తిరుమల అపవిత్రమైంది
  • లడ్డు కల్తీ ప్రచారంతో కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారు
  • వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు చావుకు కారణమయ్యారు
  • గోశాలలో భారీగా గోవులు చనిపోయాయి
  • బీఆర్ నాయుడు నైతిక విలువలు లేని వ్యక్తి
  • అందుకే తిరుమలలో అనేక అపచారాలు జరుగుతున్నాయి
  • హీరోయిన్లకు 15 నిమిషాల్లో దర్శనం చేయిస్తారు.
  • సామాన్య భక్తులను గాలికి వదిలేస్తారు.
  • హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, పవన్, బీఆర్ నాయుడికి ఉందా?  
  • టీడీపీ అంటే టెంపుల్ డెమాలిష్ పార్టీ
  • హిందూ మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు
  • లడ్డూ విషయంలో పవన్ దుర్గగుడి మెట్లు కడిగారు
  • సనాతన ధర్మం కోసం పనిచేస్తానన్న పవన్ ఇప్పుడు ఏ మెట్లు కడుగుతారు
  • కళంకిత వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా చేసినందుకు పవన్ తిరుమల మెట్లు కడగరా?. 

సమావేశాలు ప్రారంభం.. 

  • ప్రారంభమైన మండలి సమావేశాలు
  • మండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల వాయిదా తీర్మానం
  • కళంకిత టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడును తొలగించాలని కోరుతూ వాయిదా తీర్మానం
  • వాయిదా తీర్మానం ఇచ్చిన ఎమ్మెల్సీలు తుమాటి మాధవరావు, వరుదు కల్యాణి, భరత్
  • వైఎస్సార్‌సీపీ తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్
  • వాయిదా తీర్మానంపై చర్చించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల నినాదాలు
  • బీఆర్‌ నాయుడును తొలగించాలని నినాదాలు
  • వైఎస్సార్‌సీపీ సభ్యుల నినాదాలతో మండలి వాయిదా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement