breaking news
TTD
-
ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు.. BR నాయుడు రాసలీలలపై జగన్ సెటైర్లు
-
ఆకు రౌడీలంతా బీఆర్ నాయుడు చెంత చేరారు: భూమన
సాక్షి, తాడేపల్లి: ఆకు రౌడీలంతా బీఆర్ నాయుడు చెంత చేరారంటూ వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆకు రౌడీలను బీఆర్ నాయుడు పెంచి పోషిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘తిరుమల అరాచక శక్తుల, అసాంఘిక కార్యక్రమాలతో తల్లడిల్లుతోంది. బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత టీటీడీ ఔన్నత్యం, విశిష్టత దెబ్బతింది. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు పూర్తిగా అనర్హుడు. బీఆర్ నాయుడు తీరుపై రాష్ట్ర ప్రజలు, హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వం వెనకేసుకొస్తోంది.’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ.300 రూపాయల టికెట్లను కూడా ఆకు రౌడీలకు ఇచ్చి టీటీడీ ఛైర్మన్ వాళ్ళని పోషిస్తున్నారు. టీటీడీ చైర్మన్ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపితే ఆకు రౌడీలు మా వారిపై దాడి చేశారు. శాంతి యుతంగా నిరసన తెలిపిన మహిళలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. అనుగ్రహ భాషనలతో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియాల్సిన చోట ఆకు రౌడీల బూతులు వినిపిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై ఉద్యమ నాయకుడిగా 50 ఏళ్ల క్రితమే పోరాటం చేశాను’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. .శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు. సోమవారం అర్ధరాత్రి వరకు 70,606 మంది స్వామిని దర్శించుకున్నారు. 28,415 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.39 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 7 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
తిరుమల లడ్డూ బాగాలేదు.. బీజేపీ మాధవి లతా సంచలన వ్యాఖ్యలు
-
తిరుమలలో భక్తుల ఆందోళన
తిరుమల: దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్నా.. ప్రాథమిక సదుపాయాలు కూడా కల్పించలేదంటూ తిరుమలలో భక్తులు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చి నారాయణగిరి షెడ్లలో గంటల తరబడి వేచి ఉన్న తమకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేదంటూ నిరసన తెలిపారు. కొందరు భక్తులు టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షెడ్లలో రద్దీ పెరిగిపోయినా తాగునీరు, విశ్రాంతి, పరిశుభ్రత, గాలి ప్రసరణ వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా తగినంతగా కల్పించలేదని చెప్పారు.వృద్ధులు, పిల్లల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. ఈ ఇబ్బందుల నేపథ్యంలో పలువురు భక్తులు టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. దర్శన నిర్వహణలో లోపాలు, షెడ్లలో అవ్యవస్థ పరిస్థితులపై నినదించారు. భక్తుల నినాదాలతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో వైరల్: భక్తులు నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై భక్తులు, నెటిజన్లు స్పందిస్తూ.. తిరుమలలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా భక్తుల నినాదాలు
-
తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డులో జంతువు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా అని వ్యాఖ్యానించింది. ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోంది. ఏదైనా ఆధారాలుంటే సీబీఐకి అప్పగించాలని సూచించింది. -
అయ్యా TV5 సాంబా మీ సార్ కు ఏడు కొండలు గుర్తు రావడం లేదా? BR నాయుడు మిస్సింగ్...
-
24 సార్లు దొంగతనం చేస్తుంటే.. కాపలా కుక్క ఏం చేస్తుంది?
-
వెంకన్న ఆలయానికి భూములడిగితే కోట్లు వసూలు చేస్తారు
-
కోట్లల్లో స్కాం.. బయటపడ్డ బాబు కల్తీ బాగోతం
-
‘దేవుడికి దాతలు భూములిస్తారు.. మీరు దేవుడికి భూములు అమ్ముతారు’
తిరుపతి: తిరుమల శ్రీవారిని కూడా రాజకీయ అవసరాలకు వాడుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. టీటీడీ చరిత్రలో ఆలయాలకు భూమి కొన్నది లేదని, కానీ అమరావతి వెంకటాయపాలెంలో టీటీడీ ఆలయానికి భూమి కొన్నారని మండిపడ్డారు. వెంకటాయపాలెంలో దేవాలయ నిర్మాణానికి స్థలాన్ని దాతలు కానీ, సంస్థలు కానీ ఇస్తాయని, మరి దాన్ని పక్కనపెట్టి భూమి కొనడం ఏంటని ప్రశ్నించారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వతేదీ) తిరుపతి నుంచి మాట్లాడిన భూమన.. ‘ దేవుడికి దాతలు భూములిస్తారు.. మీరు దేవుడికి భూములు అమ్ముతారు.ఉచితంగా టీటీడీ భూమి కోరితే సవాలక్ష నిబంధనలు పెట్టారు. వివిధ సంస్థలకు మాత్రం ఉచితంగా భూములు కేటాయించారు. టీటీడీ రూ. 12 కోట్ల సొమ్మును సీఆర్డీఏ వెనక్కి ఇవ్వాలి. మహిళల జోలికొచ్చిన టీటీడీ చైర్మన్‌ను చూస్తే అసహ్యించుకుంటున్నారు’ అని విమర్శించారు.ఎవరూ ఈ సాహసం చేయలేదు..నవీ ముంబైలో అప్పటి సీఎం ఏక్ నాథ్ షిండే వెంకటేశ్వర స్వామి ఆలయంకు ఉచితంగా స్థలం కేటాయించారు. జమ్మూకశ్మీర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూలో ఉచితంగా శ్రీవారి ఆలయం నిర్మాణంకు ఉచితంగా స్థలం కేటాయించారు. పల్లవ మహారాణి సమవాయి, చోళ రాణి పరాంతక మణి, యాదవ రాజులు, విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కౌనకాలు, ఆస్తులు ఇచ్చారు. టీటీడీ చరిత్రలో ఏ ఒక్క చోట దేవాలయాలకు స్థలం కొన్నది లేదు. సీఎం చంద్రబాబు అమరావతి వెంకటాయ పాలెంలో 25 ఎకరాలు వెంకటేశ్వర స్వామి ఆలయంకు స్థలం కొనుగోలు చేశారు. ఎకరా 50 లక్షలకు అమ్మారు. రూ. 12 .50 కోట్లు ధర చెల్లించారు. ప్రపంచంలో ఏ ఒక్కరు ఇలాంటి సాహసం చేయలేదు. ఆర్థికంగా వివిధ సంస్థలకు ఏపీ ప్రభుత్వం భూములు కేటాయింపు ఉచితంగా చేసింది. ఏపీ హ్యూమన్ రిసోర్స్ సంస్థకు ఉచితంగా స్థలాలు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం సంస్థ సెంట్రల్ ఇనిస్టిట్యూటల్ డిజైన్ ఉచితంగా భూమి కేటాయింపు చేసింది. మరి అమరావతిలో టీటీడీ ఆలయం నిర్మాణంకు రూ. 12.50 కోట్లతో కొనుగోలు చేశారు. వ్యాపార రాజధాని కు వెంకటేశ్వర స్వామి వాణిజ్య అవసరాలకు వాడుకున్నారని స్పష్టంగా అర్థం అవుతోంది. తమిళనాడు చెన్నై జీ స్క్వేర్ రియల్ ఎస్టేట్ సంస్థ స్థలంలో వెంకటేశ్వర ఆలయం నిర్మాణం చేస్తున్నారు. చెన్నై ఆలయం విస్తరణకు టీటీడీ దాతలు సహాయంతో చేశారు. నటి కాంచన ఇచ్చిన స్థలంలో అమ్మవారు ఆలయం నిర్మాణం చేశారు. బీఆర్ నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు..గత ఏడాది కాలంగా మీరు చేస్తున్న అరాచకాలతో, హిందువులను అపహాస్యం చేస్తున్నారు.. భగవద్గీత పై రూ. 50 కోట్లు ఖర్చు అని బీఆర్ నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కోటి పుస్తకాలకు 52 లక్షలు పుస్తకాలు ప్రింట్ అయ్యాయి, భగవద్గీతకు ఇప్పటివరకు మూడున్నర కోట్లు ఖర్చు చేశారు. పుస్తకానికి .3 రూపాయలు 71 పైసలు ఖర్చు అయ్యింది. బీఆర్ నాయుడు బుకాయిస్తే సరిపోదు..పదవికి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
శ్రీవారి ఆభరణాల దొంగతనం.. ఆధారాలతో బయటపెట్టిన నాగార్జున యాదవ్
-
నెయ్యి ధరల పెంపు.. టీటీడీ నిధుల దోపిడీ?
-
రేటు పెంచి పంచుకున్నారు..
సాక్షి, అమరావతి: వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఏ చివర కూర్చున్నా పర్వాలేదు అన్నది సామెత... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే చాలు ఎల్–1గా రాకపోయినా సరే హెరిటేజ్ ఫుడ్స్‌కు అడ్డదారిలో టెండర్లు దక్కుతుండడం ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది. నెయ్యి ధరను అమాంతంగా పెంచేసి మరీ కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులను బరితెగించి కొల్లగొడుతున్నారు. ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అండ్ కో చేసిన దుష్ప్రచార రాద్ధాంతం వెనుక ఎంతటి కుట్ర ఉందో తెలిపే వాస్తవాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ఇందాపూర్, ఇంకా హెరిటేజ్ అనుకూల డెయిరీలు మాత్రమే టీటీడీ టెండర్లలోపాల్గొనేలా.. అసలు నెయ్యి టెండర్లంటేనే ఇతర డెయిరీలు భయపడేలా చంద్రబాబు అండ్ కో కల్తీ దు్రష్పచార కుట్ర సాగించింది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు అడ్డగోలుగా కట్టబెట్టిన విషయం ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడింది. టీటీడీ టెండర్లలో ఎల్–1గా వచి్చన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (నందిని డెయిరీ)ని అడ్డంపెట్టుకుని ఇందాపూర్ డెయిరీకి భారీగా నెయ్యి కాంట్రాక్టులు కట్టబెట్టిన తీరు ఇదిగో ఇలా ఉంది... కిలో నెయ్యి ధర రూ.495 నుంచి రూ.716.92కు పెంచారు.. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టుల పేరిట దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా కథ నడిపింది. అందుకే టీటీడీ నెయ్యిని ఎంత ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే అంతగా అవినీతికి పాల్పడవచ్చని స్కెచ్ వేసింది. అందుకే 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత పక్కా పన్నాగంతో టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధరను క్రమంగా పెంచారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం... టీటీడీ పాలకమండలి ఆమోదించిన తీర్మానాల వివరాలు చూస్తే నెయ్యి ధరలను క్రమంగా ఎలా పెంచుతూ పోయారో అర్థం చేసుకోవచ్చు. » 2024 నవంబరులో కిలో నెయ్యి రూ.495 చొప్పున కొనుగోలుకు టీటీడీ పాలకమండలి ఆమోదించింది. » రెండు నెలల్లోనే... అంటే 2025 జనవరిలో కిలో నెయ్యి కొనుగోలు ధరను రూ.513కు పెంచింది. » 2025 మేలో నెయ్యి ధరను మరింత పెంచుతూ కిలో రూ.600గా ఖరారు చేసింది. » అంతటితో ఆగలేదు... 2025 అక్టోబరులో కిలో నెయ్యి ధరను రూ.716.92కు పెంచింది. » దాదాపు ఏడాదిలోనే కిలో నెయ్యి ధరను రూ.495 నుంచి రూ.716.92కు పెంచింది. అంటే నెయ్యి ధర 44.83 శాతం పెరిగిందన్నమాట. అయితే ఎందుకు ఇలా నెయ్యి ధరలను పెంచుతూ పోయారు? దీని వెనక ఉన్న మతలబేమిటి? సంప్రదింపులకు యత్నించకుండానే ఏకపక్షంగా... నందిని డెయిరీ టీటీడీ టెండర్లలో పాల్గొని భారీ ధరలకు టెండరు కోట్‌చేసింది. అయినా టీటీడీ ఏమాత్రం సంకోచించకుండా ఆమోదించేసింది. సాధారణంగా ధరలు అమాంతంగా పెంచుతూ సంస్థలు బిడ్లు దాఖలు చేస్తే ప్రభుత్వంగానీ, టీటీడీగానీ ఇతర డెయిరీలతో సంప్రదింపులు జరపాలి. ధరలు తగ్గించమని కోరాలి. ఎందుకంటే 2025 అక్టోబరులో ఇందాపూర్ డెయిరీ బహిరంగ మార్కెట్లో నెయ్యి కిలో రూ.529కి విక్రయిస్తోంది. ఇక ఏపీలోని సహకార రంగ విజయ డెయిరీ కిలో రూ.675కు, తెలంగాణలోని సహకార రంగంలోని టీజీ విజయ డెయిరీ కిలో రూ.637 చొప్పునే రిటైల్ మార్కెట్లో విక్రయిస్తున్నాయి. రీటైల్ మార్కెట్లో విక్రయించే నెయ్యిని ప్యాకింగ్ చేసి విక్రయిస్తారు. ప్యాకింగ్ చార్జీలతోపాటు ఏజెన్సీకి లాభం(కమీషన్) అదనంగా భరించాల్సి ఉంటుంది. అదే టీటీడీకి నెయ్యిని ట్యాంకర్లలో సరఫరా చేస్తారు కాబట్టి ప్యాకింగ్ వ్యయం ఉండదు. మధ్యలో ఏజెన్సీ ఉండదు కాబట్టి కమీషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధర తక్కువగా ఉండాలి. కానీ దానిని చంద్రబాబు ప్రభుత్వం, టీటీడీ పట్టించుకోలేదు. వివిధ డెయిరీలతో సంప్రదింపులు జరిపితే నెయ్యి ధర తగ్గుతుందనే వాస్తవాన్ని కూడా ప్రభుత్వం, టీటీడీ విస్మరించాయి. ఏకపక్షంగా కిలో రూ.716.92లు చొప్పుననెయ్యికాంట్రాక్టు ఖరారు చేసేశారు. నందిని, ఇందాపూర్ ఫిఫ్టీ ఫిఫ్టీ... నెయ్యి ధరను అమాంతంగా పెంచుతూ టెండరు ఖరారు చేసిన తర్వాత అసలు దోపిడీ కథను ఎల్లో సిండికేట్ తెరపైకి తెచి్చంది. ముందుగా 2025 అక్టోబర్‌లో 20 లక్షల కిలోల నెయ్యి టెండర్లలో ఎల్–1గా వచ్చిన నందిని డెయిరీకి కాంట్రాక్టు ఖరారు చేశారు. అదీ కిలో రూ.716.92లు చొప్పున. ఆ మేరకు టీటీడీ పాలకమండలి తీర్మానం ఆమోదించిన తర్వాత.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నందిని డెయిరీ తాము 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయలేమని చెప్పింది. తాము 10 లక్షల కిలోల నెయ్యి మాత్రమే సరఫరా చేయగలమని తెలిపింది. కూటమి ప్రభుత్వ పెద్దలే ఆ విధంగా నందిని డెయిరీతో చెప్పించారన్నది బహిరంగ రహస్యం. మరి 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయలేని సంస్థ అసలు టెండర్లలో ఎందుకు పాల్గొంటుంది? అంటే కూటమి ప్రభుత్వ పెద్దలతో ముందుగా కుదుర్చుకున్న డీల్ ప్రకారమే నందిని డెయిరీ ఆ ప్రకటన చేసిందన్నది స్పష్టమవుతోంది. ఆ తర్వాత నందినీ డెయిరీకి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఖరారు చేశారు. మిగిలిన 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టును హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీకి కట్టబెట్టేందుకు పావులు కదిపారు. ఆ మేరకు టీటీడీ నెయ్యి కాంట్రాక్టుల్లో సవరణలు చేసి 2025 డిసెంబర్లో పది లక్షల కిలోల నెయ్యి చొప్పున మొత్తం మీద 20 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు కోసం రెండు వేర్వేరు టెండర్లు పిలిచింది. ఇందాపూర్ డెయిరీకి కాంట్రాక్టు ఖరారయ్యేలా ఇతర డెయిరీలనూ మేనేజ్ చేశారు. ఇందాపూర్ డెయిరీకి అడ్డగోలుగా నెయ్యి కాంట్రాక్టులను ఖరారు చేస్తూ టీటీడీ పాలకమండలి ప్రత్యేకంగా రెండు తీర్మానాల (590 తీర్మానం, 605 తీర్మానం) ద్వారా కథ నడిపింది. అవి ఇలా ఉన్నాయి... » టీటీడీ తీర్మానం 590 ప్రకారం 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు ఖరారు చేశారు. అందులో ఇందాపూర్ డెయిరీకి 65 శాతం వాటాతో... అంటే 6.50 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. మదర్ డెయిరీకి 35 శాతం వాటా... అంటే 3.50 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు కేటాయించారు. » ఇక టీటీడీ తీర్మానం 605 ప్రకారం మరో 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు ఖరారు చేశారు. అందులో ఇందాపూర్‌కు 35 శాతం వాటా.. అంటే 3.50 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. మదర్ డెయిరీకి 65 శాతం వాటా... అంటే 6.50 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు కేటాయించారు. ధర మాటున మతలబు ఇందాపూర్ డెయిరీకి అనుకున్నట్టుగానే 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కింది. మరీ కిలో రూ.716.92 అంటే బాగుండదు అనుకున్నారో ఏమో.. టీటీడీ తీర్మానం 590 ప్రకారం కిలో నెయ్యి రూ.658 చొప్పున ఇందాపూర్ డెయిరీకి 6.50 లక్షల కిలోల నెయ్యి టెండర్ ఖరారు చేశారు. ఇక టీటీడీ తీర్మానం 605 ప్రకారం కిలో నెయ్యి రూ.649 చొప్పున ఇందాపూర్ డెయిరీకి 3.50 లక్షల కిలోల నెయ్యి టెండరు కట్టబెట్టారు. ఇలా మొత్తంగా రూ.65.48 కోట్ల విలువైన నెయ్యి సరఫరా కాంట్రాక్టును అడ్డగోలుగా కట్టబెట్టారు. అంటే ఇందాపూర్ డెయిరీకి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టును కట్టబెట్టేందుకే పక్కా పన్నాగంతోనే ఈ కథంతా నడిపారని, నందిని డెయిరీకి నష్టం లేకుండా.. కిలో నెయ్యి ధరను రూ.495 నుంచి రూ.716.92కు పెంచారన్నది బట్టబయలైంది. ఇక ఇందాపూర్ డెయిరీకి ఖరారు చేసిన ధరలను ఏడాది క్రితం టీటీడీ నెయ్యి ధరతో పోలిస్తే చంద్రబాబు ముఠా దోపిడీ పన్నాగం బయటపడుతోంది. ఏకంగా 33 శాతం అధిక ధరకు ఇందాపూర్ డెయిరీకి కాంట్రాక్టు ఖరారు చేశారన్నది తేటతెల్లమవుతోంది. అందుకు సహకరించిన నందినీ డెయిరీకి కూడా రూ.76.19 కోట్ల కాంట్రాక్టు ఖరారు చేశారు. వెరసి దొంగలు దొంగలు కలిపి ఊళ్లు పంచుకున్నట్టుగా... నందిని డెయిరీ, ఇందాపూర్ డెయిరీ కలిపి తిరుమల శ్రీవారి నిధులను కొల్లగొట్టాయన్నది స్పష్టమైంది. చేతులెత్తేసి... మళ్లీ టెండర్లలో పాల్గొన్న ‘నందిని’... ఇక తిరుమల శ్రీవారి నిధులు కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠా పన్నిన పన్నాగం టీటీడీ సవరణ టెండర్ల వ్యవహారంలో బట్టబయలైంది. మొదట 20 లక్షల కిలోల నెయ్యి టెండర్లలో పాల్గొన్న నందిని డెయిరీ... తీరా టెండరు ఖరారు అయ్యాక (ముందుగా వేసుకున్న పథకం ప్రకారం) తాము 10 లక్షల కిలోలే సరఫరా చేయగలమని చేతులెత్తేసిన విషయం తెలిసిందే. దాంతో ఆ డెయిరీని కిలో రూ.716 చొప్పున 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టుకే పరిమితం చేశారు. తద్వారా ఇందాపూర్ డెయిరీకి 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు కట్టబెట్టేందుకు మార్గం సుగమం చేశారు. అందుకోసం టీటీడీ 10 లక్షల కిలోల నెయ్యి చొప్పున రెండు వేర్వేరు అంటే 20 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు కోసం సవరణ టెండర్లు పిలిచింది. వాటిలో టీటీడీ 605 తీర్మానం ద్వారా ఆమోదించిన ఒక టెండరులో నందిని డెయిరీ కూడా పాల్గొనడం గమనార్హం. అంటే 10 లక్షల కిలోల కంటే ఎక్కువ సరఫరా చేయలేమని 2025 అక్టోబరులో పక్కకు తప్పుకొన్న నందినీ డెయిరీ... ఆ వెంటనే.. అంటే 2025 నవంబరులోనే పిలిచిన టెండర్లలో మరో 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయగలమని బిడ్ దాఖలు చేసి ఎల్–3గా నిలిచింది. అంటే 2025 సెప్టెంబరులో పిలిచిన టెండర్లలో కూడా 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయగల సామర్థ్యం నందిని డెయిరీకి ఉందనేది స్పష్టమైంది. కేవలం ఇందాపూర్ డెయిరీ కోసమే ఆ రోజు 10 లక్షల కిలోల నెయ్యి టెండరు నుంచి నందిని పక్కకు తప్పుకొంది. మళ్లీ 2025 డిసెంబర్లో పిలిచిన సవరణ టెండర్లలో కిలో నెయ్యి రూ.716 చొప్పున బిడ్ దాఖలు చేసింది. అంటే ఇందాపూర్ డెయిరీకి కిలో రూ.658 చొప్పున కాంట్రాక్టు ఖరారు చేసేందుకే ఆ విధంగా అధిక ధరకు బిడ్ దాఖలు చేసింది. ఆ విధంగా చంద్రబాబు ముఠా ఇందాపూర్ డెయిరీకి అడ్డగోలుగా టెండరు ఖరారు చేసేందుకు పక్కాగా కథ నడపిందన్నది స్పష్టమవుతోంది. -
ఏపీ సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘన
చంద్రబాబు నాయుడు రాజకీయ ఎజెండాలోకి ఇప్పుడు కొత్త మాటలు కావాలి. రికార్డులు అరిగేలా పదేపదే పాడేసిన పాత పాటలు ఇప్పుడు చెల్లుబాటు కావడం లేదు. ఇరవై మాసాల్లో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకుందామంటే ‘క్రెడిట్ చోరీ’ దొంగాట వెక్కిరిస్తున్నది. ‘సంపద సృష్టి’ అనే మాటకు యెల్లో నిఘంటువు అర్థం ‘రుణ సమీకరణ’ అని తేలిపోయింది. తన రాజకీయ వారసత్వం కొనసాగాలంటే తుప్పు పట్టిన అస్త్రతూణీరం అక్కరకు రాబోదని అర్థమైంది. కొత్త బాణాలు కావాలి. అరువు తెచ్చుకున్న నయా తత్వాలు పాడేందుకు సరికొత్త బాణీలు కావాలి. వాటినెలా సాధించాలి? కిం కర్తవ్యం అన్న ప్రశ్నకు ఒకే ఒక మార్గాంతరం ఆయనకు కనువిప్పు కలిగించినట్టుంది.‘అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’ అంటూ మతాన్ని పులిమేసుకోవడం మొదలుపెట్టారు. మతాన్ని రాజ కీయాలతో ముడిపెట్టకూడదన్న రాజ్యాంగ స్ఫూర్తినీ, సర్వోన్నత నాయ్యస్థానాల ఆదేశాలనూ ఆయన గణించదలుచుకోలేదు. మనుగడకు మరో మార్గం లేదేమో! ‘ఉదర పోషణార్థం బహుకృత వేషం’ అన్న నానుడి చందంగా అవసరార్థం మత వేష ధారణ. ఆషాఢభూతిని ఆదర్శంగా తీసుకునేవారికి మతమైనా, రాజకీయమైనా ఒకటే. మతం కూడా రాజకీయమే. ఈ కొత్త వేషంలో ఆయనకింకో సౌలభ్యం ఉన్నది. తాను ప్రవచించే తాజా తాత్విక ధారలో కరిగి, జనం ఐహిక విషయాలు వదిలేయాలి. ఆ ట్రాన్స్‌లో మైమరిచిపోవాలి. ‘సూపర్ సిక్స్’ను సూపర్ హిట్ చేశానంటే తలలూపాలి. ఇరవై మాసాల్లో ఆరు లక్షల ఉద్యోగాలిచ్చేశానంటే నమ్మేయాలి. తన పేరును పఠించ గానే ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులుగా పరుగెత్తుకొని వచ్చా యంటే నిజమే అనుకోవాలి. ఇంకో ఇరవై లక్షల ఉద్యోగాలను చిటికేసి ఇచ్చేస్తానంటే మహాప్రసాదమని మురిసిపోవాలి.చంద్రబాబు, ఆయన పార్టీ, కూటమి కలిసి మత ఎజెండాను ముందు పెట్టుకొని రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తు న్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా దాడి చేస్తున్నారు. అందుకోసం చట్టసభలను కూడా వేదికలుగా చేసుకోవడానికి తెగించడం తీవ్రంగా ఆందో ళన కలిగిస్తున్నది. ‘‘... శాసనము ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతా చూపుతాననీ...’’ అంటూ ప్రమాణాలు చేసి చట్టసభల్లో ప్రవేశించిన నేతలు ఒట్టు తీసి గట్టుమీద పెట్టి రాజ్యాంగం పట్ల విద్రోహపూరితంగా మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ ఉభయ సభల్లో ఈవారం చోటు చేసుకున్నాయి. శాసన మండలిలో గౌరవ సభాధ్యక్ష స్థానాన్ని ఉద్దేశించి రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు విజ్ఞులందరికీ దిగ్భ్రాంతిని కలిగించాయి. ‘మీరు క్రిస్టియన్! మీ నాయకుడు క్రిస్టియన్. వెంకటేశ్వర స్వామిపై కక్ష కట్టారు. యేసు మాత్రమే దేవుడా... వెంకటేశ్వరస్వామి కాదా?’... ఈ రక మైన వాచాలతతో ఆయన చెలరేగి పోయారు. శాసనసభలో మంత్రులు మాట్లాడే మాటలను ప్రభుత్వ వాణిగానే పరిగణిస్తారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు మంత్రిమండలి సమష్టిగా బాధ్యత వహించవలసి ఉంటుంది. తాను ఒక మతానికి ప్రతి నిధి అన్నట్టుగా వకాల్తా పుచ్చుకొని మాట్లాడినట్టుగా ఆయన భాషావేశం, భావాభినివేశం తేటతెల్లం చేస్తున్నాయి. ఇది సంపూ ర్ణంగా రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన. శాసనసభ్యునిగా చేసిన ప్రమాణానికి విరుద్ధంగా రాజ్యాంగానికి ఆయన అవిధేయతను ప్రకటించినట్టే పరిగణించాలి.భారత్‌ను లౌకిక (సెక్యులర్) రిపబ్లిక్‌గా మన రాజ్యాంగ పీఠిక ప్రకటించింది. లౌకికత్వమనేది రాజ్యాంగ మౌలిక స్వరూ పంలో భాగమనీ, అది అనుల్లంఘనీయమైన ప్రాథమిక హక్కు అనీ సర్వోన్నత న్యాయస్థానం వివిధ తీర్పుల్లో ప్రకటించింది. ఏ మతాన్నీ అధికారిక మతంగా రాజ్యాంగం గుర్తించలేదు. అన్ని మతాల పట్ల సమాన గౌరవాన్నీ, సమాదరణనూ ప్రకటించింది. మత, కుల, ప్రాంత, లింగభేదాల ఆధారంగా ఎటువంటి వివక్షా లేదని ప్రాథమిక హక్కుల్లోని 15వ అధికరణం స్పష్టం చేసింది. ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఒక మతం పట్ల ప్రత్యేక అభిమానంతో వ్యవహరిస్తే అది రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించినట్టేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అటువంటి రాష్ట్ర ప్రభుత్వంపై 356వ అధిక రణం కింద చర్య (ప్రభుత్వ బర్తరఫ్) తీసుకోవచ్చునని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మతాన్ని రాజకీయాలతో ముడి వేయడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.గౌరవ సభాధ్యక్షులు తాను క్రిస్టియన్ కాదు, హిందువునని చెప్పినందువలన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని అచ్చెన్నాయుడు మండలిలో చెప్పారు. అంటే సభాధ్యక్ష స్థానంలో హిందూయేతర వ్యక్తి కూర్చుని ఉంటే అతని మీద నిందలు మోపవచ్చునా? సభాధ్యక్షుడు క్రిస్టియన్ అయ్యుంటే తన మాటలను వెనక్కు తీసుకునేవాడిని కాదనే అర్థం ఆయన స్పందనలో ధ్వనించింది. ఇది కచ్చితంగా మత విద్వేష ప్రకటన. మత విషయాల్లో రాజ్యాంగ యంత్రాంగం తటస్థ పాత్ర పోషించాలన్న రాజ్యాగ స్ఫూర్తిని అవహేళన చేశారు. శాసన సభ్యునిగా తాను చేసిన ప్రమాణాన్ని గాలికొదిలి రాజ్యాంగ అవిధేయతకు ఆయన పాల్పడ్డారు. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానాల తీర్పులను కూడా ఆయన ఖాతరు చేయలేదు.శాసన మండలిలో అచ్చెన్నాయుడు ప్రహసనం గురువారం నాడు చోటుచేసుకున్నది. శుక్రవారం నాడు శాసనసభలో స్వయానా ముఖ్యమంత్రే అచ్చెన్న పాటకు కోరస్ అందు కున్నారు. సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక భారతదేశ చరిత్రలో బహుశా పార్లమెంట్లో గానీ, రాష్ట్రాల శాసనసభల్లో గానీ ఏ ప్రధానీ, ఏ ముఖ్యమంత్రీ ఈ తరహాలో మాట్లాడి ఉండరు. ‘ఏసుక్రీస్తుకయితే క్షమాపణ చెబుతారా... వెంకటేశ్వర స్వామికి మాత్రం చెప్పరా’’ అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తిరుమలలో ఆధ్యాత్మికవేత్తలూ, వేద పండితులూ వద్దువద్దని వారిస్తున్నా వినకుండా వేయికాళ్ల మండపాన్ని కూల్చేసిన చంద్రబాబే ఈ ప్రశ్న వేశారు. ఆధ్యాత్మిక సుధలను అనుదినం ప్రవర్ధితం చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్ ప్రభుత్వం ప్రారంభించిన ఎస్వీబీసీ భక్తి ఛానల్ ఎందుకూ, డబ్బులు దండ గని ఈసడించుకున్న చంద్రబాబే వెంకన్నకు క్షమాపణ చెప్పరా అని ప్రశ్నిస్తున్నారు. ‘50 కోట్ల ఖర్చుతో భగవద్గీత పుస్తకాలు అచ్చేశారు. ఏముంది అందులో, ఆ పుస్తకాలను చూస్తే మొహాన ఉమ్మేస్తార’ని చెబుతున్న టీటీడీ బోర్డు అధ్యక్షుని మీద ఈగ వాలకుండా కాపుకాస్తున్న ముఖ్యమంత్రే ఈ ప్రశ్న వేస్తున్నారు.దేవుని మీద నిజమైన భక్తి విశ్వాసాలు ఉన్నవారు ఎవరైనా తనకు తెలిసో, తెలియకో తన వల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అపచారం జరిగిందని భావిస్తే తప్పనిసరిగా క్షమాపణ కోరు తారు. దేవుడిపై నమ్మకం ఉండేవారు శివుడూ, వేంకటేశ్వరుడూ, ఏసుక్రీస్తూ, అల్లా అనే తేడాలు చూడరు. అన్ని రూపాల్లోని అన్ని విశ్వాసాల్లోని దైవత్వాన్ని ఆరాధిస్తారు. ‘మీ దేవుడూ, మా దేవుడూ’ అనే మీమాంస భక్త వేషధారులకుంటుందేమో గానీ భక్తి విశ్వాసాలు కలవారికి ఉండదు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి శాసనసభ సాక్షిగా ఒక మతం తరఫున వకాల్తా పుచ్చుకొని రాజ్యాంగం నిర్దేశించిన ‘రాజ్య తటస్థత’ నియమాన్ని బాబు ఉల్లంఘించారు.రాజ్యాంగ ఉల్లంఘన మాత్రమే కాదు... సత్యదూరమైన విషయాన్ని ప్రశ్నగా సంధించి ఆయన సభను తప్పుదోవ పట్టించారు. ఏడుకొండల స్వామికి క్షమాపణ చెప్పవలసింది ఎవరు? ప్రభుత్వం ప్రచారం చేసినట్టు జంతు కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు నియమించిన ‘సిట్’ స్పష్టం చేసినా కూడా ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని వాదిస్తున్నారు కదా! ఆ నెయ్యి శాంపుల్స్ ఎప్ప టివి? చంద్రబాబు ముఖ్యమంత్రయిన కొన్నాళ్ల తర్వాత టీటీడీ నాణ్యతా పరీక్షలో విఫలమైన నాలుగు ట్యాంకర్ల నుంచి సేకరించిన నమూనాలివి. పరీక్ష ఫెయిలైన ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు. ఆ శాంపిల్స్‌ను పరీక్ష కోసం బాబు నియమించిన ఈవో శ్యామలరావు ఎన్డీడీబీకి పంపించారు. వెనక్కు మళ్లిన ట్యాంకర్లు ఎన్నడూ లేని విధంగా బాబు ఏలుబడిలోనే తొలి సారిగా డెయిరీ లేబుళ్లు మార్చుకొని తిరుమలకు వెళ్ళాయి.కూటమి పాలనా కాలంలో, కూటమి నియమించిన ఈవో పంపించిన నెయ్యి శాంపిల్స్‌లో కల్తీ జరిగి ఉంటే అందుకు ఎవరు బాధ్యత వహించాలి? నాణ్యతా పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు మళ్లీ తిరుమలలోకి ప్రవేశించాయంటే అందుకు ఎవరిని నిందించాలి? వైసీపీ పాలనా కాలం నుంచే టీడీడీలో నాణ్యతా పరీక్షలకు ఏర్పాట్లున్నాయి. అప్పుడు కూడా చాలా సార్లు పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు వెనక్కు మళ్లాయని రికార్డులు చెబుతున్నాయి. అయినా, 2024 జూలై తర్వాత వచ్చిన శాంపిల్స్‌ను పరీక్షించి అంతకుముందు కాలంలో కల్తీ జరిగిందని తీర్పులు చెప్పడం ఎలా కుదురుతుంది? ఈ ఆరోపణ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా? ‘మా తాతలు నేతులు తాగారు, కావాలంటే మా మూతులు వాసన చూడండి’ అన్నాడట వెనుకటికి ఒకాయన! కూటమి తీరు ఆ విధంగానే ఉన్నది.ఆదాయ వనరుల్లేని వేలాది చిన్న దేవాలయాల్లో దీప ధూప నైవేద్యాలకు నిధులనూ, అర్చక స్వాములకు భృతినీ ఏర్పాటు చేసిన రాజశేఖరరెడ్డి మీద, తిరుమలేశుని వైభవానికి దిగంతాల దాకా ప్రాచుర్యం కల్పించాలనే లక్ష్యంతో వేలాది ఆలయాలను నిర్మించిన జగన్మోహన్రెడ్డి మీద హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి కూటమి సర్కార్ పడరాని పాట్లు పడుతున్నది. ‘బట్ట కాల్చి మీదేస్తాం’ అనే బరితెగింపు ధోరణి ఇది. ఏడు కొండలూ తిరుమలేశునికే చెందుతాయని వైఎస్సార్ సర్కార్ ఇచ్చిన జీవోను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పిందెవరు? ఆ వీడియోలు బహుళ ప్రచారంలో ఉన్నాయి. అవి ఫేక్ వీడియోలని ఇంకా ప్రకటించలేదెందుకో? ఏ హిందూ పీఠాధి పతులు చెప్పారని తిరుమలలోని వేయికాళ్ల మండపాన్ని కూల్చి వేశారు? వెంకటేశ్వరుని సేవకు ఆధ్యాత్మిక ఛానల్ ఎందుకు, డబ్బులు దండగన్నది ఎవరు? హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతలో ఏమున్నదని ఎవరి హయాంలోని టీటీడీ అధ్యక్షుడు హేళన చేశారు? ‘దళిత గోవిందం’ పేరుతో శ్రీవేంకటేశ్వర మహాత్మ్యాన్ని దళితవాడల్లో వినిపించిన పాలకు లపై హిందూ వ్యతిరేక ముద్ర వేయాలని చూడటం ఎంత దిగజారుడుతనం?... ఒక్క వేలు చూపి ఒరులను నిందించ వెక్కిరించు నిన్ను మూడు వేళ్లు!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
టీటీడీ చైర్మన్ వీడియో కంటే మేము చేసింది పెద్ద తప్పా..?
దివ్వెల మాధురి, బిగ్‌బాస్ ఫేమ్ తనూజపై టీటీడీ చర్యలు తీసుకోనుంది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టినరోజు వేడుకలు చేసుకున్నందుకు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేక్‌ను తిరుమలకు తీసుకెళ్లడం అక్కడ వేడుకలు చేయడం నిబంధనలకు విరుద్ధమని టీటీడీ పేర్కొంది. కొండపై ఇలాంటి వేడుకలు నిషేధమని తెలిపింది. అయితే, తాజాగా దువ్వాడ శ్రీనివాస్‌తో పాటుగా ముధురి వివరణ ఇచ్చారు. కొండపై తాము కట్ చేసిన కేక్ ఎగ్‌లెస్ అని అందుకు సంబంధించిన బిల్‌ను ఆయన షేర్ చేశారు.తిరుమల కొండపై తనూజ బర్త్‌డే సందర్భంగా తాము కేక్ కట్ చేసింది వాస్తవమేనని దువ్వాడ శ్రీనివాస్ ఇలా అన్నారు. 'ఆమె వెంకటేశ్వర స్వామి భక్తురాలు కావడంతో తన పుట్టినరోజు నాడు దర్శనం చేసుకోవాలనుకుంది. దీంతో మాతో పాటుగా తిరుమల వచ్చింది. అయితే, తనకు చెప్పకుండానే మేము కేక్ తిరుపతిలో కొన్నాం. అది పూర్తిగా ఎగ్‌లెస్ కేక్. మా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. ఆయన పేరు పెట్టుకుని బతికే నేను ఎట్టి పరిస్థితిల్లోనూ తప్పు చేయను. నా మొదటి తలనీలాలు ఎడుకొండలవాడి సన్నిధిలోనే ఇచ్చాను. ఇప్పటికి వందసార్లకు పైగానే స్వామిని దర్శించుకున్నాను. ప్రయాణంలో కూడా మేము తినే ఆహారం పూర్తిగా శాఖాహారమే ఉంటుంది. అయితే, అక్కడ కేక్ కట్ చేయకూడదనే నిబంధనలు నాకు తెలియవు. తెలిసింటే ఆ పొరపాటు చేయం. కానీ, కొన్ని మీడియా ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.' అని ఆయన అన్నారు.బీఆర్ నాయుడి వీడియో సంగతేంటి..?టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి వీడియో టాపిక్‌ను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి విషయాలను హైలెట్ చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. మేము కేక్ కట్ చేసినందుకే కేసు పెట్టండని చెబుతున్నారు. మరి బీఆర్ నాయుడు చేసిన పనికి ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. తన వీడియో తానే చూసి ఏ తప్పు కనిపించలేదని అంటున్నాడు. అలాగే తాము కేక్ కట్ చేసిన వీడియోలో ఏం తప్పు ఉందని అన్నారు. మాకు తెలియక కేక్ కట్ చేశాం.. క్షమించమని స్వామిని వేడుకుంటాం. కానీ, నువ్వు చేసిన పనికి ఏం చేస్తావ్.. నీ వీడియో టాపిక్‌ను డైవర్ట్ చేసేందుకే మాపై కేసులు పెడతావా అంటూ ఆయన ప్రశ్నించారు. View this post on Instagram A post shared by Divvala Madhuri (@madhuri_srinivasduvvada) -
కూటమి నేతలు దిగజారిపోయి మాట్లాడుతున్నారు: రోజా
సాక్షి, భీమవరం: తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు తెలిపిందని మాజీ మంత్రి రోజా అన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పిన తర్వాత కూడా సీఎం, డిప్యూటీ సీఎం, చివరికి హోం మంత్రి కూడా దిగజారి మాట్లాడుతున్నారని చెప్పారు. వారి తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.ఇవాళ భీమవరంలో రోజా మాట్లాడుతూ.. ‘శాసన మండలిలో కూడా చైర్పర్సన్ మోషన్‌రాజు కులం గురించి మాట్లాడే స్థాయికి దిగజారిపోయే పరిస్థితికి కూటమి ప్రభుత్వం వచ్చింది. అసెంబ్లీలో కూటమి నేతలు లేనిపోనివన్నీ మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మంత్రి స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు ఒక్కరోజు కూడా సక్రమంగా మాట్లాడారా?కూటమి నేతలు భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దు. లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేయడానికి కులాల ప్రస్థావన తీసుకురాకూడదు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూటమిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నారు.. ప్రజలకు మంచి చేయండి.. లేదా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి’ అని అన్నారు. ఇదీ చదవండి: నేపాల్ ఎన్నికల ఫలితాలు భారత్‌కు ఎందుకింత కీలకం? -
BR నాయుడు రాసలీలలు.. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి షాకింగ్ రియాక్షన్
-
శ్రీవారి సన్నిధిలో పొరపాటు జరిగితే దేవుడే చూసుకుంటాడు
-
చర్చలేకుండా డైవర్షన్
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంపై అధికారపక్షం అసలు చర్చే జరగనివ్వలేదు. శాసనమండలిలో గురువారం కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు పదేపదే అడ్డుతగులుతూ చర్చను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తన కుటుంబ సంస్థ హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం కల్తీ నెయ్యి పేరుతో అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని, దానిపై చర్చిద్దామంటే సభ నుంచి ఆ పార్టీ సభ్యులు పారిపోతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. అశ్లీల వీడియోల్లో ఉన్నది తానేనని బీఆర్ నాయుడు అంగీకరించిన తర్వాత కూడా ఆయన్ను టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించడానికి చంద్రబాబు ఎందుకు భయపడిపోతున్నారని ప్రశ్నించారు. హెరిటేజ్ అనుబంధ ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి కాంట్రాక్టు కోసమే కల్తీ నాటకాన్ని తెరపైకి తెచ్చారని బయటపడడంతో అధికారపక్షం ఇరుకున పడిపోయింది. గురువారం తిరుమల లడ్డూపై దేవదాయ శాఖ మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతుండగా అడ్డుపడి అచ్చెన్నాయుడు లేచి సమస్యను పక్కదారిపట్టించేందుకు ప్రయత్నించారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ పోడియంలోకి దూసుకు వచ్చారు. ఈ నిరసన కార్యక్రమం మధ్యనే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి స్టేట్మెంట్ను చదివేసి మమ అనిపించారు. వైఎస్సార్సీపీ సభ్యుల నిరసనతో సభను చైర్మన్ అయిదు నిమిషాలు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే విధమైన పరిస్థితి కొనసాగడంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.చర్చకు దూరంగా పలాయనం..కల్తీ ఆరోపణలపై చర్చిద్దామంటే అధికారపక్షం పూర్తిగా పలాయనం చిత్తగించింది. దానిపై చర్చ జరగనీయకుండా రకరకాల వాదనలతో సమస్యను డైవర్ట్ చేయడానికి ఆపసోపాలు పడుతోంది. హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు కల్తీ నెయ్యి ఆరోపణలు చేశారని ఆధారాలతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు మండలిలో నిరూపించారు. ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కి టీటీడీ నిధులు దోచిపెట్టడానికి చేసిన ప్రయత్నాలను వివరించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీటీడీకి కిలో రూ.278కే నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీ ఇప్పుడు ఏకంగా కిలో రూ.658 చొప్పున సరఫరా చేయడానికి కాంట్రాక్టు దక్కించుకుందని వారు పేర్కొన్నారు. ఇందాపూర్ డెయిరీ.. హెరిటేజ్ అనుబంధ సంస్థేనని ఒకసారి, కాదు.. అక్కడ హెరిటేజ్ ఉత్పత్తులు మాత్రమే తయారవుతాయని మరోసారి.. హెరిటేజ్ వెబ్‌సైట్‌ను మార్చడమే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ సభ్యులు వివరించారు. హెరిటేజ్ ఆధ్వర్యంలో ఏఆర్, ఇందాపూర్, సంగం, ప్రీమియర్ ఆగ్రో, భోలేబాబా డెయిరీలతో ఏర్పడిన డెయిరీ సిండికేట్ గుట్టును బయటపెట్టడంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వం చర్చలో పాల్గొనకపోవడమంటే హెరిటేజ్ అవినీతిని అంగీకరించినట్లేనని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు పేర్కొన్నారు. కల్తీ జరగలేదని సీబీఐ సిట్ చార్జిషీట్లో పేర్కొనడాన్ని బట్టి రాజకీయ స్వార్థం కోసమే తిరుమల శ్రీవారిని చంద్రబాబు రాజకీయాల్లోకి లాగారని ప్రజలు అర్ధంచేసుకున్నారని వారు వివరించారు. సమాధానం చెప్పలేకే డైవర్షన్..రాజకీయ లబ్ధి, హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం చంద్రబాబు ఘోరమైన కుట్రచేశారని తేలిపోయింది. దానిపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోతోంది. ఏఆర్ డెయిరీ పేరుతో వచ్చిన నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపితే దాన్ని వైష్ణవి డెయిరీ పేరుతో తిరిగి రప్పించి లడ్డూ తయారీకి ఎలా వాడారని అడిగితే దానికి దేవదాయ శాఖ మంత్రి నుంచి సమాధానం లేదు. టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టిన ఇందాపూర్ డెయిరీపై సస్పెన్షన్ ఎత్తివేసింది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే. భోలేబాబా డెయిరీకి టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చింది కూడా చంద్రబాబే. వీటిలో దేనికీ సమాధానం చెప్పలేక కూటమి సభ్యులు వేరే అంశాలను లేవనెత్తి సభను డైవర్ట్ చేశారు.టీటీడీ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలి..టీటీడీ పవిత్రతను దెబ్బతీసిన బీఆర్ నాయుడు చైర్మన్ పదవికి అనర్హుడు. అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ‘ఆ వీడియోలో తప్పేముందని.. ఆమె కుటుంబంతో 30 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. ఆ వీడియోలు, చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌కు బాధిత మహిళ రాసిన లేఖలపై పూర్తిస్థాయి విచారణ జరపాలి. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరం. పవన్ నిజంగా హిందువైతే బీఆర్ నాయుడిని ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలి.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. -
బీఆర్ నాయుడిని వెంటనే తప్పించాలి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..శాసనమండలి మీడియా పాయింట్..ఉద్యోగాలపై ప్రశ్న..నిరుద్యోగ యువతకు ఆర్ధిక సాయంపై సభలో ప్రశ్నించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్..5,72, 280 ఉద్యోగాలిచ్చామని మంత్రి చెబుతున్నారువైఎస్ జగన్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన ప్రభుత్వం ఇదిపట్టుమని 15 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారురాష్ట్రంలో నిరుద్యోగుల లెక్క ఏమైనా ఉందా?నిరుద్యోగుల కోసం ఏమైనా కమిటీ వేశారా?సాక్షాత్తూ సీఎం చంద్రబాబు 6,28,320 ఉద్యోగాలిచ్చామని చెప్పారుఉద్యోగాలపై సీఎం చెప్పింది అబద్ధమా మంత్రి చెప్పింది అబద్ధమా?ఏపీలో 8.2% శాతం నిరుద్యోగం ఉందని కేంద్రం చెప్పింది20 లక్షల ఉద్యోగాలు, మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి హామీ ఏమైందిఎమ్మెల్సీలు భరత్, తూమాటి మాధవరావు కామెంట్స్..టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని తక్షణమే తప్పించాలిబీఆర్ నాయుడి చరిత్ర గురించి ఇందులేఖ అనే మహిళ చంద్రబాబు లేఖరాశారుఅలాంటి వ్యక్తిని చంద్రబాబు ఎలా చైర్మన్ గా నియమిస్తారుబీఆర్ నాయుడు వంటి వ్యక్తి చైర్మన్‌గా కొనసాగడం వల్ల తిరుమల పవిత్ర దెబ్బతింటోందిఎన్నో ఫిర్యాదులు వచ్చినా బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్‌గా నియమించారుఅపవిత్రమైన వ్యక్తిని టీటీడీ చైర్మన్ చేయడం వల్లే తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయి30 ఏళ్ల నుంచి ఆ మహిళతో తనకు సంబంధం ఉందని బీఆర్ నాయుడు చెబుతున్నారుభగవద్గీతలో ఏముందని మాట్లాడటానికి నువ్వు అసలు మనిషివేనా?రెండు మీడియా సంస్థల మధ్య జరుగుతున్న యుద్ధంలో వైఎస్సార్సీపీని బలిచేయాలని చూస్తున్నారుసోషల్ మీడియాలో మీ వీడియోలు బయటికి వచ్చాయిహిందూ ధర్మాన్ని కాపాడటం కోసమే మేం పోరాడుతున్నాంబీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..బీఆర్ నాయుడు అత్యంత కళంకితుడుఅలాంటి వ్యక్తిని చంద్రబాబు టీటీడీ చైర్మన్‌ను చేశారుచంద్రబాబుకి హిందువులంటే గౌరవం ఉంటే బీఆర్ నాయుడిని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలిబీఆర్ నాయుడు చాలా నీచంగా మాట్లాడుతున్నారుభగవద్గీత అంటే గౌరవం లేని వ్యక్తి టీటీడీ చైర్మన్‌గా కొనసాగడానికి అర్హుడా?.మీకు వ్యాపారాలే ముఖ్యమైతే తక్షణమే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయండిబీఆర్ నాయుడిని చైర్మన్‌గా చేసిన తర్వాతే తిరుమల అపవిత్రమైందిలడ్డు కల్తీ ప్రచారంతో కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారువైకుంఠ ఏకాదశి రోజున భక్తులు చావుకు కారణమయ్యారుగోశాలలో భారీగా గోవులు చనిపోయాయిబీఆర్ నాయుడు నైతిక విలువలు లేని వ్యక్తిఅందుకే తిరుమలలో అనేక అపచారాలు జరుగుతున్నాయిహీరోయిన్లకు 15 నిమిషాల్లో దర్శనం చేయిస్తారు.సామాన్య భక్తులను గాలికి వదిలేస్తారు.హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, పవన్, బీఆర్ నాయుడికి ఉందా? టీడీపీ అంటే టెంపుల్ డెమాలిష్ పార్టీహిందూ మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబులడ్డూ విషయంలో పవన్ దుర్గగుడి మెట్లు కడిగారుసనాతన ధర్మం కోసం పనిచేస్తానన్న పవన్ ఇప్పుడు ఏ మెట్లు కడుగుతారుకళంకిత వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా చేసినందుకు పవన్ తిరుమల మెట్లు కడగరా?. సమావేశాలు ప్రారంభం.. ప్రారంభమైన మండలి సమావేశాలుమండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల వాయిదా తీర్మానంకళంకిత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తొలగించాలని కోరుతూ వాయిదా తీర్మానంవాయిదా తీర్మానం ఇచ్చిన ఎమ్మెల్సీలు తుమాటి మాధవరావు, వరుదు కల్యాణి, భరత్వైఎస్సార్సీపీ తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్వాయిదా తీర్మానంపై చర్చించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నినాదాలుబీఆర్ నాయుడును తొలగించాలని నినాదాలువైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలతో మండలి వాయిదా. -
దేవుడిపై భక్తి ఉన్నవారు ఇలా చేస్తారా? బాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి దేవస్థానం నిర్వహణ అత్యంత పవిత్రమైన బాధ్యతని.. సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలిసి కూడా ఆరోపణలున్న వ్యక్తినే టీటీడీ చైర్మన్‌గా నియమించి ఆలయ ప్రతిష్ట, పవిత్రతను చంద్రబాబు కాలరాశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్ నాణ్యత లేదంటూ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు తిరిగి టీటీడీకి రావడం.. రిజెక్ట్ చేసిన వాటిని అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ సిట్ ఛార్జిషీట్లో స్పష్టం చేయడం ఆందోళనకరమన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేపుతూ.. నెయ్యి ధరల విషయంలో తప్పుడు ప్రచారం చేసి లాభాలు ఆర్జించడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. దేవుడిపై భక్తి ఉన్న వారు ఎవరైనా ఇలా చేస్తారా? అని సీఎం చంద్రబాబు నిలదీశారు. ఆలయాల పవిత్రత, భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వాల తొలి బాధ్యత అని గుర్తు చేశారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. టీటీడీ నిర్వహణలో చంద్రబాబు సర్కార్ తీరును సాక్ష్యాధారాలతో ఎండగడుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ బుధవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..దేవుడిపై బాబుకు భక్తి, శ్రద్ధ, భయం లేదని మరోసారి రుజువైంది..దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత. అది అత్యంత నిష్టతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కళంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ట కలిగిన వారే ఉండాలి. కానీ చంద్రబాబు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారు. ఒక బాధిత మహిళ చంద్రబాబు గారికి లేఖ రాస్తూ.. ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పని కోసం ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు గారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా, విచారణ, చర్యలన్నవి పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ చైర్మన్‌గా నియమించి, ఆలయ ప్రతిష్ట, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబుకు భక్తీ లేదు.. శ్రద్ధ అంతకన్నా లేదు. దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది.టీటీడీకి నెయ్యి సరఫరాను సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు..ఈ రకంగా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరిమీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నారు. మరోవైపు 2014–19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278– రూ.330 ఉంది. 2019–24 మధ్య కూడా నెయ్యి సగటు రేటు దాదాపుగా అంతే ఉంది. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ.. తన హెరిటేజ్‌కి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ డెయిరీకి కిలో నెయ్యి రూ.658లకు 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు.. శ్రద్ధ లేదు.. నిష్ట లేదు.. నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ.నాణ్యత లేని నెయ్యిని అనుమతించింది.. లడ్డూ తయారీలో వాడింది బాబు హయాంలోనే..లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబుది అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ(నాణ్యత) బాగోలేదని ఈ చంద్రబాబు గారి హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా.. మళ్లీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీకి రావడం.. ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ–సిట్ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జిషీటు 44వ పేజీలోనూ చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తీ లేదు.. ఆలయాల నిర్వహణపట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ. -
చంద్రబాబు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే BR నాయుడిని తక్షణమే తొలగించు
-
BR నాయుడు రాసలీలలు.. వైఎస్ జగన్ రియాక్షన్
-
హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక (ఫొటోలు)
-
నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు. శినివారం అర్ధరాత్రి వరకు 75,428 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,240 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.56 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 6 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. -
తిరుమల గుడి ముందే 'బిగ్‌బాస్' భామ డ్యాన్సులు
తిరుమల కొండపై కొందరు యూట్యూబర్లు ఓవరాక్షన్ చేస్తున్నారు. రీల్స్ పిచ్చిలో పడి డ్యాన్సులు వేస్తూ ఓవరాక్షన్ చేస్తున్నారు. టీటీడీ ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ వీళ్ల పద్ధతి మాత్రం అస్సలు మారడం లేదు. తాజాగా 'బిగ్‌బాస్' ఫేమ్ గీతూ రాయల్ అయితే గుడి ముందే సినిమా పాటలకు స్టెప్పులేసింది. వాటిని రీల్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం కాస్త ఇప్పుడు వివాదాస్పదమైంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్)రీసెంట్గా తన నలుగురు స్నేహితులతో కలిసి తిరుమల వెళ్లిన యూట్యూబర్ గీతూ.. ఘాట్ రోడ్డుతో పాటు ఆలయం ఎదుట, పుష్కరిణి సమీపంలో, కౌంటర్స్ దగ్గర డ్యాన్సులు చేసింది. వాటిని వీడియోగా చేసి ఇన్ స్టాలో రీల్ అప్లోడ్ చేసింది. దీంతో ఈమెపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే సదరు రీల్‌ని డిలీట్ చేసింది. తాజాగా ఈమెపై టీటీడీ చర్యలకు కూడా సిద్ధమైంది. అదే విషయాన్ని చెబుతూ మరో వీడియో పోస్ట్ చేసింది. అయితే ఈమె.. ఏకంగా గుడి ముందే డ్యాన్సులు చేస్తుంటే టీటీడీ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.'అందరికీ ఒక గుడ్ న్యూస్. నా మీద చర్యలు తీసుకుంటారట. ఇక హ్యాపీగా ఉండండి. చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ఇప్పటికే నా జీవితంలో సగం కోల్పోయాను. పోగొట్టుకోవడానికి ఇంకా ఏం మిగలలేదు. ఉన్న కొద్దిపాటి జీవితాన్ని కూడా మీరు తీసేసి సంతోషంగా ఉండండి' అని గీతూ తన లేటెస్ట్ వీడియోలో చెప్పుకొచ్చింది.తిరుమల కొండపై రూల్స్ పాటించాలని టీటీడీ పదేపదే చెబుతోంది. శ్రీవారి ఆలయం దగ్గర కూడా మైక్‌లో ప్రచారం చేస్తున్నారు. అయినా సరే కొందరు పట్టించుకోవట్లేదు. టీటీడీ నిబంధనల ప్రకారం.. కొండపై రాజకీయ ప్రసంగాలతో పాటు రీల్స్ చేయడం, ఫొటోషూట్స్ చేయడం లాంటివి నిషిద్ధం. అయినా సరే గీతూ రాయల్ లాంటి యూట్యూబర్లు.. సరదా కోసమో వ్యూస్ కోసమో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. తీరా చర్యలకు సిద్ధమైతే గానీ తాము రూల్స్ అతిక్రమించామనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. మరి ఈమెపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: తిరుమల దర్శన వివాదం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ శివానీ నాగరం) View this post on Instagram A post shared by Sakshi TV (@sakshitvdigital) -
దేవునికే టోపీ.. ఆన్ లైన్ లో కిలో నెయ్యి రూ.529.. టీటీడీకి మాత్రం రూ.638..
-
నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,952 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,414 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.97 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 6 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. -
బాబుదే మహాపచారం! ఇందాపూర్‌కు అవి‘నేతి’ విందు
సాక్షి, అమరావతి: నెయ్యి సరఫరా మాటున చంద్రబాబు అండ్ కో తిరుమల శ్రీవారి నిధులను కొల్లగొడుతోంది. ఆ కలియుగ దైవానికి భక్తులు కానుకల రూపంలో సమర్పించే నిధులను నిస్సిగ్గుగా దోచుకుంటోంది. హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీ ఆన్లైన్లో కిలో నెయ్యి రూ.529 చొప్పున విక్రయిస్తోంది. మరి ఇదే ఇందాపూర్ డెయిరీ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ, ఇతర అవసరాల కోసం టీటీడీకి కిలో ఏకంగా రూ.638 చొప్పున సరఫరా చేస్తోంది. అంటే ఆన్లైన్లో కంటే టీటీడీకి కిలోకు రూ.109 అధిక ధరకు విక్రయిస్తోంది. వాస్తవానికి ఆన్లైన్లో విక్రయించే నెయ్యిని ప్యాకింగ్ చేసి మరీ వినియోగదారులకు డోర్ డెలివరీ విధానంలో సరఫరా చేస్తారు. దాంతో ప్యాకేజీ, మార్కెటింగ్ ఖర్చులు, డోర్ డెలివరీ రవాణా ఖర్చు అదనంగా వస్తుంది. కానీ టీటీడీకి ట్యాంకర్ల ద్వారా భారీ స్థాయిలో నెయ్యిని సరఫరా చేస్తారు. దాంతో ప్యాకేజీ ఖర్చులు ఉండవు. ఒకే ప్రదేశానికి భారీ పరిమాణంలో నెయ్యిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంలో రవాణా వ్యయం తగ్గుతుంది. ఈ లెక్కన ఆన్లైన్లో ధర కంటే టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధర తక్కువగా ఉండాలి. కానీ కిలోకు ఏకంగా రూ.109 అధికంగా వసూలు చేస్తున్నారు. పోనీ బహిరంగ మార్కెట్‌తో పోల్చి చూసినా సరే హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీ బహిరంగ మార్కెట్లో ఏపీలో కిలో రూ.541 చొప్పున, హైదరాబాద్‌లో కిలో రూ.560 చొప్పున విక్రయిస్తోంది. బహిరంగ మార్కెట్ విధానంలో.. నెయ్యిని ప్యాకింగ్ చేసి, డెయిరీ హోల్‌సేల్ ఏజెన్సీ ద్వారా రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తుంది. అంటే ప్యాకింగ్ చార్జీలు, రవాణా చార్జీలతోపాటు హోల్‌సేల్ ఏజెన్సీ లాభం, రిటైల్ దుకాణదారు లాభం కలుపుకుని మరీ ధరను నిర్ణయిస్తారు. కానీ టీటీడీకి డెయిరీనే నేరుగా నెయ్యిని సరఫరా చేస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియలో హోల్‌సేల్ ఏజెన్సీ, రిటైల్ దుకాణదారు ఉండరు. దాంతో మొత్తం సరుకు మార్కెటింగ్, రవాణా వ్యయం తగ్గుతుంది. అందుకే బహిరంగ మార్కెట్ కంటే టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధర తక్కువగా ఉండాలి. కానీ ఇందాపూర్ డెయిరీ బహిరంగ మార్కెట్ కంటే టీటీడీకి నెయ్యిని కిలోకు రూ.97 అధిక ధరకు విక్రయిస్తోంది. అంటే ఆ విధంగా లక్షల లీటర్ల నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కించుకుంది. అంటే ఏ స్థాయిలో దోపిడీ చేస్తోందనేది విభ్రాంతి కలిగిస్తోంది. ఈ దందా బయట పడగానే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డెయిరీ అనే విషయాన్ని వెబ్సైట్లో తొలగించి, కో మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థగా ఎడిట్ చేసింది. ఇందాపూర్’ రూటులోనే సంగం కల్తీ ‘వైష్ణవి’తో వ్యాపార బంధం» తిరుమల శ్రీవారి నిధులు కొల్లగొట్టేందుకు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు తలుపులు బార్లా తెరిచారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల టీడీపీ గోబెల్స్ ప్రచార టీమ్‌లో ముఖ్యుడిగా ఉన్న సంగతి తెల్సిందే. ఆయన సేవలకు మెచ్చి టీటీడీ నెయ్యి కాంట్రాక్టును బహుమతిగా ఇచ్చారు. సంగం డెయిరీకి కూడా కిలో రూ.599 చొప్పున కాంట్రాక్టు ఖరారు చేశారు. అంటే కిలోకు రూ.58 అధిక ధరకే కట్టబెట్టారు. ఆ విధంగా సంగం డెయిరీకి రూ.29.95 కోట్ల విలువైన 5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టారు. » ఇంతటి దోపిడీ సాగించేందుకే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ముందస్తు కుట్రతోనే తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేశారన్నది స్పష్టమవుతోంది. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. 5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కోసం టీటీడీ పిలిచిన టెండర్లను సంగం డెయిరీకి కట్టబెట్టాలని నిర్ణయించారు. బిడ్లు దాఖలు చేసేందుకు సానుకూలత వ్యక్తం చేసిన ఇతర డెయిరీల యాజమాన్యాలను ప్రభుత్వ పెద్దలు బెదిరించారన్న ఆరోపణలున్నాయి. అందుకే టీటీడీ మూడు సార్లు టెండర్లు పిలిచినా ఏ డెయిరీ కూడా బిడ్లు దాఖలు చేయ లేదని వినిపిస్తోంది. ఈ కారణం సాకుగా చూపి ఆ టెండర్ నోటిఫికేషన్లను టీటీడీ రద్దు చేసింది. » తిరుమల లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి సరఫరా అంశంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. గతంలో తిరస్కరించిన భోలేబాబా డెయిరీ అడ్డదారిలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసినట్టు వెల్లడైంది. తమ నెయ్యి ట్యాంకర్లను తిరుపతి జిల్లాలోని పెనుబాకలో ఉన్న వైష్ణవి డెయిరీకి పంపించి... అక్కడ నుంచి తమిళనాడులోని ఏఆర్ డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్టు వెలుగు చూసింది.» టీటీడీ ల్యాబ్ పరీక్షల్లో నాణ్యత లేవని వెల్లడైనా సరే అవే ట్యాంకర్లను కొన్ని రోజుల తరువాత తిరుమలకు పంపినట్టు కూడా వెల్లడైంది. దాంతో ఏఆర్ డెయిరీ, భోలే బాబా డెయిరీ ప్రతినిధులతోపాటు వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయకాంత్ చద్వాను అరెస్టు చేశారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఈ వ్యవహారం బరితెగించి సాగించారు. అంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో అంతా చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే సాగిందన్నది స్పష్టమైంది. » తిరుపతి జిల్లా పెనబాకలో ఉన్న వైష్ణవి డెయిరీ ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పాత్ర పోషించిందని సీబీఐనే నిగ్గు తేల్చింది. అసలు వైష్ణవి డెయిరీకి అంత అనుకూలంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు వ్యవహరించిందంటే... వైష్ణవి డెయిరీ టీడీపీ సిండికేట్‌లో సభ్య డెయిరీనే. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్‌గా ఉన్న గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ, వైష్ణవి డెయిరీ వ్యాపార భాగస్వాములు. ఆ రెండింటి మధ్య దృఢమైన వ్యాపార బంధం ఉందని తాజాగా వెల్లడైంది. వైష్ణవి డెయిరీ వెబ్‌సైటే ఆ విషయాలను పేర్కొనడం గమనార్హం. తిరుపతి జిల్లా పెనబాకలోని వైష్ణవి డెయిరీ ప్రధాన ద్వారంపై సంగం డెయిరీ ఎంబ్లమ్ కూడా ముద్రించి ఉంది. సంగం డెయిరీ ట్యాంకర్లు వైష్ణవి డెయిరీలోకి వెళ్తున్న వీడియోలు కూడా బయటపడ్డాయి.» చాలా జిల్లాల్లో వైష్ణవి, సంగం డెయిరీలు ఉమ్మడిగా రిటైల్ అవుట్ లెట్లను నిర్వహిస్తున్నాయి. ఇక చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సంగం డెయిరీకే టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు అడ్డగోలుగా కట్టబెట్టిన వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. అంటే గతంలో భోలేబాబా డెయిరీ కల్తీ నెయ్యిని వైష్ణవి డెయిరీ ద్వారా సరఫరా చేశారు. భోలేబాబా డెయిరీ వ్యవహారం బయటపడటంతో ప్రస్తుతం సంగం డెయిరీ ద్వారా కథ నడపించాలని ఎత్తుగడ వేసినట్టు స్పష్టమవుతోంది. » అందుకోసం టీడీపీ కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా సాగించిన బాగోతం ఇలా ఉంది... కాగా వైష్ణవి – సంగం డెయిరీల బంధం బయటపడడంతో ఎంబ్లమ్ లు కనపడకుండా వైష్ణవి గేట్ల రంగులు మార్చేయడం గమనార్హం. అంతేకాకుండా రెండు డెయిరీల వెబ్సైట్లను కూడా తాత్కాలికంగా నిలుపుదల చేయడాన్ని చూస్తే.. వాటి మధ్య బంధం మరింతగా బట్టబయలైందని స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దల బెదిరింపులకు తలొగ్గిన జాతీయ డెయిరీలు» సంగం డెయిరీకి అనుకూలంగా నాలుగోసారి నోటిఫికేషన్ జారీ చేశారు. సంగం డెయిరీకి అనుకూలంగా నిబంధనలు విధించారు. అయిదేళ్ల అనుభవం ఉండాలి...వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లు ఉండాలన్న నిబంధనలే అందుకు తార్కాణం. పోటీలో ఉండకుండా ఇతర డెయిరీలను బెదిరించారు. ముందే రింగ్‌గా ఏర్పడి సంగం డెయిరీకి అనుకూలంగా సిండికేట్ వ్యవహారం నడిపారు. » సంగం డెయిరీకి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టాలని ప్రభుత్వం మొండి పట్టుదలతో ఉందని జాతీయ డెయిరీ సంస్థలకు అర్థమైంది. కాదని తాము బరిలో ఉంటే తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తారని కూడా ఆ డెయిరీల యాజమాన్యాలు భయపడ్డాయి. దాంతో ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గి పోటీ నుంచి తప్పుకున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఆదేశించిన ధరకు బిడ్లు దాఖలు చేసి సంగం డెయిరీకి మార్గం సుగమం చేశాయి. ఎంత పక్కాగా కథ నడిపారు అంటే.. బిడ్లు దాఖలు చేసేందుకు గడువు తేదీ 2025, సెప్టెంబరు 4 తో ముగిసిన రెండు రోజుల్లోనే అంటే సెప్టెంబరు 6నే టీటీడీ టెక్నికల్ కమిటీ సభ్యులు సంగం డెయిరీని సందర్శించి సానుకూలంగా నివేదిక సమర్పించారు. » అంటే సంగం డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టాలని ముందే నిర్ణయించినట్టు స్పష్టమవుతోంది. కర్ణాటక సహకార పాడి రైతుల ఫెడరేషన్‌ను పక్కనపెట్టేశారు. ఇక జాతీయస్థాయి డెయిరీలు కిలో నెయ్యి రూ.600 చొప్పున సరఫరా చేసేందుకు కోట్ చేశాయి. ముందే నిర్ణయించిన స్క్రిప్ట్ ప్రకారం సంగం డెయిరీ ఒక్క రూపాయి తక్కువకు అంటే కిలో నెయ్యి రూ.599 చొప్పున సరఫరాకు బిడ్ దాఖలు చేసింది. దాంతో సంగం డెయిరీకి 5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఖరారు చేసింది. టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు తోపాటు టీటీడీ పాలకమండలి అందుకు ఆమోదముద్ర వేసింది. ఏది కల్తీ... ఏది దోపిడీ చంద్రబాబూ.. తమ దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. టీటీడీకి నెయ్యి కిలో రూ.325 చొప్పున సరఫరా చేయగా ఆ ధరను టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.638కి పెంచింది. ఎందుకంటే కల్తీ నెయ్యి సరఫరాను అరికట్టడానికి ఇలా చేశామని వితండవాదం లేవనెత్తింది. రూ.638 చొప్పున అయితేనే నాణ్యతతో కూడిన నెయ్యిని సరఫరా చేయగలమని చెబుతోంది. మరి అదే ఇందాపూర్ డెయిరీ ఆన్లైన్లో కిలో రూ.529 చొప్పున బహిరంగ మార్కెట్లో కిలో రూ.541 చొప్పున ఎలా విక్రయిస్తున్నట్టు? అంటే ఆన్లైన్, బహిరంగ మార్కెట్లో విక్రయిస్తోంది కల్తీ నెయ్యి అని ఆ డెయిరీ ఒప్పుకుంటున్నట్టా? కాదు.. తిరుమల శ్రీవారి నిధులు కదా... బరితెగించి దోపిడీ చేసేందుకే కిలో నెయ్యి ఏకంగా రూ.638 చొప్పున ధర నిర్ణయించినట్టు సమ్మతించినట్టే కదా. అదే చంద్రబాబు ముఠా దోపిడీ పన్నాగం. తిరుమల శ్రీవారి దివ్యక్షేత్రం వేదికగా చంద్రబాబు ముఠా బరితెగించి సాగిస్తున్న అవినీతి దందాతో యావత్ భక్తులు నివ్వెరపోతున్నారు. -
ఇన్ని అబద్ధాలా? ఇంత విషమా?
అబద్ధాలు చెప్పడం చంద్రబాబు గారి జన్మహక్కు. దాన్ని మనం కాదన్నా ఆయన ఒప్పుకోరు. అందుకే అసెంబ్లీ లోనూ, బయటా, దేవుడి ముందూ, దేవుడి మీదా కూడా అబద్ధాలు చెప్ప గలరు. కోట్లాది మంది భక్తితో మోకరిల్లే తిరుమల శ్రీవారికే పంగనామం పెట్టగల సమర్థత బాబు గారి సొత్తు. మంగళవారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తిరుమల గురించి గుక్క తిప్పుకోకుండా అబద్ధాలు చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గారు తిరుమలను రెండు కొండలుగా ప్రకటించారని ఘోరమైన అసత్యం ప్రకటించారు. దాదాపు 20 ఏళ్లుగా ఈ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఒక అబద్ధాన్ని కోట గోడలా కట్టి, నమ్మించడం చంద్రబాబు స్పెషా లిటీ. గోడలు బద్ధలు కొట్టకపోతే దేవుడు మమ్మల్ని క్షమించడు. బ్రిటిష్ వారి మాన్యువల్ లెక్కఏడుకొండలపై వెలసిన తిరుమల క్షేత్రం సువిశాలమైంది. శేషాచలం కొండలు సమస్తం శ్రీవారి నిలయమే. దైవానికీ, భక్తికీ పరిధి లేదు. అయితే బ్రిటిష్ వారి నార్త్ ఆర్కాట్ మాన్యుయల్‌లో తిరుమల పరిధి 27 చదరపు కిలోమీటర్లు అని లిఖితమై ఉంది. టీటీడీ నిర్మాణాలకు అవసరమైన అనుమతులన్నీ కేంద్ర అటవీ శాఖ నుంచి లభించేవి కాబట్టి ఎప్పుడూ ఏ సమస్యా రాలేదు. స్వాతంత్య్రానికి ముందూ, తర్వాతా పాలకులూ, ముఖ్యమంత్రులూ వచ్చారు. టీడీపీ ఎన్టీఆర్ హయాంలోనూ, తొమ్మిదేళ్లచంద్రబాబు హయాంలోనూ కూడా బ్రిటిష్ వారి లెక్కల ప్రకారమే తిరుమల ఉండింది. ఎవరికీ ఏ సందేహం లేదు, రాలేదు. ఇది దైవ కార్యం కాబట్టి! వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్ర బాబు దిగజారి తిరుమలను రాజకీయం చేయడం మొదలు పెట్టారు. కొండపై పంచాయతీ ఎన్నికల విషయమై జయచంద్ర నాయుడు అనే తెలుగుదేశం నాయకుడితో కోర్టులో పిటిషన్ వేయించారు. ఈ సందర్భంగా అప్పటి పంచాయతీ రాజ్ సెక్రటరీ శామ్యూల్ జీవో నంబర్ 338 విడుదల చేశారు. శతాబ్దాలుగా ఉన్న బ్రిటిష్ వారి ఉత్తర్వుల్లోని 27 చ.కి.మీ. పరిధినే జీవోలో తెలిపారు. ఇదే అదనుగా చంద్రబాబు గగ్గోలు పెట్టి బురద చల్లడం ప్రారంభించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలను రెండు కొండ లుగా మార్చాడని అబద్ధం ప్రచారంలోకి తెచ్చారు. అయితే ఆ రెండు కొండలు ఏమిటి? మినహాయించిన ఐదు కొండల పేర్లను చంద్ర బాబు జన్మలో చెప్పలేరు. ఎందుకంటే, అటువంటి ఆలోచనే జరగ లేదు కాబట్టి! వైఎస్‌తో బాబుకు పోలికా!అయితే చంద్రబాబు కుటిలత్వాన్నీ, దేవుణ్ణి రాజకీయానికి వాడుకునే దుర్మార్గాన్నీ అప్పటి టీటీడీ అధ్యక్షుడిగా ఉన్న నేను గుర్తించాను. అప్పటి ఈవో కేవీ రమణాచారి, ఎండోమెంట్ సెక్రటరీ ఐవీ సుబ్బారావు గార్లతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌తో స్వయంగా చర్చించాం. చంద్రబాబు దురుద్దేశాన్ని వివరించాం. వెంటనే ఆయన తిరుమల పరిధిని 352 చదరపు కిలోమీటర్లుగా నిర్దేశిస్తూ జీవో 746, తిరుమలలో అన్య మత ప్రచారాన్ని నిషేధిస్తూ జీవో నంబర్ 747ను విడుదల చేశారు. తిరుమల శ్రీవారికి భక్తితో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో చేశారు. ఏడుకొండల చట్టం తెచ్చింది ఆయనే. అన్యమత ప్రచారాన్ని నిషే ధించింది ఆయనే. వైఎస్ హయాంలోనే, నేను టీటీడీ చైర్మన్‌గా ఉన్నపుడు, టీటీడీలో హిందువులు తప్ప మిగతా మతస్థులతోఉద్యోగాల నియామకాలు చేపట్టకూడదని చట్టం తెచ్చాం. ఎన్టీఆర్ హయాంలో గొల్లపల్లి, పైడిపల్లి, తిరుపతమ్మ, పెద్దింటి కుటుంబాల వంశ పారంపర్య మిరాశీ హక్కును రద్దు చేశారు. 2007లో దేవుణ్ణి నమ్ముకున్న ఆ కుటుంబాల ఆనువంశిక హక్కును వైఎస్ రాజశేఖర రెడ్డి పునరుద్ధరించారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సాధు పుంగవుల సమ్మేళనం నిర్వహించింది వైఎస్సార్ హయాంలోనే!తిరుమల వేంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడ్డానికీ, ధర్మాన్ని, విశ్వాసాల్ని పరిరక్షించడానికీ వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంతరం పాటుపడ్డారు. ఆయన పాదాల చెంత ఉన్న నారావారిపల్లెలో పుట్టి, తెల్లారి లేస్తే స్మరించుకుంటానని అబద్ధాలు చెప్పే చంద్రబాబు తిరుమలకు పంగనామం పెట్టడం తప్ప, చేసిందేమీ లేదు. దేవుడి పేరుతో ఇంత రాజకీయమా?అలిపిరి సంఘటనలో వేంకటేశ్వరస్వామి చంద్రబాబును కాపాడిన మాట నిజమే. అయితే దేవుణ్ణి రాజకీయాలకు వాడే ఆయన స్వభావానికి అది శ్రీవారు చేసిన హెచ్చరిక కూడా! ఆ తర్వాత కూడా తిరుమల శ్రీనివాసుడిని రాజకీయాలకు వాడారు, ఇంకా వాడుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి వస్త్రాలు భక్తితో తీసుకెళ్లిన వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్ ఇద్దరూ తిరు మలను రాజకీయాలకు వాడలేదు. ఇపుడు కూడా చంద్రబాబునిందలకు సమాధానం మాత్రమే చెబుతున్నాం. ఎందుకంటే అబ ద్ధాన్ని నిజమని నమ్మించడంలో భారత రాజకీయాల్లోనే ఆయన్ని మించినవారు లేరు, ఇప్పట్లో రారు. 2009లో జరిగిన రాజకీయ సభలో జీవోలు 746, 747 రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబే,అసెంబ్లీలో జంకు లేకుండా మాట్లాడుతున్నారు. ఇదంతా సిగ్గుగా అనిపించదా? పీవీ నరసింహారావు గారితో సహా ఎందరో మహనీయుడిగా భావించే పెజావర్ స్వామి ఈ జీవోల మీద వైఎస్‌ను ప్రశంసించారు. హైందవ ప్రచారానికి వైఎస్ చేసిన కృషిని పత్రికా సమావేశంలో కొనియాడారు. చంద్రబాబుకు బురద రాజకీయమే తెలుసు. మాకు గౌరవ రాజకీయాలు మాత్రమే తెలుసు. అందుకే ఆయన కుమారుడు లోకేశ్ పెళ్లికి, ఆయన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ కోరిక మేరకు శేషాద్రి స్వామిని, తిరుమల అర్చకుల్ని స్వయంగా నేనే ఏర్పాటు చేశాను. బాలకృష్ణ కూడా సౌకర్యాలకు ధన్యవాదాలు తెలిపారు. కానీ చంద్రబాబు మాత్రం దర్శన ఏర్పాట్లు ఘోరంగా ఉన్నాయని చెప్పారు. ఇదే విషయం బాలకృష్ణతో చెబితే, ‘రాజకీ యాలతో నాకు సంబంధం లేదు. మనస్ఫూర్తిగా చెబుతున్నా, మీ ఏర్పాట్లు బాగున్నాయి’ అన్నారు. ధైర్యం ఉంటే జగన్ తో రాజకీయంగా తలపడండి. మతాన్నీ, దేవుడినీ అడ్డు పెట్టుకుని అబద్ధాల్ని చెప్పకండి చంద్రబాబూ!ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. దేవుడు ఇంకా బాగా గమనిస్తు న్నాడు. తిరుమల క్షేత్రం చాలా శక్తిమంతమైనది. ఆ దైవం ప్రతిసారీ మిమ్మల్ని క్షమించక పోవచ్చు! -వ్యాసకర్త టీటీడీ పూర్వ అధ్యక్షులు-భూమన కరుణాకరరెడ్డి -
తిరుమల దర్శన వివాదం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
లిటిల్ హార్ట్స్, అంజాజీపేట మ్యారేజ్ బ్యాండు, హే బలవంత్ తదితర సినిమాలతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శివానీ నాగరం.. రీసెంట్గా ఊహించని విమర్శలు ఎదుర్కొంటోంది. తిరుమలలో తనకు 15 నిమిషాల పాటు స్వామి దర్శనభాగ్యం దక్కిందని కొన్నిరోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో సామాన్య భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. ఐదు సెకన్ల దొరకడమే కష్టమనుకుంటే ఈమె ఇలా చెబుతుందేంటి అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోపై స్వయంగా సదరు హీరోయినే క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: రష్మిక పెళ్లికి పిలిచిందా? రిషభ్ శెట్టి సమాధానమిదే)'కొన్నిరోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్‌కి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. యాంకర్ నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. చిన్నప్పటి విషయాలు, సినిమా జర్నీ, భక్తికి సంబంధించిన విషయాలు మాట్లాడాను. నా స్పిరిట్యూల్ జర్నీ గురించి పంచుకున్నా. అందులో తిరుపతి గురించి మాట్లాడాను. 15 నిమిషాల దర్శనం అనే మాట హైలైట్ అవుతోంది. దానికి నేను క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నా. 2025 అక్టోబరులో విమానాశ్రయంలో నేను, మా అమ్మ.. లైనులో నిల్చుని శ్రీవాణి టికెట్స్ తీసుకున్నాం. తర్వాత దర్శనం చేసుకున్నాం. లైన్లో మొదటి నుంచి స్వామి దగ్గరకు వెళ్లేంతవరకు కొంచెం కొంచెం స్వామివారు కనిపిస్తుంటారు. ఆ మొత్తం సమయం 15 నిమిషాలు ఉంటుందని అంచనాతో అలా చెప్పాను తప్పితే పావుగంట పాటు నన్ను ఎవరూ టచ్ చేయలేదు అని కాదు''సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా రూ.300 టికెట్ తీసుకుని కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లాను. అప్పుడు కేవలం 5 సెకన్ల పాటు స్వామిని చూశాను. నా జీవితంలో తొలిసారి 13 ఏళ్ల తర్వాత స్వామిని అంత దగ్గరగా చూశాను. ఇది నేను సంతోషంగా భావించి ఆత్రుతతో ఆ విషయాన్ని పంచుకున్నాను అంతే. అది కొంచెం మిస్ లీడింగ్‌గా వెళ్తోంది. మీలో ఎవరైనా శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకుని వెళ్తే స్వామి దర్శనం మీకు కూడా అలానే దక్కుతుంది' అని హీరోయిన్ శివానీ నాగారం వివరణ ఇచ్చింది.(ఇదీ చదవండి: అన్వేష్‌కి బిగ్ షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) -
నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 25 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. మంగళవారం అర్ధరాత్రి వరకు 74,902 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,869 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.05 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 5 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. -
మతం ముసుగుతో రాజకీయ వ్యాపారం
సాక్షి, అమరావతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి అంటే భయం లేకుండా చంద్రబాబు కూటమి ప్రభుత్వం అసెంబ్లీని అబద్ధాలకు వేదికగా మార్చుకుందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మతం ముసుగుతో రాజకీయ వ్యాపారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తిరుమల లడ్డూలో నెయ్యి అంశంపై ప్రభుత్వం చేసిన చర్చ అంతా వైఎస్ జగన్‌పై రాజకీయంగా బురదజల్లడానికేనని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హెరిటేజ్–ఇందాపూర్ డెయిరీల మధ్య ఉన్న అక్రమ సంబంధాలను కప్పిపుచ్చడానికి ఐదు రోజులు తాత్సారం చేసి, ఇవాళ లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని స్పష్టం చేశారు. గతంలో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇవాళ అసెంబ్లీలో మాత్రం ‘కల్తీ జరిగింది’ అంటూ మాట మార్చడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. నిజంగా చంద్రబాబుకు దేవుడిపై భక్తి ఉంటే.. 2014 నుంచి ఇప్పటి వరకు సరఫరా అయిన నెయ్యి కంపెనీల మూలాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు. ఈ సమావేశంలో పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే.. మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు ⇒ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం నారా చంద్రబాబు ఒక రిపోర్టులోని అంశాలను దురుద్దేశంతో మాజీ సీఎం జగన్‌పై ఆరోపణలు చేశారు. తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కాషాయ బట్టలు కట్టుకుని గుడి మెట్లు కడిగారు. జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారని అన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ ‘మాజీ సీఎం కలిపారని నేను అనలేదు, టీటీడీ ఉద్యోగులు కలిపారని అన్నాను’ అంటూ మాట మార్చారు. ఇప్పుడు కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారు. మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు. ⇒ జగన్ సీఎంగా ఉన్నప్పుడు దేవాలయాలపై దాడులు జరిగితే ఆయనకు రాజకీయ లాభం వస్తుందా? పవిత్ర విగ్రహాలు ధ్వంసం అయితే జగన్‌కు లాభం ఏంటి? ఏ రాజకీయ నాయకుడైనా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేస్తాడు? జగన్ హయాంలో ఆలయాలపై దాడులు జరిగితే ఆయనకు లాభమా? ప్రత్యర్థి అయిన చంద్రబాబుకే లాభం కాదా? ఇదేనా మీ భక్తికి తార్కాణం బాబూ? ⇒ 2014–2019 మధ్య ఎన్ని గుడులను జేసీబీలతో కూల్చారో.. రాజధాని నడిరోడ్డున ఎన్ని ఆలయాలు కూల్చారో వీడియోలు ఉన్నాయి. ఇలా గుడులు కూల్చిన మీకు దేవుడి పట్ల భయం ఉన్నట్టా? ఇదేనా మీ భక్తికి తార్కాణం? ⇒ కూటమి ప్రభుత్వం వచి్చన తర్వాత కాశీనాయన ఆలయంలో కూల్చివేతలు ప్రారంభించింది ఎవరు? సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్‌కు ఇవి తెలియవా? అటవీ శాఖ ఆదేశాలు లేకుండా కూల్చివేతలు జరిగాయా? ప్రజలు నమ్ముతారా? శ్రీకాకుళంలోని శ్రీకూర్మం మందిరానికి మచ్చ తెచ్చారు. సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. గుడిలో మరణాలు అపచారం కాదా? ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కాదా? అంతకు ముందు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆత్మపరిశీలన చేసుకున్నారా? ⇒ టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కిశోర్ రెడ్డి ప్రోద్బలంతో అర్ధరాత్రి ఆలయ విధ్వంసం జరిగింది. తిరుచానూరులో వారాహి ఆలయాన్ని కూల్చింది ఎవరు? మీ పార్టీకి చెందిన వారు‡ కాదా? గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు మూడు మునకలు వేయడానికి 29 మంది భక్తులు ప్రాణాలు బలిగొన్నారు. తిరుమల తిరుపతిలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చింది మీరు కాదా? రామతీర్థంలో స్వామివారి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తికి సీఎంఆర్ఎఫ్ నిధులు ఎలా ఇచ్చారు? ⇒ చంద్రబాబు ప్రభుత్వంలో కూల్చిన ఆలయాలను జగన్ ప్రభుత్వం పునర్ నిరి్మంచింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవాణి ట్రస్ట్‌ను రద్దు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కల్తీ నెయ్యి పాపం మీదే ⇒ మీరు సీఎం అయ్యాక పెట్టిన రెండో సంతకంతో టీటీడీ ఈవో శ్యామలరావును నియమించారుగా.. ఇప్పుడు ఆయన ఎందుకు కనిపించట్లేదు? మీరు చెప్పిన డెయిరీల దగ్గర నెయ్యి కొనడం లేదనే ఆయన్ను బదిలీ చేశారా? ⇒ 2024 జూన్‌లో ఆయన్ను నియమిస్తే జూలై 6న నాలుగు శాంపిల్స్, జూలై 12వ తేదీన మరో నాలుగు శాంపిల్స్ తీశారు. జూలై 16న 6వ తేదీన తీసిన శాంపిల్స్ రిపోర్ట్ వచ్చింది. జూలై 12న తీసిన శాంపిల్స్ రిపోర్ట్ జూలై 23న వచ్చింది. ఎన్డీడీబీ ఇచి్చన రిపోర్టులు జూలై 16, 23న వచ్చాయి. జూలై 25వ తేదీన ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఆ ట్యాంకర్లు ఎక్కడికి వెళ్లాయో సిట్ ఇప్పటికే బయటపెట్టింది. ⇒ ఆ ట్యాంకర్లు వైష్ణవీ డెయిరీకి సమీపంలోని రాఘవేంద్ర క్రషర్ వద్ద పెట్టడం, తిరిగి కొన్నాళ్ల తర్వాత వైష్ణవీ డెయిరీకి తీసుకెళ్లి.. అక్కడి నుంచి టీటీడీకి అప్పగించడం వాస్తవం కాదా? పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిన ఆ నెయ్యితోనే లడ్డూలు తయారు చేసి భక్తులకు పంచేశారు కదా. ఈ విషయాన్ని సిట్ తేల్చింది. అప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం మీరే కదా.. ఈ పాపం వైఎస్ జగన్‌కు మీరు ఎలా అంటగడుతున్నారు? అసలు పాపం మీదే. వీళ్లు సరఫరా చేసింది కల్తీ నెయ్యా? తక్కువ రేటుకు నెయ్యి కొన్నారని ప్రశి్నస్తున్న మీరు.. మీ హయాంలో 2014–19లో రూ.278, రూ.264కు కేజీ నెయ్యి ఎలా కొన్నారో చెప్పండి. అప్పుడు టీటీడీ లడ్డూ ప్రసాదానికి అవసరమైన నెయ్యిలో 90 శాతం సీఎఫ్టీఆర్ఐ రిపోర్ట్‌లో ఉన్న ప్రీమియర్ ఆగ్రో డెయిరీ సరఫరా చేసింది. 2016 మార్చిలో కేజీ నెయ్యి రూ.332, సెపె్టంబర్ లో రూ.364కు, ఏప్రిల్ 2017లో రూ.411కు, అక్టోబర్ 2017లో రూ.378, జనవరి 2018 రూ.320, జూన్ 2018లో రూ.321కు సరఫరా చేసింది. ఇది కల్తీ నెయ్యా? మీ లాజిక్ ప్రకారమే చెప్పండి. ప్రీమియర్ డెయిరీకి చెందిన ఆశిష్ గుప్తా, రేణూ గుప్తాకు హెరిటేజ్ డెయిరీలో వాటాలుండటం నిజమో కాదో చంద్రబాబే చెప్పాలి. ఆల్ఫా డెయిరీకి కూడా హెరిటేజ్‌లో షేర్లు ఉన్నాయో లేదో చెప్పాలి. బయటపడ్డ హెరిటేజ్–ఇందాపూర్ బంధం ⇒ తమ డెయిరీకి బోలేబాబాతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో హెరిటేజ్ పిటిషన్ వేసింది. బోలేబాబా ఆర్గానిక్కూ, సీబీఐ చార్జిషీట్లో ఉన్న బోలేబాబా ఆర్గోనిక్కూ సంబంధం లేదని అందులో చెప్పారు. తమకు ఢిల్లీ, రాజస్థాన్‌లో ఉన్న బోలేబాబా డెయిరీలతో సంబంధం ఉన్నట్లు చెప్పారు. కానీ ఐటీ శాఖ ఉత్తరాదిలో 35 డెయిరీల్లో 131 గంటల పాటు సోదాలు చేసి ఉత్తరాఖండ్, ధోల్ పూల్, రాజస్థాన్, ఢిల్లీ బోలేబాబా డెయిరీలన్నీ ఒకే గొడుగు కింద ఉన్న సంస్థలని తేల్చింది. ⇒ దీన్నిబట్టి భారత్‌లో పెద్ద డెయిరీ మాఫియా నడుస్తోందని అర్థమవుతోంది. దీనికి వైట్ కాలర్ డాన్ ఎవరు? ఇండియా మాఫియా డెయిరీకి పాబ్లో ఎస్కోబార్ ఎవరు? బాబూ ఇదేనా మీ భక్తి? ⇒ మీ సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు 2024 నవంబరు 16 న మరణిస్తే.. ఏడాది తిరక్కుండానే మార్చి 21, 2025న మీ మనవడి పుట్టిన రోజున తిరుమలకు వెళ్లి టీటీడీకి రూ.44 లక్షలు దానం ఇచ్చి పూజలు చేయలేదా? ⇒ చంద్రబాబు హయాంలో 2014 –19 మధ్య పవిత్ర జెరూసలెం యాత్ర, పవిత్ర మక్కా యాత్ర అని ప్రభుత్వం రూపొందిస్తున్న పథకాలను ఆర్టీసీ టికెట్ వెనుక ముద్రించాలని జీవో ఇచ్చింది మీరు కాదా? అవి జగన్ వచ్చే వరకు చలామణీలో ఉన్నాయి. దానికి జగన్‌కు ఏం సంబంధం? ఈ పాపం ఎవరిది? మీ హయాంలోనే నెయ్యి కొనుగోళ్లలో అక్రమాలు ⇒ బోలేబాబా డెయిరీకి పొమిల్ జైన్, విపుల్ జైన్ ఓనర్లు. వైష్ణవీ డెయిరీ ఓనర్లు కూడా వాళ్లే. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన సంగం డెయిరీ వైష్ణవీ పార్ట్నర్. ఇవాళ అసెంబ్లీలో పెద్ద పెద్దగా రంకెలేసిన ధూళిపాళ్ల నరేంద్ర ఇప్పుడేం చెప్తారు? బోలేబాబా, వైష్ణవీ డెయిరీల ఓనర్లు పొమిల్ జైన్, విపుల్ జైన్ ఇద్దరికీ హెరిటేజ్‌లో వాటాలు ఉన్నమాట వాస్తవం కాదా? ఏఆర్ డెయిరీ చంద్రబాబుకు దగ్గరా, జగన్‌కు దగ్గరా? ఏఆర్ డెయిరీ ఓనర్ రాజు రాజశేఖర్ డిండిగల్‌లో హెరిటేజ్ఫ్యాక్టరీని కట్టించింది నిజమా కాదా? ⇒ నిబంధనలు సడలించి, నాణ్యతా ప్రమాణాలు తగ్గించారని చెబుతున్న చంద్రబాబు.. దాని నేపథ్యం కూడా చెప్పాలి. ఇవాళి్టకీ అవే నిబంధనలు అమల్లో ఉన్నాయి. సీఎఫ్టీఆర్ఐ రిపోర్ట్‌లో ఉన్న ప్రీమియర్ డెయిరీ, ఆల్ఫా డెయిరీ, మాల్ గంగా డెయిరీ, వైష్ణవీ డెయిరీలు 2025 జనవరి వరకు నెయ్యి సరఫరా చేశాయి. ఇప్పుడు మీ నిబద్దత ఏమైందో చెప్పండి. -
అవును.. ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ ‘కో మాన్యుఫాక్చరర్’
సాక్షి, అమరావతి: టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఇందాపూర్ డెయిరీ తమ కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు కో–మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ అని శాసన సభ సాక్షిగా సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారు. ఇందాపూర్ డెయిరీలో హెరిటేజ్ ఉత్పత్తులు తయారవుతాయని వెల్లడించారు. తమకు కో–మాన్యుఫ్యాక్చరింగ్ చేస్తున్న ఇందాపూర్‌పై ఆరోపణలు చేస్తున్నారని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.టీటీడీకి నెయ్యి సరఫరా వ్యవహారంలో హెరిటేజ్‌కు ముడిపెడుతున్నారని, దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై శాసన సభలో మంగళవారం నిర్వహించిన లఘు చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. హెరిటేజ్ సంస్థ తన ఉత్పత్తులను ప్రభుత్వానికి ఎన్నడూ సరఫరా చేయలేదని తెలిపారు. తిరుమల క్షేత్రం ఏడు కొండలపై వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జారీ చేసిన 746, 747 జీవోలను తానెప్పుడూ వ్యతిరేకించలేదన్నారు.లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని వాడారని ఎన్డీడీబీ అనుమానిత నివేదిక ఆధారంగానే ప్రకటన చేశానని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యితో తయారు చేసిన 20.01 కోట్ల లడ్డు ప్రసాదాలను విక్రయించారని ఆరోపించారు. సీబీఐ సిట్ సిఫార్సులు అమలు చేయడం కోసం ఏకసభ్య కమిషన్‌ను నియమించామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక టీటీడీ ప్రక్షాళనకు చర్యలు తీసుకున్నామన్నారు.గతంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి సతీమణి బైబిల్ పట్టుకున్నారని, కరుణాకర్‌రెడ్డి కుమార్తె వివాహం క్రైస్తవ సంప్రదాయంలో చేశారని విమర్శించారు. కాగా 2009 ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను అధికారంలోకి వస్తే 746, 747 జీవోలను రద్దు చేస్తామని గుంటూరులో నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. ఆ విషయాన్ని కప్పి పుచ్చి, ఆ జీవోలను తాను వ్యతిరేకించలేదని అసెంబ్లీ వేదికగా తనకు అలవాటైన రీతిలో కళ్లార్పకుండా అబద్ధాలను వల్లె వేశారు. పెరుమాళ్లకే ఎరుక: పవన్ కళ్యాణ్తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం విషయంలో గత ప్రభుత్వ అధినేత తప్పు చేశారని తానెక్కడా అనలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని టీటీడీ పాలక మండలి దీనికి బాధ్యత తీసుకోవాలన్నారు. రసాయనాలు కలిపిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారని తేలిందన్నారు. ఇందులో లక్ష లడ్డూలు అయోధ్యకు పంపారని, అయితే ఇది రికార్డుల్లో నిరూపితం కావడం లేదన్నారు. రసాయనాల్లో ఏముందో పెరుమాళ్లకే ఎరుక అని వ్యాఖ్యానించారు. నిబంధనలు సవరించి, నచ్చిన సంస్థలకు గత ప్రభుత్వంలో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్‌లు ఇచ్చారని విమర్శించారు. -
మహాపచారం మీదే చంద్రబాబూ..!
సాక్షి, అమరావతి: ‘‘మోసానికి ఫ్యాంటూ చొక్కా వేస్తే అది చంద్రబాబు...!’’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలు నిజమేనని శాసనసభ వేదికగా మరోసారి రుజువైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని సీబీఐ తన చార్జిషీట్లో తేల్చేసినా ఆయన ఏమాత్రం పశ్చాత్తాపం చెందలేదు! దారుణమైన అబద్ధాలు మాట్లాడి వెంకన్న భక్తులను క్షోభకు గురిచేసి మోసగించాననే బాధ ఆయన మొహంలో ఏ కోశానా కానరాలేదు. 2014–19 మధ్య టీటీడీకి కిలో రూ.278కే ఇందాపూర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. ఏడు కొండలూ తిరుమల దివ్య క్షేత్రానివేనని స్పష్టం చేస్తూ.. హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జారీ చేసిన జీవోలు ఇప్పుడు ఏకంగా కిలో నెయ్యి రూ.658 చొప్పున సరఫరా కాంట్రాక్టు అప్పగించడంపైనా సమాధానం లేదు! ఇందాపూర్ డెయిరీని హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా కొద్ది రోజుల క్రితం వరకు హెరిటేజ్ వెబ్సైట్లోనే చూపించారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా కో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా మార్చేయడంపైనా సమాధానం లేదు! టీటీడీకి పంపిన నెయ్యి ట్యాంకర్లు రిజెక్టు కావడం.. వాటినే తిరిగి వినియోగించడం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే జరిగాయని సీబీఐ దర్యాప్తులో తేల్చేసినా దానికీ సమాధానం లేదు. చంద్రబాబు వీటిలో ఏ ఒక్కదానికీ జవాబు చెప్పకుండా తిరుమల క్షేత్రం, ఏడుకొండల గురించి గతంలో తాను చేసిన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకుంటూ చట్ట సభ సాక్షిగా నిస్సిగ్గుగా బుకాయించారు. ‘‘టీడీపీ అధికారంలోకి వస్తే ఆ రెండు జీవోలు 746, 747లను రద్దు చేస్తాం..’’ అని స్వయంగా మీరే 2009లో గుంటూరులో టీడీపీ ఎన్నికల ప్రచార సభలో చెప్పారు చంద్రబాబూ..! ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. తిరుమల ఏడుకొండలూ టీటీడీవేనని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన 746, 747 జీవోలను మీరు రద్దు చేస్తామన్నారు.. హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ మహానేత వైఎస్సార్ ఇచ్చిన జీవోను కూడా రద్దు చేస్తామని కూడా మీరే ప్రకటించారు చంద్రబాబూ..! అంటే.. తిరుమల శ్రీవారి పట్ల, హిందూమతం పట్ల అపచారానికి ఒడిగట్టింది మీరే.. అటువంటి మీరు ఇప్పుడు పరమ భక్తుడి మాదిరిగా కొంగ జపం చేస్తుంటే ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరన్నది గుర్తుంచుకోండి చంద్రబాబూ..! ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అటు కలియుగ దైవం తిరుమల శ్రీవారు అంటే ఏమాత్రం భక్తీ లేదు..! ఇటు ప్రజాస్వామ్య దేవాలయం శాసనసభ పట్ల కనీస గౌరవం లేదని నిస్సిగ్గుగా నిరూపించుకున్నారు! భగవంతుడి గురించి ఏమాత్రం అవాస్తవం చెప్పాలన్నా ఏ ఒక్క భక్తుడూ సాహసించరు. వైఎస్సార్ తెచ్చిన 746, 747 జీవోలను రద్దు చేస్తానంటూ 2009 జనవరి 27న చంద్రబాబు చేసిన ప్రకటనలపై ‘ది హిందూ’తో పాటు చంద్రబాబు గెజిట్ పత్రికైన ‘ఈనాడు’లో ప్రచురితమైన వార్తలు అందుకే ‘దేవుడి తోడు.. నిజమే చెబుతున్నా!’ అని ప్రమాణం చేస్తారు. ఇక నిండు సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడాలంటే ఏ పాలకుడైనా కాస్త తటపటాయిస్తారు. కానీ తనకు అవేవీ పట్టవని చంద్రబాబు చాటి చెబుతూ, శాసనసభ వేదికగా తిరుమల క్షేత్రం గురించి పచ్చి అవాస్తవాలు వల్లిస్తూ, బుకాయిస్తూ రాజకీయ దురుద్దేశ ఆరోపణలు చేశారు. తిరుమలను రెండు కొండలకే పరిమితం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవోలు జారీ చేశారని చంద్రబాబు నిస్సిగ్గుగా అవాస్తవాలు ప్రచారం చేశారు.ఇక తిరుమల లడ్డూ ప్రసాదం కోసం కల్తీ నెయ్యి సరఫరా మహాపచారం టీడీపీ సిండికేట్ నిర్వాకమేనని బట్టబయలు కావడంతో చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. కల్తీ దందా మహాపచారం పచ్చ ముఠా పనేనని ఆధారాలతో సహా నిగ్గు తేలడంతో చంద్రబాబు అసెంబ్లీలో అడ్డంగా బుకాయించి ప్రజల్ని మభ్య పెట్టేందుకు పడరాని పాట్లు పడ్డారు. కానీ దాచేందుకు యత్నిస్తున్న కొద్దీ టీడీపీ కల్తీ నెయ్యి కంపు మరింతగా బయటపడుతోంది. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం సాగిందంతా 2024 జూన్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతేనన్నది తేదీలతో సహా వెలుగులోకి వచ్చింది. కల్తీ అని నిర్ధారణ అయినా సరే అదే నెయ్యిని తిరుమల ప్రసాదం కోసం సరఫరా చేసిన మహాపాపం టీడీపీ పాలకులదేనన్నదీ నిగ్గు తేలింది. ఇక కల్తీ నెయ్యి సరఫరాలో నిందితులుగా ఉన్న భోలే బాబా డెయిరీ, వైష్ణవి డెయిరీలతో చంద్రబాబు ముఠా వ్యాపార బంధం బట్టబయలైంది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్‌గా ఉన్న సంగం డెయిరీకి వైష్ణవి డెయిరీతో వ్యాపార సంబంధాలు ఉండటం.. అదే సంగం డెయిరీకి 5 లక్షల కిలోల టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టడం.. మొత్తం పక్కా పన్నాగంతో కల్తీ దందా సాగిస్తున్నారన్నది టీటీడీ పాలక మండలి తీర్మానాల సాక్షిగా వెలుగులోకి వచ్చింది. వైష్ణవి, సంగం డెయిరీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అవుట్లెట్లు ఇక చంద్రబాబు బుకాయించేందుకు ఏమీ లేదు.. తిరుమల శ్రీవారి ఆలయం పట్ల... పవిత్ర ప్రసాదం పట్ల మీరు చేసిన మహాపచారం బట్టబయలైంది బాబూ! టీడీపీ అనుకూల పత్రికలు ఎంత భాజాభజంత్రీలు మోగించినా సరే కల్తీ నెయ్యి పాపాన్ని దాచిపెట్టడం సాధ్యం కాదు. ఇకనైనా లెంపలు వేసుకుని తిరుమల శ్రీవారిని క్షమాపణలు వేడుకోండి... యావత్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పండి అని పరిశీలకులు సూచిస్తున్నారు. ఇంకా మొండిగా రాజకీయ కుట్రతో తిరుమల క్షేత్రంపై దుష్ప్రచారం చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరిస్తున్నారు. శాసన సభ వేదికగా చంద్రబాబు చేసిన అవాస్తవ ఆరోపణలను వైఎస్సార్సీపీ పూర్తి ఆధారాలతో తిప్పికొట్టింది. వైఎస్సార్ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్‌రెడ్డి, పేర్ని నాని వేర్వేరు విలేకరుల సమావేశాల్లో చంద్రబాబు బండారాన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. -
అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు పలాయనం
సాక్షి, అమరావతి: తిరుమల ఏడు కొండలు జీవో రద్దు హామీపై చంద్రబాబు అడ్డంగా దొరికేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు పలాయనం చిత్తగించి అభాసుపాలయ్యారు. వైఎస్ జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు దాటవేశారు.జీవోలు 746, 747 రద్దు చేస్తానంటూ గతంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధించే జీవోను రద్దు చేస్తానని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. అయితే, సభలో తాను చేసిన ఆ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించలేదు. చంద్రబాబు వ్యాఖ్యల వీడియోను వైఎస్ జగన్ ఇటీవలే ప్రదర్శించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నైజం బట్టబయలైంది. -
సీమకు తలమానికం తిరునగరి
చరిత్రను తెలుసుకోవడం అంటే గతాన్ని గుర్తుచేసుకుని భవిష్యత్తును నిర్ణయించు కోవడం. గతం లేనిదే వర్తమానం ఉండదు, వర్తమానం లేని భవిష్యత్తును ఊహించుకోలేము. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుపతి నగరానికి ఘనమైన నేపథ్యం ఉన్నది. అలాంటి తిరుపతికి అంకురార్పణ జరిగి నేటికి 896 సంవత్సరాలు. తిరుపతి నగరానికి అనుకుని ఉన్న ప్రస్తుత తిరుచానూరులోని వేంకటేశ్వర స్వామి ఆలయం, పార్థసారథి ఆలయం చోళుల కాలంలో రూపొందితే, అటుపిమ్మట పద్మావతి అమ్మవారి ఆలయం వెలసింది. శ్రీ శుకమహర్షి ఆశ్రమాన్ని ఏర్పరచుకుని తపస్సు చేసిన కారణంగా తిరుశుకనూరుగా పిలిచే వారనీ, అటుపిమ్మట కాలక్రమంలో తిరుచానూరుగా మారిందనీ అంటారు. నారాయణవనం కేంద్రంగా పాలన సాగించిన ఆకాశ రాజు కుమార్తె పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్నారు. వివాహమనంతరం 6 నెలల దీక్షా కాలాన్ని శ్రీనివాస మంగాపురంలో గడిపారు. దీక్షా కాలం తర్వాత శ్రీనివాసుడు తిరుమల వెళ్ళారు. ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి కాలంలో శ్రీనివాస మంగాపురం ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. ఆధ్యాత్మిక అనుబంధమే పునాదిచారిత్రక ఆధారాల ప్రకారం, 1130 ఫిబ్రవరి 24న రామా నుజాచార్యుల నిర్ణయం మేరకు గోవింద రాజపురం ఆగ్రహారం నిర్మాణానికి పునాది వేశారు. అంటే నేటి తిరుపతి... గోవింద రాజపురంగా పునాది వేసుకుంది. అటు పిమ్మట గోవిందరాజ ఆలయం, దాని చుట్టూ అగ్రహారం నిర్మాణం నారాయణవనం రాజ్య పాలకుడు గట్టురాజు చేపట్టారు. తర్వాత 100 సంవత్సరాలకు ఇది తిరుపతిగా రూపాంతరం చెందింది. తిరుమల శ్రీవారి ఆలయ గోపురం, శ్రీనివాస మంగాపురంతో సహా అనేక ఆలయాలకు గోపురాలు, అభివృద్ధి పనులు యాదవ రాజుల కాలంలో జరిగాయి. అందుకే టీటీడీ ఆలయాలలో యాదవులకు తొలి దర్శన అవకాశం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది.తిరుపతి రూపుదిద్దుకుంటున్న ప్రారంభంలో తాళ్ళపాక వాసుల కృషి మరువలేనిది. శ్రీవారి ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో అన్నమయ్య కీర్తనలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే తాళ్ళపాకకు చెందిన తాతయ్య తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద వెలిసిన గంగమ్మ ఆలయానికి ఆద్యులు. అందుకే ఈ ఆలయాన్ని తాళ్ళపాక పెద్ద గంగమ్మ ఆలయం అని అంటారు. తాళ్ళపాక వాసులు శ్రీనివాస మంగాపురం ఆలయ అభివృద్ధిలో కూడా పాలుపంచుకున్నట్లు చెపుతారు. తాతాచార్య వంశస్థులు తాతయ్య గుంట గంగమ్మ ఆల యానికి ఆద్యులు. వీరికి తొలి తీర్థం ఇస్తారు. తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు ఏడుసార్లు తిరుపతి పర్యటన చేశారు. తిరుపతి, తిరుమల, తాను పర్యటించిన నాగలాపురం, నారాయణవనంలో ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారి తల్లి నాగులాంబ పేరుతో నాగులాపురం ఆలయాన్ని నిర్మించారు.మహానగరంగా మార్చే అవకాశంతిరుపతి, తిరుమల అంటూ ప్రస్తుతం పిలుచుకుంటున్నాం. కానీ చరిత్రను పరిశీలిస్తే రెండూ వేరు వేరు కాదని అర్థం చేసు కోవచ్చు. తిరుపతి నగరం స్వతంత్రం వచ్చే వరకు నార్త్ ఆర్కాట్ జిల్లా పరిధిలో ఉన్నది. నేటి కొండను పురాణాలలో వెంగడం అని పిలిచేవారు. పులికాట్ పరిసరాలను పాలించిన ప్రాంతానికి వెంగో రాష్ట్రం అన్న పేరు కూడా ఉంది. తిరుపతి, తిరుమలపై తమిళ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో తిరుపతి గానే పిలిచేవారు. తిరు అంటే శ్రీ అని అర్థం. పతి అంటే శ్రీనివాసుడు యజమాని అని. ఆ రకంగా శ్రీనివాసుడి అజమాయిషీలో తిరుపతి ఉంటుంది. ఎంత బాగుంది ఈ పిలుపు! చాలా కాలం వరకు తమిళంలో మేల్ తిరుపతి, కీల్ తిరుపతి (కింద తిరుపతి, పైన తిరుపతి) అని పిలిచే వారు. క్రమేణా కొండ అర్థం వచ్చేలా తిరుమలగా మారింది. తిరుపతిని అభివృద్ధి చేయడం అంటే శ్రీనివాసుడి అజమాయిషీలో ఉన్న ఆధ్యాత్మిక నగరాన్ని అభివృద్ధి చేయడమే. చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం తెలియనివారు తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు వెచ్చిస్తే అనవసర వివాదం చేస్తుంటారు. ఏపీ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ తన పరిశీలనలో రాయలసీమలో చెప్పుకోవడానికి ఒక నగరం లేదు, ఉన్నవన్నీ గ్రామీణ పరిధి దాటని పట్టణాలు అని పేర్కొంది. ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతోంది అనడానికి మంచి నగరాలుండటం ఒక కొలమానం. వెనుకబడిన రాయలసీమలో చెప్పుకోవడానికి ఒక నగరం కూడా లేకపోతే ఇక అభివృద్ధికి ఆస్కారం ఎక్కడిది? ఈ వెలితిని తీర్చి మహానగరంగా మార్చగలిగే అవకాశం తిరుపతికి ఉన్నది. తిరుపతి నగరానికి అనుకుని చెన్నై, బెంగళూరు మహా నగరాలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు, భూమి సమస్య ఆ రెండు నగరాలకు ప్రతిబంధకంగా మారింది. ఆ ప్రతిబంధకమే తిరుపతి నగర అభివృద్ధికి అవకాశంగా మారుతుంది. తిరుపతి చుట్టూ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో పాటు... దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రోడ్డు, రైల్వే, విమాన మార్గాలు ఉన్నాయి. చెన్నై నగరానికి సమీపంలో మాజీ ముఖ్య మంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసిన శ్రీసిటీ ప్రత్యేక అర్థిక మండలి ఆసియా ఖండంలోనే అత్యంత విజయవంతం అయిన సెజ్‌గా మారింది. వాతావరణ సమతుల్యత అదనపు అనుకూలత. అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తిరుపతిని అత్యంత సౌకర్యవంతమైన నివాస యోగ్య నగరంగా గుర్తించాయి. తిరుపతి నగర పాలక సంస్థ తీర్మానం చేసినట్లు... చంద్రగిరి, కళ్యాణి డ్యామ్, వడమాల పేట, రాయలచెరువు, ఐఐటీ వరకు తిరుపతిని గ్రేటర్‌గా మార్చి కొన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే అనతి కాలంలోనే మరో హైదరాబాద్‌గా మారుతుంది.తొలి దర్శనం నుంచి ప్రథమ పౌరురాలి వరకు...వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న రెండు కీలక నిర్ణయాలను ప్రస్తావించడానికి ఇది సరైన సమయం. విజయనగర రాజుల తర్వాత యాదవ రాయలు తిరుపతి ఆలయాల అభివృద్ధిలో గొప్ప పాత్ర పోషించారు. శ్రీవారి ఆలయం ముందు భాగాన గొల్లమండపం నిర్మించి, గోవుల పెంప కంతో శ్రీవారి నైవేద్యానికి ఆ పాలను వినియోగించే వారని అంటారు. వివిధ కొలనులను వారి హయాంలోనే నిర్మించినట్లు ఆధారాలు కనిపిస్తాయి. దైవ దర్శనంలో కోనేటి స్నానానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలిసిందే. అందుకే శ్రీవారి ఆలయాలలో తొలి దర్శనం యాదవ వంశస్థులకు ఇస్తారు. అయితే ఈ సంప్ర దాయానికి సాధికారత ఇచ్చింది మాత్రం జగన్ గారే. అదే సామాజిక వర్గానికి చెందిన శిరీష యాదవ్‌ను తిరుపతి నగరానికి తొలి మేయర్‌గా చేసిన ఘనత కూడా జగన్‌కే దక్కుతుంది. అది కూడా జనరల్ మేయర్ స్థానంలో బీసీలకు ఇవ్వాలనే నిర్ణయమూ, తిరు పతి అంకురార్పణలో కీలక భూమిక పోషించిన యాదవ సామాజిక వర్గానికి రాజకీయ గుర్తింపు ఇవ్వడమూ సముచిత నిర్ణయం. ఎంతో స్ఫూర్తినిచ్చే తిరుపతి నగర ఆవిర్భావ చారిత్రక సత్యాన్ని తన అధ్యయనం ద్వారా అందించిన చరిత్రకారుడు దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, ఈ చారిత్రక సత్యాన్ని గుర్తించి ఆవిర్భావ దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించిన నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అభినందనీయులు. మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డివ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త -
హెరిటేజ్ పై చర్చకు ఎందుకు భయపడుతున్నావ్.. చంద్రబాబు?
-
లడ్డూపై ఏకసభ్య కమిటీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సుబ్రహ్మణ్య స్వామి
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయడాన్ని సుబ్రహ్మణ్య స్వామి సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఆయన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మసనం రేపు(సోమవారం) విచారణ చేపట్టనుంది.కాగా, తిరుమల లడ్డూ వివాదంపై బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌పై చంద్రబాబు ప్రభుత్వం మరో కమిటీ నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిటిషన్లో ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏపీ సీఎం చంద్రబాబు, సిట్, సీబీఐ, టీటీడీలను చేర్చారు.అయితే, తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కారు ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కల్తీ కుతంత్రం పనిచేయకపోవడంతో చంద్రబాబు.. తన సొంత కమిటీ వేశారు. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో, కూటమి ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపింది. సిట్ సూచనలకు భిన్నంగా కమిటీ ఏర్పాటు చేసి.. తమకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకోవాలని బాబు ప్రభుత్వం భావిస్తోంది. -
అది ఏక సభ్య కమిషన్ కాదు.. తెలుగుదేశం పార్టీ కమిషన్
-
హిందువుల ద్రోహి చంద్రబాబు.. వెంటనే క్షమాపణ చెప్పాలి
-
కల్పవృక్ష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కల్పవృక్ష వాహనంపై ఉదయం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.కల్పవృక్ష వాహనం – ఐహిక ఫల ప్రాప్తి :క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.కాగా సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు సర్వభూపాలవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. వాహనసేవలో ఎల్ ఏసీ ప్రెసిడెంట్ శ్రీ ఏ వి రెడ్డి, అర్చకులు, ఏఈవో శ్రీ రమేష్, పలువురు అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
TTD డిస్ క్వాలిఫై చేసిన ఇందాపూర్ కి.. 3 నెలల్లోనే అర్హత కల్పించిన చంద్రబాబు
-
‘టీటీడీని ఎవరూ ప్రశ్నించలేదు.. టీడీపీని మాత్రమే ప్రశ్నించాం’
సాక్షి,తిరుపతి: టీటీడీని ఎవరు ప్రశ్నించలేదు.. టీడీపీని మాత్రమే ప్రశ్నిస్తున్నామని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తిరుపతి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఇందాపూర్ డైయిరీ వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు. నెయ్యి సరఫరాకి నందిని డెయిరీకి సింగిల్ టెండర్‌కే ఇచ్చారు. ఇందాపూర్ డెయిరీకి L3 టెండర్‌కే ఇచ్చారు. మదర్ డెయిరీ,ఇందాపూర్ డెయిరీ 130కోట్లకు టెండర్ దక్కించుకుంది. నిబంధనలు కఠిన తరం చేశామని టీటీడీ చెబుతోంది. 1500కిలోమీటర్ల నిబంధన 800కి కుదించారు. మేం పెట్టిన నిబంధనలనే ఎక్స్పర్ట్ కమిటీ కూడా కొనసాగించింది. అయితే, నిబంధనలు తుంగలో తొక్కి 900 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఇందాపూర్ డెయిరీకి టెండర్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే.. తడుముకున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. -
మే నెల శ్రీవారి దర్శన కోటా షెడ్యూల్ విడుదల
తిరుమల: శ్రీవారిని మే నెలలో దర్శించుకోవాలనుకునే వారి కోసం టికెట్ల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)ను లక్కీ డిప్లో పొందేందుకు 18 ఉదయం 10 గంటల నుంచి 20 ఉదయం 10 వరకూ ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. అనంతరం లక్కీడిప్‌లో టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు నగదు చెల్లించాలి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను 21న విడుదల చేయనున్నారు. 23న అంగ ప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాను విడుదల చేస్తారు. 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా, తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్ కోటా విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌కు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను 27న విడుదల చేస్తారు. -
Tirumala: 3న శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల: చంద్రగ్రహణం సందర్భంగా వచ్చే నెల 3న శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. ఆ రోజు చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల (మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 వరకు చంద్ర గ్రహణం) వరకు చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్టు చెప్పారు. సోమవారం ఆయన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెల 26 నుంచి మార్చి 2 వరకు తిరుమలలో తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 20 నుంచి మార్చి 5 వరకు పుష్కరిణీ స్నానానికి భక్తులకు అనుమతి ఉండదని చెప్పారు.పుష్కరిణి, ప్రవేశ, నిష్కమణ మార్గాల్లో అవసరమైన సెక్యూరిటీ సిబ్బంది, పుష్కరిణిలో అందుబాటులో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. తెప్పోత్సవాల కారణంగా ఈనెల 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 1, 2 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, వచ్చేనెల 3న కుమారధార తీర్థ ముక్కోటి సందర్భంగా భక్తులను ఉదయం 5 నుంచి 9గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. -
Surya Rao: చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. కాళ్లు మొక్కి క్షమాపణలు చెప్పాలి..
-
KS Prasad: 5ఏళ్ల తిరుమల వెళ్లలేదు అలాంటోడు టీటీడీ చైర్మన్..
-
TTD: శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నా రు. గురువారం అర్ధరాత్రి వరకు 61,632 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,435 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.28 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు 6 గంటల సమయం . దర్శన టిక్కె ట్లు లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 5 గంటల్లో దర్శించుకోగలుగుతున్నారు. టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి: వైఎస్ జగన్
ఎన్నికలప్పుడు ఇంటింటికీ ఇచ్చిన హామీలతో కూడిన బాండ్ల గురించి ప్రశ్నించే వారిపై దాడులు, తప్పుడు కేసులు.. అన్ని రంగాలూ తిరోగమనం.. విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావట్లేదు.. కూటమి ప్రభుత్వం స్కామ్‌ల మయంగా మారింది.. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ సాగుతోంది.. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త నినాదం వినిపిస్తోంది. అదే ‘క్యాషూ.. సూట్ కేసూ.. రాజేషు.. లోకేషు..’ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ అంశాలన్నింటిపైనా సభలో గట్టిగా గొంతు వినిపించాలి. గట్టిగా పోరాడాలి. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: శాసనసభలో ప్రజల తరఫున మన గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అందుకే ఏకైక ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కౌన్సిల్ (శాసన మండలి)లో మనకు మంచి సంఖ్యా బలం ఉందని, ప్రజా సమస్యలపై గొంతెత్తి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ‘అందరూ యుద్ధంలో ఉన్నారు. నా కంటే మీకే ఇంకా బాగా తెలుసు. అందుకే మీరు కూడా సమర్థవంతంగా పోరాడతారు. మనకు శాసనసభలో బలం తక్కువ. అక్కడ మన గొంతు వినపడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్సార్సీపీ మాత్రమే. అయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. ఎందుకంటే, మనకు ఆ గుర్తింపును ఇస్తే, విపక్ష నేతకు కూడా సీఎంకు ఎంత సమయం ఇస్తారో దాదాపుగా అంతే సమయం మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టే, మన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై గొంతెత్తలేం కాబట్టి, ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నాం. ఆధారాలతో సహా, అన్నీ వివరిస్తున్నాం’ అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మండలిలో గట్టిగా నిలదీద్దాంకౌన్సిల్లో మనకు బలం ఉంది. కాబట్టి మనకు మాట్లాడే అవకాశం వస్తుంది. మనకు మైక్ ఇస్తారు కాబట్టి, ప్రజల సమస్యలను గట్టిగా వినిపించే వీలుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు. సబ్జెక్టుల వారీగా పూర్తి అవగాహన పెంచుకోండి. అప్పుడే మనం గట్టిగా మాట్లాడగలం. దేనికైనా మంచి ప్రిపరేషన్ అవసరం. అవగాహన పెంచుకుంటే బాగా మాట్లాడగలుగుతాం. ఏ అంశంపై మాట్లాడినా తగిన ఆధారాలు, సాక్ష్యాలు చూపి మాట్లాడాలి. అప్పుడే మన గొంతు బలంగా పోతుంది. లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని బాబు తట్టుకోలేకపోతున్నారు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు ఒక అబద్ధాన్ని çసృష్టించి దానికి రెక్కలు కట్టారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్‌రెడ్డిలపై దాడులు కానీ, కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసులు.. ఇవన్నీ తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రశ్నించడాన్ని తట్టుకోలేక చంద్రబాబు చేసినవే. చివరకు చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని మనం గుళ్లలో పూజలు చేసినా, చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఏకంగా భౌతిక దాడులు చేస్తున్నారు. ఒక అబద్ధం సృష్టించి, దానికి రెక్కలు కట్టి ప్రచారం చేయడం తొలిసారి చూస్తున్నాం. అసలు కల్తీ నెయ్యి సరఫరాకు, వైఎస్సార్సీపీకి ఏమాత్రం సంబంధం లేదు. టీటీడీలో నెయ్యి సరఫరాకు ఒక పక్కా విధానంటీటీడీలో నెయ్యి సేకరణకు ఒక నిర్ధిష్టమైన పటిష్ట విధానం ఉంది. నెయ్యి తెచ్చిన ట్యాంకర్లు కేంద్ర ప్రభుత్వం అక్రిడేటెడ్ ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ తీసుకురావాలి. అలా వచ్చిన ట్యాంకర్‌లోని నెయ్యిని మళ్లీ టీటీడీ కూడా పరీక్షిస్తుంది. ఆ రిపోర్టు కూడా పాజిటివ్‌గా ఉంటేనే లోపలికి పంపిస్తారు. ఇదే పద్ధతిలో నాణ్యత లేక మన హయాంలో 18 సార్లు ట్యాంకర్లు వెనక్కు పంపాం. అంతకు ముందు చంద్రబాబు హయాంలో కూడా 2014–19 మధ్య 15 ట్యాంకర్లు వెనక్కు పంపారు. మరి ఇలాంటి పద్ధతి ఉన్నప్పటికీ కూడా దొడ్డిదారిన రిజెక్ట్ చేసినవి, తిరిగి టీటీడీకి వచ్చాయంటే, దానికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? మరి వీటన్నింటినీ మన పార్టీకి, మన ప్రభుత్వ కాలానికి ఆపాదించి రోజూ బురద చల్లుతున్నారు. వాస్తవానికి సీబీఐ చార్జిషీటులో అభియోగాలు ఎదుర్కొంటున్న కంపెనీలే 2014–19 మధ్య కూడా నెయ్యిని సరఫరా చేశాయి. ప్రీమియర్ డెయిరీ 2016, 2017, 2018లో కూడా నెయ్యి సరఫరా చేసింది. కానీ, కేవలం మన ప్రభుత్వానికి ఆపాదించి కుట్రలు చేస్తున్నారు.హామీలన్నీ గాలికి..సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారు. ఇవన్నీ అమలు చేస్తామంటూ ఎన్నికలప్పుడు ఇంటింటికీ బాండ్లు ఇచ్చారు. అప్పుడు చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? దారుణంగా మోసాలు చేస్తున్నారు. వాటి గురించి ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. అక్రమ కేసులు పెడుతూ పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మొత్తం వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం యూరియా కూడా దొరకని పరిస్థితి. ఉచిత పంటల బీమాను ఎత్తివేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పొదుపు సంఘాలన్నీ ఢమాల్ అంటున్నాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. కూటమి ప్రభుత్వం స్కామ్‌ల మయంగా మారింది. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. రూ.5 వేల కోట్ల విలువైన 54 ఎకరాల భూమిని గీతమ్ వర్సిటీకి ఇచ్చేశారు. ఏ ముఖ్యమంత్రీ తన సొంత బంధువులకు ఇలా ఇచ్చుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త నినాదం వినిపిస్తోంది. అదే ‘క్యాషు.. సూట్‌కేసు.. రాజేష్.. లోకేష్..’ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ అంశాలన్నింటిపైనా సభలో గట్టిగా గొంతు వినిపించాలి. గట్టిగా పోరాడాలి. చిత్తశుద్ధితో కష్టపడి పని చేయండి. కళ్లు మూసి తెరిచేలోపు మూడేళ్లు గడుస్తాయి. వచ్చేది మన ప్రభుత్వమే. ఇప్పుడు కష్టపడి పని చేస్తున్న వారందరికీ, తగిన గుర్తింపు ఉంటుంది. పనితీరు ఆధారంగా మీకు మీ పదవులు తిరిగి వస్తాయి. అలాగే ఇంతకన్నా మంచి పదవులు కూడా దక్కే అవకాశం ఉంది.’ఈ పాపం చంద్రబాబుదే⇒ లడ్డూ వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే. లెంపలేసుకోవాల్సిందీ చంద్రబాబే. ఒకసారి జరిగిన తీరు చూస్తే, రాష్ట్రంలో 2024 మార్చి 16న ఎన్నికల కోడ్ వస్తే, మే 13న పోలింగ్ జరిగింది. మే 15న టీటీడీలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్లు ఓకే చేసి, ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. చంద్రబాబు సీఎం అయిన తర్వాతనే నెయ్యి సరఫరా ప్రారంభమైంది.⇒ జూన్ 12న మొదటి ట్యాంకర్ వచ్చింది. ఆ తర్వాత జూన్ 20, 25వ తేదీల్లో, జూలై 4న మొత్తం నాలుగు ట్యాంకర్లలో ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. అవన్నీ ల్యాబ్ పరీక్షల్లో పాస్ అయ్యాయి. ఆ తర్వాత జూలై 6, 12వ తేదీల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి నాణ్యత పరీక్షలో ఫెయిల్ అయింది. జూలై 23న ల్యాబ్ రిపోర్టు రావడంతో, జూలై 25న వాటిని వెనక్కు పంపించారు.⇒ అయితే అవే ట్యాంకర్లను జూలై 27న శ్రీకాళహస్తిలో వైష్ణవి డెయిరీకి సమీపంలో పార్క్ చేశారు. ఆ తర్వాత అవే ట్యాంకర్లను మరో డెయిరీ పేరుతో ఆగస్టు, సెప్టెంబర్‌లో తిరిగి టీటీడీకి పంపారు. ఆ తర్వాతే సీఎం హోదాలో చంద్రబాబు లడ్డూపై తీవ్ర ఆరోపణలు చేశారు. ⇒ వెనక్కు పంపిన ట్యాంకర్లు తిరిగి టీటీడీలోకి వస్తే.. జరిగిన పరిణామాలు, జరిగిన తేదీలు చూస్తే మొత్తం ఇవన్నీ కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగాయి. మరి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? ⇒ నిజానికి 2014ృ19 మధ్య ప్రీమియర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. ఆ కంపెనీ 2019లో సరఫరా ఆపేసింది. కానీ, దాన్ని కేవలం మన ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. అంతకు ముందు సరఫరాకు సంబంధించి ప్రస్తావించడం లేదు. అసలు 2014-2019 మధ్య సరఫరా అయిన నెయ్యిపై కూడా విచారణ జరగాలి. ⇒ ఇప్పుడు చెప్పండి.. ఎవరి హయాంలో ఆ ట్యాంకర్లు వచ్చాయి? ఎవరి హయాంలో టీటీడీ వాటిని అడ్డుకుంది? ఎవరి హయాంలో నెయ్యి శాంపిళ్లు తీసుకున్నారు? వెనక్కు పంపిన ట్యాంకర్లను తిరిగి తీసుకున్నది ఎవరి హయాంలో? ఇవన్నీ కూడా టీడీపీ హయాంలోనే జరిగాయి. ఇదంతా సీబీఐ సిట్ చార్జిషీట్‌లోనే ఉంది. మరి దీన్నంతటినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఆపాదించడం దుర్మార్గం కాదా? -
శివ భక్తులపై లాఠీచార్జి దుర్మార్గం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ పాలనలో శ్రీశైలంలో శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడం దుర్మార్గం, బాధాకరమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన రూపంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోర వైఫల్యం బయటపడిందన్నారు. దురదృష్టవశాత్తూ చంద్రబాబు నీచ రాజకీయాలు పవిత్ర ఆలయాల ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయని ఎత్తిచూపారు. తిరుమల లడ్డూనూ పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగిందని.. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోందని వివరించారు.శ్రీశైలంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ.. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు, మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారు? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని ‘ఎక్స్’లో తన ఖాతాలో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..‘‘ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పాలనలో శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడం బాధాకరం. చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులవుతున్నారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబుగారి పాలనలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధ కలిగిస్తున్నాయి. నివారించగలిగిన ఘటనలు అయినప్పటికీ, ప్రభుత్వం విఫలంకావడం వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది.కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్వాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోంది. జవాబుదారీతనం, బాధ్యత అన్నవి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు. శ్రీశైలం ఆలయంలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘోరమైన వైఫల్యం బయటపడింది. సంవత్సరాలుగా మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇస్తున్న సమయాన్ని ఏడు రోజులకు కుదించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు ముందే తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదు. 🚨 🚨 Hello India 👋🏻 👋🏻👋🏻Shiva Mala Dharana devotees were lathi charged by Andhra Pradesh Police under TDP governance.Devotees across Andhra Pradesh are living with growing fear when they step into temples under the TDP coalition government led by N. Chandrababu Naidu.… pic.twitter.com/kBILeAwLOY— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2026తాగునీరు, క్యూల నిర్వహణ, వైద్య సదుపాయాలు అన్నీ లోపించాయి. తమ పిల్లాపాపలతో ఆలయానికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన చోట, పోలీసులు బలప్రయోగానికి దిగారు. దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారు. రాష్ట్రంలో తిరుపతి సహా అనేక ఆలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనల తరువాత కూడా, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 2025లో ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల్లో జరిగిన విషాదాలు చూస్తే..: ⇒ తిరుపతిలో జనవరి 8, 2025న వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలో ఉన్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు భక్తులు మృతి చెందారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారి.⇒ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సింహాచలంలో ఏప్రిల్ 30, 2025న చందనోత్సవం సమయంలో నూతనంగా నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు.⇒ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1, 2025న కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇవికాకుండా ఆలయాల్లో అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.⇒ జాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వరుసగా జరుగుతున్న ఘటనలు ఎత్తి చూపుతున్నప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది. ⇒ దురదృష్టవశాత్తూ ఇప్పుడు చంద్రబాబు గారి నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయి. తిరుమల లడ్డూను పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగింది. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోంది.⇒ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ.. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు, మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’’ -
జంతువుల కొవ్వు కలిసిందని చెప్పు.. నాగేశ్వర్‌కు బెదిరింపులు
సాక్షి, అమరావతి: ‘‘ఒరేయ్.. నా కొడకా.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పందికొవ్వు, ఆవుకొవ్వు, బాత్రూం రసాయనాలు కలిశాయని ఎందుకు చెప్పవురా నువ్వు.. ఇదే కాదు ఇంత కన్నా దారుణమైంది కలిసిందని కూడా చెప్పాలి.’’ అంటూ కొంతమంది ఆగంతకులు ఫోన్లు చేసి తనను బెదిరిస్తున్నట్లు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో మంగళవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. కొద్ది రోజులుగా లడ్డూలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు, పవన్, లోకేశ్ చేస్తున్న ప్రచారాన్ని నాగేశ్వర్ తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ–సిట్ చార్జ్‌షీట్‌లో స్పష్టం చేసిన తరువాత కూడా కలిసిందని నిరూపించాలని యత్నం చేయడం హిందూ దేవుళ్లు, హిందూ సమాజంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కూటమి అనుకూల వర్గీయులు బెదిరింపు ఫోన్లు చేస్తున్నారు. జంతువుల కొవ్వు, బాత్రూం రసాయనాలే కాకుండా మరికొన్ని దారుణమైనవి లడ్డూలో కలిశాయని చెప్పాలంటూ దాదాపు 20 నుంచి 30 ఫోన్లు వచ్చాయని నాగేశ్వర్ తెలిపారు. అలా చెప్పడం అన్యాయమవుతుందని, కావున తానలా చెప్పలేనన్నానని ఆయన వివరించారు. ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ వారిపై అమలు కాదా? మూడు రోజుల క్రితమే ఈ వేధింపులపై ఫిర్యాదు చేసినా మంత్రి లోకేశ్ కనీసం పట్టించుకోలేదని నాగేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ రికార్డులను లోకేశ్ టీమ్ జైకు పంపించానని, దీనికి స్పందనగా ఆయన పోలీసులు ఆగంతకులను హెచ్చరించారని, మళ్లీ ఆ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్లు రావని చెప్పారని నాగేశ్వర్ వివరించారు. అయితే ఒకరు కాదు, ఇద్దరు కాదు రోజుకు 20 నుంచి 30 మంది ఫోన్లు చేస్తున్నారని, బెదిరిస్తున్న వారి నంబర్లు రాష్ట్ర మంత్రికి స్వయంగా పంపితే వారిపై రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయాలి కదా అని లోకేశ్‌ను నిలదీశారు. ‘‘మీరు నన్ను కొట్టినా, తిట్టినా, చంపుతామని బెదిరించినా, నేను మాత్రం నిరూపణ కాకుండా, ఆధారాలు లేకుండా దేవుని లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందనే మాటను చచ్చినా అనను. పంది కొవ్వు కలిసిందని, బాత్రూం రసాయనాలు కలిశాయని మీరు వాడుతున్న భాషను నేను వాడను. ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను దేనికైనా సిద్ధం.’’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు. కల్తీ జరిగితే నిరూపించండి: మరో వైపు లడ్డూ విషయంలో జరుగుతున్న ప్రచారం, వస్తున్న వార్తలపై నాగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్గానీ, విచారణగానీ జరగకుండా సీఎం చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ప్రకటన చేయడం, దానిని పట్టుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ కూడా అదే మాట్లాడటం దారుణమని మరోసారి నాగేశ్వర్ తప్పుబట్టారు. -
శివభక్తులపై లాఠీచార్జ్ బాధాకరం: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: శ్రీశైలం మల్లన్న ఆలయంలో శివ స్వాములపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడంపై వైఎస్సార్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు పాలనలో ఏపీలో నెలకొన్న పరిస్థితులను తెలుపుతూ ట్వీట్ చేశారు.‘ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పాలనలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడం బాధాకరం. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో, ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులవుతున్నారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.చంద్రబాబు పాలనలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధకలిగిస్తున్నాయి. నివారించగలిగిన ఘటనలు అయినప్పటికీ, ప్రభుత్వం విఫలంకావడం వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్వాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోంది.జవాబుదారీతనం, బాధ్యత అన్నవి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు. శ్రీశైలం ఆలయంలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘోరమైన వైఫల్యం బయటపడింది. సంవత్సరాలుగా మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇచ్చే సమయాన్ని ఏడు రోజులకు కుదించారు.దీనివల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు ముందే తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదు. తాగునీరు, క్యూల నిర్వహణ, వైద్య సదుపాయాలు అన్నీ లోపించాయి. తమ పిల్లాపాపలతో ఆలయానికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన చోట, పోలీసులు బలప్రయోగానికి దిగారు.దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారు. రాష్ట్రంలో తిరుపతి సహా అనేక ఆలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనల తరువాత కూడా, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది2025లో ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల్లో జరిగిన విషాదాలు చూస్తే..తిరుపతిలో జనవరి 8, 2025న వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలో ఉన్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు భక్తులు మృతి చెందారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారిశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సింహాచలంలో ఏప్రిల్ 30, 2025న చందనోత్సవం సమయంలో నూతనంగా నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడంతో 7గురు భక్తులు మృతి చెందారుశ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1, 2025న కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇవికాకుండా ఆలయాల్లో అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయిజాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వరుసగా జరుగుతున్న ఘటనలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది. దురదృష్టవశాత్తూ ఇప్పుడు చంద్రబాబు నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయి. తిరుమల లడ్డూను పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగింది. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోందిభక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 🚨 🚨 Hello India 👋🏻 👋🏻👋🏻Shiva Mala Dharana devotees were lathi charged by Andhra Pradesh Police under TDP governance.Devotees across Andhra Pradesh are living with growing fear when they step into temples under the TDP coalition government led by N. Chandrababu Naidu.… pic.twitter.com/kBILeAwLOY— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2026 -
నీదీ పవన్ కళ్యాణ్ లాంటి చదువేనా..?? పయ్యావుల కేశవ్ ని ఆటాడుకున్న జడ శ్రవణ్
-
రాజకీయాలకోసం ఇంత దిగజారాలా.. దేవుడు నిన్ను విడిచిపెట్టడు జాగ్రత్త..
-
లడ్డూ తయారీ నెయ్యిలో కల్తీ జరగలేదు: జనసేన ఎమ్మెల్యే
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ‘ఎన్డీడీబీ, సిట్ నివేదికలలో ఎక్కడా కూడా నెయ్యిలో కల్తీ జరగలేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది నచ్చక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందనే మూర్ఖత్వంతో ఉన్నారు’ అని ఆయన స్పష్టంచేశారు. జనసేన ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి హరేరామ హరేకృష్ణ ఆలయం నుంచి గరుడ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరణి శ్రీనివాసులు ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన మాట మార్చి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపించారు. కాగా, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదనే విషయాన్ని సాక్షాత్తూ ఆ స్వామివారే ఆయన నోట పలికించారని నెటిజన్లు, జనం అభిప్రాయపడుతున్నారు. -
జగన్‌పై బురద చల్లాలని చంద్రబాబు నీచ రాజకీయాలు
కాకినాడ రూరల్: ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తప్పుపట్టాలని, ఆయనపై బురద చల్లాలనే తప్పుడు ప్రయత్నాలతో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో–ఆర్టినేటర్, మాజీమంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. అందులో భాగంగా కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి కీర్తికి, పవిత్రతకు అపఖ్యాతి కలిగించాలని నిరంతరం అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కాకినాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాధ్యతాయుత స్థానంలో ఉన్నవారు ఆధారాలతో మాట్లాడాలని, భక్తులు, ప్రజల మనోభావాలతో ఆటలాడటం మంచిదికాదని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టి సిట్ వేసిందన్నారు.సీబీఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన ఈ సిట్ పెద్ద ఎత్తున పరిశోధన చేసి, చంద్రబాబు నియమించిన టీటీడీ అధికారులు, ఈవోల వాంగ్మూలాలను రికార్డు చేసి, లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో ఎలాంటి జంతుకొవ్వులు కలవలేదని నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. అయినా చంద్రబాబు తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నారన్నారు. మొన్నటివరకు జంతుకొవ్వు అన్నారని, ఇప్పుడు ఏకంగా బాత్రూములు కడిగే హారి్పక్, కెమికల్స్ కలిపేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌పై ఉక్రోషంతో చంద్రబాబు హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారని, హిందూధర్మాన్ని బలిపెట్టే స్థితికి తీసుకొచ్చారని చెప్పారు. హెరిటేజ్ ఉత్పత్తుల్లో కల్తీ హరియాణలో విక్రయిస్తున్న హెరిటేజ్ పెరుగులో నాణ్యతలేదంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ నివేదిక ఇచ్చి, రూ.లక్ష పెనాల్టీ విధించి, సెబీకి నివేదించిందని చెప్పారు. అంతకుముందు మరో రాష్ట్రంలో ఈ ఉత్పత్తులను బ్యాన్ చేశారన్నారు. చంద్రబాబు సొంతసంస్థ హెరిటేజ్ ఉత్పత్తుల్లోనే కల్తీ జరుగుతోందని, అసలు జరగనివాటిలో జంతుకొవ్వు కల్తీ అంటూ రాజకీయాలు, కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ రాజకీయాలు తప్ప చంద్రబాబు సాధించిందేమీ లేదన్నారు. కనీసం కేంద్ర బడ్జెట్లో కూడా నిధులు రాబట్టలేకపోయారని విమర్శించారు. ఎన్ని అబద్ధాలు ఆడినా వాస్తవాలను కప్పిపుచ్చలేరని కన్నబాబు పేర్కొన్నారు. -
రెడ్బుక్కే రాజ్యాంగం.. నేనే ‘సుప్రీం’!
సాక్షి, అమరావతి: స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రీ, ఏ ముఖ్యమంత్రీగానీ తలపెట్టని దుస్సాహసానికి సీఎం చంద్రబాబు బరి తెగించారు! దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ రాజకీయ కుట్రకు తెగబడ్డారు. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పట్టించుకోకుండా.. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని నిర్ధారిస్తూ ప్రముఖ సైంటిఫిక్ ల్యాబ్‌లు ఎన్డీఆర్ఐ, ఎన్డీబీ ఇచ్చిన నివేదికలను పక్కనపెట్టేసి సొంత విచారణకు సిద్ధమయ్యారు! సుప్రీంకోర్టు ఆదేశాలను నిర్భీతిగా ధిక్కరిస్తూ.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిపై మళ్లీ విచారణకు సొంత విచారణ కమిషన్‌ను నియమించాలని నిర్ణయించారు. తద్వారా తనకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకునే కుట్రలకు తెర తీశారు. దీనిపై తాజాగా మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరపగా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సీబీఐ స్వతంత్ర సిట్ దర్యాప్తు నివేదికను తాము పరిగణలోకి తీసుకోబోమని ఏకంగా రాష్ట్ర మంత్రి మండలి వేదికగా ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు ఈ కుతంత్రానికి తెగించారు. లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారాన్ని కొనసాగించేందుకు... రాజకీయ కక్ష సాధింపుతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులను నమోదు చేసేందుకు తమ వీర విధేయులతో విచారణకు ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కుతంత్రానికి రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని వేదికగా చేసుకోవడం గమనార్హం. అంటే సుప్రీం కోర్టుతో తమకేమాత్రం సంబంధం లేదని... టీడీపీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఓ సమాంతర న్యాయ వ్యవస్థగా వ్యవహరిస్తుందని తేల్చి చెప్పారు. దేశ చరిత్రలో ఓ దుస్సాంప్రదాయానికి తెరతీశారు. తిరుమల లడ్డూల తయారీకి ఉపయోగించిన నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశం లేనేలేదని ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైందని చార్జిషీట్లో సీబీఐ సిట్ పేర్కొన్న అంశం సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ... బాబు బరితెగింపురాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు చేతల్లో చూపించారు. అందుకోసం తిరుమల శ్రీవారి ఆలయం, ప్రసాదం పవిత్రకు కూడా భంగం కలిస్తానని... ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తానని తాజాగా నిరూపించుకోవడం విభ్రాంతి కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగించే కుట్రకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే తెరతీసిన విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ఆయన నిరాధారణ ఆరోపణలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తులు విభ్రాంతి చెందారు. అంతే కాదు ఈ రాజకీయ కుట్రకు అధికారిక ముద్ర వేసేందుకు టీడీపీ అనుకూల ఐపీఎస్ అధికారులతో సిట్‌ను నియమించారు. దీనిపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసి వాస్తవాలను ప్రజలకు తెలిసేలా చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుళ్లను అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని టీడీపీ కూటమి ప్రభుత్వానికి హితవు చెప్పింది. ఈ క్రమంలో లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యి నాణ్యతపై విచారించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసింది. ఆ స్థానంలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఆ దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని పేర్కొంది. దాంతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు జరిపి తన నివేదికను ఇటీవల నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసింది. దాంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. ఈ పరిణామాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఏకంగా సుప్రీంకోర్టునే ధిక్కరించడానికి తెగబడ్డారు. 2024లోనే చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడం గమనార్హం. అనంతరం సీబీఐ ఆధ్వర్యంలోని స్వతంత్ర సిట్ ద్వారా దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ సిట్ ఆ కేసులో దాఖలు చేసిన చార్జ్‌షీట్ ఇప్పుడు నెల్లూరు న్యాయస్థానంలో ఉంది. ఇంకా కొనసాగుతున్న ఆ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. కేబినెట్ వేదికగా న్యాయధిక్కార కుట్ర...సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఇతర మార్గాల ద్వారా సేకరించి న్యాయస్థానం పరిధిలోని అంశాలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించడం విస్మయపరుస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధం. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై సమాంతరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదన్నది కచ్చితంగా పాటించాల్సిన నిబంధన. చార్జ్‌షీట్‌లోని అంశాలపై న్యాయస్థానం పరిశీలించి విచారించాలి. దానిపై ఇరువర్గాల న్యాయవాదులు న్యాయస్థానంలో తమ వాదనలను వినిపించాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనే ‘సుప్రీం’ అన్నట్లుగా బరి తెగించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా సాగుతున్న కేసు దర్యాప్తుపై తాము ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కేబినెట్ సమావేశానికి ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌లతో సమావేశమై చార్జ్‌షీట్‌లోని అంశాలపై చర్చించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్వహించిన ఈ సమావేశానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్‌చంద్ర లడ్హ ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరు కావడం గమనార్హం. సిట్ సభ్యుడిగా ఉన్న ఓ అధికారి కూడా ఈ సమావేశంలో పాల్గొనడం విస్మయపరుస్తోంది. అంటే సుప్రీం కోర్టు ఆదేశాలతో నియమించిన సిట్‌లో సభ్యుడిగా ఉన్న ఆ అధికారి... సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించే సమావేశంలో భాగస్వామి అయ్యారు. ఆది నుంచి అత్యంత వివాదాస్పదుడిగా గుర్తింపు పొందిన ఆ అధికారి మరోసారి రాజ్యాంగబద్ధ ధర్మం కంటే తన రాజకీయ విధేయతకే పెద్ద పీట వేశారు. ఇక ఎంపిక చేసిన మంత్రులతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశంలో కూడా సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలపై చర్చించారు. అంతే కాదు... సీబీఐ చార్జ్‌షీట్‌లో పొందుపరిచిన అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు విభేదించారు. ఆ చార్జ్‌షీట్ సమగ్రంగా లేదని వారే తీర్పునిచ్చేశారు. ఈ విధంగా తాము సమాంతర న్యాయ వ్యవస్థ అన్నట్టుగా వ్యవహరించారు. సీబీఐ దర్యాప్తు, నివేదికను తాము గుర్తించబోమని పరోక్షంగా ప్రకటించారు.జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నిజం చెప్పినందునే..చంద్రబాబు ప్రభుత్వం ఇంతగా బరితెగించి సుప్రీం కోర్టును ఎందుకు ధిక్కరించింది? అంటే కారణం ఒకటే... తిరుమల లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతోనే ఇంతటి దుస్సంప్రదాయానికి తెగబడింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్... లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిగ్గు తేల్చింది. టీటీడీకి చెందిన నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి నెయి నమూనాలను సేకరించి దేశంలోని ప్రతిష్టాత్మకమైన హర్యానాలోని ‘నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్డీఆర్ఐ), గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్డీడీబీ) ల్యాబొరేటలరీలకు పంపింది. ఆ ల్యాబరేటరీలలో పరీక్షించిన అనంతరం... ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదనే వాస్తవం నిగ్గు తేలింది. శాస్త్రీయంగా పరీక్షించిన రెండు ల్యాబొరేటరీలు సాధికారికంగా వేర్వేరు నివేదికలు ఇచ్చాయి. ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఆ రెండు నివేదికలూ స్పష్టం చేశాయి. ఆ రెండు నివేదికలను ప్రస్తావిస్తూ సీబీఐ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. దాంతో తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయ్యింది. జాతీయ పత్రికలు సైతం అదే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. జాతీయ మీడియా చానళ్లు, డిజిటల్ మీడియా కూడా ఆ విషయాన్ని అత్యంత ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఇక రాజకీయ పార్టీలతో నిమిత్తం లేని తటస్థులు, విశ్లేషకులు కూడా లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన రాద్ధాంతం అంతా దుష్ప్రచారమేననిఅభిప్రాయపడ్డారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు కొత్త కుతంత్రానికి తెరతీశారు. అందుకే టీడీపీ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓ కమిషన్‌ను నియమించాలని నిర్ణయించారు.నాడు పచ్చ సిట్.. నేడు పచ్చ కమిషన్!రాజకీయ కుట్ర కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు పంతం పట్టారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద సహాయక చర్యల్లో తన దారుణ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ దుష్ప్రచారానికి తెరతీశారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందనే దుష్ప్రచార కుట్రకు సీఎం హోదాలో ఆయనే నేతృత్వం వహించి ఘోర అపచారానికి పాల్పడ్డారు. శ్రీవారి ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకువచ్చే కుట్రకు రాజముద్ర వేసేందుకు చంద్రబాబు యత్నించారు. అందుకే ఈ అంశంపై దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయులైన రాష్ట్ర పోలీసు అధికారులతో సిట్‌ను నియమించారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన వివాదాస్పద అధికారి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్‌కు చీఫ్‌గా నియమించడం గమనార్హం. మరో వీర విధేయ అధికారి విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టీ, అప్పటి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు (ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీ)లను సభ్యులుగా నియమించారు. గోపీనాథ్ జెట్టి ఎవరో కాదు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా నియమితుడైన రిటైర్ట్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్యకు ఆయన అల్లుడు. పచ్చ సిట్ ద్వారా చంద్రబాబు కుట్రలను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దాంతో ఆ సిట్‌ను సుప్రీంకోర్టు రద్దుచేసి స్వతంత్ర సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. దాంతో చంద్రబాబు పన్నాగం బెడిసికొట్టింది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని తాజాగా సీబీఐ దర్యాప్తులో వెల్లడి కావడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. ఈసారి ఈ అంశంపై దర్యాప్తునకు కమిషన్‌ను నియమిస్తామని ప్రకటించింది. తమ వీర విధేయులైనవారిని అందులో చైర్మన్, సభ్యులుగా నియమించి తమ దుష్ప్రచార కుట్రకు అధికారిక ముద్ర వేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని స్పష్టమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.నివేదిక ఇలా ఉండాలి.. నిందితులుగా వీళ్లే!సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ మరీ సొంత కమిషన్ ఏర్పాటుకు బరితెగించడం వెనుక చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం సుస్పష్టం... లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని తాము చేసిన దుష్ప్రచారాన్ని బలపరుస్తూ ఓ నివేదిక ఇప్పించుకోవాలి. అంతే కాదు తాము రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలను ఆ కేసులో నిందితులుగా చేర్చాలి. వాస్తవాలు, ల్యాబరేటరీలలో పరీక్షలు, విధి విధానాలతో నిమిత్తం లేకుండా తాము చెప్పింది చెప్పినట్టుగా చేసేందుకే కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ విషయాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం విలేకరుల సమావేశంలో పరోక్షంగా వెల్లడించారు. ఫలానా వారిని నిందితులుగా చేర్చడానికే కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడమే అందుకు నిదర్శనం. ఆ కమిషన్‌కు అతి తక్కువ సమయమే ఇస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పడం గమనార్హం. అంటే దర్యాప్తుతో నిమిత్తం లేకుండా, వాస్తవాలను పట్టించుకోకుండా తాము చెప్పింది చెప్పినట్టుగా నివేదిక ఇచ్చేవారినే కమిషన్ చైర్మన్, సభ్యులుగా నియమిస్తామని ప్రభుత్వం నిర్భీతిగా ప్రకటించుకున్నట్టే! అధికారంలో ఉన్నవాళ్లు తమకు నచ్చినట్టుగా నివేదికలు ఇప్పించుకుంటాం...! తమకు నచ్చనివారిపై అక్రమ కేసులు పెడతామంటే ఇక దేశంలో పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు ఎందుకు ఉన్నట్లని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలు, వ్యవస్థలను తాము పట్టించుకోమంటూ చంద్రబాబు ప్రభుత్వం నియంతృత్వానికి తెగబడుతోందని విమర్శిస్తున్నారు. -
హింసన చణ... ధ్వంస రచన!
సుప్రసిద్ధ కథా, నవలా రచయిత రావి శాస్త్రి అయిదు దశాబ్దాల క్రితం ‘సొమ్మలు పోనాయండి’ అనే నవలిక రాశారు. ఊరి ప్రెసిడెంట్ కుట్రలకు బలైన ఒక సామాన్యుడి స్వీయ కథనమది. అతని కుటుంబాన్ని కడతేర్చిన ప్రెసిడెంట్‌ను వదిలి, వ్యవస్థలన్నీ ఏకమై ఆ సామాన్యుడికే నరకం చూపిన వైనం అందులో కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలన ఏణ్ణర్థంగా అచ్చం అదే రీతిలో సాగుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన దుష్ప్రచారం బూటకమని సీబీఐ నివేదిక తేల్చినప్పటి నుంచీ ఆ అరాచకం మరిన్ని రెట్లు పెరిగింది. ఎప్పటిలాగే లడ్డూ ప్రసాదం స్వచ్ఛంగా ఉన్నదనీ, కొవ్వెక్కిన ఈ మాయగాళ్ల పుర్రెలే వికృత పోకడలకు పోయాయనీ ప్రజలకు తేటతెల్లమైనప్పటి నుంచీ అధికార ముఠాకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు.ఆ పర్యవసానంగానే రోడ్లపైకొచ్చి దుర్భాషలతో, దుశ్చేష్టలతో రెచ్చిపోతున్నారు. హంతక దాడులకు తెగిస్తున్నారు. గృహ దహనాలకు పాల్పడుతున్నారు. ‘మళ్లీ మళ్లీ వస్తాం... అంతు తేలుస్తామ’ంటూ సవాళ్లు విసురుతున్నారు. సీబీఐ నివేదికను వక్రీ కరిస్తూ ఫ్లెక్సీలతో జనాన్ని ఏమార్చాలనుకుంటున్నారు. గుంటూరు నడిబొడ్డున తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త వందలాది మంది గూండాలను పోగేసి కర్రలు, రాడ్లతో వీధిన పడి మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంబటిరాంబాబు ఇంటిపై దాడికి దిగిన వైనం మీడియా సాక్షిగా ప్రపంచమంతా చూసింది.రక్షక భటులు భయభక్తులతో వారికి కాపలాగాసిన సంగతినీ అందరూ గమనించారు. ఆ మర్నాడు ఇబ్రహీంపట్నంలో అదే పునరావృతమైంది. తొలినాడు ఎంత విధ్వంసం చేసినా, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయం తగలబెట్టడానికి కష్టపడాల్సి వచ్చిందని కాబోలు... ఇబ్రహీంపట్నంలో మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైకి పెట్రోల్ బాంబులతో వచ్చారు. బండరాళ్లు విసిరారు. నిప్పుపెట్టారు. గుంటూరు నగర పోలీసుల మాదిరే ఇక్కడా ఈ కిష్కింధకాండకు పోలీసులు రక్షణగా నిలబడ్డారు.ఇదా ప్రజాస్వామ్యం?! పిల్లనిచ్చిన మామ పాలిటే కాదు... ఆంధ్రప్రదేశ్‌కు కూడా దశమ గ్రహంలా దాపురించి, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు వయసుడిగిన ఈ కాలంలో కూడా బాహాటంగా తన వికృత నైజాన్ని ప్రదర్శించటం చూసి జనం విస్తుపోతున్నారు. జర్నలిస్టు పింగళి దశరథరామ్, కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా తదితరుల మరణాలకు కారకులెవరో... ఇప్పుడు టీడీపీలోనే ఉన్న సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణపై ఒకానొకప్పుడు హంతక దాడికి తెగించిందెవరో... అందరికీ తేటతెల్లమే. సాక్షాత్తూ మాజీమంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావే తోడల్లుడి హింసన చణనూ, ధ్వంస రచననూ పూసగుచ్చినట్టు వివరించారు. కొన్నేళ్ల క్రితం తగలబడిన వందలాది ఆర్టీసీ బస్సులు, పదేళ్లనాడు అమరావతిలో దగ్ధమైన అరటి తోటలు ఆ ప్రావీణ్యాన్ని కథలు కథలుగా చెబుతాయి.అవిభక్త ఏపీలో 1995 తర్వాత సకల వ్యవస్థలూ భ్రష్టుపట్టడానికి కారకులెవరో అందరికీ తెలుసు. కెమెరా లేదనుకుని సాక్షాత్తూ స్వర్గీయ ఎన్టీఆర్‌నే ‘వాడూ...వీడూ’ అని తూలనాడిన ఘనుడు బాబు నుంచి పుత్రరత్నమైనా, మరొకరైనా నేర్చుకునే సంస్కృతి ఏముంటుంది? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు. అందుకే గుడికెళ్లి వస్తున్న అంబటిపై బూతులు లంకించుకొని రెచ్చగొట్టి, ఆయన తిరిగి తిట్టారని రెచ్చిపోయింది టీడీపీ ముఠా. సంస్కారం ఉంది గనుక క్షమించమని అడిగారాయన. ఆ మాట వెనక్కి తీసుకుంటున్నానన్నారు. కానీ పాపం పెరిగినట్టు పెరిగిన ఆ ముఠా అర్ధరాత్రి దాకా అల్లకల్లోలం సృష్టించింది. చివరకు అంబటినే ఖైదు చేయించింది. ఎంత విడ్డూరం?! ఏం జరుగుతోంది ఏపీలో? ప్రశ్నించే తత్వాన్ని హత్యాయత్నాలతో, విధ్వంసాలతో చంపేస్తారా? ఈవీఎంల సాయంతో అధికారాన్ని చేజిక్కించుకున్న అరాచకులు ఇక మారరా? ఇదే వారి నిర్ణయమైతే జనమే తొక్కి నార తీస్తారు. అదునుచూసి గుణపాఠం చెబుతారు. ప్రజాస్వామ్యంలో నారావారైనా, వేరేవారైనా ఇందుకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. -
భోలే బాబా వెనక ఉన్న ఆలీబాబా ఎవరు?: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో జంతుకొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపిన నెయ్యి వాడారని పచ్చి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విపరీతంగా దుష్ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, అందులో ఏ మాత్రం వాస్తవం లేదన్న సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్‌తో అడ్డంగా దొరికిపోయి, తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానాపాట్లు పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించిన సిట్, నెయ్యిలో ఏ కొవ్వూ కలవలేదని చెప్పినా, మళ్లీ ప్రభుత్వం ప్రత్యేక విచారణ చేయించాలని నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వానికి చేతనైతే సిట్ రిపోర్ట్ తప్పని సుప్రీంకోర్టును ఆశ్రయించి, అక్కడ రుజువు చేయాలని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్ చేశారు. ప్రెస్ మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:సిట్ రిపోర్ట్‌పై క్యాబినెట్ నిర్ణయమా!:సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారుల్ని సీఎం చంద్రబాబు పిలిపించుకోవడం అసాధారణ విషయం. వారి దగ్గరి నుంచి 11 పేజీల నివేదిక తీసుకుని సుదీర్ఘమైన చర్చ చేశామని కేబినెట్ భేటీ నుంచి బయటికి వచ్చిన మంత్రులు చెప్పారు. చంద్రబాబును కాపాడటానికి, ఆయన చెప్పిన అబద్ధాల్ని కప్పిపుచ్చడానికే వీళ్ల ప్రయాస. చంద్రబాబు అధికారంలోకి రాగానే 2024 సెప్టెంబర్ 20వ తేదీన కూటమి సమావేశంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిపారని ప్రకటించడంతో, వాస్తవాలు నిగ్గు తేల్చాలని వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, ఏ విషయమూ నిర్థారణ కాకుండా మాట్లాడొద్దంటూ సూచించిన సుప్రీకోర్టు, ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసింది. అందులో సీబీఐ అధికారులతో పాటు రాష్ట్ర అధికారులు కూడా ఉన్నారు.సిట్ అధికారులు ఏడాది కాలంగా సుదీర్ఘ విచారణ చేసి నివేదిక ఇచ్చారు. సిట్ అదనపు ఛార్జిషీట్లో కానీ, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులో కానీ, చంద్రబాబు ఆరోపించినట్లు నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, చేప నూనె కానీ కలిసినట్లు ఎక్కడా చెప్పలేదు. అయినా చంద్రబాబు ఈ ఛార్జిషీట్‌పై సంతృప్తి చెందకుండా ఇవాళ కేబినెట్ సమావేశంలో నెయ్యి విషయంలో ప్రత్యేక విచారణ చేపడుతున్నట్లు మంత్రులతో బయట ప్రకటన చేయించారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ రిపోర్టు కాకుండా, మళ్లీ విచారణ చేయించాలన్న నిర్ణయం పూర్తిగా తప్పు.‘భోలేబాబా డెయిరీ’ వెనుక ఉన్న ‘ఆలీ బాబా’ చంద్రబాబే: ఒక మంత్రి భోలే బాబాను తెచ్చిన అలీ బాబా ఎవరని ప్రశ్నించారు. ఈ భోలే బాబాను తెచ్చిన చంద్రబాబే. 2018లోనే భోలే బాబా రంగ ప్రవేశం చేశాడు. దాదాపు 87 వేల టిన్నులకు పైగా నెయ్యి ఈ కంపెనీ సరఫరా చేసింది. అది చాలా స్పష్టంగా సీబీఐ నివేదికలోనే ఉంది. కానీ దాన్ని వదిలేసి మా హయాంలోనే నెయ్యి సరఫరా చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. భోలే బాబాకు ముందున్న పేరు హర్‡్ష –వర్‡్ష డెయిరీకి అనుమతి ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ఇప్పుడు భోలే బాబాను తెచ్చిన ఆలీ బాబా ఎవరో తెలిసిందని అనుకుంటున్నాం.ఆ నెయ్యిపైనా విచారణ జరిపించాలి:నెయ్యిలో కల్తీ లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సిట్ విచారణ 2019–24 మధ్య కాలానికి వేశారు. ఇందులో నిందితులుగా తేలిన ప్రీమియర్ డెయిరీ 2013 నుంచి 2024 వరకూ నెయ్యిని అనేకసార్లు టెండర్లలో పాల్గొని సరఫరా చేసింది. మీకు నిజంగా తిరుమల శ్రీవారి మీద భక్తి ఉంటే, మీ గత ప్రభుత్వంలో సరఫరా అయిన నెయ్యిపైనా విచారణ చేయించాలి. ఆ రోజు 90 శాతానికి పైగా నెయ్యి సరఫరా చేసిన డెయిరీయే మా హయాంలోనూ సరఫరా చేసిందన్న విషయం మీకు గుర్తు చేస్తున్నాం.2018లో టీటీడీ తీర్మానంతోనే నెయ్యి కల్తీకి బీజం:విభజిత రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే 2018, ఆగస్టు 27న టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం 87 వేల కేజీల నెయ్యిని కొనుగోలు చేసింది. నెయ్యికి ఆ వాసన తీసుకొచ్చేందుకు ఆవు నెయ్యి ఫ్లేవర్‌ను కలిపిన నెయ్యిని రోజుకు 975 కేజీల చొప్పున కొనుగోలు చేశారు. ఆ రోజున మీరు వాడిన నెయ్యి కల్తీ నెయ్యి కాబట్టే వాసన రాలేదు. అందుకే ఏకంగా రూ.3.75 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఫ్లేవర్ కలిపారు.అప్పటి జేఈవో అధ్యక్షతన పని చేసిన ఈ కొనుగోలు కమిటీలో విజయ్‌భాస్కర్‌రెడ్డి, సురేంద్రనాథ్ వంటి సాంకేతిక నిపుణుల్ని నియమించారు. వారే ఆ తర్వాత మా హయాంలోనూ కొనసాగారు. ఇప్పుడు సిట్ రిపోర్ట్ నిందితుల్లోనూ ఉన్నారు. అలాగే ప్రొక్యూర్మెంట్ జీఎం కూడా టీడీపీ హయాంలో ఉన్న వ్యక్తే ఇప్పుడు జైల్లో ఉన్నారు. అలాగే టెంపుల్ అఫైర్స్ ఏవో, ఎస్వీ గోశాల డైరెక్టర్ కూడా మొన్నటి వరకూ ఉన్నారు. వీళ్లంతా నెయ్యిని కొనాలని నిర్ణయించి, పలమనేరుకు చెందిన పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి నుంచి కేజీ నెయ్యి రూ.385 చొప్పున కొనుగోలు చేశారు. అప్పటికే రోజుకు 3 లక్షల లడ్డూలు తయారు చేసే కాలంలోనే ప్రతి రోజూ 975 కేజీల నెయ్యికి ఫ్లేవర్ అద్దడానికి వీళ్లు చేసిన దుర్మార్గం ఇది. 2018, ఆగస్టు 28న చేసిన టీటీడీ తీర్మానం 374 ఇందుకు నిదర్శనం.దమ్ముంటే 2014 నుంచీ నెయ్యి కల్తీపై విచారణ జరపండి:2014 నుంచి ఇదే సీబీఐ దర్యాప్తు వేయించే ధైర్యం మీకు ఉందా? టీటీడీని రాజకీయ పావుగా వాడుకోకపోతే మీ హయాంలోనే నెయ్యి సరఫరా చేసిన వాళ్లు, కొనుగోళ్లు చేసిన వాళ్ల మీద విచారణ చేయించండి. ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ దోషి అంటున్నారు. సిట్ ఏర్పాటు చేశాక జంతుకొవ్వు విమర్శలు చేసిన మీరు ఆయన్ను రెండోసారి ఎందుకు ఈవోగా నియమించారు? నెయ్యి పేరుతో అనిల్ సింఘాల్‌ను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారన్న అనుమానాలు వస్తున్నాయి.చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ పదే పదే నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేప నూనె వాడారని దుష్ప్రచారం చేశారు. మీరు ఆరోపించినట్టు ఆ నెయ్యిలో అవేవీ లేవని తేలిపోయింది. అయినా మీరు ఇంకా ఎదురుదాడి చేస్తూ, గత మా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తిరుమల శ్రీవారిపై భక్తి ఉంటే, ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించకపోతే.. మీ హయాం నుంచే జరుగుతున్న నెయ్యి కల్తీపై విచారణ చేయించమని కోరుతున్నాం.మేము ఏ నిబంధనలూ సడలించలేదు: అలాగే మీ హయాంలో నుంచే ఉన్న అధికారుల్ని మేం నియమించినట్లు చెప్పడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. మేం నిబంధనల్ని సడలించడం వల్ల నెయ్యి కల్తీ జరిగిందనేది అబద్ధం. ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి స్టార్టప్ కంపెనీలను ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడులో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రూపొందించినవి. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. మీరు తెచ్చిన నిబంధనల్ని మేం సడలించి తెచ్చిన కంపెనీ ఒక్కటి కూడా లేదు. భోలేబాబా వంటి కంపెనీలు మీ హయాంలోనే టెండర్లు వేసిన విషయం గుర్తుంచుకోండి. ఏఆర్ డెయిరీ, మాల్ గంగా వంటి సంస్థలు మేం నిబంధనలు కఠినతరం చేసిన తర్వాతే టెండర్లలో పాల్గొన్నాయి. అర్హతలు ఉన్నాయి కాబట్టే ఈ కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి.దోషులెవరో సిట్ చెప్పినా మాకు అంటగట్టే యత్నం:చంద్రబాబు జంతుకొవ్వు, ఆవు కొవ్వు కలిపారని చెప్పిన నాలుగు ట్యాంకర్లను తిరిగి శ్యామలరావు ఈవోగా, మీరు సీఎంగా ఉండగానే లడ్డూల్లో వాడారని సీబీఐ తన నివేదికలో చెప్పింది. ఇప్పడు చెప్పండి దొంగలెవరో? దోషులెవరో?. మా హయాంలో నాణ్యత లేని 18 నెయ్యి ట్యాంకర్లను మేం వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం కూడా 14సార్లు కూడా ఇలాంటి నాణ్యత లేని నెయ్యిని వెనక్కి పంపింది. సీఎస్ఆర్టీఐ రిపోర్టులు వచ్చాక ఛైర్మన్‌కు అందిస్తే ఆయన కళ్లు మూసుకున్నారని ఎలా చెప్తారు? టీటీడీ పాలక మండలి తనకున్న అధికారాల్ని ఈవోకు బదలాయించిన విషయం మీకు నిజంగా తెలియదా? అధికారులు ఈవోను కలవకుండా ఛైర్మన్‌ను ఎలా కలిశారు?వాస్తవాలన్నీ ఇలా ఉంటే, కేవలం దురుద్దేశంతో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీద నింద వేయాలని చూశారు. ఇప్పుడు మళ్లీ ప్రత్యేకంగా విచారణ చేయిస్తాం అంటున్నారు. మీ దృష్టిలో మేము (గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం) నేరస్తులమని, శ్రీ వెంకటేశ్వరస్వామి మీద ఉన్న భక్తితో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా విచారణ జరిపిస్తామని కబుర్లు చెబుతున్నారు. నిజంగా నేరస్తులు అయితే శిక్షించమనే కదా మేం ముందు నుంచే అడుగుతున్నాం. సీబీఐ వంటి సంస్థే మేం నిర్దోషులమని నిర్థారించాక కొద్ది మంది అధికారులు, సరఫరా దారులు, టెక్నికల్ కమిటీ కుమ్మక్కై ఈ ద్రోహానికి పాల్పడ్డారని రిపోర్ట్ ఇస్తే మా వాళ్లను దోషులుగా చేసే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు?.మేము తప్పు చేయలేదు. అందుకే గట్టిగా నిలబడ్డాం:పవన్‌కళ్యాణ్ తమ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో నెయ్యిలో ఆవు కొవ్వు, పందికొవ్వు కలిసిందని, అది అబద్దమని మా పార్టీ చేస్తున్న వాదనను సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోతున్నామని, ఏం నిద్రపోతున్నారా అని కాకినాడ ఎంపీతో పాటు, తన సోదరుడిని కూడా ప్రశ్నించారు. నెయ్యిలో నిజంగా జంతుకొవ్వు కలిసినా, అది బయట పెడితే, ఎక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయోనని, సిట్ ఛార్జ్‌షీట్‌లో రాయలేదని చెబుతున్నారు.ఒకవేళ నిజంగా సీబీఐ ఆ పని చేసి ఉంటే, సనాతని, హైందవ ధర్మ పరిరక్షకుడదని చెప్పుకునే పవన్, అప్పుడు, ఇప్పుడు పదే పదే అదే మాట ఎందుకు చెబుతున్నారు. తిరుమలలో వాడిన నెయ్యిలో పందికొవ్వు, జంతుకొవ్వు, చేపనూనె కలిసిందని ఎలా ఆరోపిస్తున్నారు? సనాతనిగా ఉన్న మీరు భక్తుల మనోభావాల్ని ఎలా దెబ్బ తీస్తున్నారు?. తప్పు చేయలేదు కాబట్టే మేం ఛాలెంజ్‌గా మాట్లాడుతున్నాం. మీరు అబద్దాలు చెప్పారు కాబట్టే దాన్ని సమర్థించుకోలేక నానా తంటాలు పడుతున్నారు. అటు టీడీపీలో కూడా ముప్పు తిప్పలు పడుతున్నారు.సీబీఐ రిపోర్ట్ పై విచారించే అధికారం మీకు లేదు:సీబీఐ నివేదిక మీద విచారణ చేసే అధికారం మీది కాదు కోర్టుది. కానీ నేరస్తుల్ని మేమే గుర్తించామంటూ విచారణలకు సిద్దమవుతున్నారు. ఇలాంటి తీర్పులు ఇచ్చే ప్రయత్నాలు మానుకుంటే మంచిది. చంద్రబాబుకు ధైర్యం ఉంటే, నెయ్యిలో ఫ్లేవర్ కలపాలన్న నాటి టీటీడీ బోర్డు నిర్ణయానికి సమాధానం చెప్పాలి. మళ్లీ చెబుతున్నాం. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదికపై, మరో విచారణ జరిపించే అధికారం మీకు లేదు.మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..అనిల్ సింఘాల్ విషయంలో సీఎం పేషీనే పెద్ద నాటక వేదిక. ఆయన ఏ సిఫార్సుతో వచ్చారో మాకు తెలియదు కానీ, ఆయన్ను వచ్చిన రోజు నుంచే బదిలీ చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. సీబీఐ నివేదికను అడ్డు పెట్టుకుని ఇప్పుడు బదిలీ చేశారు. సర్వోన్నత న్యాయస్థానం సరైన విచారణ చేయలేదని కేబినెట్ తీర్మానం చేస్తే అప్పుడు మళ్లీ మీరు సుప్రీంకోర్టుకు వెళ్లి చెప్పుకోవాలి. చంద్రబాబు మిమ్మల్ని పట్టించడం అంటే దొంగ పోలీసును పట్టించినట్లుంది. కాబట్టి నెయ్యి మీద మీరు విచారణలు చేయడం కాదు మళ్లీ సుప్రీంకోర్టుతోనే ఆ పని జరిగేలా చూడాలని భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
TTD నెయ్యిలో జంతు కొవ్వు నిల్ బాబు అబద్ధాలు బట్టబయలు
-
అప్పుడు శ్యామలరావు.. ఇప్పుడు సింఘాల్
సాక్షి, అమరావతి/తిరుపతి, అన్నమయ్య సర్కిల్: తిరుమల లడ్డూ వ్యవహారంలో ఎలాంటి జంతు కొవ్వులేదని, తిరుమల ప్రసాదానికి మహాపచారం జరగలేదని సీబీఐ సిట్ తేల్చిచెప్పడంతో తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటూ అభాసుపాలవుతున్న సీఎం చంద్రబాబు తాము ఇప్పటివరకు చేసిన దుష్ప్రచారాన్ని నిజమని యావత్ భక్తకోటిని నమ్మించేందుకు ఆయన ఐఏఎస్ అధికారులను బలితీసుకుంటున్నారు. మొన్న టీటీడీ ఈఓ శ్యామలరావు అయితే.. తాజాగా ఆదివారం అనిల్‌కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు.ఇలా ఐదు నెలల వ్యవధిలోనే ఆయన ఇద్దరు టీటీడీ ఈఓలపై వేటు వేశారు. దీంతో.. తన రాజకీయ కుతంత్రాలకు చంద్రబాబు టీటీడీని వాడుకుంటూ ఐఏఎస్ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, సింఘాల్ బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం ఆదివారం హడావుడిగా జారీచేసింది. ఆయన వెంటనే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో ప్రస్తుతం సీఎం స్పెషల్ సీఎస్‌గా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఈఓగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో ప్రభుత్వం నియమించింది. తమ ఆరోపణలు నిజమని నమ్మబలికేందుకే..19 నెలల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే టీటీడీ ఈఓగా శ్యామలరావును నియమించారు. అప్పట్లో.. అధికారికంగా ఏ విచారణ జరగకుండానే చంద్రబాబు ‘తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిపార’ని వ్యాఖ్యానించి రాజకీయ వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే ఆ ప్రసాదంలో కల్తీ జరిగిందని విషప్రచారం చేస్తూ వస్తున్నారు. కానీ, సుప్రీంకోర్టు ప్రత్యేక ఆదేశాలతో సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ విచారణానంతరం తిరుమల లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు లేదని నిర్థారించింది.దీంతో.. అప్పట్లో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ తదితరులు లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు, పంది కొవ్వు కలిపారంటూ అడ్డగోలుగా చేసిన ఆరోపణలను నిజమని ఎలాగైనా నిరూపించేందుకే అప్పుడు శ్యామలరావును.. ఇప్పుడు అనిల్‌కుమార్ సింఘాల్‌ను బదిలీ చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇక సాధారణంగా ఒకరి స్థానంలో మరొకరిని నియమించినప్పుడు కొత్తగా వచ్చే అధికారి వచ్చాక ఆయనకు బాధ్యతలు అప్పగించడం పరిపాటి. కానీ, సింఘాల్‌ను ఉన్నపళంగా తప్పుకుని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించి ఆయన్ను ఘోరంగా అవమానించింది. రాజకీయ లబ్ధికోసమే అనిల్‌కుమార్ సింఘాల్‌ను వాడుకుని, ఇప్పుడు పక్కకు తోసేశారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.బాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే తిరుమల లక్ష్యంగా..2024 జూన్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రత అనే సాకుతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై గురిపెట్టింది. తిరుమల పవిత్రతను పట్టించుకోనందున అక్కడి పరిస్థితులను చక్కబెట్టేందుకు టీటీడీ ఈఓగా శ్యామలరావును నియమిస్తున్నట్లు అప్పట్లో ప్రభుత్వ పెద్దలు పలుమార్లు ప్రకటించారు.అయితే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 జూలై 6న, జూలై 12న తిరుమలకు సరఫరా అయిన నెయ్యి టీటీడీ ప్రమాణాలకు తగ్గట్లుగా లేకపోవడంతో అధికారుల స్థాయిలోనే వాటిని వెనక్కు పంపడానికి సిద్ధంచేశారు. ఆ శాంపిళ్లను పరీక్షించేందుకు టీటీడీ చరిత్రలో తొలిసారి గుజరాత్‌లోని ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు)కి పంపారు. జూలై 23న ఎన్డీడీబీ తన నివేదికలో నెయ్యిలో కల్తీ ఉందని వెల్లడించింది. దాంతో.. ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు.అలా నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపడంతో పాటు, ఆ కంపెనీకి షోకాజ్ నోటీసు కూడా ఇచ్చారు. ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడకపోయినా, రెండు నెలల తర్వాత 2024 సెప్టెంబరు 18న ఎమ్మెల్యేల సమావేశంలో ‘శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదానికి నాసిరకం పదార్థాలు వాడారు.. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది’ అని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం పెను దుమారం రేపుతూనే ఉంది. బాబు వ్యాఖ్యలకు భిన్నంగా శ్యామలరావు ప్రకటనతో..అయితే, 2024 జూలై 23నే నాటి టీటీడీ ఈఓ శ్యామలరావు చంద్రబాబు వ్యాఖ్యలకు భిన్నంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నెయ్యి శాంపిళ్లలో కల్తీ ఉందని తేలింది. అందులో వెజిటబుల్ ఫ్యాట్.. అంటే వనస్పతి కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు నోటీసులిచ్చి రెండు ట్యాంకర్లను రిజెక్ట్ చేశాం’.. అని వెల్లడించారు. ఆ తర్వాత.. 2024 సెప్టెంబరు 18 నాటి చంద్రబాబు ప్రకటన తర్వాత సెప్టెంబరు 20న శ్యామలరావు మరోసారి జంతు కొవ్వు కలిపారన్న చంద్రబాబు వ్యాఖ్యలకు భిన్నంగా ‘అడల్ట్రేటెడ్ నెయ్యి అని తేలిన నాలుగు ట్యాంకర్లను పక్కన పెట్టాం.రిపోర్టు వచ్చిన తర్వాత వాడాలని నిర్ణయించాం. రిపోర్టు క్లియర్ కాకపోవడంతో వాటిని రిజెక్టు చేశాం. వాటిని తిప్పి పంపించేశాం, సరఫరా నిలిపివేశాం’ అని ప్రకటించి ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. దీంతో.. అప్పటికప్పుడు ఆయనను బదిలీచేస్తే విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించిన చంద్రబాబు సర్కారు దాదాపు ఏడాది తర్వాత 2025 సెప్టెంబరులో ఆయనపై బదిలీ వేటువేసింది. ఇప్పుడు సీబీఐ సిట్ నివేదికతో ఉక్కిరిబిక్కిరి అవుతూ తమ ఆరోపణలను నిజమని ఎలాగైనా నమ్మించాలని అనిల్‌కుమార్ సింఘాల్‌ను బలిచేసింది. -
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ
సాక్షి, తిరుపతి: టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను చంద్రబాబు సర్కార్.. అకస్మాత్తుగా బదిలీ చేసింది. సీఎంవో ప్రిన్సిపాల్ సెక్రటరీ రవి చంద్రకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. తిరుమల లడ్డూ వివాదంలో చంద్రబాబు ప్రభుత్వం మరో డైవర్షన్‌కు తెరలేపిందిరెండుసార్లు సింఘాల్‌ను ఈవోగా నియమించింది సీఎం చంద్రబాబే. నెయ్యి వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం.. సింఘాల్‌ని బాధ్యుడిని చేసింది. సెప్టెంబర్ 10, 2025 నుండి టీటీడీ ఈవోగా పనిచేస్తున్న సింఘాల్.. గతంలో చంద్రబాబు హయాంలోనే టీటీడీ ఈవోగా పనిచేశారు. 2017 మే 6 నుండి 2020 అక్టోబర్ 4 వరకు టీటీడీ ఈవోగా సింఘాల్ పనిచేశారు. -
హైందవానికి ఆలన... జగన్ పాలన
చెరువు లేని చోట చేపలు పట్టిస్తాననీ, ఆకాశంలో కదలకుండా సూర్యుణ్ణి అలాగే ఉంచేస్తాననీ, గాలి పూసి ఏ గాయం అయినా మాయం చేస్తాననీ చెప్పి, ప్రసార మాధ్యమాల ద్వారా అది ఆయనకే సాధ్యం అని ఊదర గొట్టించి, మాటి మాటికీ ప్రజలను నమ్మించి అందలం ఎక్కి గొంతు కోసేవారు ఒకరు. ఇచ్చిన మాట కోసం, చేసిన వాగ్దానం కోసం, చెప్పిన నిజం నిలబెట్టడం కోసం, పేదవాడి కడుపు నింపడం కోసం, దిగువనున్న వారికి ఎగువ తరగతి చదువు అందివ్వడం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, సంక్షేమ పథకాల నిత్యవికాసం కోసం, జనం కొరకు, జనం మధ్య నిలబడి పనిచేసినవారు మరొకరు.మొదటి వారు చంద్రబాబు నాయుడు అయితే, రెండవ వ్యక్తి జగన్మోహన్రెడ్డి. అబద్ధానికీ నిజానికీ, చీకటికీ వెలుగుకూ మధ్య ఉన్నంత స్పష్టమైన తేడా ఈ ఇద్దరిలో! ఏమీ చేయకుండానే చేసినట్లు, చేస్తున్నట్లు, చేస్తూనే ఉన్నట్లు చెప్పి నమ్మించగలగడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. పత్రికలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన రాగానికి తాళం వేసి, తప్పెట్లు మోగించి అభివృద్ధి ఆకాశం దాటేసింది అంటూ అరుస్తాయి. చిటికెల పందిళ్ళకు, ఊహల ఉత్సవాలకు, గాలిలో ఘనమైన మేడలకు, గ్రాఫిక్ ఇంద్రజాలాలకు బ్రాండ్ అంబా సిడర్ చంద్రబాబు. నేలమీద నిలబడి, కరోనాలో సైతం ప్రజల కోసం కష్టపడి, చేసిన ప్రతి వాగ్దానాన్నీ నిలబెట్టుకుని పెద్దగా ప్రచారం చేసుకోలేక పోయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి.శ్రీవారి పనులు ఆపొద్దు!పదుల సంఖ్యలో ఆలయాలను నేలమట్టం చేసిన చంద్రబాబు సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని నిలబెడతానని నిస్సిగ్గుగా చెబుతున్నాడు. దేవుడిని, దేవుడి ప్రసాదాన్ని రాజకీయం చేసిన మొదటి రాక్షస రాజకీయ నాయకుడు ఈయనే. నిజానికి హైందవ ధర్మానికీ, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికీ అపారమైన సేవ చేసిన వ్యక్తి జగన్ మాత్రమే. అంత సేవ చేసిన ఆయనను చంద్రబాబు విష ప్రచారపు ముసుగు వేసి అన్యుడని అవహేళన చేశాడు. జగన్ ముఖ్యమంత్రి అయిన కాలం నుంచి ఎన్నికల వరకు తిరుమల శ్రీవారికి, హైందవ ధర్మానికి ఆయన చేసిన సేవ ప్రత్యక్షంగా చూసినవాడిగా, ఆత్మ సాక్షిగా గుండెమీద చేయి వేసుకుని ఈ మాటలు చెబుతున్నాను. ఈ వ్యాసం రాస్తున్నాను. అందరికీ తెలియాల్సిన పచ్చి నిజాలివి. పచ్చమీడియా ఎప్పటికీ అంగీకరించని వాస్తవాలివి. తిరుమల శ్రీవారి మీద జగన్‌కు అపారమైన భక్తి, విశ్వాసం. 2019లో అఖండమైన మెజారిటీతో జగన్ ఎన్నికలలో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందే ఆయన తిరుమలకు వచ్చి, శ్రీవారి ఆశీస్సులు పొందిన అనంతరమే అధికార పీఠంపై కూర్చున్నారు. ఆ రోజు జగన్‌తో పాటు నేనూ కారులో ఉన్నాను. అప్పుడు గరుడ వారధి (శ్రీనివాస సేతు) పనులు జరుగుతున్నాయి.ఆ స్తంభాలను చూసి ‘ఏమిటిది’ అని అడిగారు. ‘‘ఇది శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే యాత్రికుల సౌకర్యం కోసం నిర్మి స్తున్న ఫ్లై ఓవర్. దాదాపు 40 కోట్లు చంద్రబాబు హారతి చేశాడు. దీన్ని ఆపడం మంచిది’’ అని కారులోని ఓ ముఖ్య వ్యక్తి చెప్పాడు. దానికి జగన్ నవ్వుతూ, ‘‘శ్రీవారికీ, ఆయన భక్తులకూ ఉపయోగపడే వంతెనను ఆపడం అన్యాయం. వాటా తీసుకున్న వారి పాపం వారికే తగులుతుంది, తగిలింది. ఆపొద్దు, మరింత మెరుగుగా నిర్మించండి’’ అన్నారు. అభివృద్ధి పనులు ఎవరు ప్రారంభించినా ఆపకూడదు అన్నది ఆయన భావన.అప్పటికి కొద్దికాలం క్రితమే ఆయన సుదీర్ఘమైన పాద యాత్రతో 3,648 కి.మీ. నడిచి ఉన్నారు. ఆ అలసట కూడా మరిచి శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన పాదరక్షలు లేకుండా వెళ్ళారు. అలాంటి భక్తుడిని అన్యమతస్థుడు అని చంద్రబాబు, ఆయన మీడియా కొండంత ప్రచారం చేశాయి. జగన్ ఎంత సంప్రదాయబద్ధంగా ఆలోచిస్తా రంటే, ఆయనకు తిరుపతి గంగమ్మ గురించి ఆమె శ్రీవారి చెల్లెలు అని చెప్పాను. ఆయన ముందుగా, ముఖ్యమంత్రిగా గంగమ్మను దర్శించుకునే శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయాల పునరుద్ధరణ, గోసంరక్షణశ్రీవారి వైభవ ప్రచారానికి, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు జగన్ చేసిన సేవ మరెవ్వరూ చేయలేదు. భక్తికీ, రాజకీయానికీ ముడిపెట్టేంత నైచ్యానికి ఆయన ఏనాడూ దిగ జారలేదు. ధర్మాచరణ అంటే రాజకీయ అవసరాలకు శ్రీవారినీ, ప్రసాదాన్నీ వాడుకోవడం కాదు. శ్రీవారి ప్రసాదంలో పంది కొవ్వు, చేపకొవ్వు కలిసి కల్తీ జరిగిందని అసత్య ప్రచారం చేసిన వాళ్ళు భక్తులా? నిజానికి ఆ కొవ్వు వారి మస్తిష్కపు మకిలి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమలలో నిరంతర వేదఘోష ప్రతిధ్వనించింది. కోవిడ్ కాలం నుండి ‘నాద నీరాజన వేదిక’ మీద నిత్యం భారత, భాగవత, రామాయణ, సుందరకాండల ప్రవచన పరిమళం ఆ వైకుంఠాన్ని చేరింది.శ్రీవాణి ట్రస్టు ద్వారా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించింది జగన్. ఆ నిధుల ద్వారా దేశ వ్యాప్తంగా 3,500 ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ జరిగింది. దాన్ని సహించలేక ఆ రోజు ఆ ట్రస్టును విమర్శించాడు చంద్రబాబు. ఆ నిధులు ఎవరి జేబుల్లోకో వెళ్తున్నాయనీ, అధికారం వస్తే ఆ ట్రస్టు రద్దు చేస్తామనీ బీరాలు పలికాడు. ఇప్పుడు ఆ టికెట్ల సంఖ్య పెంచి, ఆలయాలు నిర్మిస్తాం అంటున్నాడు. ఎంత వంచన! గోసంతతిని మరింత పెంచాలని భావించి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విరాళాల క్రింద గిర్, కాంక్రీజ్, సాహిపాల్, పుంగనూరు, ఒంగోలు జాతులకు చెందిన గోమాతలను తిరుపతి గోశాలకు తీసుకువచ్చాం. వాటి సంర క్షణ, సంతతి వృద్ధికి మొదటిసారిగా ప్రణాళికలు తయారు చేసి అమలు పరిచాం. తెలుగు రాష్ట్రాలలోని గోశాలలను గుర్తించి మేత, నిర్వహణ వ్యయం అందించాం. అనేక ఆలయాలకు గోవులను విరాళంగా అందించాం. గోసేవా భాగ్యం హైందవ భక్తులందరికీ అందాలని అలిపిరి వద్ద గోమాత ప్రదక్షిణ శాలను ఏర్పాటు చేశాం. ప్రస్తుత ప్రభుత్వంలో గోశాలల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో పత్రికలు, మీడియా చెప్పాయి. ఇప్పటి దేవ స్థానం అధ్యక్షుడే ముందు కాదని... తర్వాత అంగీకరించాడు. వెన్నలాంటి మనసున్న వేంకటేశ్వరుడు నవనీత ప్రియుడు. జగన్ ముఖ్యమంత్రి కావటానికి ముందు ఆ సేవ యాంత్రికంగా జరిగేది. దాన్ని పూర్తిగా మార్చివేశారు జగన్. శ్రీవారి సేవకుల సహాయంతో మజ్జిగను చిలికించి అప్పుడే తీసిన ఆ నవనీతాన్ని ఆ నవనీత చోరుడికి ఆరగింపుగా అందించే ఏర్పాటు చేశారు. ఎంత భాగ్యం ఇది. ఎంత సేవ ఇది. ఎంత మంచి ఆలోచన ఇది.ఎన్నెన్ని సంస్కరణలు!తిరుమల ఆస్థాన మండపంలో జాతీయ వేదసభ నిర్వహించాం. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులను, మఠాధిపతులను ఆహ్వానించి హైందవ ధర్మ పరిరక్షణకు, వ్యాప్తికి అవసరమైన కార్యక్రమాలను, సలహాలను వారి నుంచి స్వీకరించాం. ఇతర మతాల వారు హిందూమతం స్వీకరించాలి అనుకుంటే అందుకు కేంద్రం తిరుమల కావాలని తీర్మానించాం. అందుకు ఒక వేదిక ఏర్పాటు చేశాం. దేశంలోనే ఇంతటి విప్లవాత్మక నిర్ణయం మొదటిగా తీసుకున్నది తి.తి.దేవస్థానమే. దానికి కారణం జగన్. వేదమూర్తి, వేదస్వరూపుడు అయిన శ్రీవారికి నిత్యం వేద ఘోష వినిపించాలని, భక్తులు అది విని తరించాలని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద శ్రీవేంకటేశ్వర దివ్యానుగ్రహ హోమం ప్రారంభించాం. యువతరాన్ని సక్రమ మార్గంలో ఉంచాలని, శ్రీవారి భక్తి మరింతగా వారి హృదయాలలో నిండా లని శ్రీవారి గోవింద నామకోటి ప్రారంభించాం. యువతీ యువకులు గోవింద నామకోటి రాసి, ఆలయ అధికారులకు అందజేస్తే వారి కుటుంబానికి శ్రీవారి బ్రేక్ దర్శన సౌకర్యం కలిగించాం. దేశంలోని ప్రముఖ పండితుల సహాయంతో శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మస్థలాన్ని గుర్తించాం. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు సౌకర్యాలు కల్పించాం.శ్రీవారికి, శ్రీవారి వివిధ ఆలయాలలో ఉపయోగించిన పుష్పాలను వృథాగా పారవేయక వాటితో అగరుబత్తుల తయారీ ప్రారంభించాం. సప్తగిరులకు గర్తుగా ఏడురకాల పరిమళాల అగరుబత్తులు తయారు చేశాం. స్వామివారికి అలంకరించిన సుమాల పరిమళం... అగరుబత్తీగా మన ఇంట వెలగడం, ఆ పరిమళ భక్తి పరవశంలో మనం లీనం కావటం ఎంత అదృష్టం. అదీ గాక దీనివల్ల ఎందరో మహిళలలకు ఉపాధి ఏర్పడింది. బ్రేక్ దర్శనాలను దాదాపు తగ్గించి, సామాన్య భక్తుల దర్శ నాలకు ప్రాముఖ్యం ఇచ్చాం. క్యూలైన్లలో వేచివుండే భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు కాఫీ, టీ, పాలు పంపిణీ చేశాం. కొండ మీద ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాం. శ్రీవారి ప్రసాదాల కవర్లను కూడా ప్లాస్టిక్ రహితంగా తయారుచేయించాం. కొండమీద పర్యావరణ హితమైన విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టాం. శిలాతోరణం వద్ద 10 ఎకరాలలో పవిత్ర ఉద్యాన వనం, గోగర్భం డ్యామ్ వద్ద 25 ఎకరాలలో పవిత్ర శ్రీగంధ ఉద్యానవనం ఏర్పాటు చేశాం.2021 అక్టోబరు 30, 31 తేదీలలో తిరుపతి మహతి ఆడిటోరియంలో జాతీయ గో సమ్మేళనం నిర్వహించాం. వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరయ్యారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపాం. తిరుమలలో నేడు ప్రతి పౌర్ణమికి శ్రీవారికి జరుగు తున్న గరుడసేవ ప్రవేశపెట్టింది జగన్ తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి. నాలుగు మాడ వీధులలో భక్తులు పాదరక్షలు ధరించ రాదని నిర్ణయం తీసుకున్నవారు జగన్మోహన్ రెడ్డి. అలిపిరి నుంచి కాలినడకన దర్శనం చేసుకున్న సమయంలో వారికి ఈ ఆలోచన వచ్చిందట. అలాంటి వ్యక్తిని, భక్తుడిని బూట్లు ధరించి పూజలు చేసేవారు విమర్శించడం ఎంత అన్యాయం?భక్తుల కోసం...అలిపిరి కాలినడక మార్గపు పైకప్పు ఎప్పుడో 40 సంవ త్సరాల క్రితం నిర్మించారు. అది పూర్తిగా పాడయింది. భక్తులకు అసౌకర్యంగా ఉండేది. ఓ దాత సహాయంతో, దాదాపు 25 కోట్ల వ్యయంతో దానిని పునర్నిర్మించాం. ఆ ఆదేశం ఇచ్చింది జగనే. ముఖ్యమంత్రిగా ఆయన దాన్ని 2021 అక్టోబరు 11న ప్రారంభించారు. కార్తీక మాసంలో మహిళల సామూహిక దీపారాధన ఉత్సవాలను 2020 నవంబరు 30న ప్రారంభించాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు, హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు నగరాలలో సైతం ఈ కార్యక్రమం నిర్వహించాం.తిరుమలలో రూ. 100 కోట్ల వ్యయంతో మ్యూజియం అభివృద్ధి పనులు చేపట్టాం. ఈ మ్యూజియంలో సుమారు 4 వేల అరుదైన, అపురూపమైన హైందవధర్మ కళాఖండాలు, దేవతామూర్తులు రూపకల్పన చేశాం. శ్రీవారి వైభవం ప్రపంచంలోని వారందరూ తెలుసుకోవాలని, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ను హిందీ, కన్నడ భాషల్లో ప్రారంభించింది జగనే.తిరుపతి బర్డ్ ఆస్పత్రిలో అధునాతన సి.టి. స్కాన్, ఎక్స్ రే మిషన్లు, 34 కోట్ల రూపాయల వ్యయంతో రోగుల కోసం నూతన గదులు నిర్మించాం. పేదలకు ఉచితంగా మోకాలు ఆప రేషన్లను ఆరోగ్యశ్రీ క్రింద చేయించాం. చెవుడు, మూగ పిల్లలకు రూ.10 లక్షలు ఖర్చు అయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషను ఉచితంగా చేయించాం. పెదవి చీలికతో ఇబ్బందులు పడుతున్న పిల్లలకు స్మైల్ లైన్ సంస్థ సహకారంతో ఉచితంగా గ్రహణం మొర్రి ఆపరేషన్లు నిర్వహించాం.శ్రీవారికి తల్లి వకుళమాత. ఆమె ఆలయాన్ని ఏ పాలక మండలీ, ఏ ముఖ్యమంత్రీ పట్టించుకోలేదు. ఆ శిథిల ఆలయాన్ని ఓ దాత సాయంతో 12 కోట్ల రూపాయల వ్యయంతో వైభవంగా నిర్మించాం. దాన్ని జగన్ 2022 జూన్ 23న ప్రారంభించారు. తిరుమల శ్రీవారికి జరిగే అన్ని సేవలూ భక్తులందరూ దర్శించాలని, వైభవోత్సవాల పేరుతో వివిధ ప్రాంతాలలో నిర్వహించాం. మఠాధిపతులు, పీఠాధిపతులను సంప్రదించి వారి అనుమతితో వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజులు ఉండేలా మార్పు చేశాం. దానివల్ల ఏటా దాదాపు 8 లక్షలమంది భక్తులు వైకుంఠ ద్వార ప్రవేశం ద్వారా శ్రీవారిని దర్శించు కున్నారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల వారికి స్వామిపట్ల మరింత భక్తి భావం ఏర్పడాలని, వారికి ఉచిత రవాణా, ఆహార, వసతి ఏర్పాట్లను చేసి వైకుంఠద్వార దర్శనం చేయించాం.ఉద్యోగుల కోసం...తి.తి.దే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగి చని పోయిన 90 రోజుల లోపు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా వ్యవస్థలో మార్పులు తెచ్చాం. అంతకు ముందు ఆ ఉద్యోగం రావడానికి సంవత్సరాలు పట్టేది. ఇందులో భాగంగా ఒకేరోజు 119 మందికి నియామక ఉత్తర్వులు ఇచ్చాం. ఈ మార్పులు జగన్ వల్లే సాధ్యమయ్యాయి. తి.తి.దేవస్థానం ఉద్యోగులకు చెన్నై, బెంగళూరు నగరా ల్లోని కార్పొరేట్ ఆస్పత్రులలో నగదు రహిత వైద్య సేవలు, చికిత్సలు అందించేలా 2022 జనవరి 7న ఒప్పందం చేసు కున్నాం. శ్రీవేంకటేశ్వర మ్యాన్‌పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపు 14 వేల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులను ఒకే గొడుగు కిందికి తెచ్చాం. వీరందరికీ సీనియారిటీ, హెూదాను బట్టి జీతాన్ని 3 వేల నుంచి 20 వేల వరకు పెంచాం.తి.తి.దేవస్థానం ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మేలు ఒక చరిత్ర. ఈ ఉద్యోగులందరికీ న్యాయ వివాదాలు లేకుండా ఇంటి స్థలాలు ఇవ్వడం కోసం వడమాలపేట మండలం, పాదిరేడు అరణ్యం గ్రామం వద్ద 300 ఎకరాల భూమిని సేకరించాం. ఇందుకోసం ఉద్యోగులు చెల్లించాల్సిన రూ.60 కోట్లు యాజమాన్యమే కలెక్టరుకు చెల్లించేలా చేసి భూమిని స్వాధీనం చేసుకున్నాం. ఈ భూమిని చదును చేసి, రోడ్లు, కాలువలు, ఇతర సౌకర్యాలు కల్పించాం. ప్రతి ఉద్యోగికీ 50 అంకణాల భూమి చొప్పున 5,518 మంది ఉద్యోగులకు జగన్ చేతుల మీదుగా పంపిణీ చేశాం. భవిష్యత్తు అవసరాల కోసం ఆ భూమిని ఆనుకుని ఉన్న మరో 132 ఎకరాల భూమిని రూ. 25 కోట్లు చెల్లించి కొనుగోలు చేశాం. తి.తి.దే. విశ్రాంత ఉద్యోగులకు కూడా ఇంటిస్థలాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో శ్రీకాళహస్తి మండలం, పల్లం వద్ద భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాం. కానీ అధికార మార్పిడి వల్ల నీలినీడలు ఏర్పడ్డాయి.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇలాంటి వేల ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. కోవిడ్ వల్ల ప్రభుత్వం మీద ఎంతో ఆర్థికభారం పడినా ఆయన ఏ సంక్షేమ పథకమూ ఆప లేదు. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే జనం కోసం, సత్యం కోసం నిలబడినవారు బలయ్యారు. సోక్రటీసుకు విషం పెట్టి, బ్రూనోను శరీరమంతా తగులబెట్టి చంపారు. భగత్‌సింగును ఉరితీశారు. అల్లూరి సీతారామ రాజును కాల్చి చంపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తల నరికారు. ప్రజల కోసం నిలబడిన వారి అధికారం, జీవిత కాలం స్వల్పమే అయింది. జగన్ అధికార కాలం కూడా వేల అబద్ధాల మబ్బుల ముందు మసక బారింది. ఆయన ఓడిపోయాడే గాని ఇంకా చనిపోలేదు కదా అని తన అనుయాయ, శిష్యుని చేత బహిరంగంగా అనిపించిన పాషాణ హృదయ కుటిలత్వం చంద్రబాబుది. హైందవ ధర్మ రక్షణకు జగన్ చేసింది కొండంత, ఇక్కడ నేను చెప్పింది గోరంత. ఆయనపై నీచ నికృష్ట ఆరోపణలు చేసిన బూట్ల బాబు, గాలి సోకినట్లు గోల చేసే పవనానందులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. అందుకే మళ్ళీ మళ్ళీ అంటాను: హైందవానికి ఆలన – జగన్ పాలన అని. ఓం నమో వేంకటేశాయ!భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ -
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 69,254 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 20,954 మంది భక్తులు తలనీలాలు అరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.35 కో ట్లు సమరి్పంచారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శ న టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇసర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
స్వామిద్రోహుల లడ్డూ మోసం
చంద్రబాబు దైవభక్తి ఒక నాటకంజనక్షేమం ఒక బూటకంఅధికారం అన్నదే కీలకంసంపాదనే ఆయనకు మూలకంచంద్రబాబు ఒక స్వార్థ కీటకంహైందవ ద్రోహ రూపకంఇది నా వ్యక్తిగత అభిప్రాయం కానేకాదు. తిరుమల లడ్డూ ప్రసాదంలో చంద్రబాబు ఆరోపించినట్టు జంతువుల కొవ్వు కలవనే లేదని సీబీఐ నేతృత్వంలోని ‘సిట్’ నిర్ధా రించిన తర్వాత, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనసుల్లో కలిగిన అభిప్రాయం. హిందువులు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. స్వామి వారి ప్రసా దాన్ని భక్తిశ్రద్ధలతో కళ్లకద్దుకుని స్వీకరిస్తారు. అలాంటి ప్రసాదాన్ని చంద్రబాబు ఆరోపణల తర్వాత, స్వీకరించాలంటే ఏదో అనుమానం. మనమెంత గానో ఇష్టపడే, పూజించే స్వామి వారి ప్రసాదమేనా? లేక పంది, ఆవు, చేపల కొవ్వుతో తయారు చేసిందా? అని హిందువుల మనసులు ఆవేదనతో గింజుకున్నాయంటే అనుమానం లేదు. అందుకే చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని 2024 సెప్టెంబర్ 18న తీవ్ర వివాదాస్పద ఆరోపణలు చేసిన తర్వాత,హిందువులంతా మనసులో పరమ శివుడు గరళాన్ని దిగ మింగినట్టు క్షోభను అనుభవిస్తూ వచ్చారు. బయటపడిన నీచత్వంసుప్రీంకోర్టు పర్యవేక్షణలో నియామకమైన సీబీఐ నేతృత్వంలోని ‘సిట్’ ఎట్టకేలకు నివేదికను న్యాయస్థానంలో సమర్పించింది. అందులోని అంశాలు కోట్లాది మంది హృదయభారాన్ని దించే సమాచారం. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కొవ్వు పదార్థాలూ లేవని ‘సిట్’ నిర్ధారించింది. ఈ నివేదిక తిరుమల శ్రీవారి ప్రతిష్ఠను పెంచేలా ఉంది. ఇదే సందర్భంలో చంద్రబాబు నీచత్వాన్ని బయట పెట్టిందని చెప్పక తప్పదు. రాజకీయ ప్రత్యర్థుల్ని నేరుగా ఎదుర్కో లేక, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకుహిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అస్త్రంగా వాడుకోవడం దిగ్భ్రమ కలిగించింది. అన్నం పెట్టినోళ్లకు సున్నం పెట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని చెప్పడానికి ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక ఉదంతాలున్నాయి. అయితే శ్రీవేంకటేశ్వరస్వామికి కూడా ద్రోహం తలపెట్టేంత దుర్మార్గం ఆయనలో ఉందని కలలో కూడా ఊహించ లేదు. కనీసం ‘సిట్’ నివేదిక వెలువడిన తర్వాతైనా ఆయనలో కాసింతైనా పశ్చాత్తాపం కలుగుతుందని సమాజం భావించింది. అలాంటిది లేకపోగా, తమ ప్రసార మాధ్యమాలు, అధికార బలంతో ఎలా పైచేయి సాధించాలని దేవుడితో రాజకీయ క్రీడ ఆడటానికే చంద్ర బాబు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు చేలో మేస్తే, తాను గట్టున ఎలా మేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరూపించుకుంటున్నారు. తనను తాను ‘సనాతని’గా ప్రచారం చేసుకుంటున్న పవన్ కల్యాణ్, దేవునికి అన్యాయం జరిగితే, బాధ్యతాయుతమైన అధికారంలో ఉన్న నాయకుడిగా రక్షణ కవచంగా ఉండాల్సింది. కానీ లడ్డూ ప్రసా దంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు కలిసిందనే చంద్రబాబు ఆరోపణలు నిజమన్నట్టు దుష్ప్రచారం చేసిన ఘనతను పవన్ దక్కించుకున్నారు. చంద్రబాబు అండ్ కోకు జగన్‌పై దుష్ప్రచారం చేయడం కొత్తేమీ కాదు. అయితే దాన్ని జనం నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చిట్టచివరి అస్త్రంగా లడ్డూ ప్రసాదమనే అస్త్రాన్ని ప్రయోగించారు. దేవుని భుజాల పైనుంచి జగన్‌ను రాజకీయంగా కాల్చాలనే ప్రయత్నం బూమరాంగ్ అయ్యింది.స్వామివారి పుణ్యమా అని... లడ్డూ ప్రసాదంలో కల్తీపై నిక్కచ్చిగా విచారణ జరిపించాలని వైసీపీ నాయకుడు, టీటీడీ పూర్వపు అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఒకవేళ సుప్రీంకోర్టు తన పర్యవేక్షణలో సీబీఐ నేతృత్వంలో విచారణ చేయాలని ఆదేశించకపోయివుంటే, స్వామి వారి ప్రతిష్ఠను దిగజార్చాలనే కుట్ర నెరవేరేదేమో! కానీ కలి యుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి చంద్రబాబు, ఆయన తాబేదా రులైన పాలకుల కుట్రల్ని గుర్తించి, సీబీఐతో విచారణ చేపట్టేలా చేయించారు. అందుకే సీబీఐ విచారణ జరిపి, చంద్రబాబు, ఆయన అనుచరులు ఆరోపణలు చేస్తున్నట్టు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఇదే చంద్రబాబు నియమించిన ‘సిట్’ విచారణ జరిపి ఉంటే, తన రాజకీయ స్వార్థానికి, ఆరోపణలే నిజమని నమ్మించేందుకు నివేదిక ఇప్పించేవారు. అలాగే వైవీ సుబ్బారెడ్డిని, నన్ను, ధర్మారెడ్డిని జైలుకు కూడా పంపి ఉండేవారు. సీబీఐ విచారణతో బాబు ఆటలు సాగలేదు. బాబు కోరుకున్నట్టుగా రాజకీయ లబ్ధి చేకూరకపోగా, యావత్ హిందూ సమాజం ఆయనను అసహ్యించుకుంటోంది. శిశుపాలుడే సిగ్గుపడేలా, కంసుడే చెవులు మూసుకునేలా, సమస్త రాక్షసులూ నోళ్లు వెళ్లబెట్టేలా... చంద్రబాబు తన మాటలతో, చేష్టలతో, వంతపాడే ప్రసార మాధ్యమాలతో లడ్డూలో వాడే నెయ్యిపై నిందారోపణలు చేయడాన్ని సమాజం గుర్తించింది. ఒక రాజకీయ నాయకుడికి, అతని దుశ్చర్యల్ని జనం పసిగట్టడం కంటే మరో శిక్ష అవసరం లేదు. పురాణ కాలంలో దేవతలు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసులు అందులో మద్యమాంసాలు కలిపేవారని కథలు కథలుగా విన్నాం. రాక్షసుల కంటే నీచస్థాయికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిగజారారనేందుకు తిరుమల లడ్డూ ప్రసాదంలో వారు చేసిన నానాయాగీని చూడాల్సి ఉంటుంది. దమ్ముంటే మొదటి నుంచీ వద్దాం!టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై విచారించిన ‘సిట్’... రాజకీయపరమైన అవినీతి లేదని స్పష్టంగా పేర్కొంది. అధి కారులు, సాంకేతిక నిపుణులు, డెయిరీ సంస్థల అధిపతులు కుమ్మక్కై పామాయిల్‌ను నెయ్యిగా భ్రమింపచేశారనేది ‘సిట్’ నివేదిక సారాంశం. ‘సిట్‘ నివేదిక వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడి నాలుక మడత పడింది. కల్తీ జరిగింది కదా అని కొత్త పల్లవి ఎత్తుకుంటున్నారు. నిజంగా చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, భక్తి ఉంటే 2009 నుంచి 2019 వరకు టీటీడీలో నెయ్యి సరఫరాపై విచారణ చేయించాలి. ఇవాళ సీబీఐ నివేదికలో భోలేబాబా మార్గంగా వైష్ణవి, ఏఆర్ డెయిరీలకు నెయ్యి సరఫరా అయినట్టు ఉంది. అలాగే ప్రీమియం డెయిరీకి కూడా! ఈ ప్రీమియర్, ఆల్ఫా డెయిరీలే 2013 సంవ త్సరం నుంచి 90 శాతానికి పైగా నెయ్యిని సరఫరా చేశాయి. ఇందుకు సంబంధించి మా దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయి. ప్రీమియర్ డెయిరీ కూడా ఇవాళ భోలేబాబా దగ్గరి నుంచే నెయ్యి సరఫరా చేసినట్టు సీబీఐ తన నివేదికలో స్పష్టం చేసింది. టెండర్ నిబంధనల్ని మా హయాంలో సరళతరం చేయడం వల్ల కల్తీ జరిగినట్టు చంద్రబాబు ఆరోపిస్తున్నారు. నిబంధనల్ని సరళ తరం చేయాలని అనుకోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఆలోచనే కారణం. కొత్తగా వచ్చిన స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. అందుకే కొత్త కంపెనీలకు కూడా నెయ్యి సరఫరా చేసే అవకాశం కల్పించాలని 2021లో టీటీడీ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం. అయితే పాల ఉత్పత్తులు తగిన మోతాదులో లేకపోతే వెన్న కొనుగోలు చేయొచ్చనే నిబంధన నేటికీ ఉంది. ఆ తర్వాత నిబంధనను కఠినతరం చేసింది నా హయాంలోనే! ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ నాయకులపై సీబీఐ నేరారోపణ చేయలేదు. ఆ నేరంలో భాగస్వాములుగా టీటీడీ చైర్మన్లగా పని చేసిన మమ్మల్ని ఎక్కడా సీబీఐ చెప్పలేదు. నెయ్యి ప్రామాణికతల్ని మెరుగుపరచడానికి రూ.5.50 కోట్లతో మిషనరీల ఏర్పాటుకు టెండర్లను పిలిచింది మా హయాంలోనే! ఆ మొత్తాన్ని అందించడానికి దాత వచ్చింది కూడా మా హయాంలోనే. ఆ తర్వాత మా ప్రభుత్వం దిగిపోయింది. మీ హయాంలో చేసిందేమీ లేదు. పైగా మాపై నిందారోపణలు. ఇవాళ నిందితులుగా ‘సిట్’ పేర్కొన్న జీఎం సుబ్రమణ్యం 2016 నుంచి 18 వరకు ప్రొక్యూర్మెంట్ జీఎంగా కొనసాగారు. అది కూడా చంద్రబాబు టైమ్ లోనే! మరో నిందితుడు జగదీష్ కూడా 2018–21 వరకు అంటే చంద్రబాబు గారి సమయంలోనే ప్రొక్యూర్మెంట్ జీఎంగా నియమి తులయ్యారు. అలాగే విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర అనే సాంకేతిక నిపుణులు 2013 నుంచి ఇప్పటి వరకూ కొనసాగుతున్నారు. ఇవాళ వారిని నిందితులిగా సీబీఐ తేల్చింది. దీనికి మా నాయకు డైన వైఎస్ జగన్‌కు ఏంటి సంబంధం బాబు? సరైన పాప పరిహారంయజ్ఞం చేస్తున్న వ్యక్తి జగన్. అందులో రక్తం పోసే వ్యక్తులు చంద్రబాబు, పవవ్ కల్యాణ్. అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల్లో చేప కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని పవనానంద స్వామి (పవన్ కల్యాణ్) ఆరోపించారు. అయోధ్యకు పంపిన లడ్డూ ప్రసాదాలకు నెయ్యి సరఫరా చేసిన టీటీడీ సభ్యుడు సౌరబ్ బోరా... నేటికీ బోర్డు సభ్యుడే! కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు ధరించి, బహిరంగ సభలో పవన్ నిస్సిగ్గుగా మాట్లాడారు. శ్రీవారి ఆలయం అపవిత్రం అయ్యిందని విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం మెట్లు కడిగారు. ఇప్పుడు పవన్ నోటి ద్వారా వాస్తవం ఏంటో బయటికి రావాలి. కల్తీ జరిగిందనే కారణంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని ఈవో శ్యామలారావు చెప్పారు. అవే ట్యాంకర్లు తిరిగి తిరుమలకు ఇదే చంద్రబాబు హయాంలో వెళ్లాయనీ, ప్రసాదంలో వినియోగించారనీ ‘సిట్’ తన నివేదికలో స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు కలిపారని, పట్టుకున్నామని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడారని కోర్టుకు సీబీఐ సమర్పించిన నివేదికలో పేర్కొంది. కల్తీ ఎవరి హయాంలో జరిగిందో ఇప్పుడు చెప్పు బాబు? అలాగే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, శ్రీవారి ఆలయ అర్చకులతో చంద్రబాబు సంప్రోక్షణ చేయించారు. తిరుమలలో నాలుగు అర్చక కుటుంబాలున్నాయి. స్వాములూ... మీరు మేల్కో వాలి. చంద్రబాబు నీచ కార్యక్రమాలకు తలొగ్గకండి. ఇప్పటికైనా హిందువులంతా వాస్తవాలు తెలుసుకుని, చంద్రబాబు శ్రీవారి ఆలయం కేంద్రంగా ఆడే రాజకీయ వికృత క్రీడను తిప్పి కొట్టాలి. పదవి పొందడానికి పాతాళం కన్నా కిందికి దిగజారి మాట్లాడే పాశవిక ప్రవృత్తి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కే చెల్లు. పాప పరిహా రానికి అమరావతి నుంచి తిరుమల ఆలయం వరకూ రోడ్లన్నీ పవన్ కడగాలి. చంద్రబాబు గుండు కొట్టించుకొని, కోట్లాదిమంది భక్తు లకు క్షమాపణ చెప్పాలి.ఓ విష్ణు పరమాత్మా! రాజకీయ స్వార్థానికి మిమ్మల్ని వాడు కున్న పాలకుల మధ్య బతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నాం. అధికారమనే పొర కళ్లకు కప్పి, అంధత్వంతో పాలిస్తున్న వారికి బుద్ధి చెప్పడానికే ‘సిట్’ నివేదిక రూపంలో మా ముందుకొచ్చావు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదనే సత్యాన్ని చెప్పి, కోట్లాది మంది హిందువుల మనసుల్ని తేలికపరిచావు. ఏది పుణ్యం, ఏది పాపం, ఏది నరకం, ఏది స్వర్గం, ఏది సత్యం, ఏదసత్యం తెలుసు కోలేని దురవస్థలో కూటమి పాలకులున్నారు. ఏడుకొండలవాడా వెంకటరమణా... మీరు తలచుకోబట్టే లడ్డూ ప్రసాదంపై ఏడాదిగా ప్రచారమవుతున్నవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. భూమన కరుణాకరరెడ్డివ్యాసకర్త టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ -
YV Subba: తిరుపతి లడ్డూ విషయంలో TDP తప్పుడు ప్రచారం
-
తిరుమలలో మరో అపచారం..
సాక్షి, తిరుమల: ఏపీలో కూటమి ప్రభుత్వంలో తిరుమలలో వరుస అపచారాలు వెలుగు చూస్తున్నాయి. టీటీడీ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తిరుమలలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఓ కొత్త జంట ఫోటో షూట్ చేయడం వివాదానికి దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల మేరకు.. తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఓ కొత్త జంట ఫోటో షూట్ తీసుకున్నారు. గొల్లమండపం నుండి అఖిలాండం వరకు నిబంధనలకు విరుద్ధంగా ఆ జంట వివిధ భంగిమల్లో ఫోటోలు తీసుకున్నారు. ముద్దులు కూడా పెట్టుకున్నారు. సదరు జంట ఇలా ఫొటోలు, వీడియోలు దిగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో ఫోటో షూట్లు, రీల్స్ చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ, భద్రతా సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ భక్తులు మండిపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు టీటీడీ భద్రతా సిబ్బందిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
తిరుమల లడ్డూ కల్తీ అయిందనే చెప్పండి
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తాము చేసిన ప్రచారం తప్పని తేలిన నేపథ్యంలో బుధవారం కేబినెట్ భేటీలో చంద్రబాబు దానిపై మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. సిట్ నివేదిక తమకు వ్యతిరేకంగా ఉందనే విషయాన్ని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు తెలిసింది. సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశం ముగిశాక చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై రాజకీయ అంశాలపై మాట్లాడారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై గతంలో తాము చేసిన ఆరోపణలను ఎలా సమర్థించుకోవాలనే దానిపైనే ఎక్కువసేపు చర్చించినట్లు సమాచారం. సిట్ ఇచ్చిన నివేదికలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని పేర్కొన్నారని, ఇది వైఎస్సార్సీపీకి ఆయుధంగా మారిందని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు తెలిసింది. దీనిపై బాబు స్పందిస్తూ.. సిట్ నివేదికపై వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని ప్రచారం చేయాలని, అసలు ఇంకా నివేదిక బయటకు రాలేదని చెప్పాలని సూచించినట్లు సమాచారం. గతంలో తాను చెప్పినట్లు జంతువుల కొవ్వు కలిసిందనే అంశాన్ని వదిలేసి కల్తీ జరిగిందనే విషయాన్ని మాత్రమే బయటకు చెప్పాలని.. అలాగే, పాలులేకుండా నెయ్యి తయారైందని ప్రచారం చేయాలని ఆయన సూచించారు. మరోవైపు.. సిట్ నివేదికను అధికారికంగా తెప్పించాలని, దానిపై ఇంకా ఎలా మాట్లాడాలో చూద్దామని అన్నట్లు సమాచారం. అయితే, ఇద్దరు మంత్రులు మాట్లాడుతూ.. ఇప్పటికే వైఎస్సార్సీపీ స్పీడుగా ఉందని చంద్రబాబు, టీడీపీ చెప్పినవన్నీ అబద్ధాలేననే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లారని అన్నట్లు తెలిసింది. అయినా పర్వాలేదని, సిట్ నివేదిక ఎలా ఉన్నా వెనక్కి తగ్గకుండా కల్తీ జరిగిందనే విషయాన్ని ప్రచారం చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం. సిట్ నివేదిక వైఎస్సార్సీపీకే వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుదామని, టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి పీఏ అకౌంట్లో డబ్బులు జమ అయిన విషయాన్ని ఎక్కువగా మీడియాలో చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.మంత్రుల పనితీరుపై అసంతృప్తి..చంద్రబాబు యథావిధిగా ఈ సమావేశంలోనూ మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరికి తమ శాఖలపై ఏమాత్రం పట్టులేదని, తమకు సంబంధించిన సబ్జెక్టులపై కూడా మాట్లాడలేకపోతున్నారని, రాజకీయ విమర్శలను వెంటనే తిప్పికొట్టలేకపోతున్నారని చెప్పినట్లు సమాచారం. లడ్డూ విషయంలో సిట్ నివేదికపై వైఎస్సార్సీపీ దూకుడుగా వెళ్తున్నా తమ వాళ్లు ధీటుగా జవాబు ఇవ్వలేకపోయారని అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. -
అంతా బాబు దుష్ప్రచారమే.. రాజకీయ రాద్ధాంతమే
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు..’ అని సీబీఐ స్పష్టం చేసింది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. టీటీడీ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై విచారించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించిన విషయం తెలిసిందే. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన సీబీఐ దర్యాప్తు పూర్తి చేసింది. అనంతరం చార్జ్‌షీట్‌ను నెల్లూరులోని ఏసీబీ న్యాయస్థానంలో ఇటీవల సమర్పించింది. మరోవైపు సీబీఐ నివేదిక పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు తమ అనుకూల ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చి దుష్ప్రచారానికి యత్నిస్తున్నారు. కాగా అసలు సీబీఐ దర్యాప్తులో ఏం వెల్లడైందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తులో వెల్లడైన వాస్తవాలు తాజాగా బహిర్గతమయ్యాయి. లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని దర్యాప్తులో నిగ్గు తేలింది. సీబీఐ శాస్త్రీయంగా విశ్లేషించి సాధికారికంగా వెల్లడించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి..టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదువైఎస్సార్ సీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తు నిర్ధారించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి శాంపిల్స్‌ను హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’కు పంపించి పరీక్షలు నిర్వహించినట్లు సీబీఐ తెలిపింది. టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని వెల్లడైందని ఆ ల్యాబరేటరీలు ఈ ఏడాది మార్చి 27న నివేదించాయని సీబీఐ నివేదిక పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రైగ్లిసరైడ్ ప్రొఫైల్’’ పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలెస్ట్రాల్ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. మరి కొలెస్ట్రాల్ లేదని అంటే... జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్లేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ నివేదిక స్పష్టం చేసింది. రాజకీయ కుట్రతో లడ్డూ ప్రసాదంపై బాబు దుష్ప్రచారంరాజకీయ కుట్రల కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిస్సిగ్గుగా నిరూపించుకున్నారు. 1994–1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఆయన భార్య లక్ష్మీ పార్వతిల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ దుష్ప్రచారం చేశారు. వైస్రాయ్ హోటల్ కుట్రతో ఆయనకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అడ్డదారిలో సీఎం అయ్యారు. కాగా ఈసారి ఏకంగా తిరుమల శ్రీవారి పవిత్రమైన లడ్డూ ప్రసాదానికి కళంకం తెచ్చేలా చంద్రబాబు దుష్ప్రచార కుట్రలకు తెగబడటం విస్మయపరుస్తోంది. 2024 సెప్టెంబరు 18న చంద్రబాబు ఈ కుట్రకు తెరతీశారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిరాధార ఆరోపణలు చేసి రాజకీయ కుట్రకు తెగబడ్డారు. అంతేకాదు ఆ మర్నాడు అంటే సెప్టెంబరు 19న ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) నివేదికను వక్రీకరిస్తూ టీడీపీ ప్రధాన కార్యాలయంలో దాన్ని విడుదల చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ఇటువంటి దుష్ప్రచారం చేయడం విభ్రాంతి కలిగించింది. ఎందుకంటే.. అధికార యంత్రాంగం అంతా ఆయన చేతిలోనే ఉంది. నిజంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారో లేదోఅని తెలుసుకునే అవకాశం ఆయనకు ఉంది. అయినా సరే కేవలం వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయడం... ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా చంద్రబాబు లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకువచ్చేందుకు కూడా వెనుకాడలేదు. కాగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ కుట్రను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు అప్పుడే తిప్పికొట్టారు. గత ఏడాది సెప్టెంబరు 20న ఆయన తిరుపతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలను పరోక్షంగా ఖండించారు. ఎటువంటి కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు. నెయ్యి ట్యాంకర్లను తిరుపతిలోనే పరీక్షించి... నాణ్యత ఉన్నవాటినే తిరుమలకు పంపిస్తామని... తగిన నాణ్యతతో లేనివాటిని వెనక్కి పంపుతామన్నారు. అది దశాబ్దాలుగా టీటీడీ కచ్చితంగా పాటిస్తున్న విధానమేనని చెప్పారు. అదే విధంగా తగిన నాణ్యతతో లేని నాలుగు ట్యాంకర్ల నెయ్యిని తిరుపతిలోని అలిపిరి నుంచే వెనక్కి పంపామన్నారు. ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించనే లేదని... అసలు కల్తీ నెయ్యి ట్యాంకర్లను తిరుమల ఘాట్ రోడ్డులోకి కూడా ప్రవేశించనివ్వలేదన్నారు. దాంతో శ్యామలరావుపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను హుటాహుటిన అమరావతికి పిలిపించడం గమనార్హం. రాజకీయ కుట్రతో తాము చేసిన నిరాధార ఆరోపణలకు వ్యతిరేకంగా మాట్లాడటం ఏమిటని ఆయన్ను మందలించినట్లు తెలుస్తోంది. అనంతరం కొంత కాలానికే టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం. బాబు కుట్రకు పవన్ వత్తాసుశ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం కలిగించేందుకు చంద్రబాబు పన్నిన కుట్రకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వత్తాసు పలికారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఆయన హైడ్రామాకు తెరతీశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లను కడిగి చంద్రబాబు కుట్ర డ్రామాను మరింత రక్తి కట్టించేందుకు యత్నించారు. ఇక టీడీపీ, జనసేన సోషల్ మీడియా విభాగాలు లడ్డూ ప్రసాదంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారానికి తెగబడ్డాయి. రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు యత్నించాయి. దేవుణ్ని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచండి: సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం దేవుణ్ణి అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయటాన్ని మందలించినట్లేనని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.వరద సహాయక చర్యల్లో వైఫల్యం...డైవర్షన్ కుట్రతోనే లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారంవిజయవాడ వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ డైవర్షన్ కుట్రకు పాల్పడ్డారు. 2024 సెప్టెంబరులో విజయవాడను బుడమేరు వరద ముంచెత్తింది. వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా టీడీపీ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడ లేదు. కనీసం లోతట్టు ప్రాంతాలవారిని అప్రమత్తం చేయలేదు. సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. దాంతో జల ప్రళయం విజయవాడను ముంచెత్తింది. కేవలం చంద్రబాబు సర్కారు వైఫల్యంతో 50మందికి పైగా దుర్మరణం చెందారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాంతో ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ కుట్రకు తెరతీశారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారానికి తెగబడ్డారు. తద్వారా ప్రజల దృష్టి విజయవాడ వరదల నుంచి మళ్లించేందుకు యత్నించారు.కుట్రతోనే ‘పచ్చ’ సిట్... అడ్డుకున్న సుప్రీంకోర్టుతమ రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం సిట్‌ను నియమించింది. టీడీపీ వీరవిధేయుడిగా ముద్రపడిన వివాదాస్పద అధికారి గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్‌ను నియమించింది. మరో టీడీపీ వీరవిధేయ అధికారి, విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టిని అందులో సభ్యుడిగా నియమించింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య అల్లుడే గోపీనాథ్ జెట్టి. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న తమ దుష్ప్రచారానికి రాజముద్ర వేయాలనే ఆ ఎత్తుగడ వేసింది. కాగా ఈ యత్నాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుంది. ఆ సిట్ ఏర్పాటు చెల్లదని చెప్పింది. ఆ స్థానంలో సీబీఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు చార్జ్‌షీట్‌ను సమర్పించింది. -
తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు దుష్ప్రచారం
-
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 77,049 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,469 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.73 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 5 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
తిరుమలలో ఘనంగా రథ సప్తమి వేడుకలు
సాక్షి, తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల భక్తజన సంద్రంగా మారింది. నేడు (ఆదివారం) రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశం నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రథసప్తమి (సూర్య జయంతి) రోజున ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు కనువిందు చేయనుండటంతో, ఆ అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తిరుమల వీధులన్నీ గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి.భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. దీంతో భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని, క్యూలైన్లలో ప్రవేశిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో, ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి అధిక సమయం పడుతోందని సమాచారం. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు ఆహార పానీయాలను అందిస్తున్నారు.వైభవంగా ఏడు వాహనాల సేవలునేటి రథసప్తమి మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు మలయప్ప స్వామి వారు ఏడు విభిన్న వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ, భక్తులను అనుగ్రహించనున్నారు. ఇది కూడా చదవండి: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం -
Ratha Sapthami: ఈ నెల 25న తిరుమలలో రథ సప్తమి వేడుకలు
సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తోంది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు.వాహనసేవల వివరాలు :• తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) – సూర్యప్రభ వాహనం.• ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.• ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.• మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.• మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.• సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.• సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.• రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.ఆర్జిత సేవలు రద్దు :ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా, సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు.తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరీ‘అనగనగా ఓ రాజు’ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరీ శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన నవీన్ పోలిశెట్టి, ‘అనగనగా ఓ రాజు’ చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో శ్రీవారి ఆశీస్సులు కోరేందుకు తిరుమల వచ్చాం. ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంక్రాంతి పండుగకు అద్భుతమైన విజయాన్ని అందించింది అని తెలిపారు.అలాగే, త్వరలో అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా మరో కొత్త సినిమాతో ముందుకు వస్తాను అని నవీన్ పోలిశెట్టి హామీ ఇచ్చారు. హీరోయిన్ మీనాక్షి చౌదరీ కూడా ఈ విజయానికి ప్రేక్షకులే కారణమని కృతజ్ఞతలు తెలిపారు. -
శ్రీవారి ద్రోహికి శిక్ష తప్పదు!
ధర్మ ఏవ హతో హన్తి, ధర్మో రక్షతి రక్షితః/తస్మాద్ధర్మో న హంతవ్యో, మా నో ధర్మో హతోవధీత్!! ‘ధర్మాన్ని నాశనం చేస్తే, అది చేసిన వాడిని నాశనం చేస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే, అది వారిని రక్షిస్తుంది. అలాగే ధర్మాన్ని ఎప్పుడూ నాశనం చేయకూడదు. ఒకవేళ నాశనం చేస్తే అదే దుర్గతి మనకు సంప్రా ప్తిస్తుంది’ అనేది ఈ శ్లోకం అర్థం. సనాతన ధర్మం (మనుస్మృతి)లో ధర్మ విశిష్టతను చెప్పే శ్లోకం ఇది. ధర్మానికి, న్యాయానికి సర్వలోకమూ నిలువెత్తు కొండగా తిరుమల శ్రీవారిని చూస్తుంది. కష్టమొస్తే, నష్టమొస్తే... ‘కలియుగ దైవమా, పాహిమాం’ అని వేడుకుంటే, ముల్లోకాల్లో శ్రీవారు ఎక్కడున్నా కాపాడుతారని భక్తుల అచంచల విశ్వాసం. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిపై నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుచరగణం విషం చిమ్ముతున్నారు. పదివేల శేషుల పడగ లపై ఆసీనులైన శ్రీ మహావిష్ణువుపై తాను విషం చిమ్ముతున్నాననే స్పృహలో లేనంతగా వారికి అహంకారం తలకెక్కిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.రాజకీయ స్వార్థానికి చివరికి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని సైతం వదిలి పెట్టనంతగా చంద్రబాబులో అవకాశవాదం పెరిగిపోయింది. మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అలాగే ఆయన సైనికులైన మాలాంటి వాళ్లపై రాజకీయ కక్ష తీర్చుకోవ డానికి చంద్రబాబుకు వేరే మార్గాలున్నాయి. కానీ అధికారంలోకి రాక మునుపు, వచ్చిన తర్వాత కూడా తిరుమల శ్రీవారినే చంద్ర బాబు ఎంచుకోవడం తీవ్ర ఆవేదన, ఆందో ళన కలిగిస్తోంది. గత ఏడాదిన్నర చంద్రబాబు పాలనలో తిరుమల శ్రీవారి కేంద్రంగానే దుర్మార్గ రాజకీయాలకు బరి తెగించారని చెప్పడానికి ఆవే దన చెందుతున్నా. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వైసీపీ హయాంలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం స్థాయిలో చంద్రబాబు నోరుజారి, స్వామి వారి దృష్టిలో క్షమించరాని నేరానికి పాల్పడ్డారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చంద్రబాబు శ్రీవారి లడ్డూపై నిందారోపణలు చేయడాన్ని సాక్షాత్తు సర్వోన్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టే చీవాట్లు పెట్టింది. ఆ విషయమై నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది.కల్తీ అయ్యింది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదు, చంద్రబాబు మనసు రాజకీంగా కలుషితమైంది. అధికారం కోసం పిల్లనిచ్చిన మామనూ, అలాగే అలవికాని హామీలిచ్చి ప్రజల్నీ వెన్నుపోటు పొడిచారని మాత్రమే ఇంతకాలం చంద్రబాబును విమర్శించే వాళ్లం. కానీ కలియుగ దైవాన్ని కూడా విడిచిపెట్టలేదని లడ్డూ ప్రసాదంపై అత్యంత దుర్మార్గంగా పేద్ద బండలాంటి నింద వేశారని స్పష్టమైంది. ఆ తర్వాత పరకామణిలో చోరీ కేసును కూడా స్వార్థ రాజకీ యాలకు వాడుకుంటున్నారనేది కలియుగ దైవం ఎరిగిన సత్యం. తన అధికారం, మీడియా అండతో లోకం కళ్లు కప్పొచ్చని చంద్రబాబు భావిస్తుండొచ్చు. కానీ సర్వాంతర్యామి అయిన శ్రీవారిని మోసగించలేమని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది.తప్పు జరిగితే వదిలేవారా?వైసీపీ హయాంలో ఏ తప్పూ జరగకపోయినా, ఏదో జరిగినట్టు ప్రజల్ని మభ్యపెట్టడంలో టీడీపీ, దాని అనుబంధ మీడియా నిమగ్న మైంది. మా హయాంలో తప్పు జరిగి ఉంటే, విడిచిపెట్టే పరిస్థితి ఉంటుందా? అనే ప్రశ్నకు... మాపై నిందలు మోపేవాళ్లు సమా ధానం చెప్పాలి. చిన్న చిన్న తప్పులకే సామాన్య ప్రజలను వీధుల్లో ఊరేగిస్తుండడాన్ని చూస్తున్నాం. అలాంటిది టీటీడీలో మేమే తప్పు చేసి ఉంటే, ఈ పాటికి రాష్ట్రమంతా ఓపెన్ టాప్ జీపుల్లో ఈ ప్రభుత్వం ఊరేగించి, అవమానించకుండా విడిచిపెట్టేదా? టీటీడీలో కొన్ని విభాగాల్లో అధికారుల తీరు వ్యవస్థీకృతమైంది. వాళ్ల తప్పుల్ని కూడా మాపై మోపి, తద్వారా వైసీపీని హిందూమత వ్యతిరేకిగా ముద్ర వేయాలనే అత్యుత్సాహంలో, కోట్లాదిమంది మనోభావాల్ని దెబ్బతీస్తున్నామన్న సంగతిని విస్మరించారు. శ్రీవేంకటేశ్వరస్వామి తన ఇలవేల్పు అనీ, అపార భక్తిశ్రద్ధలు న్నాయనీ చంద్రబాబు తరచూ చెబుతుంటారు. కానీ మాటలకూ, చేతలకూ పొంతన ఉండదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీటీడీ కేంద్రంగా టీడీపీ తన మీడియాను అడ్డుపెట్టుకుని చేస్తున్న దుష్ప్రచారమంతా, అంతిమంగా హిందువుల మనో భావాల్ని దెబ్బతీసేదే!అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ఖజానాను కొల్లగొడితే, ఆ తర్వాత మా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయన్ను అవినీతి కేసులో అరెస్ట్ చేసింది. అయితే మళ్లీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని, అధికా రుల్ని బెదిరించి, ప్రలోభపెట్టి తప్పుడు నివేదికలతో కేసులన్నీ కొట్టే యించుకుంటున్న చంద్రబాబు, స్వామివారి హుండీ సొమ్మును దొంగిలించడం తప్పని పశ్చాత్తాపం చెంది... కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని శ్రీవారి పేరుతో రాయించిన రవికుమార్ తీరులో ఆలోచించాలి. కనీసం పరకామణి చోరీ నిందితుడిలో కనిపించిన పశ్చాత్తాపం కూడా, ప్రజల సొమ్మును కొల్లగొట్టిన చంద్రబాబులో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఈ కేసులో చంద్రబాబు రాజకీయ స్వార్థానికి సతీశ్‌కుమార్ అనే నిజాయతీ కలిగిన సీఐ బలి అయ్యారు. ఇక్కడ బలి అయ్యింది కేవలం సీఐ మాత్రమే కాదు... ధర్మం, న్యాయం అనే సంగతిని మరిచిపోవద్దు. భార్య, ఇద్దరు చిన్నారులున్న సతీశ్‌కుమార్ కుటుంబ సభ్యుల ఉసురు తగలక మానదు. అలాగే చాలామంది అధికారుల్ని మానసికంగా తీవ్రంగా వేధిస్తుండడం బహిరంగ రహస్యమే. అధికారులతో పాటు రాజకీయంగా మాపై వేధింపులు కాస్తా, కక్షగా మారి, సమాజ బహిష్కరణ చేయాలనే బీఆర్ నాయుడి అహంకారపూరిత పిలుపు దిగ్భ్రమ కలిగిస్తోంది. ‘ఇలాంటి వాళ్లా అత్యంత ప్రతిష్ఠాత్మక టీటీడీకి చైర్మన్?’ అనే ప్రశ్న సమాజం మనసును తొలిచేస్తోంది.గోశాల గోవుల మరణాలుటీటీడీ ఆధ్వర్యంలో నడిచే గోశాలలో వందలాది గోవుల మర ణాలకు చంద్రబాబు, ఆయన నియమించిన బీఆర్ నాయుడి నేతృత్వంలోని పాలక మండలి మూల్యం చెల్లించుకోక తప్పదు. శ్రీవారిపై భక్తిశ్రద్ధలతో గోవుల మరణాలను నేను వెలుగులోకి తీసుకొస్తే, తప్పుల్ని సరిదిద్దుకోడానికి బదులు ఎదురు దాడికి దిగడం దివాళాకోరుతనాన్ని చూపుతోంది. గోవుల మృతిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే ఒక్కొక్కరు ఒక్కో సంఖ్య చెప్పి, అంతిమంగా నేను చెప్పింది నిజమే అని నిర్ధారించడం వాస్తవం కాదా? అసలు గోవును తల్లిగా భావించి, పూజించే పుణ్య భూమి, కర్మ భూమి మనదనే వాస్తవం తెలియక పోవడం మన దురదృష్టం.ఇక టీటీడీలో అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీవారిని దర్శించుకోడానికి క్యూ కాంప్లెక్స్‌లలో ఉన్న భక్తులకు ఉచితంగా అందాల్సిన ప్రసాదాలను, దళారులు అమ్ముకుంటున్నది వాస్తవం కాదా? అలాగే టీటీడీలో టికెట్లను బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా విక్రయించే దందా సాగుతోంది. ఇదే మా హయాంలో బ్లాక్ మార్కెట్లో టికెట్ల విక్రయానికి సంబంధించి ఎమ్మెల్సీని అరెస్ట్ చేశాం. అలాగే కొండపై నుంచి బ్లాక్ మార్కెట్లో టికెట్ల దళారుల్ని తరిమికొట్టి, స్వామిపై మా భక్తి ఏంటో చేతల్లో చూపాం. మరి మీ హయాంలో చేస్తున్నదేంటో, కొండపై అడుగడుగునా కనిపించే దళారుల దాష్టీకాలే నిదర్శనం.తిరుమల కొండపై అన్యమత ప్రచారం మాత్రమే అపచారం కాదు. కొండపై అవినీతి కూడా అపచారమే! బీఆర్ నాయుడి కార్యా లయం కేంద్రంగా సాగుతున్న అవినీతి అపచారం అంతా ఇంతా కాదు. దళారులంతా సిండికేట్‌గా ఏర్పడి, భక్తుల్ని ఇష్టానుసారం దోచుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చి, ఆనందంగా తిరుగు ప్రయాణం కావాల్సిన భక్తులు... దోపిడీకి గురయ్యామన్న ఆవేదనతో వెనుదిరగడం వాస్తవం కాదా? కంచే చేను మేసిన చందంగా, టీటీడీలో అవినీతి రహిత పాలన అందించాల్సిన బాధ్యతల్లో ఉంటూ, వాళ్లే దళారులుగా మారితే ఇక చెప్పడానికి ఏముంటుంది?అలాగే అలిపిరి సమీపంలో రోడ్డుపక్కన 12 అడుగుల విష్ణు మూర్తి విగ్రహం అత్యంత దయనీయ స్థితిలో ప్రత్యక్షం కావడం కోట్లాది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది. ఈ వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చిన పాపానికి నాపై కేసు పెట్టడం, అలాగే పోలీసులు విచారించడం దేనికి సంకేతం? సత్యం చెప్పినందుకు చరిత్రలో కళ్లు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లెందరో ఉన్నారు. అందుకే నేనెంతగానో ఇష్టపడే శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠకు భంగం కలిగితే ప్రాణాలు పోయేంత వరకూ నిజాలు మాట్లాడు తూనే ఉంటానని గతంలో చెప్పాను. ఇప్పుడూ అదే మాటకు కట్టుబడి ఉన్నాను.కొండపై మద్య మాంసాలు యథేచ్ఛగా దొరుకుతుండడం కోట్లాది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీయడం కాదా? ఈ మధ్య కాలంలో తిరుమల పోలీస్ గెస్ట్‌హౌస్ సమీపంలో మద్యం బాటిళ్లు కనిపిస్తే, వాటిని వీడియో తీసిన వ్యక్తిని, అలాగే సాక్షి ఫొటోగ్రాఫర్‌ని నిందితులుగా పేర్కొనడం కూటమి ప్రభుత్వ దురాగతానికి నిదర్శనం కాదా? ఇదే విషయమై ఆ రోజు తిరుపతి ఎస్పీ పీఆర్వో విడుదల చేసిన ప్రకటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సాయంత్రానికి మాట మార్చడాన్ని ఏమనాలి? వాస్తవాలు చెప్పడం దేశద్రోహమా?అత్యంత పవిత్రమైన, హిందువుల ఆధ్మాత్మిక రాజధాని క్షేత్రమైన తిరుమలను మద్యం, మాంసప్రియులు, దళారులకు వది లేసి, వాస్తవాలను చెప్పిన వారిపై దేశద్రోహం కేసు పెట్టడం దుర్మార్గం. అయితే న్యాయదేవత కళ్లు తెరిచి, ఆగ్రహించడంతో ఆ కేసు గాలిలో కలిసిపోయింది. శ్రీవారి విషయంలో ద్రోహి ఎవరో ప్రతి హిందువుకూ తెలుసు. కేవలం తన పార్టీకి ప్రచారకర్తగా పని చేసిన టీవీ ఛానల్ అధిపతికి ప్రతిష్ఠాత్మక టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టి, స్వామివారికి చంద్రబాబు మొదటి అపచారం చేశారు. టీటీడీ చైర్మన్‌గా శ్రీవారికి సేవ చేయడానికి బదులు, ఇంకా తాను చంద్రబాబు భక్తి ఛానల్ చైర్మన్ అనే మాయలోనే బీఆర్ నాయుడు ఉన్నారు.అందుకే కొండపై నిత్యం స్వామి వారికి అపచారం. అంతెందుకు సీఎంవో నుంచి నిత్యం వచ్చే సిఫార్సు లేఖలెన్ని? టీటీడీ చైర్మన్ కార్యాలయం నిత్యం ఇస్తున్న వివిధ రకాల దర్శనాలకు సంబంధించి వివరాలు వెల్లడిస్తే, స్వామి వారి విషయంలో వ్యాపారం చేసుకుంటున్నదెవరో తేలి పోతుంది. వాటికి సంబంధించి గోప్యత పాటిస్తున్నారంటే, ఏదో తప్పు చేస్తున్నారనే కదా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. స్వామి వారి చెంత దర్శ నాలకు సంబంధించి పారదర్శకత లేక పోవడం విమర్శలకు దారి తీస్తోంది. టీటీడీలో గతంలో ఎప్పుడూ ఇలాంటి దాపరికాలు లేవు.ఏడాదిన్నర చంద్రబాబు పాలనను గమనిస్తే మూడు అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. బాబు బ్రాండ్‌తో రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయని, అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా సాగుతున్నాయని... లేనివి ఉన్నట్టు కనికట్టు చేస్తున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని కూటమి సర్కార్ చూపుతోంది. మూడో విషయానికి వస్తే, తిరుమల కేంద్రంగా, అలాగే వైసీపీపై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి చంద్రబాబు, ఆయన్ను మోసే మీడియా ఒక తప్పుడు ఎజెండాతో ముందుకెళు తోంది. ఈ కుట్రల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వం.సంస్కరణలా? ఇబ్బందులా?సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, మొట్టమొదట శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. ఆ సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్‌లో సంస్కరణలకు తిరుమల నుంచే శ్రీకారం చుడుతున్నామని ఆర్భాటంగా ప్రకటించారు. మా హయాంలో తిరుమ లలో అన్యమత ప్రచారం జరిగిందని, ఇంకా లేనిపోని నిందలన్నీ వేసి రాజకీయ లబ్ధి పొందారు. కానీ సంస్కరణలు కాదు కదా భక్తులకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైకుంఠద్వార దర్శనం రోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా అతి తక్కువ సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకున్నారు. తిరుమల అంటే భక్తుల్లో భయాన్ని కలిగించి, ఏడుకొండలపైకి వెళ్లకుండా చేయడంలో టీటీడీ చైర్మన్, ఇతర అధికారులు విజయవంతం అయ్యారంటే అతిశయోక్తి కాదు. గత వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో సరైన భద్రతాపరమైన చర్యలు తీసుకోని కారణంగా... ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టీటీడీ చరిత్రలో ఇదో మాయని మచ్చ. ఇదంతా చంద్రబాబు నియమించిన టీటీడీ పాలక మండలి, అధికారుల చేతకానితనం వల్ల ఏర్ప డిన విపత్తు. అంతే కాదు, టీటీడీ చైర్మన్ చిన్నపిల్లాడిలా ఉన్నతాధి కారులతో గొడవ పడుతూ, పరిపాలన సవ్యంగా సాగనివ్వని పరిస్థితిని సృష్టించడం నిజం కాదా? ‘ఎవరైనా శ్రీవారికి అపచారం తలపెడితే వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే శిక్షిస్తాడని అందరూ నమ్ముతారు’ అని చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తుంటారు. బహుశా ఆయన ఈ హెచ్చరిక తనకు వర్తించదని అనుకుంటున్నారేమో! కలియుగ దైవమైన శ్రీవారికి అపచారం చేయడంలోనూ, అప్రతిష్ఠ కలిగేలా వ్యవహరించడంలోనూ చంద్రబాబు తర్వాతే ఎవరైనా, ఏమైనా! శ్రీవారి ఆది అంతాల ద్రోహి ఆయనే. టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని నాలాంటి వాళ్లు వెలికితీస్తే... అధికారాన్ని అడ్డం పెట్టుకుని దేశద్రోహం కేసులు పెట్టడానికి అత్యుత్సాహం ప్రదర్శి స్తున్నారు.కానీ ఆ వైకుంఠవాసుడు తనను ద్రోహిగా చూస్తున్నాడని ఇప్పటికైనా చంద్రబాబు గుర్తించి, భయ భక్తులతో మెలిగితే మంచిది. శిశుపాలుడికి శిక్ష విధించడానికి వంద తప్పుల్ని శ్రీకృష్ణ భగవానుడు లెక్కించారు. టీటీడీ కేంద్రంగా చంద్రబాబు తప్పుల్ని కూడా మహావిష్ణువు లెక్కిస్తుంటారు. బాబు నేతృత్వంలో స్వామి వారికి చేస్తున్న ద్రోహానికి, శిక్షించే సమయం మరెంతో దూరం లేదు. రాజకీయాల్లో అధర్మాన్ని నమ్ముకున్న చంద్రబాబును... చివరికి అదే నాశనం చేస్తుంది. ఇదే ప్రకృతి ధర్మం!భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త తిరుపతి మాజీ ఎమ్మెల్యే -
టీటీడీ అధికారులకు తలనొప్పిగా బీఆర్ నాయుడు తీరు
-
వరుస వివాదాల్లో TTD చైర్మన్, పాలక మండలి సభ్యులు
-
దేవాలయాల్లో అపచారాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా?: కారుమూరి
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ సమస్య వచ్చినా వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్ మీద విష ప్రచారం చేయడం అలవాటుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. రాష్ట్రంలో గత 19 నెలలుగా జరుగుతున్న అపచారాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ..‘పరమ పవిత్రంగా భావించే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు టీడీపీ వాళ్లకు పందేరం చేసే కుట్రలకు తెర తీశారు. రాష్ట్రంలో 4.67 లక్షల ఎకరాలు ఉన్న దేవాదాయ శాఖ భూములను అప్పనంగా దోచి పెట్టేందుకు కేబినెబ్‌లో తీర్మానం చేశారు. మూడు వేల కోట్ల మార్కెట్ విలువ ఉన్న టీటీడీ స్థలాన్ని కారుచౌకగా 25 కోట్లకు కట్టబెట్టారు. తిరుమల ఆలయ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు.దేవాలయాల పవిత్రను దెబ్బతీస్తున్నారు. పరమ పవిత్రంగా భావించే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వరుసగా అపచారాలు జరుగుతున్నాయి. తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు ఉన్నాయని చూపిస్తే.. అలా చూపించిన వారిపైనే కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఆలయాల్లో జరుగుతున్న ఘటనలకు ఏమని సమాధానం చెబుతుంది?. చంద్రబాబుకు ఏ సమస్య వచ్చినా వైఎస్సార్సీపీపై విషప్రచారం చేయడం అలవాటుగా మారిపోయింది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా.. కారుమూరి నాగేశ్వరరావు రియాక్షన్
-
టీటీడీ కల్యాణ మండపం గేట్లకు తాళాలు
-
సాక్షి ఫోటోగ్రాఫర్ పై తప్పుడు కేసు.. బుద్ధి చెప్పిన కోర్ట్
-
భక్తులను అమానవీయ రీతిలో తనిఖీలు చేయడం ఆపాల్సిందే
సాక్షి, అమరావతి: శ్రీవారి పరకామణిలో చేపట్టే సంస్కరణలపై టీటీడీ సమర్పించిన ప్లాన్–ఏపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత ఉత్తర్వుల్లో తాము పలు అంశాల్లో సంస్కరణలు అవసరమని చెబుతూ సలహాలు, సూచనలు కోరితే.. టీటీడీ మాత్రం ఎలాంటి సలహాలను తెలియజేయలేదని హైకోర్టు ఆక్షేపించింది. తాము లేవనెత్తిన ఏ అంశానికీ సమాధానం ఇవ్వలేదని తప్పు పట్టింది. శ్రీవారి పరకామణిలో కానుకల లెక్కింపును సేవగా భావించి వచ్చే భక్తులను అమానవీయ రీతిలో తనిఖీలు చేయడంపై హైకోర్టు మరోసారి అభ్యంతరం తెలిపింది.తనిఖీలపై భక్తిరీత్యా భక్తులు అభ్యంతరం చెప్పకపోవచ్చని, కానీ.. ఇది రాజ్యాంగం కల్పించిన ‘గౌరవంగా, హుందాగా జీవించే హక్కు’ను కాలరాయడమేనని స్పష్టం చేసింది. ఈ హక్కును ఎవరూ కాలరాయలేరని తేల్చి చెప్పింది. ఒకవేళ తనిఖీల్ని ఆపకుంటే.. పరకామణిలో భక్తుల చేత కానుకల లెక్కింపును ఆపేస్తూ ఉత్తర్వులిస్తామని స్పష్టం చేసింది.కానుకలు లెక్కించే చోట టేబుళ్లు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలపైనా టీటీడీ తన నివేదికలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదంది. అందువల్ల భక్తులను అమానవీయ రీతిలో తనిఖీ చేయడం, లెక్కింపు కోసం టేబుళ్ల ఏర్పాటుపై స్పష్టత తీసుకుని పూర్తి వివరాలను తమ ముందుంచాలని టీటీడీ న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ అధికారులపై క్రమశిక్షణ చర్యలు అవసరం పరకామణిలో రూ.72 వేల విలువైన 900 డాలర్ల చోరీ నేపథ్యంలో హైకోర్టు ఇటీవల పలు సంస్కరణలను ప్రతిపాదించింది. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీకి ఆదేశాలిచ్చింది. పరకామణిలో తక్షణ సంస్కరణల నిమిత్తం ప్లాన్–ఏ సమర్పించాలని టీటీడీని ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఈ వ్యవహారంపై జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మరోసారి విచారణ జరిపారు.టీటీడీ సమరి్పంచిన ప్లాన్–ఏను పరిశీలించానని, గత విచారణ సమయంలో తాను లేవనెత్తిన అంశాలు, ఆదేశాల గురించి అందులో ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. ఇది తమను అసంతృప్తికి గురి చేసిందన్నారు. పరకామణిలో చోరీ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. నిందితుడు రవికుమార్‌తో కొందరు పోలీసులు కుమ్మక్కైనట్టు సీఐడీ నివేదికను పరిశీలిస్తే తెలిసిందన్నారు. చోరీ కేసు లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్న వ్యవహారంపై తప్ప మిగిలిన అన్ని అంశాల్లో దర్యాప్తు కొనసాగించుకోవచ్చని, చట్ట ప్రకారం ముందుకెళ్లొచ్చని సీఐడీ, ఏసీబీ అదనపు డీజీలకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
Tirumala: చిరంజీవి సతీమణి సురేఖకు అవమానం...పవన్ రియాక్షన్!
-
టీటీడీ నివేదికపై హైకోర్టు సీరియస్
-
టీటీడీ పరకామణి చోరీ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి,విజయవాడ: పరకామణి చోరీ కేసులో టీటీడీ నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యామ్నాయ విధానాలను సరిగా పేర్కొనలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. భక్తుల కానుకలు పక్కదారి పట్టడాన్ని సహించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు పేర్కొంది. సలహాలు, సూచనలు తెలపకుండా ఆదేశాలు ఎలా ఇస్తామని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. -
గోవిందరాజస్వామి ఆలయ ఘటన కేసులో కీలక పరిణామం
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయ ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు కుత్తడి తిరుపతిని గత రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఆలయ గోపురం ఎక్కి.. తాను కోరినంత మద్యం ఇవ్వకుంటే కలశాలను ధ్వంసం చేస్తానంటూ హల్చల్ చేశాడు కుత్తడి తిరుపతి. జనవరి 2 రాత్రి ఏకాంత సేవ ముగిశాక ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో భక్తులతోపాటే లోనికి చొరబడిన తిరుపతి.. ఆలయం మూసేశాక కర్ర ఏర్పాట్ల మీదుగా ఆలయ గొపురం ఎక్కాడు. విజిలెన్స్ సిబ్బంది నిద్రమత్తులో ఈ విషయం గమనించలేదని తెలుస్తోంది. అయితే.. ఆ తర్వాత గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది తిరుపతిని దిగమని ఎంత బతిమాలినా వినలేదు. చివరకు.. 3 గంటలపాటు శ్రమించి నిచ్చెన సాయంతో బలవంతంగా అతన్ని కిందకు తీసుకొచ్చారు. అయితే కిందకు దిగిన తిరుపతి తొలుత తనను చంపేస్తారని బెదిరించారని.. అందుకే పైకి ఎక్కానంటూ పొంతన లేని మాటలు మాట్లాడాడు. అయితే.. మద్యం మత్తులోనే అతను ఈ అపచారానికి పాల్పడ్డాడని.. ఆధార్ కార్డ్‌ను బట్టి నిజామాబాద్‌కు చెందిన వ్యక్తిగా తిరుపతి ఈస్ట్ పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని పీఎస్‌కు తరలించిన పోలీసులు.. నిన్న రాత్రి సమయంలో జడ్జి ముందు ప్రవేశపెట్టడం గమనార్హం. ఈ నెల 12వ తేదీ దాకా రిమాండ్ విధించడంతో తిరుపతి సబ్ జైలు కు తరలించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీ ప్రతిష్ట పూర్తిగా మంటగలుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీఐపీ సేవల్లో తరలిస్తూ సామాన్యులను పట్టించుకోవడం లేదని.. పైగా వరుస అపచారాలు జరుగుతున్నా దిద్దుబాటు చర్యలు ఉండడం లేదని.. ఒక తాగుబోతు ఆలయ గోపురం మీదకు ఎక్కి కలశాలు ధ్వంసం చేసే ప్రయత్నం జరిగిందంటే విజిలెన్స్ నిఘా ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని.. మరి ముఖ్యంగా సనాతనం గురించి మాట్లాడే పవన్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించకపోవడం దారుణమంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. -
చంద్రబాబు పాలనలో ఆర్యవైశ్యులపై విచ్చలవిడిగా దాడులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోని ఆర్యవైశ్యులపై దాడులు మితిమీరిపోయాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ విజయవాడ పశి్చమ నియోజకవర్గ ఇన్చార్జి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు టీడీపీ నేతలు ఆర్యవైశ్యులపై దాడులకు పాల్పడుతున్నారని, మరోవైపు అధికారులు, పోలీసులను అడ్డంపెట్టుకుని వేధిస్తున్నారని మండిపడ్డారు. దర్శి నియోజకవర్గంలో డీలర్షిప్ వదులుకోవాలని శ్రీరామ్ వెలుగొండ రామయ్యను బెదిరించడం దుర్మార్గమన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక వీడియో విడుదల చేశారు.‘మొన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా పొదిలిలో వ్యాపారి అవినాష్, ఆయన తండ్రిపై అమానుషంగా దాడి చేసి కొట్టారు. నేడు దర్శి నియోజకవర్గంలోని గంగదేవిపల్లిలో దశాబ్దకాలంగా రేషన్ డిపో నిర్వహిస్తున్న శ్రీరామ్ వెలుగొండ రామయ్యపై వేధింపులకు పాల్పడ్డారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీలర్షిప్ వదులుకోవాలని శ్రీరామ్ వెలుగొండ రామయ్యను బెదిరించారు. లేకపోతే ఆయన కుమారుడిని కిడ్నాప్ చేస్తామని హెచ్చరించారు. వారి బెదిరింపులు భరించలేక శ్రీరామ్ వెలుగొండ రామయ్య ఇల్లు వదిలి వెళ్లి దేవస్థానంలో తలదాచుకున్నారు. టీడీపీ కూటమి నేతలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు.’ అని వెలంపల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు. బతకాలంటేనే భయపడుతున్న ఆర్యవైశ్యులు ‘రాష్ట్రంలో రోజుకు ఒకచోట ఆర్యవైశ్యులపై దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులకు రక్షణ లేదు. అసలు ఈ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులు బతకాలంటే భయపడుతున్నారు. వరుస దాడులపై ఆర్యవైశ్య సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇంత ఘోరం జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వంలోని ఆర్యవైశ్య మంత్రి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎందుకని ప్రశి్నంచడం లేదు? పొదిలిలో ఆర్యవైశ్యులపై దాడి చేసిన ఎస్ఐపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచి ఆర్యవైశ్యులపై దాడులను అరికట్టాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులమంతా కలిసి తిరుగుబాటు చేస్తాం’ అని వెలంపల్లి హెచ్చరించారు. -
బాబు పాలనలో దేవుడికే రక్షణ కరువు
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు పాలనలో దేవుడికే రక్షణ కరువైంది. ఒక ఉన్మాది తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం లోపలి నుంచి పైకెక్కి కలశాలను ధ్వంసం చేయడం, దేవుడి విగ్రహాలను కాళ్లతో తన్నడం అత్యంత ఆందోళనకరం. ఇది పూర్తిగా ప్రభుత్వం, దేవదాయ శాఖ, భద్రతా సిబ్బంది, విజిలెన్స్ అధికారుల ఘోర వైఫల్యమే. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది భక్తులు వస్తారని తెలిసినా, కనీస ఏర్పాట్లలో టీటీడీ చేతులెత్తేసింది. చివరకు గోవిందమాల స్వాములనూ అడ్డుకోవడం దారుణం’ అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు.తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు దర్శనాలు నిలిపివేయడం దుర్మార్గమని, తిరుమలకు భక్తులను రావొద్దనడం చరిత్రలో ఇదే ప్రథమమని ఆక్షేపించారు. ఆలయాల్లో తొక్కిసలాటలు, శివలింగం ధ్వంసం వంటి వరుస అపచారాలు జరుగుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు పాలనలో 20 నెలలుగా టీటీడీలో కోకొల్లలుగా అవకతవకలు జరుగుతున్నాయి. కొండపైకి మద్యం, మాంసంతో యథేచ్ఛగా వస్తున్నారు. చెప్పులు వేసుకుని దర్శనానికి వెళ్తున్నారు. అయినా, పాలక మండలి చోద్యం చూస్తోంది. వైకుంఠ ఏకాదశి నాడు ఎంతమంది వీఐపీలకు దర్శన టికెట్లు ఇచ్చారో వెల్లడించాలి’ అని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. దుర్గగుడి ఘటనకు మంత్రి బాధ్యత వహించరా? ‘విజయవాడ దుర్గగుడికి మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఘోర తప్పిదం. ఆ సమయంలో 70 వేల మంది భక్తులు ఉన్నారు. దీనికి చిన్నస్థాయి అధికారిని బాధ్యుడిని చేస్తూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. సీఎంవోకు తెలియకుండా కరెంట్ సరఫరా నిలిపివేశారా?’’ అని విష్ణు ప్రశి్నంచారు. తిరుమల లడ్డూపై దు్రష్పచారంతో రాష్ట్రానికి చెడు ‘తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ ఆరోపణలు చేసిన రోజు నుంచే రాష్ట్రానికి చెడ్డ కాలం మొదలైంది. నేడు ఆలయాలకు భద్రత లేదు, హుండీలకు భద్రత లేదు, గోశాలలో గోవులకు రక్షణ లేదు.హిందూ ధర్మాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది?’ అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. -
‘ శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో జరిగిన ఘటన దారుణాతి దారుణం’
తిరుపతి: శ్రీ గోవింద రాజస్వామి ఆలయం రాజగోపురంపై ఒక తాగుబోతు కలశాలు పైకి ఎక్కి, మందు కావాలి అంటూ డిమాండ్ చేశాడు అంటే భద్రత డొల్ల ఏస్థాయిలో ఉందో బయట పడిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. గోవింద రాజస్వామి ఆలయం లో జరిగిన ఘటన దారుణాతి. దారుణమన్నారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టిటిడి ప్రతిష్ట పూర్తి గా మంటగలిపేలా చర్యలు ఉన్నాయి. ఎంత సేపు మేము గొప్పలు చేశాము అని చెప్పుకోవడమే తప్పా, ఆలయ పరిరక్షణ కోసం చేసింది ఏమి లేదు. టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు వీఐపీ సేవల్లో తరిస్తూ పూర్తిగా ఆలయ ప్రతిష్ట మంటగలుపుతున్నాడు. తిరుమల కొండపై మద్యం, మాంసం ఎక్కడ చూసినా దొరుకుతోంది. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు చిట్టా ఎందుకు తక్కువగా ఇచ్చారు . బీఆర్ నాయుడు దర్శనాలు చిట్టా బయటపెట్టాలి. భక్తులు గోడు పట్టించుకోవడం మానేశారు. తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంలేదు. సీఎంవో నుంచి వచ్చిన సిఫార్సులు లేఖలుకే దర్శనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటే ధ్వజమెత్తారు భూమన.కాగా, టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం బయటపడింది. గత రాత్రి విజిలెన్స్ కళ్లు గప్పి ఆలయంలోకి దూరిన ఓ వ్యక్తి.. ఆలయ గోపురం పైకి ఎక్కి మద్యం ఇస్తేనేగానీ కిందకు దిగనంటూ హల్ చల్ చేశాడు. ఈ క్రమంలో కలశాలను పెకిలించే బెదిరింపులకు దిగాడు. అయితే పోలీసులు అతికష్టం మీద అతన్ని కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. -
టీటీడీ విజిలెన్స్.. మరీ ఇంత అధ్వాన్నమా? (ఫొటోలు)
-
టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం
సాక్షి, తిరుపతి: టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం బయటపడింది. గత రాత్రి విజిలెన్స్ కళ్లు గప్పి ఆలయంలోకి దూరిన ఓ వ్యక్తి.. ఆలయ గోపురం పైకి ఎక్కి మద్యం ఇస్తేనేగానీ కిందకు దిగనంటూ హల్ చల్ చేశాడు. ఈ క్రమంలో కలశాలను పెకిలించే బెదిరింపులకు దిగాడు. అయితే పోలీసులు అతికష్టం మీద అతన్ని కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారి ఏకాంత సేవ తర్వాత ఆలయం మూసివేశారు. అయితే ఆ సమయంలో భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మద్యం మత్తులో ఉన్న ఆలయంలోకి చొరబడ్డాడు. విజిలెన్స్ సిబ్బంది చూసే లోపే గోడ దూకి లోపలికి చొరబడ్డాడు. నేరుగా మహాద్వారం లోపల ఆలయ గోపురం ఎక్కాడు. అక్కడ నిల్చుని.. 90 ఎంఎల్ మద్యం బాటిల్ ఇస్తేనే కిందకి దిగనంటూ హల్ చల్ చేశాడు. అది గమనించిన విజిలెన్స్ సిబ్బంది కిందకు రావాలంటూ బతిమాలారు. చేతిలో రాడ్‌తో ఆలయ కలశాలను ధ్వంసం చేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఫైర్ సిబ్బందిని రప్పించి గోపురానికి నిచ్చెనలు వేసి తాళ్లతో బంధించి బలవంతంగా కిందకు దించారు. ఈ చర్యకు పోలీసులు మూడు గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. అదే సమయంలో.. అర్ధరాత్రి కవరేజ్‌కు వచ్చిన మీడియాపై ఫైర్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు.సదరు వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కూర్మ వాడ పెద్దమల్లా రెడ్డి కాలనీకి చెందిన కుత్తడి తిరుపతిగా గుర్తించారు. మద్యం మత్తులోనే ఆ వ్యక్తి అలా చేశాడని ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. ప్రస్తుతం అతన్ని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఆలయ కలశాలు పాక్షిక్షంగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. టీటీడీ స్పందనశ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మద్యం మత్తులో ఆలయం గోపురంపై హాల్ చల్ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. ‘‘నిన్న రాత్రి నిజామాబాద్‌కు చెందిన తిరుపతి అనే వ్యక్తి.. ఇతర భక్తులలాగే ఆలయంలోకి ప్రవేశించాడు. ఉన్నట్లుండి అతను అక్కడ ఉన్న టెంట్ కొయ్యల ద్వారా నడిమి గోపురం పైకి ఎక్కాడు. విధుల్లో ఉన్న విజిలెన్స్ సిబ్బంది అతనిని గుర్తించి పోలీసు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. మద్యం మత్తులో ఉన్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు అని టీటీడీ సీపీఆర్వో తెలిపారు. -
తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుమల: తిరుమలల వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. రేపటి నుండి సర్వదర్శనంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. దర్శన టికెట్టు లేని భక్తులకు క్యూలైన్లోకి అనుమతిస్తోంది టీటీడీ. ఉదయం వరకూ కంపార్ట్మెంట్లలో ఉంచి వేకువజాము దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 1,37,309 గా ఉందని టీటీడీ తెలిపింది. రెండు రోజుల హుండీ ఆదాయం 7.04 కోట్లుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో స్వర్ణరథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉదయం 9 నుంచి 10.30 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. బధవారం(డిసెంబర్ 31 వతేదీ) వైకుంఠ ద్వాదశి కావడంతో ఉదయం శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు సంప్రదాయబద్ధంగా చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కరిణి పరిసరాలు భక్తులతో నిండిపోయాయి.వైకుంఠ ఏకాదశి సందర్భంగా పరిమిత సంఖ్యలోనే వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించామని టీటీడీ అధికారులు తెలిపారు. మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయని, ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే రేపటి వరకు దర్శనం ఉంటుందని వెల్లడించారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనంలో భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. -
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
-
TTD: సామాన్య భక్తులకు షాక్ కొండకు రాకుండా...!
-
తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు..
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో స్వర్ణరథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉదయం 9 నుంచి 10.30 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. నేడు బధవారం వైకుంఠ ద్వాదశి కావడంతో ఉదయం శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు సంప్రదాయబద్ధంగా చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కరిణి పరిసరాలు భక్తులతో నిండిపోయాయి.వైకుంఠ ఏకాదశి సందర్భంగా పరిమిత సంఖ్యలోనే వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించామని టీటీడీ అధికారులు తెలిపారు. మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయని, ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే రేపటి వరకు దర్శనం ఉంటుందని వెల్లడించారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనంలో భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.అలిపిరి మెట్ల మార్గం ద్వారా లక్కీడిప్‌లో టికెట్ పొందిన భక్తులు మెట్టు మెట్టుకు పూజలు చేస్తూ భక్తిశ్రద్ధలతో తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుపతితో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనానికి భక్తులు కిటకిటలాడుతున్నారు.వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు: 67,053నిన్న తలనీలాలు సమర్పించిన భక్తులు: 16,301వైకుంఠ ఏకాదశి హుండీ ఆదాయం: ₹2.25 కోట్లు -
ముక్కోటి ఏకాదశి..తిరుమలలో ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున ధనుర్మాస కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసిన అనంతరం వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించారు.రాత్రి 12:05 గంటలకు అర్చకులు, జీయర్ స్వాముల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వైకుంఠ ద్వారాలను తెరిచారు. అనంతరం నిత్య కైంకర్యాలు పూర్తి చేసి వేకువజాము 1:25 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి దర్శనాలు పక్కా ప్రణాళిక ప్రకారం సజావుగా సాగుతున్నాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సోమవారం ఒక్కరోజే సుమారు 60 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామని వెల్లడించారు. దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా కేవలం 2–3 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీవీఐపీల దర్శనాలు కేవలం మూడు గంటల పాటు మాత్రమే నేరుగా వచ్చిన వీవీఐపీలకు దర్శన టికెట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. రాబోయే మూడు రోజుల కోసం ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా సుమారు 1.89 లక్షల టోకెన్లు జారీ చేసినట్లు తెలిపారు.ఉదయం 4:30 గంటల నుంచి టోకెన్లు ఉన్న భక్తులకు వారి కేటాయించిన టైమ్ స్లాట్ల ప్రకారం సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు ఈవో వివరించారు. టోకెన్లు లేని భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సోషల్ మీడియా, రేడియో అనౌన్స్మెంట్ల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టామని చెప్పారు. టోకెన్లు లేని భక్తులు జనవరి 2 నుంచి 8వ తేదీ మధ్య తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించారు.కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా దర్శనానికి పట్టే సమయం, రద్దీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు తాజా అప్డేట్స్ అందిస్తున్నామని తెలిపారు. భద్రత పరంగా సుమారు 3,500 మంది పోలీస్, విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.వైకుంఠ ద్వార దర్శనంలో ప్రముఖులువైకుంఠ ఏకాదశి సందర్భంగా అనేక మంది ప్రముఖులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కుమార్తెలు సుస్మిత, శ్రీజలతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్, సినీ నిర్మాత డివివి దానయ్య దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసులు రెడ్డి, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కూడా దర్శనం చేసుకున్నారు.నిర్మాత బండ్ల గణేష్, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ దర్శనం చేసుకున్నారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, క్రికెటర్ తిలక్ వర్మ, చాముండేశ్వరినాథ్, ఎమ్మెల్సీ భరత్, దేవినేని అవినాష్ తదితరులు వైకుంఠ ద్వార దర్శనంలో తరించారు. భక్తులు తమకు కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
జనవరి నెల శ్రీవారి ఆలయ విశేష పర్వదినాల తేదీల ప్రకటన
తిరుమల: జనవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల తేదీలన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. ఈ మేరకు జనవరి మాసం విశేష తేదీలను వెల్లడించింది. జనవరి 4న తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవంజనవరి 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొరజనవరి 12న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు సమాప్తి.జనవరి 13న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు.జనవరి 14న భోగి.జనవరి 15న మకర సంక్రాంతి, సుప్రభాతసేవ పునఃప్రారంభం.జనవరి 16న కనుమ పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు.జనవరి 18న పురందరదాసుల ఆరాధన మహోత్సవం.జనవరి 23న వసంత పంచమి.జనవరి 25న రథ సప్తమి -
Tirumala: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 13 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,823 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,660 మంది భక్తులు తలనీలాలు అరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.80 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇదిలా ఉంటే తిరుమలలో చలి తీవ్రత పెరిగిపోయింది. భక్తులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూములు దొరకని భక్తులు వెయిటింగ్ హాళ్ల వద్ద, టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద చలికి వణుకుతూ కనిపిస్తున్నారు.రేపు ముక్కోటి ఏకాదశి వేడుకలుడిసెంబరు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేట్టారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించనున్నారు. తిరుపతి స్థానిక ఆలయాల్లో పుష్పాలంకరణలకు 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 1 లక్ష కట్ ఫ్లవర్స్ ఉపయోగించనున్నారు. శ్రీ గోవిందరాజవారి ఆలయంలో…తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా వేకువజామున 12.05 నుండి 1.35 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 1.35 నుండి రాత్రి 8.45 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో…తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 2 నుండి 3 గంటల వరకు తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాలు జరుగనున్నాయి. ఉదయం 3 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు అమ్మవారికి ఆస్థానం నిర్వహిస్తారు.శ్రీనివాసమంగాపురంలో …డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 1.30 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 1.35 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 6 నుండి 7 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.అదేవిధంగా డిసెంబరు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4 నుండి 5.30 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు.అప్పలాయగుంటలో ….అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువ జామున 12.05 నుండి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 1.35 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుంది. అనంతరం రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు.డిసెంబరు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు.నారాయణవనంలో …నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేకువజామున 12.05 నుండి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 1.35 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి గ్రామోత్సవం, ఆస్థానం నిర్వహించనున్నారు.డిసెంబరు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 6 నుండి 7 గంటల గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 8:15 నుండి 9 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం జరుగునుంది. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, పిఠాపురంలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం, బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, అమరావతిలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
నేటి అర్ధరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించేందుకు టీటీడీ రంగం సిద్ధం చేసింది. జనవరి 8వ తేదీ రాత్రి 12గంటల వరకు 10 రోజులపాటు భక్తులకు వైకుంఠద్వార దర్శనం అందుబాటులో ఉంటుంది. సామాన్య భక్తులకు అధిక సమయాన్ని కేటాయిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. టోకెన్లు పొందిన భక్తులకు మూడు ప్రవేశ మార్గాల నుంచి అనుమతిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన మంగళవారం ఉదయం శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. బుధవారం ద్వాదశి పర్వదినాన వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ద్వాదశి నాడు స్వామివారి పుష్కరిణిలో స్నానాలు ఆచరించే అవకాశం కల్పిస్తారు. మొదటి మూడు రోజులు టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. వీరికి అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 11 గంటల వరకు కృష్ణతేజ ప్రవేశమార్గం నుంచి, ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏటీజీహెచ్ అతిథిగృహం నుంచి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణం ప్రవేశమార్గం నుంచి భక్తులను అనుమతిస్తాడు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఎస్ఈడీ, శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరి మూడు రోజుల్లో స్థానికులకు రోజుకు 5 వేల మందికి చొప్పున ఇప్పటికే ఈ–డిప్ ద్వారా టోకెన్లు జారీ చేశారు. ఇప్పటికే సప్తగిరులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ పది రోజులు 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, పది టన్నుల ఫలాలు, నాలుగు లక్షల కట్ ఫ్లవర్స్‌తో శ్రీవారి ఆలయంతోపాటు, అనుబంధ ఆలయాలను అలంకరించనున్నారు. ఇల వైకుంఠాన్ని తలపించేలా విద్యుద్దీప కాంతులతో శ్రీవారి ఆలయం, తిరుమల అలరారుతున్నాయి. ఆలయం వెలుపల శ్రీ రంగనాథస్వామి ఆలయ నమూనాను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులోనే అష్టలక్ష్ములను, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సెట్టింగులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు శ్రీవారి ఆలయం ఎదుట అష్టలక్ష్ములను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముక్కోటి ఏకాదశి రోజున ఆలయాల వద్ద పటిష్ట బందోబస్తు సాక్షి, అమరావతి: ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠద్వార దర్శనం కల్పించే అన్ని ఆలయాల వద్ద ఈ నెల 30న పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. రద్దీని అంచనా వేసి ఆ సమాచారాన్ని పోలీసులకు అందించాలని దేవదాయశాఖ ఈవోలను ఆదేశించింది. -
దేవుడా.. ఇదేం విడ్డూరం!
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు టీటీడీ పిడుగులాంటి వార్తను విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో దివ్య దర్శనం, టైం స్లాట్ టోకెన్ల పంపిణీని ముందుగానే నిలిపి వేసింది. టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావొచ్చని ప్రకటించింది. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని డిసెంబర్ 30వ తేదీ నుంచి పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. టీటీడీ తాజా నిర్ణయంతో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం అందని ద్రాక్షలా మారింది. ఆన్లైన్ ద్వారా మాత్రమే వైకుంఠ ద్వార దర్శన టికెట్లు ఇవ్వడం ద్వారా గ్రామీణ, చదువుకోని భక్తులకు స్వామి వారి దర్శనాన్ని దూరం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా లక్కుంటేనే వైకుంఠ ద్వార దర్శనం అంటూ ఆన్ లైన్ లక్కీ డిప్ విధానం అమలు చేయటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులకు అత్యంత పవిత్రమైన ధనుర్మాసంలో భక్తులు ఆలయాలకు వెళ్లటం ఆనవాయితీ. ముఖ్యంగా కలియుగ వైకుంఠంలో కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ నలు మూలల నుంచి భక్తులు వస్తుంటారు. అలా వచ్చే వారిలో టోకెన్లు కలిగిన వారు, లేని వారూ ఉంటారు. ఆన్లైన్లో దర్శన టికెట్లు పొందలేని భక్తులు తిరుపతిలో టైం స్లాట్ టోకెన్లు తీసుకుని స్వామి వారి దర్శనానికి వెళుతుంటారు.ఆ 3 రోజులూ తిరుమలకు రావొద్దుడిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, డిసెంబర్ 31న ద్వాదశి, జనవరి 1వ తేదీల్లో సామాన్య భక్తులు వెళ్లే సర్వ దర్శనం టోకెన్ల పంపిణీ నిలిపి వేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఆ మూడు రోజుల్లో కేవలం ఆన్లైన్లో లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందిన వారిని మాత్రమే సర్వ దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. లక్కీ డిప్ టికెట్ లేని భక్తులు ఈ మూడు రోజులు తిరుమల దర్శనానికి రావద్దని ప్రచారం చేస్తోంది. జనవరి 2 నుంచి 8 వరకు ఆఫ్‌లైన్‌లో సర్వ దర్శనం కోసం అనుమతిస్తామని ఓ ప్రకటనలో వెల్లడించింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు, నడక మార్గంలో వచ్చే భక్తులను ఉద్దేశించి సోషల్ మీడియా, దినపత్రికల్లో టీటీడీ ప్రకటనలు సైతం ఇచ్చింది. అదే విధంగా గోవింద మాల ధరించిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండవని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. మాల ధరించిన భక్తులు కూడా సర్వ దర్శనం ఆన్ లైన్ టికెట్లు ఉంటేనే అనుమతి ఇస్తామని చెబుతున్నారు. ఈ విషయం ఏపీ, తెలంగాణా, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని భక్తులకు కూడా తెలిసేలా విస్తృత ప్రచారం చేస్తున్నామని టీటీడీ ఈఓ తెలిపారు.నిర్వహణ చేతకాకేనా?గత వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో టోకెన్ల కోసం తొక్కిసలాట కారణంగా ఆరుగురు భక్తులు ప్రాణాలు కొల్పోగా, దాదాపు 40 మందికి పైగా భక్తులు గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో టీటీడీ తమ చేతికి మట్టి అంటకుండా అన్ని టికెట్లను ఆన్లైన్లో ఉంచి చేతులు దులుపుకుందని, నిర్వహణ చేతకాకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని భక్తులు విమర్శిస్తున్నారు. టీటీడీ తాజా నిర్ణయం కారణంగా తొలి మూడు రోజులు సామాన్య భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలకు దూరం అయ్యారు. లక్కీ డిప్ పేరుతో టీటీడీ పాలక మండలి భక్తుల మనోభావాలతో ఆడుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా మొదటి మూడు రోజుల తర్వాత మిగిలిన ఏడు రోజుల్లో శ్రీవారి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తామని చెబుతున్నారు.స్థానికుల పైనా వివక్ష!చంద్రబాబు పాలనలో డిప్ సిస్టమ్ ఏర్పాటు చేసి తమను శ్రీవారి దర్శనానికి దూరం చేశారని స్థానికులు, స్థానికేతరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో సుమారు 8 లక్షల మంది జనాభా ఉంటే.. కేవలం 15 వేల టికెట్లు ఇచ్చి చేతులు దులుపుకోవటం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ ఆంక్షలు విధించి టికెట్లు ఇవ్వక పోవటంపై భక్తులు మండిపడుతున్నారు. వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటించింది. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎవరికి వారు కుటుంబాలతో సహా వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైకుంఠ ఏకాదశి సమయంలో తిరుపతిలో భారీ ఏర్పాట్లు చేసి, నేరుగా భక్తులకు టోకెన్లు పంపిణీ చేశారు. క్యూలైన్లో వచ్చిన వారు వచ్చినట్లు టోకెన్లు తీసుకుని వెళ్లేవారు. స్థానికులతో పాటు అలా ఎంతో మందికి శ్రీవారి దర్శన అవకాశం కలిగింది. -
సామాన్య భక్తులకు వైకుంఠ ఏకాదశి పర్వదినాన సర్వదర్శనం నిలిపివేసిన TTD
-
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. సర్వదర్శనాలు బంద్
సాక్షి, తిరుపతి: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో మూడు రోజుల పాటు సామాన్య భక్తులు వెళ్లే సర్వదర్శనం నిలిపివేస్తున్నట్టు తాజాగా టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. గోవింద మాల ధరించిన భక్తులకు సైతం సర్వదర్శనం అనుమతి లేదని చెప్పుకొచ్చింది. దీంతో, టీటీడీ ఒంటెద్దు పోకడలపై భక్తులు మండిపడుతున్నారు. ఎన్నడూలేని విధంగా ఇలాంటి నిర్ణయాలు ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.వివరాల ప్రకారం.. వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, ద్వాదశి డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో సామాన్య భక్తులు వెళ్ళే సర్వ దర్శనం నిలిపి వేస్తున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ మూడు రోజుల్లో కేవలం ఆన్లైన్లో లక్కీడిప్ ద్వారా టికెట్లు ఎంపికైన వారిని మాత్రమే సర్వదర్శనానికి దర్శనం అనుమతి ఉన్నట్టు తెలిపింది. లక్కీ డిప్ టికెట్ లేని భక్తులు ఈ మూడు రోజులు తిరుమల దర్శనానికి రావద్దని ప్రచారం చేస్తోంది. టికెట్ ఉన్న భక్తులు మాత్రమే దర్శనానికి రావాలని టీటీడీ విస్తృత ప్రచారం మొదలుపెట్టింది. జనవరి 2 నుంచి 8 వరకు ఆఫ్ లైన్లో సర్వదర్శనం కోసం అనుమతిస్తామని ప్రకటనలో వెల్లడించింది.శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను, నడిచి వచ్చే భక్తులను ఉద్దేశించి సోషల్ మీడియా, దిన పత్రికల్లో టీటీడీ ప్రకటనలు సైతం ఇచ్చింది. అలాగే, గోవింద మాల ధరించిన భక్తులకు కూడా సర్వదర్శనం అనుమతిలేదని తెలిపింది. ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భక్తులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేస్తున్నామని టీటీడీ ఈవో తెలిపారు. కాగా, గత ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆఫ్ లైన్లో టికెట్లు కేటాయింపు ద్వారా తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే, వైకుంఠ ఏకాదశి రోజున తమకు స్వామి వారి దర్శనాన్ని దూరం చేస్తున్నారని ఆన్‌లైన్‌పై అవగాహన లేని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని ఇలా ఆంక్షలు, టికెట్లు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీటీడీ చర్యలపై భక్తులు మండిపడుతున్నారు. -
హరీ.. హరా..! సర్కారు వైఫల్యానికి ని‘దర్శనం’
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సెలవుల నేపథ్యంలో తిరుమల, శ్రీశైల క్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైంది. ఫలితంగా భక్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. దేవదేవుల దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా వసతుల కల్పన, దర్శనం కల్పనలో ప్రభుత్వం, టీటీడీ ఘోరంగా విఫలమయ్యాయి. పైగా శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్లను టీటీడీ రద్దు చేసింది.ఆన్లైన్ శ్రీవాణి దర్శన టికెట్లు పొందిన భక్తులకు యథావిధిగా దర్శనం కొనసాగుతోంది. తిరుపతిలో శుక్రవారం ఉదయం చేపట్టిన దివ్యదర్శనం టోకెన్ల పంపిణీ కొద్దిసేపటికే ముగిసింది. ఉదయం 9 గంటలకే టోకెన్లు అయిపోవడంతో భూదేవి కాంప్లెక్స్ క్యూలైన్లకు అధికారులు తాళాలు వేశారు. దీంతో భక్తులు ఉసూరుమన్నారు. తిరుపతి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద గురువారం తోపులాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం కూడా భక్తులు భారీగా తరలిరావడంతో అలిపిరి టోల్ గేట్, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణునివాసం వద్ద రద్దీ భారీగా కనిపించింది. తిరుమలలో సర్వదర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సర్వదర్శనానికి 30 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 8 గంటలు సమయం పడుతోంది. 30 నిముషాల్లో 15 వేల టికెట్లు ఎలా పూర్తవుతాయని ప్రశి్నస్తున్నారు. మల్లన్న సన్నిధిలోనూ అదే తీరు శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలోనూ మల్లికార్జున స్వామి దర్శనానికి తరలివచి్చన భక్తులు అవస్థలు పడుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం చేతులెత్తేసింది. వీఐపీల సేవలో తరిస్తున్న అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యుల తీరూ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సామాన్య భక్తులకు కనీసం తాగునీరూ అందించలేని దుస్థితి నెలకొంది. బిస్కెట్లు, అల్పాహారం, చంటిపిల్లలకు పాలూ ఇవ్వలేక దేవస్థానం చేతులెత్తేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది భక్తులు గంటల తరబడి కంపార్ట్మెంట్లలో ఉండలేక గోడలు దూకి బయటికి వచ్చేయడం గమనార్హం. భక్తుల రద్దీ దృష్ట్యా సీఆర్వో కార్యాలయం వద్ద వీఐపీ బ్రేక్ టికెట్ల కేటాయింపును దేవస్థానం తాత్కాలికంగా రద్దు చేసింది. -
ఒక్కప్పుడే బాగుంది.. ఈ ప్రభుత్వంలో తిరుమల దర్శనం అంటే నరకమే
-
భక్తుల ప్రాణాలతో చెలగాటం.. ఇంక మారవా నాయుడూ
-
శ్రీనివాస ఏంటి మాకు ఈ గోస.. తీరు మారని టీటీడీ.. భక్తుల ఆగ్రహం..
-
దేవుడా.. ఏమిటీ పరీక్ష?
తిరుపతి అన్నమయ్య సర్కిల్: ప్రభుత్వం, టీటీడీ నిర్లక్ష్యంతో భక్తులకు తిప్పలు తప్పడం లేదు. గత ఏడాది వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీ సమయంలో చోటుచేసుకున్న దుర్ఘటన నుంచి పాఠాలు నేర్చుకోలేదు. అందుకు అలిపిరి వద్ద గురువారం దివ్యదర్శనం టోకెన్ల పంపిణీ సమయంలో చోటు చేసుకున్న తోపులాటే నిదర్శనం. వారాంతపు సెలవులు రావడంతో గురువారం తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. శ్రీవారి మెట్టు నడకదారిలో తిరుమలకు చేరుకునే భక్తులు.. శ్రీవారి దివ్యదర్శన టోకెన్ల కోసం తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. పరిమితికి మించి భారీగా భక్తులు రావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భద్రతా సిబ్బంది క్యూలైన్ కౌంటర్ ప్రధాన గేటు సకాలంలో తెరవక పోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక్కసారిగా క్యూలైన్ గేటు తెరవడం, అదే సమయంలో భక్తులకు తగిన సూచనలు చేసే వారు లేకపోవడంతో టోకెన్ కౌంటర్ వద్ద తోపులాట జరిగింది. క్యూలైన్లలో అరుపులు, కేకలతో తీవ్ర ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఏమి జరుగుతుందోనని భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భక్తులు తమ పిల్లలు, కుటుంబ సభ్యుల కోసం ఇనుప కంచెపైకి ఎక్కిమరీ అరుపులు, కేకలు వేయడం, మరికొందరు కంచెను ఎక్కి టోకెన్ల కోసం పరుగులు తీయడం, భక్తులను నిలువరించేందుకు అవసరమైన సిబ్బంది లేకపోవటం వంటి పరిస్థితుల్లో కొందరికి గాయాలయ్యాయి. టీటీడీ నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం టీటీడీ తీరుపై భక్తులు మండిపడ్డారు. గురువారం తెల్లవారు జాము నుంచి టోకెన్ల కోసం తిండి తిప్పలు మాని క్యూలో వేచి ఉంటే.. మధ్యాహ్నం 12.30 గంటలకే టోకెన్ల జారీ ప్రక్రియ అయిపోయిందంటూ ప్రకటించడం... పైగా క్యూలైన్లలో అరుపులు, కేకలు, తోపులాటలు చోటుచేసుకోవడంపై భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పండుగలకు ముందు సెలవులు వస్తాయని, ఆ సమయంలోనే భక్తులు అధిక సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారని అధికారులకు ముందే తెలుసు. అయినా టీటీడీ అధికార యంత్రాంగం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోకపోవడాన్ని భక్తులు తప్పుపట్టారు. అంతా గందరగోళం అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో సాధారణ భక్తులకు ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి 15 వేల స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డి) టోకెన్లు జారీ చేస్తారు. అదే విధంగా కాలినడకన శ్రీవారిమెట్టు, అలిపిరి మెట్టు వైపు వెళ్లే భక్తులకు వేర్వేరు కౌంటర్ల ద్వారా రోజుకు 5 వేల చొప్పున 10 వేల దివ్యదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. ఈ లెక్కన ప్రతి రోజు 25 వేల టోకెన్ల జారీ జరుగుతోంది. కాగా వారాంతపు సెలవులు రావడంతో అత్యధిక సంఖ్యలో దాదాపు 50 వేల మంది భక్తులు అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌కు చేరుకోవడం, టోకెన్ల కోసం శ్రమించడంలో గందరగోళం చోటుచేసుకుంది. దాదాపు 25 వేల మంది భక్తులు టోకెన్లు పొందలేక వెనుతిరగాల్సిన పరిస్థితి చోటుచేసుకుంది. టోకెన్ల జారీ విధాన మార్పుతోనే సమస్య శ్రీవారి మెట్టు నడక మార్గంలోనే గతంలో దివ్యదర్శనం టోకెన్లు ఇచ్చేవారు. అయితే గత కొంత కాలంగా అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్‌లోనే అదనంగా కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. గురువారం కౌంటర్ వద్ద గందరగోళ పరిస్ధితి ఏర్పడటానికి అది కూడా ఒక కారణం అని భక్తులు విమర్శిస్తున్నారు. టోకెన్ల జారీ ప్రక్రియ పూర్తయిన వెంటనే మైకు ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చి ఉంటే పరిస్థితి సజావుగా సాగేదని చెబుతున్నారు. దివ్యదర్శనం టోకెన్లు లభించని వేలాది మంది భక్తులు ‘గోవిందా నీవే దిక్కు.. నీదర్శనమే మాకు మొక్కు’ అంటూ తిరుగు పయనమవడం కనిపించింది. తగిన చర్యలు తీసుకుంటాం: ఎస్పీ సుబ్బరాయుడు వారాంతపు సెలవుల నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు క్యూలైన్లలోకి రావడం వల్ల తోపులాట చోటుచేసుకుందని ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. సోషల్ మీడియాలో తొక్కిసలాట అంటూ వచి్చన వార్తల్లో వాస్తవం లేదన్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆయన టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లోని శ్రీవారి మెట్టు నడకదారి దివ్యదర్శన టోకెన్ల జారీ కౌంటర్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మొదట ఎస్ఎస్డీ టోకెన్ల జారీ ప్రక్రియ పూర్తి కావడంతో భక్తులు ఒక్కసారిగా దివ్య దర్శన టోకెన్లకు ఎగబడ్డారన్నారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మున్ముందు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎందుకొచ్చావ్.. సాక్షి ఫొటోగ్రాఫర్ సెల్‌ఫోన్ లాక్కున్న ఏవీఎస్వో తోపులాటకు సంబంధించి మీడియా కవరేజి చేస్తున్న సాక్షి ఫొటోగ్రాఫర్ కేతారి క్రిష్ణమోహన్పై అక్కడే ఉన్న ఏవీఎస్వో రమేష్ కృష్ణ దౌర్జన్యం చేశారు. ఆయనను అడ్డుకుని సెల్‌ఫోన్ లాక్కున్నారు. ‘ఎందుకొచ్చావ్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవీఎస్వో వ్యవహార శైలి తీవ్ర కలకలం రేపింది. ‘కింద స్థాయిలో అధికారులు మీడియాకు సహకరించాలి’’ అని ఉన్నతాధికారులు చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నదానికి పొంతన కుదరడంలేదంటూ పలువురు జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ యంత్రాంగం విఫలం..అడ్డదారుల్లో వచ్చే వారికి టోకెన్ పొందే అవకాశాన్ని కల్పించారు. ఉదయం నుంచి క్యూలైన్లో ఏమీ తినకుండా.. పిల్లలకు కూడా పెట్టకుండా ఇబ్బందులు పడ్డాం. సామాన్యులకు శ్రీవారి దర్శనం కల్పించడంలో టీటీడీ యంత్రాంగం విఫలం అయ్యింది. – మాధురి, భక్తురాలు (బెంగళూరు) ఏ రోజూ ఇంత దారుణంగా లేదుగోవిందమాల ధరించి వేంకటేశ్వరస్వామి దర్శనార్థం 13వ సారి 20 మంది మాలధారులతో కలిసి వచ్చాను. తీరా కౌంటర్ వద్దకు సమీపించగానే టోకెన్లు లేవని చెప్పడం తీవ్ర నిరాశ కలిగించింది. ఏ రో జూ ఇంత దారుణంగా లేదు. –రఘురామయ్య, భక్తులు (నాయుడుపేట) నిర్వహణ తీరు దారుణం..ఉదయం నుంచీ క్యూలైన్లో వేచివున్నా.. టోకెన్లు లభించకపోగా.. సెక్యూరిటీ సిబ్బందితో చేదు అనుభవం ఎదురైంది. నేను డాక్టర్‌నని చెప్పినా.. సెక్యూరిటీ సిబ్బంది ఎటువంటి గౌరవం లేకుండా నాతోపాటు మా అమ్మను తోసేశారు. నిర్వహణ తీరు దారుణంగా ఉంది. – తల్లితో డాక్టర్ వెంకటేశ్, భక్తుడు (హైదరాబాద్) ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు.. కౌంటర్ వద్దకు చేరుకునే సరికే టోకెన్లు అయిపోయాయని చెప్పారు. తీవ్ర నిరాశ ఎదురైంది. పైగా తీవ్ర తోపులాటలో కిందపడిన నా పిల్లలకు గాయాలయ్యాయి. ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. – విజయలక్ష్మి, భక్తురాలు (బళ్లారి) -
అలిపిరి క్యూలైన్లో తోపులాట.. టీటీడీపై భక్తుల ఆగ్రహం
సాక్షి, తిరుపతి: టీటీడీ నిర్లక్ష్యంతో.. ఈ ఏడాది ప్రారంభంలో తిరుమలలో జరిగిన తొక్కిసలాట భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అలిపిరి వద్ద గురువారం దాదాపు తొక్కిసలాట మాదిరి పరిస్థితులే కనిపించాయి. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దర్శన టికెట్ల జారీ నేపథ్యంలో భారీగా భక్తులు వచ్చారు. ఈ క్రమంలో.. క్యూలైన్లో తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమయంలో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది చేతులెత్తేశారు. భక్తుల్ని అదుపు చేసే పేరుతో లాఠీఛార్జ్‌కి దిగారు. అయితే.. పోలీసుల దురుసు ప్రవర్తనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపటికి భక్తులే నియంత్రించుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చూసుకున్నారు. టీటీడీ నిర్లక్ష్య ధోరణితోనే తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని భక్తులు ఈ సందర్భంగా వాపోయారు.టీటీడీపై భక్తుల ఆగ్రహం.. తోపులాట ఘటనతో భక్తులు టీటీడీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘టీటీడీ మేనేజ్మెంట్ సరిగా లేదు. వీఐపీల సేవల్లో అధికారులు మునిగిపోతున్నారు. సామాన్య భక్తుల్ని పట్టించుకోవడం లేదు. స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం మాకు ఉండకూడదా?.. భక్తులు రద్దీ దృష్టిలో పెట్టుకుని సామాన్య భక్తులకు ఇచ్చే సర్వదర్శనం టికెట్లు పెంచాలి’’ అని డిమాండ్ చేస్తున్నారు.సాక్షి సిబ్బందిపై దౌర్జన్యం.. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద పరిస్థితులను కవరేజ్ చేయడానికి వెళ్లిన సాక్షి సిబ్బందితో పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు. సాక్షి ఫోటో గ్రాఫర్ కృష్ణను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అడ్డుకోగా.. అక్కడికి వచ్చిన అలిపిరి ఎవీఎస్వో రమేష్ ఫొటోగ్రాఫర్ కృష్ణ ఫోన్ లాక్కుని దురుసుగా ప్రవర్తించారు. అంత విషాదం జరిగినా.. నిర్లక్ష్యమా?ఈ ఏడాది ప్రారంభంలో.. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట తిరుమల చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో తీవ్ర విషాదానికి దారి తీసింది. బైరాగిపట్టెడ వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. క్యూలైన్లో ఉన్నవాళ్లను ఒక్కసారిగా ఏదో పశువుల మాదిరి విడిచిపెట్టారని.. అందుకే తోపులాట జరిగిందని ఆ సమయంలో భక్తులు టీటీడీ నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. -
Tirumala: శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం ఎక్కువగా ఉంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు. బుధవారం అర్ధరాత్రి వరకు 73,524 మంది స్వామివారిని దర్శించుకున్నారు.29,989 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.88 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 10 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
-
తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)
-
Tirumala: శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం క్యూకాంప్లెక్స్‌లోని 7 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 76,903 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,612 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.64 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
టీటీడీ ఆస్తులకు రక్షణేది?: భూమన
సాక్షి, తిరుపతి: టీటీడీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. టీటీడీ పవిత్ర స్థలాన్ని 7 స్టార్ హోటళ్లకు ఇవ్వడం సరికాదన్నారు. దేవుడి ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని.. ప్రజా సంఘాలు, హిందుత్వ సంఘాలు ఆందోళనలుచేపట్టాలని భూమన పిలుపునిచ్చారు.‘‘ఎర్ర చందనం చెట్లకు కొత్తగా నెంబర్లు వేస్తున్నారు. ఒక్కో చెట్టుకు రెండు నంబర్లు వేస్తూ మోసం చేస్తున్నారు. ఎర్ర చందనం దుంగుల్ని కాపాడతానన్న పవన్ ఎక్కడ?. ఏపీ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలి’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
మొన్న ఎగ్ బిర్యాని.. నిన్న ఎగ్స్.. తిరుమలలో వరుస అపచారాలు
-
తిరుమలలో మరో అపచారం..
సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వరుస అపచారాలు చోటుచేసుకుంటున్నాయి. టీటీడీ విజిలెన్స్ వైఫల్యాలు బయటపడుతున్న నేపథ్యంలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తిరుమలలో మరో అపచారం జరిగింది. ఓ గదిలో భక్తుడి వద్ద కోడి గుడ్లను పట్టుకున్నారు. ఈ ఘటన కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం.. తిరుమలలో వరుస అపచారాలు, విజిలెన్స్ వైఫల్యాలు భక్తులను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. గత నెలలో అలిపిరి మెట్లమార్గంలో నాన్ వెజ్ తింటూ ఉద్యోగాలు పట్టుబడిన సంగతి తెలిసిందే. అలాగే, గతంలో శ్రీవారి ఆలయం ముందున్న బస్టాండులో భక్తులు ఎగ్ బిర్యానీ తింటూ దర్శనమిచ్చారు. అలిపిరిలో మద్యం, నాన్‌వెజ్ కలకలం సృష్టించింది. అంతేకాకుండా తిరుమలలో మద్యం మత్తులో యువకులు హల్చల్ చేసిన వీడియోలు బయటకువచ్చాయి. ఇక, తాజాగా తిరుమలలో కోడి గుడ్లను టీటీడీ సిబ్బంది గుర్తించారు. కౌస్తుభంలోని 538 గదిలో భక్తుడి వద్ద గుడ్లు చూసిన సిబ్బంది వారిని పట్టుకున్నారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 8 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,729 మంది స్వామివారిని దర్శించుకున్నారు.22,162 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.47 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 5 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
పరకామణిలో సంస్కరణలు తప్పనిసరి
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి పరకామణి వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టంచేసింది. హుండీల్లో భక్తులు సమర్పించే కానుకల లెక్కింపు, రవాణా, సీలింగ్, డీ–సీలింగ్, ఖాతాల నిర్వహణ వంటి అంశాల్లో ఇప్పటికీ అనుసరిస్తున్న పాత విధానాల్లో మానవ జోక్యాన్ని తగ్గిస్తూ, కృత్రిమ మేథస్సు (ఏఐ), ఆధునిక యంత్రాలు, డిజిటలైజేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సిన అవసరం ఉందని టీటీడీకి తేల్చిచెప్పింది. హుండీల్లో కేవలం డబ్బు మాత్రమే కాకుండా ఎన్నో వస్తువులు భక్తులు సమర్పిస్తారని కోర్టు గుర్తుచేసింది. ఇవన్నీ వర్గీకరించడంలో నేటి ఆధునిక యంత్రాలు, ఏఐ సాంకేతికత సమర్థవంతంగా పనిచేస్తాయని తెలిపింది. తక్షణ, శాశ్వత ప్రణాళికలను రూపొందించి వాటిని తమ ముందుంచాలని టీటీడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.సీఐడీ, ఏసీబీ దర్యాప్తునకు ఆదేశం..శ్రీవారి పరకామణి చోరీ కేసును లోక్ అదాలత్‌లో రాజీచేసుకోవడంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ తిరుపతికి చెందిన పాత్రికేయుడు ఎం.శ్రీనివాసులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే, నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు జరపాలని ఏసీబీని ఆదేశించింది. ఆ కానుకలు.. భక్తుల మనోభావాలకు ప్రతీకలు..శ్రీవారికి భక్తులు హుండీలో సమర్పించిన ప్రతి కానుక భక్తుల విశ్వాసానికి ప్రతీకగా భావించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. అందుకే వాటి భద్రత, పారదర్శక లెక్కింపునకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తున్నామని పేర్కొంది. హుండీ నిర్వహణ, కానుకల లెక్కింపులో పారదర్శకత లేకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని టీటీడీకి తేల్చిచెప్పింది. భక్తుల మనోభావాలను పరిరక్షించాల్సిన బాధ్యత టీటీడీదేనని స్పష్టంచేసింది. ఇక పరకామణి వ్యవస్థలో తక్షణ సంస్కరణల కోసం ప్లాన్–ఏ ను రెండు వారాల్లో, శాశ్వత ఆధునీకరణ కోసం ప్లాన్–బీని ఎనిమిది వారాల్లో సమర్పించాలని టీటీడీ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ప్లాన్–ఏ అమలుకు అవసరమైన నిపుణుల కమిటీలను ఏర్పాటుచేయాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కలిగిన భక్తుల సేవలను వినియోగించుకోవచ్చని సూచించింది. అలాగే, పరకామణిలో చోరీచేస్తూ దొరికిన ఓ ప్రైవేటు మఠం ఉద్యోగి సీవీ రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు జరిపిన ఆస్తుల బదలాయింపు వివరాలను సీల్డ్ కవర్లో ఒక వారంలో తమ ముందుంచాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. -
తిరుమల శ్రీవారి సేవలో కిదాంబి శ్రీకాంత్- శ్రావ్య వర్మ దంపతులు (ఫొటోలు)
-
టీటీడీ పరకామణి చోరీ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో ఏం జరిగినా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని.. ఏ ఘటన జరిగినా టీటీడీ బోర్డుదే బాధ్యత అంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. కానుకల లెక్కింపులో పారదర్శకత ఉండాలన్న ధర్మాసనం.. టెక్నాలజీని వినియోగించుకోవాలని హైకోర్టు సూచించింది.టీటీడీ పరకామణి చోరీ కేసు పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ(డిసెంబర్ 19, శుక్రవారం) విచారణ చేపట్టింది. పరకామణి లెక్కింపు వ్యవహారంలో గత విచారణలో సలహాలు ఇవ్వమన్న దానిపై ఏమైనా సలహాలు ఇస్తారా అంటూ టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. కానుకల లెక్కింపు,పర్యవేక్షణ, రికార్డుల సేకరణ కోసం AI టెక్నాలజీ, కంప్యూటర్స్ వినియోగించాలని పేర్కొంది. చివరి పైసా వరకు లెక్క సరిగ్గా ఉండాలని.. చోరీలు, మోసాలు జరగకుండా చూడాలని హైకోర్టు చెప్పింది.టీటీడీ బోర్డ్ వెంటనే వీటిపై చర్యలు చేపట్టాలని.. ఒక ముసాయిదా రూపొందించాలని పేర్కొంది. రెండు వారాల్లోగా దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. టీటీడీ బోర్డు 8 వారాల్లోగా ప్లాన్ B పై నివేదిక సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. -
తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం
-
తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థాన నిఘా వైఫల్యం మరోసారి బయటపడింది. శ్రీవారి ఆలయం ముందు ఓ రాజకీయ పోస్టర్ కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు అతి చర్యలకు దిగారు. అన్నాడీఎంకే కార్యకర్తలు ఆలయ పరిసరాల్లో జయలలిత, పళని స్వామి చిత్రాలతో కూడిన పోస్టర్‌ను పెట్టి రీల్స్ తీశారు. పోస్టర్లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత, మాజీ సీఎం పళని స్వామి చిత్రాలు ఉండటం విశేషం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఆలయ పరిసరాల్లో రాజకీయ చిహ్నాలు, ప్రసంగాలు, ప్రచారం నిషేధం ఉన్నప్పటికీ, కార్యకర్తలు అత్యుత్సాహంతో ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనను పట్టించుకోని టీటీడీ భద్రతా అధికారులు విమర్శలకు గురవుతున్నారు. ఆలయ పరిసరాల్లో భద్రతా చర్యలు కఠినంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై టీటీడీ అధికారులు స్పందించారు. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. -
460 కోట్ల టీటీడీ స్థలం బాబుపై భూమన సంచలన కామెంట్స్
-
ఇది పరకామణి చోరీ కంటే పెద్ద దోపిడి.. చంద్రబాబుపై భూమన ఆగ్రహం
సాక్షి, తిరుపతి: తిరుమల పవిత్రతను కాపాడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలం అవుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు ఏకంగా దేవుడి భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారాయన. బుధవారం తన నివాసంలో భూమన మీడియాతో మాట్లాడారు.. .. టీటీడీకి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు. దేవస్థానం భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. అలిపిరిలో సమీపంలో అత్యంత విలువైన భూముల్ని ఇచ్చేస్తున్నారు. ఎకరా రూ.26 కోట్ల రూ.52 లక్షల ఖరీదైన భూముల్ని కట్టబెట్టారు. రూ.460 కోట్ల విలువైన భూమిని ఒబెరాయ్‌కి ఇచ్చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.3 వేల కోట్ల విలువైన భూమి ఇది. 13వ తేదీన జీవోకూడా కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. 13న జీవో.. 5న రిజిస్ట్రేషన్ చేశారు. మరి ఇంకా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ సైట్లో ఎందుకు కనిపించడం లేదు?. ఎవరికి మేలు చేయడానికి రూ. 2 కోట్లు బిల్డింగ్ ఫీజుకు సర్దుబాటు చేశారు, రూ. 26 కోట్ల స్టాంప్ డ్యూటీ మాఫీ చేసేశారు. ఆ భూముల్లో భారీగా చందనపు చెట్ల ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కాకముందే చెట్లు కొట్టడం ప్రారంభించారు. ఒక బ్రాహ్మణుడు స్వామివారికి ఇచ్చిన భూమిని బాబు పందేర వేస్తున్నారు. తిరుమల పవిత్రతతను కాపాడడంలో చంద్రబాబు విఫలం అయ్యారు. వంద గదుల హోటల్‌కు భారీ ఎత్తున భూములు కట్టబెడుతున్నారు. ప్రభుత్వం దగ్గరి భూములు ఇవ్వకుండా(రెవెన్యూ ల్యాండ్).. టీటీడీ భూములు ఎలా ఇస్తారు?. గతంలోనూ హోటల్పేరు మార్చి తతంగం అంతా నడిపించింది చంద్రబాబే. దేవుడిని దోపిడీ చేసి ఒబెరాయ్‌కు ఇప్పుడు భూములు అప్పజెప్తునారు. దేవుడి ఇనాం భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెడతారు?. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు ఎలా సమర్థించుకుంటారు. వెంకటేశ్వరస్వామికి చంద్రబాబు చేస్తోంది అన్యాయం కాదా?..’’ అని భూమన మండిపడ్డారు. వంద రూమ్‌ల ఒబెరాయ్ హోటల్‌తో 1,500 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రజలకు చెప్తోంది. అదెలా సాధ్యం. ఇది పరకామణి దొంగతనం కంటే అతి పెద్ద దోపిడి. దీని వల్ల టీటీడీకి వచ్చిన లాభం ఏమిటి?. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనాడు తీసుకు వచ్చిన ఏడు కొండలు పరిధిలోనే ఈ భూములు ఉన్నాయి. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఈ భూమి ఉంది. అలిపిరి వద్ద అనుమతులు లేకుండా అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి?.. స్వామీజీలు ఇప్పటికైనా మౌనం వీడాలి. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై పోరాటం చేయాలి. ప్రత్యేక అగ్రిమెంట్ వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతి తప్పిదాలు చేశారు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలి’’ అని భూమన డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: తిరుమలలో మహాపచారం.. మద్యం, బిర్యానీ ప్యాకెట్లు లభ్యం! -
టీటీడీ నిర్లక్ష్యం.. భూదేవి కాంప్లెక్స్‌లో మందు, బిర్యానీ!
సాక్షి, తిరుపతి: ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల ఆరాధన, గోవింద నామస్మరణతో నిండిపోవాల్సిన ప్రదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యంతో అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. భూదేవి కాంప్లెక్స్ వద్ద మద్యం బాటిళ్లు, మాంసపు ప్యాకెట్లు కనిపించడం భక్తులను తీవ్రంగా కలచివేస్తోంది.మద్యం, మాంసం నిషేధం ఉన్న ప్రదేశంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘గోవింద నామస్మరణ ఉండాల్సిన ప్రదేశంలో మద్యం, మాంసం ఎలా?” అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమల పవిత్రతకు విరుద్ధంగా పదే పదే అపచారాలు జరుగుతున్నాయి. టీటీడీ విజిలెన్స్ నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.భూదేవి కాంప్లెక్స్‌లో మద్యం, మాంసం ప్రవేశం పూర్తిగా నిషేధం. అయినప్పటికీ, నిత్యం మద్యం బాటిళ్లు దర్శనమివ్వడం భద్రతా లోపాలను బహిర్గతం చేస్తోంది. టీటీడీ వెంటనే చర్యలు తీసుకుని, తిరుమల పవిత్రతను కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో మద్యం, మాంసం దర్శనమివ్వడం భక్తులలో ఆగ్రహం రేపుతూ, టీటీడీ విజిలెన్స్పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. -
ఎట్టకేలకు మోక్షం
తిరుమల: వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ ఆస్పత్రి ఆధునికీకరణకు ఎట్టకేలకు టీటీడీ కదిలింది. ఈ ఆస్పత్రిలో గత ఏడాది ఎన్నికలనాటికే 75 శాతం పనులు పూర్తయి, వినియోగానికి సిద్ధమైంది. గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం రావడంతో మిగిలిన వసతుల కల్పన పనులు నిలిపివేశారు. ఇది పూర్తయితే వైఎస్ జగన్‌కు పేరు వస్తుందన్న అక్కసుతో పనులకు అడ్డుకట్ట వేశారు. అయితే ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో ఎట్టకేలకు ఈ ఆస్పత్రిలో ఆధునిక సౌకర్యాల కల్పనకు పాలక మండలి రూ.48 కోట్లు మంజూరు చేసింది. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో వి. వీరబ్రహ్మం పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో టీటీడీ గోశాల నిర్మాణానికి కేటాయించిన 400 ఎకరాల భూమిలో 100 ఎకరాలను ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు అవసరమైన దివ్య వృక్షాలు పెంచేందుకు వినియోగించాలని ఈ సమావేశంలో టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో అంచెలంచెలుగా గోశాలకు మంగళం పాడినట్లేనని భావిస్తున్నారు. మరికొన్ని ముఖ్య నిర్ణయాలు.. » టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైన సాఫ్ట్వేర్లు, సిబ్బంది తదితర సౌకర్యాల కల్పనకు ఆమోదం. » ముంబైలోని బాంద్రాలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం »దాతల కాటేజీల నిర్వహణ, నిర్మాణాలపై నూతన విధానం తేవాలని నిర్ణయం అర్చకులు, పోటు వర్కర్ల వేతనాల పెంపు టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్న 62 మంది అర్చక, పరిచారక, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం. ఆమేరకు.. అర్చకులకు రూ.25,000 నుంచి రూ.45,000కు, పరిచారకులకు రూ.23,140 నుంచి రూ.30,000కు, పోటు వర్కర్లకు రూ.24,279 నుంచి రూ.30,000కు ప్రసాదం డి్రస్టిబ్యూటర్లకు రూ.23,640 నుంచి రూ.30,000 కు పెంపు -
శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు సమయం
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 19 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 81,345 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,150 మంది భక్తులు త లనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4 కోట్లు సమర్పించారు. టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారు స్వామి వారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. -
బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్‌పై అక్రమ ఆరోపణలు.. ఈవోకు భక్తుడి లేఖ
సాక్షి, తిరుపతి: టీటీడీ బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ చేస్తున్న అక్రమాలపై ఓ అజ్ఞాత భక్తుడు ఈవోకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల జగదీష్ అక్రమాలపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. ఈ మేరకు ఓ భక్తుడు ఈవోకు లేఖ రాశాడు. డైరెక్టర్ చేస్తున్న అక్రమాలను వివరించాడు.మెడికల్ ఇంప్లాంట్స్ కొనుగోళ్లలో టెండర్ దారులకు అనుకూలంగా మార్పులు చేసి కొందరికి మేలు చేశారు. నాణ్యత లోపించిన సర్జికల్ ఇంప్లాంట్స్ వినియోగించారు. గత మూడు నెలలుగా హాస్పిటల్లో సర్జికల్ ఇంప్లాంట్స్, మెడిసిన్స్ కొరత ఉంది. బలవంతంగా ఆన్లైన్, టెలిఫోన్ ఓపిడి రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. తెల్లవారుజామున 4 గంటలకు అపాయింట్మెంట్ ఓపిడి సేవలు ప్రారంభించడం వల్ల రోగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం, టీటీడీ చైర్మన్ అనుమతులు ఉన్నాయని జగదీష్ యదేచ్ఛగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రముఖ వైద్యులను శ్రీవారి ప్రొఫెషనల్ సేవకులుగా రాకుండా కక్ష్యపూరితంగా అడ్డుకుంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో బర్డ్ హాస్పిటల్ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర జరుగుతోంది.గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 2021లో నాసిరకం ఇంప్లాంట్స్ వాడటం వల్ల రోగులకు రెండవసారి ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాక డాక్టర్ జగదీష్ పై ఉన్న రెండు విజిలెన్స్ కేసుల పై చర్యలు తీసుకోవాలి. మార్కెట్ రేటు కంటే ఎక్కువ మొత్తంలో ఇంప్లాంట్స్ కొనుగోలు చేసి 11 కోట్ల రూపాయల నష్టం కలిగించారు. ఇలాంటి ఘటనలతో ప్రభుత్వానికి అధిక మొత్తంలో ఆర్థిక నష్టం జరుగుతోంది. గత 15 ఏళ్లలో దిగుమతి చేసిన సర్జికల్ ఇంప్లాంట్ల ధరలను పెంచి కొనుగోలు మార్గాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు. మొత్తం ఆర్థిక నష్టం సుమారు 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.డాక్టర్ గుడారు వ్యక్తిగత సద్భావన, ప్రజా సంబంధాలను పెంచుకోవడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పేరు, ప్రతిమను ఉపయోగించారు. వారి స్వీయ ప్రచారం కోసం సంస్థాగత పవిత్రతను తీవ్రంగా దెబ్బతీశారు. ఈ ఆరోపణలన్నింటిపై విజిలెన్స్ విచారణ జరపాలి. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని లేఖలో అజ్ఞాత భక్తుడు ఈవోను కోరాడు. -
2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు
సాక్షి, అమరావతి: ఈ విడత గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి జూలై 7 తేదీల మధ్య 12 రోజులు జరపనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం మేరకు పరిశీలనల అనంతరం పుష్కరాల నిర్వహణకు తేదీలను ఖరారు చేస్తున్నట్టు దేవదాయశాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి హరిజవహర్‌లాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
బాబు హయాంలోనే పట్టు వస్త్రాల స్కామ్.. విజిలెన్స్ నివేదికలో బయటపడ్డ సంచలన నిజాలు
-
జాంబవంతుడి శోభ.. అజ'రామ'రం
రాజంపేట: ఆంధ్రా అయోధ్యగా వెలుగొందుతున్న అన్నమయ్య జిల్లాలోని ఏకశిలానగరం(ఒంటిమిట్ట)లో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. రామాలయం అత్యంత సమీపంలో ఉన్న ఒంటిమిట్ట చెరువులో ఏర్పాటు చేసేందుకు టీటీడీ తన మాస్టర్‌ప్లాన్‌లో తీసుకువచ్చింది.పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలిలో 600 జయంత్యుత్సవాల సందర్భంగా 108 అడుగుల అన్నమయ్య విగ్రహం రాజంపేటకే ల్యాండ్‌మార్క్‌గా మారింది. అదే తరహాలో ఏకశిలానగరంలోని చెరువులో జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు చేస్తే.. అదే భవిష్యత్తులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారనున్నది. ఇప్పటికే దాశరథి కల్యాణ మండపం సమీపంలో నామమాత్రంగా జాంబవుంతుడి విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చెరువులోనే ఎందుకు? పురాణ, ఇతిహాసాల చరిత్ర ఆధారంగా ఒంటమిట్ట వద్ద జాంబవంతుడి విగ్రహం ఏర్పాటుకు టీటీడీ సన్నాహాలు ప్రారంభించింది. రామాయణం, భాగవతం కథనాల ప్రకారం జాంబవంతుడు.. బ్రహ్మదేవుడి ఆవలింత నుంచి పుట్టిన యోధుడు భల్లూకరాజుగా గుర్తింపు ఉంది. రామాయణంలో కూడా శ్రీరాముడితో కలిసి లంక యుద్ధంలో పోరాడిన జాంబవంతుడు శక్తియుక్తులు చాటారు. హనుమంతుడి శక్తిని గుర్తు చేసి, సీతాదేవిని వెతకడానికి ప్రేరేపించిన మహాబలశాలి మాత్రమే కాకుండా, వివేకవంతుడని ప్రస్తావించారు.శ్రీ కృష్ణుడికి శమంతకమణి ఇవ్వడంతోపాటు తన కుమార్తె జాంబవంతిని కూడా ఇచ్చి వివాహం చేశాడట. కృతయుగం నుంచి ద్వాపరయుగం వరకు జీవించినట్లు చరిత్ర చెబుతోంది. పురాణాల ప్రకారం ఈ ఏకశిల విగ్రహాలను జాంబవంతుడు ప్రతిష్టించారని ఒక కథనం. అందుకే ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి కోవెలకు ల్యాడ్మార్క్గా జాంబవంతుడి 108 అడుగుల విగ్రహం నిలవనున్నదనే భక్తుల మనోగతం. 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని... రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమిని అధికారిక పండుగగా నిర్వహించే ఏకశిలానగరం ఒంటిమిట్ట రామాలయం అభివృద్ధిపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి కేంద్రీకృతం చేసింది. 50 ఏళ్లను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆ దిశగా మాస్టర్‌ప్లాన్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మ్యూజియం: భక్తుల కోసం కల్యాణ కట్ట, పుష్కరిణి, నక్షత్రవనాలు, గార్డెనింగ్, పచ్చదనం, ఆధ్యాతి్మక చిహా్నలు, శ్రీ కోదండరామస్వామి ప్రాశస్త్యం నవతరానికి అందించేలా మ్యూజియం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉద్యానవనాలు, సాంకేతికతను జోడించి డిజిటల్ స్క్రీన్స్, హనుమంతుడి సేవానిరతి, సాంస్కృతిక కళామందిరం,తోరణాలు ఏర్పాటు చేయనున్నారు. పెరుగుతున్న యాత్రికుల అంచనాతో..పెరిగే యాత్రికుల సంఖ్యను అంచనా వేసి, ఆలయ పరిసరాలు ఎలా ఉండాలి, భక్తులకు సరిపడేలా సదుపాయాలు, వసతి రవాణా, చారిత్రక నేపథ్యం ఉట్టిపడేలా, ఆధ్యాత్మిక, మరింతగా భక్తులు వచ్చేలా ముందస్తు ప్రణాళిక ఉండాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచనలు అందాయి. నిత్యఅన్నదాన పథకం అమలు చేయడానికి వీలుగా అన్నదానసత్రం, వసతుల కోసం రూ.4.35 కోట్లు ఇప్పటికే మంజూరు చేశారు. ఆధ్యాత్మిక క్షేత్రంగా.. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లనున్నది. కడప–తిరుపతి మార్గంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవనున్నది. ఒంటిమిట్ట చెరువు జాతీయ రహదారి పక్కనే రామాలయం ఉంది. రహదారి మరో పక్క జిల్లాలోనే అతిపెద్ద చెరువు ఉంది. 2014లో రాష్ట్ర విభజనం అనంతరం శ్రీ కోదండరామాలయం ప్రభుత్వ అధికారిక రామాలయంగా మారింది. శ్రీరామనవమి ఉత్సవాలలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువ్రస్తాలు తీసుకురావడం సంప్రదాయంగా పాటిస్తున్నారు. ప్రణాళికలో.. మాడవీధులు, రథశాల, పుష్కరిణి, సంజీవరాయస్వామి ఆలయం, మాలఓబన్న స్థూపం, శృంగిశైలం, సత్రపాళెం, కొండ, రామలక్ష్మణ తీర్థాలు, కల్యాణ వేదిక ప్రాంతాల అభివృద్ధి, సుందరీకరణకు ప్రణాళిక రూపొందించారు. ఆగస్టు 23న ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అనిల్‌కుమార్ బృందం ఒంటిమిట్టను పరిశీలించిన సంగతి విదితమే. అభివృద్ధికి విశేష కృషి ఏకశిలానగరాభివృద్ధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మార్క్ బాగా కనిపిస్తుందని రామభక్తుల మనోగతం. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం అధికారిక రామాలయంగా ప్రకటించారు. టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్ తొలినాళ్లలో రూ.100 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌తో రామాలయం అభివృద్ధికి టీటీడీ తరఫున అడుగులు వేశారు. ఆనాటి మాస్టర్‌ప్లాన్‌తో ఇప్పటి రామాలయం శోభ సాక్షాత్కరిస్తుంది. మళ్లీ ఆయనే టీటీడీ ఈవోగా రావడంతో 50 ఏళ్లను ముందుగానే దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసేలా పాలకమండలి సహకారంతో నిర్ణయాలు టీటీడీ తీసుకునేలా, అధికారులను సమాయత్తం చేశారు. ఇప్పుడు ఒంటిమిట్ట చెరువులో 108 అడుగుల జాంబవంతుడివిగ్రహం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవడానికి ఈవో కారకులయ్యారని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పవన్‌పై అంబటి వ్యంగాస్త్రాలు
సాక్షి,గుంటూరు: పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ ఏ ధర్మాన్ని పాటిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.వైఎస్ జగన్‌పై కూటమి నేతలు విషప్రచారం చేస్తున్నారు. దేవుడిని అడ్డం పెట్టుకొని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్ ధర్మాన్ని ఆచరించే వ్యక్తి. వైఎస్సార్సీపీ హయాంలో పరాకామణి భవన నిర్మాణం జరిగింది. కూటమి ప్రభుత్వంలో దేవాలయాల్లో భక్తులు చనిపోయారు. దేవాలయాల్లో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణిస్తే పవన్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. తిరుమల లడ్డూపై పవన్ అసత్య ప్రచారం చేసి టీటీడీ పరువును అప్రతిష్టపాలు చేశారు. చంద్రబాబు అనేక దుర్మార్గాలు చేస్తున్నారు. సనాతన ధర్మం పేరుతో పవన్ రోజుకో వేషం వేస్తున్నారు. చంద్రబాబుకు చెంచాగిరి చేస్తున్నారు. 2003లో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చిందెవరు?. విజయవాడలో 40 దేవాలయాల్ని కూల్చిందెవరు? చంద్రబాబు తన ప్రచార పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు తీశారు. చంద్రబాబును ప్రశ్నించే దమ్ము పవన్‌కు లేదు. చంద్రబాబు,పవన్ ఎంత బురద జల్లిన వైఎస్ జగన్‌కు అంటుకోదని స్పష్టం చేశారు. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. మంగళవారం అర్ధరాత్రి వరకు 70,901 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ. 3.96 కోట్ల ఆదాయం వచ్చింది.టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన భక్తులను అనుమతించమని వెల్లడించింది. -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి దర్శనానికి 15 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. సర్వదర్శనానికి 10 గంటలు. ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,142 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 26,619 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్లు. -
నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం. నిన్న శ్రీవారిని 75,343 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 26,505 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.69 కోట్లు. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత సర్వదర్శనానికి 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శనివారం అర్ధరాత్రి వరకు 82,007 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 39,154 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ. 3.13 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల్లో దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 15 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన భక్తులను అనుమతించమని వెల్లడించింది. -
చంద్రబాబు ప్రభుత్వానికి సీఐడీ అధికారులు తలొగ్గారు: భూమన
తిరుపతి: పరకామణి వ్యవహారంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా సీఐడీ విచారణ జరిగిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీద నాకు గౌరవం ఉందన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు, మంత్రులు తప్పుడు ప్రచారం చేశారు. బీఆర్ నాయుడు, పట్టాభి, వర్ల రామయ్య అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు’’ అని ఆయన మండిపడ్డారు.‘‘మీ దగ్గర ఆధారాలు ఉంటే మిమ్మల్ని విచారణకు ఎందుకు పిలవలేదు?. టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్నవారిని ఎందుకు విచారించలేదు?. చంద్రబాబును సంతృప్తి పరచడం కోసం కేవలం నన్ను మాత్రమే విచారణకు పిలిచారు. ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి మేరకు మాత్రమే సీఐడీ అధికారులు విచారిస్తున్నారు...చంద్రబాబు ప్రభుత్వానికి సీఐడీ అధికారులు తలొగ్గారు. మమ్మల్ని నిందితులుగా నిరూపించడం కోసం ప్రయత్నిస్తున్నారు. విచారణ మొత్తం రికార్డ్ చేసి మా దగ్గర సంతకాలు తీసుకోలేదు. మా దగ్గర సంతకాలు ఎందుకు తీసుకోలేదు. చంద్రబాబుకు న్యాయస్థానాల మీద గౌరవం లేదు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందలా?
తనకు అనుకూలంగా లేకుంటే వ్యవస్థలపై దాడి చేయించడం చంద్రబాబుకు పరిపాటే. ఏకంగా న్యాయవ్యవస్థపైనే దాడి చేస్తున్నారు. తిరుపతి జడ్జి, లోక్ అదాలత్ జడ్జిపైనే కాకుండా, ఒక సుప్రీం కోర్టు పెద్ద జడ్జి ఒత్తిడి తెచ్చారని దుష్ప్రచారానికి తెగబడ్డారు. పెద్ద జడ్జిల గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు సమస్య పరిష్కారంలో భాగస్వామ్యం అవ్వడం తప్పా?’’ - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘‘జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల లడ్డూ ప్రసాదాలు తయారు చేశారని.. వాటిని భక్తులు తిన్నారని అన్నావ్..! వాటికి ఆధారాలు దొరికాయా..?’’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల వెంకటేశ్వరస్వామి విశిష్టతను అభాసుపాలు చేస్తావా బాబూ? అంటూ మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. బెయిల్‌పై ఉన్న చంద్రబాబు షరతులను ఉల్లంఘిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతి కేసులను తీసేయించుకుంటున్నారని తూర్పారబట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా బాబూ..? చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా! టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. వాటిని భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా? కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ట్యాంకర్లు ప్రసాదం తయారీ కేంద్రంలోకి వెళ్లాయా? వీటికి ఆధారాలున్నాయా? టీటీడీలో ఒక బలమైన తనిఖీ వ్యవస్థ (రోబస్ట్ ప్రొసీజర్) ఉంది. టీటీడీకి వచ్చే ఏ నెయ్యి ట్యాంకర్ అయినా ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లా»ొరేటరీస్) సర్టిఫికేషన్‌తోనే రావాలి. ఇది దశాబ్దాలుగా టీటీడీలో పాటిస్తున్న నిబంధన. ఈ సర్టిఫికెట్ లేకుండా తిరుమలలోకి ట్యాంకర్లు రావు. ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ ఒక్కటే సరిపోదు. టీటీడీకి ఒక సొంత ల్యాబ్ కూడా ఉంది. ఆ ల్యాబ్‌లో మళ్లీ టెస్టు పాస్ అయితేనే ట్యాంకర్ లోపలికి వెళ్తుంది. ఈ స్టాండర్డ్స్ లేకపోతే నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించి, వెనక్కి పంపిస్తారు. ఇలా గతంలో చంద్రబాబు హయాంలో 15 సార్లు వెనక్కి పంపించారు. వైఎస్సార్ సీపీ హయాంలో 18 సార్లు వెనక్కి పంపారు. టీటీడీలో బలమైన తనిఖీ వ్యవస్థ ఉందని, సమర్థవంతంగా పని చేస్తుందని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. అలాంటప్పుడు తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడిది? కల్తీ నెయ్యి వాడితే నీ వైఫల్యం కాదా బాబూ? చంద్రబాబు హయాంలో, ఆయన నియమించిన టీటీడీ ఈవో టైమ్స్ నౌలో(ఈవో మాట్లాడిన వీడియో ప్రదర్శించారు) స్వయంగా ఆ ట్యాంకర్ల నెయ్యిని వినియోగించలేదని చెప్పారు. సెపె్టంబర్ 20, 2024న చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నియమించిన టీటీడీ ఈవో.. నాలుగు నెయ్యి ట్యాంకర్లు టెస్టులు పాస్ కాకపోవడంతో రిజెక్ట్ చేసి వెనక్కి పంపించామని ప్రకటించారు. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన హయాంలో జూలైలో∙4 ట్యాంకర్లు తిప్పి పంపారు. మళ్లీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయట! మరి అప్పుడు సీఎం ఎవరు? చంద్రబాబు కాదా..? ప్రభుత్వాన్ని నడిపేది ఆయన కాదా..? గతంలో రిజెక్టు చేసిన నెయ్యి ట్యాంకులు ఆగస్టులో తిరిగి వచ్చాయని, లడ్డూ ప్రసాదంలో వినియోగించారని సిట్ రిమాండ్ రిపోర్టులో రాసింది. అలాంటప్పుడు ఇక్కడ ఎవరిని లోపల వేయాలి? ఇదే నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఆ నెయ్యి ట్యాంకులు ఎలా తిరిగి వచ్చాయి? చంద్రబాబు చెప్పినట్టుగా ఆ నెయ్యిని వాడి ఉంటే అది ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రస్తుత టీటీడీ చైర్మన్, అప్పటి టీటీడీ ఈవో ఇద్దరూ ఏం చేస్తున్నారు? వాళ్లిద్దరిపై కేసులు పెట్టి ఎందుకు అరెస్టు చేయలేదు? పైగా మాపై నిందలు వేస్తారా? చంద్రబాబు ముఠాకు దేవుడంటే భయం, భక్తీ లేదు. దుర్మార్గమైన అసత్యాలు ప్రచారం చేయడమే వీళ్ల పని. పైగా చంద్రబాబు వేసిన సిట్.. వ్యక్తులను ఇరికించాలనే ఆరాటం, తపన, తాపత్రయంతో తప్పులపై తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. 2014–19 మధ్య కిలో నెయ్యి రూ.276–రూ.314మరి అదంతా కల్తీ నెయ్యేనా బాబూ? స్వచ్ఛమైన నెయ్యి రూ.320కే మీరు ఎలా సప్లయ్ చేయిస్తారు? అని చంద్రబాబు, ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నలు వేశారు. నాణ్యమైనది కావాలంటే కిలో రూ.3 వేలు అవుతుందని ప్రకటించారు. చంద్రబాబు గెజిట్ పత్రిక ఈనాడు అయితే కనీసం రూ.1,000–రూ.1,600 అని రాసింది. మరి టీటీడీలో ఇప్పుడు నెయ్యి ఎంతకు కొంటున్నారు? రూ.3 వేలు ఇస్తున్నారా? రూ.1,600 లేక రూ.1,000 ఇచ్చి కొంటున్నారా? 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ కిలో నెయ్యి రూ.276–314 మధ్య కొన్నాడు. ఇది రూ.320 కంటే తక్కువ కదా? కాబట్టి అదంతా కల్తీ నెయ్యేనా? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. పైగా భోలే బాబా డెయిరీ విషయంలో చేస్తున్న దు్రష్పచారం అంతా ఇంతా కాదు. 2018 జూన్ 26న టీటీడీ బోర్డు మినిట్స్ చూస్తే భోలేబాబా ఎవరో తేలింది. హర్‡్ష ఫ్రెష్ డెయిరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్.. భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మారింది. ఈ సంస్థ టీటీడీకి పాలు సప్లై చేయడానికి డీమ్డ్ టు క్వాలిఫై అని సర్టిఫై చేసింది చంద్రబాబు హయాంలోనే. తిరుమలకు నెయ్యిని అనేక కంపెనీలు సప్లయ్ చేస్తుంటాయి. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలుస్తుంటారు. ఎవరు తక్కువకు కోట్ చేస్తారో వారి దగ్గర నుంచి కొంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రొసీజర్. టెండర్లలో ఎల్–1 ఎవరుంటారో వారికి కేటాయిస్తారు. ఇందులో రాజకీయ ప్రమేయం ఉండదు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడానికి వీళ్లు ప్రయతి్నస్తున్నారు. నెయ్యిని సప్లై చేసే ఏ కంపెనీ అయినా కచ్చితంగా ఏన్‌ఏబీఎల్ సర్టిఫికెట్ తీసుకోవాలి, టీటీడీలో ఉన్న ల్యాబ్‌లో టెస్టులు పాసవ్వాలి. అప్పుడే ట్యాంకులు లోపలకు వెళ్తాయి. దుష్ప్రచారం ఆపాలని సుప్రీంకు వెళ్లింది మేం కాదా? టీటీడీ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం ఆపాలని, నిజాలు బయటకు తీసుకురావాలని సుప్రీం కోర్టుకు వెళ్లింది వైవీ సుబ్బారెడ్డే. అంతేగానీ టీడీపీ వాళ్లు కాదు. అలాంటిది.. సుబ్బారెడ్డిపై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి ఇంటికి ఎప్పుడైనా వెళ్లారా? హైదరాబాద్‌లో ఆయన ఇంట్లోనే గోపూజ జరుగుతుంది. ఆయన 1978 నుంచి 35–40 సార్లు అయ్యప్పమాల ధరించి కొండకు వెళ్లి ఉంటారు. అందులోనూ ఆయనది గురుస్వామి స్థానం. అలాంటి వ్యక్తిపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో మీకే తెలియాలి. టీటీడీలో స్కాములన్నీ బాబువే! పరకామణి కేసులో దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ రూ.72 వేల విలువైన అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ ఓ వ్యక్తి దొరికిపోయాడు. ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు రూ.14 కోట్లు విలువైన ఆస్తులను దేవుడికి ఇవ్వడం తప్పు అవుతుందా? దేశంలో అనేక చోట్ల, అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి. కానీ, ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. తిరుపతి కోర్టులో చార్జిషీట్ వేశారు. మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు. అన్నీ కోర్టుల పరిధిలో ప్రాపర్ కోర్టు ప్రొసీజర్‌తో జరిగాయి. జ్యుడీషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. ఇందులో సాంకేతిక పరమైన అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు తప్పులేదు. కానీ, రాజకీయాల కోసం ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నాడనో.. భూమన కరుణాకర్‌రెడ్డి ఉన్నాడనో.. వారి మీద బురదజల్లాలని తప్పుడు స్టేట్మెంట్ కోసం అక్కడ పనిచేస్తున్న బీసీ పోలీస్ అధికారిని వేధించి, వెంటాడి, బెదిరించి, చివరకు ఆయన చనిపోయేలా చేశారు. ఆ మరణానికి ఎవరో కారణం అంటూ ఎల్లో మీడియా చేత తప్పుడు కథనాలు రాయించారు.మీ హయాంలో పట్టుకోలేదేం బాబూ? ఆ దొరికిన దొంగ... 30 ఏళ్ల నుంచి జీయర్ స్వామి మఠంలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. పరకామణి లెక్కింపులో ఎన్నో ఏళ్ల నుంచి పాల్గొంటున్నాడు. కొత్తగా మా ప్రభుత్వంలో వచి్చన వ్యక్తి కాదు. మరి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు పట్టుకోలేకపోయారు? ఆ దొంగను మేం పట్టుకున్నాం. వాస్తవానికి మేం వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో తిరుమల హుండీ డబ్బు లెక్కింపు ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేశాం. దేవుడి సొమ్ము దొంగల పాలు కాకూడదని రూ.23 కోట్లు ఖర్చు పెట్టి కొత్త పరకామణి బిల్డింగ్ కట్టాం. అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశాం. దాన్ని సీఎం హోదాలో నేను ప్రారంభించా. 2023 ఫిబ్రవరి 5 నుంచి ఆ బిల్డింగ్‌లో పూర్తి స్థాయి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పాత భవనంలో అరకొరగా సీసీ కెమెరాలు ఉండేవి. రికార్డింగ్ క్వాలిటీ కూడా తక్కువే. బ్లయిండ్ స్పాట్స్ ఎక్కువ. వాటిని అన్నింటినీ మారుస్తూ కొత్త భవనంలో 360 డిగ్రీల కవరేజ్‌తో 4కే హెచ్డీ సీసీ టీవీ వ్యవస్థలు, హైబ్రీడ్ నైట్ విజన్ కెమెరాలు, ఎక్కువ రోజులు డేటా ఉండేలా మల్టీ టీమ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ తెచ్చాం. ఇవన్నీ చేసిన తర్వాత ఏప్రిల్ 4, 2023లో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు మంచివారు? ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించినందుకు మాపై నిందలా..? ఆ వ్యక్తి దశాబ్దాలుగా ఇదే పనిచేస్తున్నాడని అనుకోవచ్చు. కానీ చంద్రబాబు హయాంలో ఎవరూ పట్టుకోలేదు. మా హయాంలో పట్టుకున్నాం. గతంలో ఏం జరిగిందో దేవుడికే తెలుసు. రూ.72 వేల విలువైన అమెరికన్ డాలర్లు దొరికితే.. ఏకంగా రూ.14 కోట్ల ఆస్తిని ఆ కుటుంబం దేవుడికి రాసిచ్చింది. న్యాయ వ్యవస్థపైనే దాడి..! చంద్రబాబు తనకు అనుకూలంగా లేకుంటే వ్యవస్థలపై సైతం దాడి చేయించడం పరిపాటే. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, అధికార ప్రతినిధి వర్ల రామయ్యతో మాట్లాడిస్తున్న మాటలు న్యాయ వ్యవస్థపై దాడి చేయించినట్లే! (వర్ల వీడియోను ప్రదర్శించారు)! ‘‘23–9–2025: ప్రాపర్టీ ఓనర్ ఎవరు? కోర్టు కూడా తప్పు చేసిందా.. అనుమానం వస్తుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కోరుతున్నా.. మీ తరఫున దర్యాప్తు చేయించాలి. ఈ కేసులు సీరియస్. ఎందుకు లోక్ అదాలత్‌తో దర్యాప్తు చేయిస్తారు? తిరుపతిలో రూమర్స్ వస్తున్నాయి. ఈ జడ్జిగారికి పైనుంచి ఎవరో మరో జడ్జి చెప్పారట. నేను జడ్జి ఎవరని అడగట్లేదు. అందరం మనుషులమే. ఈ జడ్జికి పైనుంచి ఎవరో జడ్జి చెప్పారట. ఏ జడ్జి చెప్పినా.. ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేసినా.. అన్యాయం జరిగింది మాత్రం స్వామి వారికే. 13–11–2025: తమిళనాడులో రిజిస్టర్ చేశారట ఆస్తులు. దీని వెనుక జడ్జి ఉన్నారని చెబుతున్నారు. రూ.50 లక్షల స్టాంపు డ్యూటీ కట్టారట. ఆ రూ.50 లక్షలు ఎవరు కట్టారు? జడ్జిలు, టీటీడీ అధికారులపై నిందలు సిగ్గుచేటు.. ఇలా ఏకంగా న్యాయవ్యవస్థపైనే చంద్రబాబు దాడి చేస్తున్నారు. తిరుపతి జడ్జి, లోక్ అదాలత్ జడ్జిపైనే కాకుండా, ఒక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి ఒత్తిడి తెచ్చారని దు్రష్పచారానికి తెగబడ్డారు. పెద్ద జడ్జిల గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు సమస్య పరిష్కారంలో భాగస్వామ్యం అవ్వడం తప్పా? తిరుమలకు పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తుంటారు. ఇలాంటి కేసులు ఏమైనా జరిగినప్పుడు తిరుపతిలో ఉన్న జడ్జిలు, సుప్రీం కోర్టు జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటారు. ఇలాంటి ముఖ్యమైన కేసుల్లో, దేశం మొత్తం చూస్తున్న కేసులో సలహాలు కోరతారు. జ్యుడీషియల్ పరిధిలో సలహాలు తీసుకుంటారు. ఏ తప్పూ జరగలేదు, ఏ తప్పూ చేయలేదు కాబట్టి సలహాలు తీసుకొని, ఇంప్లిమెంట్ చేశారేమో..! దాంట్లో రాజకీయం చేయడానికి ఏముంది? జడ్జిలపై, టీటీడీ అధికారులపై నిందలు వేయడం సిగ్గుచేటు. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా? టీడీపీ స్టాండ్ ఎలా ఉంటుందంటే.. ఈ ఏడాది సెపె్టంబర్ 1న చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే, అత్యంత విశిష్టత కలిగిన సింహాచలంలో రూ.55 వేలు హుండీ డబ్బులు చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డారు. ఉద్యోగి రమణను సస్పెండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ ను పోలీసులకు అప్పగించి, ఆ వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఆ వ్యకిని ఎందుకు జైల్లో పెట్టలేదు? మరి చంద్రబాబు దీనిపై ఎందుకు విచారణ చేయలే దు? మొత్తం వారిద్దరి ఆస్తులపై విచారణ చేసి, వాటిని మొత్తం ఎందుకు స్వా«దీనం చేసుకోలేదు? పైగా సింహాచలం ఆలయానికి ధర్మకర్త టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి చైర్మన్‌గా ఉంటే ఒక న్యాయం..! అదే అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా ఉంటే ఇంకో న్యాయం..! మరి ఆయన మీద విచారణ ఎందుకు చేయడం లేదు? ఎక్కడైనా న్యాయం ఒక్కటే కదా!!టీటీడీలో బాబు స్కాములు ఇవీ...!రాష్ట్రంలో దేవుడి సొమ్ముతో స్కామ్‌లు చేసింది చంద్రబాబే. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిలతీర్థం వరకు శ్రీనివాస సేతు 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిపాదన చేశారు. ఇందులో 67 శాతం ఖర్చు టీటీడీ, 33 శాతం ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించారు. అప్పటి తిరుపతి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను చంద్రబాబు పిలిపించుకుని రూ.684 కోట్లతో శ్రీనివాససేతు కట్టేయమని చెప్పారు. అయితే, ఆ మీటింగ్‌లో టీటీడీ ప్రతినిధులు లేకుండానే.. ఏకంగా 67 శాతం డబ్బులు టీటీడీ నుంచి తీసుకునేలా నిర్ణయం తీసేసుకున్నారు. అసలు బోర్డు అనుమతి, ఆమోదం లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు? ఇది కాదా స్కామ్? మన ప్రభుత్వం వచ్చాక టీటీడీ బోర్డు రీ విజిట్ చేసి రూ.40 కోట్లు ఖర్చు తగ్గించింది. కొత్త బోర్డు రాకపోయి ఉంటే ఆ రూ.40 కోట్లు ఎవరి జేబుల్లోకి పోయేవి? కమీషన్ల కోసం కక్కుర్తి! టీటీడీ డబ్బుల్లో 10 శాతానికి మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు. ఇది టీటీడీ రూల్. చంద్రబాబు హయాంలో కమీషన్లకు కక్కుర్తిపడి రూ.1,300 కోట్లు ఎస్ బ్యాంక్‌లో పెట్టించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచి్చన తర్వాత బోర్డు ఆ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బును విత్ డ్రా చేసి జాతీయ బ్యాంకులో పెట్టింది. ఆ తర్వాత మూడు నెలలకు ఎస్ బ్యాంక్ ఆర్థికంగా కుదేలయ్యింది. ఒకవేళ చంద్రబాబు పెట్టిన రూ.1,300 కోట్లు ఎస్ బ్యాంక్‌లోనే ఉండి ఉంటే ఆ డబ్బు ఏమయ్యేది? మరి ఏది స్కామ్? మాకు ఇవన్నీ తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాల్లో లాగకూడదని సమస్య పరిష్కరించి, సరిదిద్దాం. మన ఇప్పుడు వీళ్లు చేసేవి చూస్తుంటే అసలు ఏమీ జరగకపోయినా, మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తూ, రివర్స్ అబద్ధాలు చెబుతున్నారు. వాస్తవానికి టీటీడీ ఒక స్వతంత్ర వ్యవస్థ. కొన్ని శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విధానాలను తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేస్తున్నారు. అలాంటి ఆలయాన్ని, ఏకంగా దేవుడి ప్రతిష్టను మంటగలుపుతున్నామనే కనీస ధ్యాస కూడా లేకుండా, వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజారుస్తూ చంద్రబాబు అత్యంత హేయమైన రాజకీయాలు చేస్తున్నారు. అది చంద్రబాబు సొంత సిట్! లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు వేసిన సిట్ చూస్తే వాళ్ల బాగోతం తెలిసిపోతుంది. సిట్‌లో ఉన్న గోపీనాథ్ జెట్టి.. ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పని చేసిన కృష్ణయ్యకు అత్యంత సమీప బంధువు (ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో దిగిన ఫొటో ప్రదర్శించారు). కృష్ణయ్యపై చంద్రబాబుకు ఎంత ప్రేమ అంటే.. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పెట్టుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్‌ను చేశారు. ఇలాంటి వ్యక్తి సమీప బంధువు సిట్ ఆఫీసర్లలో ఒకరు. మరో ఆఫీసర్ డీఐజీ త్రిపాఠి. ఈ సర్వశ్రేష్ట త్రిపాఠి ఎలాంటి వాడో చెప్పాల్సిన పనిలేదు. పల్నాడు జిల్లాలో ఆయన సృష్టించిన అల్లకల్లోలం ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కోసం భుజాన వేసుకుని పాకులాడారు. ఆ తర్వాత చంద్రబాబు ఈ అధికారిని పక్కన కూర్చోబెట్టుకుని డీఐజీ స్థానం ఇచ్చి.. ఆయన చేస్తున్న మాఫియా కలెక్షన్లలో ప్రముఖ ప్రధాన పాత్ర ఇచ్చారు. ఇలాంటోళ్లు అందరూ సిట్‌లో ఉన్నారు. మరోవైపు వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న అనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అతను వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్) పీఏ. వీపీఆర్ ఒక టీడీపీ ఎంపీ. ఆయన దగ్గర నుంచి ప్రతి నెలా అప్పన్న జీతం (చెక్కులు) తీసుకుంటున్నాడు. పైగా ఏపీ భవన్ ఉద్యోగి. వీపీఆర్ పీఏ, తర్వాత ఏపీ భవన్ ఉద్యోగి. మరి వైవీ సుబ్బారెడ్డి పిక్చర్లోకి ఎలా వచ్చారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు ఎంతసేపూ వైవీ సుబ్బారెడ్డి పీఏ అని గోబెల్స్ ప్రచారం చేస్తూ డ్రిల్ చేస్తున్నారు!. -
టీటీడీ లడ్డు వ్యవహారం: శ్యామల రావు వ్యాఖ్యలపై వైఎస్ జగన్
-
వివాదాల రాజేంద్ర ప్రసాద్.. ఆ విషయంలో ఏకైక వ్యక్తిగా ఘనత..!
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆయన చేస్తున్న కామెంట్స్. ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ఆయన చేస్తున్న కామెంట్స్ కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారుతున్నాయి. డేవిడ్ వార్నర్ నుంచి బ్రహ్మనందం వరకు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. దీంతో ఆయనపై పలువురు నెటిజన్స్ మండిపడ్డారు. ప్రతిసారి ఇలా నోరు జారడం అలవాటైపోయిందని ఫైరయ్యారు.టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా పేరున్న రాజేంద్ర ప్రసాద్ ప్రతిసారి అలా మాట్లాడడం చూస్తుంటే అభిమానులే షాకవుతున్నారు. ఒక్కోసారి అసలు ఆయనకు ఏమైందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఈవెంట్స్‌లో తప్పుగా మాట్లాడడం.. ఆ తర్వాత తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పడం ఆయనకు అలవాటుగా మారిపోయిందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఏకైక నటుడిగా ఘనత..అయితే ఇటీవల కొద్ది కాలంగా తన మాటలతో ట్రోల్స్‌కు గురవుతున్న రాజేంద్ర ప్రసాద్ ఓ మంచిపని కూడా చేశాడు. పవిత్రమైన తిరుమల సన్నిధిలో భక్తుల వసతి కోసం కాటేజీ నిర్మించినట్లు తెలిసింది. టి. సుబ్బరామిరెడ్డి ఛైర్మన్‌గా ఉన్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ ఈ కాటేజీ నిర్మించానని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా తిరుమల కొండపై కాటేజీ నిర్మించిన ఏకైక నటుడిగా రాజేంద్ర ప్రసాద్ ఘనతను సొంతం చేసుకున్నారు. -
టీటీడీలో స్తంభించిన సర్వర్
తిరుమల/తిరుపతి క్రైమ్: తిరుమలలో వీఐపీ దర్శనం టికెట్లు జారీ చేసే సర్వరు సోమవారం స్తంభించింది. ఎస్ఎంఎస్లు వచ్చిన భక్తులకు పేమెంట్ చెల్లించడానికి వీలు కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఎంబీసీ కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్లు కొనుగోలు చేయాలని టీటీడీ భక్తులకు సూచించింది. వారంతా ఎంబీసీ 34 వద్ద క్యూ కట్టడం గమనార్హం. ఇది బ్యాంకర్స్ ద్వారా తలెత్తిన సమస్యగా టీటీడీ గుర్తించింది. ఇదిలా ఉండగా తిరుపతిలో సోమవారం ఓ హోటల్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కపిల తీర్థం సమీపంలో ఉన్న రాజ్ పార్క్ హోటల్లో బాంబు పెట్టామని, కాసేపట్లో పేలిపోతోందని గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు మెయిల్ పంపారు. దీంతో సీఐ రామకిషోర్ బృందం, బాంబ్ స్క్వాడ్ హోటల్లోని గదులు, బాత్రూములు మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఎస్వీ యూనివర్సిటీలో బాంబు పెట్టామని ఉత్తుత్తి బెదిరింపులు చేసిన సంగతి తెలిసిందే. -
తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే..
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా ఈ-డిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశితో పాటు డిసెంబర్ 31, జనవరి 1 దర్శనం టికెట్ల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింది. ఈ మూడు రోజులలో దాదాపు 1.80 లక్షల టోకెన్ల కోసం 24 లక్షల మంది భక్తులు ఈ-డిప్లో పేర్లు నమోదు చేసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. 9.6 లక్షల ఖాతాల నుంచి 24,05,237 లక్షల మంది భక్తులు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపింది. డిసెంబరు 2న మధ్యాహ్నం 2 తర్వాత నిర్వహించే ఈ-డిప్ లాటరీలో ఎంపికైన భక్తులకు మెసేజ్ అందుతుంది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. ఈ ఏడు రోజులకు సంబంధించి రోజుకు 15వేల చొప్పున రూ.300 దర్శనం టోకెన్లు డిసెంబరు 5వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. -
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 18 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 70,044 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,559 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.47 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 4 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
లక్కుంటేనే దర్శనమా?
-
తిరుమల: నేడు వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల
తిరుమల.: వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి నేడు(గురువారం, నవంబర్ 27 వ తేదీ) వైకుంట ద్వార దర్శన టికెట్ల విడుదల చేయనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు నుండి ఆన్లైన్లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్టేషన్‌కు అవకాశం కల్పించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తొలి మూడు రోజులకు దర్శన టోకెన్ల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. .డిసెంబర్ 1వ తేదీ వరకు ...5 రోజుల పాటు టీటీడీ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, ప్రభుత్వ WhatsApp సర్వీసెస్ ద్వారా నమోదుకు అవకాశం కల్పించనుననారు. ఈ-డిప్ లో టోకన్ పొందిన భక్తులకు డిసెంబర్ 2వ తేదీన సందేశం వస్తుంది. .డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి, 31 ద్వాదశి, జనవరి1 న త్రయోదశి రోజులలో టికెట్లు ఉన్న వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం అవకాశం కల్పిస్తారు. దీనిలో భాగంగా .జనవరి 2 నుండి 8 తేది వరకు సర్వదర్శనంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. డిసెంబర్ 30 నుండి జనవరి 8 తేది వరకు ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలు, ఆర్జిత సేవలు రద్దు చేయనున్నారు. -
తిరుమలలో చిరుత సంచారం కలకలం
సాక్షి,తిరుమల: తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున ఎస్వీ యూనివర్సిటీ ఉద్యోగుల నివాసాల వద్ద చిరుత సంచరించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీలో ఎంప్లాయిస్ క్వార్టర్స్ దగ్గర చిరుత నాటు కోళ్ల షెడ్డుపై దాడికి ప్రయత్నించింది. అనంతరం, అక్కడి నుంచి వేగంగా వెళ్లినట్లు కనిపిస్తోంది.అంతేకాదు, నివాసాల వద్దకు చేరుకున్న చిరుత కొద్ది నిమిషాలు అక్కడే తిరుగాడి సమీప అటవీ ప్రాంతం వైపు వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. చిరుత సంచారం విషయం తెలిసిన వెంటనే అటవీశాఖ సిబ్బంది, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ బృందాలు అక్కడికి చేరుకుని చిరుత జాడను గుర్తించేందుకు చర్యలకు ఉపక్రమించారు. అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ..‘తిరుమల అటవీ ప్రాంతం విస్తారంగా ఉండటం, ఆహార వనరులు అందుబాటులో ఉండటం వల్ల చిరుతలు అప్పుడప్పుడు మానవ నివాస ప్రాంతాలకు చేరుతుంటాయి. జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రత్యేక బృందాలు మోహరించాం’అని తెలిపారు.ఉద్యోగులు మాత్రం భయాందోళనలో ఉన్నారు. పిల్లలను బయటకు పంపడానికి భయపడుతున్నామని, రాత్రివేళల్లో బయటకు రావడం మానేశామని వారు తెలిపారు. చిరుతను పట్టుకునే వరకు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని వారు కోరుతున్నారు. తిరుమలలో గత కొంతకాలంగా చిరుతల సంచారం పెరుగుతుండటంతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. సోమవారం అర్ధరాత్రి వరకు 68,615 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,722 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.23 కోట్లు సమర్పించారు. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 6 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించమని స్పష్టంచేసింది. -
తిరుచానూరులో వైభవంగా రథోత్సవం


