టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ | TTD EO Anil Kumar Singhal Transferred | Sakshi
Sakshi News home page

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ

Feb 1 2026 2:53 PM | Updated on Feb 1 2026 3:12 PM

TTD EO Anil Kumar Singhal Transferred

సాక్షి, తిరుపతి: టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను చంద్రబాబు సర్కార్‌.. అకస్మాత్తుగా బదిలీ చేసింది. సీఎంవో ప్రిన్సిపాల్ సెక్రటరీ రవి చంద్రకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. తిరుమల లడ్డూ వివాదంలో చంద్రబాబు ప్రభుత్వం మరో డైవర్షన్‌కు తెరలేపింది

రెండుసార్లు సింఘాల్‌ను ఈవోగా నియమించింది సీఎం చంద్రబాబే. నెయ్యి వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం.. సింఘాల్‌ని బాధ్యుడిని చేసింది. సెప్టెంబర్ 10, 2025 నుండి టీటీడీ ఈవోగా పనిచేస్తున్న సింఘాల్.. గతంలో చంద్రబాబు హయాంలోనే టీటీడీ ఈవోగా పనిచేశారు. 2017 మే 6 నుండి 2020 అక్టోబర్ 4 వరకు టీటీడీ ఈవోగా సింఘాల్‌ పనిచేశారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement