ఆ జిల్లాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు.. | Big Alert For Andhra Pradesh: Rain And Lightning Warning | Sakshi
Sakshi News home page

ఆ జిల్లాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..

Mar 19 2026 2:22 PM | Updated on Mar 20 2026 6:51 PM

Big Alert For Andhra Pradesh: Rain And Lightning Warning

సాక్షి, అమరావతి: ఏపీలో రానున్న మూడు రోజుల్లో కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. చెట్ల క్రింద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ తెలిపారు.

కాగా కుండపోత వర్షంతో పిడుగుపాటుకు గురై రాష్ట్రవ్యాప్తంగా నిన్న(బుధవారం) నలుగురు మరణించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో పిడుగు పడి శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెం గ్రామంలో పిడుగుపాటుకు పొలంలో పనిచేస్తున్న ఇరువురికి గాయాలయ్యాయి. ప్ర­కా­శం జిల్లా కురిచేడు మండలం వీరపాలెంలో మిర్చి కోతలకు పొలానికి వెళ్లిన కాటూరి సుబ్బరత్నమ్మ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. బాపట్ల జిల్లాలో పిడుగుపాటుతో పెర­వలి వనజ మృతి చెందింది. వైఎస్సార్‌ కడప జిల్లా  చిన్నాయపల్లెకి చెందిన గుర్రాల నారాయణ రెడ్డి(55) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి­వాన ధాటికి పంటలు నేల వాలాయి. కల్లాల్లో ఆర­బెట్టిన మిర్చి, మొక్కజొన్న తడిచి ముద్దయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో పంట నష్టం అధికంగా ఉంది.

బిగ్ అలర్ట్.. రానున్న 3 రోజులు భారీ వర్షాలు

 

Advertisement
 
Advertisement
Advertisement