breaking news
rains
-
సమంగా వర్షం పడితేనే.. సాగు బాగు..!
సాక్షి, స్పెషల్ డెస్క్ : ఒకసారి భారీగా వర్షం పడటం కంటే.. సమతుల్య వర్షపాతంతోనే సాగుకు మేలు అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పంటకు అవసరమైన దశలో వర్షం పడినా, తక్కువ వర్షపాతం ఉన్నా, ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చాలా ఎక్కువ వర్షపాతం అవసరం లేనప్పుడు పడితే మాత్రం, పంట నష్టపోవటమే కాకుండా దిగుబడిలో కూడా చాలా తేడా వస్తుందంటున్నారు. ప్రస్తుతం సాధారణంగా ఒక నెల రోజుల్లో పడే వర్షం అంతా.. మూడు, నాలుగు రోజులు లేదా ఒక 10 రోజుల్లో పడటం.. లేదంటే ఒక్కోసారి ఒకే రోజులోనూ పడుతోంది, దీనివల్ల పంటలకు నిస్సందేహంగా నష్టం ఉంటుంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా తొలి రెండు నెలలు అసమాన సాధారణ వర్షపాతం నమోదైంది. ఇటీవలి భారీ వర్షాలతో ఆ అసమానత తగ్గింది. ముందు వర్షాలు లేనందువల్ల ఇప్పుడు పడిన అధిక వర్షాలు రైతులకు నిస్సందేహంగా ఉపయోగపడతాయి. ఇప్పటికే వేసిన పంటల పెరుగుదల తిరిగి పుంజుకుంటుంది. ఇప్పటికైతే వర్షపాతం లోటు చాలా వరకు తగ్గిపోయింది. ఇక ముందు పంటలకు అవసరానికి అనుగుణంగా సమతుల్యంగా వర్షం పడితే పర్వాలేదు. అలా కాకుండా వర్షాలు విపరీతంగా ఎక్కువైపోతే.. ఆ అదనపు నీటిని పొలాల్లో నుంచి ఎప్పటికప్పుడు బయటకు పంపాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఏ కారణం వల్ల రైతులు ఆ పని చెయ్యలేకపోతే ఏ పంటైనా, అది ఏ దశలో ఉన్నా, కలుపు, వేరుకుళ్లు, తెగుళ్లు, పురుగు వంటి సమస్యలు రైతును చుట్టుముట్టి దిగుబడి నష్టపరచడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. వర్షం ఎక్కువైనా,తక్కువైనా పంటలను కాపాడుకోవటం ఎలా? వర్షాలు కురవని సమయంలో బెట్టను తట్టుకోవటానికి, ఒకేసారి వర్షం ఎక్కువై నీరు నిలిచినప్పుడు పంటలను రక్షించుకోవటానికి రైతులు తేమ సంరక్షణ పద్ధతులుపాటించాలని వ్యవసాయ విశ్వవిద్యాలయ వాతావరణ పరిశోధన విభాగం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమీ) డా. లీలారాణి రైతులకు ఆచరణాత్మక సూచనలు చేశారు. సాలుకు అడ్డంగా దుక్కి: విత్తనం వేయక ముందే కొండ వాలుకు లేదా నేల వాలుకు అడ్డంగా దుక్కి దున్నుకోవటం వల్ల వర్షపు నీరు వేగంగా కొట్టుకుపోకుండా నేలలో ఇంకుతుంది. బోదెలు–కాలువల పద్ధతి: పంటలను బోదెలపై విత్తుకోవటం వల్ల అధిక వర్షాలు పడినప్పుడు కాలువల ద్వారా వరద నీటిని సులభంగా బయటకు పంపొచ్చు. వర్షాలు లేని సమయంలో ఈ కాలువలే తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుతాయి. ఎత్తు మడుల సాగు: నీటి ముంపు త్వరితగతిన నివారించటానికి ఎత్తు మడుల పద్ధతి విశేషంగా తోడ్పడుతుంది. నాగలితో గొడ్డు చాలు: వర్షాధార పంటల్లో ఆఖరి గుంటక తోలిన తర్వాత ఒక గొడ్డు చాలు (గబ్బచాలు) వేసుకోవాలి. ఇది నీరు బయటకు పోవటానికి, బెట్ట సమయంలో తేమను కాపాడటానికి ఉపయోగపడుతుంది. చేను గట్లు, డ్రైనేజీ కాలువల నిర్వహణ: పొలం చుట్టూఉన్న గట్లు, కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని, నీరు వెంటనే బయటకు వెళ్లేలా ‘డ్రైనేజీ’వసతి సరిగ్గా ఉంచుకోవాలి. పంట కుంటల నిర్మాణం: తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో పొలం దిగువ ప్రాంతంలో పంట కుంటలు (ఫామ్ పాండ్స్) తవ్వుకోవాలి. భారీ వర్షాల నీటిని ఇందులో మళ్లించి, ఆ తర్వాత బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు రక్షక తడిగా వాడుకోవచ్చు. భారీవర్షాలు కురిసిన తర్వాత వరద నీటిని రైతులు వీలైనంత త్వరగా బయటకు తీసివేయాలి. అదను చూసుకొని వెంటనే అంతర కృషి చేయాలి. ఎకరానికి 20 కేజీలు యూరియా, 10 కేజీల పొటాష్ ను పైపాటుగా వెయ్యాలి. అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తెలంగాణలో ఇలాంటి పరిస్థితే ఉంది.. సమానంగా విస్తరించిన వర్షపాతంతో వ్యవసాయం బాగుంటుంది. పంటకు అవసరమైన కీలక దశల్లో తగినంత నీరు లభించడమే మంచి దిగుబడి పొందటానికి ముఖ్యం. చాలా రోజులు వర్షం లేకుండా ఒకేసారి కుంభవృష్టి కురిస్తే వర్షపాతం లోటు తగ్గినా, పంటలకు నష్టం జరుగుతుంది. తెలంగాణలో ప్రస్తుతం ఇటువంటి పరిస్థితే నెలకొంది. మొదట్లో తీవ్ర కొరత వచ్చింది. ఇప్పుడు కొన్ని చోట్ల అతివృష్టి సమస్య. ఇక ముందూ వర్షాలు ఎక్కువైతే సమస్యలే. వర్షాధారంగా ఎక్కువగా సాగయ్యే పత్తి, వరి, మొక్కజొన్న, కంది, సోయాచిక్కుడు, పెసర, మినుము వంటి పంటలకు ఈ అసమాన వర్షపాతం వల్ల వివిధ దశల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం మేం వెలువరించే వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను గమనిస్తూ రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పాటిస్తే పంట నష్టాన్ని కనీసం 50 శాతం వరకు అరికట్టవచ్చు. – డాక్టర్ పి. లీలారాణి -
తెలంగాణలో వర్షాలకు బ్రేక్.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన
-
Alert: రాగల 48 గంటల్లో ఉత్తర కోస్తాలో వానలు
-
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి. మహా వరుణ యాగంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్య
-
వరద నీటిలో ‘ఆట’లొద్దు
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలంలో కురిసే వానలు, వరదలతో మరో అనారోగ్య ముప్పు పొంచి ఉంది. వరద నీటిలో ఆట లాడినా, తిరిగినా, కాళ్లు నానినా.... ‘లెప్టోస్పిరోసిస్’ అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ వ్యాధి నుంచి ముప్పు అధికంగా ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో లెప్టోస్పిరోసిస్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. 2023లో రాష్ట్రంలో కేవలం రెండు కేసులు నమోదవగా.. 2025లో ఆ సంఖ్య 249కి చేరింది. అంటే రెండేళ్లలో 125 రెట్లు పెరిగింది. ఈ ఏడాది జూన్ నాటికే 101 కేసులు నమోదయ్యాయి. వర్షాకాల వ్యాధులపై ఇటీవల రాజ్యసభలో సమర్పించిన గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దేశంలో కేసుల సంఖ్య పరంగా కేరళ 4,001 కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు (2,862), కర్ణాటక (2,302), మహారాష్ట్ర (2,184) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే కేసుల పెరుగుదల శాతంలో తెలంగాణ ముందుంది. ఎలుకల మూత్రంతో కలుషితమైన నీటితో.. లెప్టోస్పిరోసిస్ అనేది బ్యాక్టీరియా వ్యాధి. ముఖ్యంగా ఎలుకలు, కొన్ని ఇతర జంతువుల మూత్రం ద్వారా ఇది వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వాటి మూత్రంతో కలుషితమైన నీరు, మట్టి మనుషుల చర్మానికి తగిలినప్పుడు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. చర్మంపై గాయాలు, చిన్న పగుళ్లు ఉంటే ముప్పు మరింత పెరుగుతుంది. కళ్లు, ముక్కు, నోటి ద్వారా కూడా బ్యాక్టీరియా శరీరంలోకి చేరవచ్చు. హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు నెలకు సగటున 10 నుంచి 15 లెప్టోస్పిరోసిస్ కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అకాల వర్షాలు, పట్టణ ప్రాంతాల్లో వరదలు, నీటి పారుదల వ్యవస్థ సరిగా లేకపోవడం, కలుషిత నీటికి ప్రజలు ఎక్కువగా గురికావడం, ఎలుకల సంఖ్య పెరగడం, పారిశుద్ధ్య లోపాలు వ్యాధి వ్యాప్తికి కారణాలని నిపుణులు పేర్కొంటున్నారు. డెంగీ అనుకుని పొరబడొద్దు లెప్టోస్పిరోసిస్ ప్రారంభ లక్షణాలు సాధారణ వైరల్ జ్వరం, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులను పోలి ఉంటాయి. అకస్మాత్తుగా జ్వరం, చలి, తీవ్రమైన కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు, నీరసం, కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వరద నీటిలో నడిచిన తర్వాత జ్వరం వస్తే లెప్టోస్పిరోసిస్ అని అనుమానించాల్సిన అవసరం ఉంది. వ్యాధి తీవ్రత పెరిగితే మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం, కాలేయ వైఫల్యం, ఊపిరితిత్తుల సమస్యలు, మెదడు పొరల వాపు, కామెర్లు వంటి తీవ్ర సమస్యలు తలెత్తవచ్చు. చికిత్స అందకపోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో సకాలంలో యాంటీబయాటిక్స్ ప్రారంభిస్తే వ్యాధి తీవ్రత, సమస్యల ముప్పును తగ్గించవచ్చు. వరద నీటికి దూరంగా ఉండాలి ప్రజలు సాధ్యమైనంత వరకు నిలిచిపోయిన వరద నీటిలో నడవకూడదు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే బూట్లు, తొడుగులు వంటివి ధరించాలి. చేతులు, కాళ్లపై గాయాలు ఉంటే వాటిని నీరు చొరబడకుండా కప్పుకోవాలి. తర్వాత శరీరాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తాగునీరు కలుషితమైందనే అనుమానం ఉంటే కాచి లేదా శుద్ధి చేసి మాత్రమే వినియోగించాలి. ఇళ్లలో ఆహారాన్ని, చెత్తను మూతఉన్న పాత్రల్లో ఉంచి ఎలుకల నియంత్రణ చేపట్టాలి. -
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది. నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ అతిథి గృహం వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన ఈ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొని రుత్వికుల మార్గదర్శకత్వంలో క్రతువులు నిర్వహించారు. కృష్ణమ్మకు సీఎం పూర్ణాహుతి సమర్పించారు. ‘రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి. కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలి. ప్రాజెక్టులు, చెరువులు నిండాలి..’అని ప్రార్థించారు. బ్రహ్మ ముహూర్తంలో.. సోమవారం ఉదయం 4 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో యాగాన్ని ప్రారంభించారు. ప్రారంభ క్రతువులో నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 హోమ గుండాలతో వరుణ దేవుని అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ వైదిక విధానంలో హోమ క్రతువులు నిర్వహించారు. మధ్యాహ్నం 3.15 గంటలకు యాగశాలలోకి వచ్చిన సీఎం దంపతులు..3:24 గంటలకు పూర్ణాహుతి సమర్పించారు. ‘కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా పడాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులతో పాటు అన్ని ప్రాజెక్టులు నిండాలి. రాష్ట్రంలోని ప్రతి చెరువు, ప్రతి కుంట జలకళను సంతరించుకోవాలి. భూగర్భ జలాలు పెరగాలి. పంటలు పుష్కలంగా పండాలి. రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలి. రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలి. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలి..’అని ముఖ్యమంత్రి వరుణ దేవుడిని ప్రార్థించారు. భారతీయ సంస్కృతిలో వర్షాలు కురవాలని యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయం. కాగా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ మహా వరుణయాగాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి కె.జానారెడ్డి, ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్‌రెడ్డి, నేనావత్ బాలునాయక్, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేలు, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కృష్ణమ్మ ఒడ్డున మార్మోగిన వేదఘోష సూర్యకిరణాలు ఇంకా కృష్ణమ్మ జలాలను తాకకముందే.. నాగార్జునసాగర్ పరిసరాల్లో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సోమవారం తెల్లవారుజాము నుంచే వేద మంత్రాలు మార్మోగాయి. చతుర్వేద పారాయణంతో యాగ క్రతువు ప్రారంభమైంది. ప్రధాన యాగ క్రతువుల కోసం 32 మంది రుత్వికులు యాగశాలలో నిర్దేశించిన స్థానాల్లో ఆశీనులు కాగా, మిగిలిన రుత్వికులు నిరంతర వేద పారాయణం, జపంలో పాల్గొన్నారు. చతుర్వేద పారాయణం అనంతరం అగ్ని ప్రతిష్ఠాపన నిర్వహించారు. హోమకుండాల్లో పవిత్ర అగ్నిని ప్రజ్వలింపజేసి, వరుణ దేవుడిని ఆవాహన చేస్తూ హోమాలు నిర్వహించారు. ఆకాశం–జలం–భూమి–మానవాళి మధ్య సమతుల్యత నెలకొనాలని ఆకాంక్షిస్తూ వేద మంత్రాల నడుమ హోమ ద్రవ్యాలను అగ్నికి సమర్పించారు. ఒకవైపు కృష్ణమ్మ విశాల జలరాశి, మరోవైపు హోమకుండాల్లో ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలు, వాటి మధ్య ప్రతిధ్వనించిన వేదఘోషతో సాగర్ తీరం భక్తిభావంతో నిండిపోయింది. వరుణారాధనతో విజయపురికి ప్రాచీన అనుబంధం మహా వరుణ యాగం నిర్వహిస్తున్న ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యం కూడా ఉందని యాగ నిర్వాహకులు పేర్కొన్నారు. నేటి నాగార్జునసాగర్ ప్రాంతం ఒకనాటి విజయపురిగా ప్రసిద్ధి చెందిందని, ఈ ప్రాంతంలో ప్రాచీన కాలంలోనే వరుణారాధన జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని వేద పండితులు వివరించారు. వరుణుడితో సంబంధం ఉన్న ఒక ప్రాచీన ప్రతిమ ప్రస్తుతం నల్లగొండ మ్యూజియంలో భద్రపరచబడి ఉందని వారు పేర్కొన్నారు. ఈ చారిత్రక నేపథ్యం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న మహా వరుణ యాగానికి మరింత ఆధ్యాత్మిక విశిష్టత చేకూరిందని తెలిపారు. శతాబ్దాల కిందట జలాల కోసం ఇదే నేలపై వినిపించిన వరుణ ప్రార్థన, ఇప్పుడు మరోసారి కృష్ణమ్మ ఒడ్డున వేదఘోషగా ప్రతిధ్వనిస్తోందన్న భావన యాగానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన వేద పండితులు, అర్చకులు యాగ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. ప్రధాన అర్చకులు ఆచార్య వెంకటాచార్యులు, నరేష్ శర్మ, వెంకట రామశర్మ, ఆదిత్య శర్మతో పాటు పలువురు వేదపండితులు యాగ క్రతువులను నిర్వహించారు. రోజంతా వరుణ యాగం కొనగసాగగా, మధ్యాహ్నం 3.24 గంటలకు మహా పూర్ణాహుతితో ముగిసింది. -
నేడు సాగర్‌లో వరుణయాగం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ /హైదరాబాద్: రాష్ట్రంతోపాటు కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ సోమవారం నాగార్జునసాగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం వరుణయాగం నిర్వహించనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించనుండగా, సీఎం రేవంత్‌రెడ్డి ఈ యాగంలో పాల్గొంటారు. కృష్ణా, గోదావరి నదులకు స్థిరమైన ప్రవాహాలు రావాలని, జలాశయాలు, చెరువులు నిండాలని, భూగర్భ జలాలు పెరగాలని, వ్యవసాయానికి సమృద్ధిగా నీరు అందాలని కోరుతూ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన అర్చకులు, వేదపండితులు, ఆలయ సిద్ధాంతితో సంప్రదింపుల అనంతరం ఆగస్టు 10న వరుణయాగం నిర్వహించేందుకు ముహూర్తం నిర్ణయించారు. నాగార్జునసాగర్‌లోని పర్యాటక శాఖ అతిథి గృహం విజయవిహార్ ప్రాంగణంలో 11 హోమగుండాలను ఏర్పాటు చేస్తున్నారు. 108 మంది రుత్వికులు, అర్చకులు, వేదపండితులు రోజంతా ప్రత్యేక వైదిక క్రతువులు నిర్వహించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.45 గంటలకు సాగర్ హిల్‌కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి విజయవిహార్ ప్రాంగణంలో యాగం జరిగే ప్రాంతానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు. సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ సాగర్‌లోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. విజయవిహార్ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్, యాగశాల, వేదిక తదితర ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, నీటిపారుదల తదితర శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు. -
‘వర్షం కురిసిన ఉదయం’.. వందకి రూ. 400 ఇస్తామన్నా..
గురుగ్రామ్ : వర్షం కురిస్తే చాలు.. డిల్లీకి సమీపంలోని హర్యానాలో గల గురుగ్రామ్ పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో ఓ మహిళ తన ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపారు. ఆఫీసుకు వెళ్లేందుకు కేవలం 8 కిలోమీటర్ల దూరానికి రూ. 400 చెల్లించేందుకు సిద్ధపడి, గంటపాటు ప్రయత్నించినా ఆమెకు క్యాబ్ బుక్ కాకపోవడం గమనార్హం.గురుగ్రామ్‌లో కురిసిన వర్షాలకు మరోసారి నగరంలోని ట్రాఫిక్ వ్యవస్థ, నీరు నిలిచిపోవడం లాంటి సమస్యలు బహిర్గతమయ్యాయి. హేన్సీ సోనీ అనే స్థానికురాలు సోషల్ మీడియాలో పంచుకున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఉదయం పూట వర్షం ఆహ్లాదకరంగా అనిపించినా, ఆఫీసుకు బయలుదేరే సమయానికి అదే పెద్ద సమస్యగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్థంభించిపోయాయి. గంటపాటు శ్రమించినా క్యాబ్ దొరకలేదని, కేవలం 8 కి.మీ. ప్రయాణానికి రూ. 400 ఛార్జీ చెల్లించేందుకు సిద్ధపడినప్పటికీ డ్రైవర్లు ముందుకు రాలేదని ఆమె తెలిపారు. సొంత కారులో వెళితే ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోవాల్సి వస్తుందని, క్యాబ్‌ను ఆశ్రయిస్తే భారీగా డబ్బులు ఖర్చవుతాయని వాపోయారు.ఈ పరిస్థితుల్లో సాధారణ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ‘ఇలాంటి సమయంలో ఏం చేయాలి?’ అంటూ ఆమె ప్రశ్నించారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ, కొద్దిపాటి వర్షానికే నగరంలోని పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయంటూ ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. కాగా సాధారణంగా 8 కిలోమీటర్ల దూరానికి క్యాబ్ బుక్ చేసుకుంటే రూ.100 నుంచి రూ. 180 వరకూ ఖర్చవుతుంది. View this post on Instagram A post shared by Hensi Soni (@hensi__soni)ఇది కూడా చదవండి: అసాద్ నుంచి ఆబాన్ వరకు.. మృత్యుపాశంలో అతీక్ కుటుంబం! -
వాన బీభత్సం.. జలమయమైన ఢిల్లీ
న్యూఢిల్లీ,సాక్షి: దేశ రాజధాని ఢిల్లీలో వర్షం దంచికొడుతుంది. కురిసిన భారీ వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో వాతావరణ శాఖ రాత్రి 11 గంటల వరకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.వర్షం నిరంతరం కురుస్తుండటంతో అనేక మంది ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. క్యాబ్‌లు గంటల తరబడి అందుబాటులో లేకపోవడంతో పలువురు కార్యాలయాల్లోనే చిక్కుకుపోయారు. ఇంటికి బయలుదేరిన వారు కూడా భారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. మెహ్రౌలి-బడర్పూర్ రోడ్, వజీరాబాద్ రోడ్, పటేల్ రోడ్, రోహ్తక్ రోడ్, శంకర్ రోడ్, కిర్తి నగర్, ఢిల్లీ-జైపూర్ హైవే, పీరాగఢి, షాహీన్ బాగ్ వంటి కీలక మార్గాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.నిరంతర వర్షాల కారణంగా ఛత్తర్పూర్ ఫార్మ్ ప్రాంతం,టెర్మినల్-1 సమీపంలోని మెహ్రామ్ నగర్ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఢిల్లీ-జైపూర్ హైవేలోని శంకర్ విహార్ వద్ద వాహనాలు భారీ క్యూల్లో నిలిచిపోయాయి. అలాగే గురుగ్రామ్ నుంచి ధౌలా కువాన్ వెళ్లే మార్గంలో కూడా పలుకిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నమోదైంది.ఇక నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై కూడా తీవ్ర ట్రాఫిక్ రద్దీ నెలకొంది. తూర్పు ఢిల్లీలోని శకర్పూర్, మండావలి ప్రాంతాల్లో కాలువలు పొంగిపొర్లడం, గుంతలు నీటిలో మునిగిపోవడంతో ప్రమాదాలు పెరిగాయని ఈ-రిక్షా డ్రైవర్లు తెలిపారు. నీటిలో కనిపించని గుంతలు, మ్యాన్హోల్ల కారణంగా ఈ-రిక్షాలు, స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు సహా కనీసం మూడు నుంచి నాలుగు వాహనాలు బోల్తాపడ్డాయి. -
మూడు రోజులు భారీ వర్షాలు IMD హెచ్చరిక
-
కృష్ణమ్మ పరవళ్లు డ్రోన్ విజువల్స్
-
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
విజయవాడ: ఏపీలోని పలు జిల్లాల్లో ఈరోజు(బుధవారం) రాత్రికి పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దాంతో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. ముఖ్యంగా విజయనగరం, ఎస్ కోట, భీమునిపట్నం, కొత్తవలస, భోగాపురం, ఆనందపురం, సబ్బవరం, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. మన్యం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన వెల్లడించింది. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. -
యూపీలో దంచికొట్టిన వర్షం
-
హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం
-
కేరళలో కుండపోత.. ఎడ తెగని వానలు
-
Kerala: ఎడతెగని వర్ష బీభత్సం.. విద్యా సంస్థలకు సెలవు
తిరువనంతపురం: కేరళలో ఎడతెగని విధంగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వానల కారణంగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం కేరళలోని మొత్తం 14 జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. భారీ వర్షాల ధాటికి పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యార్థుల భద్రత దృష్ట్యా కాసరగోడ్, కన్నూర్, వాయనాడ్, పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, త్రిసూర్, మలప్పురం తదితర జిల్లాల్లోని విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగాలు సెలవు ప్రకటించాయి.అలాగే ఆలప్పుళ జిల్లాలోని చెంగన్నూర్, కుట్టనాడ్ తాలూకాలు, ఎర్నాకులం పరిధిలోని విద్యాసంస్థలను మూసివేశారు. ఈ సెలవు పాఠశాలలు, వృత్తి విద్యా సంస్థలు, అంగన్వాడీలు, మతపరమైన విద్యా సంస్థలన్నింటికీ వర్తిస్తుందని కలెక్టర్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు భారీ వర్షాల కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గల్లంతు కాగా, 13 మంది గాయపడ్డారు. వరదలు, కొండచරلలు విరిగిపడటం వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. 27 ఇళ్లు పూర్తిగా, 196 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 209 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి, 5,792 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిరాశ్రయులైన వారికి, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం అందిస్తుందని అధికారులు తెలిపారు. వచ్చే రెండు రోజుల్లో వర్షాల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.ఇది కూడా చదవండి: మనిషి డీఎన్ఏలో అజ్ఞాత పూర్వీకుల ఆనవాళ్లు! -
కృష్ణమ్మ పరవళ్లు.. జూరాల 29 గేట్లు ఎత్తివేత
-
పెరుగుతున్న గోదావరి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వరద దిగువకు వదిలేస్తుండటంతో భద్రాచలం వద్ద శుక్రవారం అర్ధరాత్రి సమయానికి 14.26 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంది. దాంతో అధికారులు భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద గంట గంటకూ పెరుగుతోంది. స్పిల్ వే 48 గేట్ల ద్వారా వచ్చిన వరదను దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 5,39,934 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులు, మిగులుగా ఉన్న 5,28,934 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. అలాగే, శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణా నది వరద ప్రవాహం పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 92,709 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 54.34 టీఎంసీలకు చేరుకుంది. రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. విదర్భ, మధ్యప్రదేశ్ ప్రాంతంపై ఉన్న వాయుగుండం వాయవ్య దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి గాలులతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు వెల్లడించింది. గత 24 గంటల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అత్యధికంగా 3.7,ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం వేమవరం, కాకినాడ జిల్లా ఇంజారంలో 3.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
తెలంగాణలో భారీ వర్షాల బీభత్సం.. IMD హెచ్చరిక!
-
AP: తీవ్ర వాయుగుండం.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 7.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షం కురిసింది. కృష్ణా జిల్లా కంకిపాడులో 6.7, పెనమలూరులో 6.46, అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో 6.2, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో 6, అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో 5.8..ఏలూరు జిల్లా కలిదిండిలో 5.5, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఏలూరు జిల్లా ముదినేపల్లిలో 5.2, అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశాపై ఉన్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో గురువారం పోలవరం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
బస్సులోకి వరద నీరు.. ఇరుక్కుపోయిన జనం.. వైరల్ అవుతున్న వీడియో
-
హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. ట్రాఫిక్ స్తంభించింది!
-
ఉత్తరాదిలో భారీ వర్షాలు.. వరద ముప్పు పెరుగుతోంది!
-
ఉత్తరాదిని వణికిస్తున్నవానలు
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. హిమాలయ ప్రాంత రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకోగా, దేశ రాజధాని ఢిల్లీలో జన జీవనం స్తంభించింది. వచ్చే నాలుగైదు రోజుల్లోనూ ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో భారీ వర్షాలు నమోదయ్యాయి. హిమాచల్‌లోని చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో వాహనాలు, నివాసాలు మట్టి, బురద, రాళ్లకింద కూరుకుపోయాయి.అయితే, ప్రాణనష్టం సంభవించలేదు. ఉత్తరాఖండ్‌లో విడవకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఛార్‌ధామ్ యాత్రను రెండు రోజులపాటు నిలిపివేశారు. యాత్ర మార్గంలో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వరద నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఈ సీజన్లో అత్యధికంగా మంగళవారం వర్షం నమోదైందని, మూడేళ్లలోనే జూలైలో 29 డిగ్రీల సెల్సియస్‌తో అతి చల్లని రోజుగా మంగళవారం ఉందని ఐఎండీ తెలిపింది. -
హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం
సాక్షి,హైదరాబాద్: నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొడుతోంది. నగరంలోని ప్రధాన ఐటీ హబ్‌లైన రాయదుర్గం, గచ్చిబౌలి, మణికొండ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీనివల్ల రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట వంటి ప్రముఖ వ్యాపార, నివాస ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం పడుతోంది. అలాగే నాంపల్లి, మెహిదీపట్నం, టోలిచౌకి, గోల్కొండ సహా నగరంలోని అన్ని ప్రాంతాలు వాన జల్లులతో తడిసిపోతున్నాయి.అకస్మాత్తుగా కురిసిన ఈ భారీ వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. సాయంత్రం వేళ ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యే ఐటీ ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు. -
వరుణుడి విరుచుకుపాటు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక..!
-
రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి: వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం పశ్చిమ బెంగాల్–ఉత్తర ఒడిశా తీరానికి సమీపంలో కొనసాగుతోందని వెల్లడించింది. ఇది బాలాసోర్–కానింగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. -
గుడ్ న్యూస్.. వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు..
-
గుజరాత్ లో వర్ష బీభత్సం నీట మునిగిన ఇళ్లు, కార్లు
-
జమ్ముకశ్మీర్‌లో కుండపోత: జలమయమైన రాజౌరి
రాజౌరి: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి పట్టణంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా వరదలు పోటెత్తడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కొండవాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాజౌరిలోని కొత్త బస్టాండ్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వరదల ధాటికి పదుల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా దర్హాలి, ఖండ్లీ, సుక్తో, జమోలా నదులు ప్రమాదకర స్థాయికి చేరువలో ప్రవహిస్తున్నాయి. దర్హాలి నది గట్టు తెంచుకోవడంతో బేలా కాలనీలోకి నీరు భారీగా చేరింది. అబ్దుల్లా బ్రిడ్జ్ సమీపంలోని మురికివాడలో వరద నీరు చేరడంతో 50కి పైగా కుటుంబాలు నివాసాలను వదిలి వెళ్లాల్సి వచ్చింది. తారిక్ బ్రిడ్జ్ సమీపంలో నివసించే వారిని కూడా పోలీసులు అప్రమత్తం చేసి ఖాళీ చేయించారు. Rajouri, Jammu and Kashmir: A local says, "The incident happened when we stepped out around 1:30 and saw that the water flow was extremely strong. There were tents set up nearby, so we tried to move people out, took their belongings, and shifted them to a safer place. But… pic.twitter.com/ZNN3NutIsH— IANS (@ians_india) July 19, 2026ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. జూలై 23 వరకు జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక ఎమ్మెల్యే ఇఫ్తికార్ అహ్మద్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, బాధితులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇది కూడా చదవండి: ఎస్పీ, బీఎస్పీలతో పొత్తుకు సిద్ధం: ఒవైసీ -
గార్ధబాలకు గులాబ్ జామ్‌లు
భోపాల్: విత్తులు నాటాక కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఆకాశం వంక మేఘాల కోసం చూడటం రైతన్నలకు నేటి యుగంలో సర్వసాధారణమైపోయింది. అయితే మధ్యప్రదేశ్‌లోని కొన్ని మారుమూలప్రాంతాల్లో మాత్రం కొందరు స్థానికులు మూగజీవాలను ప్రసన్నంచేసుకుంటే వరుణుడు వర్షిస్తాడనే బలమైన విశ్వాసం నెలకొని ఉంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలోని కోలార్ రోడ్లో గాడిదలకు కొందరు గులాబ్‌జామ్‌లు ప్లేట్లలో పెట్టి తినిపించారు. తమ పూర్వీకులు సైతం వర్షాలు సరిగా పడని సందర్భాల్లో అచ్చం ఇలాగే గాడిదలకు తీపిపదార్థాలు ఆహారంగాపెట్టేవాళ్లని స్థానికులు చెప్పారు. వరుణదేవుడైన ఇంద్రుడిని మెప్పించేందుకు గార్ధబాలకు గులాబ్‌జాములు పెట్టడం సరైన పద్ధతి అని మరికొందరు చెప్పారు. ఈ సందర్భంగా జానపద గేయాలను సైతం ఆలపించారు. ఈ ఘటన తాలూకు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లుకొడుతున్నాయి. ఈ వింత ఆచారంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే వర్షాలు బాగా కురవాలని కోరుకుంటున్న ఇదే ఇండోర్ నగరంలో ఈ సీజన్లో సాధారణసగటు కంటే 44 శాతం అధిక వర్షపాతం నమోదైందని భోపాల్ వాతావరణవిభాగ సీనియర్ అధికారి ఎన్ఎస్ సాహూ శనివారం ప్రకటించడం విశేషం.అయితే మధ్యప్రదేశ్‌లోని 35 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ఇటీవలే ప్రకటించింది. చింధ్వారా, దామోహ్, దిందోరీ, జబల్పూర్, కత్నీ, మేహర్, మాండ్లా, మౌగంజ్, నర్సింగ్‌పూర్,పంధూర్నా, పన్నా, రేవా, సాగర్, సత్నా, శివానీ, షాహ్‌దోల్, సిద్ధీ, సింగ్రౌలీ, తికాంగఢ్, ఉమారియా, అలీరాజ్‌పూర్, బర్వానీ, బేతుల్, దటియా, ధార్, ఝాన్బువా, మొరెనా, నర్మదాపురం, రైనెన్, శివ్పూర్, శివపురి, అనుప్పూర్, బాలాఘాట్, ఛాతర్పూర్, విదిష జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. -
ఏపీకి చల్లని కబురు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. ఏపీలో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో వడగాల్పులు ఉండే ఛాన్స్ ఉందని పేర్కొంది. తీరం వెంబడి గాలులు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.కాగా, జులైలోనూ ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఒడిశా సమీపంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ముఖ్యంగా సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో అక్కడక్కడ చినుకులు పడే అవకాశం ఉండగా.. ఇటు రాజధాని హైదరాబాద్‌లోనూ వర్షం కురిసే అవకాశముదని వాతావరణ శాఖ తెలిపింది.అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వాతావరణం మేఘావృతంగా మారే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశాలున్నాయి. -
ఎండలకు బ్రేక్.. తెలంగాణకు చల్లటి కబురు
సాక్షి, హైదరాబాద్: జులైలోనూ ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఒడిశా సమీపంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది. ముఖ్యంగా సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో అక్కడక్కడ చినుకులు పడే అవకాశం ఉండగా.. ఇటు రాజధాని హైదరాబాద్‌లోనూ వర్ష సూచన కనిపిస్తోంది.అల్పపీడనం(LPA) ప్రభావంతో తెలంగాణలో వాతావరణం మేఘావృతంగా మారే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశాలున్నాయి.హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాధారణంగా పొడి వాతావరణం కొనసాగినప్పటికీ.. సాయంత్రం నుంచి రాత్రి సమయంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో కొంతకాలంగా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది.పలు జిల్లాల్లో ఇప్పటికే చినుకులుగత 24 గంటల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లా కోస్గిలో 15 మిల్లీమీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడలో 8.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ పరిశీలనలు వెల్లడించాయి.ఈ జిల్లాల్లో చినుకులకు అవకాశంగురువారం ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు లేదంటే చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు ప్రస్తుతం అవకాశం తక్కువగానే ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. విస్తారంగా కాకపోయినా.. అక్కడక్కడ కురుస్తున్న ఈ వర్షాలు ఎండల తీవ్రత మధ్య ప్రజలకు కొంత ఊరటనిస్తున్నాయి.వర్షాల కోసం ఎదురుచూపులునైరుతి రుతుపవనాల కాలం కొనసాగుతున్నప్పటికీ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరిన్ని ప్రాంతాల్లో చినుకులు కురిస్తే వ్యవసాయ పనులకు ఊతమిచ్చే అవకాశం ఉంది. -
డెడ్ స్టోరీజికి ప్రాజెక్టు! ఇప్పుడు ఎలా ఉందంటే?
-
వానలకు గాలుల చెక్!
ఓవైపు మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ వంటి రాష్ట్రాలు ఎడతెరిపిలేని వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతుంటే.. మరోవైపు తెలంగాణ మాత్రం వరుణుడి కరుణ లేక విలవిల్లాడుతోంది. ప్రస్తుతం రుతుపవనాల కదలిక నెమ్మదిగా ఉంది. ఆకాశం మేఘావృతంగా కనిపించినప్పటికీ.. బలమైన ఉపరితల గాలుల ప్రభావంతో వర్షాల నమోదు ఆశించినంతగా లేదు. గత వారం రోజులుగా కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు మినహా పొడి వాతావరణమే కనిపించింది. ఈనెల 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉంటుందని.. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, చిరుజల్లులు కురవవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణ మార్పులతో ఈ ఆరు రోజులు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకట్రెండు డిగ్రీలు అధికంగా నమోదు కావచ్చని పేర్కొన్నారు. ప్రతి మేఘం వర్షించదు.. ఆకాశంలో కనిపించే ప్రతి మేఘం వర్షాన్ని కురిపించదు. వర్షం కురవాలంటే మేఘాలు నిలువుగా 10–15 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించాలి. వాటిలో తగినంత తేమ ఉండాలి. గత వారం రోజులుగా తెలంగాణపై పరుచుకున్న మేఘాల్లో చాలా వరకు మధ్యస్థాయి, ఎత్తయినవే ఉన్నాయి. అయితే, ఇవి ఎండను తగ్గిస్తాయి కానీ వర్షాన్ని ఇవ్వవు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల గాలులు చాలా బలంగా వీస్తున్నాయి. వర్షం కురిసేందుకు మేఘాలు కేంద్రీకృతమవక ముందే, ఈ గాలులు వాటిని వేగంగా వేరే ప్రాంతాలకు చెదరగొడుతున్నాయి. ఒడిశా తీరంలో ఏర్పడిన వాయుగుండం ఒక బలమైన వ్యాక్యూమ్‌లా పనిచేసింది. దీని వల్ల వాతావరణ పీడనంలో తీవ్రమైన వ్యత్యాసం ఏర్పడి, నైరుతి రుతుపవన గాలులను అది తనవైపునకు బలంగా లాక్కుంది. తెలంగాణ మీదుగా గంటకు 60–70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయడానికి ఇదే ప్రధాన కారణం. అలాగే రుతుపవనాలకు సంబంధించిన ’లో–లెవల్ జెట్’ (వాతావరణంలో కింది స్థాయిలో వీచే అత్యంత వేగవంతమైన గాలుల ప్రవాహం) కోర్ భాగం తెలంగాణ మీదుగానే పయనిస్తోంది. అయితే, ఇవి భూమికి సమాంతరంగా అత్యంత వేగంగా వెళ్లడంతో వాటి తీవ్రత వల్ల మేఘాలు ఏర్పడే ప్రాథమిక దశలోనే చెదిరిపోయి వానలు పడటంలేదు. తేమ తగ్గి గాలి పొడిగా మారడం పశ్చిమ కనుమలలో భారీ వర్షాలు కురిపించిన తర్వాత, ఈ వేగవంతమైన పశ్చి మ గాలులు తెలంగాణ వైపు కిందికి దిగుతాయి. ఇలా కిందికి దిగే క్రమంలో గాలి వేడెక్కి, అందులోని తేమశాతం అకస్మాత్తుగా పడిపోతుంది. ఈ పొడి వాతావరణం కొత్త మేఘాల ఏర్పాటును అడ్డుకుంటుంది. అలాగే వర్షం కురవాలంటే వాతావరణంలోని తేమ ఒకచోట చేరి నిలకడగా ఉండాలి. కానీ, ఈ అతివేగపు గాలులు కన్వేయర్ బెల్ట్‌లా పనిచేస్తూ, గాలిలోని కొద్దిపాటి తేమను కూడా తెలంగాణలో నిలవనివ్వకుండా వాయుగుండం వైపు వేగంగా లాగేసుకుంటున్నాయి. అందుకే పశ్చి మ కనుమలలో వర్షాలు పడుతున్నా, మేఘాలతో వాతావరణం అనుకూలంగా కనిపిస్తున్నా.. మనకు వర్షాలు రావడం లేదు.వేగవంతమైన గాలుల వల్లే.. రాష్ట్రంలో వాతావరణం చల్లబడినప్పటికీ.. వానలు కురవకపోవడానికి వేగంగా వీస్తున్న గాలులే ప్రధాన కారణం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రత తగ్గి అల్పపీడనంగా మారింది. ఒకట్రెండు రోజుల్లో సాధారణ వాతావరణం ఏర్పడుతుంది. ఈసారి వానలు కురవకపోవడంలో ప్రధాన కారణం ఎల్‌నినో పరిస్థితులని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈనెలలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే తక్కువ వర్షాలు కురుస్తాయి. – శ్రీనివాసరావు, హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ సైంటిస్ట్ -
ఉఫ్.. ఖరీఫ్
వ్యవసాయానికి వాతావరణం అనుకూలించడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు కరుణించడం లేదు. దీంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. అన్నదాతలకు దిక్కుతోచని దుస్థితి దాపురించింది. తీవ్రమైన కరువు తలెత్తే ప్రమాదం పొంచి ఉందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో మరింత ఆందోళన చెందుతున్నారు. అరకొర జల్లులతో సేద్యం చేయలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు సైతం అడుగంటి పోతున్నాయని వాపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇప్పటికే సాగు చేసిన పంటలను సైతం నష్టపోతామని దిగాలుపడుతున్నారు.సాక్షి ప్రతినిధి, తిరుపతి : వ్యవసాయంలో ఆరుద్ర నక్షత్రం, మృగశిర కార్తె వర్షాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది, ఆరుద్ర కరుణిస్తే దారిద్య్రం ఉండదని అన్నదాతల నమ్మకం. ఆరుద్ర నక్షత్రంలో వర్షాలకు కురిస్తే.. వరుసగా ఆరు కార్తెలు వానలు ఉంటాయని పల్లెల్లో సామెతలు ఉన్నాయి. పంటలు సాగు చేసేందుకు అదే సమయంలో దుక్కులు సిద్ధం చేసే పనిలో రైతులు బిజీబిజీగా గడుపుతారు. కానీ, ఈ సారి ఎల్‌నినో కారణంగా వర్షాలు కురవక పోవడంతో ఖరీఫ్‌పై ఆశలు సన్నగిల్లాయి. అందులో భాగంగానే ఖరీఫ్ సాగు నెమ్మదించిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జూలైతో పోలిస్తే ప్రస్తుతం వాతావరణంలో చాలా తేడా కనిపిస్తోంది. వరుణుడు ఊరించి ముఖం చాటేస్తున్నాడు. మబ్బులు కమ్ముకున్నప్పటికీ చిన్నపాటి జల్లులకే పరిమితం అవుతున్నాడు. నిత్యం భారీ వర్షాలు అని వాతావరణ శాఖ చేస్తున్న ప్రకటలను సైతం తలకిందులు చేస్తున్నాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడా ఆశించిన స్థాయిలో వానలు పడడం లేదు. దీంతో పంటలపై భారీ ఆశలు పెట్టుకున్న రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయి ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉప్ణోగ్రతలు నేపథ్యంలో పంటకు వదిలిన నీరు వెంటనే ఆవిరైపోతున్నాయి. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివోలుతోపాటు పలు ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు వరిపంట సాగుచేశారు. అయితే పంటకు నీరు అందక ఎండిపోతున్న క్రమంలో ఆందోళన చెందుతున్నారు. చెరువులు సైతం నీరు లేక బావురుమంటున్నాయి.. సమీప ప్రాంతాల్లోని చిన్న చిన్న బావుల్లో ఉన్న నీటిని వరిపంటను తడుపుకోవడానికి ప్లాస్టిక్ పట్టల ద్వారా రైతులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా నీరు అవిరైపోపోతోది. ఒక్క ముచ్చివోలు గ్రామంలోనే 500 ఎకరాలకు పైగా వరి పంట ఎండిపోయిందని రైతులు వాపోతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. సూపర్ ఎల్‌నినోతో కరువు? ఇప్పటికే ప్రభావం చూపుతున్న ఎల్‌నినో మరింత ప్రమాదకరంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది శీతాకాలం నాటికి సూపర్ ఎల్నినోగా మారే అవకాశముందని వాతావరణ శాఖ, వ్యవసాయశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. రుతుపవనాలు బలహీనంగా ఉన్నా యని చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 ప్లస్ డిగ్రీలకు చేరుకోవడాన్నే సూపర్ ఎల్‌నినో అంటారని వివరిస్తున్నారు. పడిపోతున్న నీటి నిల్వలు తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. వర్షాలు లేక అడవుల నుంచి ఎలాంటి ఇన్‌ఫ్లో లేక పోవడంతో జలాశయాలు అడుగంటిపోతున్నాయి. కల్యాణీ, తెలుగుగంగ, కండలేరు, స్వర్ణముఖి, నీవా నది పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. అదే విధంగా చెరువుల్లో నీరు ఖాళీ అవుతోంది. ఫలితంగా ఇప్పటి వరకు సాగైన పంటలు గట్టెక్కుతాయా?లేదా? అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అయోమయంలో అన్నదాతలుఓ వైపు వాతావరణం అనుకూలించక తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే.. మరో వైపు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలు మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 44,267 హెక్టార్లు ఉంటే.. ఇప్పటి వరకు కేవలం 7,374 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేశారు. ఇందులో వేరుశనగ 21వేల హెక్టార్లకుపైగా సాగవ్వాల్సి ఉంది. అందుకు తగ్గట్టే జిల్లాకు 27వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కేటాయించినట్లు ప్రభుత్వం ఏప్రిల్‌లో ప్రకటించింది.. అయితే ఇప్పటి వరకు పంపిణీ చేసింది కేవలం 6వేల క్వింటాళ్లు మాత్రమే. విత్తనాల గురించి అధికారులను అడిగితే.. రాలేదనే సమాధానం వస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే ఇంకా 21వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయలేక చేతులెత్తేశారని చెప్పొచ్చు. తిరుపతి జిల్లాలో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3,456 హెక్టార్లు ఉంటే.. ఇప్పటి వరకు సాగైంది 1,106 హెక్టార్లు మాత్రమే. వరి సాధారణ విస్తీర్ణం కంటే.. అధికంగా సాగైనా రైతులకు యూరియా కష్టాలు తప్పలేదు. ప్రైవేటు ఎరువు దుకాణాల్లో యూరియా బస్తా కావాలంటే రెండు నానో డీఏపీ ప్యాకెట్లు లేదా నానో యూరియా కొనాలని ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. -
చైనాలో ఊహించని విపత్తు.. తప్పించుకున్న 900 పాములు
బీజింగ్: చైనాపై ప్రకృతి పగబట్టింది. తీవ్రమైన వరదలు, భారీ వర్షాలతో డ్రాగన్ దేశం అతలాకుతలమవుతోంది. దేశంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, గ్వాంగ్జీ (Guangxi) ప్రాంతంలో ఒక వింతైన, భయంకరమైన పరిస్థితి తలెత్తింది. వరద నీటి ఉధృతికి స్థానిక పెంపకం కేంద్రాల నుంచి వందలాది పాములు తప్పించుకుని ఊళ్లపై పడటంతో అధికారులు, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాల ప్రకారం.. గ్వాంగ్జీ ప్రాంతంలో వరదలు ముంచెత్తడంతో దాదాపు 900కు పైగా పాములు పెంచే కేంద్రాల నుంచి బయటకు వచ్చాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైన నాగుపాములు వంటి విషసర్పాలు కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. లోతైన వరద నీటిలో పాములు ఈదుకుంటూ వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.గ్వాంగ్జీ పరిధిలోని హెంగ్‌జౌ నగరంలో వరద నీరు,రోడ్లు బ్లాక్ అవ్వడం వల్ల ఒక విషాదం చోటుచేసుకుంది. వరదల్లో కొట్టుకువచ్చిన పాము కాటుకు గురైన ఒక మహిళ, సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేక ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో, పాము కాటు బాధితులకు తక్షణ చికిత్స అందించేందుకు ప్రభుత్వం తాత్కాలిక వైద్య క్లినిక్‌లను ఏర్పాటు చేసింది.అలాగే తప్పించుకున్న పాములను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. చైనాలోనే సాంప్రదాయ వైద్యం, తోలు ఉత్పత్తులు మాంసం కోసం వాడే వాణిజ్య పాముల పెంపకానికి గ్వాంగ్జీ అతిపెద్ద కేంద్రం. ఇక్కడ సుమారు 3 కోట్లకు పైగా సర్పాలను పెంచుతుంటారు. హెంగ్‌జౌ పరిసరాల్లోని పలు గ్రామాలు నీట మునగడంతో ఈ పాములన్నీ వరద నీటిలోకి చేరాయని ప్రాంతీయ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. విపత్తులు, విషసర్పాల ప్రమాదం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అత్యవసర సహాయక చర్యలను పూర్తిస్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. 📌 Hengzhou, #China 🇨🇳 July 6 /2026After days of heavy rain 🌧️ and flooding across China, around 900 snakes 🐍 escaped from a breeding farm in Hengzhou. Reports say the reptiles included venomous cobras, with villagers attempting to catch them in the floodwaters. pic.twitter.com/cTcgAZ4nZd— CAUGHTIN4KHQ (@CaughtIn4KHQ) July 9, 2026 -
భారీ వర్షాలతో దెబ్బకు కుంగిన రోడ్డు..
-
నీట మునిగిన దేశ రాజధాని.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అధికారులు
-
ముంబై జలమయం..పౌరుల నిర్లక్ష్యమే కారణం : బాంబే హైకోర్టు
ముంబై: నగరంలో ప్రతి ఏటా వర్షాలకు రోడ్లు చెరువులను తలపించడం అనేది పౌరులు స్వయంగా కొనితెచ్చుకున్న సంక్షోభమేనని బాంబే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజలు భూములను ఆక్రమించడం, మురుగు కాలువలను పూడ్చివేయడం, ప్రభుత్వ మౌలిక వసతులను దుర్వినియోగం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని కోర్టు పేర్కొంది .తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర వి. ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖద్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ప్రజలు మురుగు కాలువలలో చెత్త వేయడం,నడిచే దారులను అక్రమ పార్కింగ్ స్థలాలుగా మార్చడం, ఫుట్‌పాత్‌లను ఫుడ్ స్టాళ్లతో ఆక్రమించడం వల్లే ముంబై నగరం మునిగిపోవడానికి కారణమవుతోందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది .హైకోర్టు వెలుపల ఉన్న ఫుట్‌పాత్‌లను సైతం అక్రమ దుకాణాలతో ఆక్రమించేశారని జస్టిస్ ఘుగే ఈ సందర్భంగా గుర్తుచేశారు. మన మాతృభూమిని మనమే దోచుకోవడం అలవాటుగా మార్చుకున్నాం. అక్రమంగా భూములను ఆక్రమించుకోవడం, ఆ తర్వాత కూల్చివేత నోటీసులు వచ్చినప్పుడు మాత్రమే చట్ట పుస్తకాలను వెతకడం సరికాదు అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. -
భారీ వర్షాలకు కూలిన మట్టిదిబ్బ
వయనాడ్/తిరువనంతపురం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కేరళలోని వయనాడ్‌లో భారీ విపత్తుకు కారణమైంది. కోజికోడ్ – వయనాడ్ జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన భారీ జంట సొరంగ మార్గం కోసం తవి్వన మట్టి వర్షం కారణంగా అకస్మాత్తుగా జారిపోవడంతో ముగ్గురు మరణించగా పదిమంది గాయపడ్డారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. వయనాడ్ జిల్లాలోని కల్లడి ప్రాంతంలోని మేప్పడి గ్రామం వద్ద నిర్మాణమవుతున్న మీనాక్షి వంతెన వద్ద మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.కుప్పగా పోసిన మట్టిని తొలగించాలని జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సొరంగం నిర్మిస్తున్న కాంట్రాక్టర్లను చాలాకాలం క్రితమే హెచ్చరించినా పట్టించుకోక పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కేరళ ముఖ్యమంత్రి వి.డి.సతీశన్ వ్యాఖ్యానించారు. ‘‘ఇదో దురదృష్టకర సంఘటన. సహాయక చర్యలు చేపట్టాము’’అని తెలిపారు. వాతావరణ హెచ్చరికలు జారీ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనడం సరికాదని సకాలంలో మట్టి తొలగించకపోవడం కారణమని వివరించారు. ఉన్నట్టుండి కుప్పకూలిన మట్టిదిబ్బ... ప్రమాద దృశ్యాలతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది... ప్రత్యక్ష సాక్షులు చెప్పినదాని ప్రకారం... బ్యారికేడ్లన్నింటినీ తోసేసుకుని మట్టిదిబ్బ అకస్మాత్తుగా కుప్పకూలి పోయింది. ఈ ధాటికి ఒక ట్యాంకర్ లారీ కొట్టుకుపోయింది. అదే సమయంలో ఇంకో ప్రైవేట్ బస్సు నదిలో పడిపోయింది. పాదచారులైతే ప్రాణాలు దక్కించుకునేందుకు పారిపోతూ కనిపించారు. కొందరు మట్టిలో కూరుకుపోగా... మరికొందరు ఇరుగుపొరుగు సాయంతో బయటపడ్డారు. స్నిఫర్ డాగ్‌ల సాయంతో మట్టిలో కూరుకుపోయిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.కశ్మీర్లో మెరుపు వరదలు జమ్మూ: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. మంగళవారం ఉదయం కొండ ప్రాంతాల నుంచి ప్రవేశించిన వరదతో థాత్రి పట్టణంలో పలు దుకాణాలు, ఇళ్లు, వాహనాలకు నష్టం వాటిల్లింది. భారీగా దొర్లి పడ్డ రాళ్లు, కొట్టుకువచ్చిన మట్టి, వేళ్లతో సహా పెకిలించుకువచ్చిన చెట్లు పట్టణంలో ఎక్కడ చూసినా మేట వేశాయి. థాత్రి పట్టణంలో దోడా–కి‹Ù్తవార్ రహదారి మూసుకుపోయింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనాలు పెద్ద సంఖ్యలో మట్టి, బురదలో కూరుకుపోయాయి. మట్టిదోడా, కిష్త్వార్ జిల్లాల్లో రెండు రోజుల వ్యవధిలో ఇలా మూడు చోట్ల మెరుపు వరదలు సంభవించాయి.ప్రాణం దక్కించిన పరుగువయనాడ్లో జరిగిన ప్రమాదం నుంచి దంపతులిద్దరు భలే తప్పించుకున్నారు. మట్టిదిబ్బ కూలే క్రమంలో కట్టలు తెంచుకుని అడ్డంకులను దాటుకుని బురద శరవేగంగా దూసుకొస్తూంటే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పలువురు పరుగురు పెట్టడం వీడియోలో కనిపించింది. అందరి ప్రాణాలు ఆ మట్టిలోనే కలిసిపోతాయని అందరూ అనుకున్నారు.బురద మనుషులతోపాటు ట్యాంకర్ వంటి భారీ వాహనాలను కూడా తనతో ఈడ్చుకెళ్లింది. ట్యాంకర్ కాస్తా బ్రిడ్జికి ఆవల నిలిపిన జీప్‌ను గుద్దుకోవడమూ కనిపించింది. ఆ దంపతులు కూడా కొట్టుకుపోయారని అందరూ అనుకున్నారు కానీ సెకన్ల తరువాత ఇద్దరూ లారీకి, జీపుకు మధ్య నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ‘‘నిర్మాణం జరిగే చోట బస్సు కోసం ఎదురు చూస్తున్నాం. అకస్మాత్తుగా మట్టి మావైపు దూసుకొస్తూ కనిపించింది. వంతెనకు అడ్డంగా పరుగెత్తాం. వెనుక నుంచి చుట్టేసిన మట్టి మమ్మల్ని దూరంగా తోసేసింది. ఇద్దరం పడిపోయాం. లారీతోపాటు కొట్టుకుపోతున్నాం.లారీ కింద పడిపోతానేమో అనిపించింది. కానీ దాని పక్కన నుంచి వెళ్లిపోయాం. ప్రాణాలతో ఎలా బయటపడ్డామో ఇప్పటికీ తెలియడం లేదు’’అని బాధిత మహిళ తన భయంకర అనుభవాన్ని వివరించింది. మట్టి కనిపించగానే పరుగు లంకించుకున్నామని, బురదలో కొట్టుకుపోతున్న తమకు లారీ కనిపించలేదని ప్రమాదం నుంచి బయటపడ్డ భర్త తెలిపారు. -
ఇల్లు మారాలనుకున్నారు : అంతలోనే కుటుంబం సజీవ సమాధి
దేశ వాణిజ్య నగరం ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక అక్రమ భవనం కూలిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ముంబైలోని మాన్‌ఖుర్ద్ పరిధిలో గల మండాలా (జనతా నగర్) ప్రాంతంలో భారీ వర్షాల వల్ల ఒక నాలుగు అంతస్తుల అక్రమ కట్టడం పక్కనే ఉన్న రేకుల ఇళ్లపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. వారంతా ఆ మర్నాడే ఇల్లు మారాలనుకున్నారు. ఇంతలోనే మృత్యువు వారిని వెంటాడింది.ప్రమాదాన్ని ముందే ఊహించినారోజువారీ కూలిగా పనిచేసే మొయినుద్దీన్ వాజిద్ అలీ షా, ఆయన భార్య అక్తర్ జహాన్ తమ నలుగురు పిల్లలతో కలిసి ఒక రేకుల ఇట్లో నివసిస్తున్నారు. అయితే పక్కనే ఉన్న భవనం వర్షాలకు దెబ్బతిని, కూలిపోయేలా ఉందని వారు ముందే ప్రమాదాన్ని పసిగట్టారు. ఆదివారం నాడే ఆ ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు.. మనం బతికిపోతాం అని భార్యాబిడ్డలతో చెప్పాడు. ఫుడ్ తీసుకు రావడానికి అలా బయటికి వెళ్లాడో.. లేదో 10 నిమిషాల్లో అంతా ముగిసిపోయింది.శనివారం రాత్రి అక్తర్ జహాన్ ఇల్లు మారడానికి సామాన్లు ప్యాక్ చేసుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం ఒక్కసారిగా వారి ఇంటిపై కూలిపడింది. మొయినుద్దీన్ ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందే బయటకు వెళ్లడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, ఇంట్లోనే ఉన్న భార్య, నలుగురు పిల్లలు శిథిలాల క్రింద చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఐదుగురు చిన్న పిల్లలే ఉన్నారు. ఇందులో పొరుగింట చిన్నారి కూడా ఉంది. భవనం కూలిపోవడానికి కొన్ని గంటల ముందే అందులో స్పష్టమైన మార్పులు కనిపించాయని స్థానికులు తెలిపారు. గోడలకు పగుళ్లు రావడం, టైల్స్ ఊడిపడటం, భవనం ఒక పక్కకు వంగిపోవడంతో ఆ బిల్డింగ్‌లో ఉంటున్న కుటుంబాలు ముందే ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. అలా వారు ప్రాణాలు దక్కించుకున్నప్పటికీ, ఆ భవనం పక్కనే ఉన్న పేదల రేకుల షెడ్లపై పడటంతో ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.ఇదీ చదవండి: నీళ్లు ఇవ్వకపోతే..యుద్ధమే : రంకెలేస్తున్న పాకిస్థాన్ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసింది. కూలిపోయిన ఆ అక్రమ కట్టడం యజమానిని, దానిని నిర్మించిన కాంట్రాక్టర్‌ను పోలీసులుఅరెస్ట్ చేశారు. భవన నిర్మాణంలో భద్రతా ప్రమాణాల ఉల్లంఘన కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముంబై మున్సిపల్ అధికారులు కూడా అది అనధికారిక కట్టడమేనని ధృవీకరించారు. మరోవైపు ముంబై ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, స్థానిక మున్సిపల్ సిబ్బంది రాత్రంతా శ్రమించి శిథిలాల కింద ఉన్నవారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.ఇదీ చదవండి: హాట్ టాపిక్‌గా బిగ్‌బీ అమితాబ్ రూ. 15 కోట్ల ల్యాండ్ డీల్ -
LIVE: మళ్లీ వయనాడ్‌లో... ప్రమాదంలో 50 మంది కార్మికులు!
-
ఉత్తరాదిలో ఉప్పెన వరదలతో కొట్టుకుపోతున్న నార్త్..
-
వరుణుడు ఉగ్రరూపం మునిగిన ముంబై
-
ఆ జిల్లాలకు భారీ వర్షాల ముప్పు.. IMD అలర్ట్!
-
ఆకాశానికి చిల్లు పడిందా? ముంబైలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
-
వర్షం కోసం గాడిదలకు పెళ్లి
వర్షాలు కురవకపోవడంతో బెళగావి జిల్లా మూడలగి తాలూకా మున్యాళ గ్రామస్తులు గాడిదలకు వివాహం జరిపించారు. ఈ తతంగం చాలాచోట్ల జరిగేదే అయినా మున్యాళ గ్రామస్తులు ఒక అడుగు ముందుకేసి వివాహ ఆహ్వానపత్రికలు ముద్రించి పంపిణీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం మగ గాడిదకు కాంతేశ్ అని, ఆడ గాడిదకు కస్తూరి అని నామకరణం చేసి శాస్తోక్తంగా వివాహం జరిపించారు. పెళ్లికి విచ్చేసిన వారికి విందు భోజనం ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, ఇలాంటి పరిస్థితిలో ఆనాదిగా వస్తున్ప ఆచారం ప్రకారం గాడిదలకు వివాహం జరిపించామన్నారు. - దొడ్డబళ్లాపుర(కర్ణాటక) -
ముంబైలో వర్ష బీభత్సం: ఆరుగురు మృతి
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా తూర్పు ముంబై పరిధిలో భవనం కూలి ఐదుగురు చిన్నారులు, ఒక మహిళ సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నగరవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలగడంతో పాటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. VIDEO | At least six persons were killed and one sustained injuries when a three-storey chawl (row tenement) collapsed in Mumbai’s Mankhurd area amid heavy rains on Sunday night, officials said. Rescue operation is going on. Visuals are from the spot.#Mumbai #Mankhurd pic.twitter.com/IHXyvlRdyP— Press Trust of India (@PTI_News) July 5, 2026భారీ వర్షాల కారణంగా ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలను నిలిపివేసి, రహదారిని మూసివేశారు. టన్నెల్ పైభాగం నుండి వర్షపు నీరు జలపాతంలా కిందకు పడటం, రహదారిపై రోడ్డు నిర్మాణ శిథిలాల చరియలు విరిగిపడిన దృశ్యాలు స్థానిక టెలివిజన్ ఛానళ్లలో ప్రసామవుతున్నాయి. రహదారి రవాణాతో పాటు విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముంబై-పూణె మధ్య నడిచే దూరప్రాంత రైళ్లను సైతం అధికారులు రద్దు చేశారు. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గత నెల చివర నుంచి కురుస్తున్న వర్షాల ధాటికి నగరంలో చెట్లు విరిగిపడి ఇప్పటివరకు మరో ముగ్గురు మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ముంబై నగరంలో సగటున 100 మిల్లీమీటర్ల (3.9 అంగుళాలు) కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 161 మిల్లీమీటర్ల (6.3 అంగుళాలు) వరకు వర్షం కురిసింది. ఇదిలా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సోమవారం చాలా చోట్ల చాలా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.ఇది కూడా చదవండి: రుతుపవనాలు ఉధృతం.. పలు నగరాలు అతలాకుతలం! -
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో డెంగీ..
సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, వర్షాకాలంలో ఎక్కువ విరామాలు ఉండటం డెంగీ వ్యాప్తికి అనుకూల పరిస్థితులను సృష్టిస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. సరైన వర్షాలు కురవకపోతే డెంగీ జ్వరంకారక ఏడిస్ ఈజిప్టి దోమల గుడ్లు, లార్వాలు నాశనం కాకుండా ఎక్కువకాలం జీవించి, వర్షాలు మొదలయ్యాక భారీ స్థాయిలో దోమలుగా మారే అవకాశం ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డెంగీ ముప్పును రెండు నెలల ముందే గుర్తించే కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థను పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ (ఐఐటీఎం) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ అధ్యయన ఫలితాలు అంతర్జాతీయ జర్నల్ ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’లో ప్రచురితమయ్యాయి.12 ఏళ్ల డేటాతో అధ్యయనం ఈ పరిశోధనకు ఐఐటీఎం శాస్త్రవేత్త డాక్టర్ రోహిత్ మాథ్యూ కోల్ కరస్పాండింగ్ రచయితగా, సోఫియా యాకోబ్ తొలి రచయితగా వ్యవహరించారు. 2004 నుంచి 2015 వరకు పుణేలో నమోదైన డెంగీ మరణాల వివరాలను, అదే కాలానికి సంబంధించిన ఉష్ణోగ్రత, వర్షపాతం, సాపేక్ష తేమ (రిలేటివ్ హ్యుమిడిటీ) వంటి వాతావరణ సమాచారాన్ని విశ్లేషించారు. సాధారణ గణాంక పద్ధతులతోపాటు ఏఐ, మెషీన్ లెర్నింగ్ సాంకేతికతలను ఉపయోగించి వాతావరణ పరిస్థితులు డెంగీపై చూపే ప్రభావాన్ని అంచనా వేశారు. అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడిన 2 నుంచి 5 నెలల తర్వాత డెంగీ మరణాలు పెరుగుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు.ఎల్‌నినోతో పెరిగే ముప్పువర్షాకాలమంతా మోస్తరు వర్షాలు కురిసిన సంవత్సరాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఒక వారంలో 15 సెం.మీ.కుపైగా భారీ వర్షాలు కురిస్తే దోమల గుడ్లు, లార్వాలు కొట్టుకుపోవడంతో వ్యాప్తి తగ్గింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గినప్పుడు ఈ గుడ్లు, లార్వాలు సురక్షితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అలాగే 27 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత, 60–78 శాతం సాపేక్ష తేమ ఉన్నప్పుడు ఏడిస్ దోమలు వేగంగా అభివృద్ధి చెందుతాయని గుర్తించారు. ఈ దోమల గుడ్లు పొడి వాతావరణంలో 8 నెలల వరకు జీవించగలవని కూడా అధ్యయనం పేర్కొంది.రెండు నెలల ముందే హెచ్చరిక సగటు ఉష్ణోగ్రత, మొత్తం వర్షపాతం, సాపేక్ష తేమ వంటి వాతావరణ సూచీల ఆధారంగా రూపొందించిన ఏఐ–మెషీన్ లెర్నింగ్ మోడల్ డెంగీ ముప్పును సుమారు 2 నెలల ముందే అంచనా వేయగలదని పరిశోధకులు వెల్లడించారు. దీంతో ఆరోగ్య శాఖలు ముందుగానే ఫాగింగ్, లార్వా నిర్మూలన, పారిశుద్ధ్య చర్యలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, పడకలు, వైద్య సిబ్బందిని సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు డెంగీ నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. -
Big Breaking : మరో 24 గంటల్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు
-
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి: వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ గురువారం తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40, 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం శ్రీకాకుళం, పోలవరం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. -
ఎండలు చురచుర వానలు అరకొర
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్ పావు వంతు ముగిసింది. నాలుగు నెలల పాటు కొనసాగే నైరుతి సీజన్లో రెండో నెలగా భావించే జూలై వాతావరణ అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం, అంతకంటే తక్కువ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కానీ ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది. సీజన్ సాధారణ వాతావరణం కంటే భిన్నంగా ఉంటుందని హెచ్చరించింది. సాధారణంగా జూలైలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కానీ పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు బలపడుతుండటంతో ఆ ప్రభావం వర్షాలపై తీవ్రంగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్లో కీలకమైన హిందూ మహా సముద్రంలో వాతావరణ పరిస్థితులు తటస్థంగా ఉండటం వర్షాభావ పరిస్థితులకు సంకేతంగా చెప్పొచ్చు. ఐఎండీ పరిశీలన ప్రకారం.. రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి వాతావరణ అంచనాలను విడుదల చేసింది. వర్షాల అంచనాలతో పాటు ఉష్ణోగ్రతల స్థితిని కూడా అంచనా వేసింది. ⇒ ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది ⇒ మధ్య తెలంగాణ ప్రాంతంలోని రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో సీజన్లో సగటు సాధారణ వర్షపాతానికి దగ్గరగా గణాంకాలు నమోదు కావొచ్చు ⇒ దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు సమీప ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చు ⇒ తూర్పు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో సాధారణ సగటు వర్షపాతం నమోదు కావొచ్చు అంతటా అధిక ఉష్ణోగ్రతలే.. నైరుతి సీజన్లో వర్షాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. సీజన్ ముగిసే నాటికి చలి తీవ్రత మొదలవుతుంది. కానీ ఈసారి నైరుతి సీజన్లో ఇంకా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వానలు ఆశించినంతగా లేకపోవడం, వాతావరణంలో మార్పులతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. జూన్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనా జూలై నాటికి భారీగా తగ్గుముఖం పడతాయి. కానీ ఈసారి జూలైలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీల్లోపు నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు అంతకంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలే కాకుండా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండనున్నాయి. -
3న బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి: వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ బంగ్లాదేశ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈనెల 3 నాటికి వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీనికితోడు ఏపీ, యానాం పరిధిలోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల గాలులు బలంగా వీస్తున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా పరిధిలో గురువారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మూడు రోజుల పాటు ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. -
AP: వచ్చే ఐదు రోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో అల్పపీడనంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. ఉత్తర కోస్తాలో ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిసే అవకాశముందన్న ఐఎండీ.. సముద్ర వాతావరణం అలజడిగా ఉంటుందని పేర్కొంది. రానున్న ఐదు రోజుల పాటు మత్స్యకారులు అప్రమత్తంగా అండాలని ఐఎండీ హెచ్చరించింది.దేశవ్యాప్తంగా జూలై నెలలోనూ సాధారణం కంటే తక్కువ వానలే కురిసే అవకాశమున్నట్లు ఐఎండీ తెలిపింది. దేశంలో దీర్ఘకాల(1971–2020) సగటు వర్షపాతం జూలైలో 280.4 మిల్లీ మీటర్లు కాగా, ఇందులో 94 శాతం మేర కురిసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. జూన్‌లో దేశం మొత్తమ్మీద 40 శాతం వరకు లోటు వర్షపాతం నమోదవ్వగా, మధ్య భారతంలో ఈ లోటు అత్యధికంగా 50.4 శాతం వరకు ఉందని ఐఎండీ తెలిపింది. -
ముంబైలో భారీ వర్షాలు.. అంధేరి సబ్వే బంద్
ముంబై : భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ముంబై నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. అంధేరి సబ్వేలో నీరు భారీగా నిలిచిపోవడంతో అధికారులు రవాణాను నిలిపివేసి, ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో రోడ్లు దిగ్బంధనమయ్యాయి. డీఎన్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒక భారీ వృక్షం బస్సుపై కూలగా, ఈస్టర్న్ ఫ్రీవేపై తక్కువ విజిబిలిటీ (కనిపించే సామర్థ్యం) కారణంగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సాధారణంగానే నడుస్తున్నప్పటికీ, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ తీవ్రంగా నెమ్మదించింది. #WATCH | Maharashtra: Heavy rain lashes parts of Mumbai as monsoon intensifies across Maharashtra; visuals from the Eastern Freeway pic.twitter.com/c9fwaUNI70— ANI (@ANI) June 30, 2026ఈ వాన బీభత్సంలో ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. చేంబూరు రోడ్ నంబర్ 11 వద్ద యూనివర్సల్ హైస్కూల్, తిలక్ నగర్ స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సుపై భారీ చెట్టు కూలిపోవడంతో 11 ఏళ్ల విద్యార్థి మరణించాడు. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స కోసం స్థానిక జెన్, జైన్ ఆసుపత్రులకు తరలించారు. కాగా, నగరంలో పాఠశాలలు, కళాశాలల సెలవులపై బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లేదా జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తల్లిదండ్రులు తమ పిల్లల పాఠశాల యాజమాన్యాలను సంప్రదించి అప్డేట్స్ తెలుసుకోవాలని సూచించారు.వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. తీరప్రాంత కోంకణ్ రీజియన్, పూణే ఘాట్ ప్రాంతాలకు భారీ నుండి అతి భారీ వర్షాల సూచనతో ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేయగా, పూణే సిటీకి ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించారు. ప్రజలు అనవసర ప్రయాణాలు చేయవద్దని, బలహీనమైన నిర్మాణాలు, చెట్ల కింద ఉండవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం 12:35 గంటలకు 4.16 మీటర్ల ఎత్తులో సముద్రపు పోటు వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు వెల్లడించారు. -
జులైలో వానలు! విశాఖ IMD గుడ్ న్యూస్
-
తెలంగాణలో వానల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రైతన్నలు. పలు జిల్లాల్లో లోటు వర్షపాతం
-
తొలిమాసం.. లోటు వర్షపాతం..
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్ మొదటి నెల నిరాశే మిగిల్చింది. ఎలినినో ప్రభావంతో రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయి. జూన్ 1 నుంచి సెపె్టంబర్ 30 వరకున్న కాలాన్ని నైరుతి రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. సీజన్లో తొలి మాసమైన జూన్‌లో ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 14 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు జూన్ 8న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. తొలివారం కొంత చురుకుగా ముందుకు సాగినప్పటికీ... ఆ తర్వాత మందగించడంతో రుతుపవనాల వ్యాప్తి జూన్ మూడో వారం నాటికి రాష్ట్రమంతటికీ విస్తరించగా... ఆ తర్వాత వర్షాలు నమోదయ్యాయి. జూన్‌లో రాష్ట్రంలో 13.03 సెం.మీ. సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... ఇ ప్పటివరకు 11.3 సెం.మీ. వర్షపాతమే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 14 శాతం తక్కువగా వానలు కురిశాయి. గతేడాది జూన్‌లో 9.37 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా... 21 శాతం లోటు నమోదైంది. 16 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయి. హనుమకొండ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయి. ఇక్కడ 75 శాతం లోటు నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ వెల్లడించింది. మరో 15 జిల్లాల్లో లోటు వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో సాధారణ వర్షాలు నమోదు కాగా... మరో 5 జిల్లాల్లో అధిక వర్షాలు కురిశాయి. గతేడాదితో పోలిస్తే సగటు వర్షపాతం మెరుగ్గా కనిపిస్తున్నా... వర్షాలు ఆలస్యం కావడం... కీలకమైన జిల్లాల్లో తేలికపాటి వానలే కురవడంతో సాగు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జూన్‌లో అరకొర వర్షాలు నమోదుకాగా.. వచ్చే నెల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రధానంగా మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ఆశించినస్థాయిలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.ఏ జిల్లాలో ఎలా ఉందంటే... తీవ్ర లోటు: హనుమకొండ లోటు: ఆదిలాబాద్, మంచిర్యాల, ని జామాబాద్, జగిత్యాల, వరంగల్, క రీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్–మల్కాజిగిరి, జోగులాంబ గద్వాల, వనపర్తి సాధారణం: కుమ్రుంభీం ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబుబాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట్ అధికం: రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మంజూన్.. అసాధారణందేశంలో వర్షపాతం కేవలం 85.2 మి.మీ. గత 125 ఏళ్లలో ఇలా జరగడం ఐదోసారి దక్షిణాది రాష్ట్రాల్లో 31 శాతం లోటు న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అసాధారణ వాతావరణ పరిస్థితులతో ఈ ఏడాది జూన్ నెల ప్రజలను అల్లాడించింది. ఈ నెలలో వాతావరణం సాధారణానికి భిన్నంగా, ఆందోళనకరంగానే కనిపించింది. దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి 28 వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 149.8 మి.మీ. కాగా, కేవలం 85.2 మి.మీ. మాత్రమే నమోదైంది. సుమారు 43 శాతం లోటు ఏర్పడింది. భార త వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా నివేదిక ప్రకారం, ఇలాంటి వాతావరణ పరిస్థితు లు ఏర్పడటం గత 125 ఏళ్లలో ఇది ఐదోసారి. జూన్‌లో 100 మి.మీ. కంటే తక్కువగా వర్షపాతం నమోదుకావడమనేది గతంలో 1905, 1926, 2009, 2014 సంవత్సరాలలో మాత్రమే జరిగింది. నైరుతి రు తుపవనాలు కేరళను కొంచెం ఆలస్యంగా జూన్ 4న తాకినప్పటికీ, ఆ తర్వాత దేశవ్యాప్తంగా వాటి విస్తరణ పూర్తిగా మందగించింది. భారీ లోటు వర్షపాతం... ప్రాంతాల వారీగా చూస్తే, మధ్య భారతదేశంలో అత్యధికంగా 56 శాతం లోటు ఏర్పడింది. ఈశాన్య రాష్ట్రాల్లో 43 శాతం, దక్షిణాదిలో 31 శాతం, వాయవ్య రాష్ట్రాల్లో 29 శాతం లోటు నమోదైంది. వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం, 1901 సంవత్సరం తర్వాత ఈ జూన్ మూడవ అత్యంత పొడి నెలగా నిలిచింది. ఇంతటి తీవ్ర వర్షపాత లోటు ఏర్పడటం 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే నమోదైంది. ఎల్‌నినో ప్రభావం కొంతమేర ఉన్నప్పటికీ... హిందూ మహాసముద్ర డైపోల్ తటస్థంగా ఉండటం, భూమధ్యరేఖ ప్రాంతంలో వర్షాలను ఇచ్చే మేఘాల వ్యవస్థ భారత్‌కు అనుకూలమైన దిశలో లేకపోవడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడం, వాయవ్య భారతం నుంచి వీచిన వేడిగాలులు క్లౌడ్ ఫార్మేషన్‌ను అడ్డుకోవడం వంటి పరిస్థితుల వల్ల రుతుపవనాలు స్తంభించిపోయాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 315 జిల్లాలు ప్రభావితం దేశంలో 724 జిల్లాలకుగాను 315 జిల్లాలు తక్కువ వర్షపాతం వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉందని కేంద్రం గుర్తించింది. వాటిలో 25 శాతం కంటే తక్కువ నీటి పారుదల సౌకర్యం ఉన్న 111 జిల్లాలను ‘అత్యంత అప్రమత్తత’జిల్లాలుగా ప్రకటించింది. ఆ జిల్లాల జాబితాలో తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు చెందిన జిల్లాలు ఉన్నాయి. వాటి కోసం ‘డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కాంటింజెన్సీ ప్లాన్స్’సిద్ధం చేశారు. -
ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు
సాక్షి, అమరావతి: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర తీరప్రాంతం నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ఈ ద్రోణి విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. వీటి ప్రభావంతో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రాంతంలో 6.8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. విజయనగరం జిల్లా రాజాంలో 5.2, గుంటూరు జిల్లా కాకుమానులో 5.1, తాడేపల్లిలో 4.5, ఎన్టీఆర్ జిల్లా కవులూరులో 4.1, బాపట్ల జిల్లా భట్టిప్రోలులో 3.9 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. -
విశాఖలో భీకర వర్షం.. APలో రెండు రోజులు వానలే వానలు
-
రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వానలు
సాక్షి, అమరావతి: ఏపీ తీరప్రాంతం నుంచి మధ్య మహారాష్ట్ర వరకు, తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా ఒక ద్రోణి విస్తరించి ఉందని శుక్రవారం వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా శని, ఆదివారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ద్రోణి ప్రభావంతో శనివారం కాకినాడ, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులకు ఆస్కారం ఉంది. ఆదివారం వర్షాల తీవ్రత మరికొన్ని జిల్లాలకు విస్తరించనుంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. -
ఖరీఫ్.. బహుపరాక్!
వాన కోసం..వర్షాలు కురవాలని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రం, ఎల్కతుర్తి మండలం సూరారం, కోతులనడుమ, ఆరెపల్లి, కమలాపూర్ మండలంలోని దేశరాజుపల్లిలో శుక్రవారం మహిళలు, గ్రామస్తులు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. డప్పుచప్పుళ్లు, మంగళవాయిద్యాల నడుమ మహిళలు బోనాలు, నీటిబిందెలతో ఊరేగింపుగా తరలివెళ్లారు. గ్రామదేవతలు పోచమ్మ తల్లి, రేణుకాఎల్లమ్మ తల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.– ఎల్కతుర్తి/భీమదేవరపల్లి/కమలాపూర్సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలో వరి సాగు అధికంగా ఉండే జిల్లాల్లో ముందస్తు కార్యాచరణ చేపట్టాలని సూచించింది. గతంలో ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపిన సంవత్సరాల్లో నమోదైన దిగుబడి నష్టాలను విశ్లేషించిన భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) అన్ని రాష్ట్రాలకు జిల్లాల వారీ కంటింజెన్సీ ప్రణాళికలను సిద్ధం చేసింది. మరోవైపు హైదరాబాద్‌లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ (క్రిడా) కూడా ఇప్పటికే తెలంగాణ సహా వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలతో సమీక్షలు నిర్వహిస్తూ రైతులు అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై మార్గదర్శకాలు జారీ చేస్తోంది. గత కరువుల ఆధారంగా విశ్లేషణ ఎల్‌నినో ప్రభావంతో గతంలో ఎక్కువ నష్టం చవిచూసిన జిల్లాలను గుర్తించేందుకు ఐసీఏఆర్ 2002, 2004, 2009 సంవత్సరాల వ్యవసాయ ఉత్పత్తి గణాంకాలను పరిశీలించింది. ఈ మూడేళ్లలో దేశంలో తీవ్రమైన వర్షాభావం నమోదైంది. తెలంగాణలోనూ కరువు ప్రభావం అధికంగా కనిపించింది. సాధారణంతో పోలిస్తే 2002లో 19%, 2004లో 13%, 2009లో 23% లోటు వర్షపాతం నమోదైంది. ఈ ప్రభావంతో 2002లో ఖరీఫ్ ఆహార ధాన్యాల ఉత్పత్తి 22 శాతానికి పైగా తగ్గగా, 2004, 2009లో సుమారు 12 శాతం చొప్పున తగ్గింది. ఈ అధ్యయనం ఆధారంగానే కేంద్రం ముందస్తు కార్యాచరణ సూచనలు జారీ చేసింది. వరి అధికంగా ఉత్పత్తి చేసే జిల్లాల్లో.. దేశంలో ప్రధాన వరి ఉత్పత్తి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ముఖ్యంగా కాళేశ్వరం, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ వంటి సాగునీటి వనరులు పెరిగినా, వర్షాభావ పరిస్థితులు ఎదురైతే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటిపోతాయి. వర్షాలు ఆలస్యమవడం లేదా మధ్యలో దీర్ఘకాల విరామం ఏర్పడితే, అవసరమైన సమయంలో నీరందక వరి పొలాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా ప్రాజెక్టుల కింద ఉండే చివరి ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం రోజుల్లో సైతం నీరు అందక పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులు ఉత్తర తెలంగాణలో వరి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని ఐసీఏఆర్ హెచ్చరించింది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగుతో పాటు పశ్చిమ తెలంగాణ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట వంటి ప్రధాన వరి జిల్లాలపై అధిక ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు తేల్చింది. క్రిడా.. కీలక సూచనలు హైదరాబాద్‌లోని క్రిడా రూపొందించిన కంటింజెన్సీ ప్రణాళికల్లో రైతులు అనుసరించాల్సిన పలు కీలక సూచనలు ఉన్నాయి. వర్షాలు ఆలస్యమైతే స్వల్పకాలిక వరి రకాలను ఎంపిక చేయడం, అవసరమైతే మొక్కజొన్న స్థానంలో జొన్న, సజ్జలు, పెసర, మినుములు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం, పుషి్పంచే దశలో రక్షణ నీటి తడులు ఇవ్వడం, ఆకులపై పోషక ద్రావణాలు పిచికారీ చేయడం ఇందులో ఉన్నాయి. గ్రామస్థాయిలో విత్తన నిల్వలు, ఎరువులు ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోవాలని, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి 24 వరకు సాధారణంతో పోలిస్తే సుమారు 42 శాతం వర్షలోటు నమోదైంది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో కేవలం 21 శాతం ప్రాంతాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితి కొనసాగితే ఖరీఫ్ సాగుపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. -
మరో మూడు రోజులు భారీ వర్షాలు
-
ఈ రాష్ట్రంలో మరో 5 రోజులు భారీ వర్షాలు
-
ఎల్ నినోను బ్లేమ్ చేయొద్దు.. అసలు కారణాలు వేరే!
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కదలికలు అనూహ్యంగా నిలిచిపోవడంతో రైతులు, వాతావరణ నిపుణుల్లో ఆందోళన పెరుగుతోంది. వర్షాలు ముందుకు సాగాల్సిన సమయంలో అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఈ సమయానికే దేశమంతటా రుతుపవనాల విస్తరణ వేగంగా జరగాలి. కానీ ఈసారి ఆ సహజ గమనంలో అంతరాయం ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితికి ఎల్ నినోనే ప్రధాన కారణమని అంతా భావిస్తున్నారు. అయితే లోతైన అధ్యయనాలు కొనసాగుతున్న కొద్దీ, శాస్త్రవేత్తలు ఈ మార్పు వెనుక ఒకే కారణం కాకుండా.. ఇంకా చాలా ఉన్నాయని చెబుతున్నారు..పసిఫిక్ సముద్రంలో చోటుచేసుకుంటున్న వాతావరణ అస్థిరతలు, భారత మహాసముద్రంలో తేమ ప్రవాహాల్లో మార్పులు, అలాగే ఖండాల మధ్య గాలుల సమతుల్యతలో వచ్చిన వ్యత్యాసాలు కలిసి ఈ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా రుతుపవనాలు ముందుకు సాగడానికి అవసరమైన తక్కువ పీడన వ్యవస్థలు ఈసారి సమయానికి ఏర్పడకపోవడం ప్రధాన కారణాల్లో ఒకటిగా గుర్తిస్తున్నారు. బంగాళాఖాతంలో బలమైన తక్కువ పీడన కేంద్రాలు లేకపోవడం వల్ల వర్ష మేఘాలు లోపలికి చొచ్చుకుపోవడం తగ్గిపోయింది.ఇక ఉత్తర భారతంపై తరచూ ప్రభావం చూపే పశ్చిమ దిశ వాతావరణ వ్యవస్థలు ఈసారి అసాధారణంగా క్రియాశీలంగా మారాయి. ఇవి పొడి గాలులను దక్షిణ దిశకు తీసుకువచ్చి, తేమను తగ్గించడంతో మేఘాల ఏర్పాటుకు అనుకూలం కాని పరిస్థితిని సృష్టించాయి. ఫలితంగా రుతుపవనాలు ముందుకు సాగాల్సిన దారి మధ్యలోనే బలహీనపడినట్టు కనిపిస్తోంది. సాధారణంగా ఒక వ్యవస్థ బలహీనపడితే మరొక వ్యవస్థ దాన్ని పూరిస్తుంది. కానీ ఈసారి అన్ని సహజ చక్రాలు ఒకేసారి అనుకూలంగా లేకపోవడం వల్ల సమతుల్యత దెబ్బతింది.అలాగే భూమధ్యరేఖ ప్రాంతంలో వర్షాలను ప్రభావితం చేసే సహజ చక్రం కూడా ఈ సమయంలో అనుకూలంగా లేకపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. దీని వల్ల వర్ష మేఘాల సమూహాలు బలపడకుండా విడిపోయి, నిర్దిష్ట ప్రాంతాల్లో కేంద్రీకృతం కావడం తగ్గింది. దీంతో విస్తృత స్థాయిలో వర్షాలు కురవాల్సిన అవకాశం తగ్గిపోయింది.కాబట్టి ఎల్ నినో ప్రభావం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ.. అది ఒక్కటే ఈ స్థాయి విఘటనకు కారణం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది కేవలం మొత్తం వాతావరణ సమీకరణంలో ఒక భాగం మాత్రమేనని, కానీ అసలు సమస్య అనేక వ్యవస్థల సమకాలీన అసమతుల్యతతో ముడిపడి ఉందని చెబుతున్నారు. అంటే రుతుపవనాల కదలికను ఎల్ నినో అనే ఒకే కారణంతో వివరించడం ఇప్పుడు సాధ్యం కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ చివరి వారంలో పరిస్థితులు కొంత మారే అవకాశం ఉంది. సముద్ర ఉపరితల గాలులు తిరిగి బలపడడం, భూమధ్యరేఖ నుంచి వచ్చే తేమ ప్రవాహం పెరగడం, పై స్థాయిలో గాలుల దిశ అనుకూలంగా మారడం వంటి అంశాలు కలిసి రుతుపవనాలకు మళ్లీ ఊపునివ్వవచ్చని భావిస్తున్నారు. అయితే ఇది ఎంత వేగంగా జరుగుతుందన్నదే కీలకంగా మారింది.మొత్తానికి ఈసారి రుతుపవనాల నిలకడ వెనుక ఒకే కారణం కాకుండా అనేక వాతావరణ వ్యవస్థల సంక్లిష్ట పరస్పర ప్రభావం ఉందని స్పష్టమవుతోంది. సహజ వాతావరణ చక్రాల్లో చిన్న మార్పు కూడా దేశవ్యాప్తంగా వర్షాలపై ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో ఈ పరిస్థితి మరోసారి గుర్తు చేస్తోంది. రైతుల ఆశలు వర్షాలపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఈ వాతావరణ సమతుల్యత ఎంత త్వరగా తిరిగి వస్తుందన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం. -
నైరుతి రుతుపవనాలు ఆగిపోయాయా? మాన్ సూన్ ఎందుకు ఆగింది
-
ఏపీకి భారీ వర్ష సూచన మరో 5 రోజులు వానలే వానలు
-
ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మరికొన్ని గంటలు అత్యంత కీలకమని హెచ్చరించింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు, ఈదురు గాలులు వీసే అవకాశం ఉండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. బుధవారం సాయంత్రంలోపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే ఆకాశం మేఘావృతమవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.వర్ష ప్రభావం కారణంగా విద్యుత్ అంతరాయాలు, రవాణా అంతరాయాలు సంభవించే అవకాశాలు ఉండటంతో స్థానిక యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా.🔴 రెడ్ అలర్ట్:విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.🟡 ఎల్లో అలర్ట్:తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించింది. అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని సూచించింది. మొత్తం పరిస్థితిని చూస్తే రాబోయే గంటలు రాష్ట్రానికి కీలకంగా మారనున్నాయి. -
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ కీలక సూచనలు
సాక్షి, విశాఖపట్నం/ హైదరాబాద్:వాతావరణ శాఖ తెలంగాణకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18 నుంచి 24 వరకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలకు భారీ వర్ష సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో సైతం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ఎండలు సైతం తీవ్రంగా ఉండనున్నట్లు పేర్కొంది. -
ఏపీలో భారీ వర్షం.. పొంగి పొర్లుతున్న వాగులు
-
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో హైఅలర్ట్... తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
-
రెండు రోజులు హైదరాబాద్ లో భారీ వర్షాలు
-
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
సాక్షి, అమరావతి/తిరుపతి తుడా: దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. శుక్రవారం అన్నమయ్య జిల్లా కలికిరిలో 3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే జిల్లా నిమ్మనపల్లెలో 2.9, చిత్తూరు జిల్లా పలమనేరులో 2.4, కార్వేటినగరంలో 2.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే, ఆవర్తనం ప్రభావంతో శనివారం పార్వతీపురం మన్యం, అల్లూరి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలకు ఆస్కారమున్నట్లు పేర్కొంది. గంటకు 40– 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు శుక్రవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎండ విజృంభించింది. ప్రకాశం జిల్లా కారేడులో 43.1 డిగ్రీలు, నెల్లూరు జిల్లా గూడూరులో 43, మన్యం జిల్లా భామినిలో 41.7, అనకాపల్లి జిల్లా చీడికాడలో 41.4 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతిలో కుండపోత వర్షం.. అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర ఉక్కపోతతో ఉకిరిబిక్కిరికి గురైన తిరుపతి జిల్లా ప్రజలను వరుణుడు కరుణించాడు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల పాటు తిరుపతిలో కుండపోత వర్షం కురిసింది. దీంతో మురుగు కాలువలు పొంగి రోడ్లపై ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు పెద్ద ఎత్తున చేరడంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో ఎండ వేడి నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. -
వచ్చే ఐదు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి: రాబోయే ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, అలాగే మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో నైరుతి రుతుపవనాలు గురువారం రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని పేర్కొంది. మరో రెండు నుంచి మూడు రోజుల్లో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో వచ్చే మూడు నుంచి ఐదు రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.కొవ్వూరులో అత్యధిక ఉష్ణోగ్రతఇదిలా ఉండగా గురువారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో అత్యధికంగా 44.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 44.2 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.9 డిగ్రీలు, బాపట్ల జిల్లా ఇంకొల్లు, పోలవరం జిల్లా కూనవరంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాకినాడ జిల్లా పిఠాపురం, విశాఖ జిల్లా గాజువాక, విజయనగరం జిల్లా రాజాంలో 43.6 డిగ్రీలు నమోదయ్యాయి. కోనసీమ జిల్లా శివలలో 43.3, శ్రీకాకుళం జిల్లా రావివలసలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక వర్షపాతంమరోవైపు బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 5.7 సెంటీ మీటర్లు, ఏలూరు జిల్లాలో 3.7 మిల్లీమీటర్లు, బాపట్ల జిల్లాలో 3.49 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లాలో 3.2, గుంటూరు జిల్లాలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఏపీకి రెయిన్ అలర్ట్...! ఆ జిల్లాలో భారీ వర్షాలు
-
భిన్న వాతావరణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురవగా.. అనేక చోట్ల ఎండ, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 44.2, తణుకులో 43.9, ఇంకొల్లు, కూనవరంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 72.5 మి.మీ, లావేరులో 64.5 మి.మీ. వర్షం కురిసింది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో గురువారం మార్కాపురం, రాయలసీమ జిల్లాలతో పాటు పలు కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
-
అటు మండే ఎండలు.. ఇటు పిడుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బుధవారం పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి, పన్టీమ గోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటొచ్చు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం 41–42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జైన్ తెలిపారు. శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40–41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కాగా.. మంగళవారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 42.7 డిగ్రీలు, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 42.4, మన్యం జిల్లా భామినిలో 42.2, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 42, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, కాకినాడ జిల్లా పిఠాపురంలో 41.6, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెం 41.5 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
దంచికొడుతున్న వర్షం.. చెరువులైన రోడ్లు
-
హైదరాబాద్ లో భారీ వర్షం...
-
తెలంగాణను తాకిన రుతుపవనాలు ఏపీకి ఎప్పుడంటే...?
-
కేరళ, కర్ణాటకలో అలర్ట్ ఐఎండీ భారీ వర్ష హెచ్చరిక
-
కొనసాగుతున్న ఎండ తీవ్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ మండిపోతోంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.7, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 43.3, కృష్ణా జిల్లా కానుమోలులో 43.1, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 43.1, ప్రకాశం జిల్లా కరేడులో 43, విజయనగరం జిల్లా రాజాంలో 42.7, అనకాపల్లి జిల్లా రాజాంలో 42.6 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు కర్నూలు జిల్లా పి.కోటకొండలో 6.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కర్నూలు జిల్లా హంద్రీకైర్వాడిలో 4.2, బాపట్ల జిల్లా గూడవల్లిలో 4.2, కర్నూలు జిల్లా గూడూరులో 2.7, శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 1.7, ఎర్రమంచిలో 1.3, అనంతపురం జిల్లా సలకంచెరువులో 1.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. నేడు ఎండ తీవ్రత ఉండే ప్రాంతాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
నైరుతి ఎంట్రీ.. ఏపీ, తెలంగాణలో వర్ష్పాల జోరు
-
ఎండ.. వాన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గురువారం ఎండ, వానతో విభిన్న వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం ఎండ, వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేయగా.. సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 44.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని పలుచోట్ల 42 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలుమరోవైపు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో 3 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లా తాడేపల్లి 2.7, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 1.8, విజయనగరం జిల్లా గుర్లలో 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. ఇదే విధంగా ముందుకు కదలితే 7, 8 తేదీల్లో రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు వచి్చనా ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. -
Weather Updates: వచ్చేసిన రుతుపవనాలు.. ఇక వానలే.. వానలు
-
కేరళం తీరాన్ని తాకిన నైరుతి.. దంచికొడుతున్న వర్షాలు
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు ప్రాథమిక సమాచారం వెలువడుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఒక్కసారిగా పెరిగి, అనేక జిల్లాల్లో భారీ వర్ష సూచనలు జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత పెరగడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అయితే ఈ ప్రవేశాన్ని భారత వాతావరణ శాఖ (IMD) ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.కేరళలోని సుమారు 15 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్థానిక వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షాలు, తీర ప్రాంతాల్లో అలల ఉధృతి పెరగవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇదే సమయంలో కర్ణాటక, తమిళనాడుకు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ తమిళనాడు, చెన్నై ప్రాంతాల్లో కూడా వర్ష సూచనలు వెలువడుతున్నాయి. అక్కడ కూడా మేఘావృత వాతావరణం నెలకొని, రాబోయే గంటల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.మరోవైపు నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణం కంటే ఆలస్యంగా, దాదాపు పది రోజుల ఆలస్యంతో కేరళ తీరాన్ని తాకినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే వీటి తీవ్రత ఆశించినంత బలంగా లేదని భారత వాతావరణ శాఖ ప్రాథమిక విశ్లేషణలో పేర్కొంది. రుతుపవనాల ప్రస్తుత దశ బలహీనంగానే కొనసాగుతోందని ఐఎండీ అంచనా వేస్తోంది.ఇక రాబోయే వారం రోజుల్లో ఈ రుతుపవనాలు క్రమంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు విస్తరించే అవకాశం ఉన్నట్లు సూచనలు ఉన్నాయి. మరో వారం తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే చాన్స్ కనిపిస్తోంది. దక్షిణ భారతంలో వర్షపాతం పెరుగుతుందా లేదా అన్నది రుతుపవనాల బలం, దిశపై ఆధారపడి ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం కేరళలో వర్షాలు మొదలైన నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాబోయే రోజుల్లో రుతుపవనాల వేగం ఎలా మారుతుందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గురువారం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఒకవైపు ఎండ ప్రభావం మరోవైపు పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాలు, విజయనగరం 19, మన్యం 14, అల్లూరి 1, పోలవరం 1 మండలం మొత్తంగా 46 మండలాల్లో తీవ్రవడగాడ్పులు, 79 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం 85 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 67మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని చెప్పారు. ఏలూరు, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో గురువారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే ఇతర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఆస్కారం ఉందని వెల్లడించారు. -
రెండ్రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. బుధవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 నుంచి 1డిగ్రీ సెల్సియస్ మేర తక్కువగా నమోదయ్యాయి. మారిన వాతావరణ పరిస్థితులతో ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపిస్తోందని, రానున్న నాలుగు రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలతో ఉడికిన రాష్ట్ర ప్రజలకు ఐఎండీ తాజా సూచన కాస్త ఉపశమనం ఇచ్చినట్లైంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకు మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు, కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వివరించింది.నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురువారం కేరళ రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఆగ్నేయ అరబిక్ మహాసముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, అలాగే నైరుతి, పశ్చిమ–మధ్య, తూర్పు– మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలలోకి గురువారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 42.4 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24.0 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. -
ఓ వైపు పిడుగులు.. మరోవైపు వడగాడ్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, తీవ్ర ఎండల ప్రభావంతో విభిన్న పరిస్థితులు నెలకొన్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో బుధవారం గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు.. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40–44డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. శ్రీకాకుళంలో 7, విజయనగరంలో 6, పార్వతీపురంలోని 11 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 28 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయన్నారు. మంగళవారం గూడూరులో 45.4 డిగ్రీలు, పిడుగురాళ్లలో 44.9, ప్రకాశం జిల్లా కొండపిలో 44.6 డిగ్రీల∙గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. -
ఎండలు రివర్స్ గేర్, భారీ ఈదురు గాలులతో ఏపీకి వానలు
-
మరో 24 గంటల్లో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు రైన్ అలర్ట్
-
నేడు పిడుగులతో కూడిన వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆదివారం విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని, పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని వివరించారు. దీని ప్రభావంతో ఆదివారం అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లోనూ చెదురు మదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అత్యధికంగా 51 మిల్లీమీటర్ల వర్షపాతం శనివారం సాయంత్రం 5 గంటల సమయానికి అనంతపురం జిల్లా హుస్సేన్‌పురంలో 51 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. కడప జిల్లా పెద్దపసుపల్లెలో 45, చిత్తూరు జిల్లా గంగవరంలో 41.7, అనంతపురం జిల్లా వెన్నపూసపల్లెలో 31.5, కడప జిల్లా ఉప్పలూరులో 29, తొర్రివేముల 26, పొత్తిపాడులో 26, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 20.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు. వర్షాల ప్రభావంతో ఆదివారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. ఆదివారం 17 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. -
వానలు ఇప్పట్లో కష్టమే..!
-
భారీ వర్షం లోయలో ఇరుక్కుపోయిన బొలెరో
-
ఏపీకి రెయిన్ అలర్ట్ ఆ జిల్లాల్లో వర్షాలు
-
మేఘ సందేశం... మే 26 న కేరళకు నైరుతి రుతుపవనాలు
-
అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు
సాక్షి, విశాఖపట్నం: అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు ప్రవేశించాయి. ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో 24 గంటల్లో దక్షిణ అండమాన్‌ను రుతు పవనాలు తాకనున్నాయి. 60 శాతం స్టేషన్లలో 2.5 సెంటీమీటర్ల వర్షపాతం ఆధారంగా నైరుతి ఆగమనాన్ని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రుతుపవనాలకు సహకరిస్తుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.కాగా, భారత్‌లోకి నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ఐదు రోజులు ముందే.. అంటే మే 26నే కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ ఇవాళ(శుక్రవారం) ప్రకటించింది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దేశంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల కాలానికి ఇదే ఆరంభం. అంతకుముందు నిన్న (మంగళవారం) వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేస్తూ.. ఈ వారాంతానికి దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో నైరుతి రుతుపవనాల రాకకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని పేర్కొంది.సాధారణంగా మే 20 ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవులను తాకే రుతుపవనాలు, ఆ తర్వాత పశ్చిమ దిశగా భారత ప్రధాన భూభాగం వైపు విస్తరిస్తాయి. అయితే, ఈ ఏడాది రుతు పవనాల సీజన్లో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇందుకు 'ఎల్ నినో పరిస్థితులు ఏర్పడటమే కారణం కావచ్చని పేర్కొంది. ఐఎండీ ప్రకారం... ఈ ఏడాది భారతదేశంలో 80 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. -
తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు ముందుగానే రుతుపవనాలు
-
ఏపీకి అలర్ట్.. రాగల మూడు గంటల్లో..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో అనకాపల్లి, అల్లూరి, పోలవరం, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ రోజు, రేపు(శుక్ర,శని) వానలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరో వైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండగా... ఇటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అధిక వేడి, ఉక్కపోతకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు కొబ్బరినీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు డీ హైడ్రేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుందన్నారు. వీటితో పాటు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం. బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీతో పాటు కళ్లజోడు తప్పనిసరిగా పెట్టుకోవాలి. మహిళలు గొడుగులు తప్పనిసరిగా ఉపయోగించాలి. కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరమని వైద్యులు తెలిపారు. -
వర్షం పడితే చాలు దోపిడీ
దేశ ఐటీ రాజధానిగా, ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా పేరుగాంచిన బెంగళూరులో వర్షం కురిస్తే చాలు జనజీవనం స్తంభించడంతోపాటు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. తాజాగా కేవలం 15 కిలోమీటర్ల ప్రయాణానికి ఛార్జీ కింద ఏకంగా రూ.1,200 వసూలు చేశారనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న ఈ సర్జ్ ప్రైసింగ్ (అధిక ఛార్జీలు) వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగింది?ప్రముఖ కంటెంట్ క్రియేటర్ సాన్యా సింగ్ తన స్నేహితురాలికి ఎదురైన చేదు అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. భారీ వర్షాలు, ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలో కేవలం 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆటో డ్రైవర్ రూ.1,200 డిమాండ్ చేశాడని ఆమె పేర్కొన్నారు. ఇంటికి సురక్షితంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఆమె అంత మొత్తం చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా ట్రాఫిక్ కారణంగా ఇంటికి చేరుకోవడానికి ఆమెకు ఏకంగా 3 గంటల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.గందరగోళంబెంగళూరు వర్షాల గురించి సాన్యా సింగ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ‘బెంగళూరులో వర్షం కురిసినప్పుడు వయోలిన్ సంగీతం వినిపించదు. కేవలం హారన్ల మోత మాత్రమే వినిపిస్తుంది. కాలేజీలో అడ్మిషన్ పొందడం కంటే వర్షం సమయంలో ఆటో బుక్ చేయడం చాలా కష్టమైన పని. మా కెరీర్లు ఎలా ఉన్నా ఆటో డ్రైవర్లు మాత్రం ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ భారీగా సంపాదిస్తున్నారు’ అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Sanya Singh (@sanya.unfiltered)సోషల్ మీడియాలో..ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ‘వర్షం పడితే చాలు ఆటోలు, క్యాబ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’ అని ఒక వినియోగదారుడు పేర్కొన్నారు. ‘డిమాండ్, సరఫరా పేరుతో డ్రైవర్లు ఇష్టానుసారంగా ధరలను పెంచేస్తున్నారు. దీనిని నియంత్రించే వ్యవస్థ లేదా నియమ నిబంధనలు ఎక్కడ ఉన్నాయి?’ అని మరొకరు ప్రశ్నించారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు మే లోనే వర్షాలు..?
-
చల్లటి కబురు చెప్పిన ఐఎండీ
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి.. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణంగా మే రెండో వారం తర్వాత తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈసారి ఏప్రిల్ రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు అత్యధికంగా రికార్డవుతున్నాయి. వడగాడ్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు రానున్నాయి.ఈ నెల 14 లేదా 15న అండమాన్ తాకొచ్చని ఐఎండీ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఈసారి ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణాది, పశ్చిమ భారతంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్‌లో మే 7 వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, 30-40 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో మే 4 నుండి మే 7 మధ్య వర్షాలు, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది.రేపు, ఎల్లుండి(మే 3,4) జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్-మణిపూర్-మిజోరం-త్రిపుర ప్రాంతాల్లో మే 3 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో మే 4 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.తెలంగాణలో సాధారణంగా మే రెండో వారం తర్వాత తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈసారి ఏప్రిల్ రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు అత్యధికంగా రికార్డవుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు వరుసగా నమోదు కావడాన్ని హీట్‌వేవ్ (వడగాడ్పులు)గా పరిగణిస్తారు.ఈ లెక్కన రాష్ట్రంలో ఏప్రిల్ 14 నుంచి వరుసగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. దీంతో ఏప్రిల్‌లోనే ఏకంగా 14 రోజులపాటు హీట్‌వేవ్ ప్రభావం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక మేలో తొలిరోజునే 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మేర సగటు ఉష్ణోగ్రతలు నమోదవగా ఈ నెలలో ఇంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వడగాడ్పుల రోజులు సైతం అత్యధికంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. -
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. అదే సమయంలో ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. ఈ భిన్నవాతావరణంలో ఇరు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అకాల వర్షాలతో రైతులూ పంట నష్టపోతున్నారు. ఈ లోపు వాతావరణ శాఖ ఇరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ద్రోణి ప్రభావంతో.. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బలమైన ఈదురు గాలులు సహా పిడుగులతో కూడిన జల్లులు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో.. తెలంగాణ, ఏపీలో పలు జిల్లాల్లో ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. వడగాలులు ముప్పు కూడా పొంచి ఉందని.. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.ఏపీలో శుక్ర, శనివారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడం సహా గంటకు సుమారు 40 - 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది. అలాగే.. ఇటు తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంతో వేడి, తేమ సహా అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. వర్షాలతో ఇదే తరహా వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. మరో మూడు రోజులపాటు..ఏపీలోని కృష్ణా జిల్లా పాలకాయతిప్ప వద్ద సముద్రంను చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోతున్నారు. గత రెండు రోజులుగా వెయ్యి మీటర్లు ముందుకు చొచ్చుకుని వచ్చింది. ఏడు నుంచి ఎనిమిది మీటర్ల ఎత్తున సమద్రుపు అలలు ఎగసిపడుతున్నాయి. ఇన్నేళ్లలో.. ఈ సీజన్లో ఎప్పుడూ సముద్రాన్ని ఇలా చూడలేదని మత్స్యకారులు చెబుతున్నారు. చల్లటి కబురువాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు ప్రవేశిస్తాయని.. మే రెండో లేదంటే మూడో వారం తీరాన్ని తాకుతాయని తెలిపింది. -
భారీ వర్షం : బెంగళూరు అతలాకుతలం (ఫొటోలు)
-
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు
సాక్షి,అమరావతి: ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు గంటల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
మండిన ఎండ.. అక్కడక్కడ వాన
రాష్ట్రంలో ఒకవైపు తీవ్రమైన ఎండలు కాస్తుండగా.. మరోవైపు కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఈ సీజన్లోనే గరిష్టంగా కాకినాడ జిల్లా కరపలో 44.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవ్వగా.. అన్నమయ్య జిల్లా పుంగనూరు, అనకాపల్లి జిల్లా రావికమతం, విశాఖ జిల్లా ఆనందపురం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. -
ఓ పక్క కుండపోత.. మరోపక్క ఎండల వాత!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ పక్క వరుణుడు కాలం కాని కాలంలో వర్షాలు కురిపిస్తుండగా, మరో పక్క భానుడు భగభగమంటున్నాడు. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కోర్లాంలో 5.9 సెంటీమీటర్ల వర్షం కురవగా, దక్షిణ కోస్తాలోని మార్కాపురంలో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.2, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.1, చిత్తూరు జిల్లా సింధురాజపురం, నెల్లూరు జిల్లా నెల్లూరు పాలెంలో 42.6, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 42.2, ఎన్టీఆర్ జిల్లా చందాపురం, కడప జిల్లా ఒంటిమిట్టలో 41.9, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 41.2, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 41.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 155 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు అనకాపల్లి జిల్లా రాజంలో 5.4, చూచుకొండలో 3.9, అనకాపల్లిలో 3.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.️ -
ఆంధ్రప్రదేశ్ అకాల వర్షాలు
-
ఏపీలో తొమ్మిది జిల్లాలకు రెడ్ అలెర్ట్
సాక్షి,అమరావతి: ఏపీలో తొమ్మది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షంతో పాటు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని శ్రీకాకుళం , పార్వతీపురం మన్యం , విజయనగరం , అల్లూరి సీతారామరాజు ,తూర్పు గోదావరి , పశ్చిమగోదావరి , ఏలూరు , ఎన్టీఆర్ , కృష్ణా జిల్లాలకు ఏపీ విపత్తుల శాఖ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా బయటకు వెళొద్దు. చెట్లకింద నిలబడొద్దని తెలిపింది. -
వాతావరణంలో మార్పులు సూర్యాపేటలో భారీ వర్షం
-
Delhi: మళ్లీ కృత్రిమ వర్షం.. సక్సెస్ అయ్యేనా?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కృత్రిమ వర్షం కురిపించేందుకు రంగం సిద్ధమవుతోంది. వాయు కాలుష్యాన్ని కట్టడి చేసే అత్యవసర చర్యల్లో భాగంగా, ఈ వేసవిలో (ఏప్రిల్ - జూన్ 2026 మధ్య) ‘క్లౌడ్ సీడింగ్’ ప్రయోగాలను నిర్వహించేందుకు ఐఐటీ కాన్పూర్ సన్నాహాలు చేస్తోంది.ఈ ప్రయోగాల కోసం ఐఐటీ కాన్పూర్ ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి కోరింది. అధికారిక ఆమోదం లభించిన వెంటనే ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి ఢిల్లీ పర్యావరణ శాఖ, ఐఐటీ కాన్పూర్ మధ్య 2025 సెప్టెంబర్ 25న ఒక కీలక ఒప్పందం కుదిరింది. అందులో భాగంగానే గత ఏడాది అక్టోబర్‌లో రెండుసార్లు ప్రయోగాలు నిర్వహించినప్పటికీ నగరంలో వర్షం కురవలేదు.మేఘాల్లో తేమ శాతం తక్కువగా (కేవలం 15 నుంచి 20 శాతమే) ఉండటం కారణంగానే నాటి ప్రయోగాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని ఐఐటీ కాన్పూర్ వెల్లడించింది. అయితే ఆ వైఫల్యం ద్వారా భవిష్యత్తు ప్రయోగాలకు పనికొచ్చే కీలక వాతావరణ పరిస్థితుల గురించి నేర్చుకున్నామని తెలిపింది.క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి?మేఘాల నుంచి వర్షం పడే అవకాశాలను కృత్రిమంగా పెంచే ప్రక్రియనే క్లౌడ్ సీడింగ్ అంటారు. విమానాల ద్వారా మేఘాల్లోకి సిల్వర్ అయోడైడ్, అయోడైజ్డ్ ఉప్పు, రాక్ సాల్ట్ వంటి రసాయనాలతో కూడిన ఫ్లేర్లను వదులుతారు. ఇవి మేఘాల్లో మంచు స్ఫటికాలు లేదా నీటి బిందువులు త్వరగా ఏర్పడేలా చేసి, వర్షం కురిసేలా చేస్తాయి. దీనివల్ల గాలిలోని కాలుష్య కణాలు కిందికి చేరి గాలి శుభ్రపడుతుంది.గత అక్టోబర్ ప్రయోగాల వల్ల వర్షం పడకపోయినా, లక్ష్యంగా ఎంచుకున్న ప్రాంతాల్లో కాలుష్య కారకాలు (పర్టిక్యులేట్ మ్యాటర్) తగ్గాయని ఢిల్లీ ప్రభుత్వం ఒక నివేదికలో పేర్కొంది. ఇటీవలే విడుదలైన ‘ఎకనామిక్ సర్వే ఆఫ్ ఢిల్లీ 2025-26’ సైతం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సహకారంతో మరిన్ని ప్రయోగాలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, చేయబోయే ఈ ప్రయోగం సక్సెస్ అయి, ఢిల్లీవాసులకు కాలుష్యం నుంచి ఊరటనిస్తుందేమో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: Iran: 30కి పైగా యూనివర్సిటీలు ధ్వంసం -
హైదరాబాద్‌లో జోరు వాన (ఫోటోలు)
-
Andhra Pradesh: మూడు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల పిడుగులతో వర్షాలు పడతాయని పేర్కొంది.మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది -
వచ్చే రెండు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఆదివారం కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. -
బిగ్ అలర్ట్.. రానున్న 3 రోజులు భారీ వర్షాలు
-
ఆ జిల్లాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..
సాక్షి, అమరావతి: ఏపీలో రానున్న మూడు రోజుల్లో కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. చెట్ల క్రింద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ తెలిపారు.కాగా కుండపోత వర్షంతో పిడుగుపాటుకు గురై రాష్ట్రవ్యాప్తంగా నిన్న(బుధవారం) నలుగురు మరణించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో పిడుగు పడి శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెం గ్రామంలో పిడుగుపాటుకు పొలంలో పనిచేస్తున్న ఇరువురికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం వీరపాలెంలో మిర్చి కోతలకు పొలానికి వెళ్లిన కాటూరి సుబ్బరత్నమ్మ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. బాపట్ల జిల్లాలో పిడుగుపాటుతో పెరవలి వనజ మృతి చెందింది. వైఎస్సార్ కడప జిల్లా చిన్నాయపల్లెకి చెందిన గుర్రాల నారాయణ రెడ్డి(55) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలివాన ధాటికి పంటలు నేల వాలాయి. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి, మొక్కజొన్న తడిచి ముద్దయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో పంట నష్టం అధికంగా ఉంది. -
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వాన
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది. హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, ఇన్సాపూర్‌లో వర్షం పడింది. సంగారెడ్డి జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలకు మామిడి, వరి పంట నేల రాలుతోందని రైతులు అంటున్నారు.కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి పలుచోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, సోమవారం రాత్రి కూడా హైదరాబాద్. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది.తెలంగాణలోని 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. -
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న వారు ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, కూకట్పల్లి, చార్మినార్, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం పడుతున్న సమయంలో మెట్రో పిల్లర్ల కింద వాహనాలు ఆపి వర్షం వెలిసేదాక ఎదురుచూశారు.మరోవైపు మెదక్ జిల్లాలోనూ వర్షం దంచికొట్టింది. తూప్రాన్ మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగలులతో కూడిన భారీ వర్షం పడింది. పోచమ్మరాల్ గ్రామంలో పెద్ద ఎత్తున వడగళ్ల వాన కురిసింది. అర్ధ గంటపాటు కురిసిన వడగళ్ల వానతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ అకాల వర్షాలతో వరి పంటతో పాటు మామిడికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతన్నలు ఆవేనద వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టి సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. నారాయణ ఖేడ్, ఆందోలులోనూ జోరుగా వర్షం కురిసింది. -
2026లో కుండపోత.. 40 రోజులుగా ఆ దేశంలో వర్షాలే
ఒక్క రోజు వర్షం కురిస్తేనే ఎక్కడైనా సరే జనజీవనం స్తంభించిపోతుంది. అలాంటిది యూకేలో ఈ ఏడాది మొదలైనప్పటి నుంచి వర్షాలు ఆగడం లేదు. జనవరి 1 నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 40 రోజులుగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రత్యేకించి దక్షిణ పశ్చిమ ఇంగ్లాండ్, తూర్పు స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కార్న్‌వాల్‌లో చరిత్రలోనే అత్యధిక వర్షపాతం నమోదవగా.. దేశవ్యాప్తంగా 26 వాతావరణ కేంద్రాలు ఈ వర్షాలతో సరికొత్త రికార్డులు సృష్టించాయి.ఇక ఫిబ్రవరి 8వ తేదీ నాటికి యూకేలో సగటు వర్షపాతం 37 శాతంగా నమోదైంది. ఇంగ్లాండ్‌లో ఇది 59 శాతం, దక్షిణ ఇంగ్లాండ్‌లో అయితే ఏకంగా 72 శాతానికి చేరింది. అబెర్డీన్లో ఫిబ్రవరి సగటు 180 శాతం దాటేయడం ఆందోళన కలిగిస్తోంది.వర్షాలు ఎప్పుడు తగ్గొచ్చు?వాతావరణ శాఖ డిప్యూటీ చీఫ్ స్టీవెన్ కీట్స్ చెబుతున్న దాని ప్రకారం.. ఈ వారం చివరలో స్థిరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఫిబ్రవరి 15 నుంచి 24వ తేదీ మధ్య అట్లాంటిక్ నుంచి వచ్చే బలమైన గాలులు.. యూకేలోకి ప్రవేశించొచ్చు. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని కీట్స్ హెచ్చరించారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి తొలివారాల్లో కాస్త ఎండ కనిపించినా.. మళ్లీ భారీ వర్షాల ముప్పు ఉండొచ్చని అన్నారు. ఇది ఇలానే కొనసాగితే వరదలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. -
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుంభవృష్టి
సాక్షి, అమరావతి/నెల్లూరు/వెంకటాచలం/తొట్టంబేడు: వాయుగుండం ప్రభావంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లా చిట్టమూరులో మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు 27.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 27.2, ఇదగలిలో 24, తిరుపతి జిల్లా అల్లంపాడులో 23.8, విద్యానగర్‌లో 19.6, నెల్లూరు జిల్లా మనుబోలులో 17.9, మల్లంలో 17.6, అక్కంపేటలో 16.7, నెల్లూరులో 14 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. నెల్లూరు రూరల్, సైదాపురం, నాయుడుపేట, అల్లూరు, మనుబోలు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, తిరుపతి జిల్లా గూడూరు, చింతవరం, సూళ్లూరుపేట, తొట్టంబేడు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం సాయంత్రం వరకు తిరుపతి జిల్లా తొట్టంబేడులో 4.7, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 3.7, తిరుపతి జిల్లా మన్నారు పోలూరులో 3.2, చిత్తూరు జిల్లా నిండ్రలో 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దిత్వా తుపాను బలహీనపడి రెండు రోజుల క్రితం వాయుగుండంగా మారగా.. బుధవారం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.జలదిగ్బంధంలో నెల్లూరు హైవే వాయుగుండం నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు ఏకధాటిగా కుంభవృష్టి కురిసింది. వాగులు, వంకలు, పంట పొలాలు సముద్రాన్ని తలపించాయి. వెంకటాచలం మండలం చెముడుగుంట, కాకుటూరు, కాగితాలపూరు తదితర ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై వరద ప్రవహించింది. బుజబుజ నెల్లూరు, చెముడుగుంట ప్రాంతాల్లో జాతీయ రహదారిపైకి వరద పోటెత్తడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంకటాచలం–మనుబోలు మధ్య జాతీయ రహదారిలో ఒక వరుస రోడ్డు మునిగిపోయింది. ప్రజలు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నెల్లూరు నుంచి వెంకటాచలం చేరుకునేందుకు సుమారు 3 గంటల సమయం పట్టింది. నెల్లూరు అయ్యప్పగుడి నుంచి హైవే రోడ్డు కలిసేచోట రోడ్డుపై మోకాలి లోతు నీరు చేరడంతో ద్విచక్ర వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. పలుచోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంకటాచలంలో 3 వేల ఎకరాల్లో మునిగిన నారు మళ్లు, నాట్లు మునిగినట్లు ప్రాథమిక అంచనా.నీట మునిగిన కాలనీలు భారీ వర్షాలకు నెల్లూరు నగరంలో సగం ప్రాంతాలు నీటమునిగాయి. చంద్రబాబునగర్, వైఎస్సార్ నగర్, మల్లయ్యగుంట, బుజబుజ నెల్లూరులోని ఆర్టీసీ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, తల్పగిరి కాలనీ, శివగిరి కాలనీ, జనార్దన్‌రెడ్డి నగర్, కృషి విజ్ఞాన కేంద్రం, ఆర్డీటీ కాలనీ, సుందరయ్య కాలనీ డి–బ్లాకులోని కొన్ని ప్రాంతాలు, హరనాథపురం విస్తరిత(ఎక్స్టెర్ననల్) ప్రాంతాల్లో పెద్దఎత్తున వరద నీరు చేరింది. మాగుంట లేఅవుట్, రామలింగాపురం, ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జిలు నీటమునిగాయి.గోడ కూలి వృద్ధురాలి మృతి తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కానవరంలో బుధవారం కురిసిన వర్షానికి పూరి గుడిసె గోడకూలి నిద్రదిస్తున్న రేణుకమ్మ(59)పై పడింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. -
వరదల కారణంగా 1,300 మందికి పైగా మృతి
టాంగ్ టోరు: ఇండోనేషియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌లలో భారీ వర్షాలతో గత వారం సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 1,300 దాటింది. 800 మందికి పైగా గల్లంతయ్యారు. ఇండోనేషియాలో 712 మంది, శ్రీలంకలో 410 మంది, థాయ్‌లాండ్‌లో 181 మంది మరణించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఇండోనేషియాలో.. ఇండోనేషియాలోని సుమత్రా దీవులు తీవ్రంగా నష్టపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. వంతెనలు కూలిపోయాయి. 507 మంది గల్లంతైనట్లు ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తప్పిపోయారు. ఉత్తర సుమత్రాలో వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల లక్షలాది క్యూబిక్ మీటర్ల కలప కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. చెట్లను అక్రమంగా నరికివేయడం విపత్తుకు కారణమై ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదని, మానవ నిర్మిత సంక్షోభమని ఇండోనేషియా పర్యావరణ ఫోరం ఆరోపించింది. తక్షణ పునరుద్ధరణ, కట్టుదిట్టమైన రక్షణ లేకపోతే వరదలు సాధారణమవుతాయని హెచ్చరించింది. ప్రాణ నష్టాన్ని ఇప్పుడే నిర్ణయించలేం: శ్రీలంక అధ్యక్షుడు ఇది దేశాన్ని ముంచెత్తిన అత్యంత దారుణమైన విపత్తని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే అన్నారు. ప్రాణనష్టాన్ని ఇప్పుడే నిర్ణయించలేమన్నారు. మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. వరదల్లో, కొండ చరియలు విరిగి పడటంతో చిక్కుకుపోయినవారిని చేరుకోవడానికి ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు. కొందరు మొత్తం కుటుంబాన్నే కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. థాయ్‌లాండ్‌లో పబ్లిక్ కిచెన్లు.. థాయ్‌లాండ్‌లో భారీ వరదలు 15 లక్షలకు పైగా ఇళ్లను మంచెత్తాయి. 39 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. వారికి మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. బాధితులకు ఆహారాన్ని అందించడానికి పబ్లిక్ కిచెన్లను ఏర్పాటు చేస్తామని థాయ్‌లాండ్ ప్రభుత్వం తెలిపింది. మొదటి దశలో రూ.74 లక్షల నష్టపరిహారం 26,000 మందికి పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి సిరిపోంగ్ అంగ్కసకులి్కయాట్ తెలిపారు. -
Ditwah Cyclone: నేడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు
-
మరింత బలహీన పడిన వాయుగుండం
సాక్షి, అమరావతి/నెల్లూరు (అర్బన్)/తిరుమల/సాక్షి, చెన్నై: తీవ్ర వాయుగుండం తమిళనాడు–పుదుచ్చేరి మీదుగా గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. సోమవారం సాయంత్రానికి ఇది చెన్నైకి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 130, కడలూరుకు 150, నెల్లూరుకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమేపీ బలహీనపడుతోంది. దీని ప్రభావంతో మంగళవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎనీ్టఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. స్తంభించిన ‘నెల్లూరు’ నెల్లూరు జిల్లాను దిత్వా తుపాను వణికిస్తోంది. వాయుగుండం బలహీన పడి నెల్లూరుకు దగ్గరగా వస్తున్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మూడు రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండగా, ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించింది. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో సముద్రం నాలుగైదు మీటర్ల వరకు ముందుకు చొచ్చుకువచి్చంది. తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి. దీనికితోడు చలి కూడా ఎక్కువగా ఉంది. తుపాను ప్రభావంతో జిల్లాలో పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి.చేజర్ల మండలంలోని నల్లవాగుకు ప్రవాహం పెరగడంతో యనమదల, తూర్పుకంభంపాడు, తూర్పుపల్లి తదితర ఐదు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పొదలకూరు మండలంలోని నావూరు వద్ద పెద్దవాగుకు నీటి ప్రవాహం పెరిగింది. బొగ్గేరు, బీరాపేరుకు ఓ మోస్తరు వరద పెరిగింది. విడవలూరు మండలంలోని మలిదేవి డ్రైన్, పైడేరులకు నీటి ప్రవాహం పెరిగింది. ఇప్పటికే పలుచోట్ల చెరువులు నిండిపోయాయి.అవి ఎక్కడ తెగిపోతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమశిల నుంచి పెన్నానదిలోకి 35 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పొలాల నిండా నీరు చేరడంతో నాట్లు, నారుమళ్లు కుళ్లిపోతాయేమోనని రైతులు భయపడుతున్నారు. నెల్లూరు శివారు ప్రాంతాలైన ఆర్టీసీ కాలనీ, చంద్రబాబునగర్, వైఎస్సార్ నగర్, పడారుపల్లి, కల్లూరుపల్లి, రాజీవ్ గృహకల్ప, సాయినగర్, జనార్ధన్రెడ్డినగర్ ప్రాంతాల్లో వర్షం నీరు నిలబడిపోయింది. తిరుమలలో వర్షం తుపాను కారణంగా తిరుమలలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీవారి ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. దట్టమైన పొగమంచు తిరుమల కొండలను కమ్మేసింది. చెన్నైలో కుండపోత బలహీన పడ్డ దిత్వా తుపాన్ తీవ్ర వాయుగుండంగా మారడంతో చెన్నైలో సోమవారం అనేక చోట్ల భారీ వర్షం పడింది. మంగళవారం మరింతగా భారీ వర్షాలు పడుతాయనే హెచ్చరికలతో చెన్నై, శివారు జిల్లాలలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో చెన్నై తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా రూపంలో చిరు జల్లుల వాన మొదలైంది.ఇది చెన్నైకు 50 కి.మీ దూరంలో ఏడు గంటలకు పైగా కేంద్రీకృతం కావడంతో క్రమంగా వర్షం ప్రభావం పెరిగింది. చెన్నై, శివారులలోని తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో లేదా మంగళవారం ఉదయం చెన్నె తీరానికి 30 కి.మీ దూరంలోకి తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా సమీపిస్తుందని, ఈసమయంలో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. చెన్నై, తిరువళ్లూరు జిల్లాలకు మంగళవారం రెడ్ అలర్ట్ ప్రకటించారు. -
Rain ALERT: మరో మూడురోజులపాటు ఏపీకి వర్ష సూచన
-
Cyclone Ditwah: బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుపాను
-
నేడు, రేపు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/వాకాడు: ‘దిత్వా’ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాను ఉత్తర–వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతూ శుక్రవారం రాత్రి సమయానికి పుదుచ్చేరికి 410 కి.మీ., చెన్నైకి 510 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఆదివారం తెల్లవారుజామున తీవ్రవాయుగుండంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో శనివారం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112, 18004250101లను సంప్రదించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. -
నేడు, రేపు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతం, శ్రీలంక తీర సమీపంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఉత్తర వాయవ్య దిశలో కదులుతోంది. ఈ తుపాను శుక్రవారం ఉదయం ఎనిమి దిన్నర గంటల ప్రాంతంలో పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను క్రమంగా ఉత్తర వాయవ్య దిశలో కదులుతూ ఆదివారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా ఆంధ్ర తీర ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా లేదని నిపుణులు చెబుతు న్నారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.ఆదివారం దక్షిణ ప్రాంత జిల్లాలు, సెంట్రల్ తెలంగాణ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న రెండ్రోజులు మెజారిటీ ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 30.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 13.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 10వ తేదీ వరకు మినుములు, పెసర విత్తుకోవచ్చువర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు వరి కోసే ముందు ఆకాశంలోని మేఘాలను గమనించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వి శ్వవిద్యాలయంలోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం అధిపతి, ప్ర ధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.లీలారాణి శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ⇒ మినుములు, పెసర పంటలను వచ్చే నెల 10వ తేదీ వరకు విత్తుకోవచ్చు.⇒ మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటలను డిసెంబర్ 31వ తేదీ వరకు విత్తుకోవచ్చు.⇒ యాసంగి వరినారు మడులను డిసెంబర్ 20 లోగా పోసుకోవాలి.⇒ ప్రస్తుత చలి వాతావరణ పరిస్థితులు వరి నారుమళ్లలో జింక్ ధాతువు లభ్యతను తగ్గిస్తాయి. జింక్ లోప నివారణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.⇒ చలి ప్రభావం వల్ల మొక్కజొన్నలో భాస్వరం లోపంతో ఆకులు ఊదారంగులోకి మారుతాయి. భాస్వరం లోపనివారణకు 10 గ్రాముల19–19–19 లేదా డీఏపీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.⇒ మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు 0.4 మి.లీ. క్లోరంట్రానిలిప్రోల్ లేదా 0.5 మి.లీ. స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకుల సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి. ⇒ పత్తిలో బూడిద తెగులు, కాయకుళ్లు తెగులు, గులాబీ రంగు పురుగు ఆశించడానికి అనుకూలం. కాబట్టి నియంత్రణ చర్యలు చేపట్టాలి. ⇒ కందిలో శనగపచ్చ పురుగు, మారుక మచ్చల పురుగు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి.⇒ వేరుశనగలో ఆకుముడత పురుగు నివారణకు 2.5 మి.లీ. క్లోరిపైరిపాస్ లేదా 1.5గ్రా. ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ⇒ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు సోకటానికి అనుకూలం. నివారణకు టీకాలు వేయించాలి.⇒ గొర్రెలకు పీపీఆర్, చిటుకు, ఆవులు, గేదెల్లో గొంతువాపు వ్యాధి సోకటానికి చలి వాతావరణం అనుకూలంగా ఉంది. వీటి నివారణకు టీకాలు వేయించాలి.⇒ గొర్రెల్లో నట్టల నివారణకు డీవార్మింగ్ చేయించాలి. -
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాన్
-
బంగాళాఖాతంలో ‘దిత్వా’ తుపాను
సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని శ్రీలంక తీరంలో తుపాను ముప్పు పొంచి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ తుపానుకు యెమెన్ దేశం ‘దిత్వా’(అక్కడి ప్రసిద్ధ జలాశయం దిత్వా లగూన్ పేరు మీద)గా నామకరణం చేసినట్లు పేర్కొంది. దీని ప్రభావం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా తీరాలపై ఉంటుందని తెలిపింది. గడిచిన 6 గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో తుపాను ముందుకు కదులుతోందని వెల్లడించింది. ట్రింకోమలీ(శ్రీలంక)కి 200 కి.మీ, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. కాగా, ఈ తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ముందు జాగ్రత్తలు తీసుకోండి తుపాను నేపథ్యంలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాలు, కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ధాన్యం తడవకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. తుపాను సమాచారాన్ని ఎస్ఎంఎస్ల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. ధాన్యం తడిచిపోయి.. తక్కువ ధరకు రైతులు బయట విక్రయించినట్లు ఫిర్యాదులు వస్తే సంబంధిత జాయింట్ కలెక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎస్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడాలని ఆదేశించారు. -
Heavy Rain: దక్షిణ కోస్తాలో అతిభారీ వర్షాలు పడే అవకాశం
-
వాయుగుండంగా మారిన అల్పపీడనం
సాక్షి,అమరావతి: అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక మరియు హిందూ మహాసముద్రం మీదుగా మరో అల్పపీడనం కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇది ఉత్తరవాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
AP: ముంచుకొస్తున్న వాయుగుండం 48 గంటల్లో పెను తుఫానుగా..
-
AP: 30 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 30 నుంచి మూడు రోజులపాటు పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశంతోపాటు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
AP: దూసుకొస్తున్న సెన్యార్ రెండు రోజుల్లో భారీ తుఫాన్
-
బలపడిన అల్పపీడనం
సాక్షి, అమరావతి: దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారానికి ఆగ్నేయ బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వీటి ప్రభావంతో సోమవారం ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. -
అండమాన్‌లో అల్పపీడనం
సాక్షి, అమరావతి: మలక్కా జలసంధిపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అండమాన్ సముద్రంలో శనివారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 24 నాటికి వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. 26 నాటికి మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ️దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుపాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో సూచించారు. ప్రస్తుతం వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రైతులు వెంటనే కుప్పలు వేసుకోవాలని.. ధాన్యం వర్షంలో తడవకుండా సురక్షితంగా భద్రపరచుకోవాలని కోరారు. -
అయ్యప్ప భక్తులకు అలర్ట్..! శబరిమలలో మళ్లీ..
సాక్షి, తిరువనంతపురం: శబరిమలలో ఇవాళ, రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొట్టాయం, ఇడుక్కి, అలప్పుజా, పతనం తిట్ట, కొల్లాం, తిరువనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ శబరిమల యాత్ర ప్రాంతంతో సహా మొత్తం ఆరు ఇతర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావమే ఈ భారీ వర్షాలకి కారణం అని వాతావరణ శాఖ తెలిపింది. అందువల్ల ఈ రోజు, రేపు శబరిమల సన్నిధానం, పంప, నీలక్కల్ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా ప్రాంతల్లో తప్పనిసరిగా..సన్నిధానం, పంబా, నీలక్కల్‌లలో ఇవాళ, రేపు 7 సెం.మీ నుంచి 11 సెం.మీ వరకు వర్షం పడే అవకాశం ఉందిఅలర్ట్ జారీ చేయబడిన జిల్లాల్లో 24 గంటల్లో 64.5 మిమీ నుంచి 115.5 మిమీ వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.అయ్యప్ప భక్తులకు భద్రతా సూచనలుభారీ వర్ష హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ యాత్రికులకు ప్రత్యేక హెచ్చరిక సూచనలు జారీ చేసింది.కొండచరియలు విరిగిపడటం, బురదజల్లులు, పర్వత వరదలకు గురయ్యే ప్రాంతాలలో నివసించేవారు, అలాగే నదుల వెంబడి, ఆనకట్టల దిగువన నివసించేవారు అధికారుల సూచనల మేరకు వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని విపత్తు నిర్వహణ అథారిటీ సూచించింది.విపత్తు సంభవించే ప్రాంతాల్లో నివసించేవారు పగటిపూట సమీపంలోని సహాయ శిబిరాలకు తరలి వెళ్లాలి. వాటి సమాచారం కోసం ప్రజలు స్థానిక స్వపరిపాలన, రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చు.బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున, భద్రత లేని ఇళ్లు లేదా బలహీనమైన పైకప్పులు ఉన్న ఇళ్లలో నివసించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.వర్షపు రోజుల్లో అనవసరమైన ప్రయాణాలు, పర్వతారోహణను నివారించాలి.శబరిమల దర్శనానికి వచ్చే భక్తులు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అలాగే భద్రతాధికారుల సూచనల మేరకు ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉందన స్పష్టం చేసింది కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ.(చదవండి: శబరిమల సన్నిధానం వసతి సౌకర్యాల వివరాలు ఇవిగో..!) -
25న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ శనివారం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నెమ్మదిగా కదులుతోందని పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. సోమవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
మనీ లేదు.. మట్టి పోద్దాం!
ఇది రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షించే రాష్ట్ర రహదారి. తాండూరు–జహీరాబాద్ రోడ్డులో రావులపల్లి గ్రామ శివారులో పరిస్థితి ఇది. ఎక్కడా తారు ఆనవాళ్లు అనేవి లేకుండా ఇలా మారింది. వాన కురిస్తే ఇక్కడ రాకపోకలు నిలిచిపోతాయి. గతేడాది వానాకాలంలో రోడ్డు కొట్టుకుపోగా, మరమ్మతులు చేయకపోవడంతో స్థానిక నేత ఒకరు సొంత ఖర్చుతో మట్టిపోయించి తాత్కాలికంగా రాకపోకలు జరిగేలా చేశారు. ఈసారి మళ్లీ కొట్టుకుపోయి అదే పరిస్థితి పునరావృతం అయింది. మళ్లీ స్థానిక నేతలు సొంత ఖర్చుతో మట్టి పోయించారు. దీంతో రోడ్డు ఈ మాత్రం కనిపిస్తోంది. కొత్త రోడ్డు నిర్మాణ పనులు ఏడాదిన్నర క్రితమే మంజూరైనా.. ఇప్పటివరకు పనుల జాడే లేదు. కనీసం టెండర్లు కూడా పిలవలేదు. సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు కురిసినప్పుడు దెబ్బతిన్న రోడ్లను తాత్కాలికంగా మరమ్మతు చేసి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తేనే వాహనాలు సాఫీగా ముందుకు సాగుతాయి. కానీ రాష్ట్రంలో చాలాచోట్ల ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఒక వానాకాలం ముగిసే సరికి రోడ్లకు సగటున రూ.2 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. అంటే వాటిని పునరుద్ధరించాలంటే అంతమేర నిధులు ఖర్చు చేయాలన్న మాట.కానీ నిధుల లేమి రోడ్ల మరమ్మతుకు, కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రతిబంధకంగా మారుతోంది. రోడ్ల మరమ్మతులకు భారీ మొత్తంలో నిధులు వెచి్చంచే పరిస్థితి లేకపోవటంతో కేంద్ర సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. కానీ కేంద్రం.. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారుల బృందాలను పంపటం తప్ప నిధులు ఇవ్వటం లేదు. గతేడాది రూ.2,300 కోట్ల మేర రోడ్లకు నష్టం వాటిల్లినందున అంతమేర నిధులు ఇవ్వాలని కేంద్ర బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమరి్పంచింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో కేంద్ర మంత్రుల ముందు కూడా ప్రస్తావించింది. కానీ నయా పైసా రాలేదు. బాగా దెబ్బతిన్న రోడ్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. మోంథా తుపాను కంటే ముందు కురిసిన వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు వచ్చాయి. 1,400 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయని, రూ.1,278 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, తాత్కాలిక మరమ్మతులకు రూ.78 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఆ తర్వాత మోంథా తుపాను ప్రభావంతో నష్టం మరింత పెరిగింది.ఈ రెండు నష్టాలు కలిపి దాదాపు రూ.1,600 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. 1,500 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని, మొత్తం 1,641 కి.మీ మేర రోడ్ల ఉపరితలం దెబ్బతిన్నదని పేర్కొంటూ కేంద్రానికి మరోసారి నివేదించింది. కానీ ఈ రెండు నివేదికలపైనా అక్కడి నుంచి స్పందన రాలేదు. రాష్ట్రం సొంత నిధులు ఇవ్వలేక పోవడం, కేంద్రం నుంచి నిధులపై స్పష్టత లేకపోవడంతో రోడ్లు రోజురోజుకూ మరింత దెబ్బతింటున్నాయి. తాత్కాలికంగా గుంతల్లో మట్టి నింపిన అధికారులు..పూర్తిస్థాయి మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణంపై చేతులెత్తేశారు. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా రోడ్ల మీద ప్రయాణాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఇటీవలి తుపాను ప్రభావం ఇలా.. జిల్లా దెబ్బతిన్న ప్రాంతాలు మరమ్మతులకు కావాల్సిన నిధులు (రూ.కోట్లలో) కరీంనగర్ 16 6 వరంగల్ 50 86.34 హనుమకొండ 12 2.50 ములుగు 3 4.40 మహబూబాబాద్ 38 14.94 ఖమ్మం 63 54 భద్రాద్రి 15 22.95 నల్లగొండ 26 10.10 సూర్యాపేట 4 6.82 యాదాద్రి 11 4.31 జనగామ 21 13 సిద్దిపేట 27 40.19 రంగారెడ్డి 10 3.88 నాగర్‌కర్నూలు 86 49.44 -
గంగమ్మ... గలగల
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడంతో పాతాళగంగ పైపైకి ఉబికి వచ్చింది. గత దశాబ్దకాలంతో పోలిస్తే సగటున 1.7 మీటర్ల మేర భూగర్భ జలాల్లో వృద్ధి నమోదైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో సగ టున 4.42 మీటర్ల లోతులో భూగర్భ జలాలు అందుబాటులో కి వచ్చాయని.. కనిష్టంగా 2 మీటర్లు, గరిష్టంగా 7.93 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మే నుంచి అక్టోబర్‌కు 5.65 మీటర్ల వృద్ధి మేలో వేసవి తీవ్రతతో భూగర్భ జలాల రాష్ట్ర సగటు 10.07 మీటర్లకు పడిపోగా వర్షాకాలం మొదలయ్యాక జూన్‌లో 9.47 మీటర్లకు, జూలైలో 8.37 మీటర్లకు, ఆగస్టులో 5.78 మీటర్లకు, సెప్టెంబర్‌లో 4.41 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు ఉబికి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 లక్షలకుపైగా బోరుబావుల కింద వానాకాలం పంటల సాగు కోసం భారీగా భూగర్భ జలాలను తోడేస్తున్నప్పటికీ అక్టోబర్‌లోనూ నిలకడగా 4.42 మీటర్ల లోతుకే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. మేతో పోలిస్తే అక్టోబర్ నాటికి భూగర్భ జలాలు 5.65 మీటర్ల మేరకు వృద్ధి చెందాయి. 2024 అక్టోబర్‌లో సగటున 5.38 మీటర్ల లోతులో లభ్యమైన భూగర్భ జలాలు ఈ ఏడాది అక్టోబర్ నాటికి 4.42 మీటర్ల వరకు ఉబికి వచ్చాయి. గత నెలలోనూ సాధారణంకన్నా అధిక వర్షాలు కురవడమే దీనికి కారణం. రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ అక్టోబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి రూపొందించిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. 33 జిల్లాల పరిధిలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన 1,778 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ప్రతి నెలా సమీక్షించి తర్వాతి నెలలో నివేదికలను ఆ శాఖ విడుదల చేస్తోంది. మహబూబాబాద్‌లో 2 మీటర్ల లోతుల్లోనే.. మహబూబాబాద్ జిల్లాలో 2 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు లభిస్తుండగా మెదక్ జిల్లాలో మాత్రం 7.84 మీటర్ల లోతులో అందుబాటులో ఉన్నాయి. జిల్లాల సగటు భూగర్భ జలమట్టాలను 0 నుంచి 5 మీటర్లు, 5 నుంచి 10 మీటర్లు, 10 మీటర్లకన్నా ఎక్కువ లోతు అనే మూడు విభాగాలుగా వర్గీకరిస్తారు. భూగర్భ జలాలు 0 నుంచి 5 మీటర్ల లోతులోనే ఉంటే సురక్షిత స్థాయిలో ఉన్నట్లు పరిగణిస్తారు. మొత్తం 33 జిల్లాలకుగాను 19 జిల్లాల్లో 0 నుంచి 5 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే 14 జిల్లాల్లో 5 నుంచి 10 మీటర్ల లోతులో, 2 జిల్లాల్లో 10 నుంచి 15 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నట్లు తేలింది. 10 మీటర్లకన్నా ఎక్కువ లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా భావిస్తారు. అంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ భూగర్భ జలాలు సురక్షిత స్థాయిల్లోనే ఉన్నట్లు ఈ గణాంకాలు పేర్కొంటున్నాయి. సాధారణం కంటే 95% అధిక వర్షపాతం ఏటా అక్టోబర్‌లో రాష్ట్ర వార్షిక సగటు వర్షపాతం 9.01 సెం.మీ. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో మాత్రం ఏకంగా 17.57 సెం.మీ. రికార్డు వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 95 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని స్పష్టమవుతోంది. 28 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షం కురవగా 4 జిల్లాల్లో సాధారణం, ఒక్క మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోనే లోటు వర్షపాతం కురిసింది. జూన్ నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రంలో 83.1 సెం.మీ. సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా ఏకంగా 116.4 సెం.మీ. మేర వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 40 శాతం అధికం కావడం విశేషం. -
రైతన్న వెన్ను విరిచిన వాన
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ మొత్తాన్ని అతలాకుతలం చేస్తూ వచ్చిన వర్షాలు ‘మోంథా’తుపానుతో రైతుల నడ్డి విరిచాయి. గత సెప్టెంబర్ నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో పత్తి పంట ఇప్పటికే చాలా వరకు దెబ్బతింది. చేలల్లో నీరు నిలిచి పత్తి గింజలు బలహీనంగా ఎదిగాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మొదటి విడత పత్తి ఏరడం పూర్తయ్యింది. రెండోదశ పత్తి ఏరేందుకు సిద్ధమవుతున్న చేలకు ‘మోంథా’తుపాను తీవ్ర నష్టం కలిగించింది. పత్తి గింజలు విచ్చుకుంటున్న సమయంలో కురిసిన వర్షాలతో పత్తి మరింత దెబ్బతింది. పత్తి అధికంగా సాగయ్యే ఆదిలాబాద్‌లో వర్ష ప్రభావం అధికంగా లేకపోవడంతో ఇక్కడ నష్టం కొంత తక్కువగానే ఉంది. వరి పంట చేతికి వస్తున్న సమయంలో కురిసిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతలు పూర్తయిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోయగా, చాలా ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోయింది. ఇక కోతకు వచ్చిన వరి వర్షాలకు చాలా జిల్లాల్లో నేలకొరిగింది. పొట్టకొచ్చిన వరి నేలరాలడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏపీ సరిహద్దు జిల్లాల్లో అధిక నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనుకొని ఉన్న జిల్లాల్లో మోంథా తుపానుతో నష్టం ఎక్కువగా ఉంది. నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో పత్తి పంట నష్టం అధికంగా ఉన్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి, వికారాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో కూడా పత్తి దెబ్బతింది. వరంగల్ ప్రధాన వ్యవసాయ మార్కెట్లో వడ్లు, మక్కలు వర్షం నీటిలో నానిపోయాయి. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాచలం, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులు నివేదికలు ఇచ్చినట్టు సమాచారం. మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర నష్టం మహబూబాబాద్ జిల్లాలో పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి 2,15,723 ఎకరాల్లో సాగు కాగా, ప్రస్తుతం పొట్ట దశలో ఉంది. ఈ వర్షాల కారణంగా 50 శాతానికిపైగా నష్టం వాటిల్లింది. మొక్కజొన్న 62,751 ఎకరాల్లో సాగు చేసి, కంకులను కోసి రైతులు విక్రయించేందుకు కల్లాలు, అనువుగా ఉన్న ప్రాంతాల్లో ఆరబోసుకు న్నారు. మొక్కజొన్నలకు 70 నుంచి 80 శాతానికిపైగా నష్టం వాటిల్లింది. పత్తి 86,224 ఎకరాల్లో సాగు కాగా, పంట కోతదశకు చేరుకున్న సందర్భంలో 60 శాతానికి పైగా నష్టం చేకూర్చనుంది. మిర్చి 38,289 ఎకరాల్లో సాగు చేయగా, పూత 40% వరకు రాలిపోతున్నట్టు ప్రాథమికంగా అంచనా. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో... ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఈసారి అత్యధికంగా 6,85,262 ఎకరాల్లో పత్తి సాగైంది.భారీ వర్షాల కారణంగా పత్తి పంట దిగుబడి సగానికి పడిపోవడం, ప్రస్తుత తుపాను కారణంగా పంట మరింత దెబ్బతినడంతో ఎకరానికి ఐదు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు చేతికంది వచ్చిన పంట ఆగమైందిరెండున్నర ఎకరాల్లో వరిసాగు చేయగా రూ.లక్షకుపైగా ఖర్చు అయ్యింది. ప్రస్తుతం వరి పొట్టదశకు చేరుకుంది. కొద్దిరోజుల్లో వరి కోతలు అనుకున్నాం. అంతలోనే తుపాను కారణంగా చేతికి అంది వచ్చిన పంటకు నష్టం వాటిల్లింది. –భూక్యా శాంతి, సోమ్ల తండా మహబూబాబాద్ పత్తి ఏరకుండా వదిలేశానునాకున్న 3 ఎకరాల్లో పత్తి పంట వేశా. ఇప్పటివరకు ఎకరాకు రూ.30 వేల చొప్పున ఖర్చు అయ్యింది. ఈసారి భారీ వర్షాలకు పత్తి దిగుబడి సగానికి తగ్గింది. కూలీలతో పత్తి ఏరేందుకు సిద్ధమవుతున్న సమయంలో తుపాను కారణంగా పంట మరింత దెబ్బతింది. కూలీల ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడం పత్తి తీయడం మానేశాను. – లాల్యా, పోచమ్మతండా, వెల్దండ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా) రైతులు అప్రమత్తంగా ఉండాలిమోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ఆరెంజ్ హెచ్చరిక జారీ అయ్యింది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. కోసిన వరి, మొక్కజొన్న, పత్తిని సురక్షిత ప్రాంతాల్లో దాచుకోవాలి. వరి, మొక్కజొన్నను తుపాను ప్రభావం తగ్గిన తర్వాత కోయాలి. పత్తి ఏరవద్దు. తొందరపడి కోస్తే తడిసే అవకాశం ఉంది.అధిక నీటి నిల్వతో ఎండుతెగులుతో పాటు ఇతర చీడపీడలు సోకే అవకాశాలు ఉన్నందున పలు జాగ్రత్తలు పాటించాలి. – శ్రీనివాస్, డీఏవో పెద్దపల్లి -
ప్రాజెక్టులకు మళ్లీ జలకళ
కేతేపల్లి/నాగార్జునసాగర్/బాల్కొండ/జగిత్యాల అగ్రికల్చర్: విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులు మళ్లీ జలకళను సంతరించుకున్నాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద రాగా, బుధవారం ప్రాజెక్టు ఎనిమిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 4.46 టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 4.09 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 1,94,845 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 20 క్రస్ట్‌గేట్లు, విద్యుదుత్పాదన ద్వారా 1,94,845 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కుడి, ఎడమ కాల్వ, వరద కాల్వకు, ఏఎమ్మార్పికి నీటి విడుదలను నిలిపివేశారు. సాగర్ జలాశయ గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగుల మేర నీరు ఉంది. మోంథా తుపాను ప్రభావంతో సాగర్ పరిసర ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాగర్ శివారులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులోని ఎత్తిపోతల వద్ద జలపాతం ఉధృతంగా పారుతోంది. ఎగువ నుంచి భారీ వరద నీరు వస్తుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. బాబ్లీ గేట్ల మూసివేత శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బుధవారం త్రి సభ్య కమిటీ సభ్యుల సమక్షంలో మూసివేశారు. ప్రాజెక్టు గేట్లను జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచుతారు. ప్రతి ఏటా అక్టోబర్ 29న మూసివేస్తారు. అయితే ప్రాజెక్టుకు 14 గేట్లు ఉండగా, ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తుండటంతో పది గేట్లను మాత్రమే మూసి వేసి మిగతా నాలుగు గేట్లను తెరిచి ఉంచి ఎస్సారెస్పీలోకి నీటి విడుదల చేస్తున్నారు. వరద నీటి ఆధారంగా నాలుగు గేట్ల మూసి వేత, ఓపెన్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ఈఈ ప్రాంక్లిన్, ఎస్సారెస్పీ ఎస్ఈ జగదీశ్, నాందేడ్ ఈఈ సీఆర్ బన్సద్, ఏఈఈ రవి తదితరులు పాల్గొన్నారు. -
Adimulapu Suresh: తాగటానికి నీళ్ళు కూడా ఇవ్వరా? అధికారులపై ఆదిమూలపు సురేష్ ఫైర్
-
ధాన్యం రైతు గుండెల్లో ‘మోంథా’ గుబులు
సాక్షి, అమరావతి: ధాన్యం రైతు గుండెల్లో ‘మోంథా’ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు కోతదశకు చేరుకున్న పంటచేలు నేలకొరిగాయి. తుపాను ప్రభావిత జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరికంకులు దెబ్బతింటున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద తీరాన్ని తాకిన ఈ తుపాను ప్రభావం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర, కోస్తాం«ధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తుపాను తర్వాత దాదాపు మూడురోజులు కురిసే వర్షాల ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో పంటలపై ఉంటుందని చెబుతున్నారు. ప్రధానంగా వరితోపాటు మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, పెసర పంటలకు అపారనష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది 72.87 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగవగా, అందులో 38.96 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. సాగైన వరి విస్తీర్ణంలో దాదాపు 31.14 లక్షల ఎకరాలు తుపాను ప్రభావిత జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ఇందులో సుమారు 15 లక్షల ఎకరాల్లో పంట తీవ్ర ప్రభావానికి గురవుతుందని వ్యవసాయశాఖ ముందస్తు అంచనా వేసింది. ఇతర పంటలన్నీ కలుపుకొంటే 20 లక్షల ఎకరాల్లో పంటలపై తుపాను ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దిగుబడులపై ప్రభావం తుపాను ప్రభావంతో భారీ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో వరిపైరు తీవ్రంగా దెబ్బతింటుంది. ముంపునీరు దిగిపోయిన తర్వాత సత్వర యాజమాన్య పద్ధతులు పాటించినప్పటికీ తుపాను ప్రభావం దిగుబడులపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎకరాకు కనీసం 5 నుంచి 8 బస్తాలు దిగుబడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ధాన్యం రంగుమారడం, తేమశాతం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే మొలకలొచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. బిహార్ ఎన్నికల విధుల్లో వ్యవసాయశాఖ డైరెక్టర్ వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ బిహార్‌లో ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లారు. గతంలో ఉన్నతాధికారులు ఎన్నికలతోపాటు ఇతర సేవల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లినప్పుడు వారి బాధ్యతలను ఇతర అనుబంధ శాఖల అధికారులకు అప్పగించేవారు. ఇప్పుడు వ్యవసాయశాఖ డైరెక్టర్ బాధ్యతల్ని ఎవరికీ అప్పగించలేదు. దీంతో లాగిన్స్ అన్నీ ఆయన వద్దే ఉన్నాయి. విపత్తు వేళ ఆ శాఖలో విభాగాధిపతులు ప్రతి చిన్న విషయాన్ని బిహార్‌లో ఉన్న డైరెక్టర్‌కి ఫోన్ ద్వారా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఈరోజు రాత్రికే.. కాకినాడకు 270KMల దూరంలో తుఫాన్
-
‘మోంథా’ పెను ముప్పు!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉగ్రరూపం దాల్చుతూ.. సాగరాన్ని చీల్చుకుంటూ.. రాష్ట్రంపై విరుచుకుపడేందుకు మోంథా తుపాను పెను ఉప్పెనలా దూసుకొస్తోంది. ఓవైపు బలమైన ఈదురు గాలులు కకావికలం చేస్తుండగా.. జడివానలు జడిపిస్తున్నాయి. రోడ్డు మార్గాలు జలమయమయ్యాయి.. రైలు మార్గాలను ముంపు ముప్పు భయపెడుతోంది. భీకర గాలులు వాయుమార్గాన్ని సైతం స్తంభింపజేస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతికి వచ్చే పలు విమానాలను పెను తుపాను కారణంగా రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్ల పరిధిలో 97 రైళ్లను రద్దు చేశారు. సముద్రం అల్ల కల్లోలం కావడంతో జల రవాణా స్తంభించిపోయింది. పోర్టుల్లో సరుకు రవాణా కార్గో షిప్పులకు లంగరు వేశారు. నౌకాదళానికి చెందిన నౌకలు ప్రధాన కేంద్రాలకు చేరుకున్నాయి. కాకినాడ తీరంలో రాకాసి అలల హోరు.. తీరం వైపు దూసుకొస్తున్న మోంథా తుపాను ధాటికి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా తడిసి ముద్దవగా కాకినాడ తీరంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. తీవ్ర వాయుగుండం నుంచి సోమవారం ఉదయానికి తుపానుగా మారింది. ఆగ్నేయ, పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తుపాను గంటకు 13 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి సమయానికి విశాఖకు 460 కిలోమీటర్లు, కాకినాడకు 410, చెన్నైకి 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా మారి ముందుకు కదలనుంది. బుధవారం తెల్లవారు జామున కాకినాడ– అమలాపురం మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రచండ వేగంతో.. తుపాను తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ వేగం పెరుగుతోంది. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో ఎడతెగని వర్షం.. మోంథా తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర అంతటా ఎడతెగని వర్షాలు కురవగా మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. విశాఖ నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డుపై కూలిపోయాయి. విశాఖ రూరల్ పరిధిలోని జాతర ప్రాంగణం వద్ద 9.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మధురవాడ, కాపులుప్పాడ, పెందుర్తి, సీతమ్మధార, ఎండాడ, సాగర్ నగర్, మహారాణిపేట, గోపాలపట్నం, గాజువాక, సబ్బవరం ప్రాంతాల్లో 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అనకాపల్లి జిల్లా గంధవరంలో 5.8, శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం విజయరాంపురంలో 5.7 సెంటీమీటర్ల వర్షం పడింది. అంబేడ్కర్ కోనసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ సముద్ర తీరంలో రెండు మీటర్లపైగా ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. విశాఖ బీచ్‌లో కోస్టల్ బ్యాటరీ వద్ద ఎగసిపడుతున్న అలలు నేడు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. తుపాను ప్రభావంతో మంగళవారం ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు (20 సెంటీ మీటర్లకుపైగా), కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు (15 నుంచి 20 సెంటీ మీటర్లు) కురిసే అవకాశం ఉంది. తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, నంద్యాల, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కూడా కుండపోతే..! ఈ నెల 29వ తేదీన బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నంద్యాల, ప్రకాశం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీనివల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, కమ్యూనికేషన్ వ్యవస్థకు ఆటంకం, వరదలు, పిడుగులు, నేల కోతకు గురి కావడం, రోడ్లు దెబ్బతినడం, బలహీనమైన నిర్మాణాలు, గుడిసెలు నేలమట్టమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు ఉప్పొంగి ఆకస్మిక వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది. అందుకనుగుణంగా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నెల 30వ తేదీ వరకు మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సరఫరాను పునరుద్ధరించేందుకు సంసిద్ధంగా ఉండాలని విద్యుత్ సంస్థలతో నిర్వహించిన సమీక్షలో సీఎస్ కె.విజయానంద్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో కురుస్తున్న వర్షం ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సహాయక చర్యలపై ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ ఇన్చార్జి అజయ్‌జైన్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే 32,400 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని.. ఐదు ఎన్డీఆర్ఎఫ్, ఆరు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో 2,914 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 233 మండలాల్లోని 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీల్లో తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నదాతల్లో ఆందోళన.. అన్నదాత చివరి ఆశలపై మోంథా తుపాను నీళ్లు జల్లింది. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా 1.63 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌లో వరి సాగు చేపట్టగా ప్రస్తుతం గింజ గట్టి పడుతున్న దశలో ఉంది. గత వారం అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు వరి చేలల్లో ముంపు నీరు చేరింది. కొబ్బరి రైతుల్లోనూ తుపాను తీవ్ర కలవరం రేపుతోంది. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరిస్తుండటంతో 1996 తుపాను గుర్తు చేసుకుని ఆందోళన చెందుతున్నారు. నేడు, రేపు 17 జిల్లాల్లో రెడ్ అలెర్ట్..ముంచుకొస్తున్న తుపాను ముప్పుతో అంతటా అప్రమత్తత నెలకొంది. మంగళ, బుధవారం 17 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలుండటంతో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు మూడు రోజుల పాటు సెలవులు రద్దు చేసి సహాయక చర్యల్లో నిమగ్నం చేశారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలుతుపాను నేపథ్యంలో కాకినాడ పోర్టులో 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరం పోర్టుల్లో 6వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 5వ నంబర్ ప్రమాద హెచ్చరికలు వెలువడ్డాయి. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగుర వేశారు. తీర ప్రాంతాలకు సందర్శకులు రాకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. ప్రధాన బీచ్‌లలో పోలీసులు, మెరైన్ సిబ్బంది పహారా కాస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా రెడ్ అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు... ఆరెంజ్ అలెర్ట్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.తుపాను కారణంగా అలల తాకిడి పెరగడంతో విశాఖ బీచ్ రోడ్డులో కృష్ణ మందిర్ వద్ద కోతకు గురైన తీరం కోనసీమకు పెను గండం..!సాక్షి, అమలాపురం: పెను తుపాను గండం కోనసీమను వణికిస్తోంది. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో రాకాసి అలలు రెండు, మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఓడలరేవు వద్ద ఓఎన్జీసీ వశిష్ట టెర్మినల్ ప్రధాన గోడను అలలు తాకుతున్నాయి. సరుగుడు తోటలు సముద్రంలో కలసిపోతున్నాయి. కాట్రేనికోన మండలం నదీపాయల మధ్య ఉన్న మగసానితిప్ప గ్రామంలోని మత్స్యకారులను బలుసుతిప్పకు తరలించి పునరావాసం కల్పించారు. లంక గ్రామాల రైతులు పాడి పశువులను మైదాన ప్రాంతాలకు తరలించారు. జిల్లాలో 120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. భయం గుప్పెట్లో కాకినాడసాక్షి ప్రతినిధి, కాకినాడ: మోంథా తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటనుందనే భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాలోని తీర ప్రాంత మండలాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. జిల్లాలోని 12 మండలాలపై ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ నేపథ్యంలో కాకినాడ డీప్ వాటర్ పోర్టు, యాంకరేజ్ పోర్టుల్లో కార్యకలాపాలను నిలిపివేశారు. కాకినాడ–ఉప్పాడ బీచ్ రోడ్డు, బీచ్ పార్కులలో రాకపోకలను ఆపేశారు. కాకినాడ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 29వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం కాకినాడ రూరల్‌లోని పర్ర కాలువ వంతెనపై ప్రవహిస్తున్న నీటిలో పడి 12 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. రెడ్ అలెర్ట్ జిల్లాలివే..శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం.ఆరెంజ్ అలెర్ట్ జిల్లాలుశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నంద్యాలఎల్లో అలెర్ట్ జిల్లాలుచిత్తూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురంతెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు మొంథా తుఫాను ప్రభావం తెలంగాణపైనా ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని హెచ్చరించింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. తీవ్ర తుపాను కారణంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈమేరకు జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్... భద్రాద్రి కొత్తగూడెం,ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. విమానాల రద్దు మోంథా తుపాను ప్రభావంలో విజయవాడ, విశాఖపట్నం నుంచి హైదరాబాద్, తిరుపతితోపాటు దేశంలోని వివిధ గమ్యస్థానాలకు రాకపోకలు సాగించే విమానాలను కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇప్పటికే రద్దు చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 30కి పైగా విమానాల రాకపోకలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. అలాగే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మంగళవారం, బుధవారం ప్రయాణించాల్సిన 54 రైళ్లను రద్దు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో 43 రైళ్లను రద్దు చేశారు. మొత్తం 97 రైళ్లను రద్దు చేసినట్లు ఆయా డివిజన్ల అధికారులు ప్రకటించారు. విజయవాడ డివిజన్ పరిధిలోని విజయవాడ, భీమవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నరసాపూర్, ఒంగోలు, రాజమహేంద్రవరం నుంచి బయలుదేరే రైళ్లను రద్దు చేసినట్లు డివిజనల్ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు ఎంఎస్ఎస్ ద్వారా సమాచారం పంపామని, టికెట్ల డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. కాగా, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో లోకల్ వార్నింగ్ సిగ్నల్–4 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడు, ఒడిశాలో.. తమిళనాడు, ఒడిశాలోనూ మోంథా ప్రభావం చూపుతోంది. చెన్నైతోపాటు ఉత్తర తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసనట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. మోంథా నేపథ్యంలో ఒడిశా కూడా అప్రమత్తమైంది. దక్షిణ ఒడిశాలో 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీచేశారు. మూడువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
Cyclone Montha: కోనసీమ జిల్లాలో మోంథా తుఫాన్ ఎఫెక్ట్
-
Cyclone Montha: ఏపీకి భారీ హెచ్చరిక


