సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 30 నుంచి మూడు రోజులపాటు పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశంతోపాటు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.