దమ్ముంది.. దన్ను కావాలి | India ranks 10th globally in private Artificial Intelligence investment | Sakshi
Sakshi News home page

దమ్ముంది.. దన్ను కావాలి

Feb 24 2026 5:39 AM | Updated on Feb 24 2026 5:39 AM

India ranks 10th globally in private Artificial Intelligence investment

ఇప్పటికైతే మనది 10వ స్థానం

ఏఐ మేధోనిధి.. ఇండియా!

మెరికలున్నా సదుపాయాల్లేవు

నైపుణ్యం ఒక్కటే సరిపోదు

సూపర్‌ కంప్యూటర్‌లు... భారీ పెట్టుబడులు అవసరం

ఏఐ సదస్సు చూపిన ‘ఇంపాక్ట్‌’

ఢిల్లీలో ఐదు రోజుల ఐఏ ఇంపాక్ట్‌ సదస్సు ఇటీవలే ముగిసింది. ఇండియా ఈ సదస్సును మొదటిసారి నిర్వహించింది. ప్రపంచ దేశాల నాయకులు ఇందులో పాల్గొన్నారు. కొత్త ఆవిష్కరణలపై అంతా దృష్టి పెట్టారు. ఇండియాకైతే ఇది ఒక కీలకమైన సందర్భం. మన ఏఐ వ్యవస్థలో ఉన్న బలాలు, పూరించుకోవలసిన లోట్లను ఈ సదస్సు స్పష్టం చేసింది.

నిపుణుల సంఖ్యలో రెండో స్థానం
ఏఐ రంగంలో మెరికలు ఉన్న దేశంగా ఇండియా పేరు పొందింది. కానీ మౌలిక సదుపాయాల విషయంలో వెనుకబడి ఉంది. 2024 ‘టార్టాయిస్‌ గ్లోబల్‌ ఏఐ ఇండెక్స్‌’ ప్రకారం, ఏఐ సామర్థ్యంలో ఇండియా ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది. ఏఐ నిపుణుల సంఖ్యలో మాత్రం 2వ స్థానంలో నిలిచింది.

సౌకర్యాలలో 68వ స్థానం
ఏఐ ఆపరేషన్స్‌లో ఇండియా 3వ స్థానంతో మంచి ప్రతిభ కనబరిచింది. అయితే కంప్యూటింగ్‌ పవర్, ఇతర సౌకర్యాల విషయంలో 68వ స్థానంలో ఉంది. ఈ కారణంగా అమెరికా, చైనాతో పోటీ పడటం భారత్‌కు కష్టం కావచ్చన్న అభిప్రాయం ఏఐ పరిశ్రమంలో వ్యక్తం అవుతోంది.

ఉన్నది కొన్నే సూపర్‌ కంప్యూటర్‌లు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత శక్తివంతమైన 500 సూపర్‌ కంప్యూటర్లలో ఇండియా వాటా కేవలం 1 శాతం మాత్రమే. అంటే, ఏఐకి  కావలసిన కంప్యూటింగ్‌ సామర్థ్యం మన దగ్గర చాలా తక్కువగా ఉంది. అమెరికా ఈ విషయంలో చాలా ముందుంది. ప్రపంచంలోని మొత్తం సూపర్‌ కంప్యూటర్లలో 35 శాతం సిస్టమ్‌లు, దాదాపు 48 శాతం కంప్యూటింగ్‌ సామర్థ్యం అమెరికా దగ్గరే ఉంది.

ట్రైనింగ్‌ డేటాలో 3 శాతం వాటా
ఏఐ ట్రైనింగ్‌ డేటా రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడులలో భారతదేశం వాటా కేవలం 3 శాతం మాత్రమే. అంటే, మన దేశానికి చాలా తక్కువ పెట్టుబడులు అందుతున్నాయి. ఈ విషయంలో అమెరికా 56 శాతంతో అందరికంటే ముందుంది. ఆ తర్వాత చైనా 17 శాతంతో, ఐరోపా సమాఖ్య దేశాలు 15 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ప్రపంచాన్ని శాసించగలమా?
మన దగ్గర అద్భుతమైన తెలివితేటలు కలిగిన నిపుణులు ఉన్నారు. కానీ, ఆ తెలివితేటలకు తగ్గట్టుగా శక్తివంతమైన కంప్యూటర్లు, భారీ పెట్టుబడులు తోడవాల్సి ఉంది. అమెరికా, చైనా వంటి దేశాలతో పోటీ పడాలంటే, కేవలం సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యం మాత్రమే సరిపోదు; సొంతంగా డేటా సెంటర్లు, సూపర్‌ కంప్యూటర్లను పెంచుకోవాలి. అప్పుడే ఇండియా ఏఐ ప్రపంచాన్ని శాసించ గలుగుతుంది.

హెచ్‌.పి.సి. సిస్టమ్‌ : హై పెర్ఫార్మింగ్‌ కంప్యూటింగ్‌ (యంత్ర సామర్థ్యం)
హెచ్‌.పి.సి. కెపాసిటీ : హై పెర్ఫార్మింగ్‌ కెపాసిటీ (శక్తి సామర్థ్యం)
హెచ్‌.ఐ.సి.: హై ఇన్‌కం కంట్రీస్‌; యు.ఎం.ఐ.సి.: అప్పర్‌ మిడిల్‌ ఇన్‌కం కంట్రీస్‌
ఎల్‌.ఎం.ఐ. సి. : లోయర్‌–మిడిల్‌ ఇన్‌కం కంట్రీస్‌

Advertisement
 
Advertisement
Advertisement