భూ సేకరణ పరిహారంపై సుప్రీం
న్యూఢిల్లీ: ఎన్‌హెచ్‌ఏఐ చట్టం కింద భూ సేకరణ, నష్టపరిహారాలకు సంబంధించి 2018కి ముందు కేసుల పునఃపరిశీలన సాధ్యపడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎన్‌హెచ్‌ఏఐ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం సోమవారం ఈ మేరకు పేర్కొంది.
ఎన్‌హెచ్‌ఏఐ చట్టం కింద సేకరించిన రైతుల భూమికి పరిహారం, వడ్డీ చెల్లించాలన్న నిర్ణయం గత ఉదంతాలకు కూడా వర్తిస్తుందంటూ 2019లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ‘‘అలాగైతే మాపై ఏకంగా రూ.32 వేల కోట్ల మేరకు ఆర్థిక భారం పడుతుంది. కనుక ఈ నిర్ణయాన్ని ఇకపై తలెత్తే వివాదాలకు మాత్రమే వర్తింపజేయాలి’’అని కోరింది.
అలా చేయడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14లో పేర్కొన్న సమానత్వపు హక్కుకు విఘాతమే అవుతుందంటూ ఈ విజ్ఞప్తిని అప్పట్లో న్యాయస్థానం తిరస్కరించింది. దానిపై ఎన్‌హెచ్‌ఏఐ పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌పై సీజేఐ ధర్మాసనం విచారణ జరుపుతోంది. 2019 నాటి తీర్పును ఫిబ్రవరి 4 నాటి విచారణ సందర్భంగా కూడా ధర్మాసనం సమర్థించింది. దీనిపై వాదనలు సోమవారం కూడా కొనసాగాయి. ఈ ఉదంతానికి సంబంధించి అభ్యంతరాలేమైనా ఉంటే లిఖితపూర్వకంగా సమరి్పంచాలని ఇరు వర్గాలను ధర్మాసనం ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.


