హిట్‌ సాంగ్‌ క్రెడిట్‌ వారిదే.. ఒప్పుకున్న ఏఆర్‌ రెహమాన్‌ | AR Rahman Agrees To Credit Junior Dagar Brothers For Veera Raja Veera Song After Court Dispute | Sakshi
Sakshi News home page

హిట్‌ సాంగ్‌ క్రెడిట్‌ వారిదే.. ఒప్పుకున్న ఏఆర్‌ రెహమాన్‌

Feb 21 2026 6:38 AM | Updated on Feb 21 2026 10:30 AM

AR Rahman Agree To credit this song to dogar brothers

సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచిన "వీర రాజా వీర" సాంగ్‌ వివాదం ముగిసింది. పోన్నియన్‌ సెల్వన్‌-2 మూవీలోని ఈ పాట క్రెడిట్‌ను జూనియర్ డాగర్ బ్రదర్స్‌కు ఇచ్చేందుకు సుప్రీంకోర్టులో ఆయన అంగీకరించారు.  ఈ పాట డాగర్వాణి సంప్రదాయ శివస్తుతి నుంచి తీసుకున్నారని తమ పూర్వీకులు ఆలపించిన ఈ పాటను తమకు క్రెడిట్ ఇవ్వలేదని ఉస్తాద్ ఫయాజ్ వాసిఫుద్దీన్ డాగర్ (Ustad Faiyaz Wasifuddin Dagar) కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

విచారణలో భాగంగా ఆ సంప్రదాయానికి చెందిన కుటుంబ సభ్యులకు క్రెడిట్ ఇవ్వడంలో తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. దానిని తాజాగా ఏఆర్‌ రెహమాన్‌ అంగీకరించారు. 5వారాలలోపు అన్ని సోషల్‌ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనూ వారి పేరు చేర్చి క్రెడిట్‌ ఇవ్వాలని ఆదేశించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement