గోపి, నరేంద్ర రెడ్డి, శివాని, సుహాస్, వీకే నరేశ్, వంశీ నందిపాటి
సుహాస్, శివానీ నాగారం జంటగా, వీకే నరేశ్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘హే బల్‌వంత్’. గోపీ అచ్చర దర్శకత్వంలో బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలైంది. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను రిలీజ్ చేశారు. ప్రేక్షకుల నుంచి తమ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో సుహాస్ మాట్లాడుతూ–‘‘నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఈ సినిమాతో వచ్చింది.
కలెక్షన్స్ చూస్తే నమ్మలేకపోతున్నాను. రాను రాను కలెక్షన్స్ మరింత పెరుగుతాయి’’ అని అన్నారు. ‘‘మా సినిమాను ప్రేక్షకులు థియేటర్స్‌లో చూసి, మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం’’ అన్నారు గోపీ, నరేంద్ర. ‘‘సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ వీకెండ్‌లో బ్రేక్ ఈవెన్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు వంశీ నందిపాటి.


