అంతా.. ఫిబ్రవరిలోనే | Supreme Court Final Verdict In Actress Prathyusha Case | Sakshi
Sakshi News home page

అంతా.. ఫిబ్రవరిలోనే

Feb 18 2026 7:29 AM | Updated on Feb 18 2026 7:29 AM

Supreme Court Final Verdict In Actress Prathyusha Case

ప్రత్యూష కేసులో కీలక పరిణామాలు ఈ నెలలోనే

2002లో పంజగుట్ట ఠాణాలో కేసు నమోదు 

 నగర పోలీసులు, సీబీఐ దర్యాప్తు  

నిందితుడు సిద్ధార్థ రెడ్డికి 

2011లో జైలుశిక్ష  

సాక్షి,సిటీబ్యూరో/మణికొండ: అప్పట్లో తెలుగునాట కలకలం సృష్టించిన సినీనటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. 24 ఏళ్ల ఈ ఎపిసోడ్‌లో కీలక ఘట్టాలన్నీ ఫిబ్రవరిలోనే జరగడం యాదృచ్ఛికం. 

2002లో.. 
నగరంలోని తార్నాకలో ఉండే ప్రత్యూషకు సహా విద్యార్థి, సిద్ధార్థరెడ్డితో పరిచయం ప్రేమకు దారి తీసింది. 1998లో ‘రాయుడు’ చిత్రంతో ప్రత్యూష సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 2002 నాటికి ఆమె సుమారు 10 సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో ప్రత్యూష, సిద్ధార్థరెడ్డిల పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ.. సిద్ధార్థ కుటుంబం వీరి వివాహానికి అంగీకరించలేదు. ఈ వివాదం నేపథ్యంలో 2002 ఫిబ్రవరి 23న పంజగుట్టలోని బ్యూటీపార్లర్‌లో ఉన్న ప్రత్యూషను సిద్ధార్థ తన కారులో ఎక్కించుకున్నాడు. అప్పటికే హైదర్‌గూడలో ‘ఆర్గానోఫాస్ఫేట్‌’ పురుగుల మందు ఖరీదు చేసి కూల్‌డ్రింక్‌లో కలిపి తెచ్చాడు. దీన్ని ఇద్దరూ కారులోనే తాగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రత్యూష మరణించింది.  

2004లో.. 
ఈ ఉదంతంపై పంజగుట్ట పోలీసులు సిద్ధార్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యూష పోస్టుమార్టం నివేదికలోని అంశాలు, ఇతర పరిణామాల ఆధారంగా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని, సిద్ధార్థతో పాటు అందులో ప్రమేయం ఉన్న వాళ్లు హత్య చేసి కేసును తారుమారు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. చివరకు ప్రత్యూషది ఆత్మహత్యగా తేలి్చన సీబీఐ.. అందుకు ప్రేరేపించిన సిద్ధార్థపై అభియోగపత్రం దాఖలు చేసింది. కేసును విచారించిన సెషన్స్‌ కోర్టు 2004 ఫిబ్రవరిలో నిందితుడికి శిక్ష విధించింది. 

2026లో.. 
ఈ తీర్పును సిద్ధార్థ రెడ్డి హైకోర్టులో అప్పట్లో సవాల్‌ చేయడంతో సెషన్స్‌ కోర్టు విధించిన శిక్షను తగ్గిస్తూ, జరిమానాను పెంచుతూ 2011 డిసెంబర్‌లో తీర్పు ఇచ్చింది. సెషన్స్‌ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు తగ్గించడాన్ని సరోజినీ దేవి, శిక్ష విధించడాన్ని సిద్ధార్థ సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం సుప్రీంకోర్టు తీర్పునిస్తూ అతడి పిటిషన్‌ను తోసిపుచి్చంది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని సిద్ధార్థను ఆదేశించింది. ఇలా ఈ కేసులో 2002 ఫిబ్రవరి– 2026 ఫిబ్రవరి మధ్య 24 ఏళ్లలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement