breaking news
Supreme Court
-
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
-
సౌదీ సుప్రీంకోర్టులో శివకు బిగ్ రిలీఫ్
సోషల్ మీడియాలో పెట్టిన ఓ కామెంట్.. ఆ యువకుడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. తొలుత జైలు శిక్ష, భారీ జరిమానాకు దారితీసింది. ఆ తర్వాత శిక్ష తగ్గించాలని పిటిషన్ వేస్తే.. అది ఊహించని మలుపు తిరిగి మరణశిక్ష పడేలా చేసింది. దీంతో ఆ యువకుడి కుటుంబం తల్లడిల్లిపోయింది. అతన్ని కాపాడుకునేందుకు అన్ని విధాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే.. సుప్రీం కోర్టు జోక్యంతో ఆ యువకుడికి భారీ ఊరట లభించింది.శ్రీలంకకు చెందిన 24 ఏళ్ల హిందూ వలస కార్మికుడు అనోజన్ శివరాసా విషయంలో ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇస్లాం ప్రవక్త మహమ్మద్‌పై అభ్యంతరకర వ్యాఖ్య చేశాడనే ఆరోపణలతో సౌదీ అరేబియా కోర్టు విధించిన మరణశిక్షను ఆ దేశ సుప్రీంకోర్టు అక్టోబర్ 13న రద్దు చేసింది. శ్రీలంక ప్రభుత్వం చేపట్టిన దౌత్య, న్యాయపరమైన ప్రయత్నాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే అనోజన్‌కు పూర్తిగా విముక్తి లభించిందా? శిక్ష కొనసాగనుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.అసలు వివాదం అక్కడే మొదలైంది..ఈ ఏడాది జూన్ చివర్లో శ్రీలంకలో హిందూ యాత్రికులు వెళ్తున్న సమయంలో ఓ ముస్లిం యువకుడు కుక్కను తన్నుతున్నట్లు చూపించే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో ఫేస్బుక్లో మతపరమైన వాదోపవాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి హిందూ దేవతపై అభ్యంతరకర వ్యాఖ్య చేశాడు. దీనికి స్పందించిన సౌదీలో పనిచేస్తున్న శివ.. తమిళంలో ప్రవక్త మహమ్మద్‌పై వ్యాఖ్య చేశాడు. అది ఇస్లాంను, ప్రవక్తను అవమానించేలా ఉందంటూ వివాదం చెలరేగింది.పరిస్థితి తీవ్రతను గుర్తించిన అనోజన్ కొద్దిసేపటికే ఆ కామెంట్‌ను తొలగించాడు. అనంతరం వీడియో ద్వారా క్షమాపణ కూడా చెప్పాడు. అయినప్పటికీ అప్పటికే ఆ వ్యాఖ్యకు సంబంధించిన స్క్రీన్షాట్లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. శ్రీలంకలోని కొందరు వ్యక్తులు అనోజన్ పనిచేస్తున్న సౌదీ సంస్థకు ఈ వివరాలను ఈమెయిల్ చేశారు. దీంతో సౌదీ అధికారుల దృష్టికి ఈ వ్యవహారం వెళ్లింది. అనోజన్ ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.జైలు శిక్ష నుంచి మరణశిక్షకు..జూలై 15న అల్-అహ్సా క్రిమినల్ కోర్టు అనోజన్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 30 లక్షల సౌదీ రియాళ్ల జరిమానా విధించింది. అది సుమారు 8 లక్షల అమెరికన్ డాలర్లకు సమానం. సౌదీ సైబర్ నేరాల చట్టం కింద ఈ శిక్ష విధించినట్లు కథనాలు పేర్కొన్నాయి.అయితే కేసు అక్కడితో ముగియలేదు. సెప్టెంబర్ 17న సౌదీ అప్పీల్ కోర్టు ఆయనకు విధించిన అసలు శిక్షను పక్కనపెట్టి, షరియా చట్టం కింద దైవదూషణకు సంబంధించిన నేరంగా పరిగణిస్తూ మరణశిక్ష విధించింది. దీంతో అనోజన్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. సెప్టెంబర్ 28 తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోగా.. తమ కుమారుడికి ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందారు.Mother of Anojan Sivarasa pleading.. This is painful to watch. Come on Saudi Arabia.. Give him an excuse.. and send him back to Sri Lanka 🙏 #Anojan https://t.co/GefBlpQKk4— Nibraz Ramzan (@nibraz88cricket) October 11, 2026శ్రీలంక ప్రభుత్వం దౌత్య ప్రయత్నాలు..మరణశిక్షను రద్దు చేయించేందుకు శ్రీలంక ప్రభుత్వం దౌత్య, న్యాయపరమైన చర్యలను ముమ్మరం చేసింది. సెప్టెంబర్ 21న అనోజన్ కుటుంబ సభ్యులు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకను కలిసి తమ కుమారుడిని కాపాడాలని కోరారు. క్షమాభిక్ష కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. న్యాయపరమైన ఖర్చులను భరించేందుకు కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది.మరోవైపు, శ్రీలంకకు చెందిన ఆరుగురు తమిళ, ముస్లిం ఎంపీలు సెప్టెంబర్ 24న సౌదీ విదేశాంగ మంత్రికి లేఖ రాసి అనోజన్పై కరుణ చూపించాలని కోరారు. శ్రీలంక రాయబారి అమీర్ అజ్వాద్ అక్టోబర్ 8న దమ్మామ్ సెంట్రల్ జైలులో అనోజన్ను కలిసి ఆయన పరిస్థితిని తెలుసుకున్నారు. జైలులో తోటి ఖైదీ దాడి చేసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన క్షేమసమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అదనపు సొలిసిటర్ జనరల్ ఆజాద్ నవావి, ప్రెసిడెంట్స్ కౌన్సెల్ ఫైజర్ ముస్తఫా, ఉపుల్ కుమారపెరుమ, న్యాయవాది హఫీల్ ఫారిస్లతో కూడిన ప్రత్యేక న్యాయ బృందం కూడా కేసులో తదుపరి చర్యల కోసం రియాద్‌కు వెళ్లింది.సుప్రీంకోర్టులో అప్పీల్.. మరణశిక్ష రద్దుశ్రీలంక ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాల్లో కీలక పరిణామం అక్టోబర్ 13న చోటుచేసుకుంది. అక్టోబర్ 11న సౌదీ సుప్రీంకోర్టులో దాఖలైన అప్పీల్ విచారణ అనంతరం అనోజన్‌కు విధించిన మరణశిక్షను కోర్టు రద్దు చేసింది. ఈ విషయాన్ని శ్రీలంక విదేశాంగ, విదేశీ ఉపాధి, పర్యాటక మంత్రిత్వ శాఖ అక్టోబర్ 14న అధికారికంగా వెల్లడించింది.మరణశిక్ష రద్దు కావడంతో అనోజన్ కుటుంబానికి పెద్ద ఊరట లభించినప్పటికీ, ఆయనపై ఉన్న నేరారోపణలన్నీ కొట్టివేశారా? లేక గతంలో విధించిన ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా మళ్లీ అమలులోకి వస్తాయా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ అంశంపై సౌదీ అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.సోషల్ మీడియా వ్యాఖ్యలపై మరోసారి చర్చసౌదీ అరేబియాలో సోషల్ మీడియా పోస్టుల కారణంగా కఠిన శిక్షలు విధించిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. 2023లో సౌదీ మాజీ ఉపాధ్యాయుడు మహమ్మద్ అల్-ఘమ్దీకి సోషల్ మీడియా పోస్టుల కేసులో తొలుత మరణశిక్ష విధించగా, ఆ తర్వాత దాన్ని 30 ఏళ్ల జైలు శిక్షగా మార్చారు.అనోజన్ కేసులోనూ మరణశిక్ష రద్దు కావడం కీలక పరిణామమే అయినప్పటికీ, ఆయనకు పూర్తిస్థాయిలో విముక్తి లభించే వరకు న్యాయపరమైన ప్రక్రియ కొనసాగాల్సి ఉంది. క్షణికావేశంలో సామాజిక మాధ్యమాల్లో చేసే వ్యాఖ్యలు ఎంతటి తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చో ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది.ఇదీ చదవండి: మిషిగాన్ స్పీకర్ రేసులో రణ్జీవ్! ఎవరీయన అంటే.. -
మున్సిపాలిటీల అంశం.. ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో సమీప గ్రామాలను మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఏకపక్షంగా విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గ్రామాల విలీన ప్రక్రియ తమ తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో విలీన ప్రక్రియపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధే (అలోక్ రాథే)లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. గ్రామాల తీర్మానాలు, ఆమోదం తీసుకోకుండానే సమీప గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రక్రియలో చట్టపరమైన నిబంధనలను పాటించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.ఏపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా.. పిటిషనర్లు ఎద్దుల సుబ్బారెడ్డి, వల్లేపల్లి వెంకట సుబ్రహ్మణ్యం తరఫున సీనియర్ న్యాయవాది రామకృష్ణ ప్రసాద్ వాదించారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై తుది తీర్పు వెలువడే వరకు విలీన ప్రక్రియ ఆ తీర్పునకు లోబడి ఉంటుందని పేర్కొంది.ఈ ప్రాంతాల్లో విలీనంపై అభ్యంతరాలుపొన్నూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, కందుకూరు, భీమవరం, గూడూరు, గుడివాడ మున్సిపాలిటీలతో పాటు శ్రీకాకుళం, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లలో సమీప గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. రాజానగరం ప్రాంతాన్ని అప్‌గ్రేడ్ చేసే అంశం కూడా ఈ వివాదానికి సంబంధించిన పిటిషన్లలో ప్రస్తావనకు వచ్చింది. గ్రామాల విలీనానికి సంబంధించి చట్టపరమైన ప్రక్రియను పాటించారా? గ్రామాల అభిప్రాయాలు, తీర్మానాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారా? అన్న అంశాలు ఈ కేసులో కీలకం కానున్నాయి. ఇదీ చదవండి: ఏపీ ఎన్నికల కమిషన్ ప్రెస్‌మీట్ వాయిదా -
మస్క్, ట్రంప్ లకు సుప్రీంకోర్టులో కీలక పరీక్ష, డోజీ రహస్యాలు బయటపడతాయా?
-
జంతర్ మంతర్ క్లోజ్.. సుప్రీంలో సవాల్
ఢిల్లీ: ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ఆందోళనల రద్దును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా డీనోటిఫై చేస్తూ ఢిల్లీ పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. అక్టోబర్ 11న ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ జారీ చేసిన స్టాండింగ్ ఆర్డర్‌పై అభ్యంతరం వ్యక్తమవుతోంది. జంతర్ మంతర్ స్థానంలో మూడు కొత్త నిరసన వేదికలను ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.రాంలీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్‌ను నిరసన స్థలాలుగా గుర్తించారు. ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞాన్శ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనల నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో నిరసనలపై పోలీసుల అణచివేత చర్యల మధ్య కొత్త నిరసన వేదికలపై వివాదం నెలకొంది. గతంలో జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా సుప్రీంకోర్టు గుర్తించిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించారు.నిరసనలకు అనువైన స్థలం కాదంటూ గతంలో రాంలీలా మైదాన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిందని పిటిషన్లో పేర్కొన్నారు. కొత్తగా గుర్తించిన నిరసన స్థలాలు ఢిల్లీ చెత్త డంపింగ్ యార్డులకు సమీపంలో ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో నిరసనలపై దాఖలైన పెండింగ్ పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టును పిటిషనర్ ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున మాజీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ముక్తా గుప్తా వాదనలు వినిపించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రఫేల్ డీల్‌పై వ్యాఖ్యల కేసు.. రాహుల్‌కు సుప్రీంలో ఊరట -
రఫేల్ డీల్‌పై వ్యాఖ్యల కేసు.. రాహుల్‌కు సుప్రీంలో ఊరట
ఢిల్లీ: రఫేల్ డీల్‌పై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువునష్టం కేసులో ట్రయల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రధాని మోదీని ‘చోరోన్ కే సర్దార్’, ‘కమాండర్ ఇన్ థీఫ్’ అన్న వ్యాఖ్యలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. రాహుల్ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. బాంబే హైకోర్టు సెప్టెంబర్ 8న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును రాహుల్ ఆశ్రయించారు.పరువునష్టం కేసును కొట్టివేయాలన్న రాహుల్ గాంధీ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. బీజేపీ కార్యకర్త దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం ఫిర్యాదుపై రాహుల్‌కు సమన్లు పంపింది. తాను రాజకీయ పార్టీ పేరును ప్రస్తావించలేదని రాహుల్ గాంధీ వాదన. తన వ్యాఖ్యలు నిర్దిష్ట వ్యక్తుల లేదా గుర్తించదగిన వర్గాన్ని లక్ష్యంగా చేసుకోలేదని రాహుల్ పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం.రాహుల్ గాంధీ తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పరువు నష్టం కేసు తదుపరి విచారణ కొనసాగింపుపై సుప్రీంకోర్టు పరిశీలించనుంది.ఇదీ చదవండి: టార్గెట్ జ్ఞానేశ్ కుమార్.. రాహుల్ గాంధీ బిగ్ మీటింగ్ -
సుప్రీం దిశగా సమర భేరి. ఢిల్లీలో సుప్రీంకోర్టు దాకా రాహుల్, విపక్ష నేతల బస్సు ర్యాలీ.
-
రాహుల్ పిటిషన్: 14 లోపాలతో ఎండగట్టిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఎన్నికల అవకతవకలు, ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (సర్)కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు దాఖలు చేసిన సంయుక్త పిటిషన్లో సుప్రీంకోర్టు 14 లోపాలను గుర్తించింది. ఇందులో కోర్టు ఫీజులో రూ. 220 తక్కువగా చెల్లించడం కూడా ఒక లోపంగా రిజిస్ట్రీ పేర్కొంది. తొమ్మిది మంది పిటిషనర్లకు సంబంధించిన న్యాయపరమైన అధికార పత్రాలు సమర్పించకపోవడం, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గుర్తింపు కార్డు ఫోటోకాపీ స్పష్టంగా కనిపించకపోవడం వంటి ఇతర లోపాలను కూడా కోర్టు ఎత్తిచూపింది.చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై ఎన్నికల అక్రమాల ఆరోపణలు చేస్తూ సెంట్రల్ ఢిల్లీలో వేలాది మందితో సుప్రీంకోర్టు వైపు చేపట్టిన నిరసన ర్యాలీ రోజే ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ‘ఇండియా’ కూటమి నాయకులు రోడ్లపై మార్చ్ నిర్వహిస్తుండగా, వారి న్యాయ బృందం ‘ఓటు చోరీ’ ఆరోపణలపై ఎన్నికల సంఘంపై ఈ పిటిషన్‌ను సమర్పించింది. అయితే పిటిషన్లో చిన్న ఫాంట్ వాడటం, రెండు నిర్దిష్ట పత్రాలకు రంగు ప్రతులు ఇవ్వకపోవడం, మసకబారిన రాత, తప్పిపోయిన పేజీలు, ప్రాంతీయ భాషా పత్రాలు, పేజీ నంబర్లలో తేడాలు ఉండటం వంటి సాంకేతిక సమస్యలను రిజిస్ట్రీ ప్రధాన అభ్యంతరాలుగా లేవనెత్తింది.ఈ పిటిషన్‌ను రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో పాటు సౌగతా రాయ్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, సుప్రియా సులే, సంజయ్ రౌత్, డి. రాజా, మహువా మాఝీ, ఎం.ఎ. బేబీ, ఇ.టి. మొహమ్మద్ బషీర్ సంయుక్తంగా దాఖలు చేశారు. భారత ఎన్నికల సంఘంతో పాటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు. సుప్రీంకోర్టు వెబ్సైట్లో ‘రాహుల్ గాంధీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ పేరిట నమోదైన ఈ పిటిషన్‌పై విచారణ జరగాలంటే పిటిషనర్లు ముందుగా ఈ 14 లోపాలను సరిదిద్దాల్సి ఉంటుంది.ఈ పిటిషన్ ద్వారా ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘం నిర్ణయాలపై పది రకాల ఉపశమనాలను కోరారు. అందులో ‘సర్’కు సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించడం, ఆ నిర్ణయాల రాజ్యాంగబద్ధతను పరిశీలించడం, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడం, స్వతంత్ర కమిటీతో ఆడిట్ నిర్వహించడం వంటి ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. ఈ మార్చ్‌కు ముందు ప్రతిపక్ష నేతలు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో సమావేశం కావాలని కోరగా, ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఆయన తిరస్కరించారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు తలుపులు సామాన్య పౌరులకైనా, ప్రజాప్రతినిధులకైనా ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. -
సుప్రీం దిశగా సమరభేరీ
సాక్షి, న్యూఢిల్లీ: కోట్ల ఓట్లను గల్లంతు చేశారన్న ప్రధాన ఆరోపణలను నెత్తినమోస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ పదవి నుంచి తక్షణం తప్పుకోవాలన్న డిమాండ్‌తో కొద్దిరోజులుగా దేశ రాజధాని వీధుల్లో ఉద్యమిస్తున్న విపక్షపార్టీల నేతలు ఇప్పుడు నేరుగా సర్వోన్నత న్యాయస్థానం దిశగా ర్యాలీగా దూసుకెళ్లి ఉద్యమపథాన్ని కొత్త దిశలో మళ్లించారు. అన్యాయంగా ఓట్లు కోల్పోయిన కోట్లాది మంది ఓటర్లకు న్యాయం చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేసేందుకు వందలాది మంది కార్యకర్తలు, మద్దతుదారులతో బయల్దేరిన విపక్షాల ‘ఇండియా’కూటమి పార్టీల ర్యాలీ హస్తినవీధుల్లో జనసంద్రంగా మారింది. అడుగడుగునా ఉద్యమకారులు ఎన్డీఏ సర్కార్, సీఈసీ, మోదీ, షా, ఆర్ఎస్ఎస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిపోయింది.‘మోదీ–జ్ఞానేశ్‌ను తప్పిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం’, ‘జ్ఞానేశ్ ఎక్కడ? మోదీ ఒడిలో’, ‘జ్ఞానేశ్జీ మీ గడువు ముగిసింది. దిగిపో’, ‘రాజీనామా.. చేయాల్సిందే’నినాదాలు సోమవారం ఢిల్లీ రహదారుల్లో మార్మోగాయి. జ్ఞానేశ్‌పై చర్యలు తీసుకోవాలని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నాయకులు సోమవారం రఫీమార్గ్లోని కానిస్టిట్యూషన్ క్లబ్ నుంచి సుప్రీంకోర్టు వైపు మార్చ్ చేపట్టారు.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, సీపీఐ నేత డి.రాజా, సీపీఎం నేత ఎంఏ బేబీ, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, ఎన్సీపీ–ఎస్పీ నాయకురాలు సుప్రియాసూలే, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరా, విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రతిపక్ష నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వేలాది మంది నిరసనకారులు తిలక్ మార్గ్‌లోని సుప్రీంకోర్టు దిశగా కదిలారు.సుప్రీంకోర్టుకు కొంత దూరంలో భగవాన్ దాస్ రోడ్డులో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి మార్చ్‌ను అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. కొందరు నిరసనకారులు బారికేడ్లు ఎక్కడంతో పోలీసులు వారిని వెనక్కి నెట్టారు. తర్వాత కాస్తంత తక్కువ మంది నేతలు, కార్యకర్తలతో ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాం«దీ, ప్రియాంక, తేజస్వీ యాదవ్, అఖిలేశ్ యాదవ్ వాహనం పైకెక్కి ర్యాలీగా ముందుకు కదిలారు. వీళ్లను కార్యకర్తలు జెండాలు ఊపుతూ అనుసరించారు.తర్వాత నేతలు బస్సులో ప్రయాణించారు. బస్సు బారాఖంబా రోడ్– కన్నాట్‌ప్లేస్ జంక్షన్ సమీప ఇందిరాచౌక్కురాగానే రాహుల్, ప్రియాంక, ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నేహా బోరా కిందకు దిగి కార్యకర్తలతో కలిసి నడిచారు. దీంతో ఆ మార్గంలోని పలు కంపెనీలు, సంస్థల ఉద్యోగులు వీళ్లను ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, శివసేన నేత సంజయ్ రౌత్, సీపీఐఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్య, హిమాచల్ ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సుఖూ్ఖ, కాంగ్రెస్ ఎంపీలు శశిథరూర్, సచిన్ పైలట్, ముకుల్ వాస్నిక్, టీఎంసీ నేత సాగరికా ఘోష్, సామాజిక వేత్తలు యోగేంద్ర యాదవ్, నందితా నారాయణ్ సైతం ర్యాలీలో పాల్గొన్నారు. కానిస్టిట్యూషన్ క్లబ్ నుంచి సెంట్రల్ సెక్రేటేరియేట్, ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా మీదుగా, ఫిరోజా రోడ్, మండీ హౌజ్‌ల నుంచి బారాఖంబాకు మార్చ్ చేరుకుంది.నేతలతోపాటు వేలాది మంది విద్యార్థులు, నిరసనకారులు అడుగులు వేశారు. ఇతర వామపక్ష సంఘాల సభ్యులు సైతం ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధాన మార్చ్ మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రారంభమైంది. సుప్రీంకోర్టుకు చేరేసరికి సమయం సాయంత్రం ఐదున్నర అయింది.ప్రధాన ఆకర్షణగా బ్యాట్‌మ్యాన్ మాస్క్ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తల్లో కొందరు బ్యాట్‌మ్యాన్ మాస్క్‌లు ధరించి అందర్నీ ఆకర్షించారు. ఉద్యమంలో ప్రధాన ఆకర్షణగా మారి అందర్నీ ముందుండి నడిపిస్తున్న రాహుల్‌గాం«దీని బ్యాట్‌మ్యాన్‌గా భావిస్తూ మాస్‌్కలు, వేషధారణలో వచ్చామని పలువురు ఉద్యమకారులు తెలిపారు. వారిలో ఒకరు కొన్ని మాస్‌్కలను బస్సులోని ముఖ్యనేతలకు అందజేశారు. వాటిలో ఒకదానిని రాహుల్ ధరించగానే నిరసనకారులు ఆనందంతో నినాదాలుచేశారు. మరో మాస్్కను ఖర్గే ధరించారు.ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 11 మంది ప్రతిపక్ష నాయకులు సంయుక్తంగా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ గాం«దీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, రాష్ర్టీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ–ఎస్పీ నాయకురాలు సుప్రియా సూలే, శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జార్ఖండ్ ముక్తి మోర్చా నేత మహువా మాఝీ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత ఈటీ మొహమ్మద్ బషీర్ ఈ పిటిషన్ వేశారు.పిటిషన్లో సీఈసీ జ్ఞానేశ్, ఎలక్షన్ కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలను ప్రతివాదులుగా చేర్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఉన్న అభ్యంతరాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని పిటిషనర్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి కోసం సుప్రీంకోర్టు తలుపులు తెరచే ఉంటాయని సీజేఐ సూర్యకాంత్ వేరే కార్యక్రమంలో వ్యాఖ్యానించిన కొన్ని గంటలకే విపక్షనేతలు కోర్టును ఆశ్రయించడం గమనార్హం.నేడు ఎస్ఐఆర్ పిటిషన్లపై విచారణ?ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన ఇతర పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరగాల్సి ఉంది. ప్రతిపక్ష నాయకులు తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఇప్పటికే విచారణలో ఉన్న సంబంధిత కేసులతో కలిపి పరిశీలించే అవకాశం ఉందని సీజేఐ సూచించినట్లు సమాచారం. అయితే, రాహుల్, ఇతర ప్రతిపక్ష నాయకులు దాఖలు చేసిన పిటిషన్‌లోని పూర్తి వాదనలు, కోరిన ఉపశమనాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. అందువల్ల మంగళవారం విచారణలో ఈ పిటిషన్ ఏ విధంగా పరిశీలనకు వస్తుంది, న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అన్న అంశాలపై ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: నిరసనల రాజధాని! -
ప్రభుత్వ ఉత్తర్వు చట్టం కాదు
తమిళనాడు తన 69 శాతం రిజర్వేషన్‌ను ఒక చట్టం ద్వారా, రాష్ట్రపతి ఆమోదంతో, తొమ్మిదవ షెడ్యూలును అనుసరించి కాపాడుకుంది. ఆంధ్రప్రదేశ్ అందుకు భిన్నంగా కేవలం ప్రభుత్వ ఉత్తర్వులకే పరిమితమై, న్యాయస్థానాల నిరాకరణకు గురయింది. 2026 అక్టోబర్ 9న సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎస్.ఎల్.పి.(సి) నెం. 35539/2026ను కొట్టివేసింది. దీంతో స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతులకు 34 శాతం రిజర్వేషన్‌ను కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా కాపాడే ప్రయత్నం ముగిసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం హైకోర్టు తీర్పు సమంజసమైనదని పేర్కొంటూ, రాష్ట్ర ఏకీకృత కుటుంబ సర్వేను అసలు ఏ చట్టం కింద నిర్వహించారని ప్రశ్నించింది. నాకు ఆశ్చర్యం కలగలేదు. రాజ్యాంగ రక్షణ ఉన్న చట్టం మాత్రమే చేయగలిగిన పనిని ప్రభుత్వ ఉత్తర్వు చేయలేదని నేను ఏళ్లుగా చెబుతున్నాను.కోర్టులు ఏం తీర్పు చెప్పాయి?2026 అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ (ప్రధాన న్యాయమూర్తి లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్).. కె. కృష్ణమూర్తి (2010), వికాస్ కిషన్‌రావు గవాలి (2021) తీర్పులను వర్తింపజేస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతం మించిన మేరకు జి.వో. ఎం.ఎస్. నెం. 105 (గ్రామీణ, 20.08.2026), జి.వో. ఆర్.టి. నెం. 1065 (పట్టణ, 19.08.2026) లను రద్దు చేసింది. రాష్ట్ర న్యాయవాదే మొత్తం రిజర్వేషన్లు గ్రామీణ సంస్థలలో 61.08 శాతం, పట్టణ సంస్థలలో 49.24 శాతం అని పేర్కొన్నారు.ఈ గణాంకాల ప్రకారం గ్రామీణ బీసీ కోటా 34 శాతం నుండి సుమారు 23 శాతానికి తగ్గుతుంది. బిర్రు ప్రతాప్ రెడ్డి (2020) తీర్పు తర్వాత 2021 ఎన్నికలు జరిగింది సరిగ్గా ఈ స్థాయిలోనే. పట్టణ సంస్థలలో మాత్రం మూడో వంతు కోటా నిలిచింది. బీసీలు 50.42 శాతం అని చెప్పే సర్వే, గవాలి తీర్పు కోరే ప్రత్యేక కమిషన్ విచారణకు ప్రత్యామ్నాయం కాదని కోర్టు తేల్చింది. ఆ కమిషన్ నివేదికను కనీసం ఆమోదించను కూడా లేదని గమనించింది. సరైన డేటాతో తిరిగి రావటానికి రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఇచ్చింది.తెలిసీ చేసిన తప్పుడు వాగ్దానం!ఆంధ్రప్రదేశ్ జనాభాలో సగానికి పైగా వెనుకబడిన తరగతులే. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ 16 మంది లోక్‌సభ సభ్యులతో వెన్నెముక. అంతటి బలమున్న పార్టీ ఆర్టికల్ 31–సి కింద అసెంబ్లీ చేత చట్టం చేయించి, రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి, ఆర్టికల్ 31–బి కింద తొమ్మిదవ షెడ్యూలులో చేర్పించి రాజ్యాంగ రక్షణ కల్పించి ఉండవచ్చు. అప్పుడు మాత్రమే 50 శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇవ్వటం సాధ్యమయ్యేది. అలా కాకుండా ఏపీ, తెలంగాణ హైకోర్టు తీర్పులకు, గౌరవనీయ సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు నిలవవని పూర్తిగా తెలిసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తప్పుడు వాగ్దానం చేసింది.తమిళనాడు 1990 నుండి 69 శాతం రిజర్వేషన్ ఇస్తోంది. 50 శాతం పరిమితి వచ్చిన తర్వాత అక్కడి పార్టీలు విషయాన్ని కోర్టులకే వదిలేయలేదు. 1992 నవంబర్ 24న సమావేశమ య్యాయి. 1993 నవంబర్ 6న సామాజిక న్యాయ సమావేశం నిర్వహించాయి. 1993 డిసెంబర్లో అసెంబ్లీ, ఆర్టికల్ 31–సి కింద బిల్లు ఆమోదించింది. ఆ చట్టం 1994 జూలై 19న నోటిఫై అయింది. పార్లమెంట్ 1994 ఆగస్టు 24, 25 తేదీల్లో 76వ రాజ్యాంగ సవరణను ఆమోదించింది. తమిళనాడు రాష్ట్రం ఆర్టికల్ 31–సి కింద చేసిన చట్టాలకు రాష్ట్రపతి 1994 సెప్టెంబర్ 1న ఆమోదం తెలిపి, ఆర్టికల్ 31–బి కింద వాటిని తొమ్మిదవ షెడ్యూలలో ఎంట్రీ 257–ఎ గా చేరుస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రత్యర్థులు కలిసి నడిచారు.ఆర్టికల్ 342–ఎ(3) కింద రాష్ట్ర జాబితా2021లో వచ్చిన 105వ రాజ్యాంగ సవరణ నుండి, ఆర్టికల్ 342–ఎ(3) ప్రతి రాష్ట్రానికీ తన అవసరాల కోసం, కేంద్ర జాబితాకు భిన్నమైన నమోదులతో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతుల జాబితాను సిద్ధం చేసి నిర్వహించే అధికారం ఇస్తోంది. ఆలిండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ (డబ్లు్య.పి. నెం. 36399 ఆఫ్ 2025) ఇంకా పెండింగులో ఉంది.స్థానిక సంస్థలు, ప్రవేశాలు, పోస్టులు– సర్వీసులు, సంక్షేమ చర్యలు అనే అన్ని రాష్ట్ర అవసరాల కోసం అటువంటి జాబితాను సిద్ధం చేసి నిర్వహించాలని, 2023లో ప్రారంభించిన కుల, సామాజిక–విద్యా సర్వేను పూర్తి చేయాలని రాష్ట్రాన్ని ఆదేశిస్తూ మాండమస్ ఇవ్వమని అది కోరుతోంది. 2014–19 సర్వే ఫలితాల్లాగే దాని ఫలితాలను కూడా ప్రచురించలేదు. ఆర్టికల్ 15(4), 16(4), 243–డి(6), 243–టి(6)ల కింద రిజర్వేషన్.. డేటా ఆధారంగా గుర్తించిన తరగతిపై నిలుస్తుంది కాబట్టి ఈ జాబితా ఉపయోగకరం. అన్ని బీసీ వర్గాలను ఒకే బ్లాక్‌గా పరిగణించినప్పుడు ప్రాతినిధ్యం దక్కని అత్యంత వెనుకబడిన వర్గాలైన సంచార, అర్ధ–సంచార, విముక్త జాతులను ఇది లోపలికి తెస్తుంది.చట్టం, రాష్ట్రపతి ఆమోదం, తొమ్మిదవ షెడ్యూలు.. ఏ జనాభా వెనుకబాటుతనాన్ని గణాంకాలపై నిర్మించాలో వాటిని అందిస్తుంది. 50 శాతం పరిమితిని దాటాలంటే ఆర్టికల్ 342–ఎ(3) కింద సమకాలీన, కచ్చితమైన డేటా అవసరం. దాని ఆధారంగా ఓబీసీల రాజకీయ వెనుకబాటుతనాన్ని గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల వారీగా ఒక ప్రత్యేక కమిషన్ నిర్ధారించి, తమిళనాడు మాదిరిగా తగిన చట్టం ద్వారా రిజర్వేషన్లు కల్పించాలి. అప్పుడు మాత్రమే 50 శాతం పరిమితికి మించిన రిజర్వేషన్లకు రక్షణ లభిస్తుంది.ఆర్టికల్ 342–ఎ(3) కింద సిద్ధం చేసి నిర్వహించే (సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులపై) వాస్తవ ఇంటింటి సర్వే / విచారణ లేకుండా, తమిళనాడు మాదిరిగా రాజ్యాంగ సవరణ ద్వారా తప్ప, ఏ రిజర్వేషనూ 50 శాతం మించరాదు. లేదంటే, వికాస్ కిషన్‌రావు గవాలి కేసులో చెప్పిన ట్రిపుల్ టెస్ట్ సంతృప్తి చెందకుండా 50 శాతం రిజర్వేషన్లను కూడా కాపాడలేము. వికాస్ కిషన్‌రావు గవాలి కేసులో ఎన్నికలను రద్దు చేశారు. 50 శాతం లోపు జరిగిన ఎన్నికలనూ రద్దు చేసి, ఓపెన్ కేటగిరీ కింద తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.లోపించిన నిబద్ధతఆంధ్రప్రదేశ్ అఖిలపక్ష అసెంబ్లీ తీర్మానం చేసి, ఢిల్లీకి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపడం ద్వారా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ చట్టాన్ని ఆమోదింపజేసుకోవాలి. రాష్ట్ర చట్టానికి పార్లమెంట్ ఆమోదం కోసం ఒత్తిడి చేసి, ఆర్టికల్ 31–బి కింద రక్షణ కోసం ఆ రాష్ట్ర చట్టాన్ని తొమ్మిదవ షెడ్యూలులో చేర్చటానికి రాష్ట్రపతి ఆమోదాన్ని కోరాలి. ఈలోగా ఆర్టికల్ 342–ఎ(3) కింద విచారణ జరిపి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల జాబితాను సిద్ధం చేయాలి.గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పోరేషన్ల వారీగా తగిన రిజర్వేషన్లు ఇవ్వటానికి ఓబీసీల రాజకీయ వెనుకబాటుతనాన్ని నిర్ధారించమని ప్రత్యేక కమిషన్‌ను కోరాలి. చర్యలను సమర్థించుకోవటానికి బదులు, సంబంధిత పార్టీలనూ కలిసి శాసనం చేసి, తమిళనాడు చట్టం మాదిరిగా రాజ్యాంగ రక్షణ కోసం భారత రాష్ట్రపతి ఆమోదం పొందాలి. మన నాయకులకు పార్లమెంటులో సంఖ్యాబలం ఉంది. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల విషయంలో లోపించింది... సంకల్పం, నిబద్ధత, దృఢనిశ్చయమే. - జస్టిస్ వి. ఈశ్వరయ్య (రిటైర్డ్), వ్యాసకర్త జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, దమాజీ చైర్పర్సన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి -
కాసేపట్లో కాంగ్రెస్ మార్చ్.. ప్రతిపక్ష నేతలను కలవలేను: సీజేఐ
కాంగ్రెస్ మార్చ్ అప్డేట్స్..నాడు సైమన్ గోబ్యాక్.. నేడు సర్ గోబ్యాక్: రేవంత్ రెడ్డి. తెలంగాణ భవన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిమంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ, జిల్లాల అధ్యక్షులతో సమావేశమైన సీఎంకాంగ్రెస్ నిర్వహిస్తున్న మార్చ్, సర్ ప్రక్రియపై నేతలకు దిశా నిర్దేశంసీఎం రేవంత్ కామెంట్స్..సర్ వ్యతిరేక పోరాటం మరో స్వతంత్ర పోరాటమేసైమన్ గో బ్యాక్ పోరాటం లాగే పోరాటం చేయాలిఇప్పుడు సర్ గోబ్యాక్ అనాలి.రాజ్యాంగం ద్వారా ప్రతీ భారతీయుడికి ఓటు హక్కు వచ్చింది. అంబేద్కర్ ఎంతో అధ్యయనం చేసి ఓటు హక్కును రాజ్యాంగంలో చేర్చారు.రాజ్యాంగాన్ని ఆమోదించడం ద్వారా ఓటు హక్కు వచ్చింది.పరిపాలన చేయాల్సిన వాళ్లను ప్రజలే ఎన్నుకోవాలని అంబేద్కర్ నినదించారు.మంచి ఉద్దేశంతో మొదలైన సర్ ఇప్పుడు ఓటు హక్కు తొలగించేదిగా మారింది.మతాలు, ప్రాంతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోంది.దేశంలో ఓటు చోరీకి కుట్రలు జరుగుతున్నాయి.సీఈసీని అడ్డుపెట్టుకుని ఓట్లను తొలగిస్తున్నారు. ఓటు హక్కు కోసం పోరాటం: భట్టిఢిల్లీ భట్టి విక్రమార్క కామెంట్స్..రాహుల్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ నుంచి సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు .. ఢిల్లీకి వచ్చాంప్రజాస్వామ్యానికి బలమైన పునాది ఓటు హక్కుఓటు హక్కును చోరీ చేస్తున్నారుబీజేపీ మాత్రమే గెలిచేలా.. సర్ పేరుతో అక్రమాలు జరుగుతున్నాయికాంగ్రెస్ కోసం కాదు ఈ ఆందోళన..అందరి ఓటు హక్కును కాపాడటం కోసం మా పోరాటంప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ముందుకు రావాలిశాంతియుతంగా, గాంధేయ మార్గంలో మా ఆందోళన కొనసాగుతుందిపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్..సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించే వరకు ఆందోళన కొనసాగుతుందిమోదీ అమిత్ షా సర్‌ను వాడుకొని బీహార్ ఎన్నికల్లో గెలిచారుఅధికారంలో ఎప్పటికీ ఉండాలనే ఆకాంక్షతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారుప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయిసీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లాల అధ్యక్షులు ఢిల్లీకి వచ్చాంసుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించే ప్రయత్నం చేస్తాంమంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్సర్ రద్దు చేయాలని రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పిలుపునిచ్చారుసర్ను ఉపయోగించుకొని బీజేపీ ఎన్నికలు నిర్వహించిందిఅర్హులైన ఓటర్లను తొలగించారుసీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందిఎన్నికల కార్యాలయం పక్షపాతంగా వెళ్తుందికేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తున్నాంరాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పిలుపుతో ప్రజాస్వామ్య గొంతును వినిపించేందుకు ఢిల్లీ వచ్చాముమా నిరసన తెలియజేస్తాం.కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అపాయింట్మెంట్ తప్పిదంబీజేపీ కార్యకర్తగా ఎన్నికల కమిషనర్లు తీసుకువచ్చి కేంద్ర ఎన్నిక సంఘంలో కూర్చోబెట్టారు50 ఏళ్లు అధికారంలో ఉండాలనే పిచ్చి ఆలోచనతో బీజేపీ ఇలాంటి పనులు చేసిందిప్రజాస్వామ్యంలో ఓటును తొలగించడం తప్పజంతర్మంతర్ వద్ద పోలీసుల బందోబస్తుజంతర్మంతర్ వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది.కాంగ్రెస్ ర్యాలీ దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు, జంతర్‌మంతర్ సహా పలు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.ర్యాలీకి కాంగ్రెస్ నిర్ణయంకన్నాట్ప్లేస్ నుంచి సుప్రీంకోర్టు వరకు ర్యాలీకి కాంగ్రెస్ నిర్ణయంమధ్యాహ్నం 1.30 గంటలకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బారాఖంబకు సమీపంలోని సాయంత్రం 4 గంటల వరకు పలు మెట్రో స్టేషన్లు మూసివేస్తూ ఆదేశాలు జారీచేశారు.కాంగ్రెస్‌కు నో చెప్పిన సీజేఐ..👉ఎన్నికల అక్రమాల ఆరోపణలపై వినతిపత్రం సమర్పించేందుకు సమావేశం కావాలన్న ఇండియా కూటమి నేతల అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తిరస్కరించారు. ఈ వ్యవహారం ఇప్పటికే న్యాయస్థానం విచారణ పరిధిలో ఉన్నందున పిటిషన్ దాఖలు చేసి కోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఓట్చోరీ, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా, ఎస్ఐఆర్ నిలిపివేత, భవిష్యత్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరపాలని కోరుతూ సీజేఐకి వినతిపత్రం ఇవ్వాలని ప్రతిపక్ష నేతలు భావించారు. అయితే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వారిని కలిసేందుకు తిరస్కరించారు. #WATCH | Delhi | On INDIA Bloc's protest march and their demand to meet him, Chief Justice of India (CJI) Justice Surya Kant says, "I received a letter yesterday regarding a meeting request, and I responded to it last night, outlining the reasons why I will be unable to meet..." He also says, "The Supreme Court's doors are open to everyone. Any petition from any common citizen or member of an elected body is welcome. Every Indian citizen has the right to approach the court, and we will hear their concerns and grant whatever is due under the law."— ANI (@ANI) October 12, 2026👉అయితే, సీజేఐ నిర్ణయాన్ని గౌరవిస్తూనే అక్టోబర్ 12న సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సూత్రాలను కాపాడటమే ఈ ఉద్యమ లక్ష్యమని తెలిపారు. ఈ మార్చ్ కేవలం ఒక ఆందోళన మాత్రమే కాదన్నారు. ఇది ఒక ఉద్యమంగా మారిందని తెలిపారు.👉దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అందరికీ పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. తమ ప్రతినిధి బృందాన్ని కలవకూడదని సీజేఐ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షం గౌరవిస్తుందని అన్నారు. కానీ, సుప్రీంకోర్టుకు మార్చ్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.సీఈసీ రాజీనామా చేయాలి: శశిథరూర్👉ఎన్నికల సంఘం చట్టాలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. ఓటు హక్కు పౌరుల రాజ్యాంగ హక్కు అని, తమ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారం ప్రజలకు ఉండాలని అన్నారు. ఎన్నికల సంఘం నియంత్రణ తప్పినట్లుగా వ్యవహరిస్తోందని, నిబంధనలను పక్కనపెడుతోందని ఆయన విమర్శించారు. ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్ల మంది భారతీయుల పేర్లు తొలగించారంటూ ఆరోపించారు. సుప్రీంకోర్టు మార్చ్ ద్వారా న్యాయం కోరనున్నట్లు థరూర్ తెలిపారు. ఇదీ చదవండి: జ్ఞానేశ్‌పై మరో అస్త్రంతో ఇండియా కూటమి! -
సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి మార్చ్.. CJI సూర్యకాంత్ నిరాకరణ..!
-
మెట్రో, ఇంటర్నెట్ పునరుద్ధరణకు ‘సుప్రీం’ ఆదేశాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలు, మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దు,వేలాది మంది నిర్బంధాలపై సుప్రీంకోర్టు ఆదివారం ప్రత్యేక విచారణ చేపట్టింది. అక్టోబర్ 9న ఇచ్చిన కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌తో పాటు, నాయకులు, న్యాయవాదుల అక్రమ నిర్బంధాలపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లను జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది.పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు మేనకా గురుస్వామి, కపిల్ సిబల్ తదితరులు వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం నగరంలో కర్ఫ్యూ లాంటి వాతావరణాన్ని సృష్టించిందని ఆరోపించారు. నిషేధాజ్ఞలు ఉన్న 4 కిలోమీటర్ల పరిధిని దాటి కూడా 6,000 నుంచి 7,000 మందిని, ప్రతిపక్ష ఎంపీలను, శాంతియుతంగా వెళ్తున్న న్యాయవాదులను అక్రమంగా నిర్బంధించారని కోర్టుకు తెలిపారు. న్యూఢిల్లీ, నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లను మూసివేయడం, మెట్రో సేవలను నిలిపివేయడం, ఇంటర్నెట్ బంద్ చేయడం ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21 కింద లభించే ప్రాథమిక హక్కులను కాలరాశారని, ఇది అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందని పేర్కొన్నారు.మరోవైపు ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన సాలిసిటర్ జనరల్ (ఎస్జీ), మెట్రో సేవలను పూర్తిగా రద్దు చేయలేదని, మొత్తం 303 స్టేషన్లలో కేవలం 47 స్టేషన్లపై మాత్రమే పరిమితులు విధించామని వివరించారు. నిర్బంధించిన వ్యక్తులను సాయంత్రానికల్లా విడుదల చేశారని, తాము పూర్తి సమాధానం ఇవ్వడానికి కొంత సమయం కావాలని కోరారు. రెండు వైపులా వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే తప్ప మెట్రో సేవలు యథావిధిగా నడవాలని స్పష్టం చేసింది. ప్రజల స్వేచ్ఛా రాకపోకలకు ఆటంకం కలిగించకూడదని, న్యాయవాదులు తమ విధులు నిర్వర్తించడంలో ఎలాంటి అడ్డంకులు ఉండరాదని ఆదేశించింది. ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని స్పష్టం చేస్తూ, మూసివేసిన 47 మెట్రో స్టేషన్ల వివరాలను మ్యాప్ రూపంలో చూపించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అక్రమ నిర్బంధాలు, కోర్టు ఆదేశాల అమలుపై పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
BC రిజర్వేషన్లపై సుప్రీం కొట్టివేత.. వరుదు కళ్యాణి రియాక్షన్
-
బాబుకు సుప్రీంకోర్టు షాక్..! బీసీ రిజర్వేషన్ల భవిష్యత్తు ఏంటి?
-
పిచ్చికుక్కలకు ‘మెర్సీ కిల్లింగ్’!
సాక్షి, హైదరాబాద్: వీధికుక్కల దాడులతో ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల ప్రాణాలకు ఎదురవుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేబిస్ సోకిన, నయంకాని ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న, కోలుకునే అవకాశం లేకుండా తీవ్రంగా గాయపడిన, అత్యంత ప్రమాదకరంగా మారిన కుక్కలకు నిబంధనల ప్రకారం కారుణ్యమరణం (మెర్సీ కిల్లింగ్) కల్పించేందుకు మార్గదర్శకాలకు ఆమోదం తెలిపింది. అయితే, వీధికుక్కలపై ఫిర్యాదులు వచ్చినంత మాత్రాన వాటిని చంపేందుకు అనుమతి ఉండదు. వైద్యపరమైన పరిశీలన, సంబంధిత ఆధారాలు, ప్రత్యేక కమిటీ లిఖితపూర్వక సిఫారసు ఆధారంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు తొలి సమావేశంలో ఆమోదించిన తీర్మానాలకు అనుగుణంగా, సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను రూపొందించింది. ప్రజారోగ్యం, చిన్నారుల భద్రతతో పాటు రాజ్యాంగంలోని ఆర్టీకల్ 21 కల్పించిన జీవించే హక్కును పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొంది. అదే సమయంలో జంతువుల పట్ల మానవీయంగా వ్యవహరించడం, విచక్షణారహితంగా కుక్కలను చంపకుండా నిరోధించడం కూడా ఈ విధానంలో కీలకాంశాలుగా ఉన్నాయి. దేశంలో కేరళ తర్వాత ఇందుకు సిద్ధమైన రాష్ట్రం మనదే. ఫిర్యాదు వస్తే చంపేయరు! వీధికుక్కలపై ఫిర్యాదు అందిన వెంటనే వాటిని కారుణ్యమరణానికి గురిచేయడానికి వీల్లేదు. సంబంధిత కుక్కను పట్టుకుని వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలి. దాని ఆరోగ్య పరిస్థితి, ప్రవర్తన, గతంలో దాడులకు పాల్పడిన తీరు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించాలి. కుక్కకు చికిత్స సాధ్యమా? దాని ప్రవర్తన వల్ల ప్రజలకు నిజంగా ప్రమాదం ఉందా? అనే అంశాలను నిర్ధారించాలి. కారుణ్యమరణం అవసరమని సంబంధిత కమిటీ లిఖితపూర్వకంగా సిఫారసు చేసిన తర్వాతే నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలి. దీంతో సాధారణ వీధి శునకాలను నిర్మూలించకుండా ఈ నిబంధనలను దురి్వనియోగం చేయకుండా నియంత్రణ విధించినట్లవుతుంది. కలెక్టర్లు, జీహెచ్ఎంసీకి బాధ్యతలు ప్రభుత్వ మార్గదర్శకాల అమలులో జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ, ఇతర పురపాలక సంస్థలు, సంబంధిత స్థానిక సంస్థలు, పోలీసు శాఖలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజల భద్రతకు ముప్పుగా మారిన సందర్భాల్లో చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడంతోపాటు, జంతువుల పట్ల క్రూరత్వానికి తావులేకుండా చూడాల్సి ఉంటుంది. వీధికుక్కల సమస్య పరిష్కారంలో ప్రజల ప్రాణరక్షణకు ప్రాధాన్యమిస్తూనే, వైద్యపరమైన నిర్ధారణ, నిపుణుల అభిప్రాయం, పారదర్శక విధానాలకు పెద్దపీట వేయడమే ఈ మార్గదర్శకాల ఉద్దేశం.ఈ నాలుగు పరిస్థితుల్లోనే1. రేబిస్ సోకిన కుక్కలు: రేబిస్ వ్యాధి నిర్ధారణ అయిన కుక్కలకు నిబంధనల ప్రకారం కారుణ్యమరణానికి అనుమతి ఉంటుంది. 2. నయం కాని ప్రాణాంతక వ్యాధులు: బ్లడ్ కేన్సర్ చివరి దశలో ఉండటం, ప్రాణాంతక కణితులు లేదా చికిత్సతో నయం చేయలేని తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న కుక్కల విషయంలో పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటారు. 3. కోలుకోలేని తీవ్ర గాయాలు: వాహన ప్రమాదాలు లేదా ఇతర కారణాలతో తీవ్రంగా గాయపడి, కోలుకునే అవకాశం లేకుండా భరించలేని నొప్పితో బాధపడుతున్న కుక్కలకు వైద్యపరమైన నిర్ధారణ ఆధారంగా కారుణ్యమరణం కల్పించవచ్చు. 4. అత్యంత ప్రమాదకరమైన కుక్కలు: ఎలాంటి స్పష్టమైన ప్రేరణ లేకుండానే ప్రజలు, చిన్నారులపై తీవ్ర దాడులకు పాల్పడిన చరిత్ర ఉన్న కుక్కల ప్రవర్తనను నిపుణులు పరిశీలించాలి. వాటిని అత్యంత దూకుడుగా, ప్రమాదకరంగా ఉన్నట్లు నిర్ధారించిన తర్వాతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి.నొప్పి లేకుండా.. రికార్డులు తప్పనిసరికారుణ్యమరణ ప్రక్రియలో కుక్కకు నొప్పి, బాధ కలగకుండా చూడడమే లక్ష్యం. ఇందుకోసం మార్గదర్శకాల్లో పేర్కొన్న సోడియం పెంటోబార్బిటాల్ ఔషధాన్ని నరాల ద్వారా అందించే విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఈ ప్రక్రియను అర్హత కలిగిన వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో, నిర్దేశిత విధానాల ప్రకారమే నిర్వహించాలి. కారుణ్యమరణానికి గురిచేసిన ప్రతి కుక్క వివరాలను స్థానిక సంస్థలు ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలి. కుక్కను ఎక్కడి నుంచి పట్టుకున్నారు? దాని ఫొటో లేదా గుర్తింపు ట్యాగ్ వివరాలేమిటి? కారుణ్యమరణానికి కారణాలేమిటి? వ్యాధి తీవ్రతకు సంబంధించిన వైద్య నివేదికలు, ప్రమాదకర ప్రవర్తనకు సంబంధించిన ఆధారాలేమిటి? అనే వివరాలను భద్రపరచాలి. తద్వారా తీసుకున్న చర్యలకు జవాబుదారీతనం ఉండటంతో పాటు నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. -
CJP నిరసనల వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
BC రిజర్వేషన్లపై బాబుకు సుప్రీం చెంపదెబ్బ.. ధర్మాన ప్రసాద్ రావు రియాక్షన్
-
సుప్రీంకోర్టులో బాబుకు బిగ్ షాక్.. జీవోలు కొట్టివేత
-
BC రిజర్వేషన్ల కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ
-
పెళ్లికి నిరాకరిస్తే.. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదు
సాక్షి, న్యూఢిల్లీ: సహజీవనం చేసిన భాగస్వామిని వివాహం చేసుకోవడానికి నిరాకరించడాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రేమ వైఫల్యం, బ్రేకప్ వంటివి ఆత్మహత్యకు దారితీసినంత మాత్రాన అన్నివేళలా దాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంగా చెప్పలేమని తేల్చిచెప్పింది. ఆత్మహత్య చేసుకొనేలా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం లేదా పెళ్లికి నిరాకరిస్తే ఆత్మహత్య చేసుకుంటారన్న విషయం ముందే తెలిసి ఉండటం లాంటివి లేనప్పుడు సెక్షన్ 306 కింద కేసు నమోదు చేయడం చెల్లదని పేర్కొంది. తెలంగాణలో 2022లో నమోదైన ఆత్మహత్య కేసులో దాఖలైన అప్పీల్‌పై జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. చిన్ననాటి స్నేహితురాలితో మూడు నెలలపాటు సహజీవనం చేసిన ఓ యువకుడు తొలుత ఆమెతో పెళ్లికి సిద్ధపడ్డాడు. అయితే అతని స్నేహితుడు యువతి గురించి చెడుగా మాట్లాడటం, అదే సమయంలో యువకుడి సోదరి కాబోయే భర్త ఈ వివాహాన్ని వ్యతిరేకించడంతోపాటు తల్లిదండ్రులు సైతం యువతితో సంబంధాన్ని తెంచుకోవాలని ఒత్తిడి తెచ్చారు. అయితే యువతి మాత్రం తనను సహజీవన భాగస్వామి పెళ్లి చేసుకోకుంటే ప్రాణాలు తీసుకుంటానని సోదరికి ఫోన్లో చెప్పి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకుడితోపాటు అతని తల్లిదండ్రులు, సోదరి, స్నేహితుడు, సోదరికి కాబోయే భర్త.. మొత్తం ఆరుగురిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సెషన్స్ కోర్టుతోపాటు హైకోర్టు నిందితులను దోషులుగా తేల్చగా ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఆరుగురిపై ఉన్న ప్రొసీడింగ్స్‌ను కొట్టేసింది. నిందితులు కస్టడీలో ఉంటే తక్షణమే విడుదల చేయాలంది. -
గిఫ్ట్ ఇస్తే వైద్యులు మందులు మారుస్తారా?
ఔషధ కంపెనీలు అందించే బహుమతులు, నగదు ప్రయోజనాలు, ఆతిథ్యం వంటి ప్రోత్సాహకాలు వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్లను ప్రభావితం చేస్తున్నాయా? ఇటువంటి అనైతిక మార్కెటింగ్ పద్ధతులను నియంత్రించేందుకు మరింత సమర్థవంతమైన చట్టబద్ధ వ్యవస్థ అవసరమా? అనే కీలక ప్రశ్నలపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది.వైద్యుల స్వతంత్ర నిర్ణయాలపై ప్రభావంఫార్మా సంస్థల మార్కెటింగ్ విధానాలు ప్రజారోగ్యం, ఔషధాల ధరలు, వైద్యుల స్వతంత్ర నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలోనూ సుప్రీంకోర్టు వైద్యుల ప్రిస్క్రిప్షన్లు ఫార్మా కంపెనీల నుంచి లభించే ప్రయోజనాలతో ప్రభావితమయ్యే అవకాశాన్ని ఎత్తి చూపింది. ఇది తీవ్రమైన ప్రజా ప్రయోజన సమస్యగా పేర్కొంది. ఇలాంటి ప్రయోజనాల వ్యయం చివరికి ఔషధ ధరల్లోకి చేరి రోగులపై భారం పెంచే ప్రమాదం ఉందని కూడా కోర్టు రికార్డుల్లో ప్రస్తావించింది.యూసీపీఎంపీకి చట్టబద్ధతపై చర్చఇప్పటికే కేంద్ర ప్రభుత్వం యూనిఫాం కోడ్ ఫర్ ఫార్మాస్యూటికల్స్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ (యూసీపీఎంపీ), 2024ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఔషధ కంపెనీలు వైద్యులు, వారి కుటుంబ సభ్యులకు బహుమతులు, నగదు ప్రయోజనాలు, ఆతిథ్యం అందించడాన్ని నిషేధించింది. ఫార్మా కంపెనీలు తమ ఉద్యోగులు, మెడికల్ రిప్రజెంటేటివ్‌ల చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఉల్లంఘనలపై ఫిర్యాదుల స్వీకరణ, విచారణ కూడా ఉంటుంది.అయితే యూసీపీఎంపీ ప్రస్తుతం మార్గదర్శకాల ఆధారిత వ్యవస్థగానే ఉంది. దీనికి చట్టబద్ధత తేవాలనే చర్చ సాగుతోంది. కొత్త కమిటీ పరిశీలన ద్వారా నియంత్రణలో ఉన్న లోపాలు, అమలు సామర్థ్యం, బాధ్యత నిర్ధారణ వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: తులం బంగారం కొంటే ఎంత ఖర్చు? నేటి గోల్డ్ రేట్లు! -
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురి ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్‌తో సుప్రీంకోర్టు ఆవరణలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయించారు. తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో సీజేఐతో కలుపుకొని మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. మరో న్యాయమూర్తి పదవి ఖాళీ ఉంది. సెప్టెంబర్ 28న కొలీజియం సిఫార్సుల మేరకు కేంద్రం ఈ ముగ్గురు న్యాయమూర్తుల నియామకాలను నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈ ముగ్గురూ గతంలో వేర్వేరు రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. అలహాబాద్‌ను మాతృ హైకోర్టుగా కలిగిన జస్టిస్ సునీతా అగర్వాల్.. పదోన్నతికి ముందు గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. అలహాబాద్ మాతృ హైకోర్టుకే చెందిన జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ ఢిల్లీ హైకోర్టు సీజేగా విధులు నిర్వర్తించారు. జార్ఖండ్ మాతృ హైకోర్టుగా ఉన్న జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. ప్రమాణ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలు హైకోర్టుల అధికారులు పాల్గొన్నారు.ముగ్గురికి చేరిన మహిళా ప్రాతినిధ్యంజస్టిస్ సునీతా అగర్వాల్ చేరికతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య మూడుకు చేరుకుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులు జస్టిస్ నాగరత్న, జస్టిస్ వి.మోహన ఉన్నారు. జస్టిస్ నాగరత్న 2027లో సీజేఐ అవుతారు. అయితే సీజేఐగా ఆమె పదవీకాలం దాదాపు నెల రోజులు ఉంటుంది. -
‘ఓటు హక్కు హరిస్తే’.. న్యాయస్థానాల హెచ్చరిక
ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నుముక లాంటి ఓటు హక్కు పరిరక్షణపై ఉన్నత న్యాయస్థానాలు వెలువరించిన తీర్పులు, వ్యాఖ్యలు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్వర్తించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను ఎత్తి చూపుతున్నాయి. ఇటీవల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు, బాంబే, కేరళ హైకోర్టుల తీర్పులు ఈ అంశంలో అత్యంత కీలకమైనవిగా మారాయి.‘సర్’ ప్రక్రియను విశ్లేషిస్తూ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ స్పష్టం చేసిన అంశాలు రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని చాటిచెబుతున్నాయి. ‘రాజ్యాంగం పౌరులను ఓటుహక్కు ఉన్నవారు, లేనివారు అని వేర్వేరు కేటగిరీలుగా విభజించట్లేదు. నిజమైన అర్హులు ఓటు హక్కుకు దూరంగా ఉంటూ సొంత దేశంలోనే ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చే ప్రక్రియ ఏదైనా సరే నిరంకుశమైనదే అవుతుంది’ అన్నారు.బాంబే హైకోర్టు ఏమందంటే..మరొకవైపు, పౌరులందరికీ ఓటు హక్కు కల్పించడమే ఎన్నికల సంఘం ప్రాథమిక ధ్యేయమని బాంబే హైకోర్టు గోవా ధర్మాసనం స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు లభించేలా చూసేందుకు, వారిని వీలైనంత ఎక్కువగా జాబితాల్లోకి చేర్చడానికి ఈసీ చొరవ చూపాలని నిర్దేశించింది. సాంకేతిక కారణాలు లేదా నిర్లక్ష్యం వల్ల ఏ ఒక్క అర్హుత కలిగిన వ్యక్తి ఓటరు జాబితా నుంచి బయటకు రాకూడదని ఈ తీర్పు తేటతెల్లం చేసింది.కేరళ హైకోర్టు ఇలా..అలాగే సరైన విచారణ, ముందస్తు సమాచారం లేకుండా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ‘ఓటరు వాదన వినిపించే కనీస అవకాశమివ్వకుండా పేరు తొలగించడం ఎలా ఆమోదయోగ్యం అవుతుంది? ఓటు హక్కు చాలా విలువైంది. ఇష్టారీతిన దాన్ని ఎవరూ హరించలేరు’ అని గతంలో ఆదేశాలు జారీ చేసింది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించడం చెల్లదని కోర్టు తేల్చింది.ఈ పరిణామాలన్నీ రాజ్యాంగబద్ధమైన బాధ్యతల నిర్వహణలో ఎన్నికల సంఘం ఎంత పారదర్శకంగా, జాగ్రత్తగా వ్యవహరించాలో గుర్తు చేస్తున్నాయి. పౌరుల ప్రాథమిక హక్కును రక్షించడం అంటే ప్రజాస్వామ్య పరిరక్షణే. అర్హులైన ప్రతి పౌరుడి ఓటును కాపాడటంలో ఈసీ నిష్పాక్షికంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించడమే రాజ్యాంగ మౌలిక సూత్రాలకు నిజమైన గౌరవం.ఇదీ చదవండి: వందలో ముగ్గురే రిచ్.. ఎందుకో తెలుసా? -
ఫారమ్6లో మార్పులకు మా ఆమోదముద్ర లేదు. అనుబంధ డిక్లరేషన్‌పై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
-
ఓటర్ల తుది జాబితా వచ్చేవరకు ‘స్థానిక’ సన్నాహాలు సరికాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వివాదం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. ఓటర్ల జాబితా ఖరారు అలాగే రాష్ట్రంలో వార్డుల పునర్వీభజన (డీలిమిటేషన్)పై ఏపీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక ఉమ్మడి తీర్పును సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ నేతలు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టనుంది. వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కడప మాజీ మేయర్ పాక సురేష్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం ముందు వైఎస్సార్సీపీ తరఫు న్యాయవాది మహ్ఫూజ్ ఎ.నజ్కి సోమవారం ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర సవరణ) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, ఈ ప్రక్రియ పూర్తయి తుది జాబితా ఖరారైన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు. 2026 జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ప్రాతిపదిక కాకూడదని వాదించారు. ఇదే జరిగితే పెద్ద సంఖ్యలో పౌరులు ఓటుహక్కు కోల్పోతారని, స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికలు జరిగే అవకాశమే ఉండదని వివరించారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నందున, తక్షణమే జోక్యం చేసుకోవాలని ధర్మాసనానికి విన్నవించారు. అలాగే జనాభా లెక్కల నిబంధనల ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ల సరిహద్దుల ఫ్రీజింగ్ అమల్లో ఉన్న సమయంలో వార్డుల పునర్వీభజన చేపట్టడం చట్టవిరుద్ధమని కూడా పేర్కొన్నారు. జనాభా లెక్కల్లో వార్డు కూడా కీలకమేవార్డుల పునర్వీభజనపై పిటిషనర్లు 2027 జనాభా లెక్కల (సెన్సస్) ప్రక్రియ కారణంగా 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా పరిపాలనా విభాగాల భౌగోళిక సరిహద్దులను ‘ఫ్రీజ్’ చేస్తూ రిజి్రస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా 2025 ఆగస్టులో సర్క్యులర్ జారీ చేశారు. అయితే, ఈ ఫ్రీజింగ్ నిబంధన అమల్లో ఉండగానే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 నగరపాలక సంస్థలు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) చేపడుతూ 2026 మార్చి 24న జీవో 65ను జారీ చేసింది.సెన్సస్ రూల్స్–1990లోని నిబంధన 8(4) ప్రకారం ఫ్రీజింగ్ సమయంలో సరిహద్దులు మార్చకూడదని, వార్డు కూడా పరిపాలనా విభాగమేనని తెలుపుతూ వైఎస్సార్సీపీ నేతలు, కడప మాజీ మేయర్ పాక సురేష్ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ అక్టోబర్ 1, 2026న తీర్పు వెలువరించింది. మున్సిపాలిటీ అనేది అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ అని, ‘వార్డు’ కాదని కోర్టు స్పష్టం చేసింది.మున్సిపాలిటీ భౌగోళిక సరిహద్దులు మారనంత వరకు, ఆ పరిధిలో వార్డుల పునర్విభజన చేపట్టడం చట్టవిరుద్ధం కాదని తేల్చిచెబుతూ పిటిషన్లను కొట్టివేసింది. దీన్ని పిటిషనర్లు సవాలు చేస్తూ.. ‘వార్డు కూడా సెన్సస్ ప్రక్రియలో కీలక భాగమేనని, మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు ఏపీ హైకోర్టు తీర్పు విరుద్ధంగా ఉందని’ పేర్కొంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. పాత వార్డుల ఆధారంగానే ఎన్నికలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 65పై స్టే ఇవ్వాలని కోరారు. ఎస్ఈసీ చర్యలుసరికాదువైఎస్సార్సీపీ తరఫు వాదనలుదేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సహా 19 రాష్ట్రాల్లో 01.07.2026ను అర్హత తేదీగా తీసుకుని సర్‌ను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం 01.01.2026ను అర్హత తేదీగా తీసుకుంటూ పురపాలక సంఘాల్లో ఓటర్ల జాబితా ప్రచురణకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సర్ పూర్తయి తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాలని కోరుతూ ఎన్నికల సంఘానికి మేం వినతి పత్రం ఇచ్చినా తగిన స్పందన లేదు.సర్ ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలి. మేము ఎన్నికలను వాయిదా వేయాలని కోరడం లేదు. సర్ ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. 2026 జనవరి 1ని అర్హత తేదీగా తీసుకొని అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ చర్యలు చేపట్టడం సరికాదు. దీని వల్ల పెద్ద సంఖ్యలో పౌరులు ఓటు హక్కు కోల్పోతారు. నామినేషన్ల ముగింపు తేదీ నాటికి జరిగే అన్ని సవరణలను పరిగణనలోకి తీసుకుని అనుబంధ ఓటర్ల జాబితా విడుదల చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.సర్‌లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం 31.07.2026న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో రాష్ట్రంలో సుమారు 15.22 లక్షల మంది మరణించిన వారు, 7.37 లక్షల నకిలీ ఓట్లు, పెద్ద సంఖ్యలో శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు నమోదై ఉన్నాయి. సర్ప్రక్రియ పూర్తికాకముందే 01.01.2026 అర్హత తేదీతో పాత, తప్పుల తడకగా ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు వెళ్లడం వల్ల ఒకే ప్రాంతంలో అసెంబ్లీకి ఒక జాబితా, స్థానిక సంస్థలకు మరొక జాబితా ఉంటుంది.మరణించిన, నకిలీ ఓటర్లు స్థానిక జాబితాలో కొనసాగడం వల్ల రిజర్వేషన్లు, రొటేషన్ విధానం దెబ్బతింటుంది. పంచాయతీ రాజ్ చట్టం, మున్సిపాలిటీల చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు ప్రత్యేకమైన ఓటర్ల జాబితా ఉండదు. అది పూర్తిగా అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే తయారవుతుంది. చట్ట సవరణల ద్వారా జూలై 1ని కూడా అర్హత తేదీగా ఆమోదించినప్పటికీ, రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం 01.01.2026 తేదీనే ఎంచుకోవడం ఏకపక్షం. ఎన్నికల సంఘం తీరు వల్ల స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు. పారదర్శకతకు స్థానం లేకుండా పోతుంది. -
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే సింగ్
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టీకల్ 124(2) కింద రాష్ట్రపతి ఈ నియామకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. జస్టిస్ ఏకే సింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే, గుజరాత్, ఢిల్లీ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా సేవలందిస్తున్న జస్టిస్ సునీత అగర్వాల్, జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయలకూ సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించారు. కేంద్ర న్యాయశాఖ జాయింట్ సెక్రటరీ జగన్నాథ్ శ్రీనివాసన్ పేరుతో ఈ నోటిఫికేషన్ జారీ అయింది. జస్టిస్ ఏకే సింగ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గత వారం కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు చీఫ్ జస్టిస్ పదోన్నతి నేపథ్యంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శామ్ కోషిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, జస్టిస్ ఏకే సింగ్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టు విభజన తర్వాత ఏడుగురు ప్రధాన న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టగా, అందులో జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ అపరేశ్సింగ్ కుమార్ మాత్రమే నేరుగా సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందడం గమనార్హం. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి మొత్తం మంజూరైన జడ్జీ పోస్టుల సంఖ్య 38 కాగా, తాజా నియామకాలతో ఈ సంఖ్య 37కి చేరింది. న్యాయకోవిదుల కుటుంబంలో... న్యాయకోవిదుల కుటుంబంలో మూడో తరానికి చెందిన జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ 1965, జూలై 7న జన్మించారు. ఢిల్లీ వర్సిటీ నుంచి బీఏ ఆనర్స్, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. 1990లో న్యాయవాదిగా నమోదు చేసుకుని అదే ఏడాది నుంచి 2000 వరకు పట్నా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2001 నుంచి జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగారు. 2012, జనవరి 24న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2014, జనవరి 16న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2023, ఏప్రిల్ 17న త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లారు. 2025, జూలై 19న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. -
ఫారమ్–6లో మార్పులకు మా ఆమోదం లేదు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నుంచి అనుమతి సంపాదించాకే కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం–6లో చిన్న మార్పులు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం గతవారం ప్రకటించిన వేళ సర్వోన్నత న్యాయస్థానం కీలక స్పష్టతనిచ్చింది. కొత్త ఓ టరుగా నమోదు చేసుకునేందుకు పౌరుడు నింపాల్సిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం–6కు సంబంధించిన అనుబంధ డిక్లరేషన్‌కు తాము గతంలో ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు అని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టంచేసింది. తోటి ఎలక్షన్ కమిషనర్ల నుంచి ఎలాంటి ఉమ్మడి ఏకాభిప్రాయం సాధించకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు అమలుచేస్తున్నారంటూ దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు ఉద్యమాలు ఉధృతం చేసిన వేళ ఆ పార్టీలకు సరికొత్త విమర్శనాస్త్రంగా మారేలా ధర్మాసనం వ్యాఖ్యానాలు చేయడం విశేషం. ఎన్నికల సంఘంలోని కమిషనర్లందరికీ రాజ్యాంగం ద్వారా సమానంగా దఖలుపడిన నిర్ణయాధికారాన్ని ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ ఏకపక్షంగా లాగేసుకుని మోదీ ప్రభుత్వ అనుకూల నిర్ణయాలను వెలువరిస్తున్నా రని పలు హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు సైతం అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్న వేళ సుప్రీంకో ర్టులో ఈ అంశం విచారణకు రావడం గమనార్హం. కమిషనర్లు సుఖ్బీర్సింగ్ సంధూ, వివేక్ జోషీల నిర్ణయాలకు విలువ ఇవ్వకుండా జ్ఞానేశ్ ఒక్కరే నిబంధనల్లో, రూల్స్‌లో, సాఫ్ట్‌వేర్‌లో మార్పులుచేసి ఫారం–6ను చట్టవిరుద్ధంగా మార్చారంటూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలుచేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహన ధర్మాసనం విచారించింది. కోర్టు నుంచి అనుమతి పొందాకే కొత్త నిబంధనను దరఖాస్తులో చేర్చామని ఈసీ ఇటీవల చేసిన మీడియా ప్రకటనతో సుప్రీంకోర్టు సోమవారం పూర్తిగా విబేధించింది. రికార్డులన్నింటినీ తెప్పించండి.. ‘‘ఫారమ్–6లో ఇటీవలికాలంలో జరిగిన ఏ రకమైన మార్పులు, చేర్పులతోనూ కోర్టుకు సంబంధమే లేదు. దరఖాస్తులో మార్పులకు మేం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఈ విషయంలో స్పష్టతరావాల్సిందే. దరఖాస్తుకు సంబంధించి ఏఏ మార్పులు జరిగాయనేది మాకు తెలియదు. ముందుగా సంబంధిత రికార్డులను మాకు సమర్పించండి. అసలు ఈ మార్పులు చేసిందెవరో మేం తెల్సుకోవాలనుకుంటున్నాం. దరఖాస్తులో మార్పులు చేసిన అధికారి ఎవరు? అనుమతులు ఇచ్చిన అథారిటీ ఎవరనేది మాకు తెలియజేయండి. ఈ మేరకు సంబంధిత రికార్డులను తెప్పించండి.ఈ విషయంలో మీ స్పందనను నివేదించండి’’అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆదేశించింది. పిటిషర్ తరఫున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, చాంద్ ఖురేషి వాదించారు. ‘‘ఉమ్మడి నిర్ణయాధికారం అనే భావనకు తూట్లు పొడుస్తూ సీఈసీ జ్ఞానేశ్ ఒంటెత్తుపోకడను అనుసరించారు. ఈయన ఈసీ నిబంధననావళిని పూర్తిగా ఉల్లంఘించారు. ఈయనపై నేరాభియోగాలు మోపాల్సిందే. కర్తవ్య నిర్వహణలో ఈయన విఫలమయ్యారు’’అని లాయర్లు వాదించారు. ‘‘జ్ఞానేశ్‌కు రాజ్యాంగబద్ధంగా ఎలాంటి రక్షణ లభించదు.అందుకే పోలీస్ విచారణ, సాక్ష్యాధారణసేకరణ, రోజువారీ కేసు విచారణ వంటివి ఈయనకూ వర్తిస్తాయి. సీఈసీ, ఇతర ఈసీల చట్టం,2023లోని 18వ సెక్షన్ ప్రకారం ఎలక్షన్ కమిషన్‌లో ఏదైనా నిర్ణయంలో ఏకాభిప్రాయం సాధ్యంకాని పక్షంలో మెజార్టీ నిర్ణయానికే పట్టం కట్టాలి’’అని లాయర్లు గుర్తుచేశారు. ‘ఎలక్టోరల్ రూల్స్’నిబంధనావళి ప్రకారం ఫారమ్–6 వంటి కీలక దరఖాస్తులో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే చట్టప్రకారం ముందుకెళ్లాలి. కానీ ఎస్ఐఆర్ వంటి ప్రస్తుత సందర్భంలో ఎలాంటి చట్టబద్ధ నూతన నిర్ణయాలు వెలువడకుండానే ఏకపక్షంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులుచేసేసి ఆన్లైన్ ఫారమ్‌లో కొత్త కాలమ్ చేర్చారు. కొత్త ఓటరుగా మారాలనుకుంటున్న మీరు లేదా మీ తల్లిదండ్రులు/అంతకుముందు పూర్వీకుల పేర్లు గత ఎస్ఐఆర్ జాబితాలో ఉన్నాయా? అనే ప్రశ్నను చేర్చారు. ఇది చట్టవ్యతిరేకం. అందుకే జ్ఞానేశ్ నేతృత్వంలో ఈసీలో తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, ఉత్తర్వులు, ఆదేశాలు, సాఫ్ట్వేర్ మార్పులు అన్నీ చెల్లనివిగా ప్రకటించండి’’అని లాయర్లు ధర్మాసనాన్ని కోరారు. చట్టప్రకారం లేకుంటే రద్దుచేస్తాం – ఈసీ నిర్ణయాలపై సుప్రీంకోర్టు – సీఈసీని సస్పెండ్చేయాలన్న పిటిషన్‌పై విచారణ – స్పందన తెలపాలంటూ కేంద్రం, ఈసీకి వారం గడువు సీఈసీ జ్ఞానేశ్ సారథ్యంలోని ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలు ఏకాభిప్రాయంతో వెలువడినవా కాదా అనేది తేలేదాకా జ్ఞానేశ్‌ను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ‘‘సీఈసీపై నిర్ణయం తీసుకునేముందుగా ఎలక్షన్ కమిషన్ నుంచి వెలువడిన అన్ని పాత నిర్ణయాలను మేము పరిశీలించాల్సి ఉంది. చట్టప్రకారం వెలువడని ఏ నిర్ణయాన్ని అయినా మేం రద్దుచేస్తాం. సర్వోన్నత న్యాయస్థానం అసాధారణ అధికారం గురించి మీక్కూడా తెలుసు’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘వార్తపత్రికల కథనాలను ఆధారంగా చేసుకుని మేం జ్ఞానేశ్‌ను బాధ్యతల నుంచి తప్పించబోం. ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోం’’అని కోర్టు స్పష్టంచేసింది. జ్ఞానేశ్‌ను సీఈసీ పదవి నుంచి తొలగించాలంటూ మంగళవారం ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం బయట విపక్షాల ‘ఇండియా’కూటమి పార్టీలు నిరసన ర్యాలీ చేపట్టబోతున్న వేళ సుప్రీంకోర్టులో ప్రతికూల నిర్ణయం వెలువడటం గమనార్హం. ఈ వివాదం తేలేదాకా, కొత్త నిర్ణయాలు తీసుకోకుండా జ్ఞానేశ్‌ను బాధ్యతల నుంచి తప్పించండి. కమిషనర్లు సంధూ, జోషిల ఉమ్మడి ఏకాభిప్రాయాలే అమలయ్యేలా చూడండి. ఈలోపు ఖాళీ అయిన స్థానాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం భాగస్వామిగా ఉన్న కమిటీ సిఫార్సులతో భర్తీచేయండి’’అని న్యాయవాది వికాస్ సింగ్ ఈ పిటిషన్ వేశారు. ‘‘కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయంతో వెలువడాలి లేదా మెజార్టీ సాధించిన నిర్ణయాలే అమల్లోకి రావాలి. ఇలా కాకుండా తోటి కమిషనర్ల అభిప్రాయాలను సీఈసీ పక్కనపడేశారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఈసీ నుంచి స్పందన కోరుతున్నాం. వారం లోగా స్పందన తెలియజేయండి. ఆ తర్వాతే ఈ అంశాన్ని తేలుస్తాం’’అని ధర్మాసనం ప్రకటించింది. -
బెట్టుచేయొద్దు సర్!
‘అయ్యవారు ఏం చేస్తున్నారంటే... చేసిన తప్పులు దిద్దుకుంటున్నార’ని నానుడి. ఇప్పుడు ఎన్నికల సంఘం(ఈసీ) వాలకం అలాగే ఉంది. ఓటర్ల జాబితాల్లో చాటుమాటుగా, ఏకపక్షంగా తీసివేతలు, కూడికలు చేసిన వైనం బట్టబయలయ్యాక నిరసనలు వేయినాల్కలు చాచి దహిస్తుంటే ఈసీకి కాళ్లూ చేతులూ ఆడటం లేదు. అందుకే కావొచ్చు... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట ఇంతవరకూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయిన 20 రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘మినహాయించిన’ ఓటర్లను తిరిగి చేర్చుకోవటానికి ‘ప్రత్యేక చొరవ’ మొదలెట్టాలని ఆయా ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు(సీఈఓ) గుట్టుచప్పుడు కాకుండా ఆదేశాలిచ్చింది.ఈ ‘ప్రత్యేక చొరవ’ కోసం ఫామ్–6ను ఉపయోగించాలని కోరింది. నిజానికిది సాంకేతికంగా చెల్లదు. తొలిసారి ఓటర్ల కోసం నిర్దేశించిన ఫామ్‌ను తొలగించిన ఓటర్లకు ఎలా వినియోగిస్తారు? వారిని చేర్చదల్చుకుంటే అందుకు మరో నిబంధనేమైనా ఉందేమో అన్వేషించాలి. లేదా ‘సర్’కు ముందున్న ఓటర్ల జాబితాను యధాతథంగా ఆమోదించాలి. మరో ఆసక్తికరమైన విషయమేమంటే... 2002నాటి ‘సర్’లో ఉన్న తండ్రి/తల్లి/ తాత వగైరాలతో అనుసంధానం అయితేనే ఓటు ఉంటుందన్న ఫామ్–6 సవరణకు పూర్తిగా స్వస్తి చెప్పారు. అంతేకాదు... ఇంటింటికీ వెళ్లి ఓట్లును విచారణ చేసుకుంటారట. ఎంత వినయం! ఎంత రాజ్యాంగ విధేయత!! ఇదంతా ఇన్నేళ్లుగా ఎటు పోయినట్టు?‘చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోయింద’న్నట్టు ఈసీ సాగించిన ఈ తెరచాటు వ్యవహారాలు తెలియక 13 కోట్లకుపైగా జనం మౌనంగా ఈతిబాధలు అనుభవిస్తుంటే ఈసీ దాన్ని చేతగానితనంగా తీసుకుంది. అసలు ఈసీ రాజ్యాంగాతీత శక్తి కాదనీ, నిబంధనలు బేఖాతరుచేసి దానికదే ఏ నిర్ణయమూ తీసుకోవటం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఫామ్–6 సవరణపై తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యానం దిగ్భ్రాంతిలో పడేసింది.ఆ మార్పును సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించిందంటూ ఈసీ చెప్పడాన్ని ప్రస్తావించి, తాము ఏ సవరణకూ ఆమోదం తెలపలేదని ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ వివరణనిచ్చారు. ఇదే వ్యవహారంపై ఆ ముందురోజే సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ వ్యాఖ్యానిస్తూ ‘ఓటు హక్కు పౌరసత్వానికి అసలైన ప్రాణం. దాన్ని తొలగించటం రాజ్యాంగద్రోహం’ అనటం గమనించదగింది. ఇవి చాలు...ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ తక్షణం నిష్క్రమించడానికి! ఆ పదవిలో ఉండే నైతిక హక్కు ఆయన కోల్పోయారు. గాంధీ జయంతినుంచి ఢిల్లీ, ముంబైవంటి నగరాల్లో జ్ఞానేశ్ తప్పుకోవాలంటూ యువత రోడ్లపైకొస్తున్నారు. పోలీసులు రోజూ యాతన పడుతున్నారు. ఆడ, మగ తేడా పాటించకుండా పోలీసు వ్యాన్లలోకి ఈడ్చుకెడుతున్నారు. ఒక మహిళా జర్నలిస్టుపట్ల ఏసీపీ స్థాయి వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన వైనం వీడియో సాక్షిగా బయటికొచ్చింది. తప్పు మీద తప్పు చేస్తూ కోట్లాదిమంది ఓటుకు ఎగనామం పెట్టిన పెద్దమనిషి మాత్రం తనను కానట్టు వ్యవహరిస్తున్నారు. నేరం బయటపడ్డాక స్వచ్ఛందంగా తప్పుకోవాల్సింది పోయి, యువఘోష మిన్నంటుతున్నా బధిరాంధత్వం సంప్రాప్తించినట్టు ఆయన ఉండటం మన ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గుచేటు. ‘సర్’ ప్రక్రియలో ఓట్ల తొలగింపు అక్రమాలేమిటో ఇప్పుడు కర్ణాటక, తెలంగాణల్లో బయటపడిన వ్యవహారాలు చెబుతున్నాయి. ఫలానా ఓటు తొలగించమని దరఖాస్తులు అందిందే తడవుగా అడ్డగోలుగా తీసేశారని వెల్లడైంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘సర్’ ప్రక్రియలో చోటుచేసుకున్న చట్టవిరుద్ధతలు, వాటి పర్యవసానాలపై ఆందోళన సాగుతోంది.మరి 2024నాటి ఎన్నికలనుంచీ చోటుచేసుకున్న అక్రమాల మాటేమిటి? చట్టం ఆసరావున్నా మిగతా ఇద్దరు కమిషనర్లూ ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ వరకూ తీసుకుంటే అప్పట్లో 3,500 పైగా పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి దాటాక లక్షలమంది ఎలా ఓట్లెలావేశారు? ఆ ప్రక్రియకు సంబంధించిన వీవీప్యాట్‌లూ, సీసీ టీవీ ఫుటేజ్‌లూ నిబంధనల్ని కాదని ముందే ఎందుకు తొలగించారు? ఎవరి ఆదేశాల పర్యవసానమిది? ఇవన్నీ తేలాలిప్పుడు. దానికి ముందు, బెట్టుచేయటానికి ఇక స్వస్తిపలికి జ్ఞానేశ్ తక్షణం వైదొలగాలి. -
ఏపీలో వార్డుల విభజన కేసులో సుప్రీంలో YSRCP పిటిషన్
-
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను సస్పెండ్ పై సుప్రీంకోర్టు షాక్
-
CEC జ్ఞానేశ్ కుమార్‌కు సుప్రీంకోర్టు షాక్ ఫాం-6లో మార్పులపై తీవ్ర వ్యాఖ్యలు
-
సీఈసీ ఏకపక్ష నిర్ణయాలా.. సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. అయితే ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నారా? లేక సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారా? అనే అంశంపై ఈసీతో పాటు సీఈసీ, ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీలకు నోటీసులు జారీ చేసింది.ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలా?ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చీ, వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు సాధారణంగా ఏకాభిప్రాయంతో ఉండాలని సీజేఐ స్పష్టం చేశారు. ఏకాభిప్రాయం కుదరకపోతే మెజారిటీ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.సీఈసీపై ఆరోపణలేమిటి?ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో జ్ఞానేశ్ కుమార్ ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్ల ఆరోపణ. ఈ నేపథ్యంలో సీఈసీని సస్పెండ్ చేయడంతో పాటు ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు సుప్రీంకోర్టును కోరారు.14 సార్లు అభ్యంతరాలు?‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో వచ్చిన కథనాన్ని పిటిషనర్లు ప్రస్తావించారు. 2025 అక్టోబర్ నుంచి 2026 ఆగస్టు మధ్య ఎస్ఐఆర్కు సంబంధించిన పలు చర్యల విషయంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీ కనీసం 14 సందర్భాల్లో అభ్యంతరాలు నమోదు చేసినప్పటికీ, ఎన్నికల సంఘం పేరుతో నిర్ణయాలు తీసుకున్నట్లు ఆ కథనం పేర్కొంది.రికార్డులను పరిశీలిస్తాంకేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జోయ్‌మాల్య బాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం రికార్డుల్లో కొన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకోలేదని తేలితే, వాటి అమలును నిలిపివేసి అవి చట్టపరంగా చెల్లుబాటు కావని ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం సభ్యుల నుంచి వివరణ కోరారు.సస్పెన్షన్‌కు నో.. నోటీసులతో విచారణఅయితే ప్రస్తుత దశలో జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల సంఘం, సీఈసీ, ఇతర ఇద్దరు కమిషనర్లకు నోటీసులు జారీ చేసి వారి వివరణ కోరింది. కేసు విచారణ కొనసాగనుంది. -
ఓట్లు డిలీట్ చేయడం అన్యాయం.. సుప్రీంకోర్టు CIJ
-
నేడు సీఈసీ జ్ఞానేశ్‌పై విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ!
సాక్షి, ఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు, ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో తీసుకున్న చర్యలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది.పిటిషనర్ల ప్రధాన ఆరోపణ ఏమిటంటే.. ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండానే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని.. SIR ప్రక్రియకు సంబంధించి ఇలాంటి నిర్ణయాలు సుమారు 14 వరకు తీసుకున్నట్లు పిటిషన్లలో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మాత్రం తమ నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ధారణకు రాలేదు.సిట్ కోసం డిమాండ్.. అంతేకాకుండా.. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని కూడా పిటిషనర్లు కోరారు. SIR సందర్భంగా ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వివాదాస్పదంగా పేర్కొన్న 14 నిర్ణయాలను రద్దు చేయాలని, సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ విధులు నిర్వహించకుండా తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా పిటిషన్లలో కోరారు.ఇదిలా ఉండగా.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు, పలు సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై సహా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు సైతం సీఈసీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. అక్టోబర్ 7న ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద సంయుక్త నిరసనకు కూడా ఇండియా కూటమి పిలుపునిచ్చింది.మరోవైపు.. ఎన్నికల సంఘం మాత్రం SIRకు సంబంధించిన నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని చెబుతోంది. ఈ నేపథ్యంలో సీఈసీ నిర్ణయాల చట్టబద్ధత, ఎన్నికల సంఘం అంతర్గత నిర్ణయ ప్రక్రియ, SIRపై వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ కీలకంగా మారింది. అయితే పిటిషన్లలో చేసిన ఆరోపణలు ప్రస్తుతం ఆరోపణల స్థాయిలోనే ఉన్నాయని, వాటిపై కోర్టు తుది నిర్ణయం ఇవ్వాల్సి ఉంది.ఇదీ చదవండి: బెంగాల్లో ట్విస్ట్.. తిరుగుబాటు నేతలకు మమత గట్టి వార్నింగ్ -
కోట్లాది ఓట్లు తొలగించడం అన్యాయం: సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్
ఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు రాజ్యాంగపరమైన హక్కని, రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఓటు హక్కు భాగమని తెలిపారు. గంప గుత్తగా కోట్లాది ఓట్లు తొలగించడం అన్యాయమని అన్నారు.ఓట్లు తొలగింపు ఆర్టికల్14, 326కు విరుద్ధమని ఉజ్జల్ భయాన్ చెప్పారు. అక్రమంగా ఓట్లు తొలగించే ప్రక్రియ చట్ట విరుద్ధమని తెలిపారు. ఓట్ల తొలగింపును ఏ కోర్టులూ క్షమించబోవని అన్నారు. ఓటు హక్కు తీసివేయడమంటే శరీరం నుంచి ఆత్మను లేకుండా చేయడమేనని చెప్పారు. ఓటు ఉన్న వారు, ఓటు లేని వారు అనే రెండు తరగతులను సృష్టించవద్దని అన్నారు. -
పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సీరియస్.. ఈ సేవలన్నీ బంద్!
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు.. విధించే ఈ-చలాన్లను చెల్లించకుండా కొందరు అలాగే వదిలేస్తుంటారు. ఇంకొందరు తర్వాత కడదాం అని పెండింగ్‌లో పెట్టేస్తారు. కానీ.. ఇక అలా చేస్తే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను కచ్చితంగా వసూలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.వాహనాలకు చలాన్ జారీ చేస్తే సరిపోదు, ఆ చలాన్‌కు సంబంధించిన జరిమానా కూడా వసూలు చేయాలి. దేశవ్యాప్తంగా ఇప్పటికే వేల కోట్ల రూపాయల ట్రాఫిక్ జరిమానాలు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది.కోర్టుకు అందిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా సుమారు రూ.49,194 కోట్లకు పైగా ఈ-చలాన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు సుమారు రూ.26,175 కోట్లు వసూలు చేశారు. దీంతో మిగిలిన మొత్తాన్ని కూడా వసూలు చేసేందుకు అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించింది.పెండింగ్‌లో ఉన్న చలాన్లను చెల్లించకుండా ఉంటే వాహనానికి సంబంధించిన కొన్ని సేవలు పొందడంలో ఇబ్బందులు రావచ్చు. ఇందులో వెహికల్ RC రెన్యువల్ చేయడం, డూప్లికేట్ RC తీసుకోవడం, వాహన యజమాని చిరునామా మార్చడం వంటి సేవలను నిలిపివేయవచ్చు. అలాగే వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వడంపైనా ప్రభావం పడొచ్చు. పదేపదే తప్పులు చేస్తుంటే.. డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ప్రతి ఏడాది హైక్ వస్తున్నా.. జీతం తక్కువేనా?: కారణం ఇదే! -
BIG ALERT: ట్రాఫిక్ చలానా కట్టలేదా.. ఇంట్లో కరెంట్ కట్!
-
క్రిస్టా కేసులో ఊహకందని మలుపులు.. ఆఖరికి ఉరిశిక్ష ఖరారు!
అమెరికాలో 1995లో సహ విద్యార్థి కొలీన్ స్లెమ్మర్‌ను హత్య చేసిన కేసులో క్రిస్టా పైక్ ఉరిశిక్ష అమలుకు మార్గం సుగమమైంది. ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని అమెరికా సుప్రీంకోర్టు బుధవారం రాత్రి రద్దు చేసింది. దీంతో పైక్‌కు ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉంది. 50 ఏళ్ల పైక్‌కు నాష్‌విల్లేలోని రివర్‌బెండ్ మాగ్జిమమ్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూషన్లో ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. అది అమలైతే.. గడచిన 200 ఏళ్లలో టెన్నెస్సీ స్టేట్‌లో ఉరిశిక్ష అమలయ్యే తొలి మహిళగా పైక్ నిలువనుంది.తాత్కాలికంగా నిలిపిన ఆరో సర్క్యూట్ కోర్టుపైక్ కేసులో కొత్త వాదనలను ఆమె న్యాయవాదులు ముందుకు తెచ్చిన నేపథ్యంలో వాటిని పరిశీలించేందుకు అమెరికా ఆరో సర్క్యూట్ అప్పీళ్ల కోర్టు ఉరిశిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే సుప్రీంకోర్టు ఆ నిలుపుదల ఆదేశాన్ని రద్దు చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయంపై న్యాయమూర్తులు సోనియా సోటోమేయర్, ఎలెనా కాగన్, కేతాంజి బ్రౌన్ జాక్సన్ అసమ్మతి వ్యక్తం చేశారు. ఆరో సర్క్యూట్ కోర్టు తన సాధారణ న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా పైక్ వాదనలను పరిశీలించే అవకాశాన్ని సుప్రీంకోర్టు నిర్ణయం అడ్డుకుంటోందని సోటోమేయర్ తన అసమ్మతి అభిప్రాయంలో పేర్కొన్నారు.చిన్ననాటి వేధింపులపై న్యాయవాదుల వాదనపైక్ అసలు విచారణ సమయంలో ఆమె తరఫు న్యాయవాదులు చిన్ననాట ఆమె ఎదుర్కొన్న తీవ్రమైన వేధింపులు, నిర్లక్ష్యం, మానసిక గాయాలకు సంబంధించిన ఆధారాలను తగినంతగా సమర్పించలేదని న్యాయవాదులు వాదించారు. ఆ వివరాలను జ్యూరీ ముందుంచి ఉంటే ఆమెకు మరణశిక్ష విధించాలన్న నిర్ణయం ప్రభావితమయ్యే అవకాశం ఉండేదని తెలిపారు. టెన్నెస్సీ గవర్నర్ బిల్ లీ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడానికి ముందు పైక్ రాసిన లేఖలో.. తనకు చావంటే భయం లేదని, అయితే ఉరిశిక్ష ప్రక్రియపై ఆందోళనగా ఉందని పేర్కొంది. తనకు మద్దతుగా గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.కొలీన్ స్లెమ్మర్ హత్య కేసు1995 నుంచి పైక్ జైలులో ఉంది. తన మాజీ సహ విద్యార్థిని కొలీన్ స్లెమ్మర్‌ను హత్య చేసిన కేసులో ఆమెకు మరణశిక్ష విధించారు. కోర్టు రికార్డుల ప్రకారం.. పైక్, స్లెమ్మర్ టెన్నెస్సీలోని నాక్స్విల్లే జాబ్ కార్ప్స్ సెంటర్లో విద్యార్థులుగా ఉన్నారు. పైక్‌కు అప్పటికి 18 ఏళ్లు, స్లెమ్మర్కు 19 ఏళ్లు. పైక్ అప్పటి ప్రియుడు టడరిల్ షిప్, మరో స్నేహితురాలు షడోల్లా పీటర్సన్ కూడా దాడి భాగస్వాములని కోర్టు రికార్డులు పేర్కొన్నాయి. పైక్తో స్లెమ్మర్ సంబంధాలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు.హత్య కేసులో సుదీర్ఘ విచారణస్లెమ్మర్ మరణానికి సంబంధించిన పరిస్థితులు పైక్ మరణశిక్ష కేసులో కీలక అంశంగా మారాయి. అసలు విచారణలో ప్రాసిక్యూటర్లు, జ్యూరీ సభ్యులు, అనంతరం కేసును పరిశీలించిన న్యాయమూర్తులు ఈ హత్యను అత్యంత క్రూరమైనదిగా అభివర్ణించారు. యూనివర్సిటీ ఆఫ్ టెన్నెస్సీ క్యాంపస్‌లోని అటవీ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు విచారణ రికార్డులు పేర్కొన్నాయి. స్లెమ్మర్ మృతదేహం లభ్యమైనప్పుడు ఆమె పుర్రెలో కొంత భాగం కనిపించలేదని రికార్డులు తెలిపాయి. ఆమె నుదురు, ఛాతీపై పెంటాగ్రామ్ గుర్తులు చెక్కినట్లు కూడా పేర్కొన్నారు. ఒక సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. స్లెమ్మర్ పుర్రెలో కనిపించని భాగాన్ని తాను తీసుకుని జ్ఞాపకంగా ఉంచుకున్నట్లు పైక్ చెప్పింది.1996లో మరణశిక్ష1996లో పైక్‌కు మరణశిక్ష విధించారు. స్లెమ్మర్ హత్య జరిగినప్పుడు షిప్‌కు 17 ఏళ్లు కావడంతో అతడికి మరణశిక్ష విధించే అర్హత లేదు. అతడికి జీవిత ఖైదు విధించారు. గతేడాది అతడి పెరోల్ తిరస్కరణకు గురైంది. 2031 చివర్లో అతడి కేసును మరోసారి పరిశీలించే అవకాశం ఉంది. పైక్‌పై వాంగ్మూలం ఇచ్చిన పీటర్సన్‌కు పరిశీలనలో విడుదల లభించింది.పైక్ వయసుపైనా న్యాయపరమైన వాదనలుపైక్ న్యాయవాదులు ఏళ్లుగా అనేక అప్పీలు దాఖలు చేస్తూ ఆమె దోష నిర్ధారణ, మరణశిక్ష రెండింటినీ సవాలు చేస్తున్నారు. ఆధునిక ప్రమాణాల ప్రకారం ఈ కేసును పరిశీలిస్తే తీర్పు భిన్నంగా ఉండే అవకాశం ఉందని వారు వాదించారు. పైక్‌కు 1996లో 20 ఏళ్ల వయసులో మరణశిక్ష విధించారు. నేరం జరిగినప్పుడు ఆమె వయసు 18 ఏళ్లు కావడం కూడా న్యాయపరమైన వాదనల్లో కీలక అంశంగా మారింది. స్లెమ్మర్ హత్య జరిగినప్పుడు పైక్ కొన్ని నెలలు మాత్రమే చిన్న వయసులో ఉండి ఉంటే, టెన్నెస్సీ చట్టం ప్రకారం ఆమెకు మరణశిక్ష విధించే అవకాశం ఉండేది కాదని ఆమె న్యాయవాదులు తెలిపారు.వేధింపులు, మానసిక ఆరోగ్యంపై వాదనలుపైక్ చిన్నతనంలో లైంగిక వేధింపులు, విడిచిపెట్టడం, నిర్లక్ష్యాన్ని ఎదుర్కొందని ఆమె న్యాయవాదులు తెలిపారు. అలాగే ఆమెకు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ), బైపోలార్ డిజార్డర్ వంటి తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నాయని, పుట్టుకతోనే మెదడుకు సంబంధించిన నష్టం కూడా ఉందని వారు పేర్కొన్నారు. అసలు విచారణలో ఆమె తరఫు న్యాయవాదులు ఈ చరిత్రను జ్యూరీకి తగినంతగా వివరించలేదని వాదించారు.జైలులో మారిపోయానన్న పైక్18 ఏళ్ల వయసులో ఉన్న పైక్, దశాబ్దాలుగా జైలులో ఉన్న ప్రస్తుత పైక్ మధ్య తేడాను కూడా ఆమె న్యాయవాదులు ప్రస్తావించారు. క్షమాభిక్ష పిటిషన్లో పైక్ స్లెమ్మర్ మరణానికి సంబంధించిన తన చర్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఆ ఘటన వల్ల ఒక తల్లి తన కుమార్తెను, ఒక కుటుంబం తమ సోదరిని, స్నేహితులు తమ స్నేహితురాలిని కోల్పోయారని తాను అర్థం చేసుకున్నట్లు పేర్కొంది. జైలులో ఉన్న సంవత్సరాల్లో పైక్ పూర్తిగా మారిపోయిందని ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు. ప్రస్తుతం ఆమె 50 ఏళ్ల వయసులో పశ్చాత్తాపం కలిగిన మహిళగా, మానసిక ఆరోగ్యానికి తగిన చికిత్స పొందుతూ, జైలులోని ఇతర మహిళలకు సహాయం చేస్తున్నదని చెప్పారు.చివరి దశలో సుప్రీంకోర్టు జోక్యంపైక్ ఉరిశిక్షకు కొన్ని గంటల ముందు ఈ న్యాయపరమైన వివాదం తుది దశకు చేరింది. ఆమె న్యాయవాదులు చేసిన కొత్త వాదనలను పరిశీలిస్తున్న సమయంలో ఆరో సర్క్యూట్ కోర్టు ఉరిశిక్షపై తాత్కాలిక నిలుపుదల విధించింది. అయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ నిలుపుదల ఆదేశాన్ని రద్దు చేసింది. దీంతో టెన్నెస్సీ రాష్ట్రం క్రిస్టా పైక్ ఉరిశిక్షను అమలు చేసేందుకు మార్గం ఏర్పడింది.ఇదీ చదవండి: ‘2027లో బంగారం’.. షాకిస్తున్న బాబా వంగా అంచనాలు! -
ఒత్తిడి, వివక్ష, వేధింపులు...
న్యూఢిల్లీ: దేశంలో ఉన్నత విద్య భారమైపోతోందా? ఒత్తిడిని తట్టుకోలేకే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారా? అందరి విషయంలో కాకపోయినా గత ఆరునెలల్లో కనీసం 15 శాతం మంది విద్యార్థులు ఏదో ఒక దశలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు అంటోంది సుప్రీంకోర్టు నియమించిన నేషనల్ టాస్క్‌ఫోర్స్ (ఎన్టీఎఫ్). ఈ సమయావధిలో ఆత్మహత్య ఆలోచనలు చేసిన విద్యార్థులు తొమ్మిది శాతం వరకూ ఉన్నారని తెలిపింది. దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల బలవన్మరణాలపై తరచూ వార్తలొస్తున్నాయి. ఢిల్లీ, బాంబేల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటంపై పెద్ద దుమారమే రేగుతోంది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణ, మానసిక ఆరోగ్య సమస్యలకు పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటైన నేషనల్ టాస్‌్కఫోర్స్ ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించింది. గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఎన్టీఎఫ్ అక్టోబరు 31వ తేదీ లోగా తుది నివేదికను సమర్పించనుంది. ఇప్పటికే సమర్పించిన మధ్యంతర నివేదిక ప్రకారం.... దేశంలో ఉన్నత విద్య వ్యవస్థలో సామాజిక వివక్ష వేళ్లూనుకుపోయింది. అంతేకాకుండా వైద్య, ఇంజినీరింగ్ కోర్సుల్లో లైంగిక వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయని, వైద్య, న్యాయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది స్వయంగా లింగ వివక్ష, చూపుతున్నారని తేల్చింది. విద్యాపరమైన సాయం అందించే విషయంలోనే కాకుండా, హాస్టళ్లలో కర్ఫ్యూలు విధించడం, కులాలకు తగ్గట్టుగా వ్యవహరించడం సామాన్యమైపోయాయి అని ఈ ఆ నివేదిక తెలిపింది. నీట్–యూజీ, జేఈఈ ర్యాంకులు, మార్కుల ఆధారంగా కుల ఆధారిత అవహేళన, వివక్షలు జరుగుతున్నాయని స్పష్టం చేసింది. అడ్మిషన్లు మొదలుకొని గ్రేడ్లు, భాష అంతరాలు, సిబ్బంది వ్యవహారాలన్నింటిలోనూ ఇది కొనసాగుతోందని తెలిపింది. సర్వేలో భాగంగా ఎన్టీఎఫ్ సుమారు 2.43 లక్షల మంది విద్యార్థులను ప్రశ్నించింది. వీరిలో 67 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారు. విద్యార్థుల స్పందనల ప్రకారం స్థాయీ బేధాలు కొన్ని ఉన్నా కనీసం 34 శాతం మంది తాము క్యాంపస్‌లలో పరాయివాళ్లుగా ఫీలవుతున్నట్లు స్పష్టం చేశారు. గడచిన ఆరునెలల కాలంలో ఏదో ఒక దశలో కొన్ని వారాలపాటు మానసికంగా కుంగిపోయిన సందర్భాలున్నాయని 15 శాతం మంది విద్యార్థులు చెప్పగా.. ఏడాదిగా తరచూ లేదా అప్పుడప్పుడు ఆత్మహత్య ఆలోచనలు కలుగుతున్నట్లు తొమ్మిది శాతం మంది తెలిపారు. అయితే సీరియస్ అంశాల విషయంలో తాము విద్యా సంస్థల నిర్వాహకులను నమ్ముతున్నట్లు 56 శాతం మంది తెలపడం విశేషం. మానసికంగా కుంగిపోయిన సందర్భాల్లో సంస్థలు తమకు ఎలాంటి కౌన్సిలింగ్ సేవలు అందించలేదని చెప్పిన వాళ్లు 32 శాతం మంది. ఆసక్తికరంగా... ఎంచుకున్న కోర్సు, ఉద్యోగాలకు సంబంధించిన ఆందోళనలు విద్యార్థుల్లో సహజమేనని విద్యా సంస్థల అధికారులు చెబుతున్నారు! ఉన్నత విద్యా సంస్థల్లో చేరుతున్న వారి సంఖ్య 2011– 2022 మధ్యకాలంలో ఎక్కువైనప్పటికీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్’ బ్యూరో లెక్కల ప్రకారం ప్రతి లక్ష మంది విద్యార్థులకు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య కూడా 26.37 నుంచి 30.02కు పెరిగినట్లు ఒక అధికారి తెలిపారు. విద్యార్థుల్లో ఎక్కువమంది అటెండెన్స్‌ను కఠినంగా అమలు చేయడంపై ఫిర్యాదు చేశారని, వైద్యవిద్యార్థుల విషయంలో పనివేళలు ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్లేస్‌మెంట్‌కు అర్హత సాధించేందుకు కఠినాతికఠినమైన ప్రమాణాలు.. విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసిన మిగిలిన అంశాలని తెలిపారు. రాష్ట్రాల యూనివర్సిటీల్లో సిబ్బంది కొరత కారణంగా బోధనాంశాల విషయంలో సరైన మద్దతు లభించడం లేదని, అరకొర ప్రాక్టికల్ ట్రెయినింగ్ విద్యార్థులు డెంటల్, నర్సింగ్, మెంటల్ హెల్త్ రంగాల్లో ప్రాక్టీస్ చేయడం కష్టసాధ్యం చేస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. -
పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంతోనే అరెస్టా?
న్యూఢిల్లీ: నిందితుడు పోలీసుల మందు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జాతీయ భద్రతా చట్టం కింద అతడిని అదుపులోకి తీసుకోవడం కుదరదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ముందస్తు అరెస్ట్ అనేది అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవాల్సిన చర్యని తెలిపింది. 2024 నాటి సంభల్ మత ఘర్షణల కేసులో ఉత్తర ప్రదేశ్ పోలీసులు ముల్లా అఫ్రోజ్ అనే వ్యక్తిని జాతీయ భద్రతా చట్టం కింద ముందస్తు అరెస్ట్ చేయడం చెల్లదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగూల బెంచ్ స్పష్టం చేసింది. అక్రమ ఆదేశాలు జారీ చేసినందుకుగాను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పది లక్షల రూపాయల జరిమానా చెల్లాంచాలని న్యాయమూర్తులు తీర్పునిచ్చారు.ముందస్తు అరెస్ట్ తీసుకునే ముందు అంతటి అసాధారణ పరిస్థితి ఉందా? అన్నది పోలీసులు నిర్ణయించుకోవాలని, ఆచితూచి వ్యవహరించాలని తెలిపింది. ఇతర సాక్ష్యాలు, ఆధారాలేవీ లేని పరిస్థితుల్లో నేరాంగీకర వాంగ్మూలాన్ని విశ్వసించదగ్గ సాక్ష్యంగా పరిగణించలేమని బెంచ్ తెలిపింది. సాక్ష్యంగా పరిగణించలేని అంశం ఆధారంగా ముందస్తు అరెస్టు ఆదేశాలు జారీ చేయడం సరికాదని తెలిపింది. ఒకవేళ పోలీసులు నేరాంగీకర వాంగ్మూలంతోపాటు ఇతర సాక్ష్యాధారాలపై ఆధారపడి ఉంటే వాటి ఆధారంగా ఆ ముందస్తు అరెస్ట్ చెల్లుతుందా? లేదా? అన్నది న్యాయస్థానం నిర్ణయించాలని వివరించింది.ముల్లా అఫ్రోజ్ విషయంలో పోలీసులు తనను బెదిరంచి, హింసించి వాంగ్మూలం తీసుకున్నారని చెబుతున్నారని వ్యాఖ్యా నిస్తూ బెంచ్ పలీసుల ఆదేశాలను కొట్టివేసింది. అఫ్రోజ్‌పై 2025 అక్టోబరు 13న జాతీయ భద్రతా చట్టం కేసు మోపారని, అయితే అప్పటికే అతడిపై మోపిన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించిందని బెంచ్ గుర్తించింది. అటువంటి పరిస్థితుల్లో అతడిని మళ్లీ జాతీయ భద్రతా చట్టం కింద మందస్తు అదుపులోకి తీసుకోవడం శిక్షించడమే అవుతుందని తెలిపింది.అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తరువాత ముల్లా అఫ్రోజ్‌పై జారీ అయిన ముందస్తు అరెస్ట్ ఉత్తర్వులు అక్రమం, చట్టవిరుద్ధమని తెలిపింది. ఈ కేసులో తీర్పునిచ్చే సందర్భంలో జస్టిస్ దీపాంకర్ దత్తా 27 వ జన్మదినానికి నాలుగు రోజుల ముందు మరణించిన తన లీగల్ గుమాస్తాకు నివాళులు అరి్పంచారు. 2024 నవంబరులో షాహీ జామా మసీదు సరేర్వకు న్యాయస్థానం ఆదేశించినప్పుడు సంభల్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానికులు భద్రతాధికారులతో ఘర్షణకు దిగారు. ఈ గొడవల్లో నలుగు మరణించగా.. చాలామంది గాయపడ్డారు. -
యూపీఐ చార్జీలపై ‘స్టే’కు సుప్రీం నో
వ్యాపారస్తులకు రూ.2,000కు పైబడిన యూపీఐ చెల్లింపుల మీద ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలు విధించాలన్న కేంద్రం నిర్ణయంపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎండీఆర్ విధింపుపై నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, ఎన్‌పీసీఐకి నోటీసులు జారీ చేసింది.వివరాల్లోకి వెళితే.. యూపీఐ లావాదేవీలు దాదాపు గత ఆరేళ్లుగా ఉచితంగానే కొనసాగుతున్నాయి. అయితే, వ్యాపారవర్గాలకు కొనుగోలుదారులు రూ. 2,000కు పైబడి జరిపే చెల్లింపులపై 0.4 శాతం ఫీజును విధిస్తూ కేంద్రం ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇది కేవలం వ్యాపారవర్గాలే చెల్లించాల్సి ఉంటుందని, వినియోగదారులపై ఎలాంటి భారం పడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. అయితే, దీన్ని సవాలు చేస్తూ అడ్వొకేట్ అంజన్ దత్తా సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనతో కూడిన బెంచ్ ఈ చార్జీల విధింపునకు ప్రాతిపదిక ఏమిటో వివరించాలని కేంద్రానికి సూచించింది. యూపీఐ మొత్తం లావాదేవీల్లో 96% వరకు చార్జీల పరిధిలోకి రావని, నిర్దిష్ట సేవలకు సంబంధించిన లావాదేవీలపై చార్జీని రూ.5కు ప్రభుత్వం పరిమితం చేసిందని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ వెంకటరమణ వివరించారు. యూపీఐ వ్యవస్థను నిర్వహించేందుకు భాగస్వామ్య సంస్థలకయ్యే వ్యయాల భారాన్ని తగ్గించేందుకే దీన్ని విధిస్తున్నట్లు, ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి లబ్ధి చేకూరదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సదరు వివరాలతో అఫిడవిట్‌ను దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.ఇదీ చదవండి: బ్యాంకు ఉద్యోగుల జీతాలు ఎలా ఉన్నాయంటే.. -
రాష్ట్రం దాటితే.. ‘స్థానికత’ దూరం!
సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత చదువుల కోసం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన తెలంగాణ విద్యార్థినికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వైద్య విద్య తదితర కోర్సుల ప్రవేశాల్లో స్థానికత నిర్ధారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, రాష్ట్రపతి ఉత్తర్వులే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారన్న నిబంధన అమల్లో ఉన్నప్పుడు, దానికి విరుద్ధంగా ప్రత్యేక మినహాయింపులు కోరడం కుదరదని తేల్చిచెప్పింది. ఏపీలో ఇంటర్మీడియెట్ చదివిన తనకు తెలంగాణలో స్థానికత కలి్పంచేలా ఆదేశాలివ్వాలని కోరుతూ జెల్లా అంకిత అనే విద్యార్థిని దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సోమవారంన్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. అసలేం జరిగింది? ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు 12 ఏళ్ల పాటు తెలంగాణలోనే చదివిన అంకిత.. రెండేళ్ల ఇంటర్మీడియట్‌ను ఏపీలో పూర్తి చేసింది. ప్రవేశాల సమయంలో స్థానికత నిర్ధారణకు వచ్చే సరికి అంకితకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంటర్, అంతకుముందు రెండేళ్లు అంటే వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే వారినే స్థానికులుగా పరిగణిస్తామన్న నిబంధనల ప్రకారం ఆమెకు తెలంగాణలో స్థానిక కోటాకు అర్హత లేకుండా పోయింది.దీనిపై ముందుగా ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, స్థానికతకు సంబంధించిన నిబంధనలను హైకోర్టు సమర్థించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ కేవలం ఉన్నత విద్యాభ్యాసం కోసమే రెండేళ్లు ఏపీకి వెళ్లిందని తెలిపారు. విద్యార్థిని తండ్రి, తాత కూడా తెలంగాణలోనే నివసిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో స్థానికతను నిరాకరిస్తే అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఎక్కడా స్థానికత వర్తించకుండా ఆమె నష్టపోతుందని వాదించారు.రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించలేం: సుప్రీంకోర్టు వాదనలు విన్న ధర్మాసనం స్థానికతకు సంబంధించిన ప్రభుత్వ జీవోను హైకోర్టు ఇప్పటికే సమర్థించిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ జీవోను వర్తింపజేస్తే, అందులోని ’నాలుగేళ్ల నిబంధన’ప్రకారమే ప్రక్రియ నడుస్తుందని తేల్చిచెప్పింది. ‘తండ్రి ఎక్కడ ఉంటున్నారనే దానితో సంబంధం లేదు. చదువు కోసం మీరు రాష్ట్రం దాటి వెళ్లారు. ఇక్కడ రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఆ ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పుడు వాటిని కాదని మీకు ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం కల్పించలేం. అది రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుంది‘అని న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం పిటిషనర్‌కు ఇతర ప్రత్యామ్నాయం ఏదీ లేదంటూ ధర్మాసనం కేసును కొట్టివేసింది. -
హైకోర్టు ఉద్యోగుల్లో కొందరిపై ‘సవతి తల్లి’ ప్రేమెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ హైకోర్టులో 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఒకే బ్యాచ్‌కి చెందిన ఉద్యోగుల్లో కొందరిని పర్మీనెంట్ చేసి, మరికొందరిని ఔట్సోర్సింగ్ విధానంలో ఉంచడంపై రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరికి పర్మీనెంట్, మరికొందరికి ఔట్సోర్సింగ్ ఏమిటని సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలాంటి వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ధర్మాసనం, ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి రెండు వారాల్లో రెగ్యులరైజేషన్ డ్రాఫ్ట్ స్కీమ్ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది. రొక్కం వేణుగోపాల్ రావు, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 15 ఏళ్ల క్రితం హైకోర్టు పరిధిలో 140 ఫాస్ట్ ట్రాక్, స్పెషల్, స్పెషల్ మేజి్రస్టేట్ కోర్టులను ఏర్పాటు చేసి, డ్రైవర్లు, ప్యూన్లు, అటెండర్లు, స్టెనోగ్రాఫర్లు, రికార్డ్ అసిస్టెంట్లను నియమించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ హైకోర్టు తన పరిధిలోని ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించింది. ఏపీలో మాత్రం కొందరిని పర్మీనెంట్ చేసి, మరికొందరి పోస్టులను ఔట్సోర్సింగ్, తాత్కాలిక పోస్టులుగా మార్చారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులోని దాదాపు 200 మంది ఉద్యోగుల్లో సగంమంది గతంలో రిట్ దాఖలు చేయగా, అనంతరం ప్రభుత్వం వారిని రెగ్యులరైజ్ చేసింది. ఆలస్యంగా ఆశ్రయించిన మిగతా ఉద్యోగుల అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
సుప్రీంకోర్టుకు ముగ్గురు హైకోర్టు సీజేలు..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌తో పాటు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్‌లు ఉన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు కొలీజియం నిర్వహించిన సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ప్రతిపాదనలను ఆమోదిస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇదీ చదవండి: పశ్చిమబెంగాల్లో విజయ్ టీవీకే ఎంట్రీ..! -
UPI లావాదేవీల ఛార్జీలపై సుప్రీం కీలక ఆదేశాలు
-
దానం ఎపిసోడ్.. డిఫెన్స్‌లో కాంగ్రెస్, రేవంత్?
సీనియర్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తప్పు చేశారా? కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా? దానం నాగేందర్ పార్టీ మారి ఉండవచ్చు. కాని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో ఫిరాయింపులపై స్పష్టమైన హామీని ఇచ్చింది. ఎవరైనా పార్టీ ఫిరాయించితే రాజ్యాంగం ప్రకారం వారిని అనర్హులుగా చేయాలన్నదే తమ అభిమతమని అందులో తెలిపింది. అలాంటప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉంటే కాంగ్రెస్‌కు ప్రతిష్ట అయ్యేది. అలా చేయలేదు. పైగా ఆయనను సికింద్రాబాద్ నుంచి లోక్‌సభకు కాంగ్రెస్ పక్షాన పోటీచేయించింది. కనీసం అప్పుడైనా రాజీనామా చేయించాల్సింది. ఆయన గెలిచి ఉంటే ఎలాగూ రాజీనామా చేస్తారని అనుకుని ఉండవచ్చు. కాని ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డిలు స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్‌కు ఫిర్యాదు చేసినప్పుడు ఆయన విచారణ పేరుతో కొంత కాలయాపన చేశారన్న భావన ఉంది.నిజానికి మొత్తం తొమ్మిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేసి ఉంటే గౌరవంగా ఉండేది. ఏదో కారణంతో వారిపై అనర్హత వేటు వేయకుండా వారిని రక్షించారన్న విమర్శకు స్పీకర్ గురయ్యారు. మిగిలిన ఎనిమిది మంది కన్నా, దానం నాగేందర్ ఫిరాయింపు మరీ ఓపెన్ అయిపోయినట్లు లెక్క.స్పష్టమైన ఆధారాలు ఎదురుగా కనబడుతుంటే, అసెంబ్లీ వెలుపుల జరిగే పరిణామాలతో సంబంధం లేదని స్పీకర్ అభిప్రాయపడడం ఎంతవరకు హేతుబద్దమో తెలియదు.తదుపరి బీఆర్ఎస్, బీజేపీలు హైకోర్టును ఆశ్రయించాయి. అక్కడ వాదోపవాదాల తదుపరి నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవిపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆ వెంటనే నాగేందర్ దానిని స్వాగతిస్తూ తాను మళ్లీ పోటీకి సిద్దమని అన్నారు. కాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయమో, లేక అదిష్టానం అభిప్రాయమో తెలియదు కాని, హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లారు. హైకోర్టులో తీర్పు రాగానే రాజీనామా చేసి ఉన్నా బాగుండేది. కాని స్పీకర్ తీర్పులో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవచ్చా అన్న మీమాంసలో కాంగ్రెస్ పడింది తప్ప, నైతికంగా తప్పు చేస్తున్న సంగతిని విస్మరించింది. చివరికి సుప్రింకోర్టు తీర్పుతో కాంగ్రెస్ పార్టీకి పరువు పోయినట్లయింది.నాగేందర్ మాత్రం తీర్పును వ్యతిరేకించకుండా పోటీకి రెడీ అని మాట్లాడడం కరెక్టుగా ఉందని చెప్పాలి. అంటే మొత్తం విశ్లేషిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి ఇష్టపడడం లేదన్న సంగతి అర్థం అవుతుంది. లేదా ఆయనకు న్యాయ సలహా ఇచ్చినవారు తప్పు దోవ పట్టించి ఉండాలి. దేశంలో ఇదొక రిఫరల్ జడ్జిమెంట్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో బీజేపీ చేయిస్తున్న ఫిరాయింపులపై విమర్శ చేసే కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా వ్యవహరించి నైతికంగా నష్టపోయినట్లయింది.లోక్ సభలో విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకం పట్టుకు తిరుగుతూ ప్రధానిని విమర్శిస్తున్నారని, అలాంటి వ్యక్తికి ఫిరాయింపుల చట్టం ఏమి చెబుతోందో తెలియదా అని బీఆర్ఎస్, బీజేపీలు ప్రశ్నించడం సహేతుకమే అని చెప్పాలి. ఓవరాల్‌గా చూసినప్పుడు ఈ మొత్తం ప్రక్రియలో నాగేందర్ చేసిన తప్పుకన్నా, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదమే ఎక్కువగా కనిపిస్తుంది.ఇదీ చదవండి: బాబూ.. అమరావతిలో అసలు లెక్కేంటి?ఇంకో సంగతి గుర్తు చేయాలి. 2004లో నాగేందర్‌కు అసిఫ్ నగర్ అసెంబ్లీ టిక్కెట్ కాకుండా సికింద్రాబాద్ లోక్‌సభ టిక్కెట్‌ను ఇచ్చారు. దానిపై ఆయన అసంతృప్తి చెందారు. రాత్రికి రాత్రే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి ఆ పార్టీ టిక్కెట్ తీసుకుని పోటీచేసి అసెంబ్లీకి గెలిచారు. కాని ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్‌తో ఉన్న సాన్నిహిత్యం, కాంగ్రెస్ పవర్లోకి రావడంతో దానం టీడీపీకి దూరం అవ్వడానికి నిర్ణయించుకున్నారు. దానికి అంగీకరించిన వైఎస్ ఈయనతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించారు. నాగేందర్ కూడా అందుకు భయపడలేదు. కాకపోతే ఉప ఎన్నికలో ఓడి పోయి ఉండవచ్చు. కాని ఆయన చట్టం ప్రకారం తప్పు చేయలేదు. అప్పటి మాదిరే దానం రాజీనామాకు సిద్దపడినా కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించలేదా అన్న సంశయం కలుగుతుంది. బీఆర్ఎస్ నుంచి ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు కూడా ఇదే గతి పడుతుందని ఆ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. దానం నాగేందర్ బహిరంగంగా ఎన్నికలలో పోటీచేశారని, అందువల్ల అనర్హత వేటు పడిందని, మిగిలినవారు కాంగ్రెస్‌తో ఉంటున్నా, తాము పార్టీ మారలేదని వాదిస్తున్నారని, దాంతో వారిపై చర్య అంత తేలికగా అవుతుందా అన్న చర్చ ఉంది.సుప్రింకోర్టు తీర్పు తర్వాత సత్యమేవ జయతే అని కేటీఆర్ అనడం బాగానే ఉన్నా, గతంలో బీఆర్ఎస్ వివిధ కారణాలతో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ, సీపీఐ మొదలైన పక్షాల నుంచి కూడా ఫిరాయింపులను ప్రోత్సహించింది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాసయాదవ్‌కు ఏకంగా మంత్రి పదవిని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారు. అవి కూడా తప్పులే అవుతాయి. ఏపీలో అయితే మరీ ఘోరంగా ఫిరాయింపులు జరిగాయి. 2014 టరమ్‌లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని అప్పుడు కూడా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు టీడీపీలో చేర్చుకుని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఆ ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది. అయినా వారు మాట మాత్రంగా కూడా అభ్యంతరం చెప్పలేదు.కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ తదితర పార్టీలు ఫిరాయింపుల విషయంలో అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయన్నది వాస్తవం. చట్టాలు చేసేది ఈ పార్టీలే, వాటిని ఉల్లంఘించి, సాకులు వెదికేది ఈ పార్టీలే. దాంతో దేశంలో రాజకీయ పార్టీల పట్ల ప్రజలలో గౌరవం సన్నగిల్తుతోంది. ఇప్పుడు దానం అనర్హత వేటు వ్యవహారం స్పీకర్ పరిధి దాటి వెళ్లిపోయినట్లే అన్నది న్యాయనిపుణుల అభిప్రాయం. అలాకాకుండా ఇంకా దీనిని సాగదీయడానికి స్పీకర్‌తో కాంగ్రెస్ ప్రయత్నిస్తే అది ఆ పార్టీకి మరింత చేటు తెస్తుంది.ఆయా రామ్, గయారామ్లపై న్యాయ వ్యవస్థ కూడా స్థిరమైన తీర్పులు ఇవ్వడం లేదన్న భావన కూడా లేకపోలేదు. ఫిరాయింపులకు ఆస్కారం లేని విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మంచిది. కాని దురదృష్టవశాత్తు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తున్నాయి. ఏది ఏమైనా నాగేందర్ అనర్హతపై సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించదగింది. కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు దీనిని గుణపాఠంగా తీసుకుంటాయా? లేదా? అన్నది కాలమే తేల్చాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కొబ్బరి.. కాయా? పండా..? కోర్టు మెట్లు ఎక్కించిన ప్రశ్న!
భగవంతునికి భక్తునికి అనుసంధానమైన వాటిల్లో కొబ్బరికాయ ఒకటి. అయితే ఇది పండా? కూరగాయ? డ్రై ఫ్రూటా? ఈ మూడూ కాదా? వినడానికి ఇది చాలా చిన్న ప్రశ్నలానే అనిపిస్తోంది..కానీ ఇదే ప్రశ్న ఓ వ్యాపారిని కోర్టు మెట్లు ఎక్కించింది. కొబ్బరికాయ ‘గ్రీన్ ఫ్రూట్ ’ పరిధిలోకి వస్తుంది కాబట్టి దీనికి పన్ను మినహాయించాలని వ్యాపారి, మినహాయించరాదని మున్సిపల్ అధికారులు.. చివరికి ఈ ప్రశ్న సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఒకటీ రెండూ కాదు– పదేళ్లకు పైగా ఈ వివాదం సాగింది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో దీనిపై ఒక స్పష్టత వచ్చింది.బరూచ్ కొబ్బరి ట్రేడింగ్ కంపెనీకి చెందిన వ్యాపారులు ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి కొబ్బరి బొండాలు, కాయలను దిగుమతి చేసుకుని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విక్రయించేవారు. కొబ్బరికాయ పైన ఉండే డొక్కలు, పీచు తీసేసి వాటిని మార్కెట్‌కు తీసుకు వచ్చేవారు. వాటిలోని నీటిని పానీయంగా, కొబ్బరిని వంటలకు విక్రయించే వారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే, వెళ్లే వస్తువులపై ఆక్ట్రాయ్ పన్నును ఆ కార్పొరేషన్‌కు చెల్లించేలా విధించే వారు. నిబంధనల ప్రకారం కొన్ని వస్తువులకు పన్ను మినహాయింపు ఉండేది. వాటిలో గ్రీన్ ఫ్రూట్స్ ఒకటి. పన్నును వ్యతిరేకించిన వ్యాపారులుమున్సిపల్ కార్పొరేషన్ మొదట్లో కొబ్బరి బొండాలు/కాయలపై 100 కేజీలకు రూ.1 చొప్పును పన్ను విధించేంది. తర్వాత ఈ పన్నును రూ. 5కి పెంచింది. దీనిని కొబ్బరి వ్యాపారులు వ్యతిరేకించారు. కొబ్బరికాయలు కూడా గ్రీన్ ఫూట్స్ పరిధిలోకి వస్తాయి కాబట్టి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనికి మున్సిపల్ అధికారులు అంగీకరించలేదు. కొబ్బరికాయలు ఆ పరిధిలోకి రావని తేల్చి చెప్పారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.హైకోర్టులో వాదనలుగుజరాత్ హైకోర్టు వ్యాపారుల వాదనను అంగీకరించలేదు. కొబ్బరి కాయను గ్రీన్ఫ్రూట్గా పరిగణించలేమని తేల్చింది. పన్ను మినహాయింపు పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆక్ట్రాయ్ నిబంధనల్లోని ఐటెమ్ 55 పరిధిలోకి వస్తుందని పేర్కొంది. అందువల్ల పన్ను చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పుతో సంతృప్తి చెందని వ్యాపారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తీర్పు వెలువరించిన సుప్రీంకొబ్బరి కాయ పైన ఉండే తొక్క లేదా డొక్క... పీచును తొలగించిన తర్వాత గోధుమ రంగులో ఉండే కొబ్బరికాయను గ్రీన్ ఫ్రూట్‌గా పరిగణించొచ్చా? లేదా? ఈ ప్రశ్నే సుప్రీంకోర్టు ముందు నిలిచింది. గ్రీన్ అనే పదానికి సాధారణ అర్థం, సాధారణ ప్రజలు ఫ్రూట్ అనే పదాన్ని ఎలా వినియోగిస్తారనే అంశాన్ని కోర్టు పరిశీలించింది. కోర్టు ఒక ఆసక్తికరమైన సందేహాన్ని ఈ సందర్భంగా వెలిబుచ్చింది. ‘ఒక ఇంట్లో ఎవరైనా వ్యక్తిని ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకురా అంటే? ఈ రెండింటిలో ఏ కేటగిరీ కిందా అయినా కొబ్బరికాయను తీసుకువస్తాడా? అని ప్రశ్నించింది. ఎవరూ కొబ్బరికాయను గ్రీన్ ఫ్రూట్‌గా గుర్తించరు. అందువల్ల అది కేవలం గ్రీన్ ఫ్రూట్ అని చెప్పడం ద్వారా పన్ను మినహాయింపు పొందలేరని కోర్టు స్పష్టం చేసింది. ఇక్కడే మరో వాదన కూడా వచ్చింది. దీన్ని డ్రైఫ్రూట్ కింద పరిగణించొచ్చా? అనే ప్రశ్న తలెత్తింది. దీన్నీ సుప్రీంకోర్టు తిరస్కరించింది. డ్రై ఫ్రూట్ అంటే అదొక ప్రత్యేకమైన వర్గంగా పేర్కొంది. దీన్ని ఆ కేటగిరీలోనూ చేర్చలేమని చెప్పింది. రెండు కేటగిరీల పరిధిలోకి రానందున ఏ కేటగిరీకి చెందని వస్తువులకు వర్తించే ఐటెమ్ 55 రూల్ 14 కింద కొబ్బరికాయను చేర్చవచ్చని పేర్కొంది. దీంతో వీటికి కూడా ఆక్ట్రాయ్ పన్ను విధించొచ్చని స్పష్టం చేసింది. ఈ తరహాలో పలు రాష్ట్రాల్లో సేల్స్ ట్యాక్స్ వంటి వివాదాలు వస్తుంటాయని కావున ఈ కేసును విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని వ్యాపారుల తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఆ అవసరం లేదని ద్విసభ్య బెంచ్ పేర్కొంది. వ్యాపారుల అప్పీల్‌ను కొట్టివేసింది. ఈ కేసు మొత్తం కొబ్బరికాయ గ్రీన్ ఫ్రూటా? కాదా? అనే అంశంపైనే తిరిగింది. చట్టంలో ఓ పదానికి స్పష్టమైన నిర్వచనం, వివరణ లేనప్పుడు సాధారణంగా వాడుకలో ఉన్నవే ఒక్కోసారి కీలకంగా మారుతాయని ఈ తీర్పు స్పష్టం చేస్తుంది. కొబ్బరికాయపై పన్ను వివాదం చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆసక్తికరమైన అంశంగా మారింది.- దిలీప్ మాదిరెడ్డి ఇదీ చదవండి: Andy Allen Success Story: ఎలక్ట్రీషియన్ నుంచి మాస్టర్ చెఫ్ విజేత, రెస్టారెంట్ యజమాని రేంజ్‌కి..! -
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంలో పిల్
ఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై విచారణ జరపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎస్ఐఆర్లో అవకతవకలు, ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడ్డారని పిటిషన్లో పేర్కొన్నారు. ఏకపక్షంగా ఫారం 6లో మార్పులను ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వ్యతిరేకించిన నేపథ్యంలో విచారణ జరపాలని పిటిషన్లో అభ్యర్థించారు. జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాల వల్ల అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయారని పిటిషనర్ పేర్కొన్నారు.మరోవైపు, జ్ఞానేశ్ కుమార్‌ను బాధ్యతల నుంచి తొలగించేందుకు లోక్‌సభ, రాజ్యసభలో తీర్మానం చేయాలని కోరుతూ త్వరలోనే ప్రతిపక్షాలు మరోసారి నోటీసు ఇవ్వనున్నట్లు సమాచారం. జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న మూడో ప్రయత్నమిది కావడం గమనార్హం. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని రూపొందించే ఈ నోటీసును వచ్చే వారం పార్లమెంట్ ఉభ య సభల్లో అందజేసే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.ఇద్దరు కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ప్రచురించిన పరిశోధనాత్మక కథనం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. గత పది నెలల కాలంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్జోషీలు మొత్తం 14 సార్లు వివిధ నిర్ణయాలపై తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా వ్యక్తం చేశారని, అనధికారిక, అక్రమ ఉత్తర్వులంటూ తెలిపినప్పటికీ ఆ నిర్ణయాలు అమలయ్యాయని ఈ కథనం ఆరోపించింది.ఇదీ చదవండి: ఇంకా 24 గంటలే.. సీఈసీ జ్ఞానేశ్‌కు కాక్రోచ్ల డెడ్‌లైన్ -
బూడిదైన ఇవ్వండి అంటే... ఇప్పుడు మీ బ్రతుకులు బూడిద పక్కా... సాయి కృష్ణ పిన్ని సంచలన కామెంట్స్
-
నేడు దానం పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఏం జరగనుంది?
సాక్షి, ఢిల్లీ: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. తెలంగాణ హైకోర్టు తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణకు అంగీకరించింది.బీఆర్ఎస్ టికెట్‌పై 2023లో ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతకు గురయ్యారు. తెలంగాణ హైకోర్టు ఆయన అనర్హతను 2024 ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంటూ ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది.హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని దానం నాగేందర్ సుప్రీంకోర్టును కోరుతున్నారు. కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన తాను బీఆర్ఎస్ను వీడినట్లు కాదని, తాను బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని ఆయన తరఫు వాదనలు ఉన్నాయి. పార్టీ ఆదేశాల మేరకే తాను వ్యవహరించానని పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.ఇదీ చదవండి: ఈసీపై దుమారం.. కేటీఆర్ స్పందన.. -
‘సీఈసీ, ఈసీల’ నియామకంపై పిటిషన్లు
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(ఈసీ) నియామకం విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఈసీ, ఈసీల ఎంపిక ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ని మినహాయిస్తూ 2023లో తీసుకొచ్చిన చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా? వద్దా? అనే అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను ఐదు రోజులపాటు విచారించింది. వీటిని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని అంగీకరించడానికి జస్టిస్ దత్తా నిరాకరించారు. ఇదే ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి అయిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ.. జస్టిస్ దత్తా అభిప్రాయాలతో విభేదించారు. అభిప్రాయ భేదాల కారణంగా.. తదుపరి విచారణ కోసం తగినంత మంది సభ్యులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పరిశీలనకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. మరోవైపు ఇలాంటి రాజ్యాంగపరమైన అంశాల్లో కీలకమైన సమస్యలను పరిష్కరించడానికి శాశ్వత విస్తృత రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్నీ పరిశీలించాలని సీజేఐని ధర్మాసనం కోరింది. 2023 మార్చి 2న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం.. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన ఒక కమిటీ సిఫార్సు మేరకు సీఈసీ, ఈసీలను రాష్ట్రపతి నియమిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల నియామకాలను కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం నుంచి తప్పించే లక్ష్యంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తర్వాత 2023 డిసెంబర్లో పార్లమెంట్లో ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా షరతులు, పదవీకాలం) చట్టం–2023’తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం సీఈసీ, ఈసీ ఎంపికలో సీజేఐ ప్రమేయం ఉండదు. ఎంపిక కమిటీలో సీజేఐ స్థానంలో ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర మంత్రిని చేరుస్తారు. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ దత్తా ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ఇవి రాజ్యాంగ ప్రాముఖ్యత కలిగిన కీలక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని, వీటిని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని జస్టిస్ దత్తా తిరస్కరించారు. కానీ, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ.. జస్టిస్ దత్తా అభిప్రాయాలతో విభేదించారు. ‘‘ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరగాలంటే ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థగా ఉండటమే కాకుండా, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు కూడా కనిపించాలి. రాజ్యాంగ వ్యవస్థ సమగ్రతను, పవిత్రతను కాపాడే సమిష్టి బాధ్యత మంత్రి మండలిదే కాబట్టి ఆర్టికల్ 75(3) ప్రకారం ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్న ఒక మంత్రి, ఒక సున్నితమైన రాజ్యాంగ పదవికి నియామకం విషయంలో ప్రభుత్వ అధినేత అభిప్రాయంతో విభేదిస్తారని ఆశించలేం’’అని జస్టిస్ దత్తా స్పష్టంచేశారు. 2023 నాటి చట్టాన్ని కేంద్రం సమర్థించుకుంది. భారత న్యాయవ్యవస్థలో కొలీజియం వ్యవస్థ ద్వారా న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమిస్తారని గుర్తుచేసింది. దీనిపై జస్టిస్ దత్తా స్పందించారు. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమిస్తారంటూ తరచూ వినిపించే వాదనలో నిజం లేదన్నారు. స్వార్థ శక్తులు ప్రేరేపిత కథనాల ద్వారా ప్రజలకు ఈ విషయాన్ని నూరిపోశాయని ఆక్షేపించారు. అంతేకాకుండా కొలీజియం తీర్మానాల ఆధారంగా ప్రభుత్వం చేసే పక్షపాత నియామకాలను ప్రస్తావించారు. ఈ పక్షపాత వైఖరి కారణంగా ఆ నియామకాలు పవిత్రతను కోల్పోతాయని అన్నారు. న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక శాఖ నుంచి స్వతంత్రంగా ఉండటంతోపాటు స్వయంగా సమర్థతను కలిగి ఉండాలని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశించారని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అంబేద్కర్ ఆశయం అస్పష్టంగా మారి, తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వం.. రాజ్యాంగం స్వతంత్రంగా ఉండాలని ఉద్దేశించిన సంస్థలను తమ నియంత్రణలోకి తీసుకోవడం సౌకర్యంగా భావించిందని జస్టిస్ దత్తా చెప్పారు. శాశ్వత ధర్మాసనం ఏర్పాటు చేయాలి రాజ్యాంగపరమైన అంశాలున్న కేసులను విచారించడానికి ఐదుగురు న్యాయమూర్తులతో శాశ్వత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం భారత ప్రధాన న్యాయమూర్తిని కోరింది. విస్తృత ధర్మాసనాలకు పంపిన కేసుల పరిష్కారంలో అసాధారణ జాప్యం జరుగుతోందని గుర్తుచేసింది. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఒక కేసు చాలాకాలం పాటు పెండింగ్‌లో ఉండటం సంబంధిత సంస్థ ప్రతిష్టకు మంచిది కాదని, కాబట్టి ఆత్మపరిశీలన అవసరమని వెల్లడించింది. గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు ఎప్పుడు పరిష్కారమవుతాయో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందని గుర్తుచేసింది. ఇది తాము కొత్తగా చెబుతున్న సంగతి కాదని.. బాధ్యతాయుతమైన పౌరులు పదేపదే ప్రస్తావిస్తున్నారని తెలియజేసింది. ప్రజల అభిప్రాయాన్ని తాము సమరి్థస్తున్నామని పే ర్కొంది. రాజ్యాంగపరమైన అంశాలను పరిష్కరించడం అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తుల ప్రాథమిక బాధ్యత అని తేల్చిచెప్పింది. -
ఎన్నికల కమిషనర్ల నియామకంపై.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం కేసుపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈసీ నియామక ప్రక్రియపై సందేహం వ్యక్తం చేసింది. ఈసీ స్వతంత్రంగా ఉండడమే కాదు స్వతంత్రంగా కనిపించాలి కూడా అని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. ప్రధాని నామినేట్ చేసిన క్యాబినెట్ మంత్రి, ప్రధానిమంత్రి కి వ్యతిరేకంగా ఓటు వేయలేరు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ల చట్టం 2023ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసింది. -
సాయి కృష్ణ కేసు పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సత్యం గెలిచింది...
-
DGP నిద్ర పోతున్నారా.? సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టు సీరియస్
-
పోలీసుల తీరు ఇలా ఉంటే.. మహిళలు స్టేషన్‌కు వెళ్లగలరా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘రక్షణ కల్పించాల్సిన పోలీసుల తీరు ఇలా ఉంటే.. సామాన్య మహిళలు న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లేందుకు ఎలా సాహసిస్తారు?‘అంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళను వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ మాజీ సీఐ యు.శ్రీనివాసులు రెడ్డి వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. తదుపరి విచారణ ముగిసే వరకు పిటిషనర్‌ను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. అయితే, కేసు దర్యాప్తునకు ఆయన పూర్తిగా సహకరించాలని షరతు విధించింది. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, బాధితురాలికి (రెండో ప్రతివాది) నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో 2021లో తనను ఆశ్రయించిన ఓ వివాహితను అప్పటి జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డి నమ్మించి లోబరుచుకున్నాడనేది ప్రధాన ఆరోపణ. ఆమెను బెదిరించి లైంగికంగా వేధించడంతోపాటు రూ.1.80 కోట్లు వసూలు చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. భౌతికంగా దాడి చేయడమే కాకుండా, బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆరోపించింది. స్థానికంగా కేసు నమోదు కాకపోవడంతో ఆమె డీజీపీని ఆశ్రయించగా కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించి భంగపడ్డ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. లైంగిక దాడి జరగలేదు: సీఐ తరఫు న్యాయవాది శ్రీనివాసులు రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ఇదొక ఆర్థిక లావాదేవీల వివాదమని, బాధితురాలు ఆరోపిస్తున్నట్లుగా ఎలాంటి లైంగిక దాడి జరగలేదని విన్నవించారు. ఐదేళ్లుగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందని, పరస్పర అంగీకారంతోనే ఇద్దరూ కలిసి పర్యటనలకు వెళ్లారని తెలిపారు. బాధితురాలి తరఫు న్యాయవాది వాదిస్తూ.. సీఐ తన హోదాను అడ్డుపెట్టుకుని ఆ మహిళను తీవ్రంగా వేధించాడని, ఇది పరస్పర అంగీకారంతో జరిగిన వ్యవహారం కాదని స్పష్టం చేశారు. నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. -
‘వందేమాతరం’ పాడకపోతే శిక్షించడానికి వీల్లేదు
సాక్షి, న్యూఢిల్లీ: వందేమాతరం పాడడానికి నిరాకరించినందుకు శిక్షించకూడదని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ‘మనఃసాక్షి కారణాల’వల్ల జాతీయ గీతం పాడడానికి నిరాకరించిన పిల్లలకు రక్షణ కల్పించిన 1986 నాటి తీర్పును దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. మతపరమైన కారణాలతో జాతీయ గీతం పాడేందుకు నిరాకరించే వ్యక్తులకు క్రిమినల్ శిక్షలు విధించరాదని మౌఖికంగా తేల్చిచెప్పింది. జాతీయ గీతం ఏది? దాని చరణాలు ఎన్ని? వంటి అంశాలను నిర్ణయించడం కోర్టు పరిధిలో లేదని తెలిపింది. ప్రజల మనఃసాక్షికి సంబంధించిన అభ్యంతరాలను, ముఖ్యంగా మత విశ్వాసాల కారణంగా గీతాన్ని పాడలేని వ్యక్తుల హక్కులను పరిశీలిస్తామని పేర్కొంది.వందేమాతరం పూర్తి గీతాన్ని పాడడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ కర్ణాటక సంగీత విద్వాంసుడు టి.ఎం.కృష్ణ దాఖలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనాతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. 1971 నాటి ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టూ నేషనల్ హానర్ యాక్ట్’కు 2026లో చేసిన సవరణను సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ‘బిజోయ్ ఇమ్మాన్యుయేల్’ తీర్పును పాటించాలి విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 1986లో ‘బిజోయ్ ఇమ్మాన్యుయేల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో మనఃస్సాక్షి కారణాలతో జాతీయ గీతాన్ని పాడని విద్యార్థుల హక్కులను రక్షించడాన్ని గుర్తుచేసింది. అదే సూత్రం ప్రస్తుత వ్యవహారంలోనూ వర్తిస్తుందని పేర్కొంది. మతపరమైన కారణాలతో వందేమాతరాన్ని పాడని వ్యక్తిపై క్రిమినల్ చర్యలు ఉండకూడదని వెల్లడించింది. ‘జాతీయ గీతం ఏది? ఎన్ని చరణాలు ఉండాలి? అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వ పరిధిలోని అంశమని తెలియజేసింది. తమ హక్కులకు విఘాతం కలుగుతోందని భావించే వ్యక్తి లేదా మనఃసాక్షి కారణంగా జాతీయ గీతం పాడేందుకు నిరాకరించే వారిని శిక్షించకూడదని స్పష్టంచేసింది. 1986 నాటి తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. చివరి నాలుగు చరణాలపైనే అభ్యంతరం కృష్ణ దాఖలు చేసిన పిటిషన్లో ప్రధానంగా వందేమాతరంలోని చివరి నాలుగు చరణాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ చరణాల్లో దుర్గ, లక్షి్మ, సరస్వతి వంటి హిందూ దేవతల ప్రస్తావనలు ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అలాంటి చరణాలను పౌరులు తప్పనిసరిగా పాడేలా చేయడం అంటే ఒక నిర్దిష్ట మతపరమైన లేదా భావజాలపరమైన విశ్వాసాన్ని వ్యక్తం చేయాల్సిందిగా బలవంతం చేయడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇది రాజ్యాంగంలోని లౌకికవాద సూత్రానికి విరుద్ధమని పేర్కొన్నారు. ‘నేషనల్ సాంగ్’ అంటే ఏమిటో చట్టంలో స్పష్టత లేదు ‘‘2026 నాటి సవరణ చట్టంలో ‘నేషనల్ సాంగ్’అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించలేదు. దీనివల్ల చట్టాన్ని దుర్వీనియోగం చేసే అవకాశం ఉంది. అలాగే కేంద్ర హోంశాఖ జారీ చేసిన మెమోరాండం గెజిట్‌లో ప్రచురించలేదు’’అని పిటిషనర్ కృష్ణ తరపు న్యాయవాది డాక్టర్ ఎస్.మురళీధర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వందేమాతరం విషయంలో ఇంతకాలం రెండు చరణాలకే ఉన్న సంప్రదాయాన్ని ప్రభుత్వం ఒక్కసారిగా ఆరు చరణాలకు మార్చిందని వాదించారు. దీనిపై జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించకుండా సవరణను తొందరగా తీసుకొచ్చారని పేర్కొన్నారు. ‘డిస్టర్బెన్స్’అనే పదం అస్పష్టం 2026 జనవరి 28, జూలై 9 తేదీల్లో కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలను కూడా కృష్ణ సవాలు చేశారు. ఈ ఆదేశాల ప్రకారం వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలను అధికారిక వెర్షన్‌గా పేర్కొని, ప్రభుత్వ, అధికారిక, సాంస్కృతిక, వేడుకల్లో సామూహికంగా ఆలపించేందుకు మార్గదర్శకాలు ఇచ్చినట్లు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలకు 2026 సవరణ చట్టంలోని శిక్షా నిబంధనలను కలిపి చూస్తే.. ఆరు చరణాలను పాడటం తప్పనిసరి చేసినట్లవుతుందని కృష్ణ వాదించారు. సవరించిన చట్టంలోని డిస్టర్బెన్స్ (అంతరాయం) అనే పదం స్పష్టత లేకుండా ఉందని కృష్ణ తన పిటిషన్లో పేర్కొన్నారు.నక్సలైట్ల ఆలోచనల ప్రకారం కాదు అమెరికా జాతీయ గీతంలో ‘ఇన్ గాడ్ వి ట్రస్ట్’వంటి పదాలు ఉన్నాయని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి ప్రస్తావించారు. అమెరికాను సానుకూల లౌకికవాదానికి ఉదాహరణగా పేర్కొంటారని గుర్తుచేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలను వ్యతిరేకించారు. ‘‘లౌకికవాదం ఇంత సంకుచితంగా ఉండకూడదు. చట్టాల రూపకల్పన అనేది రా జ్యాంగం ప్రకారమే జరుగుతుంది. నక్సలైట్ల ఆలోచనలకు అనుగుణంగా చట్టాల రూపకల్పన ఉండకూడదు’’అని వ్యాఖ్యానించారు.తుషార్ మెహతా వ్యాఖ్యలతో కోర్టు ప్రాంగణం ఒక్కసారిగా వేడెక్కింది. మురళీధర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని తుషార్ మెహతాను కోరారు. ప్రభుత్వ న్యాయాధికారి అలా మాట్లాడడం సరైంది కాదన్నారు. అయితే, సొలిసిటర్ జనరల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. చట్టాన్ని గౌరవించని వారి గురించి తాను మాట్లాడనని స్పష్టం చేశారు. ‘‘నేను చెప్పినదాన్నే మళ్లీ చెప్పగలను. ఎవరైనా చట్ట ప్రకారమే నడుచుకోవాలి. నేను అన్నదానికి నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. అది రాజ్యాంగబద్ధమైన మార్గమని చెప్పాను.నక్సలైట్లు కోరుకునేది కాదని చెప్పాను. అందుకు నాకు ఎలాంటి విచారం లేదు’’అని సొలిసిటర్ జనరల్ అన్నారు. ఇద్దరి మధ్య వాదోపవాదనలు జరుగుతున్న సమయంలో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకున్నారు. ‘‘మనం రాజ్యాంగ వ్యాఖ్యానికి సంబంధించిన న్యాయపరమైన అంశానికే పరిమితం అవుదాం’’అని సూచించారు. ఆ తర్వాత కూడా మురళీధర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, ‘‘ఆ వ్యాఖ్య లను మేం పరిగణనలోకి తీసుకోవడం లేదు. రాజ్యాంగ అంశానికే పరిమితం అవుతున్నాం’’అని జస్టిస్ బాగ్చి పేర్కొన్నారు. -
వందేమాతరం పూర్తిగా పాడని వారిపై క్రిమినల్ చర్యలు వద్దు: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ గీతం ‘వందేమాతరం’ ఆలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వందేమాతరంలోని అన్ని చరణాలు తప్పనిసరిగా పాడాలనే నిబంధనపై స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అన్ని చరణాలు పాడని వారిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.వందేమాతరం గీతంలోని ఆరు చరణాల ఆలాపనను తప్పనిసరి చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.వ్యక్తిగత నిర్ణయమే..వందేమాతరంలో ఎన్ని చరణాలు పాడాలనేది పూర్తిగా ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమని ధర్మాసనం పేర్కొంది. అన్ని చరణాలు ఆలపించని వారిపై క్రిమినల్ కేసులు లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవడం తగదని తేల్చిచెప్పింది. ఈ అంశానికి సంబంధించి వందేమాతరం సవరణ చట్టం, అలాగే దీనికి సంబంధించిన మార్గదర్శకాలపై పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై రాతపూర్వక సమాధానం సమర్పించడానికి కేంద్రానికి రెండు వారాల గడువు ఇచ్చింది. -
దానం అనర్హత పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తనపై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరగనుంది. ఈ కేసును అత్యవసరంగా విచారించాలన్న దానం తరఫు న్యాయవాది విజ్ఞప్తి, విచారణను బుధవారం చేపట్టాలన్న ప్రతివాదుల అభ్యర్థన మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం దానం తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఈ వ్యవహారాన్ని ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హత వేటు వేసిందని, వాస్తవానికి స్పీకర్ ఆ పిటిషన్‌ను ముందే తిరస్కరించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ తరఫున కాకుండా వేరొకరి ఫిర్యాదు మేరకు ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తే ఇబ్బందులు వస్తాయని, కాబట్టి మంగళవారమే ఈ కేసును అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే, ప్రతివాదుల తరఫు న్యాయవాది కల్పించుకుని.. ఈ విచారణను మంగళవారం కాకుండా బుధవారం చేపట్టాలని కోరారు. అనంతరం ధర్మాసనం విచారణ బుధవారం చేపడతామని స్పష్టం చేసింది. కండువా కప్పుకుంటే పార్టీ మారినట్లా? హైకోర్టు తీర్పుపై శనివారం మధ్యాహ్నం సుప్రీంకోర్టులో దానం నాగేందర్ ఎస్ఎల్పీ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో స్పీకర్ తీసుకునే నిర్ణయాలను న్యాయస్థానాలు సమీక్షించడానికి వీల్లేదన్నది ఆయన ప్రధాన వాదన. స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని, అందులో ఆర్టీకల్ 226 కింద హైకోర్టు జోక్యం చేసుకోకూడదని అప్పీలులో పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకోలేదని, కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. కేవలం మెడలో మూడు రంగుల కండువా వేసుకున్నంత మాత్రాన కాంగ్రెస్‌లో చేరినట్లు కాదన్నారు. దానం పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనలు కూడా వినాలని కోరుతూ ఏలేటి మహేశ్వర్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
ఒక్కరోజూ కలిసి లేరు... విడిపోవడానికి 20 ఏళ్లు! ట్విస్ట్ ఏంటంటే?
ఇదో విచిత్రమైన విడాకుల కేసు. పెళ్లి జరిగింది కానీ, ఇద్దరూ ఒక్క రోజూ కలిసి జీవించలేదు, కాపురం చేయలేదు. దాంపత్య జీవితం మొదలుకాకముందే వారి వివాహ బంధం ముగిసిపోయింది. అయితే వీరు వేరు పడడానికి, విడాకులు తీసుకోవడానికి 20 ఏళ్లు పట్టింది. కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ కేసు నడిచింది. చివరికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి సుప్రీంకోర్టు ఈ వివాహాన్ని రద్దు చేసి, ఈ కేసుకు ముగింపు పలికింది.తమిళనాడుకు చెందిన శివశంకరన్, సంతిమీనాల్కు 2002లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఆమె అత్తారింటికి వెళ్లలేదు. ఎవరికీ చెప్పకుండా పెళ్లి రోజు రాత్రి కల్యాణమండపం నుంచి సొంతూరికి వెళ్లిపోయింది. మరుసటి రోజు బంధువులు ఆమెను తిరిగి తీసుకొచ్చి కాపురం చక్కబెట్టేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. పెళ్లి ఆమె సమ్మతితో జరగలేదని భావిస్తోందని, అందుకే ఈ విధంగా చేస్తోందని భర్త పేర్కొన్నాడు. భార్య ప్రవర్తనతో తాను మానసికంగా కుంగిపోయానని పేర్కొంటూ హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(1)(ఐ–ఏ)కింద 2002లోనే విడాకుల నోటీసు పంపాడు.వివాహ పునరుద్ధరణ కోరిన భార్య‘అదనపు కట్నం కోసం తనను వేధించారని, తన భర్త నుంచి అతని సోదరులే తనని దూరం చేశారని సంతిమీనాల్ ఆరోపించారు. వివాహ పునరుద్ధరణ కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు..ఆమె భర్త సోదరులపై చేసిన ఆరోపణలు మౌఖికంగా తప్ప సాక్ష్యాధారాలను సమర్పించలేదు. భార్యభర్తలు కలిసి జీవించకపోవడం, వివాహ పునరుద్ధరణ కోసం చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడం తదితర కారణాలను దృష్టిలో ఉంచుకుని 2008లో ట్రయల్ కోర్టు విడాకులు మంజూరు చేసింది. అప్పటికి వారికి వివాహం జరిగి ఆరేళ్లు.ఆరు రోజులకే రెండో పెళ్లివిడాకుల తీర్పు వచ్చిన ఆరు రోజులకే భర్త రెండో వివాహం చేసుకున్నాడు. విడాకుల తీర్పుపై మొదటి భార్య అప్పీల్‌కు Ðð ళ్లింది. అప్పిలేట్కోర్టు ఆమె వాదనను అంగీకరిస్తూ వివాహ బంధాన్ని కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. విడాకుల డిక్రీని రద్దు చేసింది. భర్త ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేశాడు. అప్పీలు కోర్టు తీర్పును పక్కన పెట్టి, ట్రయల్ కోర్టు ఇచ్చిన విడాకుల డిక్రీని సమర్థిస్తూ హైకోర్టు 2018లో తీర్పు ఇచ్చింది. అప్పటికే వారికి పెళ్లయి 15 సంవత్సరాలకు పైగా గడిచిపోయాయి.రివ్యూ పిటిషన్ దాఖలువివాహ బంధం కొనసాగడం లేదన్న ఒక్క కారణంతో విడాకులు మంజూరు చేసే అధికారం ట్రయల్, హైకోర్టులకు లేవని పేర్కొంటూ ఆమె రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. చివరకు ఈ వివాదం సుప్రీంకోర్టు చేరింది. భర్త నుంచి ఎటువంటి మెయింటెనెన్స్ కోరడం లేదని, రెండో వివాహ స్థితిని ప్రభావితం చేయాలని మొదటి భార్య భావించడం లేదని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చాడు. అయితే ‘మొదటి వివాహం ముగిసిపోయిందనే వాదనను ఆమె సమ్మతించడం లేదని పేర్కొన్నాడు.’ ఈ దశలో ఏం చేయాలనేదే సుప్రీంకోర్టు ముందున్న అసలు సమస్య.ఆర్టికల్ 142ని వినియోగించుకున్న ‘సుప్రీం’భర్తతో కలిసి ఉంటానని భార్య చెప్పినప్పటికీ ఏళ్ల తరబడి ఆమె వేరుగా ఉంటోంది. వారి బంధం కొనసాగించేందుకు మధ్యవర్తుల ప్రయత్నాలూ ఫలించలేదు. ఈ కారణాలతో వివాహ బంధం కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదని కోర్టు నిర్ధారణకు వచ్చింది. పైగా ఆర్టీఐ కింద భర్త వ్యక్తిగత వివరాలు కోరడం, రెండో వివాహంపై భర్త పని చేసే కార్యాలయ ఉన్నతాధికారులకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం. ఐపీసీ సెక్షన్ 494 కింద కేసు పెట్టడం వంటి అంశాలను సుప్రీంకోర్టు పరిశీలించింది. కేవలం విడిగా ఉన్నారనే అంశమే కాకుండా, ఇతర వాటినీ పరిశీలించింది. తిరిగి చక్కదిద్దలేని విధంగా వివాహ బంధం వికటించిందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు– భారతరాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాల్ని వినియోగించుకుని వారికి విడాకులు మంజూరు చేసింది. వారి వివాహ బంధానికి ముగింపు పలికింది. దీంతో పాటు ఆమె ఆర్థిక ప్రయోజనాలను కాపాడడానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఆమెకు శాశ్వత భరణం ఏకమొత్తం ఒకేసారి చెల్లించాలని ఆదేశించింది.ఈ కేసులో కేవలం ఏళ్ల తరబడి విడిగా ఉండడం, మానసిక క్రూరత్వాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోలేదు. ఈ రెండు ఉన్న అన్నీ కేసుల్లోనూ ఆర్టికల్ 142 కింద విడాకుల మంజూరుకు అవకాశం లేదు. ప్రత్యేక పరిస్థితులను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కలిసి జీవించలేని ఇద్దర్ని ఒక వివాహ బంధం పేరుతో బంధించి ఉంచడం కంటే విడివిడిగా అయినా ప్రశాంత జీవితం గడపడమే మేలని భావించింది. వారి వివాహ బంధానికి, సుదీర్ఘన్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. ఇద్దరికీ కొత్త జీవితానికి మార్గం చూపింది.- దిలీప్ మాదిరెడ్డిఇదీ చదవండి: కూతురి కోసం తండ్రి మొక్కు.. 75 ఏళ్లుగా దేశానికే పండుగ! -
హిందీ భాషకు మేం వ్యతిరేకం కాదు.. సుప్రీంకోర్టు వ్యాఖ్యల వేళ ఉదయనిధి కౌంటర్
చెన్నై: హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకించడం అంటే ఆ భాషకు వ్యతిరేకం కావడం కాదని తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. తాము దేశం నుంచి విడిగా వ్యవహరించడం లేదని, రాష్ట్ర భాషా ప్రత్యేకతను కాపాడుకుంటున్నామని చెప్పారు. హిందీ నేర్చుకోవడానికీ దేశభక్తికీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రాష్ట్రాలు తమకు అనుగుణమైన భాషా విధానాలను అనుసరించేందుకు అవకాశం కల్పించడం దేశ సమైక్యతను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు భూమిని గుర్తించే అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తమిళనాడు తన వైఖరిని పునఃపరిశీలించాలని సూచించిన నేపథ్యంలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు గడ్డపై హిందీ నేర్పించకూడదనే ధోరణి ఉండకూడదు అని జస్టిస్ బి.వి. నాగరత్న వ్యాఖ్యానించారు. కేంద్రం, రాష్ట్రం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ధర్మాసనం సూచించింది. నవోదయ విద్యాలయాలు విద్యార్థులకు మరో విద్యా అవకాశాన్ని కల్పిస్తాయని పేర్కొంటూ.. పాఠశాలల ఏర్పాటుకు భూమిని గుర్తించేందుకు తమిళనాడుకు మరో మూడు నెలల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.ఈ నేపథ్యంలో ఉదయనిధి రెండు పేజీల ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు హిందీకి వ్యతిరేకం కాదని, హిందీని బలవంతంగా రుద్దడాన్నే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. తమిళనాడు రెండు భాషల విధానంతోనే విద్య, ఉపాధి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు. హిందీ తెలియకపోయినా తమిళులు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారని, ఇస్రోలోనూ పలువురు కీలక పదవుల్లో ఉన్నారని ఉదాహరించారు. తమిళనాడులో ఇప్పటికే పేద, వెనుకబడిన విద్యార్థులకు విద్య అందించే పాఠశాలలు ఉన్నందున నవోదయ విద్యాలయాల అవసరం లేదని ఉదయనిధి తెలిపారు. మూడు భాషల విధానం అమలయ్యే నవోదయ పాఠశాలలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించాలని కోరారు. ఈ అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి వ్యతిరేక తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు.ఇదే సమయంలో సమగ్ర శిక్షా పథకం కింద తమిళనాడుకు రావాల్సిన రూ.3,548 కోట్లను మూడు భాషల విధానాన్ని అంగీకరించలేదనే కారణంతో కేంద్రం నిలిపివేసిందని ఉదయనిధి ఆరోపించారు. రాష్ట్రం రెండు భాషల విధానాన్ని కొనసాగిస్తున్నందుకు విద్యా నిధులను నిలిపివేయడం సరికాదని అన్నారు.ఇదీ చదవండి: తమిళనాట ట్విస్ట్.. విజయ్‌కు కొత్త టెన్షన్! -
దానం నాగేందర్ ఎపిసోడ్.. సుప్రీంలో బీఆర్ఎస్ కేవియట్ పిటిషన్
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత పిటిషన్ నేపథ్యంలో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. దానం నాగేందర్ పిటిషన్ దాఖలు చేస్తే తమ వాదనలు వినాలని కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కాగా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీకి దిగడంతో దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. -
సుప్రీం కోర్టుకు దానం నాగేందర్ ..?
-
పన్ను చెల్లింపుదారులకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్
ఇన్కమ్ టాక్స్ సెటిల్మెంట్ కమిషన్ (ఐటీఎస్సీ) తుది ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అదే అంశాన్ని లేదా పన్ను వివాదాన్ని అసెస్సింగ్ ఆఫీసర్లు (ఏఓ) మళ్లీ రీఓపెన్ చేసి పునపరిశీలించడం (రీఅసెస్మెంట్) చెల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చట్టసభలు (పార్లమెంట్) ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్‌లోని చాప్టర్ XIX-A రూపకల్పనలో ఇటువంటి చర్యలను ఏమాత్రం ఊహించలేదని కోర్టు తేల్చిచెప్పింది. జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టి, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం ‘అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ వర్సెస్ ఎం/ఎస్ ఒమాక్స్ లిమిటెడ్’ కేసులో పన్ను శాఖ దాఖలు చేసిన అప్పీలును కొట్టివేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.కేసు నేపథ్యంరియల్ ఎస్టేట్ సంస్థ ఒమాక్స్ లిమిటెడ్ 2006-07 అసెస్మెంట్ సంవత్సరానికి గాను హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి సెక్షన్ 80-IB(10) కింద రూ.78.99 కోట్ల మినహాయింపు పొందింది. అనంతరం పన్ను వివాద పరిష్కారం కోసం కంపెనీ సెటిల్మెంట్ కమిషన్‌ను ఆశ్రయించగా 2008 మార్చిలో కమిషన్ తుది తీర్పునిస్తూ టాక్సబుల్ ఇన్‌కమ్‌ను ఖరారు చేసింది. అయితే, 2009 డిసెంబర్లో పన్ను శాఖ నిర్వహించిన సర్వే ఆధారంగా సెక్షన్ 148 కింద అసెస్సింగ్ ఆఫీసర్ రీఓపెన్ నోటీసులు ఇచ్చి, మినహాయింపులను నిరాకరిస్తూ రూ.65.65 కోట్లను అదనపు ఆదాయంగా చేర్చారు.దీన్ని సవాలు చేస్తూ ఒమాక్స్ లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు రీఓపెనింగ్ నోటీసులను రద్దు చేసింది. పన్ను శాఖ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ పన్ను శాఖ అప్పీలును తోసిపుచ్చింది.ధర్మాసనం కీలక వ్యాఖ్యలుసెక్షన్ 245D(1) కింద సెటిల్మెంట్ దరఖాస్తును కమిషన్ ఆమోదించిన క్షణం నుంచే ఆ కేసుపై పూర్తి అధికార పరిధి కమిషన్‌కు మాత్రమే ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ సెక్షన్ 143(2), 148, లేదా 154ల కింద అసెస్సింగ్ ఆఫీసర్లకు మళ్లీ స్వతంత్ర విచారణ అధికారాలు ఇస్తే సెటిల్మెంట్ కమిషన్‌కు రాజ్యాంగబద్ధంగా లభించిన తుది నిర్ణయ పునాదే దెబ్బతింటుంది. సెటిల్మెంట్లో మోసం లేదా వాస్తవాల సమర్పణలో తప్పుదోవ పట్టించారని పన్ను శాఖ భావిస్తే సెక్షన్ 245D(6) కింద సెటిల్మెంట్ కమిషన్నే ఆశ్రయించాలి తప్ప అసెస్సింగ్ ఆఫీసర్లు నేరుగా రీఓపెన్ చేయలేరని కోర్టు స్పష్టం చేసింది. ఒమాక్స్ విషయంలో పన్ను శాఖ దాఖలు చేసిన సెక్షన్ 245D(6) పిటిషన్‌ను కూడా కమిషన్ ఇప్పటికే తిరస్కరించిందని సుప్రీంకోర్టు గుర్తుచేసింది.ఇదీ చదవండి: నగవులు నిజమని నమ్మేదా? -
విద్యా సంస్థల నియంత్రణ... కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీస్
న్యూఢిల్లీ: పద్నాలుగేళ్ల లోపు పిల్లలకు మతపరమైన, సాధారణ విద్యనందించే సంస్థల నియంత్రణ విషయంలో ఆదేశాలు పాటించకపోవడంపై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర విద్యాశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. నాలుగువారాల్లోగా సమాధానమివ్వాలని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్నాగూలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. విద్యాశాఖ కార్యదర్శి టి.కె.అనిల్‌కుమార్ తానిచ్చిన విజ్ఞప్తిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడాన్ని అశ్వినికుమార్ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది సవాలు చేయడంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వానికి తన విజ్ఞప్తిని సమర్పించాలని సుప్రీంకోర్టు మే 11వ తేదీ ఉపాధ్యాయ్‌కు సూచించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. న్యాయవాది అశ్వినీ దూబే ద్వారా దాఖలైన ఈ పిటిషన్లో ‘‘14 ఏళ్ల లోపు పిల్లలకు మత సామరస్య, మతపరమైన సూచనలిచ్చే ప్రతి విద్యాసంస్థ రిజిస్టర్ అయ్యేలా, గుర్తింపు కలిగి ఉండేలా, పర్యవేక్షణ, నిఘాలకు అనుకూలంగా ఉండేలా కేంద్రం తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలి’’ అని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగంలోని ఆర్టిక్ 21ఏ, ఆర్టిక్ 39(ఎఫ్), 45, 51–ఏ(కే)ల స్ఫూర్తితో ఈ చర్యలు తీసుకోవాలని కోరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 మైనార్టీలకు ఎలాంటి ప్రత్యేక, అదనపు హక్కులు కల్పించవని, ఆర్టికల్ 19(1)(జీ) కింద ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, వాణిజ్యాల్లో స్వేచ్ఛ మాత్రమే లభిస్తుందని పిటిషనర్ వాదించారు. ‘‘ఆర్టికల్ 30 అనేది ఆర్టికల్ 19 (1)(జీ) పునరుద్ఘాటన అని ప్రకటించాలని, దానిద్వారా ప్రత్యేక, అదనపు హక్కులు, ప్రయోజనాలు, ప్రత్యేతలు లభించవని ఆదేశించేలా చేయాలి’’ అని కోరింది. ‘‘పిల్లలు ఈ దేశానికి వెన్నెముక అని పిటిషనర్ గుర్తిస్తున్నారు. వారి లేత వయసు కారణంగా తొందరగా ప్రభావితమయ్యే అవకాశమూ ఉంది కాబట్టి ప్రభుత్వానికి వారిపట్ల ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం. రిజిస్టర్ కాని విద్యా సంస్థలు దేశ భవిష్యత్తు అయిన పిల్లల మెదళ్లను తప్పుదోవ పట్టించేందుకు, నియంత్రించేందుకు అవకాశాలు ఉంటాయి’’ అని స్పష్టం చేసింది. ఉత్తరప్రదరేశ్ సరిహద్దు జిల్లాల్లో తాను విస్తృతంగా పర్యటించానని, అక్కడ రిజిస్టర్ కానీ, గుర్తింపులేని సంస్థలు అనేకం నడుస్తున్నాయని ఉపాధ్యాయ్ తన పిటిషన్లో తెలిపారు. ఎలాంటి పర్యవేక్షణ, నియంత్రణల్లేకుండా ఈ సంస్థలు లాభాలు దండుకుంటున్నాయని ఆరోపించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు మే నెల 11న కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. అయితే కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఉపాధ్యాయ్ మళ్లీ ఆశ్రయించడంతో అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. -
మధ్యంతర ఎన్నికల వేళ.. ట్రంప్‌కు బిగ్ షాక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టు ద్వారా ఓటు వేసే అమెరికన్లకు ఇకపై కొత్త నిబంధనలు పెట్టాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రయత్నానికి కోర్టు అడ్డుకట్ట వేసింది. నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందే ఈ నిబంధనలను అమలు చేయాలని ప్రభుత్వం భావించినా.. సర్వోన్నత న్యాయస్థానం అందుకు అనుమతించలేదు. దీంతో మెయిల్ బ్యాలెట్లపై ట్రంప్ ప్రభుత్వం తీసుకురావాలనుకున్న మార్పులు ప్రస్తుతానికి నిలిచిపోయాయి.ట్రంప్ మార్చిలో జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆధారంగా యూఎస్ పోస్టల్ సర్వీస్ (USPS) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం.. మెయిల్ బ్యాలెట్లు పొందే ఓటర్ల జాబితాలను రాష్ట్రాలు పోస్టల్ సర్వీస్‌కు అందించాలి. అలాగే బ్యాలెట్లను పంపేందుకు, తిరిగి స్వీకరించేందుకు USPS ఆమోదించిన ప్రత్యేక కవర్లనే ఉపయోగించాలి. వాటిపై ప్రత్యేక బార్కోడ్ ఉండాలి. రాష్ట్రాలు అందించే జాబితాలో పేరు లేని ఓటర్ల బ్యాలెట్లను లేదంటే నిబంధనలకు అనుగుణంగా లేని బ్యాలెట్లను పోస్టల్ సర్వీస్ తిరస్కరించే అవకాశం ఉండేది.కోర్టుల తలుపు తట్టిన రాష్ట్రాలుఈ నిబంధనలపై డెమొక్రాట్ల పాలనలో ఉన్న పలు రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీతో పాటు ఓటింగ్ హక్కుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కొత్త నిబంధనల వల్ల చట్టబద్ధంగా ఓటు వేసే వేలాది మంది ఓటర్ల బ్యాలెట్లు కూడా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని, ఎన్నికల సమయంలో గందరగోళం తలెత్తుతుందని వారు వాదించారు.బోస్టన్లోని ఫెడరల్ జడ్జి ఇందిరా తల్వానీ సెప్టెంబర్ 4న ఈ నిబంధనల అమలును నిలిపివేశారు. ఎన్నికల నిర్వహణలో రాష్ట్రాలకే ప్రధాన అధికారం కల్పించే అమెరికా రాజ్యాంగానికి ఈ నిబంధనలు విరుద్ధంగా ఉండే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొత్త విధానాలను అమలు చేయడం రాష్ట్రాలకు ఆచరణాత్మకంగా కూడా కష్టమని తెలిపారు.దీనిపై ట్రంప్ ప్రభుత్వం అప్పీల్ చేసినా.. 1వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ కూడా దిగువ కోర్టు ఆదేశాలను నిలిపివేయడానికి నిరాకరించింది. కొత్త నిబంధనల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని, అదే సమయంలో ఓటింగ్ మోసాలను అడ్డుకోవడంలో పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది.సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బకింది కోర్టులతో చుక్కెదురు కావడంతో.. ట్రంప్ ప్రభుత్వం సెప్టెంబర్ 6న అత్యవసర పిటిషన్‌తో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మెయిల్ వ్యవస్థను ఎన్నికల మోసాలకు ఉపయోగించకుండా అడ్డుకోవడానికి ఈ నిబంధనలు అవసరమని వాదించింది. అయితే సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో దిగువ కోర్టు విధించిన నిషేధం కొనసాగనుంది.ఈ నిర్ణయంపై ఇద్దరు కన్జర్వేటివ్ న్యాయమూర్తులు శామ్యూల్ అలిటో, క్లారెన్స్ థామస్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. నిబంధనలపై ప్రభుత్వం చేస్తున్న అప్పీల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని అలిటో అభిప్రాయపడ్డారు. మరోవైపు జస్టిస్ బ్రెట్ కవనాగ్.. USPSకు ఇలాంటి నిబంధనలు రూపొందించే అధికారం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నప్పటికీ, 2026 ఎన్నికలకు ముందు రాష్ట్రాలు, స్థానిక ఎన్నికల అధికారులు వాటిని అమలు చేసేందుకు తగిన సమయం లేదన్నారు.మెయిల్ ఓటింగ్‌పైనే ఎందుకింత ఫోకస్?అమెరికా ఎన్నికల్లో మెయిల్ ద్వారా ఓటింగ్‌కు గణనీయమైన ప్రాధాన్యం ఉంది. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లో ఏదో ఒక రూపంలో మెయిల్ ఓటింగ్ అందుబాటులో ఉంది. 29 రాష్ట్రాల్లో ఎలాంటి కారణం చెప్పకుండానే ఓటర్లు మెయిల్ బ్యాలెట్ కోరుకోవచ్చు. మరో ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తిగా మెయిల్ విధానంలోనే జరుగుతున్నాయి.డెమొక్రాటిక్ ఓటర్లు మెయిల్ బ్యాలెట్లను రిపబ్లికన్ల కంటే ఎక్కువగా ఉపయోగిస్తారని పలు సర్వేలు సూచిస్తున్నాయి. దీంతో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు మెయిల్ ఓటింగ్‌పై విధించే ఆంక్షలు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్‌పై నియంత్రణ కోసం రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న సమయంలో ఈ తీర్పు వెలువడింది.ట్రంప్ చాలాకాలంగా మెయిల్ ఓటింగ్ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆయన గతంలో చేసిన పలు ఆరోపణలకు ఆధారాలు లేవని విమర్శలు వచ్చాయి. ఆసక్తికరంగా.. ట్రంప్ స్వయంగా కూడా గతంలో మెయిల్ ద్వారా ఓటు వేశారు.మెయిల్ బ్యాలెట్లపై పోరాటం ట్రంప్ పరిపాలనకు, రాష్ట్రాల అధికారాలకు మధ్య జరుగుతున్న విస్తృత న్యాయపోరులో మరో కీలక పరిణామంగా మారింది. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉండాలన్న ప్రశ్నను కూడా ఈ వివాదం మరోసారి ముందుకు తెచ్చింది.ఇదీ చదవండి: అంతా బూటకం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు -
ముంబై పేలుళ్ల కేసు.. అబూ సలేంకు సుప్రీంకోర్టు ఝలక్!
న్యూఢిల్లీ: ముంబై 1993 వరుస పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూ సలేం ముందస్తు విడుదలకు చేసిన ప్రయత్నానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. 25 ఏళ్ల జైలు శిక్షను ఇప్పటికే పూర్తి చేశానంటూ సలేం దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బాంబే హైకోర్టు ఏప్రిల్ 2026లో ఇచ్చిన తీర్పును సమర్థించింది.పోర్చుగల్ నుంచి భారత్‌కు అప్పగించే సమయంలో అక్కడి ప్రభుత్వానికి భారత్ ఇచ్చిన హామీని సలేం తన పిటిషన్లో ప్రధానంగా ప్రస్తావించాడు. తనను భారత్‌కు అప్పగిస్తే మరణశిక్ష విధించబోమని, అలాగే 25 ఏళ్లకు మించి జైలులో ఉంచబోమని 2002లో భారత్ హామీ ఇచ్చిందని పేర్కొన్నాడు. 2005 నవంబర్ 11న అతడిని పోర్చుగల్ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. తాను విచారణ ఖైదీగా గడిపిన కాలం, శిక్ష అనుభవించిన కాలం, మంచి ప్రవర్తనకు లభించిన రిమిషన్ అన్నింటినీ కలిపితే 2025 మార్చి 31 నాటికే 25 ఏళ్లు పూర్తయ్యాయని సలేం వాదించాడు. అందువల్ల ఇకపై తనను జైలులో ఉంచడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ముందస్తు విడుదల కోరాడు.అయితే, ఈ వాదనను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. సలేం పిటిషన్ ముందుగానే దాఖలైందని, 25 ఏళ్ల వ్యవధి 2030లో పూర్తవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో సలేం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. గతంలో 2022లో ఇదే అంశంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. సలేం 25 ఏళ్ల జైలు కాలాన్ని పూర్తి చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అతడి ముందస్తు విడుదలను నిర్ధారించాలని పేర్కొన్నప్పటికీ.. అతడి శిక్షను కమ్యూట్ చేయడం లేదని స్పష్టం చేసింది. పోర్చుగల్‌లో పాస్‌పోర్టు మోసం కేసులో గడిపిన జైలు కాలాన్ని 25 ఏళ్ల వ్యవధిలో లెక్కించరాదని కూడా తేల్చింది.కాగా, అబూ సలేం 2002లో పోర్చుగల్‌లో అరెస్టయ్యాడు. 1993 ముంబై పేలుళ్ల కేసుతో పాటు మరో టాడా కేసులో అతడికి వరుసగా 2015, 2017లో జీవిత ఖైదు పడింది. ఈ నేపథ్యంలో 2025కే 25 ఏళ్లు పూర్తయ్యాయన్న అబూ సలేం వాదనను సుప్రీంకోర్టు తాజాగా తిరస్కరించడంతో.. తక్షణ విడుదలకు అతడి ప్రయత్నాలకు మరోసారి బ్రేక్ పడింది.ఇదీ చదవండి: తమిళనాడులో సంచలనం.. స్టాలిన్‌కు బంపరాఫర్ -
టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
-
‘టెట్’ లేకుండా టీచర్లను నియమించొద్దు: సుప్రీంకోర్టు
ఢిల్లీ: అర్హత లేని టీచర్లతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, ‘టెట్’ లాంటి నిర్దేశిత అర్హతలు లేని ఉపాధ్యాయులను నియమించొద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పేర్కొంది. అర్హత లేని టీచర్ల నియామకంపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మద్యంతర ఆదేశాలిచ్చింది. అస్సాం టీచర్ రిక్రూట్మెంట్ కేసులో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీచర్ల రిక్రూట్మెంట్పై సమీక్ష చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సరైనటువంటి విద్యార్హతలు లేకుండా టీచర్ల నియామకం చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.అర్హత లేని టీచర్ల నియామకంపై సుప్రీంకోర్టు స్టేవిద్యాహక్కు చట్టం, ఎన్సీటీఈ, యూజీసీ చట్టం కింద నిర్దేశించిన అర్హతలు లేని వారిని పాఠశాలు, కళాశాలల్లో బోధకులుగా నియమించవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అర్హత లేని టీచర్లతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, టెట్ లాంటి నిర్దేశిత అర్హతలు లేని ఉపాధ్యాయులను నియమించొద్దని సూచించింది. పోటీతో కూడిన నియామక ప్రక్రియ లేకుండా ఉపాధ్యాయ నియామకాలు జరగకూడదని వ్యాఖ్యానించింది. టీచర్ల ఎంపికలో న్యాయమైన, పారదర్శక విధానాలు పాటించాలని ఆదేశించింది.అస్సాం విద్యా చట్టంలోని ప్రావిన్స్లైజేషన్ ప్రైవేటు పాఠశాలలను ప్రభుత్వ పాఠశాలలుగా మార్చడం.. రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసననం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సంస్థల్లోకి అర్హత లేని టీచర్లను అనుమతించొద్దని కోరుతూ పిటిషనర్లు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
రాజస్తాన్ జడ్జిపై సుప్రీం జడ్జి నాలుగో లేఖాస్త్రం
న్యూఢిల్లీ: రాజస్తాన్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ శర్మపై ఆరోపణలు గుప్పిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా నాలుగోసారి లేఖాస్త్రం సంధించారు. ఆగస్ట్ 30న రాసిన ఈ లేఖ తాజాగా వెలుగులోకి వచి్చంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ సంజీవ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు జస్టిస్ మెహతా నాలుగో లేఖ రాశారు. గతంలోనే జస్టిస్ మెహతా ఆగస్ట్ 2, 10, 17 తేదీల్లో లేఖలు రాయడం విదితమే. అంతర్గత జ్యుడీíÙయల్ విచారణలో జస్టిస్ శర్మ దురుద్దేశంతో కలగజేసుకుంటున్నారని తాజా ఆరోపణలుచేశారు. అయితే జస్టిస్ శర్మ వైఖరిని నిరసిస్తూ రాజస్థాన్ హైకోర్టులో పలువురు న్యాయవాదులు ధర్నాకు దిగడంతో జస్టిస్ శర్మ సెలవుపై వెళ్లారు. ‘‘జస్టిస్ శర్మ కోర్టు పరిపాలనా వ్యవహారాల్లో పూర్తి గా విఫలమయ్యారు. బంధు ప్రీతి చూపిస్తున్నారని, తప్పుడు తీర్పులు ఇస్తున్నారు. సమాజంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల, సంపన్నుల జోక్యమున్న కేసులనే ఈయన విచారణకు తీసుకుంటూ మిగతా కేసులను ఇతర ధర్మాసనాలకు సిఫార్సుచేస్తూ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. భూ వివాదాల్లో జ్యుడీíÙయల్ జోక్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. భారీస్థాయిలో అవినీతికి పాల్పడుతూ హైకోర్టులో కార్యకలాపాలను స్తంభింపజేస్తున్నారు’’అని లేఖలో పేర్కొన్నారు. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ హోదాలో కేసులను ఏఏ జడ్జీలకు కేటాయించాలనే మాస్టర్ ఆఫ్ రోస్టర్ నిబంధనను ఈయన ఇష్టారీతిన ఉల్లంఘిస్తున్నారని విజ్ఞప్తిచేశారు. అయితే ఆరోపణలపై బలమైన సాక్ష్యాధారాలు ఉంటే సమర్పించాలని సీజేఐ ఆగస్ట్ 26వ తేదీన స్పందించడం తెల్సిందే. -
జడ్జీల రిటైర్మెంట్ వయస్సు 62కు పెంచండి
న్యూఢిల్లీ: న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలంటూ శుక్రవారం సుప్రీంకోర్టు ఏడు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అనుభవజు్ఞలైన న్యాయాధికారుల కొరతను నివారించడం, ప్రజలకు న్యాయం అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని తెలిపింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీన, ఆతర్వాత రిటైరైన న్యాయాధికారులకు తిరిగి విధుల్లో జాయినయ్యే అవకాశం కల్పించాలని కోరింది. వారు ఇతర విధుల్లో చేరని పక్షంలో ఈ వెసులుబాటు వర్తింపజేయాలని ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ‘న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు పెంపునకు ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసిన ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం, తమిళనాడు, బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అనుగుణంగా సర్వీసు నిబంధనల్లో మార్పులు చేపట్టాలి. రెండు నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈలోగా ఆయా రాష్ట్రాల్లో 60 ఏళ్ల వయస్సు పూర్తయిన న్యాయాధికారులు 62 ఏళ్లు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. వీరు పదవీ విరమణ పొందరు. అయితే ఇది సంబంధిత హైకోర్టు వారి అర్హత, పనితీరును సమీక్షించి ఇచ్చే ఆమోదానికి లోబడి ఉంటుంది’అని ధర్మాసనం వివరించింది. ఆ రాష్ట్రాలు పునరాలోచన చేయాలి అదేవిధంగా, న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు పెంపును వ్యతిరేకిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూకశీ్మర్లు తమ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ధర్మాసనం కోరింది. ఈ అంశంపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకుని, ఆ మేరకు నివేదిక అందజేయాలంది. ఉన్నత న్యాయవ్యవస్థలో వయోపరిమితిలో వ్యత్యాసం ఉండటం సమర్థనీయమేనని తెలిపింది. ‘అయితే, మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న న్యాయాధికారుల సంఖ్యకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడానికి, ఖాళీల కారణంగా ప్రజలకు న్యాయం అందని ద్రాక్షగా మిగిలిపోకుండా చూడటానికి అనుభవజు్ఞలైన న్యాయ నిపుణుల కొరతను నివారించడమే ప్రస్తుత తక్షణ అవసరం’అని ధర్మాసనం వివరించింది. ‘జిల్లా న్యాయవ్యవస్థలో పనిచేసే అధికారుల పదవీ విరమణ వయస్సు పెంపుపై, వారి సేవా నిబంధనలకు అనుగుణంగా సిఫార్సులు చేయాల్సిన హైకోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. -
ఫ్రిజ్‌లో మృతదేహం కేసులో ప్రధాన నిందితుడికి ఊరట
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్‌లో కలకలం రేపిన కరీంనగర్ యువకుడి కిడ్నాప్, హత్య కేసులో ప్రధాన నిందితుడిని సుప్రీంకోర్టు నిర్దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచిన ఈ ఘటనలో ప్రధాన నిందితుడు కొండపాక శ్రీధర్ అలియాస్ శేఖర్ (ఏ1) దాఖలు చేసిన అప్పీల్‌పై గురువారం తీర్పు వెలువరించింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదును ఉమ్మడి హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో ఆరుగురు నిందితుల్లో ఒకరు విచారణ దశలోనే చనిపోగా, మిగిలిన ఐదుగురికి కింది కోర్టు జీవిత ఖైదు ఖరారు చేసిందన్నారు. కానీ, పైకోర్టు నలుగురిని నిర్దోషులుగా విడుదల చేసి, శ్రీధర్‌కు మాత్రమే శిక్షను సమర్థించిందని తెలిపారు. అతడు ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నట్లు కచ్చితమైన ఆధారాలు లేవని, ఇప్పటికే 16 ఏళ్లుగా జైలుకే పరిమితమయ్యాడని, బెయిల్ వచ్చినా పూచీకత్తు సమర్పించలేని స్థితిలో ఉన్నాడని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. కింది కోర్టులో శిక్ష పడిన నలుగురిని హైకోర్టు విడుదల చేస్తే, వారిపై ప్రభుత్వం ఎందుకు అప్పీల్‌కు వెళ్లలేదని నిలదీసింది. సహ నిందితులను వదిలేసి, ఒకే వ్యక్తిపై హత్యానేరాన్ని ఎలా నిర్ధారిస్తారని వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఏం జరిగిందంటే... జగిత్యాలకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు 2011 జూన్‌లో హైదరాబాద్‌కు వచ్చి అదృశ్యమయ్యాడు. కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో, బాధితుడి తండ్రి లక్షన్నర రూపాయలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. ఆ బ్యాంక్ లావాదేవీలు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఉప్పల్‌లోని ఓ అపార్ట్మెంట్లో గాలింపు చేపట్టారు. అక్కడి 402వ నంబరు ఫ్లాట్‌లోని ఫ్రిజ్‌లో శ్రీనివాస్ మృతదేహం ప్లాస్టిక్ కవర్లు, వైర్లతో చుట్టి కుళ్లిన స్థితిలో కనిపించింది. ఈ కేసులో కరీంనగర్ కోర్టు ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. హైకోర్టు శ్రీధర్ మినహా నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పుపైనే శ్రీధర్ సుప్రీంను ఆశ్రయించాడు. -
11 ఏళ్ల వేరు కాపురం.. విడాకులు మంజూరు!
న్యూఢిల్లీ: పెళ్లి తరువాత గొడవల కారణంగా వేర్వేరుగా ఉంటున్న దంపతులకు సుప్రీంకోర్టు బుధవారం విడాకులు మంజూరు చేసింది. 2005 డిసెంబరు నుంచి వీరు విడిగా ఉంటున్నారని, మహిళ వైవాహిక సంబంధాన్ని వదిలేసుకుందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ ప్రకటిస్తూ ఆమెకు శాశ్వత భరణంగా ఏడు లక్షల రూపాయలు చెల్లించాలని భర్తను ఆదేశించారు. వీలైనంత వరకూ వివాహాన్ని కాపాడేందుకు ప్రయత్నించాలని చట్టం చెబుతున్నప్పటికీ దీర్ఘకాలం దూరంగా ఉంటున్నారు కాబట్టి వాస్తవిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరముందని బెంచ్ వ్యాఖ్యానించింది. దీర్ఘకాలం వేరుగా ఉండటం వారి మధ్య వైవాహిక బంధం పునరుద్ధరణకు వీలు కానంత బలహీనమైందా? అన్న విషయాన్ని నిర్ణయించేందుకూ ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఒక తీర్పును కూడా బెంచ్ ప్రస్తావించింది. కేసు వివరాలు...మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. భార్య తనను వదిలిపెట్టడం, క్రూరత్వాన్ని ప్రదర్శించడాన్ని ఆ వ్యక్తి రుజువు చేయలేకపోయాడని హైకోర్టు స్పష్టం చేస్తూ విడాకులు నిరాకరించింది. వీరిద్దరికీ 2003లో వివాహం కాగా.. విద్యార్హతల్లేవని భార్య భర్తను వదిలేసిందని, నిరక్షరాస్యుడని, మొరటోడని అవమానించిందని ఆ వ్యక్తి తన పిటిషన్లో పేర్కొన్నాడు. భార్య 2005 నవంబరు నెలలో పుట్టింటికి వెళ్లిపోయిందని, కాపురానికి రమ్మన్నా రాకపోవడం వల్ల తనకు విడాకులివ్వాలని ఆ వ్యక్తి 2007 జూన్‌లో కేసు వేశాడు. మనస్పర్దల కారణంగా దంపతులు ఇద్దరూ 2005 డిసెంబరు నుంచి కలిసి ఉండటం లేదని ట్రయల్ కోర్టు విచారణలో వెలుగు చూసిన విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. ‘‘మా దృష్టిలో ఈ కేసులో భార్యకు భర్తను వదిలేయాలన్న ఉద్దేశం లేదని హైకోర్టు అర్థం చేసుకోవడం సరికాదు’’ అని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. భార్యకు కాపురానికి తెచ్చుకునేందుకు భర్త అత్తారింటికి వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయని, కానీ సరైన కారణం చూపకుండా ఆమె భర్తతో వచ్చేందుకు నిరాకరించిందని తెలిపింది. వివాహం కారణంగా వీరికి సంతానమేదీ లేని విషయాన్ని, సంబంధాన్ని పునరుద్ధరించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడాన్ని పరిగణలోకి తీసుకుని ఇద్దరికీ విడాకులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. -
చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక
-
అన్ని ఎఫ్‌ఐఆర్‌లూ కొట్టివేత
న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసన సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యార్థులపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇందుకు రాజ్యాంగం ప్రకారం తమకు దక్కిన ప్రత్యేక అధికారాలను న్యాయస్థానం ఉపయోగించుకుంది. ఈ కేసులు విద్యార్థులపై భవిష్యత్తుపై ప్రభావం చూపకూడదని స్పష్టంచేసింది. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు మూడు నెలల్లోగా పరిహారం అందజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.కేంద్రం అభ్యర్థన మేరకు నిరసనకారులపై క్రిమినల్ విచారణను ముగించింది. ‘‘యువ నిరసనకారుల భవిష్యత్ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, వారికి సంపూర్ణ న్యాయం చేయడానికి మేము రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద మాకు లభించిన అధికారాలను ఉపయోగిస్తున్నాం’’అని స్పష్టంచేసింది. కక్షిదారులకు సంపూర్ణ న్యాయం చేకూర్చడానికి ఎలాంటి ఉత్తర్వులైనా జారీ చేసే అధికారాన్ని ఆరి్టకల్ 142 సర్వోన్నత న్యాయస్థానానికి కలి్పస్తుంది. తమ ముందు కుదిరిన అవగాహనకు ఇరుపక్షాలు కట్టుబడి ఉండాలని సూచించింది. 2,873 మందిపై కొత్తగా ఎఫ్ఐఆర్లు నిరసనలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు మహారాష్ట్ర, అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కోరినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం నిరసనకారులపై అన్ని ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తూ ధర్మాసనం ఉత్తర్వు జారీచేసింది. ప్రభుత్వ అభ్యర్థనను మన్నిస్తూ, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న తీవ్రమైన నేర చరిత్ర కలిగిన 2,873 మంది వ్యక్తులపై కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతి ఇచి్చంది. ప్రజలపై దాడులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వారిపై కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేసేందుకు కూడా సమ్మతి తెలియజేసింది. ఈ ఎఫ్ఐఆర్ల పరిధి కేవలం ఆ రెండు రకాల నేరాలకు మాత్రమే పరిమితం కావాలని వెల్లడించింది. సీజేపీ నిరసన ర్యాలీ రద్దు ఢిల్లీలో సెపె్టంబర్ 5న చేపట్టాల్సిన నిరసన ర్యాలీ రద్దు చేసున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ మంగళవారం ప్రకటించింది. విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సీజేపీ కో–కన్వీనర్ సౌరవ్ దాస్ ఈ మేరకు కోర్టులో ఒక ప్రకటన చదివి వినిపించారు. ఉపసంహరించుకుంటాం: నడ్డా నిరసనకారులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని, వారిలో ఎవరిపైనా కఠిన చర్యలు తీసుకోబోమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సెప్టెంబర్ 5న జరగాల్సిన నిరసన ర్యాలీని రద్దు చేయాలన్న సీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. నీట్ పేపర్ లీక్ అనంతరం ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులకు 90 రోజు ల్లోగా తగిన పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సంపూర్ణ న్యాయం జరిగింది: దీప్కే సుప్రీంకోర్టు తాజా ఉత్త ర్వును సీజేపీ కన్వీనర్ అభిజీత్ దీప్కే స్వాగతించారు. తమ గళాన్ని వినిపించడానికి వీధులు, సోషల్ మీడియాను ఆశ్రయించిన విద్యార్థులకు, పౌరులందరికీ ఎట్టకేలకు న్యాయం చేకూరిందని అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్లన్నీ నెరవేరాయి కాబట్టి పాదయాత్రను విరమిస్తున్నామని తెలిపారు. సంపూర్ణ న్యాయం జరిగిందన్నారు. తమ ఆందోళన విజయవంతమైందని వెల్లడించారు. సుప్రీంకోర్టుకు దీప్కే కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు మద్దతు ఇచ్చిన ప్రజలకు ఈ తీర్పును అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఇది కేవలం జంతర్ మంతర్ వద్దే కాకుండా, దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరి విజయమని అభివరి్ణంచారు. ప్రజలంతా గళం విప్పకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యే దని కాదని వివరించారు. -
సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు
-
సీజేపీ నిరసనకారులకు సుప్రీంకోర్టు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులపై సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్లను రద్దు చేసింది. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన నిరసనల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు రద్దు కానున్నాయి. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన సీజేపీ నిరసనలపై దేశంలో ఎక్కడా ఎఫ్ఐఆర్లను నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2,873 నేరచరిత్ర కలిగిన వారి నేపథ్యంలో వారిపై ఎఫ్ఐఆర్ల నమోదుపై పోలీసులకు సుప్రీంకోర్టు స్వేచ్ఛనిచ్చింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నష్టపరిహారం చెల్లింపులపై విధివిధానాలు రూపొందించాలని ఆదేశించింది. విధివిధానాలు రూపొందించిన మూడు నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలరని చెప్పింది. ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహనకు కట్టుబడి ఉండాలనే షరతుకి లోబడి ఆర్టికల్ 142 కింద ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తున్నామని, ఈ విధానాన్ని రాష్ట్రాలు సైతం పాటించవచ్చని పేర్కొంది.‘సెప్టెంబర్ 5 ర్యాలీ’ రద్దువిద్యార్థులపై కేసుల ఉపసంహరణతో కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5న తలపెట్టిన ర్యాలీని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. మరోవైపు, అంతకుముందు ఎఫ్ఐఆర్ల రద్దుకు సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు ఢిల్లీ , బిహార్, అస్సాం, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర పోలీసులు. రెండు పక్షాలు పరస్పర నమ్మకంతో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిదని సీజేఐ చెప్పారు. విద్యార్థులను ప్రత్యర్థులుగా భావించడం లేదని సొలిసిటర్ జనరల్ తెలిపారు. -
రెండేళ్లుగా ఏం చేశారు?
సాక్షి, అమరావతి: మద్యం రవాణా అక్రమ కేసు విషయంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) రెండేళ్లుగా ఏం చేసిందని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమీ కనుగొనలేకపోయిందని తేల్చి చెప్పింది. ఈ కేసులో సిట్ అనుసరిస్తున్న పక్షపాత, చట్ట విరుద్ధ తీరును తప్పు పట్టింది. సిట్ తీరు ఆందోళన కలిగిస్తోందని, అతి చేస్తోందని తెలిపింది. ఈ కేసులో తాము ముందు సిట్ తీరు తేలుస్తామని, ప్రవర్తనను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఆ తర్వాతే హైకోర్టు ఇచ్చిన తీర్పు లోతుల్లోకి వెళతామని తేల్చి చెప్పింది.ఈ కేసులో నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే, కింది కోర్టులో సిట్ ప్రొడక్షన్ వారెంట్ కోరడాన్ని తప్పుబట్టింది. ‘అతను అప్పటికే కస్టడీలో ఉన్నాడు. పారిపోయే అవకాశం ఏ మాత్రం లేదు. అలాంటప్పుడు మీరు ప్రొడక్షన్ వారెంట్ కోసం ఎలా దరఖాస్తు చేస్తారు? ఇది హైకోర్టును మీరి వ్యవహరించడం కాదా? ఇది అతి చేయడం కాదా?’ అని సిట్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కడిగి పారేసింది. దర్యాప్తు సంస్థల ఏకపక్ష వైఖరిని రాజ్యాంగంలోని అధికరణ 136 కింద ఎలా అనుమతించగలమని నిలదీసింది. సిట్ తీరు కచ్చితంగా ఆక్షేపణీయమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిట్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సిట్ తరఫున సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణరావు వాదనలు వినిపించేందుకు సిద్ధం కాగా, ధర్మాసనం జోక్యం చేసుకుంది. ‘కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.కేసిరెడ్డి పోలీసు కస్టడీపై మీరు (సిట్) నిజంగా సీరియస్‌గా ఉన్నారా? ఒకవైపు కస్టోడియల్ ఇంటరాగేషన్ కావాలని కోరుతారు. తీరా జడ్జి ప్రొడక్షన్ వారెంట్ ఇచ్చాక పోలీసు కస్టడీకి సిద్ధంగా లేమని చెబుతారా? ఇదేం తీరు? పోలీసు కస్టడీకి ప్రిపేర్ కాకుండా తిరిగి జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని అడగడం ఏ రకమైన ప్రవర్తన? ప్రొడక్షన్ వారెంట్ అనేది అరెస్ట్ వారెంట్‌తో సమానం. రెండేళ్లుగా ఈ కేసు దర్యాప్తు నడుస్తోంది. అయినా ఇప్పటి వరకు ఏమీ కనుగొనలేకపోయారు’ అంటూ సిట్ తీరును ధర్మాసనం తీవ్రస్థాయిలో ఎండగట్టింది. కస్టోడియల్ విచారణ అవసరం.. న్యాయవాది ఆదినారాయణరావు ఈ సందర్భంగా వాదనలు వినిపిస్తూ.. మద్యం రవాణా కేసు భారీ వ్యవహారమని, నిందితుడిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని కోర్టుకు విన్నవించారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణను వాయిదా వేస్తూ వస్తోందని, ప్రొడక్షన్ వారెంట్‌ను నిరోధిస్తూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆయన తమ చర్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ఒక దాని వెంట ఒకటి కేసుల నమోదు దీనిపై కేసిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది పటా్వలియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థ ఉద్దేశ పూర్వకంగానే ఒకదాని తర్వాత ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 2024 నాటి మద్యం అక్రమ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉన్న దశలో, ఉద్దేశ పూర్వకంగానే సిట్ ఈ ఏడాది మరో కేసు (మద్యం రవాణా) నమోదు చేసిందన్నారు. తద్వారా కేసిరెడ్డిని కస్టడీలో ఉంచేలా సిట్ కక్షపూరిత తీరుతో వ్యవహరించిందన్నారు. అందుకే హైకోర్టు కేసిరెడ్డి అక్రమ అరెస్ట్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించిందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అరెస్ట్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించిన హైకోర్టు మద్యం రవాణా అక్రమ కేసులో తమ అరెస్ట్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ రాజశేఖర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ సిట్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. రాజశేఖర్‌రెడ్డి, వాసుదేవరెడ్డిల అరెస్ట్‌ను అక్రమంగా ప్రకటించి, వారి తక్షణ విడుదలకు ఆదేశాలిచ్చారు.మద్యం రవాణా కేసులో చాలా కాలంగా అరెస్టు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ, 2026 ఏప్రిల్ 7న ఈ కేసులో బెయిల్ లభించిన తర్వాతే రాజశేఖర్‌రెడ్డిని అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీ కోసం అత్యవసరంగా చర్యలు తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని హైకోర్టు తెలిపింది. కేసిరెడ్డిని ముందుగా కస్టడీలోకి తీసుకుని, తర్వాత కోర్టులో అరెస్ట్ చూపారంది. అంతేకాక అరెస్ట్‌కు ముందు వైద్య పరీక్షలు నిర్వహించారని, ఇది బీఎస్‌ఎస్‌ఎస్ సెక్షన్ 53కు విరుద్ధమని తేల్చి చెప్పింది.హైకోర్టు తీర్పును అనుసరించాల్సిందే న్యాయవాదుల వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. సిట్ వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. కస్టడీలో ఉన్న వ్యక్తికి సంబంధించి ప్రొడక్షన్ వారెంట్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సిట్ అనుసరించాల్సిందేనని తేల్చి చెప్పింది. లేని పక్షంలో ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తామని హెచ్చరించింది. తాము హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టేంత వరకు.. అవి పూర్తి స్థాయిలో చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. అయితే, ఈ కేసు పూర్వాపరాల ఆధారంగా ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉందని తెలిపింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిలను ఆదేశిస్తూ వారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. -
E20 పెట్రోల్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇదే!
మనలో చాలామంది పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు లీటర్ పెట్రోల్‌కు ఎంత డబ్బు చెల్లిస్తున్నామో అని మాత్రమే చూస్తాం. కానీ.. అందులో ఎంత ఇథనాల్ కలిపి ఉంది? అనే విషయాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోం. ఇప్పుడు ఇదే విషయంపై చర్చ జరుగుతోంది.పెట్రోల్ బంకుల్లో అమ్ముతున్న ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ ఉందో.. కస్టమర్లకు స్పష్టంగా తెలియజేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే.. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించలేదు. ఈ అంశంపై సంబంధిత అధికారులను సంప్రదించుకోవచ్చని పిటిషనర్‌కు సూచించింది.E20 పెట్రోల్ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు E20 పెట్రోల్. ఇందులో 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ ఉంటుంది. విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం, దేశంలోనే తయారయ్యే ఇంధనాన్ని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలుపుతోంది. అయితే.. కస్టమర్లు తాము కొంటున్న పెట్రోల్‌లో అసలు ఎంత ఇథనాల్ ఉందో తెలుసుకోవాలని కోరుతున్నారు.వాహనదారుల్లో సందేహాలుE20 పెట్రోల్‌పై వాహనదారుల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా.. పాత వాహనాల్లో ఈ20 ఇంధనం వాడితే మైలేజ్ ఎలా ఉంటుంది? ఇంజిన్‌పై ప్రభావం ఉంటుందా? ఫ్యూయల్ సిస్టమ్‌కు ఏమైనా సమస్యలు వస్తాయా? అనే ప్రశ్నలు ఉన్నాయి. అయితే మైలేజ్ అనేది.. కేవలం ఇంధనంపైనే మాత్రమే ఆధారపడి ఉంటుందనుకోవడం పొరపాటు. ఎందుకంటే.. డ్రైవింగ్ చేసే విధానం, ట్రాఫిక్, వెహికల్ మెయింటెనెన్స్, టైర్ ప్రెజర్, ఏసీ వినియోగం వంటి అంశాలు మైలేజిని ప్రభావితం చేస్తాయని ప్రభుత్వం చెబుతోంది.పంటలపై ప్రభావంఇథనాల్ తయారీకి పంటలను ఉపయోగించడంపై కూడా చర్చ మొదలైంది. ఆహారం కోసం ఉపయోగించే పంటలను ఇంధనం తయారీకి ఉపయోగిస్తే.. భవిష్యత్తులో ఆహార ధరలపై ప్రభావం పడుతుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే.. వ్యవసాయ వ్యర్థాలు, బయోమాస్‌తో 2జీ ఇథనాల్ తయారు చేయడం ద్వారా ఆహార పంటలపై ఒత్తిడి తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే వ్యర్థాలను ఉపయోగించి ఇంధనం తయారు చేస్తే ఫుడ్, ఫ్యూయల్ రెండింటి అవసరాలను బ్యాలెన్స్ చేయొచ్చన్నమాట.ఇదీ చదవండి: 23 ఏళ్లకే ఉద్యోగం వదిలేశాడు.. కొండల్లో తిరుగుతూ కోట్ల సంపాదన! -
రాజ్ కేసిరెడ్డి కేసులో SITపై సుప్రీం సీరియస్
-
లిక్కర్ అక్రమ రవాణా కేసు.. సిట్‌పై సుప్రీంకోర్టు సీరియస్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో లిక్కర్ అక్రమ రవాణా కేసులో సిట్ దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్ కేసిరెడ్డి కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన సిట్ వైఖరిపై మండిపడిన సర్వోన్నత న్యాయస్థానం.. ‘సిట్ అతి చేస్తోంది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదేం ప్రవర్తన? అంటూ సిట్ తీరును నిలదీసింది.లిక్కర్ అక్రమ రవాణా కేసు రెండేళ్లుగా కొనసాగుతున్నా ఇప్పటివరకు ఏం కనుగొన్నారని సిట్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకవైపు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని కోరుతూ.. మరోవైపు పోలీసు కస్టడీకి తాము సిద్ధంగా లేమని చెప్పడమేంటని ప్రశ్నించింది. ఇదేం ప్రవర్తన? అంటూ సిట్ తీరును నిలదీసింది. ముందుగా సిట్ వ్యవహరించిన తీరును పరిశీలిస్తామని, ఆ తర్వాత హైకోర్టు తీర్పుపై దృష్టి పెడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సిట్ తప్పనిసరిగా పాటించాల్సిందేనని, లేదంటే కేసును కొట్టివేస్తామని హెచ్చరించింది. అనంతరం, తదుపరి విచారణను వాయిదా వేసింది.ఇదీ చదవండి: వెలిగొండలో క్రెడిట్ చోరీ.. -
555 టీఎంసీలు సాధించాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్ –1) గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు పొందేలా జస్టిస్ బ్రిజేశ్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట వాదనలు వినిపించాలని సూచించారు. జల వివాదాలకు సంబంధించిన సుప్రీంకోర్టు కేసులతోపాటు జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రం తరఫున వినిపించాల్సిన వాదనలపై శుక్రవారం ఆయన నీటిపారుదలశాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌తో సమీక్ష నిర్వహించారు.పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే అందుకు బదులుగా నాగార్జున సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఎదుట అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగింది. ఇందులో ఉమ్మడి ఏపీకి దక్కిన 45 టీఎంసీలతో పాటు ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 555 టీఎంసీలు కలిపి మొత్తం 600 టీఎంసీలను 75 శాతం లభ్యత (నాలుగేళ్లలో కచ్చితంగా మూడేళ్లపాటు ఉండే వరద లభ్యత) ఆధారంగా తెలంగాణకు కేటాయించాలని 2023లో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో స్టేట్మెంట్ ఆఫ్ కేస్ దాఖలు చేశామని న్యాయ నిపుణులు సీఎంకు వివరించారు. ఈ కేసులో ఏపీ కౌంటర్ వాదనలు ముగిశాయని.. తెలంగాణ తరఫున రిజాయిండర్ వాదనలు ప్రారంభించినట్లు చెప్పారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల వాటాలో 555 టీఎంసీలకు 45 టీఎంసీల పోలవరం మళ్లింపు నీళ్లు కలిపి మొత్తం 600 టీఎంసీలు దక్కేలా వాదనలు ఉండాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఆ మేరకు నీటి వినియోగానికి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని గుర్తుచేశారు. పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలను పూర్తిగా ఏపీలో వాడుకుంటారని.. గోదావరి జలాల మళ్లింపునకు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి ఏపీకి దక్కిన 45 టీఎంసీలపై పూర్తి అధికారం తెలంగాణదేనని సీఎం స్పష్టం చేశారు. సాగర్ ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక 80 టీఎంసీల్లో ఇప్పటికే 35 టీఎంసీల వినియోగానికి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నాయని.. మిగిలిన 45 టీఎంసీలు తెలంగాణకు దక్కాల్సిందేనని తెలిపారు. తీర్పు అన్యాయంగా ఉంటే అంగీకరించొద్దు.. జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 2011లో ఇచ్చిన అవార్డుపై సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై వచ్చే నెలలో వాదనలు వినిపించాల్సి ఉందని న్యాయవాదులు తెలియజేయగా... కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు అమల్లోకి వస్తే తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున సరైన గ్యారంటీలు లభించకుండా ఈ తీర్పునకు అంగీకరించొద్దని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మరో కేసు అప్పర్ భద్ర ప్రాజెక్టుపై ఉందని.. తెలంగాణలో జలవిద్యుత్ ఉత్పాదన కోసం జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టులో కేసు ఉందని అధికారులు నివేదించారు.ఇక పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన కేసులో సమన్ల జారీ ప్రక్రియ జరుగుతోందని న్యాయవాదులు సీఎంకు నివేదించారు. సుప్రీంకోర్టుతోపాటు కృష్ణాలో తెలంగాణ వాదనలు బలంగా ఉండాలని.. కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన నీటి వాటాను సాధించేలా పోరాటం చేయాలని సీఎం కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ అడ్వకేట్ జనరల్, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ కుషి్వందర్ వోహ్రా, ప్రముఖ న్యాయవాది సాత్విక్, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ కె. ప్రసాద్, ఎస్ఈ ఎస్. విజయకుమార్, ఈఈ వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
90 రోజుల్లో అభియోగాలు నమోదు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: వరకట్న మరణాలు, మహిళలపై వేధింపుల కేసుల విచారణలో ఇకపై ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తరహా కేసుల్లో చార్జిషిటు దాఖలైన 60 నుంచి 90 రోజుల్లోగా నిందితులపై అభియోగాలు ఖరారు చేయాలని విచారణా కోర్టులను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనవసర వాయిదాలు ఇవ్వకుండా సాక్ష్యాల నమోదును వీలైనంత వరకు రోజువారీగా జరపాలని సూచించింది. బాధితులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ట్రయల్ కోర్టులు అనుసరించాల్సిన విధానంపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు 10 కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.ఉత్తరప్రదేశ్‌లో పెళ్లైన ఏడాదికే 20 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి కేసు విచారణ 24 ఏళ్లపాటు సాగిన పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం దేశవ్యాప్తంగా పాత కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి ఈ మార్గదర్శకాలు చేసింది. మార్గదర్శకాల అమలు నివేదికల పరిశీలన కోసం తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. బాధితులకు అండగా నిలిచేందుకు వన్–స్టాప్ సెంటర్లు, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు, మహిళా హెల్ప్‌డెస్క్‌లు, హెల్ప్లైన్లు, ఆన్లైన్ గ్రీవెన్స్ సిస్టమ్‌లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరింత బలోపేతం చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
కస్టోడియల్ డెత్ కేసు: సుప్రీంకోర్టుకు డీజీపీ ఐదుసార్లు సారీ.. అయినా..
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో పోలీసు కస్టడీలో జరిగిన ఓ యువకుడి మరణం కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర పోలీసు వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2024లో ఓ యువకుడు కస్టడీలో మృతి చెందగా, ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి 2 సంవత్సరాల 7 నెలలు ఆలస్యం కావడంపై కోర్టు తీవ్రంగా మండిపడింది. ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్‌దేవ్ గౌతమ్‌ను కోర్టు తీవ్రంగా ప్రశ్నిస్తూ, ఇలాంటి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఇంత సమయం పట్టడం ఏంటని, ఇక పోలీసు అధికారులకు శిక్షణ అవసరమా? అని ప్రశ్నించింది.విచారణ సందర్భంగా.. ఛత్తీస్‌గఢ్ డీజీపీ పూర్తిగా అసమర్థుడిగా కనిపిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును నిర్వహించే సామర్థ్యం ఛత్తీస్‌గఢ్ అడ్మినిస్ట్రేషన్‌కు లేదని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కస్టడీలో మరణం వంటి తీవ్రమైన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఇంత ఆలస్యం ఎందుకు జరిగిందో కోర్టు ప్రశ్నించింది.మరో అంశంపై కూడా సుప్రీంకోర్టు డీజీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోస్ట్‌మార్టం నివేదికను పరిశీలించకుండానే తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశారని కోర్టు పేర్కొంది. ఇది సుప్రీంకోర్టును మోసం చేయడమేనని, కేసులోని ప్రతి అంశంపై కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించింది.మృతుడి మరణానికి మద్యం మానేయడం వల్ల వచ్చిన ఉపసంహరణ లక్షణాలు కారణమని పేర్కొన్నప్పటికీ, పోస్ట్‌మార్టం నివేదికలో తలకు మొద్దుబారిన వస్తువుతో గాయం అయినట్లు నమోదై ఉండటాన్ని కోర్టు ప్రస్తావించింది. నివేదికలో తలకు గాయం స్పష్టంగా ఉన్నప్పటికీ దాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించింది.న్యాయ విచారణ నివేదిక తమకు అందలేదని డీజీపీ చెప్పినప్పుడు కూడా కోర్టు తీవ్రంగా స్పందించింది. ఆ నివేదిక జూలై 2024లోనే సమర్పించారని, అంతేకాకుండా డీజీపీ స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్లోనే ఆ నివేదిక భాగంగా ఉందని కోర్టు గుర్తు చేసింది.ఈ కేసులో కస్టడీ మరణానికి రూ.లక్ష పరిహారం చెల్లించిన విషయంపైనా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఒక మనిషి ప్రాణానికి విలువ కేవలం రూ.లక్షేనా అని ప్రశ్నిస్తూ, అది భయంకరమైన విషయం అని వ్యాఖ్యానించింది.తన వాదనలో డీజీపీ.. న్యాయ కస్టడీలో జరిగే ప్రతి మరణంపై న్యాయ విచారణ తప్పనిసరి అని చెప్పారు. న్యాయ విచారణలో అది నేరంగా పరిగణించాల్సిన కేసు అని నిర్ధారణ అయ్యే వరకు పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరని వాదించారు. న్యాయ విచారణ నివేదిక రెండేళ్ల పాటు పోలీసు శాఖకు అందలేదని, అది బిలాస్పూర్ కేంద్ర జైలు లేదా జైళ్ల శాఖకు పంపినట్లు తెలిపారు.మరణం హత్యా, ప్రమాదమా, ఆత్మహత్యా అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో న్యాయ విచారణ ద్వారా దాన్ని తేల్చాల్సి వచ్చిందని డీజీపీ కోర్టుకు వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పటికే చెల్లించామని చెప్పారు. న్యాయ విచారణకు సంబంధించిన సమాచారం అందిన తర్వాత జూలై 30న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించేందుకు ఓ గెజిటెడ్ అధికారితో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలిపారు.5 సార్లు క్షమాపణలువిచారణ సందర్భంగా డీజీపీ అరుణ్‌దేవ్ గౌతమ్ 5 సార్లు క్షమాపణలు చెప్పారు. న్యాయ విచారణ నివేదికపై జరిగిన చర్చ, నివేదిక తమకు అందకపోవడం, ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం, నివేదికల విషయంలో ఏర్పడిన గందరగోళం వంటి అంశాలపై ఆయన క్షమాపణలు కోరారు. చివర్లో కోర్టు తనను పూర్తిగా అసమర్థుడిగా పేర్కొన్న తర్వాత కూడా క్షమాపణలు చెప్పారు.కేసును సీబీఐకి అప్పగింతకేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు కథనం పేర్కొంది. పోస్ట్‌మార్టం నివేదికలో మృతుడి తలకు మొద్దుబారిన వస్తువుతో గాయం అయినట్లు, కొన్ని చోట్ల రక్తస్రావం జరిగినట్లు నమోదైంది. న్యాయం కోసం మృతుడి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.దర్యాప్తును సీబీఐకి అప్పగించడంతో పాటు బాధితులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మొత్తం మీద, కస్టడీలో జరిగిన మరణంపై ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, పోస్ట్‌మార్టం నివేదికను సరిగా పరిగణనలోకి తీసుకోకపోవడం, తప్పు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయడం వంటి అంశాలపై సుప్రీంకోర్టు ఛత్తీస్‌గఢ్ పోలీసు, పరిపాలనా వ్యవస్థను తీవ్రంగా తప్పుబట్టింది.ఇదీ చదవండి: పాకిస్థాన్ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులు -
‘మోసం.. అని చెప్పేముందు జాగ్రత్త’
పన్ను చెల్లింపుదారులకు జారీ చేసే సెక్షన్ 74 జీఎస్టీ షోకాజ్ నోటీసులపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. నోటీసులో ‘మోసం, వాస్తవాలను సమర్పించలేకపోవడం లేదా దాగిన సత్యాలు’ అనే చట్టబద్ధమైన పదాలను జాగ్రత్తగా ఉపయోగించాలని స్పష్టం చేసింది. పన్ను ఎగవేతకు పన్ను చెల్లింపుదారులు ఎలాంటి కుట్ర పన్నారో ప్రాథమిక సాక్ష్యాధారాలతో నోటీసులోనే స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది.జస్టిస్ బె.బి.పార్దీవాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ‘మోసం లేదా దాగిఉన్న వాస్తవాలు’ అనే సందేహస్పద పదజాలాన్ని ప్రయోగించినంత మాత్రాన గడువు పొడిగింపు నిబంధనలను సవరించే వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. అసెస్సింగ్ ఆఫీసర్ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడే ఎక్ట్సెండెడ్ లిమిటేషన్ వ్యవధిని వర్తింపజేయాలని పేర్కొంది.మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌పై విచారణ సందర్భంగా.. నోటీసులోని శబ్దజాలం అసెస్సింగ్ ఆఫీసర్ల అనిశ్చితిని స్పష్టం చేస్తోందని, ‘మోసం లేదా కప్పిపుచ్చడం’ అనే పదాల వాడకంలో స్పష్టమైన నిర్ధారణ లేదని కోర్టు పేర్కొంది.ఈ తీర్పుపై స్పందించిన డెలాయిట్ పార్టనర్ హర్‌ప్రీత్ సింగ్.. ‘ఇది పన్ను చెల్లింపుదారులకు దక్కిన గొప్ప ఉపశమనం. చట్టపరమైన పదాలను కేవలం పునరావృతం చేస్తూ నోటీసులు పంపే ధోరణికి ఈ తీర్పు చెక్ పెడుతుంది’ అని వ్యాఖ్యానించారు. అధికారులు తమ నిర్లక్ష్య వైఖరిని వదిలి ఆధారాలతో సహా వివరమైన సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ తీర్పు ద్వారా పన్ను యంత్రాంగంలో బాధ్యత, పారదర్శకత పెరుగుతాయని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. నిజాయతీ కలిగిన పన్ను చెల్లింపుదారులకు ఈ తీర్పు రక్షణ కల్పిస్తుందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: రూ.లక్షల కోట్ల ఆదా సరే.. మైలేజ్ కోతకు పరిష్కారమేది? -
45 ఏళ్లకు కానీ తేల్లేదు
న్యూఢిల్లీ: ‘‘కేసు ఓడినవాడు కోర్టులో ఏడిస్తే... గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడ్చాడు’’అంటారు. దేశంలో కోర్టు కేసులు తేలేందుకు ఏళ్లు పూళ్లవుతున్న నేపథ్యంలో పుట్టుకొచ్చిన ఈ నానుడి తాజాగా ఇంకోసారి రుజువైంది. జంట హత్యల కేసులో ఓ వ్యక్తి యాభై ఏళ్లుగా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితిపై దేశ అత్యున్నత న్యాయస్థానమూ చలించిపోయింది. డెబ్ఫై ఏళ్ల ఆ నిందితుడు సైమన్ సోరేన్ శిక్షను తాత్కాలికంగా రద్దు చేయడంతోపాటు ‘‘న్యాయ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం’’ఈ ఉదంతమని జస్టిస్ జేబీ పర్డీవాలా, జస్టిస్ వినోద్ కే చంద్రన్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఇరవై ఏళ్లుగా ఈ కేసును తేల్చని జార్ఖండ్ హైకోర్టు తీరును కూడా న్యాయమూర్తులు ఆక్షేపించారు. కోర్టులో వినిపించిన వాదనలు, న్యాయమూర్తుల వ్యాఖ్యల ప్రకారం... 1981, అక్టోబర్ 18న బిభూతి, బనార్సీ, క్షీర్సాగర్ మండల్లు, మేనల్లుళ్లు జగదీశ్, సత్యనారాయణ్లతో కలిసి వరి కోతల కోసం దుమ్కా జిల్లాలోని భురుండియా గ్రామానికి వెళ్లారు. అదేరోజు కొంతమంది సంతాల్ గిరిజనులు డప్పులు కొడుతూ విల్లు, బాణాలతో, గొడ్డళ్లతో మండల్ కుటుంబీకులు పనిచేస్తున్న పొలాల వద్దకు వచ్చారు. ఈ గిరిజనులు మండల్ కుటుంబ సభ్యులను చంపాలంటూ పిలుపునిచ్చారు. పారిపోతూండగా వెంటబడ్డ జేథున్ సోరేన్, సైమన్ సొరేన్ పేరున్న గిరిజనులు బిభూతి మండల్, బనార్సీ మండల్లపై బాణాలతో దాడి చేశారు.ఆ తరువాత బిభూతి, బనార్సీ మండల్లు ఇద్దరూ కిందపడిపోగా జెథున్, సైమన్లు వారిని నరికి చంపారని ప్రత్యక్ష సాక్షులు జగదీశ్, సత్యనారాయణలు తెలిపారు. ఈ ఘర్షణ, జంట హత్యలపై పోలీసు కేసు నమోదైంది. ఆరుగురు గిరిజనులను అరెస్ట్ చేశారు కూడా. అయితే అభియోగాలు నమోదు చేయకముందే ఇద్దరు నిందితులు మరణించారు. ఆ తరువాత విచారన పూర్తయ్యేందుకు ఏకంగా పన్నెండేళ్లు పట్టింది. 1991లో ఛార్జ్‌షిట్ నమోదైతే 2002లో శిక్షలు ఖరారయ్యాయి. ఈ మధ్యకాలంలో ఈ కేసు ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు ఐదుసార్లు బదిలీ అయింది. నిందితులు కొందరు ఆరేళ్లపాటు పరారీలో ఉండటమూ తోడై విచారణలో విపరీతమైన జాప్యం జరిగింది. అయితే ఈ పన్నెండేళ్లను మినహాయిస్తే మిగిలిన సమయంలోనైనా కేసు విచారణ ఎందుకు ఒక కొలిక్కి రాలేదన్న విషయంపై మాత్రం స్పష్టత లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ పూర్తయిన తరువాత ట్రయల్ కోర్టు 2002లో జీవించి ఉన్న నలుగురు నిందితులకు జీవిత ఖైదు శిక్షగా విధించింది. నిందితులు ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేశారు కానీ.. కేసు అక్కడ పెండింగ్‌లో ఉండగానే ముగ్గురు మరణించారు. దీంతో సైమన్ సోరేన్ ఒక్కడే మిగిలిపోయాడు. సుమారు 22 ఏళ్ల తరువాత జార్ఖండ్ హైకోర్టు 2024 అక్టోబరు 28న సైమన్ సోరేన్ అప్పీల్‌ను కొట్టివేస్తూ ట్రయల్‌కోర్టు ఇచ్చిన శిక్షను ఖరారు చేసింది. అప్పటికి సోరేన్ వయసు దాదాపు డెబ్భై ఏళ్లు! అనేక అనారోగ్యాలతో బాధపడుతూ జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైకోర్టు తీర్పు తర్వాత కస్టడీలోకి వెళ్లారు.కస్టడీలో రెండేళ్లు మాత్రమేసైమన్ సోరేన్‌కు శిక్ష ఖరారైన తరువాత కస్టడీలో ఉన్నది కేవలం రెండేళ్ల నాలుగు నెలలు, 12 రోజులు మాత్రమేనని సుప్రీంకోర్టు గుర్తించింది. ఈ ఏడాది ఆగస్టు 19న జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ వినోద్ కే చంద్రన్ల ధర్మాసనం తుది తీర్పునిస్తూ... దాదాపు 45 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు ‘‘న్యాయ వ్యవస్థ వైఫల్యాన్ని’’ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించింది. నేరానికి శిక్ష పడేందుకు విచారణ పేరుతో 22 ఏళ్లు పడితే.. అప్పీళ్లలో ఇంకో 22 ఏళ్లు గడిచిపోయిందని వ్యాఖ్యానించింది. సైమన్ సోరెన్ శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. బెయిల్‌పై ఉన్న సమయంలో ఎలాంటి నేరానికి పాల్పడకూడదనే షరతుతో, వ్యక్తిగత పూచీకత్తుపై వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను సెపె్టంబరు 18కి వాయిదా వేసింది. -
20 మంది టీఎంసీ రెబల్స్‌కు నోటీసులు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో తిరుగుబాటు లేవదీసి తర్వాత మరో పార్టీకి మద్దతు ప్రకటించిన 20 మంది ఎంపీలకు సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వద్ద పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యాన్ని సవాల్ చేస్తూ టీఎంపీ ఎంపీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం విచారణ చేపట్టింది.ఈ పిటిషన్లో ప్రతివాదులుగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్‌సభ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేయడానికి ధర్మాసనం సిద్ధపడింది. అయితే స్పీకర్ తరఫున తాను కోర్టులో వాదనలు విన్పిస్తానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హామీ ఇవ్వడంతో నోటీసులు ఇవ్వాలన్న తన నిర్ణయాన్ని ధర్మాసనం ఉపసంహరించుకుంది.‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఏ ఒక్కరికీ వ్యతిరేకంగా మేము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడం లేదు. కానీ, నిర్ణిత కాలవ్యవధిలోగా ప్రొసీడింగ్స్ పూర్తి అయ్యేలా చూడటమే మా ప్రధాన ఉద్దేశం’’అని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ అన్నారు. తిరుగుబావుటా ఎగరేసిన 20 మంది నేతలు టీఎంసీ టికెట్‌పై గెలుపొందారు. టీఎంసీ అధికారం కోల్పోగానే ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ) పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం తెల్సిందే. -
మార్గదర్శి కేసు: తప్పు.. తప్పు కాకుండా పోతుందా?
భారతదేశంలో రాజకీయ, రాజ్యాంగ వ్యవస్థలను ప్రభావితం చేయగల అత్యంత శక్తిమంతులలో ఒకరిగా పేరొందిన ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి ఫైనాన్షియర్ సంస్థ డిపాజిట్ల సేకరణ కేసులో, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ రెండు దశాబ్దాలపాటు సాగించిన పోరాటం ఫలించినట్లా? కాదా? ఈ కేసును సుప్రింకోర్టు కొట్టివేయడంతో న్యాయం గెలిచిందని, సత్యం గెలిచిందని ఈనాడు మీడియా ప్రముఖంగా ప్రచారం చేసుకుంది. తప్పులేదు. ఎందుకంటే వారి గ్రూప్ సంస్థ కనుక తమకు అనుకూలంగా ఎట్టకేలకు తీర్పు వచ్చిందన్న భావనతో ప్రజలలో దీనిపై ఉన్న నెగిటివ్ అభిప్రాయాన్ని తొలగించేందుకు ఆ మీడియా యత్నించింది. కాని అంత మాత్రాన చేసిన తప్పు, తప్పు కాకుండా పోతుందా? అన్నది చర్చనీయాంశం.ఈ తీర్పుపై ఉండవల్లి ఇచ్చిన విశ్లేషణ, ఆయన వేసిన ప్రశ్నలకు మార్గదర్శి సంస్థ తరపున ఈనాడు మీడియా సమాధానం ఇస్తే అప్పుడు ప్రజలు ఇందులో రామోజీరావు తప్పు చేశారా? లేదా? అన్నది ఆలోచించుకుంటారు. కాని అటువైపు నుంచి స్పందన కనిపించలేదు. మాజీ ఛీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ఈ కేసు తీర్పు, ఉండవల్లి పోరాటంపై ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రామోజీరావుపై ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన అలుపెరగని పోరాటానికి చివరకు తెరపడిందని, ఈ కేసును ఇంత దూరం తీసుకురాగలుగుతారని తాను అసలు అనుకోలేదని, కేసులో ఉన్న పటిష్టత, ఉండవల్లి పడిన శ్రమ మాత్రమే దీన్ని ఇన్నాళ్లు నడిపించాయని ఆయన కొనియాడారు.మంది మార్బలం, అపారమైన శక్తి ఉన్న రామోజీరావు ఎక్కడ? ఒంటరిగా పోరాడిన ఉండవల్లి ఎక్కడ? అని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. ఈ పోరాటాన్ని బైబిల్లోని 'గోలియత్-డేవిడ్' యుద్ధంతో పోల్చారు. బైబిల్లో డేవిడ్ గెలిచి ఉండవచ్చు కానీ, నిజజీవితంలో ఎప్పుడూ గోలియత్లదే (బలవంతులదే) విజయం అవుతుందని న్యాయపరమైన ముగింపును ఉద్దేశించి ఐవైఆర్ కృష్ణారావు నిగూఢ వ్యాఖ్యలు చేశారు. న్యాయపరంగా ఈ కేసు వీగిపోవడానికి లేదా ముగియడానికి అనేక కారణాలు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలోనే మొత్తం సూక్ష్మం అంతా కనిపిస్తుంది కదా! రామోజీరావు తప్పు చేయలేదన్నట్లుగా ఈనాడు ప్రొజెక్టు చేసుకోవడాన్ని ఉండవల్లి ప్రస్తావించి, తప్పు చేయకపోతే ఈటీవీ షేర్లను విక్రయించి డిపాజిట్ దారులకు డబ్బు ఎందుకు చెల్లించారని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే డిపాజిట్లు తిరిగి చెల్లించివేస్తామని సుప్రింకోర్టును ఎందుకు వేడుకున్నారన్నది ఆయన ప్రశ్న?అంతేకాక ఫైనాన్స్ సంస్థను ఎందుకు మూసివేశారని ఆయన అడుగుతున్నారు. డిపాజిట్ల సేకరణ చేయవచ్చని ఏ కోర్టు చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ఇవి నిజమా? కాదా? ఉండవల్లి అడిగిన ప్రశ్నలన్నీ హేతుబద్దంగా ఉన్నాయి కదా! వీటికి రామోజీరావు కుమారుడు కిరణ్ తన మీడియాలో జవాబు ఇస్తే బాగుంటుంది కదా! ఇక్కడ అసలు సమస్య 2600 కోట్ల డిపాజిట్లు తిరిగి చెల్లించారా?లేదా? అన్నది కాదు. చట్టం ప్రకారం డిపాజిట్ల సేకరణ తప్పా? కాదా? అన్నదే. మామూలుగా అయితే రామోజీ ఎంతమాత్రం ఎవరికి లొంగకూడదని అనుకుంటారు. బ్రేక్ ద లా లాఫుల్లీ అన్నది తన విధానం అని ఆయా సందర్భాలలో సన్నిహితులతో రామోజీ అనేవారని చెబుతారు. అంటే ఎక్కడా దొరకకుండా, చట్టంలోని లొసుగులను వాడుకోవాలన్నది ఆయన ధీరీ అన్నమాట.ఆయనకు రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉందన్నది ఎనలేని సత్యం. ఆయన చేసింది సక్రమమా? అక్రమమా? అన్నదానితో నిమిత్తం లేకుండా తెలుగుదేశం మద్దతు ఇస్తుంటుందన్నది చాలామంది భావన. ఒకప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకినని రామోజీ ప్రకటించుకున్నా, ఆ తర్వాత కాలంలో ఆ పార్టీకి చెందినవారు కొందరితో కూడా సత్సంబంధాలు నెరపి, తన వ్యాపార అవసరాలకు వాడుకునేవారని అంటారు. తెలంగాణలో టీఆర్ఎస్తో కూడా చాలావరకు మంచి సంబంధాలు పెట్టుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యుడుగా పేరొందిన రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యాక రామోజీ గ్రూప్‌కు పూర్తి సహకారం లభించసాగింది. అందువల్లే రామోజీ మరణించిన తర్వాత ఆ సంస్థకు అనుకూలంగా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానంలో అఫిడవిట్లు వేశాయన్నది న్యాయనిపుణుల అభిప్రాయంగా ఉంది.ఇక కేంద్రంలోని బీజేపీతో కూడా ఈ గ్రూపు సఖ్యతతో ఉంటుంది. ఇదంతా తనకు ఉన్న మీడియా బలంతోనే అన్నది బహిరంగ రహస్యమే. బహుశా అందువల్లేనేమో కొంతకాలం క్రితం వరకు డిపాజిట్ల సేకరణ కేసులో రిజర్వ్ బ్యాంక్ హైకోర్టులో గట్టిగా వాదనలు వినిపించి సెక్షన్ 45 ఎస్ కింద హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ సంస్థలు డిపాజిట్లు వసూలు చేయడం చెల్లదని స్పష్టం చేసేది. కాని అదే రిజర్వుబ్యాంకు ఈ కేసును ఇకపై తాము పట్టించుకోబోమని ఉండవల్లి రాసిన ఒక లేఖకు బదులుగా చెప్పిందంటే ఏమిటి అర్దం?రామోజీ గ్రూప్‌నకు ఉన్న పరపతి, రాజకీయ పలుకుబడి ముందు తాము నిలబడ లేకపోతున్నామని ఆర్బీఐ అంగీకరించడమే కదా!రామోజీ మరణించినందున ఆయనపై క్రిమినల్ కేసు కొనసాగదన్నది తెలిసిన విషయమే. కాని ఆయన సంస్థ చేసిన తప్పులపై కేసు కొనసాగుతుందని గతంలో కోర్టువారు ఇచ్చిన ఒక తీర్పును ఉండవల్లి ఉదహరించారు. నిజానికి ఉండవల్లి చేస్తున్న పోరాటం ఏమిటి?మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ డిపాజిట్లు వసూలు చేయడం సక్రమమా? అక్రమమా? కేంద్రం తీసుకు వచ్చిన చట్టాన్ని రామోజీ అతిక్రమించారా? లేదా? అన్నది తేల్చాలనే! రామోజీ జీవించి ఉన్నప్పుడు కూడా ఉండవల్లి ఒక మాట చెప్పేవారు. రామోజీని జైలులో పెట్టాలని తాను కోరుకోవడం లేదని, కాని ఈ డిపాజిట్ల కేసును నిగ్గు తేల్చడం ద్వారా ఇకపై అలా ఎవరూ డిపాజిట్లు వసూలు చేయకుండా చూడాలన్నదే తన ఉద్దేశం అని ఆయన అనేవారు. ఎందుకంటే అక్రమ డిపాజిట్లు వసూలు చేసినవారికి రెట్టింపు జరిమానా వేయాలని రిజర్వుబ్యాంక్ చట్టం సెక్షన్ 45 ఎస్ చెబుతోంది. దీనిని ఎవరికైనా ఒకేరకంగా వర్తింప చేయాలన్నది ఉండవల్లి డిమాండ్.సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు ఈ సెక్షన్ 45 ఎస్ గురించి కాకుండా, ఉండవల్లికి ఈ కేసుతో ఏమి సంబంధం అన్నదానిపైనే ఇచ్చినట్లుగా ఉంది. తాను కేసు ఫిర్యాదుదారుడినని గతంలోనే కోర్టుకు తెలిపానని, దానిని పరిగణనలోకి తీసుకున్నందునే ఇంతకాలం కేసు సాగిందని ఆయన అంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే కొన్ని నెలల క్రితం వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి వేసిన ఒక ప్రశ్నకు రిజర్వుబ్యాంక్ సమాధానం ఇస్తూ హెచ్‌యూఎఫ్‌లు, అనధికార సంస్థలు డిపాజిట్లు వసూలు చేయరాదని, అది చట్టరీత్యా నేరం అని స్పష్టం చేసిందని ఆయన వివరించారు. దీని ఆధారంగా తాను పార్లమెంటు ఫైనాన్స్ కమిటీ సభ్యులను అప్రోచ్ అయి, ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ తన వైఖరి ఎందుకు మార్చుకుందో తెలుసుకోవాలని కోరతానని ఉండవల్లి తెలిపారు.రామోజీరావు మరణించేవరకు సెక్షన్ 45 ఎస్ తమకు వర్తించదని వాదించేవారని, తర్వాత వారసులు కొత్త వాదన తీసుకువచ్చి ఆయన చేసిన తప్పులకు తమకు సంబంధం ఏమిటని అన్నారని ఉండవల్లి పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో తప్పు చేసినా జరిమానా కట్టకుండా రామోజీ సంస్థ తప్పించుకుందన్నది విశ్లేషణగా ఉంటుంది. అన్నిటిని పరిశీలిస్తే ఉండవల్లి ఇంతవరకు చేసిన పోరాటానికి.. పూర్తి స్థాయిలో అర్ధవంతమైన ముగింపు వచ్చి ఉండకపోవచ్చు కాని, ఆయన చేసిన పోరాట స్పూర్తి మాత్రం ఎప్పటికి కొనసాగుతుంది. రామోజీ వంటి బలాఢ్యులు సైతం తప్పు చేస్తే, దానిని ఒప్పుకోకతప్పదని కూడా ఈ కేసు సారాంశంగా తీసుకోవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
YSRCP సోషల్ మీడియా పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
ఫ్రిడ్జ్‌లో మృతదేహం కేసుపై సుప్రీంలో తీర్పు రిజర్వ్
సాక్షి, న్యూఢిల్లీ: సుమారు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన యువకుడి కిడ్నాప్, హత్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మృతదేహాన్ని ఫ్రిడ్జ్‌లో దాచిన ఈ అమానుష ఘటనలో ప్రధాన నిందితుడు కొండపాక శ్రీధర్ అలియాస్ శేఖర్ (ఏ1) దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. కింది కోర్టు విధించిన జీవిత ఖైదును ఉమ్మడి హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు లోపాలు, సాక్ష్యాధారాల లేమిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తుది తీర్పును వాయిదా వేసింది.సుప్రీంలో సుదీర్ఘ వాదనలు..విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యా యవాది వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో ఆరుగురు నిందితుల్లో ఒకరు విచారణ దశలోనే చనిపోయాడని, మిగిలిన ఐదుగురికి కింది కోర్టు జీవిత ఖైదు ఖరారు చేసిందన్నారు. కానీ.. పైకోర్టు నలుగురిని నిర్దోషులుగా విడుదల చేసి, శ్రీధర్‌కు మాత్రమే శిక్షను సమర్థించిందని తెలిపారు. అతడు ప్లాట్‌ను అద్దెకు తీసుకున్నట్లు కచ్చితమైన ఆధారాలు లేవని, ఇప్పటికే 16 ఏళ్లుగా జైలుకే పరిమితమయ్యాడని, బెయిల్ వచ్చినా పూచీకత్తు సమర్పించలేని స్థితిలో ఉన్నాడని వివరించారు. మరోవైపు ప్రభుత్వం తరపు న్యాయవాది వాదిస్తూ.. ఘట నా స్థలంలోని ఫ్రిడ్జ్‌పై ఉన్న వేలిముద్రలు శ్రీధర్వేనని ఫొరెన్సిక్ నివేదిక స్పష్టం చేసిందన్నా రు. ఘటనకు ముందు బాధితుడిని నిందితుడే ప్లాట్‌కు తీసుకెళ్లడాన్ని వాచ్‌మన్ చూశాడని, మృతుడికి చెందిన ఆర్టీసీ బస్ పాస్ కూడా నిందితుడి వద్దే లభ్యమైందని కోర్టు దష్టికి తీసుకొచ్చారు.ధర్మాసనం వ్యాఖ్యలు..వాదనలు విన్న జస్టిస్ పార్దివాలా ధర్మాసనం పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. కింది కోర్టు శిక్ష పడిన నలుగురిని హై కోర్టు విడుదల చేస్తే వారిపై ప్రభుత్వం ఎందుకు అప్పీల్‌కు వెళ్లలేదని నిలదీసింది. సహ నిందితులను వదిలేసి.. ఒకే వ్యక్తిపై హత్యానేరా న్ని ఎలా నిర్ధారిస్తారని వ్యాఖ్యానించింది. ఇంటి ఓనర్‌కు నిందితుడు ఎవరో తెలియదని, కేవలం వాచ్‌మన్ మాత్రమే చూశానని చెప్పడాన్ని ‘లాస్ట్ సీన్’ కింద మాత్రమే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. మృతుడికి చెందిన బస్ పా స్ నిందితుడికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పాలంటూ ప్రాసిక్యూషన్‌ను ప్రశ్నించింది. సరైన ఆధారాలు నిరూపించకుండా 16 ఏళ్లుగా ఒక వ్యక్తి జైలులో ఉండటంపై స్పంది స్తూ.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.గతంలో ఏం జరిగిందంటే..: 2011 జూన్‌లో జగిత్యాలకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు హైదరాబాద్‌కు వచ్చి అదశ్యమయ్యాడు. కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో.. బాధితుడి తండ్రి రూ.1.50లక్షలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. ఆ బ్యాంక్ లావాదేవీలు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఉప్పల్‌లోని ఓ అపార్ట్మెంట్లో గాలింపు చేపట్టారు. అక్కడి 402వ నంబరు ప్లాట్లోని ఫ్రిడ్జ్‌లో శ్రీనివాస్ మృతదేహం ప్లాస్టిక్ కవర్లు, వైర్లతో చుట్టి కుళ్లిన స్థితిలో కనిపించింది. ఈ కేసులో కరీంనగర్ కోర్టు ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. అయితే సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటాలకు సంబంధించి 65–బీ సర్టిఫికెట్ లేకపోవడంతో పాటు పలు సాంకేతిక కారణాలతో హై కోర్టు నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ప్లాట్ అద్దెకు తీసుకున్నది, బాధితుడిని చివరిసారిగా అక్కడికి తీసుకెళ్లింది శ్రీధర్ కావడంతో సెక్షన్ 106 కింద అతడి శిక్షను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఈ తీ ర్పుపైనే శ్రీధర్ సుప్రీంను ఆశ్రయించాడు. కొడుకు వరుసైన వ్యక్తితో భార్య అక్రమ సంబంధం -
1,712 కేసుల పరిష్కారం
న్యూఢిల్లీ: ఈ ఏడాదికిగాను సర్వోన్నత న్యాయస్థానంలో నిర్వహించిన సమాధాన్ సమారోహ్ ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమంలో మూడ్రోజుల్లోనే ఏకంగా 1,712 కేసులను పరిష్కరించారు. మొత్తం 1,712 కేసులకు తీర్పులివ్వడం లేదా విచారణార్హమైనవి కావని తేలిన పక్షంలో తిరస్కరించడమూ చేశారు. ఆగస్ట్ 21వ తేదీ నుంచి 23వ తేదీదాకా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మార్గదర్శకంలో ఈ లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సుప్రీంకోర్టు సోమవారం విడుదలచేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. సత్వరం సెటెల్మెంట్ చేయగల ఆస్కారమున్న కేసులను ఒక జాబితాగా సిద్ధంచేసి కక్షిదారులు, ప్రత్యర్థి పార్టీలను పిలిపించి వేగంగా కేసులను పరిష్కరించారు. ఈ మూడ్రోజుల్లో విచారణ కోసం 3,285 కేసులను సిద్ధంచేయగా కాలావధిలోపు 1,664 కేసులకు తీర్పులు ఇవ్వడం లేదా తిరస్కరించడం చేశారు. మిగతా 48 కేసులన మధ్యవర్తిత్వం మార్గం ద్వారా రాజీ కుదిర్చి కేసులకు ముగింపు పలికారు. దీంతో పరిష్కారభాగ్యం దక్కిన కేసుల సంఖ్య 1,712కు పెరిగింది. ఈ మొత్తం కేసులతో ముడిపడిన రూ.240.94 కోట్ల విలువైన స్థిర,చరాస్థులకు సైతం సుప్రీంకోర్టు పరిష్కారాలు చూపింది. లోక్‌అదాలత్‌కు సీజేఐ నేతృత్వం వహించారు. ఈయనతోపాటు సీనియర్ జడ్జీలు, ఇతర జడ్జీలు, సీనియర్ న్యాయవాదులు, అడ్వకేట్స్–ఆన్–రికార్డ్, సీనియర్ రిజి్రస్టార్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ లోక్ అదాలత్‌లో భాగస్వాములయ్యారు. మధ్యవర్తిత్వం, రాజీ, ఏకాభప్రాయం ద్వారా కొన్ని కేసులు పరిష్కారమయ్యాయి. వివాహ సంబంధ, స్థిరచరాస్థి తగాదాలు, యాక్సిడెంట్లు, భూ వివాదాలు, నష్టపరిహారాలు, పన్నులు, సేవలు, కారి్మకులకు సంబంధించిన కేసులను ఈ లోక్‌అదాలత్‌లో పరిష్కరించారు. లోక్‌అదాలత్‌లో ఇరు పక్షాల కాలం, డబ్బు, శ్రమ, మానసిక క్షోభ, నిరీక్షణ అన్ని తప్పుతాయని కోర్టు వ్యాఖ్యానించింది. -
CJP లాఠీ ఛార్జ్ పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
-
తమిళనాడుకు సుప్రీంకోర్టు షాక్
సాక్షి, ఢిల్లీ: కావేరీ నదీ జలాల విడుదల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నీటి వాటా విడుదలలో ఏవైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే వాటిని కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) ముందే లేవనెత్తాలని తమిళనాడు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కర్ణాటక నుంచి తమకు రావాల్సిన అదనపు నిష్పత్తి నీటి వాటాను విడుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది.వివరాల్లోకి వెళితే.. కావేరీ నీటి నియంత్రణ కమిటీ (CWRC) ఆగస్టు 12 నుండి 15 రోజుల పాటు ప్రతిరోజూ తమిళనాడుకు 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) కూడా సమర్థించింది. అయితే వాటా న్యాయపరంగా తమకు దక్కడం లేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమిళనాడు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ, తమకు దక్కాల్సిన సరైన నిష్పత్తిలో నీరు అందడం లేదని ధర్మాసనానికి తెలిపారు. దురదృష్టవశాత్తూ క్షేత్రస్థాయిలో నీటి విడుదల సక్రమంగా జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ అంశాన్ని సంబంధిత అథారిటీ (CWMA) సమావేశంలోనే లేవనెత్తాలని సుప్రీంకోర్టు సూచించింది.గత విచారణలో కర్ణాటక ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ సమర్పించిన నీటి విడుదల వివరాల చార్ట్‌ను ధర్మాసనం ప్రస్తావించింది. ఆ చార్ట్ ప్రకారం CWMA ఆదేశాల మేరకే తమిళనాడుకు నీటిని విడుదల చేసినట్లు కనిపిస్తోందని బెంచ్ వ్యాఖ్యానించింది. దీనిపై వైద్యనాథన్ స్పందిస్తూ, నిష్పత్తి ప్రకారం నీటిని విడుదల చేయడానికి CWMA దిశా నిర్దేశం చేయడం లేదని, దీనివల్ల తమిళనాడులోని రైతులకు తాము ఒక్క చుక్క నీటిని కూడా విడుదల చేయలేకపోతున్నామని, కానీ కర్ణాటక మాత్రం తమ రైతులకు నీటిని ఇచ్చుకుంటోందని వాదించారు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేస్తూ, ఆ రోజు నాటికి తాజా పరిస్థితిపై నివేదిక (అప్డేటెడ్ స్టేటస్) సమర్పించాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది.అంతకుముందు ఆగస్టు 17న జరిగిన విచారణలో కూడా CWMA ఆదేశాలను కర్ణాటక తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం, వర్షపాతం తక్కువగా ఉన్న ఈ సంవత్సరంలో తమకు రావలసిన న్యాయమైన వాటా దక్కడం లేదు. CWRC కేటాయించిన పరిమాణం కంటే, పొరుగున ఉన్న కర్ణాటక విడుదల చేసిన నీటి పరిమాణం చాలా తక్కువగా ఉందని తమిళనాడు తన పిటిషన్లో పేర్కొంది.జూలై 28న జరిగిన CWRC సమావేశంలో జూలై 29 నుండి 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించినప్పటికీ, జూలై 29 నుండి ఆగస్టు 2 వరకు బిలిగుండ్లు వద్ద కేవలం 158 నుండి 550 క్యూసెక్కుల లోపే నీరు అందిందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ఆగస్టు 3 నాటికి కర్ణాటకలోని కేఆర్ఎస్, కబిని, హారంగి, హేమవతి జలాశయాలలో మొత్తం నీటి నిల్వ 77.537 టీఎంసీలుగా ఉంది. కాబట్టి తమిళనాడుకు చెందాల్సిన వాటాను నిష్పత్తి ప్రకారం విడుదల చేయడానికి కర్ణాటకకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.కర్ణాటకలోని కేఆర్ఎస్, కబిని డ్యామ్‌ల క్యాచ్మెంట్ ఏరియాలలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా, బిలిగుండ్లు వద్ద తమిళనాడుకు అందాల్సిన నిష్పత్తి నీరు 26.954 టీఎంసీలుగా ఉండాలని పేర్కొంది. దీనితో పోలిస్తే కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) కేటాయించిన 4.536 టీఎంసీలు చాలా తక్కువని తమిళనాడు ఆరోపించింది. మొత్తంగా కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు ఇవ్వాల్సిన 26.954 టీఎంసీల న్యాయమైన వాటాను పంచుకోవడంలో విఫలమైందని తమిళనాడు ప్రభుత్వం తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. -
యుమునా నది వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2016లో ఢిల్లీలోని యమునా నది వరద మైదానాల్లో నిర్వహించిన ‘వరల్డ్ కల్చర్ ఫెస్టివల్’ కారణంగా పర్యావరణానికి నష్టం జరిగిందన్న ఆరోపణలపై విధించిన రూ.5 కోట్ల జరిమానాను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ కార్యక్రమం వల్ల యమునా నది సున్నితమైన పర్యావరణ వ్యవస్థకు నష్టం జరిగినట్లు నిర్ధారించే ప్రత్యక్ష ఆధారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలోని రిజిస్టర్డ్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ వ్యక్తి వికాస్ కేంద్ర చెల్లించిన రూ.5 కోట్ల మొత్తాన్ని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ రోజు శనివారం ఈకేసును విచారించిన సుప్రీంక్రోర్టు కీలక తీర్పు ఇచ్చింది.2017లో ఎన్జీటీ జరిమానా2016 మార్చి 11 నుంచి 13 వరకు ఢిల్లీలో యమునా నది ఒడ్డున ‘వరల్డ్ కల్చర్ ఫెస్టివల్’ నిర్వహించారు. కార్యక్రమం కోసం యమునా వరద మైదానాలను సిద్ధం చేయడం వల్ల పర్యావరణానికి నష్టం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) 2017 డిసెంబర్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ను నష్టానికి బాధ్యులుగా పేర్కొంది. పర్యావరణ నష్టానికి పరిహారంగా రూ.5 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అయితే ఆ కేసుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు తాజాగా ఆ కేసులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ తప్పిదమేమి లేదని తేల్చింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని కార్యక్రమంతో నేరుగా అనుసంధానించే ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.DDAపైనాా సుప్రీంకోర్టు ఆగ్రహంఈ సందర్భంగా యమునా వరద మైదానాలను పరిరక్షించడంలో DDA తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.అదే సమయంలో, యమునా వరద మైదానాల పునరుద్ధరణకు సంబంధించి NGT ఇచ్చిన ఆదేశాల ప్రకారం చేపట్టిన పనులను DDA కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారం చాలా ఏళ్ల పాటు సుప్రీంకోర్టులో ఎన్నో ఏళ్లపాటు న్యాయపోరాటంగా కొనసాగగా తాజా సుప్రీం తీర్పుతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు ఉపశమనం లభించింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ 1981లో స్థాపించారు. -
కేసులను ఎత్తేయాల్సిందే
న్యూఢిల్లీ: చలో సంసద్ ర్యాలీ సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తత వేళ విద్యార్థులపై పోలీసులు మోపిన కేసులను రద్దుచేసేందుకు సుప్రీంకోర్టు సానుకూలత వ్యక్తంచేసినా అందుకు మోదీ ప్రభుత్వం సముఖంగా లేదని కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘జూలై 25న సీజేపీకి మోదీ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే. విద్యార్థులపై కేసులు ఎత్తేయాలి. ఈ దిశలో ఆలోచనచేసిన సుప్రీంకోర్టు ఎదుట ప్రభుత్వం మోకాలడ్డొద్దు. అలా చేస్తే సీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ రెండ్రోజుల్లో సమావేశమై మళ్లీ జాతీయస్థాయి ఉద్యమానికి రంగం సిద్ధంచేస్తుంది’’అని ఆయన హెచ్చరించారు. ‘‘విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ల జాబితా ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరితే ప్రభుత్వం ఆ జాబితాను ఉద్దేశపూర్వకంగా అందజేయలేదు. జాబితా ఇస్తే ఆ కేసులన్నింటినీ 142వ అధికరణం ద్వారా దఖలుపడిన అధికారం ద్వారా రద్దుచేస్తామని కోర్టు మంగళవారం మూడు సార్లు గుర్తుచేసి, జాబితా అడిగినా ప్రభుత్వం సమర్పించలేదు. ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయాలకు తగ్గట్లే దీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇద్దరు కేంద్ర మంత్రులు మాట ఇచ్చి తప్పారు. యావత్ భారత దేశ యువత నమ్మకంతో ఆటలాడతామంటే మేం చూస్తూ ఊరుకోం. ఇకనైనా కోర్టు నియమించిన హైపవర్ కమిటీలో సీజేపీకి ప్రాతినిధ్యం ఇవ్వాలి. పోలీసుల దారుణాలను వివరించే అవకాశం ఇవ్వాలి’’అని దాస్ కోరారు. -
పోలీస్ చర్యపై దర్యాప్తుకు హైపవర్ కమిటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంలో పార్లమెంట్ ఎదుట నిరసన వ్యక్తం చేసేందుకు చలో సంసద్ ర్యాలీగా దూసుకొచ్చిన విద్యార్థులను పోలీసులు బాష్పవాయుగోళాలతో అడ్డుకుని లాఠీచార్జ్ చేసి విచక్షణారహితంగా చితకబాదారన్న ఆరోపణలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. పార్లమెంట్ సాక్షిగా ఉద్యమకారులపై ఢిల్లీ పోలీసుల అతి బలప్రయోగం ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు అత్యున్నతస్థాయి(హైపవర్) కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం మంగళవారం ప్రకటించింది. పోలీసుల అత్యుత్సాహంతో వందలాది మంది గాయాలపాలయ్యారని, ఈ ఘటనలో పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పలు పిటిషన్లను సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి మోహనల బెంచ్ విచారించి పై విధంగా ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టులో, హైకోర్టులో పదవీవిరమణ చేసిన న్యాయమూర్తులు, మాజీ డీజీపీ, మాజీ సీబీఐ డైరెక్టర్లను సభ్యులుగా ఎంపికచేస్తూ హైపవర్ కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు బెంచ్ తెలిపింది. ర్యాలీలో బాధితులుగా మారిన ఉద్యమకారులు నేరుగా ఈ కమిటీని సంప్రదించి తమ ఫిర్యాదులు, ఆరోపణలు తెలియజేయవచ్చు. కమిటీ ఇచ్చే సిఫార్సులను కోర్టు పరిశీలిస్తుంది. తగు చట్టబద్ధమైన నిర్ణయాలను మేం తీసుకుంటాం’’అని ధర్మాసనం తెలిపింది. ‘‘ఉద్యమిస్తున్న మహిళలతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలపైనా కమిటీ దర్యాప్తు చేయనుంది. ఉద్యమకారిణులను ఆన్లైన్లో వేధించిన ఉదంతాలు, సోషల్‌మీడియా ద్వారా బెదిరించిన ఘటనలనూ, మహిళా కార్యకర్తలు చేసిన ఫిర్యాదులనూ హైపవర్ కమిటీ పరిశీలిస్తుంది. పరీక్షార్థుల ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రతి కోణంలోనూ కమిటీ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ఉదంతంలో నేరస్తులుగా తేలిన వారిపై కఠిన శిక్షలుంటాయి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిని గుర్తించేందుకు జూలై 20వ తేదీనాటి ఘటనాస్థలి ఫొటోలు, వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలను హైపవర్ కమిటీకి ఢిల్లీపోలీసులు అందజేయాలి’’అని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సీజేఐ సూర్యకాంత్ ఆదేశించారు. వాళ్లకెంతో భవిష్యత్ ఉంది.. ఈ సందర్భంగా విద్యార్థులపై మోపిన కేసులను ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘ఇది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం. అక్రమ ఎఫ్ఐఆర్లను తొలగించాల్సిన సమయమిది. రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రకారం నిరసన తెలిపే హక్కు విద్యార్థులు, పరీక్షార్థులకు ఉంది. అనవసరంగా విద్యార్థులపై మోపిన ఎఫ్ఐఆర్లను తొలగించే హక్కు రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టుకు ఉంది’’అని ధర్మాసనం గుర్తుచేసింది.కేసుల మాఫీపై సొలిసిటర్ జనరల్ తుషార్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘ఆ రోజు ఆందోళనల్లో 2,800 మంది అసాంఘీక శక్తుల పాత్ర ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వాళ్లకు నేర చరిత్ర ఉంది. జూలై 20న సంసద్ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీయానికి వీళ్లే కారణం. వీళ్లను గుర్తించేందుకు ఫేíషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, నిఘా సాధనాలను ఉపయోగించాల్సి వచ్చింది’’అని తెలిపారు. దీనిపై కోర్టు స్పష్టతనిచ్చింది. ఫేíషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, నిఘా, ప్రైవసీ అనే అంశాలు ఈ కేసులో ఉల్లంఘనకు గురయ్యాయా లేదా అనేవి కమిటీ నిర్ణయించదు. కోర్టు నిర్ణయిస్తుంది’’అని ధర్మాసనం స్పష్టంచేసింది.సమర్ధించుకున్న ఢిల్లీ పోలీసులు విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు అతిగా బలప్రయోగం చేశారన్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ కౌంటర్ అఫిడవిట్ సమరి్పంచారు. ‘‘ఆరోజు జంతర్‌మంతర్ వద్ద 30,000 మందికిపైగా నిరసనకారులు గుమిగూడారు. సంసద్ ర్యాలీకి అనుమతి లేదు. విద్యార్థులను నియంత్రించేందుకు సుమారు 5 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు. బారికేడ్లు తోసేసి పార్లమెంట్ దిశగా దూసుకొస్తున్న నిరసనకారులను నిలువరించగా తోపులాట జరిగింది.ఈ ఘటనలో 240 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. 200 మంది పౌరులు, నిరసనకారులు సైతం గాయపడ్డారు. ఉద్యమంలో సంఘవిద్రోహ శక్తులు, నేరచరితులు చొరబడ్డారు. వీరిలో 2,873 మందిపై గతంలోనే క్రిమినల్ కేసులు ఉన్నాయి’’అని పోలీసులు తెలిపారు. నిరసనల సమయంలో సాధారణ దుస్తుల్లో లాఠీలతో కనిపించిన పోలీసు సిబ్బందికి సంబంధించిన వీడియోలపై కూడా ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు.ఇలా సాధారణ దుస్తుల్లో పోలీసులను గుంపుల్లో కలిపి విధులు నిర్వహించడం చట్టవిరుద్ధం కాదని, అసాధారణమైన చర్య కూడా కాదని పేర్కొన్నారు. పార్లమెంట్, రాష్ట్రపతిభవన్, సేవా తీర్థ్, కర్తవ్యభవన్, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర మంత్రుల అధికారిక నివాసాలున్న ఆ ప్రాంతంలో అవాంఛనీయ ఘటన జరక్కుండా తాము సరైన నిర్ణయమే తీసుకున్నట్లు పోలీసులు తమ చర్యను సమర్ధించుకున్నారు. -
ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట.. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు..
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(73)ను వైద్య పరీక్షల కోసం ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్‌ను ఆసుపత్రిలో చేర్పించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. జైలు అధికారులు ఆయన కుటుంబ సభ్యులతో వారానికి ఒకసారి సమావేశం అయ్యేలా చూడాలని కూడా ఆదేశించింది. 2023 నుంచి ఖాన్ అదియాలా జైలులో ఉన్నారు. అల్-ఖాదిర్ ట్రస్ట్, ప్రభుత్వ బహుమతుల కేసుల్లో అవినీతి, అధికారిక ప్రభుత్వ రహస్యాల లీక్, చట్టవిరుద్ధ వివాహం సహా పలు నేరారోపణలు, పెండింగ్ కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు.మంగళవారం కోర్టు వైద్య బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ బోర్డులో ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత వైద్యుడు, ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్‌ను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించింది. కంటి సమస్యకు చికిత్స కోసం ఇంతకుముందు కూడా ఆయనను ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి పలుసార్లు తరలించారు. ఆయనకు కుడి కంటిలోని కేంద్ర రెటీనా సిరలో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడిన సమస్య ఉంది. ఈ సమస్య తొలిసారిగా జనవరి చివర్లో వెలుగులోకి వచ్చింది. అదియాలా జైలు అధికారులు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం మెరుగుపడుతోందని గతంలో తెలిపారు. ఆయన కంటిలో స్పష్టమైన మెరుగుదల కనిపించిందని, చూపు దాదాపు సాధారణ స్థితికి తిరిగి వచ్చిందని చెప్పారు. -
సీజేపీ నిరసనలపై స్వతంత్ర దర్యాప్తు.. సుప్రీంకోర్టు ఆదేశం
ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలపై స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటైర్డ్ న్యాయమూర్తి, డీజీపీ నేతృత్వంలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరగనుంది. మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలపై సుప్రీంకోర్టులో ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ ఆందోళనలో 240 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని అఫిడవిట్లో పేర్కొన్నారు. 5 వేల మంది భద్రత సిబ్బంది విధుల్లో ఉన్నారని వెల్లడించారు. నిరసనకారులపై అత్యంత నియంత్రణతో అవసరమైన బలగాలను మాత్రమే ఏర్పాటు చేసినట్టు అఫిడవిట్లో ఢిల్లీ పోలీసులు చెప్పారు. NEET-UG CBSE పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 6న జంతర్ మంతర్ వద్ద ఈ నిరసనలు తెలిపారని అఫిడవిట్ లో పేర్కొన్నారు పోలీసులు.జూన్ 20న సాయంత్రం 5 గంటల వరకు ధర్నాకు అనుమతి ఇచ్చినప్పటికీ నిరసనకారులు ఖాళీ చేయలేదని అఫిడవిట్ లో పేర్కొన్నారు. జులై 20న 'చలో సంసద్' మార్చ్ పిలుపుతో ఉద్రిక్తత పెరిగిందని, ఈ మార్చ్‌కు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిరసనకారులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని, ఒక ప్రభుత్వ భవనాన్ని ధ్వంసం చేసి అక్కడి ఇటుకలతో దాడి చేశారని అఫిడవిట్లో తెలిపారు. 30,000 మందికి పైగా నిరసనకారులు ఆందోళలో పాల్గొన్నారన్నారు. నిరసనకారులపై అధిక బల ప్రయోగం చేయలేదని, పార్లమెంట్ మార్చ్ చట్ట విరుద్ధమని తెలిపారు. -
తమిళనాడుకు కావేరి నీళ్లివ్వండి
సాక్షి బెంగళూరు: అసలే వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న కర్ణాటకకు మరో షాక్ తగిలింది. తమిళనాడుకు నీటిని వదలాలని, ఈ మేరకు కావేరి నీటి నిర్వహణ ప్రాధికార సంస్థ (సీడబ్ల్యూఆర్సీ) ఆదేశాలను పాటించాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రతి రోజూ 12 వేల క్యూసెక్కులు తమిళనాడుకు వదలాల్సి ఉంది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలను పాటించాలని చెబుతూ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాకుండా ప్రస్తుత స్థితిగతులపై నివేదిక సమర్పించాలని కూడా సూచన చేసింది. కొంత సమయం పడుతుంది : కర్ణాటక కర్ణాటక నుంచి ప్రతిరోజూ 12 వేల క్యూసెక్కులు విడుదల చేయాలని సీడబ్ల్యూఆర్సీ సూచించినట్లు సుప్రీంకోర్టు దృష్టికి తమిళనాడు తీసుకొచి్చంది. సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలను కర్ణాటక పూర్తిగా పాటించడం లేదని ఆరోపించింది. దీనిపై బిళిగుండ్లు వద్ద నీటి పరిమాణం బాగా తగ్గిపోయిందని, తమిళనాడు కోరుతున్నట్లు 12 వేల క్యూసెక్కులు విడుదల చేసేందుకు కొంత సమయం పడుతుందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. కావేరి పరీవాహక ప్రాంతంలో వర్షాలు లేక, రిజర్వాయర్లలో ఆశించిన మేర నీటి నిల్వలు లేవని పేర్కొంది. అయినా సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలను పాటించేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందని వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సీడబ్ల్యూఆర్సీ ఆదేశాల మేరకు ప్రతిరోజూ 12 వేల క్యూసెక్కులు తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. -
సుప్రీంకోర్టులో రాహుల్‌గాంధీకి భారీ ఊరట
సాక్షి, ఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు హైకోర్టు విచారణను కొనసాగించవద్దని అలహాబాద్ కోర్టుకు.. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. సీబీఐ, ఈడీలు హైకోర్టుకు ఎలాంటి నివేదిక సమర్పించరాదని తెలిపింది. ఈ కేసును విచారించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రాహుల్ గాంధీపై నమోదైన పిటిషన్‌ను విచారించిన అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం, ఈ ఆరోపణలపై సీబీఐ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు జరపాలని ఆదేశించింది. దర్యాప్తు పురోగతికి సంబంధించి నివేదికలు సమర్పించాలని, ఈడీ కూడా తగిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు అంత తీవ్రమైనవి అయితే మీ ఏజెన్సీలు ఇప్పటివరకు ఎందుకు మౌనంగా ఉన్నాయని ధర్మాసనం నిలదీసింది. "కోర్టు నుంచి ఆదేశాలు రావాల్సిందేనా? మీ అంతట మీరుగా సుమోటోగా ఎలాంటి చర్యలు తీసుకోలేదా?" అని జస్టిస్ బాగ్చి దర్యాప్తు అధికారులను ప్రశ్నించారు.కోర్టులో ఇరు పక్షాల వాదనలు.. రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ విఘ్నేష్ శిశిర్‌కు ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసే అర్హత లేదని ప్రశ్నించారు. ఇది చట్టబద్ధత లేని, పూర్తిగా కక్షసాధింపు చర్య అని, పిటిషనర్ పదేపదే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. సీబీఐ కేవలం ఫిర్యాదును ధృవీకరించడం మించి ఏమీ చేయలేదని ఆయన పేర్కొన్నారు.కేంద్ర దర్యాప్తు సంస్థల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) ఎస్.వి. రాజు వాదిస్తూ.. ఇప్పటివరకు ఈ కేసులో తమ పాత్రేమీ లేదని, ఒకవేళ ఫిర్యాదులో గమనించదగ్గ నేరాలు ఉన్నట్లు తేలితే అది చాలా తీవ్రమైన విషయమవుతుందని తెలిపారు. కాగా, రాహుల్ గాంధీపై వచ్చిన అక్రమాస్తుల ఆరోపణలను ధృవీకరించాలని సీబీఐ, ఈడీలను ఆదేశిస్తూ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ జూలై 20న ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. సీబీఐ సమర్పించిన అఫిడవిట్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, దీనిపై వ్యక్తిగతంగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రస్తుతానికి ఆయనకు ఊరట లభించింది. -
కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్.. విజయ్‌కు గుడ్‌న్యూస్
ఢిల్లీ: కావేరి జలాల విషయంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కావేరి జల నిర్వహణ అథారిటీ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు 12 రోజుల పాటు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున కావేరి నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించినట్లు సమాచారం.కావేరి నీటి విడుదలపై కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి వివాదం నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నీటి లభ్యత, రాష్ట్ర రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలపై కర్ణాటక అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. కావేరి అథారిటీ నిర్ణయాలను అమలు చేయాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.అసలు కథ ఇదే.. కావేరి జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి వివాదం ముదిరింది. సుప్రీంకోర్టు తాజాగా కావేరి జల నిర్వహణ అథారిటీ ఆదేశాలను కర్ణాటక అమలు చేయాలని స్పష్టం చేయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. అసలు కావేరి నీటి విషయంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇంతటి వివాదం ఎందుకు? ఈ నీటి పంచాయితీ ఎక్కడ మొదలైంది?..బ్రిటిష్ కాలం నుంచే వివాదం.. కావేరి నది కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో పుట్టి.. కర్ణాటక, తమిళనాడు మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదిపై ఆధారపడి రెండు రాష్ట్రాల్లోనూ లక్షలాది మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. దీంతో కావేరి నీటి పంపకం రెండు రాష్ట్రాలకూ అత్యంత కీలకంగా మారింది. కావేరి నీటి పంపకంపై కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. బ్రిటిష్ కాలం నాటి 1892, 1924 ఒప్పందాల నుంచే నీటి వినియోగంపై విభేదాలు ఉన్నాయి. ఎగువ ప్రాంతంలో ఉన్న కర్ణాటకలో కొత్త ప్రాజెక్టులు, సాగు విస్తరణతో దిగువన ఉన్న తమిళనాడుకు నీటి లభ్యత తగ్గుతోందని ఆ రాష్ట్రం చాలాకాలంగా వాదిస్తోంది.1986లో తమిళనాడు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో వివాదం అధికారికంగా అంతర్రాష్ట్ర జల వివాదంగా ముందుకు వచ్చింది. 1990లో కావేరి జల వివాదాల ట్రైబ్యునల్ ఏర్పాటైంది. 2007లో ట్రైబ్యునల్ తుది తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత కూడా నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి మధ్య నీటి పంపకంపై న్యాయపోరాటం కొనసాగింది. 2018లో సుప్రీంకోర్టు ట్రైబ్యునల్ అవార్డులో కొన్ని మార్పులు చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. అనంతరం కేంద్రం కావేరి వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ, సంబంధిత వ్యవస్థలను ఏర్పాటు చేసింది. కావేరి నీటి విడుదలపై నిర్ణయాలు తీసుకోవడంలో ఈ సంస్థలు కీలకంగా మారాయి.కర్ణాటక అభ్యంతరం.. అయితే కావేరి నీటి పంపకం వర్షపాతంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కర్ణాటకలో వర్షాలు తక్కువగా ఉండి జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గినప్పుడు తమిళనాడుకు నీటిని విడుదల చేయడం తమ రైతులకు ఇబ్బందిగా మారుతుందని కర్ణాటక చెబుతోంది. మరోవైపు కావేరి డెల్టాలో పంటలకు నీరు అవసరమని, తమకు కేటాయించిన వాటాను కర్ణాటక విడుదల చేయాల్సిందేనని తమిళనాడు వాదిస్తోంది. తాజా వివాదంలో కర్ణాటక నుంచి తమిళనాడుకు రోజుకు 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న ఆదేశాలపై కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా కావేరి జల నిర్వహణ అథారిటీ ఆదేశాలను కర్ణాటక పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.కావేరి వివాదం కేవలం నీటి పంపకానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. రెండు రాష్ట్రాల రైతుల జీవనాధారం, ప్రాంతీయ భావోద్వేగాలు, రాజకీయాలు ఈ అంశంతో ముడిపడి ఉన్నాయి. కర్ణాటకలో నీరు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగితే.. తమిళనాడులో తమకు రావాల్సిన నీటిని కర్ణాటక అడ్డుకుంటోందనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అందుకే ప్రతి ఏడాది వర్షాలు, జలాశయాల్లో నీటి నిల్వలు, పంటల అవసరాలు మారినప్పుడల్లా కావేరి వివాదం మళ్లీ తెరపైకి వస్తూనే ఉంటుంది. తాజా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరి నీటి పంచాయితీ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. -
సినిమాలో పాట లేదని కోర్టు మెట్లు ఎక్కిన మహిళ
ట్రైలర్లో ఉన్న పాట సినిమాలో లేకపోతే ఏం చేస్తారు? తిట్టుకుంటూ బయటకు వస్తారా? డబ్బులు వృథా అయ్యాయని బాధపడతారా? అయితే ఓ మహిళా ప్రేక్షకురాలు ఇలా చేయలేదు. కోర్టుకెక్కింది... వినియోగదారుగా తన హక్కుల కోసం పోరాడింది. ఆ పాట కోసం ఔరంగాబాద్ నుంచి ఢిల్లీ వరకు న్యాయ పోరాటం సాగించింది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సమస్యకు శుభం కార్డు పడింది.బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హీరోగా యశ్‌రాజ్ ఫిలిమ్స్(వైఆర్ఎఫ్) 2016లో ‘ఫ్యాన్’ సినిమాను నిర్మించింది. సినిమా విడుదలకు ముందు టెలివిజన్, సోషల్ మీడియాలో ప్రమోషనల్ ట్రైలర్ విడుదల చేసింది. ట్రైలర్‌లోని ‘జబ్రా’ ఫ్యాన్ పాట సినీ అభిమానులను ఉర్రూతలూగించింది. సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఔరంగాబాద్‌కు చెందిన ఓ స్కూల్ టీచర్ ఈ ట్రైలర్ చూసి కుటుంబంతో సినిమాకు వెళ్లారు. సినిమా పూర్తయినా ఆ పాట మాత్రం రాలేదు. దీంతో ఆమె నిరుత్సాహానికి గురై జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.ట్రైలర్‌లోని పాటను తొలగించి చిత్ర నిర్మాణ సంస్థ మోసం చే సిందని , దీనివల్ల తాను మానసిక వేదనకు గురయ్యానని జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. రూ. 60,500 నష్టపరిహారం కోరారు. టికెట్ కొనుగోలు చేసినంత మాత్రాన నిర్మాత నేరుగా సేవలందించే సంస్థగా మారడని ఫోరం పేర్కొంది. వినియోగదారుడికి..సంస్థకు మధ్య ఎలాంటి చట్టబద్ధమైన హామీ లేదని.. కేసు చెల్లదని కేసు తిరస్కరించింది.ఫిర్యాదుదారుకు అనుకూలంగా..ఆ తీర్పుపై ఫిర్యాదుదారు రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. .సినిమా ప్రదర్శన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంలోని ‘సేవ’ నిర్వచనం పరిధిలోకి వస్తుందని, వైఆర్ఎఫ్ ఆ సేవను అందించే సంస్థగా కమిషన్ పేర్కొంది. జబ్రాఫ్యాన్ పాటను తొలగించి సంస్థ ప్రేక్షకులను పక్కదోవ పట్టించింది. ఇది అన్యాయ వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని అభిప్రాయపడింది. . పరిహారంగా రూ. 10,000, కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ.5,000 పిర్యాదుదారుకి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ)ను సంస్థ ఆశ్రయించింది. రాష్ట్ర కమిషన్ అభిప్రాయాన్నే ఎన్సీడీఆర్సీ కూడా సమర్థించింది.ఆఫర్.. అంగీకారం ఉండాలి..ఈ తీర్పుపై వైఆర్ఎఫ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రైలర్ సినిమాకు సంబంధించిన ప్రకటన మాత్రమే అని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కింద రక్షణ ఉంటుందని పేర్కొంది. అయితే మోసపూరితమైన, అన్యాయమైన, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు రాజ్యాంగ రక్షణ ఉండదని స్పష్టం చేసింది. ట్రైలర్ చూసి ప్రేక్షకుడు ప్రభావితం కావొచ్చు..కానీ చట్టబద్ధమైన హామీగా దీన్ని భావించలేమని కోర్టు వివరించింది. టికెట్ కొని సినిమా చూసే ప్రతీ వ్యక్తి వినియోగదారుడే అనడంలో సందేహం లేదని పేర్కొంది. సేవల్లో లోపం జరిగిందా? లేదా? అనేదే ఈ కేసులో కీలకాంశమని చెప్పింది.అసంపూర్ణత, నాణ్యతలో నాసిరకం, పనితీరు సక్రమంగా లేకపోవడం, తయారీలో తగిన ప్రమాణాలు పాటించకపోవడాన్నే సేవల్లో లోపంగా గుర్తించాలని పేర్కొంది. సినిమాలో ఆ పాట తప్పనిసరిగా ఉంటుందనేది ఫిర్యాదుదారు వ్యక్తిగత అంచనా మాత్రమే అని తెలిపింది. దీన్ని చట్టపరంగా సేవల్లో లోపంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.చట్టబద్ధమైన ఒప్పందం ఏర్పడాలంటే ‘ఆఫర్’ ఉండాలి..ఆ ఆఫర్‌ను మరో పక్షం అంగీకరించాలని చెప్పింది. ట్రైలర్‌ను ‘ఆఫర్’గా భావించలేమని అందువల్ల కాంట్రాక్టు చట్టం ప్రకారం ఈ వాదన సరైంది కాదని తేల్చింది. ప్రతి చిన్న తేడా లేదా ప్రతి నిరాశ ‘అన్యాయ వాణిజ్య పద్ధతి’ నిర్వచనం పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే ప్రచారం, ప్రకటన, వాస్తవానికి విరుద్ధంగా ఉన్నప్పుడే అది ‘అన్యాయ వాణిజ్య పద్ధతి’ కిందకు వస్తుందని పేర్కొంది. ఈ కేసులో ఇవేవీ రుజువు కాలేదని వివరించింది.యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఉద్దేశపూర్వకంగా ప్రేక్షకులను మోసం చేసిందని, తప్పుదోవ పట్టించిందని నిరూపించే బలమైన ఆధారాలను ఫిర్యాదుదారు సమర్పించలేదని కోర్టు పేర్కొంది. సినిమా నిర్మాణ ప్రక్రియలో ఉన్న పలు అంశాలు చివరి దశలో మారడం సహజమేనని కళాత్మక సేవలను సాధారణ సేవలతో పోల్చలేమని వివరించింది. అన్ని అంశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ఎన్సీడీఆర్సీ ఉత్తర్వును రద్దు చేసింది. ప్రచార ట్రైలర్లో కనిపించిన పాట సినిమాలో లేకపోవడం సేవల్లో లోపం, అన్యాయ వాణిజ్య పద్ధతి కిందకు రాదని తీర్పు ఇచ్చింది.- దిలీప్ మాదిరెడ్డి -
అమరావతి రైతులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
సీఎం విజయ్ కు బిగ్ రిలీఫ్
-
అమరావతి రైతులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తామని తెలిపింది. రైతులకు అన్యాయం జరిగితే ఎట్టిపరిస్థితుల్లో చూస్తూ ఊరుకునేది లేదని పేర్కొంది. భూములు ఇచ్చి నష్టపోయిన రైతుల పక్షానే అత్యున్నత ధర్మాసనం ఉంటుందని స్పష్టం చేసింది. ల్యాండ్ పూలింగ్ చట్టాలపై అభ్యంతరాలుంటే రైతులు కోర్టులను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. -
విజయ్ సర్కార్‌కు బిగ్ విక్టరీ
కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు బిగ్ రిలీఫ్ లభించింది. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు తమిళనాడు సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన విషయంలో ఈ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కరూర్ బాధిత కుటుంబాలకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం సరైంది కాదని ఈ ఉద్యోగాలు చెల్లవని ఈ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది.కాగా గతేడాది సెప్టెంబర్‌లో కరూర్‌లో టీవీకే నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తొక్కిసలాట జరిగి 41మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ క్రమంలో గత నెలలో సీఎం విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలలోని 32 మందికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందించారు. ఆ నియామకాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు కరూర్ బాధిత కుటుంబాలకు సీఎం విజయ్ అందించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు చెల్లవని స్పష్టం చేసింది. రాజ్యాంగ పరిమితులకు లోబడే వ్యవహరించాలని ఆదేశించింది. బాధితులకు ఆర్ధిక సాయం అందించవచ్చు. కానీ ఉద్యోగం ఇవ్వడం సమంజసం కాదని తెలిపింది. ప్రభుత్వ బస్సుల్లో మరణించినవారికి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది అర్హత, నిర్దేశిత నియామక ప్రక్రియ (TNPSC వంటి పరీక్షలు) ద్వారా రావాలే తప్ప, ఇలా ఉచితంగా పంచేది కాదని స్పష్టం చేసింది.ఇది సాధారణ అభ్యర్థుల సమానత్వ హక్కును దెబ్బతీస్తుందని పేర్కొంది. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ఎంతైనా ఆర్థిక సాయం అందించుకోవచ్చని, కానీ రాజ్యాంగ నిబంధనలు, పరిమితులను దాటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. అర్హత ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పెట్టేది కాదని వ్యాఖ్యానిస్తూ కరూర్ బాధితులకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టేవిధించింది. దీంతో కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఊరట లభించింది. -
డేరా బాబా విడుదలపై సుప్రీంకోర్టు సీరియస్!
న్యూఢిల్లీ: జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్పందన కోరింది. ఈ కేసుకు సంబంధించి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తో పాటు సీబీఐ కూడా ఎనిమిది వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను 2026 నవంబర్ 16వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.2002 అక్టోబర్‌లో జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ నవంబర్ 21న మృతి చెందారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయగా, 2019 జనవరిలో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు గుర్మీత్ రామ్ రహీంతో పాటు మరో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ రామ్ రహీమ్ హైకోర్టును ఆశ్రయించగా, తగినన్ని సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ 2026 మార్చిలో పంజాబ్, హర్యానా హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది.దిగువ కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేసింది. కాగా, ఈ కేసులోని మరో ముగ్గురు దోషుల శిక్షలను మాత్రం హైకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ రామచంద్ర ఛత్రపతి కుమారుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుపై అప్పీల్ చేయలేదని ప్రస్తావిస్తూ రామ్ రహీమ్, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన నిర్దోషిత్వ తీర్పుపై నవంబర్‌లో జరిగే విచారణలో సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: కొరియా కార్యాలయాల్లో.. బయటకు చెప్పుకోలేని ఐదు నిజాలు! -
ప్రధాన న్యాయమూర్తులుగా నలుగురు జడ్జీలు
న్యూఢిల్లీ: నలుగురు న్యాయమూర్తులను వేర్వేరు రాష్ట్రాల హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలిజీయం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కొలీజియం ఈ నెల 6న సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్న వి.కామేశ్వర్‌రావును పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, బాంబే హైకోర్టులో జడ్జీగా పని చేస్తున్న జస్టిస్ రవీంద్ర వి.ఘూగేను కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠిని బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, పంజాబ్–హరియాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశ్వనీకుమార్ మిశ్రాను అదే కోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సూచించింది. -
ఎయిర్టెల్, విఐలకు సుప్రీంకోర్టు నోటీసులు!
బాంబే హైకోర్టు వన్ టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జీలను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం, సుప్రీంకోర్టు టెలికాం ఆపరేటర్లైన భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు నోటీసులు జారీ చేసింది.2008 నుంచి 2012 మధ్య 6.2 MHz కంటే ఎక్కువ స్పెక్ట్రమ్ కలిగి ఉన్న కంపెనీల నుంచి ప్రభుత్వం వన్‌టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలంటూ బాంబే హైకోర్టు జూన్‌లో తీర్పు ఇచ్చింది. దీంతో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట లభించింది.అయితే.. హైకోర్టు తీర్పుతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. స్పెక్ట్రమ్ అనేది పరిమితమైన వనరు కాబట్టి, కంపెనీలు 6.2 MHz కంటే ఎక్కువ స్పెక్ట్రమ్ ఉపయోగించినందుకు ఛార్జీలు చెల్లించాల్సిందేనని కేంద్రం వాదిస్తోంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఇప్పుడు టెలికాం కంపెనీల వివరణ కూడా తీసుకోవాలని నిర్ణయించింది. అందుకే రెండు కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.ప్రస్తుతం.. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. దీంతో హైకోర్టు తీర్పు ప్రస్తుతానికి కొనసాగుతోంది. అయితే.. కేసు తుది నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ వాదనను సమర్థిస్తే.. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలపై భారీగా ఛార్జీల భారం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో ఉన్న టెలికాం కంపెనీలకు ఇది మరింత కష్టమవుతుంది. -
బయోమెడికల్ వ్యర్థాల ఫీజులపై సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆసుపత్రుల నుంచి బయోమెడికల్ వ్యర్థాల సేకరణ, నిర్వహణకు సంబంధించి యాజమాన్యాల నుంచి బెడ్ల (పడకల) సంఖ్య ఆధారంగా ఫీజులు వసూలు చేస్తున్న విధానంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఆసుపత్రుల్లోని బెడ్ల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఫీజులు వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది.అసలేం జరిగిందంటే..ఆసుపత్రుల బయోమెడికల్ వ్యర్థాల పారబోతకు సంబంధించి 2016లో రూపొందించిన నిబంధనల ప్రకారం.. ప్రతి 75 కిలోమీటర్ల పరిధిలోని ఆసుపత్రులన్నీ తమ వ్యర్థాల నిర్వహణను ప్రభుత్వం నిర్దేశించిన ఒక ఉమ్మడి ప్రైవేటు సంస్థకు (సీబీడబ్లూటీఎఫ్) అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆసుపత్రులు తమ వ్యర్థాలను పసుపు, ఎరుపు, నీలం తదితర రంగుల సంచుల్లో వేరుచేసి సదరు సంస్థకు ఇవ్వాలి. అయితే, ఆ వ్యర్థాల పరిమాణం, బ్యాగుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా.. ఆసుపత్రిలోని మొత్తం బెడ్ల సంఖ్య ఆధారంగా ఫీజులను వసూలు చేస్తుండటాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. -
మీరు కోడిగుడ్లకే భయపడుతున్నారా?: సుప్రీంకోర్టు
ఢిల్లీ: 'స్వాతంత్య్ర సమరయోధులు తుపాకీ గుళ్లను ఎదుర్కొన్నారు.. మీరు కోడిగుడ్లకే భయపడుతున్నారా?' అంటూ టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. మతపరమైన భావాలను దెబ్బతీశారనే ఆరోపణల కేసులో పోలీసుల ఎదుట విచారణకు హాజరవ్వాలని ఎంపీకి కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహువా మోయిత్రా.. విచారణకు వెళ్తే తనపై కోడిగుడ్లపై దాడి చేస్తారని పిటిషన్లో పేర్కొన్నారు.ఇవాళ(శుక్రవారం) జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఆమె విచారణను ఎదుర్కోవాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. విచారణకు హాజరయ్యేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే వర్చువల్ విధానంలో హాజరయ్యేందుకు అనుమతించాలని మోయిత్రా తరఫు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ కోరారు. దీనిపై జస్టిస్ దత్తా స్పందిస్తూ.. "మీరు ఎంపీ అయినంత మాత్రాన ప్రత్యేక మినహాయింపు ఇస్తారా?" అంటూ వ్యాఖ్యానించారు. గతంలో మోయిత్రాపై గుడ్లు విసిరిన ఘటనలను శంకరనారాయణన్ ప్రస్తావిస్తూ.. ఆమె స్వయంగా హాజరైతే మళ్లీ అలాంటి ఘటన జరిగే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు.దీనిపై జస్టిస్ దత్తా స్పందిస్తూ.. ఎంపీగా ఉన్నవారు గుడ్లకు భయపడకూడదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మీపై గుడ్లు విసురుతారని ఎందుకు భయపడుతున్నారు? మన స్వాతంత్య్ర సమరయోధులు తమ ఛాతీపై తుపాకీ గుళ్లను ఎదుర్కొన్నారు" అని వ్యాఖ్యానించారు. దీంతో తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటానని శంకరనారాయణన్ కోరగా.. దానికి ధర్మాసనం అనుమతించింది. -
ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్‌గా ఘనత
Justice Abha Nayar Patel ఢిల్లీలో పుట్టి పెరిగిన అభా నాయర్ జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించారు. అభాకు ఏడేళ్ల వయసులో ఆమె కుటుంబం ఉపాధి కోసం 1973లో జాంబియాకు వెళ్లింది.అంతేకాదు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ ఆహ్వానం మేరకు భారత సుప్రీంకోర్టు ధర్మాసనం (Judicial Dais)పై ఆసీనులైన తొలి జాంబియా న్యాయమూర్తిగా కూడా ఆమె నిలిచారు.ఆమె భారతదేశ పర్యటలో భాగంగా సుప్రీంకోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ (SCAORA) నిర్వహించిన "న్యాయం అందించే భవిష్యత్తు: ఆవిష్కరణ, సమ్మిళితం మరియు సమగ్రత" అనే అంశంపై జస్టిస్ పటేల్ ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ వి. మోహన కూడా ప్రసంగించారు. జస్టిస్ సూర్య కాంత్ ఆహ్వానం మేరకు జస్టిస్ అభా నాయర్ భారత సుప్రీంకోర్టు న్యాయపీఠాన్ని అలంకరించడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయ నిర్ణయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించడం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అల్గారిథమ్‌ల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల గతంలో ఉన్న పక్షపాతాలు (historical bias) మళ్లీ పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్నారు. న్యాయ వితరణలో ఆవిష్కరణ (Innovation), నిబద్ధత (Integrity), సమ్మిళితత్వం (Inclusivity) అనే మూడు అంశాలు కీలకమని తెలిపారు. “సమగ్రత లేని ఆవిష్కరణ ప్రమాదకరం. సమ్మిళితత్వం లేని సమగ్రత అసంపూర్ణం, అలాగే ఆవిష్కరణ లేని సమ్మిళితత్వం తరచుగా ప్రభావం చూపలేనంత నెమ్మదిగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. న్యాయస్థానాలలో సాంకేతిక సాధనాలను ఉపయోగించేటప్పుడు, అవి తీర్పు ఫలితాల నిష్పక్షపాతాన్ని, అలాగే న్యాయం పొందే అవకాశాన్ని రెండింటినీ మెరుగుపరిస్తే తప్ప వాటిని ఉపయోగించకూడదని జస్టిస్ అభా నాయర్ పటేల్ అన్నారు. అనియంత్రిత ఆవిష్కరణలు ఇప్పటికే ఉన్న అసమానతలను కేవలం "డిజిటలైజ్" చేయగలవని ఆమె హెచ్చరించారు.జాంబియా కోర్టు రికార్డుల డిజిటలైజేషన్ అండ్ వర్చువల్ సాక్ష్యం దిశగా నెమ్మదిగానే అయినప్పటికీ, అర్థవంతమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ సందర్బంగా జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ సాంకేతికత వల్ల భారతదేశంలో సామాన్యులకు న్యాయం చేరువైందని, సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించే అవసరం లేకుండా కేసుల విచారణను ట్రాక్ చేసే వెసులుబాటు కలిగిందన్నారు. అయితే ఏఐ న్యాయ నిర్వహణకు సాయపడగలదే తప్ప, న్యాయమూర్తి సానుభూతిని, మానవీయ విచక్షణను ఎంతమాత్రమూ భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.కాగా చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి జాంబియాకు వెళ్లిపోయిన అభానాయర్ అర్కడి విశ్వవిద్యాలయంనుండి లా పూర్తి చేశారు. యుకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ పొందారు. అనంతరం 1989లో జాంబియా బార్లో చేరారు. పర్వతారోహకురాలు కూడా అయిన ఆమె 'కిలిమంజారో' పర్వతాన్నిఅధిరోహించడం మరో విశేషం. 2019లో హైకోర్టు న్యాయమూర్తిగా, 2023 ఏప్రిల్‌లో కోర్ట్ ఆఫ్ అప్పీల్‌కు, ఈ ఏడాది మే 27న జాంబియా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి సాధించారు. -
పౌరసత్వంపై ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌పై ట్రంప్ మరోసారి బాంబు పేల్చారు. ఆ దేశంలోకి వచ్చే శత్రుదేశాల పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికాలో జన్మించడంతో వచ్చే ఆటోమెటిక్ పౌరసత్వ నిబంధనపై సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. బర్త్ టూరిజంపై ఇటీవలే అక్కడి సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కొద్ది వారాల్లోనే మరోసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు.ట్రంప్ మాట్లాడుతూ.. శత్రుదేశాల పౌరులు, విదేశీ ఉగ్రవాద సంస్థల సభ్యుల పిల్లలు మోసపూరిత మార్గాల్లో వీసాలు పొందిన వారి పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ బానిసల పిల్లల కోసమని ప్రస్తుతం దీనిని కొంతమంది వ్యాపారంగా మార్చుకున్నారని ట్రంప్ విమర్శించారు.ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ నేపథ్యంలో అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా రాజ్యాంగ హక్కులను మార్చలేరని ఈ ఆదేశాలను కూడా కోర్టులో సవాలు చేస్తామని పేర్కొంది.ట్రంప్ తెచ్చిన నూతన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్1. మొదటి ఆర్డర్ : ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అమెరికాలో పుట్టే పిల్లలకు ఆటోమేటిక్‌గా లభించే పౌరసత్వం విషయంలో కొన్ని నిర్దిష్ట వర్గాలను అనర్హులుగా చేర్చారు. శత్రు దేశాల వ్యక్తులు, ఉగ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు విదేశీ ప్రభుత్వాల తరఫున లాబీయింగ్ చేసేవారు లేదా ఆ దేశాల కోసం పనిచేసే వ్యక్తులు 2. రెండవ ఆర్డర్ (బర్త్ టూరిజంపై పూర్తి నిషేదం: అమెరికా పౌరసత్వాన్ని (పాస్‌పోర్ట్‌ను) సంపాదించడం కోసమే టూరిస్ట్ వీసాలపై అమెరికాకు వచ్చి పిల్లలను కనే అక్రమ పద్ధతిని అరికట్టడానికి ఈ ఆర్డర్ తెచ్చారు. విదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు/కాన్సులేట్లలోని వీసా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా గర్భిణీలు కేవలం అమెరికాలో ప్రసవించి పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో (మోసపూరితంగా లేదా తప్పుడు సమాచారంతో) వీసా కోరితే, అటువంటి వారి వీసాలను తిరస్కరించాలని ఈ ఆర్డర్ నిర్దేశిస్తుంది.సుప్రీంకోర్టు తీర్పు అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికా గడ్డపై జన్మించే ప్రతి ఒక్కరికీ (అక్రమ వలసదారులు లేదా తాత్కాలిక వీసాలపై ఉన్నవారి పిల్లలతో సహా) ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత (జనవరి 2025లో) బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్‌ను నిరోధిస్తూ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను 6-3 మెజారిటీతో సుప్రీంకోర్టు కొట్టివేసింది. పౌరసత్వ నిబంధనలను మార్చాలంటే అధ్యక్షుడి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు సరిపోవని, రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని కోర్టు తేల్చిచెప్పింది. ఆ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. -
యావజ్జీవ శిక్ష నిలిపివేత.. బెయిల్..
సాక్షి, న్యూఢిల్లీ: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేటలో సంచలనం సృష్టించిన బట్ట లింగయ్య హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న అప్పటి గ్రామ సర్పంచ్ పోలెబోయిన లింగయ్యకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కింది కోర్టు విధించిన జీవితకాల శిక్షను సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. హైకోర్టులో అప్పీల్ పెండింగ్‌లో ఉన్నందున ఆయన్ను బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. ప్రత్యక్ష దాడికి పాల్పడలేదు ఈ పిటిషన్‌పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఘటన జరిగిన సమయంలో లింగయ్య సర్పంచ్‌గా ఉన్నారని, మృతుడి భార్య వాంగ్మూలంలో ఆయన ప్రత్యక్షంగా దాడి చేసినట్టు ఎక్కడా పేర్కొనలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్ నేరుగా దాడి చేయకపోయినా నిందితులను రెచ్చగొట్టి హత్యకు పురికొల్పారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. దాడిలో పిటిషనర్ ప్రత్యక్ష పాత్ర లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేసింది. ఇదీ నేపథ్యం...: 2017 సెపె్టంబర్ 30 దసరా పండుగ రోజున అజీంపేటలోని జమ్మిచెట్టు వద్ద ఎస్సీ వర్గానికి చెందిన బట్ట లింగయ్య దారుణ హత్యకు గురయ్యారు. పాతకక్షల నేపథ్యంలో నాటి సర్పంచ్ పోలెబోయిన లింగయ్య ప్రోద్బలంతో ఆయన అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన నల్లగొండ ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు సర్పంచ్‌తో సహా మొత్తం 18 మందికి జీవితఖైదు విధించింది. కింది కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించినా, ఉపశమనం లభించకపోవడంతో మాజీ సర్పంచ్ పోలెబోయిన లింగయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రహదారి భద్రతలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
దేశంలో పెరుగుతున్న రహదారి ప్రమాదాలు ఒకవైపు కాగా, ప్రమాద బాధితులకు చట్టబద్ధంగా దక్కాల్సిన నష్టపరిహారం అందకుండా పోతుండటం తీవ్ర ఆందోళనకరమైన అంశం. దీనికి ప్రధాన కారణం దేశంలోని రహదారులపై తిరుగుతున్న వాహనాల్లో దాదాపు 56 శాతం వాహనాలకు చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ బీమా (ఇన్సూరెన్స్) లేకపోవడమే. పార్లమెంటరీ కమిటీ, అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలో నమోదైన 30.48 కోట్ల వాహనాల్లో ఏకంగా 16.54 కోట్ల వాహనాలు (ప్రధానంగా ద్విచక్ర వాహనాలు) ఎటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ లేకుండానే యథేచ్ఛగా రోడ్డెక్కుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.‘నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయల్’ పైలట్ ప్రాజెక్ట్జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మోటారు వాహనాల చట్టం-1988 లోని సెక్షన్ 146 అమలుపై కీలక తీర్పు ఇచ్చింది. చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం (పెట్రోల్/డీజిల్) విక్రయించకుండా నిరోధించేలా ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను రూపొందించాలని బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ), కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.సాంకేతికతతో ఆటోమేటిక్ ఈ-చలాన్లుఇంధన విక్రయాల నిలిపివేతకే పరిమితం కాకుండా సాంకేతికతను జోడించాలని కోర్టు స్పష్టం చేసింది. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై ఉన్న ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను 'వాహన్' పోర్టల్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాబేస్‌తో అనుసంధానించాలని ఆదేశించింది. దీనిద్వారా బీమా లేని వాహనాలు రహదారిపైకి రాగానే ఆటోమేటిక్‌గా గుర్తించి వాహనదారుల మొబైల్ ఫోన్లకు ఈ-చలాన్లు వెళ్తాయి. తనిఖీల కోసం ట్రాఫిక్ పోలీసులకు డిజిటల్ హ్యాండ్‌హెల్డ్ పరికరాలు/యాప్‌లు అందుబాటులోకి తేనున్నారు.ఇదీ చదవండి: మళ్లీ నింగినంటుతున్న బంగారం ధరలు -
హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు అదనపు బెంచ్?..ఎంపీ
సాక్షి, ఢిల్లీ:హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు అదనపు బెంచ్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ రోజు (బుధవారం) రాజ్యసభలో జరిగిన చర్చలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి 2,218 కేసులు విచారణ చేయాల్సి వస్తుందన్నారు. హైకోర్టులో అప్పిలేట్ కోర్టులు ఏర్పాటు చేయాలని సీనియర్ మోస్ట్ హైకోర్టు జడ్జితో అప్పిలేట్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. హైకోర్టులో క్రిమినల్ కేసులు సింగిల్ బెంచ్ తర్వాత డివిజన్ బెంచ్ విచారించేలా సీఆర్పీసీలో సవరణ తీసుకురావాలని దీనివల్ల 15శాతం భారం సుప్రీంకోర్టుపై తగ్గుతుందని తెలిపారు. తప్పుడు కేసులు విచారిస్తే భారీగా జరిమానాలు విధించాలని రాబోయే పదేళ్ళను దృష్టిలో ఉంచుకొని వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని నిరంజన్ రెడ్డి రాజ్యసభలో మాట్లాడారు. -
నో ఇన్సూరెన్స్.. ఫ్యూయెల్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వాహనాలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీ లేకుండానే రోడ్లపై సంచరిస్తుండటం తీవ్రమైన విషయమని సుప్రీంకోర్టు పేర్కొంది. సరైన బీమా పత్రాలు లేని వాహనాలకు పెట్రోల్ పంపుల్లో ఇంధనాన్ని నిరాకరించేలా ఓ పైలట్ ప్రాజెక్టును అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. టోల్ ప్లాజాల మీదుగా రాకపోకలు సాగించే వాహనాలకు బీమా ఉందో లేదో ఆటోమేటిక్‌గా తెలుసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది.ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికర్నిషన్ కెమెరాల వినియోగం ద్వారా ఇది సాధ్యమవుతుందని పేర్కొంది. బీమా లేని వాహనాలకు ఆటోమేటిక్ ఈ–చలాన్లు జారీ చేసేందుకు ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, వాహన్ పోర్టల్ సమాచారంతో అనుసంధానించిన ఏఎన్పీఆర్ కెమెరాలను కొన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. పోలీసులకూ ఆ అధికారమివ్వాలి సరైన బీమా పత్రాలు లేని వాహనాలకు ఏ పెట్రోల్ పంపులోనూ ఇంధనం నింపరాదని, సరైన ఇన్సూరెన్స్ పత్రాలను చూపే వరకు ఇదే నిబంధన అమలు కావాలని స్పష్టం చేసింది. దీనివల్ల ఇన్సూరెన్స్ లేని, రిజిస్టర్ కాని వాహనాలను గుర్తించడంతోపాటు, యజమానులు సరైన విధంగా బీమా చేయించుకునేలా ప్రోత్సహించినట్లవుతుందని ధర్మాసనం తెలిపింది. మోటారు వాహన చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలయ్యేలా ఇటువంటి ప్రాజెక్టులు ఉపయోగపడతాయని తెలిపింది. వాహనాల బీమా స్థితిని పరిశీలించే అధికారాన్ని రాష్ట్రాల పోలీసులకు కూడా ఇవ్వాలని, ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని కోరింది. దీనివల్ల అప్పటికప్పుడే బీమా లేని వాహనాలకు జరిమానా విధించడం, బీమా చేయించుకునేలా చేయడానికి వీలవుతుందని తెలిపింది. ఇకపై నాలుగేళ్లు.. ఆరేళ్లు..! కొత్త కార్లకు మూడేళ్లు, సెకండ్ హ్యాండ్ కార్లకైతే ఐదేళ్ల థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు 2018లో ఆదేశాలిచ్చినా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు కాకపోవడం ఆందోళనకరమని ధర్మాసనం పేర్కొంది. దేశంలోని మొత్తం 30.48 కోట్ల వాహనాలకు గాను 16.54 కోట్ల వాహనాలకు, 56 శాతం వరకు ఇన్సూరెన్స్ లేకపోవడం దిగ్భ్రాంతికరమంది. ఇకపై, కొత్త కార్లకు నాలుగేళ్లు, సెకండ్‌హ్యాండ్ కార్లకైతే ఆరేళ్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు సమయంలోనే చేయించుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయాలని ఐఆర్‌డీఏను ఆదేశించింది. బీమా ఆప్షన్లు ఇవ్వాలి మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్–146 కింద బీమా తప్పనిసరి నియమం కేవలం రోడ్డు ప్రమాద బాధితులకు నష్టపరిహారం అందడమే కాదని, వారు సుదీర్ఘమైన కోర్టు కేసుల్లో చిక్కుకోకుండా చూడటం కూడా అని పేర్కొంది. వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ప్రమాద బాధితులు, వారి కుటుంబాలు తగిన సమయంలో సరైన నష్టపరిహారాన్ని పొందే వీలు లేకుండా పోతోందని ఆందోళన వెలిబుచి్చంది. మోటారు వాహనాల చట్టం కింద అవసరమైన కనీస బీమా రక్షణతో ఉండే బేస్ పాలసీతో పాటు, ప్రైవేట్ వాహన యజమానులకు యాడ్–ఆన్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్ సహా పలు పాలసీ ఎంపికలను అందించాలని ఐఆర్‌డీఏను కోరింది. ఈ మేరకు ఒక మోటారు ప్రమాద పరిహార కేసులో విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
సహజీవనంపై సుప్రీం సంచలన తీర్పు
సాక్షి,ఢిల్లీ: సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సహాజీవనంలోనూ గృహాహింస కేసు వర్తిస్తుందని తెలిపింది. పెళ్లయిన మహిళలకు రక్షణ కల్పించే సెక్షన్ 498ఏ.. సహజీవనంలో ఉన్న స్త్రీలకు అప్లై అవుతుందని పేర్కొంది. అయితే ఆ సదరు మహిళ తాము వివాహానికి సిద్ధంగా ఉన్నామని నిరూపించాల్సి ఉంటుందని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది.సహజీవనంలో (లివ్-ఇన్ రిలేషన్షిప్) ఉండే మహిళలకు సైతం వివాహితల మాదిరిగానే భర్త లేదా భాగస్వామి వేధింపులపై రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గృహహింస చట్టం కేవలం గృహహింస నిరోధాకానికి మాత్రమే కాకుండా, క్రిమినల్ చట్టాలు ఇటువంటి బాధితులకు రక్షణ కల్పిస్తాయని కోర్టు తెలిపింది. అయితే దీనికి తప్పనిసరిగా ఇద్దరు పరస్పర వివాహ అంగీకారంతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఈ రక్షణ వర్తిస్తుందని స్పష్టం చేసింది.జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ నోంగ్మీకాపమ్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం తమతీర్పులో "భర్త లేదా అత్తమామలు ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించి, మానసిక లేదా శారీరక గాయం కలిగించడం లేదా మహిళను ఆత్మహత్యకు పురికొల్పడం వంటి వేధింపులకు పాల్పడే కేసులకు రక్షణ కల్పించడమే సెక్షన్ 498A యొక్క ఉద్దేశ్యం అయినప్పుడు, అటువంటి వేధింపులు కేవలం వివాహం తర్వాత మాత్రమే జరుగుతాయని, అంతకు ముందు కాదని చెప్పడం, మా సునిశ్చిత అభిప్రాయంలో, విషయాన్ని అతి సరళీకరించడమే అవుతుంది... సెక్షన్ 498A ద్వారా ఉద్దేశించిన రక్షణకు సంబంధించినంత వరకు, 'వివాహం' 'వివాహ స్వభావం గల సహజీవనం' మధ్య ఉన్న ఈ వ్యత్యాసానికి, గృహ హింసను నివారించే లక్ష్యంతో ఎటువంటి హేతుబద్ధమైన సంబంధం లేదు అందువల్ల ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధం." అని తెలిపింది. -
కారుణ్య నియామకాల్లో కూతుళ్లకూ సమాన హక్కు!
సాక్షి, న్యూఢిల్లీ: కారుణ్య నియామకాల విషయంలో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో ఉండగా మరణిస్తే, ఆ కుటుంబ సభ్యులకు కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కల్పించే క్రమంలో కుమారులు, కుమార్తెల మధ్య ఎలాంటి వివక్ష చూపరాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కారుణ్య నియామక నిబంధనలు పురుషులతో పాటు మహిళలకూ సమానంగా వర్తించేలా ఉండాలని స్పష్టంచేసింది. కారుణ్య నియామకాల నిబంధనల్లో కేవలం కుమారులను, పెళ్లికాని కుమార్తెలను మాత్రమే చేర్చి వివాహిత లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలను మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. ఇది రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 15 (లింగ, కుల, మత వివక్షల నిషేధం)లను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. వివాహమైనంత మాత్రాన కుమార్తెలు తల్లిదండ్రుల కుటుంబంలో భాగం కారని భావించడం సరికాదని కోర్టు తప్పుబట్టింది. కారుణ్య నియామకాల పథకంలో లింగ వివక్షకు తావులేదని స్పష్టంచేసింది. నిబంధనల సవరణకు ఆదేశం పలు రాష్ట్రాల సరీ్వస్ రూల్స్, కారుణ్య నియామక మార్గదర్శకాల్లో ఇప్పటికీ కాలం చెల్లిన నిబంధనలున్నాయని న్యాయస్థానం గుర్తుచేసింది. విడాకులు పొందిన, వితంతువులైన కుమార్తెలు తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్నట్లయితే వారికి ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్పష్టంచేసింది. ఈ మేరకు నిబంధనల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఉద్యోగి హఠాన్మరణంతో కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల పాలు కాకుండా చూసేందుకే కారుణ్య నియామకాలు చేపట్టాలని కోర్టు సూచించింది. మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన వారసుల్లో అర్హత, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. -
భోజ్‌శాల పొరుగున ప్రార్థనలకు సుప్రీంకోర్టు అనుమతి!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజ్‌శాల కాంప్లెక్స్ పక్కన ఉన్న దర్గాలో ప్రార్థనలు జరుపుకునేందుకు సుప్రీంకోర్టు గురువారం ముస్లింలకు అనుమతిచ్చింది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి మూడు గంటల మధ్యలో ముస్లింలు దర్గాలో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఇరు పక్షాల సమ్మతితో ఇంకోచోట ప్రార్థనలు జరుపుకునేందుకు ఉన్న అవకాశానికి తమ ఆదేశాలు అడ్డుకావని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఈ నెల 14న సుప్రీంకోర్టు భోజ్‌శాల కాంప్లెక్స్ పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో ముస్లింలు శుక్రవారపు నమాజ్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కేసు విచారణ పూర్తయ్యేంత వరకూ వర్తించే ఈ ఆదేశం అమలు కాలేదని ఆరోపిస్తూ ముస్లింల తరఫున హాజీ మునీర్ అహ్మద్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ అధికారులు భోజ్‌శాల కాంప్లెక్స్‌కు 1.3 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాన్ని ప్రత్యామ్నాయంగా చూపారని ఇది తమకు సమ్మతం కాదని పిటిషన్ ద్వారా వాదించారు. భోజ్‌శాల మసీదును చూడగలిగే అవకాశం ఉండాలని కోరారు. ముస్లింల తరఫున సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మదీ, ప్రభుత్వం తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్‌లు తమ వాదనలు వినిపించగా జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ గురువారం తానిచ్చిన మునుపటి తీర్పును సవరించింది. ‘‘గత తీర్పులో దర్గా భూమిగా చెబుతున్న ఖస్రా నెం 596లోని ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం 1 నుంచి మూడు గంటల మధ్యలో ప్రార్థనలు మస్లిం సముదాయానికి అనుమతిచ్చాం. మాకందిన ప్లాన్ కాపీ ప్రకారం ఈ చోటికి వేరే రహదారి కూడా ఉంది. కాబట్టి ఈ స్థలం వారికి అనువుగా ఉంటుంది.’’అని స్పష్టం చేసింది. -
ఇష్టారీతిగా ఉద్యోగం వదిలేస్తానంటే కుదరదు
న్యూఢిల్లీ: అనుక్షణం సర్వసన్నద్ధంగా ఉండాల్సిన భారత వాయుసేనలో పనిచేసే ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగం మానేసి ఇతర సివిల్ పోస్టుల్లోకి చేరిపోతామంటే కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఏడేళ్లపాటు భారతవాయుసేనలో కార్పోరల్‌గా ఉద్యోగం చేసిన నఖత్సింగ్ అనే వ్యక్తి ఎయిర్‌ఫోర్స్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరతానంటే ఒప్పుకునేది లేదు అని జస్టిస్ ఉజ్జల్‌భూయాన్, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్ల ధర్మాసనం తేల్చిచెప్పింది. దేశభద్రత దృష్ట్యా వాయుసేనలో అన్ని స్థాయిల్లో ఉద్యోగులు అనుక్షణం అందుబాటులో ఉండటం అత్యావశ్యకం. వేరే ఉద్యోగం, వృత్తిలో చేరాలనుకుంటే వాయుసేన నుంచి తొలి దశలోనే ముందస్తు అనుమతిపొందాలి. ఆర్పీఎస్సీకి 2020లో దరఖాస్తు చేసి, పరీక్ష రాసి, ఉద్యోగం పొందాక తీరిగ్గా నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ), డిశ్చార్జ్ ఆర్డర్ కావాలని వస్తే కుదరదు అని కోర్టు తేల్చిచెప్పింది. గతంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యూనల్ తర్వాత ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురయ్యాక సుప్రీంకోర్టు తలుపుతట్టినా నఖత్ సింగ్‌కు నిరాశ ఎదురైంది. -
ఆ ప్రాజెక్టులకు లైన్ క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: పర్యావరణ అనుమతుల (ఈసీ) విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు తెలంగాణ రాష్ట్రానికి భారీ ఊరటనిచ్చింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పనులు ప్రారంభించిన భారీ ప్రాజెక్టులకు వెనుకటి తేదీతో (ఎక్స్–పోస్ట్ ఫ్యాక్టో) అనుమతులు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2021లో జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం (ఓఎం)ను అత్యున్నత న్యాయస్థానం బుధవారం రద్దు చేసింది. అయితే గతంలో ఉన్న అనిశ్చితి, ప్రాజెక్టుల్లో ఇమిడి ఉన్న ప్రజాధనాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ తీర్పు భవిష్యత్తుకు మాత్రమే (ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్) వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీంతో పాత అనుమతులకు రక్షణ లభించి, తెలంగాణలో నిలిచిపోయిన పలు కీలక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. రాష్ట్ర ప్రాజెక్టులకు తొలగిన అడ్డంకులు గతంలో పర్యావరణ అనుమతుల విషయంలో ఎదురైన న్యాయపరమైన చిక్కుల వల్ల పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్, దిండి ప్రాజెక్టుల నిర్మాణం నిలిచిపోయింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ ప్రాజెక్టులకు మార్గం సుగమమైంది. పాత అనుమతులు రద్దు కాకపోవడం, భవిష్యత్తులో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చట్టబద్ధమైన నోటిఫికేషన్ ద్వారా మినహాయింపులు పొందే అవకాశం ఉండటం రాష్ట్ర సాగునీటి రంగానికి వరంగా మారింది. వనశక్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలితో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది.భారీ ప్రాజెక్టుల నిర్మాణాలకు ముందస్తుగా అనుమతులు తీసుకోవడం ప్రాథమిక నిబంధన అని తేల్చిచెప్పింది. ముందస్తు అనుమతులు లేని ప్రాజెక్టులను క్రమబద్ధికరించేందుకు కేంద్రం 2021లో జారీ చేసిన ఓఎం ఒక శాశ్వత మార్గాన్ని ఏర్పాటు చేసిందని ధర్మాసనం తప్పుబట్టింది. పర్యావరణ పరిరక్షణ చట్టం–1986, ఈఐఏ నోటిఫికేషన్–2006 నిబంధనలను పరిపాలనా ఉత్తర్వు ద్వారా తొలగించడం చట్టసమ్మతం కాదని చెప్పింది. ఏ ప్రాజెక్టులకు మినహాయింపు ఇవ్వాలనే దానిపై స్పష్టమైన ప్రమాణాలు లేకపోవడం రాజ్యాంగంలోని ఆర్టీకల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 21 (జీవించే హక్కు, స్వచ్ఛమైన పర్యావరణం)ల ఉల్లంఘనే అని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ ద్వారానే మినహాయింపులు ముందస్తు అనుమతి నిబంధన ప్రాథమికమైనప్పటికీ, అత్యంత అరుదైన, భారీ ప్రజాప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాజెక్టుల విషయంలో చట్టంలోని సెక్షన్ 3 కింద పరిమిత కాలానికి ప్రత్యేక మినహాయింపు నోటిఫికేషన్లు జారీ చేసే అధికారం కేంద్రానికి ఉంటుందని ధర్మాసనం చెప్పింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా అత్యవసర ప్రాజెక్టులను క్రమబద్ధికరించడానికి చట్టబద్ధమైన నోటిఫికేషన్ తీసుకురావాలి తప్ప, దొడ్డిదారిన ఆఫీస్ మెమోల ద్వారా అనుమతులు మంజూరు చేయడం చెల్లదని చెప్పింది. గత తీర్పులపై స్పష్టత వివిధ కేసుల్లో గతంలో ఇచ్చిన తీర్పుల వర్తింపుపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. కామన్ కాజ్ (2017), అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ (2020) కేసుల్లో ముందస్తు పర్యావరణ అనుమతి ఆవశ్యకతను సమరి్థంచిన విషయాన్ని గుర్తుచేసింది. పహ్వా ప్లాస్టిక్స్ (2022), డి.స్వామి (2022) కేసులు నిర్దిష్ట పరిస్థితుల్లో ఇచ్చినవని, వాటిని సాధారణ సూత్రాలుగా పరిగణించలేమని తెలిపింది. పర్యావరణ చట్టాలు పోస్ట్ ఫ్యాక్టో అనుమతులకు వీలు కలి్పస్తాయంటూ ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ (2021) కేసులో చేసిన వ్యాఖ్యలు చట్టపరంగా తప్పుడు వ్యాఖ్యానమంటూ వాటిని తప్పుబట్టింది. అయితే 2017లో ఇచ్చిన వన్–టైమ్ మినహాయింపు నోటిఫికేషన్ చెల్లుబాటును మాత్రం అంగీకరించింది.కీలక ఆదేశాలివీ.. ⇒ పాత అనుమతులకు రక్షణ: 2017 నోటిఫికేషన్ లేదా 2021 ఓఎం కింద ఇప్పటికే పొందిన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయి. వాటిపై చట్ట ప్రకారం విడిగా సవాళ్లు వస్తే తప్ప రద్దు కావు. ⇒ కొత్త దరఖాస్తులపై నిషేధం: ఈ విధానాల కింద ఇకపై ఎలాంటి కొత్త దరఖాస్తులను స్వీకరించరాదు. భవిష్యత్తులో కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ఎక్స్–పోస్ట్ ఫ్యాక్టో అనుమతులు ఇవ్వకూడదు. ⇒ పెండింగ్ దరఖాస్తుల పరిశీలన: పాత ఉత్తర్వుల వల్ల పెండింగ్‌లో ఉన్న లేదా తిరస్కరించిన దరఖాస్తులను తీర్పులోని పేరా 79లో పేర్కొన్న నిబంధనల ప్రకారం అధికారులు పరిశీలించాలి. ⇒ ఆర్టికల్ 142 అధికారాలు: సంపూర్ణ న్యాయం అందించేందుకు రాజ్యాంగంలోని ఆర్టీకల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉన్న విశేషాధికారాలకు ఈ తీర్పు అడ్డంకి కాదు. ⇒ అప్పీళ్ల పరిష్కారం: మద్రాస్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన సివిల్ అప్పీళ్లను కోర్టు కొట్టివేసింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను తాజా తీర్పుకు అనుగుణంగా పరిష్కరించింది. ఒక షాపింగ్ మాల్ మూసివేతకు సంబంధించి బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వచ్చిన అప్పీల్‌ను ప్రత్యేకంగా విడదీసి సంబంధిత బెంచ్ ముందుకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
పర్యావరణ అనుమతులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
సాక్షి, ఢిల్లీ : పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పనులు ప్రారంభించిన ప్రాజెక్టులకు, పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వం ఒక సాధారణ మెమోరాండమ్ (OM) ద్వారా పోస్ట్-ఫాక్టో (ముందు పని తరువాత అనుమతి) కుదరదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం జారీ చేసిన 2021 ఆఫీస్ మెమోరాండమ్‌ను రద్దు చేసింది.ఫాస్ట్ ఫ్యాక్టో పర్యావరణ అనుమతుల కోసం ఆఫీస్ మెమోరాండం మాత్రమే సరిపోదని తెలిపింది. ఎట్టిపరిస్థితుల్లో నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని పేర్కొంది. చట్టబద్ధ నోటిఫికేషన్ ద్వారా అవసరమైతే పోస్ట్-ఫాక్టో (తర్వాతి దశలో) పర్యావరణ అనుమతులు ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన నోటిఫికేషన్ జారీ చేసి పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతుల వ్యవస్థను అమలు చేసే అవకాశం ఉంది.ఈ కేసు వివరాలు2006 నాటి పర్యావరణ ప్రభావ అంచనా నిబంధనల ప్రకారం ఏ ప్రాజెక్టు ప్రారంభించాలన్నా ముందస్తు పర్యావరణ అనుమతి తప్పనిసరిగా ఉండేది. అయితే, ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా పనులు ప్రారంభించిన కంపెనీలు/ప్రాజెక్టులకు, తదనంతరం (పోస్ట్-ఫాక్టో) అనుమతులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2017లో ఒక నోటిఫికేషన్, 2021లో ఒక ఆఫీస్ మెమోరాండమ్ (OM) జారీ చేసింది."వనశక్తి" అనే పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం — చట్టబద్ధమైన పర్యావరణ నిబంధనలను కేవలం కార్యాలయ ఉత్తర్వుల (OM) ద్వారా సవరించడం చెల్లదని, ఇది పర్యావరణ చట్టాల ఆశయానికి విరుద్ధమని పేర్కొంటూ 2021 OMను కొట్టివేసింది. అయితే, ఇప్పటికే గత అనుమతుల ఆధారంగా మొదలైన ప్రాజెక్టులు దెబ్బతినకుండా పాత అనుమతులను సమర్థించింది. -
జంతర్ మంతర్ లో లాఠీ ఛార్జ్.. పోలీసులకు సుప్రీం నోటీసులు
-
కోర్టు గేట్లకు ఏముండాలో మేం చూసుకుంటాం!
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు భవనం ప్రధాన గుమ్మటం, గేటు, అధికార పత్రాలపై జాతీయ చిహ్ననికి బదులుగా న్యాయస్థానం తన సొంత చిహ్నాన్ని వినియోగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోర్టు గేట్లపై ఏముండాలో నిర్ణయించే విషయాన్ని తమకు వదిలేయాలని, ఇతర సామాజిక సమస్యలపై దృష్టి పెట్టాలని పిటిషనర్‌కు హితవు పలికింది. ఈ అంశంపై బదరవాడ వేణుగోపాల్ అలియాస్ బాబా ఖతర్నాక్ అనే వ్యక్తి స్వయంగా పిటిషన్ వేశారు. కేంద్ర హోంశాఖ–2007 నిబంధనల ప్రకారం రాజ్యాంగ సంస్థలు జాతీయ చిహ్నాన్ని మాత్రమే ప్రదర్శించాలని, కానీ 1958లో ప్రారంభమైన సుప్రీంకోర్టు భవనంపై జాతీయ చిహ్నం ఇప్పటి వరకు లేదని ఆయన పేర్కొన్నారు.రిజిస్ట్రీ సైతం కోర్టు సొంత చిహ్నన్నే వాడుతోందని తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం దీనిపై మంగళవారం విచారణ చేపట్టింది. ‘సుప్రీంకోర్టు గేట్లు, తలుపులపై ఏముండాలనే విషయాన్ని మాకే వదిలేయండి. మీ ఆహార్యం చూస్తుంటే సన్యాసిలా ఉన్నారు, ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. వాటిపై దృష్టిపెట్టి సమాజ సేవ చేసుకోండి. కోర్టు గేట్ల విషయం మేం చూసుకుంటాం‘అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్ర హోంశాఖ నిబంధనలను పిటిషనర్ ప్రస్తావించినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. పిటిషన్లో విచారణార్హమైన అంశాలు లేవంటూ కొట్టివేసింది.గతంలో వేసిన పిటిషన్‌కు కొనసాగింపుకోర్టులకు రాజ్యాంగపరమైన గుర్తింపు వంటి అశోక చిహ్నం సుప్రీంకోర్టుకు ఏర్పాటు చేసేందుకు తగు ఆదేశాలు జారీ చేయాలంటూ వేణుగోపాల్ రాజ్యాంగంలోని ఆర్టీకల్ 32 ప్రకారం గతంలో ఒక రిట్ వేశారు. మార్చి 23న సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ అంశం పరిపాలనాపరమైనదని పేర్కొంటూ దీనిపై తగిన నోట్‌ను సంబంధిత అధికారికి పంపించాలని సెక్రటరీ జనరల్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాల పురోగతిని తెలపాలంటూ వేణుగోపాల్ జూలై 3న రిజిస్ట్రార్ ద్వారా మరో పిటిషన్ వేశారు. ఆ తర్వాత, రిజిస్ట్రార్ ఉత్తర్వును సవాల్ చేస్తూ చేసిన అప్పీలును మంగళవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏం ప్రదర్శించాలనేది తమ సొంత విషయమంటూ అప్పీల్‌ను కొట్టివేసింది. -
నిరసన చేస్తే కొట్టడం ఏంటి? లాఠీ ఛార్జ్ పై సుప్రీంకోర్టు సీరియస్
-
కేబీఆర్ చుట్టూ ఏం జరుగుతోంది?
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మనందరెడ్డి (కేబీఆర్) జాతీయ ఉద్యానవనం చుట్టూ ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు ఈ నెల 27న విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం శుక్రవారం నగరానికి వచ్చింది. కేబీఆర్ పార్కులో అటవీ, జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమైంది. అలాగే ఈ బృందం స్వయంగా పార్కు పరిసరాల్లో పర్యటించి వివరాలు తెలుసుకుంది. కేబీఆర్ పార్కు చుట్టూ చెట్ల తొలగింపును నిలిపివేయాలని, పార్కు పర్యావరణ సమతుల్యతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా..ఎకో సెన్సిటివ్ జోన్లో 25 మీటర్ల మేర ఎలాంటి చెట్లు కొట్టవద్దంటూ ఈ ప్రక్రియపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ఈ నెల 27న మరోసారి విచారణ చేపట్టనుంది. ఈ విచారణలో రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖలు చేపడుతున్న అభివృద్ధి పనులు, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలుసమర్పించనున్నారు. ఎకో సెన్సిటివ్ జోన్లో 25–30 మీటర్ల దూరంలో చెట్లు ఎన్ని ఉన్నాయి, కొట్టివేశారా..? తదితర అంశాలను కేంద్రబృందం పరిశీలించింది. ఎంపవర్డ్ కమిటీ మెంబర్ అంజన్ మొహంతితో పాటు మరో అధికారి ఢిల్లీ నుంచి వచ్చి కేబీఆర్ పార్కులో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, అటవీ శాఖ అధికారిణి ప్రియాంక వర్గీస్, హెచ్–సిటీ ఖైరతాబాద్ జోన్ సీఈ రత్నాకర్, ఈఈ సంపద, డీఈ హరీష్, ఏఈ ప్రశాంత్‌లతో సమావేశమయ్యారు. సమీక్షలో చర్చించిన అంశాలు, పరిశీలించిన అంశాలతో ఓ నివేదికను ఈ బృందం సుప్రీంకోర్టులో తమ వాదనల్లో వినిపించనుంది. -
విచారణకు ఫైవ్ స్టార్ సౌకర్యాలు కావాలా?
సాక్షి, న్యూఢిల్లీ: విచారణ పేరుతో వేరే దేశాల్లోలాగా ఫైవ్ స్టార్ హోటళ్లు కావాలా అని విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రధాన నిందితుడైన సీఐ నాగరాజును సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. సీఐ నాగరాజు పోలీసు కస్టడీకి హైకోర్టు విధించిన నిబంధనలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారించింది. కింది కోర్టులు విధించిన నిబంధనల వల్ల పోలీసు కస్టడీ లక్ష్యం నెరవేరడం లేదని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. నిందితుడిని విచారణకు రాజమండ్రి జైలు నుంచి విజయవాడకు తీసుకొచ్చేందుకు రానుపోను ఆరు గంటల సమయం పడుతోందని, విచారణకు సమయం ఎక్కడ ఉంటుందని అన్నారు. సీఐ నాగరాజు తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.నరసింహారెడ్డి వాదనలు వినిపిస్తూ.. విజయవాడ జైలులో ఉన్న పలువురి అరెస్టుకు ఆ పోలీస్ అధికారి కారణమైనందున, అక్కడ ఉంచితే ప్రాణహాని ఉంటుందనే ఉద్దేశంతోనే హైకోర్టు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు మార్చిందని తెలిపారు. ఈ వాదనపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. ‘విచారణ పేరుతో వేరే దేశాల్లో లాగా ఫైవ్ స్టార్ హోటళ్లు, ఏసీ రూమ్‌లు, ప్రత్యేక సదుపాయాలు కావాలా ఏంటి?’ అని నాగరాజు తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇక్కడ సమస్య కేవలం జైలు మార్పిడి గురించి కాదని, రిమాండ్ విచారణ పద్ధతి గురించి అని స్పష్టం చేసింది. పోలీస్ విచారణ చట్టబద్ధమైన పద్ధతుల్లో, కోర్టు మార్గదర్శకాలకు లోబడి మాత్రమే జరగాలని స్పష్టం చేసింది. జూన్ 23న అరెస్ట్ జరిగినందున చట్టప్రకారం 90 రోజుల దర్యాప్తు గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించేది లేదని తేల్చిచెబుతూ «తీర్పును రిజర్వ్ చేసింది. -
నీట్ ఆందోళనలకు సుప్రీంకోర్టు లాయర్ల మద్దతు, రాజ్యాంగ ప్రవేశిక పఠనం
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అక్రమాలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా సుప్రీంకోర్టు న్యాయవాదులు ముందుకొచ్చారు. గురువారం లంచ్ విరామంలో 'సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్' బ్యానర్ కింద నిరసనకారులపై పోలీసుల చర్యకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ ప్రవేశికను (Preamble) పఠించారు. ముఖ్యంగా సీనియర్ న్యాయవాదులు ఇందిరా జైసింగ్, ఎస్. మురళీధర్ (ఒరిస్సా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి) Supreme Court Bar Association (SCBA) అధ్యక్షుడు డాక్టర్ వికాస్ సింగ్ లీడ్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులపై పోలీసుల దారుణ హింసాకాండను, బలప్రయోగాన్ని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా నిలవడం న్యాయవాదుల రాజ్యాంగ బాధ్యత అని ప్రముఖ న్యాయవాదిఇందిరా జైసింగ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: స్టీల్ సిటీ అందాలకు అమెరికన్ ట్రావెల్ వ్లాగర్ ఫిదా, వైరల్ వీడియో Supreme Court Lawyers Fraternity in Delhi, stands up in solidarity with the Students Protest.They read the Preamble in unison and vow to stand by the youth of our Nation. This gets us all new found respect and support for all the Lawyers in the SC of India. So what if the… pic.twitter.com/kRPXYPeylJ— Pragnya Gupta (@GuptaPragnya) July 23, 2026 నీట్ పేపర్‌లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేస్తున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం డిమాండ్స్‌తో సీజేపీ ఆధ్వర్యంలో జూన్ 20 నుండి కొనసాగుతున్న ఈ నిరసనకు వాతావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్, AISA విద్యార్థులు కూడా మద్దతు తెరిపిస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులు ఆందోళన కారులపై పోలీసుల దమనకాండపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైనాయి. మరోవైపు ఈ డిమాండ్లతో నిరసన కారులపై పెట్టిన FIRల ఉపసంహరణ వరకు ఆందోళన విరమించేది లేదని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.ఇదీచదవండి: సీజేపీపై వివాదాస్పద పోస్ట్ : ఎవరీ ఇన్‌స్టా స్టార్ సోనియాప్రధాని మోదీ స్పందనపరీక్షా పత్రాల లీకేజీ కేసులలో నిందితులకు త్వరితగతిన కఠిన శిక్ష పడేలా 'ఫాస్ట్ ట్రాక్ కోర్టులు' ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా గురువారం ప్రకటించారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. -
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్‌కు షాక్..!
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్‌కు షాక్ తగిలింది. నిర్మాత వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ కేసులో తాము జోక్యం చేసుకోలేమని పిటిషన్ కొట్టేసింది. దీంతో బండ్ల గణేశ్‌కు సుప్రీంలో చుక్కెదురైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న రుణ వివాదంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్ఫేసీ, ఐబీసీ చట్టాలకు సంబంధించిన కీలక అంశాలపై అత్యున్నత న్యాయస్థానంలో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.అసలేం జరిగిందంటే..హైదరాబాద్‌లోని శ్రీ పరమేశ్వర పౌల్ట్రీఫామ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రుణాలకు సంబంధించి బండ్ల గణేష్, ఆయన కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత ఆస్తులను పూచీకత్తుగా పెట్టిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ సమయంలో, బ్యాంక్ సర్ఫేసీ చట్టం కింద చర్యలు చేపట్టి తనఖా పెట్టిన ఆస్తుల్లో ఒకదానిని వేలం వేసింది. అయితే, ఈ వేలం ప్రక్రియను, సేల్ సర్టిఫికెట్‌ను హైదరాబాద్‌లోని రుణ వసూళ్ల ట్రిబ్యునల్ (డీఆర్టీ) తప్పుబట్టింది. కొనుగోలుదారుడికి వడ్డీతోసహా డబ్బును వాపసు చేయాలని, పిటిషనర్లకు ఆస్తిని తిరిగి అప్పగించాలని ఆదేశించింది. అయితే, డీఆర్టీ ఇచ్చిన ఈ తీర్పును హైకోర్టు కొట్టివేసింది.వన్ టైమ్ సెటిల్మెంట్ కింద బ్యాంక్ రూ.71.44 కోట్లతో సహా సుమారు రూ.129.02 కోట్లను రికవరీ చేసిందని, బకాయిలు పూర్తిగా తీరిపోయినట్లు సెటిల్మెంట్ సర్టిఫికెట్ కూడా ఇచ్చిందని బండ్ల గణేష్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆస్తిని వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తి ముందుగానే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. -
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవడం వల్లే ఇదంతా..!: సుప్రీం కోర్టు
మేఘాలయా హనీమూన్ కేసు యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సాంకేతికత ముసుగులో ఎటుపోతున్నాం, మానవతా విలువలు ఏమవుతున్నాయనే ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఈ కేసు ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి బెయిల్ రద్దు చేస్తూ గట్టి షాకివ్వడమే కాదు కోర్టు ఎదుట లొంగిపోవాలని ఆదేశాలిచ్చింది. అంతేగాదు ధర్మాసనం ఈ కేసు విచారణ నేపథ్యంలో మారుతున్న కుటుంబ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. పైగా యావత్తు సమాజాన్ని ఆలోచింప చేసేలా చక్కటి సందేశాన్ని ఇచ్చింది జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, పి.బి. వరలేలతో కూడిన ధర్మాసనం. ఇంతకీ సుప్రీంకోర్టు కుటుంబ వ్యవస్థ గురించి ఏం చెప్పిందంటే..ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో, దంపతుల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు పెద్దలు వాటిని పరిష్కరించేవారు. చిన్న కుటుంబాల విషయానికొస్తే, వాళ్లు ఒంటరిగా మిగిలిపోతున్నారు, అందువల్ల విడిపోవడం పెరుగుతోందని పేర్కొంది. పైగా వారిలో డిప్రెషన్ కూడా పెరుగుతోంది. సోషల్ మీడియా వల్ల ప్రతిది ఇట్టే తెలిసిపోతున్నా..యువత మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని ధర్మాసనం వెల్లడించింది. అది కాస్తా తరుచుగా వ్యక్తిగత సంబంధాలు, కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈమేరకు జస్టిస్ ఎం ఎం సుందరేష్ మాట్లాడుతూ..మారుతున్న కుటుంబ వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు జరగడం సహజం. వైవాహిక వివాదాలు పెరగడంతో వ్యక్తిగత చట్టాలతో సంఘర్షణలు కూడా పెరుగుతాయని అన్నారు. ప్రస్తుత తరం మనకంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉండొచ్చు, కానీ ఒత్తిడిలో మనకంటే బలహీనంగా ఉన్నారని చెప్పారు. ఆ వ్యాఖ్యలకు భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ..యువతకు "సమాచారం ఎక్కువగా ఉంది కానీ జ్ఞానం ఎక్కువగా లేదని అన్నారు. వాట్సాప్‌లలో పంచుకున్న ప్రతిదాన్ని జ్ఞానంగా పరిగణిస్తున్నారని, ఈ డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం వల్లే పెను ప్రమాదాలు వాటిల్లుతున్నయని ఆవేదనగా చెప్పుకొచ్చారు. అంతేగాదు తాను ఇటీవల ఏడుస్తున్న ఒక చిన్నారిని చూశానని, ఆమెకు పేరెంట్స్ మొబైల్ ఇచ్చారని అన్నారు. అంటే ఇక్కడ తల్లిదండ్రుల స్థానాన్ని మొబైల్ భర్తీ చేస్తోందన్నమాట. ఇది రాను రాను ఒక విపత్తుగా మారుతుందని ఆ క్షణం ఏ తల్లిదండ్రులకు దీనిగురించి అంతగా తెలియదని అన్నారు జస్టిస్ ఎం ఎం సుందరేష్. ఇలాంటివి నిజానికి చాలా ప్రమాదకరమైనవని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడంతోనే ఇలాంటి ఘోరాలు జరగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. అంతేగాదు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహించడమే గాక, ఐక్యతకు ప్రతీకగా నిలిచేవని పేర్కొంది. ప్రస్తతం న్యూక్లియర్ (చిన్న) కుటుంబాల సంఖ్య ఎక్కువై బంధాల మధ్య మాధుర్యం లోపిస్తోందని అభిప్రాయపడింది. నవ సమాజానికి పునాది అయినా కుటుంబాలే గతితప్పడంతోనే..ఇలాంటి నేరాలు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయని స్పష్టం చేసింది. కాగా, సోనమ్‌కు షిల్లాంగ్ ట్రయల్ కోర్టు ఏప్రిల్‌లో బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు సమయంలో నిబంధనల ప్రకారం కారణాలు సరిగ్గా తెలియజేయలేదన్న సాంకేతిక అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం మేఘాలయ హైకోర్టు కూడా ఆ బెయిల్ ఉత్తర్వులను సమర్థించింది. అయితే, బెయిల్ మంజూరును సవాలు చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అరెస్టు మెమోలోని తప్పు కేవలం టైపింగ్ లేదా క్లరికల్ పొరపాటు మాత్రమేనని, దాని ఆధారంగా బెయిల్ ఇవ్వడం సరికాదని ప్రభుత్వం వాదించింది.(చదవండి: కార్పెంటర్ కుమార్తె ఘనత..! శక్తిశాట్‌లో మెరిసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని..) -
భర్తపై దాడి చేస్తుంటే నువ్వేం చేశావ్?
న్యూఢిల్లీ: గతేడాది మేఘాలయలో హనీమూన్ సమయంలో భర్తను చంపించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. జైలు అధికారుల ఎదుట లొంగిపోయి, ఈ కేసు విచారణను ఎదుర్కోవాలని సూచించింది. వ్యాపారవేత్త రాజా రఘువంశీని చంపినట్లు ఆరోపణలున్న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సోనమ్‌ను గతేడాది జూన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆమెకు బెయిలిస్తూ మేఘాలయ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీబీ వరాలేల ధర్మాసనం విచారణ చేపట్టింది.‘మీ ప్రవర్తనను మీరు ఎలా సమరి్థంచుకుంటారు? మీరు భర్తతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లారు. అక్కడే అతడిపై దాడి జరిగింది. అతడు మరణించాడు. అప్పుడు, ఆ తర్వాత మీరేం చేశారు? ఇది ప్రాథమికంగా ఉత్పన్నమయ్యే ప్రశ్న. అరెస్ట్‌కు కారణాలేంటని మీరు మొదట్లోనే పోలీసులను అడిగారా?..ఇది రెండో ప్రశ్న’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘పిటిషన్లో పేర్కొన్న ఆధారాలను బట్టి తగు ఆదేశాలు జారీ చేయడం లేదా నిందితురాలు సోనమ్‌ను లొంగిపోయి విచారణను ఎదుర్కోవాలని ఆదేశించడం గానీ చేస్తాం. వీటికి సిద్ధపడి రండి..’అంటూ సోనమ్ తరఫు లాయర్‌తో వ్యాఖ్యానించిన ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
మల్లారెడ్డి యూనివర్సిటీ లో ఆకస్మిక తనిఖీలు
-
విధులు నిర్వహించలేనప్పుడు డాక్టర్ అని రాసుకోవద్దు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మార్చిలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో సకాలంలో చికిత్స అందించేందుకు నిరాకరించిన రెండు ప్రైవేట్ ఆస్పత్రులు, వాటి వైద్యులపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘మీరు బాధ్యతలను సక్రమంగా నిర్వహించనప్పుడు, పేరు ముందు డాక్టర్ అని రాసుకునే అర్హత మీకు లేదు. మీకు గనుక మానవత్వం, స్పందించే గుణం ఉండి ఉంటే, మీ దగ్గర తగిన వసతులు లేనప్పుడు ఆ బిడ్డతో పాటు మీరే స్వయంగా మరో ఆస్పత్రికి వెళ్లి ఉండేవారు. ఆమె పేదరాలు అనో, ఫీజు చెల్లించలేదనో మీరు నిర్లక్ష్యం చేశారా?’అని వైద్యులను ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. చిన్నారి కుటుంబానికి సహేతుకమైన మొత్తంలో పరిహారం చెల్లించాలని సంబంధిత రెండు ఆస్పత్రుల నిర్వాహకులను ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. మార్చి 16వ తేదీన బాధిత చిన్నారిని పొరుగింట్లో ఉండే వ్యక్తి చాక్లెట్లు ఆశచూపి తీసుకెళ్లాడు. ఆ చిన్నారి తిరిగి సాయంత్రమైనా ఇంటికి చేరుకోకపోవడంతో రోజుకూలీగా పనిచేసే ఆమె తండ్రి చుట్టుపక్కల వెదికారు. నిర్మానుష్య ప్రాంతంలో రక్తపు మడుగులో, అపస్మారక స్థితిలో పడి ఉన్న కుమార్తెను గుర్తించి, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండు ఆస్పత్రుల్లోనూ ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో, చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఏప్రిల్ విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. చిన్నారికి వైద్యం అందించేందుకు నిరాకరించిన ఖాజన్ సింగ్మాన్వి హెల్త్ కేర్, సెయింట్ జోసెఫ్(మరియం)ఆస్పత్రులకు తగు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయంలో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టేందుకు ఘజియాబాద్ పోలీసులు తాత్సారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీ ప్రభుత్వానికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో)కు, సంబంధిత ఆస్పత్రులకు, జిల్లా మేజి్రస్టేట్‌కు నోటీసులు జారీ చేసింది. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల గుర్తింపుపై గోప్యత పాటించాలని పోలీసులు, ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబాన్ని వేధించరాదంటూ పోలీసులకు స్పష్టం చేసింది. -
బకాయిలకు వడ్డీ చెల్లించండి!
‘పెన్షన్ ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదు– అది ఉద్యోగుల హక్కు’ అని సుప్రీంకోర్టు 1982 డిసెంబర్ 17న డి.ఎస్. నకారా కేసులో తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం 2024 మార్చి నుండి ఇప్పటివరకు రిటైర్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు హక్కుగా చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలు రెండేళ్లయినా ప్రభుత్వం చెల్లించడం లేదంటూ కొంతమంది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రారంభంలో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం చెల్లింపులు చేసింది కానీ తర్వాత ఆపింది. దీంతో కోర్టు ధిక్కారం కింద హైకోర్టులో కేసులు నమోదయ్యాయి.రిటైర్మెంట్ బకాయిలు 10% వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని కోర్టు ఆదేశించినప్పటికీ కొంతమందికి మాత్రమే పూర్తి స్థాయిలో చెల్లించి, మరికొంత మందికి కొన్ని బిల్లులు మాత్రమే పాక్షికంగా చెల్లించి, పూర్తిగా చెల్లించామని కోర్టు ధిక్కరణకు మళ్లీ ప్రభుత్వం పాల్పడు తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయులు సర్వీసులో ఉన్నప్పుడు కొంత మంది హోమ్ లోన్, పర్సనల్ లోన్, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకొన్న వారు ఇప్పటికీ వడ్డీలు భారీగా కడుతున్నారు. కాబట్టి గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయి లపై10 శాతం వడ్డీ చెల్లించాలి.2024 మార్చి నుండి 2026 జూన్ వరకు దాదాపు 26,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందారు. ఎనిమిది నెలలుగా వివిధ పెన్షనర్ సంఘాలు ఉద్యమాలు చేస్తే వంద రోజులలో ఆరువేల కోట్లు చెల్లిస్తామని – వాటిలో మే నెలలో 2,000 కోట్లు, జూన్‌లో 2,000 కోట్లు, సెప్టెంబర్ 2025 వరకు కమ్యుటేషన్, జీపీఎఫ్ 100 శాతం చెల్లించామని ప్రకటించుకొంది ప్రభుత్వం. కానీ సెప్టెంబర్ 2025 వరకు ఎస్టీఓలో కమ్యుటేషన్ బిల్లు సబ్మిట్ చేసినప్పటికీ కొంతమందికి రాలేదు.కొంతమందికి జీపీఎఫ్ కూడా రాలేదు. కొంతమంది బిడ్డల పెళ్లిళ్లు ఉన్నాయని పెండ్లి కార్డులు పెట్టినప్పటికీ వారికి జీపీఎఫ్ డబ్బులు అందకపోవడం దారుణం. కాబట్టి వారి టోకెన్ నంబర్లు పరిశీలించి, వారికి ఈ జూలై నెలలో చెల్లించాలి. రిటైర్ అయిన ఉద్యోగులందరికీ రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ దశలవారీగా కాకుండా ఏక మొత్తంగా ఈ జూలై నెలలోనే చెల్లించాలి.– కందుకూరి దేవదాసు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (తెలంగాణ) అసోసియేట్ అధ్యక్షుడు -
ఇటలీలో పాక్ యువతి పరువు హత్య.. ఐదుగురికి యావజ్జీవం
రోమ్: ఇటలీ సుప్రీంకోర్టు ఒక పరువు హత్య కేసులో సంచలన తీర్పును వెలువరించింది. పాకిస్తాన్ సంతతికి చెందిన 18 ఏళ్ల సమన్ అబ్బాస్ హత్యోదంతంలో దోషులుగా తేలిన ఆమె తల్లిదండ్రులు, మరో ఇద్దరు బంధువులకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు సమర్థించింది. మరో నిందితుడైన ఆమె బాబాయికి విధించిన 22 ఏళ్ల జైలు శిక్షను కూడా ఖరారు చేసింది. ఇటలీని కుదిపేసిన ఈ పరువు హత్య కేసులో అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పుతో విచారణ ప్రక్రియ ముగిసింది.2021 ఏప్రిల్‌లో ఉత్తర ఇటలీలోని నోవెల్లారా నగరంలో సమన్ అబ్బాస్ దారుణ హత్యకు గురయ్యింది. పాకిస్తాన్లో తన బంధువుతో బలవంతంగా జరిపించాలనుకున్న వివాహాన్ని ఆమె వ్యతిరేకించడమే ఈ దారుణానికి కారణమైంది. కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని భావించిన సమన్, గతంలో అధికారుల సహాయంతో షెల్టర్ హోమ్‌లో తలదాచుకుంది.అయితే ఏప్రిల్ 2021లో తిరిగి కుటుంబంతో కలిసి వెళ్లిన ఆమె అదృశ్యమయ్యింది. ఆ తర్వాత నిందితులు తమ చేతిలో పనిముట్లతో వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ కీలక ఆధారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి, పాకిస్తాన్ నుంచి నిందితులను ఇటలీకి రప్పించారు. ఈ తీర్పుపై స్పందించిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ.. ఒక మహిళ స్వేచ్ఛా జీవితాన్ని హరించే సంస్కృతి, సంప్రదాయాలకు ఇటలీలో తావులేదని అన్నారు. బాధ్యులకు సరైన శిక్ష పడటం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: విదేశీ యువతికి చీర సింగారించిన కానిస్టేబుల్ -
సుప్రీంకోర్టులో మరోసారి అలజడి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న మరో దూషణల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 10వ తేదీన 13వ నంబర్ కోర్టు హాల్లో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సమక్షంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి యూపీలోని ఇటావాకు చెందిన లక్నో యూనివర్సిటీలో మూడో సంవత్సరం లా చదువుతున్న ప్రబల్ ప్రతాప్ సింగ్(24), రాయ్‌బరేలీకి చెందిన సెకండియర్ లా విద్యార్థి చందర్ భాన్(23)లను అరెస్ట్ చేశారు. పిటిషనర్‌గా ఉన్న ప్రబల్ సింగ్ ఓ కేసును స్వయంగా వాదించేందుకు కోర్టు హాలుకు వచ్చాడు. ఈ సందర్భంగా చేతిలోని పేపర్లను గాలిలోకి విసిరివేస్తూ, సీజేఐ నుద్దేశించి దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. ఇతడికి చందర్ భాన్ తోడయ్యాడు. అడ్డుకోబోయిన భద్రతా సిబ్బందితో వీరు ఘర్షణ పడ్డారు. దీంతో, కోర్టు కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. భద్రతా సిబ్బందిని ఇద్దరినీ వెంటనే అదుపులోకి తీసుకుని మానసిక వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. అయితే, ఇద్దరికీ ఎలాంటి మానసిక చికిత్స అవసరం లేదని వైద్యులు నిర్ధారించారు. వీరి వద్ద అభ్యంతరకర రాతలున్న కరపత్రాలు లభించాయి. సుప్రీంకోర్టు భద్రతా సిబ్బంది ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టు ఆదేశాలతో పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ గడువు బుధవారం పూర్తయింది. పోలీసుల వినతి మేరకు తదుపరి విచారణ నిమిత్తం వీరిద్దరినీ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ రవి ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్‌కు అనుమతించారు. వారం క్రితం సుప్రీంకోర్టు హాల్లో విచారణ సమయంలో ఓ లాయర్ అనుచితంగా వ్యవహరించడం, దూషణలకు దిగడం తెల్సిందే. అయితే, అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీజేఐ ప్రకటించారు. -
టీచర్లపై చర్యలు తీసుకుంటే ఊరుకోం
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రవేశపెట్టిన త్రిభాషా విధానాన్ని అమలుచేయని ఉపాధ్యాయులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము జోక్యం చేసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తగినన్ని పాఠ్యపుస్తకాలు, తగు సంఖ్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేకుండా హఠాత్తుగా ఈ విధానాన్ని అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది.కొత్తగా ప్రవేశపెట్టిన భాషలను బోధించని ఉపాధ్యాయులపై యాజమాన్యాలు ఏవైనా చర్యలు తీసుకుంటే బాధితులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఒక వేళ విధుల్లోంచి తొలగిస్తే అందుకు సంబంధించిన ఆదేశాలపై స్టే విధిస్తామని సీజేఐ తెలిపారు. త్రిభాషా విధానం ఆకస్మిక అమలు, వనరుల లేమిపై వివరణ ఇవ్వాలని సీబీఎస్ఈని ఆదేశించారు. విద్యార్థులపై అదనపు భారం.. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020, నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్–2023కి అనుగుణంగా సీబీఎస్ఈ మే 15న ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం 2026 జూలై నుంచి ఆరు, తొమ్మిదో తరగతి విద్యార్థులు 3 భాషలు అభ్యసించాలి. వాటిలో కనీసం రెండు భారతీయ భాషలు అయి ఉండాలి. అయితే, విద్యా సంవత్సరం మధ్యలో ఆకస్మికంగా దీనిని అమలు చేయడం విద్యార్థులపై అదనపు భారం మోపడమేనంటూ కొందరు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని పిటిషన్లలో పేర్కొన్నారు.పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆనంద్ గ్రోవర్, గోపాల్ శంకర్ నారాయణన్, ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇంగ్లిష్, ఫ్రెంచ్ చదివే 14 ఏళ్ల తొమ్మిదో తరగతి విద్యారి్థకి అకస్మాత్తుగా తమిళం నేర్చుకోమని చెబితే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు, మౌలిక వసతులు ఎక్కడి నుంచి వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనల అనంతరం ధర్మాసనం సీబీఎస్ఈకి నోటీస్ జారీచేసి కేసును 29వ తేదీకి వాయిదావేసింది. -
భోజ్‌శాల వద్ద ముస్లింల ప్రార్థనలకు ప్రత్యేక ప్రదేశం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజ్‌శాలకు సమీపంలో ముస్లింల ప్రార్థనల కోసం వేరుగా బహిరంగ ప్రదేశాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఇందులో నమాజ్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ముస్లిం వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై తుది తీర్పు వచ్చే వరకు దీనిని కేవలం తాత్కాలిక ఏర్పాటుగా మాత్రమే భావించాలని పేర్కొంది. భోజ్‌శాల ప్రాంతంలో నిర్మాణ సంబంధమైన ఎలాంటి మార్పులు చేపట్టరాదంటూ భారత పురాతత్వ విభాగం(ఏఎస్ఐ)ను ఆదేశించింది.అత్యంత సున్నితమైన భోజ్‌శాల విషయంలో హిందువులు, ముస్లింలు సహనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై రోజువారీ విచారణ చేపట్టి, ఒక పరిష్కారం కనుగొంటామని తెలిపింది. ధార్ జిల్లాలో ఉన్న భోజ్‌శాల–కమాల్ మౌలా మసీదు సముదాయాన్ని సరస్వతీ మాత ఆలయ ప్రాంగణంగా మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచి్చన ఆదేశాల అంతరార్థాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది.‘ఇవి చాలా సున్నితమైన విషయాలు. కోర్టులో మాట్లాడే అంశాలు అనవసరంగా వివాదాలను సృష్టించవచ్చు. తప్పుడు అభిప్రాయాన్ని కలిగించవచ్చు. అందుకు మనం ఉపయోగించే ప్రతి పదం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వివాదంలో మధ్యంతర వెసులుబాటు కోరుతూ మా ముందుకు రావడం ఇదే మొదటిసారి. హైకోర్టు ఆదేశాలను, అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వ నిస్సహాయతను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఎలాంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ, ఈ విషయాన్ని 10 నుంచి 15 రోజుల్లోగా తగిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చేలా చూడాలన్నదే మా ఉద్దేశం’అని సీజేఐ మౌఖికంగా వ్యాఖ్యానించారు. -
‘భోజశాల’పై సుప్రీం తీర్పు.. నమాజ్‌కు నిరాకరణ
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద ధార్ భోజశాల ప్రాంగణంలో శుక్రవారం నమాజ్ నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి భోజశాల ప్రాంగణం లోపల నమాజ్ చేయడాన్ని నిషేధిస్తూ, ప్రత్యామ్నాయంగా దానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో ముస్లిం పక్షానికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల మధ్య నమాజ్ చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు, భద్రత పర్యవేక్షించాలని ఆదేశించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్‌లకు నోటీసులు జారీ చేసింది.హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, భోజశాల అత్యంత సున్నితమైన అంశమని, రెండు వర్గాలు సంయమనం పాటించాలని సూచించింది. అవసరమైతే ఈ కేసును రోజువారీ ప్రాతిపదికన విచారించేందుకు సిద్ధమని పేర్కొంది. గతంలో ఈ కాంప్లెక్స్ సరస్వతి ఆలయమేనని స్పష్టం చేస్తూ, అక్కడ నమాజ్ చేసుకోవచ్చన్న దశాబ్దాల నాటి ఉత్తర్వులను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.ఇది కూడా చదవండి: సీబీఎస్ఈ: మూడో భాష ఫెయిలైతే టెన్త్ సర్టిఫికెట్ రాదు! -
15 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నాం.. మా గోడు వినండి..
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ మహిళా పిటిషనర్ కన్నీరుమున్నీరుగా విలపించారు. 15 ఏళ్లుగా తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతోందని, ఒక్కసారి తమ గోడు వినాలని హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ... ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను వేడుకున్నారు. అవసరమైతే ఆన్లైన్లో విచారణకు హాజరుకావాలని, అనవసరంగా ప్రయాణ ఖర్చులు భరించవద్దని సీజేఐ సూచించారు. తన కేసుకు సంబంధించి స్వయంగా వాదనలు వినిపించేందుకు హైదరాబా ద్ నుంచి వచ్చిన సదరు మహిళ సోమవారం ఉదయం మెన్షన్ సమయంలో మాట్లాడుతూ... ‘పదిహేనేళ్లుగా మేం జీవచ్ఛవాల్లా బతుకుతున్నాం. మా కుటుంబాలు పూర్తిగా నాశనమయ్యాయి. పిల్లలకు కనీసం తిండిపెట్టలేని, చదువు చెప్పించలేని దీనస్థితిలో ఉన్నాం. నా బాధ మీ మనసుకు చేరాలనే ఇక్కడికి వచ్చాను. ఒక మహిళకు మంగళసూత్రం కంటే మరేదీ ఎక్కువ కాదు.. ఇప్పుడు నా మెడలో ఏముందో చూడండి’ అంటూ తన మంగళసూత్రం తీస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఆన్లైన్లో హాజరుకండి: సహారా ఆస్తుల విక్రయ వ్యవహారాలకు సంబంధించిన ఈ కేసులో మహిళ ఆవేదనకు స్పందించిన జస్టిస్ సూర్యకాంత్ ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ‘మీరు సుప్రీంకోర్టుకు రావడానికి ప్రయాణ ఖర్చులు వృథా చేసుకోవద్దు. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో హాజరుకండి. మీ వాదనలు ఎంతసేపైనా వింటాం. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం ఉంటుంది’ అని సీజేఐ చెప్పారు. సీజేఐ సూచనను మహిళ సున్నితంగా తిరస్కరించారు. తన జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదని, తదుపరి విచారణకు కూడా తాను స్వయంగా వస్తానని పట్టుబట్టారు. దీంతో వచ్చే వారం ఈ కేసు కోసం ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు. ఆ రోజు బోర్డు జాబితాలో ఈ కేసును మొదటి వరసలో ఉంచుతామని, ప్రత్యేక ధర్మాసనమే కేసును విచారిస్తుందని చెప్పారు. -
ఒక సెమిస్టర్ చదివితే.. ఏడాది కింద లెక్కించలేం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చేపట్టిన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎస్ఓ) నియామకాల వ్యవహారంలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) అభ్యర్థులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డిగ్రీలో కనీసం ఏడాదిపాటు స్టాటిస్టిక్స్ చదివి ఉండాలన్న నిబంధన ఉన్నప్పుడు, కేవలం ఒక సెమిస్టర్ (ఆరు నెలలు) మాత్రమే ఆ సబ్జెక్టును చదివిన అభ్యర్థులను అర్హు లుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. అభ్యర్థుల అర్హత వివా దంపై వై.జగదీష్ తదితరులు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. బీటెక్ అభ్యర్థులు తమ కోర్సులో భాగంగా ఒక సెమిస్టర్లో స్టాటిస్టిక్స్ చదివారని చెప్పారు. రాతపరీక్షలో వీరు 7వ ర్యాంకు లాంటి అత్యుత్తమ మెరిట్ సాధించినప్పటికీ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో టీజీపీఎస్సీ వీరిని అనర్హులుగా ప్రకటించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. సెమిస్టర్ విధానంలో ఏడాది సిలబస్‌ను ఆరు నెలలకే కుదించి బోధిస్తారని, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ అకడమిక్ నిపుణుల కమిటీ సైతం దీనికి ఆమోదం తెలిపిందని వాదించారు.నిపుణుల కమిటీ నివేదికే కీలకంనిబంధనల్లో స్పష్టంగా ’ఒక ఏడాది’ అని పేర్కొన్నప్పుడు, కేవలం ఒక సెమిస్టర్ మాత్రమే చదివితే ఆ నిబంధనను ఎలా సంతృప్తి పరుస్తుందని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ అంశంపై తెలంగాణ అకడమిక్ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ధర్మాసనం ప్రస్తావించింది. ఒక విద్యా సంవత్సరం అనగా 12 నెలలు లేదా రెండు సెమిస్టర్లు అని, ఫౌండేషన్ కోసం కేవలం ఆరు నెలలు చదివిన సబ్జెక్టును పూర్తి అకడమిక్ ఇయర్లో చదివినట్లుగా పరిగణించలేమని కమిటీ స్పష్టం చేసిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. అకడమిక్ అంశాలకు సంబంధించి నిపుణుల కమిటీలదే తుది నిర్ణయమని, వారి అభిప్రాయాన్ని కాదని న్యాయస్థానాలు తమ సొంత నిర్ణయాలను రుద్దలేవని జస్టిస్ మనోజ్ మిశ్రా స్పష్టం చేశారు. -
కొడుకుపై కేసును తండ్రిపై ఎలా నమోదు చేస్తారు?
బెంగళూరు: కుమారుడిపై ఉన్న కేసునే తండ్రిపైనా ఎలా నమోదు చేస్తారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వివరాలు.. మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణ కుమారుడైన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసులో బెంగళూరు పరప్పన సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో రేవణ్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి నిందితునిగా చేర్చారు. దీనిని రేవణ్ణ హైకోర్టులో సవాల్ చేయగా.. ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే ఒక సెక్షన్‌ను తొలగించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ‘ఇద్దరిపై భిన్నమైన ఆరోపణలున్నాయి. కానీ ఒకే కేసుగా భావించి.. కొడుకుపై ఉన్న కేసునే తండ్రిపై ఎలా నమోదు చేస్తారు. చట్టంలో ఈ అవకాశం ఉందా? దౌర్జన్యం కేసును రద్దు చేసి.. లైంగిక దాడి కేసుగా విచారించాలని ఆదేశించడం ఔచిత్యమేనా?’ అని కర్ణాటక హైకోర్టును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ విషయాన్ని పరిశీలించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేయడంలో చేసిన జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసి.. విచారణను వాయిదా వేసింది. -
టికెట్ ధరల బాదుడుపై కోర్టు సీరియస్!
విమాన చార్జీల నియంత్రణ, ప్రయాణికుల హక్కుల పరిరక్షణ దిశగా అత్యున్నత న్యాయస్థానం కీలక అడుగు వేసింది. ప్రైవేట్ విమానయాన సంస్థలు విధిస్తున్న ఏకపక్ష చార్జీల పెంపునకు అడ్డుకట్ట వేసేలా రూపొందించిన కొత్త విమానయాన నిబంధనలను రెండు వారాల్లోగా తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.రెండు వారాల్లోగా నివేదికజస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పౌర విమానయాన నియంత్రణ, ప్రయాణికులపై విధిస్తున్న అదనపు భారాలను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త ఎస్.లక్ష్మీనారాయణన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ నిబంధనల ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశపెట్టారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, ‘సీల్డ్ కవర్’ (రహస్య పత్రం) రూపంలో కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది స్పందిస్తూ.. ‘భారతీయ వాయుయాన్ అధినియం, 2024’ కింద నిబంధనల రూపకల్పన ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం వాటి అధికారిక అనువాద ప్రక్రియ జరుగుతోందని అది ముగియగానే పార్లమెంటు ముందు ఉంచుతామని ధర్మాసనానికి వివరించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ పార్లమెంటు ఆమోదం కంటే ముందే కోర్టు పరిశీలన కోసం వాటిని అందజేయాలని ఆదేశించింది.చార్జీల దోపిడీపై కోర్టు ఆందోళనపండుగలు, ప్రత్యేక సెలవులు, కుంభమేళా వంటి భారీ ఈవెంట్ల సమయంలో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ విమాన చార్జీలను అడ్డగోలుగా పెంచేస్తున్నాయని (డైనమిక్ ప్రైసింగ్), ఇది ప్రయాణికులను తీవ్రంగా దోపిడీ చేయడమేనని గత విచారణల సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఉదాహరణకు, మహాకుంభ్ సమయంలో భోపాల్-ప్రయాగ్‌రాజ్ మార్గంలో వన్-వే విమాన చార్జీలు ఏకంగా 498 శాతం పెరిగి రూ.2,977 నుంచి రూ.17,796కి చేరిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించారు.పారదర్శకతలేని విధానాలుపిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రవీంద్ర శ్రీవాస్తవ వాదనలు వినిపిస్తూ విమాన చార్జీలు, లగేజీ రుసుములు, ఇతర అనుబంధ చార్జీలను నియంత్రించడానికి స్పష్టమైన చట్టబద్ధమైన అధికార సంస్థ లేకపోవడం వల్లే ఎయిర్‌లైన్స్ పారదర్శకత లేని విధానాలను అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు. ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు ఉచిత చెక్ఇన్ బ్యాగేజీ పరిమితిని 25 కిలోల నుంచి 15 కిలోలకు తగ్గించి, అదనపు లగేజీపై భారీగా వసూలు చేయడం ద్వారా ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండా కేవలం అదనపు ఆదాయ వనరుగా మార్చుకున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు.కొత్త చట్టం - నిబంధనల అవశ్యకతబ్రిటిష్ కాలం నాటి ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్, 1934’ స్థానంలో సివిల్ ఏవియేషన్ రంగాన్ని ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘భారతీయ వాయుయాన్ అధినియం, 2024’ జనవరి 2025 నుంచి అమలులోకి వచ్చింది. అయితే, దీని పరిధిలో ప్రయాణికుల రక్షణ, ధరల నియంత్రణకు సంబంధించిన పూర్తి స్థాయి నిబంధనలు ఇంకా నోటిఫై కాలేదు. ప్రస్తుత చట్టాల ప్రకారం విమాన చార్జీలు పూర్తిగా మార్కెట్ శక్తుల ఆధారంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల హక్కులను రక్షించేందుకు కఠినమైన మార్గదర్శకాలు అవసరమని సుప్రీంకోర్టు భావిస్తోంది.ఇదీ చదవండి: ఏఐ ఎందుకో వెనుకబడింది? -
పౌరసత్వ నిర్ధారణ హేతుబద్ధంగా ఉండాలి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఒక వ్యక్తికి చెందిన పౌరసత్వ నిర్ధారణ అనేది రాజ్యాంగపరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని, అందువల్ల ఈ ప్రక్రియ తప్పనిసరిగా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, హేతుబద్ధంగా సాగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసోంలోని వివిధ ‘ఫారినర్స్ ట్రిబ్యునళ్లు’ 27 మందిని విదేశీయులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పులను గతంలో గౌహతి హైకోర్టు సమర్థించింది. అయితే ఆ హైకోర్టు ఉత్తర్వులను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పక్కన పెట్టింది.బాధితులు దాఖలు చేసిన 27 అప్పీళ్లను స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం వీటిపై నిష్పక్షపాతంగా సరికొత్త విచారణ జరపాలని సదరు ట్రిబ్యునళ్లకు కేసులను రిమాండ్ చేసింది. పౌరసత్వాన్ని తిరస్కరించే ప్రక్రియలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని కోర్టు పేర్కొంది. అదే సమయంలో చట్ట విరుద్ధంగా ఎవరూ భారత పౌరసత్వం పొందకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ధర్మాసనం గుర్తుచేసింది.దేశ భద్రత, సరిహద్దుల అంశాల నెపంతో ప్రాథమిక న్యాయ ప్రక్రియను విస్మరించలేమని స్పష్టం చేసింది. అయితే, ఈ 27 కేసులలోని ఆధారాలు, పత్రాల యోగ్యతలపై తాము ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదని, ట్రిబ్యునళ్లే వీటిని స్వతంత్రంగా పరిశీలించాలని కోర్టు స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి: 14 దేశాల దెబ్బకు డ్రాగన్ మైండ్ బ్లాక్! -
గోవధ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు!
న్యూఢిల్లీ: తమిళనాడు వ్యాప్తంగా గోవధను సంపూర్ణంగా నిషేధించాలంటూ మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది. హైకోర్టు ఇచ్చిన ఈ వివాదాస్పద తీర్పును సవాలు చేస్తూ, తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది.బక్రీద్ లేదా మరే ఇతర రోజుల్లోనైనా ఆవులు, దూడల వధను పూర్తిగా నిషేధించాలని మే 27న మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో గోవధను అరికట్టాలని కోరుతూ హిందూ మక్కల్ కట్చి ప్రధాన కార్యదర్శి కె. సూర్య ప్రశాంత్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా.. హైకోర్టు ఒక పరిధిని మించి పూర్తి నిషేధాన్ని విధించిందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. లైసెన్స్ పొందిన వధశాలల్లో కూడా ఆవుల వధను నిషేధించడం చట్టవిరుద్ధమని ప్రభుత్వం పేర్కొంది.తమిళనాడు జంతు సంరక్షణ చట్టం 1958, పట్టణ స్థానిక సంస్థల చట్టం 1998, 2023 నిబంధనలు జంతువుల వధను క్రమబద్ధీకరించడానికే ఉద్దేశించినవని, పూర్తిగా నిషేధించడానికి కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల అమలుపై మధ్యంతర స్టే మంజూరు చేసింది.ఇది కూడా చదవండి: బద్రీనాథ్ విరాళాల చోరీ: సస్పెండైన ఉద్యోగి అరెస్ట్ -
లోక్ అదాలత్‌కు జ్ఞానవాపి, మథుర.. ‘సుప్రీం’ కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: దేశంలో వివాదాస్పదంగా మారిన జ్ఞానవాపి మసీదు, మథుర శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు, సంభాల్ హరిహర మందిరం-మసీదు కేసులను సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్ అదాలత్‌కు బదిలీ చేసింది. సుదీర్ఘ కోర్టు వ్యాజ్యాల కంటే చర్చల ద్వారా సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనేందుకు ఆగస్టు 21 నుంచి 23 వరకు సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘సమాధాన్ సమారోహ్’ పేరిట ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇరుపక్షాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.గత ఏప్రిల్ 21 నుంచే కింది కోర్టుల్లో ముందస్తు రాజీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జూలై 14న వారణాసిలో జ్ఞానవాపి కేసుపై ముందస్తు విచారణ జరగనుంది. కాగా మథుర వివాదంలో జూలై 5న జరిగిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలం కావడంతో, సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని ప్రత్యేక లోక్ అదాలత్ పరిధిలోకి తెచ్చింది.మొఘల్ కాలంలో ఆలయాలను కూల్చివేసి ఈ మసీదులను నిర్మించారంటూ హిందూ పక్షాలు కోర్టులను ఆశ్రయించగా, 1991 నాటి ఆరాధనా స్థలాల చట్టం ప్రకారం ఈ పిటిషన్లు చెల్లవని ముస్లిం పక్షాలు వాదిస్తున్నాయి. గత ఏడాది సంభాల్ మసీదు సర్వే ఉద్రిక్తతలకు దారితీసి, పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూడు వివాదాల్లోని చట్టపరమైన అంశాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. -
సుప్రీంకోర్టులో హైడ్రామా.. జడ్జీలపై పేపర్లు విసిరి!
-
సుప్రీంలో పిటిషనర్ వీరంగం
సాక్షి, న్యూఢిల్లీ: సాక్షాత్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో శుక్రవారం ఓ పిటిషనర్ తీవ్రస్థాయిలో వీరంగం సృష్టించాడు. విచారణ సమయంలో న్యాయమూర్తులపైకి పేపర్లు విసిరేయడంతోపాటు తీవ్ర పదజాలంతో దూషణలకు దిగాడు. ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని కోర్టు హాలు నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే సదరు పిటిషనర్ ప్రవర్తనపై ఎలాంటి కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టబోమని, అతడిపై తమకు సానుభూతి మాత్రమే ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. మెరిట్స్ ఆధారంగా అతడి పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది. నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రబల్ ప్రతాప్ దాఖలు చేసిన దరఖాస్తును భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 173(4) కింద ప్రైవేట్ ఫిర్యాదుగా పరిగణించాలని కింది కోర్టు నిర్ణయించింది. ఈ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. దాంతో ప్రబల్ ప్రతాప్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు చేశాడు. ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. నల్లకోటుతో వచ్చిన పిటిషనర్ ప్రబల్ ప్రతాప్ న్యాయవాదులు మెడలో ధరించే టై ఏదీ కట్టుకోలేదు. స్వయంగా వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యాడు. న్యాయమూర్తులు అతడి పేరు, వివరాలను తెలుసుకుని ‘స్వయంగా వాదనలు వినిపిస్తారా’అని ప్రశ్నించారు. అవునని సమాధానం ఇచ్చాడు. అనంతరం వాదనలు వినిపిస్తూ ఆరంభం నుంచే తీవ్ర అసహనంతో, దూకుడుగా వ్యవహరించాడు. న్యాయపరమైన అంశాలు కాకుండా ధర్మాసనాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. లక్నో ఏసీపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ధర్మాసనాన్ని డిమాండ్ చేశాడు. ‘మిస్టర్ జ్యుడీషియల్ సర్వెంట్.. లక్నోలోని వికాస్ నగర్ ఏసీపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. ఎందుకంటే నేను సార్వ¿ౌముడిని’అని బిగ్గరగా అరుస్తూ చెప్పాడు. నన్ను ఆదేశిస్తున్నావా? మమ్మల్ని ఆదేశిస్తున్నావా? పిటిషనర్ వాదనలు, ప్రవర్తన పట్ల ధర్మాసనం తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. జస్టిస్ కేవీ విశ్వనాథన్ స్పందిస్తూ.. ‘నువ్వు నన్ను ఆదేశిస్తున్నావా? మమ్మల్ని ఆదేశిస్తున్నావా?’అని ప్రశ్నించారు. దీనికి పిటిషనర్ బదులిస్తూ.. ‘నా వైపు నుంచి చెప్పాల్సింది అంతే.. అంతా రికార్డుల్లో ఉంది’అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అతడి ప్రవర్తన మరింత శృతి మించింది. తన చేతిలో ఉన్న కేసుకు సంబంధించిన పేపర్ల కట్టను న్యాయమూర్తులపైకి విసిరేశాడు. కోర్టు హాల్లో ఆ పేపర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. ‘వీటిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇవ్వండి’అంటూ ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో దూషించాడు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని బలవంతంగా బయటకు పంపించేశారు. ఈ సంఘటన పట్ల ధర్మాసనం ఎంతో సంయమనంతో వ్యవహరించింది. పిటిషనర్‌పై ఎలాంటి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవడం లేదని జస్టిస్ కేవీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. ‘మేము రికార్డులను పరిశీలించాం. కింది కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి సరైన కారణాలు కనిపించడం లేదు. కాబట్టి ప్రబల్ ప్రతాప్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’అని ధర్మాసనం తమ తీర్పులో తేల్చిచెప్పింది. పిటిషనర్ తీవ్ర ఆందోళన, నిరాశలో ఉన్నాడని, అతడి పట్ల తమకు కేవలం సానుభూతి మాత్రమే ఉందని జస్టిస్ విశ్వనాథన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గతంలో సీజేఐపైకి బూటు సుప్రీంకోర్టులో వ్యక్తుల అనుచిత ప్రవర్తన ఇదే తొలిసారి కాదు. 2025లో ఓ న్యాయవాది అప్పటి ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్‌పై బూటు విసిరాడు. కోర్టు సిబ్బంది అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఆ తరువాత ఆ న్యాయవాదిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. బార్ కౌన్సిల్ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే చర్యలు ప్రారంభించింది. ఈ ఘటన కంటే ముందు 2009లో జస్టిస్ అరిజిత్ పసాయత్పై ఒక వ్యక్తి చెప్పు విసిరాడు. 1968లో మరో వ్యక్తి చేతిలో కత్తితో న్యాయమూర్తుల వైపు దూసుకెళ్లాడు. కోర్టు సిబ్బంది, న్యాయవాదులు అతడిని అడ్డుకున్నారు. -
భార్యను కాదని ఇతరులకు ఆస్తి.. ఆ వీలునామా చెల్లదు!
సాక్షి, న్యూఢిల్లీ: చట్టబద్ధమైన వారసురాలైన భార్యను కాదని, ఎలాంటి సంబంధం లేని మూడో వ్యక్తులకు ఆస్తిని రాసిస్తూ చేసే వీలునామాలను అసహజమైనవిగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. అనుమానాస్పద పరిస్థితుల మధ్య రాసిన వీలునామాలను కేవలం రిజి్రస్టేషన్ జరిగిందనో, సాక్షుల సంతకాలు ఉన్నాయనో ఆమోదించలేమని తేల్చిచెప్పింది. వీలునామా అసలైనదేనని నిరూపించి, కోర్టు అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పూర్తిగా ఆస్తి లబ్ధిదారులపైనే ఉంటుందని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. సర్దారీ లాల్ వర్సెస్ బిషన్ దాస్ కేసులో అసలు ఆస్తి యజమాని చజ్జు రామ్ మరణానంతరం, ఆస్తికి తానే ఏకైక వారసురాలినని పేర్కొంటూ ఆయన భార్య భాంబో దేవి సివిల్ దావా వేశారు. అయితే, చజ్జు రామ్‌కు తాము సేవలు చేసినందుకు ప్రతిఫలంగా 1974లో ఆస్తి రాసిస్తూ రిజిస్టర్డ్ వీలునామా చేశారని ప్రతివాదులైన బిషన్ దాస్ తదితరులు కోర్టులో వాదించారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. వీలునామా వెనుక భాగంలో సబ్– రిజిస్టర్ ధ్రువీకరణ వద్ద పేర్ల కొట్టివేతలు ఉన్నాయని, లబి్ధదారుల్లో ఒకరు అప్పటికి చిన్న పిల్లవాడని, భార్యను కాదని ఆస్తిని ఇతరులకు ఇవ్వడం అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం వీలునామా చెల్లుబాటుపై కీలక వ్యాఖ్యలు చేసింది. క్లాస్–1 వారసురాలైన భార్యను పూర్తిగా పక్కనబెట్టి, ఎలాంటి రక్తసంబంధం లేని వ్యక్తులకు ఆస్తిని కట్టబెట్టడం సహజ విరుద్ధమని పేర్కొంది. ఇది వీలునామా విశ్వసనీయతపై తీవ్రమైన అనుమానాలను రేకెత్తిస్తోందని తెలిపింది. చదువుకోని వ్యక్తి రాసిన వీలునామా కావడంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొట్టివేతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. వీలునామాపై అనుమానాలు ఉన్నప్పుడు, కేవలం దానికి సాక్షుల బలముందన్న ఒకే ఒక్క కారణంతో గుడ్డిగా ఆమోదించరాదంది. ఆ అనుమానాలను నివృత్తి చేసి స్వేచ్ఛాయుత వాతావరణంలోనే దానిని రాశారని న్యాయస్థానాన్ని సంతృప్తి పరచాల్సిన బాధ్యత లబి్ధదారులదేనని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు, మొదటి అప్పీలేట్ కోర్టులు దానిని కొట్టివేయగా.. సాక్షుల వాంగ్మూలం ఉన్నందున వీలునామాను సమరి్థస్తూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తీర్పు నిచి్చంది. దీనిపై దాఖలైన అప్పీల్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తన పరిధిని మించి వ్యవహరించిందని తప్పుబట్టింది.


