బైక్‌ ట్యాక్సీలకు భారీ షాక్‌..? | Karnataka to challenge High Court order allowing bike taxis in Supreme Court | Sakshi
Sakshi News home page

బైక్‌ ట్యాక్సీలకు భారీ షాక్‌..?

Apr 20 2026 12:06 PM | Updated on Apr 20 2026 12:06 PM

Karnataka to challenge High Court order allowing bike taxis in Supreme Court

బెంగళూరు: బైక్‌ ట్యాక్సీల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ నిర్ణయించాయి. రాష్ట్రంలో బైక్‌ ట్యాక్సీల విధానానికి నియమావళి రూపొందించే ఉద్దేశం లేదని చెబుతున్న ప్రభుత్వం, హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్‌ చేయనుంది. గతేడాది హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం బైక్‌ ట్యాక్సీలను అనధికారికమని ప్రకటించి నిషేధించింది. 

అయితే ఈ జనవరి 23న ద్విసభ్య ధర్మాసనం బైక్‌ ట్యాక్సీలకు అనుమతిస్తూ ఆయా సంస్థలకు లైసెన్సులు ఇవ్వాలని సర్కారును ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం బైక్‌ ట్యాక్సీలకు అవకాశం లేదని సర్కారు వాదించింది. మూడు నాలుగు రోజుల్లో బైక్‌ ట్యాక్సీల నిషేధం కోసం సుప్రీంలో పిటిషన్‌ సమర్పించనుంది. దీంతో వేలాదిమంది రైడర్లు అయోమయంలో పడిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement