breaking news
court
-
ఐజీ సునీల్ నాయక్ కేసులో కీలక మలుపు
బిహార్ ఐజీ సునీల్ నాయక్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను పోలీసులు విత్‌డ్రా చేసుకున్నారు. సునీల్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని గుంటూరు స్పెషల్ మెుబైల్ కోర్టును పోలీసుల ఆశ్రయించారు.దీంతో అరెస్ట్ చేసిన తర్వాత నాన్ బెయిలబుల్ వారెంట్ ఏంటి అని అధికారులను ప్రశ్నించింది. గుంటూరు స్పెషల్ కోర్టు. దీంతో కోర్టు ప్రశ్నలకు కంగుతిన్న పోలీసులు, లాయర్లు సునీల్ నాయక్ నాన్ బెయిలబుల్ వారెంట్ ను విత్‌డ్రా చేసుకున్నారు. కాగా అంతకు ముందు ఏపీ పోలీసు అధికారులు.. బిహార్ కేడర్ ఐజీ సునీల్ నాయక్‌ను అరెస్టు చేసేందుకు ఆ రాష్ట్ర రాజధానిలో హంగామా చేశారు. అయితే అక్కడ ఏపీ పోలీసులకు భంగపాటు తప్పలేదు. తమ అధికారిని గోడదూకి ఎలా అరెస్ట్ చేస్తారంటూ బిహార్ ప్రభుత్వం మండిపడింది. తమ రాష్ట్ర కేడర్‌కు చెందిన పోలీసు అధికారులపై ఇతర రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా తమ ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ గత శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది.తమ అధికారులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా తాము అనుమతించాలంటే పాటించాల్సిన నిబంధనలను కూడా వెల్లడించింది. కేంద్ర పోలీసు బలగాలకు చెందిన అధికారులకు వర్తించే అన్ని రకాల రక్షణ చర్యలు బిహార్ ప్రభుత్వ అధికారులకు వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు బిఎన్ఎస్ సెక్షన్ 218 కింద బీహార్ పోలీసులకు రక్షణ కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.దీంతో కేంద్ర సాయుధ దళాలకు రక్షణ తరహాలోనే బీహార్ పోలీసులకు ప్రభుత్వ రక్షణ కల్పించనుంది. బిహార్ పోలీస్ అధికారి సునీల్ నాయక్ పై ఏపీ పోలీసుల దుందుడుకు చర్యలు నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతీకార, రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులతో అధికారులను వేధించకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకుంది ప్రభుత్వం. కేసులను సమీక్షించిన తర్వాతే అనుమతిపై నిర్ణయం తీసుకునేలా నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా కోర్టులు సైతం ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ తిరస్కరించింది. -
కేజ్రీవాల్‌కు క్లీన్ చిట్, అన్నా హజారే కీలక వ్యాఖ్యలు
లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 21 మందిని కోర్టు ఈ కేసు నుండి విముక్తి చేసింది. ఈ కేసులో ఉద్దేశ పూర్వక కుట్ర ఏదీ లేదని తీర్పు చెప్పింది. అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)ని తప్పుబట్టింది. దీనిపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే (Anna Hazare) స్వాగతించారు. న్యాయ వ్యవస్థే అత్యున్నతమై నదని, కోర్టు తీర్పును అందరూ గౌరవించాలని హజారే పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో విలేకరులతో మాట్లాడుతూ "మన దేశం న్యాయవ్యవస్థపై నడుస్తుంది. దేశంలో న్యాయ వ్యవస్థ అత్యున్నతమైంది. దాని కారణంగనే పలు రాజకీయ పార్టీలు, అనేక కులాలు,మతాలతో కూడిన మన దేశం సవ్యంగా నడుస్తోందని హజారే వ్యాఖ్యానించారు. బలమైన న్యాయవ్యవస్థ లేనప్పుడు, నేరస్థులు పైచేయి సాధిస్తారు, దేశంలో అల్లర్ల లాంటి పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో తాను చేసిన విమర్శలు అప్పట్లో ఉన్న ఆరోపణల ఆధారంగా చేసినవేనని, ఇప్పుడు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినందున దానిని అంగీకరిస్తున్నానని చెప్పారు. అంతేకాదు 2011 నాటి 'ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్' ఉద్యమంలో వీరంతా కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తూ కేజ్రీవాల్, సిసోడియాలు తన వాళ్లేనని హజారే అభివర్ణించడం విశేషం. అన్నా హజారే సలహాకోర్టు తీర్పు తర్వాత కేజ్రీవాల్‌కు అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు హజారే ఒక ముఖ్యమైన సూచన చేశారు. సొంత పార్టీ లేదా స్వ ప్రయోజనాల కోసం లేదా పార్టీ కోసం కాకుండా, సమాజం మరియు దేశం కోసం పని చేయాలని సూచించారు. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమచంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి వచ్చిన వ్యక్తి ఇలాంటి కేసులో చిక్కుకోవడంపై హజారే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ కోట్లాది మంది దేశవాసుల నమ్మకాన్ని మోసం చేశారని, రాజకీయ ఆశయాలు 2011 అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నాశనం చేశాయని కూడా ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజా కోర్టు తీర్పుతో తన వైఖరిని మార్చుకున్నారు.కాగా మార్చి 21, 2024న ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ అరెస్టు చేసింది. తరువాత అవినీతి ఆరోపణలను విచారిస్తున్న CBI అరెస్టు చేసి, 155 రోజులు జైలులో గడిపిన తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఇదీ చదవండి: Yoga ఉత్కటాసనం ప్రయోజనాలు అమోఘం, ఈ జాగ్రత్తలు మస్ట్ -
51 రోజుల్లో 11మంది అనాథ దివ్యాంగుల మృతి?
మధ్యప్రదేశ్‌లోని అంకిత్ సేవాధామ్ ఆశ్రమంలో 11 మంది దివ్యాంగులైన పిల్లల మృతిపై ఆరాష్ట్ర హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మరణాలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరుతూ ఆశ్రమ నిర్వాహకులతో పాటు జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది.ఉజ్జయినిలోని అంకిత్ సేవానంద్ ఆశ్రమంలో దివ్యాంగులు ( మైనర్లు) మరణాన్ని ఆ రాష్ట్ర కోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై రెండు వారాల్లోగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలఫ్‌మెంట్ కమిషనర్లతో పాటు ఉజ్జయిని కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఆశ్రమ నిర్వాహాకులకు కోర్టు నోటీసులందించింది.అసలేం జరిగింది?ఉజ్జయిని అంబోడియాలోని అంకిత్ సేవాధామ్ ఆశ్రమంలో గత 51 రోజులుగా 11 మంది పిల్లలు అనారోగ్యకారణాలతో మృతిచెందారు. గతేడాది నవంబర్ 10 నుంచి ఈ ఏడాది జనవరి 10 వరకూ ఈ మరణాలు సంభవించాయి. చనిపోయిన పిల్లల వయసు 10-18 సంవత్సరాల మధ్యలో ఉంది. అయితే ప్రస్తుతం కూడా 50 మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. చాలా మంది ఆశ్రమానికి వివిధ రకాలైన సమస్యలతోనే వస్తారని వారిలో చాలామందికి నడవడం, తినే పరిస్థితిలో కూడా ఉండరని అన్నారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఆశ్రమం డైరెక్టర్ సుధీర్ భాయ్ గోయల్ తెలిపారు.అయితే ఏడాదిన్నర క్రితం ఇండోర్‌లోని పురుష్ ధామ్ ఆశ్రమంలో ఈ పిల్లలు ఆశ్రయం పొందేవారు. ఆ సమయంలో ఇదే రీతిలో అక్కడ మరణాలు సంభవించడంతో ప్రభుత్వం ఆశ్రమం గుర్తింపు రద్దు చేసి అంకిత్ సేవాధామ్ ఆశ్రమానికి పిల్లలను తరలించింది. ఇప్పుడు ఇక్కడే ఇదే తరహా మరణాలు జరగడం ఆందోళనకు గురిచేస్తుంది. అయితే దీనిని సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు మార్చి 12లోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది. -
ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర
వాషింగ్టన్: అమెరికా రాజకీయ వర్గాలను కుదిపేసిన ఈ కేసు ప్రస్తుతం న్యూయార్క్‌లో విచారణ దశలో ఉంది. పాకిస్తాన్‌కు చెందిన అసిఫ్ మర్చంట్ అనే వ్యక్తి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు తాజాగా కోర్టు విచారణ లో తేలింది. ఆసిఫ్ పాక్ జాతీయుడియే అయినా ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. 2024లో అమెరికాలోకి ప్రవేశించిన అసిఫ్, న్యూయార్క్ చేరిన కొద్ది రోజుల్లోనే కాంట్రాక్ట్ కిల్లర్లను సంప్రదించడానికి ప్రయత్నించాడు. కానీ అతను కలిసిన వారు వాస్తవానికి ఎఫ్‌బీఐ గూఢచారులు కావడంతో మొత్తం కుట్ర బయటపడింది. విచారణలో అసిఫ్ ఇద్దరికి 5వేల డాలర్ల అడ్వాన్స్ చెల్లించినట్లు రుజువైంది.ప్రస్తుతం బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. నిందితుడు దోషిగా తేలితే అతనికి జీవిత ఖైదు శిక్ష విధించే అవకాశం ఉంది. అమెరికా న్యాయ శాఖ ఈ కేసును ‘మర్డర్-ఫర్-హైర్ కుట్ర’గా పేర్కొంటూ, దేశ రాజకీయ నాయకులపై దాడి ప్రయత్నం అత్యంత తీవ్రమైన నేరమని స్పష్టం చేసింది. -
దంపతులకు మరణ శిక్ష.. యూపీ కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: చిన్నారులపై దారుణ లైంగిక వేధింపులకు పాల్పడిన కామ పిశాచాలకు ఉత్తరప్రదేశ్‌లోని బాండా ప్రత్యేక పోస్కో కోర్టు మరణ శిక్ష విధించింది. నిందితులైన నీటిపారుదల శాఖ మాజీ జూనియర్ ఇంజనీర్ రామ్ భవన్, అతని భార్య దుర్గావతికి మరణశిక్ష విధిస్తూ శుక్రవారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. 2010 నుండి 2020 మధ్య కాలంలో దాదాపు 33 మంది మైనర్ బాలురపై (3 ఏళ్ల చిన్నారులతో సహా) దారుణమైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది.అంతేకాకుండా, 2 లక్షలకు పైగా అభ్యంతరకర వీడియోలు, ఫొటోలను దాదాపు 47 దేశాలకు ఇంటర్నెట్ ద్వారా చేరవేశారు. ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించిన న్యాయమూర్తి ప్రదీప్ కుమార్ మిశ్రా, నిందితుల క్రూరత్వం సమాజ నైతిక పునాదులనే కదిలించిందని పేర్కొన్నారు. బాధితులైన 33 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. నిందితుల ఇంట్లో స్వాధీనం చేసుకున్న నగదును కూడా బాధితులకు సమానంగా పంపిణీ చేయాలని సూచించింది. -
అంబటికి బెయిల్ ఇచ్చిన గుంటూరు కోర్టు
-
తెలుగురాష్ట్రాల్లో...కోర్టులకు బాంబు బెదిరింపులు
తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. రాజమండ్రి జిల్లా కోర్టులో బాంబు ఉందంటూ బెదిరింపు రావడంతో వెంటనేపోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు భవనాన్ని ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. మరోవైపు నాంపల్లి సీబీఐ కోర్డుకు, కరీంనగర్ కోర్టుకు బాంబు బెదింరింపులు రావడంతో పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. న్యాయవాదులను కోర్టు సిబ్బందిని బయిటకి పంపారు. అనంతరం డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు.మద్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు పేలతాయని 12 చోట్ల ఆర్డీఎక్స్ పెట్టామంటూ బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.అయితే అవి బెదిరింపు ఫోన్లా లేక నిజంగానే పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల తరచుగా కోర్టులకు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని ఓ కోర్టు భవనంలో బాంబు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. అంతే కాకుండా తరచుగా విద్యాలయాలకు బెదిరింపులు వస్తున్నాయి. -
ఇజ్రాయెల్ మహిళపై అత్యాచారం.. ముగ్గురు దోషులకు మరణశిక్ష విధించిన కోర్టు
-
ఇజ్రాయెల్ మహిళపై అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు
కర్ణాటకాలో గతేడాది ఇజ్రాయెల్ మహిళతో పాటు మరోకరిపై అత్యాచారం జరిగిన ఘటనలో గంగావతి జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ ఘటనలో అరెస్టైన ముగ్గురిని నిందితులుగా గుర్తిస్తూ వారికి మరణశిక్ష విధించింది. 2025 మార్చి 6న ఒక మహిళా ఇజ్రెయెల్ పర్యాటకురాలు, ఆమె సహాయకురాలితో పాటు భారత్‌కు చెందిన ముగ్గురు ఇతర పర్యాటకులు తుంగభద్రా నది ఎడమకాలువ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో మల్లేశ్, సాయి, శరణప్ప అనే ముగ్గురు వారి వద్ద కొచ్చి డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. వారు నిరాకరించడంతో వారిపై దాడి చేసి ముగ్గురు మగవారిని అక్కడి తుంగభద్రా లోయలో తోసివేశారు. మిగతా ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారు.అయితే ఆ నదిలో పడ్డ ముగ్గురిలో ఇద్దరు ఈత రావడంతో బ్రతికారు. ఒడిశాకు చెందిన మరో పర్యాటకుడు దురదృష్టవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిందితులను కఠనంగా శిక్షించాలని నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ కేసును విచారించిన గంగావతి జిల్లా కోర్టు నిందితులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసు అత్యంత అరుదైనదని దీనికి ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాలని న్యాయమూర్తి తెలిపారు. -
‘వృద్ధాప్యంలో విడాకులేంటి?’.. చివాట్లు పెట్టిన కోర్టు
వారిది అరవై ఏళ్లకు సమీపించిన వైవాహిక జీవితం.. ముగ్గురు పిల్లలు.. మనవలు.. మనవరాళ్లు.. ఇన్ని దశాబ్దాల ప్రయాణం తర్వాత వారు విడిపోతామంటే కోర్టు ఒప్పుకుంటుందా? ‘భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు సహజం.. వాటిని క్రూరత్వం అని పిలవలేం’ అంటూ రాజస్థాన్ హైకోర్టు ఒక వృద్ధ దంపతుల విడాకుల పిటిషన్‌ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.భరత్‌పూర్‌కు చెందిన ఈ జంటకు 1967, జూన్ 29న వివాహం జరిగింది. దాదాపు 46 ఏళ్ల పాటు (2013 వరకు) ఎలాంటి తగాదాలు లేకుండా వీరి సంసారం సాఫీగానే సాగింది. అయితే ఆస్తి పంపకాలు, వ్యక్తిగత ఆరోపణల నేపథ్యంలో 2014లో భర్త విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. ఫ్యామిలీ కోర్టు విడాకులకు నిరాకరించడంతో, ఆయన హైకోర్టును ఆశ్రయించారు.తన భార్య తనపై తప్పుడు వరకట్న వేధింపుల కేసు పెట్టిందని, దీనివల్ల సమాజంలో తన ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆయన ఆరోపించారు. అలాగే, ఆస్తిని పెద్ద కొడుకుకే ఇవ్వాలని ఆమె పట్టుబడుతోందని, తనపై అక్రమ సంబంధాల ఆరోపణలు చేస్తూ, మానసికంగా వేధిస్తోందని పేర్కొన్నారు.అయితే తన భర్త .. అతని తమ్ముడి మాటలు విని ఆస్తిని వృథా చేస్తున్నారని భార్య వాదించింది. ఆయనకు వేరే మహిళతో సంబంధం ఉందని, అందుకే తనను వదిలించుకోవాలని చూస్తున్నారని ఆరోపించింది. వివాదంలో ఉన్న ఆస్తిని తన సొంత డబ్బుతో కొనుగోలు చేసినట్లు ఆమె స్పష్టం చేసింది.జస్టిస్ సుదేష్ బన్సాల్, జస్టిస్ అనిల్ కుమార్ ఉప్మాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును నిశితంగా పరిశీలించి తన అభిప్రాయం వ్యక్తం చేసింది. దశాబ్దాల పాటు కలిసి ఉన్న దంపతుల్లో వయస్సుతో పాటు సహనం, అవగాహన పెరగాలి కానీ ఇలాంటి చిన్న కారణాలతో విడిపోకూడదు. కుటుంబంలో ఆస్తి తగాదాలు రావడం సహజం, అంతమాత్రాన అది విడాకులు ఇచ్చేంత ‘క్రూరత్వం’ కిందకు రాదు. ఈ వయస్సులో విడాకులు మంజూరు చేస్తే కేవలం ఆ దంపతులకే కాకుండా, వారి పిల్లల గౌరవానికి భంగం కలుగుతుంది అని పేర్కొంది. చిన్నపాటి మనస్పర్థలను విడాకుల వరకు తీసుకెళ్లడం సరికాదని చెబుతూ, భర్త దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. 58 ఏళ్ల బంధాన్ని గౌరవించాలని ఆ వృద్ధ దంపతులకు హితవు పలికింది.ఇది కూడా చదవండి: ప్రియంకా చోప్రా భారత్‌కు గర్వకారణం: శశి థరూర్ -
జైల్లో పెట్టినా అదే ధైర్యం.. పోలీస్ జీపులోంచి తగ్గేదే లే..
-
అంబటికి బెయిల్... కూతురు మౌనిక ఫస్ట్ రియాక్షన్
-
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతేగడాది నవంబర్ 12న నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు తీర్పును వెలువరించింది. నవంబర్ 12న వైఎస్సార్సీపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టింది. ఆ ర్యాలీ నిర్వహించే సమయంలో అంబటి తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. తాజా, కోర్టు తీర్పుతో ఈరోజే అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంబటి రాంబాబు బెయిల్‌కు సంబంధించి పూచికత్తుల వ్యవహారం ఇప్పటికే పూర్తయ్యింది. అంబటి తరఫు న్యాయవాదులు పదివేల రూపాయలు చొప్పున రెండు పూచీకత్తులు కోర్టుకు సమర్పించారు. రిలీజింగ్ ఆర్డర్ తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు బయల్దేరారు. -
గుంటూరు కోర్టుకు అంబటి రాంబాబు
-
నన్ను అంతం చేయడమే వారి లక్ష్యం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్)/గుంటూరు లీగల్: తనను అంతం చేయడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని వైఎస్సార్సీపీ నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీస్‌స్టేషన్‌లో తనను హింసించారని తెలిపారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తమ విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. దీంతో శనివారం ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం రాత్రి 8.30 గంటలకు గుంటూరు మొబైల్ కోర్టులో హాజరు పరిచారు.రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అంబటి పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనివల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిపై అంబటి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. అంబటిపై నమోదైన కేసు ఎఫ్ఐఆర్ చెల్లదన్నారు. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే ఉన్నతాధికారుల అనుమతితో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉందని, దీన్ని పోలీసులు పట్టించుకోలేదన్నారు. అంబటిపై పెట్టిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే కాబట్టి 41ఏ నోటీసు కూడా ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడం తగదన్నారు. రెండు కాళ్లు పంగ చీల్చి వేధించారుఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు తనను హింసించిన తీరును న్యాయమూర్తి ఎదుట వివరించారు. ‘గుంటూరు సిద్ధార్థనగర్‌లోని మా ఇంటి వద్ద నుంచి శనివారం రాత్రి 10.30 గంటలకు పోలీసులు నన్ను నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లాకప్‌లో పడుకుని ఉండగా, రాత్రి రెండు గంటలప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చి.. స్టేట్మెంట్ రికార్డు చేయాలంటూ మొదటి అంతస్తులోకి తీసుకువెళ్లాడు. అక్కడ నల్లపాడు సీఐ వంశీధర్, పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు వచ్చి పక్కన కూర్చున్నారు. తమకు పై నుంచి ఒత్తిడి ఉందని, తప్పుగా అనుకోవద్దని చెబుతూనే కానిస్టేబుళ్లకు సైగ చేశారు. కానిస్టేబుళ్లు నన్ను గోడకు అనించి కూర్చోబెట్టి, రెండు కాళ్లు ఎడం చేసి గట్టిగా లాగి పంగ చీల్చారు. నొప్పితో అరవడంతో కాసేపు ఆపి.. రెండోసారి కూడా అలాగే చేశారు. నొప్పితో తర్వాత లేచి నిల్చుని నడవలేక పోయాను. కొంచెం సేపు నెమ్మదిగా నడిపించి కిందికి పంపారు. చాలా నొప్పిగా ఉంది. నన్ను అంతం చేసేందుకే టీడీపీ నాయకులు ఈ వ్యవహారం అంతా చేస్తున్నారు’ అని న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో న్యాయమూర్తి అంబటి రాంబాబు స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. తమ విధులకు అడ్డు పడ్డారంటూ నల్లపాడు ఎస్ఐ చేత పెట్టించిన కేసులో రిమాండ్‌ను తిరస్కరించారు. దీంతో అంబటిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. కాగా, అంతకు ముందు రాత్రి 7.30 గంటలకు అంబటికి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. న్యాయవాదుల ఆగ్రహంకోర్టు ఆవరణలో కూడా బ్యారికేడ్లు పెట్టడం, పోలీసులు తమను పదే పదే బయటకు పంపే ప్రయత్నం చేయడంపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలీసుల వల్ల తమకు కోర్టులో కూడా రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టుకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. అంబటిని ఏ జైలుకు తరలిస్తున్నారనే విషయం కూడా అంబటి రాంబాబు తరఫు న్యాయవాదులకు చెప్పక పోవడం దారుణం అని మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి నల్లపాడు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అంబటిని పోలీసులు ‘బాగా చూసుకున్నారు’ అని ఆమె తెలిపారు.రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపుతెల్లవారుజామున నాలుగు గంటలకునేత అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రత్యేక వాహనంలో ఎస్కార్ట్ తో సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. జైలు వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు.. జైలు బయట భద్రత పెంచారు. అంబటి రాంబాబుకు తీసుకొచ్చిన దుస్తులను సంచుల్లో పంపించేందుకు సైతం అనుమతించలేదు పోలీసులు. ఈరోజు అంబటితో వైఎస్సార్సీపీ నేతలు ములాకత్ కానున్నారు.తిరుగుబాటు తప్పదుప్రభుత్వ పెద్దలు పరిపాలనను పక్కనపెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అహంకార ధోరణితో కక్షగట్టి అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశారు. తిరిగి ఆయనపైనే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దుర్మార్గంతో కూడిన రాక్షస చర్య. రెడ్‌బుక్ పేరుతో తండ్రీకొడుకులిద్దరూ కలిసి వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులపై దాడులు చేయడం, తప్పుడు కేసులతో అరెస్ట్ చేయడం మినహా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్నారా? తప్పుడు కేసులకు, బెదిరింపులకు భయపడేది లేదు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రిఆటవిక రాజ్యంలో ఉన్నామా?అంబటి రాంబాబుపై దాడికి పాల్పడటం దుర్మార్గం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యంలో ఉన్నామా? సీబీఐ–సిట్ దర్యాప్తులో లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని తేల్చింది. దీనిని డైవర్ట్ చేసేందుకు టీడీపీ గూండాలు అంబటి రాంబాబు ఇంటిని, పార్టీ కార్యాలయాన్ని, ఆయన వాహనాన్ని ధ్వంసం చేసి ఇంటికి నిప్పు పెట్టారు. – రామసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీడైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే..లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ నిగ్గు తేల్చడంతో డైవర్షన్ పాలిటిక్స్‌ను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం తమదేనన్న మదంతో అంబటి రాంబాబు ఇంటిపై పైశాచికంగా దాడులు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని దేవాలయం మెట్లు కడిగిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఈ రోజు ఏ దేవాలయం మెట్లు కడుగుతారో చెప్పాలి. చంద్రబాబు, లోకేశ్ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. – తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యేరాష్ట్రంలో రాబందుల పాలనరాష్ట్రంలో రాబందుల పాలన నడుస్తోంది. టీడీపీ కూటమి అధికారంలో ఉన్నంతకాలం పక్క రాష్ట్రాలకు పారిపోయేలా చేస్తున్నారు. చంద్రబాబు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఘటనతో ఏపీని ఆటవిక ప్రదేశ్‌గా మార్చేశారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడుచంద్రబాబు నేతృత్వంలో వికృత పాలనవైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేసే వికృత రాజకీయ క్రీడ రాష్ట్రంలో కొనసాగుతోంది. లోకేశ్ తోడల్లుడికి చెందిన గీతం వర్సిటీకి రూ.5 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టడంతో రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రజల ఆలోచనలను మళ్లించేందుకు పథకం ప్రకారం అంబటి రాంబాబుపై దాడి చేశారు. – సాకే శైలజానాథ్, మాజీ మంత్రిబిహార్ తరహా ఆటవిక పాలనరాష్ట్రంలో బిహార్ తరహా పాలనకు టీడీపీ కూటమి ప్రభుత్వం తెరతీసింది. వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేల ఇంటిపై అధికార పార్టీ శ్రేణులు దాడికి పాల్పడటం గర్హనీయం. అంబటి ఇంటిపైన, మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన పెట్రోల్, కిరోసిన్ బాంబులతో దాడికి దిగారు. కూటమి పాలనలో రౌడీ రాజ్యానికి ఇది నిదర్శనం. – వెలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రిదాడులకు భయపడం రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. వైఎస్సార్సీపీ నాయకులపై కూటమి మూకలు దాడులు చేస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై దాడి చేయడం అమానుషం. డీజీపీ పచ్చచొక్కాను వీడి ఖాకీ చొక్కా ధరించాలి. పోలీసుల సమక్షంలోనే దాడులు జరగటం సిగ్గుచేటు. వైఎస్సార్సీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రభుత్వ విధానాలపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలు చేసూ్తనే ఉంటాం. – తలశిల రఘురాం, ఎమ్మెల్సీఅమిత్షా దృష్టికి తీసుకెళ్తాం..అంబటి రాంబాబుపై జరిగిన దాడి గురించి కేంద్ర హోంశాఖకు, ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాం. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళతాం. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై పార్లమెంట్ వేదికగా తెలియజేస్తాం. బాధితుల్ని కాపాడాల్సిన పోలీసులు దాడిచేసేవారికి రక్షణ కల్పించడం దుర్మార్గం. – వైవీ సుబ్బారెడ్డి, ఎంపీవ్యూహం ప్రకారమే దాడి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలను బట్టి వ్యూహం ప్రకారమే అంబటిపై దాడి జరిగిందనిపిస్తోంది. ఈ కేసులో పోలీసుల్ని నిందితుల్ని చేయాలి. – పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎంపీపోలీసులు చోద్యం చూశారుఅంబటి రాంబాబు కారులో వస్తుండగా ఆయన్ని అడ్డగించి టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూశారు. సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భర్త సమక్షంలో దాడి జరిగింది. – వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఎంపీఅంబటిని రెచ్చగొట్టారు లడ్డూ వ్యవహారంలో అంబటి రాంబాబుపై 24 గంటల ముందునుంచే వ్యూహం పన్ని ఆయన్ని రెచ్చగొట్టారు. టీటీడీ ఈవోపై ప్రభుత్వం అభాండాలు వేస్తోంది. వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి తప్పుచేయలేదని సీబీఐ చార్‌్జషీట్ ద్వారా నిజం బహిర్గతమైంది. – మేడ రఘునాథరెడ్డి, ఎంపీ హత్య చేయాలని చూశారుఅంబటి రాంబాబును హత్యచేసేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నం చేశారు. వందలాదిమంది ఆయన ఇంటిపై దాడిచేసి నిప్పంటించడం అత్యంత దుర్మార్గం. దీని ఉద్దేశం ఏమిటంటే హత్యచేయాలనే కదా? అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారు? వారు పోలీసులా? గూండాలా? దాడిచేసిన వారిపై కేసులు పెట్టకుండా అంబటి రాంబాబుపై కేసు పెట్టడం దారుణం. – గొల్ల బాబూరావు, ఎంపీ -
అంబటి రాంబాబుకు రిమాండ్
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనపై రెండుకేసులు నమోదు కాగా ఒక్క కేసులో రిమాండ్ విధించింది. మరోకేసులో 41ఏ నోటీసులిచ్చి విచారించాలని తెలిపింది. దీంతో పోలీసులు ఆయనను రిమాండ్ నిమిత్తం రాజమండ్రికి తరలించనున్నారు.కాగా మాజీ మంత్రి ఆయన తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అంబటిపై పెట్టిన కేసులన్నీ ఏడేళ్ల శిక్షకు సంబంధించినవేని సుధాకర్ రెడ్డి అన్నారు. 41ఏ కింద నోటీసులు ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా అంబటి పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ చెల్లదని కేవలం ఉన్నతాధికారుల అనుమతితోనే ఏఫ్ఐఆర్ నమోదు చేయాలని సుధాకర్ రెడ్డి కోర్టు ముందు వాదించారు.అంబటి రాంబాబు గుంటూరు మేజిస్ట్రేట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు తనను శారీరకంగా నన్ను ఇబ్బందిపెట్టారని, రెండు కాళ్లు వెడల్పు చేశారు. తన కాళ్లు నొప్పిపెడుతున్నాయన్నారు. నల్లపాడు సీఐతో పాటు మరో ఇద్దరు సీఐలు తనను వేధించారన్నారు. తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తీసుకోలేదని జడ్జి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు ఆవేదనను కోర్టు జడ్జి రికార్డు చేశారు. -
చైనాలో 11 మంది కుటుంబ సభ్యులకు మరణశిక్ష.. కారణం ఇదే
మయన్నార్‌లో మాఫియా, వ్యభిచారం, ఇతర స్కామ్‌లలో పాల్గొన్న మింగ్ కుటుంబసభ్యులు 11 మందికి ప్రభుత్వం విధించిన మరణశిక్షను అమలు చేసినట్లు చైనా మీడియా పేర్కొంది. గతేడాది సెప్టెంబర్‌లో వీరికి మరణదండన విధించగా తాజాగా అమలు చేసింది.ఉత్తర మయన్మార్‌లోని నాలుగు కుటుంబాలు అని పిలువబడే సమూహాలలో మింగ్ కుటుంబసభ్యులు అనేది ఒక సమూహం. తొలుత చైనా దేశస్థులైన వీరు చైనా సరిహాద్దుకు సమీపంలోని షాన్ రాష్ట్రంలోని స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాలలో పెద్ద నేర సామ్రాజాన్ని నడిపారు. ఆన్లైన్ మోసాలతో పాటు హత్యలు, గ్యాంబ్లింగ్, ప్రాసిస్టూషన్, ఇలా ఎన్నో రకాల నేరాలకు పాల్పడ్డారు. ఏటా ఈ ముఠాల దోపిడీ 43 బిలియన్ డాలర్లకు పైగా ఉండేదంటే వీరు ఎంత పెద్ద స్కామ్ జరిపారో అర్థం చేసుకోవచ్చు.2023 తర్వాత ఈ ముఠా వ్యవహారం అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది. అంతే కాకుండా వీరిపై వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో చైనా ఈ కుటుంబంపై విచారణ చేపట్టగా ఈ కుటుంబంపై కఠిన చర్యలకు ఉపక్రమించి వీరిని అరెస్టు చేసింది. గత సెప్టెంబర్‌లో ఈ కుటుంబానికి చెందిన 11 మంది కుటుంబ సభ్యులకు ఉరిశిక్ష విధిస్తూ ఆదేశ కోర్టులు తీర్పుఇచ్చింది. తాజాగా వారికి ఉరిశిక్ష వేసినట్లు చైనా మీడియా కథనాలు ప్రచురించింది. -
High Court: న్యాయస్థానంలో పోలీసుల హద్దులు దాటారా?
-
భర్త అక్రమ సంబంధం గుట్టు రట్టు.. భార్యకు కోర్టు వింత శిక్ష
చైనాలోని ఓ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను సోషల్ మీడియాలో విమర్శించినందుకు భార్యకు కోర్టు వింత శిక్ష విధించింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన నియు నా అనే మహిళకు, గావో ఫీతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. గావో ఫీ ఒక బొగ్గు గని కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అదే ఆఫీసులో పనిచేసే ఒక వివాహితతో గావో ఫీ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.ఈ విషయం నియుకు తెలియడంతో వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆమె సోషల్ మీడియాలో తన భర్త బండారాన్ని బయటపెట్టింది. అతడు పనిచేసే ఆఫీస్ వివరాలతో, భర్తను తిడుతూ పోస్టులు పెట్టింది. దీంతో గావో ఫీ తన భార్యపై కోర్టులో 'పరువు నష్టం' దావా వేశాడు. ఈ కేసును విచారించిన న్యాయస్ధానం ఎవరూ ఊహించని తీర్పు ఇచ్చింది. ఒకరు వ్యక్తిగతంగా ఎన్ని తప్పులు చేసినా, చట్టం ప్రకారం అతడి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని కోర్టు తేల్చింది. దీంతో తన భర్తకు వరుసగా 15 రోజుల పాటు సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని నియును కోర్టు ఆదేశించింది.కోర్టు ఆదేశాలు మేరకు జనవరి 12 నుంచి నియు నా క్షమాపణ వీడియోలు పెట్టడం ప్రారంభించింది. అయితే ఆమె మాత్రం చాలా వ్యంగ్యంగా తన భర్తకు సారీ చెబుతోంది. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను ఉద్దేశించి.. "మీ ఇద్దరిది నిజమైన ప్రేమ. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీ గౌరవాన్ని నేను కాపాడాలి కాబట్టి క్షమించు" అంటూ సెటైర్లు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే కోర్టు ఇచ్చిన ఈ వింత తీర్పుతో ఆమె సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయింది. ఆమెకు రోజుల వ్యవధిలోనే 3,50,000 మంది ఫాలోవర్లు వచ్చారు. -
ఒక కేసులో సజ్జన్‌కు విముక్తి
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను నిర్దోషిగా పేర్కొంటూ విడుదల చేసింది. జనక్‌పురి ప్రాంతంలో జరిగిన అల్లర్లకు సజ్జన్ కుమార్ కారణమని సందేహానికి తావులేని రీతిలో నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది. బాధితులు, వారి కుటుంబాల ఆవేదనను తాము అర్థం చేసుకోగలమన్న స్పెషల్ కోర్టు జడ్జి దిగ్ వినయ్ సింగ్..భావోద్వేగాలకు అతీతంగా తీర్పు ఉండాలంటూ వ్యాఖ్యానించారు. ‘ఈ కేసులో నిందితుడి నేరాన్ని కేవలం సాక్ష్యాధారాల ఆధారంగానే నిర్ధారించాలి. దురదృష్టవశాత్తూ సాక్షులలో ఎక్కువ మంది విన్న మాటలను చెప్పిన వారు, కనీసం నిందితుడి పేరును చెప్పడంలో విఫలమైన వారు ఉన్నారు’అని జడ్జి పేర్కొన్నారు. ఇటువంటి సాక్షులు నిందితుడిని గుర్తించారన్న అంశంపై ఆధారపడటం ప్రమాదకరం, న్యాయం పక్కదారి పట్టడానికి దారితీయవచ్చునని ఆయన అన్నారు. నేరం జరిగిన ప్రాంతంలో సజ్జన్ కుమార్ ఉన్నాడని లేదా అతడిని అక్కడ ఎవరైనా చూశారని చెప్పడానికి ఎటువంటి నమ్మదగిన సాక్ష్యాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అల్లర్లకు పాల్పడిన గుంపును సజ్జన్ కుమార్ రెచ్చగొట్టినట్లు, ఆ ఘటనకు సంబంధించి ఎటువంటి కుట్ర జరిగినట్లు కూడా ఆధారాలు లేవని 60 పేజీల తీర్పులో తెలిపారు. అందుకే, అతడిని అన్ని ఆరోపణల నుంచి విముక్తి చేస్తూ నిర్దోషిగా ప్రకటిస్తున్నామని తీర్పు వెలువరించారు. సజ్జన్ కుమార్‌కు ఇదివరకే ఇటువంటి నేరాలతో ప్రమేయం ఉందన్న వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు. ఒక వ్యక్తి 100 నేరాలలో దోషిగా తేలి ఉండవచ్చు, కానీ 101వ నేరంలో కూడా అతడిని దోషిగా నిర్ధారించాలంటే సందేహానికి తావు లేని బలమైన సాక్ష్యం కచ్చితంగా ఉండాలన్నారు. ఇక్కడ అనుమానాలకు తావుండరాదని తెలిపారు. నిందితుడు సామాన్యుడైనా లేదా పలుకుబడి కలిగిన వ్యక్తయినా చట్టం అందరికీ సమానమేనన్నారు. ‘నిందితుడికి భయపడే పరిస్థితులు తగ్గినప్పటికీ, తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన, ఆ ఘటనను స్వయంగా చూసిన సాక్షులు, ఇంత సుదీర్ఘ కాలం తర్వాత కూడా నిందితుడి పేరును చెప్పడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పడానికి తగిన కారణం ఏదీ కనిపించడం లేదు’అని జడ్జి దిగ్ వినయ్ సింగ్ పేర్కొన్నారు. బాధితులు, వారి కుటుంబ సభ్యులు అనుభవించిన మానసిక వేదన అర్థం చేసుకోగలం. కానీ, ఆ వేదన ఈ కోర్టు నిర్ణయానికి అడ్డంకి కాకూడదు. ఈ నిర్ణయం భావోద్వేగాలకు అతీతంగా ఉండాలి’అని ఆయన తెలిపారు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అంగరక్షకుల కాల్పుల్లో చనిపోవడంతో ఢిల్లీలో సిక్కులపై దాడులు జరిగాయి. ఢిల్లీలోని జనక్‌పురి, వికాస్పురి పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన అల్లర్లకు అప్పటి ఔటర్ ఢిల్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సజ్జన్ కుమార్ కుట్ర పన్నినట్లు ఆరోపణలున్నాయి. వికాస్పురి కేసులో కోర్టు ఇప్పటికీ ఆయన్ను నిర్దోషిగా విడుదల చేసింది. అయితే, సరస్వతీ విహార్ ప్రాంతంలో అల్లర్ల సమయంలో జరిగిన హత్యల్లో ప్రమేయం ఉందన్న ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు గతేడాది సజ్జన్ కుమార్‌కు యావజ్జీవ శిక్ష విధించింది. దీంతో, ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు.బాధిత కుటుంబాల తీవ్ర ఆవేదన1984 అల్లర్ల కేసు తీర్పు వెలువడుతుందన్న విషయం తెలిసిన బాధితులు, వారి కుటుంబీకులు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు తరలివచ్చారు. సజ్జన్ కుమార్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేనందున, ఆయన్ను నిర్దోషిగా విడుదల చేస్తున్నట్లు కోర్టు ప్రకటించగా వారంతా షాక్‌కు గురయ్యారు. ‘దుండగులు నిప్పంటించడంతో మా నాన్న నా కళ్లెదుటే మంటలకు ఆహుతయ్యారు. కోర్టుల చుట్టూ తిరిగా. న్యాయం జరుగుతుందని 42 ఏళ్లపాటు ఎదురు చూశా. దశాబ్దాల తరబడి ఆశతో ఎదురుచూసినా, ఇప్పటికీ న్యాయం అందనంత దూరంలోనే ఉంది’అని నిర్మల్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
Ravi Teja: ప్రేమ పేరుతో యువతిని మోసం 10 ఏళ్ల జైలు శిక్ష
-
డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్!
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు, అమెరికా న్యాయస్థానాలకు మధ్య జరుగుతున్న ‘గుత్తాధిపత్య’ పోరు కొత్త మలుపు తిరిగింది. తమ సెర్చ్ డేటాను చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ వంటి ప్రత్యర్థి సంస్థలతో పంచుకోవాలన్న కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ గూగుల్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టును ఆశ్రయించింది. అప్పీలుపై తుది నిర్ణయం వచ్చే వరకు ఈ డేటా బదిలీని వాయిదా వేయాలని కంపెనీ కోరింది.తీర్పు నేపథ్యం ఏమిటి?ఆన్లైన్ సెర్చ్ మార్కెట్లో గూగుల్ చట్టవిరుద్ధమైన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని 2024లో వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి అమిత్ మెహతా చారిత్రాత్మక తీర్పునిచ్చారు. యాపిల్, శామ్సంగ్ వంటి కంపెనీలకు ఏటా 20 బిలియన్ డాలర్లకు పైగా చెల్లించి, గూగుల్‌ను ‘డిఫాల్ట్’ సెర్చ్ ఇంజిన్‌గా ఉంచడం ద్వారా పోటీని అణచివేసిందని కోర్టు నిర్ధారించింది. ఈ ఆధిపత్యాన్ని తగ్గించే క్రమంలో గూగుల్ తన సెర్చ్ డేటాను ప్రత్యర్థులకు అందుబాటులో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు.గూగుల్ వాదన ఏంటి?అప్పీలు పెండింగ్‌లో ఉండగానే డేటాను పంచుకుంటే కంపెనీకి చెందిన కీలక వాణిజ్య రహస్యాలు ప్రత్యర్థుల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ప్రజలు గూగుల్‌ను బలవంతంగా కాకుండా, మంచి సేవలు అందిస్తుంది కాబట్టే వాడుతున్నారు’ అని గూగుల్ రెగ్యులేటరీ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ లీ-అన్నే ముల్హోలాండ్ స్పష్టం చేశారు. ఇప్పటికే మార్కెట్లో గట్టి పోటీ ఉందని, కోర్టు నిర్ణయం ఆవిష్కరణల స్థాయిని తక్కువ అంచనా వేసిందని కంపెనీ వాదిస్తోంది.షరతులకు అంగీకారం.. కానీ!గోప్యత, భద్రతా రక్షణలకు సంబంధించిన నిబంధనలను పాటించడానికి సిద్ధమని గూగుల్ తెలిపింది. అయితే డేటా షేరింగ్, సిండికేటెడ్ ఫలితాలు, ప్రకటనల పంపిణీ విషయంలో మాత్రమే స్టే కోరుతోంది.ఇదీ చదవండి: తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు -
సాక్షి ఫోటోగ్రాఫర్ పై తప్పుడు కేసు.. బుద్ధి చెప్పిన కోర్ట్
-
బాంబు బెదిరింపులు.. ఇటు కోర్టు.. అటు రైల్వే స్టేషన్
మైసూరు: బాంబు బెదిరింపులతో ఇటు ఒక కోర్టు ప్రాంగణంలో, మరోవైపు ఒక రైల్వే స్టేషన్ కలకలం చెలరేగింది. వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని మైసూర్ జిల్లా కోర్టుకు మంగళవారం ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఈ సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా కోర్టు కార్యకలాపాలను నిలిపివేసి, ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. న్యాయాధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనతో కోర్టు ఆవరణలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌తో పాటు సంఘఘటనా స్థలానికి చేరుకున్నారు. కోర్టు ప్రాంగణమంతా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి పోలీసుల నియంత్రణలో ఉందని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశామని ఒక సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు ప్రారంభించామన్నారు.ఉత్తరప్రదేశ్‌లో..మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లోని మౌ (Mau) రైల్వే జంక్షన్లో కూడా బాంబు కలకలం చెలరేగింది. గోరఖ్‌పూర్ నుండి ముంబై వెళుతున్న కాశీ ఎక్స్‌ప్రెస్ (15018 డౌన్) రైలులో బాంబు అమర్చినట్లు పోలీసు కంట్రోల్ రూమ్‌కు మంగళవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఒక అజ్ఞాత ఫోన్ కాల్ వచ్చింది. ఈ వార్తతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానిక పోలీసులు, జిఆర్పి (జీఆర్పీ), ఆర్పిఎఫ్ (ఆర్పీఎఫ్)బృందాలు సంయుక్తంగా రైలులోని ప్రయాణికులను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఒకటవ నంబర్ ప్లాట్‌ఫారమ్‌ను చుట్టుముట్టిన పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అన్ని కోచ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది నకిలీ బెదిరింపు అని అధికారులు భావిస్తున్నారు. అజ్ఞాతంగా కాల్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘నా నోబెల్ ట్రంప్‌కే..’ మచాడో సంచలనం -
బై బై 2025
2025కి నేటి అర్ధరాత్రితో శుభం కార్డు పడినట్టే. ప్రపంచమంతా 2025కి బై బై చెప్పేసి.. 2026కి వెల్కమ్ చెప్పబోతోంది. చిత్ర పరిశ్రమ కూడా కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతోంది. 2025లో పెద్ద, చిన్న సినిమాలు కలిపి తెలుగులో దాదాపు 250 విడుదలయ్యాయి. అయితే విజయాల శాతం తక్కువే. ఈ ఏడాదిలో రిలీజైన సినిమాలు, హిట్ అయినవి, ప్రేక్షకులను మెప్పించినవి, మెప్పించే ప్రయత్నం చేసిన చిత్రాల వివరాలేంటో ఓ లుక్కేద్దాం.⇒ జనవరిలో టాలీవుడ్ అంటే సంక్రాంతి సినిమాలను గురించే ప్రధానంగా చర్చించుకుంటారు. 2025 సంక్రాంతికి రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు విడుదలయ్యాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించి 2025 సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది. ‘గాంధీ తాత చెట్టు’ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. దర్శక–నిర్మాత సుకుమార్ తనయ సుకృతి వేణి లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. ఈ మూవీతో సుకృతి ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డును అందుకున్నారు. అలాగే జనవరి 24నే విడుదలైన ‘హత్య’ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ⇒ ఫిబ్రవరి నెలలో దాదాపు పదిహేను సినిమాలు విడుదలయ్యాయి. నాగచైతన్య ‘తండేల్’ సినిమాతో థియేటర్స్‌లోకి వచ్చారు. ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది. బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘బ్రహ్మా ఆనందం’ సినిమా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘మజాకా’ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. విశ్వక్ సేన్ ‘లైలా’ చిత్రం ఆడియన్స్ ను నిరాశపరచగా, ‘బాపు’, ‘రామం రాఘవం’ చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేశాయి. ⇒ మార్చిలో దాదాపు 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘కోర్ట్’ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాగే ‘మ్యాడ్ 2’ చిత్రం ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసింది. నితిన్ ‘రాబిన్ హుడ్’, కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయాయి.⇒ ఏప్రిల్‌లో పదిహేడు సినిమాలు ప్రేక్షకులముందుకొచ్చాయి. సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ ప్రేక్షకులను అలరించలేకపోయింది. తమన్నా ‘ఓదెల 2’, కల్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతీ’, ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’, ఇంద్రరామ్ ‘చౌర్యపాఠం’, ప్రదీప్ మాచి రాజు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ వంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాయి. ⇒ మే నెల ఆరంభంలో నాని ‘హిట్: ది థర్డ్ కేస్’ రిలీజై యాక్షన్ ఆడియన్స్ ను అలరించింది. శ్రీవిష్ణు ‘సింగిల్’ సినిమా హిట్‌గా నిలిచింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘భైరవం’ ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేసింది. సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’, రాజేంద్ర ప్రసాద్ ‘షష్ఠిపూర్తి’ వంటి చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ⇒ జూన్ లో పదికంటే తక్కువ చిత్రాలే విడుదలయ్యాయి. నాగార్జున, ధనుష్‌ల ‘కుబేర’ హిట్‌గా నిలిచింది. అనంతిక సనీల్‌కుమార్ ‘8 వసంతాలు’ సినిమా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రం హిట్ ఫిల్మ్‌గా నిలిచింది. ⇒ జూలైలో 18 సినిమాలు ప్రేక్షకులముందుకొచ్చాయి. వాటిలో నితిన్ ‘తమ్ముడు’, పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’, విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ వంటి సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదలయి, ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాయి. ‘మహావతార్ నరసింహ’ అనే యానిమేషన్ ఫిల్మ్ మాత్రం బ్లాక్‌బస్టర్ అయింది. ⇒ ఆగస్టు నెలలో దాదాపు 14 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘థ్యాంక్యూ డియర్, బకాసుర రెస్టారెంట్, పరదా, యూనివర్శిటీ, సుందరకాండ, త్రిబాణధారి బార్బరిక్’ వంటి సినిమాలు ప్రేక్షకులముందుకొచ్చాయి. ⇒ సెప్టెంబరులో కేవలం ఎనిమిది చిత్రాలు ఆడియన్స్ ముందుకొచ్చినప్పటికీ విజయాల శాతం ఎక్కువగా ఉంది. అనుష్క ‘ఘాటీ’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘కిష్కింధపురి’, తేజా సజ్జా ‘మిరాయ్’, పవన్ కల్యాణ్ ‘ఓజీ’, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలు విజయం సొంతం చేసుకున్నాయి . ⇒ అక్టోబరులో దాదాపు డజను సినిమాలు వెండితెరపైకి వచ్చాయి. వీటిలో అనసూయ, సాయికుమార్ ‘అరి’, రక్షిత్ శెట్టి ‘శశివదనే’, సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసుకదా’, కిరణ్ అబ్బవరం ‘కె–ర్యాంప్’, రవితేజ ‘మాస్ జాతర’ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కిరణ్ అబ్బవరం ‘కె–ర్యాంప్’ మాత్రం హిట్‌గా నిలిచింది. ‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ కూడా ఆడియన్స్‌ని అలరించింది. ⇒ నవంబరులో సుమారుపాతిక చిత్రాల ప్రేక్షకులముందుకొచ్చాయి. వాటిలో సుధీర్ బాబు ‘జటాధర’, రష్మికా మందన్నా ‘ది గర్ల్ ఫ్రెండ్’, తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’, విక్రాంత్ రెడ్డి ‘సంతాన ప్రాప్తిరస్తు, ‘అల్లరి’ నరేశ్ ‘12 ఎ రైల్వే కాలనీ’, రాజ్ తరుణ్ పాంచ్ మినార్’, ప్రియదర్శి ‘ప్రేమంటే’, అఖిల్ రాజ్ ‘రాజు వెడ్స్ రాంబాయి’, రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ⇒ 2025లో ఆఖరి నెల అయిన డిసెంబరులో దాదాపు పదిహేను సినిమాలకుపైగా వెండితెరపైకి వచ్చాయి. వాటిలో బాలకృష్ణ ‘అఖండ 2:తాండవం’, రోషన్ కనకాల ‘మోగ్లీ’, నరేశ్ అగస్త్య ‘గుర్రంపాపిరెడ్డి’, హెబ్బా పటేల్ ‘మారియో’, నవదీప్ ‘దండోరా’, త్రిగుణ్, అఖిల్ రాజ్ ‘ఈషా’, ఆది సాయికుమార్ ‘శంబాల’, మోహన్‌లాల్ ‘వృషభ’ వంటి సినిమాలున్నాయి. వీటిలో ‘అఖండ 2: తాండవం’, ‘గుర్రంపాపిరెడ్డి’, ‘దండోరా’, ‘ఈషా’, ‘శంబాల’, ‘వృషభ’ వంటి చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి. -
మహిళ హత్య.. నిందితునికి మరణశిక్ష
సాక్షి హైదరాబాద్: ఇటీవల భరత్‌నగర్ ప్రాంతంలో మహిళను దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా III స్పెషల్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడు కరణ్ సింగ్‌ను దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దానితో పాటు రూ. పదివేలు జరిమానా చెల్లించాలని తెలిపారు. ఈ నెల 18 వతేదీ భరత్‌గర్‌లోని ఫ్లై ఓవర్ సమీపంలోని ఏసీసీ గోదాం పక్కన ఉన్న పొదల్లో ఒక మహిళ మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు వివరాలు అందించగా వారు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో కర్ణాటక బీదర్‌కు చెందిన కరణ్ సింగ్‌ను నిందితునిగా అనుమానిస్తూ అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు కరణ్ సింగ్‌ను దోషిగా తేలుస్తూ మరణశిక్ష విధించింది. -
బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్?
సోషల్ మీడియా ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీనిలో మునిగిపోతున్నారు. పిల్లల్లో అయితే సామాజిక మాధ్యమాల ఎఫెక్ట్ మరింత అధికంగా ఉంటుంది. అయితే మద్రాస్ హైకోర్టు పిల్లల్లో సోషల్ మీడియా వాడకంపై కీలక సూచన చేసింది. 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు వాటిని వాడకుండా నియంత్రించాలని సూచించింది. పిల్లల్లో ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. మానసికంగా, శారీరకంగా ఎదగాల్సిన వయస్సులో గంటల గంటలు ఫోన్లకు అతుక్కపోయి వాటిలోనే గడపడంతో ఆందోళన, డిఫ్రెషన్, ఒత్తిడి తదితర సమస్యలు చిన్న వయసులోనే వెలుగు చూస్తున్నాయి. వారి తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు ఫోన్లకు దూరం చేద్దామని ప్రయత్నించినా ఫలితం ఉండట్లేదు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు తెలిపింది.16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలకు అనుమతించకుండా చట్టం రూపొందించాలని కోర్టు పేర్కొంది. ఆస్ట్రేలియాలో ఈ మధ్య ఇటువంటి చట్టం రూపొందించారని భారత్‌లో సైతం ఈ విషయం ఆలోచించాలని తెలిపింది. తద్వారా హానికరమైన, అసభ్యకరమైన కంటెంట్‌ను పిల్లలు చూడకుండా నియంత్రిచవచ్చని పేర్కొంది. అదేవిధంగా అటువంటి కఠిన చట్టాలు రూపొందించే వరకూ పిల్లలు ఇంటర్నెట్ను సురక్షితంగా వాడేలా రాష్ట్ర ప్రభుత్వం, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంయుక్తంగా ఓ కార్యాచరణ సిద్ధం చేయాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. -
నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్‌కు నోటీసులు
ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో ఈడీ అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ అప్పీలుపై స్పందన కోరుతూ సోనియా, రాహుల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే ఏజెఎల్‌కు కాంగ్రెస్ పార్టీ రూ. 90కోట్ల రుణం అందించింది. అందుకు బదులుగా ఏజేఎల్ కంపెనీ ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే ఈవ్యవహారంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, అస్కార్ ఫెర్నాండేజ్, సుమన్ దుబే తదితరులు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తుంది.ఏజేఎల్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన వాటాదారులు. ఈ సంస్థ కేవలం రూ.50 లక్షలు చెల్లించి ఏజేఎల్‌కు చెందిన సూమారు. రూ. రెండువేల కోట్ల విలువైన ఆస్తులు పొందారని ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.నేషనల్ హెరాల్డ్ పత్రికను 1938లో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో పాటు ఇతర స్వాతంత్ర సమర యోధులు ప్రారంభించారు. దీని నిర్వహణ బాధ్యతలు AJL అనే సంస్థ చూసుకునేది. ఈ పత్రికకు ఢిల్లీ, ముంబై, లక్నో వంటి నగరాల్లో ఆస్తులు ఉన్నాయి. కాగా ఆస్తుల బదిలీ విధానంలో అక్రమాలు జరిగాయని ఈడీ ఆరోపిస్తుంది. -
పక్కా ప్లాన్ తోనే బాబుపై కేసులు క్లోజ్..
-
ఐపీఎస్ సంజయ్‌కు బెయిల్
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టైన ఐపీఎస్ అధికారి సంజయ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో ఆసంస్థకు చెందిన వెబ్‌పోర్టల్, మొబైల్ యాప్ అభివృద్ధి కాంట్రాక్ట్‌లో అవకతవకలు జరిగాయని ఆయనపై ఆరోపణలున్నాయి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న సంజయ్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది.ఐపీఎస్ సంజయ్ కుమార్ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారంటూ సరిగ్గా 112 రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి బెయిల్ కోసం వివిధ కోర్టుల్లో పిటిషన్లు వేసినప్పటికీ బెయిల్ లభించలేదు. సంజయ్ కుమార్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సీఐడీ చీఫ్‌గా ఉ న్నారు.సీఐడీలో ఎస్పీ, ఎస్టీ అవగాహన కార్యక్రమాలకు టెండర్లు పిలిచి 1.15కోట్లు దుర్వినియోగం చేశారని 2025లో ఏసీబీ కేసు నమోదు చేసింది. అనంతరం రిమాండ్, కస్టడీ పొడిగింపులు జరిగాయి. 2025 నవంబర్‌లో సంజయ్ కుమార్ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగించారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ మే 2026 వరకు ఉంటుంది. -
'కోర్ట్' మూవీ, టీమ్‌పై అల్లు అర్జున్ ప్రశంసలు (ఫొటోలు)
-
ఐకాన్ స్టార్‌ను కలిసిన కోర్ట్ మూవీ టీమ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కోర్ట్ మూవీ టీమ్ కలిశారు. బన్నీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ప్రియదర్శి పులికొండ. ఐకాన్ స్టార్‌తో ఐకానిక్ మూమెంట్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. కోర్ట్ మూవీ సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది.కోర్ట్ కథేంటంటే..కాగా.. మైనర్ బాలికల రక్షణ కోసం ఉన్న పోక్సో చట్టం బ్యాక్ డ్రాప్ స్టోరీతో కోర్ట్ మూవీ తీశారు. మంగపతిగా శివాజీ, లాయర్‌గా ప్రియదర్శి నటించారు. టీనేజీ ప్రేమికులుగా హర్ష రోషన్, శ్రీదేవీ ఆకట్టుకున్నారు. ఈ మూవీని హీరో నాని నిర్మించారు. రామ్ జగదీశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తీసిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శివాజీ, ప్రియదర్శితో పాటు హర్ష రోషన్-శ్రీదేవి జంట నటనకు ప్రశంసలు దక్కాయి.What an Ikonic moment…@alluarjun Anna ❤️🙏🫂#Court pic.twitter.com/eBMCtTyEsQ— Priyadarshi Pulikonda (@Preyadarshe) December 11, 2025 -
ఆఫీస్‌కు అర్లీగా వస్తోందని ఉద్యోగిని తొలగింపు
స్పెయిన్‌లో ఒక విచిత్రమైన ఉద్యోగ వివాదం వార్తల్లో నిలిచింది. దాదాపు రెండేళ్ల పాటు క్రమం తప్పకుండా 40 నిమిషాల ముందుగానే ఆఫీస్‌కు వస్తోన్న ఒక ఉద్యోగినిని ఆ కంపెనీ తొలగించింది. ఆఫీస్‌కు అర్లీగా వస్తే తొలగిస్తారా? అంటూ కంపెనీని కోర్టుకు లాగింది ఆ 22 ఏళ్ల ఉద్యోగిని. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదవండి...అసలేం జరిగిందంటే.. మెట్రో వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. ఆ ఉద్యోగిని షిఫ్ట్ ఉదయం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ ఆమె ఉదయం 6:45 నుంచి 7:00 గంటల మధ్యే ఠంచనుగా ఆఫీస్‌కు వెళ్లిపోయేది. ఉద్యోగిని ముందుగా రావడం ప్రారంభంలో మంచి అలవాటుగా కనిపించినా, ఆ సమయంలో ఆమె చేయడానికి ఎలాంటి పని లేకపోవడం, అలాగే ముందుగా రాకూడదన్న సంస్థ ఆదేశాలను ఆమె పదేపదే లెక్కచేయకపోవడం కంపెనీ యాజమాన్యాన్ని అసహనానికి గురి చేసింది. దీంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది.కంపెనీ ఏం చెబుతోందంటే.. సంస్థ మాటల్లో.. ఉద్యోగి ముందుగానే రావడం వల్ల ఎటువంటి ఉత్పాదకతా అందించకపోగా, నిర్ణయించిన సమయాలకు కట్టుబడే నిబంధనలను సదరు ఉద్యోగిని నిర్లక్ష్యం చేసింది. పలుమార్లు మౌఖికంగా, రాతపూర్వకంగా హెచ్చరించినప్పటికీ ఆమె తన అలవాటు మార్చుకోలేదు. ఇక, ఆమె 19 సందర్భాల్లో ఆఫీస్ ప్రాంగణంలోకి రాక ముందే కంపెనీ యాప్‌లో లాగిన్ కావడానికి ప్రయత్నించినట్లు కూడా సంస్థ పేర్కొంది. ఇది మోసపూరిత చర్యగా కంపెనీ యాజమాన్యం పరిగణించింది.తొలగింపు అన్యాయమంటూ కోర్టుకు..తన తొలగిపింపును సవాలు చేస్తూ ఆ మహిళ అలికాంటే సోషల్ కోర్టును ఆశ్రయించింది. ఆమె వాదన ఏమిటంటే ముందుగా రావడం తప్పు కాదు. కంపెనీ యాజమాన్యం తనపట్ల అన్యాయం చేసింది.భిన్నంగా కోర్టు తీర్పుఅయితే, కోర్టు ఈ వాదనలు అంగీకరించలేదు. గైర్హాజరు లేదా ఆలస్యంగా రావడం కాకుండా అత్యధిక సమయపాలన కూడా నియమావళిని ఉల్లంఘించే పరిస్థితుల్లో సమస్యగా మారుతుందని కోర్టు స్పష్టం చేసింది. సంస్థ నిబంధనలను పాటించడానికి ఉద్యోగి నిరాకరించిందని, ఇది స్పానిష్ వర్కర్స్ స్టాట్యూట్ ఆర్టికల్ 54ను ఉల్లంఘించడమేనని తీర్పులో పేర్కొంది.అంతేకాకుండా ముందుగానే రావడం కారణంగా జట్టు సమన్వయానికి అంతరాయం ఏర్పడిందని మరో ఉద్యోగి ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఉద్యోగిని తొలగించడం సముచితమేనని నిర్ణయిస్తూ కోర్టు యజమానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. -
సందేశ్‌ఖాలీ కేసు: కీలక సాక్షిపైదాడి,కుమారుడు, డ్రైవర్ మృతి
కోల్‌కతా, సాక్షి : పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన సందేశ్‌ఖలి వివాదానికి సంబంధించిన కేసుల్లో కీలక సాక్షిపై దాడి జరిగింది. ఈ ప్రమాదంలో భోలానాథ్ ఘోష్ తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకోగా, అతని చిన్న కుమారుడు , కారు డ్రైవర్ మరణించారు. ఈ ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తోంది.ఈకేసుకు సంబంధించి బుధవారం కోర్టుకు వెళుతుండగా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బోయ్‌ఖలి పెట్రోల్ పంప్ సమీపంలో ఒక ట్రక్కు అమిత వేగంతో వచ్చి అతని వాహనాన్ని ఢీకొట్టింది. ట్రక్కు కారును ఢీకొట్టి, ఈడ్చుకెళ్లి, సమీపంలోని నీళ్లలోకి నెట్టివేసింది. వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఘోష్ చిన్న కుమారుడు సత్యజిత్ ఘోష్ (32), కారు డ్రైవర్ సహనూర్ మొల్లా (27) స్పాట్లోనే మరణించారు. తీవ్రంగా గాయపడిన భోలానాథ్‌ను మెరుగైన చికిత్స కోసం కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రికి తరలించారు.సందేశ్‌ఖాలి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ తనపై దాఖలు చేసిన అనేక కేసుల్లో ఒకదానికి సంబంధించి బసిర్హాట్ సబ్-డివిజనల్ కోర్టుకు హాజరు కావడానికి ఘోష్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: మొటిమల చికిత్స కోసం వెళితే, దారుణం: రూ. 31 లక్షల దావాహత్యకు కుట్రఇది ఉద్దేశ పూర్వకంగా చేసిన దాడి అని, తన తండ్రిని హత్య చేసేందుకు పన్నిన పన్నాగమని ఘోష్ పెద్ద కుమారుడు బిశ్వజిత్ ఆరోపించారు. షాజహాన్ జైలు నుండే ఈ పథకం వేశాడన్నారు. 2024 జనవరిలో సందేశ్‌ఖాలిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై జరిగిన దాడిలో, అలాగే షాజహాన్‌కు వ్యతిరేకంగా సమాచారం ఇచ్చిన సంబంధిత సిబిఐ దర్యాప్తులో ఘోష్ ప్రధాన సాక్షులలో ఒకరిగా ఉన్నారు.ఏంటీ సందేశ్‌ఖాలీ కేసుపశ్చిమ బెంగాల్‌లోని ఉత్తే 24 పరగణాల జిల్లాలో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, లైంగిక వేధింపులు, భూకబ్జాలకు వ్యతిరేకంగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. మహిళలను బంధించి లైంగికంగా హింసించారని ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసు యంత్రాంగం స్పందించలేదని బాధితులు తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఈ అంశాన్ని కోల్‌కతా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై ఉత్తర 24 పరగణాల జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. రేషన్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న షాజహాన్ షేక్ నివాసంపై ఈడీ అధికారులు తనిఖీల నిమిత్తం వెళ్లినపుడు షాజహాన్ అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన అనంతరం షాజహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.షాజహాన్ అనేక కేసులకు సంబంధించి గతంలో అరెస్టు , కస్టడీలో ఉన్నాడు. మనీలాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన ED ప్రాసిక్యూషన్ ఫిర్యాదు, భూకబ్జాలు, అక్రమ చేపల పెంపకం మరియు వ్యాపారం, ఇటుక బట్టీలను స్వాధీనం చేసుకోవడం, కాంట్రాక్టుల కార్టలైజేషన్, అక్రమ పన్నులు ,లెవీల వసూలు మరియు భూమి ఒప్పందాలపై కమీషన్లపై కేంద్రీకృతమై ఉన్న నేర సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో వివరించింది. ఇదీ చదవండి: Indigo Crisis హర్ష్ గోయెంకా నో డిలే, నో డైవర్షన్ వైరల్ వీడియో -
అభాసుపాలైన దేశంలోకెల్లా బెస్ట్ పోలీస్ స్టేషన్!
ప్రశంసలతో మొదలైన ప్రయాణం… అవమానంతో ముగిసింది. దేశంలోకెల్లా బెస్ట్ పోలీస్ స్టేషన్‌గా బిరుదు పొందిన కొద్ది రోజుల్లోనే… ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇటు కోర్టు ముందు అవమానానికి గురైంది. ఇందుకు కారణం ఆ పీఎస్ సిబ్బంది చేసిన నిర్వాకమే.పోలీస్ వ్యవస్థను కుదిపేసిన సంచలన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మల్హర్‌గఢ్ పోలీస్ స్టేషన్ దేశంలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే అమాయకుడైన ఓ స్టూడెంట్ను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నంలో కోర్టులో పరువు పొగొట్టుకుంది.సోహన్ అనే ఇంటర్ విద్యార్థిని ఆగస్టు 29న మల్హర్‌గఢ్ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అతని నుంచి నిషేధిత మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామంటూ కోర్టులో ప్రవేశపెట్టారు. డ్రగ్స్ అక్రమ రవాణా కేసు నేపథ్యంతో.. కోర్టు అతనికి రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితుడి కుటుంబం డిసెంబర్ 5వ తేదీన మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్‌ను ఆశ్రయించింది. అక్రమ అపహరణ, తప్పుడు అరెస్ట్, నకిలీ సాక్ష్యాలు అంటూ.. కొన్ని ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. అందులో..పోలీసులు చెప్పినట్లు డ్రగ్స్ లేదు. చేజింగ్ లేదు. ఎలాంటి సీజ్‌లు లేవు. బస్సులో వెళ్తున్న సోహాన్‌ను మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా బయటకు లాక్కెళ్లిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. పైగా ఎఫ్ఐఆర్లో అతని అరెస్ట్‌కు సంబంధించిన వివరాలతో పొంతన కుదరలేదు. దీంతో.. కోర్టు ఎస్పీని తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.డిసెంబర్ 9వ తేదీన మాందసౌర్ జిల్లా ఎస్పీ వినోద్ కుమార్ మీనా కోర్టులో చేతులు కట్టుకుని నిల్చోవాల్సి వచ్చింది. సోహాన్‌ను బస్సులోనే సివిల్ డ్రెస్‌లో ఉన్న పీఎస్ సిబ్బంది అరెస్ట్ చేసినట్లు అంగీకరించారు. ఇదంతా ఓ కానిస్టేబుల్ ఆధ్వర్యంలో జరిగిందని.. అరెస్ట్ మొదలు ఏదీ ప్రొసీజర్ ప్రకారం జరగలేదని కోర్టుకు వివరించారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఆరుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైయిరీకి ఆదేశించినట్లు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ఈ పిటిషన్‌పై ఉత్తర్వులను వాయిదా వేసింది. ఈ కేసు పోలీస్ వ్యవస్థలో హాట్ టాపిక్‌గా మారింది.నిరపరాధులను బలవంతంగా తీసుకెళ్లడం.. తర్వాత తప్పుడు కేసులు నమోదు చేయడం.. CCTVలో ఒకటి ఉంటే.. తప్పుడు సాక్ష్యాలతో మానిఫులేషన్ చేయడం.. పోలీసుల కథనం వాస్తవానికి విరుద్ధంగా ఉండడం.. కుటుంబాలు కోర్టులను ఆశ్రయించడం.. కోర్టు ముందు పోలీస్ అధికారులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి రావడం.. కోర్టులతో ఆక్షింతలు వేయించుకోవడం.. మధ్యప్రదేశ్ ఘటన ఏపీలో జరుగుతున్న అక్రమ అరెస్టుల కేసులను గుర్తు చేస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ये देश के सबसे अच्छे पुलिस स्टेशन में से एक की मल्हारगढ़ की पुलिस है, पिछले महीने गृहमंत्री अमित शाह ने ऐलान किया था, उसी थाने के कर्मचारी हैं एक छात्र को जबरन ड्रग्स तस्करी में फंसाने का आरोप है, हाईकोर्ट ने सवाल पूछे अब जाकर निलंबित हुए लेकिन छात्र को २ महीने जेल में रहना पड़ा! pic.twitter.com/tN3IT6fDpJ— Anurag Dwary (@Anurag_Dwary) December 10, 2025 -
ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఉత్తర్వులపై ఉత్కంఠ
సాక్షి, విజయవాడ: దొడ్డిదారిన తనపై నమోదైన ఫైబర్‌నెట్ కుంభకోణం కేసును క్లోజ్ చేసుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రయత్నానికి వైఎస్సార్సీపీ నేత, ఫైబర్‌నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి రూపంలో ట్విస్ట్ ఎదురైంది. తాజాగా గౌతమ్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను విచారించిన విజయవాడ ఏసీబీ కోర్టు.. ఉత్తర్వులను రెండ్రోజుల పాటు వాయిదా వేసింది. 2023లో ఫైబర్ నెట్ టెండర్ల కేటాయింపులో సుమారు రూ.300 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏపీ సీడీఐ కేసు నమోదు చేసింది. బ్లాక్ లిస్టులో ఉన్న 'టెర్రా సాఫ్ట్' అనే సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ కేసులో ఆనాటి మాజీ సీఎం చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చింది. విచారణలో భాగంగా కొందరిని అరెస్ట్ చేయడంతో పాటు, ఆస్తుల అటాచ్‌మెంట్‌కు కూడా సిద్ధమైంది.అయితే.. అదే సీడీఐ ఇప్పుడు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడికి ఏ పాపం తెలియదని.. ఈ కేసు క్లోజ్ చేయమని పిటిషన్ దాఖలు చేసింది. ఎలాంటి ఆధారాలు లభించలేదని, అందుకే కేసును మూసివేస్తున్నట్లు సీఐడీ, సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు నివేదిక సమర్పించారు. మాజీ ఎండీలు సైతం ఇందుకు అంగీకారం తెలిపారు. అయితే.. ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఫిర్యాదుతో ప్రారంభమైన కేసును, తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, తన వాదనలు వినకుండా ఎలా మూసివేస్తారని పూనూరు గౌతమ్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ కేసును క్లోజ్ చేయొద్దంటూ ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో ఇవాళ గౌతమ్ తరఫున పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. సీఐడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు గతంలో దర్యాప్తు సంస్థ పేర్కొన్న అభియోగాలను, వివరాలను.. ఇప్పుడు అధికారం ఉండడంతో కేసును మూసేయించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పొన్నవోలు. వాదనలు విన్న విజయవాడ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్ ఆర్డర్స్‌ను 11వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. కోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
KA Paul: నన్నే అడ్డుకుంటారా చంద్రబాబుపై KA పాల్ ఫైర్
-
ఐ బొమ్మ రవికి మరోసారి పోలీసు కస్టడీ
సాక్షి హైదరాబాద్ : సినీ పైరసీకేసులో అరెస్టైన ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు మరోసారి పోలీసు కస్టడీ విధించింది. రవిని మూడురోజుల పాటు కస్టడీలో విచారించాలని దానికి అనుమతివ్వాలని పోలీసులు కోరగా కోర్టు అనుమతులిచ్చింది. దీంతో రేపు పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకోనున్నారు. మూడు కేసుల్లో రవిని పోలీసులు విచారించనున్నారు. అనంతరం సోమవారం బెయిల్ పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది.కాగా గత కొన్ని సంవత్సరాలుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఐబొమ్మ రవి అలియాస్ (ఇమ్మడి రవి) పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. తొలుత ఒక కేసులో రవిని అరెస్టు చేసి ఓ సారి కస్టడీకి తీసుకుని మరోసారి కస్టడీ పొడిగించుకున్నారు. అనంతరం మరో కేసులో అరెస్టు చేయడానికి అనుమతి కోరుతూ ప్రిజినర్స్ ట్రాన్సిట్ వారెంట్ వేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ రెండు కేసుల్లో ఈ విధంగానే చేశారు.అనంతరం మిగిలిన మూడు కేసుల్లోనూ ఈ విధంగానే ప్రక్రియ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు కోర్టు అనుమతిచ్చింది. కాగా ప్రస్తుతం ఐబొమ్మ రవి సినీ పైరసీలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లేదా విశాఖపట్నంలో రెస్టారెంట్ బిజినెస్ పెట్టే ఆలోచనలో రవి ఉన్నట్లు వారు పేర్కొన్నారు. -
కడప పోక్సో కోర్టు సంచలన తీర్పు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. లైంగికదాడి కేసులో నిందితుడికి యావజీవ కారాగారా శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధించింది. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగిలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు రాంప్రసాద్ రెడ్డికి యావజ్జీవ జైలు శిక్ష విధిసూ.. పోక్సోకోర్టు మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ తీర్పు చెప్పారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీసీ, రైల్వే సిబ్బందిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలికి రూ.10 లక్షల 50 వేలు పరిహారం అందించాలని గుంతకల్ ఆర్ఎంకు ఆదేశాలు జారీ చేసింది. 2019 జనవరి 19న తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా.. రాజంపేట-నందలూరు మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక వాష్ రూమ్ వెళ్ళినప్పుడు రాం ప్రసాద్‌రెడ్డి ఆమెపై లైంగికదాడి చేశాడు.హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో బాధిత బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గుంతకల్ ఆర్ఎం కార్యాలయం నుంచి కడపకు రిఫర్ చేశారు. కడప రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే టీసీల నిర్లక్ష్యమే ఘటనకు కారణంగా భావించిన కోర్టు.. నిర్లక్ష్యానికి కారణమైన టీసీ, పోలీస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేజిస్ట్రేట్ వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి హైదరాబాద్: లిప్ట్, ఎలివేటర్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. లిప్ట్ అంశాలపై చట్టం రూపొందించడానికే పదేళ్లు పడితే దానిని అమలు చేయడానికి మరెన్నేళ్లు పడుతుందని వ్యాఖ్యానించింది.. లిప్ట్ అంశాలపై చట్టం రూపొందించడానికే పదేళ్లు పడితే దానిని అమలు చేయడానికి మరెన్నేళ్లు పడుతుందని వ్యాఖ్యానించింది.అయితే ఇతర రాష్ట్రాలలో లిప్ట్, ఎలివేటర్ అంశాలపై అవలంభిస్తున్న మార్గదర్శకాలను అనుసరించి నూతనంగా చట్టాలు రూపొందించాలని పిటిషనర్ కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కోర్టు ఆ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.కాగా ఇటీవల అపార్ట్ మెంట్ లలో లిఫ్ట్ లు సరిగ్గా లేక ప్రాణాలు కోల్పోవడం లేదా ప్రమాదానికి గురవడం జరుగుతుంది. దీనిపై ఓ వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ కేసును సుమోటోగా తీసుకొని హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ప్రమాదాల నివారణకు ఏ చర్యలు తీసుకొంటున్నారో తెలపాలని గతంలోనే ప్రభుత్వాన్ని కోరింది. -
ఐబొమ్మ రవికి 14రోజుల రిమాండ్
సాక్షి హైదరాబాద్: ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. సినీ పైరసీ కేసులో అరెస్టైన ఇమ్మడి రవి (అలియాస్ ఐ బొమ్మ రవి) పోలీసు కస్టడీ సోమవారం ముగిసింది. కస్టడీలో అతని నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ సినీ పైరసీ ఐబొమ్మ రవి ఒక్కడే చేశాడని అలా రూ. 100 కోట్లకు పైగా సంపాదించాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇందులో రూ.30 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను ఇప్పటికే సేకరించారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా బేరమాడి మరీ సినిమాలు కొనుగోలు చేశాడు. మూవీపై క్లిక్ చేయగానే.. 15 యాడ్స్‌కు డైరెక్ట్ లింక్ అయ్యేలా ఏర్పాటు చేశాడని విచారణలో పోలీసులు గుర్తించారు.కాగా, రవిపై చాలా సెక్షన్లతో కేసులు పెట్టారని.. అందులో రెండు మాత్రమే వర్తిస్తాయని అంటున్నారు అడ్వకేట్ సీవీ శ్రీనాథ్ . రవి ఐదు రోజుల కస్టడీ రెండు రోజుల క్రితం ముగిసిన నేపథ్యంలో కోర్టులో హాజరుపరిచి చంచల్గూడా జైలుకు తరలించారు. అయితే రవికి బెయిల్ వస్తుందని ఆయన తరుఫు లాయర్ శ్రీనాథ్ భావించినప్పటికీ, మరో 14 రోజుల పాటుజ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు.ఇదిలా ఉంచితే, వీటితో పాటు రవిపై పోలీసులు మరో మూడుకేసుల్లో పీటీ వారెంట్ జ్యారీ చేశారు. ఈ వారెంట్లపై విచారించిన కోర్టు ఐబొమ్మ రవిని మరోసారి విచారించడానికి 3 రోజుల కస్టడీకి పోలీసులకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో రేపు చంచల్ గూడ జైలులో ఐబొమ్మ రవిని పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. -
Advocate: ఇక కోర్టుకు రావాల్సిన పనిలేదు
-
బాడీషేమింగ్ చేస్తే తక్షణ శిక్ష తప్పదు!
మామూలుగానైతే భార్య మొబైల్ నంబరును సేవ్ చేసుకోడానికి ‘జానూ’, ‘సోనా’ అనో లేదా ‘బంగారం’ అనో... ఇలా రకరకాల ముద్దు పేర్లు పెట్టుకుంటుంటారు. మరికొందరు శిరీషకు ‘సిరి’ అనీ, దీపికకు ‘దీపూ’ అంటూ షార్ట్‌కట్‌లో షార్ట్ పేర్లూ పెట్టుకోవడం మనకు తెలిసిన విషయమే. కాపురంలో కొద్దికాలం గడిచాక ఆమెలో నచ్చని అంశాలేవైనా కనిపించినా సదరు ముద్దుపేర్లకు బదులుగా తన కోపాన్నీ, కసినీ సైలెంటుగా వెల్లడించుకునేలా ‘దెయ్యం’ అనో, ‘రాక్షసి’ అంటూ వయొలెంటు పేర్లు పెట్టుకోవాలనుకున్నా అలా చేయకపోవడమే మంచిదంటూ టర్కీలో జరిగిన ఓ ఉదంతం తెలుపుతోంది. టర్కీలో ఓ ప్రబుద్ధుడికి భార్య మీద కోపం వచ్చింది. ఆమె కాస్తంత లావుగా ఉండటంతో ఆమె పేరును ‘టాంబిక్’ అంటూ సేవ్ చేసుకున్నాడు ఆ మహానుభావుడు. అంతే... ఆ అంశం మీద అతడికి జరిమానా విధిస్తూ... అతడి వల్ల తన భార్యకు కలిగిన మనోవేదనకు గాను పరిహారం, విడాకులూ మంజూరయ్యాయి. ఇంతకీ ‘టాంబిక్’ అంటే టర్కీలో స్థూలకాయాన్ని (ఛబ్బీ) తెలిపే పదం. ఇది కేవలం స్థూలకాయాన్ని సూచించే పదం మాత్రమే కాదు... ఏ ‘బండ’దనో, ‘మొద్దు’దనో, ‘లడ్డు’దనో... ఇలా కాస్తంత దురర్థమో, నిందార్థమో ఇచ్చేలాంటి వాడుక మాట కావడంతో... అలా సేవ్ చేసుకున్న ఆ భర్తకు కోర్టులో మొట్టికాయలు తప్పలేదు. పైగా ఓ అమ్మాయి స్థూలకాయాన్ని ఎగతాళి చేసేలా ఆమె పేరును అభ్యంతరకరమైన పదాలతో సేవ్ చేసుకున్నందుకు ఆ భర్తకు భారీ జరిమానా విధించింది అక్కడి కోర్టు. అంతేకాదు.. పరోక్ష దూషణే అయినా... ఫోన్లో అలాంటి అభ్యంతరకరమైన మాటతో భార్యపేరు సేవ్ చేసుకున్నందున ఆమెకు కలిగిన మనోవేదనను పరిగణనలోకి తీసుకుని వెంటనే విడాకులు సైతం మంజూరు చేసింది టర్కీ కోర్టు. (చదవండి: మందు పెట్టడం, కక్కించడం... రెండూ అపోహలే!) -
రాష్ట్ర చరిత్రలో ఐదుగురికి ఉరిశిక్ష ఇదే తొలిసారి?
దాదాపు పదేళ్ల నిరీక్షణకు తెరపడింది. చిత్తూరులో సంచలనం కలిగించిన కఠారి దంపతుల హత్య కేసులో అంతిమ తీర్పు వెలువడింది. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం దోషులకు మరణ దండన విధించింది. శ్రీరామ్ చంద్రశేఖర్(చింటూ), వెంకటాచలపతి, జయప్రకాష్రెడి, మంజునాథ్, వెంకటేష్ చనిపోయేంత వరకు ఉరి తీయాలని న్యాయమూర్తి డా.ఎన్.శ్రీనివాసరావు తీర్పునివ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిత్తూరు అర్బన్: చిత్తూరులోని 9వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానంలో శుక్రవారం ఉదయం 10.35 గంటలకు 110/2016 అంటూ పిలిచారు. అప్పటికే జనంతో నిండిపోయిన కోర్టు హాలులో దోషులను ప్రవేశపెట్టగానే మొత్తం నిశ్శబ్దంగా అలముకుంది. న్యాయమూర్తి ఏం తీర్పు చెబుతారోనంటూ అందరిలోనూ ఉత్కంఠ. ఒక్కసారిగా దోషులు ఐదుగురికికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి తన వద్ద ఉన్న ఐదు పేజీల్లోని తీర్పును చదివి వినిపించారు. దోషులకు ఉరిశిక్ష అని చెప్పగానే అక్కడే ఉన్న కఠారి దంపతుల కుమార్తె కఠారి లావణ్య భావోద్వేగంతో కన్నీళ్లు తుడుచుకుంటూనే పూర్తి తీర్పును విన్నారు. ఆపై కఠారి కోడలు హేమలత, లావణ్య మీడియాతో మాట్లాడారు. పదేళ్ల నిరీక్షణ తర్వాత దోషులకు మరణశిక్ష పడటం న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచిందన్నారు. కఠారి సమాధుల వద్ద నివాళులరి్పంచి, కార్పొరేషన్ కార్యాలయంలోని వాళ్ల విగ్రహానికి పూలమాలలు వేశారు. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జీఎస్.శైలజా మాట్లాడుతూ దోషులు చేసిన నేరానికి తగిన శిక్ష పడిందన్నారు. తీర్పుపై హైకోర్టుకు వెళతామని, కఠారి కేసులో మరణశిక్ష విధించే గ్రావిటీ లేదని.. హైకోర్టు కేసును కొట్టేస్తుందనే విశ్వాసం తమకు ఉందని డిఫెన్స్ న్యాయవాది విజయచందర్‌రెడ్డి అన్నారు. తీర్పు ఇలా.. న్యాయమూర్తి తన ఐదు పేజీల తీర్పులో 13 అంశాలను ప్రస్తావించారు. ఇందులో ప్రధానంగా ఐపీసీ 302, రెడ్‌విత్ 120–బి కింద కఠారి అనురాధను హత్య చేసినందుకు ఐదుగురు దోషుల గొంతుకు ఉరి బిగించి మరణించేంత వరకు ఉరి తీయాలి. బాధిత కుటుంబాలకు ప్రధాన నిందితుడు రూ.70 లక్షల జరిమానా చెల్లించాలి. లేకుంటే ఆర్నెళ్ల జైలుశిక్ష, ఏ2 నుంచి ఏ5 దోషులకు వెయ్యి జరిమానా, చెల్లించని పక్షంలో ఆర్నెళ్ల జైలుశిక్ష. ఐపీసీ 302, రెడ్‌విత్ 120–బి కింద కఠారి మోహన్‌ను హత్య చేసినందుకు ఐదుగురు దోషుల గొంతుకు ఉరి బిగించి మరణించేంత వరకు ఉరి తీయాలి. ఒక్కొక్కరూ రూ.వెయ్యి జరిమానా, లేకుంటే ఆర్నెళ్ల జైలుశిక్ష. కఠారి అనుచరుడు వేలూరు సతీష్‌కుమార్ నాయుడపై హత్యాయత్నం చేయడానికి ప్రయతి్నంచినందుకు మంజునాథ్‌తో సహా ఐదుగురికి ఐపీసీ 307 ప్రకారం జీవిత ఖైదు. ఒక్కొక్కరికీ రూ.500 జరిమానా. సెక్షన్ 428 (1) సీఆర్సీపీ ప్రకారం.. దోషులు ఐదుగురు జైల్లో గడిపిన కాలాన్ని శిక్ష నుంచి మినహాయించారు. దోషులకు ఉరిశిక్ష విధించినప్పటికీ హైకోర్టు తీర్పును నిర్ధారించేంత వరకు ఉరిని అమలు చేయకూడదు. దోషులు ఉరిశిక్షపై అమరావతిలోని రాష్ట్ర హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. తప్పుడు సాక్ష్యంపై.. ఇక ఈ కేసులో 14 మంది ప్రభుత్వ ఉద్యోగుల తీరును కోర్టు తప్పుబట్టింది. న్యాయమూర్తి ఇచ్చిన బైదు పేజీల తీర్పులో సాక్షులుగా ఉన్న సురేష్ కుమార్, మల్లికార్జున, బాలకృష్ణ, పద్మనాభశెట్టి, ఆదాము, ఆనందనాయుడు, మునిరత్నం, ముద్దకృష్ణ యాదవ్, దొరైరాజ్, త్యాగరాజన్, కిరణ్‌కుమార్, వాసుబాబు, గోపీనాథ్, ధనంజయ అనే వ్యక్తులు ఈ సులో సాకు‡్ష్యలుగా ఉంటూ.. కోర్టులో తప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి ప్రయత్నించారని తీర్పులో పేర్కొన్నారు. సెక్షన్ 193 ఐపీసీ (నేరం రుజువైతే ఏడేళ్ల గరిష్ట జైలుశిక్ష) ప్రకారం ఎందుకు వీళ్లను ప్రాసిక్యూట్ చేయకూడదో షోకాజు నోటీసులు పంపాలని ఏపీపీ ద్వారా వివరణ ఇవ్వాలని, వీళ్ల చిరునామాలు పది రోజుల్లో సేకరించాలని వన్‌టౌన్ పోలీసులను ఆదేశించింది. దోషుల నేపథ్యం ఈ కేసులో ప్రధాన దోషి చింటూ మెరైన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమోచేసి, బాంబేలోని ఐఎన్ఏ (ఇండియన్ నావెల్ షిప్)లో పనిచేస్తూ.. తన మామ కఠారి మోహన్‌పై జరిగిన దాడికి ప్రతీకారంగా మాజీ ఎమ్మెల్యే సీకే బాబును ఎదిరించి ఆయనపై హత్యాయత్నం చేసి రెండేళ్ల పాటు జైల్లో ఉన్నాడు. ఈ కేసులో చిత్తూరు కోర్టు చింటూకు జీవితఖైదు విధించినప్పటికీ, హైకోర్టు ఆ కేసును కొట్టేసింది. కఠారి మోహన్ కోసం సీకేను ఎదిరించిన చింటూ, ఆపై సొంత మామనే మట్టుబెట్టి తొమ్మిదిన్నరేళ్ల వరకు జైల్లో ఉన్నాడు. కర్ణాటక రాష్ట్రం ముల్బాగిల్కు చెందిన వెంకటాచలపతి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తూ మోహన్‌కు పరిచయమై ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఆపై చింటూకు దగ్గరయ్యాడు. తండ్రి ఆటో నడిపితేగానీ ఇల్లు గడవని జయప్రకాష్‌రెడ్డి కూడా చిత్తూరులోని గంగనపల్లె ఉంటూ మోహన్, చింటూ వద్ద తిరుగుతూ 23 ఏళ్ల వయస్సులో జంట హత్యల కేసులో చిక్కుకుని దాదాపు పదేళ్ల పాటు జైల్లో ఉంటూ ఇపుడు దోషిగా తేలాడుడు. గంగవరం మండలం మారేడుపల్లెకు చెందిన మంజునాథ్ తాపీ కూలి పనిచేస్తూ చింటూ ఇంటి వద్ద గోడ కట్టడానికి వచ్చి అతని వద్దే ఉండిపోయాడు. ఇతను కూడా జంట హత్యలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు జైల్లోనే ఉన్నాడు. గంగనపల్లెకు చెందిన మరో దోషి వెంకటే‹Ù. మోహన్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తూ ఆపై చింటూ వద్ద సైతం డ్రైవర్‌గా పనిచేసి జంట హత్యల్లో దోషిగా తేలాడు.పదేళ్ల పరిణామాలు ఇలా.. 2015, నవంబర్ 17 – మధ్యాహ్నం 12 గంటల సమయంలో చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నాటి మేయర్ అనురాధను తుపాకీతో కాల్చి చంపారు. ఆమె భర్త కఠారి మోహన్‌ను కత్తులతో వెంటాడి నరికేశారు. అదే రోజు రాత్రి వేలూరులోని ఓ ఆస్పత్రిలో మోహన్ మృతిచెందాడు. అడ్డొచ్చిన వేలూ రు సతీ‹Ùకుమార్ నాయుడుపై హత్యాయత్నం చేశారు. 2016 ఫిబ్రవరి 19 – ఈ కుట్రలో 23 మందికి సంబంధం ఉన్నట్లు న్యాయ స్థానంలో నేరాభియో గపత్రం దాఖలు చేసిన పోలీసులు 2016 ఏప్రిల్ – కఠారి దంపతుల హత్య కేసు విచారణ ప్రారంభం 2025 ఫిబ్రవరి 7 – షరతులతో కూడిన బెయిల్‌పై చింటూ విడుదల 2025 అక్టోబర్ 16 – విచారణ పూర్తి, తీర్పు వెలువరించే తేదీపై ప్రకటన 2025 అక్టోబర్ 24 – చంద్రశేఖర్ (చింటూ), వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ అనే ఐదుగురిపై నేరం రుజువైనట్లు కోర్టు తీర్పు. మిగిలిన 16 మందిపై నేరం రుజువుకాకపోవడంతో వాళ్లపై కేసు కొట్టేసిన న్యాయస్థానం. శిక్ష ఖారుపై తీర్పు వాయిదా. 2025 అక్టోబర్ 27 – దోషుల మానసిక పరిస్థితి, జైల్లో ప్రవర్తనపై నివేదిక కోరిన న్యాయస్థానం. 2024 అక్టోబర్ 30 – నివేదిక తీసుకున్న అనంతరం ప్రాసిక్యూషన్ డిఫెన్స్ వాదనలు పూర్తి. మరుసటి రోజుకు తీర్పు రిజర్వు. 2024 అక్టోబర్ 31 – ఐదుగురు దోషులకు మరణ శిక్ష. కడప జైలుకు తరలింపు -
మేయర్ దంపతుల కేసులో సంచలనం.. ఐదుగురికి ఉరిశిక్ష
-
చిత్తూరు కోర్టు సంచలన తీర్పు.. ఐదుగురికి మరణ శిక్ష
-
కఠారీ దంపతుల కేసులో సంచలన తీర్పు
సాక్షి, చిత్తూరు: మాజీ మేయర్ కఠారీ అనురాధ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఐదుగురిని దోషులుగా ఇదివరకే నిర్ధారించిన చిత్తూరు జిల్లా కోర్టు శుక్రవారం మరణ శిక్ష ఖరారు చేసింది. ప్రభుత్వ కార్యాలయంలోనే జరిగిన ఈ హత్యోదంతాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.2015 నవంబరు 17న చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి బురఖాలు ధరించి తుపాకులు, కత్తులతో ప్రవేశించిన దుండగులు.. మేయర్ కఠారి అనురాధపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆపై పక్క గదిలో ఉన్న కఠారి మోహన్‌ను కత్తులతో నరికారు. తీవ్ర గాయాలతో మోహన్ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మరణించారు. పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఈ ఘటన. ఈ కేసులో.. తొలుత 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. కాసరం రమేష్(ఏ22) తనకు కేసుతో సంబంధం లేదని పిటిషన్ దాఖలు చేయగా అతడి పేరును తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్.శ్రీనివాసాచారి(ఏ21) కేసు విచారణ సాగుతుండగానే మృతిచెందారు. దాంతో 21 మంది నిందితులుగా ఉన్నారు. అయితే ఇందులో శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ(ఏ1), గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్(ఏ2), జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జయారెడ్డి(ఏ3), మంజునాథ్ అలియాస్ మంజు(ఏ4), మునిరత్నం వెంకటేష్(ఏ5)లు దోషులుగా తేలారు. దీంతో ఈ ఐదుగురికి ఇవాళ మరణశిక్ష విధించారు 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు. కఠారి మోహన్‌కు శ్రీరామ్ చంద్రశేఖర్(చింటూ) మేనల్లుడు. వారి మధ్య వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాల నేపథ్యంతోనే ఈ హత్య జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. పదేళ్లకు తీర్పు వచ్చిన ఈ కేసులో ఏకంగా 352 వాయిదాలు పడ్డాయి. 122 మంది సాక్షులను విచారించారు. A 1 నిందితుడు చంద్ర శేఖర్ @చింటూ, A 2 నిందితుడు వెంకట చలపతి@ ములబాగల్ వెంకటేశ్, A 3 నిందితుడు జయ ప్రకాష్ రెడ్డి, A 4 నిందితుడు మంజునాథ్, A 5 నిందితుడు వెంకటేశ్@ గంగన్న పల్లి వెంకటేశ్. వీళ్లలో ఏ3, ఏ4గా ఉన్న జయప్రకాష్‌రెడ్డి, మంజునాథ్.. అరెస్టు అయినప్పటి నుంచి జైలులోనే ఉన్నారు. తీర్పు నేపథ్యంలో చిత్తూరు పోలీసు బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టు లపై,వాట్సప్ మెసేజ్ పై ప్రత్యేక నిఘా ఉంచారు. హైకోర్టుకు వెళ్తాం: చింటూ తరపు లాయర్సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లోనే మరణశిక్ష అత్యంత అరుదుగా ఉందంటూ నిందితుల తరఫు లాయర్ విజయ్ చంద్రారెడ్డి అంటున్నారు. చిత్తూరు కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని మీడియాకు తెలిపారు. ‘‘కఠారి అనురాధ మోహన్ దంపతుల కేసులో 57 మందిని విచారించారు. ఐదుగురికి మరణశిక్ష విధించారు. నిందితులను చిత్తూరు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక జడ్జిమెంట్ లో చాలా అరుదుగా మాత్రమే మరణశిక్ష విధించారు. వాళ్ల జీవితాలను బాగు చేయాలని మాత్రమే వ్యాఖ్యానించింది. 90 రోజుల్లోపు హైకోర్టును వెళ్తాం. హైకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారాయన. -
‘నిందితుడు కాదు నిర్దోషి’.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
చెన్నై: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్(ఎన్డీపీఎస్) చట్టం కింద పదేళ్ల జైలు శిక్ష పడిన ఎ విఘ్నేష్ అనే వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతని సహ నిందితుని వాంగ్మూలం ఆధారంగా శిక్ష విధించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉదంతంలో తప్పుడు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన ముగ్గురు పోలీసులు.. బాధితునికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.2021 నాటి ఈ కేసు వివరాల్లోకి వెళితే.. మధురైలోని తిదిర్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి.. మెల్వాసల్ సమీపంలో ఎ. విఘ్నేష్ సహా కొంతమంది వ్యక్తులు 24 కిలోల గంజాయిని తీసుకెళ్తున్నారని సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారందినీ అరెస్టు చేశారు. అనంతరం మధురై స్పెషల్ కోర్టు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే విఘ్నేష్ దీనిని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. ఈ కేసులో సహ నిందితుడి ఒప్పుకోలు తప్ప, నేరంలో నిందితుడి ప్రమేయానికి సంబంధించి ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలను లేవని కోర్టులో అతని తరపు న్యాయవాది వాదించారు. కేసును విచారించిన న్యాయమూర్తి కె. రామకృష్ణన్ మాట్లాడుతూ.. నిష్పాక్షిక విచారణ నిందితుల ప్రాథమిక హక్కు అని అన్నారు. నిందితుడు విఘ్నేష్ నుండి పోలీసులు ఎటువంటి వస్తువులు స్వాధీనం చేసుకోలేదని విచారణలో తేలిందన్నారు. సంఘటన జరిగిన ప్రదేశంలో విఘ్నేష్ ఉన్నాడనేందుకు ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొన్నారు. అందుకే విఘ్నేష్‌ను దోషిగా నిర్ధారించడానికి కోర్టు నిరాకరిస్తున్నదని స్పష్టం చేశారుతిదిర్ నగర్ పోలీస్ స్టేషన్లో నాడు విధుల్లో ఉన్న పోలీసు అధికారులు పనరాజ్, సెంథిల్‌కుమార్, మహమ్మద్ ఇద్రిస్ తదితరులు ట్రయల్ కోర్టులో తప్పుడు సాక్ష్యం ఇచ్చి, విఘ్నేష్‌ను దోషిగా నిర్ధారించేందుకు కుట్ర పన్నడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ముగ్గురు పోలీసు అధికారులు బాధితుడు విఘ్నేష్‌కు సంయుక్తంగా రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఈ ముగ్గురు పోలీసుల ప్రవర్తనపై దర్యాప్తు చేయాలని కోర్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని ఆదేశించింది.ఇది కూడా చదవండి: Rajasthan: మంటల్లో మరో బస్సు.. ఇద్దరు మృతి -
కాసేపట్లో చిత్తూరు మాజీ మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో తీర్పు
-
కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి గణపతి హోమం (ఫోటోలు)
-
‘ఆ అభ్యంతరకర వీడియోలను తొలగించండి’: గూగుల్‌కు కోర్టు ఆదేశం
లక్నో: ప్రముఖ రామకథ కథకుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత జగద్గురు రామభద్రాచార్యపై సోషల్ మీడియాలో కనిపిస్తున్న అభ్యంతరక వీడియోలను 48 గంటల్లోగా తొలగించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ మెటా, గూగుల్‌లను ఆదేశించింది. జస్టిస్ శేఖర్ బీ సరాఫ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్.. శరద్ చంద్ర శ్రీవాస్తవ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.రామభద్రాచార్యపై అభ్యంతరకరంగా రూపొందించిన వీడియోల తొలగింపు ప్రక్రియను సులభతరం చేసేందుకు సోషల్ మీడియా కంపెనీలకు సంబంధిత యూఆర్ఎల్ లింక్‌లను అందించాలని కోర్టు పిటిషనర్లను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ నవంబర్ 11కి వాయిదా వేశారు. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లోగల దివ్యాంగ్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన జగద్గురు స్వామి రామభద్రాచార్యను అవమానపరుస్తూ శశాంక్ శేఖర్ అనే వ్యక్తి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అభ్యంతరకర వీడియోలను పోస్ట్ చేస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు.రామభద్రాచార్య అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఆ వీడియోలు ఆన్లైన్లో ఉన్నాయని, వాటిని తొలగించడానికి సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించేందుకు నిబంధనలను రూపొందించి, కఠినంగా అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పిటిషన్ కోరింది. ఈ కంటెంట్ పరువు నష్టం కలిగించేలా ఉండటమే కాకుండా, రామభద్రాచార్య కంటి చూపు కోల్పోవడాన్ని ఎగతాళి చేసేలా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. రాష్ట్ర వికలాంగుల కమిషనర్ కార్యాలయం ఈ అంశాన్ని ఇప్పటికే పరిగణనలోకి తీసుకుని, శేఖర్‌కు నోటీసు జారీ చేసింది. అక్టోబర్ 18న అతను కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
భర్త మానసిక క్షోభకు రూ. 37 లక్షలు : ప్రియుడికి భారీ షాకిచ్చిన కోర్టు
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు, విడాకులు, భరణానికి సంబంధించిన వార్తలు చాలానే వింటున్నాం. సాధారణంగా భార్యకు భర్త భరణం ఇవ్వడం కామన్. కానీ ఒక కేసులో భర్తకు రూ. 37 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోర్టు భార్య ప్రియుడిని ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి.తైవాన్‌కు చెందిన వీ (పేరు మార్చబడింది) అనే వ్యక్తి తన భార్య జీ (మారుపేరు) ప్రేమికుడి (యోంగ్)తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న వైనాన్ని గుర్తించాడు. దీంతో తీవ్ర వేదనకు గురయ్యాడు. అక్కడితో ఆగిపోకుండా, వారిపై చట్టపరమైన చర్య తీసుకున్నాడు. తాను అనుభవించిన మానసిక క్షోభ వైవాహిక హక్కుల ఉల్లంఘనకు పరిహారంగా దాదాపు కోటి రూపాయలను డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు.విచారణ సమయంలో వీ మానసిక క్షోభకు గురైనట్లు కనిపించాడని కోర్టు గుర్తించింది. అలాగే వీ కంటే ప్రియుడు యోంగ్ సంపాదన ఎక్కువ అని కూడా గమనించింది. అందుకే మోసపోయిన భర్తకు పరిహారంగా భర్తకు 300,000 యువాన్లు (సుమారు రూ. 37 లక్షలు) చెల్లించాలని తీర్పు చెప్పింది.2000లొ వీ- జీకి పెళ్లైంది. దాదాపు 15 సంవత్సరా సంసారిక జీవితం తరువాత 2022 నుంచి జీ తన కొలిగ్ యోంగ్‌తో సంబంధం పెట్టుకుంది. జీ,యోంగ్ ఒకేచోట పనిచేస్తారు. యోంగ్ అకౌంటింగ్ డైరెక్టర్‌గా ఉండగా, జీ ఒక ఉపాధ్యాయురాలిగా ఉంది. అయితే ఏడాది తరువాత 2023 నవంబరులో తన భార్య జీ యోంగ్‌తో రిలేషన్లో వున్నట్టు ఫోన్ ద్వారా గుర్తించాడు. వారిద్దరి మధ్య మెసేజ్‌లు కంటపడ్డాయి. ఇద్దరూ తరచుగా హోటళ్లలో కలుసుకోవడం, అక్రమంగా శారీరక సంబంధంలో ఉన్నారని తెలుసుకున్నాడు. అంతేకాదు "భార్యభర్త" లుగానే వ్యవహరిస్తున్నారని కూడా గమనించి షాక్ అయ్యాడు. దీనితో తన ఎమోషన్స్‌ని హర్ట్ చేశారంటూ యోంగ్ పై దావా వేశాడు. అయితే జీకి పెళ్లి అయిందన్న విషయం తనకు తెలియదంటే బుకాయించాడు యోంగ్. కానీ వీ వాదనలను విశ్వసించిన కోర్టు ప్రియుడికి భారీ షాకే ఇచ్చింది. అయితే అతను డిమాండ్ చేసినట్టుగా కోటి రూపాయలు కాకుండా, రూ. 37 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పింది. మరోవైపు ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం యోంగ్‌కి ఇచ్చింది కోర్టు -
జడ్జిపై చంద్రబాబు లాయర్ అనుచిత వ్యాఖ్యలు..
-
రైతుల న్యాయ పోరాటానికి కోర్టు అండ.. ఆర్డీవో కార్యాలయం జప్తు
సాక్షి,జగిత్యాల : జగిత్యాల కోర్టు ఆదేశాలతో అధికారులు ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రైతులకు సరైన పరిహారం చెల్లించలేదని కారణంతో ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేసినట్లు తెలుస్తోంది.పెద్దపల్లి- నిజామాబాద్ రైల్వేలైన్ కోసం 2006లో రైతుల నుంచి సుమారు 100 ఎకరాలు భూమిని సేకరించారు. రైతులకు ఒక్క ఎకరాకు కేవలం రూ.లక్షా 30వేలు మాత్రమే అధికారులు చెల్లించారు. అయితే, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు రైతులకు అండగా నిలిచింది. ఒక్కో ఎకరాకు రూ.లక్షా 30వేలు కాదని, 15లక్షల97 వేల200 చెల్లించాలని కోర్టు ఉత్తర్వులుజారీ చేసింది.కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ఆర్డీఓ అధికారులు విఫలమయ్యారు. దీంతో ఆర్డీఓ అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో అధికారులు ఆర్డీవో కార్యాలయా సామాగ్రిని జప్తు చేశారు. -
టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి భర్తకు కోర్టు మొట్టికాయలు..
-
దసరాకి సోనమ్ దిష్టిబొమ్మ దహనం.. హైకోర్టు అభ్యంతరం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రాజా రఘువంశీ హత్య కేసులో అరెస్టయిన అతని భార్య సోనమ్ రఘువంశీ(24) మళ్లీ వార్తల్లో నిలిచారు. మేఘాలయలో హనీమూన్ సందర్భంగా భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ రఘువంశీ దిష్టిబొమ్మను దసరా రోజున దహనం చేయకుండా చూడాలని మధ్యప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.సోనమ్ రఘువంశీ తల్లి దసరా రోజున తన కుమార్తె దిష్టిబొమ్మను దహనం చేయకుండా చూడాలని, ఈ తరహా బహిరంగ అవమానకర చర్యలకు ఎవరూ పాల్పడకుండా ఆపాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. పిటిషనర్ తన కుటుంబంపై చట్టవిరుద్ధమైన లేదా రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు జరగకుండా చూడాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ప్రణయ్ వర్మ మాట్లాడుతూ.. పిటిషనర్ దాఖలు చేసిన అభ్యర్థన చూస్తుంటే.. విజయదశమి నాడు రావణుని దిష్టిబొమ్మకు బదులుగా పిటిషనర్ కుమార్తె దిష్టిబొమ్మను దహనం చేయాలని ఎవరో ప్రతిపాదించినట్లు స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. అయితే అది సరికాదని, అలా చేయడం భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో పూర్తిగా ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు.పిటిషనర్ కుమార్తె ఒక క్రిమినల్ కేసులో నిందితురాలిగా ఉన్నప్పటికీ, ఆమె దిష్టిబొమ్మ దహనానికి అనుమతినివ్వబోము. ఇది ఖచ్చితంగా పిటిషనర్‌తో పాటు ఆమె కుమార్తె, కుటుంబ సభ్యుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లవుతుందని జస్టిస్ ప్రణయ్ వర్మ అన్నారు. అలాగే రావణుడి దిష్టిబొమ్మ స్థానంలో ఎవరైనా పిటిషనర్ కుమార్తె లేదా మరే ఇతర వ్యక్తి దిష్టిబొమ్మను దహనం చేయకుండా చూసుకోవాలని కోర్టు రాష్ట్ర అధికారులను కోర్టు ఆదేశించింది. ఇటువంటి చర్యలు చట్ట నియమాలకు విరుద్ధమని, ఇది పిటిషనర్ కుటుంబపు ప్రతిష్టను శాశ్వతంగా దెబ్బతీస్తుందని కోర్టు పేర్కొంది. -
దాడి కేసులో నటుడు ఉన్ని ముకుందన్‌కు నోటీసులు
మలయాళ నటుడు ఉన్ని ముకుందన్(Unni Mukundan)కు కేరళ కోర్టు నోటీసులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం ఉన్నిముకుందన్‌పై తన మాజీ మేనేజర్ విపిన్ కుమార్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. టోవినో థామస్ నటించిన నరివెట్ట సినిమాను ప్రశంసిస్తూ ఉన్నిముకుందన్‌ను ఆయన కించపరిచాడు. దీంతో ముకుందన్‌కు కోపం వచ్చింది. ఈ కారణంగానే విపిన్ కుమార్‌పై దాడి చేశాడని సమాచారం. దీంతో ఉన్ని ముకుందన్ తనపై దుర్భాషలాడారని, దాడి చేశారంటూ ఈ ఏడాది మే నెలలో విపిన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.విపిన్ కుమార్ ఫిర్యాదుతో ఉన్నిముకుందన్‌పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు తర్వాత కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాలుగా సీసీటీవీ ఫుటేజ్ వీడియోను అందించారు. దీంతో తాజాగా కేరళలోని కాకనాడ్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 27న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, విపిన్ చేసిన ఆరోపణలను ముకుందన్ కొట్టిపారేశారు. తాను విపిన్ కళ్లద్దాలు మాత్రమే పగలగొట్టానని ఒప్పుకున్నారు. కానీ, మార్కో సినిమా ఫెయిల్ కావడంతోనే ఉన్నిముకుందన్ ఇలా ఒత్తిడికి లోనయ్యాడని విపిన్ చెప్పడం విశేషం. -
ఎయిరిండియా విమాన ప్రమాదం, కీలక పరిణామం : అమెరికా కోర్టులో
తీవ్ర విషాదాన్ని నింపిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళుతుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఏఐ171 డ్రీమ్‌లైనర్‌విమానం కుప్పకూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు బాధిత కుటుంబాలు బోయింగ్, హనీవెల్‌పై దావా వేశాయి. కంపెనీ తీవ్ర నిర్లక్ష్య కారణంగానే విమానం కూలిపోయిందని ఆరోపిస్తూ అమెరికాలోని కోర్టులో ఫిర్యాదు నమోదు చేశాయి. తమకు జరిగిన పూడ్చలేని నష్టానికి పరిహారం చెల్లించాలని కోరాయి. ఈ ప్రమాదంపై అమెరికా కోర్టులో దావా వేయడం ఇదే తొలిసారి.డెలావేర్ సుపీరియర్ కోర్టులో మంగళవారం ఈ నాలుగు కుటుంబాలు ఫిర్యాదును దాఖలు చేశాయి. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లోని స్విచ్‌ను ఇన్స్టాల్ చేసి తయారు చేసిన బోయింగ్ మరియు విడిభాగాల తయారీ సంస్థ హనీవెల్‌లకు ఆ ప్రమాదం గురించి తెలుసునని, ముఖ్యంగా 2018లో US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనేక బోయింగ్ విమానాలలో డిసేబుల్డ్ లాకింగ్ మెకానిజమ్‌ల గురించి హెచ్చరించిన తర్వాత, స్విచ్‌ను ఇన్స్టాల్ చేసి తయారు చేసిన బోయింగ్ మరియు హనీవెల్‌లకు ఆ ప్రమాదం గురించి తెలుసునని పేర్కొన్నారు. ఈ స్విచ్ లాకింగ్ మెకానిజం అనుకోకుండా ఆగిపోవచ్చు, లేదా కనిపించకుండా పోవచ్చు. దీనివల్ల ఇంధన సరఫరా ఆగిపోవచ్చు, టేకాఫ్‌కు అవసరమైన థ్రస్ట్ కోల్పోవచ్చు అని వాదులు తెలిపారు. థ్రస్ట్ లివర్ల వెనుక నేరుగా స్విచ్‌ను ఉంచడం ద్వారా, "సాధారణ కాక్‌పిట్ కార్యకలాపాలు అనుకోకుండా ఇంధన కటాఫ్‌కు దారితీయవచ్చని బోయింగ్ సమర్థవంతంగా హామీ ఇచ్చింది" అయినా, ఈ విపత్తును నివారించడానికి హనీవెల్ , బోయింగ్ చేసిందేమీలేదని ఫిర్యాదులో మండిపడ్డాయి.ఈ ప్రమాదంలో కోల్పోయిన తమ బంధువులు కాంతాబెన్ ధీరూభాయ్ పఘడల్, నవ్య చిరాగ్ పఘడల్, కుబేర్భాయ్ పటేల్, బాబిబెన్ పటేల్ మరణాలకు నష్టపరిహారాన్ని డిమాండ్ చేశాయి. అయితే వర్జీనియాలోని ఆర్లింగ్టన్లో ఉన్న బోయింగ్ బుధవారం దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. నార్త్ కరోలినాలోని షార్లెట్‌లో ఉన్న హనీవెల్ కూడా ఇంకా స్పందించలేదు. రెండు కంపెనీలు డెలావేర్లో విలీనమైనాయి.కాగాఅహ్మదాబాద్‌లోనిమెడికల్ కాలేజీపై ఎయిరిండియా విమానం కుప్పకూలిన ప్రమాదంలో 12 మంది సిబ్బంది, మరో 19మందితో229 మంది మరణించారు. ఒక ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీనిపై భారతదేశ విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో ప్రాథమిక నివేదిక ప్రమాదానికి ముందు కాక్‌పిట్‌లో గందరగోళం నెలకొందని, ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని జూలైలో నివేదించింది. భారత్, యూకే, అమెరికన్ పరిశోధకులు ప్రమాదానికి కారణం ఇదీ అని నిర్ణయించ లేదు. మరోవైపు బోయింగ్ విమానాల్లో ఇంధన నియంత్రణ స్విచ్‌లు సక్రమంగానే ఉన్నాయని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎఎ) దీనిపై క్లారిటీ ఇచ్చింది. US FAA నిర్వాహకుడు బ్రయాన్ బెడ్ఫోర్డ్, యాంత్రిక సమస్య లేదా ఇంధన నియంత్రణ భాగాల అనుకోకుండా కదలికలు కారణం కాదనే గట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
పేరెంటింగ్ విషయంలో బీకేర్‌ఫుల్..! ఆ తల్లిదండ్రులకు రూ. 2 కోట్లు జరిమానా..
పిల్లలు ప్రవర్తనా తీరు వల్లే వాళ్ల తల్లిందండ్రులకు గుర్తింపు లేదా అవమానం అనేవి రావడం జరుగుతాయి. అందుకే పిల్లల పెంపకంలో ప్రతి తల్లిదండ్రులు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని అంటుంటారు. వాళ్లు గనుక ఇతరులను ఇబ్బందిపెట్టేలా ఊహకందని ఘనకార్యం చేసి వస్తే..ఇక తల్లిదండ్రులకు చీవాట్లు, అవమానాలు తప్పవు. అంతవరకు అయితే పర్లేదు, వారి కారణంగా కోర్టులపాలై, కోట్ల కొద్ది జరిమానాలు ఎదుర్కొంటే ఆ తల్లిదండ్రులకు కనడమే నేరంగా మారుతుంది. అలాంటి దురదృష్టకర ఘటనే పాపం ఆ ఇద్దరు టీనేజర్ల తల్లిందండ్రులకు ఎదురైంది.అసలేం జరిగిందంటే..ఆ యువకులను చూస్తే..అబ్బా ఇలాంటి పుత్రులు పగవాడికి కూడా వద్దు అని అస్యహించుకునేంత దారుణానికి ఒడిగట్టారు ఆ ఇద్దరు. వాళ్లు చేసిన పని వింటే ఎవ్వరికైనా చిర్రెత్తికొచ్చి తిట్టిపోసేలా ఉంది. ఈ ఘటన చైనాలోని షాంఘైలో చోటు చేసుకుంది. అక్కడ ప్రసిద్ద హైడిలావ్ హాట్‌పాట్ రెస్టారెంట్లో టాంగ్ అనే ఇంటిపేరుతో ఉన్న ఇద్దరు 17 ఏళ్ల యువకులు మద్యం తాగి ఆ మత్తులో విచక్షణరహితంగా ప్రవర్తించారు. సమీపంలోని టైబుల్ ఎక్కి సంప్రాదాయ చైనీస్ హాట్‌పాట్ శైలిలో మాంసం, కూరగాయలు వండటానికి ఉపయోగించే కమ్యూనల్ సూప్‌లో మూత్రం పోశారు. ఆ ఇరువురు ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటన ఫిబ్రవరి 24, 2025న ఒక ప్రైవేట్ డైనింగ్ రూమ్‌లో జరిగింది. అయితే ఆ కలుషితమైన రసాన్ని కస్టమర్లు సేవించినట్లు ఆధారాలు లేవు. అందుకుగానూ సదరు బ్రాంచ్ హైడిలావ్ రెస్టారెంట్ ఈ సంఘటన జరిగిన రోజు నుంచి మార్చి 8లోపు సందర్శించిన దాదాపు నాలుగువేల మంది కస్టమర్లకు పరిహారం చెల్లించింది. అంతేగాదు ఈ ఘటనకు పరిహారం కావాలంటూ సదరు రెస్టారెంట్ కోర్టు మెట్లు ఎక్కింది. ఈ ఘటన కారణంగా తమ రెస్టారెంట్ పరవు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది, పైగా కస్లమర్ల నమ్మకానికి భంగం కలిగేలా చోటు చేసుకుందని అందుకుగానూ తమకు సుమారు రూ. 28 కోట్లు దాక నష్ట పరిహారం చెల్లించాలని కోరింది. ఈ కేసుని విచారించిన షాంఘై కోర్టు..ఇది అవమానకరమైన చర్యగా పేర్కొంటూ..టేబుల్‌వేర్‌ని కలుషితం చేయడమే గాక ప్రజలకు కూడా అసౌకర్యం కల్పించారంటూ మండిపడింది. ఈ టీనేజర్లు ఇద్దరు సదరు రెస్టారెంట్ ఆస్తిహక్కులు, ప్రతిష్టను ఉల్లంఘించారని పేర్కొంది. అంతేగాదు ఈ టీనేజర్ల తల్లిదండ్రులు పిల్లల సంరక్షణ బాధ్యతల్లో విఫలమయ్యారంటూ చీవాట్లు పెట్టింది. అందుకుగానూ ఆ పేరెంట్స్‌ని సందరు రెస్టారెంట్‌కి రూ. 2 కోట్లుదాక నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరిచ్చింది. అలాగే ఆ టీనేజర్ల తల్లిదండ్రులు సదరు రెస్టారెంట్‌కి బహిరంగంగా క్షమాపణుల కోరుతూ.. వార్తపత్రికలో ప్రచురించాలని కూడా ఆదేశించింది. అందుకేనేమో మొక్కై వంగనిది.. మానై వంగునా అని పెద్దలు అంటుంటారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే సరిగా పెరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. లేదంటే వాళ్లు చేసే ఘనకార్యలకు ఫలితం అనుభవించక తప్పదు. పేరెంటింగ్ విషయంలో ప్రతి తలిందండ్రులు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని ఈ ఉదంతం చెప్పకనే చెబుతోంది కదూ..!.(చదవండి: రండి.. ఫొటో దిగుదాం’) -
కాగ్నిజెంట్ సమాచారాన్ని ఇన్ఫోసిస్ దుర్వినియోగం?
ప్రముఖ ఐటీ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు ఇన్ఫోసిస్-కాగ్నిజెంట్ మధ్య నెలకొన్న యాంటీట్రస్ట్ వివాదాన్ని యూఎస్ ఫెడరల్ కోర్టు అధికారికంగా ఫిబ్రవరి 1, 2027న ఉన్నత స్థాయి జ్యూరీ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. టెక్సాస్ నార్తర్న్ డిస్ట్రిక్ట్ (డల్లాస్ డివిజన్) కోర్టు ఇటీవల ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విచారణ ప్రారంభానికి ముందు జనవరి 25, 2027న ప్రీ-ట్రయల్ కాన్ఫరెన్స్‌ను షెడ్యూల్ చేసినట్లు కోర్టు పేర్కొంది.అసలు వివాదం ఏంటి?బెంగళూరు ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న ఇన్ఫోసిస్ కాగ్నిజెంట్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ అయిన ట్రైజెట్టోకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని కాగ్నిజెంట్ ఆరోపించింది. హెల్త్‌కేర్ ఐటీ స్పేస్‌లో పోటీని బలహీనపరుస్తూ, ప్రత్యర్థి ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి ఇన్ఫోసిస్ ఈ సమాచారాన్ని ఉపయోగించిందని దావాలో పేర్కొంది.ఇన్ఫోసిస్ వాదన..ఇన్ఫోసిస్ దీనిపై స్పందిస్తూ ఈ వాదనలను ఖండించింది. హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్ మార్కెట్లోకి ఇతర కంపెనీలు ప్రవేశించకుండా నిరోధించడానికి కాగ్నిజెంట్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని ఉపయోగించుకుందని ఆరోపించింది. మేధో సంపత్తిని రక్షించడం కంటే పోటీని అణచివేసే లక్ష్యంతోనే కాగ్నిజెంట్ ముందుకెళ్లిందని కౌంటర్ క్లెయిమ్‌లో పేర్కొంది. 2024లో ప్రారంభమైన ఈ చట్టపరమైన వివాదంపై 2027లో విచారణ జరగనుంది.మధ్యవర్తిత్వం అవసరం..యాంటీట్రస్ట్ చట్టాలు, ధరల వ్యూహాలు, క్లయింట్ కాంట్రాక్ట్ నిర్మాణాలు, పోటీ మార్కెట్ డైనమిక్స్ సంక్లిష్ట స్వభావాన్ని బట్టి ఈ కేసు నిపుణుల సాక్ష్యంపై ఎక్కువగా ఆధారపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసు విచారణకు చేరుకునే ముందే ఇరు వర్గాలు సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. అందుకు జులై 9, 2026 నాటికి మధ్యవర్తిత్వాన్ని తప్పనిసరి చేసింది. రెండు పార్టీలు మధ్యవర్తిత్వాన్ని అంగీకరించాలని లేదా జులై 16, 2026 నాటికి దీనిపై వివరణ ఇవ్వాలని చెప్పింది.ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే -
షారుక్ ఖాన్, దీపికా పదుకొణెకు ముందస్తు బెయిల్
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), దీపికా పదుకొణెలకు రాజస్థాన్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హ్యుందాయ్ కార్ల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న షారుక్, దీపికాలపై రాజస్థాన్‌కు చెందిన కీర్తిసింగ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ కార్ల కంపెనీ ప్రచారం చేయడం వల్ల తాను ఒక కారు కొనుగోలు చేసి నష్టపోయానని, వారిద్దరూ కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన కేసు వేశారు. అయితే, ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని రాజస్థాన్ హైకోర్టును నటీనటులు కూడా ఆశ్రయించారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 25న ఉంటుందని పేర్కొంది.గతంలో కీర్తి సింగ్ చేసిన ఫిర్యాదు ఇలా ఉంది. 2022 జూన్ నెలలో హ్యుందాయ్ కంపెనీ అల్కాజార్ కారును సుమారు రూ. 24 లక్షలకు కొనుగోలు చేస్తే.. కేవలం ఆరు నెలల్లోనే కారు ఇంజన్లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నాడు. అధిక వేగంతో వెళ్తున్నప్పుడు ఇంజన్ నుంచి తీవ్రమైన శబ్ధం వస్తుందని ఒక్కోసారి దారి మధ్యలోనే ఆగిపోతుందని తెలిపాడు. కారు సమస్య గురించి కంపెనీ ఏజెన్సీని సంప్రదించినప్పుడు, ఇది ఈ కారు మోడల్ తయారీ లోపమంటూ దాన్ని పరిష్కరించలేమని అక్కడి సిబ్బంది చెప్పినట్లు ఆయన పేర్కొన్నాడు. నిర్లక్ష్యంతో సమాధానం చెప్పడంతో తాను కోర్టును ఆశ్రయించానని తెలిపాడు. హ్యూందాయ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్స్‌గా పనిచేస్తున్న షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె( Deepika Padukone) ఈ ఘటనలో బాధ్యత వహించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. -
విషమివ్వాలని దర్శన్ విజ్ఞప్తి.. బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు!
కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రేణుకాస్వామి అనే అభిమాని హత్యకేసులో నిందితుడైన ఆయనను బెయిల్ రద్దు కావడంతో అరెస్టై జైలుకు వెళ్లారు. ఈ కేసులో దర్శన్‌తో పాటు అతని ప్రియురాలు పవిత్ర గౌడను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో విచారణకు వర్చువల్‌గా హాజరైన దర్శన్.. న్యాయమూర్తికి తన బాధలను చెప్పుకొచ్చారు. జైల్లో ఉండలేకపోతున్నానని.. తన పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని అన్నారు. దయచేసి తనకు ఇంత విషమివ్వాలని జడ్జిని అభ్యర్థించాడు. నా జీవితం దారుణంగా తయారైందని జడ్జి ముందు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే దర్శన్ పరిస్థితిని అర్థం చేసుకున్న బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అతనికి జైలులో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. అదే సమయంలో దర్శన్‌ను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారి జైలుకు బదిలీ చేయాలన్న అధికారుల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. దర్శన్‌ను బళ్లారి జైలుకు మార్చడానికి ఎటువంటి బలమైన కారణం లేదని పేర్కొంది. కాగా.. రేణుకాస్వామి హత్య కేసులో 7 మంది నిందితులు వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. దర్శన్ తరపు న్యాయవాదులు కనీసం ఒక మంచం, దిండును అందించాలని జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.అంతకుముందు దర్శన్ జడ్జితో మాట్లాడుతూ.. 'నెల రోజులకు పైనే అవుతుంది ఎండ అన్నది చూడలేదు. దీంతో నా చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేశాయి. బట్టలు కంపు కొడుతున్నాయి. ఇలా నేను బతకలేను. ఒక్క చుక్క విషం ఇవ్వండి నేను చనిపోతా. నా జీవితం దారుణంగా తయారైంది' అని దర్శన్ ముందు విలపించాడు. దీనిపై స్పందించిన జడ్జి.. అలాంటివి మీరు అడగకూడదు. ఇది జరగదు' అని సమాధానమిచ్చారు. -
బాబు కుట్రలను తిప్పికొట్టిన ఏసీబీ కోర్టు
-
- మద్యం అక్రమ కేసులో గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు బెయిల్. మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్
-
థాయ్ ప్రధాని షినవత్రా డిస్మిస్
బ్యాంకాక్: నైతిక ఉల్లంఘనకు పాల్పడిన ఆరోపణలపై సస్పెండయిన థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పెటొంగ్టర్న్ షినవత్రా(39)ను రాజ్యాంగ న్యాయస్థానం ఆ పదవి నుంచి తొలగిస్తూ తీర్పు వెలువరించింది. కోట్లకు పడగలెత్తిన షినవత్రాల కుటుంబ రాజకీయాలకు గట్టి ఎదురుదెబ్బ మాత్రమే కాదు, దేశం మరోసారి రాజకీయ సంక్షోభంలో చిక్కుకునేందుకు ఈ పరిణామం దారి తీయనుందని పరిశీలకులు అంటున్నారు. అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షినవత్రా ఏడాది కాలం మాత్రమే అధికారంలో ఉన్నారు. కాంబోడియాతో తలెత్తిన సరిహద్దు వివాదం నేపథ్యంలో జూన్‌లో ఆ దేశ మాజీ నేత హున్ సెన్‌తో జరిపిన ఫోన్ సంభాషణ బయటకు పొక్కడం తీవ్ర సంచలనం రేపింది. షినవత్రా క్షమాపణ చెప్పినా వివాదం సద్దుమణగలేదు. విచారణ జరిపిన రాజ్యాంగ న్యాయస్థానం ఆమెను సస్పెండ్ చేసింది. దీంతో, ఆమె వైదొలగి ఉపప్రధానికి ఫుమ్తమ్కు బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన రాజ్యాంగ న్యాయస్థానం తాజాగా ఆమెను బర్తరఫ్ చేస్తూ శుక్రవారం చేస్తూ ఆదేశాలిచ్చింది. హున్ సెన్ను అంకుల్ అని సంబోధించడం, థాయ్ ఆర్మీ కమాండర్లను తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలపై న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. కాంబోడియా నేతతో జరిపిన సంభాషణ పెటొంగ్టర్న్ విశ్వసనీయతపై అనుమానాలొచ్చేలా ఉందని, ఆమె హోదాకు సరైంది కాదని తీర్పులో పేర్కొంది. ఆమె తీరు థాయ్‌లాండ్ కంటే కాంబోడియాకే అనుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. కాగా, థాయ్‌లాండ్‌లో గత 17 ఏళ్లలో రాజ్యాంగ కోర్టు వేటేసిన ఐదో ప్రధాని షినవత్రా కావడం గమనార్హం. పెటొంగ్టర్న్ షినవత్రా తండ్రి సీనియర్ నేత థక్సిన్ షినవత్రా సైతం గతంలో ప్రధాని పదవిని కోల్పోయిన వారే. తాజా పరిణామంతో షినవత్రాకు చెందిన ఫ్యు థాయ్ పార్టీ ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సంప్రదాయ వాదులు, పలుకుబడి కలిగిన రాచరిక అనుకూల సైనిక నేతలతో ఎన్నికైన ప్రభుత్వాలు గట్టి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఉప ప్రధాని ఫుమ్తమ్, ఆయన కేబినెట్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే, ఇందుకు నిర్దిష్ట కాలపరిమితి లేకపోవడం గమనార్హం. ప్రధానమంత్రి పదవికి ఫ్యు థాయ్ పార్టీకి చెందిన 77 ఏళ్ల ఛయ్కసెమ్ నితిసిరితోపాటు ఇతర పార్టీలకు చెందిన ఐదుగురు అర్హులని చెబుతున్నారు. అన్ని పార్టీలు కూడా తమ సొంత రాజకీయ అవసరాల కోసం యత్నిస్తుండటంతో ప్రభుత్వం ఏర్పాటు అంత సులువుగా అయ్యే పని కాదన్నది విశ్లేషకుల మాట. థాయ్‌లాండ్ రాజ్యాంగ కోర్టు గత 17 ఏళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులను తొలగించిందని తెలుసా?. ఆ జాబితాను పరిశీలిస్తే.. థాక్సిన్ షినవత్ర (2006).. బలవంతపు పదవీ విరమణ. సైనిక తిరుగుబాటు తర్వాత కోర్టు ద్వారా అనర్హత వేటు. అయితే కోర్టు విచారణ ఎదుర్కొన్న సమయంలోనూ ప్రధాని పదవిలో కొనసాగిన ఏకైక వ్యక్తి కూడా ఈయనే. సమక్ సుందరవేజ్ (2008).. ఓ ప్రముఖ ఛానెల్ కుకింగ్ షోలో పాల్గొన్నారు. దీంతో నైతిక ఉల్లంఘన పేరిట కోర్టు ఆయన్ని తొలగించింది. యింగ్లక్ షినవత్ర (2014).. ధాన్యం సబ్సిడీ స్కీమ్‌లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో నైతిక ఉల్లంఘనలపై కోర్టు తీర్పుతో పదవి కోల్పోయారు. స్రేత్థా థావిసిన్ (2024).. నైతిక ప్రమాణాలు ఉల్లంఘించారని ఏడాది తిరగకుండానే కోర్టు ఆయన్ని తొలగించిందిపాయెతోంగ్తార్న్ షినవత్ర (2025). కంబోడియా నేత హున్ సెన్‌తో లీకైన ఫోన్ సంభాషణలో "అంకుల్" అని సంబోధించడం, థాయ్ సైనికాధికారిని "ప్రతిద్వంది"గా పేర్కొనడం వల్ల నైతిక ఉల్లంఘనగా కోర్టు అభిప్రాయంతో పదవి కోల్పోయారు. -
ఏటా 6,516 వరకట్న హత్యలు.. భయపెడుతున్న ఎన్సీఆర్బీ డేటా
లక్నో: యూపీలోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకున్న వరకట్న వేధింపుల ఘటనలో ఒక మహిళ బలయ్యింది. ఆమెను భర్త, అత్తింటివారు సజీవదహనం చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది దేశంలో వివాహిత మహిళలు ఎదుర్కొంటున్న హింసాయుత ఘటనల తీవ్రతను మరోసారి వెలుగులోకి తెచ్చింది.అత్యాచారాల కంటే అధికందేశంలో వరకట్న మరణాలనేవి అత్యాచారాల కంటే అధికంగా ఉన్నాయని హోం మంత్రిత్వశాఖకు చెందిన జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) తెలియజేసింది. బ్యూరో వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం 2022లో భారత్‌లో 6,516 వరకట్న మరణాలు చోటుచేసుకున్నాయి. అత్యాచారం, గ్యాంగ్‌రేప్ తరువాత హత్యకు గురైన మహిళల మరణాల కంటే ఈ మరణాలు 25 రెట్లు ఎక్కువ అని వెల్లడయ్యింది. ప్రతి మూడో మహిళ..2022లో 13,641 మహిళలు వరకట్న వేధింపులకు గురయ్యారు. ఈ ఉదంతాలు పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. ఈ సంఖ్యను అనుసరించి చూస్తే, వరకట్న వేధింపులకు గురైన ప్రతి మూడో మహిళ మరణిస్తున్నదని తెలుస్తోంది. బాధితులు చివరివరకు న్యాయపరమైన సహాయాన్ని కోరడంలో వెనుకడుగు వేస్తుండటమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. న్యాయం దొరకే అవకాశాలు బహు స్వల్పం2022 చివరి నాటికి 60,577 వరకట్న కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగా, అందులో 54,416 కేసులు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. ఆ ఏడాది 3,689 కేసులకు సంబంధించిన విచారణ పూర్తయినా, కేవలం 33శాతం తీర్పులలో నిందితులకు శిక్ష పడింది. కోర్టులకు పంపిన 6,161 నూతన కేసుల్లో కేవలం 99 కేసుల్లో మాత్రమే శిక్షలు అమలయ్యాయి. దీని ప్రకారం చూస్తే బాధిత కుటుంబాలకు ఏడాదిలోపు న్యాయం దొరకే అవకాశాలు రెండు శాతం కంటే చాలా తక్కువేని తేలింది. వరుడి కుటుంబంతో పోలిస్తే..భారతదేశంలో వరకట్నం ఇప్పటికీ ఒక ఆచారంగా కొనసాగుతోంది. పలు అధ్యయనాలు ఈ సమస్య నేటికీ తీవ్రంగానే ఉందని తెలియజేస్తున్నాయి. ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే (2004-05)లో వెల్లడైన వివరాల ప్రకారం పెళ్లిళ్లలో వరుడి కుటుంబంతో పోలిస్తే వధువు కుటుంబం 1.5 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నది. 24 శాతం కుటుంబాలు టీవీలు, ఫ్రిజ్‌లు, కార్లు, బైక్‌లు తదితర వస్తువులను వరునికి కట్నంగా ఇచ్చాయి.మహిళల్లో 29 శాతం మంది..2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) తెలిపిన వివరాల ప్రకారం 18-49 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో 29 శాతం మంది భర్తలు లేదా భాగస్వాముల నుంచి శారీరక లేదా లైంగిక హింస అనుభవిస్తున్నారు. వరకట్న దురాచారాన్ని రూపుమాపేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి. -
విజయవాడ ACB కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి దృశ్యాలు
-
మద్యం అక్రమ కేసులో సిట్ పనితనంపై ACB కోర్టు అభ్యంతరం
-
పోక్సో కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు
సాక్షి,విశాఖ: పోక్సో కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన నిందితుడుకి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలికి రూ. 3 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో 2024,సెప్టెంబర్ 24న కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు నిందితుడు చిత్తరంజన్ ఏడవ తరగతి చదువుతున్న బాలికపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇదే విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో బాలిక తన తోటి విద్యార్థులు తనపై జరుగుతున్న లైంగిక దాడికి గురించి చెప్పడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. టీచర్ల సాయంతో బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజా కేసు విచారణలో విశాఖ కోర్టు నిందితుడు చిత్తరంజన్‌కు కఠిన శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. -
టెకీకి భారీ ఊరట, కంపెనీకి షాకిచ్చిన కోర్టు
బెంగళూరు టెక్నీషియన్ ఉగాండాలో ఒంటరిగా వదిలేసినందుకు యజమానిపై కేసు వేసి, రూ.3 లక్షలకు పైగా గెలుచుకున్నాడు. టెక్నికల్ కన్సల్టెంట్ - కంపెనీ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదంలో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అతని బకాయిలు, ఇతర పత్రాలను ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసిందన్న ఐటీ ఉద్యోగి వాదనను సమర్ధించిన కోర్టు రూ. 3 లక్షల బకాయిలు, 6 శాతం వార్షిక వడ్డీ, రిలీవింగ్ లెటర్ ,అతని ఒరిజినల్ విద్యా సర్టిఫికెట్లను అతనికి తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం పాపారెడ్డిపాళ్యంలోని ఐటీఐ లేఅవుట్లో నివసించే రక్షిత్ ఎంవీ, సెప్టెంబర్ 2016లో లోకస్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో చేరారు. డిసెంబర్ 2019లో ఉగాండాలోని కంపాలాలో ఒక క్లయింట్ ప్రాజెక్ట్ కోసం రక్షిత్‌ను నియమించారు. ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయింది. అయితే పదే పదే అభ్యర్థించినప్పటికీ అతనికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వకుండా కంపెనీ నిర్లక్ష్యం చేసింది. పైగా పొడిగించిన స్టే సమయంలో తన జీత భత్యాలను ఏకపక్షంగా సగానికి తగ్గించిందనీ, నెలకు చెల్లించాల్సిన పీఎఫ్ రూ.3,600 రూపాయలు జమ చేయలేదని వాదించారు. అలాగే దేశీయ ప్రయాణం,ఇతర ఛార్జీలు మొత్తం రూ. 3 లక్షలతో సహా అదనపు ఖర్చులను కూడా చెల్లించలేదు. దీంతో జూలై 2020 వరకు తాను అక్కడ చిక్కుకుపోయానని రక్షిత్ ఆరోపించారు. చివరికి2020 ఆగస్టులో రాజీనామా చేశానని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. జీతం కోత , పొడిగించిన స్టేతో సహా అన్ని నిర్ణయాలను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అధికారిక ఇమెయిల్ కమ్యూనికేషన్ లేకుండా మౌఖికంగా తెలియజేశారని, అందువల్లే తనకు వ్రాతపూర్వక రుజువు లేకుండా పోయిందని రక్షిత్ చెప్పారు.రాజీనామా చేసిన తర్వాత, రక్షిత్ 2021లో కంపెనీకి లీగల్ నోటీసు పంపాడు. ఆ తర్వాత 2022 జనవరిలో తన బకాయిల చెల్లింపు, తనకు సంబందించిన సర్టిఫికెట్లను, ఇతర పత్రాలను విడుదల చేయాలని కోరుతూ సివిల్ దావా వేశాడు.ఇదీ చదవండి: ఉద్యోగాన్ని వదలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుఎండీ రోహిత్ కుడుకులి ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీ రక్షిత్ ఆరోపణలను ఖండించింది. రక్షిత్ ప్రాజెక్ట్ మధ్యలో పరారయ్యాడని వాదించింది. కానీ, న్యాయమూర్తి శివానంద్ మారుతి జిపారే అధ్యక్షతలోని అదనపు సిటీ సివిల్ మరియు సెషన్స్ కోర్టు రక్షిత్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 6 శాతం వార్షిక వడ్డీతో రూ. 3 లక్షలు బకాయిలు చెల్లించాలని, అతని సర్టిఫికెట్లను విడుదల చేయాలని ఆదేశించింది. కపెంనీ తన చర్య ద్వారా బాధితుడికి కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని వ్యాఖ్యానించింది. కరీర్‌ను ప్రమాదంలో పడేసేలా, బకాయిలు, ఇతర పత్రాలను నిలిపివేయడానికి కోర్టు తప్పుబట్టింది. -
తొమ్మిది పదుల వయసులో ఆ తల్లి లా పుస్తకాలతో కుస్తీ! ఎందుకో తెలుసా?
అవధులు లేని ప్రేమ తల్లి ప్రేమ. అందుకే కాబోలు అమ్మ ప్రేమ కోసం..చరిత్రలో ఎందరో మహానుభావులు తమ సర్వస్వాన్ని త్యజించేందుకు సిద్ధపడ్డారు. వెలకట్టలేని ఆ గొప్ప ప్రేమకు దైవుడు సైతం తలవంచుతాడని ఆర్యోక్తి. ఇదంతా ఎందుకంటే..నేరమే చేసినా..ఆ తల్లి మాత్రం తన కొడుకుని మంచివాడనే అంటుంది. అలాంటి అసామాన్యమైన ఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. ఈ ఉదంతం తల్లిప్రేమ అనంతం ..బిడ్డ కోసం ఎంతటి సాహసానికైనా ఒడిగడుతుంది అని మరోసారి రుజువు చేస్తోంది.అంతులేని తల్లిప్రేమకు నిదర్శనం ఈ ఘటన. ఇది చైనాలో చోటుచేసుకుంది. ఒక హైప్రొఫైల్ కేసులో లిన్(57) అనే వ్యక్తి అరెస్టు అయ్యాడు. అతడు నగరంలో స్థానిక వ్యవస్థాపకుడు హువాంగ్ అనే వ్యక్తి సుమారు రూ. 140 కోట్లు బ్లాక్మెయిల్ చేసిన కేసులో అరెస్టు అయ్యాడు. ఈ కేసు చైనా జెజియాంగ్ ప్రావిన్స్‌లోని జౌషాన్ మున్సిపల్ ఇంటర్మీడియట్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. చివరి విచారణ గత నెల జూలై 30న జరిగింది. ఈ విషయం తెలుసుకున్న లిన్ తల్లి హి తల్లిడిల్లిపోయింది. తన కొడుకు ఏ నేరం చేయలేదంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. పైగా ఆ ఆరోపణలు ఆవాస్తవం అని ఆమె బలంగా విశ్వస్తిస్తుండటం విశేషం. అంతేగాదు తన కొడుకుని ఈ కేసు నుంచి బయటపడేసేలా ఏదైనా చేయాలని పలు రకాలుగా అన్వేషించింది. ఇక ఏ లాయర్ని నమ్మాలనుకోలేదో లేక తానే రక్షించుకోగలనన్న నమ్మకమో..! గానీ ఆ తల్లి హి లా పుస్తకాలు కుస్తీ పట్టి మరి తన కొడుకుని రక్షించుకోవాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది. కుటుంబ సభ్యులు 90 ఏళ్ల వయసులో ఎందుకు ఈ రిస్క్ అదంతా తాము చూసుకుంటామని చెప్పినా..ససేమిరా అంటూ చట్టం గురించి తెలుసుకోవాలని మంకుపట్టుపట్టి.. క్రిమినల్ లా పుస్తకాలను కొనుగోలు చేసి మరి చదివేందుకు సిద్ధమైంది ఆ తల్లి. దగ్గర దగ్గర తొంభైఏళ్లు పైనే ఉంటాయి ఆ వృద్ధురాలికి. కానీ ఆమె వయోసంబంధిత భారాన్ని ఖాతారు చేయకుండా తగ్గేదేలా అంటూ ప్రతినిత్యం కోర్టుని సందర్శిస్తూ..ఆ కేసుకి సంబంధించిన పూర్వపరాలన్నింటిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోందామె. కేసు వివరాలు..లిన్ స్థానిక వ్యవస్థాపకుడు హువాండ్తో గ్యాస్ ఉత్పత్తి బిజినెస్ చేస్తున్నారు. 2009 వరకు చైనాలో టాప్ ధనవంతుల్లో ఒకడిగా మంచి లాభాలు అందుకున్నాడు లిన్. అయితే తరచుగా చెల్లింపులను సకాలంలో చెల్లించడంలో విఫలమవ్వడంతో ఫ్యాక్టరీలో ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చేది. దాంతో బిజినెస్ తీవ్ర నష్టాలకు దారితీసింది. ఆ నేపథ్యంలోనే 2014 నుంచి 2017 మద్య లిన్ తన అకౌంటెంట్‌తో కలిసి అక్రమదారుల్లో పయనించాడు. తన పార్టనర్ హువాంగ్‌ని అక్రమ పద్ధతిలో వ్యాపారం చేస్తున్నట్లు ఏజెన్సీలకు చెబుతానంటూ బ్లాక్ మెయిల్ చేసి దాదాపు రూ. 140 కోట్లు వసూలు చేశాడు. అతడి ఆగడాలకు తాళ్లలేక 2023లో పోలీసులను ఆశ్రయించాడు హువాంగ్. పోలీసుల విచారణలో అది నిజమని తేలడంతో లిన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కొడుకు చేతికి వేసిన సంకెళ్లను చూసి 'హి'కి గుండె ఆగినంత పనైంది. ఆ నేపథ్యంలోనే ఆ తల్లి తన కొడుకుని రక్షించుకునేందుకు ఇలా లా పుస్తకాలను చేతబట్టింది. తన కొడుకు లాంటి మిగతా కేసులను స్టడీ చేసి మరీ రక్షించుకోవాలని ఆశిస్తోందా తల్లి. ఈ విధంగానైనా తన కొడుకునే కనులారా చూసుకోవాలని కోర్టుకి హాజరవుతూనే ఉంటోంది ఆ వృద్ధురాలు. కొడుకుని చూసి భావోద్వేగానికి గురై స్ప్రుహ తప్పుతున్నా..ఆమెకు కేటాయించిన అంబులెన్స్ వైద్యులచే చెకప్ చేయించుకునేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. ఆమె ధ్యాసంతా కొడుకుని ఈ కేసు నుంచి ఎలా బయటపడేయాలన్నదే. ఈ తల్లి హి కథ నెట్టింట అందర్నీ తెగ ఆకర్షించడమే గాక తల్లి ప్రేమ మించినది మరొకటి లేదు అని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేగాదు ఆమె కొడుకు అతి త్వరలోనే రిలీజ కావాలని భంగవంతుడిని ప్రార్థిస్తున్నాం అంటూ పోస్టులు పెడుతుండటం గమనార్హం.(చదవండి: 'స్ట్రీట్‌లైట్ ఆంటీ': భద్రతకు వెలుగుగా నిలిచింది..!) -
‘తప్పు చేశావ్ నాన్న’ .. తండ్రి తప్పు చేస్తే కూతురు సరిదిద్దింది
లక్నో: ఓ పోలీసు ఉన్నతాధికారి (ఐజీ) తన కింద స్థాయి మహిళా ఉద్యోగిని వేధించాడన్న ఆరోపణల నేపథ్యంలో అతడిని విధుల నుంచి తొలగించారు. ఈ కేసులో సదరు పోలీసు అధికారి కుమార్తె బాధితుడి తరఫున కోర్టులో తన వాదనలు వినిపించారు. ఆమె తన తండ్రి తీసుకున్న నిర్ణయం తప్పని, న్యాయపరంగా అన్యాయమని న్యాయస్థానంలో తన వాదనలు వినిపించారు. చివరికి, ఆమె వాదనలు.. తన తండ్రి తీసుకున్న నిర్ణయం తప్పని నిరూపించాయి. ఇంతకీ ఎవరా కుమార్తె? ఆమె కథేంటీ?అది జనవరి 13,2023. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ రైల్వేస్టేషన్. ఫిలిబిట్కు చెందిన ఓ బాలిక బరేలీ రైల్వే స్టేషన్‌కు రావాల్సిన సమయం కంటే ఒకరోజే ముందే వచ్చింది. అయితే, ఆ బాలికను పోలీసు కానిస్టేబుల్ తౌఫిక్ అహ్మద్ వేధించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసు శాఖ అతడిపై చర్యలకు ఉపక్రమించింది. విచారణ చేపట్టి బరేలీ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ రాకేష్ సింగ్ కానిస్టేబుల్ తౌఫిక్‌ను విధుల నుంచి తొలగించారు.బాధితురాలు మైనర్ కావడంతో రైల్వే పోలీసులు తౌఫిక్‌పై పోక్స్ యాక్ట్కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. లోయర్ కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించినప్పటికీ, బరేలీ ఐజీ రాకేష్ సింగ్ అతనిపై శాఖా విచారణ జరిపి ఉద్యోగం నుండి తొలగించారు. ఇదే అంశాన్ని సవాలు చేస్తూ తౌఫిక్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తరుఫున వాదించమని ఇన్స్పెక్టర్ జనరల్ రాకేష్ సింగ్ కుమార్తె అనురా సింగ్‌ను ఆశ్రయించారు. వాస్తవానికి తౌఫిక్‌కు అనూరా సింగ్ ఐజీ రాకేష్ సింగ్ కుమార్తె అని తెలియదు.తౌఫిక్ కేసు కోర్టులో వాదనలు మొదలయ్యాయి. కానిస్టేబుల్ తరఫున అనురా సింగ్ తన వాదనలు వినిపించారు. విచారణలో పోలీసు శాఖ పద్ధతులు పాటించలేదని, ఉద్యోగం తొలగింపు చట్టబద్ధంగా లేదని హైకోర్టు ముందు పలు ఆధారాలు ముందుంచారు. ఇరు పక్షాల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తౌఫిక్ అహ్మద్‌పై పోలీసు శాఖ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. తౌఫిక్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.ఇటీవల అలహాదాబాద్ హైకోర్టులో చర్చాంశనీయంగా మారిన ఈ కేసుపై అనూరా సింగ్ తండ్రి మాజీ ఐజీ రాకేష్ సింగ్ స్పందించారు. న్యాయవాదిగా అనూరా తన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించిందని, తన కుమార్తెను చూస్తే తనకు గర్వంగా ఉందని అన్నారు. ఆమె తన పని చేసింది, నేను నా పని చేశాను. ఇది ఒక తండ్రిగా గర్వించదగిన విషయం అంటూ కుమార్తెపై ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు, తౌఫిక్ అహ్మద్ సైతం లాయర్ అనూరాపై ప్రశంసలు కురిపించారు. ఆమె నాకు ఉద్యోగం మాత్రమే కాదు..గౌరవాన్ని కూడా తిరిగి ఇచ్చింది’అని సంతోషం వ్యక్తం చేశారు. -
మద్యం అక్రమ కేసులో మిథున్‌రెడ్డి బెయిల్‌పై తీర్పు రిజర్వ్
సాక్షి, విజయవాడ: మద్యం అక్రమ కేసులో మిథున్‌రెడ్డి బెయిల్‌పై ఏసీబీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ నెల 12న బెయిల్ పిటీషన్‌పై విజయవాడ ఏబీసీ కోర్టు తీర్పు ఇవ్వనుంది.ముగ్గురు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఎక్కడా మిథున్‌రెడ్డి పాత్ర ఉందని చెప్పలేదని ఆయన తరఫు లాయర్ తెలిపారు. అసలు లిక్కర్ స్కామే జరగలేదని న్యాయవాది తెలిపారు. ‘‘ఇప్పటివరకు మిథున్‌రెడ్డిని సిట్ కస్టడీకి కోరలేదు. పీఎల్ఆర్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిన నగదును తిరిగి మళ్లీ చెల్లించడం జరిగింది. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలి’ అని న్యాయవాది కోరారు. -
విజయవాడ ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి మెమో దాఖలు
-
JDS మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవితఖైదు
-
అడ్డంగా దొరికిపోయిన సిట్.. రద్దయిన 2000 నోట్లు ఎలా వచ్చాయి.?
-
టెస్లాకు రూ.2100 కోట్ల జరిమానా: కారణం ఇదే..
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు ఫ్లోరిడా కోర్టు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 2019లో జరిగిన రోడ్డు ప్రమాదానికి "ఆటోపైలట్" డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీ కారణమని భావించి కోర్టు ఈ జరిమానా విధించింది.2019లో కీ లార్గోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. నైబెల్ బెనవిడెస్ లియోన్ మరణించగా, ఆమె ప్రియుడు డిల్లాన్ అంగులో గాయపడ్డాడు. ఆ సమయంలో 'జార్జ్ మెక్‌గీ' టెస్లా కారు నడుపుతున్నాడు. ఆటోపైలట్ ఫీచర్ (టెస్లా కార్లలోని ఒక ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టం) ఆన్ చేసి ప్రయాణిస్తున్న సమయంలో.. తన ఫోన్ అనుకోకుండా కారులోనే కింద పడింది. ఆ సమయంలో వంగి ఫోన్ తీసుకున్న సమయంలో కారు రోడ్దుపై ఉన్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనపై బాధితులు కోర్టును ఆశ్రయించారు.ఈ ఘటనపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు.. ఎట్టకేలకు తీర్పునిస్తూ 329 మిలియన్ డాలర్లు పరిగహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇందులో 242 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,100 కోట్లు) టెస్లా చెల్లించాలని.. మిగిలిన మొత్తాన్ని డ్రైవర్ ఇవ్వాలని పేర్కొంది. ఈ తీర్పుపై టెస్లా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు సంస్థ యాజమాన్యం పేర్కొంది. -
రూ.11 కోట్లతో నాకు సంబంధం లేదు: రాజ్ కేసిరెడ్డి
సాక్షి, విజయవాడ: సిట్ సీజ్ చేశామని చెబుతున్న రూ.11 కోట్లతో తనకు సంబంధం లేదని రాజ్ కేసిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. హైదరాబాద్ ఫామ్‌హౌజ్‌లో సీజ్ చేశామంటున్న డబ్బు తనది కాదన్న రాజ్ కేసిరెడ్డి.. ఆ ఫామ్ హౌజ్ తీగల విజయేందర్‌రెడ్డికి చెందిందని తెలిపారు.‘‘తీగల విజయేందర్‌రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీతో పాటు హాస్పిటల్, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. విజయేందర్‌రెడ్డి రూ.కోట్ల టర్నోవర్‌తో లావాదేవీలు చేస్తారు. విజయేందర్‌రెడ్డికి చెందిన ఆరెట్ ఆసుపత్రిలో నా భార్య మైనార్టీ షేర్ హోల్డర్ మాత్రమే. ..అంతకు మించి విజయేందర్‌రెడ్డితో నాకు ఎలాంటి సంబంధం లేదు. సిట్.. కట్టు కథలు చెప్పి నాకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తోంది. కేవలం నా బెయిల్‌ను అడ్డుకునేందుకే డబ్బులు సీజ్ అంటూ అబద్ధాలు చెబుతోంది’’ అని రాజ్ కేసిరెడ్డి చెప్పారు. -
'కోర్ట్' శ్రీదేవి జూలై జ్ఞాపకాలు.. అటు ఫ్యామిలీ ఇటు కొత్త కారు (ఫొటోలు)
-
నటుడు 'విజయ్ దేవరకొండ'కు మరోసారి ఈడీ నోటీసులు
బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ ఇప్పటికే ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే కేసులో నిందితులుగా ఉన్న పలువురు సెలబ్రిటీలకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా సినీ నటుడు విజయ్ దేవరకొండకు విచారణకు హాజరుకావాలని ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ముందుగా ఆగష్టు 6న రావాలని పేర్కొంది. అయితే, ఇప్పుడు జారీ చేసిన నోటీసులలో ఆగష్టు 11న హాజరుకావాలని సూచించింది. విజయ్ దేవరకొండ సూచన మేరకే తేదీని మార్చినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ప్రకాశ్ రాజ్‌ను జులై 30న, మంచు లక్ష్మిని ఆగస్టు 13 విచారణకు రావాలంటూ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. -
మిథున్ రెడ్డి విషయంలో జైలు అధికారులకు కోర్టు కీలక ఆదేశాలు..
-
ఎంపీ మిథున్‌రెడ్డికి వసతులపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ మిథున్‌రెడ్డికి జైల్లో వసతులపై ఆదేశాలిచ్చిన ఏసీబీ కోర్టు.. వారంలో మూడు సార్లు లాయర్ల ములాఖత్‌కు అనుమతి ఇచ్చింది.వారానికి మూడు సార్లు కుటుంబసభ్యుల ములాఖత్‌కు కూడా కోర్టు అనుమతులు ఇచ్చింది. బెడ్ సదుపాయం కల్పించాలని కోర్టు ఆదేశించింది. రోజుకొకసారి ఇంటి భోజనం తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు.. న్యూస్ పేపర్, మినరల్ వాటర్ అనుమతించాలని ఆదేశించింది.మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. రాజమండ్రి జైల్లో తనకు కేటాయించిన బ్లాక్‌లో సరైన సదుపాయలు లేవని చెబుతూ ఆయన పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఎంపీ మిథున్‌రెడ్డి సదుపాయాల పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా? అని రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారిని ఏసీబీ జడ్జి ప్రశ్నించారు.అయితే.. కోర్టు ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేస్తామని జైలు అధికారులు చెప్పారు. దీంతో.. చట్టాలు చేసే వారికి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇవ్వాలి కదా అని జడ్జి అన్నారు. వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈ పిటిషన్లపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నా.. చెవిరెడ్డి కంటతడి
సాక్షి, విజయవాడ: కోర్టులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. జడ్జి ముందు తన వాదనలు వినిపించుకునే క్రమంలో చెవిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి, తన సోదరుడు మద్యం కారణంగానే చనిపోయారని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తాను మద్యం జోలికి వెళ్ల లేదు, వెళ్లబోనని భాస్కర్‌రెడ్డి చెప్పారు. చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నానని బాధగా ఉందని చెవిరెడ్డి అన్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్‌బుక్ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా కూటమి సర్కార్ పాలన సాగుతోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసింది. ఆ కుట్రలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయన్ని ఏ38గా చేర్చింది. -
ఏసీబీ కోర్టు వద్ద పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, విజయవాడ: ఎంపీ మిథున్‌రెడ్డిని జడ్జి ఎదుట సిట్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. న్యాయవాదులను కోర్టు లోపలికి అనుమతించని పోలీసులు.. కోర్టుకి అన్ని వైపులా బారికేడ్లతో దారులను మూసేశారు. కోర్టు ప్రధాన ద్వారం కూడా మూసేశారు. దీంతో పోలీసులు, న్యాయవాదులకు మధ్య వాగ్వాదం జరిగింది.కాగా, నిన్న (శనివారం) ఎంపీ మిథున్‌రెడ్డి స్వచ్ఛందంగా సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ అక్రమ కేసులో గతంలో ఓసారి ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన మిథున్‌రెడ్డి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 వరకు సిట్ అధికారులు ఆయనను విచారించారు. అనంతరం మిథున్‌ను అరెస్ట్ చేసి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. మిథున్‌రెడ్డిని ఇవాళ ఉదయం(ఆదివారం) విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపర్చారు.సిట్ అధికారుల విచారణలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేది ఎంపీ మిథున్‌రెడ్డి సాధికారికంగా తేల్చిచెప్పారు. ఎంపీ అయిన తనకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో ఏమాత్రం ప్రమేయం ఉండదని కుండబద్ధలు కొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై సిట్ అధికారులు మిథున్‌ను పలు ప్రశ్నలు వేశారు.అయితే ఆయనపై అభియోగాలకు సంబంధించి సిట్ అధికారులు సరైన ఆధారాలను చూపించలేకపోయారు. ఈ కేసులో సిట్ బెదిరించి, వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే ఎంపీ మిథున్‌రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆ అవాస్తవ ఆరోపణలను మిథున్ సమర్థంగా తిప్పికొట్టారు. సిట్ అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డితో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా సరే, ప్రభుత్వ పెద్దల కుట్రనే సిట్ అధికారులు ఏకపక్షంగా అమలు చేశారు. -
చట్టప్రకారం చిరంజీవి దరఖాస్తు పరిష్కరించండి: హైకోర్ట్
మెగాస్టార్ చిరంజీవి తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని కొద్దిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, తాజాగా జీహెచ్ఎంసీకి హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. చట్ట ప్రకారం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్‌లో ఉన్న చిరు ఇల్లు పునరుద్ధరణ చర్యల్లో భాగంగా రిటెయిన్ వాల్ క్రమబద్ధీకరణకు జూన్ 5న జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. కానీ, అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదంటూ చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఇటీవల విచారణ జరిపారు. చిరంజీవి తరఫు న్యాయవాది వాదనల ప్రకారం.. 2002లో అనుమతి తీసుకుని జీ+2 ఇంటిని చిరు నిర్మించారని తెలిపారు. అయితే, పునరుద్ధరణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అనుమతులు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో చిరు ఇంటి నిర్మాణాన్ని తనిఖీ చేసి క్రమబద్ధీకరించాలని కోరినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలేదని కోర్టుకు ఆయన తెలిపారు. చిరంజీవి దరఖాస్తును నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని జీహెచ్ఎంసీని అధికారులను హైకోర్ట్ ఆదేశించింది. -
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సమన్లు జారీ చేసిన హిందూపురం కోర్టు
-
చదివింది ఇంటర్, ఫస్ట్ సినిమానే హిట్.. లగ్జరీ కారు కొన్న నటి
హీరో నాని నిర్మించిన 'కోర్ట్' సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమాలో 'జాబిలి' పాత్రలో నటించిన తెలుగమ్మాయి శ్రీదేవి బాగా పాపులర్ అయిపోయింది. వైష్ణవ్‌తేజ్ చేసిన ‘ఆదికేశవ’లో ఓ పాత్రలో ఆమె కనిపించినప్పటికీ హీరోయిన్గా కోర్ట్ సినిమానే మొదటిది కావడం విశేషం. తాజాగా కొత్త కారు కొన్నట్లు శ్రీదేవి సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసిందికొత్త కారు కొనడం తన కోరిక అంటూ.. ఎంజీ హెక్టార్ (MG Hector) కారును శ్రీదేవి పోస్ట్ చేసింది. అయితే, ఈ లగ్జరీ కారు ధర రూ. 25 లక్షల వరకు వుంటుందని సమాచారం. చిన్నవయసులోనే తను అనుకున్న కలను నెరవేర్చుకుందని శ్రీదేవిపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కోర్టు సినిమాకు గాను రూ. 10 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమా ద్వారా ఆమెకు సోషల్‌మీడియాలో ఫాలోవర్స్ పెరిగారు. ఆపై పలు సినిమా ఛాన్సులు రావడంతో కాస్త సంపాదన కూడా పెరిగిందని టాక్.శ్రీదేవి పూర్తిపేరు శ్రీదేవి ఆపళ్ల. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ ఈమె సొంతూరు. 'కోర్ట్' మూవీలో జాబిలి పాత్ర కోసం ఎవరు సెట్ అవుతారా అని డైరెక్టర్ రామ్ జగదీశ్ వెతుకుతున్న క్రమంలోనే ఈమె చేసిన ఓ ఇన్ స్టా రీల్ ని ఫ్రెండ్ చూపించాడు. దీంతో ఈమెనే జాబిలి అని ఫిక్సయ్యాడు. పిలిపించి ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారు. ఈ ఏడాదిలోనే ఆమె ఇంటర్ పూర్తి చేసింది. అమ్మానాన్నలిద్దరూ రియల్ఎస్టేట్ రంగంలో ఉన్నారు. సినిమాలు అంటే ఇష్టంతోనే ఎక్కువగా రీల్స్ చేసేదానిని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. -
విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల
సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బుధవారం విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేనికి నూజీవీడు కోర్టు బెయిలిచ్చింది. కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీపై 11 అక్రమ కేసులు నమోదు చేసింది. ఫిభ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేనిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. నాటి నుంచి 140 రోజుల పాటు జైలులో ఉన్న వల్లభనేని అక్రమ అరెస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైంది. దీంతో కొద్ది సేపటి క్రితం విజయవాడ సబ్ జైల్ నుంచి విడుదలయ్యారు. వల్లభనేని వంశీ విడుదలతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన సతీమణి పంకజ శ్రీ, వైఎస్సార్సీపీ కృష్ణ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం,మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్, పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జ్ దేవ భక్తుని చక్రవర్తిలతో పాటు వైస్సార్సీపీ శ్రేణులు, వంశీ అభిమానులు జైలు వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు. -
పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్‌కు బెయిల్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్‌కు బెయిల్ మంజూరైంది. వరప్రసాద్ సహా 13 మందికి కడప కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ నాయకుల తప్పుడు ఫిర్యాదుతో వారిని పులివెందుల పోలీసులు అరెస్టు చేశారు.వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ జెండాలు, తోరణాలు కట్టారని పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ జెండాలు, తోరణాలను వైఎస్సార్ విగ్రహం వద్ద తొలగించారు. అయితే, వాటిని తొలగించినందుకు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకు పోలీసులు అత్యుత్సాహంతో హత్యాయత్నం కేసును వైఎస్సార్సీపీ నాయకులపై నమోదు చేసిన విషయం తెలిసిందే.అధికార పార్టీ అండదండలతో తమను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారంటూ వైఎస్సార్సీపీ నాయకులు జడ్జికి వివరించారు. అరెస్టయిన వారితో పాటు కేసులో ఉన్న ఇతరులకు కూడా కడప జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి పులివెందులలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయి. -
ఆధారాలు లేకుండానే కేసులో ఇరికించాలని చూస్తున్నారు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: విజయవాడ కోర్టులో అక్రమ లిక్కర్ కేసుపై వాదనలు ముగిశాయి. న్యాయవాదితో పాటు స్వయంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. ఆధారాలు లేకుండానే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెవిరెడ్డితో పాటు ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.2024 ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట చిల్లకల్లు టోల్ గేట్ వద్ద 8.40 కోట్లు సీజ్ చేసిన పోలీసులు.. ఆ డబ్బును ఇప్పుడు లిక్కర్ డబ్బుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చిల్లకల్లు టోల్ గేట్ వద్ద పట్టుకున్న డబ్బు తనదేనని అప్పట్లో ప్రద్యుమ్న అనే వ్యక్తి హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఈ డబ్బు విషయాన్ని ఎక్కడా ప్రస్తావించొద్దని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలున్నా లిక్కర్ కేసులో ప్రస్తావించారు. డబ్బులు తరలించామని గన్ మెన్ గిరి ఒప్పుకున్నాడు. అలాంటపుడు అతనే ప్రధాన ముద్దాయి.ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఇలా డబ్బులు తరలించినందుకు గిరి నేరం చేసినట్లే కదా. ఇటీవల గిరికి ఆక్టోపస్‌లో ప్రమోషన్ ఇచ్చి రూ. 60 వేలు ఎలా పెంచారు. డబ్బులు తరలించిన వ్యక్తి ముద్దాయి అవుతారు కానీ సాక్షి ఎలా అవుతారు?. అతని సాక్ష్యం ఎలా చెల్లుతుంది. మదన్ అనే గన్ మెన్‌ను సిట్ అధికారులు కొడితే మణిపాల్‌లో చేరాడు. సిట్ అధికారులు భయబ్రాంతులకు గురుచేశారని డీజీపీకి లేఖ రాశాడు. గిరి చెప్పినది వాస్తవమా?. మదన్ చెప్పింది వాస్తవమా?చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడు ఇరికించారు. చౌదరి సామాజికవర్గానికి చెందిన వాడివి అయ్యుండి చౌదరి ప్రభుత్వానికి సపోర్ట్ చేయవా అని సిట్ అధికారులు బెదిరించారు. రెండు సార్లు వెంకటేష్ నాయుడిని సిట్ విచారించింది. అబద్ధపు సాక్ష్యం చెప్పమని తీవ్రమైన ఒత్తిడి తెచ్చినా వెంకటేష్ నాయుడు అంగీకరించలేదు. ఈ కేసులో అంతా కట్ అండ్ పేస్ట్ తప్పుల తడకగా ఉంది. వెంకటేష్ నాయుడు వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. కానీ వెంకటేష్ నాయుడిని కేసులో ఐఏఎస్‌గా చూపించారు’ అని చెవిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. -
ఫిర్యాదుదారు వద్దకే జడ్జి
జగిత్యాల జిల్లా: అనారోగ్యంతో కోర్టు హాల్లోకి రాలేని ఫిర్యాదీ దగ్గరకు.. స్వయంగా జడ్జి వచ్చారు. బాధితురాలి కేసుకు పరిష్కారం చూపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి కోర్టులో జరిగిన ఈ సంఘటన వివరాలివి. ఇబ్రహీంపట్నం మండలం గోధూర్‌కు చెందిన చల్ల రమక్క.. అదే గ్రామానికి చెందిన చల్ల మల్లేశ్, చల్ల శంకర్‌లపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 2024 సంవత్సరంలో ఫిర్యాదు చేశారు.రమక్క ఫిర్యాదు మేరకు 174/2024 క్రైం నంబరు కింద సెక్షన్ 329(4), 292, 118(1) ప్రకారం చల్ల మల్లేశ్, చల్ల శంకర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మెట్పల్లి కోర్టుకు చార్జిషీట్ పంపించారు. ఆ కేసుకు కోర్టులో కేలండర్ కేసు నంబర్ 549/2024 కేటాయించి నిందితుల హాజరుకు నోటీసులు పంపించారు. నిందితులు, ఫిర్యాదీ కలిసి రాజీ చేసుకుని సోమవారం కోర్టుకు వచ్చారు. పక్షవాతంలో బాధపడుతున్న ఫిర్యాదీ చల్ల రమక్క.. కోర్టు హాల్లోకి జడ్జి అరుణ్‌కుమార్ ముందుకు రాలేక ఆటోలోనే ఉండిపోయారు. పరిస్థితిని తెలుసుకున్న జడ్జి అరుణ్‌కుమార్ కోర్టుహాల్ బయటకు వచి్చ.. ఆటోలో ఉన్న ఫిర్యాదీ చల్ల రమక్క నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. ఇరు పక్షాలకు రాజీ కుదిరిన క్రమంలో.. చల్ల మల్లేశ్, చల్ల శంకర్‌లపై ఉన్న కేసు కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. -
కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవికి ఎయిర్‌లైన్స్ సర్ప్రైజ్ గిఫ్ట్ (ఫొటోలు)
-
మెజిస్ట్రేట్ ఎదుట కాకాని
-
గ్యాంగ్‌రేప్ నిందితులకు బెయిల్.. కార్లు, బైకులతో విజయోత్సవ ర్యాలీ
సాక్షి,బెంగళూరు: ఓ మహిళపై సామూహిక అత్యాచారం. ఆపై జైలు శిక్ష, బెయిల్‌పై విడుదల. ఈ తరహా దారుణాల నిందితులు చేసిన తప్పుకు పశ్చాతాపానికి గురవుతుంటారు. సమాజంలో తిరగలేక సిగ్గుతో తలదించుకుంటుంటారు. కానీ కర్ణాటక కేసు నిందితులు అందుకు భిన్నంగా వ్యవహించారు. బెయిల్ రావడంతో బైక్, కార్లలో తిరుగుతూ విజయోత్సవ ర్యాలీలు జరిపారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల,గ్యాంగ్ రేప్ కేసులో ఏడుగురు ప్రధాన నిందితులు అఫ్తాబ్, మదర్ సాబ్, సమీవుల్లా, మొహమ్మద్ సాదిక్, తౌసీఫ్, రియాజ్, షోయిబ్‌లకు కర్ణాటక హవేరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అనంతరం, చేసిన తప్పుకు తలదించుకోవాల్సింది పోయి సంబరాలు చేసుకున్నారు. వీధుల్లో కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. SHOCKING 🚨 7 Gang rape accused take out road show after securing BAIL in Karnataka's Haveri. Names — Mohammad Sadiq Agasimani, Shoib Mulla, Tausip Choti, Samiwulla Lalanavar, Aptab Chandanakatti, Madar Saab Mandakki, and Riyaz Savikeri. pic.twitter.com/pNMF21YXJy— Times Algebra (@TimesAlgebraIND) May 23, 2025కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే.. 2024 జనవరి 8న కర్ణాటకలోని హవేరీ జిల్లాలో హనగర్‌కు చెందిన ఓ హోటల్ గదిలో దారుణం జరిగింది. నిందితులు హోటల్ గదిలోకి చొరబడి ఓ జంటపై దాడి చేశారు. అనంతరం బాధితురాల్ని స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.తాజాగా, ఆ కేసులో ఏడుగురు ప్రధాన నిందితలు బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్ రావడంపై నిందితులు హవేరి జిల్లా అక్కి అలూరు పట్టణంలో పెద్ద ఎత్తున మోటార్ బైక్‌లు, కార్లు, డీజే మ్యూజిక్‌తో కూడిన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చిరునవ్వుతో చేతులు ఊపుతూ, విజయోత్సవ సంకేతాలిచ్చిన దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. బాధితురాలు ఓ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారు. ఆమె కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలో ఆమె, తన ప్రియుడితో కలిసి 2024 జనవరి 8న హనగల్‌కు చెందిన ఓ హోటల్లో రూమ్ తీసుకున్నారు. బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టారు. అయితే జనవరి 11న న్యాయమూర్తి ఎదుట బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి ఆదేశాలతో ఈ కేసులో పోలీసులు మొత్తం 19 మందిని అరెస్ట్ అయ్యారు. వీరిలో 12 మందిని దాదాపు 10 నెలల క్రితమే బెయిల్‌పై విడుదల చేశారు. కానీ, ఏడుగురు ప్రధాన నిందితులు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇదే కేసులో ఆ ఏడుగురికి న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంతో నిందితులు బైక్‌లు,కార్లలో ర్యాలీతో సంబరాలు చేసుకున్నారు.ఈ ఘటనపై నెటిజన్లు, స్థానికులు.. న్యాయం గెలవాలన్న ఆశతో బాధితురాలు ఎదురుచూస్తున్న సమయంలో నిందితులు చేసిన విజయోత్సవాల ర్యాలీ బాధితురాలిని మరింత మానసికంగా దెబ్బతీసేలా ఉందని విమర్శిస్తున్నారు. -
'నా కొడుకు చావుకు గూగుల్, ఏఐలే కారణం'
టెక్నాలజీ వల్ల లాభాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్ఫాబెట్‌కు చెందిన గూగుల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన క్యారెక్టర్.ఏఐ తన కొడుకు ఆత్మహత్యకు కారణమైందని ఓ తల్లి కోర్టు మెట్లెక్కింది.అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతానికి చెందిన మెగన్ గార్సియా.. తన 14 ఏళ్ల కొడుకు 'సెవెల్ సెట్జర్' ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏఐ చాట్‌బాట్‌తో చాటింగ్ చేసినట్లు పేర్కొంది. పిల్లల మానసిక బాధ లేదా ప్రవర్తన నుంచి బయట పడేయడంలో ఏఐ విఫలమైందని ఆ మహిళ ఆరోపించింది.ఏఐ చాట్‌బాట్ పట్ల ఒక యువకుడు ఎంతగానో మక్కువ పెంచుకున్నాడనే దానివల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే చాట్బాట్ల అవుట్‌పుట్ రాజ్యాంగబద్ధంగా ఉన్న స్వేచ్ఛా వాక్ స్వాతంత్య్రాన్ని కలిగి ఉన్నందున కేసును కొట్టివేయాలని గూగుల్, ఏఐ సంస్థ విజ్ఞప్తి చేశాయి. అయితే దీనిపై యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అన్నే కాన్వే ఏకీభవించలేదు. అంతే కాకుండా కంపెనీ తప్పకుండా జవాబుదారీ తనంతో ఉండాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులుఏఐ చాట్‌బాట్ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. అయితే అడిగే ప్రశ్న మంచిదా?, ప్రమాదాన్ని కలిగిస్తుందా? అనే విషయం ఏఐ గుర్తించడం లేదు. ఒక వ్యక్తి ఎలా చనిపోవాలి అని అడిగితే.. దానికి కూడా తనదైన రీతిలో సమాధానం చెబుతుంది. మానసిక బాధతో ఉన్న వ్యక్తులు ఏఐను ఒక ఫ్రెండ్ లేదా అంతకంటే ఎక్కువే అనుకుంటారు. అలాంటి సమయంలో ఏఐ ఇచ్చే సలహాలు ప్రమాదానికి కారణమవుతున్నాయి. కాబట్టి ప్రశ్న ఎలాంటిదో.. ముందు ఏఐ దానిని తప్పకుండా గమనించేలా కంపెనీలు కూడా సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు
-
వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేశారన్న ఆరోపణల కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్న వల్లభనేని వంశీ ఉన్నారు. రెండు రోజుల వ్యవధిలో రెండు కీలక కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరైంది. రెండు రోజుల క్రితం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరవ్వగా, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇవాళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వంశీపై ఇప్పటి వరకూ నమోదైన 6 కేసుల్లో బెయిల్ మంజూరైంది.90 రోజులుగా రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు. వరుసగా ఒక్కొక్క కేసులో బెయిల్ వస్తున్న తరుణంలో వంశీపై కక్ష పూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వంశీపై నిన్న నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు.. ఇవాళ నూజివీడు కోర్టులో వంశీని హాజరు పరిచారు.ఈ నెల 29 వరకూ నూజివీడు కోర్టు రిమాండ్ విధించగా.. ఇవాళ తాజాగా వల్లభనేని వంశీపై మరో కేసును గన్నవరం పోలీసులు నమోదు చేశారు. గన్నవరంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై 58 పేజీలతో పోలీసులకు గనుల శాఖ ఏడీ ఫిర్యాదు చేశారు. క్రైమ్ నెం.142/2025తో గన్నవరం పీఎస్‌లో కేసు నమోదైంది. కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయాలని గన్నవరం పోలీసుల నిర్ణయించారు. వంశీపై కూటమి కక్షసాధింపు చర్యలపై ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ మండిపడుతోంది. జైల్లో వంశీ శ్వాసకోస సమస్య, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. వంశీ ఆరోగ్యంపై ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పరిటాల శ్రీరామ్‌కు అరెస్టు వారెంట్
సాక్షి, అనంతపురం: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు, టీడీపీ ధర్మవరం నియోజక వర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై 2023 అనంతపురం రెండో పట్టణ స్టేషన్లో పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు హాజరు కాకపోవడంపై ఏజేఎఫ్సీఎం కోర్టు సీరియస్ అయ్యింది. పరిటాల శ్రీరామ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. -
అరెస్ట్ చేసిన బాలుడు ఎక్కడ?
హైదరాబాద్: ఎలాంటి తప్పు చేయని తన కుమారుడిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌కు బుధవారం ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్..పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తూ మే 5వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఏప్రిల్ 28న మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు తన కమారుడు మేకల కళ్యాణ్‌పై ఎలాంటి కేసు నమోదు చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ అలివేలు అనే మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసింది. పోలీసులు అక్రమ కస్టడీకి తీసుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చూడగా అక్కడ తన కుమారుడు కనిపించలేదని పిటిషన్లో పేర్కొన్నారు.తర్వాత మూడు గంటల సమయంలో తన కుమారుడి ఫోన్ నుంచి కాల్ రాగా అతన్ని కోర్టులో హాజరు పరుస్తున్నామని చెప్పిన పోలీసులు కోర్టు ఎదుట కూడా హాజరు పర్చకుండా ఎక్కడికి తీసుకెళ్లారో కూడా సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో న్యాయవాది అమర్నాథ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేస్తూ తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కమిషన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేస్తూ ఈ కేసుపై విచారణ జరిపించి మే 5వ తేదీలోపు పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది. -
'కోర్ట్' జ్ఞాపకాలు.. మర్చిపోలేకపోతున్న జాబిలి (ఫొటోలు)
-
జైలు శిక్ష విధిస్తావా..చంపేస్తాం
తమిళనాడు: గంజాయి అక్రమ రవాణా కేసులో 12 సంవత్సరాల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తిని కోర్టు ఆవరణలోనే చంపేస్తామని ఇద్దరు సోదరులు బెదిరించిన ఘటన తేని కోర్టు ఆవరణలో శుక్రవారం కలకలం రేపింది. వివరాలు.. మదురై జిల్లా విల్లాపురం తూర్పు వీధిలోని మునియాండి ఆలయం సమీపంలో కొంతమంది గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కీరతురై పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి 25 కిలోల గంజాయి తరలిస్తున్న మురతంభత్రి ప్రాంతానికి చెందిన పాండియరాజన్, ప్రశాంత్, పాండియరాజన్ భార్య శరణ్యలను అరెస్టు చేశారు. విచారణలో, మధురైలోని కామరాజపురం ప్రాంతానికి చెందిన రౌడీ వెల్లైౖకలి మేనల్లుడు షణ్ముగవేలు తమకు 25 కిలోల గంజాయి ఇచ్చాడని వారు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసు గురువారం మదురై జిల్లా నార్కోటిక్స్ కంట్రోల్ మొదటి అదనపు కోర్టు న్యాయమూర్తి హరిహరకుమార్ ముందు విచారణకు వచ్చింది. ఆ సమయంలో, ముగ్గురిని దోషులుగా నిర్ధారించి, ఒక్కొక్కరికి 12 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ పరిస్థితిలో, పోలీసులు వారిని జైలుకు తరలించారు. ఆ సమయంలో నిందితులు పాండియరాజన్, ప్రశాంత్, న్యాయమూర్తిని చూసి చంపేస్తామని బెదిరించారు. వారు న్యాయమూర్తిని దుర్భాషలాడుతూ కోర్టు భవనం కిటికీలను పగులగొట్టి వీరంగం చేశారు. న్యాయమూర్తిని చంపేస్తామని బెదిరించారు. పోలీసులు, న్యాయవాదులపై అసభ్యకర పదజాలంతో దూషించారు. పోలీసులు వారిద్దరిని వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. న్యాయమూర్తిని చంపుతామని బెదిరించారని ఆరోపిస్తూ అన్నానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
చీటింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త మయూరి జయరాం చౌదరి అరెస్ట్
సాక్షి,తిరుపతి: మయూరీ గ్రూప్ అధినేత జయరాం చౌదరిపై తిరుపతి పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కోల్‌కతాలో రూ.8కోట్ల చీటింగ్ కేసులో నిందితుడిగా పేర్కొంటూ .. జయరాం చౌదరికి చెందిన రూ.500 కోట్లను అటాచ్ చేస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో మయూరీ జయరాంను తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.8కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నామని,హైకోర్టు ఆదేశాల ప్రకారం 18శాతం చెల్లించామని జయరాం అన్నారు. -
నెల్లూరులో కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి సందడి (ఫొటోలు)
-
బోనమెత్తిన కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి (ఫొటోలు)
-
అమెరికా పౌరుడినని చెప్పినా వదలని ఐసీఈ
మయామి: దేశంలో అక్రమంగా ఉంటున్నాడంటూ అమెరికా పౌరుడొకరిని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత పత్రాలన్నిటినీ అతడి తల్లి చూపినా వదల్లేదు. చివరికి కోర్టు జోక్యంతో అతడికి విముక్తి లభించింది. బుధవారం కారులో వెళ్తున్న జువాన్ కార్లోస్ లోపెజ్ గోమెజ్ (20) అనే వ్యక్తిని ఫ్లోరిడా హైవే పెట్రోల్ అధికారులు జార్జియా రాష్ట్ర సరిహద్దుల్లో అడ్డుకున్నారు. దేశంలో అక్రమంగా ఉండే వారికి జార్జియాలోకి ప్రవేశం నిషిద్ధం. ఆ నిబంధనను సాకుగా చూపు తూ గోమెజ్తోపాటు ఆ కారులో ఉన్న వారందరినీ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి తల్లి వచ్చి పౌరసత్వ కార్డు సహా ఆధారాలన్నీ చూపినా ససేమిరా అంటూ లియోన్ కౌంటీ జైలుకు వారిని తరలించారు. కేసు విచారణ సమయంలో గోమెజ్ తల్లి స్టేట్ ఐడెంటిటీ కార్డు, బర్త్ సర్టిఫికెట్, సోషల్ సె క్యూరిటీ కార్డు చూపారు. దీంతో, ఇమిగ్రేషన్ అధి కారుల చర్యకు ఎటువంటి ఆధారాలు లేవంటూ గోమెజ్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఈ పరిమాణంపై ఇమిగ్రేషన్ విభాగం స్పందించలేదు. దేశ పౌరులను అదుపులోకి తీసుకునే అధికారం యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు లేకపోవడం గమనార్హం. -
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
పల్నాడు జిల్లా,సాక్షి: దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ తనను బాగా ఇబ్బంది పెట్టారంటూ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి గురజాల కోర్టు న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.రెడ్‌బుక్ రాజ్యాంగం మేరకు పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని పోలీసులు గురువారం గురజాల కోర్టులో హాజరు పరిచారు. కోర్టులో పాలేటి కృష్ణవేణి అరెస్టుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. ‘దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. నిన్న సాయంత్రం హైదరాబాదులో ఐదు గంటల పది నిమిషాలకు నన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి దాచేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. రాత్రి తినడానికి నాకు ఆహారం కూడా ఏమి పెట్టలేదు. మూడున్నరకి కొంత ఆహారం పెట్టారు. మేం చెప్పినట్టు వినకపోతే సీఐ భాస్కర్ కేసులు పెడతామని బెదిరించారు.నా భర్త రాజ్ కుమార్‌పైన గంజాయి కేసు పెడతామని సీఐ భాస్కర్ బెదిరించారు. నీ వల్ల దేశానికి ఏంటి ఉపయోగం అని సీఐ భాస్కర్ నన్ను వేధించాడు. నీకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా అని టార్చర్ చేశారు. ఈ పోస్టులు వెనక పార్టీ నాయకులు ఎవరెవరు ఉన్నారో చెప్పమని ఇబ్బంది పెట్టారు. పార్టీ నాయకుల పేర్లు చెప్పమని బలవంతం చేశారు’ అని అన్నారు. అయితే తాను పెట్టిన పోస్టులకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కృష్ణవేణి న్యాయమూర్తికి చెప్పారు. అనంతరం మిమ్మల్ని పోలీసులు ఎలా చూసుకున్నారని కృష్ణవేణిని న్యాయమూర్తి ప్రశ్నించారు. నన్ను బాగా ఇబ్బంది పెట్టారని కృష్ణమూర్తి చెప్పగా.. పోలీసులు పైన కంప్లైంట్ ఇస్తారా? అని న్యాయమూర్తి కృష్ణవేణిని అడిగారు. అందుకు తాను పోలీసులపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు.ఈ సందర్భంగా.. కృష్ణవేణి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ఆమె తరుఫు న్యాయవాది.. న్యాయమూర్తిని కోరారు. వాదన సందర్భంగా దాచేపల్లి పోలీస్ స్టేషన్ గేట్లకు బేడీలతో తాళాలు వేసిన విజువల్స్ న్యాయమూర్తిగా చూపించారు. అనంతరం, కృష్ణవేణికి 14 రోజులు పాటు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను గుంటూరు కోర్టుకు తరలించారు. కృష్ణవేణి కస్టోడియల్ టార్చర్‌పై దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్‌కు కోర్టు మెమో జారీ చేసింది. -
సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు.. కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కూతుర్ని చంపిన కేసులో తల్లికి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. మానసిక స్థితి సరిగ్గాలేదని కన్న కూతుర్నే తల్లి చంపేసింది. మోతె మండలం మేకపాటి తండాలో 2021, ఏప్రిల్‌లో జరిగిన ఘటనలో ఇవాళ జిల్లా న్యాయస్థానం తీర్పు చెప్పింది.నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పు..నాంపల్లి పోక్సో కోర్టు కూడా ఇవాళ సంచలన తీర్పునిచ్చింది. బాలికపై లైంగికదాడి యత్నం చేసిన నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. 2023లో రాజ్ భవన్ మక్త ప్రాంతంలో బాలికపై అత్యాచారయత్నం జరిగింది. సెల్‌ఫోన్ ఇస్తానని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి శ్రీనివాస్ అనే వ్యక్తి లైంగికదాడి యత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై పోలీసులపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌కు 25 జైలు శిక్షతో పాటు కోర్టు జరిమానా విధించారు. -
26/11 టార్గెట్‌లో జల వాయు విహార్.. తహవ్వుర్ రాణా కీలక పాత్ర?
ముంబై: మహానగరం ముంబైలో 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన ఉగ్రదాడులు(Terrorist attacks) (26/11) భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైన ఘటనలలో ప్రధానమైనవిగా నిలుస్తాయి. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా జనం గాయపడ్డారు. లష్కర్-ఏ-తోయిబా అనే పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడింది.నారిమన్ హౌస్ సమీపంలోని..ఈ దాడుల లక్ష్యాలలో తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, ఛత్రపతి శివాజీ టెర్మినస్(Chhatrapati Shivaji Terminus) (సీఎస్టీ), నారిమన్ హౌస్ మొదలైనవి ఉన్నాయి. అయితే ఎన్డీటీవీ పేర్కొన్న ఒక కథనం ప్రకారం ముంబైలోని జల వాయు విహార్ పేరిట ఉన్న సైనిక కాలనీ కూడా ఉగ్రవాదుల లక్ష్యంగా ఉందని తెలుస్తోంది. ఈ ప్రాంతం ముంబైలోని కోలాబాలో ఉంది. ఇక్కడ నావికా దళ సిబ్బంది, వారి కుటుంబాలు ఉంటాయి. ఈ ప్రాంతం దాడి జరిగిన నారిమన్ హౌస్(Nariman House) సమీపంలో ఉంది. డేవిడ్ కోల్మన్ హెడ్లీ అనే ఉగ్రవాది ఈ దాడులకు ముందు అత్యంత రహస్యంగా ముంబైలో వారి లక్ష్యాలను పరిశీలించాడు. హెడ్లీ బృందం జల వాయు విహార్‌ను కూడా లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ కాలనీలో సైనిక అధికారులు ఉండటం వల్ల దీనిపై ఉగ్రవాదులు దాడులు చేయాలనుకున్నారు. అయితే, చివరి నిమిషంలో వారి ప్రణాళికలు మారి, ఇతర ప్రదేశాలలో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులలో తహవ్వుర్ రాణా కీలక పాత్ర పోషించాడని ఆ కథనం బెబుతోంది.డేవిడ్ హెడ్లీకి అత్యంత సన్నిహితుడుతహవ్వుర్ రాణా(Tahawwur Rana) పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడియన్ పౌరుడు. తొలుత పాకిస్తాన్ సైన్యంలో వైద్యునిగా పనిచేసిన రాణా ఆ తర్వాత అమెరికాలోని చికాగోలో స్థిరపడ్డాడు. అక్కడ అతను ఇమ్మిగ్రేషన్ సర్వీస్ సెంటర్‌ను నడిపాడు. రాణా.. డేవిడ్ హెడ్లీకి అత్యంత సన్నిహితుడు. ఈ దాడుల్లో కీలక సహాయకునిగా వ్యవహరించాడు. హెడ్లీ అసలు పేరు దావూద్ సయ్యద్ గిలానీ, అతను పాకిస్థానీ-అమెరికన్ ఉగ్రవాది. రాణా ఈ దాడులకు సంబంధించిన లాజిస్టిక్ సహాయం అందించాడనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రాణా స్వమంగా హెడ్లీకి ఆర్థిక సహాయం, ప్రయాణ ఏర్పాట్లు చేశాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆరోపిస్తోంది.భారత న్యాయస్థానం ముందుకు..తహవ్వుర్ రాణా లష్కర్-ఏ-తోయిబాతో సంబంధాలు కలిగి ఉన్నాడని, ఈ దాడులకు సంబంధించిన ప్రణాళికలో పాల్గొన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. 2009లో అమెరికాలోని చికాగోలో రాణాను ఎఫ్‌బీఐ అరెస్టు చేసింది. అతనిపై ముంబై దాడులకు సంబంధించిన ఆరోపణలతో పాటు, డెన్మార్క్‌లోని ఒక వార్తాపత్రికపై దాడికి సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. 2011లో అమెరికన్ కోర్టు(American court) రాణాను లష్కర్-ఏ-తోయిబాకు సహాయం చేసినందుకు దోషిగా తేల్చింది. కానీ ముంబై దాడులకు సంబంధించిన ఆరోపణల నుంచి విముక్తి కల్పించింది. అయితే హెడ్లీ ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా భారత్ రాణాను ఈ దాడుల్లో భాగస్వామిగా గుర్తించింది. 2025 ఏప్రిల్‌లో రాణాను భారతదేశానికి అప్పగించేందుకు అమెరికా సుప్రీం కోర్టు అంగీకరించింది. దీంతో తహవ్వుర్ రాణా ఇప్పుడు భారత న్యాయస్థానంలో విచారణ ఎదుర్కోనున్నాడు.ఇది కూడా చదవండి: వేడెక్కిన ‘పటేల్’ రాజకీయాలు.. ‘ఉక్కు మనిషి’పై హక్కు ఎవరిది? -
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడికి బెయిల్
వైఎస్సార్,సాక్షి: కూటమి కుట్రలో భాగంగా అరెస్టయిన ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా బెయిల్‌పై విడుదలయ్యారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కడప కోర్టు కొట్టివేసింది. మరో కేసులో పోలీసులు వేసిన పీటీ వారెంట్ డిస్మిస్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది.గతంలో ఓ వివాదంలో కడప తాలూకా స్టేషన్లో అహ్మద్ భాషపై కేసు నమోదైంది. ఆ సమయంలోనే అహ్మద్ బాషా రాజీ పడ్డారు. అయితే, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజీ కుదుర్చుకున్న కేసులు తిరగదోడింది. కక్షపూరితంగా అహ్మద్ భాషాపై పలు సెక్షన్ల కింద నోటీసులు జారీ చేసింది.లుక్ అవుట్ నోటీసులిచ్చి ముంబై ఎయిర్ పోర్ట్‌లో అరెస్ట్ చేసింది. అయితే,కేసుపై బుధవారం విచారణ చేపట్టిన కడప కోర్టు అహ్మద్‌బాషాకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.కోర్టు తీర్పుతో కడప సెంట్రల్ జైలు నుంచి అహ్మద్ భాషా విడుదలయ్యారు. సెంట్రల్ జైలు వద్ద అహ్మద్ భాషాకు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష,పార్టీ నాయకులు,కార్యకర్తలు స్వాగతం పలికారు. -
ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల
ఏప్రిల్ మొదటి వారంలో థియేటర్, ఓటీటీలలో పెద్దగా సినిమాల సందడి కనిపించలేదు. మార్చి చివరన వచ్చిన సినిమాలతోనే అభిమానులు ఎంజాయ్ చేశారు. అయితే, ఈ వారంలో బాక్సాఫీస్ వద్ద కాస్త సందడి వాతావరణం కనిపించనుంది. రేసులో సిద్ధు నటించిన జాక్, అజిత్, త్రిష నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీతో పాటు సన్నీ డియోల్- దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ సినిమా 'జాట్' ఉంది. ఇదే క్రమంలో ఓటీటీ నుంచి కూడా కాస్త పర్వాలేదనే సినిమాలే ఉన్నాయి.థియేటర్స్‌లోకి వచ్చే సినిమాలు🎥 జాక్- ఏప్రిల్ 10🎥 గుడ్ బ్యాడ్ అగ్లీ -ఏప్రిల్ 10🎥 జాట్- ఏప్రిల్ 10🎥 బజూక- ఏప్రిల్ 10🎥 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి- ఏప్రిల్ 11🎥 కౌసల్య తనయ రాఘవ- ఏప్రిల్ 11ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు/ వెబ్సిరీస్లునెట్ఫ్లిక్స్🎥 కోర్టు- ఏప్రిల్ 11🎥 పెరుసు (తెలుగు/ తమిళ్)- ఏప్రిల్ 11🎥 బ్లాక్ మిర్రర్ 7 (వెబ్‌సిరీస్/ఇంగ్లిష్)- ఏప్రిల్ 10 🎥 కిల్ టోనీ (వెబ్‌సిరీస్/ఇంగ్లిష్)- ఏప్రిల్ 7అమెజాన్ ప్రైమ్ వీడియో🎥 ఛోరీ 2 (హిందీ)- ఏప్రిల్ 11🎥 ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్ ( ఇంగ్లీష్) - ఏప్రిల్ 8 🎥 జీ20 (ఇంగ్లీష్)- ఏప్రిల్ 10జియో హాట్‌స్టార్🎥 ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 6 (యానిమేషన్ సిరీస్/హిందీ)- ఏప్రిల్ 11🎥 ది లాస్ట్ ఆఫ్ అజ్ (హిందీ/ తెలుగు/ ఇంగ్లీష్)- ఏసోనీలివ్🎥 ప్రావింకూడు షాపు (తెలుగు/ మలయాళం)- ఏప్రిల్ 11 జీ5🎥 కింగ్స్‌స్టన్ (తమిళ్/తెలుగు)- ఏప్రిల్ 13 -
పల్లెటూరి చిన్నోడు.. నటనలో మెప్పించాడు
అల్లూరి సీతారామరాజు: కృషి, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహం వెరసి ఓ పల్లెటూరి చిన్నోడు... ‘కోర్ట్’లో మెప్పించి అనేక మంది ప్రశంసలు అందుకుంటున్నాడు. చిన్న చిన్న డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేసే ఆ చిన్నోడు డ్యాన్స్ పట్ల మక్కువతో తనను తాను తీర్చిదిద్దుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. 19 ఏళ్లకే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ‘కోర్ట్’ సినిమా ద్వారా హీరోగా మారి బంపర్ హిట్ కొట్టాడు. ఆయన ఇటీవల తన స్వగ్రామమైన కూనవరం వచ్చారు. ఆయనకు స్థానికులు అపూర్వ స్వాగతం తెలిపి ఘనంగా సన్మానించారు. చింతూరు ఏజెన్సీ డివిజన్ కూనవరం గ్రామానికి చెందిన రోషన్ అంచెలంచెలుగా ఎదిగిన తీరును తెలుసుకుందాం... ఇటీవల విడుదలైన కోర్ట్ సినిమా హిట్ కావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. హీరో నాని నిర్మాతగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ బంపర్ హిట్ సాధించింది. ఇందులో యువ హీరోగా రోషన్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి.. సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన రోషన్ తాత మస్తాన్ కూనవరం ఎంపీడీవో కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేశారు. తండ్రి రషీద్ వైద్యశాలలో పనిచేసేవారు. రోషన్ చదువు ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు భద్రాచలంలో..అనంతరం ఖమ్మంలో పదో తరగతి వరకు సాగింది. రోషన్‌కు చిన్నతనం నుంచే డ్యాన్స్‌పై మక్కువ ఉండేది. తన సోదరుడు తౌఫిక్ ప్రోత్సాహంతో పాల్వంచలోని అరవింద్ మాస్టర్, భద్రాచలంలోని పవన్, నాగురాజు మాస్టార్ల వద్ద డ్యాన్స్‌లో మెలకువలు నేర్చుకున్నారు. సినిమారంగంపై ఉన్న మక్కువతో హైదరాబాద్‌కు కుటుంబసమేతంగా తరలివెళ్లారు. వివిధ టీవీ ఛానళ్లలో డ్యాన్స్ పోటీల్లో పాల్గొని, ఉత్తమ ప్రదర్శనతో రోషన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో దర్శకుడు తరుణ్‌భాస్కర్ అతడిలోని ప్రతిభను గుర్తించి, ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించే అవకాశం కల్పించారు. ఆ తరువాత అరవింద సమేత, గద్దలకొండ గణేష్, వెంకీ మామ చిత్రాల్లో బాలనటుడిగా.. సలార్, విరూపాక్ష, బచ్చలమల్లి, మిషన్ ఇంపాజిబుల్, స్వాగ్ వంటి చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్రలు పోషించడంతో తనకంటూ ఓ గుర్తింపు వచ్చింది. ‘సరిపోదా శనివారం’తో ప్రత్యేక గుర్తింపు సరిపోదా శనివారం చిత్రంలో హీరో నానితో కలిసి పనిచేసే అవకాశం రావడంతో రోషన్‌కు ప్రత్యేక అవకాశం లభించింది. అతనిలో నటనను హీరో నాని గుర్తించారు.. ఈ నేపథ్యంలో నాని నిర్మాతగా, రామ్ జగదీష్ దర్శకత్వంలో తీసిన ‘కోర్ట్’ సినిమాలో యువ కథనాయుకుడిగా రోషన్‌కు అవకాశం దొరికింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ సాధించింది. రోషన్ నటనకు పెద్ద పెద్ద కథనాయకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. స్వగ్రామస్తుల ఆదరణ మరువలేను ఈ సందర్భంగా హీరో రోషన్ మాట్లాడుతూ తాను నటించిన మిషన్ ఇంపాజిబుల్ చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవిని కలిశానని, చిత్రంలో తాను చేసిన డ్యాన్స్‌ను ఆయన మెచ్చుకొని ప్రశంసించారని గుర్తు చేశారు. కోర్ట్ చిత్రం చూసిన తరువాత కథనాయకుడు చిరంజీవి స్వయంగా ఆహ్వానించి జ్ఞాపికను బహుకరించడం మరచిపోలేని అనుభూతి అని చెప్పారు.ఇటీవల తన స్వగ్రామం కూనవరం వచ్చానని, స్థానికులు చూపిన ఆదరణ మరువలేనిదన్నారు. ప్రస్తుతం కొందరు దర్శకులు కథలు వినిపించారు. వాటిలో కొన్నింటికి అంగీకారం తెలిపే అవకాశముందని చెప్పారు. -
'కోర్ట్' బ్యూటీ జర్నీ.. కాకినాడ నుంచి మెగాస్టార్ ఇంటివరకు (ఫొటోలు)
-
అనకాపల్లి: వేపాడు దివ్య కేసులో సంచలన తీర్పు
అనకాపల్లి, సాక్షి: పదేళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి వేపాడు దివ్య హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడు గుణశేఖర్‌ను దోషిగా ప్రకటించిన చోడవరం కోర్టు.. మరణశిక్షను ఖరారు చేసింది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. గుణశేఖర్‌కు దివ్య కుటుంబంతో గొడవలు ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకుని.. స్కూల్‌కి వెళ్లి వస్తున్న ఆరేళ్ల చిన్నారి దివ్యను నిందితుడు తన వెంట తీసుకెళ్లాడు. బిళ్లలమెట్ల రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లి బీర్ బాటిల్‌తో గొంతు కోసి పైశాచికంగా హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా జరిపారు. చివరకు బంధువైన గుణ శేఖరే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లపాటు విచారణ జరగ్గా.. చివరకు దివ్య కుటుంబానికి న్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
అందరూ గర్వపడే సినిమా కోర్ట్: చిరంజీవి
‘‘కోర్ట్’ సినిమా చూశాను.. ఎక్కడా బోర్ కొట్టలేదు. కథని ఆద్యంతం ఆసక్తిగా తీశారు. నటీనటులందరూ అద్భుతంగా నటించారు.. ప్రతి పాత్ర సహజంగా ఉంది. ఈ మూవీని కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్‌లా కాకుండా ఒక ఎడ్యుకేటివ్ కోర్ట్ డ్రామాగా భావిస్తున్నాను. అందరూ గర్వపడే సినిమా ‘కోర్ట్’’ అని హీరో చిరంజీవి తెలిపారు. ప్రియదర్శి, శివాజి, రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు.నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం మార్చి 14న విడుదలై, హిట్‌గా నిలిచింది. తాజాగా ‘కోర్ట్’ చిత్రబృందాన్ని చిరంజీవి అభినందించి, సత్కరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ–‘‘కోర్ట్’లో చాలా బలమైన సందేశం ఉంది. నాని ఒక కథపై ఆసక్తి చూపించారంటే కచ్చితంగా అందులో విషయం ఉంటుంది. ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్‌లోనే చూడాలి’’ అన్నారు. -
కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా: కోర్ట్ టీమ్‌పై మెగాస్టార్ ప్రశంసలు
చిన్న సినిమా అయినా సరే కంటెంట్ కింగ్ అనే విషయం మరోసారి రుజువైంది. ఆ మాటను ఇటీవల విడుదలైన కోర్ట్ మూవీ మరోసారి స్పష్టం చేసింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరెకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ఊహించిన దానికంటే అధికంగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా ఈ మూవీపై పలువురు టాలీవుడ్ అగ్ర సినీతారలు ప్రశంసలు కురిపించారు.తాజాగా ఈ మూవీ టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. కోర్ట్ మూవీ టీమ్‌ను తన ఇంటికి ఆహ్వానించిన చిరు.. సినిమా తెరకెక్కించిన తీరుపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో ప్రియదర్శి ఉండడంతో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని భావించానని అన్నారు. కానీ ఈ కథను చాలా స్ట్రైట్‌గా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారని మెగాస్టార్ కొనియాడారు. ఈ సినిమాలో శివాజీ చాలా క్రూయల్‌గా నటించారని.. రోషన్, శ్రీదేవి అద్భుతంగా చేశారని చిరంజీవి ప్రశంసించారు. ఈ సందర్భంగా చిరంజీవితో ప్రియదర్శి కాసేపు సినిమా కాన్సెప్ట్ గురించి వివరించారు. ఠాగూరు మూవీ తర్వాత అంతలా చర్చించుకున్న సినిమా ఇదేనని ప్రియదర్శి అన్నారు. కాగా.. ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. ఈ -
చిరంజీవిని కలిసిన 'కోర్ట్' మూవీ టీమ్ (ఫొటోలు)
-
కలెక్షన్లలో దూసుకెళ్తున్న కోర్ట్ 10 రోజుల్లోనే 50 కోట్లు..
-
ఐపీఎస్ అధికారి మహంతికి హైకోర్టులో ఊరట
సాక్షి,హైదరాబాద్: తెలంగాణాకు చెందిన ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి(IPS officer Abhishek Mohanty)కి హైకోర్టులో ఊరట లభించింది. క్యాట్‌లో విచారణ ముగిసే వరకు తెలంగాణలోనే అభిషేక్ మహంతి విధులు నిర్వహించాలని హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో అభిషేక్ మహంతికి ఉపశమనం లభించింది.తెలంగాణ నుంచి ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీకి బదిలీచేస్తూ డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. వీరిలో అభిషేక్ మహంతి ఒకరు. అయితే ఆయన తనను ఆంధ్రప్రదేశ్‌కు పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ప్రస్తుతం క్యాట్‌లో అభిషేక్ మహంతి పిటీషన్ పై విచారణ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో గతంలో డీవోపీటీ జారీ చేసిన ఉత్తర్వులపై క్యాట్‌లో విచారణ ముగిసేంత వరకూ ఆయన బదిలీని నిలిపేయాలని, అప్పటి వరకూ తెలంగాణలోనే ఆయన విధులు నిర్వహించవచ్చని హైకోర్టు(High Court) పేర్కొంది.రాష్ట్ర విభజన సమయంలో మహంతికి కేటాయించిన ఏపీలో ఆయన విధులలో చేరాలని కేంద్రం గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఐపీఎస్ అభిషేక్ మహంతి క్యాట్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన క్యాట్ కేంద్ర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ తిరుమలాదేవీ ధర్మాసనం విచారణ చేపట్టింది. మహంతి గురువారం ఏపీలో చేర్చాల్చి ఉండటంతో నేటి (సోమవారం) వరకు కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసింది.ఇది కూడా చదవండి: కర్నాటక ముస్లిం కోటా బిల్లుపై రాజ్యసభలో రసాభాస -
గోదారిగట్టు, బుజ్జితల్లి.. ఇప్పుడు ప్రేమలో.. ఆ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది
కొన్ని సాంగ్స్ వింటే పదే పదే వినాలనిపిస్తుంది. అంతేకాదు డ్యాన్స్ కూడా చేయాలనిపిస్తుంది. అలాంటి పాటలు ఇటీవల తెలుగు సినిమాల్లో అభిమానులను అలరిస్తున్నాయి. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి గోదారి గట్టు సాంగ్, అలాగే తండేల్ సినిమా నుంచి బుజ్జితల్లి సాంగ్ సినీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఎక్కడ చూసిన ఈ పాటలకు ఆడియన్స్ కాలు కదిరాపు. దీంతో ఈ రెండు పాటలకు ఓ రేంజ్లో క్రేజ్ వచ్చింది కొంతమంది ఏకంగా ఈ పాటలకు రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అలా ఇదే జాబితాలో మరో హిట్ సాంగ్ వచ్చి చేరింది. అదేనండి ఇటీవల సోషల్ మీడియాను ఊపేస్తోన్న కోర్ట్ మూవీ సాంగ్. ఇంకేంటీ మీకోసమే తాజాగా ఫుల్ సాంగ్ కూడా వచ్చేసింది. మరెందుకు ఆలస్యం చూసి ఎంజాయ్ చేయండి.(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద ‘కోర్ట్’ సంచలనం.. నాలుగో రోజు ఊహించని కలెక్షన్స్!)ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం కోర్ట్(Court: State Vs Nobody). కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలా ఈ నెల 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మొదటి రోజే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. పాజిటివ్ మౌత్‌టాక్‌తో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 28.9 కోట్లు రాబట్టింది. చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ వల్ల బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. -
పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు
-
కోర్ట్ మూవీ హీరోయిన్ మన తెలుగమ్మాయే.. ఆమె సొంతూరు ఎక్కడో తెలుసా? (ఫోటోలు )
-
పోసాని బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి,గుంటూరు: ప్రముఖ రచయిత,నటుడు పోసాని కృష్ణ మురళి (Posni Krishna Murali) బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసింది.గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్‌పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా .. న్యాయస్థానం ఇవ్వాల్టికి వాయిదా వేసింది. ఈరోజు పోసాని బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. వాదనలు పూర్తి అయిన తర్వాత తీర్పును న్యాయస్థానం ఈనెల 21కి వాయిదా వేసింది. -
Posani Krishna Murali : న్యాయవాది సమక్షంలో విచారణ.. సీఐడీ కస్టడీకి పోసాని
సాక్షి,గుంటూరు: ప్రముఖ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళికి కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు పోసానిని మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ కస్టడీకి తీసుకొని ప్రశ్నించనుంది. న్యాయవాది సమక్షంలోనే పోసానిని సీఐడీ విచారించనుంది. కాగా, సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో ప్రస్తుతం పోసాని గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు మంగళవారం పోసాని బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది. -
‘కోర్ట్’ మూవీ హీరోయిన్ శ్రీదేవి ఎంత క్యూట్‌గా ఉందో చూడండి (ఫొటోలు)
-
'కోర్టు' సినిమా కలెక్షన్లు.. 'నాని'కి భారీ లాభాలు
హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘కోర్ట్’–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రల్లో నటించారు. ఇందులో శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలకంగా మెప్పించారు. మార్చి 14న హోలీ పండగ సందర్భంగా ఈ చిత్రం విడుదలైంది. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు తొలిరోజే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈమేరకు భారీ కలెక్షన్లను రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది.కోర్టు సినిమా ప్రీమియర్ షోలతో కలుపుకొని మొదటిరోజు రూ. 8.10 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం అతని కెరీర్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సుమారు రూ. 11 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నాని నిర్మించారని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటిరోజు బ్రేక్ఈవెన్కు దగ్గరలో కోర్టు కలెక్షన్లు రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ వీకెండ్లో భారీగా కలెక్షన్లు పెరిగే ఛాన్స్ ఉంది. సులువుగా ఈ వారంలోనే రూ. 20 కోట్ల మార్క్‌ను ఈ చిత్రం అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 8 కోట్లు, ఆడియో ద్వారా రూ. 50 లక్షలు, శాటిలైట్ ద్వారా మరో రెండు కోట్లు ఈ చిత్రానికి వచ్చాయని అంచనా వేస్తున్నారు. కోర్టు సినిమా భారీ లాభాలు తెచ్చిపెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాన్ని నిర్మించిన హీరో నానిపై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.(ఇదీ చదవండి- Court Movie Review: కోర్టు సినిమా రివ్యూ) -
‘కోర్ట్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
కోర్ట్‌తో నా కల నెరవేరింది: శివాజీ
‘‘కోర్ట్’ సినిమాలో నేను చేసిన మంగపతి పాత్రకి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇలాంటి బలమైన పాత్ర చేయాలన్న నా 25 ఏళ్ల కల ఈ సినిమాతో నెరవేరింది’’ అని నటుడు శివాజీ(Shivaji) తెలిపారు. ప్రియదర్శి, శివాజీ, రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పొస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.ఈ సినిమాలో మంగపతి పాత్ర పొషించిన శివాజీ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నాకు నటనలో దాదాపు 12 ఏళ్ల విరామం వచ్చింది. నన్ను మళ్లీ నటించమని నా పిల్లలు కోరేవారు. నాకూ చేయాలని ఉండేది కానీ ఎవర్నీ అవకాశం అడగలేదు. సొంతంగా నేనే ఓ సినిమా నిర్మిద్దామనుకున్న సమయంలో ‘90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ చేశాను. అది చేస్తున్నప్పుడు ‘బిగ్ బాస్’ అవకాశం వస్తే, చేశాను. ఆ షోతో నేనంటే ఏంటో ప్రపంచానికి తెలిసింది. వెబ్ సిరీస్ పెద్ద హిట్ కావడంతో దాదాపు ఎనభై కథలు విన్నాను. చాలావరకూ తండ్రి పాత్రలే కావడంతో తిరస్కరించాను.‘కోర్ట్’లో మంగపతి పాత్ర క్రెడిట్ డైరెక్టర్ రామ్‌దే. ఎస్వీ రంగారావు, గుమ్మడి, జగ్గయ్య, రాజనాలగార్లు మరపురాని పాత్రలు చేశారు. అలాంటి పాత్రలు చేయాలని నాకూ ఉండేది కానీ హీరోగా ఉండాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. కొత్తవారిని ప్రొత్సహించడంలో నాని గొప్ప చొరవ చూపిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్, ఉషా కిరణ్ మూవీస్ వంటి బ్యానర్స్లా వాల్ పొస్టర్ సినిమా అవుతుంది.ఇక మంగపతి తరహాలో మెడికల్ షాప్ మూర్తి అనే ఓ క్యారెక్టర్ విన్నాను. ప్రస్తుతం నేను నిర్మాతగా, హీరోగా, లయ హీరోయిన్గా ఓ సినిమా చేస్తున్నా. అలాగే ‘దండోరా’ అనే మరో చిత్రంలో నటిస్తున్నాను’’ అని తెలిపారు. ఇంకా రాజకీయాల గురించి మాట్లాడుతూ – ‘‘నేను ఏ పార్టీకి సపొర్ట్‌గా ఉండలేదు... మాట్లాడలేదు. నేను ప్రజల కోసం నిలబడ్డాను. ప్రాంతం కోసం, భావితరాల కోసం పొరాటం చేశాను’’ అని శివాజీ స్పష్టం చేశారు. -
‘భార్య అలా చేస్తే భర్తకు ఇంతకు మించిన నరకం మరొకటి ఉండదు’ :హైకోర్టు
భోపాల్ : పెళ్లైన మహిళలు, వారి పురుష స్నేహితుల సాన్నిహిత్యంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం తర్వాత పురుషుడు లేదా స్త్రీ తమ స్నేహితులతో అసభ్యకరమైన ఫోన్ ఛాటింగ్‌లు చేయకూడదని, తన భార్య ఆ తరహా చాటింగ్‌లు చేస్తుంటే ఏ భర్త కూడా సహించలేడని పేర్కొంది. దిగువ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ సందర్భంగా ఫోన్ ఛాటింగ్‌పై వ్యాఖ్యానించింది. నా భార్య చాటింగ్ చేస్తోందిమధ్యప్రదేశ్కు చెందిన భార్య,భర్తల గొడవ ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే చర్చకు దారితీసింది. 2018లో దంపతులకి వివాహమైంది. అయితే, ఆ ఇద్దరి దంపతుల మధ్య పొరపొచ్చలొచ్చాయి. అప్పుడే తన భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ‘విచారణలో నా భార్య వివాహం తరువాత కూడా ఆమె ప్రియుడితో మాట్లాడుతోంది. అందుకు వాట్సప్ చాటింగే నిద్శనం. పైగా ఆ చాటింగ్ అసభ్యంగా ఉందని ఆధారాల్ని అందించారు.లేదు.. నా భర్తే నాకు రూ.25లక్షల భరణం ఇవ్వాలికానీ పిటిషనర్ భార్య మాత్రం భర్త చేస్తున్న ఆరోపణల్ని ఖండించింది. నా భర్త చెప్పినట్లుగా నేను ఎవరితోను సాన్నిహిత్యంగా లేను. చాటింగ్ చేయడం లేదు.నా భర్త కావాలనే నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు పుట్టించాడు. నా ఫోన్ హ్యాక్ చేసి మరి మరో ఇద్దరు పురుషులతో చాటింగ్ కూడా చేశారు. నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించనందుకు రూ.25లక్షలు భరణం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పలు ఆరోపణలు చేసింది.భార్యే నిందితురాలుఅంతేకాదు, ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు భార్య-భర్త ఏపిసోడ్ భర్త చెప్పేవన్నీ నిజాలేనని నిర్ధారించింది. వాటిని నివృత్తి చేసుకునేందుకు భార్య తండ్రిని సైతం విచారించింది. విచారణలో ఆమె తండ్రి కూడా అంగీకరించారు. తన కుమార్తె పరాయి మగాడితో చాటింగ్ చేస్తుందన్న విషయాన్ని గుర్తించినట్లు కోర్టుకు చెప్పారు. దీంతో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.నాకు విడాకులొద్దు.. భర్తతోనే కలిసుంటాఫ్యామీలి కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ బాధిత మహిళ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు జస్టిస్ వివేక్ రష్యా, జస్టిస్ గజేంద్ర సింగ్‌ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో పిటిషనర్ తన ప్రియుడితో సె* లైఫ్ గురించి చాటింగ్ చేసినట్లు గుర్తించింది. భార్య పరాయి పురుషుడితో ఈ తరహా చాటింగ్ చేస్తే ఏ భర్త సహించలగడనే అభిప్రాయం వ్యక్తం చేసింది. భర్తలకు ఇంతకంటే నరకం మరొకటి ఉండదువివాహం తర్వాత, భర్త మరియు భార్య ఇద్దరూ తమ స్నేహితులతో మొబైల్, చాటింగ్, ఇతర మార్గాల ద్వారా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉందని గుర్తు చేస్తూ.. సంభాషణ స్థాయి సౌమ్యంగా, గౌరవప్రదంగా ఉండాలి. ముఖ్యంగా, మహిళ.. పురుషుడితో.. పురుషుడు స్త్రీతో మాట్లాడితే జీవిత భాగస్వామికి వ్యతిరేకంగా ఉండకూడదు’ అని కోర్టు పేర్కొంది. ఒక భాగస్వామి ఇలా అసభ్యకరమైన చాటింగ్ చేస్తే.. భర్తలకు ఇంతకంటే నరకం మరొకటి ఉండదని తెలిపింది. చివరగా.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. -
Amrutha Pranay case : చివరికి మిగిలిందేమిటి?
రామ నామ జపముచే మున్ను వాల్మీకి, / బోయడయ్యు బాపడయ్యే! / కులము ఘనము కాదు గుణమే ఘనమ్మురా / విశ్వదాభిరామ వినురవేమ! అని వేమన వందల సంవత్సరాల క్రితమే చెప్పినప్పటికీ ఈనాటికీ ఆ పద్య భావం పెడచెవిన పెట్టబడుతోంది. వేమన, కులం కాదు ‘గుణమే’ ముఖ్యమన్నాడు. ‘మంచి అన్నది మాల అయితే మాల నేనవుతాను‘ అని గురజాడ అన్నారు. ఇవేమీ పట్టించుకోని మిర్యాలగూడకు చెందిన అమృత తండ్రి మారుతీరావు 2018లో దళితుడైన ఆమె భర్త ప్రణయ్ (Pranay Perumalla)ను పాశవికంగా పరువు పేరుతో హత్య చేయించాడు. ఇలాంటివారు దేశమంతా ఎందరో ఉన్నారు. ఆరేళ్ల తర్వాత నల్లగొండ జిల్లా సెషన్స్ కోర్ట్ ఇచ్చిన తీర్పు... మనిషి కంటే కులమే గొప్పదని నమ్మే హైందవ నాగరాజులకు చెంప దెబ్బనే చెప్పాలి. ఈ అంశం సమాజానికి ఎన్నో విషయాలను మరోసారి బహిర్గతం చేసింది. మరీ ముఖ్యంగా తల్లి దండ్రులు–పిల్లల బాంధవ్యాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేదాన్ని సుస్పష్టం చేసింది. ఈ మధ్యకాలంలో రచయిత డా‘‘ స్టీఫెన్ ఆర్... ఒక పనిని ప్రారంభించే ముందు, దాని ముగింపును దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొన్నారు. అమృత తండ్రి మారుతీరావులో మొదలైన అల్లుణ్ణి హత్య చేయించాలనే ఆలోచన నేడు కొన్ని కుటుంబాల శోకానికి కారణమైంది. కన్న కూతురిపై అపారమైన ప్రేమను పెంచు కున్న మారుతీ రావు జీవితాన్ని కోల్పోయాడు. అతని భార్య భర్తను కోల్పోయింది. అతని కూతురు తండ్రిని కోల్పోయింది. ఇటు అమృత భర్తను కోల్పోయింది. ఆమెకు పుట్టిన బిడ్డకు కన్నతండ్రి లేకుండా పోయాడు. మొదటి ముద్దాయికి ఉరిశిక్ష ఖరారుఅయింది. మిగిలిన వారికి జీవిత ఖైదు విధించబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే అందరికీ శూన్యమే మిగిలింది. చదవండి : Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అహ్మదాబాద్‌లో హరేన్ పాండ్యా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అస్గర్ అలీ ఈ కేసులో కూడా నిందితుడు కావడం సామాన్య మనిషికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటి వ్యక్తులకు అసలు బెయిల్ మంజూరు కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ‘పరువా, కులమా... మీ చిరునామా ఎక్కడ’ అంటూ వెతికితే... దానికి సాహిత్యకారుల రచనల్లో సమాధానం దొరుకుతుంది. ‘ఎంచి చూడగా మనుజులందున మంచి– చెడులు అను రెండే కులములు’ అన్నాడు మహాకవి. సాటి మనిషిని మనిషిగా చూడలేని మనిషి మనోమందిరాలు ‘అపరిశుభ్ర విసర్జన శాలలుగానే’ మిగిలిపోతాయి. దీని ప్రక్షాళనకై అంతరంగ పారిశుద్ధ్య కార్మికులు కావాలి.– డా. ఉడుము ఝాన్సీ తెలుగు అధ్యాపకురాలు, ఆర్జీయూకేటీ, నూజివీడు -
అక్కా తమ్ముళ్లు సెట్స్‌లో ఉండకూడదు: దీప్తి గంటా
‘‘కోర్ట్’ సినిమా నచ్చకపోతే, తాను హీరోగా నటించిన ‘హిట్ 3’ సినిమా చూడొద్దని నానిగారు వేదికపై మాట్లాడినప్పుడు మేం షాక్ అయ్యాం. కానీ నాని అలా అన్నారంటే.. ‘కోర్ట్’ సినిమాపై నమ్మకం ఉంది కాబట్టే అంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలిగారు. పైగా రెండు (కోర్ట్, హిట్ 3) సినిమాలకూ నానీయే ఓ నిర్మాత... సోప్రాబ్లమ్ లేదు’’ అని అన్నారు దీప్తి గంటా.ప్రియదర్శి ప్రధాన పాత్రలో, రోషన్, శ్రీదేవి, శివాజీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. రామ్ జగదీశ్ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి గంటా సహనిర్మాత.కాగా ఈ సినిమా విడుదలకు రెండు రోజులు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో ఈ ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా చెప్పిన విశేషాలు.‘‘నాని, ప్రశాంతిగారు స్క్రిప్ట్ విని ఈ సినిమాను ఓకే చేశారు. ఈ కథ నాకూ నచ్చింది. దర్శకుడు జగదీశ్ రాసిన ‘కోర్ట్’ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ సినిమాకు నేను ఆన్సెట్ ప్రోడ్యూసర్‌గా జాయిన్ అయ్యాను. సెట్స్‌కు రోజూ వెళ్లేదాన్ని. జగదీశ్ చాలా పరిశోధన చేసి, ఈ సినిమా చేశారు. అందుకే నేచురల్‌గా వచ్చింది.పోక్సో చట్టం గురించి ఆయన చాలా వివరంగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు. ఇక మంగపతి క్యారెక్టర్లో శివాజీగారు అద్భుతంగా నటించారు. ఇంకా ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి... ఇలా ప్రతి పాత్రకు సినిమాలోప్రాముఖ్యత ఉంది. ‘మీట్ క్యూట్’ తర్వాత నేను యూఎస్‌కి వెళ్లిపోయాను. ఈ సినిమా కోసం మళ్లీ వచ్చాను.కొన్ని కథలు ఉన్నాయి. భవిష్యత్‌లో మళ్లీ దర్శకత్వం వహిస్తాను’’ అన్నారు దీప్తి. నాని ‘వాల్‌పోస్టర్ సినిమా’ బ్యానర్లోనే మీ డైరెక్షన్ మూవీ ఉండొచ్చా? అన్న ప్రశ్నకు– ‘‘నేను సినిమా చేస్తే నానితో చేయను. అక్కాతమ్ముళ్లు సెట్స్‌లో ఉండకూడదు’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు దీప్తి.నానిగారు పెద్దగా లెక్కలు వేయరు: ప్రశాంతి తిపిర్నేని‘‘కోర్ట్’ సినిమా ప్రీమియర్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మేం అనుకున్నదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుండటం హ్యాపీగా ఉంది. ఈ తరహా జానర్లోని మూవీని ఆడియన్స్ ఆదరించి, సక్సెస్ చేయడం కూడా మంచి పరిణామం. ప్రస్తుతానికి ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాం.నాని, నేను ఇద్దరం కథలు వింటాం. మా నమ్మకం అంతా నానిగారి జడ్జిమెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. నానిగారు పెద్దగా లెక్కలేమీ వేయరు. జానర్ ఏదైనా కథలో నిజాయితీ ఉండి, డైరెక్టర్లో క్లారిటీ ఉంటే చాలు ముందుకు వెళ్తాం. ఒక కథ థియేటర్స్‌లో చూడాలనిపించేలా ఉంటే చాలు... సినిమా చేసేందుకు నానిగారు ఒప్పుకుంటారు. నానిగారి సినిమాలు థియేటర్స్‌కు ముందే ఓటీటీ డీల్స్‌ను పూర్తి చేసుకుంటున్నాయంటే అది కథలపై తనకు ఉన్న జడ్జిమెంటే కారణం. ఇక ‘కోర్ట్’లో పోక్సో చట్టం ఎలా దుర్వినియోగం కావొచ్చనే పాయింట్‌ను దర్శకుడు జగదీశ్ అద్భుతంగా చూపించారు’’ అని ప్రశాంతి చెప్పారు. -
నాని సవాల్.. నా సినిమా సేఫ్ అంటూ డైరెక్టర్ ఆసక్తికర పోస్ట్!
‘కోర్ట్’(Court: Sate Vs A Nobody) సినిమా నచ్చకపోతే తను హీరోగా నటిస్తున్న ‘హిట్ 3’(Hit 3) చూడొద్దని నాని బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా నాని వ్యాఖ్యలపై హిట్3 దర్శకుడు శైలేశ్ కొలను స్పందిస్తూ నా సినిమా సేఫ్ అంటూ ఆసక్తికర పోస్ట్ చేశాడు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్‌జగదీశ్ తెరకెక్కించిన చిత్రం ‘కోర్ట్’. మార్చి 14న విడుదల కానున్న ఈ చిత్రానికి బుధవారం కొన్ని చోట్ల ప్రీమియర్ ప్రదర్శించగా పాజిటివ్ టాక్ వచ్చింది. డైరెక్టర్ శైలేశ్ కొలను కూడా ఈ సినిమా వీక్షించాడు. అనంతరం ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ.. తన హిట్ 3 సినిమా సేఫ్ అంటూ పోస్ట్ చేశాడు.‘నా సినిమా సేఫ్ (హిట్ 3). ‘కోర్ట్’ సినిమాలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. ఇది కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అందరూ చూడాల్సిన చిత్రమిది. మూవీ యూనిట్‌కు నా అభినందనలు. ప్రియదర్శి.. నువ్వు మరో విజయం సాధించావు. ఇక నా ‘హిట్ 3’ ఎడిట్ రూమ్‌కు వెళ్లాలి. అందరూ కోర్ట్ సినిమా చూడండి’’ అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌కు ‘మిర్చి’లో ప్రభాస్ పోస్టర్‌ను జోడించారు. మిర్చిలో ప్రభాస్ ‘నా ఫ్యామిలీ సేఫ్’ అని డైలాగు చెప్పే ఇమేజ్‌లను శైలేశ్ కొలను పంచుకున్నారు. ‘హిట్ 3’ సినిమా విషయానికొస్తే.. శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో అర్జున్ సర్కార్‌గా కనిపించనున్నారు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. Naaa cinema safe !!!! #CourtStateVsANobody is an emotionally riveting movie that is absolutely necessary for everyone cos there is so much to take back home. So proud to be associated with @walpostercinema @tprashantii and my man @NameisNani. One more feather in… pic.twitter.com/e13JAGLEJa— Sailesh Kolanu (@KolanuSailesh) March 12, 2025 -
Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ
టైటిల్:'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' నటీనటులు: ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి తదితరులుసమర్పణ: నానినిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమానిర్మాత: ప్రశాంతి తిపిర్నేనికథ, దర్శకత్వం: రామ్ జగదీష్సంగీతం: విజయ్ బుల్గానిన్సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్విడుదల తేది: మార్చి 14, 2025హీరో నాని ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కొత్త చిత్రాలను నిర్మిస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ద్వారా కొత్త కంటెంట్‌తో పాటు కొత్త నటీనటులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఆయన బ్యానర్లో తెరకెక్కిన చిత్రమే ‘కోర్ట్’. ‘‘కోర్ట్’ నచ్చకపోతే నా ‘హిట్ 3’సినిమా చూడకండి’ అంటూ నాని సవాల్ విసరడంతో ఈ చిన్న చిత్రంపై అందరిలో ఆసక్తి పెరిగింది. అంతేకాదు రిలీజ్‌కి రెండు రోజుల ముందే మీడియాకు స్పెషల్ షో వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతి(శివాజీ)కి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య(శుభలేఖ సుధాకర్) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త ఫ్యాషన్ దుస్తులు ధరించినా సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్ చదువుతున్న జాబిలి.. ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాచ్మెన్ కొడుకు చంద్రశేఖర్ అలియాస్ చందు(రోషన్)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మంగపతికి తెలిసి.. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు? జూనియర్ లాయర్ సూర్యతేజ(ప్రియదర్శి) ఎలాంటి సహాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతోంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కోర్ట్’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని రాజ్యాంగం చెబుతోంది. కానీ అదే చట్టాలను కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకులను జైలుపాలు చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ‘కోర్ట్’ సినిమా చూస్తున్నంతసేపు అలాంటి ఘటనలు గుర్తుకొస్తూనే ఉంటాయి. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని కొంతమంది ఎలా మిస్ యూజ్ చేస్తున్నారు? ఇలాంటి పవర్ఫుల్ చట్టాలలో ఉన్న లొసుగులను పోలీసులతో పాటు ‘లా’ వ్యవస్థ ఎలా వాడుకుంటుంది? పోక్సో చట్టం ఏం చెబుతోంది? అందులో ఉన్న ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? తదితర విషయాలను ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు రామ్ జగదీష్.దర్శకుడు ఎంచుకున్న టాపిక్ చాలా సెన్సిబుల్. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా చాలా నీట్‌గా ఆ టాపిక్‌ని చర్చించాడు. ఈ విషయంలో దర్శకుడిని ప్రశంసించాల్సిందే. అయితే కథనం మాత్రం ఊహకందేలా సాగించాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సీన్ మన ఊహకందేలా సాగుతుంది. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. అలాగే లవ్ స్టోరీని కూడా రొటీన్‌గానే చూపించాడు. కుర్రాడిపై పోక్సో కేసు నమోదైన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. బెయిల్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి చట్టంలోని లొసుగులు ఉపయోగించి లాయర్ దాము(హర్ష వర్ధన్) అడ్డుపడే విధానం ఆకట్టుకుంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో అవన్నీ అబద్దాలని తేలిపోతాయని తెలిసినా.. తెరపై చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తాయి. సెకండాఫ్ మొత్తం కోర్టు వాదనల చుట్టే తిరుగుతుంది. కొన్ని చోట్ల ప్రియదర్శి వాదనలు ఆకట్టుకుంటాయి. చిన్నచిన్న ట్విస్టులు కూడా ఎంటర్టైన్ చేస్తాయి. ఎమోషనల్ సీన్లను బలంగా రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో లా వ్యవస్థను ప్రశ్నిస్తూ ప్రియదర్శి చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఎవరెలా చేశారంటే.. ప్రియదర్శి నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్ర అయినా సరే నేచురల్ యాక్టింగ్‌తో అదరగొట్టేస్తాడు. జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో ఒదిగిపోయాడు. కోర్టులో ఆయన వినిపించే వాదనలు ఆకట్టుకుంటాయి. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన హర్ష రోషన్ ఈ సినిమాలో చందు పాత్ర పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జాబిలిగా కొత్తమ్మాయి శ్రీదేవి చక్కగా నటించింది. ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర శివాజీది అని చెప్పాలి. తెరపై ఆయన పండించిన విలనిజం సినిమా స్థాయిని పెంచేసింది. సాయి కుమార్, రోహిణి, శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలమైంది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నాని కాన్ఫిడెన్స్‌కి కారణం ఇదే : ‘కోర్ట్’ డైరెక్టర్
‘కోర్ట్’ కథ నానికి చెప్పడానికి దాదాపు 8 నెలల వెయిట్ చేశాను. ఫైనల్‌గా ఓ రోజు ఆయన నుంచి పిలుపొచ్చింది. దాదాపు రెండున్నర గంటల కథని సింగిల్ సిటింగ్ లో విన్నారు. కథ మొత్తం విని నిల్చుని షేక్ హ్యాండ్ ఇచ్చి 'వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా' అన్నారు. అది నా జీవితంలో హై మూమెంట్’ అని అన్నారు డైరెక్టర్ రామ్ జగదీష్. ఆయన ఆయన దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 14న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ జగదీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ ఈ కథ ఫోక్సో యాక్ట్ నేపథ్యంలో ఉంటుంది. నిజజీవితంలో ఇలాంటి ఒక కేసుని నేను పరిశీలించాను. ఆ కేసు గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా ఇలా కూడా ఉంటుందా అని సందేహంగా అనిపించింది. ఇలాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయని తెలిసింది. ఆ కేసులు అన్నిటి మీద కూడా రీసెర్చ్ చేశాను. ఏపీ తెలంగాణలో వందల కేసులు ఉన్నాయి. ఇవన్నీ స్క్రీన్ మీద అడ్రస్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఈ కథ కోసం చాలా కేసు ఫైల్స్ చదివాను. అన్ని కేస్ ఫైల్స్ లో ఉన్న మెటీరియల్ తో ఒక మంచి కథ చెప్పొచ్చు కదా అనిపించింది. అవన్నీ ఒక కథగా చేసి స్క్రీన్ పై చూపించడం జరిగింది.⇢ ఇది పర్టికులర్ ఒక పర్సన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కి సంబంధించిన కథ కాదు. చాలా సంఘటనల స్ఫూర్తి ఉంది. ఇది కంప్లీట్ గా ఫిక్షనల్ కథ. చదివిన కేసుల ఎసెన్స్ తో ఒక ఫిక్షనల్ స్టోరీ చేయడం జరిగింది.⇢ మనం గతంలో చాలా కోర్ట్ రూమ్ డ్రామాలు చూసాం. కానీ ఒక లవ్ స్టోరీ ని కోర్ట్ రూమ్ డ్రామాగా ఎప్పుడు చూడలేదని భావిస్తున్నాను. ఇందులో లవ్ స్టోరీ, కోర్ట్ రూమ్ డ్రామా చాలా ప్రత్యేకంగా ఉంటాయి.⇢ ఫోక్సో చాలా ముఖ్యమైన ఆక్ట్. నిజానికి ఆ చట్టం గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు. దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తే బాగుంటుందని అనిపించింది. అది ఈ సినిమాలో చూస్తారు.⇢ ఈ సినిమాలో అన్ని పాత్రలని ఆడిషన్స్ చేసి తీసుకున్నాం. చందు పాత్ర ప్లే చేయడానికి రోషన్ చాలా తపనపడ్డాడు. సెలెక్ట్ అయిన తర్వాత తను చేసిన ఫాలోఅప్ అద్భుతం. చాలా ఫ్యాషన్ చూపించాడు. చందు పాత్రని త్వరగానే క్లోజ్ చేసాం కానీ జాబిల్లి పాత్ర కోసం చాలా సెర్చ్ చేసాం. ఒక తెలుగు అమ్మాయి కావాలి, కొత్తగా ఉండాలి, సరైన ఏజ్ కావలి, నటన తెలిసి ఉండాలి ఇలాంటి కాంబినేషన్ ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నప్పుడు ఒక దశలో దొరకదేమో అనుకున్నాం. అలాంటి సమయంలో నా ఫ్రెండ్ ఒక ఇన్‌స్టా ప్రొఫైల్ పంపించాడు. అందులో రీల్స్ చూస్తున్నప్పుడు ఒక రీల్ లో తను జాబిల్లిలా కనిపించింది. అడిషనల్ చేసాం. ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యింది, ⇢ ఈ సినిమా ఐడియా మొదటగా ప్రియదర్శికే చెప్పాను. ఆయనకి చెప్పిన తర్వాత ఈ సినిమాని నేనే చేస్తాను. ఇంకా ఎవరికీ చెప్పొద్దు అన్నారు. ఆయనకే చెప్పాను. ఆయనతోనే చేశాను. ప్రియదర్శితో నాకు చాలా క్లోజ్ అసోషియేషన్. చాలా ఫ్రెండ్లీ గా ఉంటాం. తనతో అన్నీ షేర్ చేసుకోగలను.⇢ శివాజీ గారు మంగపతి క్యారెక్టర్ లో కనిపిస్తారు. ప్రతి ఫ్యామిలీలో అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ప్రతి ఒక్కరు మంగపతి అవుతారు. రియల్ లైఫ్ క్యారెక్టర్ లా ఉంటుంది.⇢ నాని గారు సినిమా చూశారు. అందుకే ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుందని చెబుతున్నాడు. సినిమాపై ఆయనకి ఉన్న కాన్ఫిడెన్స్ అది. ఆయన కాన్ఫిడెన్స్ అంతా సినిమా ఇచ్చిందే. నాని గారు సినిమా చూసి 'ప్రౌడ్ అఫ్ యూ జగదీశ్' అన్నారు. అది నాకు వచ్చిన బెస్ట్ కాంప్లీమెంట్⇢ ఇది కమర్షియల్ సినిమానే. సినిమా చూసి ఒకతను చుక్క రక్తం లేకుండా కమర్షియల్ సినిమా చూపించావ్ అన్నారు. ఆ మాట నాకు చాలా నచ్చింది.ఈ సినిమా మనందరి జీవితం. మనం తెలుసుకోవాల్సిన నిజం. స్క్రీన్ మీద మన జీవితమే ఉంటుంది. మనల్ని మనం తెరపై చూసుకోవడానికి సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. -
ఆరెంజ్ సినిమా నా ఫేవరేట్.. ఎందుకు ఫ్లాఫ్ అయిందో తెలియదు: ప్రియదర్శి
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కోర్ట్. విభిన్నమైన పాత్రలతో అభిమానులను మెప్పించే మరో కొత్త కథలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించనున్నారు. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ప్రియదర్శి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రియదర్శి.. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.ప్రియదర్శి మాట్లాడుతూ..' రామ్ చరణ్ నటించిన బెస్ట్ ఫిల్స్మ్‌లో ఆరెంజ్ అంటే ఇష్టం. ఆ సినిమా నాకు ఇన్స్పైరేషన్. అప్పుట్లో ఆ సినిమా అంత కలెక్షన్స్ వచ్చి ఉండవు. కానీ మొన్న రిలీజైనప్పుడు సూపర్‌గా ఆడింది. ఆ సినిమా ఎప్పుడొచ్చినా నేను, మా చెల్లి చూసేవాళ్లం. మీరు ఆరెంజ్ సినిమాలో సూపర్‌గా చేశారన్న అని చెప్పేవాన్ని. ఆ సినిమా నాకు ఇప్పుడిచ్చిన చేస్తా. నాకు ఇష్టమైన డైరెక్టర్ ఆయన. అప్పుడు ఎందుకు ఆడలేదో ఇప్పటికీ నాకు అర్థం కాదు. రెండోసార్లు థియేటర్లలో చూశా. ఓటీటీలో వచ్చినప్పుడు కూడా చూశా. ముఖ్యంగా రామ్ చరణ్ అన్న యాక్టింగ్ అంటే చాలా ఇష్టం' అని అన్నారు.కాగా.. కోర్ట్ సినిమాను పోక్సో కేసు ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. ఈ చిత్రంలో ప్రియదర్శి లాయర్‌గా అభిమానులను అలరించనున్నారు. పోక్సో కేసు అంటే ఏంటి? ఎలాంటి శిక్షలు ఉంటాయి? అనే కోణంలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. -
నానిగారు సలహాలు ఇచ్చేవారు: ప్రియదర్శి
‘‘కోర్ట్’ కథ నానిగారికి బాగా నచ్చింది. దీంతో నిర్మాణంలో ఏది కావాలన్నా ఏర్పాటు చేయమని నిర్మాతలు దీప్తి, ప్రశాంతిగార్లకు చెప్పారు. వారిద్దరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. దీప్తిగారు సెట్స్‌లో ఉండేవారు. నానిగారు మాత్రం అప్పుడప్పుడు మా సినిమా రషెస్ చూసి ఏౖవైనా సలహాలు, సూచనలు ఇచ్చేవారు’’ అని ప్రియదర్శి తెలిపారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కోర్ట్’.నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ–‘‘2022లో నేను, రామ్ జగదీష్ ‘కోర్ట్’ మూవీ గురించి మాట్లాడుకున్నాం. ఇందులో లాయర్ పాత్రని ఓ పెద్ద ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుందనుకున్నాడు జగదీష్. కానీ, నేనే చేస్తానని చెప్పడంతో సరే అన్నాడు. పోక్సో కేసు అంటే ఏంటి? ఎలాంటి శిక్షలు ఉంటాయి? అని చాలా పరిశోధన చేసి, ఈ మూవీ తీశాడు జగదీష్.ఈ చిత్రంలో నేను లాయర్ పాత్ర చేశాక వారిపై నాకు గౌరవం పెరిగింది. ‘కోర్ట్’ సినిమాపై ఉన్న నమ్మకంతోనే ‘ఈ చిత్రం నచ్చకపోతే నా ‘హిట్ 3’ చూడొద్దు’ అని నానిగారు చెప్పారు. నా లాంటి నటులు మంచి కథలు చేస్తేనే జనాలు థియేటర్స్‌కి వస్తారు.. లేదంటే రారు. ఏ సినిమా అయినా మంచి వసూళ్లు సాధిస్తే అది కమర్షియల్ హిట్టే.అలా ‘కోర్ట్’కి మంచి వసూళ్లు వస్తే నేను కమర్షియల్ హీరోనే(నవ్వుతూ). శాంతా బయోటెక్ ఫౌండర్ అండ్ చైర్మన్ కేఐ వరప్రసాద్‌గారి బయోపిక్ చేయాలని ఉంది. నేను నటించిన ‘సారంగపాణి జాతకం’ మూవీ ఏప్రిల్‌లో రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ‘ప్రేమంటే..’ మూవీ చేస్తున్నాను. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తాను’’ అని చెప్పారు. -
పోసాని కస్టడీ పిటిషన్ కొట్టివేత
సాక్షి,కర్నూలు.: కూటమి సర్కారు అక్రమంగా బనాయించిన కేసులో అరెస్టైన ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్టమురళీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు కోర్టు మేజిస్ట్రేట్. ఈ నెల ఆరో తేదీన జేఎఫ్‌సీఎం కోర్టులో ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. పోసానిని విచారించే క్రమంలో కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏడో తేదీన తీర్పును రిజర్వ్ చేసిన మేజిస్ట్రేట్.. ఇవాళ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్చు ఇచ్చారు. ఇక బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేశారు మేజిస్ట్రేట్.ఇదిలా ఉంటే, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు.పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్ జిల్లా ఆదోనీ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేశారు. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉంది.పోసాని క్వాష్ పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు -
Pranay Amrutha: ప్రణయ్ అమృత కేసులో రేపే తుది తీర్పు
సాక్షి,నల్లగొండ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో రెండో అదనపు సెషన్స్ కోర్టు,ఎస్సీ ఎస్టీ కోర్టు సోమవారం (మార్చి 10న) తుది తీర్పును వెలవరించనుంది. దీంతో ఈ కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యాధారాలను పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం వెల్లడించే తుదితీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇక కేసు విషయానికొస్తే.. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుసుకుందన్న నెపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబరు 14వ తేదీన ప్రణయ్‌ను హత్యచేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసుశాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తిచేసి 1600పేజీల్లో చార్జిషీట్ నివేదికను రూపొందించింది. 2019 జూన్ 12న చార్జిషీట్ దాఖలు చేయగా ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్‌కోర్టు విచారణ మొదలుపెట్టింది.సుమారు ఐదున్నర ఏళ్ల పాటు విచారణ కొనసాగగా, ఈ కేసులో ఇప్పటికే ఏ-1 మారుతీరావు 2020 మార్చి 7న ఖైరతాబాద్ వైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్‌తో పాటు సాక్షులను విచారించిన న్యాయస్థానం విచారించి తుది తీర్పును మార్చి 10వ తేదీకి రిజర్వు చేసింది. రేపు తుది తీర్పును వెలువరించనుంది.ఈ కేసులో ఏ-2 సుబాష్ శర్మ, ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ బారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్, ఏ-7 శివ, ఏ-8 నిజాంలుగా నిర్ధారించారు. సుబాష్ శర్మ, అస్గర్ అలీ మినహా మిగతా ఐదుగురు నిందితులు గతంలోనే బెయిల్ పొందారు. నిందితుల్లో అస్గర్ అలీ గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలక నిందితుడు. -
అందుకే బతిమాలుతున్నా: నాని
‘‘నా కెరీర్లో ఎప్పుడూ దయచేసి ఓ సినిమా చూడండి అని అడగలేదు. కానీ ‘కోర్టు’( Court Movie) లాంటి మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు మిస్ కాకూడదని చెబుతున్నాను.. అందరూ చూడాలని బతిమాలుతున్నాను’’ అని హీరో నాని(Nani ) చెప్పారు. ప్రియదర్శి ప్రధాన ΄ాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్టు’. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, ఇంద్రగంటి మోహన కృష్ణ, దేవ కట్టా అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ–‘‘కోర్టు’ సినిమాకి వెళ్లాక నా మాటలు మీ అంచనాలకి సరిపోలేదనిపిస్తే... రెండు నెలల్లో రిలీజ్ అవుతున్న నా ‘హిట్ 3’ సినిమాని ఎవరూ చూడొద్దు’’ అని కోరారు. ‘‘బలగం’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ‘కోర్టు’ చేయమని నాని అన్న చెప్పారు’’ అని ప్రియదర్శి తెలిపారు. ‘‘ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నాగ్ అశ్విన్, శ్రీకాంత్ ఓదెల. ‘‘నానీగారు వాల్ పోస్టర్ సినిమా ద్వారా నన్ను డైరెక్టర్‌గా పరిచయం చేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలి’’ అని ప్రశాంత్ వర్మ ఆకాంక్షించారు. ‘‘కోర్టు’ ట్రైలర్ చూశాక సినిమా అద్భుతంగా వచ్చిందనిపిస్తోంది’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘ఈ సినిమాని ఆడియన్స్ సెలబ్రేట్ చేసుకుంటారని భావిస్తున్నాను’’ అని దేవ కట్టా తెలిపారు. ‘‘కోర్టు’ చాలా అందమైన సినిమా’’ అన్నారు నిర్మాత దీప్తి. ‘‘కోర్టు’ మనందరికీ జీవితం. అందరూ థియేటర్స్‌కి రండి’’ అన్నారు రామ్ జగదీశ్. ‘‘ఈ సినిమా ప్రోమోస్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. అందరూ థియేటర్స్‌లో చూడాలి’’ అన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. నటీనటులు శ్రీదేవి, రోహిణి, సురభి ప్రభావతి, హర్ష రోషన్, శ్రీనివాస్ భోగిరెడ్డి, శివాజీ, డైరెక్టర్ శౌర్యువ్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్, లిరిక్ రైటర్ పూర్ణాచారి తదితరులు మాట్లాడారు. -
మరో కేసులో కోర్టుకు పోసాని
-
కోర్ట్ సినిమా ట్రైలర్ రిలీజ్
-
'కోర్ట్' సినిమా నచ్చకుంటే.. నా 'హిట్ 3'ని చూడొద్దు: నాని
ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. ఇందులో శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న హోలీ పండగ సందర్భంగా విడుదల కానుంది. హీరో నాని ప్రోడక్షన్ హౌస్ నుంచి ఈ సినిమా వస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో నానితో పాటు నాగ్ అశ్విన్, మోహనకృష్ణ ఇంద్రగంటి, ప్రశాంత్ వర్మ, శ్రీకాంత్ ఓదెల, శైలేశ్ కొలను, శౌర్యువ్ తదితరులు పాల్గొన్నారు.'కోర్ట్' సినిమా సమర్పకుడు నాని ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి 16ఏళ్లు దాటింది. దయ చేసి ఈ సినిమా చూడండి అని నేనెప్పుడూ అడగలేదు. తొలిసారి ఈ మాట ప్రేక్షకులను అడుగుతున్నాను. ఈ సినిమా నిర్మాతగా చెప్పడం లేదు, నా తెలుగు ప్రేక్షకులు ఒక మంచి సినిమా మిస్ అవ్వొద్దని కోరుకుంటున్నా. దయచేసి కోర్టు చిత్రాన్ని ఇంటిల్లిపాది చూడండి. కోర్టు చిత్రం చూసిన వారంతా గర్వంగా థియేటర్ల నుంచి బయటికి వస్తారు.'కోర్టు' సినిమా కంటే హిట్ 3పై పది రెట్లు ఖర్చుపెట్టాను. ఈ చిత్రం ప్రేక్షకులను అంచనాలను అందుకోకపోతే నా నెక్స్ట్ మూవీ 'హిట్3'ని ఎవరూ చూడొద్దు. ఇంతకంటే బలంగా మీకు చెప్పలేను. ఈ సినిమాతో మీరు తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఈ చిత్రంలోని పాత్రలతో ప్రతి ఒక్కరు కూడా ఎమోషన్‌తో కనెక్ట్ అయిపోతారు. ఆ పాత్రలతో పాటుగా మీరు కూడా నవ్వడమే కాకుండా ఏడిపించేస్తారు.' అని నాని అన్నారు. -
'కోర్ట్' ట్రైలర్ రిలీజ్.. సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్!
యాక్షన్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరో నాని.. నిర్మాతగానూ ఓ మూవీని విడుదలకు సిద్ధం చేశాడు. అదే 'కోర్ట్'. ప్రియదర్శి ప్రధాన పాత్రధారి. రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు. మార్చి 14న మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళ డార్క్ కామెడీ)ట్రైలర్ బట్టి చూస్తే.. తన కూతురితో ప్రేమలో ఉన్నాడనే కోపంతో ఓ తండ్రి.. ఓ కుర్రాడిపై కేసు పెడతాడు. ఏకంగా పోక్సో కేసు బనాయిస్తాడు. అలా 78 రోజుల పాటు జైల్లో మగ్గుతాడు. పోక్సో లాంటి సెన్సిటివ్ కేసు కావడంతో లాయర్స్ ఎవరూ ముందుకు రారు. అలాంటిది ప్రియదర్శి ఈ కేసు వాదించేందుకు సిద్ధమవుతాడు. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ అనిపిస్తుంది.నాని నిర్మాత అంటే కాస్త వైవిధ్యభరిత చిత్రాలే వస్తుంటాయి. 'కోర్ట్' ట్రైలర్ చూస్తుంటే సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలానే ఉంది. కోర్ట్ రూమ్ డ్రామాలు ఈ మధ్య కాలంలో తెలుగులో ఏం రాలేదు. రామ్ జగదీశ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు) -
Posani Krishna Murali : పోసాని కృష్ణమురళికి బెయిల్
సాక్షి,వైఎస్సార్ జిల్లా : ప్రముఖ నటుడు,రచయిత పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఓబులవారిపల్లి పీఎస్‌లో పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసులో బెయిల్ లభించింది. కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. ఓబులవారిపల్లి పీఎస్‌లో నమోదైన కేసులో పోసాని తరుఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. దీంతో పోసానికి ఊరట లభించినట్లైంది. -
మరణశయ్యపై తల్లి.. కూతురి దుర్మార్గంపై కోర్టు కన్నెర్ర
కన్నతల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. ఆ కూతురేమో దుర్మార్గంగా ఆలోచించింది. ఆస్తి కోసం బలవంతంగా ఆమెతో వీలునామాపై సంతకం చేయించుకుంది. అయితే సాక్ష్యంగా ఉంటుందని ఆ కూతురు తీయించుకున్న వీడియోనే.. ఈ బండారం మొత్తాన్ని బయట పెట్టింది. దీంతో కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది . యూకేలో ఓ వ్యక్తి మూడేళ్లపాటు చేసిన న్యాయ పోరాటం.. నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. సోదరుడిని మోసం చేసి ఆస్తి కొట్టేయాలని భావించిన ఓ మహిళకు పెద్ద షాకే తగిలింది. అతనికి 7 లక్షల పౌండ్ల విలువైన(మన కరెన్సీలో రూ.7 కోట్ల 86 లక్షల దాకా) విలువైన ఆస్తిపాస్తుల్లో సగం సోదరుడికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.కేసు ఇదే..మార్గరేట్ బేవర్స్టాక్(76) అనే మహిళ 2021 మార్చిలో కన్నుమూసింది. చనిపోయే టైంలో ఆమె తన ఆస్తి మొత్తం కూతురు లీసా పేరిట రాసింది. కొడుకు జాన్‌కు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. అయితే మతిమరుపు జబ్బుతో బాధపడుతున్న తన తల్లి.. సోదరికి మాత్రమే ఆస్తి ఎలా రాయగలిగిందని అతనికి అనుమానం వచ్చింది. ఆస్తిలో వాటా కోరుతూ.. సెంట్రల్ లండన్ కౌంటీ కోర్టులో పిటిషన్ వేశాడు.తన తల్లి 2014 నుంచే మతిమరుపు వ్యాధితో బాధపడుతోందని, ఆ వీలునామాపై అనుమానాలు ఉన్నాయని వాదించాడతను. అయితే తల్లి తన పేరిట రాసిన వీలుకు సంబంధించిన వీడియోను లీసా కోర్టులో ప్రవేశపెట్టింది. ఆ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి జేన్ ఇవాన్స్.. లీసాను గద్దించారు. అది బలవంతంగా చేయించుకున్నదేనని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆ వీడియోలో ఆమె అతి కష్టంగా మాట్లాడుతోంది. పైగా పెన్నును ఆమెతో బలవంతంగా పెట్టించుకున్నట్లు కనిపిస్తోంది. వీలు కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన కాపీలా ఉంది అని జడ్జి అభ్యంతరాలు వ్యక్తం చేశారు.జడ్జి కన్నెర్ర చేయడంతో లీసా నిజం ఒప్పుకుంది. అది ఆమె చనిపోతున్న సమయంలో తీసిందని తెలిపింది. తల్లికి ఉన్న ఆ జబ్బును ఆసరా చేసుకుని ఆస్తి మొత్తం కాజేయాలని ప్రయత్నించినట్లు చెప్పింది. సాక్ష్యంగా ఉండాలని ఆ టైంలో వీడియో కూడా తీయించుకున్నట్లు తెలిపింది. దీంతో ఆస్తిలో సగం వాటా.. సోదరుడు జాన్‌కు అప్పగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. జాన్‌కు అయిన కోర్టు ఖర్చులను కూడా లీసానే భరించాలని ఆదేశించింది. -
‘మెడలో తాళి, నుదుటున బొట్టు లేదు.. మీ భర్త మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారు’: కోర్టు
ముంబై : వాళ్లిద్దరూ భార్యా, భర్తలు. అయితే, భర్త తనని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు విడాకులు కావాలని కోరింది. ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో న్యాయమూర్తికి, మహిళకు మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పూణేకు చెందిన అంకుర్ ఆర్ జగిధర్ లాయర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ తన భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ తనని సంప్రదించిందని, అందుకే ఆమె తరుఫున వాదిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా తన క్లయింట్ కేసు పూణే జిల్లా కోర్టులో విచారణకు వచ్చిందని, విచారణ సమయంలో న్యాయమూర్తితో జరిగిన వాదనలను భార్య తరుఫు లాయర్ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో పూణే జిల్లా కోర్టులో ‘‘నా క్లయింట్ విడాకుల కేసు విచారణ జరిగింది. విచారణలో భర్త తన డిమాండ్లను నెరవేర్చాలని కోర్టును కోరింది. అయితే, ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి నా క్లయింట్‌ను ఇలా ప్రశ్నించారు. ‘‘ఏమ్మా.. మిమ్మల్ని చూస్తుంటే మొడలో మంగళసూత్రం, నుదుట బొట్టు పెట్టుకునేవారిలా కనిపించడం లేదే? వివాహం జరిగిన స్త్రీగా మీరు కనిపించకపోతే.. మీ వారు.. మిమ్మల్ని ఎలా ఇష్టపడతారు? అందుకే భర్తలతో ప్రేమగా ఉండండి. కఠువగా ఉండకండి అని సలహా ఇచ్చారు.అంతేకాదు.. మాటల మధ్యలో న్యాయమూర్తి ఇలా అన్నారు. ‘‘ఒక స్త్రీ బాగా సంపాదిస్తే, ఆమె ఎప్పుడూ తనకంటే ఎక్కువ సంపాదిస్తున్న భర్తనే కోరుకుంటుంది. తక్కువ సంపాదిస్తున్న వ్యక్తి చాల్లే అని సరిపెట్టుకోదు. అదే బాగా సంపాదించే వ్యక్తి తాను వివాహం చేసుకోవాలనుకుంటే, తన ఇంట్లో పాత్రలు కడిగే పనిమనిషినైనా సరే వివాహం చేసుకోవాలనుకుంటాడు. కాబట్టి మీరు మీ భర్త పట్ల కాస్త ప్రేమను చూపించండి. కఠినంగా ఉండొద్దు అని ఇద్దరు దంపతుల్ని ఒక్కటి చేసే ప్రయత్నం చేశారని వివరిస్తూ’’ సదరు న్యాయవాది రాసిన సోషల్ మీడియా పోస్టు నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. -
రాహుల్ గాంధీకి కోర్టు రూ.200 జరిమానా.. ఎందుకంటే?
లక్నో: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీకి (Rahul Gandhi) కోర్టు ఫైన్ విధించింది. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్‌సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాహుల్‌పై పరువు నష్టం దావా కేసు నమోదైంది. అయితే, ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ గాంధీ లక్నోలోని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (acjm)ముందు హాజరు కావాల్సి ఉంది.కానీ రాహుల్ కోర్టు విచారణకు గైర్హాజరయ్యారు. రాహుల్ తీరుపై ఏసీజేఎం న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.200 ఫైన్ విధించారు. ఇదే కేసులో ఏప్రిల్ 14న కోర్టు విచారణకు తప్పని సరిగా హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. -
పులివెందుల పోలీసులకు ఎదురుదెబ్బ
-
కోర్టులో పులివెందుల పోలీసులకు చుక్కెదురు
-
నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ముందు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం హాజరయ్యారు. బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని.. గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వీడియో విడదల చేసిన సంగతి తెలిసిందే.. ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్, నల్గొండలో కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం నాంపల్లి ప్రజాపత్రినిధుల కోర్టుకు రేవంత్‌రెడ్డి వెళ్లారు. తదుపరి విచారణను కోర్టు.. ఈ నెల 23కి వాయిదా వేసింది.


