సాక్షి, విజయవాడ: ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టైన ఐపీఎస్ అధికారి సంజయ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో ఆసంస్థకు చెందిన వెబ్‌పోర్టల్, మొబైల్ యాప్ అభివృద్ధి కాంట్రాక్ట్‌లో అవకతవకలు జరిగాయని ఆయనపై ఆరోపణలున్నాయి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న సంజయ్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది.
ఐపీఎస్ సంజయ్ కుమార్ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారంటూ సరిగ్గా 112 రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి బెయిల్ కోసం వివిధ కోర్టుల్లో పిటిషన్లు వేసినప్పటికీ బెయిల్ లభించలేదు. సంజయ్ కుమార్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో సీఐడీ చీఫ్‌గా ఉ న్నారు.
సీఐడీలో ఎస్పీ, ఎస్టీ అవగాహన కార్యక్రమాలకు టెండర్లు పిలిచి 1.15కోట్లు దుర్వినియోగం చేశారని 2025లో ఏసీబీ కేసు నమోదు చేసింది. అనంతరం రిమాండ్, కస్టడీ పొడిగింపులు జరిగాయి. 2025 నవంబర్‌లో సంజయ్ కుమార్ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగించారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ మే 2026 వరకు ఉంటుంది.


