ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా నిరసన బాట పట్టారు. ఈరోజు(సోమవారం, డిసెంబర్ 15వ తేదీ) పార్లమంట్ సమావేశాల్లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు.. అనంతరం ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి మకరద్వారం వద్ద ఫ్లకార్డులతో నిరసనకు దిగారు.
ఎంపీలు సుబ్బారెడ్డి ,మిథున్ రెడ్డి, గురుమూర్తి, అవినాష్ రెడ్డి, తనుజ రాణి, అయోధ్య రామిరెడ్డిలు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘ ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసాం. రాష్ట్రంలో కోట్లాది సంతకాలు సేకరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో గవర్నర్‌ను కలిసి కోటి సంతకాలు చేస్తాం. ప్రైవేటీకరణ వెనక్కి తీసుకేనేంతవరకూ పోరాటం కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు.
ప్రమాదకరస్థాయిలో ఏపీ అప్పులు..
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. 18 నెలల్లోనే రూ 2.66 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. అధిక వడ్డీకి అప్పులు తెచ్చి కుంభకోణానికి పాల్పడుతున్నారు. 9 శాతానికి వడ్డీ తెచ్చి ప్రజలపై భారం వేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి అప్పులు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిధి నుంచి డబ్బులు డ్రా చేసే అవకాఃశం ప్రైవేటు వ్యక్తులకు కల్పించడం దారుణమన్నారు. ప్రభుత్వం చేతుల్లోనే వైద్య రంగం ఉండాలని, ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలన్నారు. రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు చేసిన ఏపీ ప్రభుత్వం.. వైద్య కళాశాలను కాపాడలేదా? అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
కోటి సంతకాలు.. కోట్ల గళాలు


