breaking news
Medical Colleges Privatization
-
‘చంద్రబాబు మార్క్ దోపిడీకి ఇదే నిదర్శనం’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు మార్క్ దోపిడీకి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే నిదర్శనమని, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు ప్రజారోగ్యాన్ని, వైద్య విద్య అభ్యసించాలన్న పేద విద్యార్థుల కలను పణంగా పెడుతున్నాడని మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరిగితే యూజర్ చార్జీల రూపంలో ప్రజలపై పెనుభారం మోపడం ఖాయమని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచితంగా అందిన వైద్య సేవలన్నీ రాబోయే రోజుల్లో డబ్బులు చెల్లించి పొందాల్సిన పరిస్థితి వస్తుందని వివరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని, ఈ ఉద్యమంతో కూటమి నాయకుల్లో వణుకు మొదలైందని చెప్పారు. కాబట్టే దాన్ని తక్కువ చేసి చూపించేలా కూటమి నాయకులతో సంతకాలు చేసిన ప్రజలను సైకోలు అని తిట్టిస్తూ చంద్రబాబు రోజురోజుకీ దిగజారిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణపై విచారణ జరిపి అవినీతికి పాల్పడిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం ఖాయమన్నారు.ఆమె ఇంకా ఏమన్నారంటే...మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి వచ్చిన స్పందన చూసి కూటమి నాయకుల గుండెల్లో వణుకు పుడుతోంది. అందుకే చంద్రబాబు అండ్ కో ప్రజా స్పందనను తక్కువ చేసి చూపించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సైతం మెడికల్ కాలేజీల ఆవశ్యకతను నొక్కి వక్కాణిస్తూ చెప్పినా ఈ ప్రభుత్వం తీరులో మార్పు కనిపించడం లేదు. కమీషన్ల పేరుతో దోచుకోవడమే లక్ష్యంగా ప్రైవేటీకరణ ముద్దు- ప్రభుత్వ కాలేజీలు వద్దు అనేలా ముందుకు సాగుతున్నాడు. కోటికిపైగా సంతకాలు చేసిన విద్యార్థులు, యువత, మేథావులను సైకోలు, దొంగలు అని కూటమి పార్టీ నాయకులతో చంద్రబాబు తిట్టిస్తున్నాడు. మెడికల్ కాలేజీలు వద్దని సంతకాలు చేసిన 1,04,11,136 మంది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు.ప్రజా పాలన పట్ల బాధ్యత మరిచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు చెంప చెళ్లుమనిపించేలా, కూటమి ప్రభుత్వాన్ని బండకేసి బాదినట్టు ప్రజలు సంతకాలు చేశారు. సంతకాల రూపంలో తమ ఆవేదనను వ్యక్తం చేసిన ప్రజాభిప్రాయాన్ని పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పీపీపీ ముసుగులో జరుగుతున్న ప్రజా దోపిడీని ఆయనకు వివరించారు. గవర్నర్ కూడా ప్రజల ఆవేదనను అర్థం చేసుకున్నారు. పీపీపీ మోడల్లో చంద్రబాబు తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం కోట్లాదిమంది ప్రజల ఆరోగ్యానినికి గొడ్డలిపెట్టు లాంటిది. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు ప్రజాభిప్రాయాన్ని గ్రహించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దీనిపై న్యాయస్థానాల్లో వైఎస్సార్సీపీ పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం. విద్య, వైద్యం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. దాన్ని చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్తోంది. మాకొద్దు బాబోయే అని కోటి మందికిపైగా సంతకాలు చేసి చెప్పినా, ఇప్పటికీ పీపీపీ గొప్ప అన్నట్టు చంద్రబాబు ప్రచారం చేసుకోవడం నిరంకుశత్వానికి నిదర్శనం.లా అండ్ ఆర్డర్ కూడా ప్రైవేటుపరం చేస్తారా?రాష్ట్రంలో అతి ముఖ్యమైన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసిన చంద్రబాబు.. శాంతి భద్రతల విభాగాన్ని ప్రైవేటుపరం చేస్తారేమో చెప్పాలి. పీపీపీ మోడల్లో రోడ్లు నిర్మాణం చేసి టోల్ ట్యాక్స్ వసూలు చేసినట్టుగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తర్వాత హెల్త్ ట్యాక్స్ వసూలు చేయకుండా ఉంటారా? అందులో భాగంగానే ప్రభుత్వ వైద్యారోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. యూజర్ చార్జీల రూపంలో ప్రజల మీద భారం మోపడానికే చంద్రబాబు ఈ పీపీపీ మోడల్ తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగించేస్తున్నాడు. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉంది. గత టీడీపీ పాలనలోనూ ప్రైవేటుమయంప్రజల ఆరోగ్య భద్రత విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడలేదు. గతంలో రాష్ట్రంలో 260 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉండగా వాటి నిర్వహణకు ప్రతినెలా రూ. 4.50 లక్షల చొప్పున కేటాయించి చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటుకి అప్పగించింది. అయినా వాటి ద్వారా ప్రజలకు అందిన వైద్య సేవలు ఏమాత్రం ఉండేవి కాదు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూహెచ్‌సీల సంఖ్యను 560కి పెంచడంతోపాటు నాడు- నేడు ద్వారా వాటిని ఆధునికీకరించి ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. 24 బై 7 పనిచేసేలా వైద్యులను అందుబాటులో ఉండటంతోపాటు అన్నిరకాల వైద్యపరికరాలు, మందులను సమకూర్చడం జరిగింది.రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో 10,032 వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లీనిక్‌లను ఏర్పాటు చేశాం. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా నేరుగా డాక్టర్నే ప్రజల ఇంటికి పంపించడం కూడా వైఎస్ జగన్ వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో ఒకటి. నాడు మా ప్రభుత్వ హయాంలో ఉచితంగా రక్త పరీక్షలను నిర్వహిస్తే నేడు చంద్రబాబు వాటిని ప్రైవేటుపరం చేశాడు. ఏడాదికి రూ. 1000 కోట్లు చెప్పున రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తవుతాయని తెలిసినా అందుకు పూనుకోకుండా ప్రైవేటీకరణకే మొగ్గుచూపడానికి ప్రధాన కారణం కూడా కమీషన్ల కోసమే.ఇదేం తెలివితక్కువ విశ్లేషణ చంద్రబాబూ..పీపీపీ మోడల్ ను సమర్థించుకోవడానికి చంద్రబాబు చెబుతున్న మాటలు చూస్తే ఎవరికైనా అనుమానాలు కలగకుండా ఉండవు. ప్రభుత్వ పెత్తనం అని తెలుగులో చెప్పి ప్రైవేట్ మేనేజ్మెంట్ అని ఇంగ్లిష్‌లో చెబుతున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిందని తెలిసినా అడ్డగోలు విశ్లేషణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. 50 ఎకరాల మెడికల్ కాలేజీల భూములను ఎకరం వంద రూపాయలకు 66 ఏళ్లపాటు లీజుకివ్వడాన్ని ప్రజలెవరూ హర్షించడం లేదు. దీంతోపాటు మెడికల్ కాలేజీల పెత్తనం ప్రైవేటుకిచ్చి నిర్వహణకు అయ్యే ఖర్చును మాత్రం ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఇలా స్కాంల మీద స్కాంలు చేస్తూ వైద్యవిద్యార్థుల ఆశలను, పేద ప్రజల ఆరోగ్యాన్ని అందని ద్రాక్షగా మార్చేస్తున్నాడు. చంద్రబాబు మార్క్ ఆస్తుల దోపిడీకి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే పెద్ద ఉదాహరణ. ఇవన్నీ చూస్తుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ముసుగులో వేల కోట్లు చేతులు మారుతున్నాయని ఎవరికైనా స్పష్టంగా అర్థమైపోతుంది.అందుకే మా నాయకులు వైఎస్ జగన్ దీన్ని మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దీనిపై విచారణ జరిపి అవినీతికి ఎవరు పాల్పడినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలే ప్రసక్తే ఉండదు. తప్పు చేసిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరుతామని విడదల రజిని హెచ్చరించారు. -
ఇది అంతం కాదు ఆరంభం.. ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
-
జగన్ చరిత్ర సృష్టిస్తే.. నువ్వు చరిత్ర హీనుడిగా మిగిలిపోయావ్
-
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్‌కు అందజేత
-
రాష్ట్ర చరిత్రలో గొప్ప ఉద్యమం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. కాలేజీలను ప్రైవేటువారికి ఇప్పించడమే కాకుండా వాటిలో పనిచేసే సిబ్బందికి రెండేళ్లు చంద్రబాబు సర్కారే వేతనాలు ఇస్తుందట..! ఇదో మరో స్కామ్ అని స్పష్టం చేశారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించిందని.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. ప్రభుత్వ రంగంలోనే వాటిని నిర్మించి నడపాలని డిమాండ్ చేస్తూ 1,04,11,136 మంది సంతకాలు చేసి ఉద్యమాన్ని విజయవంతం చేశారని వెల్లడించారు. ఈ ప్రజా ఉద్యమానికి వచ్చిన స్పందన చూసైనా చంద్రబాబు సర్కార్ వాస్తవాలు గుర్తించి.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిర్ణయం మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే తాము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. స్కామ్‌కు పాల్పడిన వారిని జైళ్లకు పంపుతామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వారిపై అన్ని చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటికి పైగా సంతకాలతో కూడిన వాహనాలకు గురువారం ఉదయం వైఎస్ జగన్ జెండా ఊపి లోక్‌భవన్‌కు పంపారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, సీనియర్ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..చరిత్రలో నిల్చిపోయే ఘట్టంకోటి సంతకాల సేకరణలో మీ కృషి, మీ అందరినీ అభినందించేందుకు ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఇక్కడి నుంచి మొదలు పెడితే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు, గ్రామస్థాయిలో కార్యకర్తల వరకు అంతా నిబద్ధతతో పని చేశారు.రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలని, ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తేవాలనే పట్టుదలతో చేపట్టిన ఇంత గొప్ప ఉద్యమం బహుశా రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరిగి ఉండదు. ఇన్ని సంతకాలు సేకరించడం, నిజంగా రాష్ట్ర చరిత్రలో నిల్చిపోయే ఘట్టం. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా.స్కామ్ చేసిన వారెవరినీ వదలం..గవర్నర్‌కు ఈ పత్రాలన్నీ చూపించిన తర్వాత, ఆయనకు చెప్పిన తర్వాత ఈ పత్రాలతో కోర్టు తలుపు కూడా తడతాం. ఆ మేరకు కోర్టులో పిటిషన్ వేస్తాం. మీరెప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు (కోటి సంతకాల పత్రాలు) మీకు చూపించడం కోసం సిద్ధంగా ఉంటామని కోర్టుకు నివేదిస్తాం. కానీ ఇంతటితో చంద్రబాబుకు జ్ఞానోదయం అవుతుందని నేను అనుకోవడం లేదు. గతంలో ఎన్.జనార్ధన్‌రెడ్డి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వడంతో ఏకంగా ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈయనకు (చంద్రబాబు) సిగ్గు లేదో ఇంకొకటి లేదో! ఎడాపెడా గవర్నమెంట్ ఆస్తుల్ని ఇచ్చేస్తూ స్కాములు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు! మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా చంద్రబాబు వినకుండా దీన్ని ముందుకు తీసుకుని పోతే మాత్రం.. ఈ స్కామ్‌లో ఉన్న వారంతా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు నెలలు తిరక్క ముందే జైళ్లలో ఉంటారు. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితం అవుతుంది. గవర్నర్‌తో భేటీ తర్వాత కోర్టుల్లో చేసే యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈలోపు చంద్రబాబునాయుడు ఇంకా మనసు మార్చుకోకుండా ముందుకు అడుగులు వేస్తే చూస్తూ ఊరుకోం. మళ్లీ నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం. మళ్లీ ప్రజల మధ్యన నిల్చుని ఉద్యమాలు చేసే కార్యక్రమం కొనసాగుతుంది. బాబు చేసిన మంచి.. బోడి సున్నా!గవర్నమెంట్ స్కూళ్లు, గవర్నమెంట్ హాస్పిటళ్లు ఎందుకు నడుపుతోంది అని అనుకునే మనిషి బహుశా చంద్రబాబు మినహా ప్రపంచంలో ఎవరూ ఉండరు. నాడు.. మనం ఉన్నాం కాబట్టి ఆర్టీసీ బతికింది. కార్మికులందరినీ గవర్నమెంట్లో విలీనం చేశాం. ఇంతకుముందు ఎన్నికల్లో మనం అధికారంలోకి రాకపోయి ఉంటే, చంద్రబాబునాయుడు వచ్చి ఉంటే ఆర్టీసీని కూడా అమ్మేసుండేవారు. మొన్న ఆశ్చర్యకరంగా ఒకమాట విన్నా.. పోలీస్ శాఖను కూడా ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం చేస్తాడట. శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వ ఆధ్వర్యంలో లేకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నోటి నుంచి నిన్న (బుధవారం) కలెక్టర్ల సదస్సులో వచ్చిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రజల్లో ఆయన గ్రాఫ్ పడిపోతోంది. దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగా లేదని వారిపై నెపం వేస్తున్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టగా వచ్చే మార్చిలో మూడో బడ్జెట్ పెడుతున్నారు. మరి ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అంటే? బోడి సున్నా కనిపిస్తుంది.అప్పటిదాకా ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని స్కీములూ రద్దయిపోయాయి. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ వివిధ విభాగాలకు చెందిన నేతలు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటమే: వైఎస్ జగన్
మా హయాంలో ప్రతి చోటా 50 ఎకరాలు ఉండేలా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. వాటికి నాబార్డ్, ఇతర బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ నిధులు టైఅప్ చేశాం. వాటిలో 7 కాలేజీలు పూర్తి కూడా చేశాం. అవి ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్నాయి. వాటి ద్వారా 800మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన కాలేజీలు పూర్తి చేసేందుకు ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు అవసరం. మరి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ మాత్రం నిధులు ఖర్చు చేయలేదా? పోనీ మీరు ఖర్చు చేయలేకపోతే వదిలేయండి.. మేం వచ్చాక వాటిని పూర్తి చేస్తాం. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్“మా పోరాటం ఇంతటితో ఆగదుగవర్నర్కు కోటి సంతకాలు చూపించాం. రేపు కోర్టులో పిటిషన్ వేస్తాం. అక్కడ కూడా ఈ కోటి సంతకాలు చూపిస్తాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం...“మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే ఒక స్కామ్ అయితే, ఆ తర్వాత రెండేళ్ల పాటు ఆ కాలేజీల సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం మరో స్కామ్. అంటే.. అక్కడున్న భూమి, భవనాలు, పని చేసే వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, నిర్వహణ మాత్రం ప్రైవేటువారిది.ఖర్చు ప్రభుత్వానిది.. సంపద మాత్రం ప్రైవేటువారికి. ఒక మెడికల్ కాలేజీలో జీతాలు ఏడాదికి కనీసం రూ.60 కోట్లు... రెండేళ్లకు రూ.120 కోట్లు అవుతాయి. ఆ లెక్కన 10 మెడికల్ కాలేజీల సిబ్బందికి రెండేళ్లపాటు జీతంగా కనీసం రూ.1,200 కోట్లు అవుతుంది. ఇలాంటి స్కామ్‌లు దేశంలో ఎక్కడా ఉండవు...’’“మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో బాబు చేస్తున్న అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కూడా ఆయనకు తెలియజేశాం. ఈరోజు ఒక చరిత్రాత్మక ఘట్టం. ఏకంగా 1,04,11,136 సంతకాలు సేకరించాం. దేశ చరిత్రలో కూడా ఇలాంటి ఉద్యమం జరిగి ఉండదేమో..’’“నిజానికి ఆ మెడికల్ కాలేజీలన్నీ భవిష్యత్‌లో రూ.లక్ష కోట్ల విలువైన ఆస్తి అవుతాయి. కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం అందిస్తూ, వెల కట్టలేని సేవలందిస్తూ కోట్లాది మందిలో వెలుగులు నింపుతాయి..’’“అందరం కలసికట్టుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుందాం. మనం ఇప్పుడు ఆ పని చేయకపోతే, రేప్పొద్దున వైద్యం కోసం ఒక్కొక్కరు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది’’“మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు ప్రతి ద్వారం తొక్కుతాం. కోర్టుల ద్వారా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఉద్యమం కొనసాగుతుంది. ప్రజలతో కలసి పోరాటం కూడా చేస్తాం. ఇది కచ్చితంగా స్కామే’’రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గవర్నర్‌కు నివేదించామని, ఈ పోరాటం ఇంతటితో ఆగదని.. న్యాయ పోరాటం.. ప్రజల్లోకి వెళ్లి పోరాటం కూడా చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులతో కూడిన 26 వాహనాలను లోక్‌భవన్‌కు తరలించారు. గవర్నర్ కార్యాలయ అధికారులు కె.రఘు (డిప్యూటీ సెక్రటరీ టు గవర్నర్), ఎన్.వెంకటరామాంజనేయులు (ఏడీసీ) ఆ పత్రాలు పరిశీలించారు.వాటన్నింటినీ వైఎస్ జగన్ తన భేటీలో గవర్నర్‌కు చూపారు. తాడేపల్లి లోని తన నివాసం నుంచి బయలు దేరిన వైఎస్ జగన్ నేరుగా తొలుత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని సందర్శించి నివాళులర్పించారు.సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబూ..! ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేయడం మీకు చేతకాకపోతే.. అలా వదిలేయండి. మేం వచ్చాక వాటిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. అంతేకానీ వాటిని పూర్తి చేస్తే ఎక్కడ మాకు మంచి పేరు (క్రెడిట్) వస్తుందోననే ఆలోచనతో ప్రైవేటీకరణ చేయడం మంచి పద్ధతి కాదు..’’ అని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు.చంద్రబాబు సర్కారు అసంబద్ధ నిర్ణయం భవిష్యత్తు తరాలకు పెను శాపంగా మారుతుందని హెచ్చరించారు. భూమి.. మెడికల్ కాలేజీ.. ఆస్పత్రి.. అన్నీ ప్రభుత్వానివే.. ఉద్యోగులూ గవర్నమెంట్‌వారే.. చివరకు జీతాలు ఇచ్చేదీ ప్రభుత్వమే..! ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేట్ వ్యక్తులు..! ఇది స్కామ్ కాకపోతే మరేమిటి? ప్రపంచంలో ఇలా ఎక్కడైనా ఉందా..? ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్..! అని మండిపడ్డారు.కొత్త వైద్య కాలేజీలు, ఆస్పత్రులను కట్టబెట్టడమే కాకుండా ఒక్క జీతాల రూపంలోనే రూ.1,200 కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రూ.5 వేల కోట్లతో ప్రభుత్వమే ఆ మెడికల్ కాలేజీలను పూర్తి చేసే వీలున్నా స్కామ్‌ల కోసం ప్రైవేట్‌పరం చేస్తున్నారని మండిపడ్డారు.పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లతో కూడిన 40 మంది నేతల బృందంతో గురువారం లోక్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణను వివరించారు.మెడికల్ కాలేజీల విషయంలో ఈ ప్రభుత్వం ఎలాగైనా తన నిర్ణయం మార్చుకునేలా చూడాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అన్ని వివరాలతో ఒక వినతిపత్రం సమరి్పంచారు. గవర్నర్‌తో సమావేశం ముగిసిన తర్వాత లోక్‌భవన్ వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు సర్కారు చేస్తున్న అన్యాయాలు, మోసాలు, స్కామ్‌లను గవర్నర్ దృష్టికి తేవడంతోపాటు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ఆయనకు అర్థమయ్యేలా వివరించామని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై గవర్నర్ చాలా బాధపడ్డారని.. సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రజల మనోభావాలు గవర్నర్‌కు నివేదించాంమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కూడా ఆయనకు తెలియజేశాం. ఈరోజు ఒక చరిత్రాత్మక ఘట్టం. ఏకంగా 1,04,11,136 సంతకాలు సేకరించాం. దేశ చరిత్రలో కూడా ఇలాంటి ఉద్యమం జరిగి ఉండదేమో. గత అక్టోబరు 7న ప్రజా ఉద్యమ కార్యాచరణను ప్రకటించాం.అక్టోబరు 10 నుంచి ఈనెల 10 వరకు ప్రతి గ్రామం, పట్టణం, ప్రతి వార్డులో రచ్చబండ కార్యక్రమాల ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వారిని ఉద్యమంలోకి తీసుకువచ్చాం. వాళ్ల సంతకాలు తీసుకున్నాం. నవంబర్ 12న ఒకసారి, మళ్లీ ఈనెల 10న మరోసారి అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించాం.10న ర్యాలీల తర్వాత కోటి సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాలకు తరలించాం. అక్కడ డిసెంబరు 15న ర్యాలీలు నిర్వహించి వాటిని ప్రజలకు చూపాం. ఆ తర్వాత వాటన్నింటినీ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించి, ఈరోజు (గురువారం) గవర్నర్ గారికి చూపించాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల నిరసన, వారి మనోభావాలను గవర్నర్‌కు వివరించాం. అసంబద్ధంగా ప్రభుత్వ నిర్ణయం..ఈ రోజు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నా. మనం తీసుకునే నిర్ణయాలతో భవిష్యత్ తరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ ఎందుకు నడుపుతుంది? దేశంలో అన్ని చోట్లా స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను ప్రభుత్వమే ఎందుకు నడుపుతుందో ఆలోచించారా? రాష్ట్ర ప్రభుత్వం కనుక వీటిని నడపకపోతే.. పేద, మధ్య తరగతి వారు ప్రైవేటు దోపిడీకి గురై, వారు భరించలేని స్థాయికి వెళ్లిపోతాయి. ఆశ్రయించలేక నష్టపోతారు.అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఒక బాధ్యతగా భావించి నిర్వహిస్తాయి. అన్నీ ప్రైవేటీకరిస్తూ పోతే దోపిడీకి చెక్ పడదు. ప్రజలు సేవలు పొందాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇన్‌పేషంట్‌గా చేరాలంటే కనీసం రూ.5 వేలు చార్జ్ చేస్తారు. కనీస వసతులతో రూమ్ కావాలంటే రోజుకు రూ.10 వేలు, ఐసీయూలో రోజుకు రూ.30వేల నుంచి రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఈ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయం.మెడికల్ కాలేజీతో ఉచితంగా అత్యుత్తమ వైద్య సేవలు..మా ప్రభుత్వ హయాంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో కొత్త మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టాం. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే, అక్కడ టీచింగ్ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఆ ఆస్పత్రిలో, మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్స్, మెడికోస్, నర్సింగ్ స్టూడెంట్లు.. అందరూ అందుబాటులో ఉంటారు.దీంతో పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. దాని వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టం వచి్చనట్లు ఛార్జ్ చేయలేవు. మేం నాడు తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలన్నీ ప్రారంభమైతే మన పిల్లలకు మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దాని వల్ల వైద్య విద్య చదవాలని కోరుకునే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.నిధుల కొరత అబద్ధం..మా హయాంలో ప్రతి చోటా 50 ఎకరాలు ఉండేలా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. వాటికి నాబార్డ్, ఇతర బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ నిధులు టైఅప్ చేశాం. వాటిలో 7 కాలేజీలు పూర్తి కూడా చేశాం. అవి ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్నాయి. వాటి ద్వారా 800 మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన కాలేజీలు పూర్తి చేసేందుకు ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు అవసరం. మరి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ మాత్రం నిధులు ఖర్చు చేయలేదా?పోనీ మీరు ఖర్చు చేయలేకపోతే వదిలేయండి.. మేం వచ్చాక వాటిని పూర్తి చేస్తాం. చంద్రబాబుకు గట్టిగా తగిలేటట్టుగా గవర్నర్‌గారి దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్లాం. మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే, మాకు క్రెడిట్ దక్కుతుందన్న అక్కసుతో చంద్రబాబు పేదలకు నష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటీకరణతో స్కామ్‌లు చేస్తున్నారు. నిజానికి ఆ మెడికల్ కాలేజీలన్నీ భవిష్యత్‌లో రూ.లక్ష కోట్ల విలువైన ఆస్తి అవుతాయి. కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం అందిస్తూ, వెల కట్టలేని సేవలందిస్తూ కోట్లాది మందిలో వెలుగులు నింపుతాయి.కలసి కట్టుగా అడ్డుకుందాం..చంద్రబాబు తోలు మందం కాబట్టి ఆయన మారకపోవచ్చు. కాబట్టి అందరూ కలసి రావాలి. అందరం కలసికట్టుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుందాం. మనం ఇప్పుడు ఆ పని చేయకపోతే, రేప్పొద్దున వైద్యం కోసం ఒక్కొక్కరు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. గవర్నర్‌కు గానీ, మనసున్న ఏ వ్యక్తికైనాగానీ చంద్రబాబు చేసేది తప్పు అని అర్థమవుతుంది. ఇదే గవర్నర్ ఇంట్లో పని చేసే వ్యక్తులు మెడికల్ కాలేజీకి వెళ్తే ఉచితంగా వైద్యం అందుతుంది. గవర్నర్‌ది మంచి మనసు. ఆయన అన్నీ అర్థం చేసుకున్నారు.న్యాయ పోరాటం.. ప్రజా పోరాటం..మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు ప్రతి ద్వారం తొక్కుతాం. కోర్టుల ద్వారా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఉద్యమం కొనసాగుతుంది. ప్రజలతో కలసి వీధి పోరాటం కూడా చేస్తాం. ఇది కచ్చితంగా స్కామ్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే ఒక స్కామ్ అయితే, ఆ తర్వాత రెండేళ్ల పాటు ఆ కాలేజీల సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం మరో స్కామ్.అంటే.. అక్కడున్న భూమి, భవనాలు, పని చేసే వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, నిర్వహణ మాత్రం ప్రైవేటువారిది. ఖర్చు ప్రభుత్వానిది.. సంపద మాత్రం ప్రైవేటువారికి. ఒక మెడికల్ కాలేజీలో జీతాలు ఏడాదికి కనీసం రూ.60 కోట్లు... రెండేళ్లకు రూ.120 కోట్లు అవుతాయి. ఆ లెక్కన 10 మెడికల్ కాలేజీల సిబ్బందికి రెండేళ్లపాటు జీతంగా కనీసం రూ.1,200 కోట్లు అవుతుంది. అన్నీ ప్రభుత్వానివే.. అప్పగించేది మాత్రం ప్రైవేటు వ్యక్తులకా? ఇలాంటి స్కామ్‌లు ప్రపంచంలో ఎక్కడా ఉండవు..!పైగా ప్రజలను మోసం చేసేందుకు.. డైవర్షన్ చేసేందుకు.. కళాశాలలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతూ గవర్నమెంట్ పేరు పెడతాడట! రేప్పొద్దున హెరిటేజ్ కంపెనీ ముందు గవర్నమెంట్ పేరు పెట్టి కింద హెరిటేజ్ అని చిన్నగా పేరు పెడితే ఆ హెరిటేజ్ కంపెనీ ప్రభుత్వానిది అయిపోతుందా? అందరూ ఆలోచన చేయాలి. ప్రజలంటే ఎలా కనిపిస్తున్నారు? మరీ ఇంత దారుణంగా చెవిలో పూలు పెడితే ఎలా?సూపర్ 6 ఒక మోసం.. సూపర్–7 ఒక మోసం.. ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ ఇస్తూనే, వాటికి అదనంగా సూపర్ సిక్స్, సెవన్ ఇస్తామన్నారు. ఇప్పుడు చూస్తే పలావు పోయింది... బిర్యాని పోయింది!ప్రజలు పూర్తిగా రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు.. డిసెంబర్ నెల ముగిస్తే 8 క్వార్టర్స్ బకాయిలు ఇవ్వాలి. విద్యాదీవెన లేదు.. వసతి దీవెన లేదు... పిల్లలు చదువులు మానేస్తున్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలు (జీఈఆర్) తగ్గాయి. ఆరోగ్యశ్రీ లేదు.. నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వక పోవడంతో బోర్డులు తిప్పేశారు. మరోవైపు గవర్నమెంట్ ఆస్పత్రులు దారుణంగా ఉన్నాయి.ఒక్కరోజు యోగాకు 330 కోట్లా?- మ్యాట్లు మీరు కొన్నదెంత?.. అమెజాన్‌లో ఉన్నదెంత?‘‘రుషికొండలో రూ.230... రూ.240 కోట్లతో కట్టిన భవనాలు విశాఖకు మణిహారంగా మారాయి. విశాఖకు ఆ భవనాలు తలమానికంగా ఉన్నాయి. ఈ రోజున వెళ్లి చూస్తే విశాఖపటా్ననికి గొప్ప పర్యాటక ప్రాంతంగా ఉంటుంది. విశాఖకు గవర్నర్ వెళ్లినా, ప్రధాని మోదీ వచ్చినా, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వస్తే ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి భవనమది.. ఆ భవనంలో వారికి అతిథ్యం ఇవ్వవచ్చు. అదే చంద్రబాబు నాయుడు యోగా కార్యక్రమం కోసం రూ.330 కోట్లు ఖర్చు చేశారు. ఒక్క రోజు కార్యక్రమం కోసం రూ.330 కోట్లు ఆవిరి చేశారు. దాన్నేమంటారు? ఆరోజు యోగా మ్యాట్లకు ఎంత ఖర్చు పెట్టారో చూస్తే మీకే అర్థమవుతుంది. అమెజాన్‌లోకి వెళ్లి మ్యాట్ల ఖరీదు ఎంతో చూడండి. వీళ్లు ఎంతకు కొనుగోలు చేశారో పరిశీలించండి. వాళ్ల కంటే 50 శాతం తక్కువ ఉండకపోతే నన్ను అడగండి’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా జగన్ పేర్కొన్నారు. -
YS Jagan: నీకు చేతకాకపోతే వదిలేయ్ అయ్యా నేను చూసుకుంటా..
-
దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద స్కాం: వైఎస్ జగన్
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దేశంలో అతిపెద్ద స్కాం అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల సేకరణ ప్రతులను గురువారం విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ అబ్ధుల్ నజీర్‌కు అందించారు. అనంతరం లోక్‌భవన్ వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కూడా ఆయనకు తెలియజేశాం. ఈరోజు ఒక చారిత్రక ఘట్టం. ఏకంగా 1,04,11,136 సంతకాలు. దేశ చరిత్రలో కూడా ఇలాంటి ఉద్యమం జరిగి ఉండదేమో?. గత అక్టోబరు 7న ప్రజా ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. ఆ తర్వాత అక్టోబరు 10 నుంచి ఈనెల 10 వరకు ప్రతి గ్రామం, పట్టణం, ప్రతి వార్డులో రచ్చబండ కార్యక్రమం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వారిని ఉద్యమంలోకి తీసుకువచ్చాం. వాళ్ల సంతకాలు తీసుకున్నాం.నవంబర్ 12న ఒకసారి, మళ్లీ ఈనెల 10న మరోసారి అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించాం. డిసెంబరు 10న ర్యాలీల తర్వాత కోటి సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాలకు తరలించాం. అక్కడ డిసెంబరు 15న ర్యాలీలు నిర్వహించి, వాటిని ప్రజలకు చూపాం. ఆ తర్వాత వాటన్నింటినీ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించి, ఈరోజు (గురువారం) గవర్నర్‌కి చూపించాం. ఆ విధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల నిరసన, వారి మనోభావాలను వివరించాం.అసంబద్ధంగా ప్రభుత్వ నిర్ణయం:ఈరోజు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాను. మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలకు ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ ఎందుకు నడుపుతుంది? దేశంలో అన్ని చోట్ల స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను ప్రభుత్వమే ఎందుకు నడుపుతుందో ఆలోచించారా? రాష్ట్ర ప్రభుత్వమే వీటిని నడపకపోతే పేద, మధ్య తరగతి వారు ప్రైవేటును ఆశ్రయించలేక నష్టపోతారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఒక బాధ్యతగా భావించి నిర్వహిస్తాయి.ఇలా అన్నీ ప్రైవేటీకరిస్తూ పోతే, దోపిడికి చెక్ పడదు. ప్రజా సేవలు పొందాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్‌గా చేరాలంటే కనీసం రూ.5 వేలు ఛార్జ్ చేస్తారు. కనీస వసతుల రూమ్ కావాలంటే రోజుకు రూ.10 వేలు, ఐసీయూలో రోజుకు కనీసం రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయం.మెడికల్ కాలేజీతో ఫ్రీగా అత్యుత్తమ వైద్య సేవలు: మా ప్రభుత్వ హయాంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు, ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టాం. ఎక్కడైనా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే, అక్కడ టీచింగ్ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఆ ఆస్పత్రిలో, మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు అందరూ అందుబాటులో ఉంటారు. దీంతో పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. దాని వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టం వచ్చినట్లు ఛార్జ్ చేయలేవు. మేము నాడు తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే, మన పిల్లలకు మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దాని వల్ల వైద్య విద్య కోరుకునే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ స్కామ్‌ల మయం:కానీ, ఇప్పుడు చంద్రబాబు ఆ పని చేయకపోగా, కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిçస్తూ, స్కామ్‌లు చేస్తున్నారు. స్కామ్‌ల విషయంలో చంద్రబాబు నాలుగు అడుగులు ఎక్కువ వేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కామ్ అయితే, ఆ తర్వాత రెండేళ్ల పాటు, ఆ కాలేజీల సిబ్బందికి ప్రభుత్వం జీతాలు ఇవ్వడం మరో స్కామ్. అంటే అక్కడున్న భూమి, భవనాలు, పని చేసే వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, నిర్వహణ మాత్రం ప్రైవేటువారిది. అంటే ఖర్చు ప్రభుత్వానిది. సంపద ప్రైవేటువారికి. ఒక మెడికల్ కాలేజీలో జీతాలు ఏడాదికి కనీసం రూ.60 కోట్లు. రెండేళ్లకు రూ.120 కోట్లు. అంటే ఆ లెక్కన 10 మెడికల్ కాలేజీల సిబ్బందికి రెండేళ్లపాటు జీతంగా కనీసం రూ.1200 కోట్లు అవుతుంది. ఇలాంటి స్కామ్‌లు దేశంలో ఎక్కడా ఉండవు.నిధుల కొరత అనేది అబద్ధం:మా హయంలో ప్రతి చోట 50 ఎకరాలు ఉండేలా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. వాటికి నాబార్డ్, ఇతర బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ నిధులు టైఅప్ చేశాం. వాటిలో 7 కాలేజీలు పూర్తి చేశాం. అవి ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్నాయి. వాటి ద్వారా 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన కాలేజీలు పూర్తి చేసేందుకు ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు అవసరం. రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ మాత్రం నిధులు ఖర్చు చేయలేదా?.పోనీ మీరు ఖర్చు చేయలేకపోతే వదిలేయండి. మేం వచ్చాక వాటిని పూర్తి చేస్తాం. చంద్రబాబుకు గట్టిగా తగిలేట్టుగా గవర్నర్ దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్లాం. మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే, మాకు క్రెడిట్ దక్కుతుందన్న అక్కసుతో చంద్రబాబు పేదలకు నష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటీకరణతో స్కామ్‌లు చేస్తున్నారు. నిజానికి ఆ మెడికల్ కాలేజీలన్నీ భవిష్యత్‌లో లక్ష కోట్ల ఆస్తి అవుతాయి. ఇంకా కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం అందిస్తూ, వెల కట్టలేని సేవలందిస్తూ కోట్లాది మందికి వెలుగులు నింపుతాయి.అందుకే మా పోరాటం ఆపబోము:మా ఈ పోరాటం ఇంతటితో ఆగదు. గవర్నర్‌కి కోటి సంతకాలు చూపించాం. ఇక్కడి నుంచి రేపు కోర్టులో పిటిషన్ వేస్తాం. అక్కడ కూడా ఈ కోటి సంతకాలు చూపిస్తాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. చంద్రబాబు తోలు మందం కాబట్టి ఆయన మారకపోవచ్చు. కాబట్టి అందరూ కలిసి రావాలి. అందరం కలిసికట్టుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుందాం. మనం ఇప్పుడు ఆ పని చేయకపోతే, రేపొద్దున వైద్యం కోసం ఒక్కొక్కరు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. గవర్నర్ కానీ, మనసున్న ఏ వ్యక్తికి కానీ చంద్రబాబు చేసేది తప్పు అని అర్థమవుతుంది. ఇదే గవర్నర్ ఇంట్లో పని చేసే వ్యక్తులు మెడికల్ కాలేజీకి వెళ్తే ఉచితంగా వైద్యం అందుతుంది. గవర్నర్‌ది మంచి మనసు. ఆయన అన్నీ అర్థం చేసుకున్నారు.ఈ ప్రభుత్వంలో అన్నీ సున్నా:మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు ప్రతి ద్వారం తొక్కుతాం. కోర్టుల ద్వారా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఉద్యమమూ కొనసాగుతుంది. ఎందుకంటే ఇది కచితంగా స్కామ్. అన్నీ ప్రభుత్వానివే. అప్పగించేది మాత్రం ప్రైవేటు వ్యక్తులకా?. ఎన్నికల ముందు ఏం చెప్పారు? బిర్యానీ పెడతామని నమ్మించారు. కానీ, ఈరోజు అవేవీ లేవు. చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్ లేదు. దాంతో వారు చదువులు మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేదు. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు ఇవ్వడం లేదు. విశాఖలో మా హయాంలో రిషికొండపై రూ.230 కోట్లతో బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మిస్తే, అది ఇప్పుడు నగరానికే తలమానికంగా ఉంది. అయినా దానిపై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. విశాఖలో ఒకరోజు నిర్వహించిన యోగా డే కోసం అంత కంటే ఎక్కువే ఖర్చు చేశారు. మ్యాట్లు మొదలు మిగిలిన సామాగ్రి కొనుగోలులోనూ తీవ్ర అవినీతికి పాల్పడ్డారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. -
YS Jagan: ఎవడెవడు కాలేజీలు తీసుకున్నాడో వాళ్ళకి చెబుతున్నా...
-
YS Jagan : విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు
-
చంద్రబాబు సర్కార్‌కు వైఎస్ జగన్ అల్టిమేటం
ప్రైవేటీకరణ అనేదే పెద్ద స్కామ్ అని.. అలాంటి స్కామ్‌ల ఎన్నైనా చేయడానికి చంద్రబాబు నాయుడు ఏనాడూ వెనకడుగు వేయబోరని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాల సేకరణ ఒక చరిత్ర. ఈ సంతకాలను గవర్నర్‌కు సమర్పించి.. చంద్రబాబు నిర్ణయం పట్ల వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను తెలియజేస్తామని వైఎస్ జగన్ అన్నారు. ‘‘కోటి సంతకాలతో గవర్నర్‌ను కలుస్తాం. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్తాం. అవసరమైతే ఈ పత్రాలతో కోర్టు తలుపులు తడతాం. ఆ మేరకు కోర్టులో పిటిషన్ వేస్తాం. న్యాయస్థానం ఎప్పుడు కోరినా, ఆ పత్రాలు చూపుతాం. అయినా చంద్రబాబులో చలనం రాదు. ఎందుకంటే ఆయన చర్మం మందం. గతంలో ఎన్.జనార్థన్‌రెడ్డి సీఎంగా ఉండి.. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.ఇక్కడ ప్రభుత్వం కట్టిన కాలేజీలను చంద్రబాబు ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్ అయితే.. ఆయా కాలేజీల సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం ఇవ్వడం మరో పెద్ద స్కామ్. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాక ఇక ప్రభుత్వం జీతాలు చెల్లించడం ఏంటి?. ఒక మెడికల్ కాలేజీ సిబ్బందికి జీతాల కింద నెలకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతాయి. అంటే రెండేళ్లకు దాదాపు రూ.140 కోట్లు. పది కాలేజీలకు కలిపి ఏకంగా రూ.1400 కోట్లు. ఇది కదా పెద్ద స్కామ్ అంటే!.కోటి సంతకాల మహోద్యమం చూసైనా చంద్రబాబు సర్కార్ నిర్ణయం మార్చుకోవాలి. లేకుంటే ప్రజా ఉద్యమం కొనసాగిస్తాం. రేపు మనం అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం. ఈ స్కామ్‌కు పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టం. రెండు నెలల్లో వారిని జైల్లో పెడతాం. చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతాం’’ అని జగన్ అల్టమేటం జారీ చేశారు. -
సొంతూరిలో చంద్రబాబుకి షాక్!
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతూరిలోనే ఆయనకు షాక్ తగిలింది. ఆయన తీసుకున్న పీపీపీ విధానాన్ని ఆ ఊరి ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో ఈ ఊరి ప్రజలూ భాగం కావడం గమనార్హం.వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంకల్పించారు. అందులో ఏడు పూర్తి చేయగా.. మరో 10 నిర్మాణ దశలో ఉన్నాయి. ఈలోపు కూటమి ప్రభుత్వం జగన్‌కు మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో వాటిని అలాగే వదిలేసింది. అటుపై.. పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేస్తూ చంద్రబాబు సర్కార్ పీపీపీ విధానంలో వాటి నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది.చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తమ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ చేపట్టింది వైఎస్సార్సీపీ. తుపాను, వర్షాల్లోనూ రెండు నెలలపాటు రాష్ట్రమంతటా ఉవ్వెత్తున సాగింది ఈ కార్యక్రమం. ఇందులో భాగంగా.. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలోనూ ప్రజలు సంతకాలు చేశారు. అయితే.. తమ ఊరి నుంచి ఎలాంటి సంతకాలు చేయలేదని నారావారిపల్లె టీడీపీ నేతలు ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటనలు చేశారు. కానీ, వైఎస్సార్సీపీ రచ్చబండలో భాగంగా అక్కడా సంతకాల సేకరణ జరిగింది. ఆ పత్రాలు అక్కడి నుంచి చంద్రగిరి నియోజకవర్గానికి.. అక్కడి నుంచి తిరుపతికి.. అక్కడి నుంచి ఇవాళ తాడేపల్లికి చేరుకున్నాయి. ఈ లెక్కన.. సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్ జగన్ సమర్పించబోయే చంద్రబాబు వ్యతిరేక ప్రజా గళాల్లో ఆయన సొంతూరి ప్రజలది కూడా ఉండబోతుందన్నమాట. -
Watch Live: కోటి సంతకాల పత్రాలతో ర్యాలీగా బయల్దేరిన వాహనాలు
-
ప్రజా ఉద్యమంతో తగ్గిన చంద్రబాబు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సంచలన నిర్ణయం..
-
వైఎస్సార్సీపీ కీలక భేటీ.. సాయంత్రం లోక్ భవన్‌కు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం వైఎస్సార్సీపీ కీలక భేటీ జరగనుంది. కోటి సంతకాల ప్రతులను రాష్ట్ర గవర్నర్‌కు అందజేయనున్న నేపథ్యంలో ఆయన ముందుగా పార్టీ నేతలతో భేటీ నిర్వహించనున్నారు.వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున.. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించాలని ప్రయత్నించారు. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం ద్వారా కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు రాష్ట్రంలో వైద్య విద్యా అవకాశాలను విస్తరించడం ఉద్దేశంతో ఆయన ఈ అడుగు వేశారు.ఇందులో ఏడు పూర్తి కాగా.. వైఎస్సార్సీపీ దిగిపోయేనాటికి మరో పది నిర్మాణంలో ఉన్నాయి. అయితే.. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాటిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. చివరకు పీపీవీ విధానం పేరిట కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ పేరిట ప్రజా ఉద్యమానికి పిలుపు ఇచ్చారు వైఎస్ జగన్.అక్టోబర్ నెలలో గ్రామాల స్థాయిలో ‘రచ్చబండ’ పేరిట మొదలైన సంతకాల సేకరణ.. ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. రెండు నెలల్లో చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం కోటి 4 లక్షల 11 వేల 136 మంది సంతకాలు చేశారు. విద్యార్థులు, మేధావులు.. అన్ని వర్గాల ప్రజలూ వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణలో పాల్గొనడంతో.. దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.కొసమెరుపు ఏంటంటే.. అలాగే చంద్రబాబు సొంత గ్రామమైన నారావారిపల్లెలోనూ ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతూ అక్కడి ప్రజలు సంతకాలు చేయడం..ఇప్పటికే అన్ని జిల్లాల నుండి సంతకాల ప్రతుల బాక్స్‌లు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. గురువారం ఉదయం పత్రాలతో వచ్చిన వాహనాలకు వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభిస్తారు. అవి అక్కడి నుంచి నేరుగా లోక్‌భవన్(పూర్వ రాజ్‌భవన్)కు చేరుకుంటాయి.అనంతరం పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశమై.. ఇప్పటిదాకా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం గురించి చర్చిస్తారు. సాయంత్రం పార్టీ కీలక నేతలతో కలిసి లోక్ భవన్‌కు వైఎస్ జగన్‌కు వెళ్తారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యి.. మెడికల్ కాలేజీల ప్రవేటీకరణపై ప్రజల అభిప్రాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారు. -
కూటమి కుట్రను ఎడమ కాలితో తన్నిన ఏపీ ప్రజలు
-
నేడు గవర్నర్‌తో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌తో భేటీ కానున్నారు. పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, ఎంపీలు, తదితరులతో కలిసి ఆయన గవర్నర్‌కు 1,04,11,136 సంతకాల పత్రాలను అందించనున్నారు.అంతకు ముందు ఉదయం 10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల పత్రాలతో వచ్చిన వాహనాలను వైఎస్ జగన్ జెండా ఊపి లోక్‌భవన్‌కు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పాల్గొంటారు.ఆ తర్వాత వీరితో వైఎస్ జగన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమవుతారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్ నివాసం లోక్‌భవన్‌కు బయల్దేరి వెళతారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కోటి మందికిపైగా చేసిన సంతకాల పత్రాలతో వాహనాలు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. -
మెడి‘కిల్’పై మహోద్యమం.. కోటి గళాల సింహగర్జన
సాక్షి, అమరావతి: కమీషన్ల కక్కుర్తితో పేదలకు నాణ్యమైన వైద్యాన్ని, విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తూ ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు ప్రభంజనమైంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు, మేధావులు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు సర్కార్‌పై కళ్లెర్ర చేశారు. కోటి గళాలతో సింహగర్జన చేశారు.నిరసన జ్వాల ఉవ్వెత్తున ఎగసి పడటంతో కోటి సంతకాల ఉద్యమం ప్రజా మహోద్యమంగా మారింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలసి కోటి సంతకాల ప్రతులను అందిచనున్నారు. గద్దెనెక్కిన 18 నెలల్లోనే చంద్రబాబు సర్కార్ రూ.2,81,312 కోట్లు అప్పు చేసింది. దీన్ని బట్టి చూస్తే.. నెలకు రూ.15,628.44 కోట్లు.. రోజుకు రూ.520.94 కోట్లు చొప్పున అప్పు చేసింది. అంటే.. ఒక్క రోజులో చేసిన అప్పుతో ఒక మెడికల్ కాలేజీని పూర్తి చేయొచ్చు. కేవలం పది రోజుల్లో చేసిన అప్పుతో మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తి చేయొచ్చు.కానీ.. అందుకు విరుద్ధంగా అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను దుబారా చేస్తూ మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధుల్లేవని సాకు చూపుతూ.. ప్రైవేటీకరణ ముసుగులో వాటిని చంద్రబాబు సర్కార్ బినామీలకు కట్టబెట్టాలన్న కుట్రపై జనం భగ్గుమన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లోని 175 నియోజకవర్గాలలో గ్రామాలు.. పట్టణాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాలకు చెందిన 1,04,11,136 మంది ప్రజలు స్వచ్ఛందగా సంతకాలు చేశారు.ఆ సంతకాల ప్రతులు 26 జిల్లాల నుంచి మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఆ సంతకాల ప్రతులను గురువారం గవర్నర్‌కు అందజేయనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలుపుదల చేసి.. వాటిని ప్రభుత్వమే నిర్మించి, నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేయనున్నారు. 14 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టని చంద్రబాబు రాష్ట్రంలో 1923 నుంచి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. పద్మావతి అటానమస్ మెడికల్ కాలేజీతో కలిపితే 12 ఉన్నాయి. 2019 నాటికి చంద్రబాబు మూడు సార్లు అంటే 1995–99, 1999–04, 2014–19 మధ్య 14 ఏళ్లు సీఎంగా పాలించారు. ఆ మూడు దఫాల్లో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు.కనీసం కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. ఈ క్రమంలో 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 13 జిల్లాలను పునర్విభజించి, 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు.ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతోపాటు నాణ్యమైన వైద్యం అందించడం.. పేదలకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో కాలేజీకి 50 ఎకరాల కనీస స్థలం ఉండేలా భూమిని కేటాయించారు. ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లకుపైగా ఖర్చు చేసి అన్ని రకాల సదుపాయాలు ఉండేలా క్యాంపస్‌ల అభివృద్ధి పనులు ప్రారంభించారు.కోవిడ్ మహమ్మారి వంటి సమస్యలు రెండేళ్లపాటు రాష్ట్రాన్ని పీడించినా, ఎన్ని ఇబ్బందులున్నా ఎక్కడా వెనక్కు తగ్గకుండా మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలనే ధృడ సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను 2023–24లోనే ప్రారంభించి, తరగతులు మొదలుపెట్టారు.గతేడాది ఎన్నికలు వచ్చే నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా తరగతులు ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్లు ముగిసి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట పులివెందుల మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గతేడాది అనుమతులు ఇచ్చింది. కానీ.. ఆ సీట్లు మాకు వద్దంటూ ఎన్ఎంసీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి అవసరమైన నిధులను అప్పట్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమీకరించింది. ఆ నిధులను సది్వనియోగం చేసుకుని.. వైఎస్సార్సీపీ సర్కార్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టి ఉంటే.. 2024–25 విద్యా సంవత్సరంలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి.ఈ విద్యా సంవత్సరం అంటే 2025–26లో అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండలో కూడా వైద్య కళాశాలలు ప్రారంభం అయ్యేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 2,360 మాత్రమే ఉండేవి.కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అదనంగా మరో 2,550 సీట్లు పెరిగితే.. మొత్తంమ్మీద 4,910 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తరగతులు ప్రారంభమైన కొత్త మెడికల్ కాలేజీల్లో అప్పట్లోనే 800 సీట్లు భర్తీ చేశారు. పులివెందుల మెడికల్ కాలేజీలో తరగతులు ప్రారంభించేందుకు చంద్రబాబు సర్కార్ అంగీకరించి ఉంటే మరో 50 సీట్లు వచ్చేవి.ఎక్కడ వైఎస్ జగన్‌కు క్రెడిట్ వస్తుందోనని ఏకంగా ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు దెబ్బ తీస్తున్నారని మేధావులు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలన్నీ అందుబాటులోకి వచ్చేవి.అణచివేసే దుస్సాహసంపై ప్రజాగ్రహం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతుండటం.. రచ్చబండ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తుండటంతో చంద్రబాబు సర్కార్ వెన్నులో వణుకు పుట్టింది. రచ్చబండ కార్యక్రమాలపై పోలీసులను ఉసిగొల్పి ప్రజా ఉద్యమాన్ని అణచివేసే దుస్సాహసంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది.చంద్రబాబు సర్కార్ ప్రజా వ్యతిరేక చర్యలపై సమర భేరి మోగించింది. నవంబర్ 12న నియోజకవర్గాల కేంద్రాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కారు. ఈ నెల 10న ఏపీలోని 175 నియోజకవర్గాల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా చేసిన సంతకాల ప్రతులను ప్రదర్శిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో ప్రజలు భారీగా పాల్గొన్నారు.పోలీసుల ద్వారా ర్యాలీలను అడగడుగునా అడ్డుకోవడానికి చంద్రబాబు చేసిన కుట్రలను జనం పటాపంచలు చేశారు. ఈ నెల 15న జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల పత్రాలను ప్రదర్శిస్తూ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు వైఎస్సార్సీపీ నేతలతో కలిసి బాబు సర్కార్‌పై రణభేరి మోగించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ కోటి గళాలు సింహగర్జన చేశాయి. మహోద్యమంగా ప్రజా ఉద్యమం కమీషన్ల కక్కుర్తితో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించడాన్ని నిరసిస్తూ అక్టోబర్ 7న వైఎస్ జగన్ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించి సమరభేరి మోగించారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ ఆఖరు వరకు 175 నియోజకవర్గాల్లో గ్రామాలు, పట్టణాల్లో వైఎస్సార్సీపీ నేతలు విస్తృతంగా రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించారు.భవిష్యత్తులో రూ.లక్ష కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీలను బినామీలకు కట్టబెట్టాలన్న చంద్రబాబు కుట్రను.. పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్యను దూరం చేస్తున్న దురాగతాన్ని ప్రజల కళ్లకు కట్టినట్టు వివరించారు. వీటికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని నిరసిస్తూ.. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే నిర్మించి, నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కోటి మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. -
Sajjala: మెడికల్ కాలేజీలను అనుమతులు తేవడం చాలా కష్టం
-
ఇది పీపీపీ కాదు.. పెద్ద స్కామ్: సజ్జల
సాక్షి, తాడేపల్లి: జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న కోటి సంతకాల ప్రతులను బుధవారం.. ఆ పార్టీ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేట్ పరం అయితే ప్రభుత్వం ఉండి ఏం లాభం? అంటూ ప్రశ్నించారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అతిపెద్ద స్కామ్‌కు పాల్పడుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రజల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. కోటిమందికి పైగా చేసిన సంతకాలే.. ప్రైవేటీకరణ నిర్ణయంపై వెల్లువెత్తిన ప్రజా నిరసనకు నిదర్శనమని, ప్రభుత్వ నిర్ణయంపై ఇది కచ్చితంగా రెఫరెండమే అని ఆయన తేల్చి చెప్పారు. ఏపీని మెడికల్ హబ్ గా మార్చాలని కలగన్నవైఎస్ జగన్ అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు.అయితే అధికారంలోకి రాగానే కాలేజీల నిర్మాణాలను నిలిపివేసిన చంద్రబాబు.. కమిషన్ల కక్కుర్తితోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మమ్మాటికీ ముందస్తు కుట్రేనని.. . ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఆక్షేపించారు. కాలేజీల ప్రైవేటీకరణతో పాటు అప్పనంగా ఆస్తులు అప్పగిస్తున్న చంద్రబాబు.. అదనంగా 2 ఏళ్ల పాటు రూ.1400 కోట్లు జీతాలు ప్రభుత్వం నుంచి చెల్లించాలన్న నిర్ణయం.. మరో భారీ కుంభకోణమని స్పష్టం చేశారు.చంద్రబాబు తీరుకు నిరసనగా రేపు సాయంత్రం(డిసెంబర్ 18, గురువారం) వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం గౌరవ గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు సమర్పిస్తారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన... లేనిపక్షంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వీటిపై సమీక్షించి, బాధ్యులను బోనెక్కిస్తామని స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..ఏపీని మెడికల్ హబ్ చేయడమే వైఎస్ జగన్ లక్ష్యం:ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకుని రావటమే కష్టం, అలాంటి అనుమతులన్నీ వైఎస్ జగన్ సాధించి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కాలేజీలు తెచ్చారు. దేశంలోనే ఉత్తమ మెడికల్ హబ్‌గా ఏపీని మార్చాలని జగన్ కలలు కన్నారు. ఆ మేరకు కింది స్థాయి నుండి పటిష్ఠం చేసుకుంటూ వచ్చారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసింది. అనంతరం ప్రైవేటీకరణకు సిద్ధమైంది. ప్రైవేటు రంగంలోనే అత్యుత్తమ సేవలందుతాయని తాను నమ్ముతున్న సిధ్దాంతాన్ని అమలు చేయడం ప్రారంభించాడు. తాను అధికారంలో లేనప్పుడు ఎప్పుడూ ప్రైవేటు రంగం గురించి నోరెత్తని చంద్రబాబు.. గెలిచిన తర్వాత ప్రైవేటు రంగంలో మంచి సేవలు అందుతాయని చెప్పడం అలవాటు.ఆర్థిక వనరులు లోటు లేకున్నా ప్రైవేటీకరణ మంత్రం:వైఎస్ జగన్ ప్రభుత్వ వైద్య కళాశాలను పూర్తి చేయకుండానే, కేవలం కాలేజీలని నిర్మించాలని లక్ష్యంగా మాత్రమే చెబితే.. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం కష్టమని చెప్పడంలో అర్ధముంది. కానీ ఐదు మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ పూర్తి చేసి, ఆ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగి, విజయవంతంగా కాలేజీలు నడుస్తున్నాయి. మరో రెండు కాలేజీలు పూర్తయ్యాయి.. మరో మూడు కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకునే దశలో ఉన్నాయి.అంటే మొత్తం 10 కాలేజీలు దాదాపు పూర్తైన దశలో ఎందుకు వాటిని ఆపాల్సి వచ్చింది. మరో కీలకమైన అంశం ఏమిటంటే... కాలేజీల నిర్మాణానికి నిధుల కొరత లేకుండా వివిధ ఆర్ధికసంస్ధలతో వైయస్.జగన్ ప్రభుత్వమే టై అప్ అయింది. నీకు కావాల్సిందల్లా కాలేజీల నిర్మించాలన్న మనసు మాత్రమే. అదే చంద్రబాబుకు లేదు. చంద్రబాబు హెరిటేజ్‌తో సహా ఎవరైనా ప్రైవేటు రంగంలో ఉచితంగా సేవలు అందిస్తారా? రూపాయి పెట్టుబడి పెట్టి రూ.10, రూ.20, రూ.50 ఎలా సంపాదించాలనే వస్తారు. చంద్రబాబు ఏం చెప్పినా పీపీపీ అనేది ఓ పెద్ద స్కామ్. ఇంకా జనాల చెవిలో పువ్వులు ఎలా పెట్టగలననుకుంటున్నాడో తెలియడం లేదు? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కోసం వైఎస్ జగన్ అక్టోబరులో పిలుపునిస్తే... ఈ రెండు నెలల్లో వచ్చిన ప్రజాస్పందన చూసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజల అభిప్రాయం చంద్రబాబుకు అర్థం కావడం లేదు. కోటి సంతకాలకు అక్టోబరులో పిలుపునిస్తే.. జనంలో వస్తున్న స్పందన అందరికీ తెలుసు.ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రిఫరెండంలా.. చరిత్రలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎప్పూడూ చూడని విధంగా తొలిసారిగా ఇంత పక్కాగా ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. వైయస్సార్సీపీ ఆధ్యర్యంలో ప్రతిచోటా జనంలోని వెళ్లి సంతకాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పేదలతో పాటు సమసమాజం కావాలనుకునేవాళ్లు, సమాజంలో అసమానతలు తగ్గించాలని కోరుకునేవారు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు.ప్రైవేటీకరణే చంద్రబాబు విజన్:ఇవాల్టికి చంద్రబాబు కొంచెం తగ్గి.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం పేరు పెద్దదిగా ఉంటే.. ప్రైవేటు వాళ్ల పేరు చిన్న అక్షరాల్లో ఉంటుందని చెబుతున్నారు. కాలేజీల భవనాలు, ఆసుపత్రులు, భూమి అంతా ప్రైవేటు వాళ్ల చేతుల్లో పెట్టిన తర్వాత వాళ్లు పేరు పెట్టినా, పెట్టకపోయినా ఏం ప్రయోజనం ఉంటుంది. పైగా వారికి రెండేళ్ల జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించడానికి అంగీకరించడం మరించి ఆశ్చర్యకరం. ఇన్ని ప్రైవేటు వారికి ఇచ్చినప్పుడు... ప్రభుత్వమే ఎందుకు నిర్వహించలేకపోతుంది?మెడిసిన్ చేయాలనుకునే విద్యార్ధులు తొలుత ప్రభుత్వ కాలేజీలనే కోరుకుంటారు. కారణం ఆయా కాలేజీలకు వచ్చే పేషెంట్లు, ఉత్తమ సర్వీసులు, మంచి శిక్షణ అందుతుందన్న ఆలోచనతోనే ఎంచుకుంటారు. మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు పెడితే... మేం అధికారంలోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అన్నింటినీ రద్దు చేసి ఉచితం చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్నే నిలిపివేశారు.ప్రైవేటీకరణను అవసరం లేకపోయినా సపోర్టు చేసి నెత్తిన పెట్టుకునే ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన మొదటి నుంచి ఇదే తీరు. కేవలం కాసుల కోసం కక్కుర్తి పడి ప్రైవేటీకరణ చేయడం ఒక అంశం అయితే... ప్రజల ప్రాణాలకు సంబంధించిన వైద్యరంగంలో ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నాడు. వైయస్.జగన్ విజయవంతంగా మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభిస్తే... దాన్ని కొనసాగించాల్సింది పోయి, ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు 100 శాతం మెడికల్ సేవలు ఉచితం అని చెప్పాడు. ఇవాళ 100 శాతం అవుట్ పేషెంట్ సేవలు ఉచితంగా వస్తాయని, 70 శాతం ఇన్ పేషెంట్ కేటగిరీలో ఉచితం అని చెబుతున్నాడు. ఇవన్నీ ఎవరికి చెబుతున్నావ్ చంద్రబాబూ?జీతాలు చెల్లింపు మరో కుంభకోణం..వైఎస్ జగన్ ఇప్పటికే ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్మించి, విజయవంతంగా నిర్వహించవచ్చని, సామర్థ్యం ఉన్న సిబ్బందిని నియమించవచ్చని నిరూపించిన తర్వాత.. ఇవాళ చంద్రబాబు దాన్నుంచి పక్కకు పోవడం అంటే ఇది పెద్ద కుంభకోణం. రెండో కుంభకోణం.. రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తామని చెప్పడం. ఒక వైపు మెడికల్ కాలేజీలను నిర్మించడానికి డబ్బుల్లేవు అని చెబుతూ... మెడికల్ కాలేజీలను, ఇన్ ఫ్రా స్ట్రక్చర్, భూమితో సహా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూనే.. వారికి రెండేళ్ల జీతాలు కూడా ప్రభుత్వం నుంచి చెల్లించడం అంటే ఒక్కో కాలేజీకి ఏడాదికి రూ.8 కోట్లు చొప్పున 10 మెడికల్ కాలేజీలకు రూ.80 కోట్లు ఖర్చువుతుంది. రెండేళ్లకు రూ.1400 కోట్లు ఇవ్వాలి. ఈ డబ్బులతో కాలేజీలు పూర్తి కావా?ఇవాళ కార్పొరేట్ కాలేజీల్లో వైద్యం ఖర్చు ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? ఇవాళ కొత్త ట్రీట్మెంట్ వచ్చిందంటే అది ఎన్ని లక్షలు కట్టమంటే అంతా కట్టాల్సిందే? ఇక్కడ మొదలుపెట్టి ప్రైమరీ హెల్త్ కేర్‌ను కూడా ప్రైవేటుకు కచ్చితంగా అప్పగిస్తాడు. అంటే మొత్తం వైద్య ఆరోగ్యరంగం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతుంది. మన ఆర్దిక వ్యవస్ధలో ప్రైవేటు ఉండడం మన మార్కెట్ ఎకానమీలో భాగం.ప్రజల పట్ల ప్రేమ - పాప భీతి లేని వ్యక్తి చంద్రబాబులాభం లేకుండా ప్రైవేటు వ్యాపారులు రారని తెలిసి, వాళ్లకు లాభాలిచ్చి, నువ్వు వేల కోట్లు కుమ్మిరించి.. ఇక్కడ అవసరమైన రూ.2-3 వేల కోట్లు పెట్టలేదంటే చంద్రబాబు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాడు. ఆయన సేవలు చేయనవసరం లేదు, కానీ ద్రోహం చేయడం మహాపాపం. నా వల్ల ఇంత నష్టం జరుగుతుందన్న భయం కానీ పాపభీతి కానీ రెండూ చంద్రబాబుకు లేవు. అందుకే నేటికీ ప్రైవేటీకరణ మంచిదని బుకాయిస్తున్నాడు.రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల వెల్లువఈ నేపధ్యంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరనసగా వైఎస్ జగన్ పిలుపు మేరకు అక్టోబర్‌లో సంతకాల సేకరణ ఉద్యమం మొదలుపెట్టి... రెండు నెలల కాలంలో 1 కోటి సంతకాలను లక్ష్యంగా పెడితే... 1,04,11,136 సంతకాలు వచ్చాయి. ఈ సంతకాలన్నీ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను మీరు వ్యతిరేకిస్తే... సంతకం చేయమని అడిగితే..రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో చేసినవే. జిల్లాల వారీగా చూస్తే.. శ్రీకాకుళంలో జిల్లాలో 4,02,833, విజయనగరం జిల్లాలో 3,99,908, పార్వతీపురం మన్యం 2,15,500, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,47,000, విశాఖపట్నం 4,19,200, అనకాపల్లి జిల్లాలో 3,73,000, కాకినాడ జిల్లాలో 4,00,600, బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4,20,086, తూర్పుగోదావరి జిల్లాలో 4,06,929, పశ్చిమ గోదావరి జిల్లాలో 4,19,650, ఏలూరు జిల్లాలో 3,60,008, కృష్ణా జిల్లాలో 3,77,336, ఎన్టీఆర్ జిల్లాలో 4,31,217, గుంటూరు జిల్లాలో 4,78,059,..పల్నాడు జిల్లాలో 4,31,802, బాపట్ల జిల్లాలో 3,73,199, ప్రకాశం జిల్లాలో 5,26,168, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 6,30,040, కర్నూలు జిల్లాలో 3,98.277, నంద్యాల జిల్లాలో 4,05,500, అనంతపురం జిల్లాలో 4,55,840, శ్రీసత్యసాయి జిల్లాలో 4,40,358, వైయస్సార్ జిల్లాలో 4,80,101, అన్నమయ్య జిల్లాలో 2,60,500, చిత్తూరు జిల్లాలో 7,22,025 మొత్తం 1 కోటి 3 లక్షల 71వేల 136 సంతకాలు చేరాయి. ఇవి కాకుండా కేంద్ర కార్యాలయానికి చేరిన మరో 40వేలు సంతకాలు కలిపి మొత్తం... 1, 04,11,136 నిఖార్సైన సంతకాలతో ప్రవైటీకరణకు వ్యతిరేకంగా తమ మద్ధతు తెలిపారు.బ్యాలెట్ తీర్పు తరహాలో ప్రజాభిప్రాయం:రాష్ట్రంలో ప్రజాభిప్రాయసేకరణలో ఇంత పక్కాగా బ్యాలెట్ బాక్సులో తీర్పునిచ్చినట్లు.. రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు. 1.04 కోట్ల మంది సంతకాలు అంటే అన్ని కుటుంబాలు సంతకాలు చేశారంటే... రాష్ట్రంలో మొత్తం కుటంబాలు 1.60 కోట్లు పైగా ఉంటే... అందులో 1.04 కోట్ల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు.ఇంతమంది సంతకాలు చేసిన తర్వాత చంద్రబాబు పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు. క్రెడిట్ ఆయనే తీసుకుని... మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలి. టిడ్కో ఇళ్ల విషయంలో కూడా గతంలో చంద్రబాబు డబ్బులు వసూలు చేసి పూర్తి చేయకుండా వదిలేస్తే.. వైఎస్ జగన్ హయాంలో క్రెడిట్ కూడా క్లెయిమ్ కూడా చేయకుండా.. ఉచితంగా అందించారు. అది వైఎస్ జగన్‌కు ఉన్న ఆలోచన. రాజకీయం కోసం ప్రజలతో ఆడుకోవడం సరికాదు. వైఎస్ జగన్ హయాంలో కట్టిన ఇళ్లను చంద్రబాబు తన ఖాతాలో చూపించుకున్నాడు. ఏమాత్రం జంకులేకుండా క్లెయిమ్ చేసుకోవడం చంద్రబాబుకు అలవాటు.కాలేజీల నిర్మాణానికి కుంటిసాకులు:ఇవాళ మెడికల్ కాలేజీలను కూడా తానే కట్టానని చంద్రబాబు క్లెయిమ్ చేసుకోవచ్చు.. కానీ ప్రైవేటీకరణ చేసి ప్రజల ఉసురు తీసుకోవద్దు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దు. వైఎస్ జగన్ ప్రారంభించిన వాటి నిర్మాణం కొనసాగిస్తే సరిపోతుంది. ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు చేసిన రూ. 2.60 లక్షల కోట్లకు పైగా అప్పులో .. కొంత మెడికల్ కాలేజీల కోసం వెచ్చిస్తే సరిపోయేది. కానీ కుంటిసాకులు వెదుకుతూ, పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్పిందని తన అనుకూల పత్రికల్లో రాయించుకోవడం మానేసి... చేసి చూపించాలి వైఎస్సార్ ఉచిత కరెంటు ఇవ్వడం అసాధ్యమని అందరూ అన్నారు.. దాన్ని ఆయన చేసి చూపించేసరికి అందరూ దాన్ని అనుసరిస్తున్నారు.నీవు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం సాధ్యం కాదు అనుకున్నావు.. కానీ వైఎస్ జగన్ వాటిని చేసి చూపిస్తే దాన్ని కొనసాగించ లేకపోవడం దారుణం. భవిష్యత్తు తరాలకు 20, 30 ఏళ్లు గడిచిన తర్వాత... మెడిసిన్‌లో గొప్ప సిస్టమ్స్ ఉన్నాయని చెప్పుకునే అవకాశాన్ని చేతులారా చంద్రబాబు చంపేస్తున్నాడు. ఇప్పటికైనా చంద్రబాబుకు మంచి బుద్ధి కలిగి ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలను నిర్మించాలని కోరుతున్నాం.ఇదే విషయంపై రేపు సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ ఒక ప్రతినిధి బృందంతో... గవర్నర్‌ని కలిసి వినతి పత్రం ఇవ్వడంతో పాటు, సంతకాల ప్రతులను ఆయనకు సమర్పిస్తామని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అప్పటికైనా చంద్రబాబు కుట్రపూరితమైన, తన దుర్మార్గమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మెడికల్ కాలేజీలను ప్రభుత్వరంగంలోనే ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానమిస్తూ..రోడ్లు పీపీపీ విధానంలో నిర్మిస్తే అవి ప్రభుత్వం వద్దే ఉంటాయి కదా అని ప్రశ్నించగా.. అలా చేయడం వల్ల టోల్ గేట్ల ఖర్చు భారీగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఇవేవీ లేవని.. ప్రైవేటు వ్యక్తులు లాభాపేక్ష లేకుండా ఎందుకు వస్తారని నిలదీశారు. మెడికల్ కాలేజీలు ప్రజారోగ్యానికి సంబంధించిన విషయమని... ఏ దేశమైనా ప్రభుత్వ పరిధిలేకుండా వైద్యాన్ని ప్రైవేటుపరం చేయలేదని గుర్తు చేశారు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు.. వాటి ధరలను సమాజం భరించలేదని... అందుకే ప్రభుత్వం వాటిని బేలన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కోటి సంతకాలు ఎవరు చేశారన్నది.. తెలుగుదేశం పార్టీ నేతలందరికీ తెలుసు. ప్రైవేటీకరణ విషయంలో మారిన చంద్రబాబు మాట తీరే ఇందుకు నిదర్శనం. అయినా మొండిగా ముందుకు వెళ్తూ చంద్రబాబు తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు.వైఎస్ జగన్ హయాంలో మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ప్రవేశపెడితే.. ఇదే కూటమి నేతలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం సీట్లు ఉచితంగా భర్తీ చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా కాలేజీలనే ప్రైవేటీకరణ చేస్తున్నారు. 108 సేవలకు సంబంధించి ప్రతిచోటా మొత్తం ప్రభుత్వం చేయాలనుకోవడం మంచి మార్గం. ఒకవేళ అది కాకపోతే ప్రభుత్వ కంట్రోల్ ఉంచేలా చూడాలి. కానీ కూటమి నేతలు మేం అధికారంలోకి వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేసి మొత్తం ఉచితంగా భర్తీ చేస్తామని చెప్పి... ఇవాళ ప్రైవేటీకరణకు వెళ్లడమే మంచిదని వితండవాదం చేయడం దుర్మార్గం.రాజధాని నిర్మాణం కోసం డిజైన్లు, లైటింగ్ వంటి వాటి కోసం కోట్లాది రూపాయులు ఖర్చుపెడుతున్నారు. కానీ మెడికల్ కాలేజీల నిర్మాణానికి వచ్చేసరికి చేయాలన్న ఉద్దేశం లేకపోవడంతోనే ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో మాత్రం ఇలా చేయడం దుర్మార్గం. ఉచితంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని వైయస్.జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణం చేసి చూపించిన తర్వాత కూడా ఇలాంటి వాదన చేయడం అర్ధరహితమని తేల్చి చెప్పారు. -
Gudivada: ఎంత చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్టే..
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మహోద్యమం.. పోటెత్తిన కోట్ల గళాలు
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం మహోద్యమంగా మారి ఉవ్వెత్తున ఎగసిపడింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో చేపట్టిన రచ్చబండ కోటి సంత కాల సేకరణ కార్యక్ర మానికి భారీ స్పందన లభించింది. మారు మూల గిరిజన గూడేల నుంచి జిల్లా కేంద్రాల దాకా సర్వత్రా కోటి సంతకాల సేకరణకు ప్రజా మద్దతు లభించింది. అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొని తమ అభీష్టాన్ని సంతకాల రూపంలో చంద్రబాబు సర్కారుకు చాటి చెప్పారు. జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీల నడుమ వాహనాల్లో సోమవారం తాడేపల్లి లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి సంతకాల ప్రతులను తరలించారు. సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, విజయవాడ, నెట్వర్క్: వైఎస్ జగన్ కృషితో సాకారమైన ప్రభుత్వ వైద్య కళాశాలలను పప్పుబెల్లాల మాదిరిగా చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంపై కోట్ల గొంతులు కన్నెర్ర చేశాయి. పేదలకు చేరువలో ఉచితంగా సూపర్ స్పెషాల్టీ వైద్యం, మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలను చిదిమేశారని ర్యాలీల్లో కదం తొక్కాయి. ప్రభుత్వ భూమి.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు..ప్రభుత్వ ఆస్పత్రులు.. ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేట్ వ్యక్తులా..? అంటూ చంద్రబాబు సర్కారు దుర్మార్గ విధానాలను ఊరూరా ప్రజలు నిలదీశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణలో శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. విద్యాసంస్థల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. మారుమూల ప్రాంతాల నుంచి ప్రతి గ్రామంలోనూ విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు, విద్యావేత్తలు, సామాజిక ఉద్యమకారులు ఇందులో పాలు పంచుకుని చంద్రబాబు సర్కారు ప్రజా కంటక విధానాలను తీవ్రంగా నిరసించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఈ సర్కారుకు బుద్ధి చెప్పేందుకు ఎలాంటి ఉద్యమాలకైనా వెనుకాడబోమని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడటమే కాకుండా బోధనాస్పత్రులను సైతం ధారాదత్తం చేయడం దుర్మార్గమని కోట్ల గళాలు మండిపడ్డాయి. ఆయా ఆస్పత్రుల్లో పని చేసే వైద్యులు, సిబ్బంది వేతనాలను సైతం ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తామని చంద్రబాబు సర్కారు ప్రకటించడం దోపిడీకి పరాకాష్ట అంటూ సర్వత్రా ఆగ్రహం పెల్లుబికింది. రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఊరూరా నినదించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలలకు పైగా సాగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చంద్రబాబు సర్కారు కక్షపూరిత విధానాలపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహాన్ని చాటి చెబుతోందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ కృషితో సాకారమైన ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్‌కు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా ప్రజల సంతకాలను సేకరించిన విషయం తెలిసిందే. ఇంటింటా, ఊరూరా వైఎస్సార్సీపీ నాయకులు పర్యటించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ సంతకాల ద్వారా ప్రజల మద్దతు సేకరించారు. ఈ సంతకాల ప్రతులతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి వాటిని వాహనాల్లో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, బాపట్ల తదితర జిల్లాలకు చెందిన కోటి సంతకాల వాహనాలకు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి స్వాగతం పలికారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరిన కోటి ప్రతులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 18వతేదీన గవర్నర్‌ను కలిసి నివేదించి ప్రజా స్పందనను వివరించనున్నారు. కోటి సంతకాల ప్రతుల వాహనాలతో ఎక్కడికక్కడ జరిగిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని చంద్రబాబు సర్కారు నిరంకుశ విధానాలపై కన్నెర్ర చేశారు. పోలీసు ఆంక్షలు, చెక్‌పోస్టులు, నిర్బంధాలను లెక్కచేయకుండా ర్యాలీలకు పోటెత్తారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే.. మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.8,480 కోట్లతో ఒకేసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలోనే ఏడు కాలేజీలు సిద్ధం కాగా, ఐదు కళాశాలల్లో తరగతులు కూడా మొదలయ్యాయని.. పులివెందుల కాలేజీకి ఎంఎన్సీ సీట్లను కేటాయించినా చంద్రబాబు ప్రభుత్వం తమకు వద్దంటూ అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. సర్వం సిద్ధంగా ఉన్న కాలేజీలను ఈ ప్రభుత్వం ప్రైవేట్‌కు అప్పనంగా కట్టబెడుతోందని.. అది చాలదన్నట్లుగా నర్సింగ్ కాలేజీలను కూడా నడుపుకోవచ్చని పచ్చజెండా ఊపడంపై సర్వత్రా జనాగ్రహం వ్యక్తమైంది. మెడి‘కిల్’బాబుపై కోటిగళాల గర్జనప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. గడిచిన 19 నెలల్లో రూ.2.68 లక్షల కోట్లు అప్పుచేసిన చంద్రబాబు, రూ.5వేల కోట్లతో మెడికల్ కాలేజీలు ఎందుకు నిరి్మంచడం లేదు? సంపద సృష్టి ఏమైంది? రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదు? మాజీ సీఎం వైఎస్ జగన్ మాటగా చెబుతున్నా.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. – బొత్స సత్యనారాయణ, శాసనమండలి విపక్షనేతదోచుకోవడం.. దాచుకోవడమే బాబు నైజం చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు పప్పుబెల్లాల్లా పంచిపెట్టి తద్వారా రూ. వేల కోట్లు దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకుంటారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధిని చంద్రబాబు ఏనాడూ ఆకాంక్షించరు. అందుకే మా నాయకుడు వైఎస్ జగన్ పేదల కోసం నిర్మించిన 17 మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేసి రూ. వేల కోట్లు దండుకోవాలని చూస్తున్నాడు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ -
ఢిల్లీలో వైఎస్సార్సీపీ ఎంపీల నిరసన
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా నిరసన బాట పట్టారు. ఈరోజు(సోమవారం, డిసెంబర్ 15వ తేదీ) పార్లమంట్ సమావేశాల్లో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీలు.. అనంతరం ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి మకరద్వారం వద్ద ఫ్లకార్డులతో నిరసనకు దిగారు. ఎంపీలు సుబ్బారెడ్డి ,మిథున్ రెడ్డి, గురుమూర్తి, అవినాష్ రెడ్డి, తనుజ రాణి, అయోధ్య రామిరెడ్డిలు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘ ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసాం. రాష్ట్రంలో కోట్లాది సంతకాలు సేకరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో గవర్నర్‌ను కలిసి కోటి సంతకాలు చేస్తాం. ప్రైవేటీకరణ వెనక్కి తీసుకేనేంతవరకూ పోరాటం కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు. ప్రమాదకరస్థాయిలో ఏపీ అప్పులు..ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. 18 నెలల్లోనే రూ 2.66 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. అధిక వడ్డీకి అప్పులు తెచ్చి కుంభకోణానికి పాల్పడుతున్నారు. 9 శాతానికి వడ్డీ తెచ్చి ప్రజలపై భారం వేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి అప్పులు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిధి నుంచి డబ్బులు డ్రా చేసే అవకాఃశం ప్రైవేటు వ్యక్తులకు కల్పించడం దారుణమన్నారు. ప్రభుత్వం చేతుల్లోనే వైద్య రంగం ఉండాలని, ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలన్నారు. రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు చేసిన ఏపీ ప్రభుత్వం.. వైద్య కళాశాలను కాపాడలేదా? అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.ఇవీ చదవండి:కోటి సంతకాలు.. కోట్ల గళాలువిజయవాడకు వైఎస్ జగన్ఇది కదా ప్రజా ఉద్యమం అంటే.. -
Vizag: డాన్సులు, స్టెప్పులతో పోటెత్తిన జనం
-
‘ఇది కదా ప్రజా ఉద్యమం అంటే..!’
చంద్రబాబు సర్కార్ తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.. ప్రజా పోరాటంగా మారిన తీరు యావత్ దేశాన్నే ఆశ్చర్యపరుస్తోంది. వైఎస్సార్సీపీ ఈ ఉద్యమాన్ని “ప్రజా గళం”గా అభివర్ణించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పొచ్చు. అందుకు కారణం.. విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొనడమే!.. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంకల్పించారు. అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారు. తాను అధికారంలో ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు కూడా. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్‌ను నాశనం చేయాలని బలంగా నిర్ణయించింది. స్వతహాగానే పెత్తందారుల సీఎం అయిన చంద్రబాబు.. పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ఆ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్ జగన్ భావించారు. ఒక పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగానే.. కోటి సంతకాల సేకరణ ఉద్యమం “రచ్చబండ” కార్యక్రమం నుంచి మొదలై.. నియోజకవర్గాలు నుంచి ఇవాళ జిల్లా కేంద్రాలు దాటింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైనే సంతకాలు సేకరించి.. వాటిని ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయానికి తరలించింది. వీటిని రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్‌కు నివేదించి.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలన్నదే వైఎస్ జగన్ అభిమతం. రచ్చబండతో షురూ ..అక్టోబర్‌లో వైఎస్సార్సీపీ “రచ్చబండ” పేరుతో ప్రజల మధ్యకు వెళ్లి సంతకాల సేకరణ ప్రారంభించింది. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొని సంతకాలు చేశారు.తుపాను ఆపలేకపోయింది!లక్ష్యం కోటి సంతకాలు. ఆ సమయంలోనే తుపాను, వర్షాలు వచ్చాయి. దీంతో ఈ కార్యక్రమం ప్లాప్ అవుతుందని కూటమి సర్కార్ సంతోషించింది. కానీ, ప్రభుత్వ వ్యతిరేక ప్రజాభిప్రాయం సేకరణ ఏ దశలోనూ ఆగిపోలేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనం సంతకాలు చేస్తూనే వచ్చారు. ఆపై ఈ ప్రజా ఉద్యమం నవంబర్‌కొచ్చేసరికి నియోజకవర్గాల స్థాయికి చేరింది. ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. అటుపై సంతకాల బాక్సులు సేకరించి.. నియోజకవర్గాల నుంచి ర్యాలీగా జిల్లా కేంద్రాలకు తరలించారు. ఆ ర్యాలీలకు అనూహ స్పందన లభించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసించాలి అంటూ ఆ ర్యాలీల్లో నినాదాలు చేశారు. డిసెంబర్ మొదటి వారం కల్లా అన్ని నియోజకవర్గాల నుంచి ఆ బాక్సులను భద్రంగా జిల్లా కేంద్రాల్లోని పార్టీ ఆఫీసులకు తరలించారు. అక్కడి నుంచి ఇవాళ ర్యాలీగా తాడేపల్లికి తరలించారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ఈ ఉద్యమం.. తమ ఆరోగ్యం, విద్యా హక్కుల పరిరక్షణ కోసమని జనం అర్థం చేసుకున్నారు. అందుకే ఇవాళ్టి(సోమవారం) ర్యాలీలో పార్టీ శ్రేణులకు పోటీగా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యం వల్లే ఇది ఒక విశాలమైన ఇప్పుడు ప్రజా ఉద్యమంగా నిలిచి దేశం దృష్టిని ఆకర్షించగలిగింది. -
కోటి సంతకాలసేకరణ ప్రజా ఉద్యమ ర్యాలీలో పాల్గొన్న పేర్ని నాని
-
‘అయ్యా చంద్రబాబూ.. మీరు చేస్తోంది పెద్ద తప్పయ్యా’
సాక్షి, కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తప్పయ్యా.. అంటూ కోటి మందికి పైగా ఏపీ ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెప్పారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. మచిలీపట్నంలో సంతకాల ప్రతులను తరలించే కార్యక్రమాన్ని సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు సర్కార్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజాభిప్రాయాన్ని వైఎస్సార్సీపీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. అంతకు మించే అనూహ్య స్పందన లభించింది. ఈ నేపథ్యంలో.. సంతక పత్రాలతో సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో భారీగా ర్యాలీ నిర్వహించింది. జగన్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని.. కోటి సంతకాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని వైఎస్సార్సీపీ చెబుతోంది. మచిలీపట్నంలో ప్రతులను తరలించే కార్యక్రమాన్ని మాజీ మంత్రి పేర్ని నాని జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు.. వైఎస్సార్సీపీ ఆఫీస్ నుంచి వాహనంలో బాక్సులను స్వయంగా పేర్ని నాని, ఇతర నేతలతో కలిసి ఎక్కించారు. అక్కడి నుంచి కోనేరు సెంటర్ దాకా భారీ ర్యాలీ జరిగింది. -
పార్లమెంటు స్థాయీ సంఘం నివేదికకు ఎల్లో మీడియా వక్ర భాష్యం
సాక్షి, అమరావతి: దేశంలో వైద్యవిద్య నాణ్యతపై ఇటీవల పార్లమెంటు స్థాయీ సంఘం విడుదల చేసిన నివేదికకూ ఎల్లో మీడియా వక్రభాష్యం పలికింది. కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలల ఆవశ్యకత, ఎంబీబీఎస్ సీట్ల పెంపు అవసరాన్ని స్థాయి సంఘం నొక్కివక్కాణిస్తే.. పీపీపీ విధానాన్ని సమర్థించినట్టు కట్టుకథలల్లుతోంది. కొత్తగా కళాశాలలు ఏర్పాటుకు ముందుకొచ్చే ప్రైవేటు సంస్థలకు కేవలం పన్ను రాయితీలు చాలన్న స్థాయీ సంఘం సూచనను వక్రీకరించి చంద్రబాబు ప్రైవేటీకకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చినట్టు దుష్ప్రచారం చేస్తోంది. దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అసలు స్థాయి సంఘం చెప్పిందేమంటే..! ‘దేశంలో వైద్య విద్యకు ఉన్న పోటీకి తగ్గట్టుగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారుతోంది. సీట్లు పరిమితంగా ఉండటంతో దేశం వెలుపల ఎంబీబీఎస్ అభ్యసించడానికి వలస వెళ్లే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటోంది.’ అని పార్లమెంట్ స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం ఇప్పటికే ప్రకటించినట్టు వచ్చే ఐదేళ్లలో 75 వేల సీట్లు జోడిస్తే విద్యార్థులు వలసలు వెళ్లడానికి అవసరం ఉండదని దృఢంగా అభిప్రాయపడింది. దేశంలో వైద్య విద్య నాణ్యతపై ఇటీవల స్థాయీ సంఘం నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక దేశంలోని అనేక రాష్ట్రాల్లోని వైద్య విద్యలో అసమానతలను బట్టబయలు చేసింది. దేశంలో వైద్య విద్యలో అసమానతలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటని స్పష్టం చేసింది. దేశం మొత్తం 1.10 లక్షల ఎంబీబీఎస్ సీట్ల పంపిణీలో రాష్ట్రాల మధ్య అసమానతలను ఎత్తి చూపింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రతి 10 లక్షల జనాభాకు 150కు దగ్గరగా ఎంబీబీఎస్ సీట్లు ఉండగా జాతీయ స్థాయిలో 75 సీట్లే ఉంటున్నాయని వివరించింది. 10 లక్షల జనాభాకు 50 కంటే తక్కువ సీట్లున్న రాష్ట్రాలు ఉన్నాయని పేర్కొంది. అయితే ఆయా రాష్ట్రాల పేర్లను నివేదికలో వెల్లడించలేదు. జాతీయ స్థాయిలో 10 లక్షల జనాభాకు 100 సీట్ల నిష్పత్తిని సాధించడానికి మరో 40 వేల సీట్లు కొత్తగా సమకూర్చాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా 10 లక్షల జనాభాకు వంద కంటే ఎంబీబీఎస్ సీట్లున్న రాష్ట్రాలు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కృషి చేయాలని సిఫార్సు చేసింది. వైద్య కళాశాలలు అందుబాటులో లేని జిల్లాల్లో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, కళాశాలల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైద్య విద్యలో బోధన, బోధనేతర సిబ్బంది కొరత అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్య, ఆరోగ్య శాఖలకు పలు సూచనలు చేసింది. వైద్య విద్యలో అసమానతలు అధిగమించడంతోపాటు, నాణ్యత పెంపునకు స్థాయీ సంఘం చేసిన సిఫార్సులకు ఐదేళ్ల కిందటే వైఎస్ జగన్ రాష్ట్రంలో కార్యరూపం ఇచ్చిందని వైద్యవర్గాల్లో చర్చ ఊపందుకుంది. చంద్రబాబు సర్కారు గ్రహణం 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం బాబు గద్దెనెక్కడంతో మిగిలిన మెడికల్ కళాశాలలకు చంద్రగ్రహణం పట్టుకుంది. ఎక్కడికక్కడ గతేడాది జూన్ నుంచి నిర్మాణాలను ఆపేసి, పీపీపీలో వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టే కార్యక్రమానికి చంద్రబాబు తెరలేపారు. వైద్య విద్యపై బాబు చిన్న చూపు ఏపీ విద్యార్థులకు పెను శాపంగా మారింది. ఉమ్మడి ఏపీ నుంచి వేరుపడిన సందర్భంలో మన కంటే తెలంగాణలో తక్కువ సీట్లు ఉండేవి. ఇదిలా ఉండగా పదేళ్లలో ఆ రాష్ట్రంలో తొమ్మిది వేలకుపైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2014లో కేంద్రంలోని ఎన్డీఏతో పొత్తులో ప్రభుత్వాన్ని నడిపిన బాబు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఒక్కటంటే ఒక్క కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేయలేదు. ఫలితంగా ఐదు కోట్లమందికిపైగా జనాభా ఉన్న ఏపీలో 2019–20లో 4,650 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో కేవలం రెండు వేల సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో ఉండగా, మిగిలినవి ప్రైవేట్ కాలేజీల్లోవి. పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఏపీ కంటే ఎక్కువ సీట్లుండేవి. పోటీకి సరిపడా ఎంబీబీఎస్ సీట్లు లేక, ప్రైవేట్‌లో వైద్య విద్యను కొనే స్థోమత లేని వేల మంది విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్, కజికిస్తాన్ వంటి విదేశాలకు పరుగులు తీశారు. సామాన్య ప్రజలు సైతం ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందక తీవ్ర అగచాట్లు పడేవారు. పీపీపీ పేరిట దోచిపెట్టే కుట్రలు దేశంలో వైద్య విద్యను బలోపేతం చేసే క్రమంలో ప్రభుత్వాలు పీపీపీలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే సంస్థలకు పన్ను రాయితీలు ఇవ్వాలని పార్లమెంట్ స్థాయీ సంఘం సూచించింది. ఇదిలా ఉండగా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ధి చేసిన బోధనాస్పత్రులను, తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతోంది. 10 కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. ప్రభుత్వమే భూములు సేకరించి, టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించి, నిర్మాణాల్లో మంచి పురోగతి సాధించిన కళాశాలలను పప్పుబెల్లాల మాదిరిగా ప్రైవేటుకు కట్టబెట్టేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బాబు సర్కారు అవలంబిస్తున్న విధానం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పార్లమెంట్ స్థాయి సంఘం సైతం కొత్త కళాశాలల ఏర్పాటు కోసం కేవలం పన్ను రాయితీలు మాత్రమే ఇవ్వాలని సిఫార్సు చేయడం గమనార్హం. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా బాబు సర్కారు అడుగులు వేస్తోంది. అంతేకాకుండా విద్యార్థుల నుంచి ఫీజులు, రోగుల నుంచి చార్జీల రూపంలో దోచుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఎకరం భూమికి కేవలం రూ.100 లీజు రూపంలో ఏకంగా 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కళాశాలలు పెట్టేస్తోంది. గతేడాది ప్రారంభం కాకుండా నిలిచిపోయిన పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని వైద్య కళాశాలలకు టెండర్లూ పిలిచింది. వాస్తవానికి పులివెందుల కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణం వైఎస్ జగన్ హాయంలోనే పూర్తయింది. ఈ నేపథ్యంలోనే బాబు ప్రభుత్వం ఏమీ చేయకున్నా పులివెందులకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) 2024–25లోనే 50 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. అయితే కళాశాల మాకొద్దంటూ చంద్రబాబు సర్కార్ ఎన్ఎంసీకి లేఖలు రాసి, అనుమతులు రద్దు చేసింది. మిగిలిన మూడు కళాశాలలు ప్రారంభించకుండా వదిలేసింది. ఇప్పుడీ నాలుగింటిని తొలి దశలో ప్రైవేట్‌కు కట్టబెట్టడమే కాకుండా మరింత బరితెగించి, గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన బోధనాస్పత్రులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టబోతుంది. రెండేళ్ల పాటు ఈ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ఖజానా నుంచి వేతనాలు చెల్లించడం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు రూ.వందల కోట్లు దోచిపెట్టడానికి స్కెచ్ వేసింది.దోపిడీ విధానాన్ని సమర్థించుకోవడానికి పాట్లుపీపీపీ పేరిట దేశంలో ఎక్కడా లేనివిధంగా బాబు సర్కారు తెరలేపిన దోపిడీ విధానంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైంది. నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన నిరసన ర్యాలీలకు రాజకీయాలకు అతీతంగా విద్యార్థి, ప్రజా, మేధావి వర్గాలు తరలివచ్చాయి. ఈ నేపథ్యంలో తన దోపిడీ విధానాన్ని సమర్థించుకోవడానికి చంద్రబాబు సర్కారు నానా పాట్లు పడుతోంది. పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సులకు వక్రభాష్యం చెబుతోంది. వైద్య కళాశాలల అభివృద్ధిలో పీపీపీ విధానమే ఉత్తమం అంటూ తన ఆస్థాన మీడియాలో ప్రచారం చేయించుకుంటోంది. అయితే పార్లమెంట్ స్థాయి సంఘం ఎక్కడా ప్రభుత్వం నిర్మించిన, నిర్మాణం ప్రారంభించిన కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టాలని చెప్పనే లేదు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. మసిబూసి మారేడుగాయ చేయడంలో ఆరితేరిన చంద్రబాబు పార్లమెంట్ స్థాయి సంఘంలోని చిన్న అంశాన్ని ఆయుధంగా మలుచుకుని తాను చేసేదే కరెక్ట్ అన్నట్టు వక్రీకరించేస్తున్నారు.పీపీపీ తప్పితే ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు నిర్వహించడం వేస్ట్ అన్నట్టుగా తప్పుడు ప్రచారాన్ని మరింత విస్తృతం చేసే పనిలోపడ్డారు. ప్లగ్ ప్లే తరహాలో తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడుతూ పీపీపీనే ఉత్తమ విధానం అంటూ సమర్థించుకోవడానికి తెగ తాపత్రయపడుతున్నారు. ఐదేళ్ల కిందటే వైఎస్ జగన్ కార్యరూపం ప్రతి 10 లక్షల జనాభాకు 50 కంటే తక్కువ సీట్లు రాష్ట్రాలు కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని స్థాయి సంఘం ప్రభుత్వాలకు సూచించింది. వైద్య సౌకర్యాలు సరిగా లేని జిల్లాల్లో కళాశాలలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రైవేటులో వైద్య విద్యను అభ్యసించడానికి రూ. కోట్లలో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్న క్రమంలో సామాన్య విద్యార్థుల తెల్లకోటు కల సాకారం చేసే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పింది. పార్లమెంట్ స్థాయీ సంఘం ఇప్పుడు చేసిన సిఫార్సులకు ఐదేళ్ల కిందటే, అంటే 2019లోనే వైఎస్ జగన్ కార్యరూపంలోకి తీసుకొచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసి, ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తానన్న హామీని అమలు చేస్తూ ఏకంగా రూ.8వేల కోట్లకుపైగా నిధులతో 17 కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి వరకూ ఒక్క ప్రభుత్వ/ప్రైవేట్ వైద్య కళాశాల లేని పల్నాడు, ఏఎస్ఆర్, బాపట్ల, అన్నమయ్య, సత్యసాయి, అనకాపల్లి, పార్వతీపురం మన్యం ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్‌స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేసే దిశగా అడుగులు వేశారు. మరోవైపు ప్రైవేట్ వైద్య కళాశాలే తప్ప ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందని నంద్యాల, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లోనూ కొత్త వైద్య కళాశాలలు నెలకొల్పడానికి నడుం బిగించారు. వీటితోపాటు కృష్ణా జిల్లా మచిలీపట్నం, కర్నూల్ జిల్లా ఆదోని, వైఎస్సార్ జిల్లా పులివెందుల, ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో కొత్త కళాశాలల నిర్మాణాలను కరోనా సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని అధిగమించి ప్రారంభించారు. 2023లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, 2024లో పాడేరు వైద్య కళాశాలను ప్రారంభించారు. -
కోటి సంతకాల పత్రాలతో.. నేడు జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు
సాక్షి, అమరావతి: పేదలకు నాణ్యమైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను అందకుండా చేస్తూ.. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తూ.. రూ.లక్ష కోట్ల ప్రజల ఆస్తులను బినామీలకు కట్టబెట్టి ‘నీకింత నాకింత’ అంటూ పంచుకు తినేందుకు చంద్రబాబు సర్కారు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పైగా.. ఈ ప్రజా ఉద్యమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగ–ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజాసంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు స్వచ్ఛందంగా కదంతొక్కడం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడీ ఉద్యమం తుది అంకానికి చేరుకుంది. కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండటాన్ని నిరసిస్తూ 175 నియోజకవర్గాల్లోనూ కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు చేసిన పత్రాలను ఆయా నియోజకవర్గాల నుంచి ఇప్పటికే జిల్లా కేంద్రాల్లోని వైఎస్సార్సీపీ కార్యాలయాలకు భారీ ర్యాలీలతో తరలించారు. ఈ నేపథ్యంలో.. సోమవారం జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల పత్రాలతో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను చాటిచెప్పేలా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు నిర్వహిస్తోంది. ర్యాలీల్లో పాల్గొంటే కేసులంటూ బెదిరింపులు.. ఇక ఈ ర్యాలీలను అడ్డుకోవడానికి చంద్రబాబు సర్కారు అప్పుడే పోలీసులను ఉసిగొలిపింది. ర్యాలీల్లో పాల్గొనవద్దని.. పాల్గొంటే కేసులు పెడతామంటూ వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్థులు, ప్రజాసంఘాల నేతలకు జిల్లాల్లో పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. అయితే, ఈ బెదిరింపులను ఏమాత్రం ఖాతరు చేయబోమని.. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహించే ర్యాలీల్లో కదంతొక్కుతామని వారు తేల్చిచెబుతున్నారు. కోటి సంతకాల పత్రాలతో జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి.. కొత్త మెడికల్ కాలేజీలపై చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరి, బినామీలకు కట్టబెట్టి కమీషన్ల దండుకోవడానికి వేసిన ప్రణాళిక.. పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్యను దూరం చేయడానికి చేస్తున్న కుట్రను మరోసారి ప్రజలకు వైఎస్సార్సీపీ నేతలు వివరించనున్నారు. ఆ తర్వాత కోటి సంతకాల పత్రాలు ఉన్న వాహనాలను జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడానికి జెండా ఊపి ప్రారంభిస్తారు. జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ఈ కోటి సంతకాల పత్రాలను ఈనెల 18న సా. 4 గంటలకు పార్టీ నేతలతో కలిసి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్‌కు నివేదిస్తారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వివరిస్తారు. ప్రభుత్వమే వాటిని పూర్తిచేసి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేయనున్నారు. వాహనాల ర్యాలీకి అనుమతివ్వండి.. కోటి సంతకాల ప్రతులున్న వాహనాల ర్యాలీలకు అనుమతివ్వాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈ మేరకు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ర్యాలీల్లో పాల్గొనద్దంటూ జిల్లాల్లో పోలీసులు నోటీసులు జారీచేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ర్యాలీలు, సంతకాల పత్రాల రవాణా సజావుగా సాగేందుకు అనుమతి అవసరమని.. దీనికోసం అన్ని జిల్లాల ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని అప్పిరెడ్డి తన లేఖలో డీజీపీకి విజ్ఞప్తి చేశారు. -
ప్రైవేటు వ్యక్తులకు లాభాలు, పేదలపై భారమా?: సీదిరి
సాక్షి, శ్రీకాకుళం: పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణమే మేలంటూ ఎల్లోమీడియా రాతలు రాయడం అన్యాయం, దుర్మార్గమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు. ‘‘గతంలో విశాఖపట్నం తూర్పు తీరంలో ఉండటం వల్ల తీవ్రవాద దాడులకు టార్గెట్, విదేశీ దాడులకు సాఫ్ట్ టార్గెట్ అని రాశారని, విశాఖ భూకంపాల జోన్లో ఉంది. హైరిస్క్ ఏరియా అని రాశారని, గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోయి విశాఖ మునిగిపోతుంది, కాబట్టి రాజధానిగా చేయొద్దంటూ రాతలు రాశారని గుర్తు చేశారు.‘‘ఇప్పుడు విశాఖపట్నం అద్బుతం, ఇక్కడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, బంగారం పండుతుంది, సిలికాన్ లభిస్తుంది, కాబట్టి ఇక్కడే పెట్టుబడులు పెట్టండి, చంద్రబాబు విజన్ వల్లే విశాఖ ఇలా మారిపోతుందని రాస్తున్నారు’’ అంటూ సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..ఆ సంఘం సిఫార్సులంటూ పిచ్చిరాతలు:పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే పేదలకు మేలు జరుగుతుందని చంద్రబాబు ఏడాదిగా చెబుతున్నారు. ప్రైవేటు గుత్తాధిపత్యం ఎక్కువైతే ఏం జరుగుతుందో ఇండిగో వ్యవహారంలో చూశాం. మన ఎంపీ కేంద్రమంత్రిగా ఉండి ఏం చేశారో చూశాం. ప్రభుత్వ ఆస్పత్రులు, కాలేజీలు లేకపోతే మన పరిస్ధితి ఏంటో అంతా అలోచించాలి. వైద్య వ్యవస్థలు ప్రైవేటు చేతుల్లో ఉంటే కరోనా లాంటి విపత్తుల్లో ఏం జరిగి ఉండేదో ఆలోచించాలి.ఇప్పుడు పార్లమెంటరీ స్దాయీ సంఘం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందంటూ పిచ్చి రాతలు రాస్తున్నారు. నిజానికి కమిటీ ఏం చెప్పిందన్నది చూస్తే.. మెడికల్ కాలేజీల నిర్వహణకు ఎవరైనా ముందుకొస్తే రాయితీలు ఇవ్వాలని, అర్హులైన విద్యార్ధులుంటే స్కాలర్ షిప్పులు ఇవ్వాలని, వైద్య విద్యలో సీట్లు పెంచడం తప్పనిసరి అని పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్పింది. వైద్య విద్య, సామాగ్రి ఖర్చు పెరిగిపోతున్న తరుణంలో పీపీపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని మాత్రమే సిఫార్సు చేసింది.అంతే తప్ప ఉన్నవాటిని పీపీపీ విధానంలో చేపట్టాలని ఎక్కడా చెప్పలేదు. అదే వాస్తవమైతే ఎయిమ్స్, జిప్ మర్, ఐఐటీ వంటి సంస్థలు కూడా పీపీపీ విధానంలో పెట్టుకోవాలి కదా?. ప్రైవేటువాళ్లు ముందుకొస్తే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు చేపట్టాలని మాత్రమే పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్తే ఉన్న కాలేజీల్ని ప్రైవేటు చేతుల్లో పెడుతున్నారు.ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం స్కాం, నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, వెన్నుపోటే కాదు పేదల కలకల్ని తుంచేయడమే అవుతుంది. దీనికి తోడు ప్రైవేటు ఆస్పత్రుల్లో జీతాలు కూడా ప్రభుత్వమే రెండేళ్ల పాటు ఇస్తుందంటున్నారు. ఇలాంటి ఆఫర్లు ఎక్కడైనా విన్నామా ? భూములు, భవనాలు, ఆస్పత్రులు, మౌలిక సదుపాయాలు, జీతాలు ప్రభుత్వం ఇస్తుంటే లాభాలు ప్రైవేటుకు ఇచ్చి, భారం పేదలపై వేస్తారా? ఇదీ చంద్రబాబు చెప్తున్న పీపీపీ మోడల్. మొన్నటివరకూ పీపీపీ మోడ్ లో ఏర్పాటు చేసినా ప్రభుత్వం నిర్వహణ చూస్తుందన్నారు. అంటే జీతాలు ప్రభుత్వం ఇచ్చి లాభాలు ప్రైవేటు వ్యక్తులకు వెళ్లడమా ?, ఇది కొత్త మౌలిక సదుపాయాల కల్పన కాదు, ఉన్న వాటినే ప్రైవేటు చేతుల్లో పెట్టడం. మెడికల్ కాలేజీలు కొత్త వారు ఏర్పాటు చేస్తామంటే వారికి రాయితీలతో అవకాశం ఇవ్వండి. అంతే తప్ప మనం డబ్బులు పెట్టి, భూసేకరణ చేసి, భవనాలు కట్టి ప్రైవేటుకు లాభాలు ఇస్తారా ? ఇది మంచి విధానం అంటూ ఆస్థాన కరపత్రికలతో పొగడ్తలా ?జగన్‌కి పేరు వస్తుందనే ఇదంతా..:మొన్నే రెండు వారాల క్రితం అమరావతి కోసం రూ.7500 కోట్లు అప్పు చేశారు. నిన్న దాన్ని క్యాబినెట్లో ఆమోదించారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాలకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నారు. కలల రాజధానిలో కి.మీ రోడ్డు వేసేందుకు రూ.180 కోట్లకు టెండర్ ఇచ్చారు. అలా మూడు కి.మీ రోడ్డు కోసం రూ.540 కోట్లకు టెండర్ ఇచ్చారు. రెండు, మూడు కిలోమీటర్ల రోడ్డు ఖర్చుతో ఒక మెడికల్ కాలేజీ పూర్తయిపోతుంది. కానీ మెడికల్ కాలేజీలు పెట్టడానికి డబ్బులు లేవంటున్నారు.పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలు దోచి పెడుతున్నారు:అసలు మెడికల్ కాలేజీలకు కొత్తగా డబ్బు తీసుకు రావాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్ హయాంలోనే నాబార్డ్ వంటి ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. నాబార్డ్‌ను సంప్రదిస్తే మెడికల్ కాలేజీలకు నిధులు దొరుకుతాయి. కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరమే లేదు. కేవలం వైఎస్ జగన్‌కు పేరు వస్తుందనే దుగ్ద తప్ప ఇందులో మరొకటి లేదు. అందుకే వాటిని ప్రైవేటు వ్యక్తులకు, బినామీలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క మెడికల్ కాలేజీలో ఉద్యోగుల నెల జీతాలకు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అలా ఏడాదికి రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు అవుతుంది. 10 మెడికల్ కాలేజీలకు ఇలా ఇస్తే రూ.700 కోట్లు అవుతుంది. రెండేళ్లు ఇలా ఇస్తారా?. ఇది ఎంత వరకు సబబు?ఇంకా 10 మెడికల్ కాలేజీలకు సుమారు 257 ఎకరాలు సేకరించాం. ఒక్కో కాలేజీకి 50 ఎకరాల చొప్పున దోచి పెడుతున్నారు. కేంద్రం ఇచ్చిన పీజీ సీట్లు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కింద ప్రైవేటుకు ఇచ్చేశారు. ఎన్నారై సీటు ఫీజు రూ.29 లక్షలని జీవో కూడా ఇచ్చారు. మేనేజ్ మెంట్ కోటా సీటు రూ.9 లక్షలని ఇచ్చారు.రికార్డుస్థాయిలో అప్పు:అసలు ఈ ప్రభుత్వం ఎటు పోతోంది? డబ్బుల్లేవంటూనే 18 నెలల్లోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేశారు. రాష్ట్రానికి భారీ అప్పులు తెచ్చుకుంటూ మరోవైపు జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చెప్పుకుంటున్నారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తీసుకెళ్తున్నారు.కోటి సంతకాలు గవర్నర్‌కి సమర్పణ:10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చర్యలపై ప్రజా ఉద్యమం చేపట్టిన వైయస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగించింది. దానికి అన్ని చోట్ల, అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. ఆ కోటి సంతకాల పత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరుకోగా, సోమవారం (డిసెంబరు 15వ తేదీ) అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నాం. అక్కణ్నుంచి అవి విజయవాడ చేరుకుంటాయి. ఆ పత్రాలను ఈనెల 18న గవర్నర్‌కి సమర్పిస్తాం. ఆ మేరకు ఆరోజు సా.4 గం.కు, మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్‌నజీర్‌తో భేటీ కానున్నారని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వివరించారు. -
ప్రజా పాలన ఎలా చేయాలో చంద్రబాబు తెలుసుకోవాలి
సాక్షి, ఏలూరు: వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ జరిగింది. అక్టోబర్ 10వ తేదీ నుండి ప్రతి నియోజకవర్గంలో ఉద్యమంలా సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 4 లక్షల 25 వేల సంతకాలు సేకరించగా, రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు దాటాయి. ఈ నెల 15వ తేదీన కోటి సంతకాల ప్రతులను పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నాము. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలోని ప్రతీ వైసీపీ నాయకులు, ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది. మరో 6 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు, ప్రజా పాలన ఎలా చేయాలో చంద్రబాబు తెలుసుకోవాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలం వచ్చినా సంక్షేమ పథకాలు మాత్రం ఆగలేదు. తూర్పు నియోజకవర్గంలో 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడూ వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర గవర్నర్‌కు కోటి సంతకాలను మాజీ సీఎం వైఎస్ జగన్ అందజేయనున్నారని అవినాష్ వెల్లడించారు. -
18న గవర్నర్‌తో వైఎస్ జగన్ భేటీ ఖరారు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భేటీ ఖరారు అయ్యింది. ఈ నెల 18వ తేదీన ఈ భేటీ జరగనుందని వైఎస్సార్సీపీ పేర్కొంది. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ప్రజా స్పందనను ఈ భేటీలో గవర్నర్‌కు వైఎస్ జగన్ తెలియజేయనున్నారు.ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సిద్ధపడింది. అయితే దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నడుస్తోంది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ జరిగింది. ఇందుకు సంబంధించిన నివేదికను వైఎస్ జగన్ స్వయంగా గవర్నర్‌కు సమర్పించి.. ప్రైవేటీకరణను అడ్డుకునేలా విజ్ఞప్తి చేయనున్నారు. గవర్నర్ కార్యాలయం షెడ్యూల్ ప్రకారం.. తొలుత 17వ తేదీన ఈ భేటీ జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఒకరోజు ముందుకు మార్చినట్లు గవర్నర్ కార్యాలయం వైఎస్సార్సీపీకి సమాచారం అందించింది. దీంతో 18వ తేదీన భేటీ జరగనుంది. ఆరోజు సాయంత్రం 4 గం.కు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వైఎస్ జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలుస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై(వ్యతిరేకత) ప్రజాభిప్రాయాన్ని గవర్నర్‌కి నివేదిస్తారు. అలాగే పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్‌కి చూపిస్తారు. ఆ మేరకు 26 జిల్లాల నుంచి.. ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలించనున్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ఇండిగో తరహా సంక్షోభమే!
సాక్షి, ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వేగంగా చేయాలని ప్రయత్నిస్తోందని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆపాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కోరుతున్నారు. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీల బృందం ఈ మేరకు వినతి పత్రం అందజేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు మెడికల్ కోర్సులు చదవడం కష్టంగా మారుతుంది. పేద వర్గాలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర ఇది. ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. ఈనెల 17న ఈ కోటి సంతకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్‌కు అందిస్తారు. అందుకే ప్రభుత్వం వేగంగా మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రైవేటీకరణను ఆపాలి.. .. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హాయంలో 17 కొత్త ప్రైవేట్ మెడికల్ కాలేజీలను నిర్మాణం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఆస్తులను లీజుకు ఇస్తున్నారు. వంద రూపాయలకు ఎకరం చొప్పున ఒక్కో సంస్థకు 50 ఎకరాలు అప్పజెప్తున్నారు. దొడ్డి దారిన వారి నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఈ విధానాల వల్ల ప్రభుత్వ కాలేజీలలో డాక్టర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అని వినతి పత్రంలో ఎంపీలు పేర్కొన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో.. వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి, రఘునాథ్ రెడ్డి , సుభాష్ చంద్రబోస్ , బాబురావు , అయోధ్య రామిరెడ్డి తదితరులు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామను కలిసి కుట్రను వివరించాం. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. కేంద్ర బడ్జెట్లో ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఆమెనే నిధులు కేటాయించారు. ఏపీలో ఇప్పటికే మూడు మెడికల్ కాలేజీలకు ఫండింగ్ వచ్చింది. మిగిలిన మెడికల్ కాలేజీలకు ఫండ్ ఇవ్వాలని కోరాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయవద్దని కోరాంప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వల్ల పేదల విద్యార్థులకు పేదలకు అన్యాయం జరుగుతుంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పిన అమరావతికి ఇప్పుడు అప్పు ఎందుకు తెచ్చారు?. మెడికల్ కాలేజీల రూపంలో లక్ష కోట్ల రూపాయలు ఆస్తి వస్తున్నా.. తనకు కావలసిన మనుషులకు పంచడానికి ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది రాబోయే తరాలకు, పేదలకు నష్టం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను విద్యార్థులు తమ టాపు ప్రయారిటీగా ఎంచుకుంటారు. వైద్య రంగాన్ని ప్రైవేటీకరించడం వల్ల ఇండిగో లాంటి సంక్షోభం తలెత్తుతుంది అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. -
‘వైఎస్సార్సీపీతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు ఖాయం’
సాక్షి,విజయనగరం: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు ఖాయమాని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం విజయనగరంలో బొత్స సత్య నారాయణ మీడియాతో మాట్లాడారు. ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా కొనసాగింది. సామాన్యులకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. నియోజక వర్గాల నుండి వచ్చిన కోటి సంతకాల కార్యక్రమం పత్రాలను గవర్నర్ కు అందచేస్తాం. డిసెంబర్ 18న వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి గవర్నర్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వ్యక్తిగత లబ్ధి కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసింది. ప్రతినియోజక వర్గంలో వేలాది మంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. చంద్రబాబు ఎప్పడు కార్పొరేట్ కంపెనీలకే మేలు చేస్తారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే పేదలకు వైద్యం అందుతుంది.కోవిడ్ లాంటి విపత్తులు వస్తే పేదల ఆరోగ్యం కాపాడగలం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరమైతే పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసింది. మరో రెండు కాలేజీలకు అనుమతులు కూడా తెచ్చింది.తరువాత వచ్చిన ప్రభుత్వం మెడికల్ కాలేజీలను కొనసాగించాల్సి ఉన్నా అలా చేయడం లేదు. కూటమి ప్రభుత్వానికి ఓటేసిన పాపానికి పేద ప్రజలు ఇబ్బంది పడకూడదను సదుద్దేశ్యంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ రద్దు చేస్తోందని’ స్పష్టం చేశారు. -
లక్ష్యానికి మించి YSRCP కోటి సంతకాల సేకరణ
-
Kodali Nani Speech: జగన్‌ను మళ్ళీ సీఎం చేసేందుకు.. రంగంలోకి కొడాలి నాని
-
వెంటనే ఆపేయండి.. మెడికల్ కాలేజీల జోలికి పోవద్దు
-
18 నెలల్లో ఏపీలో ఏ ఒక్క రంగంలో అభివృద్ధి లేదు: బొత్స
సాక్షి, కోనసీమ: విద్యా, వైద్యం అనేవి ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలని.. దురదృష్ట శాత్తు కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంతో పాటు పలు సమస్యలపై సోమవారం ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేట్పురం చేయాలన్న నిర్ణయం వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు కార్యక్రమాన్ని చేపట్టాం. ఈనెల 10వ తేదీన సేకరించిన సంతకాలను ఆయన జిల్లాల కేంద్ర కార్యాలయాలకు తరలిస్తాం. 15వ తేదీన జిల్లాల నుంచి సేకరించిక సంతకాల పేపర్లను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలిస్తాం. ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు తన తాబేదార్లకు మెడికల్ కళాశాల కట్టుపెట్టి ప్రయత్నం చేస్తోంది. రానున్న కాలంలో వైద్యం ప్రైవేటు చేతుల్లోకి పూర్తిగా వెళితే సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతారు... గడచిన 18 నెలల్లో ప్రభుత్వం ఏ రంగంలోనూ వృద్ధి సాధించలేదు. 18 నెలల్లో ఎన్ఆర్ఈజీఎస్లో ఏడు కోట్ల పని దినాలు తగ్గించారు. ప్రభుత్వం ఉపాధి కల్పించలేకపోతోంది. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పేదలకు పని దినాలు కల్పించలేని ఈ ప్రభుత్వం.. అద్భుతమైన ఉద్యోగాలు కల్పిస్తామని ఎలా హామీ ఇస్తుంది?. పేరెంట్స్ మీటింగ్ జరిగిన పాఠశాలలు ఐదేళ్ల క్రితం ఎలా ఉన్నాయో?.. ఇప్పుడు ఎలా ఉన్నాయో చంద్రబాబు గమనించారా.?. రాష్ట్రంలో సాగయ్యే ఈ పంటకు కనీస మద్దతు ధర లేదు. రైతులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాలు ఈ ప్రభుత్వంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మంత్రులు అకౌంటబిలిటీతో మాట్లాడాలి. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది. గడచిన 18 నెలల్లో రాస్తున్న క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. హత్యలు, మానభంగాలు చిన్నారులపై అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. ప్రజల తరపున పోరాటం చేస్తాం. అన్ని వర్గాలకు అండగా ఉంటాం’’ అని బొత్స అన్నారు. -
ఈ సర్కారుకు మాయరోగం!
‘‘ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేయడం అన్నది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీకి 18 నెలలకు రూ.5,400 కోట్లు ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.1,800 కోట్లు. ఇంకా రూ.3,600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలున్నాయి. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే పెద్ద స్కాము.. వాటిని తీసుకున్న వారికి మరో పెద్ద బొనాంజా..! ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తున్న సిబ్బందికి గవర్నమెంటే జీతాలు ఇస్తుందట. గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ భవనాలు, గవర్నమెంట్ సిబ్బంది, గవర్నమెంట్ జీతాలు.. కానీ ఓనర్లేమో ప్రైవేటు వాళ్లు! లాభాలేమో ప్రైవేటు వాళ్లకు! భారమేమో ప్రజలపై! బొనాంజా కాదా ఇది?’’ - వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబు ప్రభుత్వానికి మాయరోగం వచ్చింది. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు. గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? ఏం చేయడం కోసం ప్రజలు నీకు అధికారం ఇచ్చారు? విద్య, వైద్యం, వ్యవసాయం, శాంతిభద్రతల పరిరక్షణ, పారదర్శక పాలన.. ఇవి కదా చేయాల్సింది. కానీ అన్నీ తిరోగమనమే. అన్నీ స్కాములే. ఏవీ పట్టించుకునే పరిస్థితి లేదు. అన్నీ ప్రైవేటీకరణే.. బాధ్యత నుంచి తప్పించుకోవడం.. ఉన్నకాడికి స్కామ్‌లు చేయడమే..’’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. దారుణంగా ప్రజారోగ్య వ్యవస్థ ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేయడం అన్నది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ అమలుకు నెలకు రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 18 నెలలకు కలిపి రూ.5,400 కోట్లు ఇవ్వాలి. ఇటీవల నేను దీనిపై పలుదఫాలు మాట్లాడటం.. వాళ్లు కూడా (నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు) స్ట్రైక్‌లు చేయడంతో ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.1,800 కోట్లు. అంటే ఇంకా రూ.3,600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలున్నాయి. చివరికి మొన్న నెట్వర్క్ ఆస్పత్రులన్నీ సమ్మెకు దిగాయి. సమ్మె విరమించేటప్పుడు ప్రభుత్వం వాళ్లకిచి్చన మాటకు ఇంతవరకు దిక్కులేదు. పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. 104, 108 సేవలను స్కాములుగా మార్చేశారు. రూ.5 కోట్లు టర్నోవర్ లేని వాటికి 104, 108 సరీ్వసుల నిర్వహణను అప్పగించేశారు. ఆ వ్యక్తి ఎవరంటే.. టీడీపీ ఆఫీసులో డాక్టర్ల సెల్ అధ్యక్షుడట..! ఓ పక్క ఇంత దారుణంగా ఆరోగ్య వ్యవస్థ ఉంటే.. మరోవైపు సంజీవని అంటారు. అది ఇంకో డ్రామా. అన్నీ గవర్నమెంట్వే.. లాభాలేమో ప్రైవేటు వాళ్లకు! మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణే పెద్ద స్కాము.. వాటిని తీసుకున్న వారికి మరో పెద్ద బొనాంజా.. ఓవైపున ఆరోగ్యశ్రీని ఖూనీ చేస్తూ.. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా హతం చేస్తూ ఇంకోవైపు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఒక స్కాముగా మారుస్తూ ఈ ప్రభుత్వ పాలన సాగుతోంది. కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం ఒక స్కాము అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాంజా కూడా ఇచ్చారు. అది ఇంకో పెద్ద స్కామ్. ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తున్న సిబ్బందికి గవర్నమెంటే జీతాలు ఇస్తుందంట. (ప్రభుత్వం జారీ చేసిన జీవో 847ను ప్రదర్శించారు). ఒక్కో టీచింగ్ హాస్పిటల్ (550 పడకల ఆసుపత్రి)లో ఉద్యోగుల జీతాల కోసం నెలకు దాదాపు రూ.5 నుంచి రూ.6 కోట్లు ఖర్చవుతుంది. అంటే ఏడాదికి రూ.60 నుంచి రూ.70 కోట్లు. రెండేళ్లకు రూ.120 నుంచి రూ.140 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం ఇస్తుంది.ఆశ్చర్యమేమిటంటే.. గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ భవనాలు, గవర్నమెంట్ సిబ్బంది, గవర్నమెంట్ జీతాలు.. కానీ ఓనర్లేమో ప్రైవేటు వాళ్లు! లాభాలేమో ప్రైవేటు వాళ్లకు! భారమేమో ప్రజలపై! ఆశ్చర్యంగా లేదా ఇది..? బొనాంజా కాదా ఇది? స్కాముల్లో అన్నిటికంటే పెద్ద స్కామ్ కాదా ఇది? ఓవైపు ప్రజా ఉద్యమం జరుగుతోంది. దానిని ఖాతరు చేయకుండా, సిగ్గు లేకుండా చంద్రబాబు స్కాములపర్వం ముందుకు పోతోంది. ఒక పక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి మందికిపైగా ప్రజలు సంతకాలు చేస్తున్నారు. మరో వైపున వాటిని ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తున్న స్కామ్‌ల్లో ఒక అడుగు ముందుకేసి ఇంకో స్కామ్ చేస్తున్నాడు.16న గవర్నర్‌కు కోటి సంతకాల పత్రాలు అందచేస్తాంకొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో రోడ్లెక్కుతున్నారు. 175 నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి మా పార్టీ భారీ ర్యాలీలు చేపట్టి ప్రజల గొంతుకను వినిపించింది. కోటిమందికి పైగా సంతకాలు చేసి ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ నెల 10వ తేదీన సంతకాలు చేసిన పత్రాలను నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శించి ప్రజలకు, మీడియాకు అందరికీ చూపించి జిల్లా కేంద్రాలకు పంపుతారు. ఈ నెల 13వ తేదీన జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేసి పార్టీ సెంట్రల్ ఆఫీసుకు చేరుస్తారు. ఆ కోటి సంతకాల పత్రాలను ఈ నెల 16న గవర్నర్‌కు అందచేస్తాం. ఆ తరువాత ఈ పత్రాలతో హైకోర్టులో పిటిషన్ వేస్తాం. -
YS Jagan: ఈ నెల 16వ తేదీన గవర్నర్ ను కలుస్తా.. చంద్రబాబు సంగతి తెలుస్తా..
-
16న వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్‌కు కోటి సంతకాలు అందజేత
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ జిల్లా పార్టీల అధ్యక్షులు, పార్లమెంటరీ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినేషన్, అనుబంధ విభాగాలు), రాష్ట్ర కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్)తో బుధవారం రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలా సాగిందన్నారు. సంతకాలు కోటి అనుకుంటే అంతకుమించి వస్తున్నాయని చెప్పారు. ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో సేకరించిన సంతకాలను ఈ నెల 10న జిల్లా పార్టీ కార్యాలయాలకు పంపాలని సూచించారు. 13న జిల్లా కార్యాలయాల నుంచి కేంద్ర కార్యాలయం తాడేపల్లికి పంపాలని కోరారు. ఈ నెల 16న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో గవర్నర్‌కు కోటి సంతకాలు అందజేయనున్నట్టు చెప్పారు.సేకరించిన సంతకాలన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల ముందు, మీడియా ముందు ప్రదర్శించి వారి సమక్షంలోనే బాక్సుల్లో సర్ది వాహనాల్లో పెట్టి నాయకులు జెండా ఊపి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన నాయకులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 13న జిల్లా కేంద్రంలో కూడా అదే స్థాయిలో కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకంగా చెప్పారని వెల్లడించారు. జిల్లా కేంద్రం నుంచి వేలాది మందితో ర్యాలీలు చేపట్టి రాష్ట్ర కార్యాలయానికి పంపాలన్నారు. పార్టీ అనుబంధ విభాగాలు కూడా ఇందులో కీలకపాత్ర పోషించాలని సూచించారు. -
ప్రశ్నిస్తానన్న పవన్ ఏమైపోయాడో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి
-
బాబు బేరసారాలు.. రూ. వంద కోట్లు దోచిపెట్టే కుట్ర!
-
ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు ఆ కాలేజీలకు రాష్ట్ర ఖజానా నుంచి వంద కోట్ల రూపాయలు దోచిపెట్టే కుతంత్రం
-
ప్రైవేటుకు కాలేజీలు.. అప్పనంగా ఆస్పత్రులూ..
నిన్న...ప్రభుత్వ భూమిలో... ప్రభుత్వ డబ్బుతో... వైఎస్సార్సీపీ సర్కారులో వైఎస్ జగన్ నిరి్మంచిన వైద్య కళాశాలలను పప్పుబెల్లాల తరహాలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వం. తద్వారా మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలను చిదిమేసింది. మనకు రావాల్సిన మెడికల్ సీట్లను కూడా పోగొట్టింది. పేదలకు ఉచితంగా అందాల్సిన మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని దూరం చేసింది.నేడు..చంద్రబాబు సర్కారు మరింత బరితెగించింది. ప్రభుత్వ డబ్బులతో నిరి్మంచిన నాలుగు ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పబోతోంది. కొసమెరుపు ఏంటంటే... ఇప్పటికే ఇక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బందికి జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. రెండేళ్ల పాటు గంపగుత్తగా ఆస్పత్రిని ప్రైవేటుకు అప్పజెప్పడమే కాకుండా.. ఈ రెండేళ్లు పాటు అక్కడ పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది అందరికీ ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తుందట. అంటే... ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు కట్టి, ప్రభుత్వ ఆస్పత్రిని, దానిలో పనిచేసే సిబ్బంది జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లించి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టబోతోంది. బహుశా ప్రపంచ చరిత్రలో ఏ ప్రజాస్వామిక ప్రభుత్వమూ చేయని రీతిలో చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. సాక్షి, అమరావతి: సంపద సృష్టి హామీతో గద్దెనెక్కిన చంద్రబాబు... పచ్చపార్టీ కార్పొరేట్లు, అస్మదీయులు, బంధుమిత్రులకు ప్రజా సంపదను దోచిపెట్టడంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ)ను ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో నిరి్మంచిన కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు వారికి పప్పుబెల్లాల్లా కట్టబెడుతున్నారు. భూమి ప్రభుత్వానిది, మెడికల్ కాలేజీ ప్రభుత్వానిది, ఆస్పత్రులు ప్రభుత్వానివి, అక్కడ పనిచేసే వైద్య సిబ్బందిని హోల్‌సేల్‌గా ప్రైవేటుకు అప్పజెప్పడమే కాక రెండేళ్ల పాటు వారి జీతాలను ప్రభుత్వమే చెల్లించడానికి సిద్ధమైంది. తద్వారా జీతభత్యాల రూపేణానే వందల కోట్ల రూపాయిలను అప్పనంగా ప్రైవేటు వారికి దోచిపెడుతోంది. జగన్ శ్రీకారం.. చంద్రబాబు బేరం వైఎస్ జగన్ రూ.8,480 కోట్లతో కొత్తగా 17 మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టగా గత ప్రభుత్వంలోనే ఐదు కళాశాలలు ప్రారంభమై తరగతులు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు 10 వైద్య కళాశాలలను చంద్రబాబు సర్కార్ ప్రైవేట్‌కు కట్టబెడుతున్న విషయం తెలిసిందే. తొలి దశలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె కళాశాలలను కైవసం చేసుకునే ప్రైవేట్‌కు ధారాదత్తం చేసింది. ఇది చాలదన్నట్లు వాళ్లకు ప్రభుత్వ ఆస్పత్రులను రెండేళ్ల పాటు అప్పగించనుంది. వాటిలో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ఖజానా నుంచి వేతనాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏకంగా రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అధికారికంగా దోచిపెడుతోంది. ఆర్ఎఫ్పీకి సవరణలు చేస్తూ ఉత్తర్వులు ఇప్పటికే రూ.కోట్ల విలువైన భూములను ఎకరానికి రూ.వంద లీజు, వైద్య సేవలకు రుసుములు, ప్రైవేట్ కళాశాలల మాదిరి వైద్య విద్యార్థుల నుంచి ఫీజు వసూలుతో ప్రైవేట్ వ్యక్తులకు భారీ మేలు తలపెట్టడానికి బాబు సర్కారు సిద్ధమైంది. ఇదికూడా సరిపోనట్లుగా ప్రైవేట్ వ్యక్తులకు మరింత లబ్ధి చేకూరుస్తూ ఖజానా నుంచి ఏకంగా రూ.వందల కోట్లపైనే ప్రయోజనం చేకూర్చే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)కు సవరణలు చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అత్యాధునిక పరికరాలు, పోస్టులు భర్తీ చేసిన జగన్ సర్కారు.. తొలి దశలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు ఇస్తూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్లు పిలిచింది. వీటిలో పులివెందుల వైద్య కళాశాల, ఆస్పత్రి నిర్మాణం గత వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే పూర్తయ్యాయి. మిగతా మూడుచోట్ల ఏపీవీవీపీ ఆస్పత్రులను 300 పైగా పడకల ఆస్పత్రులుగా అభివృద్ధి చేశారు. అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చడంతో పాటు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా వైద్యులు, బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేశారు. పులివెందుల కళాశాలలో 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులను ప్రారంభించడానికి ఎన్ఎంసీ నుంచి అనుమతులు కూడా వచ్చాయి. కానీ, బాబు సర్కారు కళాశాలకు సీట్లు వద్దని లేఖ రాసి రద్దు చేయించింది. దీన్నిబట్టి పరిశీలిస్తే ప్లగ్ అండ్ ప్లే తరహాలో నాలుగు కళాశాలలు ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాగా, ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ఒక కొత్త వైద్య కళాశాలను స్థాపించాలంటే 25 ఎకరాల భూమి సమకూర్చుకోవాలి. కనీసం 320 పడకల బోధనాస్పత్రిని అభివృద్ధి చేశాక... ఎన్ఎంసీకి దరఖాస్తు చేసి ఓపీ, ఐపీ, సర్జరీలు, ఇతర సేవల్లో నిర్దేశించిన ప్రమాణాలను అధిగమించాకే నెలకొల్పే అర్హత వస్తుంది. ఇది ఎంతో ఖర్చు, ప్రయాసలతో కూడినది. దీనంతటికీ రూ.వందల కోట్ల పెట్టుబడి పెట్టి, సుమారు ఐదేళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ వ్యయ ప్రయాసలేమీ లేకుండా తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న కళాశాలలను బాబు సర్కార్ ప్రైవేట్‌కు ఇచ్చేసింది. దాంతో ఆగకుండా మరింత బరితెగించి ఆస్పత్రులను ఇచ్చేసి, అక్కడి పనిచేసే వైద్య సిబ్బందికి జీతాలను కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి 800 మంది వైద్య సిబ్బంది నాలుగు ఆస్పత్రుల్లో ప్రస్తుతం 800 మంది మేర వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నారు. టెండర్లలో కళాశాలలను కైవసం చేసుకున్న ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఆస్పత్రులు పెట్టి, వైద్యులు, సిబ్బంది వేతనాలను ప్రభుత్వమే చెల్లించబోతోంది. అంటే, రూ.వందల కోట్లపైగా ప్రజాధనాన్ని జీతాల రూపంలో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు భారీ మేలు చేయబోతోంది. గోరంత ప్రభుత్వానికి ఇస్తే చాలు భవిష్యత్‌లో నర్సింగ్, ఆయుష్, డెంటల్ వంటి అనుబంధ వైద్య విద్య కళాశాలలు మిగులు భూముల్లో ఏర్పాటు చేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం అవకాశం ఇచి్చంది. ప్రతిఫలంగా వచ్చే ఆదాయం నుంచి ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వానికి 3 శాతం ఇవ్వాలని ఆఫర్ ఇచ్చారు. వాస్తవానికి తొలుత మెడికల్, నర్సింగ్, అనంతరం డెంటల్, ఆయుష్ వంటి ఇతర కళాశాలలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయడానికి వీలుగా వైఎస్ జగన్ హయాంలో కళాశాలలకు భూములను కేటాయించారు. ఇప్పుడా భూములన్నింటినీ నామమాత్రం లీజు ధరలతో ప్రైవేట్‌కు కట్టబెట్టేయడమే కాకుండా అనుబంధ కళాశాలలు ఏర్పాటు చేసుకుని లాభాలు గడించడానికి బాబు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చేసింది. పీపీపీలో వైద్య కళాశాలల అభివృద్ధిలో ప్రభుత్వం, ప్రజలు, విద్యార్థులపై ఎలాటి భారం ఉండదంటూ చంద్రబాబు, మంత్రులు తేనె పూసిన కత్తిలాంటి ప్రకటనలు చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం, ప్రజలు, విద్యార్థులకు నష్టం తలపెడుతూ ప్రైవేట్ వ్యక్తులకు లాభాల పంట పండించేలా పీపీపీ విధానం రూపొందించారు. ఈ కళాశాలల్లో... మిగతా ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగానే ఫీజులు ఉంటాయని సాక్షాత్తు అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రకటించింది. కోటి సంతకాలతో కలమెత్తి..! వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపునకు అపూర్వ స్పందన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కదంతొక్కిన వైఎస్సార్సీపీ ప్రజాసంఘాలు, మేధావులు, విద్యార్థుల నుంచి స్వచ్ఛందంగా మద్దతు మేధావులు, తల్లిదండ్రులతో పాటు అన్ని వర్గాల ప్రజల సంతకాలుప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కారు ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ, వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచి్చన కోటి సంతకాల సేకరణ పిలుపునకు అపూర్వ స్పందన లభించింది. రూ.లక్షల కోట్ల విలువైన సంపద లాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు తన సన్నిహితులకు పప్పుబెల్లాల మాదిరిగా పంచిపెట్టడంపై వైఎస్ జగన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. పేదలు వైద్యం కోసం వెళ్లిన క్రమంలో ప్రైవేటు దోపిడీకి బలికాకుండా అరికట్టి సేవలందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాసంఘాలు, మేధావులు, విద్యార్థులు స్వచ్ఛందంగా మద్దతు పలికి పెద్దఎత్తున పాల్గొన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీల్లో ప్రజలు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు కోటి గొంతుకలతో సింహగర్జన చేశారు. ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలంటూ చంద్రబాబు సర్కార్‌పై సమరభేరి మోగించారు. మరోవైపు కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పరాకాష్టకు చేరిన చంద్రబాబు సర్కారు అవినీతికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ప్రభుత్వ రంగంలో కొత్త మెడికల్ కాలేజీలతో పేదలకు చేరువలో నాణ్యమైన వైద్యంతో పాటు మన విద్యార్థులకు కనీ్వనర్ కోటాలో సగం మెడికల్ సీట్లు ఉచితంగా, మిగిలినవి కూడా ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే అతి తక్కువ ఫీజులతో అందుబాటులోకి వచ్చే అవకాశాన్ని చంద్రబాబు కాలదన్నడాన్ని వివరించింది. కాగా, కోటి సంతకాల కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు పోటీపడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ప్రైవేటీకరణను నిరసిస్తూ సంతకాల సేకరణలో భాగమయ్యారు. ఇది ఒక మహోద్యమంగా రూపాంతరం చెందడంతో బాబు ప్రభుత్వం అధికార దురి్వనియోగానికి దిగింది. నిరసన ర్యాలీల్లో పాల్గొనొద్దని, కేసులు పెడతామని వైఎస్సార్సీపీ నేతలకు పోలీసుల చేత నోటీసులిప్పించింది. అయినా నిరసన ర్యాలీల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలు గళం విప్పాయి. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మేధావులు స్పందించాలి
ప్రొద్దుటూరు : సీఎం చంద్రబాబు చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేధావులు స్పందించకపోతే భవిష్యత్తు తరాలకు తీరని నష్టం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లక్ష సంతకాలు పూర్తిచేసిన సందర్భంగా ఆదివారం ఆయన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, డా. జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు వేదికలపై మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రసంగించాలి్సన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వీరు ఈ విషయంపై అస్సలు మాట్లాడటంలేదని, దీనివల్ల రాçÙ్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని రాచమల్లు చెప్పారు. ఇది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్య కాదని.. ఈ అంశాన్ని రాజకీయంగా కాకుండా సామాజిక కోణంలో చూడాలని ఆయన సూచించారు. రాచమల్లు ఇంకా ఏమన్నారంటే.. చంద్రబాబు సిగ్గుపడాలి..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణవల్ల ప్రతిభగల విద్యార్థులకు ఉచితంగా సీట్లు దొరికే అవకాశం ఉండదు. అందరి ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను మంజూరుచేసి అందులో కొన్నింటిని నిర్మించారు. నిజానికి గతంలో ఎవరూ ఇన్ని తీసుకురాలేదు. ప్రతీవారం సీఎం చంద్రబాబు చేసే అప్పుల్లో కేవలం రూ.నాలుగైదు వేల కోట్లు ఖర్చుపెడితే ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పూర్తిచెయొ్యచ్చు. సీఎం చంద్రబాబు వీటిని ప్రాథమిక బాధ్యతగా భావించి యుద్ధప్రాతిపదికన వీటి నిర్మాణం పూర్తిచేయాలి. వీటివల్ల ఆటో కార్మికులు, బేల్దారి పనిచేసే వారు, హమాలీల పిల్లలకు వాటిల్లో చదివే అవకాశం దొరుకుతుంది. పూర్తిగా జగన్‌పై కక్షతోనే.. ఆయనకు పేరొస్తుందన్న అక్కసుతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను గాలికొదిలేశారు. ఏంచెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఇందుకు బాబు సిగ్గుపడాలి.ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అటకెక్కించారుఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలతో వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచిపోయారు. ఎంతోమంది నిరుపేదలు ఆరోగ్యశ్రీతో గుండెజబ్బుల ఆపరేషన్లు చేయించుకుని జీవిస్తున్నారు. పేద పిల్లలూ ఉన్నత చదువులు చదివారు. చంద్రబాబు ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని అటకెక్కించారు. దీంతో ఆస్పత్రుల వద్ద ఆరోగ్యశ్రీ లేదని బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సక్రమంగా చెల్లించడంలేదు. బాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో నాలుగోసారి సీఎంగా ఉన్నారు. అసలు ఇప్పటివరకు ఆయనకు మెడికల్ కాలేజీలు నిర్మించాలన్న ఆలోచన ఎందుకు రాలేదు?లక్ష సంతకాలు పూర్తిచేశాం..ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గాంధేయ మార్గంలో చేపట్టాలని పార్టీ నేతలను ఆదేశించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 41 వార్డులతోపాటు నియోజకవర్గంలోని 30 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఒక్కో పుస్తకంలో 200 సంతకాలతో మొత్తం 500 పుస్తకాలను పూర్తిచేశాం. వాస్తవానికి అన్ని నియోజకవర్గాల్లో 50 వేల నుంచి 60 వేలు సంతకాలు చేయించాలని పార్టీ సూచించగా, ఇక్కడొక్క చోటే లక్ష సంతకాలు పూర్తిచేయడంతో నియోజకవర్గం అందరికీ ఆదర్శంగా ఉంది. డిసెంబరు 10న పార్టీ హైకమాండ్‌కు వీటిని అందిస్తాం. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక బడా స్కాం: గోపిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో టీడీపీ నేతలకు కట్టబెట్టి వందల కోట్లు దోచుకునే కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. యాభై ఎకరాల మెడికల్ కాలేజీ భూముల్ని కేజీ టమోటా ధరకు సమానంగా అమ్మేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారాయన. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ వెనుక స్కాం ఉంది. టీడీపీ నేతలకు కాలేజీలను కట్టబెట్టి వందల కోట్లు దోచుకుంటున్నారు. మెడికల్ సీట్లను చంద్రబాబు ప్రభుత్వం అమ్ముకోవడానికి రెడీ అయ్యింది. మెడికల్ కాలేజీలను 66 సంవత్సరాలు లీజుకు ఇవ్వటానికి జీవోలు ఇచ్చారు..తరతరాలుగా తమ వారికి దోచిపెట్టే ప్లాన్ చేశారు. యాభై ఎకరాల మెడికల్ కాలేజీల భూములను కేజీ టమోటా ధరకు సమానంగా అమ్మేస్తున్నారు. ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీ అయినా సరే జగన్ కట్టించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలాగా ఉన్నాయా?. అత్యద్భుతంగా జగన్ మెడికల్ కాలేజీలను నిర్మిస్తే చంద్రబాబు వాటిని సింపుల్‌గా అమ్మేస్తారా?. దేశంలో ఎక్కడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేయలేదు. కానీ చంద్రబాబే ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ వారికి ఇచ్చాక కూడా స్టాఫ్‌కి ప్రభుత్వమే జీతాలు ఇస్తుందట.. ఏంటసలు?. ఒక పేదవాడు అత్యవసర వైద్యం కోసం వస్తే వైద్యం చేసే పరిస్థితి ఉంటుందా?. ఒకవేళ ఆస్పత్రి 70% ఫుల్ అయిందని చెప్పి వెనక్కు పంపితే ఆ పేదోడు బతికేదెలా?. వైద్య విద్య మీద ఈ ప్రభుత్వం సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేదా?. ఇప్పటికే చంద్రబాబు వైఖరి వల్ల 2,750 మెడికల్ సీట్లు కోల్పోయాం. పాడేరు మెడికల్ కాలేజీ విషయంలో 50 సీట్లు కోల్పోయాం. ఇటీవల ఆ ప్రాంతంలో గర్భిణులు, హాస్టల్ విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడ్డారో కనపడలేదా?. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు మంచి స్పందన వస్తోంది. మేం అధికారం చేపట్టాక ప్రైవేటీకరించిన మెడికల్ కాలేజీలను తిరిగి స్వాధీనం చేసుకుని తీరతాం అని అన్నారాయన. -
AP: PPP కి గత ప్రభుత్వం జీవోలే అమలు
-
కోటి సంతకాల సేకరణలో RK రోజా
-
Botsa : జగన్ కు మంచి పేరు వస్తుందనే బాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు
-
‘జగన్‌కు మంచి పేరు వస్తుందనే ఇలా చేస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి: ప్రజా ఆరోగ్యం కోసం వైఎస్ జగన్ ఎంతో తపించి మెడికల్ కాలేజీల తీసుకొస్తే.. వాటిని చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బొత్స నేతృత్వంలో వైఎస్సార్సీపీ బృందం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం తాడేపల్లి పార్టీ కేంద్రకార్యాలయంలో బొత్స ఈ అంశంపై మాట్లాడారు. కోవిడ్ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాం. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనే ఆలోచనతో ముందుకు వెళ్లాం. పేదలకు మేలు జరగాలనే వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. వైద్య రంగాన్ని వైఎస్ జగన్ అభివృద్ధి చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం వైద్య రంగానికి నిధులు కేటాయించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కాలేజీలను పెట్టాలని చూస్తున్నారు. ఐదు కాలేజీలు మా హయాంలో పూర్తయ్యాయి. మిగతావి క్రమబద్దంగా పనులు జరుగుతున్నాయి. జగన్‌కు మంచి పేరు రాకూడదనే ప్రైవేటీకరణకు వెళ్తున్నారు. అవి పూర్తయితే జగన్ కు పేరు వస్తుందని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది.. ..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నాం. అన్ని ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య వాదులు మద్దతు తెలుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ల చేతుల్లో ఉండకూడదు. అన్ని విషయాలు గవర్నర్‌కు వివరించాం. దీనిపై ఒక కమిటీని పంపించి ర్యాండమ్ చెకింగ్ చేయమని కోరాం. ప్రైవేట్ వాళ్లు ప్రజలకు ఎందుకు సేవ చేస్తారు?. లాభాపేక్షతో వ్యాపారం చేస్తే ప్రజల పరిస్థితి ఏంటి?. పేద పిల్లలు వైద్య విద్యని ఎలా చదవగలరు?. పీపీపీని వెనక్కు తీసుకునే వరకు మా పోరాటం ఆగదు’’ అని బొత్స స్పష్టం చేశారు. ఇంకా బొత్స ఏమన్నారంటే.. 👉జగన్ హయాంలో రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందేలా చేశారు. చంద్రబాబుకు కోపం ఉంటే మాపై తీర్చుకోవాలి. అంతేగానీ పేదల మీద అంత కోపం ఎందుకు?. ఓటు వేసి గెలిపించిన పాపానికి అదే పేదల మీద కక్ష తీర్చుకోవటం న్యాయమేనా?. విద్య, వైద్య రంగాలను చంద్రబాబు సర్వ నాశనం చేశారు. 👉జగన్ హయాంలో ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించారు. ట్యాబులు ఇస్తే విద్యార్థులు గేమ్ లు ఆడుకున్నారని మాక్ అసెంబ్లీలో చెప్పించారు. ఇలా పిల్లలతో చెప్పించటానికి కాస్తన్నా సిగ్గు ఉండాలి. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఇంగిత జ్ఞానం లేదు. ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడటం తగదు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటే స్పీకర్ తీసుకోవచ్చు. అంతేగానీ బాధ్యతలేని వ్యక్తి లాగా మాట్లాడటం సరికాదు👉రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేదు. ఏ వ్యవస్థ మీదా పర్యవేక్షణ లేదు. ఎల్లోమీడియాలో ఆహాఓహో అనిపించుకోవటం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. రైతులు గిట్టుబాటు ధరల్లేక అల్లాడిపోతుంటే అసలే మాత్రం పట్టించుకోవటం లేదు. హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వానికి పట్టటంలేదు. ఆస్పత్రులలో సరైన వైద్యం అందటం లేదు. ఇలాంటి వాటి గురించి కూడా చంద్రబాబు పట్టించుకోవటం లేదు👉రాజ్యాంగ ఆమోద దినోత్సవానికి ప్రతిపక్షాన్ని ఎందుకు పిలవలేదు?. రాజ్యాంగంలో ప్రతిపక్షాన్ని పిలవవద్దని ఉందా?. ప్రతిపక్షం గురించి పట్టించుకోని ప్రభుత్వానికి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు👉పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడితే ఒప్పా?. ఇంకొకరు మాట్లాడితే తప్పా?. పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్లి రేషన్ బియ్యం గురించి హడావుడి చేశారు. మరి ఆ తర్వాత కూడా బియ్యం అక్రమ రవాణా ఎందుకు ఆగలేదు?. ఒక డీఎస్పీ అవినీతిపరుడుని, పేకాట క్లబ్బులు నడిపిస్తున్నాడని పవన్ చెప్పారు. మరి అదే డీఎస్పీకి అవార్డులు, రివార్డులు ఎలా ఇచ్చారు? అని బొత్స నిలదీశారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ‘‘ఏ రాష్ట్రంలోనైనా, ఏ సమాజంలోనైనా విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ పాత్ర బలంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అని రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ సి.రామచంద్రయ్య తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తెచ్చి మంచి పనిచేసిందన్నారు. వాటిని కొనసాగించాల్సిన బాబు సర్కారు విధ్వంసానికి పాల్పడుతూ ప్రైవేటుకు ఇవ్వడాన్ని తమ వేదిక తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. విద్య, వైద్య రంగాల్లో విచ్చలవిడి ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ ఉమ్మడి ఏపీలో తీవ్ర నష్టం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జీవో 590ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది సామాన్యులు తమ కష్టార్జితాన్ని ప్రయివేటు వైద్యం మీద ఖర్చుపెట్టాల్సిన అనివార్య పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రానికి ఆర్థిక గుదిబండగా అమరావతిసెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరుతో మొదలైన అమరావతి రాష్ట్రానికి ఒక ఆర్థిక గుదిబండగా మారుతోందని రామచంద్రయ్య అన్నారు. ‘‘రాజధాని పేరుతో ఇప్పటికే రూ.70 వేల కోట్లకు పైగా చంద్రబాబు అప్పు తెచ్చారు. రెండో దశ ల్యాండ్ పూలింగ్‌లో 40–50 వేల ఎకరాలు సేకరించాలనడం దుర్మార్గం. ఆర్థిక వ్యవస్థపై చాలా పెద్ద బరువు పడుతోంది. దీన్ని ఆపాలి. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా రాజధానికి నిధులు ఎందుకు తేలేకపోతున్నారో, విభజన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదో చంద్రబాబు ప్రజలకు వివరించాలి. విజయవాడ, విశాఖలో లులూ సంస్థకు భూములు కట్టబెట్టడం తప్పు. వైజాగ్‌లో 2015–18 మధ్య జరిగిన పెట్టుబడుల సదస్సు ఒప్పందాలు, వాటి అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని డిమాండ్ చేశారు.రైతులు చితికిపోయారు.. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర రాక లక్షలాది రైతులు పొలాల్లో, బయట పంటను వదిలేస్తున్నారని, చితికిపోయి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారని రామచంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత సుభీభవ పేరుతో అరకొరగా నిధులిస్తే ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. నెల్లూరు జిల్లా కరేడు గ్రామ రైతుల పోరాటానికి సామాజిక కార్యకర్త కుర్రా వసుంధర మద్దతు ప్రకటించారు. ఒక సోలార్ ప్లాంట్ కోసం బహుళ పంటలు పండే 8,458 ఎకరాలను సేకరించడం అమానుషం, అనైతికమన్నారు. సామాజిక కార్యకర్త సలీం మాలిక్ మాట్లాడతూ వెనుకబడిన జిల్లాలకు బడ్జెట్ కేటాయింపు, ఎంత ఖర్చు చేశారు? వంటి కొన్ని అంశాలపై తమ ఆలోచన తెలిపేందుకు అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో మీడియా సమావేశాలు నిర్వహించి తమ వైఖరి స్పష్టం చేస్తామన్నారు. -
Vijayawada: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి తీరుతాం: విద్యార్థి సంఘాలు
-
‘సర్వేపల్లి’లో కోటి సంతకాలు సక్సెస్
పొదలకూరు: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉవ్వెత్తున వ్యతిరేకత ఎగిసిపడింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం సర్వేపల్లిలో ఆదివారంతో పూర్తయింది. ఈ నియోజకవర్గంలో 60 వేల సంతకాల సేకరణను చేపట్టాలని పార్టీ అధిష్టానం లక్ష్యంగా నిర్ణయించింది. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ లక్ష్యాన్ని ముందుగానే పూర్తిచేయడంతో ప్రైవేటీకరణపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దంపట్టింది.ఈ నెల 22 నాటికి సంతకాల సేకరణ పూర్తిచేయాల్సి ఉండగా, 16వ తేదీకే కాకాణి పూర్తిచేయించి ముగింపు సభను పొదలకూరు మండలం విరువూరులో ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలనను ఖండిస్తూ సర్వేపల్లిలో పెద్దఎత్తున నిర్వహించిన ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలను పెట్టారు. బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కోటి సంతకాల సేకరణలో భాగస్వామ్యులయ్యారు. పేదలకు ప్రభుత్వ వైద్యం దూరం అవుతుందని చాటిచెబుతూ కాకాణి గోవర్థన్‌రెడ్డితో పాటు ఆయన కుమార్తె, పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత నియోజకవర్గంలో పర్యటించి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. -
టీడీపీ మాజీమంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు
సాక్షి,అమరావతి: టీడీపీ మాజీమంత్రి యనలమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను రోజూ సాక్షిపేపర్ చదువుతా.. సాక్షి టీవీ చూస్తా. ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతాం. మెడికల్ కాలేజీల నిరసన ర్యాలీతో.. ప్రతిపక్షంలో కసి పెరిగింది. ప్రజలు గ్రామాల నుంచి భారీగా తరలివచ్చారు’ అని గుర్తు చేశారు. -
తిరుపతిలో ప్రజా ఉద్యమం చూసి బిత్తరపోయిన పోలీసులు
-
కోటి గళాల గర్జన.. గ్రాండ్ సక్సెస్
-
ఇది ప్రజా విజయం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు, విద్యార్థులతో కలిసి వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీలు గ్రాండ్ సక్సెస్ కావడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ర్యాలీలను విజయవంతం చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, భావసారూప్య పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రజా విజయం అని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తక్షణమే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. » వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గళమెత్తారు. 175 నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీల ద్వారా ప్రజలు తమ ఆగ్రహాన్ని, ఆవేదనను, సంకల్పాన్ని స్పష్టంగా వ్యక్త పరిచారు. ర్యాలీల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం.. ప్రభుత్వ రంగంలో విద్య, వైద్య వ్యవస్థలను కాపాడుకోవాలన్న వారి సంకల్పానికి నిదర్శనం. ఆ సంకల్పంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రజలందరితోపాటు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంస్థలు, మిత్రపక్షాలు.. వివిధ ప్రజా సంఘాలకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమం ప్రజల నిబద్ధతను, సామాజిక న్యాయంపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రజలు స్వలాభం కోసం కాకుండా, సమాజ భవిష్యత్తు కోసం నిలబడ్డారు. » తమ బాధ్యత మరిచి, ప్రభుత్వ పెద్దల మాటలు మాత్రమే వింటున్న పోలీసులు నిరసన ర్యాలీలను అడ్డుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నించినా, ఎక్కడా ప్రజలు ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు. ధైర్యంగా, శాంతియుతంగా ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టింది. బలవంతంగా ప్రజల గొంతు నొక్కలేమని ప్రజా ఉద్యమ ర్యాలీ మరోసారి నిరూపించింది. » చంద్రబాబు గారూ.. ఇకనైనా ప్రజల మనోభావాలు గుర్తించి, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి. ప్రజల సంకల్పాన్ని తక్కువగా అంచనా వేయడం రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరం అవుతుందన్న విషయాన్ని గుర్తించండి. ఈ చారిత్రక ఉద్యమాన్ని విజయవంతం చేసిన అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలకు మరోసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. -
కట్టలు తెగిన ప్రజాగ్రహం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందకుండా చేస్తూ.. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు సర్కారుపై విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు తిరగబడ్డారు. రూ.లక్షల కోట్ల ప్రజల ఆస్తులను బినామీలకు కట్టబెట్టి, నీకింత నాకింత అంటూ పంచుకుతినేందుకు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండటంపై కళ్లెర్ర చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా ఉద్యమంలో కదం తొక్కేందుకు ప్రభంజనంలా జనం కదలివచ్చారు. ర్యాలీలకు అనుమతి లేదు.. పాల్గొంటే అక్రమ కేసులు పెడతాం.. అంటూ పోలీసుల నోటీసులు, బెదిరింపులను ఏమాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన నిరసన ర్యాలీల్లో కదంతొక్కారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా రూ.2.50 లక్షల కోట్లు అప్పు చేశారని, అందులో రూ.5 వేల కోట్లు మెడికల్ కాలేజీల పనులు పూర్తి చేయడానికి ఖర్చు చేయలేరా.. అంటూ ర్యాలీల్లో దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని దూరం చేస్తారా.. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందకుండా చేస్తారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలంటూ డిమాండ్ చేశారు. ఒకవేళ కాదూ కూడదని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కొనసాగిస్తే వైఎస్సార్సీపీతో కలిసి మహోద్యమాన్ని నిరి్మస్తామంటూ కోటి గళాలు రణ నినాదాలు చేయడంతో దిక్కులు పిక్కటిల్లాయి. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నేతలతో కలిసి అధికారులకు డిమాండ్ పత్రాలను అందజేశారు. ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు ఈ నిరసన ర్యాలీలు మరోసారి అద్దం పట్టాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఉద్యమంలో భాగంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేల సంతకాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, అంతకు మించి సంతకాలు చేస్తున్నారు. పదండి ముందుకు.. పదండి తోసుకు! అడ్డంకులను అధిగమించి..సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ఎక్కడికక్కడ ర్యాలీలను నిలువరించడానికి విఫలయత్నం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో బైకు ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకుని, బైక్‌ల తాళాలు లాక్కునే ప్రయత్నం చేయగా యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కు తగ్గారు. గుంటూరులో పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు బెదిరింపు ధోరణితో వ్యవహరించడంపై నిరసన వ్యక్తమైంది. నెల్లూరులో మెడికల్ విద్యార్థులు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఫ్లకార్డులు మెడలో వేసుకుని మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఒంగోలులో నిరసన ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు తన సిబ్బంది ద్వారా చాలా సేపు నిలువరించారు. చివరకు ప్రజలు తోసుకొని ముందుకు సాగారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వినతిపత్రం తీసుకునేందుకు అధికారులు, కార్యాలయ సిబ్బంది అందుబాటులో లేకుండా పోవడంతో అక్కడి తలుపునకు అంటించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో పార్టీ శ్రేణులు, ప్రజలు నిరసన ర్యాలీ నిర్వహించారు. విశాఖ జిల్లా భీమిలిలో ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల భారీ బైక్ ర్యాలీ మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గమైన టెక్కలిలో ప్రజలను నియంత్రించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో గరివిడి ఆర్వోబీ వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకోగా గంటపాటు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో పర్ల గ్రామానికి చెందిన సిరియాల పాపినాయుడు కిందపడి పోవడంతో కాలు విరిగింది. ఆయన్ను ఆస్పత్రికి తరలించి ర్యాలీ కొనసాగించారు. ఆయన వైద్య ఖర్చును వైఎస్సార్సీపీ భరిస్తుందని నేతలు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎల్లవరం నుంచి రంపచోడవరం వరకు 35 కిలోమీటర్ల మేర బైకులు, కార్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ర్యాలీ నిర్వహించడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించారు. అయినా యాడికిలో ర్యాలీ కొనసాగింది. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆర్డీవో కార్యాలయంలో డిమాండ్ పత్రం అందచేశారు. -
వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం..కోటి గొంతుకలతో సింహగర్జన (ఫొటోలు)
-
ప్రజల కష్టాలు తెలుసుకోలేని ఒక అసమరుడు పరిపాలిస్తున్నాడు
-
RK రోజా ఆధ్వర్యంలో భారీగా ప్రజా ఉద్యమం ర్యాలీ
-
Varikuti Ashok: కరోనా టైంలో జగన్ సీఎంగా లేకపోతే.. చంద్రబాబును ఇప్పటికి ఛీ కొడుతున్నారు
-
గుంటూరులో ఉద్రికత్త.. అంబటితో సీఐ ఓవరాక్షన్
సాక్షి, గుంటూరు: ఏపీలో ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు కదిలారు. వైఎస్సార్సీపీ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు.. అడ్డంకులను సృష్టించారు. ఈ క్రమంలో గుంటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పోలీసులు వాగ్వాదానికి దిగారు.వివరాల ప్రకారం.. మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులోని తన నివాసం నుంచి ర్యాలీగా ముందుకు సాగారు. వైఎస్సార్సీపీ ర్యాలీ.. స్వామి థియేటర్ వద్ద రాగానే పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఓవరాక్షన్‌కు దిగారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబుకు వేలు చూపిస్తూ సీఐ గంగా వెంకటేశ్వర్లు దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగారు. దీంతో, సీఐపై అంబటి రాంబాబు మండిపడ్డారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల వైఖరి నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఇక, గతంలోనూ అంబటి రాంబాబు పట్ల పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 175 నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహించాం. రెవెన్యూ అధికారులకు మెమోరాండం అందించాం. 17మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టామని చెప్పాం. ఐదు కాలేజీల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం మొదలుపెట్టారు. ప్రైవేటు కాలేజీలు భారీస్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. పేదలకు అన్యాయం చేసే పీపీపీ పద్దతిని వద్దని చంద్రబాబుకు సూచిస్తున్నాం. పీపీపీ పద్దతిపై కొన్ని రాష్ట్రాలలో ప్రజలు వ్యతిరేకించడంతో ప్రభుత్వాలు వెనక్కితగ్గాయి.గుంటూరు లో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో YSRCP ప్రజా ఉద్యమం🔥🔥అడ్డుకుంటున్న పోలీసులు #OneCroreSignatures#StopPrivatization#SaveMedicalCollegesInAP#YSRCPForMedicalStudents pic.twitter.com/MtDOBCRkH0— Rahul (@2024YCP) November 12, 2025 పీపీపీ పద్దతి వద్దంటూ కోటి సంతకాలు సేకరించాం. చంద్రబాబు, కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను బడా బాబులకు అప్పగించి లోకేష్ జేబులు నింపుతున్నారని మేం ఆరోపిస్తున్నాం. మేం ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. బారికేడ్లు పెట్టి అడ్డుకోవాలని చూస్తున్నారు. మెమోరాండం ఇవ్వకుండా ఆపగలిగారా?. పోలీసులు పద్దతి మార్చుకోవాలని చెబుతున్నాం. లోకేష్ మెప్పుకోసం కొందరు పోలీసులు ప్రవర్తిస్తున్నారు. పోలీసుల భాష మాట్లాడుతున్నారు.. మాకు రాదా పోలీసు భాష. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకూ ఉద్యమం ఆగదు. పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు లోకేష్ బంధువు. ఎక్కడా ఆపని పోలీసులు ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు. మేం తగ్గేది లేదు.. చిత్తశుద్దితో పనిచేస్తున్నాం. పోలీసులతో అణిచిపెట్టాలని చూస్తున్నారు.. లోపల వేయాలని చూస్తున్నారు. మేం దేనికైనా సిద్దం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
బాబు అవినీతికి నిదర్శనం..! వైఎస్ఆర్ సీపీ ర్యాలీలకు వేలల్లో తరలివస్తున్న జనం
-
నెల్లూరులో దుమ్మురేపుతున్న YSRCP ప్రజా ఉద్యమం
-
YSRCP ప్రజా ఉద్యమం
-
YSRCP సమర శంఖం
-
కూటమికి వణుకే.. వైఎస్సార్సీపీ శ్రేణుల భారీ ర్యాలీ
చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, కక్షపూరిత వైఖరి, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ర్యాలీల్లో కదం తొక్కేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు కోటి గొంతుకలతో సింహగర్జన చేయనున్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ సమరభేరి
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై.. కోటి గళాల గర్జన
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, కక్షపూరిత వైఖరి, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ర్యాలీల్లో కదం తొక్కేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు కోటి గొంతుకలతో సింహగర్జన చేయనున్నారు. ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలనే డిమాండ్‌తో చంద్రబాబు సర్కార్‌పై సమరభేరి మోగించనున్నారు. వైఎస్సార్సీపీ నేతలు గత నెల రోజులుగా ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్య తరగతి రోగులు, విద్యార్థులకు కలిగే నష్టాలు, ప్రైవేటీకరణ ముసుగులో చంద్రబాబు సర్కారు అవినీతిని ప్రజలకు లోతుగా వివరించారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం.. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో రోగులకు సేవలు నిలిచిపోవడం.. ఆరోగ్యశ్రీ, ఆసరా కింద ఏకంగా రూ.4 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టడం.. చరిత్రలో తొలిసారి ప్రైవేట్ డాక్టర్లు రోడ్డెక్కి ఆందోళనకు దిగడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ రంగంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు చేరువలో నాణ్యమైన వైద్యంతోపాటు మన విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సగం మెడికల్ సీట్లు ఉచితంగా, మిగిలినవి కూడా ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే అతి తక్కువ ఫీజులతో అందుబాటులోకి వచ్చే అవకాశాన్ని చంద్రబాబు సర్కారు కాలదన్నుకోవడంపై మండిపడుతున్నారు. కొత్త మెడికల్ కాలేజీలపై చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు పోటీపడుతున్నారు. కోటి సంతకాల సేకరణ మహోద్యమంగా రూపాంతరం చెందుతుండటం చంద్రబాబు సర్కార్‌కు వణుకు పుట్టిస్తోంది. నేడు వైఎస్సార్సీపీ నిర్వహించే ర్యాలీలలో అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరభేరి మోగించనున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ప్రభుత్వ పెద్దలు యధావిధిగా అధికార దుర్వినియోగానికి తెరతీశారు. నిరసన ర్యాలీల్లో పాల్గొనకూడదని.. కేసులు పెడతామంటూ వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. పోలీసుల నోటీసులు.. బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని.. నిరసన ర్యాలీల్లో విద్యార్థులు, తల్లితండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలతో కలిసి కదంతొక్కి, గళం విప్పుతామని వైఎస్సార్సీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. 14 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టని చంద్రబాబు.. రాష్ట్రంలో 1923 నుంచి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. పద్మావతి అటానమస్ మెడికల్ కాలేజీతో కలిపితే 12 ఉన్నాయి. 2019 నాటికి చంద్రబాబు మూడుసార్లు అంటే 1995–99, 1999–2004, 2014–19 మధ్య 14 ఏళ్లు సీఎంగా పాలించారు. ఆయన హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు. కనీసం కొత్తగా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలను పునర్విభజించి 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ప్రజలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడంతోపాటు మన విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో కాలేజీకి కనీసం 50 ఎకరాల స్థలం ఉండేలా భూమిని కేటాయించారు. ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లకుపైగా కేటాయించి అన్ని రకాల సదుపాయాలు ఉండేలా క్యాంపస్‌ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. కోవిడ్ రెండేళ్లపాటు రాష్ట్రాన్ని పీడించినా, ఎన్ని ఇబ్బందులున్నా ఎక్కడా వెనక్కి తగ్గకుండా మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలనే ధృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను 2023–24లోనే ప్రారంభించి తరగతులు కూడా మొదలుపెట్టారు. ఎన్నికల నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా సిద్ధమయ్యాయి. ఎన్నికల తర్వాత పాడేరులో అడ్మిషన్లు ముగిసి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట.. గత ఏడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కొత్త మెడికల్ కాలేజీలను తన అనుయాయులకు కట్టబెట్టాలని నిర్ణయించారు. పులివెందుల మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గతేడాది అనుమతులు ఇచ్చింది. కానీ.. ఆ సీట్లు మాకు వద్దంటూ ఎన్ఎంసీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి అవసరమైన నిధులను అప్పట్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమీకరించింది. ఆ నిధులను సది్వనియోగం చేసుకుని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు సర్కారు చర్యలు చేపట్టి ఉంటే.. 2024–25 విద్యా సంవత్సరంలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి. ఈ విద్యా సంవత్సరం అంటే 2025–26లో అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండ కూడా ప్రారంభం అయ్యేవి.బుధవారం ర్యాలీ నిర్వహించకూడదంటూ నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్‌కు నోటీసు ఇస్తున్న పోలీసు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 2,360 మాత్రమే ఉండేవి. కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అదనంగా మరో 2,550 సీట్లు పెరిగి.. మొత్తమ్మీద 4,910 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. ఎక్కడ వైఎస్ జగన్‌కు క్రెడిట్ వస్తుందోనని ఏకంగా ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు దెబ్బతీస్తున్నారని మేధావులు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. 17 నెలల్లో రూ.2.36 లక్షల కోట్ల అప్పు.. మెడికల్ కాలేజీలకు మాత్రం డబ్బుల్లేవట.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 17 నెలల్లోనే రూ.2.36 లక్షల కోట్లు అప్పులు చేసింది. మిగిలిన కొత్త మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు వ్యయం చేస్తే చాలు! ఆ రూ.5 వేల కోట్లను సైతం నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ రూపాల్లో సమీకరించేందుకు అప్పట్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ నిధులతో మిగిలిన ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను పూర్తి చేయవచ్చు. అయితే కొత్త మెడికల్ కాలేజీలను పప్పు బెల్లాలకు బినామీలు, అస్మదీయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కారు పీపీపీ కుట్ర పన్నింది. ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్రూ.లక్ష కోట్ల విలువైన సంపద లాంటి కొత్త మెడికల్ కాలేజీలను బినామీలకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సమరభేరి మోగించారు. ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఊరూరా రచ్చబండ నిర్వహించి.. కోటి మంది ప్రజలతో సంతకాలు సేకరించాలని, వాటిని గవర్నర్‌కు అందజేద్దామని పిలుపునిచ్చారు. గత నెల 10న రచ్చబండ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ ప్రారంభించింది. ఊరూవాడా రచ్చబండ నిర్వహిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్వాకాలను వైఎస్సార్సీపీ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. వాటిని ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలూ పెద్ద ఎత్తున వస్తున్నారు. కోటి సంతకాల సేకరణ మహోద్యమంగా మారింది. వైఎస్ జగన్ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా 175 నియోజకవర్గాల్లో బుధవారం వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తోంది. కుప్పంలో ర్యాలీకి అనుమతి లేదుసాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం వైఎస్సార్సీపీ చేపట్టనున్న నిరసన ర్యాలీకి చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. ఇందుకు అనుమతులు కోరుతూ ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు పోలీసులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరులో కేవలం 20 మందితో ర్యాలీ నిర్వహించుకోవాలని పోలీసులు హుకుం జారీ చేశారు. -
ప్రజాస్పందనను బలంగా వినిపిద్దాం..
తాడేపల్లి :ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు(బుధవారం, నవంబర్ 12వ తేదీ) వైఎస్సార్సీపీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ర్యాలీలకు పార్టీలకతీతంగా అంతా కలిసి రావాలని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రేపు చేపట్టే ర్యాలీల ద్వారా ప్రజాస్పందనను గట్టిగా వినిపిద్దామన్నారు సజ్జల. ఈ మేరకు మంగళవారం(నవంబర్11వ తేదీ) వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రేపు గట్టిగా పోరాటం చేద్దాం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలదలో కేంద్రాల్లో ర్యాలీలను సూపర్ సక్సెస్ చేద్దాం. జగన్ తెచ్చిన వైద్య విప్లవాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారు. వైద్యవిద్యార్ధుల కలలను సాకారం చేయాలన్న గొప్ప సంకల్పం జగన్‌ది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణను చూసైనా చంద్రబాబు బుద్దితెచ్చుకోవాలి. వైద్య వ్యవస్ధను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుదాం,. ప్రజా స్పందనను బలంగా వినిపిద్దాం. అందరి భాగస్వామ్యం వలనే కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అన్ని పథకాలు నిర్వీర్యం చేసింది. ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. అన్ని రంగాలు కుదేలయ్యాయి. రైతుల పరిస్ధితి దయనీయంగా మారింది. విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. చంద్రబాబు ప్రభుత్వంపై దేశంలో ఏ ప్రభుత్వంపై లేనంత వ్యతిరేకత వచ్చింది. రేపటి ర్యాలీలకు పార్టీలకు అతీతంగా కలిసిరావాలి. విద్యార్ధులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలతో ర్యాలీలు విజయవంతం అవ్వాలి. మనం చేసే ఆందోళనలు, ర్యాలీల గురించి జాతీయస్ధాయిలో చర్చ జరిగేలా ఉండాలి. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం దిగివస్తుంది’ అని పేర్కొన్నారు. -
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం బాబు Vs జగన్ మధ్య తేడా ఇదే..
-
Anantha Venkatarami: ప్రైవేటీకరణ ఆపేవరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గళాల రణభేరి
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలు, ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ బుధవారం తలపెట్టిన నిరసన ర్యాలీలలో కదం తొక్కేందుకు పార్టీలకు అతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేథావులు సామాజిక కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే నిరసన ర్యాలీల్లో పాల్గొనేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కదలి వస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా 2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ఒకేసారి ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 మెడికల్ కళాశాలలను 2023–24లో గత ప్రభుత్వంలోనే ప్రారంభించారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను మాజీ సీఎం వైఎస్ జగన్ మన విద్యార్థులకు అదనంగా సమకూర్చారు. ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వాస్పత్రులను బోధనాస్పత్రులుగా బలోపేతం చేశారు. అనంతరం గతేడాది చంద్రబాబు గద్దెనెక్కడంతో వైద్య కళాశాలలకు గ్రహణం పట్టుకుంది. 50 సీట్లతో పాడేరులో మెడికల్ కాలేజీ ఎట్టకేలకు ప్రారంభమైనా వంద సీట్లకు కోత పడింది. ఇక పులివెందుల వైద్యకళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చినప్పటికీ, తమకు వద్దంటూ చంద్రబాబు సర్కారు అడ్డుపడి లేఖ రాసింది. చంద్రబాబు కక్షపూరిత విధానాలతో రెండేళ్లలో రాష్ట్రం ఏకంగా 2,450 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయింది. రూ. లక్ష కోట్ల విలువైన సంపద లాంటి ప్రజల ఆస్తులను పచ్చ కార్పొరేట్ గద్దలకు దోచిపెట్టడం కోసం చంద్రబాబు పీపీపీ కుట్రలు పన్నారు. ఏకంగా 10 కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని నిర్ణయించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఉద్యమ కార్యచరణ రూపొందించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంగా నానాటికి ఉధృతం అవుతోంది. నిజానికి కేవలం రూ.ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే 10 కొత్త వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే పూర్తై అందుబాటులోకి వస్తాయి. కేవలం 17 నెలల్లోనే చంద్రబాబు సర్కార్ రూ.2.50 లక్షల కోట్ల అప్పులు చేసింది. అందులో కేవలం రూ. ఐదు వేల కోట్లను ఈ మెడికల్ కాలేజీల కోసం ఖర్చు చేయడానికి చంద్రబాబుకు మనసు రాకపోవడంపై ప్రజల్లో ఆగ్రహాగ్ని పెల్లుబుకుతోంది. తెలంగాణలో భవనాల్లేకపోయినా.. 2025–26 విద్యా సంవత్సరంలో తెలంగాణలో కొడంగల్ వైద్య కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) 50 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. ఈ వైద్య కళాశాల, బోధనాస్పత్రికి శాశ్వత భవనాలను అక్కడి ప్రభుత్వం ఇప్పటి వరకూ నిర్మించకపోయినా కొడంగల్‌కు 15 కి.మీ దూరంలో ఉండే తాండూర్ ప్రభుత్వాస్పత్రిని బోధనాస్పత్రిగా, నర్సింగ్ కళాశాల భవనాలను తాత్కాలిక తరగతి గదులుగా చూపించి ఎన్ఎంసీ నుంచి అనుమతులు రాబట్టారు. అలాగే గతేడాది తెలంగాణలోని మహేశ్వరం వైద్య కళాశాలకు ఎన్ఎంసీ 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసింది. కళాశాల, బోధనాస్పత్రి శాశ్వత నిర్మాణాలు అందుబాటులోకి వచ్చే వరకూ తాత్కాలిక భవనాల్లోనే అకడమిక్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. జగన్ చొరవతో సకల వసతులతో భవనాలు నిర్మించినా.. వైఎస్ జగన్ ప్రభుత్వం 2024–25 విద్యా సంవత్సరంలో ఐదు కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంది. పులివెందుల వైద్య కళాశాల, బోధనాస్పత్రిని నిర్మించి ప్రారంభించారు. మార్కాపురం, మదనపల్లె, ఆదోని కళాశాలల్లో తొలి ఏడాది తరగతులు ప్రారంభించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అనంతరం గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం ఈ కళాశాలలు ప్రారంభించకుండా అడ్డుపడింది. రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించాల్సి ఉండగా 2025–26 విద్యా సంవత్సరంలో ఒక్క కళాశాలకు కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేయలేదు. మెరుగైన మార్కులు సాధించినా నిరాశే.. తెలంగాణలో తాత్కాలిక వసతులతోనే వైద్య కళాశాలలను ప్రారంభిస్తూ రెండేళ్లలో తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తేగా.. ఏపీలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గ విధానాలతో రెండేళ్లలో 2,450 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులు నష్టపోయారు. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం కోసం విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు సర్కారు చెలగాటం ఆడింది. 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ప్రభుత్వ కోటా మూడో రౌండ్ కౌన్సెలింగ్ ముగిశాక తెలంగాణలో నీట్ యూజీ–2025లో 403 స్కోర్‌తో రెండు లక్షలకు పైబడి ఆలిండియా ర్యాంక్ సాధించిన విద్యార్థికి ప్రభుత్వ కోటా సీటు దక్కింది. ఇదే కేటగిరీలో ఏపీలో ఎస్వీయూ రీజియన్‌లో 471, ఏయూలో 487 స్కోర్ వద్దే ప్రభుత్వ కోటా సీట్ల కేటాయింపు ఆగిపోయింది. ఈ లెక్కన ఓపెన్ కేటగిరీలో తెలంగాణాతో పోలిస్తే 84 మార్కులు అధికంగా సాధించినప్పటికీ ఏపీ విద్యార్థులకు ప్రభుత్వ కోటా సీటు దక్కలేదు. బీసీ కోటాలో 120కిపైగా ఎక్కువ మార్కులున్నా.. కొత్త కళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ విధానాన్ని వంద రోజుల్లో రద్దు చేసి మెరిట్ విద్యార్థులకు సీట్లన్నీ కేటాయిస్తామనే వాగ్దానాలతో గద్దెనెక్కిన టీడీపీ కూటమి సర్కారు విద్యార్థులకు వెన్నుపోటు పొడిచింది. ఏకంగా 10 వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టాలని నిర్ణయించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం కళాశాలలను ప్రభుత్వ రంగంలో ప్రారంభించకుండా బీసీ, ఎస్సీ లాంటి రిజర్వేషన్ వర్గాలకూ తీరని ద్రోహం తలపెట్టింది. కొత్తగా సీట్లు రాష్ట్రంలో పెరగకపోవడంతో తెలంగాణ విద్యార్థుల కంటే 120 మార్కులకు పైగా ఎక్కువ స్కోర్ చేసినా మన విద్యార్థులకు ఏపీలో ప్రభుత్వ కోటా సీట్లు దక్కలేదు. తెలంగాణాలో బీసీ–ఏ విభాగంలో 338 స్కోర్ చేసిన వారికి ప్రభుత్వ కోటాలో మెడికల్ సీట్ రాగా, ఏపీలో ఏయూలో 461, ఎస్వీయూలో 443 స్కోర్ల వరకే సీట్లు వచ్చాయి. అంటే 105–123 మార్కులు అదనంగా కటాఫ్ ఉంది. మిగిలిన రిజర్వేషన్ విభాగాల్లోనూ తెలంగాణాలో కంటే ఏపీలో కటాఫ్‌లు 50 నుంచి వంద మార్కుల మేర అధికంగానే ఉన్నాయి. దీంతో పిల్లలను యాజమాన్య కోటా కింద రూ. లక్షలు ఖర్చు చేసి చదివించలేని నిరుపేద, మధ్యతరగతి తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. ధైర్యం చేసి లాంగ్ టర్మ్ కోచింగ్‌కు పంపినా వచ్చే ఏడాదైనా రాష్ట్రంలో సీట్లు పెరుగుతాయనే నమ్మకం లేదని నిస్పృహ వ్యక్తం చేస్తున్నారు. 2,450 మంది వైద్య విద్యకు దూరం వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టగా వాటిలో ఐదు కాలేజీలను 2023–24లోనే ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూర్చారు. గత ప్రభుత్వ కృషితో పులివెందులకు 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనా చంద్రబాబు అడ్డుకుని రద్దు చేయించారు. గత విద్యా సంవత్సరం 700 మెడికల్ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూరకుండా అడ్డుకున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో మరో 7 కొత్త వైద్య కళాశాలలు కూడా ప్రారంభమై మొత్తం 1,750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రావాల్సి ఉండగా వాటిని రాబట్టకపోగా ప్రైవేట్‌పరం చేస్తున్నారు. రెండేళ్లలో 2,450 మంది విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసిన ప్రభుత్వం వారి కలలను ఛిద్రం చేసింది. చేరువలో వైద్య విద్య.. కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల ఎక్కువ మంది వైద్య విద్య చదువుకునేందుకు ఆస్కారం ఉంటుంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు సైతం చేరువలో వైద్య విద్య అభ్యసించే అవకాశం కలుగుతుంది. – కె.లహిత, వైద్య విద్యార్థి, ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం ఉచితంగా మెరుగైన వైద్యం ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎక్కువగా ఏర్పాటైతే ఆ ప్రాంత ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలందుతాయి. న్యూరో మెడిసిన్, న్యూరో సర్జరీ, పల్మనాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ లాంటి సూపర్ స్పెషాలిటీ సేవలు ఉచితంగా లభిస్తాయి. వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. – బి.రతుల్రామ్, వైద్యవిద్యార్థి, ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం -
Sailajanath: చంద్రబాబు మీ కళ్ళు తెరిపించేందుకే ఈ సంతకాల సేకరణ
-
75 ఏళ్లు వచ్చాయి అయిన సిగ్గు లేదు.. చంద్రబాబుపై రవీంద్రనాథ్ రెడ్డి ఫైర్
-
‘చంద్రబాబు సర్కార్‌కు గుణపాఠం చెబుదాం’
సాక్షి,తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 12న జరిగే ర్యాలీలను సూపర్ సక్సెస్ చేద్దాం. వైద్య వ్యవస్ధను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుదాం. ప్రజా స్పందనను బలంగా వినిపిద్దాం’అంటూ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ సీఈసీ, ఎస్ఈసీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్, మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, జెడ్పీటీసీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మునిసిపల్ ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 12న ర్యాలీలు జరుగనున్నాయి, కోటి సంతకాల సేకరణ కోసం క్షేత్రస్ధాయిలో మీరంతా ఉన్నారు, ఇదంతా కూడా ఒక ప్రజా ఉద్యమంగా కొనసాగుతోంది. మీ అందరి భాగస్వామ్యం వల్ల కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం విజయవంతం అవుతుంది. మనం తీసుకుంటున్న ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా 12న జరిగే ర్యాలీలు ఉండాలి. వైద్యవ్యవస్ధను జగన్ ప్రజలకు చక్కటి గొడుగులా తయారుచేస్తే చంద్రబాబు దానిని నిర్వీర్యం చేశారు. మనం చేసే ఆందోళనలు, ర్యాలీలు జాతీయస్ధాయిలో చర్చ జరిగేలా ఉండాలి. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం దిగివస్తుంది. కలిసి వచ్చే పార్టీలందరినీ కలుపుకుపోదాం. కులసంఘాలు, స్వఛ్చంద సంస్ధలు, ట్రేడ్ యూనియన్లు ఇలా అందరినీ కలుపుకుందాం. అప్పుడే సూపర్ సక్సెస్ అవుతుంది. ఇందుకు అవసరమైన కసరత్తు పూర్తిచేయాలి. ఏ మాత్రం ఏమరుపాటు వద్దు, అందరూ ఈ కార్యక్రమాన్ని పర్సనల్‌గా తీసుకుని సక్సెస్ చేయాలి. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుందాం. మీ పరిధిలో ఉన్న వారందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ర్యాలీలు సక్సెస్ చేయాలి. మీరంతా ఓనర్ షిప్ తీసుకుని లీడర్లుగా నిరూపించుకునే అవకాశం ఇది. స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎప్పుడొచ్చినా మీరంతా సిద్దంగా ఉండాలి, దీనిపై కూడా సీరియస్‌గా దృష్టిపెట్టాలి. క్షేత్రస్ధాయి నుంచి పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఈ కమిటీలన్నీ పూర్తయితే దాదాపు 13 లక్షల మంది సైన్యం సిద్దమవుతుంది. ఇదంతా పారదర్శకంగా డిజిటలైజేపన్ చేయాలి. పరిశీలకుల సహాకారం తీసుకుని పక్కాగా చేయండి. కేంద్ర కార్యాలయం నుంచి అవసరమైన సహకారం ఉంటుంది. అన్ని నియోజకవర్గాల్లో డిజిటల్ మేనేజర్లను కూడా నియమించడం జరిగింది. కమిటీల ఏర్పాటు పకడ్భందీగా చేయాలి, డేటా అంతా కూడా డిజిటలైజ్ చేయాలి. ప్రతి ఇంట్లో మన పార్టీ ఉంటుంది, నిత్యం ప్రజా సమస్యలపై మనం చేస్తున్న పోరాటాలకు అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. ప్రజల్లో మన పార్టీకి ఉన్న ఇమేజ్ బాగా పెరుగుతుంది. దీనిని ఇంకా మరింతగా పెంచుకుందాం. కూటమి ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొందాం’అని సూచించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. బాబు సర్కార్ దిగిరావాల్సిందే: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పార్టీ ముఖ్య నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రచ్చబండ కార్యక్రమాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. ఈ నెల 12న అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ర్యాలీలను విజయవంతం చేయాలన్నారు. కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ముందుకు పోవాలని.. పార్టీ కమిటీలు, డేటా డిజిటలైజేషన్‌పై ప్రతి ఒక్కరూ సీరియస్‌గా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.‘‘పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం ఆగదు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అంతా పకడ్బందీగా సిద్ధమవ్వాలి. ప్రజలకు మరింత చేరువయ్యేలా గొంతెత్తి నినదించాలి. ప్రతి ఒక్కరూ మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో పనిచేయాలి’’ అని సజ్జల పేర్కొన్నారు.సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..‘‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గాల్లో ఈ నెల 12న ర్యాలీలు జరుగుతాయి. ఇందుకు రాష్ట్ర స్థాయిలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. దీనిపై రేపు అన్ని జిల్లాలలో జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో అసెంబ్లీ ఇంఛార్జ్‌లు, ఆ తర్వాత మండల స్ధాయిలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమాలు నిర్వహించాలి. పోస్టర్ రిలీజ్ తర్వాత ప్రెస్ మీట్లు నిర్వహించి మీడియాకు మన ఉద్దేశాన్ని వివరించాలి. కోటి సంతకాలు-రచ్చబండ కార్యక్రమంకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది...వైఎస్ జగన్ అభిప్రాయంతో ప్రజలు ఏకీభవిస్తున్నారు. పార్టీ అనుబంధ విభాగాలు కూడా ఇందులో తమ వంతుగా వివిధ వర్గాల ప్రజలను కలిసి ప్రజా స్పందనను సంతకాల రూపంలో విస్తృతంగా నమోదు చేస్తున్నారు. వచ్చే వారంలో కోటి సంతకాల సేకరణపై రివ్యూ చేద్దాం. ప్రభుత్వం దిగివచ్చే వరకూ మన పోరాటం ఆగదు. మనతో కలిసివచ్చే పార్టీలను ఆహ్వనిద్దాం. వివిధ కుల సంఘాలు, సివిల్ సొసైటీలను భాగస్వామ్యం చేద్దాం. మరింత ఫోకస్డ్గా పనిచేద్దాం...పార్టీ కమిటీల ఏర్పాటు, డేటా డిజిటలైజేషన్‌పై కూడా నాయకులు సీరియస్‌గా దృష్టిపెట్టాలి. వైఎస్ జగన్ వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇంటెన్సివ్ డ్రైవ్ లాగా చేయాలి. మనం ముందుగా అనుకున్న డెడ్ లైన్కల్లా అన్ని స్థాయిలలో కమిటీల నియామకాలు పూర్తవ్వాలి. సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం తక్షణమే ఫోకస్డ్గా పని చేయాలి. మండల, గ్రామ స్థాయి కమిటీలు నిర్ణీత టైంలైన్లోపు పూర్తి చేయాలి. డేటా ప్రొఫైలింగ్ అనేది పక్కాగా జరగాలి. అందుకు అవసరమైన సాఫ్ట్వేర్ ఇప్పటికే రూపొందించాం...పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళదాం. నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లతో సమన్వయం చేసుకోవాలి. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగే సమయంలో మనం జాగ్రత్తగా పరిశీలించాలి, అలెర్ట్‌గా ఉండాలి. అందుకు అవసరమైన బూత్ లెవల్ ఏజెంట్లను సిద్ధం చేసుకుందాం. స్థానిక సంస్ధల ఎన్నికలు జరిగే నాటికి మనం అంతా పకడ్బందీగా సిద్ధమవ్వాలి. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మనం వారి తరుపున గొంతెత్తి నినదిస్తున్నాం. డిజిటల్ మీడియా వేదికగా మన వాణిని వినిపిద్దాం. ప్రతిఒక్కరూ మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో పనిచేయాలి. కమిటీల నిర్మాణానికి అవసరమైన పరిశీలకులను అవసరమైతే తక్షణం నియమించాలి. కమిటీల ఏర్పాటు ఎంత ముఖ్యమో ఆ తర్వాత ఆ కమిటీలు అంతే ఉత్సాహంగా పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు’’ అని సజ్జల వివరించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ‘వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం’
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈనెల 12న ‘వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం’ పేరుతో 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు పార్టీ నాయకులు వెల్లడించారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేయడం జరుగుతుందని వివరించారు.ఇందుకు సంబంధించి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా వైఎస్సార్సీపీ పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..అందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావించిన నాటి సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడమే కాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 7 కాలేజీలను పూర్తి చేశారు. మిగిలిన కాలేజీల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్మాణాలకు నిధుల కొరత లేకుండా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్‌తో టైఅప్ చేయడం జరిగింది.కానీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ నిర్మాణాలను పూర్తిచేయకపోగా సేఫ్ క్లోజర్ పేరుతో పూర్తిగా పక్కన పెట్టేశారు. అంతే కాకుండా 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించి డాక్టర్లు కావాలని కలలు కనే పేద విద్యార్థుల ఆశలకు చంద్రబాబు గండి కొట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, నారాయణమూర్తి, ఇతర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
చంద్రబాబు మంచి చేయకపోగా.. చెడు చేస్తున్నారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు మంచి చేయకపోగా.. చెడు చేస్తున్నారని అన్నారు. అలాగే, సమాజంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని గుర్తు చేశారు. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని సూచించారు.వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలపై వైఎస్ జగన్ చర్చించారు. అనంతరం వారితో వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘కల్మషం లేని రాజకీయ వ్యవస్థ మీ దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది. మంచి రాజకీయాలకు బీజం విద్యార్థి దశలోనే పడుతుంది. మీరంతా జెన్ -Z తరంలో ఉన్నారు. భావి తరానికి మీరంతా దిక్సూచీ. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి. పలానా వాడు మన రాజకీయ నాయకుడు అని కాలర్ ఎగరేసేకునేలా మనం ఉండాలి. మనలో ఆ గుణాలను, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. ఈ రాష్ట్రం మనది కాబట్టి.. ఈ రాష్ట్రం బాగుండాలని మనమంతా కోరుకుంటున్నాం. ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితిలోకి ప్రతి విద్యార్థీ వెళ్లాల్సిన అవసరం ఉంది.కాని, ఆ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా?.ప్రపంచంతో పోటీ పడాలి.. ఒక్క రాత్రిలోనే ఇవన్నీ జరగవు. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలి. ఒక నాయకుడు తన విజన్‌లో భాగంగా ఒక అడుగు వేస్తే, అవి ఫలితాలు ఇవ్వడానికి 10-15 సంవత్సరాలు పడుతుంది. అలాంటి ఆలోచనలు మనం చేయాలి. అది రియాల్టీలోకి వచ్చినప్పుడు భవిష్యత్తు తరాలు మారుతాయి. సమాజంలో విద్యార్థులుగా మీ పాత్ర అత్యంత కీలకం. మన ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకు వచ్చాం.కేజీ నుంచి పీజీ వరకూ మంచి చదువులు ఉండాలని భావించాం. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించేలా మన ప్రభుత్వంలో ఆలోచనలు చేశాం.స్కూలుకు వెళ్లే పిల్లలకు ఓట్లు లేవని, ఏ రాజకీయ పార్టీ కూడా వారి గురించి పట్టించుకోదు. కాని, రేపు భవిష్యత్తును నిర్దేశించేది వాళ్లే. అందుకని స్కూళ్ల నుంచే మనం విప్లవాత్మక చర్యలు తీసుకు వచ్చాం. ప్రైవేటు స్కూల్స్‌తో పోటీపడేలా ప్రభుత్వ స్కూల్లను తీర్చిదిద్దాం. సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం ప్రారంభించాం. ఆ స్థాయి విద్యను మన పిల్లలకు మనం ఇవ్వాలి.6,200 కోట్లు బకాయిలు.. మనకు పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, మన పోటీ ప్రపంచంతోనే. ఎడెక్స్‌తో ఉచితంగా ఆన్లైన్ కోర్సులు ఇప్పించాం. ప్రపంచంలో అత్యుత్తమ యూనివర్శిటీలకు చెందిన కోర్సులు అందుబాటులోకి ఇచ్చాం. ఆయా యూనివర్శిటీలు సర్టిఫికెట్లు ఇచ్చేలా చేశాం. డిగ్రీల్లో కొత్త కోర్సులు తీసుకు వచ్చాం. మనం రాక ముందు 257 కాలేజీలకు మాత్రమే నాక్ రిజిస్ట్రేషన్ ఉంటే 2024 నాటికి 432కి పెరిగాయి. పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్ తీసుకు వచ్చాంది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. కేవలం విద్యాదీవెన అనే ఒకే ఒక పథకం కింద రూ.12,609 కోట్లు ఇచ్చాం. వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.20వేలు ఇచ్చాం. చదువుల కోసం అప్పులు పాలు కాకుండా చూశాం. కాని, ఇవాళ అన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. పిల్లలు చదవకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. ఏడు త్రైమాసికాల నుంచి ఫీజు రియింబర్స్‌మెంట్ పెండింగ్‌లో పెట్టారు. ఫీజు రియిబంర్స్మెంట్లో రూ.4,200 కోట్లు పెండింగ్ ఉంది. వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు పెండింగ్. మొత్తంగా రూ.6,200 కోట్లు బకాయి పెట్టారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాయకత్వం తీసుకోవాలి.1.2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.. మన ప్రభుత్వ హయాంలో అక్షరాల ప్రభుత్వ రంగంలోనే 6.3 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. 52 వేల మందిని ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేశాం. హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో కూడా భారీగా ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు ఉద్యోగాలను కోత కోస్తున్నారు. ఎంఎస్ఎంఈ సెక్టార్లో 4.7లక్షల యూనిట్ల ద్వారా 33లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తోడుగా ఉందనే భావన ఎంఎస్ఎంఈలకు ఉండేది. క్రమం తప్పకుండా వారికి ప్రోత్సాహకాలు అందేవి. అందుకనే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయి.చంద్రబాబు చేసిందేంటి?. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడు. అసలు చంద్రబాబు చేసింది ఏముంది?. సింగపూర్ నుంచి కేబుల్ తీసుకురావడానికి అంకురార్పణ చేసింది వైఎస్సార్సీపీ. అదానీ-గూగుల్‌కు 2022లో నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉంది. మనం ఇక్కడ కూడా భూములు ఇచ్చాం, అన్ని ఏర్పాట్లూ జరిగాయి. ఆరోజు అడుగులు వేశాం కాబట్టి ఇప్పుడు గూగుల్ వస్తోంది. మూలపేట ప్రారంభించి మనం కట్టుకుంటూ వెళ్లాం కాబట్టి ఇప్పుడు మూలపేట పోర్టు జరుగుతోంది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చి మనం శరవేగంగా నిర్మాణాలు చేశాం.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న అత్యంత దరిద్రపు పని. మంచి చేయకపోగా, చెడు చేస్తున్నాడు. 2019 వరకూ ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 12. అప్పటికి చంద్రబాబు ఒక్కటి కూడా తేలేదు. ఐదేళ్లలో కోవిడ్ రెండేళ్లు తీసేస్తే, మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చాం. ప్రతి జిల్లాకో గవర్నమెంటు మెడికల్ కాలేజీ తీసుకు వచ్చాం. 17 కొత్త మెడికల్ కాలేజీల వల్ల 2,550 సీట్లు అందుబాటులోకి వస్తాయి. సగం సీట్లు ఉచితం, మిగిలిన సీట్లు తక్కువ రేటుకే అందుబాటులోకి వస్తాయి. మన పిల్లలు ఇక్కడే డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది. మెడికల్ కాలేజీలు సీట్లు ప్రారంభం అయ్యాయి. పాడేరు కూడా ఎన్నికల తర్వాత ప్రారంభం అయ్యింది. 800 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.సీట్లు వద్దని లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు.. పులివెందుల కాలేజీకి 50 సీట్లు కేంద్రం ఇస్తే.. వద్దంటూ చంద్రబాబు లెటర్ రాశాడు. మిగిలిన 10 కాలేజీలకు రూ.5వేల కోట్లు పెడితే చాలు. ఏడాదికి రూ.వేయి కోట్లు పెట్టినా చాలు. కాని, చంద్రబాబుకు మనసు రాదు. ఆయన పెట్టకపోయినా పర్వాలేదు, అలా వదిలేస్తే మేం వచ్చాక కట్టుకుంటాం. స్కాములు చేస్తూ అమ్మేస్తున్నాడు. ఇలాంటి వాటిపై ప్రశ్నలు వేసి, నిలదీసే బాధ్యత మీది. రాష్ట్రంలో కోటి సంతకాల కార్యక్రమం జరుగుతోంది. మీరంతా చురుగ్గా పాల్గొనాలి. గ్రామస్థాయిలో కూడా విద్యార్థి విభాగం, యూత్ విభాగం రావాలి. మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది. మీరు ఎవర్ని డిసైడ్ చేస్తే.. ఆ ప్రభుత్వం వస్తుంది. విద్యార్థి, యువకులకు ఉన్న శక్తి అది. తటస్థులను, భావసారూప్యత ఉన్న వ్యక్తులను కూడా కలుపుకోవాలి. అసెంబ్లీ కేంద్రాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు 11 నుంచి 12వ తేదీకి మార్పు జరిగింది. డిసెంబర్లో ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ఆందోళనలు ఉంటాయి. అంతవరకూ చంద్రబాబుకు సమయం ఇద్దాం అని సూచించారు. -
ప్రభుత్వ ధనం.. ప్రైవేటు లాభం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చెల్లించినట్లు భారీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని, ఇలాంటి కేసుల్లో ప్రజా ప్రయోజనాలనే కోర్టులు పరమావధిగా పరిగణించాలని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ బుధవారం హైకోర్టును అభ్యర్థించారు. రాష్ట్రంలో 10 వైద్య కళాశాలలను పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేసేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 590ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ గుంటూరు జిల్లా, తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ముందు తాజాగా ఈ పిల్ విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున శ్రీరామ్ తన వాదనలను వినిపిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను లీజుకివ్వడం వల్ల ప్రైవేటు వ్యక్తులు రూ. కోట్లు ఆర్జిస్తారన్నారు. కాలేజీలను కేంద్రం, నాబార్డ్ ఇచ్చే నిధులతోనే నిర్మిస్తారని తెలిపారు. లబ్ధి మాత్రం ప్రైవేటు వ్యక్తులే పొందుతారన్నారు. ప్రభుత్వ వైద్య సేవలకు పేదలు దూరమవుతారని పేర్కొన్నారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు కోర్టు అంగీకరిస్తూ తదుపరి విచారణను నవంబర్ 19కి వాయిదా వేసింది. -
బాబు కుతంత్రం
సాక్షి, అమరావతి: ఛత్తీస్‌గఢ్.. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటి. చిన్న రాష్ట్రం, 33 జిల్లాలు.. 3.10 కోట్ల జనాభా.. 99 అసెంబ్లీ నియోజకవర్గాలు.. ఏడాదికి రూ.1.41 లక్షల కోట్ల రెవెన్యూ.. ఇంతటి వెనుకబడిన రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు ఉంటే.. వాటిలో 12 ప్రభుత్వానికి చెందినవే. ఆ రాష్ట్ర ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు వీలుగా మరో నాలుగు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.1,300 కోట్లతో నాలుగు కొత్త కళాశాలల నిర్మాణానికి ఆ రాష్ట్ర వైద్య శాఖ టెండర్లను ఖరారు చేసింది. ఒకటి, రెండేళ్లలో ఆ రాష్ట్రంలో ప్రతి 19 లక్షల మందికి ఒక ప్రభుత్వ వైద్య కళాశాల అందుబాటులోకివస్తుంది. ఏపీ పరిస్థితి ఇదీజనాభా.. విస్తీర్ణం.. రెవెన్యూ వంటి అన్ని అంశాల్లో ఛత్తీస్‌గఢ్ కంటే ముందుండే ఏపీలో పరిస్థితి పరిశీలిస్తే.. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 5.50 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. ఈ జనాభాకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో ప్రారంభించిన ఐదు కళాశాలలతో కలిపి 16 ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. ఈ లెక్కన ఏపీలో 34 లక్షల జనాభాకు ఒక ప్రభుత్వ కళాశాల ఉంది. దేశంలోని అతి చిన్న, వెనుకబడిన రాష్ట్రాలు సైతం ప్రజారోగ్యం, పిల్లల భవిష్యత్‌కు బంగారుబాట వేసేలా ప్రభుత్వ రంగంలో విద్యా, వైద్య వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాయి. ఈ రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 150కి పైగా కొత్త కళాశాలల ప్రారంభానికి అనుమతులిచ్చింది. వీటిలో 80 వరకు వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ కళాశాలలే ఉన్నాయి. ఏపీలో మాత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యల ఫలితంగానే గత ఏడాది పాడేరు వైద్య కళాశాల అందుబాటులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక..అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలే ఉన్నప్పటికీ చంద్రబాబు కొత్త ప్రభుత్వ కళాశాలల ఏర్పాటు దిశగా అడుగులు వేయకపోగా.. గత ప్రభుత్వంలో వచ్చిన కళాశాలలను సైతం ప్రైవేటుకు అప్పగించేస్తున్నారు. ఇందుకోసం పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కేరళతో పాటు దేశంలో అత్యంత వెనుకబడిన, చిన్న రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, హరియాణ , హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో సైతం లేనివిధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడుతుండటం చర్చనీయాంశంగా మారింది. పీపీపీ ముసుగులో ఏకంగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రైవేట్‌కు ధారాదత్తం చేస్తుండటంపై అన్నివర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఛత్తీస్‌గఢ్ వంటి చిన్న రాష్ట్రం, ఏపీతో పోలిస్తే ఆర్థికంగా ఎంతో వెనుకబడిన రాష్ట్రం సైతం ఒకేసారి రూ.1,300 కోట్లతో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మిస్తోంది. భూములు సేకరించి, టెండర్లు ప్రక్రియ పూర్తిచేసి, తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న కళాశాలలను సైతం చంద్రబాబు ప్రైవేట్‌కు కట్టబెట్టి ప్రభుత్వ వైద్యరంగాన్ని ధ్వంసం చేస్తుండటం గమనార్హం.రూ.5 వేల కోట్లు లేవంటూ..రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కల్పన, మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను పెంచేలా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.8,480 కోట్ల అంచనాలతో కళాశాలలు నెలకొల్పడానికి ప్రణాళికలు రూపొందించారు. 17 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర సాయం, స్పెషల్ అసిస్టెంటెన్స్ టు ది స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం, నాబార్డు రుణాల ద్వారా నిధులు సమకూర్చారు. ఒక్కోచోట 50 నుంచి 100 ఎకరాల చొప్పున 17 వైద్య కళాశాలలకు భూములు సేకరించారు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని సైతం ఎదురొడ్డి 2023–24లో 5, 2024–25లో మరో 5, 2025–26లో ఇంకో 7 కళాశాలలు ప్రారంభించేలా అడుగులు ముందుకు వేశారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు వందేళ్ల రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 2023–24లో ఏలూరు, రాజమండ్రి, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం కళాశాలల్ని ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చారు. 2024–25లో మరో 5 కళాశాలలు ప్రారంభించేలా సార్వత్రిక ఎన్నికల నాటికే ఏర్పాట్లు చేశారు. ఆ చర్యల ఫలితంగానే పాడేరు, పులివెందులకు 50 చొప్పున సీట్లతో అడ్మిషన్లకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది. గతేడాది బాబు గద్దెనెక్కిన వెంటనే వైద్య కళాశాలలపై నీలినీడలు కమ్ముకున్నాయి. పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టేస్తున్నామని వైద్య శాఖపై మొదటి సమీక్షలోనే సీఎం ప్రకటించారు. అంతేకాకుండా గతేడాదే పులివెందుల వైద్య కళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చినా వద్దని కుట్రపూరితంగా రద్దు చేయించారు.ప్రభుత్వమే కళాశాలలు నిర్మించి, నిర్వహించడానికి నిధుల్లేవంటూ ఏకంగా 10 కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్‌కు కట్టబెట్టడానికి పూనుకున్నారు. వాస్తవానికి 10 కళాశాలలు నిర్మించడానికి రూ.5 వేల కోట్ల నిధులుంటే సరిపోతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఒకేసారి ఖర్చు పెట్టాల్సి అవసరం లేదు. ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వ రంగంలో 10 కళాశాలలు అందుబాటులోకి వచ్చేవి.మోసపూరితంగా..వైఎస్ జగన్ ప్రభుత్వం రచించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు నడుచుకుని ఉంటే ఈ విద్యా సంవత్సరానికే 17 వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం అయి ఉండేవి. ప్రైవేట్‌కు వైద్య కళాశాలలు కట్టబెట్టడం కోసం ఆయన చేసిన కుట్రలతో రెండేళ్లలో 2,550 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు కళాశాలలు పీపీపీకి ఇవ్వడంతో ప్రజలు, విద్యార్థులపై ఎటువంటి భారం ఉండబోదనే ప్రకటనలతో మోసం చేస్తోంది. వైఎస్ జగన్ విధానంలో ఒక్కో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆలిండియా, రాష్ట్ర కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ కోటా సీట్లు 86 ఉండగా.. వీటిలో 11 సీట్లకు బాబు గండి కొడుతున్నారు. తద్వారా 10 కళాశాలల్లో 110 సీట్లను విద్యార్థులు నష్టపోతున్నారు. ఆ సీట్లన్నింటినీ యాజమాన్య కోటాకు మళ్లించి, ప్రైవేట్ వ్యక్తులు ఫీజులు రూపంలో దోచుకునేలా ప్రభుత్వమే ప్రణాళిక వేసింది. అదేవిధంగా పీపీపీలో యాజమాన్య కోటా సీట్లకు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగానే ఫీజులను ప్రతిపాదించారు. జగన్ విధానంలో రోగులకు బోధనాస్పత్రుల్లో పూర్తిస్థాయిలో ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేవి. బాబు విధానంలో ఏ సేవకైనా పేదలు డబ్బు చెల్లించాల్సిందేనని, ఏదీ ఉచితం కాదని ఇప్పటికే స్పష్టం అయిపోయింది. -
జనకోటి త్రిక‘రణ’శుద్ధి
సాక్షి,అమరావతి: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం ఊపందుకుంది. కోటి సంతకాల సేకరణ శరవేగంగా సాగుతోంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జోరువాన కురుస్తున్నా.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులు సంతకాల సేకరణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రణన్నినాదాన్ని పూరించారు. అనేక చోట్ల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సర్కారు తీరుపై గళమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించకుంటే పోరాటం ఉద్ధృతమవుతుందని గర్జించారు.గత ప్రభుత్వంలో వైఎస్ జగన్జిల్లాకు ఒకటి చొప్పున 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం ఈ 17 నెలల పాలనలో వాటిని నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. మెడికల్ సీట్లు వద్దన్న ఏకైక ప్రభుత్వం ఇదేనని దుయ్యబట్టారు. రూ.లక్షల కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజీలను కూటమి పెద్దలు అతి తక్కువ ధరకు తమ అస్మదీయులకు సింగిల్ టెండర్లోనే కట్టబెట్టడం అన్యాయమని గర్హించారు. వైద్య విద్యను వ్యాపారంచేయొద్దని, ఇది కేవలం సంతకం కాదు.. కోటి గుండెల నిరసన అంటూ హెచ్చరించారు. » అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం భట్టువానిపల్లి గ్రామంలో మంగళవారం కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య హాజరయ్యారు. భట్టువానిపల్లి గ్రామస్తులు సంతకాల సేకరణలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. » బాపట్ల జిల్లా చుండూరు మండలంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు, నాయకులు సంతకాలు సేకరించారు. » ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కోయరాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరిగింది. » పార్వతీపురం 14వ వార్డులోని బైపాస్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. » ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరిగింది. ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. » కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోట నరసింహం ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. » కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం, సంతకాల సేకరణ చేపట్టారు. » కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. » ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం మర్రిపూడి మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ , వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకులు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఏఐఎస్ఎఫ్ నిరసన
పాడేరు(అల్లూరి జిల్లా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏఐఎస్ఎఫ్ నిరసన చేపట్టింది. విద్యావ్యవస్థను నీరుగారుస్తున్న కూటమి ప్రభుత్వం చర్యలను తప్పుబట్టింది. ఈ మేరకు పాడేరు మెడికల్ కళాశాలను విద్యార్థి సంఘాల బృందం సందర్శించింది. విద్యార్థుల సంస్థల్లో నెలకొన్న సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టింది ఏఐఎస్ఎఫ్.సీపీపీ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రేవేటుపరం చేస్తే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడుదాం! ఉద్యమాలను తీవ్రతం చేద్దాం!.... అంటూ పిలుపునిచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన తప్పుడు జీవో నెంబర్77ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. విద్యార్థుల హక్కులను హరించే ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. -
మెడికల్ కాలేజీలను ఎవరికి దోచి పెట్టాలో రెడీ చేశారు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేతలు పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, అరుణ్ కుమార్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయాంలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి. అబద్ధాలు చెప్పి దబాయించడం చంద్రబాబు అలవాటే. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. కోవిడ్ తర్వాత ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి. కూటమి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ దుర్మార్గ చర్య. దీనిపై ప్రజల్లో కూడా వ్యతిరేకత బాగా పెరిగింది. ప్రభుత్వం వెనక్కు తగ్గే వరకు పోరాటం చేస్తాం. ఇది రాజకీయాల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే. ఈనెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేస్తాం. ప్రజాస్వామ్య వాదులంతా హాజరు కావాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ ఉదృతంగా జరుగుతోంది. ప్రజల అభిప్రాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. స్వచ్ఛందంగా ప్రజా సంఘాలు, మేధావులు ఈ పోరాటంలో పాల్గొంటున్నారు.అందులో భాగంగానే ఈనెల 28న అసెంబ్లీ నియోజకవర్గాలలో ర్యాలీలు చేయబోతున్నాం. తర్వాత నవంబర్ 12న జిల్లా కేంద్రాలలో కూడా ర్యాలీలు చేస్తాం. కోటి సంతకాలు పూర్తి చేసుకుని వాటిని నవంబర్ 23న జిల్లాలకు తరలిస్తాం. అనంతరం కేంద్ర కార్యాలయానికి వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణను ఆపాలి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైద్యం, వైద్య విద్యను అందించాలన్నది వైఎస్ జగన్ ఉద్దేశం. అందుకే 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతాయి. ఒక్కరోజులో ఏ కాలేజీ పూర్తి కాదు. ఎయిమ్స్ లాంటి సంస్థ పూర్తవటానికే తొమ్మిదేళ్లు పట్టింది.పులివెందుల కాలేజీ పూర్తయినా చంద్రబాబు సీట్లు రాకుండా అడ్డుకున్నారు. పాడేరు కాలేజీకి 50 సీట్లు చాలని మిగతావి రాకుండా అడ్డుకున్నారు. సంవత్సరానికి వెయ్యి కోట్లు చొప్పున నాలుగైదేళ్లు ఖర్చు చేస్తే కాలేజీలన్నీ అందుబాటులోకి వస్తాయి. పీపీపీ అంటే ప్రయివేటీకరణ కాదని చంద్రబాబు కొత్త భాష్యం చెప్తున్నారు. లాభాల కోసమే ప్రైవేటు వ్యక్తులు మెడికల్ కాలేజీలతో వ్యాపారం చేస్తారు. ఇప్పటికే ఎవరెవరికి ఏ కాలేజీని దోచి పెట్టాలో నిర్ణయం తీసుకున్నారు. ఇక పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఇలాంటి విధ్వంసాన్ని ఏపీలో ఎప్పుడూ చూడలేదు. కానీ, తన మీడియా పవర్‌తో ఎదుటి వారిపై విమర్శలు చేస్తున్నారు’ అని అన్నారు. -
చంద్రబాబు అంటేనే కాపీ కొట్టడం: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అప్పులు చేసి అభూత కల్పనపై ఖర్చు పెడుతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైఎస్ జగన్ చేసిన పనులను చూసి కాపీ కొట్టడమే చంద్రబాబుకు తెలిసిన విద్య అని ఎద్దేవా చేశారు. అలాగే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగింది అంటూ వ్యాఖ్యలు చేశారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేవీనగర్‌లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, కార్పొరేటర్ జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు అప్పులు చేసి అభూత కల్పనపై ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగింది. చంద్రబాబు ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశాడు . వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీకి గ్రీన్ చానల్ అని పెట్టి ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించారు. ఆరోగ్య శ్రీ ఉద్యోగులు రోడ్డుపై నిరసనలకు దిగుతున్నారుప్రతి సందర్భంలో వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కూటమి నేతలు విర్రవీగుతున్నారు. వైఎస్ జగన్ దీపావళి పండగ చేస్తే.. దానిపై బురద జల్లుతున్నారు. వైఎస్ జగన్ చేసిన పనులన్నీ చంద్రబాబు కాపీ కొట్టడమే పని. వైఎస్ జగన్ దీపావళి చేస్తే.. చంద్రబాబు విజయవాడలో దీపావళి చేస్తాడు. వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తే.. చంద్రబాబు విజయవాడలో వినాయక చవితి వేడుకలు ఏర్పాటు చేశాడు. వైఎస్ జగన్ చేసే ప్రతీ పనిని చంద్రబాబు కాపీ కొడుతున్నాడు. ప్రజల విషయంలో అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీ ఉద్యమాలు చేపడుతుంది. 28వ తేదీన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ర్యాలీ చేపడతాం’ అని చెప్పుకొచ్చారు. -
వైఎస్ జగన్ స్థాపించిన మెడికల్ కాలేజీలకు పీజీ సీట్ల మంజూరు
విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హయాంలో స్థాపించిన మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు మంజూరయ్యాయి. తొలిసారి కొత్త మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు మంజూరు చేసింది ఎన్ఎంసీ(National Medical Commission). ఇందులో మచిలీపట్నం-12, నంద్యాల-16, విజయనగరం -12, రాజమండ్రి-16, ఏలూరు -4 చొప్పున పీజీ సీట్లు మంజూరు చేసింది. ఐదు మెడికల్ కాలేజీలకు 60 మెడికల్ పీజీ సీట్లు మంజూరు చేయడంతో ఇన్నాళ్లు కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నది అబద్ధమేనని తేలిపోయింది. వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలు కట్టలేదంటూ మంత్రులు సైతం అబద్ధాలు చెప్పారు. వైఎస్ జగన్ స్థాపించిన మెడికల్ కాలేజీలకు తాజాగా పీజీ సీట్లు మంజూరు కావడంతో ప్రభుత్వ పెద్దలు చెప్పేదంతా అసత్య ప్రచారమేనని నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే 5 కాలేజీల్లో 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు మంజూరు కాగా, తాజాగా 60 పీజీ సీట్లు మంజూరు చేసింది ఎన్ఎమ్సీ.ఇదీ చదవండి: ‘వైద్య రంగంలో జగన్ సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే’ -
మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనంపై టీడీపీ గూండాల దాడి
సాక్షి,కర్నూల్: కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనంపై టీడీపీ గూండాలు దాడి చేశాయి. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు వెళ్తుండగా టీడీపీ గూండాలు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. టీడీపీ గూండాల దాడిలో వైఎస్సార్సీపీ ఎంపీపీ వాహనం ధ్వంసమైంది. వైఎస్సార్సీపీ నేతలు గ్రామంలోకి అడుగు పెట్టకూడదు అంటూ హుకుం జారీ చేశారు. గ్రామంలో రెచ్చిపోతూ స్థానికుల్ని టీడీపీ గూండాలు భయబ్రాంతులకు గురి చేశారు. -
డబ్బులేని పేదోడు ఈ రాష్ట్రంలో బతకొద్దా.. బాబుకు శ్యామల వార్నింగ్
-
ప్రైవేటీకరణ ఆపించండి.. ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, కర్నూలు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ఆపించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. తాజాగా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన్ని ఎయిర్‌పోర్టు వద్ద పలువురు నేతలు కలిశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేయాలని ఈ సందర్భంగా ప్రధానిని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. అలాగే.. వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం పరిశీలించాలని, నంద్యాల-కల్వకుర్తి బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ప్రధాని మోదీని కలిసిన వాళ్ళలో ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, జెడ్పీ చైర్మన్.. తదితరులు ఉన్నారు. -
Malladi Vishnu: పేరుకే అనుభవం అభివృద్ధిలో శూన్యం
-
పేదలకు వైద్యవిద్యను దూరం చేయొద్దు మెడికల్ కళాశాలల పీపీపీ ఆపండి
గాందీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తోందని మేధోమథన సదస్సులో పలువురు వక్తలు విమర్శించారు. పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలు కట్టబెట్టేందుకు జారీ చేసిన జీవోను తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం ప్రభుత్వం రంగంలోనే నడపాలని పట్టుబట్టారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో శనివారం జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో మేధోమథన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పలువురు వక్తలు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమికి సహకరించిన ఎన్ఆర్ఐలు, కార్పొరేట్లు, తమకు కావాల్సిన వారికి మెడికల్ కళాశాలలను కట్టబెట్టేందుకు లోపభూయిష్టమైన పీపీపీ విధానం ముందుకు తెచ్చిందని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణకు డబ్బులు లేవని సర్కారు కుంటి సాకులు చెబుతోందని, వాస్తవంగా డబ్బులు లేకపోతే తాము జోలెపట్టి డబ్బులు అడిగి ప్రభుత్వానికి ఇస్తామని, వైద్య కళాశాలలు ప్రైవేటుపరం చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే మహోద్యమం తప్పదని హెచ్చరించారు. రాబోయే రెండు నెలల్లో సర్కారు తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 110 నియోజకవర్గాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల విషయంలో అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు వివరించి ప్రభుత్వ కుట్రలు బహిర్గతం చేస్తామన్నారు. వాస్తవాలు వివరించేందుకే సదస్సు..‘‘వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించారు. వీటిలో ఐదు కళాశాలలు వైఎస్సార్సీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయి. మరో రెండు కూడా పూర్తవగా, ఎన్నికల తర్వాత ఒక కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మరో కాలేజీకి ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనా కూటమి ప్రభుత్వం వద్దని ఎన్ఎంసీకి లేఖ రాసింది. మరో రెండు అడ్మిషన్లకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మిగిలిన కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి నేతలు మెడికల్ కాలేజీలకు జీవోలు లేవని, అసలు నిర్మాణం జరగలేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ప్రజలకు వాస్తవాలు వివరించేందుకే మేధోమథన సదస్సు నిర్వహించాం. ఈ విషయంలో వైఎస్ జగన్‌కే మా మద్దతు. ఆయనను అందరూ అభినందించి తీరాల్సిందే. కమీషన్లకు ఆశపడి చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ పీపీపీపై మోజు పెంచుకున్నారు. సర్కారు తీరువల్ల ఏటా 2,500 మంది ఏపీ విద్యార్థులు నష్టపోతారు. హోమంత్రి అనిత తన శాఖ పనిని వదిలేసి మెడికల్ కాలేజీలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అసంబద్ధం. స్పీకర్ అయ్యన్నపాత్రుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మేమూ భాగస్వాములం అవుతాం.’’ అని వక్తలు స్పష్టం చేశారు. ఈ మేరకు తీర్మానం చేశారు. అనంతరం మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఒక్కొక్కటి చదివి వినిపించారు. సదస్సులో వైఎస్సార్సీపీ నాయకురాలు మంచా నాగమల్లేశ్వరి, వైఎస్సార్సీపీ వైద్యవిభాగం ఎనీ్టఆర్ జిల్లా అధ్యక్షుడు అంబటి నాగరాధాకృష్ణ, న్యాయవాది సాయిరామ్, రిటైర్డ్ జడ్జి జయసూర్య, ముస్లిం లీగ్ నాయకులు బషీర్ అహ్మద్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత నేతి మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పీపీపీ కమిషన్లలో బాబు, పవన్, లోకేష్‌కు వాటాలు: జడ శ్రావణ్ కుమార్
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో బడుగు,బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుందని జైభీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడలో శనివారం మేధోమథనం సదస్సు జరిగింది.జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేటీకరణ చేయడమే. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వల్ల సామాన్యులకు తీరని నష్టం తప్పదు. ఈ విధానం వల్ల బడుగు,బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుంది. తీవ్ర వ్యతిరేకత వస్తున్న చంద్రబాబు వెనక్కి తగ్గకపోవడం వెనుక అతిపెద్ద లాభం ఉందనేది స్పష్టమవుతోంది. పీపీపీ చేయడం వల్ల వచ్చే కమిషన్లలో చంద్రబాబు,పవన్,లోకేష్‌కు వాటాలు పంచుకోవాలనుకుంటున్నారు... ప్రైవేటీకరణ చేయడం వల్ల ఒక్క ఏడాది అడ్మిషన్లలోనే రూ.400 కోట్లు సంపాదిస్తారు. చంద్రబాబుకు నాదొక సూటి ప్రశ్న..ధైర్యముంటే సమాధానం చెప్పాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగే విధానంలోనే పీపీపీలోనూ చేపడతారని చెప్పగలరా?. ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే మన భావితరాలు తీవ్రంగా నష్టపోతాయి. మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేయనిస్తే మన భవిష్యత్ తరాలు మనల్ని క్షమించరు. కచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలి అని అన్నారాయన. ఈ క్రమంలో.. సీఎం చంద్రబాబు,హోంమంత్రి అనిత పై జడ శ్రవణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ‘‘అన్నీ నేనే కనిపెట్టానని చంద్రబాబు చెబుతారు. చంద్రబాబు వల్ల ఏడాదికి 2500 మంది పేద విద్యార్ధులకు విద్య అందకుండా చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత తన పని తాను చేయడం లేదు. శాంతిభద్రతలను గాలికొదిలేసి మెడికల్ కాలేజీల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన వంగలపూడి అనితకు నాదొక ప్రశ్న. ప్రభుత్వ మెడికల్ కాలేజీల అడ్మిషన్ పద్ధతిలోనే ప్రైవేట్ మెడికల్ కాలేజీల అడ్మిషన్లు జరుగుతాయా?. పేద విద్యార్ధులకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయారు?’’ అని ప్రశ్నించారాయన. అమ్ ఆద్మీ పార్టీ నేత నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ.. పీపీపీ అంటే చంద్రబాబుకు తెలుసా?. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రజలకు ఇచ్చే అసలైన సంక్షేమం. కోవిడ్ నేర్పిన పాఠాలను మనం గుర్తు తెచ్చుకోవాలి. పేదలకు మెరుగైన వైద్యం,వైద్య విద్యను అందజేస్తేనే సమాజం బాగుపడుతుంది. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఏడాదికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేయలేకపోతున్నారా?.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా...ప్రజలతో వ్యాపారం చేస్తున్నారా? అని నిలదీశారు. జైభీమ్ రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని.. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదీ చదవండి: టీడీపీలో వాళ్లు పనోళ్లేనా? -
జగన్ దెబ్బకు టీడీపీ మైండ్ బ్లాక్
‘‘ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు..’’ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న కూటమి సర్కారు నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్య. ‘‘వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్మిస్తే తప్పేంటి? నిధుల కొరత ఉండవచ్చు.. వనరుల లేమితో కోర్టు భవన నిర్మాణాలే ఆగిపోయాయి’’ - ఏపీ హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం. తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు సహజంగానే హైకోర్టు వ్యాఖ్యలను పతాక శీర్షికలుగా చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించడానికి వెళుతున్న రోజే ఎల్లో మీడియాలో ఈ కథనం వచ్చింది. జగన్ పర్యటనకు వచ్చిన స్పందన చూసిన తర్వాత జనాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం కష్టం కాదు. ఆంక్షలతో అడ్డుకోవడానికి ఎన్ని కుయుక్తులు పన్ననా, జనం మాత్రం తరలి సంద్రంలా తరలి వచ్చారు. వర్షం జోరున కురుస్తున్నా ప్రజలు జగన్‌తో సమస్యలు విన్నవించడానికి తండోపతండాలుగా వచ్చారు. అరవై కిలో మీటర్ల దూరం ప్రయాణించడానికి ఆరు గంటలు పట్టిందంటేనే జన ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ జనాన్ని చూసి కూటమి పార్టీల నేతలకు మతిపోయి ఉండాలి. ప్రజలు ప్రైవేటీకరణపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమై ఉండాలి. కొద్దిరోజుల క్రితం శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక సమావేశంలో మాట్లాడుతూ అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కడ? అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన జీవో ఎక్కడ అని అడిగారు. తన ప్రాంతంలో మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిసి కూడా అయ్యన్న ఆ వ్యాఖ్య చేయడాన్ని వైసీపీ సవాల్ గా తీసుకుంది. జగన్ గతంలో చెప్పిన విధంగా తన హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీల సందర్శనకు ఇది ఒక అవకాశంగా మారింది. తదుపరి ఆయన నర్సీపట్నం టూర్ పెట్టుకున్నారు. ఆ సందర్భంగానే జగన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలు ఎలా తీసుకొచ్చింది వివరించారు. భవన నిర్మాణాలకు తీసుకున్న చర్యలతోపాటు జారీ చేసిన జీవోలను కూడా చూపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య కళాశాలలను టీడీనే తెచ్చిందని అనంతపురంలో ప్రకటించి భంగపడితే జీవోలు ఎక్కడని అడిగి స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభాసుపాలయ్యారని జనమిప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు. గౌరవ న్యాయస్థానం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నడిపే ప్రతిపాదనపై అభిప్రాయం వ్యక్తం చేయడాన్ని మనం తప్పు పట్టనక్కర్లేదు. అయితే ఆ మీడియాలోనే ఆ రోజు వచ్చిన వార్తలే న్యాయమూర్తుల సందేహాన్ని తీర్చే విధంగా ఉన్నాయన్న విశ్లేషణలు వచ్చాయి. అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణం చేపట్టాలని రాజధాని అభివృద్ది సంస్థ (సీఆర్డీయే) సమావేశంలో నిర్ణయించారన్నది ఆ వార్త సారాంశం. మూడు నెలల్లో రాజధానికి ఒక రూపు తీసుకు రావాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సమావేశంలో చెప్పినట్లు కూడా రాశారు. అమరావతిలో రూ.104 కోట్లతో క్వాంటమ్ హబ్ భవనం నిర్మాణానికి సీఆర్డీయే నిర్ణయం అన్నది ఎల్లో మీడియా ఇచ్చిన ఇంకో వార్త. ప్రధాన రోడ్లకు రూ.వెయ్యి కోట్లు వ్యయం చేయడానికి ప్రభుత్వం పాలన అనుమతులు ఇచ్చింది.గోదావరి- బనకచర్ల స్కీమును రూ.81 వేల కోట్లతో చేపట్టే విషయంలో ముందుకే వెళ్లాలని, డీపీఆర్‌లు సిద్దం చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు మరో కథనం. ఇంతకన్నా ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే ప్రభుత్వం రూ.257 కోట్లు వ్యయం చేసి జీ+ 7 అంతస్తుల సీఆర్డీయే కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది. వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి భవనాలు, ఇతర నిర్మాణాలు చేపడుతున్న కూటమి సర్కార్ పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం విషయానికి వచ్చేసరికి డబ్బులు లేకుండా పోయాయా? అన్న సాధారణ పౌరుల ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. గౌరవ న్యాయస్థానం కోర్టుల నిర్మాణం కూడా ఆగిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. అంటే కోర్టుల కన్నా కూడా రాజధానిలో తాము అనుకున్న విలాసవంత భవనాలే ముఖ్యమని ప్రభుత్వ అధినేతలు భావిస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది కదా! ఈ తరహా వ్యాఖ్య కోర్టు జగన్ ప్రభుత్వ టైమ్‌లో చేసి ఉంటే ప్రభుత్వం దివాళా తీసిందని, కోర్టుల భవనాలను కూడా నిర్మించ లేకపోతోందని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసేది. కాని ఇప్పుడు మాత్రం కోర్టు భవనాలకే డబ్బు లేనప్పుడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఎలా కట్టగలుగుతుందని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి అప్పగిస్తున్నట్లు జనాన్ని మభ్య పెట్టాలని యత్నిస్తోంది. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.ఐదు వేల కోట్ల వనరులు లేకపోతే రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయి? వైఎస్ జగన్ తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో అన్ని సీట్లు మెరిట్ బేసిస్ మీదే కేటాయించాలని, సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద ఎన్నారైలకు ఇవ్వడానికి వీల్లేదని చంద్రబాబు, లోకేశ్‌లు ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కో సీటును ఏకంగా రూ.57 లక్షలకు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోవచ్చా అన్న సంశయం కోర్టుకు ఉండవచ్చు. ఇది కేవలం విధానానికి సంబంధించిందే కాదు. వందల కోట్ల విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారు. ఇప్పటికే నిర్మించిన భవనాలను అప్పగించేస్తారు. ఎకరా వంద రూపాయల లీజుకే ఇచ్చేయబోతున్నారు. ఈ కాలేజీలకు అనుబంధంగా ఏర్పాటయ్యే వైద్యశాలల్లో కూడా అన్ని సేవలు పేదలకు ఉచితంగా లభించే అవకాశం తక్కువే. ఒకవేళ ఇచ్చినా, వాటికి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపులు చేస్తుంది. ఇలా రకరకాల అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. వీటన్నిటి మీద కోర్టులో వాద, ప్రతివాదాలు జరుగుతాయో లేదో తెలియదు. కోర్టు వారు ఎలాంటి తీర్పు ఇచ్చినా, రాజకీయ పార్టీలు తమ విధానం ప్రకారం ఇలాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే ఈ టెండర్లు ఖరారు కాకుండా స్టే ఇవ్వలేమని కోర్టు పేర్కొనడం గమనించదగ్గ విశేషమే. మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం పీపీపీ విధానం కింద ప్రైవేటు సంస్థలకు అప్పగించినా, తాము అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాధీనం చేసుకుంటామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ లోగా ప్రైవేటికరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని వైసీపీ ఆరంభించింది. ఈ రకంగా ప్రజల మనోగతాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలొ వైసీపీతో సహా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తగు పాత్ర పోషిస్తాయి. అందువల్ల కోర్టు ప్రభుత్వ చర్యలకు ఆమోదం తెలిపినా, తెలపకపోయినా, దానితో నిమిత్తం లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ తమ విధానం ప్రకారం ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాలి. జగన్ వ్యాఖ్యానించినట్లు ఆధునిక దేవాలయాల వంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమ్మడం న్యాయం కాదని ప్రజలు భావిస్తున్నారు . జగన్ టూర్ కు జనం రాకుండా చూడడంలో పోలీసులు విఫలమయ్యారని, మంత్రులు సరిగా స్పందించ లేకపోతున్నారని.. చంద్రబాబు అభిప్రాయపడ్డారని వార్తలు వచ్చాయి. దానిని బట్టే జగన్ టూర్ సక్సెస్ అయిందని చంద్రబాబుతో సహా కూటమి నేతలంతా పరోక్షంగా ఒప్పుకుంటున్నట్లే!. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జన జాతర
సాక్షి, అమరావతి : కర్ఫ్యూను తలపిస్తూ మోహరించిన పోలీసులు.. అడుగడుగునాఆంక్షలు.. బారికేడ్లు.. ఆటోవాలాలకు బెదిరింపులు.. పార్టీ నేతలకు వేధింపులు.. ఖాకీల దిగ్బంధంలో నర్సీపట్నం మెడికల్ కాలేజీ రోడ్డు..! ఉత్తరాంధ్రలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కారు ఎన్ని ఆంక్షలు పెట్టినా జన సునామీ ఎదుట తల వంచక తప్పలేదు! జోరు వర్షంతో పాటు ప్రజల అభిమానంతో తడిసి ముద్ద కావడంతో 65 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణాన్ని వైఎస్ జగన్ ఏకంగా 6 గంటల పాటు ఎడతెరపి లేకుండా సాగించాల్సి వచ్చింది. వాహనాలను పోలీసులు అడ్డుకున్నా ప్రజలు పెద్ద ఎత్తున ఆయన వెంట తరలి వచ్చారు. ఇటీవలి కాలంలో అతి పెద్ద రాజకీయ సభగా పరిశీలకులు దీన్ని అభివర్ణిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అశేష ప్రజాదరణతో జనం గుండెల్లో జగన్ చిరస్థాయిగా నిలిచారని.. ఇంటికే పథకాలు, సేవలతో పేదల జీవితాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొంటున్నారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజా ఉద్యమానికి పిలుపునిస్తూ వైఎస్ జగన్ నర్సీపట్నం వైద్య కశాశాలను సందర్శించిన నేపథ్యంలో.. చంద్రబాబు సర్కారు దారుణ పాలన వైఫల్యాలు, సూపర్ సిక్స్ మోసాలు, రెడ్‌బుక్ కుట్రలు మరోసారి సర్వత్రా చర్చనీయాంశంగా మారాయని విశ్లేషిస్తున్నారు. పేదల జీవితాల్లో మార్పు కోసం తాపత్రయపడుతూ.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన మంచి, తీసుకొచ్చిన విప్లవాత్మక వ్యవస్థలు, సంపద సృష్టిని గుర్తు చేసుకుంటున్నారు. సచివాలయాలు, వలంటీర్లు, ఆర్బీకేలు లాంటి వినూత్న వ్యవస్థల ద్వారా ఊరు దాటాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దే పథకాలు, పౌర సేవలు అందాయని గ్రామాల్లో చర్చ జరుగుతోంది. కోవిడ్ సంక్షోభంలోనూ ఎక్కడా ఆగకుండా డీబీటీ ద్వారా నేరుగా పథకాలు అందించటాన్ని ప్రస్తావిస్తున్నారు. గత 16 నెలల కూటమి పాలనలో ఎంతో నష్టపోయామని.. బాబు చేతిలో మోసపోయామని అన్ని వర్గాల ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. ఐఆర్, నాలుగు డీఏలు పెండింగ్‌లో పెట్టారని, పీఆర్సీ ఊసే లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. బాబు ష్యూరిటీ పోయి.. మోసం గ్యారెంటీగా మారిందని.. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని.. ఇసుక దోపిడీ.. విద్యుత్తు చార్జీల బాదుడు.. నకిలీ మద్యంతో అమాయకులు ప్రాణాలు పోతున్నాయని.. ఏడాది తిరగక ముందే కూటమి పాలనపై ప్రజలకు భ్రమలు పూర్తిగా తొలగిపోయాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.ఆరోగ్యానికి సంపూర్ణ భరోసా..వైఎస్ జగన్ వైద్య, ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యానికి భరోసా కల్పించారు. ఫ్యామిలీ డాక్టర్, హెల్త్ క్లినిక్స్ ద్వారా ప్రజారోగ్య పరిరక్షణకు పెద్ద పీట వేశారు. వందేళ్లుగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కేవలం రెండే రెండు మెడికల్ కాలేజీలు ఉండగా... మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఏకంగా నాలుగు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం గమనార్హం. మాట ప్రకారం ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల రీసెర్చ్ సెంటర్, అతిపెద్ద డయాలసిస్ సెంటర్ నిర్మించారు. ఉత్తరాంధ్రతో పాటు మైదాన ప్రాంత గిరిజనులకు ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ ఐదు గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలల్లో ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం ఆగిపోయింది. భావి తరాలకు విలువైన సంపద సృష్టిస్తూ ప్రభుత్వ రంగంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుడితే.. పది కాలేజీలను చంద్రబాబు సర్కారు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. చంద్రబాబు సర్కారు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా పెండింగ్ పెట్టడంతో రోగులకు వైద్యం నిలిచిపోయిన దుస్థితి.పిల్లలకు మోసం.. వైఎస్ జగన్ హయాంలో నాడు – నేడు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, ట్యాబ్‌లు, డిజిటల్ తరగతి గదులు, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్‌్ట, అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, ఐబీ, టోఫెల్, ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్ది పిల్లల చదువులకు గట్టి భరోసా కల్పించారని చర్చించుకుంటున్నారు. అదే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏకంగా దాదాపు ఐదు లక్షల వరకు తగ్గిపోవడం ప్రభుత్వ విద్యావ్యవస్థ దుస్థితి, తల్లిదండ్రుల్లో సన్నగిల్లిన నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంటున్నారు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించకపోవడంతో పిల్లలు చదువులకు దూరమవుతున్నారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణ కూడా సరిగా చేయకపోవడంతో కురుపాంలో ఇద్దరు విద్యార్థనులు మృతి చెందారు. పిల్లలకు పచ్చకామెర్లు సోకితే కనీసం పట్టించుకున్న దిక్కు లేకుండా పోయింది.అన్నదాతకు మహిళలకు దగా..ఈ ప్రభుత్వం వ్యవసాయ సీజన్లో కనీసం ఎరువులు కూడా సమకూర్చలేకపోయిందని, యూరియా నల్ల బజారుకు తరలిపోగా.. ఏ పంటకూ మద్దతు ధరలు దక్కక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఇంటికే సేవలందించిన వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని పేర్కొంటున్నారు. రైతులకి ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది. ఇన్పుట్ సబ్సిడీకి దిక్కే లేదు. ఈ క్రాప్ కనపడకుండా పోయింది. ఆర్బీకేలు, సచివాలయాలు నిర్వీర్యమయ్యాయి. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా అన్నదాతా సుఖీభవ ద్వారా తామే ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ లెక్కన రెండేళ్లకు కలిపి రూ.40 వేలకుగాను ఇచ్చింది కేవలం రూ.5 వేలు మాత్రమే. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం కింద ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి గత ఏడాది చంద్రబాబు పూర్తిగా ఎగరగొట్టేశారు. రెండో ఏడాది తూతూమంత్రంగా అమలు చేసి 30 లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి కింద రాష్ట్రంలో మహిళలందరికీ ఏటా రూ.18 వేల చొప్పున ఇస్తామన్న హామీని ఎగ్గొట్టారు. అటు 20 లక్షల ఉద్యోగాలూ లేవు.. ఇటు నిరుద్యోగ భృతీ ఇవ్వట్లేదు! ఈ నేపథ్యంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంది? ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసి పటిష్టంగా నిర్వహించాల్సిన ఆవశ్యకతపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ప్రైవేట్ దోపిడీకి చెక్ పెడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మంచి చేసే కార్యక్రమంలో భాగంగా 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. 52 ఎకరాల్లో ఉన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి.. కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కూడా, రూ.500 కోట్ల ఖర్చుతో 2022 డిసెంబర్ 30న కాలేజీకి శంకుస్థాపన చేశాం -నర్సీపట్నం నియోజకవర్గం భీమబోయినపాలెం మెడికల్ కాలేజీ సందర్శనలో వైఎస్ జగన్ -
కొల్లు రవీంద్ర ఖుషి కోసం... సుబ్బన్న అక్రమ అరెస్టుపై పేర్ని నాని రియాక్షన్
-
అంతర్మధనంలో అధికార టీడీపీ
సాక్షి, విశాఖపట్నం: తమ కుట్రలు విఫలం కావడంతో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తే.. వైఎస్సార్సీపీ కేడర్ సైతం విస్తుపోయే రేంజ్లో సూపర్ సక్సెస్ కావడంతో అధికార టీడీపీ ఇప్పుడు అంతర్మధనంలో పడిపోయింది(YS Jagan Uttarandhra Tour Success).జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని ఆంక్షల పేరిట ఆటంకాలు సృష్టించింది కూటమి ప్రభుత్వం. ఖాకీలను ప్రయోగించి జనాన్ని రాకుండా ప్రయత్నించింది. అయితే చెక్‌పోస్టులు, బారికేడ్లను జగన్ మీద ఉన్న అభిమానం బద్దలు కొట్టేసింది. జనాలు తండోపతండాలుగా తరలి రావడం చూసి పోలీసులే కంగుతిన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు.. దారి పొడవునా జగన్ ఆగిన చోటల్లా ఇసకేస్తే రాలని జనమే కనిపించారు. ఆంక్షల వలయాన్ని చేధించుకుని.. గుట్టలు, పొలాల గుండా కొందరు యువకులు బైకులపై తరలి రావడం గమనార్హం. తొలుత.. ఈ పర్యటన కోసం దళితులను వాడుకోవాలని అధికార టీడీపీ విశ్వప్రయత్నాలు చేసింది. డాక్టర్ సుధాకర్ పేరుతో హోర్డింగులు ఏర్పాటు చేయించడంతో పాటు ఫకార్డుల ప్రదర్శన చేయించాలని స్కెచ్ వేసింది. అయితే దళితులు ఆ కుట్రలకు లొంగలేదు. పైపెచ్చు జగన్ ర్యాలీకి భారీగా తరలి వచ్చారు. వివిధ వర్గాలు సైతం జగన్‌ను కలిసి తమ గోడును వెల్లదీసుకోవడం.. ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడుపడని విషయం. ఇంకోవైపు..చివరకు ప్రకృతిపైనా పచ్చ బ్యాచ్ ఆశలు పెట్టుకోగా.. అది నెరవేరలేదు. కుండపోత వర్షంలోనూ రోడ్డు పొడవునా.. మహిళలు, వృద్ధులు, రైతులు బారులు తీయడం.. ఎల్లో మీడియాకు సైతం సహించనట్లుంది. అందుకే ట్రాఫిక్ జామ్, షరతుల ఉల్లంఘన పేరుతో విషం చిమ్ముతోంది. వెరసి..ఊహించని రీతిలో జగన్ ఉత్తరాంధ్ర పర్యటన సక్సెస్ కావడంతో కరకట్ట బంగ్లాకు ఏం సమాధానం చెప్పుకోవాలో అని ఉత్తరాంధ్ర తమ్ముళ్లు తెగ మదనపడిపోతున్నారు.క్లిక్ చేయండి: ఉత్తరాంధ్రలో జగన్ కోసం జన సునామీ.. చూశారా? -
ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు... ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం
సాక్షి, అమరావతి: పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని, వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుడితే, ప్రైవేటీకరణ ద్వారా వాటిని సీఎం చంద్రబాబు పేదలకు దూరం చేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమం పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ‘‘ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి 175 నియోజకవర్గాల్లో శుక్రవారం నుంచి వైఎస్సార్సీపీ 45 రోజుల పాటు గ్రామ స్థాయి వరకూ ప్రజా ఉద్యమం చేపడుతుంది. సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నుంచి రచ్చబండ కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండలో నాయకులు పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పిస్తారు. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ చేపట్టి సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమరి్పస్తారు. నవంబర్ 23న జిల్లా కేంద్రాల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. నవంబర్ 24న ఈ పత్రాలు కేంద్ర కార్యాలయానికి చేరుకుంటాయి. అనంతరం పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్ కు కోటి సంతకాలను సమర్పిస్తాం. పార్టీ మాత్రమే కాకుండా, పౌరసమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న మేధావి వర్గాలు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సంతకాల సేకరణలో పాల్గొనాలని కోరుతున్నాం’’అని పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేయడాన్ని చూస్తే, చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు తారస్థాయికి చేరాయని అర్థం అవుతోందని సజ్జల అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి , ఎనీ్టఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, పలువురువైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. 13న నకిలీ మద్యంపై నిరసన కార్యక్రమాలు నకిలీ మద్యంపై సోమవారం (13వ తేదీ) అన్ని నియోజకవర్గాల్లో ఎక్సైజ్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలకు సజ్జల పిలుపునిచ్చారు. నకిలీ మద్యంపై ఇప్పటికే మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్య నాయకులతో గురువారం సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల విజయవంతంతోపాటు, పార్టీ కమిటీల నియామకంపై ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా సూచించారు. -
YS Jagan: చంద్రబాబుకు సైన్స్ ఉంటే.. పిల్లలు చనిపోయేవాళ్లు కాదు
-
ఇదే నర్సీపట్నం మెడికల్ కాలేజీ అయ్యన్నను ఏకిపారేసిన YS జగన్
-
YS Jagan: చంద్రబాబు.. ఇదే నా వార్నింగ్
-
Medical College: అయ్యా చంద్రబాబు నీకే చెప్తున్నా.. రేపటినుండి మీకు చుక్కలే
-
అయ్యన్న ఇదిగో జీవో... వైఎస్ జగన్ దిమ్మతిరిగే కౌంటర్
-
కళ్ళు కనబడని వాళ్లకు చెబుతున్నా... ఇదిగో మెడికల్ కాలేజ్
-
జగనన్న కోసం కదిలిన ఊరూ-వాడా (ఫొటోలు)
-
మేం మంచి చేస్తే.. చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు: వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. నేడు నర్సీపట్నంలో పర్యటనలో భాగంగా.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరుబాటు... -
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల రక్షణకు పోరుబాట... నేడు నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించనున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పోరుబాట... ఉద్యమాన్ని ఉదృతం చేయాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు
-
Ys Jagan: జిల్లా కేంద్రాల్లో నవంబర్ S 12న ధర్నాలు
-
ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ పోరు.. ఇక రచ్చబండ, ధర్నాలు..
సాక్షి, తాడేపల్లి: ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై(Medical Colleges Privatization) ఆందోళనలకు వైఎస్సార్సీపీ(YSRCP) సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 10 నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలను ప్లాన్ చేసింది.ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరుకు వైఎస్సార్సీపీ ముందు సాగనుంది. రచ్చబండ(Rachabanda), కోటి సంతకాల సేకరణ, గవర్నర్‌ని కలవటం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అక్టోబర్ పదో తేదీ నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గాల్లో 28న నిరసన ర్యాలీలు చేపట్టనుంది. జిల్లా కేంద్రాల్లో నవంబర్ 12న ధర్నాలు చేసేందుకు సిద్ధమైంది. ప్రతీ నియోజకవర్గం నుండి 50వేల సంతకాలు సేకరణ చేయనున్నారు. చివరగా నవంబర్ 26న పార్టీ నేతలు గవర్నర్‌ని కలిసేలా నిర్ణయం తీసుకున్నారు. -
వైఎస్సార్సీపీ నేతలతో ముగిసిన వైఎస్ జగన్ భేటీ
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఆ పార్టీ కీలక భేటీ ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంతో పాటు రాష్ట్రంలో యదేచ్ఛగా నడుస్తున్న నకిలీ మద్యం వ్యవహారంపై వైఎస్ జగన్ ప్రముఖంగా ప్రసంగించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ప్రజా పోరాటం చేయాలని కేడర్‌కు ఆయన పిలుపు ఇచ్చినట్లు సమాచారం. ఈ భేటీకి కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కాకాణి గోవర్దన్ రెడ్డి, పేర్ని నాని, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. జగన్ హయాంలో మొదలైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ప్రజా పోరాటానికి పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించిన.. మాకవరం మెడికల్ కాలేజీని సందర్శించనున్న సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: బాబు చీటర్.. లోకేష్ లూటర్! -
వైద్యకళాశాలల ప్రైవేటీకరణ ఎవరికి లాభం?
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా తీసుకొచ్చిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. ఈ చర్యలో అసలు హేతుబద్ధత అన్నదే లేదని, టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సర్కారు ప్రైవేటీకరణ పేరుతో వైద్యకళాశాలలను తమ తాబేదార్లకు అప్పగిస్తోందన్న విమర్శలు అటు సామాన్య ప్రజానీకంతోపాటు ప్రతిపక్ష వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణలు వినిపిస్తున్నారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని బీరాలు పలికిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ప్రజల ఆస్తులు అమ్ముతూ ప్రైవేటువారికి సంపద సృష్టిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో యాభై శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిని పెడతామన్న వైఎస్ జగన్ మాటలను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన బాబు, లోకేశ్‌లు ఇప్పుడు మాటమార్చడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పైగా పీపీపీ విధానం ప్రైవేటేషన్ కాదని, జగన్‌కు ఆ విషయం తెలియదని బాబు అండ్ కో బుకాయిస్తున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబు నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌లు అసెంబ్లీలోని ఇరు సభల్లో చేసిన వాదనలను పరిశీలిస్తే వీరు వైద్యకళాశాలల ప్రైవేటీకరించి కళ్లప్పగించి చూడబోతున్న వైనం స్పష్టమవుతోంది. పేదలకు వైద్యవిద్య అన్నది ఒట్టిమాటేనని, వ్యహారమంతా ధనికులకు అనకూలంగానే నడుస్తోందని విమర్శలు వస్తున్నాయి. పీపీపీ అంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానమంటున్న చంద్రబాబు తద్వారా కాలేజీలు, ఆసుపత్రుల నిర్వహణలో తమ అసమర్థతను బయటపెట్టుకున్నట్లు అయ్యింది. జగన్ ప్రభుత్వం నాడు-నేడు కింద ఆస్పత్రులను బాగు చేయించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే, సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం కంటే ప్రైవేటు వారే బెటర్ అంటున్నారా? ఈ మాత్రం దానికి ప్రభుత్వం ఎందుకో? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మాణాల మాదిరి అయితే ఈ పది మెడికల్ కాలేజీలు పూర్తి కావడానికి 15 ఏళ్లు పడుతుందని చంద్రబాబు అనడం చూస్తే ఆయన తనను తాను అసమర్థుడిగా చెప్పుకుంటున్నట్లే కదా అని వైసీపీ వారు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో లక్ష కోట్లైనా ఖర్చు చేసి అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తి చేస్తామనడం మరీ విడ్డూరంగా ఉంది. జగన్ సీఎంగా రెండేళ్లలోనే ఐదు వైద్య కశాళాలలను అందుబాటులోకి తెచ్చారు. ఆ తరువాత ఇంకో రెండు దాదాపుగా పూరర్తయ్యాయి. మిగిలిన పదింటికీ అయ్యే రూ.ఐదారు వేల కోట్లు ప్రభుత్వం సమకూర్చుకోలేదా? లక్షల కోట్ల బడ్జెట్ కలిగిన ప్రభుత్వమే ఈ మాత్రం డబ్బు సమకూర్చు కోలేకపోతే ప్రైవేటు సంస్థలు ఎలా తెచ్చుకుంటాయి? ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా లేని విధంగా ఒక్కో వైద్యకళాశాలలకు కేటాయించిన దాదాపు యాభై ఎకరాల భూమిని ఎకరా రూ.వంద చొప్పున లీజుకు ఇవ్వడమంటే ఉత్తినే ఇచ్చినట్లు కదా? ప్రైవేట్ సంస్థలు ఈ భూములను తాకట్టు పెట్టి రుణం తెచ్చుకుంటే.. ప్రభుత్వం తన సంపదను రాసిచ్చినట్లే అవుతుంది.ప్రస్తుతం 33 ఏళ్లు ఉన్న లీజు భవిష్యత్తులో పొడిగించరన్న గ్యారెంటీ ఏమీ లేదు కాబట్టి.. ఇవి శాశ్వతంగా ప్రైవేటు వారి పరమవుతాయి. పేద ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులకు అమరావతి మాదిరే ప్రభుత్వం రుణాలు తేలేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ చంద్రబాబు ప్రభుత్వం 54 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసింది. కొనుగోలు చేసిన సంస్థలు తమకు దక్కిన భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాయని ఒక రిటైర్డ్ అధికారి చెప్పారు. ఎవరి సంపద ఎవరి పరమైనట్లు? జగన్ ప్రభుత్వం ఏభై శాతం సీట్లు సెల్ప్ ఫైనాన్స్ పద్దతిలో కేటాయించి, వాటికి రూ.20 లక్షల చొప్పున ఫీజ్ వసూలు చేయాలని నిర్ణయిస్తే, చంద్రబాబు, లోకేశ్‌లు తప్పు పట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసి అంతా ఫ్రీ చేస్తామని లోకేశ్ విద్యార్ధుల సమావేశంలోనే ప్రకటించారు. ఇప్పుడు మొత్తం ప్రైవేటుపరం చేయడమే కాకుండా, ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల ఖరీదు రూ.57 లక్షలు ప్రభుత్వ రంగంలో రూ.20 లక్షలు అంటే అంతే మొత్తం వసూలు చేస్తారు. అదే ప్రైవేటు వారు అయితే ఈ రూ.57 లక్షలే కాకుండా, అదనంగా రూ.కోటి పైనే వసూలు చేయవచ్చు అంటున్నారు. మొత్తం డబ్బు ప్రభుత్వ ఖాతాలోకి వచ్చేలా జగన్ చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు వేల కోట్ల రూపాయలు దక్కేలా చేస్తున్నారన్న విమర్శకు సమాధానం దొరకదు. ఇంతా చేసి ఆ వైద్య కళాశాలల ఆసుపత్రుల్లో ప్రజలందరికి ఉచిత వైద్య సేవలు అందుతాయన్న గ్యారంటీ కూడా లేదు. ప్రైవేటు సంస్థలు లాభాలు రాకపోతే మనలేవన్నది తెలిసిన సత్యమే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్ష రూపాయల విలువైన చికిత్స అయినా, ఆపరేషన్ అయినా ఉచితంగా చేస్తారు. మరి పీపీపీ మోడల్లో ఏర్పాటైన ప్రైవేట్ కళాశాలలు ఇలా చేస్తాయా? చేయవు. ఒకవేళ చేసినా ఆ మొత్తాలను ఎన్టీఆర్ వైద్య సేవ లేదా బీమా సదుపాయం పేరుతో ప్రభుత్వం నుంచే వసూలు చేసే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పీపీపీ విధానంతో ప్రజలకు ఒరిగేదేమిటి? ప్రభుత్వానికి మిగిలేదేమిటి? ప్రైవేటీకరణే విధానమని నిర్ణయించుకుని ఉంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వీటిపై రూ.700 కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్లు? ఇప్పటివరకూ ఆయా కళాశాలల ఏర్పాటుకు అయిన ఖర్చు (భూమి + నిర్మాణాలు) తీసుకుని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి ఉంటే కనీసం ప్రభుత్వానికి కొంత డబ్బు మిగిలి ఉండేదేమో. ప్రస్తుతం ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా ఏభై శాతం సీట్లు మెరిట్ ప్రకారం, రిజర్వేషన్లు పాటిస్తూ కేటాయించాల్సిందే. ఈ పరిస్థితిలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటువారికి ఉత్తపుణ్యానికి ధారాదత్తం చేసి మెడికల్ కాలేజీలను నడపాలని చెప్పడం అర్ధరహితం. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి పొందిన సంస్థలు భూమిని స్వయంగా సమకూర్చుకుంటున్నాయి. భవనాలు సొంత ఖర్చుతో నిర్మించుకుంటున్నాయి. యంత్ర పరికరాలు ఇతర సదుపాయాలన్నీ సొంత ఖర్చుతోనే చేసుకుంటున్నాయి. కాని ఇప్పుడు ప్రభుత్వం భూమి, భవనాలు ఉచితంగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో అర్ధం ఏమి ఉంటుంది? పైగా ఈ కాలేజీలకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులను కూడా అప్పగిస్తారట. ఈ సంస్థలు ఉచితంగా సేవలు అందించనప్పుడు ,ప్రభుత్వం వారికి రకరకాల రూపాలలో ఫీజులు చెల్లిస్తున్నప్పుడు ప్రైవేటు పరం చేయవలసిన అవసరం ఏమిటో తెలియదు. ప్రస్తుతం నాలుగు కాలేజీలకు పీపీపీ విదానం అమలు చేస్తున్నా, భవిష్యత్తులో మిగిలిన కాలేజీలన్నిటిని అదే రకంగా అప్పచెప్పనున్నారు. బహుశా పూర్తి అయిన ఏడు కాలేజీలను కూడా అలాగే ఇచ్చేస్తే జగన్ ప్రభుత్వ రంగంలో తీసుకు వచ్చిన ఆశయాన్ని పూర్తిగా నీరుకార్చిన ఘనత కూటమి సర్కార్ కు దక్కుతుంది. ఝార్కండ్ రాజధాని రాంచీలో ఒక ప్రభుత్వ ఆస్పత్రిని ఇదే విధంగా పీపీపీ అంటూ ప్రైవేటీకరించబోగా ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఒడిశా లో గత బీజేడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయలేదు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల్లో ప్రభుత్వాలే కొత్త కాలేజీలను నడుపుతున్నాయి. ఇవన్ని ఎందుకు! ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేస్తోంది కదా! ఎందుకు వారు ప్రభుత్వరంగంలోనే నెలకొల్పుతున్నారు? కొత్తగా కేంద్రం ఇస్తున్న పదివేల మెడికల్ సీట్లను ప్రభుత్వ కాలేజీలకే ఎందుకు ఇస్తున్నారు? ఏపీ ప్రభుత్వం రోడ్లు, పోర్టులు ప్రైవేటైజ్ చేయడం లేదా అని పిచ్చి వాదన చేస్తోంది. రోడ్లకు, ఓడరేవులకు వైద్యరంగానికి పోలిక పెట్టడం అంటే ప్రజారోగ్యంపైన, పేదల వైద్యంపై చులకన భావం ఉన్నట్లు అనిపించడం లేదా?ఏది ఏమైనా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకు రాలేకపోయిన చంద్రబాబు నాయుడు, తనకంటే చిన్నవాడైన వైఎస్ జగన్ తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటైకీరణకు దిగుతుండడం శోచనీయం. ఈ నేపథ్యంలోనే జగన్... బుద్ది జ్ఞానం ఉన్నవారెవరైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ కింద ప్రైవేటు వారికి అప్పగిస్తారా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక వీటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ప్రజల కోసం జగన్ సంపద సృష్టిస్తే,, ఆ సందపను చంద్రబాబు ప్రైవేటువారికి ధారాదత్తం చేయడం సరైనదా? ఇదేనా చంద్రబాబు చెప్పే విజన్?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. రంగంలోకి YS జగన్
-
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ విరమించకపోతే ఉద్యమం
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్ని పీపీపీ విధానం పేరిట ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోకుంటే ఉద్యమం తప్పదని పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ సమితి హెచ్చరించింది. శనివారం పాలకొల్లులోని పూలపల్లి అంబేడ్కర్ భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో ‘పాలకొల్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ’ అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ వైద్య విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.ఇందులో భాగంగా 17 మెడికల్ కళాశాలలను జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందుకోసం గత ప్రభుత్వం రూ.2,400 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఇంకా దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు అని గొప్పలు చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం కనీసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేయలేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అరకొర పనులు చేపట్టిందని కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ వాటిని ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించామని కబుర్లు చెబుతూ ప్రజలకు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పీపీపీ అంటూనే వైద్యకళాశాలలు ప్రైవేటుపరం కావని చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. పీపీపీ పద్ధతి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకే కాకుండా ఓసీ కులాల్లోని పేద విద్యార్థులకూ నష్టం కలిగిస్తుందన్నారు.వైద్యం, విద్య రెండూ ప్రభుత్వ రంగాల్లో ఉంటేనే ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ఇప్పటికే విద్య, వైద్యం రెండూ ఖరీదయ్యాయని, మరింత ఖరీదు కాకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, సీపీఎం నేత జేఎన్వీ గోపాలన్, దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్, సంచార జాతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెండ్ర వీరన్న, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు జవ్వాది శ్రీనివాసరావు, జేవీవీ జిల్లా నాయకుడు యర్రా అజయ్‌కుమార్, దగ్గులూరు సర్పంచ్ పేరయ్య, పట్టణ జేఏసీ చైర్మన్ గుడాల హరిబాబు తదితరులు మాట్లాడారు. -
విద్య, వైద్యాన్ని పెత్తందారుల చేతుల్లో పెట్టే కుట్ర
సాక్షి, విశాఖపట్నం: విద్య, వైద్యాన్ని పెత్తందారుల చేతుల్లో పెట్టేసి.. ప్రజలకు ప్రధాన అవసరాల్ని దూరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో కుట్ర పన్నుతోందని ‘పీపుల్స్ ఫర్ ఇండియా’ ధ్వజమెత్తింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పేరుతో కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రజారోగ్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ ప్రజారోగ్య వేదిక, పీపుల్ ఫర్ ఇండియా విశాఖపట్నం చాప్టర్ ఆధ్వర్యంలో స్థానిక అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. విలువైన ప్రజాధనాన్ని కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసే చంద్రబాబు వైఖరిపై ప్రజా ఉద్యమాలు చేపట్టాలని తీర్మానించారు.ఐదేళ్ల తర్వాత పదవిలో ఉంటామన్న గ్యారెంటీ లేదు ఐదేళ్ల తర్వాత గెలుస్తామో లేదో అన్న గ్యారెంటీ అధికారంలో ఉన్న వాళ్లకి లేదు. ఐదేళ్లలోనే 50 ఏళ్ల రాజకీయ జీవితంలో సంపాదించాల్సిందంతా సంపాదించేయాలన్న తొందరతోనే రాజకీయ నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు బలవుతున్నారు. కాబట్టి.. ప్రజలే ముందుకు రావాలి. నిరసనల్ని ఉద్యమంగా మార్చి.. ప్రజావ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. – ఎంవీఎస్ శర్మ, మాజీ ఎమ్మెల్సీప్రజాధనాన్ని ప్రైవేట్‌కివ్వడమే సంపద సృష్టా? సంపద సృష్టి అంటే ప్రజలకు అనుకున్నారు. కానీ.. ప్రైవేట్ వాళ్లకు అని చంద్రబాబు ప్రభుత్వ విధానాల ద్వారా అర్థమవుతోంది. వైద్య కళాశాలల్ని ప్రైవేట్‌పరం చేస్తే.. పేద విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు దూరమవుతారు. ఇప్పటికే పేదలకు వైద్యం భారంగా మారింది. ఈ కాలేజీలు ప్రైవేట్‌పరం చేస్తే.. మరింత భారమవుతుందన్న విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. – కేఎస్ చలం, మాజీ ఉపకులపతి, ద్రవిడ యూనివర్సిటీప్రజాధనాన్ని ప్రైవేట్‌కివ్వడమే సంపద సృష్టా? సంపద సృష్టి అంటే ప్రజలకు అనుకున్నారు. కానీ.. ప్రైవేట్ వాళ్లకు అని చంద్రబాబు ప్రభుత్వ విధానాల ద్వారా అర్థమవుతోంది. వైద్య కళాశాలల్ని ప్రైవేట్‌పరం చేస్తే.. పేద విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు దూరమవుతారు. ఇప్పటికే పేదలకు వైద్యం భారంగా మారింది. ఈ కాలేజీలు ప్రైవేట్‌పరం చేస్తే.. మరింత భారమవుతుందన్న విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. – కేఎస్ చలం, మాజీ ఉపకులపతి, ద్రవిడ యూనివర్సిటీప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉంది కేజీహెచ్‌కు రోజూ 3,200 ఓపీ వస్తోంది. చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ కలిపితే ఇందులో పావు వంతు కూడా ఓపీ ఉండదు. సింహభాగం ప్రజలకు వైద్యం ఉచితంగా.. ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే అందాలి. అమరావతికి రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.5 వేల కోట్లు కేటాయించలేరా. – టి.కామేశ్వరరావు, అధ్యక్షుడు, ప్రజారోగ్య వేదిక అప్పుడొకటి చెప్పి.. ఇప్పుడు ముంచేస్తున్నారు పీపీపీ పేరుతో సంపద మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే.. ఎవరికి సొంత ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి స్పష్టంగానే ఉంది. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడుపుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు నిలువునా ముంచేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల విద్యార్థులతో పాటు.. ప్రజలూ తీవ్రంగా నష్టపోతారు. – పి.రామ్మోహన్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐకార్పొరేట్ పీఎం, కార్పొరేట్ సీఎం వల్లే..! వైద్య కళాశాలలపై పోరాటం ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రంలో కార్పొరేట్ పీఎం, రాష్ట్రంలో కార్పొరేట్ సీఎం ఉన్నారు. ప్రజలకు సేవ చేయరు కానీ.. ప్రైవేట్ సంస్థలపై మాత్రం ప్రేమ కురిపిస్తారు. కనిపించిన ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్‌కు «కట్టబెట్టేలా చట్టం చేస్తారేమో. భూమి, భవనం, మౌలిక వసతులు అన్నీ కల్పించి ప్రైవేట్‌కు కాలేజీలను అప్పగించడం హేయమైన చర్య. – రామారావు, రిటైర్డ్ డీఎంహెచ్‌వో ప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉంది కేజీహెచ్‌కు రోజూ 3,200 ఓపీ వస్తోంది. చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ కలిపితే ఇందులో పావు వంతు కూడా ఓపీ ఉండదు. సింహభాగం ప్రజలకు వైద్యం ఉచితంగా.. ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే అందాలి. అమరావతికి రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.5 వేల కోట్లు కేటాయించలేరా. – టి.కామేశ్వరరావు, అధ్యక్షుడు, ప్రజారోగ్య వేదిక అప్పుడొకటి చెప్పి.. ఇప్పుడు ముంచేస్తున్నారు పీపీపీ పేరుతో సంపద మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే.. ఎవరికి సొంత ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి స్పష్టంగానే ఉంది. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడుపుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు నిలువునా ముంచేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల విద్యార్థులతో పాటు.. ప్రజలూ తీవ్రంగా నష్టపోతారు. – పి.రామ్మోహన్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐకార్పొరేట్ పీఎం, కార్పొరేట్ సీఎం వల్లే..! వైద్య కళాశాలలపై పోరాటం ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రంలో కార్పొరేట్ పీఎం, రాష్ట్రంలో కార్పొరేట్ సీఎం ఉన్నారు. ప్రజలకు సేవ చేయరు కానీ.. ప్రైవేట్ సంస్థలపై మాత్రం ప్రేమ కురిపిస్తారు. కనిపించిన ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్‌కు «కట్టబెట్టేలా చట్టం చేస్తారేమో. భూమి, భవనం, మౌలిక వసతులు అన్నీ కల్పించి ప్రైవేట్‌కు కాలేజీలను అప్పగించడం హేయమైన చర్య. – రామారావు, రిటైర్డ్ డీఎంహెచ్‌వో -
7న వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఈ నెల 7వ తేదీన ఆ పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న ఈ కీలక భేటీలో రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా పోరాటాలు సహా అనేక అంశాలపై ఈ కీలక భేటీలో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు.. ఈ నెల 8, 9 వ తేదీల్లో వైఎస్ జగన్ పర్యటనలకు సంబంధించిన అప్డేట్స్ను అందించాయి. ఈ నెల 8వ తేదీన వైఎస్ జగన్ భీమవరంలో పర్యటించనున్నారు(YS Jagan Bhimavaram Tour). మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన జంటను ఆశీర్వదించనున్నారు. అలాగే.. ఈ నెల 9వ తేదీన వైఎస్ జగన్ అనకాపల్లిలో పర్యటించనున్నారు(jagan Anakapalle Tour). నర్సీపట్నం మాకవరపాలెంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆయన సందర్శించనున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రజాగ్రహం వ్యక్తం అవుతున్న తరుణంలో ఇటు వైఎస్ జగన్ పర్యటన రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. -
9న అనకాపల్లికి వైఎస్ జగన్
సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ(Narsipatnam Medical College)ని సందర్శించి.. జరిగిన పనులను పరిశీలిస్తారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజిల నిర్మాణం ఒక చరిత్ర. కానీ, విద్యా వైద్యాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు. ఏకంగా అందులో పది మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. తన అనునాయులకు మెడికల్ కాలేజీలను కట్టబెడుతున్నారు. తద్వారా జగన్‌కు మంచి పేరు రాకుండా అడ్డుకుంటున్నారు. కానీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది... చంద్రబాబు ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారు. కళ్లుండి కబోదుల్లా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారు. స్పీకర్ అయ్యన్న అవగాహనతో మాట్లాడాలి. ఆయన మెడికల్ కాలేజీని సందర్శిస్తే నిర్మాణం జరిగిందో లేదో తెలుస్తుంది. మెడికల్ కాలేజ్ నిర్మాణం జరగకపోతే ప్రైవేటీకరణ ఎలా చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాలపై ప్రజలు చీ అంటున్నారు. అయినా ఆయన సిగ్గు తెచ్చుకోవడం లేదు. కేవలం జగన్ మీద కక్ష సాధింపు చర్యతో మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు అని అన్నారు. మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు 11 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉండేవి. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. పేదవాడికి ఆధునిక వైద్యం అందించాలనే లక్ష్యంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నర్సీపట్నం మెడికల్ కాలేజీను వైఎస్ జగన్ సందర్శిస్తారు. .. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్యను చంద్రబాబు దూరం చేశారు. మెడికల్ విద్య చదివే విద్యార్థులకు నేడు మెడికల్ సీట్లును దూరం చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగ పడే మెడికల్ కాలేజిల ఐదు వేల కోట్లు ఖర్చు మీద పెట్టలేరా. విద్యా వైద్యంతోపాటు అన్ని రంగాలను చంద్రబాబు ప్రవేటిపరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది’’ అని అమర్నాథ్ అన్నారు. -
ప్రశ్నిస్తానన్న పవన్ ఏమైపోయాడు.. మా పోరాటం ఆగదు
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. కడపలో వైఎస్సార్ సీపీ భారీ నిరసన
-
పేదల వైద్యాన్ని పెద్దల చేతుల్లో పెడతారా?
సాక్షి నెట్వర్క్: ‘‘ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివేవారిలో అధికులు ఆర్థిక స్థోమత లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేది కూడా వీరే. అలాంటి వైద్య విద్య, వైద్యాన్ని వారికి దూరం చేసి, ప్రయివేటుకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం దారుణం’’ అని వైఎస్సార్సీపీ మండిపడింది. వైద్య కళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు మంగళవారం వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘సమర భేరి’ పేరిట నిరసనలు నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ప్రధాన కూడళ్లలో నల్లబ్యాడ్జీలు ధరించి బైఠాయించారు.చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగడుతూ... ఇదేం పాలన.. ఇదేం పాలన.. సర్కార్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పార్టీ కార్యాలయాల నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమరి్పంచారు. సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వ బుద్ధి మారేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ చంద్రబాబూ... కార్పొరేట్లపై ప్రేమ.. పేదలపై కక్షనా? బడుగు బలహీన వర్గాల పిల్లలకు వైద్య విద్యను అభ్యసించే అర్హత లేదా? అని ప్రశి్నంచారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే పేదలకు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పేదలకు విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. పేదల సంక్షేమమే లక్ష్యంగా, జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలని, సామాన్యులకూ వైద్య విద్య అందుబాటులోకి రావాలన్న గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలను తీసుకొచ్చి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేలా చూశారు. కూటమి సర్కారు మాత్రం ప్రయివేటుకు కట్టబెట్టి పేదలకు వైద్య విద్యతో పాటు వైద్యాన్ని దూరం చేస్తోంది’’ అని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఆ«దీనంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘‘చంద్రబాబూ 15 ఏళ్లు సీఎంగా చేశావ్.. ఒక్క ప్రభుత్వ వైద్య కాలేజీ తేలేకపోయావ్..? అలాంటిది ఐదేళ్లలోనే జగన్ 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు. వాటిని నువ్వొచ్చి ప్రయివేటుపరం చేస్తావా?’’ అని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో కావాల్సిన వారికి కట్టబెట్టాలనేదే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ఆలోచన అని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపకపోతే... అంబేద్కర్ విగ్రహం ముందే కిరోసిన్ పోసుకుని
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అజిత్‌సింగ్ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ రాహుల్లా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఐదేళ్లలో సామాన్యుల పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు మెడికల్ విద్య చదవాలని కాలేజీలు తీసుకువచ్చారు. ప్రైవేట్ కాలేజీలు ఇచ్చిన ప్యాకేజి తీసుకోవాలని చంద్రబాబు, లోకేష్, పవన్ ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. డబ్బు మీద ప్రేమతో సామాన్యుల కలను చిదిమేస్తున్నాడు మెడికల్ కాలేజీల పరిశీలనకు వెళ్తే పోలీసులతో అడ్డుకున్నారు.. కేసులు పెట్టారు. నిర్బంధంతో పోరాటం ఆపలేరు. మెడికల్ కాలేజీల ప్రవేటికరణ ఆపకపోతే పోరాటం తీవ్రతరం చేస్తాం’ అని హెచ్చరించారు.విశాఖ: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దంటూ వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కుటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. గొల్ల బాబురావు మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం కూటమి సర్కార్ అంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చంద్రబాబు పెడుతున్నారు. పేదల పక్షపాతి వైఎస్ జగన్. దళితుల జోలికి వస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చివేస్తాం’’ అంటూ గొల్ల బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్ జిల్లా: కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.అనంతపురం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై దళిత సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేస్తూ.. నల్లబ్యాడ్జీలు, బెలూన్లతో నిరసన తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.తిరుపతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం పేద వర్గాల పిల్లలకు వైద్య విద్యను దూరం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజేంద్ర మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. పునరాలోచన చేయాలంటూ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం డిమాండ్ చేశారు.గుంటూరు: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గెడ్డేటి సురేంద్ర ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వనమా బాల వజ్రబాబు, పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను గట్టిగా నిరసించాలి: సజ్జల
-
నీకు జ్వరం వస్తే హైదరాబాద్ పోతావ్.. మరి పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోతే..
-
‘ చంద్రబాబు ప్రభుత్వంలో విద్య, వైద్యం పూర్తిగా నాశనం’
తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఇది నిజంగా కూటమి ప్రభుత్వం సిగ్గు పడాల్సిన అంశమని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. ‘చంద్రబాబు ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలు పూర్తిగా నాశనం అయ్యాయి. ఆ రెండు రంగాలనూ తమ గుప్పెట్లో పెట్టుకుని పేదలను పీల్చి పిప్పి చేస్తున్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యం కోసం జగన్ పాడేరులో మెడికల్ కాలేజీ పెట్టారు. అలాంటి కాలేజీని కూడా అడవి బిడ్డలకు దూరం చేస్తున్నారు. అదేమని అడిగితే చట్టసభలోనే లోకేష్ పీకుడు భాష మాట్లాడుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి మెడికల్ కాలేజీలు వెళ్లిపోతే పేద, మధ్య తరగతి ప్రజలు బతికేది ఎలా?, జగన్ సీఎం అయ్యాక మెడికల్ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వపరం చేస్తాం. మంత్రి సత్యకుమార్ అసత్యాలు మాట్లాడుతున్నారు. ఆయన రాష్ట్ర మంత్రిగా కాకుండా బీజేపీ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. లోకేష్ నోరు తెరిస్తే పీకుడు భాష తప్ప మరేమీ మాట్లాడటం లేదు. బూతు మాటలు మానేసి మంచి మాటలు నేర్చుకుంటే మంచిది. చంద్రబాబు తనవారికి మెడికల్ కాలేజీలను దోచి పెడుతున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలు సహించే పరిస్థితి లేదు’ అని స్పష్టం చేశారు. -
YSRCP పాలనలో ఇలాంటి పరిస్థితులు లేవు: వైఎస్ జగన్
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చర్చపై పట్టు వీడని YSRCP..
-
మోదీని మరోసారి అవమానించిన బాబు.. మీ శిష్యుడిని చూసి బుద్ధి తెచ్చుకో
-
మీరు చెప్పినట్టు ముగ్గురు పిల్లల్ని కనాలంటే ఆరోగ్యం కావాలి కదా బాబు.. యువ డాక్టర్ సెటైర్లు
-
మెడికల్ కాలేజీల విషయంలో పాపం మూట కట్టుకుంటున్న బాబు సర్కార్
సాక్షి, వెలగపూడి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యమ సంఘాలు, ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. మరోవైపు.. రాజకీయంగానూ వైఎస్సార్సీపీ తమ ఆందోళనలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో.. చట్ట సభలో ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయంపై అసెంబ్లీలో చర్చకు వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. అయితే ప్రభుత్వం ఈ అంశంపై ఇంతకు ముందు షార్ట్ డిస్కషన్‌కు ఒప్పుకుంది. ఈ క్రమంలో ఇవాళ శాసన మండలిలో ఎలాగైనా చర్చ జరిగేలా చూడాలని వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోంది. తక్షణమే ఈ అంశంపై చర్చించాలని సోమవారం మండలి చైర్మన్‌కు వాయిదా తీర్మానం అందజేసింది కూడా. అయితే.. ఈ వాయిదా తీర్మాన్ని చైర్మన్ తిరస్కరించడంతో.. ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. నల్ల కండువాలతో మండలిపై శాసనమండలికి హాజరైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ‘‘ఈరోజు చర్చ జరుపుతాం అన్నారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు పాటించరు?. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం. ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఉంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు కావాల్సిందే’’ అని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. తక్షణం చర్చ జరగాలి అంటూ మండలి చైర్మన్ పోడియం చుట్టూ చేరి వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. వైఎస్సార్సీపీ పట్టు వీడకపోవడంతో ఆందోళన నడుమ.. చైర్మన్ మండలిని కాసేపు వాయిదా వేశారు.మండలి బయట ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం పాపం మూట కట్టుకుంటోంది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణను ఆపాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నా చంద్రబాబుకు చెవికి ఎక్కటం లేదు. ప్రజల నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తే ఆ ప్రభుత్వాలనే జనం కూల్చేసిన సంఘటనలు ఉన్నాయి. తమ తాబేదార్లకి మెడికల్ కాలేజీలను దోచి పెడుతున్నారు. రాష్ట్ర ప్రజలు దీనిపై తిరుగుబాటు చేయబోతున్నారు. వైద్యం అందుబాటులో లేక జనం ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వానికి కనపడటం లేదా?. 17 కాలేజీలను ప్రభుత్వ పరంలోనే నడపాలి అని డిమాండ్ చేశారు.అంతకు ముందు.. సోమవారం ఉదయం శాసనమండలి ప్రారంభానికి ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.. నల్లకండువాలతో, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ ఫ్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. ఆ సమయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ముందుకు సాగారు. ‘‘కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఆలోచిస్తోంది. ప్రజారోగ్యాన్ని చంద్రబాబు రోడ్డుపాలు చేస్తున్నారు. ప్రజల కోసం ఎందాకైనా పోరాటం చేస్తాం’’ అని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా అన్నారు. -
టీడీపీ నేతలు ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన వడ్డే శోభనాద్రీశ్వరరావు
-
చంద్రబాబూ.. ఆ అధికారం నీకు ఎక్కడిది?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ భూములను కోటీశ్వరులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. పీపీపీ విధానం అంటూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గం. ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేసే అధికారం.. చంద్రబాబుకు ఎక్కడిది?. మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ కట్టించడం హర్షించదగినది అని ప్రశంసలు కురిపించారు.మాజీ మంత్రి వడ్డే శోభానాద్రీశ్వరరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తయిన మెడికల్ కళాశాల్లో పీపీపీ విధానం తీసుకురావడం సరైన విధానం కాదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గం. వైద్య, విద్యా రంగాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?. వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తే ప్రైవేటు వాళ్లకే లబ్ది జరుగుతుంది. 1972 నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను. చంద్రబాబు.. కోటేశ్వరులకు ప్రభుత్వ భూములు కట్టబెడుతున్నారు. కోట్ల విలువ చేసే భూములను 95 పైసలకు చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నాడు.P4 విధానాన్ని చంద్రబాబు విరమించుకోవాలి. 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నడపాలి. UHI మెడికల్ కాలేజీ విశాఖపట్నంలో పెట్టాలి. అమరావతిలో పెట్టేందుకు వీల్లేదు. టూరిజం పాలసీ ప్రకారం లులు కంపెనీలకు చంద్రబాబు కట్టబెడుతున్నాడు. లులు మీద ప్రేమతో ఆర్టీసీ స్ధలాన్ని 99 సంవత్సరాలకు ప్రైవేటు పరం చేశాడు. చంద్రబాబుకు ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేసే అధికారం ఎక్కడుంది?. విజయవాడలో లులు కంపెనీకి ప్రైవేట్ పరం చేసిన దానిపై సుప్రీంకోర్టులో ఫిల్ వేశాను.చంద్రబాబుకు సానుకూలమైన పత్రికలోనే మట్టి దందా వార్తలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇబ్రహీంపట్నం బూడిద కంపెనీలో వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. గతంలో నీరు చెట్టు-కార్యక్రమంలో ఉన్న బాకీలు నేటి కూడా చంద్రబాబు చెల్లించలేదు. మంత్రి నారాయణ కళాశాలల్లో 10 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వండి. అప్పుడు పీఫోర్ విధానం అమలు చేయండి. గతంలో 75 ఏళ్లలో 2365 మెడికల్ సీట్లు ఉండేవి. వైఎస్ జగన్ తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలు వల్ల 2550 మెడికల్ సీట్లు వస్తాయి’ అని తెలిపారు. -
ప్రజల కోసం పోరాటం.. ఎన్ని రోజులైనా జైల్లో పెట్టండి: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నాం.. నెలకాకపోతే రెండు నెలల జైల్లో పెట్టండి అని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ మేం శాంతియుతంగా నిరసనకు పిలుపునిచ్చాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 400 మందిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. జిల్లా ఎస్పీ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని తాము తప్పుబట్టడం లేదన్నారు.వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘360 రోజులు సెక్షన్ 30 పెట్టడం అనేది ధర్మమేనా?. ఈ విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను నడపలేదని 2014-19 మధ్యలోనే చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019లో వైఎస్ జగన్ వచ్చిన తర్వాత వైద్యానికి పెద్దపీట వేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆలోచన చేశారు. పేద పిల్లలు మెరుగైన వైద్య విద్యను అభ్యసించాలని ఆలోచన చేశారు. 17 కొత్త మెడికల్ కాలేజీలను తెచ్చారు. ఇందులో భాగంగా ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేశారు.మాట తప్పిన లోకేష్ నాయుడు..కాలేజీల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఒక 50 సీట్లకు పేమెంట్ కోట కింద పెట్టారు. వైఎస్ జగన్ ఆలోచనతో ప్రభుత్వం నుంచి డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. అధికారంలోకి రాగానే 150 సీట్లు 15 వేలకే అందిస్తామని లోకేష్ నాయుడు చెప్పాడు. కానీ, అసలు కాలేజీలనే నడపలేనని ప్రైవేటు వాళ్లకు అప్పగించేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మేం శాంతియుతంగా నిరసనకు పిలుపునిచ్చాం. నిరసనకు పర్మిషన్ అడిగాం ఇవ్వనన్నారు. మెడికల్ కాలేజీ వద్దకు వెళ్తే లోపలేస్తామన్నారు. ప్రజల తరపున ప్రతిపక్షంగా పోరాడటం మా బాధ్యత. అందుకే ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చేపట్టాం.జనసేన, టీడీపీ సంగతేంటి?రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 400 మందిపై కేసులు పెట్టారు. 10 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్ల కింద కేసు పెట్టారని చెబుతున్నారు. ప్రజల కోసం మేము పోరాడుతున్నాం.. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి. మంత్రి కొల్లు రవీంద్ర, చంద్రబాబుకు నచ్చింది చేసుకోనివ్వండి. హత్యలు చేసి దొరికిపోయిన వాళ్లే నామోషిగా ఫీలవ్వడం లేదు. ఇలాంటి కేసులకు మేమెందుకు బాధపడాలి. ప్రజల కోసం పోరాడాం.. నెలకాకపోతే రెండు నెలలు జైల్లో పెట్టండి. జిల్లా ఎస్పీ మాపై కేసులు పెట్టడాన్ని మేము తప్పు పట్టడం లేదు. ఎస్పీ చర్యలను స్వాగతిస్తున్నాం. కృష్ణాజిల్లాలో జనసేన, టీడీపీ నేతల అరాచకాలపై ఇలాగే కొరడా ఝుళిపించాలని కోరుకుంటున్నాం.ఎస్పీకి సూచన..గత ఎస్పీ కారణంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు రాజకీయ వ్యవస్థకు తలొగ్గారు. ఏకపక్షంగా వ్యవహరించడానికి అలవాటైపోయారు. గాడి తప్పిన పోలీసులను గాడిలో పెట్టండి. పాత అలవాట్లను వదిలించండి. స్టేషన్ ఆఫీసర్లు పేకాటను నడిపిస్తున్నారు. మర్డర్లు చేసే వారికి కొమ్ము కాస్తున్నారు. మరో స్టేషన్ ఆఫీసర్ పెద్ద ఎత్తున డీజిల్ మాఫియా నడిపిస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర కనుసన్నల్లో ఆయన నడుచుకుంటారు. మంత్రి గారి అనుచరులు తప్ప మరొకరు డీజిల్ అమ్మితే ఆయన ఊరుకోరు. నెలకు పది నుంచి 12 లారీల డీజిల్ అమ్ముకుంటున్నారు. పోర్టు దగ్గర్లో భూమిలో రెండు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులకు తెలిసే ఇంతలా బరితెగించారు. బందరు వాళ్లను కాకుండా బయట నుంచి ఆఫీసర్లను పంపించండి మీకే తెలుస్తుంది. మీ చుట్టూ గాడి చెప్పిన వ్యవస్థను సరిదిద్దండి. తప్పు చేసిన వాడు ఏ పార్టీ అయినా శిక్షించండి’ అని డిమాండ్ చేశారు. -
ప్రైవేటీకరణపై ప్రజా యుద్ధం.. బాబుకు YS జగన్ వార్నింగ్
-
ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జనాగ్రహం... చంద్రబాబు కూటమి సర్కార్ నిర్ణయంపై వెల్లువెత్తిన నిరసన
-
మెడికల్ కాలేజీలపై ‘మండలి’లో ఆందోళన
సాక్షి, అమరావతి: పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను చంద్రబాబు ప్రభుత్వం వెంటనే రద్దుచేయాలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శుక్రవారం శాసనమండలి సమావేశంలో పట్టుబట్టారు. సమావేశాలు జరుగుతున్నంతసేపూ వారు పోడియం ముందే నిలబడి పెద్దఎత్తున నినాదాలు, ఆందోళన చేశారు. దీంతో శుక్రవారం గంటపాటు కూడా సభ జరగలేదు. వీరి ఆందోళనల మధ్యే ‘మండలి’ చైర్మన్ మోషేన్‌రాజు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు యత్నించారు. మధ్యలో రెండుసార్లు సభను తాత్కాలికంగా వాయిదా వేసి గందరగోళ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినా, పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. వాయిదా తీర్మానం, తిరస్కరణ..అంతకుముందు.. ఉదయం సభ ప్రారంభం కాగానే ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ–పీపీపీ విధానం’ గురించి చర్చించేందుకు వైఎస్సార్సీపీ సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్, సిపాయి సుబ్రమణ్యం, కుంభా రవిబాబు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్లు చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు.ఇందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలుపుతూ, ఈ అంశంపై సభలో చర్చ చేపట్టాలంటూ పోడియం వద్దకు చేరుకుని ‘ప్రజారోగ్యం ప్రైవేటీకరణా.. పేదలు చదువుకునే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సిగ్గుసిగ్గు’.. వంటి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు ఉపక్రమించారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య విద్యా శాఖకు సంబంధించిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ బదులిచ్చారు. బీఏసీలో చర్చించి ఈ అంశంపై నిర్ణయం తీసుకుందాం.. అప్పటివరకు సభ్యులు సహకరించాలని చైర్మన్ సూచించినప్పటికీ సభ్యులు శాంతించలేదు. దీంతో, ఆయన సభను కొద్దిసేపు వాయిదా వేశారు.మళ్లీ అదే సీన్..అనంతరం.. ఉ.10.44కు సభ తిరిగి ప్రారంభమయ్యాక మండలి చైర్మన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తిరిగి పోడియం వద్దకు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు కొనసాగించారు. ఇంతలో మరో రెండు ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో చైర్మన్ మోషేన్‌రాజు 11 గంటలకు మళ్లీ వాయిదా వేశారు. మండలి బీఏసీ సమావేశానంతరం సభ తిరిగి కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.టీడీపీ వర్సెస్ వైఎస్సార్సీపీ..సభ తిరిగి మ.12.38కు ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్ద మళ్లీ తమ ఆందోళన కొనసాగించారు. మెడికల్ కాలేజీ అంశంపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం బీఏసీ సమావేశంలో అంగీకరించిందని.. సభ్యులు తమ సీట్లలోకి వెళ్లి కూర్చోవాలంటూ విజ్ఞప్తి చేసినా వారు అక్కడే ఉండిపోయారు. దీంతో ప్రశ్నోత్తరాల అజెండాల్లో ఉన్న అన్ని ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు ఉంచాలంటూ చెప్పి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసినట్లు చైర్మన్ ప్రకటించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నోత్తరాలు కొనసాగించాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ పోడియం వద్దకు చేరుకోవడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. కొద్దిసేపటికి టీడీపీ సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లగా, వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన కొనసాగిస్తూ పోడియం ముందే ఉండిపోయారు. ఈ సమయంలో జీఎస్టీపై ప్రభుత్వ ప్రకటన చేసేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ యత్నించగా.. సభలో పరిస్థితులు చూసి సోమవారం ప్రకటన చేస్తానంటూ చెప్పారు. దీంతో.. మ.ఒంటిగంట ప్రాంతంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. -
మెడికల్ కాలేజీలను అమ్మేస్తుంటే ప్రశ్నించకూడదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? అంటూ చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘ఛలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేయటంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రజల తరఫున నిరసన తెలిపే రాజ్యాంగ పరమైన హక్కులను కాలరాస్తారా? అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.‘‘చంద్రబాబూ.. ప్రజారోగ్య రంగాన్ని, పేదల ఆరోగ్య భద్రతను కాపాడుకునేందుకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ప్రజల తరఫున, వారి గొంతును గట్టిగా వినిపిస్తూ, వారితో కలిసి వైఎస్సార్సీపీ యూత్, స్టూడెంట్ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనలు, ర్యాలీలను ఎందుకు పాశవికంగా అడ్డుకోవాలనుకున్నారు? లాఠీచార్జ్‌లు ఎందుకు చేశారు? గృహనిర్బంధాలు, అరెస్టులు ఎందుకు చేశారు?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘మీరు స్కాములు చేస్తూ తరతరాల ప్రజల ఆస్తులైన గవర్నమెంటు మెడికల్ కాలేజీలను మీ అనుయాయులకు అమ్మేస్తుంటే వాటిని ప్రశ్నించకూడదా? ప్రజల తరఫున గొంతెత్తితే అణచివేస్తారా? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇటు అసెంబ్లీ వెలుపలకూడా మా పార్టీ ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతుంటే పోలీసులచేత దౌర్జన్యం చేయించడం మీ బరితెగింపు కాదా? ఇది కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు దిగుతారా? ఏమిటీ రాక్షసత్వం...మీరింతగా తెగబడినా ప్రజాప్రయోజనాల పరిరక్షణ కోసం మా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు, వీరితో పాటు యువతీయువకులు, స్టూడెంట్లు తెగింపు చూపారు. ప్రజల పక్షాన నిలిచి అటు శాసన మండలిలోనూ, ఇటు మెడికల్ కాలేజీల ఆవరణలోనూ విజయవంతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. పేదల ఆరోగ్య భద్రత, పేద విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ పోరాటాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయి’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు..@ncbn గారూ.. ప్రజారోగ్య రంగాన్ని, పేదల ఆరోగ్య భద్రతను కాపాడుకునేందుకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ప్రజల తరఫున, వారి గొంతును గట్టిగా వినిపిస్తూ, వారితో కలిసి వైయస్సార్సీపీ యూత్, స్టూడెంట్ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనలు, ర్యాలీలను ఎందుకు… pic.twitter.com/EkqzMcG9cW— YS Jagan Mohan Reddy (@ysjagan) September 19, 2025 -
'ఛలో మెడికల్ కాలేజ్' విజయవంతం: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు నిర్వహించిన ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం విజయవంతం అయిందని మాజీ మంత్రి విడదల రజని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించకుంటే దిగొచ్చేదాకా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని రజని హెచ్చరించారు. పోలీసులను ప్రయోగించి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా పార్టీ శ్రేణులు, విద్యార్థులు, యువత, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారని వివరించారు. మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదని కూటమి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆయా మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి ఫొటోలు, వీడియోలు ప్రదర్శించారని ఆమె మీడియాకు వివరించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధుల కొరత లేదువైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఛలో మెడికల్ కాలేజీల కార్యక్రమం విజయవంతమైంది. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రూ.8,500 కోట్ల వ్యయంతో వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి 5 కాలేజీలను పూర్తి చేశారు. వాటిల్లో అడ్మిషన్లు పూర్తయ్యి క్లాసులు జరుగుతున్నాయి. ఎన్నికల నాటికి పూర్తయిన పాడేరు మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించింది.వైఎస్ జగన్ మీద కక్షతో పులివెందుల మెడికల్ కాలేజీని మాత్రం ప్రారంభించకుండా ఎన్ఎంసీ సీట్లు కేటాయించినా వద్దని లేఖరాసిన నీచుడు చంద్రబాబు. వీటితో పాటు రెండో దశలో ప్రారంభంకావాల్సిన మరో 3 మెడికల్ కాలేజీలు 90 శాతం పనులు పూర్తయినా, కూటమి ప్రభుత్వం వచ్చాక 15 నెలలుగా పెండింగ్ పనులను పూర్తి చేయకుండా పక్కనపెట్టేశారు. మూడో దశలో పూర్తి చేయాల్సిన కాలేజీలు సైతం పిల్లర్ల దశలో ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి కూడా పనులన్నీ ప్రణాళిక ప్రకారం శరవేగంగా జరుగుతుండేవి. మెడికల్ కాలేజీలు పూర్తయితే వైఎస్ జగన్‌కి మంచి పేరు వస్తోందన్న కుట్రతో ప్రారంభించకుండా సేఫ్ క్లోజర్ పేరుతో మూసేసిన నీచ చరిత్ర చంద్రబాబుది.పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలని కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. కాలేజీల నిర్మాణం నిధుల కొరత కారణంగా ఆగిపోకూడదన్న ఉద్దేశంతో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, నాబార్డు నిధులు వచ్చేలా టైఅప్ చేసుకున్నారు. పేదల వైద్యం ప్రభుత్వ బాధ్యతగా భావించి వైయస్ జగన్ అంత గొప్పగా ఆలోచించి ముందుచూపుతో వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు వాటిని పీపీపీ పేరుతో పప్పు బెల్లాలకు తన వారికి కట్టబెట్టేందుకు సిద్దమయ్యారు.10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు, ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ప్రజారోగ్యం గురించి ఆలోచించకుండా, మెడిసిన్ చదివి డాక్టర్ కావాలని కలలు కంటున్న పేద విద్యార్థుల ఆశలను చిదిమేస్తూ దోపిడీయే ధ్యేయంగా సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నాడు.పోలీసుల వేధింపులకు లెక్క చేయకుండా వచ్చారుప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. వైఎస్సార్సీపీ వాదనకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలపై సమాధానం చెప్పుకోలేని కూటమి ప్రభుత్వం, కాలేజీల నిర్మాణమే జరగలేదని విష ప్రచారం మొదలు పెట్టింది. కాలేజీల నిర్మాణం పూర్తయి క్లాసులు జరుగుతున్నప్పటికీ పిల్లర్ల దశలో ఉన్న భవనాల పొటోలు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రకు తెరలేపారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని విద్యార్థులు, యువజన విభాగాల ఆధ్వర్యంలో `ఛలో మెడికల్ కాలేజీ`ల కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నిర్వహించింది. కేసులు పెడతామని బెదిరించినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా 17 కొత్త మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి కాలేజీ నిర్మాణాల పరిస్థితిని ప్రజలకు వివరించాం. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన లభించింది. ఏ కాలేజీ ఏయే స్థితిలో ఉందో మా కార్యకర్తలు నేరుగా ఆయా భవనాల వద్దకు వెళ్లి వీడియోలు, ఫొటోల ద్వారా వివరించడం జరిగింది.హౌస్ అరెస్టులు, అక్రమ కేసులతో అడ్డుకోవాలని ఎంత ప్రయత్నించినా అడ్డంకులన్నీ దాటుకుని వైయస్సార్సీపీ నాయకులతో పాటు విద్యార్థులు, సామాన్య ప్రజలు ఈ ఆందోళన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపైనే చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై యవతలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సోషల్ మీడియాలో సైతం స్వచ్ఛందంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని వైయస్సార్సీపీ చేస్తున్న ఆందోళనలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రైవేటీకరణ జీవోను వెనక్కి తీసుకోవాలివైఎస్సార్సీపీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారనే భయంతో ఎక్కడికక్కడ నాయకులను హౌస్ అరెస్టులు చేసినా, అరెస్టులు, కేసుల పేరుతో భయపెట్టినా వైఎస్సార్సీపీ శ్రేణులు వెనకడుగు వేయలేదు. పల్నాడు జిల్లా పరిధిలో నిరసన కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకుని తీరాలన్న లక్ష్యంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా నన్ను హౌస్ అరెస్టు చేశారు.మా నాయకులు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని పక్క రాష్ట్రం మిర్యాలగూడలో అడ్డుకుని కార్యక్రమంలో పాల్గొనకుండా చూశారు. పోలీసులను ప్రయోగించి అక్కడక్కడా వైయస్సార్సీపీ నాయకులను అడ్డుకుని ఉండొచ్చేమో కానీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా వైఎస్సార్సీపీ పోరాటం ఆపడం జరగదని స్పష్టంగా చెబుతున్నాము. ఎంత ఆపుదామని ప్రయత్నిస్తే అంతగా రెట్టింపు ఉత్సాహంతో వైయస్సార్సీపీ పోరాడుతుంది. ప్రైవేటీకరణ పేరుతో ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం మేల్కొనేదాకా మా పోరాటం ఆగదు. -
Kurnool: విద్య, వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం పట్ల ఆగ్రహం
-
Vidadala: కూటమి ప్రభుత్వం వల్ల సర్కార్ వైద్యం ప్రజలకు దూరమవుతుంది
-
Perni Nani: పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మెడికల్ కాలేజీలు
-
ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఆందోళనలు ఆగవని YSRCP హెచ్చరిక
-
రూ.6 వేల కోట్లు ఇవ్వడానికి చేతులు పడిపోయినాయా బాబూ..
-
ఎవరి సొమ్ము.. ఎవరి సొత్తు.. బాబును రఫ్ఫాడించిన పేర్ని కిట్టు
-
భయపడ్డ చంద్రబాబు.. ఇంత మంది పోలీసులా..
-
KSR Live Show: ప్రభుత్వ మెడికల్ కాలేజీల చరిత్రలో చీకటి రోజు
-
మెడికల్ కాలేజీలు పేదల కోసం.. బినామీలకు ఇస్తానంటే ఊరుకోము
-
Watch Live: ఛలో మెడికల్ కాలేజ్


