
2023లో విజయనగరం మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్
విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హయాంలో స్థాపించిన మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు మంజూరయ్యాయి. తొలిసారి కొత్త మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు మంజూరు చేసింది ఎన్‌ఎంసీ(National Medical Commission). ఇందులో మచిలీపట్నం-12, నంద్యాల-16, విజయనగరం -12, రాజమండ్రి-16, ఏలూరు -4 చొప్పున పీజీ సీట్లు మంజూరు చేసింది.
ఐదు మెడికల్ కాలేజీలకు 60 మెడికల్ పీజీ సీట్లు మంజూరు చేయడంతో ఇన్నాళ్లు కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నది అబద్ధమేనని తేలిపోయింది.
వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలు కట్టలేదంటూ మంత్రులు సైతం అబద్ధాలు చెప్పారు. వైఎస్ జగన్ స్థాపించిన మెడికల్ కాలేజీలకు తాజాగా పీజీ సీట్లు మంజూరు కావడంతో ప్రభుత్వ పెద్దలు చెప్పేదంతా అసత్య ప్రచారమేనని నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే 5 కాలేజీల్లో 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు మంజూరు కాగా, తాజాగా 60 పీజీ సీట్లు మంజూరు చేసింది ఎన్ఎమ్‌సీ.
ఇదీ చదవండి:
‘వైద్య రంగంలో జగన్ సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే’


