సాక్షి, తాడేపల్లి: ఏపీసీఎస్‌వోతో మేం ఒకటినే జీతాలు ఇచ్చేలా చేశామని.. చంద్రబాబు హయాంలో ఏపీసీవోఎస్‌ను నీరుగార్చారంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘‘ఏపీసీవోఎస్‌లో రెండు, మూడు నెలలకు కూడా జీతాలు లేవు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కేవలం ఒక డీఏ మాత్రమే ఇచ్చారు. ఒక డీఏ కూడా వాయిదాల్లో ఇస్తారంట. రిటైర్డ్ అయ్యాక ఎరియర్స్ ఇస్తామన్నది బాబు ప్రభుత్వమే. ఎన్నికల్లో ఇచ్చిన పీఆర్సీ హామీ ఇప్పటికీ లేదు’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.
‘‘పీఆర్సీ ఛైర్మన్ కూడా లేడు. జీతాలు పెరగొద్దని పీఆర్సీ ఛైర్మన్‌ను నియమించలేదు. పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.31 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.


