సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరికాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ద్వారా ఏపీ ప్రజలకు పలు విషయాలు తెలియజేయనున్నారు. తాజా రాజకీయాంశాలపై ఆయన మాట్లాడతారని పార్టీ ఇదివరకే ఓ ప్రకటనలో తెలిపింది.
అయితే.. ఏపీలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగం.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు, అరెస్టులు.. శాంతిభద్రతల భంగం.. తన కేసులను చంద్రబాబు లేకుండా చేసుకోవడం, రైతుల సమస్యలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం.. సంక్షేమానికి పడుతున్న తూట్లు.. తాజాగా విశాఖ గూగుడ్ డాటా సెంటర్ అదానీనేదని నిర్ధారణ కావడం.. తదితర అంశాలపై టాపిక్ వైజ్‌గా వైఎస్ జగన్ మాట్లాడే సూచనలు కనిపిస్తున్నాయి.


