రైలులో లైంగిక దాడి కేసులో నిందితుడికి
జీవిత ఖైదు, రూ..10వేల జరిమానా
కడప అర్బన్: కడప పోక్సో కోర్టు కీలక తీర్పునిచ్చింది. లైంగిక దాడికేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు 10,000/– జరిమానా విధించింది. అంతేగాక గుంతకల్ డీఆర్‌ఎం బాధితురాలికి రూ.10.50లక్షల పరిహారం చెల్లించాలని కడప పోక్సో కోర్టు జడ్జి సి. ప్రవీణ్ కుమార్ తీర్పు చెప్పారు.వివరాలు..2019 జనవరి 27వ తేదీన తిరుపతి– నిజామాబాద్ (రైలు నంబర్ 12793) రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని బి–2 కోచ్‌లో ఎనిమిదేళ్ల బాలిక ప్రయాణిస్తోంది. సాయంత్రం 6 గంటల సమయంలో బోగీలోని టాయ్‌లెట్‌కు ఒంటరిగా వెళ్లింది. అదే రైలులో ఉన్న నిందితుడు ఆమెను వెంబడించి, టాయిలెట్ లోపలికి నెట్టి, లైంగిక దాడికి పా ల్పడ్డాడు.
చిన్నారి కేకలు వేయగా తల్లిదండ్రులు, ప్రయాణికులు తలుపు తట్టడంతో నిందితుడు తప్పించుకోవడానికి ప్రయతి్నంచాడు.ప్రయాణికులు నిందితుడిని ఎస్1 కోచ్‌లో పట్టుకుని, డ్యూటీలో ఉన్న టీటీఐకి అప్పగించారు. రైలు కడప రైల్వే స్టేషన్‌లోప్లాట్‌ఫాం నంబర్ 3కి చేరుకున్నప్పుడు, నిందితుడు రైలు నుంచి దూకి తప్పించుకున్నాడు.బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు, సికింద్రాబాద్ ఆర్‌పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఆ కేసు అధికార పరిధి ఆధారంగా కడప ఆర్‌పీఎస్‌కు బదిలీ చేశారు. రైల్వే డీఎస్పీ (రిటైర్డ్) రమేష్ ఈ కేసు (క్రైం.నంబర్.08/2019)ను దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు.
నిందితుడు గాలి రామ్ ప్రసాద్ రెడ్డిని 2019 ఫిబ్రవరి 5న అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.కడప పోక్సో కోర్టు ఆదేశాలతో గాలి రామ్‌ప్రసాద్ రెడ్డి అలియాస్ ప్రసాద్ రెడ్డి(28)కి జీవిత ఖైదు, జరిమానా విధించారు. ఈ ఘటన జరిగిన తేదీన విధుల్లో ఉన్న టీటీఐ (ట్రావెలింగ్ టికెట్ ఇ¯న్‌స్పెక్టర్)పై శాఖాపరమైన చర్యలకు న్యాయస్థానం సిఫార్సు చేసింది. ఈ కేసును కడప పోక్సోకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొమ్మినేని వేణుగోపాల్, అప్పటి పీపీ సానేపల్లి రామసుబ్బారెడ్డి వాదించారు. ఈ కేసు వివరాలను కడప రైల్వే సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి తెలియజేశారు.


