breaking news
Kutami Prabhutvam
-
పోలవరం.. మళ్లీ అదే తప్పు చేస్తున్న చంద్రబాబు!: ఉండవల్లి
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వంలో పోలవరం పనులు నత్తనడకనే సాగుతున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు తరచూ అక్కడ పర్యటిస్తుండడం వల్ల మొత్తం అధికార యంత్రాగం వాళ్ల చుట్టే తిరుగుతోందని.. తద్వారా పనులు త్వరగతిన సాగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ.. పోలవరంలో డయాగ్రమ్ వాల్ మళ్ళీ కడుతున్నారు. పనులు ఎలా జరుగుతున్నాయో మీడియం తీసుకెళ్లి చూపించాలి అనుకున్నాను. కాఫర్ డ్యామ్ ఫెయిల్యూర్‌కు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధమే లేదు. తెలుగు దేశం హయాంలో జరిగిన తప్పు వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని జగన్ స్పష్టం చేశారు. రూ.440 కోట్ల డయాఫ్రమ్ వాల్ ఫెయిల్ అయినా కూడా అదే కంపెనీ మళ్లీ పనులు చేస్తోంది.. ఇప్పుడు రూ.990 కోట్లతో అదే బావర్ కంపెనీ కొత్త డయాఫ్రమ్ వాల్ కడుతోంది. దీనిపై ఎందుకు ఎంక్వయిరీ జరగడం లేదు. పోలవరానికి సంబంధించి ప్యానల్ అఫ్ ఎక్స్పర్ట్స్(POE) ఇచ్చిన రిపోర్ట్ ఎక్కడ ఉంది?. అసలు ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది??.. రైట్ టు ఇన్ఫర్మేషన్ లో ప్రభుత్వాన్ని అడిగితే కాపీ రైట్ వర్తిస్తుందని చెప్పటం దారుణం. వాల్ కొట్టుకుపోవడం మానవ తప్పిదమా?.. ఫ్లడ్ భారీగా రావటం వల్ల జరిగిన సమస్యా? అనే విషయాన్ని స్పష్టం చేయాలి. ఢయాఫ్రం వాల్ మళ్ళీ కడుతున్నారు.. ఇదే ప్రమాదం ఎదురైతే ఏం చేస్తారో స్పష్టం చేయాలి. పోలవరంలో తరచూ చంద్రబాబు, మంత్రులు చేసే విజిట్లు వల్ల పనులు త్వరితగతిన సాగడం లేదనిపిస్తోంది. మొత్తం యంత్రాంగం అంతా వీరి చుట్టూనే తిరుగుతోంది. గత పుష్కరాల్లో జనం చనిపోవటానికి ముహూర్తం మూఢనమ్మకమే కారణమని కమిషన్ చెప్పేసింది. అప్పట్లో టిడిపితో బీజేపీ కలిసి ఉండటం వల్ల ఏం మాట్లాడలేదు. ముహూర్తం మూఢనమ్మకమా?.. అదే అనుకుంటే అన్ని మూఢనమ్మకాలే!’’ అని ఉండవల్లి అన్నారు. -
వల్లభనేని వంశీపై మరో అక్రమ కేసు
-
రివర్స్ డ్రామా.. వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌పై కూటమి ప్రభుత్వం మరో కుట్రకు తెర తీసింది. మాచవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేయించింది.సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయ్యింది. 2024 జులైలో వంశీ, ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డాడని తాజాగా ఆ వ్యక్తి మాచవరం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో.. వంశీ సహా మరో 20 మందిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఇక్కడ జరిగింది వేరు!. 2024 జూలై 7న విజయవాడలోని వంశీ ఇంటిపై టీడీపీ గూండాలు కత్తులు, కర్రలు, రాడ్లు, రాళ్లతో రెచ్చిపోయారు. అయితే వంశీ ఇంటిపై జరిగిన దాడిని.. తమ పైన దాడిగా రివర్స్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం. పైగా ఫిర్యాదులో తమను ఉద్ధేశపూర్వకంగా రెచ్చగొట్టి.. దూషించి దాడి చేశారంటూ సునీల్ పేర్కొనడం గమనార్హం. ఇంతకు ముందు.. వల్లభనేని వంశీని అక్రమ కేసుల్లో కూటమి ప్రభుత్వం జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో నకిలీ ఇళ్ల పట్టాల కేసుతో వంశీని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. ఈ కేసులో విజయవాడ జైల్లో ఉన్న ఆయన.. నూజివీడు కోర్టు బెయిల్ ఇవ్వడంతో 137 రోజుల తర్వాత బయటకు వచ్చారు. -
వైఎస్సార్సీపీ కీలక భేటీ.. సాయంత్రం లోక్ భవన్‌కు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం వైఎస్సార్సీపీ కీలక భేటీ జరగనుంది. కోటి సంతకాల ప్రతులను రాష్ట్ర గవర్నర్‌కు అందజేయనున్న నేపథ్యంలో ఆయన ముందుగా పార్టీ నేతలతో భేటీ నిర్వహించనున్నారు.వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున.. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించాలని ప్రయత్నించారు. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం ద్వారా కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు రాష్ట్రంలో వైద్య విద్యా అవకాశాలను విస్తరించడం ఉద్దేశంతో ఆయన ఈ అడుగు వేశారు.ఇందులో ఏడు పూర్తి కాగా.. వైఎస్సార్సీపీ దిగిపోయేనాటికి మరో పది నిర్మాణంలో ఉన్నాయి. అయితే.. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాటిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. చివరకు పీపీవీ విధానం పేరిట కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ పేరిట ప్రజా ఉద్యమానికి పిలుపు ఇచ్చారు వైఎస్ జగన్.అక్టోబర్ నెలలో గ్రామాల స్థాయిలో ‘రచ్చబండ’ పేరిట మొదలైన సంతకాల సేకరణ.. ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. రెండు నెలల్లో చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం కోటి 4 లక్షల 11 వేల 136 మంది సంతకాలు చేశారు. విద్యార్థులు, మేధావులు.. అన్ని వర్గాల ప్రజలూ వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణలో పాల్గొనడంతో.. దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.కొసమెరుపు ఏంటంటే.. అలాగే చంద్రబాబు సొంత గ్రామమైన నారావారిపల్లెలోనూ ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతూ అక్కడి ప్రజలు సంతకాలు చేయడం..ఇప్పటికే అన్ని జిల్లాల నుండి సంతకాల ప్రతుల బాక్స్‌లు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. గురువారం ఉదయం పత్రాలతో వచ్చిన వాహనాలకు వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభిస్తారు. అవి అక్కడి నుంచి నేరుగా లోక్‌భవన్(పూర్వ రాజ్‌భవన్)కు చేరుకుంటాయి.అనంతరం పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశమై.. ఇప్పటిదాకా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం గురించి చర్చిస్తారు. సాయంత్రం పార్టీ కీలక నేతలతో కలిసి లోక్ భవన్‌కు వైఎస్ జగన్‌కు వెళ్తారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యి.. మెడికల్ కాలేజీల ప్రవేటీకరణపై ప్రజల అభిప్రాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారు. -
99 పైసలకే 27.10 ఎకరాలా..? రహేజా కార్ప్‌కు భూకేటాయింపులపై హైకోర్టు విస్మయం
సాక్షి, అమరావతి: పలు ప్రైవేటు కంపెనీలకు నామమాత్రపు ధరలకే భూములు కట్టబెడుతూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఏకంగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ– రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కూడా కేవలం 99 పైసలకే 27.10 ఎకరాలు కట్టబెట్టడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.ఇంత తక్కువ ధరకు రియల్ ఎస్టేట్ కంపెనీకి అంత భూమి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించింది. ఇతర కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒక వేళ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మరిన్ని కంపెనీలు కూడా ముందుకు వచ్చి ఉండేవని తెలిపింది.అలా ఎన్ని కంపెనీలు ముందుకు వచ్చాయని ప్రశ్నించింది. అందరికీ అవకాశం ఇవ్వకుండా ఒకే కంపెనీకే భూములు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.రహేజాకు భూ కేటాయింపు విషయంలో అనుసరించిన విధానాన్ని కూడా తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఎదురు రూ.91.2 కోట్లు చెల్లిస్తోంది: పొన్నవోలువిశాఖపట్నం, మధురవాడ, ఐటీ హిల్‌లో కేవలం 99 పైసలకే 27.10 ఎకరాల భూమిని రహేజాకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు, మానవ హక్కుల కమిషన్ పూర్వ సభ్యుడు డాక్టర్ గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనల్లో ముఖ్యాంశాలు..– పొన్నవోలు వాదనల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, కంపెనీలకు భూ కేటాయింపులపై ఇప్పటికే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలై ఉన్నాయని, ప్రస్తుత వ్యాజ్యంలో కూడా పిటిషనర్ భూ కేటాయింపులను, కేటాయింపుల విధానాన్ని సవాలు చేశారని వివరించారు. – అలా అయితే ఆ వ్యాజ్యాలతో కలిపి ఈ వ్యాజ్యాన్ని కూడా వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. – ఈ సమయంలో పొన్నవోలు జోక్యం చేసుకుంటూ, ఇది రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు కేటాయించిన వ్యవహారమని తెలిపారు. గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాలు పలు ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులపై దాఖలైనవని వివరించారు. దీంతో ధర్మాసనం విచారణను కొనసాగించింది– రహేజా రియల్టీ సంస్థ కాదని ఏజీ చెబుతుండగా, పొన్నవోలు అడ్డుతగులుతూ అది రియల్ ఎస్టేట్ కంపెనీనేనని, కావాలంటే జీవో 204ను చూడాలని, అందులో రియల్ ఎస్టేట్ కంపెనీ అని స్పష్టంగా ఉందని చెప్పారు. – ప్రభుత్వం భూ కేటాయింపులతో సరిపెట్టలేదని, ప్రోత్సాహకాలుగా సదరు రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎదురు రూ.91.2 కోట్లు చెల్లిస్తోందని వివరించారు. ఈ మొత్తాన్ని ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని, అందువల్ల తగిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. – పొన్నవోలు లేవనెత్తిన పాయింట్ సరైనదేనని, అయితే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తరువాత అన్ని విషయాలను పరిశీలిస్తామని పొన్నవోలుకు ధర్మాసనం స్పష్టం చేసింది. -
ఇది పరకామణి చోరీ కంటే పెద్ద దోపిడి.. చంద్రబాబుపై భూమన ఆగ్రహం
సాక్షి, తిరుపతి: తిరుమల పవిత్రతను కాపాడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలం అవుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు ఏకంగా దేవుడి భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారాయన. బుధవారం తన నివాసంలో భూమన మీడియాతో మాట్లాడారు.. .. టీటీడీకి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు. దేవస్థానం భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. అలిపిరిలో సమీపంలో అత్యంత విలువైన భూముల్ని ఇచ్చేస్తున్నారు. ఎకరా రూ.26 కోట్ల రూ.52 లక్షల ఖరీదైన భూముల్ని కట్టబెట్టారు. రూ.460 కోట్ల విలువైన భూమిని ఒబెరాయ్‌కి ఇచ్చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.3 వేల కోట్ల విలువైన భూమి ఇది. 13వ తేదీన జీవోకూడా కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. 13న జీవో.. 5న రిజిస్ట్రేషన్ చేశారు. మరి ఇంకా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ సైట్లో ఎందుకు కనిపించడం లేదు?. ఎవరికి మేలు చేయడానికి రూ. 2 కోట్లు బిల్డింగ్ ఫీజుకు సర్దుబాటు చేశారు, రూ. 26 కోట్ల స్టాంప్ డ్యూటీ మాఫీ చేసేశారు. ఆ భూముల్లో భారీగా చందనపు చెట్ల ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కాకముందే చెట్లు కొట్టడం ప్రారంభించారు. ఒక బ్రాహ్మణుడు స్వామివారికి ఇచ్చిన భూమిని బాబు పందేర వేస్తున్నారు. తిరుమల పవిత్రతతను కాపాడడంలో చంద్రబాబు విఫలం అయ్యారు. వంద గదుల హోటల్‌కు భారీ ఎత్తున భూములు కట్టబెడుతున్నారు. ప్రభుత్వం దగ్గరి భూములు ఇవ్వకుండా(రెవెన్యూ ల్యాండ్).. టీటీడీ భూములు ఎలా ఇస్తారు?. గతంలోనూ హోటల్పేరు మార్చి తతంగం అంతా నడిపించింది చంద్రబాబే. దేవుడిని దోపిడీ చేసి ఒబెరాయ్‌కు ఇప్పుడు భూములు అప్పజెప్తునారు. దేవుడి ఇనాం భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెడతారు?. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు ఎలా సమర్థించుకుంటారు. వెంకటేశ్వరస్వామికి చంద్రబాబు చేస్తోంది అన్యాయం కాదా?..’’ అని భూమన మండిపడ్డారు. వంద రూమ్‌ల ఒబెరాయ్ హోటల్‌తో 1,500 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రజలకు చెప్తోంది. అదెలా సాధ్యం. ఇది పరకామణి దొంగతనం కంటే అతి పెద్ద దోపిడి. దీని వల్ల టీటీడీకి వచ్చిన లాభం ఏమిటి?. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనాడు తీసుకు వచ్చిన ఏడు కొండలు పరిధిలోనే ఈ భూములు ఉన్నాయి. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఈ భూమి ఉంది. అలిపిరి వద్ద అనుమతులు లేకుండా అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి?.. స్వామీజీలు ఇప్పటికైనా మౌనం వీడాలి. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై పోరాటం చేయాలి. ప్రత్యేక అగ్రిమెంట్ వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతి తప్పిదాలు చేశారు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలి’’ అని భూమన డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: తిరుమలలో మహాపచారం.. మద్యం, బిర్యానీ ప్యాకెట్లు లభ్యం! -
రఘురామను సస్పెండ్ చేయకుండా వదిలేస్తారా?
సాక్షి, విజయవాడ: సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చట్టం ముందు అందరూ సమానమేనని.. అలాంటప్పుడు తన సస్పెన్షన్ విషయంలో జరిగింది అవతలివాళ్లకు కూడా వర్తించాలి కదా? అంటూ ఆయన ఓ సూటి ప్రశ్న సంధిస్తూ పోస్ట్ చేశారు. మాజీ నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కీ. రఘురామకృష్ణరాజు కస్టడీలో హింసకు గురయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అప్పటి సీఐడీ అదనపు డీజీపీగా ఉన్న పీవీ సునీల్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన్ను సస్పెండ్ చేసి.. విచారణకు కూడా పిలిచారు. అయితే.. ‘‘నన్ను సస్పెండ్ చేశారు మంచిదే. కానీ దర్యాప్తు న్యాయంగా జరగాలంటే రఘురామకృష్ణరాజును కూడా అన్ని పదవులనుండి తొలగించాలి కదా. అని ఆయన పోస్ట్ చేశారు. ఒకరిని సస్పెండ్ చేసి, మరొకరిని పదవిలో కొనసాగించడం అన్యాయని.. రఘురామకృష్ణరాజు పదవిలో ఉంటే దర్యాప్తు ప్రభావితం అవుతుందని.. సీబీఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి రఘురామను పదవుల నుండి తొలగించాలని.. తద్వారా చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్లాలని కోరుకుంటున్నట్లు ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ ఉంచారు.ఇదీ చదవండి: ఫ్రాడ్ కేసులో రఘురామకు భారీ షాక్ -
ఫేక్ సొసైటీతో భూకబ్జా కుట్ర
విజయవాడ నడిబొడ్డున ఖరీదైన భవానీపురంలోని జోజినగర్‌లో భూముల కబ్జాకు 2016లోనే కన్నేశారు. 1981 నాటి డేట్‌తో ఒక ఫేక్ సొసైటీని 2016లో ఏర్పాటు చేశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇప్పుడు జోజినగర్‌లో ఏకంగా 42 మంది పేదల ఇళ్లు నిర్దాక్షిణ్యంగా కూల్చేయటాన్ని బట్టి ఇందులో కూటమి పెద్దల కుట్ర స్పష్టంగా తేలుతోంది. ఇళ్ల కూల్చివేతపై సీబీఐతో విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది ఏమిటి? ఈ ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తోంది? పేదల తరపున ఉందా? ఇక్కడి వారు సీఎం చంద్రబాబును మూడుసార్లు, లోకేశ్ రెండు సార్లు కలిశారు. అర్జీలు ఇచ్చారు. ఎవరికైతే వీరు అర్జీలు ఇచ్చారో.. వారే కుట్ర పన్ని వీళ్లకు అన్యాయం చేశారు.సాక్షి ప్రతినిధి, విజయవాడ: చంద్రబాబు సర్కారు విజయవాడ భవానీపురంలోని జోజినగర్‌లో 42 మంది పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఇళ్ల కూల్చివేత దారుణమన్నారు. ఈ కూల్చివేతలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, ఎంపీ కేశినేని చిన్నితో పాటు స్థానిక జనసేన కార్పొరేటర్ సోదరుడి ప్రమేయం ఉందన్నారు.‘సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఇళ్లు ఎలా కూల్చేస్తారు? పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే వారికి వ్యతిరేకంగా అఫిడవిట్లు, పిటిషన్లు వేయడం దుర్మార్గం. జోజినగర్ బాధితుల బ్యాంకు రుణాలను ప్రభుత్వమే చెల్లించాలి. కూల్చివేతలో ఇళ్లు కోల్పోయిన ఆ 42 కుటుంబాలకు తిరిగి ఇళ్లు కట్టించి ఇవ్వాలి’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. లేని పక్షంలో తమ ప్రభుత్వం రాగానే విచారణ జరిపించి ఈ ఘటనకు బాధ్యులను బోనులో నిలబెట్టి తీరుతామని హెచ్చరించారు.జోజినగర్ బాధితులకు పూర్తి అండగా నిలబడతామని, వారి న్యాయ పోరాటానికి పార్టీ తోడుగా ఉంటుందని ప్రకటించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం జోజినగర్‌లో పర్యటించి ఇళ్లు కోల్పోవడంతో రోడ్డున పడ్డ బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించారు. కోర్టు ఉత్తర్వులున్నప్పటికీ ఏకపక్షంగా తమ ఇళ్లను కూల్చివేశారని, ఎంత ప్రాథేయపడినా ఆలకించకుండా ఈ ప్రభుత్వం తమ బతుకులను రోడ్డు పాలు చేసిందని బాధిత కుటుంబాలు ఆక్రోశించాయి. వారికి న్యాయం జరిగేవరకు తోడుగా నిలిచి పోరాడతామని వైఎస్ జగన్ భరోసానిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..ప్రభుత్వ పెద్దల అండతోనే కూల్చివేతలు..విజయవాడ జోజినగర్‌లో 42 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారు 25 ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని నివసిస్తుంటే ఒక్కసారిగా వచ్చి ధ్వంసం చేశారు. ఈ స్థలం గురించి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం జరుగుతోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఆ 42 కుటుంబాలకు డిసెంబరు 31 వరకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఒకవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా, ఈనెల 31 వరకు ఊరట ఉండగానే.. ఒకేసారి 200 మందికి పైగా పోలీసులు వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ, ఈ 42 ఇళ్లకు సంబంధించిన వారిని నిర్దాక్షిణ్యంగా, వాళ్లు ఇళ్లలో ఉండగానే, ఇళ్లన్నీ పడగొట్టి రోడ్డున పడేశారు.ప్రభుత్వ పెద్దల ప్రమేయం, వారి సహకారం, ఆశీస్సులతోనే ఇదంతా జరిగింది. అందుకే ఇంత అకస్మాత్తుగా కూల్చివేశారు. ఈ నెలాఖరు వరకు గడువు ఉందని తెలిసి కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వారిని రోడ్డు పాల్జేశారు.ఫేక్ సొసైటీ ఏర్పాటు..ఇక్కడ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.150 కోట్లకు పైగానే ఉంది. దీంతో దీంట్లోకి ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు. 2016లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఓ ఫేక్ సొసైటీని పెట్టారు. 1981 డేట్‌తో ఒక తప్పుడు సొసైటీని ఏర్పాటు చేసి, రూ.150 కోట్ల స్థలాన్ని కాజేసేందుకు అడుగులు పడ్డాయి.వీరంతా చంద్రబాబు సన్నిహితులు. నారా లోకేశ్, ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్ సోదరుడికి కూడా ఇందులో ప్రమేయం ఉంది. ఇంతమంది కలిశారు. అధికార దుర్వినియోగం ఎలా ఉంటుందనేందుకు ఇది నిదర్శనం. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే, డిసెంబర్ 31 వరకు వెసులుబాటు ఉన్నా కూడా.. 200 మందికిపైగా పోలీసులు వచ్చి ఇంత మందిని రోడ్డు పాల్జేశారు.ఈ స్థలాలు వేరేవారివైతే.. అనుమతులన్నీ ఎలా ఇచ్చారు?ఈ 2.17 ఎకరాల స్థలంలో 2001కి ముందు నుంచి 25 ఏళ్లుగా వీరు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇందులో చాలా మంది ఇళ్లు కూడా కట్టుకున్నారు. వాటికి విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నుంచి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కూడా ఇచ్చారు. ఈ ఇళ్లకు కరెంటు, డ్రైనేజీ కనెక్షన్లు కూడా ఉన్నాయి. ఈ ఇళ్లకు ప్లాన్ అప్రూవల్ నుంచి అన్ని అనుమతులూ ఉన్నాయి. మరోవైపు బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చాయి.ఇక్కడున్న వారిలో చాలామంది రూ.20 లక్షలు, రూ.25 లక్షలకుపైగా లోన్లు కూడా తీసుకుని ఇళ్లు కట్టుకున్నారు. మరి ఇక్కడ స్థలాలు వేరేవారివైతే.. ఎలా అనుమతి ఇచ్చారు? ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? బిల్డింగ్ ప్లాన్ ఎలా అనుమతించారు? బ్యాంకులు లోన్లు ఎలా ఇచ్చాయి? వాటర్, పవర్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు? మరి ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు, అన్ని అనుమతులున్నా.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, న్యాయం చేయాలని కనీసం ఆలోచన చేయకుండా, ప్రైవేటు వ్యక్తులకు మద్దతు ఇస్తూ, పోలీసులు వచ్చి పొక్లెయిన్లు, బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి ఏకంగా బిల్డింగ్లు పగలగొట్టారు.గతంలో ఇక్కడ ఇళ్ల క్రయ విక్రయాలు జరిగినప్పుడు అభ్యంతరాలు ఉంటే చెప్పాలని పలు సందర్భాల్లో పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. కానీ ఎక్కడా, ఎవరి నుంచి అభ్యంతరాలు రాలేదు. ప్రైవేటు వ్యక్తులకు మేలు చేసేందుకు, రూ.150 కోట్లకుపైగా విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు.. చంద్రబాబు, ఆయన కుమారుడు, టీడీపీ ఎంపీ, జనసేన కార్పొరేటర్ సోదరుడు.. ఇంతమంది కలిసి ఒక్కటై పేదలను నిస్సహాయులుగా రోడ్ల మీద నిలబెట్టించారు.సీబీఐతో విచారణ జరిపించాలి..ఇక్కడే కాదు.. రాష్ట్రమంతా ఇదే కొనసాగుతోంది. ఎక్కడైనా చిన్న చిన్న లిటిగేషన్లు ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ఎంటర్ అవుతున్నారు. ల్యాండ్ కబ్జా చేస్తున్నారు. కొన్ని చోట్ల వారే స్వయంగా లిటిగేషన్లు పెట్టి కబ్జా చేస్తున్నారు. వీరే నిషేధిత జాబితాలో ఆస్తులను బలవంతంగా చేరుస్తున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్ సోదరుడు.. వీరంతా కలసి ఏ రకంగా కబ్జాలు చేయిస్తున్నారో ప్రజలకు తెలియాలి.ఇక్కడ 1981 డేట్ వేసి ఓ ఫేక్ సొసైటీని 2016లో ఏర్పాటు చేశారు. అది కూడా బయటకు రావాలి. ప్రభుత్వం పేదలకు అండగా ఉండాల్సింది పోయి వారికి వ్యతిరేకంగా అఫిడవిట్లు, పిటిషన్లు వేసింది. అందుకే మొత్తం వ్యవహారంపై విచారణ జరగాలి. వాస్తవాలు బయటకు రావాలి.ప్రభుత్వమే లోన్లు చెల్లించాలి.. ఇళ్లు కూడా కట్టించాలిఇక్కడ 25 ఏళ్ల నుంచి ఉంటున్నారు. వారికి బ్యాంక్ లోన్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇళ్లు లేవు. అందుకే ప్రభుత్వం ముందుకు రావాలి. వీరి బ్యాంక్ రుణాలు ప్రభుత్వమే కట్టాలి. వీరందరికి ఇక్కడ గానీ మరెక్కడైనా గానీ పక్కాగా ఇళ్లు కట్టించాలి.ఇది మీ జగనన్న మాట..!అయ్యా చంద్రబాబూ..! మీరు ఈ పని చేయకపోతే, రేపు మా ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తాం. దోషులను కోర్టు ముందు నిలబెడతాం. ఇక్కడి బాధితులందరికీ తోడుగా నిలబడతాం. బాధితులకు ఇది మీ జగనన్న మాట అని హామీ ఇస్తున్నా. సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ బాధితుల తరపున వాదించేందుకు వైఎస్సార్ సీపీ తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తాం.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, రుహూల్లా, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయకర్తలు మల్లాది విష్ణు, నల్లగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు పోతిన మహేష్, పూనూరు గౌతంరెడ్డి, ఆసిఫ్, జోగి రాజీవ్, రామిరెడ్డి, కొండారెడ్డి, సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆడపిల్లలకు పసుపు–కుంకుమ కింద ఇచ్చా మేం 2007లో ఇక్కడ 180 గజాల ప్లాట్ కొన్నాం. నా ఇద్దరు కుమార్తెలకు 2015లో పెళ్లిళ్లు చేశాం. ఆ ప్లాట్‌ను రెండు భాగాలు చేసి 2016లో నా కుమార్తెలకు పసుపు–కుంకుమ కింద ఇచ్చాను. ఇప్పుడేమో ఆ ప్లాట్ మాది కాదని రోడ్డుపాలు చేశారు. ఇద్దరు కుమార్తెలు మా పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. అల్లుళ్లు గొడవ చేస్తున్నారు. చాలా దారుణంగా మమ్మల్ని రోడ్డుపాలు చేశారు. అన్ని విధాలా అండగా ఉంటామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాకు భరోసా ఇచ్చారు.– కోడెబోయిన కోటేశ్వరమ్మప్రభుత్వమే మమ్మల్ని రోడ్డుపాలు చేసింది మేం అందరం డబ్బులు పెట్టి ప్లాట్లు కొనుగోలు చేశాం. అక్రమంగా ఆక్రమించుకుని ఉంటున్న స్థలాలు కాదు ఇవి. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. మేం కొన్న స్థలాలు 25 తర్వాత మావి కాదంటే... మేం ఏమి చేయాలి? ఏమీ అర్థంకావడం లేదు. మాకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే మమ్మల్ని రోడ్డుపాలు చేసింది. అధికారులు బలవంతంగా మా ఇళ్లు కూల్చేశారు. ఉన్నపళంగా రోడ్డుపాలు చేశారు. ఇంత దారుణం ఎక్కడా చూడలేదు.– విజయలక్ష్మిప్రైవేట్ వ్యక్తులకు కొమ్ముకాసిన ప్రభుత్వం మేం ఎన్నో ఏళ్లపాటు డబ్బులు కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాన్ని దౌర్జన్యంగా లాక్కున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఈ ప్రభుత్వం కొమ్ముకాసి మమ్మల్ని బజారున పడేసింది. ఇంత అడ్డగోలుగా మమ్మల్ని రోడ్డుపాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి పేదలంటే చిన్నచూపని అర్థమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చి మాకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. న్యాయ పోరాటానికి సహకారం అందిస్తామని, మాకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మాకు చాలా ధైర్యం వచ్చింది.– కె.అరుణరూ.25 లక్షలు బ్యాంక్ రుణం ఎలా కట్టాలి? కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని ఇక్కడ స్థలం కొన్నాం. కార్పొరేషన్ నుంచి ప్లాన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాం. ఇంటి నిర్మాణానికి బ్యాంకు నుంచి రూ.25 లక్షలు రుణం తీసుకున్నాం. ఇప్పుడేమో ఇంటిని దౌర్జన్యంగా కూల్చేశారు. మేం కొనుక్కున్న స్థలం మాదికాదంటున్నారు. బ్యాంక్ రుణం ఎలా కట్టాలి? మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులే మా ఇంటి నిర్మాణానికి ప్లాన్ ఇచ్చారు. ఆ ఇంటికి పన్ను కట్టించుకుంటున్నారు. అదే ప్రభుత్వ ఉద్యోగులైన పోలీసులు వచ్చి మమ్మల్ని రోడ్డుపాలు చేశారు. ఇంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంటే మేం ఎలా బతకాలి?.– డి.స్రవంతిఊరిలో పొలం అమ్మి ఇక్కడ స్థలం కొన్నాం సిటీలో స్థలం ఉంటే మా కుటుంబానికి ఆసరాగా ఉంటుందని భావించాం. 25 ఏళ్ల కిందట సొంతూరులో ఉన్న ఎకరం పొలం అమ్మి ఇక్కడ స్థలం కొన్నాం. మొత్తం 42 ప్లాట్లు కొనుగోలుచేసివారు పేదలు. రోజువారీ పనులు, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుని బతికేవాళ్లు. మేం అందరం కలిసి ఈ ప్రాంతంలో ఇళ్లు కట్టుకుని కాస్త అభివృద్ధి చేసుకున్నాం. చీమలు పుట్టలు పెడితే పాములు వచ్చి ఆక్రమించినట్లుగా సొసైటీ పేరుతో అక్రమంగా మా స్థలాలను ఆక్రమించారు. ప్రశ్నిస్తే కోర్టు తీర్పు అంటూ బెదిరిస్తున్నారు.– సుబ్బులులీగల్ సపోర్ట్ ఇస్తామని వైఎస్ జగన్ భరోసా కోర్టు తీర్పులో ఇళ్లు కూల్చి 42 ప్లాట్లను స్వా«దీనం చేసుకోవాలని ఎక్కడా పేర్కొనలేదు. ఈ నెలాఖరు వరకు కోర్టు గడువిచ్చింది. స్థానిక న్యాయస్థానాలు, హైకోర్టు ఇలా చాలాచోట్ల వాదోపవాదనలు జరిగాయి. అయితే బాధితులకు సరైన న్యాయం జరగలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల బాధితుల తరఫున న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించటానికి లీగర్ సపోర్ట్ ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. – వి.స్వప్న, న్యాయవాది -
బుల్డోజర్లతో మధ్యతరగతి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేశారు: వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: న్యాయస్థానంలో ఊరట ఉన్నప్పటికీ.. అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేసిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం భవానీపురం జోజి నగర్లో బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘25 ఏళ్లుగా 42 కుటుంబాలు ఇక్కడే ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఉంది. అయినా కూడా వీళ్ల ఇళ్లను ధ్వంసం చేశారు. సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ఈ నెల 31వ తేదీ వరకు సుప్రీం కోర్టు వీళ్లకు ఊరట ఇచ్చింది. పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతుగా ఈ కూల్చివేతలు జరిపారు. 200 మంది పోలీసులు ఈ కూల్చివేతలు జరిపారు. ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేసేందుకు ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఈ కూల్చివేతలు జరిగాయి. అధికార దుర్వినియోగం చేస్తూ ఇక్కడి వాళ్లను రోడ్డుపాలు చేశారు’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. .. 2.17 ఎకరాల ఈ భూమి విలువ రూ.150 కోట్ల దాకా ఉంటుంది. 2016లో ఫేక్ సొసైటీ క్రియేట్ చేశారు. అప్పటి నంచే ఈ భూమిని కాజేసేందుకు స్కెచ్ వేశారు. కూల్చివేతల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పేటర్ సోదరుడి ప్రమేయం కూడా ఉంది. బాధితులు చంద్రబాబును మూడుసార్లు కలిశారు. లోకేష్‌ను రెండు సార్లు కలిశారు. ఆ ఇద్దరికీ వినతి పత్రాలు ఇచ్చారు. అయినా కూడా కుట్రపూరితంగా.. చంద్రబాబు, లోకేష్, చిన్నిలు బాధితులకు అన్యాయం చేశారు. బుల్డోజర్లతో మధ్యతరగతి కుటుంబాలను విచ్ఛిన్నం చేశారు’’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్లకు అన్నిరకాల అనుమతులు కూడా ఉన్నాయి. బ్యాంకుల నుంచి లోన్లు కూడా వచ్చాయి. ఎన్నో ఏళ్లగా ఈఎంఐలు కూడా కడుతున్నారు. అయినా కూడా కుట్ర పన్ని కూల్చివేతలు జరిపారు. స్థలం వేరొకరిదే అయితే రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు?. ఇళ్లకు ఎలా అనుమతులు ఇచ్చారు?.. బ్యాంకు లోన్లు ఎలా వచ్చాయి?.. క్రయవిక్రయాలపై పేపర్లలలో కూడా ప్రకటనలు ఇచ్చారు. అలాంటప్పుడు ఆ సమయంలో ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదు? అని ప్రశ్నించారాయన. ఈ క్రమంలో ఇళ్ల కూల్చివేతలపై సీబీఐ విచారణ జరిపించాలని.. బాధితులకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వమే కేటాయించాలని.. వాళ్ల బ్యాంకు లోన్లు కూడా ప్రభుత్వమే కట్టాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ‘‘బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. అవసరమైన న్యాయ సహకారం కూడా అందిస్తాం. ఒకవేళ మీరు ఎంక్వైరీ వేయకపోతే.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పని చేస్తుంది. దోషులుగా మిమ్మల్ని కోర్టు ముందు నిలబెడుతుంది’’ అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ హెచ్చరించారు. -
‘‘బాబుగోరు.. మీరు గుడ్డో గుడ్డూ’’
ఏది ఏమైనా బాబుగోరు మీరన్నా...మీ పాలన అన్నా చెవి కోసుకుంటా. అసలు మీలా పాలించేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? నాకైతే డౌటనుమానమే. గత ఎన్నికల్లో మీరు గొప్ప మనసు చేస్కొని మమ్మల్ని మీతో కలవనివ్వబట్టే కదా ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టా ...సెంటర్ లో మన సర్కారు నిలబెట్టా. మేం కూటమి అంటున్నామే కానీ అదంతా మీ చలవ కాకపోతే మరేందనుకుంటున్నారు. మీరు మాతో జట్టుకట్టబట్టే కదా ఈ పుణ్యం పురుషార్థం మాకు దక్కింది. అయినా బాబుగోరు మీ గొప్పతనం మీకు తెల్వదు... ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడికక్కెడికో తీసుకెళ్లి పోతున్నారంటే నిజం నన్ను నమ్మండి..అసలు మీకున్న విజను...మీకున్న లిజను ఎవరికుంది చెప్పండి? కానీ విజన్ లేని వారికి ఏం తెలిసొస్తుంది చెప్పండి. ఒక్కోసారి వీరంతా ఎందుకొచ్చారా రాజకీయాల్లోకి అనిపించేస్తుందంటే నమ్మండి సుమండీ. అయినా కోటిజన్మల పుణ్యఫలం వల్లే కదా మీ స్నేహం మాకు దక్కింది. మీరాదరి మేమీ దరిని ఉన్నా....చెగువీరాను పూనిన ఆ అద్భుత వ్యక్తే కదా మనల్ని కలిపింది..లేదంటే మేమెంత ఒంటరి పక్షులమైపోయేవాళ్ళమో తలచుకుంటేనే గుండె తరుక్కుపోతుందంటే నమ్మండి సుమండి..అయినా ఎవరెవరో ఏదో అంటుంటారు...మనం అదంతా పట్టించుకోరాదు బాబుగోరు. అలా పట్టించుకుంటే రాజకీయాల్లో ఉండగలమా? అయినా నా చాదస్తం గానీ మీకు ఇవన్నీ కొట్టినపిండేగా. నిజమే అప్పుడెప్పుడో పాత ఎన్నికలప్పుడు మమ్మల్ని మీరు మనసారా దూషించారు. కానీ మీ తిట్లే మాకు దీవెనలని అనుకోలేదూ..అయినా బాబుగోరు మమ్మల్ని మీరు అప్పుడెంత దూషించారో...ఆ క్షణాన కాస్త కోపం వచ్చినా...మళ్ళీ మాతో కలవాలని మీరు పదే పదే కలవరించారు చూడండీ...అదీ మీ గొప్పతనం. మన మధ్య స్నేహబంధం నాగార్జునా సిమెంట్ కన్నా దృఢమైంది. కాకుంటే ఇన్నిసార్లు మీరు ఇన్నేసి మాటలన్నా...మళ్ళీ లటుక్కున వచ్చి మమ్మల్ని అతుక్కుపోయారు చూడండి...అబ్బబ్బా ఏమన్నా పొలిటికల్ విజనా మీది. .ఇక మీ సైనికుని గురించి ఏం చెప్పమంటారు...ఎంతని చెప్పమంటారు? ఇపుడు వారు మాకూ ఆంతరంగికులై పోయారు. అసలు వారిని మీరు బలే తయారు చేశారు బాబుగోరు. ఏ ఇజాలు తెలీకపోయినా...నిజాలు రాకపోయినా పర్వాలేదు పైకి మాత్రం గంభీరంగా ఎస్వీరంగారావులాగా తలూపుకొంటూ తిరుగుతుండాలి. ఆయన అచ్చం అలానే చేస్తున్నారాయే. మమ్మల్ని కలవక ముందు చెగువీరా అన్నారా...ఎర్రెర్రని జెండా ఎన్నీయల్లో... అని పాటలు కూడా పాడేశారా...ఇపుడు చూడండి నుదుటిపై ఇంతేసి బొట్టు పెట్టుకుని , కాషాయం చుట్టుకుని...నా ధర్మం...నేచూస్తా...నే కాస్తా అంటూ ఎర్రజెండా పట్టుకున్నోరిలా రంకెలు వేస్తున్నారు. అసలు మీ ట్రైనింగ్ ఇక్కడే కనిపిస్తోంది. నేను మారాను అని చెప్పకుండానే చేసి చూపిస్తున్నారు. జనాలు ఎలాగూ నమ్మరనుకోండి ...అది మా సిలబస్ కాదు కదా. చూశారా ఇదీ కదా సేవ..సారీ స్నేహధర్మమంటే..గత ఎన్నికల్లో మీతో కలిసి వెళ్ళడం నా పూర్వజన్మ సుకృతం అని అన్నానని బలే ప్రచారంలో పెట్టారు బాబుగోరు. అయినా అన్నామో లేదో ఆ పెరుమాళ్లకే ఎరుక...దాందేముంది లేండి...ఆ ప్రచారం వల్ల మీరు కుషీ అయితే అదే పదివేలు. గిట్టని వారు అది అబద్దమంటారని పీల్ కాకండి బాబుగోరు. మనం మనం బాగుంటే చాలు కదా...ఏదో మీ తృప్తి కోసం అలా అన్నారే అనుకోండి...మరీ అంత ప్రచారంలో పెడితే ఎలా? వదిలేయండి బాబుగోరు...మీ విజన్ కు అది ఆనదు గాక ఆనదు. అదేదో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మెడికల్ కళాశాలలు ప్రైవేటు వద్దంటూ కోటి సంతకాలు చేయిస్తున్నారటగా... నిరసనలు కూడా చేస్తున్నారటగా...జనాలూ వస్తున్నారటగా...ఆ మీరు బెదరుతారా ఏంది? అయినా ప్రైవేటైజేషన్ అంటే మీకు ఎంత ప్రేమో మాకు తెలీదా ఏంటి? మేం కూడా విశాఖ ఉక్కును ఎవరికైనా అప్పగిద్దామనే కదా అనుకుంటున్నది....కానీ గట్టిగా అనరాదు వేరెవరూ వినరాదు...మన సర్కారుకు ఇంకా బోల్డంత టైముంది ఇంకా చేయాల్సింది చాలా చాలా ఉంది...ఇదే కదా బాబుగోరు మీ మనసులో మాట....అరే మా మనసులోనూ ఇదే. కానీయండి అలా ముందుకెళదాం..సివారఖరికి మేము చెప్పొచ్చేదేంటంటే.. ప్రతిపక్షాలు కదా కాస్త ఘాటుగానే వ్యవహరిస్తుంటాయి. కానీ మనం కూడా తక్కువేం కాదుగా అంతకంతకు నాటుగానే ఉంటున్నాం. మీరు మాత్రం తగ్గేదేలా అన్నట్లుండండి. విజన్ అంటూ ఊదరగొట్టండి. అసలు జనాలు మీరు ఏం చెబుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం చేసుకోలేక బిక్కమొగం వేసుకోవాలి. వారు తేరుకునేలోగా మన పుణ్యకాలం ఎలాగూ పూర్తయిపోతుంది. మరి ఆతర్వాతో అంటారా...సినబాబు చూసుకుంటారు లెండి. మన ప్యూచరేంటి అంటారా? నందో రాజో భవిష్యతి అనుకుని గ్లాసు నీళ్లు గటగటా తాగేయడమే. సరే మరి నేనుంటా మీరలాగే ముందుకు వెళ్ళిపోతూనే ఉండండేం.. పొరపాటున కూడా ఆగకండి.::ఆర్ఎం -
జోజి నగర్ బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, విజయవాడ: భవానీపురం జోజి నగర్లో ఇళ్ల కోల్పోయిన బాధిత కుటుంబాలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు తమ గోడును ఆయనకు చెప్పుకున్నాయి. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు కూల్చివేతలకు సంబంధించిన ఫొటోలను ఆయనకు చూపించాయి. ‘‘25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. మావన్నీ కూడా పట్టా భూములే. అన్ని అనుమతులున్నాయి. వాటర్, కరెంట్ బిల్లులు కడుతూ వచ్చాం. మా ఇళ్లను అన్యాయంగా కూల్చేశారు. మమ్మల్ని రోడ్డున పడేశారు..’’ అని జగన్ వద్ద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితులతో.. ‘‘అధైర్య పడొద్దని.. అండగా ఉంటామని.. అన్నివిధాల అవసరమైన సాయం అందిస్తామని’’ అని ఆయన భరోసా ఇచ్చారు. జగన్ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలం నెలకొంది. ఆయన్ని చూసేందుకు.. ఫొటోలు తీసేందుకు.. సెల్ఫీలు దిగేందుకు.. కరచలనం చేసేందుకు.. భారీగా జనం తరలివచ్చారు.ఈ నెల 3వ తేదీన విజయవాడ భవానీపురం జోజి నగర్లో 42 ఇళ్లను కూల్చేశారు అధికారులు. తమ ఇళ్లను కోల్పోయి రోడ్డునపడ్డ బాధితులు ప్రభుత్వ పెద్దలకు కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వైఎస్ జగన్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని దృష్టికి తీసుకెళ్లారు. బాధితులు కంటతడి పెట్టగా.. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని, అవసరమైన న్యాయ సహయం అందిస్తానని ఆయన వాళ్లకు మాటిచ్చారు. ఈ క్రమంలో.. ఇవాళ స్వయంగా ఆయన జోజినగర్ వెళ్లి బాధితులతో కలిసి కూల్చివేత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే.. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ప్రొద్భలంతోనే కూల్చివేతలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూల్చివేతల సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కోర్టు ఆదేశాలున్నాయని చెబుతూ బలవంతంగా వాళ్లను పక్కకు లాగిపడేసి కూల్చివేతలు జరిపారు. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నామని.. పాతికేళ్లుగా ఏళ్లుగా నివాసముంటున్నామని.. ఇప్పుడు నిర్ధాక్షణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని పలువురు ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన కోటి సంతకాల ర్యాలీ. కోటి మంది చేసిన సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు
-
పత్తాలేని పట్టాదారు పాస్ పుస్తకాలు.. ఏడాది నుంచి జారీ నిలిపివేసిన చంద్రబాబు సర్కారు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు రైతులు విలవిల్లాడుతున్నారు. గత ప్రభుత్వంపై అక్కసుతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీని నిలిపివేయడంతో గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వాటిపై అప్పటి సీఎం జగన్ ఫొటో ఉందనే కారణంతో ఏడాదిగా పాస్ పుస్తకాల జారీని నిలిపివేసింది. గత ప్రభుత్వంఇచ్చిన లక్షలాది పట్టాదార్ పుస్తకాలను వెనక్కి తీసు కుని కొత్తవి ఇస్తామని చెప్పినా ఇప్పటివరకూ ఆ పని చేయలేకపోయింది. పాస్ పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకు రుణాలు తీసుకునేందుకు రైతులు ఇబ్బందులుపడుతున్నారు. ఎందుకంటే.. భూమి ఉందని నిరూపించుకునే ఏకైక ఆధారం ఈ పాస్ పుస్తకమే. జగన్ హయాంలో క్యూఆర్ కోడ్‌తో జారీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని ఎనిమిది వేల గ్రామాల్లో భూముల రీసర్వేను పూర్తిచేసి సంబంధిత రైతులకు క్యూఆర్ కోడ్‌తో రైతులకు పాస్ పుస్తకాలు అందజేసింది. ప్రతీ రైతుకి ఆధార్ నంబర్ తరహాలో ఒక యూనిక్ ఐడీని కేటాయించింది. రికార్డుల్లోగానీ, భూమిపైగానీ ఎటువంటి ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా భూవివాదాలకు శాశ్వతంగా చరమగీతం పాడేలా చర్యలు తీసుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ సర్వే విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్ల రాయితీ కూడా ప్రకటించింది. అయితే, వైఎస్ జగన్ హయాంలో జరిగిన భూ సంస్కరణలను వ్యతిరేకించి అభాండాలు మోపిన చంద్రబాబు ప్రభుత్వం ఆ రాయితీ సొమ్ము ఇటీవలే స్వీకరించడం విశేషం. వెనక్కి తీసుకుని కొత్తవి ఇవ్వలేదు.. మరోవైపు.. గత ప్రభుత్వం చేసిన రీసర్వేపై చంద్రబాబు బ్యాచ్ అభాండాలు మోపినా దానిని కొనసాగించక తప్పలేదు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఉందనే కారణంతో ఎనిమిది వేల గ్రామాల్లో సర్వే పూర్తయినా భూములకు సంబంధించిన పుస్తకాలను రైతులకు పంచలేదు. పంచిన వాటిని కూడా వీఆర్ఓల ద్వారా వెనక్కి తీసుకుంది. వాటి స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కొత్తవి ఇస్తామని ప్రకటించి ఏడాది దాటిపోయింది. ఇందుకోసం రూ.15 కోట్లతో టెండర్ పిలిచింది. చెన్నైకి చెందిన కంపెనీకి టెండరు ఖరారుచేసి పనులు అప్పగించింది. అయితే, ఈ ముద్రణలో చాలా లోపాలు చోటుచేసుకున్నాయి. తొలి విడతలో కొన్ని పుస్తకాలు ముద్రించగా వాటిలో అన్నీ తప్పుల తడకలేనని అధికారులు వాపోతున్నారు. పేర్లు, సర్వే నంబర్లు వంటివన్నీ మారిపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. వాటిని పంచకుండా ఇంకా ముద్రణ పూర్తికాలేదని చెబుతున్నారు. రైతులు తమకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని పదేపదే అడుగుతున్నా వారిని రేపు, మాపు అంటూ చంద్రబాబు ప్రభుత్వం తిప్పుతూనే ఉంది. తహశీల్దార్లు కూడా పాస్ పుస్తకాలు ఎప్పుడు వస్తాయో తమకు తెలీదని చేతులెత్తేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా దీనిపై సరిగ్గా సమాధానం చెప్పకుండా త్వరలో ప్రింటింగ్ పూర్తవుతుందని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇటీవలే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాస్ పుస్తకాల ముద్రణకు పిలిచిన టెండర్లలో ఏర్పడిన సమస్యవల్ల ఇబ్బంది ఏర్పడిందని చావు కబురు చల్లగా చెప్పారు. అంటే.. ఇప్పట్లో పాస్ పుస్తకాలు వచ్చే అవకాశం లేదు. రైతుల అగచాట్లు.. పాస్ పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలేదు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే నంబర్ల స్థానంలో ఎల్పీఎం నంబర్లు కేటాయించారు. ఈ నంబర్లు ఉన్న పాస్ పుస్తకాలు లేకపోవడంతో భూముల అమ్మకాలు కూడా జరగడంలేదు. రెవెన్యూ రికార్డుల్లో పేరు ఉన్నా పాస్ పుస్తకాలు లేవనే భయంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేస్తే అడంగల్‌లో పేరు మారుతుంది తప్ప పుస్తకం రావడంలేదు. మరోవైపు.. రీ సర్వే జరగని గ్రామాల్లోనూ పాస్ పుస్తకాల జారీ కావడంలేదు. దీంతో.. రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేయడంపై గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
‘ఇది కదా ప్రజా ఉద్యమం అంటే..!’
చంద్రబాబు సర్కార్ తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.. ప్రజా పోరాటంగా మారిన తీరు యావత్ దేశాన్నే ఆశ్చర్యపరుస్తోంది. వైఎస్సార్సీపీ ఈ ఉద్యమాన్ని “ప్రజా గళం”గా అభివర్ణించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పొచ్చు. అందుకు కారణం.. విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొనడమే!.. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంకల్పించారు. అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారు. తాను అధికారంలో ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు కూడా. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్‌ను నాశనం చేయాలని బలంగా నిర్ణయించింది. స్వతహాగానే పెత్తందారుల సీఎం అయిన చంద్రబాబు.. పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ఆ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్ జగన్ భావించారు. ఒక పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగానే.. కోటి సంతకాల సేకరణ ఉద్యమం “రచ్చబండ” కార్యక్రమం నుంచి మొదలై.. నియోజకవర్గాలు నుంచి ఇవాళ జిల్లా కేంద్రాలు దాటింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైనే సంతకాలు సేకరించి.. వాటిని ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయానికి తరలించింది. వీటిని రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్‌కు నివేదించి.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలన్నదే వైఎస్ జగన్ అభిమతం. రచ్చబండతో షురూ ..అక్టోబర్‌లో వైఎస్సార్సీపీ “రచ్చబండ” పేరుతో ప్రజల మధ్యకు వెళ్లి సంతకాల సేకరణ ప్రారంభించింది. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొని సంతకాలు చేశారు.తుపాను ఆపలేకపోయింది!లక్ష్యం కోటి సంతకాలు. ఆ సమయంలోనే తుపాను, వర్షాలు వచ్చాయి. దీంతో ఈ కార్యక్రమం ప్లాప్ అవుతుందని కూటమి సర్కార్ సంతోషించింది. కానీ, ప్రభుత్వ వ్యతిరేక ప్రజాభిప్రాయం సేకరణ ఏ దశలోనూ ఆగిపోలేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనం సంతకాలు చేస్తూనే వచ్చారు. ఆపై ఈ ప్రజా ఉద్యమం నవంబర్‌కొచ్చేసరికి నియోజకవర్గాల స్థాయికి చేరింది. ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. అటుపై సంతకాల బాక్సులు సేకరించి.. నియోజకవర్గాల నుంచి ర్యాలీగా జిల్లా కేంద్రాలకు తరలించారు. ఆ ర్యాలీలకు అనూహ స్పందన లభించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసించాలి అంటూ ఆ ర్యాలీల్లో నినాదాలు చేశారు. డిసెంబర్ మొదటి వారం కల్లా అన్ని నియోజకవర్గాల నుంచి ఆ బాక్సులను భద్రంగా జిల్లా కేంద్రాల్లోని పార్టీ ఆఫీసులకు తరలించారు. అక్కడి నుంచి ఇవాళ ర్యాలీగా తాడేపల్లికి తరలించారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ఈ ఉద్యమం.. తమ ఆరోగ్యం, విద్యా హక్కుల పరిరక్షణ కోసమని జనం అర్థం చేసుకున్నారు. అందుకే ఇవాళ్టి(సోమవారం) ర్యాలీలో పార్టీ శ్రేణులకు పోటీగా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యం వల్లే ఇది ఒక విశాలమైన ఇప్పుడు ప్రజా ఉద్యమంగా నిలిచి దేశం దృష్టిని ఆకర్షించగలిగింది. -
సుప్రీం కోర్టులో కూటమి సర్కార్‌కు మరో ఎదురు దెబ్బ
సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో కూటమి ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త తారక్ ప్రతాప్ రెడ్డికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది. తక్షణమే విడుదల చేయాలంటూ జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ అగస్టీన్ జార్జిలతో కూడిన ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే అణచివేత ధోరణిని కూటమి ప్రదర్శించడం చూస్తున్నదే. ఈ క్రమంలోనే యూరియా కొరతపై తారక్ ప్రతాప్ రెడ్డి ఓ పోస్ట్ చేశారు. ఈ పరిణామంలో రగిలిపోయిన ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించింది. తారక్‌ను అక్రమ అరెస్ట్ చేయించింది. తారక్ తరఫున సుప్రీం కోర్టులో సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ‘‘యూనిఫాంలో కాకుండా మఫ్టీలో వైఎస్ఆర్సిపీ సోషల్ మీడియా కార్యకర్తలను కిడ్నాప్ చేస్తున్నారని.. ప్రభుత్వ దమనకాండపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని’’ వాదించారు. సోషల్ మీడియాను అణగదొక్కేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తుందో కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ద్విసభ్య ధర్మాసనం.. తారక్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. -
ఆయనేమన్నారో.. వీళ్లేం విన్నారో?
ఆంధ్రప్రదేశ్ గురించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసినట్టుగా చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇవి ఆయన చేసినవేనా? లేక బీజేపీలోని టీడీపీ విధేయ ఎంపీలెవరైనా కావాలని అలా రాయించారా? 2024 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి వెళ్లడం మంచిదైందని, ఏపీలో పాలనపై మంచి ఫీడ్‌బ్యాక్ వస్తోందని మోదీ వ్యాఖ్యానించినట్లు ఎల్లోమీడియాలో వార్తలొచ్చాయి. ఆయన ఏ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారో? ఏది బాగుందన్నారో? ఎవరకీ తెలియదు.. బహుశా, ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు మాత్రమే అర్థమైఉంటాయి. ఏదో సాధారణంగా అన్నమాటలను చంద్రబాబుకు మరిన్ని భుజకీర్తులు తొడగవచ్చు అని ఈ రెండు పత్రికలు అనుకుని ఉండవచ్చు. ప్రధానమంత్రి కార్యాలయానికి రాష్ట్రాల సమాచారం రాకుండా ఉంటుందా? అలాంటిది ఏపీలో ఏమి జరుగుతుందో తెలియకుండానే గుడ్డిగా ప్రశంసిస్తారా?.. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును మోదీ ఎలా విమర్శించింది, వారసత్వ రాజకీయాల గురించి ఎలా ధ్వజమెత్తింది, చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై ఎన్ని ఆరోపణలు చేసింది అందరికి తెలిసిన విషయమే కదా!. అలాగే చంద్రబాబు కూడా ప్రధాని అని కూడా చూడకుండా మోదీని దారుణమైన విమర్శలు చేశారు. ఓటమి తర్వాత వ్యూహాత్మకంగా టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపించి ఆ పార్టీని మేనేజ్ చేసే పని మొదలుపెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ముందుగా బీజేపీతో జత కట్టించారు. ఒక సందర్భంలో బీజేపీకి టీడీసీ కలవడం ఇష్టం లేదని, తాను తిట్లు తిన్నానని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు కూడా. అప్పట్లో సీబీటీడీ చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి ఇంటిలో సోదాలు జరిపి రూ.2,000 కోట్ల మేరకు జరిగాయని ప్రకటించింది. ఆ తరువాత ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియకుండా పోయింది. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు మోదీ, అమిత్‌షాల అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో ఎదురుచూసిన సందర్భాలు కూడా మనం చూశాం. ఆ తరువాత ఏం చేశారో తెలియదు కానీ.. బీజేపీతో పొత్తు అయితే కొదిరింది. ఈ నేపథ్యం మొత్తానఇన పరిగణలోకి తీసుకుంటే.. మోదీ ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు మంచిదని అన్నాడంటే నమ్మడం కష్టమే. అది మంచి, చెడు కాదు. అవకాశవాద రాజకీయ పరిణామం అని మోదీకి కూడా తెలిసే ఉంటుంది. ఆ సంగతి పక్కనబెడితే గత పద్దెనిమిది నెలలుగా ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అధ్వాన్నపు, అరాచకపు పాలనకు మోదీ సర్టిఫికెట్ ఇచ్చి ఉంటే అంతకన్నా ఘోరం లేదు. ఫీడ్‌బ్యాక్ అంత బాగుంటే.. ఏపీలో పోలీసు వ్యవస్థ పనితీరుపై కేంద్రం చిట్టచివరి ర్యాంకు ఎలా ఇచ్చింది? రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ఏపీలో పోలీసు వ్యవస్థను ఇంతగా దిగజార్చిన ప్రభుత్వం ఇంకో చోట ఉండకపోవచ్చు. తమ పార్టీ వ్యతిరేకమని పలుమార్లు ప్రకటించిన మోదీకి ఏపీలో టీడీపీ, జనసేనలు ప్రజాస్వామ్య పార్టీలుగా కనిపిస్తున్నాయా? లోకేశ్‌ను వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగా గుర్తించే ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారా? మోదీ సైతం డబుల్ స్టాండర్స్ అనుసరిస్తున్న తీరు బాధ కలిగిస్తుంది. ఏపీ ప్రభుత్వ పనితీరు గురించి చూస్తే ఈ ఏడాదిన్నరలో ఏకంగా రూ.2.60 లక్షల కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించడాన్ని మోదీ సమర్థిస్తారా? ఇదే చంద్రబాబు సమర్థత అని అనుకుంటున్నారా? తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై మోదీ పెదవి విరిచారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరీ తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయని అడిగారట. ఏపీలో మాత్రం పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారట.అసలు ఏపీలో బీజేపీ ఉనికి ఉందా? టీడీపీనే మొత్తం డామినేట్ చేస్తోంది కదా? మోదీకి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే బీజేపీలోని టీడీపీ కోవర్టులు ఎప్పటికప్పుడు చంద్రబాబు తరపున కేంద్రంలోని పెద్దలను మేనేజ్ చేస్తుంటారేమో తెలియదు. తెలంగాణ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గంటల కొద్ది భేటీ అవడాన్ని తప్పుపట్టారట..బాగానే ఉంది. మరి తెలంగాణ ఉప ఎన్నికలో తన మిత్రపక్షమైన తెలుగుదేశం బీజేపీ అభ్యర్ధికి ఎందుకు మద్దతు ప్రకటించలేదు? పైగా కాంగ్రెస్ కు సపోర్టు చేసినా బీజేపీ కేంద్ర నాయకత్వం ఎందుకు కిమ్మనలేదు? దీనిపై మోదీకి ఎవరూ ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదా? చంద్రబాబు ,పవన్ కళ్యాణ్, లోకేశ్ లు ఇక్కడ ఎందుకు ప్రచారం చేయలేదు? ఇదేనా ఎన్డీయే పక్షాల తీరు! ఏపీలో జగన్‌ను, వైసీపీ సోషల్ మీడియాను ధీటుగా ఎదుర్కోవాలని చెప్పారని కూడా రాయించారు. అంటే వైఎస్సార్సీపీ అంత బలంగా ఉందని మోదీ భావిస్తున్నట్లే కదా! లేదంటే ఒరిజినల్ బీజేపీ వారు కూడా వైఎస్సార్సీపీపై తప్పుడు ఆరోపణలు చేయాలన్న లక్ష్యంతో ఇలా కథ అల్లి ఉండవచ్చన్న సందేహం ఉంది. ఏపీలో టీడీపీ, జనసేనలు సంయుక్తంగా విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికను బీజేపీ తనదని చెప్పలేకపోయింది. అయినా ప్రభుత్వంలో చేరిన తర్వాత ఆ హామీలకు బీజేపీ కూడా ఒప్పుకున్నట్లే కదా! వాటి అమలు తీరు తెన్నుల గురించి, ప్రధాని ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని ఉంటే బాగుండేది కదా! అప్పుడు వాస్తవాలు తెలిసేవి కదా! ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిపోయిందని ఎల్లో మీడియానే ఆయా సందర్భాలలో కథనాలు ఇచ్చింది.అంతదాకా ఎందుకు మోదీ వ్యాఖ్యల కథనం వచ్చిన రోజునే పరిశీలిస్తే వివిధ పత్రికలలో వచ్చిన వార్తల సారాంశం కనుక ప్రధాని దృష్టికి వెళితే ఏపీలో కూటమి ఎంత అధ్వాన్నంగా ఉన్నది తెలుసుకోవడం కష్టం కాదు.ఎపి ప్రభుత్వం విద్యార్ధులకు ఇచ్చిన బాగ్ లు రెండు నెలల్లోనే చిరిగిపోయాయి. రెవెన్యూ శాఖలో గందరగోళంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్వయంగా చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు తనపై ఉన్న పలు అవినీతి కేసులను, మాఫీ చేయించుకుంటున్న తీరు అందరిని విస్తుపోయేలా చేస్తోంది. తాజాగా ఫైబర్ నెట్ అవినీతి కేసును కూడా సిఐడి ని ప్రభావితం చేసి మూసివేయించుకున్నారు. ఇది ఏ మేర నైతికతో ప్రధాని చెప్పగలరా? మిత్రపక్షం కాకుండా ఉంటే టీడీపీపైన, చంద్రబాబుపైన మోదీ తదితర బీజేపీ నేతలు ఎంతగా విరుచుకుపడేవారో! చంద్రబాబు తన టూర్ లకు వాడే హెలికాఫ్టర్, విమానం అద్దె ఛార్జీల చెల్లింపునకు నలభైకోట్లకు పైగా ఇప్పటికే ఖర్చు చేశారట. నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ లో తిరిగి చేరిన కార్పొరేటర్ ను పోలీసులే కిడ్పాన్ చేశారని వార్తలు వచ్చాయి. విజయవాడలో సుప్రీంకోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండానే పోలీసుల సమక్షంలో 42 ఇళ్లు కూల్చిన దారుణ ఘటన జరిగింది. ఆ బాధితులు మాజీ సీఎం జగన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అమరావతిలో రాజధాని అభివృద్ది సంస్థే చెరువులను చెరబట్టి రైతులకు వాటిలో ప్లాట్లు ఇస్తోందన్న స్టోరీ వచ్చింది.దీనిపై రైతులు మండిపడుతున్నారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై అక్రమ కేసు పెట్టిన నేపథ్యంలో సుప్రీం కోర్టు సూచన మేరకు వారు లొంగిపోవడానికి కోర్టుకు వెళుతుంటే పోలీసులు ఎంత నిర్భంధ కాండ అమలు చేశారో ఆశ్చర్యంగా ఉంటుంది. ఏపీలో గంజాయి వ్యాసారం సాగుతున్న తీరు అందరిని కలవర పరుస్తోంది.కుల వివాదంగా మారిన ఒక హత్య కేసులో భారీ పరిహారం ప్రకటించిన కూటమి ప్రభుత్వం, నెల్లూరులో గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు హత్యకు గురైతే కనీసం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రం గంజాయి హబ్‌గా మారుతోందనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అవసరమా? ఒకవైపు పోలీసుల దౌర్జన్యాలు, మరో వైపు టీడీపీ నేతల దాష్టికాలతో ఏపీ అంతటా అరాచకం ప్రబలుతుంటే మోదీకి ఈ పాలన ఎలా బాగుందో, ఆయనకు ఎవరు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారో తెలియదు. కేంద్రం నుంచి మోంథా తుపాను సహాయనిధిగా రూ.544 కోట్ల వస్తే ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదని సోషల్ మీడియాలో కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేతంచర్లలో ఒక లిక్కర్ షాపు యజమాని ఎక్సైజ్ అధికారులు అడిగినంత మామూళ్లు ఇవ్వలేక ఏకంగా షాపునే మూసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎల్లో మీడియాలో కూడా కొన్ని కథనాలు వచ్చాయి. రవాణా మంత్రి రామ ప్రసాదరెడ్డి పేషీ లో అవినీతి గురించి ఎల్లోమీడియాకు చెందిన ఒక పత్రిక వార్త ఇచ్చింది.రాష్ట్రంలో ప్రతినెల మొదటి తేదీన అందరికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. రెవెన్యూ లోటు నిపుణులను భయపెడుతోంది. విశాఖ వంటి ప్రతిష్టాత్మక నగరంలో 99 పైసలకే కొన్ని పరిశ్రమలకు భూములు ఇవ్వడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. లూలూ గ్రూప్‌కు విజయవాడలో వందల కోట్ల విలువైన ఆర్టీసీ భూమిని కట్టబెట్టడంపై జనం మండిపడుతున్నారు.ఇలా ఏ రంగం గురించి చూసినా పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. వీటిని కవర్ చేయడానికి మత రాజకీయాలు చేయడానికి పవన్ కళ్యాణ్ ను టీడీపీ ఆపరేట్ చేస్తోందన్న అభిప్రాయం ఉంది. వైఎస్సార్సీపీని బదనాం చేయాలన్న దురుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్టపాలు చేయడానికి టీడీపీ, జనసేనలు వెనుకాడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోదీకి ఏపీ ప్రజలపై ఏ మాత్రం అభిమానం ఉన్నా, వాస్తవికమైన ప్రజాభిప్రాయాన్ని సేకరించి తదనుగుణంగా చంద్రబాబు సర్కార్ కు సరైన సలహాలు ఇవ్వగలిగితే అంతా సంతోషిస్తారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కోటి సంతకాలు.. కోట్ల గళాలు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాగ్రహం.. వైఎస్సార్సీపీ పోరాటం.. తుది అంకానికి చేరుకున్నాయి.. -
ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టే్ట్ రివర్స్... భారీగా క్షీణించిన స్థిరాస్తుల క్రయవిక్రయాలు, అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలు
-
'రియల్'.. సీన్ రివర్స్!
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి విజయవాడ, నెట్వర్క్: అభివృద్ధికి చిరునామా..! మంచి ప్రభుత్వం..! విజనరీ పాలన..! సంపద సృష్టిస్తానంటూ అంటూ నమ్మబలికిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వ్యవస్థలను దిగజారుస్తూ, అన్ని రంగాలను కుప్పకూలుస్తున్నారు. సంక్షేమం ఊసే పట్టించుకోకుండా.. అభివృద్ధి జాడే లేకుండా చేస్తున్నారు. ఒకవైపు పారిశ్రామిక విధానం ముసుగులో తమకు నచ్చినవారికి ఖరీదైన భూములను పప్పు బెల్లాల మాదిరిగా 99 పైసలకే కేటాయిస్తూ, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నీరుగార్చడంతో అవసరాలకు అమ్ముకోలేక రైతులు, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు, వ్యాపారులు అల్లాడుతున్నారు. రాజధాని ప్రాంతంలో సైతం ఇదే దుస్థితి నెలకొంది. వైఎస్సార్ సీపీ హయాంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా విజయవాడ, బందరులో జిల్లా కేంద్రాలు, పోర్టు, కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడంతో గుంటూరు నుంచి మచిలీపట్నం దాకా భూముల ధరలు బాగా పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగింది. ఇప్పుడు ఏడాదిన్నరగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. నెలకు పది రోజులు కూడా ఉపాధి దొరకటం లేదని కార్మికులు వాపోతున్నారు. ప్రధాన పట్టణాలు, నగరాల్లో పరిస్థితి తారుమారైంది. రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలైన సిమెంట్, ఐరన్, శానిటేషన్, ఎలక్ట్రికల్, పెయింట్స్, ప్లంబింగ్ తదితరాల వ్యాపారం కుప్పకూలింది. విజయవాడ, తిరుపతి, నెల్లూరులో స్థిరాస్తి వ్యాపారులు అల్లాడుతున్నారు. రాజధానిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రచారం మినహా అభివృద్ధి జాడ లేకపోవడంతో ఏడాదిన్నరగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం రివర్స్‌లో ప్రయాణిస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ స్థిరాస్తి క్రయవిక్రయాల్లో మందగమనం కనిపిస్తోంది. రాష్ట్రం దూసుకుపోతోందంటూ ప్రభుత్వం చేస్తున్న హడావుడికి, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. చంద్రబాబు సర్కారు మాటలు నిజమైతే స్థిరాస్తి మార్కెట్ కళకళలాడాలి. రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం పెరగాలి. కానీ మార్కెట్ బేల చూపులు చూస్తోంది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గతంలో ఎన్నడూ లేనివిధంగా పడిపోవడమే ఇందుకు ఉదాహరణ. 2023–24లో రూ.12 వేల కోట్లుగా ఉన్న రిజి్రస్టేషన్ల టార్గెట్ తాజాగా 2025–26 ఏడాదిలో రూ.10,169 కోట్లకు తగ్గిపోవడం గమనార్హం. ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు టార్గెట్‌ను పెంచుకుంటూ వెళ్లి అందుకనుగుణంగా ఆదాయాన్ని సముపార్జిస్తాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం రివర్స్‌లో టార్గెట్‌ను తగ్గించుకుంటూ వెళుతోంది. తద్వారా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, స్థిరాస్తుల కొనుగోళ్లు జరగడం లేదని ప్రభుత్వమే అధికారికంగా నిర్థారించేసింది. 2023–24లో గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 22.25 లక్షల డాక్యుమెంట్ల రిజి్రస్టేషన్ జరగగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిలో అక్టోబర్ నాటికి 13.92 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ కావడం దిగజారిన పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. కాగా దివంగత వైఎస్సార్ హయాంలో గొల్లపూడి నుంచి రామవరప్పాడు రింగ్ వరకు ఇన్నర్ రింగు రోడ్డు నిర్మాణంతోపాటు బుడమేరుపై ఫ్లైఓవర్లతో విజయవాడ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ ఊపందుకుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. చిన అవుటపల్లి నుంచి వెస్ట్ బైపాస్ నిర్మాణ పనులను 2014–19 మధ్య టీడీపీ హయాంలో పట్టించుకోలేదు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిన అవుటపల్లి నుంచి వెస్ట్ బైపాస్ పనులను 96 శాతం మేర పూర్తి చేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నరకుపైగా అవుతున్నా మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తి చేయడంలో విఫలమైంది. రిజిస్ట్రేషన్ల టార్గెట్లు రివర్స్ చంద్రబాబు సర్కారు అస్తవ్యస్థ పాలన, విచ్చలవిడి అవినీతితోపాటు సంక్షేమ పథకాలు అందకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి స్థిరాస్తుల క్రయవిక్రయాలు ఊహించని విధంగా పడిపోయాయి. కనీసం వసూళ్ల లక్ష్యాన్ని కూడా సరిగా నిర్దేశించుకోలేని స్థాయికి రిజిస్ట్రేషన్ల ఆదాయం క్షీణించింది. ఎప్పుడో మూడేళ్ల క్రితం నిర్దేశించిన లక్ష్యం కంటే కూడా ప్రస్తుతం తక్కువ టార్గెట్ పెట్టుకోవడం ద్వారా స్థిరాస్తి క్రయవిక్రయాలపై చంద్రబాబు సర్కారు ఆశలు వదిలేసుకుంది. 2023–24 ఆరి్థక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ రూ.12 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుని రూ.9,546 కోట్లు రాబట్టింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ లక్ష్యాన్ని తగ్గించుకుంటూ వస్తుండడం గమనార్హం. 2024–25లో రూ.11,997 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకుని రూ.8,843 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. అంతకుముందు సంవత్సరం వచ్చి న ఆదాయాన్ని కూడా చంద్రబాబు సర్కారు తొలి ఏడాది సాధించలేకపోయింది. ఇక 2025–26లో లక్ష్యాన్ని రూ.10,169 కోట్లుగా పెట్టుకుని అక్టోబర్ నాటికి రిజి్రస్టేషన్ల ద్వారా రూ.7 వేల కోట్లు వసూలు చేయగలిగింది. వరుసగా రెండేళ్లపాటు లక్ష్యాన్ని తగ్గించుకోవడాన్ని బట్టి స్థిరాస్థి రంగంలో ఏమాత్రం వృద్ధి లేదని ఈ ప్రభుత్వమే బయటపెట్టింది. దీంతో తన హయాంలో పడిపోయిన ఆదాయాలనే కొలమానంగా తీసుకుని ప్రస్తుత ఆదాయాలను పోల్చుతుండడం విశేషం. ఆదాయాన్ని 2023–24 సంవత్సరంతో పోల్చకపోవడం, తక్కువ లక్ష్యాన్ని పెట్టుకుని దాంతో పోల్చడం ద్వారా ప్రజలను మభ్యపుచ్చేందుకు యత్నిస్తోంది. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రబాబు సర్కారు రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువను సగటున 50 శాతానికిపైగా పెంచింది. దీంతో ప్రజలపై భారం పడి రిజిస్ట్రేషన్ల సొమ్ము ఎక్కువగా కట్టాల్సి వస్తోంది. చార్జీలు పెంచడం ద్వారా ప్రజలను బాది ఆదాయాన్ని పెంచుకున్నా రిజి్రస్టేషన్లు మాత్రం అమాంతం తగ్గిపోవడం గమనార్హం. లేదంటే రిజిస్ట్రేషన్ల ఆదాయం ఇంకా భారీగా పడిపోయేదని స్పష్టంగా తెలుస్తోంది. రాజధానిలో ‘రియల్’ షాక్..! రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. రాజధానికి బడా కంపెనీలు, కార్యాలయాలు వచ్చేస్తున్నాయని చంద్రబాబు సర్కారు ప్రచారం చేస్తున్నా రియల్ వ్యాపారం మాత్రం పెరగడంలేదు. రాజధాని పరిసర ప్రాంతాల్లో కొత్త వెంచర్లు వేయడం తగ్గిపోయింది. ఇప్పటికే వేసిన వాటిలో స్థలాలు అమ్ముడు కావడంలేదు. అపార్టుమెంట్లలో ప్లాట్లు పరిస్థితి కూడా అలాగే ఉంది. స్థలాలు, ప్లాట్ల కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో వ్యాపారులు ఆందోళనలో మునిగిపోయారు. స్వయంగా చంద్రబాబు రాజధానిలోని వెలగపూడిలో ఇల్లు నిర్మించుకుంటున్నట్లు చెబుతున్నా అక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకోలేదు. రెండు, మూడు విడతల భూసమీకరణ ద్వారా మరింత భూమిని తీసుకుంటామని ప్రకటించడం, పూలింగ్‌కు భూములు ఇవ్వకపోతే బలవంతంగా భూసేకరణ చేస్తామని బెదిరిస్తుండటంతో రాజధానిలో పరిస్థితి ఆందోళనకరంగా మారిపోయింది. చంద్రబాబు సర్కారు భూదాహంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. పట్ణణాలు, నగరాల్లోనూ డీలాచంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాయలసీమను పట్టించుకోకపోవడం, ఆ ప్రాంతంలో పెట్టుబడులు రాకపోవడంతో రియల్ రంగం కుదేలైంది. వైఎస్ జగన్ హయాంలో సీమలో పరుగులు తీసిన రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఇప్పుడు కుదేలయ్యాయి. ప్రధానంగా తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లో భూముల అమ్మకాలు తగ్గిపోయాయి. స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధుల దందాలు, భూములపై పెత్తనం చేస్తుండడంతో కొనాలనుకున్న కొద్దిమంది కూడా జంకుతున్నారు. క్షీణించిన ప్రజల కొనుగోలు శక్తి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం లాంటి ప్రధాన నగరాల్లోనూ రియల్ వ్యాపారం మందకొడిగా ఉంది. నగరాల్లోనూ అమ్మకాలు లేవని వ్యాపారులు చెబుతున్నారు. విజయవాడ–మచిలీపట్నం రహదారికి ఇరువైపులా గతంలో కళకళలాడిన వ్యాపారం ఇప్పుడు పడిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడం, ఈ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, కార్పొరేట్ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని చంద్రబాబు ప్రభుత్వం బడాయి పోతున్నా భూముల కొనుగోళ్లు మాత్రం లేకపోవడం గమనార్హం. 2019–24 మధ్య విశాఖలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లిన రియల్ వ్యాపారం ఏడాదిన్నరగా దిగజారిపోయింది. పెద్ద ప్రాజెక్టులు చాలా వరకూ ఆగిపోయాయి. కొత్త ప్రాజెక్టులు తగ్గిపోయాయి. నిర్మాణ రంగం విలవిలఒకపక్క రియల్ రంగం తిరోగమనంలో ఉండడంతో మరోపక్క దానిపై ఆధారపడిన నిర్మాణ రంగం కూడా కుదేలైంది. భవన నిర్మాణ కారి్మకులకు పనులు తగ్గిపోయాయి. విశాఖ, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో కార్మికులకు గతంలో చేతి నిండా పని ఉండేది. ఇప్పుడు పని దొరకడం కష్టంగా మారింది. నిర్మాణ రంగంలో కీలకమైన ఇటుక, సిమెంట్, పెయింటింగ్, ప్లంబింగ్, ఇనుము. ఎలక్ట్రిసిటీ, విక్రయాల వ్యాపారాలు క్షీణించాయి. ఇలా చంద్రబాబు సర్కారు అస్తవ్యస్థ విధానాల వల్ల కీలక రంగాలు చతికిలపడ్డాయి. వ్యాపారాలు తగ్గిపోవడంతో వాటిపై ఆధారపడిన వారు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో మనీ సర్క్యులేషన్ తగ్గిపోవడంతో అన్ని వ్యాపారాలు తగ్గిపోయాయి. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ హయాంలో మంచి రోజుల్లో సగటున రోజుకు 150, ఇతర రోజుల్లో 100–120 రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు మంచి రోజుల్లోనూ 70–80 దాటడం లేదు. సాధారణ రోజుల్లో 50 రిజిస్ట్రేషన్లు కావడం గగనంగా ఉంది. 2019కి ముందు మచిలీపట్నం శివారులో సెంటు రూ.3 లక్షలు ఉంటే 2024లో రెట్టింపై రూ.6 లక్షలకు చేరుకుంది. తరువాత చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా ధరలు పెరగలేదు. 2022–23లో తూర్పు గోదావరి జిల్లాలో 1,29,355 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా 2025–26 నవంబర్ చివరి నాటికి కేవలం 61,597 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. విజయనగరం పరిసర ప్రాంతాల్లో సుమారు రూ.10 లక్షలు ఉన్న 200 గజాల ఇంటి స్థలం 2019 తరువాత వైఎస్ జగన్ హయాంలో రూ.25 – రూ.30 లక్షలకు చేరుకుంది. ఇప్పుడు ఒక్కసారిగా ధరలు తగ్గిపోయాయి. మూడు నాలుగేళ్ల క్రితం కొన్న ధరకు అమ్ముకుందామన్నా కొనేవారు లేరని వ్యాపారులు చెబుతున్నారు. కడప అర్బన్, రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గత ప్రభుత్వంలో రోజుకు సుమారు 250–300 రిజి్రస్టేషన్లు జరగగా ప్రస్తుతం 50–60 మించడం లేదు. ప్రొద్దుటూరు సబ్ రిజి్రస్టార్ కార్యాలయ పరిధిలో రోజుకు 80–90 రిజిస్ట్రేషన్లు నుంచి ప్రస్తుతం 30కి తగ్గిపోయాయి. ఆదోని మెడికల్ కాలేజీ పరిసరాల్లో గతంలో ఎకరం రూ.5 కోట్లు పలకగా ఇప్పుడు అడిగే నాథుడే కరువయ్యారు. 2023–24 వైఎస్ జగన్ హయాంలో ఇలా..1) రిజిస్ట్రేషన్ల ఆదాయం టార్గెట్ రూ.12,000 కోట్లు 2) రాష్ట్రంలో భారీగా పెరిగిన భూముల ధరలు 3) రోజూ వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు.. 22.25 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ 4) రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు, 30 లక్షలకుపైగా గృహ నిర్మాణాలు - ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం - తీర ప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు - గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ భవన నిర్మాణాలతో స్థానికంగా ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధితో పాటు సంపద సృష్టిస్తూ అడుగులు 5) భవన నిర్మాణ కార్మికులకు సమృద్ధిగా పనులు 6) సంక్షేమ పథకాల అమలుతో పెరిగిన పేదల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు 7) రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలు కళకళ. జోరుగా గృహ నిర్మాణాలతో సిమెంట్, పెయింట్లు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వ్యాపారాల జోరు 2025–26 బాబు ప్రభుత్వంలో.. 1) రిజిస్ట్రేషన్ల ఆదాయం టార్గెట్ రూ.10,169 కోట్లకు కుదింపు 2) భూముల ధరలు ఒక్కసారిగా పతనం.. రాజధానిలోనూ మందగమనం 3) రిజిస్ట్రేషన్లు పదుల సంఖ్యకే పరిమితం.. అక్టోబర్ దాకా 13.92 లక్షలే 4) కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోగా ఉన్న వ్యవస్థలే నిర్వీర్యం. 5) పొట్ట కూటి కోసం కార్మికుల అవస్థలు 6) పథకాలు అందక, అభివృద్ధి జాడ లేక పేదల దీనావస్థ 7) రియల్ ఎస్టేట్ వెలవెల. ఆగిన ఇళ్ల నిర్మాణాలు. వ్యాపారులు బేజార్కృష్ణాలో కుప్పకూలింది..! కృష్ణా జిల్లాలో ఏడాదిన్నరగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. గత ప్రభుత్వంలో నెలకు 20 రోజులకు తగ్గకుండా పనులుంటే ఇప్పుడు పది రోజులు కూడా ఉపాధి దొరకటం లేదని భవన నిర్మాణ కార్మికులు వాపోతున్నారు. అనుబంధ రంగాలైన సిమెంట్, ఐరన్, శానిటేషన్, ఎలక్ట్రికల్, పెయింట్స్, ప్లంబింగ్ తదితరాల వ్యాపారం కుప్పకూలింది. వైఎస్సార్ సీపీ హయాంలో బందరు పోర్టుకు శంకుస్థాపన చేసి పనులను పరుగులు పెట్టించింది. మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసింది. గిలకలదిండి íఫిషింగ్ హార్బర్, పలు కొత్త హైవేలు రావడంతో జిల్లా పునర్విభజన సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. బందర్ హైవే వెంట నిడుమోలు, పామర్రు, ఉయ్యూరు. కంకిపాడు ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. కత్తిపూడి–ఒంగోలు హైవేతో పెడన, అవనిగడ్డ నియోజక వర్గాల్లో సైతం రియల్ భూమ్ అందుకొంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక వేగం మందగించడంతో రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొంది. బాపట్లలో భవన రంగం బాధలు బాపట్ల జిల్లాలో ఏడాదిన్నరగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పతనమైంది. గత ప్రభుత్వంతో పోలిస్తే రిజి్రస్టేషన్లు సగం తగ్గాయి. వైఎస్ జగన్ హయాంలో బాపట్ల జిల్లాలో 2022 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 76,215 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 50,983 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగాయి. ప్రభుత్వానికి రాబడి తగ్గిపోగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. గత ప్రభుత్వంలో నెలకు 22 రోజులకు తగ్గకుండా పనులుంటే ఇప్పుడు పది రోజులు కూడా దొరకడం లేదని భవన నిర్మాణ కారి్మకులు వాపోతున్నారు. సిమెంట్, ఐరన్ విక్రయాలు పడిపోయాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో జిల్లాలో ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది. తీరప్రాంతం అభివృద్ధికి నిధులు కేటాయించడంతో రోడ్లు ఇతర మౌలిక వసతుల పనులు వేగంగా జరిగాయి. బాపట్ల కేంద్రంగా గత ప్రభుత్వం మెడికల్ కళాశాల మంజూరు చేసింది. దీంతో 2019 తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. అప్పటివరకూ తీర ప్రాంతంలో ఎకరం రూ.30 లక్షలు పలికిన భూమి తరువాత రూ.3 నుంచి 5 కోట్లకు చేరింది. గత ఏడాదిన్నరగా పరిస్థితి తారుమారైంది. వైఎస్ జగన్ హయాంలో బాపట్ల మెడికల్ కళాశాల ప్రాంతంలో రూ.కోటిన్నర పలికిన ఎకరం భూమిని ప్రస్తుతం రూ.20 లక్షలకు కూడా కొనేవారు లేరు. అద్దంకి, రేపల్లె ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో ఎకరం రూ.కోటి దాకా పలికిన భూముల ధరలు తిరిగి రూ.20 లక్షలకు పతనమయ్యాయి.పల్నాడులో ధరలు పతనం.. పల్నాడు జిల్లాలో గత ప్రభుత్వంలో మెడికల్ కళాశాల రాకతో పిడుగురాళ్ల, దాచేపల్లి, రాజుపాలెం, మాచవరం తదితర మండలాల్లో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. రైతుల భూములు రెట్టింపు ధరలు పలికాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ ఆదాయం అమాంతం పడిపోయింది. పల్నాడు జిల్లావ్యాప్తంగా 2023–24లో రిజి్రస్టేషన్ల ద్వారా రూ.472.38 కోట్ల ఆదాయం సమకూరగా 2024–25లో ఆదాయం రూ.396 కోట్లకు పడిపోయింది. 2025–26లో ఇప్పటిదాకా రూ.200 కోట్లు కూడా రాలేదు. గతంలో ఏటా సగటున 32 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా ప్రస్తుతం అది 14 వేలకు పడిపోయింది. దీంతో మధ్యవర్తులు ఉపాధిలేక హైదరాబాద్ లాంటి నగరాలకు వలస వెళ్తున్నారు. గతంలో వెంచర్ల ఏర్పాటుతో ఉపాధి పొందిన వేలాది మంది కూలీలు, ట్రాక్టర్, జేసీబీ, ట్రక్కు డ్రైవర్లు ప్రస్తుతం పనుల కోసం అడ్డాలలో ఎదురు చూస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చేరువలోని కామేపల్లి గ్రామ పరిధిలో 2019కి ముందు ఎకరం పొలం రోడ్డు పక్కన సుమారు రూ.30 లక్షలు ఉండగా స్థానికంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఏకంగా ఎకరం రూ.కోటిన్నర దాకా పలికింది. 2024లో వైఎస్సార్సీపీ దిగిపోయేనాటికి ఎకరం రూ.2 కోట్ల దాకా వెళ్లింది. అదే ఇప్పుడు కనీసం రూ.60 – రూ.80 లక్షలు కూడా పలకడం లేదు. కనీసం ధర గురించి అడిగే వారు లేరని రైతులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు. నరసరావుపేటలోనూ వెంచర్లు వేసిన వ్యాపారులు స్థలాలు అమ్ముకోలేక, వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరులో నీరసించిన వ్యాపారం నెల్లూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ బాగుంటుందని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి వచ్చిన రియల్టర్లు లేఅవుట్లు వేశారు. అన్ని సదుపాయాలతో అధునాతనంగా ఇళ్ల నిర్మాణాలు కూడా చేశారు. ఇప్పుడు వాటిని కొనేవారు లేరు. గత 9 నెలలుగా ఖాళీగా ఉన్నారు. కొందరు బిల్డర్లు నూతనంగా నిర్మించిన ఇళ్లను బాడుగలకు ఇస్తున్న పరిస్థితి ఏర్పడింది. భారీగా వడ్డీలు కట్టలేక లబోదిబోమంటున్నారు. ఇక మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తూ చంద్రబాబు సర్కారు ప్రకటన చేసినా రియల్ ఎస్టేట్ ఏమాత్రం ఊపందుకోలేదు. ఏడాదిలో ఒక్కటీ అమ్ముడుపోలేదుటీడీపీ అధికారంలోకి వచ్చాక భూముల అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గాయి. గత ఏడాది కాలంలో ఒక్క ప్లాటు కూడా అమ్ముడు పోలేదు. పెట్టుబడులు మొత్తం ప్రాజెక్టులపై పెట్టాం. వ్యాపారం దివాలా తీస్తోంది. తెచి్చన పెట్టుబడులకు వడ్డీలు కట్టడమే సరిపోతోంది.– షేక్ కిరణ్‌బాబు, బిల్డర్, ఈడుపుగల్లు, కంకిపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా వలసలు పోతున్నారు ఏడాదిన్నరగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. స్థలం అమ్మేవారు ఉన్నా.. కొనేవారు లేరు. అందుకే రిజి్రస్టేషన్లు ఆగిపోయాయి. ఇల్లు కట్టించే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఓపెన్ ప్లాట్లు కూడా అమ్ముడు పోవడం లేదు. దీంతో భవన నిర్మాణ కారి్మకులు తమ పనులను వదిలేసి బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. – నాగరాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు, కదిరి, సత్యసాయి జిల్లాపూర్తిగా పతనమైన రియల్ ఎస్టేట్ ప్రకాశం జిల్లాలో రియల్ ఎస్టేట్ పూర్తిగా డౌనైపోయింది. మార్కాపురం జిల్లా ప్రకటిస్తే మంచి ధరలు వస్తాయని ఆశించాం. అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అమ్మే వారు ఉన్నాగానీ కొనేవారు లేరు. నేషనల్ హైవే పక్కన కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. సంతనూతలపాడు మండలంలో రియల్ ఎస్టేట్ భూం ఇప్పుడు పూర్తిగా పతనమైంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో నమోదవుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ఇక్కడ 2022–23లో 6,029 రిజిస్ట్రేషన్లు జరిగాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024–25లో ఆ సంఖ్య 3,972కు పడిపోయింది. – కుంచాల ఆంజనేయులు, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లాపూట గడవడమే కష్టంగా ఉందిరియల్ ఎస్టేట్ కుదేలైంది. భవన నిర్మాణాలు భారీగా తగ్గిపోయాయి. గతంలో నెలలో 20 రోజులకుపైగా పనులుంటే ప్రస్తుతం 10–15 రోజులు కూడా దొరకడం లేదు. భవన నిర్మాణ కార్మికులకు పూట గడవడమే కష్టంగా ఉంది. – జి.హరికృష్ణారెడ్డి, ఎనీ్టఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడునెలలో సగం రోజులే పనిరియల్ ఎస్టేట్ లావాదేవీలన్నీ నిలిచి పోయాయి. దీంతో నిర్మాణ పనులపై ఆధారపడి ఇక్కడ జీవిస్తున్న వేల మంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రాజధాని వస్తుందన్న సమయంలో భవనాల పనులు మొదలు పెట్టారు. అందరికీ చేతినిండా పని ఉండేది. ఇప్పుడు పూర్తి స్థాయిలో పనులు దొరకడం లేదు. రోజుకో బ్యాచ్‌కి పని సర్దుబాటు చేయాల్సి వస్తోంది. అంటే ఒక కార్మికుడికి నెలలో 15 రోజులు కూడా పని లేకుండా పోయింది. దీంతో కారి్మకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు దొరకకపోవడంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. – వైఎస్ మూర్తి, శ్రీ దుర్గా భవానీ భవన నిర్మాణ శ్రామిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మధురవాడ, విశాఖపని దొరకడం లేదు.. గత ప్రభుత్వంలో నెలకు 22 రోజులు పనులు దొరికేవి. ఈ ప్రభుత్వం వచ్చాక నెలకు పది రోజులు కూడా పనులు ఉండడం లేదు. ఉదయమే సెంటర్‌కు వచ్చి పడిగాపులు కాస్తున్నాం. కుటుంబ పోషణ భారంగా మారింది. – నాగూర్‌బాషా, భవన నిర్మాణ కార్మికుడు, ఉప్పరపాలెం, బాపట్ల జిల్లా. -
అమరావతిపై అనుమానాలు అడిగితే వణుకుతున్నారు..!
-
బస్ షెల్టర్‌నూ వదలని టీడీపీ నేత
పెనుకొండ రూరల్: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత అనుచరుల ఆగడాలకు అడ్డుఅదుపూ లేకుండాపోయింది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి ఓ టీడీపీ నేత ఏకంగా బస్ షెల్టర్‌ను కబ్జా చేశాడు. దాన్ని కూల్చి ఆ స్థలంలో కాంప్లెక్సు నిరి్మంచేందుకు సిద్ధమయ్యాడు. గ్రామస్తులు ఎదురు తిరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.నాలుగు గ్రామాలకు అదే షెల్టర్ పెనుకొండ మండలం మావటూరులోని బస్ షెల్టర్ నాలుగు గ్రామాల ప్రయాణికులకు ఆదరువుగా ఉంది. నాగళూరు, బండపల్లి, సానిపల్లి, మావటూరు గ్రామాల ప్రజలు పెనుకొండ, మడకశిర పట్టణాలకు వెళ్లేందుకు ఈ బస్‌షెల్టర్ వద్దే వేచి ఉంటారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ షెల్టర్ స్థలంపై కన్నేసిన టీడీపీ నాయకుడు జ్యోతీష్ దాన్ని కూల్చి అక్కడ కాంప్లెక్స్ నిర్మించి అద్దెలకు ఇవ్వాలనే పన్నాగం వేశాడు. శుక్రవారం అర్ధరాత్రి జేసీబీతో బస్‌షెల్టర్‌ను కూల్చేయించాడు. గ్రామస్తులు అతన్ని నిలదీయటంతో పారిపోయాడు. దీంతో బస్ షెల్టర్ కూల్చేందుకు ఉపయోగించిన జేసీబీని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. ఉదయానికి ఈ విషయం మిగిలిన గ్రామాల వారికి తెలియడంతో మావటూరు, నాగళూరు, సానిపల్లి, బండపల్లి గ్రామాల ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు శనివారం ఉదయం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పెనుకొండ నుంచి మడకశిర వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బస్‌షెల్టర్‌ను కూల్చిన జ్యోతీను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని, కూల్చిన బస్ షెల్టర్ స్థానంలో నూతన షెల్టర్ కట్టించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. బస్‌షెల్టర్ కూల్చిన వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారంతా ఆందోళన విరమించారు. అనంతరం సర్పంచ్ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ నాగభూషణ్‌రెడ్డి, ఎంపీటీíసీ శివయ్య, మోహన్, మాజీ డీలర్ శ్రీనివాసులు, మేకల మారుతి, నరసింహ, పీజే రాజశేఖర్, శివారెడ్డి, మురళీ తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. జ్యోతీష్, జేసీబీ డ్రైవర్‌పైన కేసు నమోదు చేశామన్నారు. మంత్రి అండతోనే కూల్చివేత బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అండతోనే జ్యోతీష్ బస్òÙల్టర్ కూల్చేశాడని వైఎస్సార్సీపీ మండల కనీ్వనర్ సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం బస్ షెల్టర్ ఉన్న స్థానంలో కాంప్లెక్స్ నిర్మాణం కోసం గతంలోనే జ్యోతీష్ తనను, సర్పంచ్ నాగరాజును అనుమతులు అడగ్గా తాము అంగీకరించలేదని ఆయన వెల్లడించారు. -
విశాఖ ఉక్కు ప్రై'వేటు'కే!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు శరవేగంగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోతోంది..! ఆంధ్రుల హక్కు వడివడిగా చేజారిపోతోంది..! స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతాం... లాభాల బాట పట్టిస్తాం అంటూ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు అధికారం దక్కాక ప్లేటు ఫిరాయించేస్తున్నారు..! గత ఏడాదిన్నరగా ప్లాంట్‌ను ప్రైవేటుకు కట్టబెట్టే దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారు..! ఈ క్రమంలో తొలుత కాంట్రాక్టు కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. రెగ్యులర్ ఉద్యోగులను వీఆర్ఎస్ ద్వారా ఇంటికి పంపారు. పొమ్మనలేక పొగబెట్టినట్లు... ఉన్న ఉద్యోగులకు జీతాల చెల్లింపును ఆలస్యం చేస్తున్నారు. అదీ సరిపోక ఉత్తత్పికి తగిన వేతనం అంటూ మెలికపెట్టారు. ఇక ఇటీవల మరింత ముందుకెళ్లి ‘‘ఉద్యోగులు ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా? ప్రభుత్వ రంగంలో ఉంది కదా? అని బెదిరించలేరు’’ అంటూ సీఎం చంద్రబాబు దారుణ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏకంగా స్టీల్ ప్లాంట్ ప్రధాన ఉత్పత్తి విభాగం అయిన ఆపరేషన్స్ విభాగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు వీలుగా టెండర్ నోటీసులు జారీ చేశారు. ఇంతకాలం దాగుడుమూతలుస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇంతకాలం దాగుడుమూతలు ఆడింది ప్రభుత్వం. ఇప్పుడు మాత్రం వేగంగా ప్రైవేట్‌పరం చేసేందుకు చర్యలు వేగిరం చేస్తోంది. ఇప్పటివరకు కేవలం మొత్తం నిర్వహణ (టోటల్ మెయింటినెన్స్) పనులను మాత్రమే ప్రైవేటుకు అప్పగించారు. ఇప్పటివరకు మెయింటినెన్స్ పనులకు పరిమితమైన ప్రైవేటీకరణ ఇప్పుడు ఆపరేషన్స్‌కూ వర్తింపు కాగా, ప్రైవేటుపరం చేసేందుకు వీలుగా మొదట 46 విభాగాలను ఎంపిక చేశారు. తర్వాత పలు విభాగాల నిర్వహణకు ఆగస్టులో తొలి విడతగా ఒకేరోజు 32 ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) దరఖాస్తులు ఆహ్వానించారు. ఇలా ఆర్ఎంహెచ్పీ, సెంటర్ ప్లాంట్ మెయింటెనెన్స్‌కు ఈవోఐలు జారీ చేశారు. తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్–1, థర్మల్ పవర్ ప్లాంట్–2, ఎస్ఎంఎస్ సీసీఎం–4, మాధారం మైన్స్, ఫౌండ్రీ, సెంట్రల్ మెషిన్ షాప్ (సీఎంఎస్) వంటి అనేక ఇతర విభాగాలను కూడా ప్రైవేట్‌కు కట్టబెట్టే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ప్లాంట్‌కు వెన్నెముక ఇది...స్టీల్ ప్లాంట్‌లోని ప్రధాన ఉత్పత్తి విభాగం ఎస్ఎంఎస్–1లో కోల్ కెమికల్ డిపార్ట్మెంట్ (సీసీడీ) ప్రైవేటీకరణకు టెండర్లు ఆహ్వానిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఆరు కంటిన్యూస్ క్యాస్టింగ్ మెషీన్ (సీసీఎం)లతో పాటు గ్యాస్ కటింగ్ మెషీన్లను ప్రైవేటుకు ఇచ్చేందుకు టెండర్లు పిలవడంతో ప్లాంట్ ఉద్యోగుల్లో కలకలం మొదలైంది. స్టీల్‌ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్‌లో తయారయ్యే హాట్ మెటల్‌ను స్టీల్ మెల్ట్ షాప్(ఎస్ఎంఎస్)లో వివిధ ప్రక్రియల ద్వారా శుద్ధి చేసి లిక్విడ్ స్టీల్‌గా తయారు చేస్తారు. ఈ ద్రవపు ఉక్కును ఫినిష్డ్ స్టీల్‌గా తయారు చేసే ప్రక్రియలో తొలుత సీసీఎంల ద్వారా బ్లూమ్స్గా మారుస్తారు. ఈ బ్లూమ్స్‌ను డిమాండ్‌ను బట్టి రోలింగ్ మిల్స్ విభాగంలో రీబార్స్, యాంగిల్స్, చానెల్స్ తదితర ఫినిష్డ్ స్టీల్‌గా చేస్తారు. కన్వర్టర్‌లో తయారైన లిక్విడ్ స్టీల్‌ను సీసీఎంలో పంపడం ద్వారా బ్లూమ్స్ తయారవుతాయి. గతంలో 3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్నప్పుడు ఎస్ఎంఎస్–1లో సీసీఎంల ద్వారా ఏడాదికి 2.82 మిలియన్ టన్నుల బ్లూమ్‌లు ఉత్పత్తి చేసేవారు. ఆధునికీకరణ తర్వాత సామర్థ్యం 3.5 మిలియన్ టన్నులకు పెరిగింది. తద్వారా 3.29 మిలియన్ టన్నుల బ్లూమ్స్ తయారయ్యే సామర్థ్యం ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ నిర్వహణలో సీసీడీ ఇంతటి కీలక విభాగం. ఇలాంటిదానిని ప్రైవేట్‌కు ఇస్తే... ప్లాంట్ మొత్తం వారి చేతుల్లో పెట్టినట్లేననే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. 680 మంది ఉద్యోగులను తొలగించే ప్రమాదం పొంచి ఉందని భయపడుతున్నారు. ఇప్పటికే వేలమంది కార్మికులను ఖర్చు నియంత్రణ (కాస్ట్ కటింగ్) పేరుతో బయటకి పంపారని గుర్తుచేస్తున్నారు. తాజా టెండర్లలో కూడా పూర్తిగా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోని భారీ ప్రైవేటు సంస్థలే పాల్గొనే విధంగా నిబంధనలను రూపొందించారనే ఆరోపణలు వస్తున్నాయి. రూ.131.33 కోట్ల విలువైన ఆపరేషన్స్ పనులకు టెండర్ తుది గడువును జనవరి 3వ తేదీగా నిర్ణయించారు. 4వ తేదీన బిడ్‌ను తెరిచి ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. విశాఖ ఉక్కుకు కాకుండా మిట్టల్ కోసం పాటదశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు ప్రభుత్వ వైఖరి ఇటీవల మరింత స్పష్టమైంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఆంధ్రుల హక్కుగా గొప్పగా చెప్పుకొనే ఈ ప్లాంట్‌కు సొంత గనులు ఇవ్వాలని కోరలేదు. సరికదా... నక్కపల్లి వద్ద ఏడాదికి 24 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాక ఈ ప్రైవేట్ ప్లాంట్‌కు బొగ్గు గనులు ఇవ్వాలని కూడా టీడీపీ కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముద్ర వేసి.. వదిలించుకునే కుట్ర...విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం దొడ్డిదారి ప్రయత్నాలు చేసింది. మొదట ప్లాంట్ నష్టాల్లో ఉందంటూ ముద్ర వేసింది. అంతేకాక నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధించడం మొదలుపెట్టారు. అనంతరం ప్లాంటులో ఉన్న కాంట్రాక్టు కార్మికులను 5,500 మందిని తొలగించారు. ఇక రెగ్యులర్ ఉద్యోగులను కూడా వీఆర్ఎస్ ద్వారా 1,590 మందిని ఇంటికి సాగనంపారు. ఉద్యోగులు ఇంట్లో పడుకుని జీతాలు ఇవ్వాలంటే ఎలా ఇస్తాం? అంటూ ఏకంగా సీఎం చంద్రబాబు నవంబరు 15న విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు సందర్భంగా వ్యాఖ్యానించారు. తద్వారా ఉద్యోగుల నైతిక స్థ్యైర్యాన్ని దెబ్బతీశారు. ప్రజల్లో వారి పట్ల వ్యతిరేక ధోరణి వచ్చేలా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే అసలు సక్రమంగా జీతాలివ్వకుండా... ఉత్పత్తికి తగిన వేతనం అంటూ మెలికపెట్టారు. మూడో విడతలో మరో వెయ్యిమంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఉద్యోగులు ఇంట్లో తిని పడుకుంటే జీతాలివ్వాలా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించాక వెంటనే యాజమాన్యం ఉత్పత్తికి తగిన వేతనమంటూ కొత్త విధానాన్ని ప్రకటించింది. తాజాగా ప్లాంట్ ఆపరేషన్స్‌ను ప్రైవేట్‌పరం చేసేందుకు టెండర్లను ఆహ్వానించి మిగిలిన ఉద్యోగులను కూడా సాగనంపేందుకు నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది.కాపాడడమంటే ఇదేనా చంద్రబాబూ..?స్టీల్ ప్లాంట్‌ను కాపాడతాం అంటూ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు గెలిచాక పట్టించుకోవడం మానేశారు. ప్రైవేటీకరణకు బాటలు వేస్తున్నారని ప్లాంట్ కార్మికులు మండిపడుతున్నారు. ఒత్తిడి పెరగడంతో చివరకు ‘ప్యాకేజీ’ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అయితే, ప్యాకేజీలో భాగంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు నడపడం, శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులను గణనీయంగా తగ్గించడం వంటి చర్యలు ప్రారంభించారని విమర్శిస్తున్నారు. అంతేకాక ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను తగ్గించి, గత ఏడాది సెప్టెంబర్ నుంచి పూర్తి జీతాలు చెల్లించడం లేదని వాపోతున్నారు. ఇప్పుడు ఆపరేషన్స్ విభాగం టెండర్లు పూర్తయితే... మరింతమంది శాశ్వత ఉద్యోగులను తొలగించే ప్రమాదం ఉందని ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.మొదటి నుంచి వైఎస్సార్సీపీ పోరాటంవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ మొదటినుంచి ఒకే పంథా అనుసరిస్తోంది. ప్రైవేటీకరణ ప్రయత్నాలను వెనక్కి తీసుకునేవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ దీర్ఘకాలం పాటు ఒత్తిడిని కొనసాగించడంతో ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రైవేటీకరణపై అడుగులు ముందుకుపడలేదు.దొడ్డిదారిలో కుట్రవిశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసే కుట్రలు చాలా రోజులుగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా ఎస్ఎంఎస్–1లో సీసీడీ సెక్షన్ ప్రైవేటీకరణకు టెండర్లు పిలిచారు. తద్వారా ఈ విభాగంలో పనిచేసే 450 మంది రెగ్యులర్, 230 మంది కాంట్రాక్టు ఉద్యోగుల ఉద్యోగాలు తొలగిస్తారనే ఆందోళన నెలకొంది. టెండర్లలో పాల్గొనే సంస్థలకు విధించిన నిబంధనలన్నీ చంద్రబాబు ప్రభుత్వం కనుసన్నల్లోని భారీ ప్రైవేటు సంస్థలకు కావాల్సిన విధంగా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ప్లాంట్‌ను దొడ్డిదారిలో ప్రైవేటుపరం చేసే కుట్రగా అర్థమవుతోంది. – జగ్గునాయుడు, గౌరవాధ్యక్షుడు, విశాఖ స్టీల్ ప్లాంట్, సీఐటీయూముక్తకంఠంతో ఖండిస్తున్నాంఏవో చిన్నచిన్న విభాగాలను కాకుండా ఏకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ సెక్షన్నే ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది మొత్తం ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకేనని స్పష్టమవుతోంది. ఒకవైపు ప్రైవేటుకు ఇవ్వమని చెబుతూనే, మరోవైపు కీలక విభాగాలను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు టెండర్లను పిలవడం ఏమిటి? ఇదంతా చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తి సహకారంతోనే జరుగుతోంది. దీనిని ప్లాంట్ కార్మికులతో పాటు ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలి. – దాలినాయుడు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ స్టీల్ ప్లాంట్ అధ్యక్షులుటెండర్లను రద్దు చేయాలి స్టీల్ మెల్ట్ షాప్ (ఎస్ఎంఎస్)... స్టీల్‌ప్లాంట్‌కు గుండెకాయ వంటిది. దానిని ప్రైవేటీకరించడం అంటే ప్లాంట్‌ను ప్రైవేటీకరణే అవుతుంది. మెయింటినెన్స్ పనులకు పరిమితమైన ప్రైవేటీకరణను ఆపరేషన్స్‌కూ వర్తింపజేయడం దుర్మార్గం. యాజమాన్యం వెంటనే ఈ టెండర్లను రద్దు చేయాలి. – ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ స్టీల్‌ప్లాంట్ విభాగం -
టీడీపీ కనుసన్నల్లో కిడ్నాప్ లు.. ఏపీ పోలీసులపై ఆరోపణలు
-
9.15% వడ్డీతో నడ్డి విరిగేలా.. కొత్త అప్పుకు కొత్త ప్లాన్
-
కూటమి కొత్త కుట్రను తిప్పి కొట్టిన కడప మేయర్
సాక్షి, వైయస్సార్ జిల్లా: కడప మేయర్ పదవి దక్కకపోవడంతో కూటమి ప్రభుత్వం కొత్త కుట్రలకు తెర తీసింది. వైఎస్సార్సీపీకి చెందిన నూతన మేయర్ పాకా సురేష్ పేరిట అభ్యంతకర పోస్టర్లను అచ్చేయించింది. అయితే ఈ కుట్రను ఆయన అంతే సమర్థవంతంగా తిప్పికొట్టారు. కడప సిటీలో మేయర్ పాకా సురేష్‌పై కొన్ని పోస్టర్లు వెలిశాయి. కోర్టులో ఉన్న అంశాన్ని వక్రీకరిస్తూ.. పన్ను కట్టలేదంటూ ప్లెక్సీలు వేయించారు టీడీపీ నేతలు. అయితే.. ఈ పరిణామంపై ఇటు వైఎస్సార్సీపీతో పాటు అటు బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ఓ బీసీ నేత మేయర్ కావడాన్ని ఓర్వలేకపోతున్నారని అంటున్నాయి. ఈ మేరకు ప్లెక్సీలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. తాజాగా ఈ పోస్టర్ పరిణామాలపై సురేష్ స్పందించారు..‘‘నేను 10 ఏళ్లుగా నేను పన్ను కట్టడం లేదని ఆరోపణలు చేశారు. ఈ కూటమి ఏడీపీ సర్వే చేసి నగరంలో 20వేల ఇళ్లకు పన్నులు భారీగా పెంచారు. దానిపై నేను స్వయంగా పోరాటం చేస్తున్నాను. చట్ట ప్రకారం పన్ను పెంచాలంటే ముందు నోటీసులు ఇవ్వాలి. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయకుండా 20వేల మందిపై బాదుడు వేశారు. కార్పొరేషన్ పాలకవర్గం ఈ పెంపుపై తీర్మానం కూడా చేశాం. పన్ను పెంపుపై మా తల్లి కూడా రివిజన్ పిటిషన్ వేశాం. అన్ని అనుమతులు చూపించాం. పన్ను తగ్గిస్తామని కూడా అధికారులు చెప్పారు. రివిజన్ పన్ను కట్టాలని అధికారులు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు. 20వేల మంది పరిస్థితి ఇలానే ఉంది. కొంతమంది కోర్టుకు కూడా వెళ్లారు.. .. వ్యక్తిగతంగా నాపై కక్షతో ఇలాంటి ప్లెక్సీలు వేసి టైమ్ వెస్ట్ చేసుకుంటున్నారు. నేను మేయర్ కావడాన్ని తట్టుకోలేక ఇలాంటి తప్పుడు చర్యలకు దిగుతున్నారు. మా పార్టీ నేతలు ఏకాభిప్రాయంతో నన్ను మేయర్ గా ఎన్నుకున్నారు. మేయర్ అయిన మొదటి రోజే నాపై కుట్రలు చేస్తున్నారు. నేను మేయర్ కావడం గిట్టని వారు నాపై ప్లెక్సీలు పెట్టారు. మీ వ్యక్తిగత ఎజెండాతో ఇలా ప్లెక్సీలు పెట్టే బదులు నగరంపై దృష్టి పెట్టండి. ప్రజా సమస్యలపై ఎవరు సలహాలు ఇచిన తీసుకుంటాను. అధికార, ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు ఏవైనా నగర అభివృద్ధికి సహకరించాలి’’ అని పాకా సురేష్ తనపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు. -
అధికారంలో ఉండి కూడా భయపడ్డారు చూడు.. అది జగన్ అంటే
-
విద్యార్థులకు నాసిరకం స్కూల్ బ్యాగులు, బూట్లు... ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర ఇక్కట్లు
-
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు వ్యతిరేకంగా ‘కోటి’ గళాల గర్జన...
-
స్థూల ఉత్పత్తిపై చంద్రబాబు అబద్ధాలు చెప్పారు: బుగ్గన
సాక్షి, హైదరాబాద్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తైనా కూడా.. ఇంకా గతం గురించే మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి(ఆర్థిక) బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై చేసిన అంకెల గారడీపై బుధవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో బుగ్గన మాట్లాడారు. ఏడాదిన్నర అయినా కూడా ఇంకా గతం గురించే మాట్లాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయ్యింది అని చంద్రబాబు వ్యూహాత్మకంగా చెప్పారు. ఆదాయం, స్థూల ఉత్పత్తిపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. 2014-19 బాబు హయాంలో కేంద్రానికి 4.45 శాతం ఇస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో 4.8 శాతం ఇచ్చాం. కోవిడ్ సమయంలోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థూల ఉత్పత్తిని పెంచింది.... తలసరి ఆదాయంలో చంద్రబాబు పాలనలో ఏపీ 18వ స్థానంలో ఉంది. అదే.. జగన్ పాలనలో 15వ స్థానంలో ఉంది. జగన్ హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పు 3 లక్షల 32 వేల కోట్లు. చంద్రబాబు 18 నెలల్లో 2 లక్షల 66 వేల కోట్ల అప్పు చేశారు. కాగ్ లెక్కల ప్రకారం.. 2025-2026గానూ ఏపీ అప్పుల్లో నెంబర్ వన్‌గా ఉంది. చంద్రబాబు ప్రతీ నెలా 9 వేల కోట్ల అప్పు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఏజెన్సీలే చెబుతున్నాయి. స్థూల ఉత్పత్తి లెక్కల్లో ఆర్బీఐ చెప్పినవి తప్పు.. కాగ్ చెప్పినవన్నీ తప్పు చంద్రబాబు అంటున్నారు. కేవలం తాను చెప్పినవే నిజాలు అనట్లు మాట్లాడుతున్నారు. సీఎం స్థాయిలో ఉండి చంద్రబాబు ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆ పిచ్చి లెక్కలు, కాకి లెక్కలు జనం నమ్మరు అని బుగ్గన అన్నారు. చంద్రబాబు పాలన అంటే అసమర్థతతో కూడిన విధ్వంసం. కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలను కోసే పరిస్థితుల్లో కూడా రైతులు లేరు.కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు అడుగుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పంట ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం చేశాం. రెండు పంటలకు ఇచ్చాం. 34 లక్షల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆంధ్ర ప్రదేశ్ శ్రీలంక అవుతుంది అని తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు బాబు పాలనలో ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు కొలంబో అవుతుందా బాబు చెప్పాలి. సంపద ఎలా సృష్టిస్తున్నారో బాబు చెప్పాలి. పోలవరం కోసం కేంద్రం అడ్వాన్స్ ఇస్తుంది. కేంద్రం ఇచ్చిన ఆ నిధులను చంద్రబాబు పక్కదోవ పట్టించారు. -
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికే అంకెల గారడీ. చంద్రబాబు జీఎస్డీపీ ముందస్తు అంచనాలపై వైఎస్ జగన్ ధ్వజం
-
అప్పులు.. దివాళా కోరు ప్రభుత్వం చంద్రబాబుదే: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: రైతును గుడ్డికన్నుతో చూడడం ముఖ్యమంత్రి చంద్రబాబు విధానమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. తాజాగా చంద్రబాబు మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు.. అసత్య ప్రచారాలపై పేర్ని నాని మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం, ధాన్యాగారంగా ఏపీకి బ్రాండ్ ఉండేది. అలాంటి బ్రాండ్‌ను దెబ్బ తీసింది చంద్రబాబే. చంద్రబాబు ఎప్పటికీ రైతు వ్యతిరేకే. గంటన్నర చంద్రబాబు ప్రసంగంలో అసత్యాలు, నిందలు, విషం వెదజల్లారు. రైతును గుడ్డికన్నుతో చూడడం చంద్రబాబు విధానం. ప్రభుత్వంలో ఎవరున్నా రైతుహితం కోసం పని చేశారు. కానీ చంద్రబాబు ఒక్కరే వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేస్తారు. ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరిస్తారు.. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది. ఎన్నికల ముందు ఏపీ అప్పులు రూ.14 లక్ష కోట్లు అని చంద్రబాబు ప్రచారం చేశారు. తీరా ఎన్నికలయ్యాక రూ.3.33 లక్షల కోట్ల అప్పు అని రాతపూర్వకంగా అసెంబ్లీలో చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ రూ.10 లక్షల కోట్లని బొంకుతున్నారు. అప్పుల ప్రభుత్వం, దివాళా కోరు ప్రభుత్వం చంద్రబాబుదే. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 2 లక్షల 66 వేల 516 కోట్ల అప్పు చేశారు. చంద్రబాబుకు అప్పు ఇచ్చినవాళ్లు ప్రభుత్వ ఖజానాలో డైరెక్ట్‌గా చెయ్యి పెట్టి తీసుకొవచ్చు. మోదీ, నీతీశ్‌కుమార్‌లు ఏనాడైనా తప్పుడుగా అప్పులు చేశారా?. రాష్ట్ర భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుది. లక్షా 91 వేల కోట్లను తాకట్టపెట్టి 9 వేల కోట్లు అప్పు తెచ్చారు. ప్రజల రక్తాన్ని తాగుతూ అప్పులు చేస్తున్నారు. మీ ముగ్గురు(చంద్రబాబు, పవన్, నారా లోకేష్‌లను ఉద్దేశిస్తూ..) అడుగు తీసి అడుగేస్తే హెలికాఫ్టర్లు ప్రత్యేక విమానాలా?. అప్పులు చేస్తోంది ప్రత్యేక విమానాల్లో తిరగడానికా?.. అప్పులు తెచ్చి డబ్బు ఎక్కడ పెడుతున్నావ్.. దేశ జీడీపీలో రాష్ట్ర ఎంతో చెప్పగలవా చంద్రబాబు? అని పేర్ని నాని నిలదీశారు. ఉన్నత చదువులతోనే పేదరికం తగ్గుతుందని నమ్మిన నాయకుడు వైఎస్ జగన్. అందుకే వైఎస్సార్సీపీ హయాంలో స్కూల్స్ అభివృద్ధి చెందాయి. కానీ, స్కూళ్లపై చంద్రబాబు ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సినిమా సెట్టింగులు వేసి.. స్టూడెంట్స్- పేరెంట్స్ మీటింగ్ పెట్టడం ఏంటి?. ఒక్క స్కూల్లో కూడా పేరెంట్స్ మీటింగ్ ఎందుకు పెట్టలేకపోయారు?. నేరుగా స్కూల్ కే వెళ్తే జగన్ హయాంలో బాగు పడిన విధానం కనపడుతుందని భయం కాబట్టి. కూటమి వచ్చాక ఎంత మందికి ట్యాబ్‌లు ఇస్తున్నారు?. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఎందుకు తీసేశారు?. ప్రభుత్వ స్కూళ్లను నాశనం చేసింది.. చేస్తోంది ఎవరు?.. ..వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ జీడీపీ వేగంగా పెరిగింది. అభివృధ్ధి శరవేగంగా జరిగింది. 4 పోర్టులు, 10 హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు సహా గ్రామ వార్డు సచివాలయ నిర్మాణం ద్వారా జగన్ ఆదాయం సృష్టించారు. వైఎస్ జగన్ సంపద సృష్టిస్తే.. మీరు దానిని వాడుకుంటున్నారు. మూలధన పెట్టుడి ఎవరి హయాంలో ఎక్కువ ఉందో చర్చకు సిద్ధమా?.. బుగ్గన రాజేంద్రనాధ్(ఏపీ మాజీ ఆర్థిక మంత్రి)తో చర్చకు వచ్చే దమ్ముందా చంద్రబాబూ? అని చంద్రబాబుకి పేర్ని నాని సవాల్ విసిరారు.చంద్రబాబు సంపద సృష్టి అనేది ఓ అభూత కల్పన. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలను ఎందుకు అమలు చేయడం లేదు?. ఏ పేదవాడికీ ఇప్పటి వరకు గజం స్థలం కూడా ఎందుకు ఇవ్వలేదు?. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చారా?. ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తేవడంలో చంద్రబాబు ఫస్ట్ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. టీడీపీలో కష్టపడే వారికి పదవులు దక్కటం లేదు. జంపింగ్ జపాంగులకే పదవులు ఇస్తున్నారు. అనంతపురం రైతులకు వ్యవసాయం నేర్పానని చంద్రబాబు బడాయి మాటలు చెప్పుకుంటున్నారు. ధాన్యం పండించకుండా జనం తినే ఆహారం పండించాలని చంద్రబాబు అంటున్నారు. మరి అరటి, మామిడి, టమోటా, దానిమ్మలాంటివి పండిస్తే వాటికి కూడా ఎందుకు ధరల్లేవు?. రైతులకు అత్యాశ అంటూ కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు. రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. ప్రజలందరికీ వాస్తవాలు తెలుస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో తగిన బుద్ది చెప్పటానికి సిద్దంగా ఉన్నారు.. అని పేర్ని నాని అన్నారు.సీఎం హోదాలో చంద్రబాబు తనపై ఉన్న కేసులను తానే కొట్టేసుకోవటం పెద్ద నేరం. చంద్రబాబు చేసిన దివాళాకోరు తనం, నీతి మాలిన తనం కంటే ఇంకోటి లేదు. చంద్రబాబుకు దమ్ముంటే కేసును న్యాయబద్దంగా ఎందుకు ఎదుర్కోలేక పోయారు. పరకామని కేసులో తన ఆస్తిని రవికుమార్ టీటీడీకి రాసిచ్చారు. చంద్రబాబు చేసిన దోపిడీలతో పోల్చితే రవికుమార్ చేసిన నేరం చిన్నదే. ఇండిగో సంక్షోభం టీడీపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి తప్పిదమే. పైలెట్లకు రెస్టు ఉండాలనే నిబంధనలను కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. దాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అమలు చేయాలి. విమానయాన సంస్థల పనితీరును సమీక్షించాలి. కానీ రామ్మోహన్ నాయుడు రీల్స్ చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇండిగో సంస్థ విమానాలను పెంచుకుంటున్నంతగా సిబ్బందిని పెంచుకోలేదు. ఆ విషయాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు ఎందుకు సమీక్ష చేయలేదు?. దీని గురించి ప్రజలు, ప్రయాణీకులు ప్రశ్నిస్తే చంద్రబాబు మా పార్టీపై పడి ఏడుస్తున్నారు. తెలుగువారి పరువే కాదు, మొత్తం దేశం పరువునే పోగొట్టారు. తప్పు చేశారు కాబట్టే అర్నాబ్ గోస్వామి చర్చను బాయ్ కాట్ చేశారు అని పేర్ని నాని అన్నారు. -
కూటమి కర్కశ సర్కారుపై గళమెత్తిన విద్యార్థి దళం (ఫొటోలు)
-
వందేమాతరం స్ఫూర్తిని కాలరాసేలా ఏపీలో పాలన: ఎంపీ గురుమూర్తి
సాక్షి, ఢిల్లీ: వందేమాతర గేయాన్ని వేడుకలా చేయడమే దేశభక్తి కాదని.. అన్యాయాన్ని ఎదిరించడం, ప్రభుత్వాలను జవాబుదారి చేయడమే భారతమాతకు నిజమైన సేవ చేయడమని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. సోమవారం లోక్‌సభలో వందేమాతరంపై చర్చ సందర్భంగా(Vande Mataram debate) ఆయన మాట్లాడుతూ.. భారతీయులందరిలో స్వాతంత్ర ప్రేరణ కల్పించిన గేయం వందేమాతరం అని.. ప్రభుత్వం పౌరులందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారాయన.ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా సామాజిక న్యాయాన్ని, సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించారు. కానీ, ఇప్పుడు ఏపీలో రాజ్యాంగ స్పూర్తి, సామాజిక న్యాయానికి విరుద్ధంగా పాలన జరుగుతోంది. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. కీలకమైన వైద్య రంగాన్ని కొద్ది మంది చేతుల్లో పెట్టి . ..ప్రజలను గాలికి వదిలేశారు. ఏపీలో రైతులకు కనీస మద్దతు ధర దొరకడం లేదు. రైతులను సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు. విద్యార్థులకు సరైనటువంటి ఆహారం ప్రభుత్వాన్నించకపోవడంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై లైంగిక వేధింపులు యదేచ్చగా జరుగుతున్నాయి. ఇది ప్రభుత్వ పాలన వైఫల్యమే. ఇది వందేమాతరం స్ఫూర్తిని కాలరాయడమే అని గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. -
18 నెలల్లో ఏపీలో ఏ ఒక్క రంగంలో అభివృద్ధి లేదు: బొత్స
సాక్షి, కోనసీమ: విద్యా, వైద్యం అనేవి ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలని.. దురదృష్ట శాత్తు కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంతో పాటు పలు సమస్యలపై సోమవారం ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేట్పురం చేయాలన్న నిర్ణయం వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు కార్యక్రమాన్ని చేపట్టాం. ఈనెల 10వ తేదీన సేకరించిన సంతకాలను ఆయన జిల్లాల కేంద్ర కార్యాలయాలకు తరలిస్తాం. 15వ తేదీన జిల్లాల నుంచి సేకరించిక సంతకాల పేపర్లను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలిస్తాం. ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు తన తాబేదార్లకు మెడికల్ కళాశాల కట్టుపెట్టి ప్రయత్నం చేస్తోంది. రానున్న కాలంలో వైద్యం ప్రైవేటు చేతుల్లోకి పూర్తిగా వెళితే సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతారు... గడచిన 18 నెలల్లో ప్రభుత్వం ఏ రంగంలోనూ వృద్ధి సాధించలేదు. 18 నెలల్లో ఎన్ఆర్ఈజీఎస్లో ఏడు కోట్ల పని దినాలు తగ్గించారు. ప్రభుత్వం ఉపాధి కల్పించలేకపోతోంది. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పేదలకు పని దినాలు కల్పించలేని ఈ ప్రభుత్వం.. అద్భుతమైన ఉద్యోగాలు కల్పిస్తామని ఎలా హామీ ఇస్తుంది?. పేరెంట్స్ మీటింగ్ జరిగిన పాఠశాలలు ఐదేళ్ల క్రితం ఎలా ఉన్నాయో?.. ఇప్పుడు ఎలా ఉన్నాయో చంద్రబాబు గమనించారా.?. రాష్ట్రంలో సాగయ్యే ఈ పంటకు కనీస మద్దతు ధర లేదు. రైతులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాలు ఈ ప్రభుత్వంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మంత్రులు అకౌంటబిలిటీతో మాట్లాడాలి. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది. గడచిన 18 నెలల్లో రాస్తున్న క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. హత్యలు, మానభంగాలు చిన్నారులపై అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. ప్రజల తరపున పోరాటం చేస్తాం. అన్ని వర్గాలకు అండగా ఉంటాం’’ అని బొత్స అన్నారు. -
బందరులో వాజ్‌పేయి విగ్రహ ఏర్పాటుపై అభ్యంతరాలు
సాక్షి, కృష్ణా: బందరులో విగ్రహ రాజకీయం హాట్ టాపిక్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఏర్పాటు కూటమి పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. వాజ్ పేయ్ విగ్రహం పెట్టొద్దంటూ తెలుగు దేశం పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో.. శంకుస్థాపనకు ప్రయత్నించిన బీజేపీ నేతలను అడ్డుకుని నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేసింది. అయితే ఈ పరిణామంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం ఏర్పాటును ఎందుకు అడ్డుకుంటున్నారంటూ టీడీపీ శ్రేణులను నిలదీశారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. -
జగన్ ప్రశ్నలకు మంత్రులు సైలెంట్.. బిత్తరపోయిన చంద్రబాబు
-
సింహాచలం చోరీ కేసు.. అశోక గజపతి మాటేంటి?
తాడేపల్లి, సాక్షి: దేవుడంటే భయం, భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని.. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చేసిన ఆరోపణలే అందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. లడ్డూలు తయారు చేశారని ఆరోపణలు చేశారు. ఆ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయని.. భక్తులు తిన్నారని ఆధారాలు ఉన్నాయా?. తిరుమలకు వచ్చే ఏ ట్యాంకర్ అయినా సరే.. గుర్తింపు సర్టిఫికెట్‌తోనే రావాలి. సర్టిఫికెట్ మాత్రమే కాదు.. టీటీడీ ల్యాబ్‌ల్లోనూ పరీక్షలో నెగ్గాలి. ఆ పరీక్షల్లో రిజెక్ట్ అయితే వెనక్కి పంపిస్తారు..అలా మా హయాంలో 18 సార్లు వెనక్కి పంపించాం. పకడ్బందీగా ప్రొటోకాల్ ఉన్నప్పుడు తప్పెలా జరుగుతుంది?. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. జులైలో 4 ట్యాంకర్లు వెనక్కి పంపారు. మళ్లీ ఆ ట్యాంకర్లే ఆగస్టులో తిరిగి వచ్చాయని.. లడ్డూ ప్రసాదంలో వాడారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది..అలాంటప్పుడు టీటీడీ చైర్మన్, ఈవో ఏం చేస్తున్నారు?. ఇదే నిజమైతే.. ఎవరిని లోపల వేయాలి?.. ఇది చంద్రబాబు వైఫల్యం కాదా? మరి తక్కువ ధరకు కొన్నారు కాబట్టి కల్తీ నెయ్యే అనుకోవాలా?.లడ్డూ ప్రసాదంలో దుష్ప్రచారాలు ఆపాలని.. నిజాలు బయటకు రావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిందే వైవీ సుబ్బారెడ్డి. ఆయన అపర భక్తుడు. నిత్యం గోపూజలు చేస్తుంటారు. అయ్యప్ప దీక్ష చేసి గురుస్వామి అయ్యారు. అలాంటి వ్యక్తిని ఈ కేసుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్పన్న సుబ్బారెడ్డి పీఏ అంటూ ప్రచారం చేశారు. ఆయన అప్పన్న అసలు ఎవరు?. ఏపీ భవన్ ఉద్యోగి. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి పీఏ. అధికార పార్టీతో సంబంధాలు ఉన్న వ్యక్తి. ఎల్లో మీడియా ఎందుకు వైవీ సుబ్బారెడ్డి పీఏగా బోగస్ ప్రచారం చేస్తున్నాయి?. చంద్రబాబు లడ్డూ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌లో ఏర్పాటు చేసిన అధికారులంతా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగు దేశం పార్టీతో సంబంధాలు ఉన్నవాళ్లే. టీడీపీని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేసినవాళ్లే. బాబు మాఫియా కలెక్షన్లలో వీళ్లంతా కీలకంగా ఉన్నవాళ్లే.పరకామణి కేసులో.. పరకామణిలో గతంలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు?. పరకామణి దొంగ.. లెక్కింపులో ఎన్నో ఏళ్లుగా ఉన్నాడు. జీయర్ స్వామి మఠంలో క్లర్క్‌గా పని చేశాడు. ఆ దొంగ దగ్గర 9 డాలర్లు పట్టుబడ్డాయి. దొంగను మేం పట్టుకున్నాం. మీరెందుకు పట్టుకోలేదు. ఈ కేసులో దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. కేసు కోర్టులకూ వెళ్లాయి. అంతా పద్దతి ప్రకారమే జరిగింది. నిందితుడి కుటుంబ సభ్యులు ప్రాయశ్చితంగా రూ.14 కోట్లు విలువైన ఆస్తులన్నీ రాసిచ్చేశారు. పరకామణి కేసులో.. జడ్జిలపైనే వర్ల రామయ్యలాంటి వాళ్లు నిందలేశారు. కేసు పట్టుకున్న వ్యక్తిని మరణించేలా చేశారు. దొంగను పట్టుకోవడం నేరమా?.. ఒక బీసీ పోలీస్ అధికారిని వెంటాడి.. వేధించి.. చనిపోయేలా చేశారు. ఆ మరణాన్ని కూడా రాజకీయం చేయాలనుకున్నారు. ఎల్లో మీడియాతో ఫేక్ కథనాలు రాయించారు.. అని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో సింహాచలం ఆలయంలో చోరీ జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీన రమణ, సురేష్ అనే ఆలయ ఉద్యోగులే చోరీకి పాల్పడ్డారు. వీళ్లిద్దరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. అలా ఎందుకు వదిలేశారు?.. ఇద్దరినీ జైల్లో ఎందుకు పెట్టలేదు?. విచారణ జరిపి పరకామణి కేసులా ఆస్తుల్ని స్వాధీనం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు. సింహాచలం ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి. మరి ఆయన్ని విచారించారా?. వైవీ సుబ్బారెడ్డి, అశోక్ గజపతిలకు చెరో న్యాయమా?.. అని ప్రశ్నించారు. దేవుడి సోమ్ము దొంగల పాలు కాకూడదని టీటీడీలో రూ.23 కోట్లతో సాంకేతికతను జోడించాం. ప్రతీచోట సీసీ కెమెరాలు పెట్టించాం. పారదర్శక వ్యవస్థ తీసుకొస్తే మాపైనే నిందలు వేస్తున్నారు. ఇది ధర్మమేనా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. -
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్.. హైలైట్స్
సాక్షి, తాడేపల్లి: మోసాలతో, కుంభకోణాలతో చంద్రబాబు అండ్ కో ఆంధ్రప్రదేశ్‌ను అడ్డంగా దోచుకుంటున్నారని.. పైగా గోబెల్స్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. పలు అంశాలపై మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్అమరావతిలో భూములు ఎవరూ కొనకూడదు.. అమ్మకూడదని చట్టంలో ఉందికానీ బాబు, ఆయన బినామీలు స్కామ్‌లు చేస్తూనే ఉన్నారుప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును దోచేశారు బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి ఫైబర్‌ను కట్టుబెట్టి వందల కోట్లు దోచిపెట్టారుకేబినెట్ ఆమోదం లేకుండా ప్రివలేజ్ ఫీజులు రద్దు చేశారుప్రివిలేజ్ ఫీజు రద్దు ఫైల్‌పై బాబే సంతకం చేశారుచంద్రబాబుకు దేవుడు.. ప్రజలే బుద్ధి చెబుతారుచంద్రబాబు బరితెగింపు2014-19 మధ్య చంద్రబాబు స్కామ్లుఆషామాషీ స్కాములు కావవి!స్కిల్ స్కామ్ కేసును కేంద్రం కూడా గుర్తించిందిస్కిల్ స్కామ్‌లో 370 కోట్లు షెల్ కంపెనీలకు తరలించారుచంద్రబాబు, బినామీలతో అమరావతి భూకుంభకోణంఇసుక స్కామ్‌తో వందల కోట్లు దోచిపెట్టారువివిధ కేసులలో బెయిల్ మీద ఉన్న చంద్రబాబుచంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారుల్ని బెదిరించారుఅబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించారుబెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ బరితెగింపుబెదిరించి తనపై ఉన్న కేసుల్ని మూసేయించుకుంటున్నారుఉచితం పేరుతో కోట్ల విలువైన స్కామ్‌లు చేస్తున్నారుబాబు అండ్‌కో గోబెల్స్‌ను మించి పోయారువీటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం ఆగదు అశోక్ గజపతిని ఎందుకు విచారణ జరపలేదు?చంద్రబాబు హయాంలో సింహాచలం ఆలయంలో చోరీసెప్టెంబర్ 1 ఆలయ ఉద్యోగులే చోరీకి పాల్పడ్డారురమణ, సురేష్.. ఇద్దరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారుఅలా ఎందుకు వదిలేశారు?.. ఇద్దరినీ జైల్లో ఎందుకు పెట్టలేదువిచారణ జరిపి ఆస్తుల్ని స్వాధీనం ఎంఉదకు చసుకోలేదుసింహాచలం ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిఅశోక్ గజపతిని ఎందుకు విచారించలేదుసుబ్బారెడ్డి, అశోక్ గజపతిలకు చెరో న్యాయమా? పరకామణి కేసులో.. పరకామణిలో గతంలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు?. పరకామణి దొంగ.. లెక్కింపులో ఎన్నో ఏళ్లుగా ఉన్నాడు. జీయర్ స్వామి మఠంలో క్లర్క్‌గా పని చేశాడు. ఆ దొంగ దగ్గర 9 డాలర్లు పట్టుబడ్డాయి. దొంగను మేం పట్టుకున్నాం.. మీరెందుకు పట్టుకోలేదు. ఈ కేసులో దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. కేసు కోర్టులకూ వెళ్లాయి. నిందితుడి కుటుంబ సభ్యులు ప్రాయశ్చితంగా రూ.14 కోట్లు విలువైన ఆస్తులన్నీ రాసిచ్చేశారు. దేవుడి సోమ్ము దొంగల పాలు కాకూడదని రూ.23 కోట్లతో సాంకేతికతను జోడించాం. ప్రతీచోట సీసీ కెమెరాలు పెట్టించాం. టీటీడీలో పారదర్శక వ్యవస్థ తీసుకొస్తే మాపైనే నిందలు వేస్తున్నారు.పరకామణి కేసులో.. జడ్జిలపైనే వర్ల రామయ్యలాంటి వాళ్లు నిందలేశారు. కేసు పట్టుకున్న వ్యక్తిని మరణించేలా చేశారు. ఆ మరణాన్ని కూడా రాజకీయం చేయాలనుకున్నారు. ఎల్లో మీడియాతో ఫేక్ కథనాలు రాయించారు. ఇది ధర్మమేనా? వాళ్లంతా టీడీపీ మనుషులే.. లడ్డూ ప్రసాదంలో వాస్తవాల కోసం వైవీ సుబ్బారెడ్డి కేసు వేశారు నిజాలు బయటకు రావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు అప్పన్న అనే వ్యక్తి సుబ్బారెడ్డి పీఏ కాదుటీడీపీ ఎంపీ వేమారెడ్డి అనుచరుడు.. ఏపీ భవన్ ఉద్యోగిలడ్డూ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌లో అంతా టీడీపీ వాళ్లే ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగు దేశం పార్టీతో సంబంధాలు ఉన్నవాళ్లే టీడీపీని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేసినవాళ్లే. బాబు మాఫియా కలెక్షన్లలో వీళ్లంతా భాగమే దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారుదేవుడంటే భయం, భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారునెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. లడ్డూలు తయారు చేశారని ఆరోపణలు చేశారుఆ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయని.. భక్తులు తిన్నారని ఆధారాలు ఉన్నాయా?తిరుమలకు వచ్చే ఏ ట్యాంకర్ అయినా సరే.. గుర్తింపు సర్టిఫికెట్‌తోనే రావాలిసర్టిఫికెట్ మాత్రమే కాదు.. టీటీడీ ల్యాబ్‌ల్లోనూ పరీక్షలో నెగ్గాలి ఆ పరీక్షల్లో రిజెక్ట్ అయితే వెనక్కి పంపిస్తారుమా హయాంలో 18 సార్లు వెనక్కి పంపించాంపకడ్బందీగా ప్రొటోకాల్ ఉన్నప్పుడు తప్పెలా జరుగుతుంది?బాబు అధికారంలోకి వచ్చాక.. జులైలో 4 ట్యాంకర్లు వెనక్కి పంపారుమళ్లీ ఆ ట్యాంకర్లే ఆగస్టులో తిరిగి వచ్చాయని.. లడ్డూ ప్రసాదంలో వాడారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొందిటీటీడీ చైర్మన్, ఈవో ఏం చేస్తున్నారు?ఇదే నిజమైతే.. ఎవరిని లోపల వేయాలి?.. ఇది చంద్రబాబు వైఫల్యం కాదా? తారాస్థాయికి చంద్రబాబు కక్షా రాజకీయాలుఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నేతలపై కేసులు.. అరెస్టులుచెవిరెడ్డిని జైలుకు పంపారుమిథున్ రెడ్డిని అరెస్ట్ చేయించారు మిథున్‌రెడ్డి బెయిల్ టైంలో ఎందుకు అరెస్ట్ చేశారో? అని జడ్జి ప్రశ్నించారుకాకాణి, శ్రీకాంత్, వంశీ.. వాళ్లను అరెస్ట్ చేశారుపోసాని లాంటి సామాన్యుడ్ని, కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్టును, చివరికి సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధించారుమంత్రి సంద్యారాణి పీఏ వ్యవహారంలో ఆధారాలున్నా చర్యలు లేవువాట్సాప్ మెసేజ్‌లు కళ్ల ముందే కనిపిస్తున్నా పోలీసుల్లో చలనం లేదుఆధారాలు చూపించినా ఇప్పటిదాకా కేసు పెట్టలేదుపైగా వార్త రాసిన సాక్షి, సాక్షి విలేఖరిపై కేసులు పెట్టి నోటీసులు పంపించారు పిన్నెల్లి సోదరులపై తప్పుడు కేసులు పెట్టారురిగ్గింగ్ అడ్డుకున్నందుకే పిన్నెల్లిని జైల్లో పెట్టారుటీడీపీ ఆధిపత్య పోరు ఘటనను.. రాజకీయ ప్రతీకారానికి వాడుకుంటున్నారుటీడీపీ వాళ్లు హత్య చేసుకుంటే.. పిన్నెల్లిని ఇరికించారుచంపింది.. చంపబడ్డవాళ్లు.. టీడీపీ వాళ్లేనని పోలీసులే స్వయంగా చెప్పారుటీడీపీ గొడవల వల్లేనని ఎస్పీ స్వయంగా ట్వీట్ చేశారు చంద్రబాబు పాలనలో పిన్నెల్లిపై పెట్టిన కేసులు 16విశాఖలో వైఎస్సార్సీపీ విద్యార్థి నాయకుడు కొండా రెడ్డిని దొంగ కేసులో అరెస్ట్ చేశారుకొండా రెడ్డిపై గంజాయి కేసు పెట్టారుఆశ్చర్యం ఏంటంటే.. అరెస్ట్ చేసింది ఓ చోట.. నేరం జరిగిందని చెప్పింది మరో చోటఇలాంటి రాజకీయాలతో వ్యవస్థలు బతుకుతాయా?అన్యాయంగా వైఎస్సార్సీపీ వాళ్లను జైలుకు పంపారులిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి చంద్రబాబుఅప్పుడు ఏదైతే స్కామ్ చేశారో.. ఇప్పుడు సీఎంగా అదే పని చేస్తున్నారుఅలాంటి వ్యక్తి తన కేసుల్ని నీరుగార్చేందుకు.. మధ్యలో ఉన్న మా ప్రభుత్వ పాలసీని తప్పుగా ప్రచారం చేస్తున్నారులేని కేసుతో .. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టులు చేశారుమా హయాంలో పని చేసిన అధికారులనూ అరెస్ట్ చేశారుమిథున్రెడ్డి బెయిల్ సమయంలో ఎందుకు అరెస్ట్ చేశారు?అని జడ్జే ప్రశ్నించారు రెడ్‌బుక్ వెర్రితలలు వేస్తోందిరాష్ట్రమంతా కల్తీ లిక్కర్ నడుపుతోంది టీడీడీవాళ్లేమంత్రులు, ఎమ్మెల్యేల మనుషులతోనే ఆ దందా నడిచిందికుటీర పరిశ్రమ లాగా.. రాష్ట్రంలో ప్రతీ మూలా నడిపించారు మా పార్టీకి చెందిన జోగి రమేష్‌పై తప్పుడు కేసు పెట్టారుజోగి రమేష్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారుజోగి రమేష్ కొడుకును కూడా ఇబ్బంది పెడుతున్నారువాళ్ల పార్టీకి చెందిన నిందితులనే ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు వీళ్లదే ప్రభుత్వం.. వీళ్లదే స్కామ్కల్తీ మద్యం కేసుల్లో.. తయారు చేసింది, పంచింది.. దోచుకుంది.. అంతా వాళ్లేరెడ్బుక్ పాలనలో కల్తీ మద్యం తయారు చేసే దమ్ము వేరే పార్టీ వాళ్లకు ఉంటుందా? నమ్మేలా ఉందా ఇది?తప్పుడు ఆధారాలతో.. సాక్ష్యాలతో.. వైఎస్సార్సీపీ వాళ్లను జైల్లో పెడుతున్నారు ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారుపీఆర్సీ లేదు.. ఐఆర్ లేదుచంద్రబాబు రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు ఏపీసీవోఎస్తో వైఎస్సార్సీపీ హయాంలో ఒకటో తేదీనే జీతాలిచ్చాంబాబు హయాంలో ఏపీసీవోఎస్‌ను నీరుగార్చారురెండు , మూడు నెలలకు కూడా ఏవీసీవోఎస్లో జీతాల్లేవుఉద్యమాల్ని ఖాతరు చేయకుండా స్కామ్‌లు చేస్తున్నారుజీతాలు పెరగొద్దని పీఆర్సీ చైర్మన్‌ను కూడా నియమించలేదుఐదు డీఎలు పెండింగ్‌లో ఉన్నాయి.. కేవలం ఒక డీఏ మాత్రమే ఇచ్చారు.. మిగతావి వాయిదాల్లో ఇస్తారట!రిటైర్ అయ్యాక ఎరియర్స్ ఇస్తామన్నది బాబు ప్రభుత్వం మాత్రమేవిశాఖ స్టీల్‌కు సొంత గనుల్లేకనే ఈ నష్టాలుమిట్టల్ అనే ప్రైవేట్ వ్యక్తి కోసం చంద్రబాబు సొంత గనులు ఇవ్వాలని అడుగుతారుకానీ, విశాఖ స్టీల్‌కు మాత్రం అడగరు.. ప్రభుత్వ ప్లాంట్‌ను పట్టించుకోరుఅందుకే గనులు ఇవ్వాలని మేం అసెంబ్లీలో తీర్మానం చేశాంప్రైవేటీకరణ కాకుండా ఆపేశాంస్టీల్ ప్లాంట్ విషయంలో మాములు దగా చేయలేదుఎన్నికల ముందు.. నాడు.. కాపాడుకుంటా.. కలిసి పోరాడతాం అని చెప్పారుఇప్పుడేమో.. ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా?.. తమాషాలొద్దంటూ సీరియస్పీడీ యాక్టులు పెట్టి విశాఖ ఉద్యోగులను లోపల వేస్తారట!దటీజ్ చంద్రబాబు ప్రైవేటీకరణపై కోటి సంతకాలతో కోర్టుకెళ్తాంగవర్నర్ను కలుస్తాం.. కోర్టులో పిటిషన్ వేస్తాంమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సూపర్ స్కామ్లాభం ప్రైవేట్‌వాళ్లకు.. భారం ప్రభుత్వం, ప్రజలకా?ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఉద్యమంకోటి సంతకాలతో 16న గవర్నర్‌ను కలుస్తాం ఆ పత్రాలతోనే కోర్టులో పిటిషన్ సైతం వేస్తాం ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేసి.. ఖూనీ చేశారు నెలకు రూ.300 కోట్లు అవుతుందిఅలా ఏడాదికి అయ్యే ఖర్చు రూ.3600 కోట్లుకానీ, ప్రభుత్వ ఆస్పత్రులను చంద్రబాబు హతం చేస్తున్నారుబకాయిలు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు సర్వీసులను ఆపేశాయి104, 108లు స్కామ్‌గా మారిపోయాయిపేదలకు వైద్య సాయం అందేదెలా?సంజీవని పేరుతో డ్రామాకు తెర తీశారుఇంకోవైపు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్‌గా నడుస్తోందికొత్త కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఒక స్కామ్ అయితే.. ప్రైవేటీకరణ తర్వాత పని చేసే సిబ్బందికి ప్రభుత్వ జీతాలట!ఇది మరో పెద్ద స్కామ్.. బాబు ఇచ్చిన బొనాంజా భూమి, బిల్డింగ్, స్టాఫ్.. జీతాలు అన్నీ ప్రభుత్వానివే.. కానీ, ఓనర్లు ప్రైవేట్వాళ్లుభారం ప్రజలమీదకు.. లాభాలు ప్రైవేట్ వాళ్లకా?? నేటి తరం ఆస్తి చదువుపిల్లల్ని చదివించేందుకు చంద్రబాబు ముందుకు రావడం లేదుస్కూళ్లలో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయినాడు-నేడును పూర్తిగా ఆపేశారుఇంగ్లీష్ మీడియాన్ని ఆపేశారుఫీజు రియంబర్స్మెంట్, వసతి బకాయిలు కోట్లలో పెరిగిపోయాయితల్లికి వందనం పేరిట మోసానికి పాల్పడ్డారువైఎస్సార్సీపీలో జరిగిన మంచిని చంద్రబాబు నిలిపివేశారుకలుషిత ఆహారం.. నీరు.. సరైన వసతులు లేక పిల్లల ప్రాణాలు పోతున్నాయిఅనారోగ్యంతో 29 మంది పిల్లలు చనిపోయారువందలాది మంది పిల్లలు ఆస్పత్రి పాలయ్యారుచిన్నారుల జీవితాలను చంద్రబాబు ఛిద్రం చేస్తున్నారుచంద్రబాబు పాలనలో.. ఇది ఎవరూ జీర్ణించుకోలేని విషయాలు గోబెల్స్‌కే మెంటార్ మన చంద్రబాబుసూపర్ సిక్స్.. సూపర్ సెవెన్.. అన్నీ మోసాలేపెన్షన్లు.. సిలిండర్లు.. ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదుఅయినా కూడా హామీలన్నీ నెరవేర్చామని ప్రచారంహిట్లర్ కాలంలోని జోసెఫ్ గోబెల్స్ ప్రపంచానికి తెలుసు అబద్ధపు ప్రచారాలకు గోబెల్స్ ప్రచారం అంటుంటాంఅందుకే చంద్రబాబు ప్రచారాలకు గోబెల్స్ ప్రచారాలు అని పేరుకానీ, ఆ గోబెల్సే చంద్రబాబు నుంచి చాలా నేర్చుకోవాలిఇలాంటివి చేస్తున్న చంద్రబాబు మీద చీటింగ్ కేసు పెట్టి జైల్లో వేయాలిగతంలో.. వైఎస్సార్సీపీ హయాంలో ఎలా ఉండేది?ఆర్బీకేలు అద్భుతంగా పని చేసేవిరైతులకు గిట్టుబాటు ధర కోసం ఆరాట పడ్డాంబాబు పాలనలో రైతులను దళారులను మోసం చేస్తున్నారుచంద్రబాబేమో చోద్యం చూస్తున్నారుఇచ్చిన హామీలు మోసం.. రైతుల పరిస్థితి దయనీయం.. టాపిక్ డైవర్ట్ కోసం రైతన్నా మీ కోసం అంటూ డ్రామాలుజీవితంలో రైతుల కోసం ఏం చేయని చంద్రబాబు.. బోగస్ ప్రచారాలకు దిగారుఘోరాతి ఘోరంగా ఉంది చంద్రబాబు పాలనదిత్వా తుపాను గురించి ముందస్తు సమాచారం ఉందిపంట కోతలకు సిద్ధంగా ఉందనీ తెలుసుఅయినా చంద్రబాబు ప్రభుత్వం నష్టాన్ని నివారించలేకపోయిందిమా హయాంలో ఇలాంటి విపత్తులు వస్తే పరిస్థితి ఎలా ఉండేది?వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో.. తక్షణ చర్యల ఉండేవిరైతులు ఎలా పోయినా ఫర్వాలేదని చంద్రబాబు అనుకుంటున్నారుకేజీ అరటికి రూ.50 పైసలా?వరి, కొబ్బరి, పత్తి.. ప్రతి పంట పరిస్థితి ఇదే..రైతులు ఎలా బతికేది?.. ఇంత ఘోరంగా పాలన సాగుతోందిచంద్రబాబు అనే వ్యక్తి అసలేం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా?.. సీఎంగా ఉండి ఎందుకు?.. రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ మోసాలేరెండేళ్లలో రూ.40 వేల పంట సాయం ఇవ్వాలి.. కానీ, రూ.10 వేలే ఇచ్చారు 18 నెలల బాబు పాలనలో 17 ప్రకృతి విపత్తులుకూటమి పాలనలో రైతుల జీవితాలు ఛిన్నాభిన్నంరూ.1,100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు వైఎస్సార్సీపీ హయాంలో హక్కుగా ఉచిత పంటల బీమావైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.7,000 కోట్ల ఉచిత పంటల బీమాచంద్రబాబు పాలనలో ఉచిత పంటల బీమా పేరిట మోసం84 లక్షల మంది రైతులు ఉంటే.. 19 లక్షల మందికే ఇన్సూరెన్స్ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలీదుఇన్పుట్ సబ్సిడీలు ఎప్పుడిస్తారో తెలియదుదయనీయంగా ఏపీ కౌలు రైతుల పరిస్థితిమరి గతంలో ఎలా ఉండేది?.. వైఎస్సార్సీపీ హయాంలో పండుగలా వ్యవసాయం62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారుచంద్రబాబు హయాంలో దండుగగా మారిన వ్యవసాయంమోంథా తుపానును పీకపట్టి చంద్రబాబు, లోకేష్, పవన్‌లే ఆపినట్లు బిల్డప్ ఇచ్చారుతుపాను తర్వాత కూడా రైతులకు న్యాయం చేయలేదునష్టపోయిన రైతులకు పైసా సాయం అందించలేదుపైగా పంట నష్టాన్ని దారుణంగా తగ్గించారు సేవ్ ఆంధ్రప్రదేశ్‌లా.. పాలనరాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం గురించి చాలా విషయాలు తెలియాల్సి ఉందినాణేనికి రెండో వైపు ఎలా ఉందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందిరాష్ట్రంలో సేవ్ ఆంధ్రా పాలన జరుగుతున్నదిరాష్ట్రం మొత్తం దేశం వైపు చూడాలిరైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందిరైతు, రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎదగదు -
ప్రజా ధనంతో ప్రభుత్వ పెద్దల జల్సాలు!
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రం ఆర్థిక లోటులో ఉందని.. అది అర్థం చేసుకోవాలంటూ ఏపీ ప్రజల ముందు నారా చంద్రబాబు నాయుడు ఆడే డ్రామాలు తెలియంది కాదు. ఈ వంకతో ఎన్నికల సమయంలో ప్రకటించిన సంక్షేమ పథకాలను ఎగ్గొడుతూ వస్తున్నారు కూడా. అయితే రాష్ట్రం అప్పులలో కూరుకుపోతున్నా సరే.. ప్రజా సొమ్ముతో ప్రభుత్వ పెద్దల జల్సాలు మాత్రం ఆగడం లేదు.. రాష్ట్రం ఆర్ధిక లోటులో ఉన్నా సరే.. ప్రభుతవ ఖజానాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు గండికొడుతూనే ఉన్నారు. ప్రత్యేక విమానాల్లోనే పర్యటనలకు మొగ్గు చూపిస్తున్నారు. వీకెండ్ ఎంజాయ్మెంట్కైతే అధికారిక పర్యటనలనే వంకతో తెగచక్కర్లు కొట్టేస్తున్నారు. దీంతో ఖర్చు తడిసి మోపెడు అవుతోందిసీఎం అయినప్పటి నుంచి చంద్రబాబు ఇప్పటిదాకా 88 సార్లు ప్రత్యేక విమానాల్లో తిరిగారు. అయితే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి నిజంగానే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉదయం టిఫిన్ మంగళగిరిలో, లంచ్ తిరుపతిలో, డిన్నర్ హైదరాబాదులో.. ఇలా ఆయన ప్రత్యేక పర్యటనలకు మాత్రం లెక్కే లేకుండా పోయింది. ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ నుంచి ఆయన కాలు కింద పెట్టడం లేదని అధికార వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ఇప్పటిదాకా 92సార్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించారు. ఈ మధ్యే క్రికెట్ చూడటానికి ప్రత్యేక విమానంలో దుబాయ్, ముంబై వెళ్లారు కూడా. అయితే సొంత ఖర్చులతో ఆయన ఇదంతా చేస్తున్నారని.. ఆర్టీఐ ద్వారా ఈ విషయం తేటతెల్లమైందంటూ ఆయన వర్గీయులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇటు వైఎస్ జగన్ మీద ఫోకస్ పెడుతూ కూటమి పెద్దల విలాసాలను ప్రజల్లోకి పోనీయకుండా ఎల్లో మీడియా జాగ్రత్త పడుతోంది. -
ఉన్నమాటతో ఉలికిపడుతున్న చంద్రబాబు!
సాక్షి, తాడేపల్లి: ‘‘హలో ఇండియా.. ఓ సారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి! అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఏపీలో రైతుల దుస్థితి తెలుపుతూనే.. సేవ్ ఏపీ ఫార్మర్స్ (#SaveAPFarmers) పేరుతో సదీర్ఘమైన పోస్ట్ ఒకటి ఉంచారాయన. ఈ ఉదయం మరోసారి ఆ ట్వీట్ సారాంశాన్ని తెలుగులో ప్రస్తావిస్తూ రీట్వీట్ చేశారు.కిలో అరటిపండ్లను రైతుల నుండి కొంటున్నది కేవలం 50 పైసలకే!. ఒక అగ్గిపెట్టె, ఒక బిస్కెట్ కంటే కూడా అరటిపండ్లు చౌక. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి.. నెలల తరబడి కష్టపడి వ్యవసాయం చేస్తే.. చివరికి రైతులకు దక్కే ప్రతిఫలం ఇదేనా? అంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు. ఉల్లిపాయల నుంచి టమాట వరకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని పేర్కొంటూ ఏపీ అన్నదాతలు అవస్థలను దేశం దృష్టికి తీసుకెళ్లారాయన. అలాగే.. అన్నదాతలకు దన్నుగా నిలవాల్సిన చంద్రబాబు సర్కారు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండడాన్ని సూటిగా ప్రస్తావిస్తూ తీవ్రంగా ధ్వజమెత్తారు.హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి!ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే!అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్‌లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి. ఒక అగ్గిపెట్టెకన్నా, ఒక్క బిస్కెట్ కన్నా చవక. లక్షల రూపాయలు పెట్టి, నెలల తరబడి కష్టపడి సాగు చేసే రైతులకు… https://t.co/6HVqS4Wk1N— YS Jagan Mohan Reddy (@ysjagan) December 2, 2025జగన్ ట్వీట్‌తో చంద్రబాబు ప్రభుత్వం భుజాలు తడుముకుంటోంది. సాధారణంగా జగన్ ప్రెస్‌మీట్ పెట్టినా.. ఏదైనా ట్వీట్ చేసినా వెంటనే మీడియా ముందుకు వచ్చి అబద్ధపు ప్రకటనలు చేయడం టీడీపీ అండ్ కోకు అలవాటుగా మారింది. ఇప్పుడు ఆయన చెప్పిన లెక్కలు సరైనవి కావడం, పైగా కళ్ల ముందు ప్రత్యక్షంగా పరిస్థితులు కనిపిస్తుండడంతో ఖండించలేని స్థితిలో ఉండిపోయింది. మరోవైపు.. అవి వాస్తవాలు కావడంతో ఎలా కవరింగ్ చేసుకోవాలో అర్థంకాక ఇటు ఎల్లో మీడియా అవస్థలు పడుతోంది. 📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH!One kilogram of bananas is being sold for just Rs 0.50!Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP.Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who… pic.twitter.com/Egqh7oXDRD— YS Jagan Mohan Reddy (@ysjagan) December 1, 2025 -
హలో ఇండియా... ఓసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి.
-
కూటమి సర్కార్ నిర్లక్ష్యం.. అనంతలో అరటి రైతుల ఆగ్రహం (చిత్రాలు)
-
మీకు అధికారం ఇచ్చినందుకు రైతులకు బాగా బుద్ది చెప్పారు..
-
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక అభివృద్ధి మాటున భూ దోపిడీ...
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక బడా స్కాం: గోపిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో టీడీపీ నేతలకు కట్టబెట్టి వందల కోట్లు దోచుకునే కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. యాభై ఎకరాల మెడికల్ కాలేజీ భూముల్ని కేజీ టమోటా ధరకు సమానంగా అమ్మేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారాయన. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ వెనుక స్కాం ఉంది. టీడీపీ నేతలకు కాలేజీలను కట్టబెట్టి వందల కోట్లు దోచుకుంటున్నారు. మెడికల్ సీట్లను చంద్రబాబు ప్రభుత్వం అమ్ముకోవడానికి రెడీ అయ్యింది. మెడికల్ కాలేజీలను 66 సంవత్సరాలు లీజుకు ఇవ్వటానికి జీవోలు ఇచ్చారు..తరతరాలుగా తమ వారికి దోచిపెట్టే ప్లాన్ చేశారు. యాభై ఎకరాల మెడికల్ కాలేజీల భూములను కేజీ టమోటా ధరకు సమానంగా అమ్మేస్తున్నారు. ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీ అయినా సరే జగన్ కట్టించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలాగా ఉన్నాయా?. అత్యద్భుతంగా జగన్ మెడికల్ కాలేజీలను నిర్మిస్తే చంద్రబాబు వాటిని సింపుల్‌గా అమ్మేస్తారా?. దేశంలో ఎక్కడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేయలేదు. కానీ చంద్రబాబే ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ వారికి ఇచ్చాక కూడా స్టాఫ్‌కి ప్రభుత్వమే జీతాలు ఇస్తుందట.. ఏంటసలు?. ఒక పేదవాడు అత్యవసర వైద్యం కోసం వస్తే వైద్యం చేసే పరిస్థితి ఉంటుందా?. ఒకవేళ ఆస్పత్రి 70% ఫుల్ అయిందని చెప్పి వెనక్కు పంపితే ఆ పేదోడు బతికేదెలా?. వైద్య విద్య మీద ఈ ప్రభుత్వం సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేదా?. ఇప్పటికే చంద్రబాబు వైఖరి వల్ల 2,750 మెడికల్ సీట్లు కోల్పోయాం. పాడేరు మెడికల్ కాలేజీ విషయంలో 50 సీట్లు కోల్పోయాం. ఇటీవల ఆ ప్రాంతంలో గర్భిణులు, హాస్టల్ విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడ్డారో కనపడలేదా?. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు మంచి స్పందన వస్తోంది. మేం అధికారం చేపట్టాక ప్రైవేటీకరించిన మెడికల్ కాలేజీలను తిరిగి స్వాధీనం చేసుకుని తీరతాం అని అన్నారాయన. -
అయ్యా చంద్రబాబూ.. ఇనుప ముక్కలు తిని బతుకుతున్నావా?
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నోరు తెరిస్తే వ్యవసాయం దండుగ అంటున్న సీఎం చంద్రబాబు నాయుడికి ఓ రైతు సూటి ప్రశ్నలతో చురకలు అంటించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బ్రహ్మణపల్లి పర్యటనలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. రైతు ఉత్సాహం గమనించిన వైఎస్ జగన్ మీడియా ముందు మాట్లాడాలని కోరారు.‘‘అయ్యా చంద్రబాబూ.. మాట్లాడితే వ్యవసాయం దండగ, వ్యవసాయం దండగ అంటున్నావ్ కదా. నువ్వేమైనా ఇనుప ముక్కలు తిని బతుకుతున్నావా?. రైతులంతా కన్నెర్ర చేస్తే ఏం తిని బతుకుతావ్?. దేశానికి రక్షణ ఎంత అవసరమో.. రైతు కూడా అంతే ముఖ్యం. పసిపిల్ల పాల దగ్గరి నుంచి ప్రతీది రైతు మీద ఆధారపడి బతకాల్సిందే. అలాంటిది.. రైతును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావ్?’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చంద్రన్న దిగిపోవాలి.. జగనన్న రావాలి
వ్యవసాయం వద్దంటారు.. సేద్యం ముద్దంటారు. యూరియా వేస్తె క్యాన్సర్.. వరి వేస్తె షుగర్. ఓటుకు ముందోమాట.. గెలిచాక ఇంకోమాట.. ప్రపంచంలో మొత్తం. ఊసరవెల్లులు ఎన్ని రంగులు మారుస్తాయో చెప్పలేం కానీ రాజకీయ ఊసరవెల్లి చంద్రబాబు మాత్రం పూటకోమాట మారుస్తారు. రైతులతో అవసరం ఉంటే ఒకమాట.. గెలిచేందుకు వారి సాయం కావాలంటే ఒకమాట.. గెలిచాక ఇంకో మాట.. సేద్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేస్తున్న తరుణంలో ఇంకోమాట.. పంటలు గిట్టుబాటు ధర ఇవ్వలేనప్పుడు .. ప్రజలకు మొహం చూపలేని పరిస్థితుల్లో ఇంకోమాట.. రైతుల పంటలను కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో వారికి సమాధానం ఇవ్వలేని తరుణంలో ఇంకోమాట.. ఇలా గంటగంటకూ మాటలు మారుస్తూ మాయలు చేసే చంద్రబాబు పాలనలో రైతులు నిలువునా మునిగిపోయారు. చేలకు పురుగుపడితే ఏదో మందు కొట్టి ఆపొచ్చు.. కానీ ప్రభుత్వమే పురుగులా మరి వ్యవసాయాన్ని తొలిచేస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. .. కాపుగాయాల్సినవాళ్ళే కాల్చేస్తుంటే రైతు ఎవరికీ చెప్పుకుంటాడు.. యేమని చెప్పుకుంటాడు. వ్యవసాయం.. పంటలసాగుపై చంద్రబాబు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు..ప్రాజెక్టులు కడితే డబ్బులు దండగ.. ఐటీని ప్రమోట్ చేయాలి..వ్యవసాయం దండగ..వరి పండిచొద్దు.. బియ్యం తింటే డయాబెటిస్ వస్తుంది..ఉచిత విద్యుత్ ఇస్తే రైతులు కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలి..యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది..ఎరువుల వినియోగం తగ్గించాలి.. దీని వల్ల భూసారం తగ్గుతోంది.. చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు, ఉండబోదు( మాట తడబాటు )..వ్యవసాయంలో ఉపాధి లేదు.. సేవా రంగమే భేష్వ్యవసాయం వల్ల ఆదాయం అంతంత మాత్రమే..1995-2004 (మొదటి ముఖ్యమంత్రి కాలం) వ్యవసాయం "భారం" (దండగ/శిక్ష) అని పేర్కొన్నారు. 2004లో వైయస్ రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. తన పాలనలో రైతులను ప్రాధాన్యత ఇవ్వలేదని తర్వాత (2012) అంగీకరించారు. రైతులకు 87 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చి రూ.15 వేల కోట్లు కూడా చేయలేదు. 1999లో రైతుల ఆత్మహత్యలకు పరిహారం ఇవ్వడం వల్ల మరిన్ని ఆత్మహత్యలు పెరుగుతాయని చంద్రబాబు కామెంట్ చేసారు. తన పుస్తకం మనసులో మాటలో (Manasulo Maata) ఈ వ్యాఖ్య ఉంది. 1995-2004 మధ్య 25,000 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శలున్నాయి. 2012, జనవరి 21 నెల్లూరు, కందుకూరులో TDP సభలో మాట్లాడిన చంద్రబాబు మొదటి సారి ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో రైతులను "విస్మరించాను, తప్పు చేశాను" అని క్షమాపణ చెప్పారు..తిరిగి.. 2014, డిసెంబర్ 24న ముఖ్యమంత్రిగా చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు కేవలం కరువు కారణంగా కాదు, "ప్రేమ విషాదం, రుణాలు, కుటుంబ సమస్యలు" కారణం అన్నారు.. ఇది తీవ్ర విమర్శలకు కారణమైంది. 2025, సెప్టెంబర్ 15-16 న కేబినెట్ సమావేశంలో యూరియా అధికంగా వాడితే క్యాన్సర్ వస్తుందని, రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమయంలో యూరియా లభించక రైతులు అల్లాడిపోతున్న తరుణంలో తన చేతగాని తనాన్ని తప్పించుకోవడానికి ఇలా మాట్లాడారు. 2025, నవంబర్ 12-13న "నీళ్లు ఉన్నందుకే వరి పండిస్తే, ఎవరూ మీ వరిని తినరు" అని చంద్రబాబు చెప్పారు. వరి పంటలకు బదులు ఇతర పంటలు పండించాలని సూచించారు.పైవన్నీ చంద్రబాబు నోటినుంచి వెలువడిన ముత్యాల మాటాలు కొన్ని మచ్చుకు. ఇక ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గెలిచాక మొక్కజొన్న, మామిడి.. అరటి.. పొగాకు.. మిర్చి రైతులు నిట్టనిలువునా మునిగిపోయారు. పండిద్దాం అంటే ఎరువులు దొరకవు.. పంటలు పండించాక అమ్ముదాం అంటే ధర దక్కదు.. ఆనాడు మామిడి రైతులు కిలో ఐదారు రూపాయలకు సైతం అమ్ముకోలేక వీధుల్లో పళ్ళను పారబోశారు.. నేడు అరటి రైతులు గెలలను పశువులకు వేస్తున్నారు.. అవి కూడా సయించక తినకపోవడంతో కొందరు రైతులు ఏకంగా అరటి తోటలను ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం సాగదు .. రైతు ఏడ్చిన రాష్టం ముందుకు నడవదు అనే సామెత ఏపీలో అక్షరాలా నిజమవుతోంది. నేడు కిలో అరటి కాయలు అర్ధరూపాయికి అమ్మాలంటే కన్నీళ్లొస్తున్నాయంటూ రైతులు పొలం గట్టున కూర్చుని ఏడుస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో కూడా అకాల వర్షాలకు అరటి పంటను నష్టపోయిన దాదాపు 670 మంది రైతులకు వైయస్ జగన్ హెక్టారుకు రూ. 20 వేలు చొప్పున సొంత డబ్బులు అందించి వారిని నిలబెట్టారు.. నాయకుడికి నయవంచకుడికి ఉన్న తేడాను వైఎస్ జగన్ తన మంచి మనసుతో చాటుకున్నారు.. ప్రజలకు కష్టం వస్తే జగనన్న.. ఆపద వస్తే జగనన్న.. కన్నీరొస్తే తుడవడానికి జగనన్న ఉండాలి.. ఆయనే రావాలి.. అదీ ప్రజల ప్రస్తుత పరిస్థితి..:::సిమ్మాదిరప్పన్న -
పులివెందుల: అరటి రైతుల కష్టాలు విన్న వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల పర్యటనలో భాగంగా.. బ్రహ్మణపల్లి అరటి రైతులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కలిశారు. వైఎస్ జగన్‌కు రైతులు ఆకుపచ్చ కండువా కప్పి తోటల పరిశీలనకు ఆహ్వానించారు. సాగు నష్టాన్ని స్వయంగా వైఎస్ జగన్ పరిశీలిస్తూ.. వాళ్ల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు.ఎకరానికి లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే.. రెట్టింపు నష్టాలు వాటిల్లుతున్నాయని పలువురు రైతులు ఆయన వద్ద వాపోయారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని ఈ సందర్భంగా వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. జగన్ హయాంలో అరటి రైతుల కోసం రూ. 20.15 కోట్లతో ఈ భవనాన్ని ప్రారంభించారు. ప్రతిరోజూ 32 టన్నుల సామర్థ్యం కలిగిన ప్రత్యేక టబ్‌లో అరటి కాయలను శుభ్రపరిచే యూనిట్‌తో పాటు 45 కిలోవాట్ల కూలింగ్ ఛాంబర్, 30.6 కిలోవాట్ల కోల్డ్ స్టోరేజ్, ఆరు కూలింగ్ సెల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. మార్కెట్లలో తగిన ధర లభించే వరకు రైతులు అరటి, నారింజ పండ్లను 40 రోజుల పాటు నిల్వ చేసుకునే కెపాసిటితో నిర్మించారు. అలాగే.. ప్లాంట్ ఆవరణలో 60 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో వే బ్రిడ్జ్ నిర్మించారు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దుర్మార్గంగా దీనిని మూసేయించింది. ఇదీ చదవండి: బాబు పాలనలో గిల‘గెల’! -
‘పరకామణి కేసులో డీజీ నన్ను ఈ ప్రశ్నలే అడిగారు’
సాక్షి, తిరుపతి: పరకామణి చోరీ కేసులో వైఎస్సార్సీపీ కీలక నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి సిట్ విచారణ ముగిసింది. మంగళవారం సాయంత్రం అధికారుల ఎదుట హాజరైన ఆయన్ని 25 నిమిషాలపాటు విచారించి పంపించేశారు. అయితే.. విచారణకు హాజరయ్యే ముందు, ఆ తరవాత ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విచారణకు ముందు.. నాకు ఈ కేసుకు భూమికి, నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. కూటమి ప్రభుత్వాన్ని మోసే పిచ్చి శునకాలు అక్షరాల విరోచనాలతో తమ పత్రికను నింపేశాయి. నన్ను ఈ కేసులో ఇరికించాలని దుష్టచతుష్టయం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నారా లోకేష్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, వర్ల రామయ్య, పట్టాభిలు నన్ను కచ్చితంగా విచారణ చెయ్యాలని అధికారులపై ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడి భరించలేకనే అధికారులు నన్ను పిలిచారు. అయినను పోయి రావలె హస్తినకు.. ’’ అని భూమన అన్నారు. విచారణ అనంతరం.. నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని ...? 15 ఏళ్లలో శ్రీ వారికి తలనీలాలు ఎంత మంది సమర్పించారూ.. అనేవిధంగా ప్రశ్నలు వేస్తే నాకు తెలియదు. పరకామణి కేసు విషయంలో నాకు అంతే తెలుసు. పరకామణి కేసులో డీజీ నన్ను ఈ ప్రశ్నలే అడిగారు. నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను అని చెప్పి వెళ్లిపోయారాయన. -
ధర పతనం.. అరటి రైతులకు శోకం
సాక్షి, అమలాపురం/ రావులపాలెం: తీపి పంట అరటి.. రైతు నోరు చేదు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అంచనాలకు మించి దిగుబడి రావడం, ఉత్తరాదికి ఎగుమతులు క్షీణించడం, దేశీయంగా అరటి ధరలు గణనీయంగా పడిపోవడం, జిల్లా రైతులకు శాపంగా మారింది. ధరలు తగ్గడంతోపాటు ఎగుమతులు కూడా పెద్దగా సాగకపోవడంతో అరటి రైతులు విలవిలలాడుతున్నారు. (Banana Prices Drop In AP)ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అరటి సాగు అధికం. ఒక్క కోనసీమ జిల్లాలోనే సుమారు 25,204 ఎకరాల్లో అరటి పంట సాగు జరుగుతోంది. రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు, పి.గన్నవరం, కపిలేశ్వరపురం, అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో ఈ సాగు అధికం. డెల్టాలోనే కాకుండా లంక గ్రామాల్లో అరటి ఏక పంటగాను, కొబ్బరిలో అంతర పంటగా సాగవుతోంది. మొత్తం సాగులో 80 శాతం తెల్ల అరటి, కర్పూరం కాగా, మిగిలిన 20 శాతం కూర అరటి, అమృతపాణి, ఎర్ర చక్కెర కేళీ వంటి రకాలు పండిస్తున్నారు.ఈసారి సీన్ రివర్స్సాధారణంగా కార్తిక మాసంలో అరటి ధరలు అధికంగా ఉంటాయి. కాని ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. కార్తిక మాసం మొదలైన నాటి నుంచి అరటి ధరలు తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం రావులపాలెం, అంబాజీపేట మార్కెట్ యార్డులలో అరటి ధరలు పరిశీలిస్తే కర్పూరం కనిష్టంగా రూ.100, గరిష్టంగా రూ.200 చొప్పున ఉంది. చక్కెర కేళీ (తెలుపు) రూ.150 నుంచి రూ.250 వరకు, బుషావళి రూ.125 నుంచి రూ.200 వరకు, బొంత (కూర అరటి) రూ.150 నుంచి రూ.200 వరకు, అమృతపాణి రూ.200 నుంచి రూ.350 వరకు, చక్కెర కేళీ (ఎరుపు) రూ.200 నుంచి రూ.300 వరకు ఉంది. ఇప్పుడున్న ధరలకు గెలకు అదనంగా రూ.100 నుంచి రూ.150 వరకు ఉంటే కాని రైతులకు గిట్టుబాటు కాదు. పైగా ఈ ధరలు నాణ్యత ఉన్న గెలలకు మాత్రమే. ఇప్పుడు మార్కెట్‌కు వస్తున్న గెలలు చాలా నాసిరకంగాను, చిన్న సైజువి కావడంతో ధరలకు మరింత కోత పెడుతున్నారు. (Banana Farmers Struggles In AP)నాణ్యత లేక ధరాఘాతం గత నెలలో వచ్చిన మోంథా తుపాను ప్రభావంతో ఈదురుగాలులు, వర్షాలకు అరటి తోటలు పెద్ద ఎత్తున నేలనంటిన విషయం తెలిసిందే. జిల్లాలో 3,379.90 ఎకరాల్లో పంట నేలకొరిగి దెబ్బతింది. తుపాను బారి నుంచి తప్పించుకున్న చోట్ల గాలులకు మొవ్వు ఒడి తిరిగిపోయింది. దీనివల్ల చెట్టు శక్తి కోల్పోవడంతో ఆ ప్రభావం గెలలపై పడింది. దీనివల్ల ఇప్పుడు కోత కోస్తున్న గెలల్లో 60 శాతం నాసిరకం గెలలు, మరో 20 శాతం మధ్యస్థంగా ఉండే మొరటు (నాణ్యమైన) గెలలు, మరో 20 శాతం మొరటు గెలలు వస్తున్నాయని రావులపాలెం మార్కెట్ యార్డు వ్యాపారులు చెబుతున్నారు.పది రోజులుగా పెరిగిన మంచు కూడా అరటి కాయల దిగుబడిని దెబ్బ తీస్తోంది. కాయల సైజు తగ్గిపోతోందని రైతులు వాపోతున్నారు. ఈ కారణంగా ఆశించిన ధరలు రావడం లేదంటున్నారు. దీనివల్ల రావులపాలెం మార్కెట్ యార్డు నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. సీజన్లో ఇక్కడ నుంచి రోజుకు 25 నుంచి 30 లారీల అరటి (లారీకి సగటున 800 గెలలు) చొప్పున రోజుకు 25 వేల గెలలు ఎగుమతి జరిగేది. ఇప్పుడు కేవలం 15 వేల నుంచి 18 వేల గెలలు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి.నలువైపులా పోటీరాయలసీమ జిల్లాలు కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురంలో దశాబ్దకాలంగా అరటి సాగు అధికంగా ఉన్నా అక్కడ జి–9 మాత్రమే పండించేవారు. ఇప్పుడు కర్పూరం అధికంగాను, అమృతపాణి, చక్కెర కేళీలు అధికంగా సాగు చేస్తున్నారు. మంచి దిగుబడి మొరటు 80 శాతం వరకు వస్తున్నాయి. దీనితో అక్కడ అరటికి డిమాండ్ పెరిగింది.ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి అరటి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్‌కు ఎగుమతి అధికం. ఎర్ర చక్కెర కేళి మాత్రం తమిళనాడు వెళుతోంది. ఈ ఏడాది శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తెలంగాణలోని ఖమ్మం, భద్రాది కొత్తగూడెంలో కూడా అరటి విస్తారంగా సాగు జరిగింది. మంచి దిగుబడి కూడా వస్తోంది. దీంతో ఉత్తరాదికి ఆయా జిల్లాల నుంచి ఎగుమతి అధికంగా ఉండడంతో ఇక్కడ అరటికి డిమాండ్ తగ్గింది.(Banana Farmers Challenges)తమిళనాడుకు ఎర్ర చక్కెర కేళీ ఎగుమతి అధికం. సీజన్లో దీని ధర రూ.400 నుంచి రూ.500 వరకు ఉంటోంది. ఇప్పుడు దిగుబడి నాణ్యత లేని కారణంగా రూ.200 నుంచి రూ.300కు పడిపోయింది. గతంలో రోజుకు ఆరు నుంచి ఎనిమిది మినీ వ్యాన్ల అరటి ఎగుమతి జరిగేది. ఇప్పుడు ఇది నాలుగు వ్యాన్లకు మించడం లేదు. పైగా తమిళనాడు నుంచి బొంత అరటి ఇక్కడకు పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది. దీని ధర కూడా తక్కువగా ఉండడం విశేషం.సంక్రాంతి వరకు డిమాండ్ వచ్చేలా లేదురావులపాలెం మార్కెట్‌కు పదిహే ను రోజులుగా నాణ్యత లేని గెలులు అధికంగా వస్తున్నాయి. తుపాను ప్ర భావం, మంచు వల్ల గెలల నాణ్యత దెబ్బతింటోంది. ధర పడిపోయింది. రాయలసీమలో పంట పెరగడం కూడా ధర పెరుగుదలకు అడ్డంకిగా మారింది. పండగల సీజన్ పూర్తవడంతో సంక్రాంతి వరకు డిమాండ్ వ చ్చేలా లేదు. – కోనాల చంద్రశేఖర్, అరటి వ్యాపారి, ఊబలంక, రావులపాలెం మండలంగాలులు దెబ్బ తీశాయితుపాను వల్ల ఈదురు గాలులకు అరటి తోటలకు పెద్ద దెబ్బ తగిలింది. గెలలు సరిగా తయారవడం లేదు. దీనివల్ల ధర రావడం లేదు. తుపాను ముందు గెల రూ.200 నుంచి రూ.400 వరకు ఉంది. ఇప్పుడు సగం ధర కూడా రావడం లేదు. గెలలు తయారవుతున్న సమయంలో గాలులు దెబ్బ తీశాయి.– పిల్లా గంగాధర్, అరటి రైతు, అంబాజీపేట -
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ ముసుగులో రియల్ దందా...
-
‘రైతన్న మీకోసం’లో అచ్చెన్న నవ్వులపాలు!
సాక్షి కృష్ణా: ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఘంటసాలలో ప్రభుత్వం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయ్యింది. ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం రైతులతో ముఖాముఖీ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే ఆ కార్యక్రమంలో రైతుల వద్దకు వెళ్లేందుకు అచ్చెన్న భయపడినట్లు ఉన్నారు. అందుకే అన్నదాతలకు బదులు టీడీపీ నేతలతో ముఖాముఖీ నిర్వహించారు. ముఖాముఖిలో అయినపూడి యశోధర, దోనేపూడి విజయలక్ష్మి, బంజి పరాత్మరరావులు అచ్చెన్నతో మాట్లాడారు. బండి పరాత్మర రావు ఘంటసాల పీఏసీఎస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. యశోధర, విజయలక్ష్మిలిద్దరూ టీడీపీ నేతకు సంబంధించిన కుటుంబీకులు. అలా.. ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం నిర్వహించామని చెబుతూ సొంతపార్టీ నేతలతోనే మాట్లాడి మంత్రి అచ్చెన్న నవ్వులపాలయ్యారు. -
‘స్పెషల్ ఫ్లైట్‌లో తిరిగే చంద్రబాబుకి రైతుల కన్నీళ్లు పట్టవు’
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని శింగనమల వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు కష్టాలు తప్పవు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. అయినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడంలేదు. అరటి, ఉల్లి, మొక్కజొన్న, ధాన్యం, కొబ్బరి... ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. చంద్రబాబు ప్రతిరోజూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తికి రైతుల కన్నీరు కనిపించడం లేదా?. అలాంటప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయనేం చేస్తున్నట్లు అని శైలజానాథ్ అన్నారు. -
కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యమా?... సీఎం చంద్రబాబు
-
‘మన డప్పు కొట్టదు.. అందుకే రానివ్వొద్దు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పాలకుల ధోరణి పక్షపాతంగా మారితే ప్రజాస్వామ్య విలువలు తుడిచిపెట్టుకుపోతాయి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతను మరిచి, మీడియా స్వేచ్ఛను అడ్డుకుంటే అది ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా మారుతుంది. ఇదే పరిస్థితి ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది.ఇటీవల పెండ్లిమర్రిలో నిర్వహించిన పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమానికి అన్ని మీడియా సంస్థలకు అనుమతి ఇచ్చినప్పటికీ, 'సాక్షి' మీడియా ప్రతినిధిని అనుమతించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే అనుమతి నిరాకరణ జరిగిందని అధికారులు పేర్కొనడం మరింత చర్చనీయాంశమైంది.ఇది కేవలం ఒక మీడియా సంస్థను లక్ష్యంగా చేసుకున్న కుట్రగా భావిస్తున్నట్లు జర్నలిస్టు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే మంజూరు చేసిన పాస్ ఉన్నా, చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం పక్షపాత ధోరణికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లోనూ, మీడియా వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. అధికారిక కార్యక్రమాల్లో మీడియాను అడ్డుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నా.. లేకున్నా.. మీడియా ప్రతినిధులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉండేది. మీడియా ముఖంగా ప్రజలతో మాట్లాడే ధోరణి ఆయనలో కనిపించేది. ఇది పాలకుడిగా ఆయనలో ఉన్న ప్రజాస్వామ్య గుణాన్ని ప్రతిబింబిస్తుంది. అదే చంద్రబాబు పాలనలో మాత్రం మీడియా స్వేచ్ఛపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవాలతో ప్రశ్నించడం.. అనుకూల పత్రికల్లా బాకా ఊదకపోవడమే సాక్షికి అనుమతి నిరాకరించారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. -
వైఎస్సార్సీపీ నేత వెంకటరెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఆయన నివాసానికి వచ్చిన తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తున్నారు. ఆ సమయంలో వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడంపై వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో వాళ్ల ఫోన్లు లాక్కున్న పోలీసులు.. భయబ్రాంతులకు గురి చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై వెంకటరెడ్డి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటరెడ్డి సతీమణి హరిత సాక్షితో మాట్లాడుతూ.. నా భర్తకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని పోలీసులు చెప్పారు. వాటిని మాకు కనీసం చూపించలేదు. పోలీసులు మా ఫోన్లు బలవంతంగా లాక్కున్నారు. నా భర్తను తమ వెంట తీసుకెళ్లారు. ప్రశ్నించిన వారి నోరు మూయించడం సరికాదు అని అన్నారు. కేసు ఏంటంటే.. టీటీడీ విజిలెన్స్ మాజీ అధికారి సీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణంపై సోషల్ మీడియాలో ప్రచారం చేశారంటూ వెంకటరెడ్డిపై చర్యలకు దిగారు. తాడిపత్రి రూరల్ పోలీసులు 352, 353(1)(2), 196(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ఉత్త ఒప్పందాలే... రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులంటూ చంద్రబాబు ప్రచార ఆర్భాటం
-
మోసాలతో పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం
-
సెంటు భూమి ఇవ్వలేదు... 3 లక్షల ఇళ్లు కట్టేశాడంట బాబును చీదరించుకుంటున్న జనం
-
YSRCP సమర శంఖం
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ సమరభేరి
-
ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నేడు కోటి గొంతుకల గర్జన.... చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమ కార్యచరణ ప్రకటన
-
ఏపీ ఇక సూడాన్.. 17 నెలల్లో బాబు చేసిన అప్పు
-
ఎమ్మెల్యేలు తప్పు చేస్తే నాకు సంబంధం లేదు
సాక్షి, అమరావతి: కూటమి ఎమ్మెల్యేలు ఇక నుంచి చేసే తప్పులకు.. తనకు ఎలాంటి సంబంధం ఉండబోదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ సచివాలయంలో సోమవారం మంత్రివర్గ సమావేశం అనంతరం కూటమి నేతల తీరుపై చర్చ జరిగింది. ఆ భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఏ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసినా ఇన్ఛార్జ్ మంత్రులు కఠినంగా వ్యవహరించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుతో అన్నారు. దీనికి స్పందించిన చంద్రబాబు ఆ వ్యవహారంతో ఇక తనకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన ఎమ్మెల్యేల బాధ్యత జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు. ఇవాళ మూడున్నర గంటలపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. అంశాలపై చర్చ అనంతరం మంత్రుల వద్ద చంద్రబాబు ఎమ్మెల్యేల పని తీరుపై చర్చ జరిగింది. ఇందులో 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లు తమ పద్దతులు మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అదే సమయంలో.. తన పార్టీ ఎమ్మెల్యేల తీరు దారుణంగా ఉందని టీడీపీ అధిష్టానం అంగీకరించింది. ఎమ్మెల్యేల అవినీతి, దోపిడీ బాగోతాలపై అంతర్గతంగా ఓ సర్వే నిర్వహించి.. ఆ నివేదికను తెప్పించుకున్న చంద్రబాబు, లోకేష్‌లు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అనవసరంగా కొందరికి టికెట్లు ఇచ్చామని మంత్రుల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అలాగే యువ తరాన్ని ప్రొత్సహించే క్రమంలో టికెట్లు ఇచ్చామని.. కానీ, ఫస్ట్ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లకు మంచి చెడులు తెలియడం లేదంటూ లోకేష్ అభిప్రాయపడ్డట్లు సమాచారం. -
ఇది నీకు..ఇది నాకు అమరావతి పనుల్లో అడ్డగోలు దోపిడీ
-
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం... సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం
-
ఇది ఆరంభం మాత్రమే.. ఎల్లో మీడియా గుట్టువిప్పుతున్న సోషల్ మీడియా
-
ప్రజాధనాన్ని ప్రైవేటుకు దోచిపెడుతున్న కూటమి సర్కారు...
-
కూటమి నేతల తీరుపై విడదల రజిని తీవ్ర ఆగ్రహం
-
నాపై కావాలనే తప్పుడు ప్రచారం: విడదల రజిని
సాక్షి, పల్నాడు: తనపై దుష్ప్రచారం చేస్తూ, తనకు సంబంధించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ కూటమి నేతలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావుని కలిసిన ఆమె.. తన అనుచరులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే తొలగించాలంటూ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది టీడీపీ నాయకులు గాలి పోగేసి తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారు. ఆ ఫిర్యాదులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి నన్ను భయపెట్టాలనుకుంటున్నారు. మీ బెదిరింపులకు భయపడే వారు ఎవరూ ఇక్కడ లేరు. ఇప్పటికే నా పైన ఏడు తప్పుడు కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు కూడా బనాయించారు....కొంతమంది పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. డీఎస్పీ హనుమంతరావు పచ్చ ఖద్దర్ చొక్కా వేసుకొని టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. నాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. తెలుగుదేశం నాయకులు వాళ్ల నాయకుల మెప్పుకోసం తప్పుడు ఫిర్యాదులు నమోదు చేస్తుంటే.. అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. తప్పుడు ఫిర్యాదులు ఇచ్చిన వారిని, తప్పుడు కేసులు పెట్టిన అధికారిని ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తి లేదు. .. శ్రీగణేష్ చౌదరి అనే వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అతనికి టీడీపీతోనే సంబంధాలు ఉన్నాయి. నాపైనా నా కుటుంబ సభ్యుల పైన నా అనుచరుల పైన తప్పుడు కేసులు పెడుతున్నారు. వాళ్లనూ వదిలిపెట్టను. అవసరమైతే మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్లలో ఫిర్యాదులు చేస్తా. నా ధైర్యం మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. నేను చిలకలూరిపేట నుంచి వేరే నియోజకవర్గానికి వెళ్తానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నేను చిలకలూరిపేట నుంచే పోటీ చేస్తాను. చిలకలూరిపేట పై మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశారామె. -
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? చంద్రబాబును నిలదీసిన : వైఎస్ జగన్
-
బాబుకు బిగ్ షాక్..! వణుకుతున్న టీడీపీ పెద్ద తలకాయలు
-
పులివెందులలో మెడికల్ కాలేజీ లేకుండా చేయాలి..!
-
AP Govt: ఐదో తేదీ వచ్చినా ఉద్యోగులకు పూర్తి జీతాలివ్వని ప్రభుత్వం
-
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు.. అప్పుడలా.. ఇప్పుడిలా
సాక్షి,అమరావతి: కూటమి ప్రభుత్వంలో నవంబర్ 5వ తేదీ వచ్చినా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. దీంతో ప్రభుత్వం జీతం ఎప్పుడిస్తుందా? అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటినే జీతాలు చెల్లిస్తామంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. అయినా కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు సకాలంలో ఉద్యోగులకు జీతాలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గతంలో జీతాలు పెంచాలని ధర్నాలు చేసే ఉద్యోగులు.. చంద్రబాబు ప్రభుత్వంలో జీతాలు ఇవ్వాలని ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. జీతం కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అయితే, జీతాలివ్వండి మహా ప్రభో.. అంటూ ఉద్యోగులు నిరసన తెలుపుతారేమోనన్న ఉద్దేశ్యంతో నిన్న రాత్రి పోలీస్, మెడికల్,టీచర్,సచివాలయ ఉద్యోగులకు మాత్రమే జీతాలు చెల్లించింది.ఆ జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం అప్పు చేసింది. మిగిలిన శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు ఎప్పుడొస్తాయో కూడా తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
కూటమి ప్రభుత్వంపై ఎంపీ YS అవినాష్ రెడ్డి ఫైర్
-
బాబు సర్కార్ ప్లాన్ అదేనా?
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం కేసులో సిట్ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్ట్ చేసినట్లు తేటతెల్లమైంది. ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అధికారులు. నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కంటే.. అక్రమ అరెస్టులపైనే సిట్ శ్రద్ధ పెట్టినట్లు జోగి రమేష్ వ్యవహారంతో స్పష్టమవుతోంది. నాటకీయ పరిణామాల నడుమ ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు. ఆ సమయంలోనూ ఈ కేసు ప్రధాన నిందితుడు(ఏ1) అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పిన కట్టుకథనే సిట్ వల్లేవేయడం గమనార్హం. అలాగే రిమాండ్ రిపోర్టులో జనార్దన్‌తో నమోదు చేయించిన వాంగ్మూలాన్నే వినిపించిన అధికారులు.. రమేష్‌కు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. జనార్దన్‌రావు-జోగి రమేష్‌కు మధ్య జరిగిన లావాదేవీలను సైతం నిరూపించలేక చతికిపలడ్డారు. జనార్దన్ పోయిందని చెబుతున్న ఫోన్ తాలుకా స్క్రీన్ షాట్లనే మళ్లీ ప్రస్తావనకు తెచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన టీడీపీ నేత జయచంద్రారెడ్డిపై ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అలాగే నకిలీ మద్యం అమ్మకాలు జరిపిన శ్రీనివాస వైన్స్ ఓనర్ మహంకాళి పూర్ణ చంద్ర రావుపై ఇప్పటిదాకా కేసు నమోదు చేయలేదు కూడా. అంతేకాదు ఫేక్ లిక్కర్ డైరీలో పలువురు బడా నేతలు పేర్లున్నాయని దర్యాప్తు తొలినాళ్లలో ప్రకటించిన సిట్.. ఇప్పుడు గమ్మున ఉండిపోవడమూ పలు అనుమానాలను తావిస్తోంది. దీంతో.. సీఎం చంద్రబాబు డైరెక్షన్‌తోనే టీడీపీ నాయకులని తప్పించేందుకు అధికారులు నకిలీ మద్యం కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోందని వైఎస్సార్సీపీ అంటోంది. పదిరోజుల రిమాండ్నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పేరును ఏ-18 గా, ఆయన సోదరుడు జోగి రామును ఏ-19 గా ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. ఆరవ ఏజెఎంఎఫ్‌సీ న్యాయస్థానం ఈ ఇద్దరికీ 10రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది . దీంతో ఇరువురిని విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ జోగి రమేష్ వేసిన పిటిషన్ మంగళవారం(రేపు, నవంబర్ 12) విచారణ జరగాల్సి ఉంది. ఈలోపే ఆయన్ని అరెస్ట్ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: దుర్గమ్మ చెంత సత్యప్రమాణం.. బాబు, లోకేష్‌కు ఆ దమ్ముందా? -
కాశీబుగ్గ ఘటన: వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, గుంటూరు: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. మీడియాలో సమాచారం మేరకు 10 మంది మరణించారని తెలుస్తోంది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలి. వైఎస్సార్సీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలి.... తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు. అలాగే సింహాచలంలోనూ దుర్ఘటన జరిగి ఏడుగురు మరణించారు. ఇప్పుడు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన వల్ల ఇప్పటిదాకా 10 మంది మరణించారని తెలుస్తోంది. ఈ 18 నెలలకాలంలో ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం లేదని అర్థం అవుతోంది. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ భక్తుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. చంద్రబాబు అసమర్థ పాలనకు నిదర్శనం ఇది. ఇకనైనా కళ్లు తెరిచి తప్పులను సరిదిద్దుకోవాలి అని జగన్ పేర్కొన్నారు. -
బాబుది చారిత్రక తప్పిదం: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.‘‘పొట్టి శ్రీరాములుగారి అహింసా దీక్షతో, ప్రాణత్యాగంతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారి ఆత్మగౌరవంకోసం అలుపెరగని పోరాటం చేశారాయన. పొట్టి శ్రీరాములుగారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. .. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపకుండా చంద్రబాబుగారి ప్రభుత్వం చారిత్రక తప్పిదాలకు పాల్పడుతూనే ఉంది. పొట్టి శ్రీరాములుగారి త్యాగాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే. రాష్ట్ర అవతరణ దినోత్సవం రాజకీయాలకు అతీతంగా జరగాలి’’ అని ఎక్స్ ఖాతాలో కోరారాయన. పొట్టి శ్రీరాములుగారి అహింసా దీక్షతో, ప్రాణత్యాగంతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారి ఆత్మగౌరవంకోసం అలుపెరగని పోరాటం చేశారాయన. పొట్టి శ్రీరాములుగారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్…— YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2025 భాషా ప్రతిపాదికన.. 1956లో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుంచి 58 ఏళ్లపాటు ఆ తేదీనే అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తూ వచ్చాయి ప్రభుత్వాలు. 2014, జూన్ 2వ తేదీన తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. వైఎస్సార్సీపీ హయాంలోనూ ఆ వేడుకలు జరిగాయి. అయితే 2024లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా జరపడం లేదు. అందువల్ల కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో.. శనివారం తాడేపల్లిలోని YSRCP కేంద్ర కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులర్పించారు. ప్రభుత్వం వేడుకలను నిర్వహించకపోవడాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అలాంటిది ఆయన త్యాగానికి చంద్రబాబు విలువ లేకుండా చేశారు. ప్రభుత్వం తరపున పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో ఆర్యవైశ్యలే చందాలు వసూలు చేసుకుని పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టుకోమని లోకేష్ సూచించారు. అందుకే మండలాలు, జిల్లాల వారీగా టార్గెట్ పెట్టి చందాలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టలేని స్థితిలో ఉందా?. ఎన్టీఆర్ విగ్రహానికి వందల కోట్లు ఖర్చు పెడతారుగానీ.. పొట్టి శ్రీరాములుని మాత్రం విస్మరిస్తారా?. ఇది సరైన నిర్ణయం కాదు. ప్రభుత్వమే పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. వైశ్యుల దగ్గర చందాలు వసూలు చేస్తామంటే సహించం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మంగళవారం మళ్లీ అప్పు చేయనున్న కూటమి ప్రభుత్వం
-
నీట మునిగిన వేలాది ఎకరాలు.. సహాయక చర్యల్లో ప్రభుత్వం ఫెయిల్
-
పరిశ్రమల పేరుతో భూ దోపిడీ
-
ఆంధ్రాలో అద్దంలాంటి రోడ్లు.. ఇవేనా బాబు!
-
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం మాఫియా
-
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్.. హైలైట్స్
సాక్షి, గుంటూరు: ఏపీలో నకిలీ మద్యం వ్యవస్థీకృతంగా నడుస్తోందని, చేసిన తప్పును అవతలి వాళ్ల మీదకు నెట్టేయడం చంద్రబాబుకి, ఆయన తనయుడు నారా లోకేష్ అలవాటైన పనేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. నకిలీ మద్యం వ్యవహారంతో పాటు విశాఖ డాటా సెంటర్‌పై కూటమి ప్రభుత్వం.. దాని అనుకూల మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ వాస్తవాల్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. అలాగే ఉద్యోగులను చంద్రబాబు ఎలా మోసం చేస్తోంది తెలియజేస్తూనే కూటమి పాలనలో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు.జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్గ్రామస్థాయిలో పాలనను చంద్రబాబు గాలికొదిలేశారుగ్రామ సచివాలయం, వలంటీర్లాంటి వ్యవస్థలను నిర్వీర్యం చేశారుపొలిటికల్ గవర్నరెన్స్ వల్లే రాష్ట్రం అతలాకుతలం అవుతోంది ఏపీలో ఇప్పటికీ డీఏపీ, యూరియా దొరకని పరిస్థితిబీమా సంగతి పట్టించుకోవడం లేదువర్షాలకు పంట నష్టం జరిగితే కనీసం రైతులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అంచనా వేయలేదుసబ్సిడీ విత్తనాలు ల్లేవ్ఉల్లి రైతులను గాలికి వదిలేశారుఅరటి, టమాట, పత్తికి డిమాండ్ లేదుక్వింటాల్ పత్తికి ఒకప్పుడు రూ.12 వేలు ఉండేది.. ఇప్పుడు రూ.5 వేలు కూడా లేదుటమాట రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారుపరిస్థితులు ఎలా ఉంటాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులకే కాదు.. ప్రజలకూ చంద్రబాబు ఏమీ చేయలేకపోయారురాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ తిరోగమనంలోనే కనిపిస్తున్నాయిస్కూళ్లలో నాడు-నేడు పనులు ఆగిపోయాయి.. ఇంగ్లీష్ మీడియా చదువులు గాలికి ఎగిరిపోయాయి.. గోరుముద్ద పథకం నిర్వీర్యం అయిపోయిందివిద్యాదీవెన, వసతి దీవెన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదువైద్యరంగం.. ఆరోగ్యశ్రీ నీరుగారిపోయింది. చంద్రబాబు పుణ్యాన పేదవాడికి వైద్యం అందించాల్సిన ఆస్పత్రులు ధర్నాలు చేస్తున్నాయిప్రభుత్వ ఆస్పత్రుల్లో దూదికి కూడా దిక్కలేదుకనీసం రూ.5 కోట్ల టర్న్ ఓవర్ లేని మనిషికి.. 104, 108 సర్వీసులను అప్పజెప్పారుమా హయాంలో మెడికల్ కాలేజీలు తెస్తే.. 10 కాలేజీలను నెమ్మదిగా అయినా పూర్తి చేయాల్సి పోయి ప్రైవేటీకరణకు అప్పజెప్తున్నారుమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా.. రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోందిదానిని గవర్నర్‌కు సమర్పించి.. రాష్ట్ర ప్రజల రెఫరండంను తెలియజేస్తాంఎన్నికలయ్యాక.. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అన్నారుజీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడడం లేదుఐఆర్ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదుఉద్యోగులకు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదుఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారుఉద్యోగులను మోసం చేసి వికృత ఆనందం పొందుతున్నారుటీడీపీ నేతలు వాళ్లపై దాడులు చేస్తున్నారుఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారుమొత్తంరూ.31 వేల కోట్లు బకాయిలు పెట్టారుప్రతీ నెలా ఒక్కటే తేదీన జీతాలన్నారు.. ఒక్క నెల ఇచ్చారంతేకనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదుకాంట్రాక్టు ఉద్యోగులకు పథకాలు ఇస్తామన్నారుపోలీసులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ పెండింగ్‌లో పెట్టారుఉద్యోగుల విషయంలో మేం ఏనాడూ ఇబ్బందులకు గురి చేయలేదుఅధికారంలోకి వచ్చిన వారంలోనే ఐఆర్ ఇచ్చాంకోవిడ్ సమయంలోనూ వాళ్ల సంక్షేమం గురించే ఆలోచించాంమేం తెచ్చిన జీపీఎస్‌ను కేంద్రం, రాష్ట్రాలు ప్రశంసించాయిఆనాడు చంద్రబాబు ఉంటే.. రాష్ట్రం అతలాకుతలం అయ్యి ఉండేదేమో ఉద్యోగులనూ చంద్రబాబు మోసం చేశారునాలుగు డీఏలు పెండింగ్‌లో పెట్టారుఇప్పటి వరకు ఒక్క డీఏ ఇవ్వలేదుఉద్యోగులు రోడ్డెక్కాక.. డ్రామా చేసి ఒక్కటి ఇస్తామన్నారుఅది కూడా ప్రకటించారు అంతే.. ఇంకా ఇవ్వలేదు(నవంబర్‌లో ఇస్తామని అంటున్నారు)డీఏ బకాయిలు కూడా రిటైర్ అయ్యాక ఇస్తామని ప్రకటించారుదీనికే దీపావళి సంబురాలు అంంటూ ప్రకటనలు చేస్తున్నారుకోవిడ్ కష్టాలు ఉన్నా మేం వెనకడుగు వేయలేదుఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాల్సి ఉంటే.. మేం 11 ఇచ్చాం తనను చూసే గూగుల్ వైజాగ్‌కి వచ్చినట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారుహైదరాబాద్ సైబర్ టవర్స్ విషయంలోనూ చంద్రబాబు ఇలాగే చేశారుదాని పేరే హైటెక్ సిటీహైటెక్ సిటీకి ఆరు ఎకరాల్లో పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్కానీ, చంద్రబాబు ఆ విషయాన్ని ఏనాడూ చెప్పుకోరుఅసలు చంద్రబాబుకి 20 ఏళ్లపాటు హైదరాబాద్‌తో సంబంధమే లేదుఅయినా అభివృద్ధి తనదేనంటూ బిల్డప్ ఇస్తుంటారువాస్తవం ఏంటంటే.. 2003-04 వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచే హైదరాబాద్‌లో నిజమైన అభివృద్ధి మొదలైందిఈ విషయాన్ని గణాంకాలే చెబుతున్నాయిఆ తర్వాత వైఎస్సార్ లేకపోయినా.. ఆ అభివృద్ధి అలా కొనసాగిందికేసీఆర్ రెండుసార్లు సీఎం చేశారు.. అప్పుడూ డెవలప్మెంట్ జరిగిందిక్రెడిట్ ఇవ్వకపోవడం చంద్రబాబుకి ఉన్న దుర్మార్గపు నైజంహైదరాబాద్ అభివృద్ధికి అసలు చంద్రబాబుకే సంబంధం లేదు డాటా సెంటర్ వల్ల ఉద్యోగవకాశాలు తక్కువే, కానీ, భవిష్యత్తులో ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుందిభవిష్యత్తులో పెద్ద మార్పులకు డాటా సెంటర్ కీలకందీనికి వైఎస్సార్సీపీ హయాంలోనూ నాంది అప్పుడే పడిందిఅందుకే తక్కువ ఉద్యోగాలు వస్తాయని తెలిసి కూడా నాడు అదానీతో ఒప్పందం చేసుకున్నాంఅదే సమయంలో.. ఐటీ పార్క్ రీక్రియేషన్, స్కిల్ సెంటర్ పెట్టి 25 వేల ఉద్యోగాలు కావాలని కోరాం ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డాటా సెంటర్ వైజాగ్‌కి రాబోతోందిముమ్మాటికీ వైఎస్సార్సీపీ వేసిన విత్తనమే ఇదివేరేవాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారుఅదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయ్అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డాటా సెంటర్అదానీ ఇందులో రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారువైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్ డాటా సెంటర్‌ని నిర్మిస్తున్నాయిఅదానీ కట్టాక గూగుల్ దీనిని వాడుకుంటుందిఇందుకు సంబంధించి.. ఐటీ సెక్రటరీ భాస్కర్‌కు గూగుల్ ప్రతినిధి లేఖ కూడా రాశారుచంద్రబాబు కనీసం అదానీకి కృతజ్ఞతలు కూడా చెప్పలేదుజగన్ సర్కార్‌కు ఆ క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం లేదువైఎస్సార్సీపీకి ఆ ఘనత దక్కుతుందనే.. బాబు ఆ పని చేయడం లేదు 2020లో.. కరోనా టైంలోనే అదానీ డాటా సెంటర్ ఒప్పందానికి బీజం వేశాం2021 మార్చిలో సింగపూర్ ప్రభుత్వానికి ఈ ఒప్పందానికి సంబంధించి లేఖ రాశాం2023 మే 3న.. ఆ తర్వాత డాటా సెంటర్‌కు వైజాగ్‌లో శంకుస్థాపన కూడా చేశాంఆనాడే.. సింగపూర్ నుంచి సబ్‌సీ కేబుల్ తీసుకొచ్చే అంకురార్పణ జరిగిందిదీనికి కొనసాగింపుగానే గూగుల్ డాటా సెంటర్ వచ్చిందివైఎస్సార్సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇదివైఎస్సార్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే వైజాగ్ గూగుట్ డాటా సెంటర్ గూగుల్ డాటా సెంటర్ గురించి మాట్లాడుకుందాం..వారం, పదిరోజులుగా దీని గురించి ఆశ్చర్యం కలిగించే వార్తలు వింటున్నాంరాష్ట్రంలో పాలనను బాబు గాలికి ఎగిరిపోయిందిఏదో యాడ్ ఏజెన్సీ నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోందిక్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. రాష్ట్రపరిస్థితి వీక్వేరే వాళ్లకి దక్కాల్సిన క్రెడిట్‌ను చోరీ చేయడంలో బాబు ఎప్పుడూ ముందుంటారు లేని ఎవిడెన్స్ క్రియేట్ చేయడం దారుణంలిక్కర్ స్కాం పేరిట తప్పుడు కేసులోనూ ఇలాగే జరిగిందిఎక్కడో రూ.11 కోట్లు దొరికితే.. అంటగట్టే ప్రయత్నం చేశారుకోర్టుకు వెళ్లడంతో సైలెంట్ అయిపోయారుచంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఏమాత్రం ల్లేవ్ అసలు జనార్దన్‌రావు ఎవరు?జనార్దన్‌తో తనకు పరిచయమే లేదని జోగి రమేష్ క్లారిటీ ఇచ్చారుఏదో ఫంక్షన్లో కలిసినందుకే కట్టుకథలు అల్లుతున్నారుతన రెండు ఫోన్లు తనిఖీ చేసుకోమని జోగి రమేష్ సవాల్ చేశారుతప్పు చేయలేదు కాబట్టే సీబీఐ ఎంక్వైరీ కోరుతూ జోగి రమేష్ కోర్టును ఆశ్రయించారుఈలోపే డైవర్షన్ పాలిటిక్స్‌తో.. తప్పుడు ఆధారాలతో అభాండాలు వేస్తున్నారు వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపించిందిలాభాపేక్ష మా ప్రభుత్వానికి లేదు.. అందుకే బెల్ట్ షాపులు రద్దు చేశాంషాపుల సంఖ్య తగ్గించాంటైమింగ్ పెట్టి నడిపించాంఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లు లేవుక్యూ ఆర్ కోడ్ తెచ్చిందే మా ప్రభుత్వం.. ఆ టైంలో స్కాన్ చేసి అమ్మేవాళ్లుకాస్తో కూస్తో ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నాలు చేశాంఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ.. నకిలీ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలంటూ ఆదేశాలిచ్చారు ఇదసలు హైలైట్ కావాల్సిన అంశంలిక్కర్ షాపుల నుంచి ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌ల దాకా అంతా చంద్రబాబు మనుషులే దొంగకు తాళాలివ్వడం అంటే ఇది కాదా?ఎవరి క్యూఆర్‌కోడ్.. ఎవరి స్కాన్? ఎవరు చేసేది?మద్యం షాపులే మీవి అయినప్పుడు క్యూఆర్ కోడ్ ఎందుకు?క్యూఆర్ కోడ్ అంటూ మరో డైవర్షన్ ఇది ఏలూరులో ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో నకిలీ లిక్కర్ దందా నడుస్తోందిరేపల్లే పేకాట కింగ్.. ఇష్టానుసారంగా నకిలీ మద్యం దందా నడిపిస్తున్నారునకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు మనుషులేతమకు సంబంధించిన లిక్కర్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులేబెల్ట్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే.. అమ్మకునేది వాళ్ల కింది మనుషులేసీబీఐ విచారణ జరిపితే మూలాలు బయటకు వస్తాయిఅందుకే బాబు సిట్ ముద్దు అంటున్నారు జనార్దన్‌రావు వీడియోలో ఎలా మాట్లాడారు?.. ఫోన్ పోయిందని జనార్దనే చెప్పాడు. మరి ఫోన్ పోతే చాటింగ్ ఎలా బయటకు వచ్చింది?. అసలు లుకౌట్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు?ఈ 20 రోజుల్లో జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?.. పాస్‌పోర్టును ఎందుకు సీజ్ చేయలేదు?.. పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినప్పుడు.. పెద్దిరెడ్డి సోదరుడిపై జయచంద్రారెడ్డిని చంద్రబాబు ఎందుకు పోటీకి నిలబెట్టారు? టీడీపీ టికెట్ ఎలా ఇచ్చారు?తనకు ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని అఫిడవిట్లోనే జయచంద్రారెడ్డి పేర్కొన్నారు.. మరి అప్పుడు ఆఫ్రికా లింకులు చంద్రబాబుకి, ఆయన టిష్యూ పేపర్లకు కనిపించలేదా?పరవాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది?నకిలీ మద్యం బయటపడ్డాక ఎన్ని తనిఖీలు నిర్వహించారు? ఎన్ని బాటిళ్లను పట్టుకున్నారు?అన్ని చోట్ల దొరుకుతుందనే తనిఖీలు చేయలేదా?చంద్రబాబుకు ధైర్యం ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనార్దన్ రావు లొంగిపోతాడని ఎల్లో మీడియా ముందే ఎలా చెప్పింది?నిందితులకు మా పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు అంటగట్టే ప్రయత్నం చేశారుఆర్గనైజ్డ్గా క్రైమ్చేయడం చంద్రబాబు, లోకేష్‌లకు అలవాటేఆఫ్రికాలో మూలలున్నాయంటూ టీడీపీ సోషల్ మీడియా బిల్డప్పులుమాజీ మంత్రి జోగి రమేష్ పేరు సైతం చెప్పించి.. ఉధృతంగా ప్రచారం చేశారుఏబీఎన్, ఈనాడు, టీవీ5లు.. జనార్దన్ చాటింగ్‌లంటూ హడావిడి చేశారుచేసేది వీళ్లే.. కథా స్క్రీన్‌ప్లే అంతా వాళ్లదే ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమే!ఒక మొలకల చెరువులోనే 20 వేల లీటర్ల నకిలీ మద్యం బయటపడిందికల్తీ లిక్కర్ మాఫియాలో ఉంది అంతా టీడీపీ వాళ్లేచేసింది.. చేయిస్తోంది చంద్రబాబేటాపిక్ డైవర్ట్ చేయడానికి.. తప్పును వేరే వారికి మీదకు నెడుతున్నారుప్రజలను తప్పు దోవ పట్టించడానికి ఆయన దొంగల ముఠా, ఎల్లో మీడియా సిద్ధంగా ఉండనే ఉంది విజయవాడ సీపీ చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారుఅక్రమ మద్యం కేసులో మా పార్టీ వాళ్లను అనవసరంగా వేధిస్తున్నారుఅన్నమయ్య జిల్లా తంబళపళ్లె, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, అనకాపల్లి జిల్లా పరవాడ, పాలకొల్లు, నెల్లూరులోనూ నకిలీ మద్యం బయటపడిందిపట్టుబడకుంటే వేల లీటర్ల మద్యం తయారయ్యేదే రాష్ట్రంలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయిప్రైవేట్ మద్యం మాఫియా నడుస్తోందిపోలీసుల భద్రత నడుమ గ్రామాల్లో అమ్మకాలుఆక్షన్లు వేసి మరీ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారుబెల్ట్ షాపులే కాకుండా ఇల్లీగల్ పర్మిట్‌రూమ్‌లు నిర్వహిస్తున్నారుడబ్బుల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారుప్రభుత్వ ఖజానాకు వేల కోట్లకు గండి కొడుతున్నారువాటాల్లో తేడాలు రావడంతోనే ఇదంతా బయటపడింది ఏపీలో నకిలీ మద్యం దందా వ్యవస్థీకృతమైందిఇలాంటి మాఫియా ప్రపంచంలో ఎక్కడా చూడలేదునకిలీ మద్యం కోసం చిన్నపాటి పరిశ్రమల్నే ఏర్పాటు చేశారునకిలీ మద్యాన్ని తయారు చేస్తోంది వాళ్లే.. బెల్ట్‌షాపులు పెట్టి నడిపిస్తోంది వాళ్లే ఇవాళ నాలుగు అంశాల మీద మాట్లాడుకుందాంనకిలీ మద్యం కేసులో నాణేనికి రెండో వైపు గురించి.. విశాఖలో డేటా సెంటర్ గురించి చంద్రబాబు చేస్తున్న గిమ్మికులు, డ్రామాల గురించి, అసలు వాస్తవాలేంటివి అనేది..ఉద్యోగులకు ఏరకంగా చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు?.. ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తున్నారనేదానిని మీడియా మీద ప్రజల దృష్టికి తీసకెళ్తా.. ప్రస్తుతం ఏపీలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, ఈ ప్రభుత్వంలో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా.. -
మైలవరం లోనే ఉంటా.. మీకు దమ్ముంటే.. కూటమిపై జోగి రమేష్ ఫైర్
-
చంద్రబాబు, పవన్ కు సిగ్గుందా? తుని చిన్నారి సంఘటనపై అనలిస్ట్ పాషా ఉగ్రరూపం
-
అక్రమ మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు ప్రభుత్వం బరితెగింపు.. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌లను అప్రూవర్లుగా మార్చే కుతంత్రం
-
చాలా మందికి అన్నదాత సుఖీభవ రావడం లేదు: జయకృష్ణ
-
ఏపీలో నకిలీ మద్యం.. ప్రమాదకరం కాదంట!
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు ఎల్లోమీడియా వింత పోకడలకు పోతోంది. ల్యాబ్ నివేదికలపై చిత్ర విచిత్రమైన కథనాలు ప్రచురిస్తోంది. మద్యపానం ఆరోగ్యానికి, సమాజానికి హానికరమని ప్రచారం చేయాల్సిన బాధ్యతాయుతమైన మీడియా సంస్థ, కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు గత ఎన్నికల సమయంలోనే నాణ్యమైన మద్యమిస్తామని జనాన్ని మభ్యపెట్టిన విషయం ఒకసారి గుర్తుచేసుకోవాలిక్కడ. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా తాము గెలిస్తే రూ.99లకే మద్యం సరఫరా చేస్తామని నిస్సిగ్గు ప్రచారం కూడా చేసుకుందీ కూటమి. అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిచిన మద్యం దుకాణాలను కాస్తా ప్రైవేటకు అప్పగించేసింది. ఈ బాధ్యతారహితమైన నిర్ణయమే నకిలీ మద్యం దందాకు, కుంభకోణానికి దారితీసిందన్నది అంచనా. గత ప్రభుత్వం మాదిరిగా క్యూఆర్ కోడ్ ఆధారంగా విక్రయాలు జరపకపోవడం, విచ్చలవిడిగా పర్మిట్ రూములను అనుమతించడం, బెల్ట్‌షాపుల అణచివేతకు చర్యలు తీసుకోకపోవడం వంటి ఇతర కారణాలు కూడా మార్కెట్లో అసలుకు, నకిలీకి మధ్య తేడా తెలియని స్థితికి నెట్టింది. ఇదే ఛాన్సుగా భావించిన కొందరు టీడీపీ నేతలు ఫ్యాక్టరీ పెట్టిమరీ నకిలీ మద్యాన్ని తయారు చేసి పంపిణీ చేయడం మొదలుపెట్టారు. సరుకు నిల్వలకు ప్రత్యేక ఏర్పాట్లు, హైదరాబాద్ నుంచి సరఫరా వంటి అనేకాకనేక అక్రమాలకు పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకల చెరువు వద్ద నకిలీ ప్లాంట్, ఇటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఒక డంప్ బయటపడ్డాయి. తరువాతి కాలంలో ఎక్సైజ్ పోలీసులు కొందరిని పట్టుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నకిలీ మద్యంతో చాలామంది అనారోగ్యానికి గురై ఉండవచ్చునని, మృత్యువాత పడి ఉండవచ్చునని అనుమానాలు ఉన్నాయి. నకిలీ మద్యం కుంభకోణాన్ని కాస్తా వైసీపీవైపు తిప్పేందుకు అధికార టీడీపీ విఫలయత్నం చేసింది. సొంతపార్టీ నేతలే పలువురు కీలక సూత్ర, పాత్రధారులుగా స్పష్టం కావడంతో రోజుకో కొత్త కథతో విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. ములకలచెరువుతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో లభించిన నకిలీ మద్యం శాంపిళ్లను పరీక్షల కోసం పంపగా.. వచ్చిన ఫలితాలను మసిపూసి మారేడు కాయ చేసేందుకు ఎల్లోమీడియా రంగంలోకి దిగింది. స్ట్రెంత్ ప్రమాణాలు పాటించకుండా నకిలీ మద్యం తయారు చేశారని, ప్రమాదకరం కాకపోయినా మంచిది కాదని లాబ్ అధికారులు నివేదించారని తెలుగుదేశం మీడియా సన్నాయి నొక్కులు నొక్కింది. ఒక సమాచారం.. ప్రకారం.. నీళ్లు, స్పిరిట్, రంగు ,రుచి రసాయనాలతో నకిలీ మద్యం తయారైందని గుంటూరు లాబ్ నివేదిక ఇచ్చిందట. వారికి అందిన 45 శాంపిల్స్ నకిలీ మద్యమేనని తేల్చిందట. అండర్ ఫ్రూఫ్, ఓర్ ఫ్రూఫ్లలో భారీ వత్యాసం ఉందని కనుగొన్నారు. లాబ్ రిపోర్టు తీవ్రత తగ్గించి చూపడానికి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోందని వార్తా కథనాలు సూచిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. బార్లు, బెల్టు షాపులు, పర్మిట్ రూమ్ ల ముసుగులో నకిలీ మద్యం దందా సాగుతోందని ఆయన అన్నారు. ఈ 16 నెలల్లో వైన్ షాపుల ద్వారా జరిగిన డిజిటల్ చెల్లింపులు, రూ.99 రూపాయల ధర కలిగిన లిక్కర్ సేల్స్ వివరాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం ఆదాయంపై విపరీతంగా ఆధారపడ్డ రాష్ట్ర ప్రభుత్వం నకిలీమద్యం పేరెత్తితే కేసులు బనాయించేందుకు సిద్ధమవుతోంది. దుగ్గిరాల మండలంలో పెరిగిపోతున్న బెల్ట్ షాపుల గురించి లేఖద్వారా తెలియజేసినందుకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి లోకేశ్ చిర్రుబుర్రులాడారట. ఆ కోపంతో ఆయన తన భర్త దాసరి వీరయ్యపై అక్రమంగా హత్యకేసు బనాయించారని స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ వాపోతున్నారు. పేర్ని నాని మరో సంచలన విషయం చెప్పారు. బార్ల యజమానులకు ప్రభుత్వం నిర్దిశించిన ఫీజ్ కట్టాలంటే విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు తదితర నగరాలలో రోజుకు మూడు లక్షల రూపాయల మద్యం అమ్మాల్సి ఉంటుందట. ఇందుకోసం ప్రభుత్వం నుంచి నెలకు రూ.80 లక్షల విలువైన సరుకు కొనాలట. ఈ బార్లవారు నెలకు ఎంత సరుకు కొంటున్నారో వివరాలు బయటపెట్టగలరా అని పేర్ని నాని సవాల్ చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించాలంటే ఆ వివరాలు వెల్లడించాలి. బార్లలో అమ్మే మద్యంలో పదిశాతం కూడా ప్రభుత్వం వద్ద కొన్నది కాదని ఆయన ఆరోపించారు. ఇది నిజమే అయితే సంచలనమే అని చెప్పాలి. 500 బార్ల నుంచి నెలనెలా రూ.5 కోట్లు అడ్వాన్స్ గా వసూళ్లు జరుగుతున్నాయని, ఇది నకిలీ మద్యం కన్నా భారీ కుంభకోణం అని ఆయన అంటున్నారు. గతంలో ఎల్లో మీడియా.. నేరుగా డిస్టిలరీల నుంచి వచ్చిన మద్యాన్ని ప్రభుత్వ షాపుల ద్వారా విక్రయిస్తేనే నాసిరకం మద్యం అని, పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారని ప్రచారం చేసింది. చంద్రబాబు అయితే ఏకంగా 30 వేల మంది చనిపోయారని ఆరోపించారు. ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్మితే దానిపై ఫేక్ ప్రచారం జరుగుతోందని ఎదురుదాడి చేస్తున్నారు. పోలీసులను ప్రయోగించి కేసులు పెడుతున్నారు. వాస్తవాలు రాస్తున్న సాక్షి మీడియాపై పోలీసులతో వెంటాడుతున్నారు. సాక్షిని, సోషల్ మీడియాను అణచివేస్తే నకిలీ మద్యం సమస్యను కప్పిపుచ్చవచ్చని భ్రమ పడుతున్నారు. దానికి ఎల్లో మీడియా నకిలీ మద్యం ప్రమాదకరం కాదంటూ వంతపాడుతూ సమాజానికి ద్రోహం చేస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘సంక్షేమం ఎక్కడ?..’ జనసేన ఎమ్మెల్యే అసంతృప్తి
సాక్షి, పార్వతీపురం మన్యం: సూపర్ సిక్స్ అంటూ బోలెడన్ని ఎన్నికల హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam).. వాటిని ఎగ్గొట్టే ప్రయత్నంలో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీస్తోంది. అయితే జనాలు మాత్రం ఆ కుట్రలను పసిగడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో.. జనసేన ఎమ్మెల్యే ఒకరు అసంతృప్తితో ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది.అన్నదాత సుఖీభవ పథకం(annadata sukhibhava)పై టీడీపీ మాజీ నేత, పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. గత వైఎస్సార్సీపీ హయాంలో రైతు భరోసా అందిన రైతులకు.. ఇప్పుడు అన్నదాత సుఖీభవ జమ కావడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో.. వండవ గ్రామంలో 600 మంది రైతులకు నగదు జమ కాకపోవడాన్ని ప్రమఖంగా ప్రస్తావించారు. ‘‘అన్నదాత సుఖీభవపై అధికారులకు ఫిర్యాదు చేశాం. పరిష్కరిస్తారేమో చూడాలి. న్యాయం జరగకపోతే సీఎం దృష్టికి, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్తా. వాళ్లకు న్యాయం జరిగే దాకా పోరాడతా’’ అని నిమ్మక అన్నారు. ఏడాదిన్నర దాటినా కూటమి పాలనలో సంక్షేమం ఊసే లేకుండా పోయింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాల అమలు అలసత్వం, వాటిలో కొన్నింటిని ఎగవేయడంపై వైఎస్సార్సీపీ ప్రజా పోరాటాలు చేస్తోంది. అదే సమయంలో కూటమి నేతలే ఇలా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఇదీ చదవండి: బాబూ.. ఇంటింటా దీపాల వెలుగు ఎక్కడ? -
డీఏపై దొంగాట.. దీపావళి వేళ ఉద్యోగులు, పెన్షనర్లకు పిడుగుపాటులా చంద్రబాబు సర్కారు చీకటి జీవోలు జారీ
-
చంద్రం పాలనలో వెలుగులు లేని దీపావళి
-
వర్మ.. ఏంటి ఈ కర్మ
-
లక్ష్మీ నాయుడు హత్యలో మొదటి ముద్దాయి పవన్ కల్యాణే
-
కూటమి సర్కార్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై తాగునీటి బాదుడు
-
ఏపీలో అద్దేపల్లి జనార్దనరావు డంప్ వద్ద స్వాధీనం చేసుకున్నది నకిలీ మద్యమే... ల్యాబ్ పరీక్షల సాక్షిగా బట్టబయలు
-
సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా నిరసన
-
ప్రైవేటీకరణ ఆపించండి.. ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, కర్నూలు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ఆపించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. తాజాగా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన్ని ఎయిర్‌పోర్టు వద్ద పలువురు నేతలు కలిశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేయాలని ఈ సందర్భంగా ప్రధానిని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. అలాగే.. వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం పరిశీలించాలని, నంద్యాల-కల్వకుర్తి బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ప్రధాని మోదీని కలిసిన వాళ్ళలో ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, జెడ్పీ చైర్మన్.. తదితరులు ఉన్నారు. -
కల్తీ మద్యం కేసులో కీలక పరిణామాలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నకిలీ మద్యం కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ నేత జనార్ధన్‌రావుకి చెందిన వైన్ షాపుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో.. ఓ వైన్ షాపును సీజ్ చేశారు. అదే సమయంలో వైఎస్సార్సీపీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది.ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీనివాస వైన్స్.. పూర్ణచంద్రరావు అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఈ వైన్స్‌కు నకిలీ మద్యాన్ని జనార్దన్‌రావే సరఫరా చేశారు. ఈ వ్యవహారాన్ని జనార్దన్ పిన్ని కొడుకు కల్యాణ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చాడు. అలా వచ్చిన సొమ్ముతోనే గొల్లపూడిలో విలువైన భూములను కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఈ కేసులో కల్యాణ్ కూడా అరెస్ట్ అయ్యారు. కక్ష సాధింపులో భాగంగా..మరో వైపు నకిలీ మద్యం కేసుకు సంబంధించిన ప్రశ్నలు గుప్పిస్తున్న, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని నేతల ఇళ్లపై పోలీసులు ఈ తెల్లవారుజామున దాడులు చేశారు. ఇందులో మేడపాటి నాగిరెడ్డితో పాటు బీసీ సెల్ అధ్యక్షుడు కుంచం జయరాజు కూడా ఉన్నారు. వాళ్ల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అయితే.. మంత్రి లోకేష్,మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టారని, టీడీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారని, అందుకే విచారణ జరుపుతున్నామని పోలీసులు అంటున్నారు.ఇదీ చదవండి: అమౌంట్ తగ్గితే వసంత బావ ఊరుకోడు! -
‘సాక్షి’ పత్రిక గొంతు నొక్కే కుతంత్రం... ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకు అక్రమ కేసులతో చంద్రబాబు సర్కారు వేధింపులు
-
ఫేక్ గాళ్ల కుట్రలు.. లై డిటెక్టర్ టెస్టుకి రెడీ: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్దన్‌రావుతో తనకు సంబంధాలు ఉన్నట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ సీఎం చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. ఈ విషయంలో చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన విషయం తనకు లేదని.. అయితే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో లై డిటెక్టర్ పరీక్షలకు కూడా తాను సిద్ధమని అన్నారాయన. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నారావారి సారాను చంద్రబాబు ఏరులై పారిస్తున్నారు. టీడీపీ నేతలు నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమల్లా నడిపిస్తున్నారు. టీడీపీ నేత జనార్దన్‌రావుతో నేను ఎలాంటి చాటింగ్ చేయలేదు. అది నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని జోగి రమేష్ అన్నారు. తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ మీద కూడా ప్రమాణం చేస్తా. చంద్రబాబు ఇంట్లో కూడా ప్రమాణానికి నేను సిద్ధం. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయడానికి వస్తారా?. అవసరమైతే సత్య శోధన పరీక్ష(లై డిటెక్టర్)కు నేను సిద్ధం. నా సవాల్‌ను చంద్రబాబు స్వీకరిస్తారా? అని జోగి రమేష్ నిలదీశారు.నా ఫోన్ ఇస్తా చంద్రబాబు, లోకేష్ చెక్ చేస్కోండి. ఓ గౌడ కులస్థుడి మీద దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. నీది ఓ బతుకేనా చంద్రబాబు?నా పేరు రిమాండ్ రిపోర్టులో ఉందా?.. ఫేక్ గాళ్లు కుట్రలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారాయన.ఇదీ చదవండి: బాబు డైరెక్షన్.. జనార్దన్ యాక్షన్! -
నీ పతనం మొదలైంది బాబు!
-
తూచ్.. మాకు సంబంధం లేదు.. ప్లేట్ మార్చిన చంద్రబాబు
-
‘మోదీకి మా బాధ తెలియాలి..’ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల ఆందోళన
సాక్షి, కర్నూలు: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో వేళ.. న్యాయం కోరుతూ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో, ఫ్లకార్డుతో నిరసన చేపట్టారు. మోదీకి తమ కుటుంబం పడుతున్న బాధేంటో తెలియజేసుకునే అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా వాళ్లు కోరుతున్నారు.సుగాలి ప్రీతిపై అఘత్యానికి పాల్పడ్డ వాళ్లను కఠినంగా శిక్షించాలి(Sugali Preethi Case News). అసలు లోకేష్ రెడ్ బుక్‌లో వాళ్ల పేర్లు లేవా?. మా కుటుంబానికి ఇప్పటికైనా న్యాయం చేయాలి అంటూ ఫ్లకార్డలతో నినాదాలు చేశారు. మరోవైపు.. తమకు న్యాయం చేయాలని, తమ గోడను ప్రధాని మోదీకి వినిపించే అవకాశాన్ని కల్పించాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి వేడుకుంటున్నారు. 2017లో కర్నూలులోని ఓ స్కూల్లో అనుమానాస్పద స్థితిలో సుగాలి ప్రీతిబాయి మృతి చెందింది. అయితే.. స్కూల్ యజమాన్యమే అత్యాచారం చేసి, తన బిడ్డను హత్య చేసిందని ప్రీతిబాయ్ తల్లితండ్రులు ఆరోపిస్తూ వస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల బెనిఫిట్స్ ప్రీతి కుటుంబానికి అందాయి. అలాగే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినప్పటికీ.. ఆ అంశం ముందుకు కదల్లేదు. ఈలోపు ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ఈ కేసు విపరీతమైన రాజకీయ ప్రచారానికి వాడుకున్నారు. అయితే తాజాగా బాధిత కుటుంబం కూటమి పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేయడం, ఆందోళనకు దిగిన నేపథ్యంలో.. ప్రభుత్వం దిగి వచ్చి కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ఇదిలా ఉంటే.. న్యాయం చేస్తానని నమ్మించి పవన్ నమ్మక ద్రోహం చేశారని పార్వతి ఆరోపిస్తున్నారు(Sugali Preethi Mother Slams Pawan Kalyan). అంతేకాదు.. జనసేన ఎమ్మెల్యేలు, నేతలు తమను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘2017 నుండి నా కూతురు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాం. ఎనిమిదేళ్లుగా నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తూనే ఉన్నాం. విజయవాడ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించాను అయినా మాకు న్యాయం జరగలేదు. ప్రీతికి న్యాయం జరగకపోతే.. చంద్రబాబు, పవన్, లోకేష్‌కు మా ఉసురు తగులుతుంది’’ అని వాపోయారామె. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ రేపు(అక్టోబర్ 16న) కర్నూలుకు రానున్నారు(PM Modi AP Kurnool Tour). ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌ను మోదీ అప్పాయింట్మెంట్ ఇప్పించాలని పార్వతి విజ్ఞప్తి చేశారు. అయితే.. అవతలి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు. ఇదీ చదవండి: న్యాయం గెలిచింది.. కూటమికి గట్టి దెబ్బ -
TDPకి ఓటువేయొద్దు.. నాశనమైపోతారు
-
‘సాక్షి’ ప్రసారాల నిలిపివేతపై సుప్రీంకోర్టు సీరియస్. ఏపీలో కూటమి సర్కార్ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం
-
బాబును రక్షించేందుకేనా ‘ఉచిత’ సలహా?
ప్రజాకర్షక పథకాలు, వారసత్వ రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ వ్యాఖ్యలు చేసిన సమయం సందర్భం వెనుక ఉద్దేశం ఏమిటా? అనేదీ చర్చనీయాంశంగా మారింది. ఉచితాల గురించి ఆయన గతంలోనూ కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పటికీ.. సంక్షేమ పథకాలను రాజకీయం కోసం వాడుకుంటున్న వారికి మద్దతిచ్చి విమర్శలకు గురయ్యేవారు. అలాంటిది తాజాగా.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ‘స్వర్ణ భారతి ట్రస్టు’లో వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణాల వంటివి మహిళలకు కాకుండా దివ్యాంగులకైతే అమలు చేయవచ్చునని, ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పెరుగుతుందని అన్నారు. రాష్ట్రాల అప్పుల గురించి ప్రస్తావిస్తూ ఐదేళ్లలో ఎంత అప్పు చేస్తారన్న దానిపై స్పష్టత ఉండాలని, అప్పులను ఎలా తీర్చుతారో కూడా ప్రజలకు తెలియ చేయాలని ఆయన సూచించారు. విద్య, వైద్య రంగాలను అభివృద్ది చేస్తే పేదరికం తగ్గుతుందని, ఉచితాల వల్ల కాదని అన్నారు(Venkaiah Naidu Shocking Comments On CBN Govt). వెంకయ్య నాయుడు వ్యాఖ్యలలో తప్పేమీ లేదు కానీ.. ఏపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఏపీ సర్కారును సంక్షోభం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? లేక చంద్రబాబుతో కాస్త తేడా వచ్చిందా అన్న అనుమానం వస్తుంది. అయితే వెంకయ్య నాయుడు, చంద్రబాబు, లోకేశ్‌లు ఇటీవలే ఒక కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. దీన్నిబట్టి ఊస్తే పొరపచ్చాలు వచ్చే అవకాశాలు తక్కువేనని చెప్పాలి. ఇదీ చదవండి: అడ్డగోలు ఉచితాలెందుకు? ఏపీ సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలుఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అలవిగాని హామీలను అమలు చేయలేక నానా పిల్లిమొగ్గలు వేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ సిక్స్‌సహా సుమారు 150 వరకూ వాగ్ధానాలిచ్చిన కూటమి నేతలు ఏడాదిపాటు వాటి అమలును ఎగవేసి ఆ తరువాత కూడా అరకొరగా కొన్నింటిని మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించాయి. అది కూడా ప్రజల నిరసన నుంచి తప్పించుకునేందుకు మాత్రమే. ఎన్నికల సమయంలో మహిళలు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి షరతుల్లేకుండా తిరగవచ్చని ఊరించిన చంద్రబాబు అధికారం వచ్చిన తరువాత మాత్రం ఏసీ బస్సుల్లో ఎక్క కూడదని, సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ అనుమతించమని, పదహారు రకాల బస్సు సర్వీసుల్లో ఐదింటిలో మాత్రమే ఉచిత స్కీము అమలు మొదలుపెట్టారు. అంతేకాకుండా.. బస్సు సర్వీసులను బాగా తగ్గించి నడుపుతూండటంతో ఉచిత స్కీము ఉన్నా లేనట్టుగా మారిపోయింది. మరోవైపు ఈ స్కీము వల్ల ఆటోలు నడుపుకునే వారు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. వారికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆందోళనకు దిగడంతో రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చారు. ప్రచారం సమయంలో 13 లక్షల మంది ఆటోల వారు ఉన్నారని చెప్పి, మూడు లక్షల మందికే ఈ సాయం ఇచ్చారు. రోజుకు వెయ్యి నుంచి రెండువేల వరకు సంపాదించుకునే తమకు ఇప్పుడు రూ.200 నుంచి రూ.500 రావడమే గగనం అవుతోందని వాపోతున్నారు. ప్రభుత్వం రోజుకు రూ.45 చొప్పున ఇస్తే ఏ అవసరం తీరుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు గమనించదగినవే. కాకపోతే ఎన్నికల మానిఫెస్టో ప్రకటించినప్పుడే ఈ కామెంట్లు చేసి ఉంటే అంతా మెచ్చుకునేవారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్ టీడీపీ, జనసేనలు సూపర్ సిక్స్ ద్వారా ప్రజలను ఎలా మోసం చేయబోతున్నారో వివరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి చేసిన వాగ్దానాల విలువ ఏడాదికి దాదాపు రూ.1.5 లక్షల కోట్లు అవుతుందని లెక్కగట్టి మరీ చెప్పారు. అయినా అప్పట్లో వెంకయ్య నాయుడు వంటివారు దానిపై కూటమి నేతలను ప్రశ్నించలేదు. పరోక్షంగా సహకరించారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూ మాట్లాడడం ద్వారా చంద్రబాబు సర్కారుకు వాటి నుంచి బయటపడడానికి ఒక మార్గం చూపుతున్నారా? అనే సందేహం వస్తుంది. గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే చేశారు. 1996 ఎన్నికల సమయంలో మద్య నిషేధం, కిలో రెండు రూపాయల బియ్యం పథకం వంటి వాటిని అమలు చేస్తామని ప్రచారం చేసిన ఆయన తదుపరి ఆ స్కాముల వల్ల నష్టం జరుగుతోందని, ప్రజాభిప్రాయం సేకరణ తంతును నిర్వహించి వాటన్నిటిని రివర్స్ చేశారు. గత టర్మ్‌లో రైతులకు పూర్తిగా రుణాల మాఫీ చేస్తామని ప్రకటించారు కాని చేయలేకపోయారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం మీడియాను, వెంకయ్య వంటివారితో ముందుగా ప్రచారం చేయించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టామని చెప్పి, స్కీములకు ఎగనామం పెట్టడానికి ఏమైనా ప్రయత్నం జరగుతోందా? అనే సందేహం పలువురిలో కలుగుతోంది. ఎందుకంటే.. టీడీపీ మీడియా కూడా కొన్నాళ్ల క్రితం సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా కథనాలు ఇచ్చింది. ఇదే మీడియా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అద్భుతం అంటూ ప్రచారం చేసేది. అధికారం వచ్చాక చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియా కూడా ప్రజలను మాయ చేయడానికి తన వంతు పాత్ర పోషిస్తోంది. ఆ విన్యాసాలలో వెంకయ్య నాయుడు వంటివారు భాగస్వాములు కారాదని అంతా కోరుకుంటారు. విద్య, వైద్యానికి సంబంధించి జగన్ చేసిన కృషి కళ్లకు కనబడుతున్న విషయమే. అయినా వెంకయ్య నాయుడు ఎన్నడూ మెచ్చుకోలేదు. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు ఎవరిమీదో ప్రేమతో కాకుండా, వాస్తవ పరిస్థితికి అనుగుణంగా మాట్లాడితే మంచి విలువ వస్తుంది. వెంకయ్య ఆ పని చేశారా అన్నది ప్రశ్న. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. కాని తెలుగుదేశంలోని వారసత్వ రాజకీయాల గురించి ఎందుకు ఆయన ప్రస్తావించరన్న సంశయం వస్తుంది. చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను రాజకీయంగా ప్రోత్సహిస్తున్న విధానం గురించి తన అబిప్రాయం చెప్పి ఉంటే బాగుండేది. ఈ పదిహేడు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన రూ.2.10 లక్షల కోట్ల రుణం గురించి కూడా వెంకయ్య కామెంట్ చేసి ఉండాల్సింది. అంతేకాదు. ఈ మధ్యకాలంలో బీహారు ఎన్నికల నేపథ్యంలో 75 లక్షల మంది మహిళలకు రూ.పది వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. దానికి ప్రదాని మోదీ బటన్ నొక్కారు. 2014లో బీజేపీలో వెంకయ్య నాయుడుకు ముఖ్య భూమికే ఉండేది. అయినా ఆ పార్టీ చేసిన వాగ్ధానాలతో ఎన్ని ప్రజాకర్షక విధానాలు ఉన్నాయో ఆయనకు తెలియవా? అని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో.. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తీసుకు వచ్చి రూ.15 లక్షల చొప్పున పంచుతామని బీజేపీ నేతలు ప్రచారం చేసేవారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ విషయాలన్ని పలుమార్లు ప్రస్తావించేవారు. ఆ తర్వాత కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వంలో వెంకయ్య నాయుడు కూడా మంత్రి. పార్టీ ఫిరాయింపులపై కూడా వెంకయ్య నాయుడు స్పందించారు. కాని ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీలో విలీనం చేసిన తీరు కూడా విమర్శలకు గురైంది. ఎన్డీయేకి దూరమైన సీనియర్ నేత శరద్ యాదవ్ విషయంలో ఎంత వేగంగా అనర్హత వేటు వేసింది కూడా చర్చనీయాంశమైంది. 2014 టర్మ్‌లో ఏపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్న అంశం గురించి కూడా వెంకయ్య పల్లెత్తు మాట అన్నట్టు లేదు. చేతిలో అధికారం ఉన్నప్పుడు గట్టిగా స్పందించి ఉంటే ఇప్పుడు ఆయన మాటకు విలువ వచ్చేది. మరో సంగతి కూడా చెప్పాలి. ఓటుకు నోటు కేసు సమయంలో చంద్రబాబు కష్టాలలో ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు కూడా తన పరపతి ఉపయోగించి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాజీ కుదర్చిన వారిలో ఉన్నారని చెబుతారు. తాజాగా ఏపీలో బయటపడ్డ నకిలీ మద్యం ప్లాంట్లు, అందులో టీడీపీ నేతల పాత్రపై కూడా వెంకయ్య నాయుడు గట్టిగా మాట్లాడి ఉంటే సమాజానికి మంచి సందేశం ఇచ్చినవారై ఉండేవారేమో కదా!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నకిలీ మద్యంపై ఏపీవ్యాప్తంగా YSRCP రణభేరి
నకిలీ మద్యం వ్యవహారంలో కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వైఎస్సార్సీపీ పోరాటానికి దిగింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా.. నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ఎదుట నిరసన, ధర్నాలు చేపడుతోంది. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై పలువురు నేతలు ధ్వజమెత్తుతున్నారు. -
హాస్టళ్లా.. నరక కూపాలా.. పిల్లలకు మురుగు నీరు.. సార్లకు మినరల్ నీరు
-
ఓడినా మనం నవ్వుతుంటే.. గెలిచిన వాళ్ళు మాత్రం ఏడుస్తున్నారు
-
పీపీపీ కమిషన్లలో బాబు, పవన్, లోకేష్‌కు వాటాలు: జడ శ్రావణ్ కుమార్
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో బడుగు,బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుందని జైభీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడలో శనివారం మేధోమథనం సదస్సు జరిగింది.జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేటీకరణ చేయడమే. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వల్ల సామాన్యులకు తీరని నష్టం తప్పదు. ఈ విధానం వల్ల బడుగు,బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుంది. తీవ్ర వ్యతిరేకత వస్తున్న చంద్రబాబు వెనక్కి తగ్గకపోవడం వెనుక అతిపెద్ద లాభం ఉందనేది స్పష్టమవుతోంది. పీపీపీ చేయడం వల్ల వచ్చే కమిషన్లలో చంద్రబాబు,పవన్,లోకేష్‌కు వాటాలు పంచుకోవాలనుకుంటున్నారు... ప్రైవేటీకరణ చేయడం వల్ల ఒక్క ఏడాది అడ్మిషన్లలోనే రూ.400 కోట్లు సంపాదిస్తారు. చంద్రబాబుకు నాదొక సూటి ప్రశ్న..ధైర్యముంటే సమాధానం చెప్పాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగే విధానంలోనే పీపీపీలోనూ చేపడతారని చెప్పగలరా?. ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే మన భావితరాలు తీవ్రంగా నష్టపోతాయి. మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేయనిస్తే మన భవిష్యత్ తరాలు మనల్ని క్షమించరు. కచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలి అని అన్నారాయన. ఈ క్రమంలో.. సీఎం చంద్రబాబు,హోంమంత్రి అనిత పై జడ శ్రవణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ‘‘అన్నీ నేనే కనిపెట్టానని చంద్రబాబు చెబుతారు. చంద్రబాబు వల్ల ఏడాదికి 2500 మంది పేద విద్యార్ధులకు విద్య అందకుండా చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత తన పని తాను చేయడం లేదు. శాంతిభద్రతలను గాలికొదిలేసి మెడికల్ కాలేజీల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన వంగలపూడి అనితకు నాదొక ప్రశ్న. ప్రభుత్వ మెడికల్ కాలేజీల అడ్మిషన్ పద్ధతిలోనే ప్రైవేట్ మెడికల్ కాలేజీల అడ్మిషన్లు జరుగుతాయా?. పేద విద్యార్ధులకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయారు?’’ అని ప్రశ్నించారాయన. అమ్ ఆద్మీ పార్టీ నేత నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ.. పీపీపీ అంటే చంద్రబాబుకు తెలుసా?. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రజలకు ఇచ్చే అసలైన సంక్షేమం. కోవిడ్ నేర్పిన పాఠాలను మనం గుర్తు తెచ్చుకోవాలి. పేదలకు మెరుగైన వైద్యం,వైద్య విద్యను అందజేస్తేనే సమాజం బాగుపడుతుంది. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఏడాదికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేయలేకపోతున్నారా?.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా...ప్రజలతో వ్యాపారం చేస్తున్నారా? అని నిలదీశారు. జైభీమ్ రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని.. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదీ చదవండి: టీడీపీలో వాళ్లు పనోళ్లేనా? -
మాజీ మంత్రి పేర్నినానిపై కూటమి కక్ష సాధింపు
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్..పెండింగ్ బిల్లులు చెల్లించాలని నెట్వర్క్ ఆస్పత్రుల డిమాండ్...పేదలకు పెనుశాపంగా మారిన కూటమి పాలన
-
ఏపీలో ప్రజల ప్రాణాలు తీస్తున్న నకిలీ మద్యం
-
పిల్లల ప్రాణాలతో చెలగాటమా?
-
అంతర్మధనంలో అధికార టీడీపీ
సాక్షి, విశాఖపట్నం: తమ కుట్రలు విఫలం కావడంతో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తే.. వైఎస్సార్సీపీ కేడర్ సైతం విస్తుపోయే రేంజ్లో సూపర్ సక్సెస్ కావడంతో అధికార టీడీపీ ఇప్పుడు అంతర్మధనంలో పడిపోయింది(YS Jagan Uttarandhra Tour Success).జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని ఆంక్షల పేరిట ఆటంకాలు సృష్టించింది కూటమి ప్రభుత్వం. ఖాకీలను ప్రయోగించి జనాన్ని రాకుండా ప్రయత్నించింది. అయితే చెక్‌పోస్టులు, బారికేడ్లను జగన్ మీద ఉన్న అభిమానం బద్దలు కొట్టేసింది. జనాలు తండోపతండాలుగా తరలి రావడం చూసి పోలీసులే కంగుతిన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు.. దారి పొడవునా జగన్ ఆగిన చోటల్లా ఇసకేస్తే రాలని జనమే కనిపించారు. ఆంక్షల వలయాన్ని చేధించుకుని.. గుట్టలు, పొలాల గుండా కొందరు యువకులు బైకులపై తరలి రావడం గమనార్హం. తొలుత.. ఈ పర్యటన కోసం దళితులను వాడుకోవాలని అధికార టీడీపీ విశ్వప్రయత్నాలు చేసింది. డాక్టర్ సుధాకర్ పేరుతో హోర్డింగులు ఏర్పాటు చేయించడంతో పాటు ఫకార్డుల ప్రదర్శన చేయించాలని స్కెచ్ వేసింది. అయితే దళితులు ఆ కుట్రలకు లొంగలేదు. పైపెచ్చు జగన్ ర్యాలీకి భారీగా తరలి వచ్చారు. వివిధ వర్గాలు సైతం జగన్‌ను కలిసి తమ గోడును వెల్లదీసుకోవడం.. ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడుపడని విషయం. ఇంకోవైపు..చివరకు ప్రకృతిపైనా పచ్చ బ్యాచ్ ఆశలు పెట్టుకోగా.. అది నెరవేరలేదు. కుండపోత వర్షంలోనూ రోడ్డు పొడవునా.. మహిళలు, వృద్ధులు, రైతులు బారులు తీయడం.. ఎల్లో మీడియాకు సైతం సహించనట్లుంది. అందుకే ట్రాఫిక్ జామ్, షరతుల ఉల్లంఘన పేరుతో విషం చిమ్ముతోంది. వెరసి..ఊహించని రీతిలో జగన్ ఉత్తరాంధ్ర పర్యటన సక్సెస్ కావడంతో కరకట్ట బంగ్లాకు ఏం సమాధానం చెప్పుకోవాలో అని ఉత్తరాంధ్ర తమ్ముళ్లు తెగ మదనపడిపోతున్నారు.క్లిక్ చేయండి: ఉత్తరాంధ్రలో జగన్ కోసం జన సునామీ.. చూశారా? -
ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు... ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
నర్సీపట్నంకు జగన్.. వణికిపోతోన్న బాబు అండ్ కో
-
జగన్ టూర్ పై కుట్ర.. అయినా తగ్గేదే లే..
-
నకిలీ మద్యం ముడుపులు కరకట్ట బంగ్లాకు..
-
జగన్ పర్యటనపై కూటమి కుట్ర.. YSRCP నేతల హౌస్ అరెస్టులకు ప్లాన్ !
-
కార్గో కోసం ప్రత్యేక ఎయిర్ పోర్ట్ ఏంటి.?
-
ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన గ్రహణమేమిటో?
ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? ఒకపక్క నకిలీ మద్యం.. ఇంకోపక్క కలుషిత నీరు. ప్రజల ఆరోగ్యం గాల్లో దీపం అవుతోంది. ప్రభుత్వానికేమో ఏదీ పట్టదాయె! అధికార పార్టీ తన దందాల్లో బిజీ!. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు వద్ద నకిలీ మద్యం ప్లాంట్‌ను గుర్తించడం తెలుగుదేశం పార్టీ నేతల దుర్మార్గాలకు అద్దం పడుతోంది. అలాగే ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి కూడా. రాష్ట్రంలో అనకాపల్లి, పాలకొల్లు, గూడూరుల్లోనూ నకిలీ మద్యం అమ్ముతున్నట్లు గుర్తించారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కూడా ఒక టీడీపీ నాయకుడి డంప్ ఒకటి బయటపడింది. వీటి పుణ్యమా అని ఏపీలో కల్తీ మద్యం ఏరులైపారుతోందన్నది కళ్ల ముందే కనిపిస్తోంది. ఎన్ని లక్షల మంది అనారోగ్యం పాలయ్యారో తెలియని పరిస్థితి. కల్తీ మద్యం అమ్మకాలకు ఒక నెట్ వర్క్.. తెలుగుదేశం నేతల అండ ఉండవచ్చని తెలుస్తోంది(AP Spurious Liquor Racket). జగన్ టైమ్‌లో ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో పెట్టి నానా యాగీ చేసిన చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా ఇప్పుడు నిమ్మకు నీరెత్తితే ఒట్టు. పైగా నిందితులు వైసీపీ వారన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు వెంటనే మొదలుపెట్టింది. తంబళ్లపల్లెలో టీడీపీ పక్షాన పోటీ చేసిన జయచంద్రా రెడ్డి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడని, ఆయనే టీడీపీలోకి పంపించారని చిత్రమైన ప్రచారం ఆరంభించింది. చంద్రబాబును కాపాడేందుకా? అన్నట్టు నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవదన్నారని కథనాలు వండి వార్చింది. అన్ని కోణాలలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని చంద్రబాబు అన్నారట. నిష్పక్షపాతం వరకు ఓకే గాని, అన్ని కోణాల్లో అనడంలోనే మతలబు ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొందరు మంత్రులకూ సంబంధం ఉన్న ఈ కేసు నిందితులను చంద్రబాబు కాపాడుతున్నారని ఆరోపించారు. పైకి తూతూ మంత్రంగా తంబళ్లపల్లె ఇన్‌ఛార్జి జయచంద్రా రెడ్డి, సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీడీపీ ప్రకటించింది. వీరికీ చంద్రబాబు, లోకేశ్‌లకు ఉన్న దగ్గరి సంబంధాలు, కలిసి దిగిన ఫొటోలిప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. జగన్ సీఎంగా ఉండగా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఇదంతా ప్రైవేట్ వ్యక్తుల పరమైంది. ఈ క్రమంలో వేలాది దుకాణాలను దక్కించుకున్న టీడీపీ నేతలు ఇతరులకు దక్కకుండా ఎమ్మెల్యేల చేత భయపెట్టించిన వార్తలూ మనం చూశాం. మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూములు కాస్తా మినీబార్లుగా మారాయి. వీటికి లెక్కకు మిక్కిలి బెల్ట్ షాపులు వెలిశాయి. ఒక్క తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే వెయ్యి బెల్ట్ షాపులు ఉండగా..రాష్ట్రం మొత్తమ్మీద వీటి సంఖ్య లక్షకు మించిపోయాయని తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే మీడియానే అంచనా వేస్తోంది. ఈ బెల్ట్ షాపులతోపాటు అనుమతి కలిగిన మద్యం దుకాణాలకూ కల్తీమద్యం సరఫరా అయి ఉంటుందన్నది కొందరి అనుమానం. ములకల చెరువు నకిలీ మద్యం కేసు నిందితులు కొంతమందికి లైసెన్స్డ్ వైన్ షాపులు కూడా ఉండటం గమనార్హం.అప్పట్లో చంద్రబాబు నాసిరకం మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారని నిరాధారంగా ఆరోపిస్తే(Chandrababu AP Spurious Liquor Racket Drama).. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియా చిలువలు వలువలు చేసింది. టీడీపీ నేతలు స్వయంగా విషపూరిత మద్యం సరఫరా వెనుక ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. అత్యంత ప్రమాదకరమైన స్పిరిట్‌కే రంగులు, ఎస్సెన్స్‌లు కలిపి, గుర్తింపు పొందిన బ్రాండ్ల బాటిళ్లలో నింపి మార్కెట్ లోకి వదలుతున్నట్లు వెల్లడవుతోంది. నాణ్యమైన మద్యం రూ.99 రూపాయలకే ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మరీ గద్దెనెక్కిన కూటమి నేతలిప్పుడు ఏకంగా విషం ఇస్తున్నారని వీటి బారినపడి ఎన్నివేల మంది అనారోగ్యానికి గురయ్యారో, ఎంతమంది అకాల మృత్యువుకు గురయ్యారో ఎవరూ చెప్పలేకపోతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి పాలనలో నకిలీ మద్యం ఒక పరిశ్రమగా(Kutami Prabhutvam Fake Liquor) వర్ధిల్లుతోందని, ప్రజలకు ఉపాధి, మేలు కలిగించే పరిశ్రమలు ఏవీ రావడం లేదని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకున్నారంటూ ఒక కల్పిత స్కామ్ ను సృష్టించి ఎవరెవరిపైనో దాడులు చేస్తూ, పలువురు ప్రముఖులపై కేసులు పెట్టిన చంద్రబాబు సర్కార్, ఇంత పెద్ద నకిలీ మద్యం స్కామ్ జరిగితే ఆ స్థాయిలో విచారణ చేయించే పరిస్థితి కనబడడం లేదని అంటున్నారు.ములకల చెరువు నకిలీ మద్యం దందా విలువ సుమారు రూ.6,000 కోట్లంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్సైజ్ అధికారులకు వెయ్యి లీటర్లకుపైగా స్పిరిట్, వేల బాటిళ్ల నకిలీ మద్యం పట్టుబడడం, జాతీయ రహదారికి కిలోమీటరు దూరంలోనే అన్ని రకాల యంత్ర సామాగ్రీ, హంగులతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారంటే.. పై స్థాయి నుంచి గట్టి మద్దతే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కేసులో జనార్ధనరావు అనే నిందితుడికి విజయవాడ వద్ద కూడా ఒక బార్ లైసెన్స్ ఉందట. ఈయన తంబళ్లపల్లెకు వెళ్లి ఈ నకిలీ మద్యం ప్లాంట్ పెట్టడానికి ఎవరి అండ ఉందన్నది దర్యాప్తు చేయవలసిన అధికారులు ఆ పని చేస్తారా? లేదా? అన్నదానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ములకల చెరువు కేసులో అసలు సూత్రధారులను తప్పించేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో వెలుగులోకి వచ్చిన డైరీలోని వివరాలు, పేర్లు ఎవరివి? సూత్రధారులు ఎవరు? వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? అన్న అంశాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఎందుకు నియమించలేదు?.. ఒక వేళ నిజంగానే సిట్ ను ఏర్పాటు చేసినా, వారికి స్వేచ్చ ఉంటుందా?.. మరో వైపు కలుషిత నీరు వల్ల కురుపాం వద్ద గిరిజన విద్యార్థుల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్ధులు మరణించారు. సుమారు వంద మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు సమీపంలోని తురకపాలెం గ్రామంలో 24 మంది అంతుపట్టని వ్యాధితో మృతి చెందారు. దీనికీ కలుషిత నీరే కారణం కావచ్చని భావిస్తున్నారు. మంచినీరు దొరుకుతుందో లేదో కాని, మద్యం విచ్చలవిడిగా పారుతోంది. దానికి తోడు విషపూరితమైన నకిలీ బ్రాండ్లు అడ్డూ, ఆపు లేకుండా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు . ఫలితంగా అనేక అనర్ధాలు సమాజంలో ఏర్పడుతున్నాయి.అందువల్లే ఏపీకి ఏమైంది? అని ఆందోళన చెందాల్సి వస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జగన్ పర్యటనను ఆపే దమ్ముందా?
-
ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య ఘాటు వ్యాఖ్యలు!
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగించడం వల్ల కలిగే ప్రయోజం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన.. ఉచితాలను అలవాటు చేయకూడదంటూ మాట్లాడారు. ‘‘ప్రభుత్వాలు విద్యా, వైద్యంపై ఖర్చు చేయాలి. అంతేకానీ ఉచితాలు అలవాటు చేయకూడదు. విద్య వల్ల పేదవాడు సంపన్నులయ్యే అవకాశాలు ఉన్నాయి. వైద్యం ప్రతి మనిషికి అవసరమైనది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్వేత పత్రం రూపంలో ప్రజలకు తెలియపరచాలి. ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు., ఎంత తిరిగి చెల్లిస్తున్నారు అన్నది ప్రకటించాలి. .. అసెంబ్లీలో బూతుల సాంప్రదాయానికి తెర వేయాలి. సభలో లేని వారి పట్ల అమర్యాదగా వ్యవహరించకూడదు. అటువంటి వ్యాఖ్యలు చేసే వారిని సస్పెండ్ చేయాలి. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సభలో ఎలా నడుచుకొవాలో ట్రైనింగ్ ఇవ్వాలి. పార్టీ ఫిరాయిస్తే చర్యలు తీసుకోవాలి.. న్యాయస్థానాలు ప్రజా ప్రతినిధులపై కేసులను రెండు సంవత్సరాలలో తీర్పులు ప్రకటించాలి. కోర్టులు తక్కువైతే, జడ్జిలు తక్కువ సంఖ్యలో ఉంటే వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అని నెల్లూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వ్యాఖ్యలు చేశారు. -
వైఎస్సార్సీపీ నేతలతో ముగిసిన వైఎస్ జగన్ భేటీ
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఆ పార్టీ కీలక భేటీ ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంతో పాటు రాష్ట్రంలో యదేచ్ఛగా నడుస్తున్న నకిలీ మద్యం వ్యవహారంపై వైఎస్ జగన్ ప్రముఖంగా ప్రసంగించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ప్రజా పోరాటం చేయాలని కేడర్‌కు ఆయన పిలుపు ఇచ్చినట్లు సమాచారం. ఈ భేటీకి కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కాకాణి గోవర్దన్ రెడ్డి, పేర్ని నాని, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. జగన్ హయాంలో మొదలైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ప్రజా పోరాటానికి పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించిన.. మాకవరం మెడికల్ కాలేజీని సందర్శించనున్న సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: బాబు చీటర్.. లోకేష్ లూటర్! -
ఏపీలో నకిలీ మద్యం రింగ్ లీడర్లను బుజ్జగిస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దలు
-
విద్యార్థులు చనిపోతుంటే.. సీఎం, మంత్రులు గాడిదలు కాస్తున్నారా..?
-
ఆంధ్రప్రదేశ్‌లో రాత్రికి రాత్రే కల్తీ మద్యం సూత్రధారులను మార్చేశారు... సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
Big Question: ఇది ఒరిజినల్ కాదు బాస్.. మీ మందు బాటిల్ పై ఒట్టు
-
Big Question: నారా నకిలీ సారా! నరకానికి ఎంట్రీ పాస్
-
చంద్రబాబుపై ఆటో కార్మిక సంఘాల ఫైర్
-
లూలు మీద ఎందుకంత ప్రేమ.. బాబుకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన వడ్డే శోభనాద్రీశ్వరరావు
-
Big Question: ఇక ఆపండయ్యా మీ అబద్ధాలు! బాబు, పవన్ కు NCRB చెంప చెళ్లు
-
ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం దందాకు కూటమి ప్రభుత్వం అండదండలు... తొలి ఏడాదే 5 వేల 280 కోట్ల రూపాయల దోపిడీ
-
సర్వేల పేరుతో వేధింపులు.. బాబుపై తిరగబడ్డ సచివాలయ ఉద్యోగులు
-
KSR Comment: టీడీపీ ఆగడాలకు చెక్! YSRCP కార్యకర్తలకు అండగా రంగంలోకి జగన్..
-
ఇదేం కవరింగు బాబూ.. మరీ ఇంత అధ్వానమా?
‘‘విద్యుత్ రంగంలో తొలిసారి ట్రూ డౌన్.. ప్రజలకు తగ్గనున్న వెయ్యి కోట్ల భారం’’.. ఈనాడు పత్రికలో వచ్చిన ఒక కథనం.‘‘సమర్థత, అనుభవం.. ఫలితమే ఛార్జీల తగ్గింపు’’.. ఆంధ్రజ్యోతి ఇచ్చిన వార్త‘‘ఈఆర్సీ సీరియస్.. సర్కార్‌కు షాక్ - దాదాపు వెయ్యి కోట్ల అడ్డగోలు వసూళ్లపై గట్టిగా మొట్టికాయలు’’.. సాక్షి దినపత్రిక ఇచ్చిన వార్తపైవాటిల్లో సత్యమేది? అసత్యమేది? అనే సంశయం పాఠకులకు రావచ్చు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎలివేషన్ ఇవ్వడానికి నిరంతరం పాటు పడుతుంటాయన్న సంగతి తెలిసిందే. కాకపోతే ప్రభుత్వానికి నెగిటివ్‌గా ఇవ్వాల్సిన వార్తను అలా ఇవ్వకపోతే మానే.. ప్రజలకు పచ్చి అబద్దపు సమాచారం ఇవ్వడానికి ఎక్కడా సిగ్గు పడకపోవడం ఈ రెండు మీడియా సంస్థల ప్రత్యేకతగా మారిపోయింది. విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వ తీరుపై నియంత్రణ మండలి ఆగ్రహం వ్యక్తం చేసి ఛార్జీలు తగ్గించాలని, ప్రజల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని ఆదేశిస్తే, దానిని వక్రీకరించి అదేదో ప్రభుత్వం ప్రజలపై దయతో తగ్గించినట్లుగా కథనాలు ఇవ్వడం పాఠకులను, ప్రజలను మోసం చేయడమే!. ఈ విషయాన్ని సాక్షి మీడియా బహిర్గతం చేసింది. సోషల్ మీడియాలోనూ సమాచారం విస్తారంగా వచ్చింది. దాంతో ప్రభుత్వం పరువుతోపాటు, టీడీపీకి మద్దతిచ్చి అసత్యాలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థల బాగోతం మరోసారి బట్టబయలమైంది. సాక్షి, సోషల్ మీడియా లేకపోతే ప్రజలు టీడీపీ మీడియా వండి వార్చిన అసత్యాలనే నమ్మాల్సి వచ్చేది. అసలు విషయం ఏమిటి! 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.15,485 కోట్ల అదనపు బాదుడుకు ఈఆర్సీ అనుమతి కోరడం, ఈఆర్సీ యూనిట్‌కు రూ.5.27లకు కొనుగోలుకు ఓకే చేస్తే డిస్కంలు రూ.5.84 నుంచి రూ.5.89 వరకు కొన్నది వాస్తవం. ఫలితంగా ప్రభుత్వం ప్రజల నుంచి అదనంగా రూ.2787 కోట్ల విద్యుత్ ఛార్జీలను వసూలు చేయడానికి విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి కోరింది. కాని ఈఆర్సీ రూ.1863 కోట్ల అదనపు వసూలుకు అంగీకరించింది. అయినా ప్రభుత్వం, డిస్కమ్ ఏదైనా అనండి.. ఈఆర్సీ ఆదేశాన్ని కాదని రూ.2787 కోట్లు వసూలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఈఆర్సీ అదనంగా వసూలు చేసిన రూ.923 కోట్లు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. దీని ప్రకారం యూనిట్‌కు పదమూడు పైసలు తగ్గుతుంది. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా అదనపు బాదుడు బాదకుండా, విద్యుత్ ఛార్జీలను ఎంతో కొంత తగ్గించి ఉంటే అప్పుడు నిజంగానే చంద్రబాబుకు మంచి పేరు వచ్చేది. ఆయన సమర్థుడు అని భుజకీర్తులు తగిలించినా బాగానే ఉండేది. అలాకాకుండా.. ఎప్పటి మాదిరే అబద్దాలతో ప్రజలను మాయ చేయాలనుకోవడమే ఇందులో మతలబు. అసలు కూటమి సర్కార్ ప్రజలపై అదనపు భారం ఎందుకు మోపింది? ఇప్పుడు ఎందుకు ఈఆర్సీ తగ్గింపు ఆదేశాలు ఇచ్చింది చెప్పకుండా అదేదో తమ చంద్రబాబు నిర్ణయం అన్నట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేయడమే శోచనీయం. కూటమి అధికారంలోకి వచ్చాక ఇంతవరకు సుమారు రూ. 19 వేల కోట్ల భారం వేశారని లెక్కలతో సహా వార్తలు వస్తున్నాయి. ఇది ఏపాటి సమర్ధత అవుతుందో ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా వారే చెప్పాలి! పోనీ అదెందుకు! డిస్కంలు మరో రూ.12771 కోట్ల అదనపు వసూలుకు ఈఆర్సీని అనుమతి కోరాయి కదా.. దానిని ఉపసంహరించుకుంటామని చంద్రబాబు కాని, ఆయన తరపున ఎల్లో మీడియా కాని ప్రకటిస్తాయా? అని రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పొగడరా! పొగడరా! అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అని పొగిడాడట వెనుకటి ఒకడు. అలాగే ఈ ఎల్లోమీడియా ఎంతకైనా దిగజారుతున్నాయి. జగన్ టైమ్‌లో విద్యుత్ రంగాన్ని ఎంత సమర్థంగా నిర్వహించినా, అప్పట్లో ఇంకేముంది ఛార్జీలు పెంచేశారు అంటూ ప్రచారం చేసిన ఈ మీడియా ఇప్పుడు వేల కోట్ల అదనపు భారాలు ప్రజలపై కూటమి మోపుతున్నా ,దానిని కప్పిపుచ్చడానికి యత్నిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలన్న డిమాండ్ నెరవేర్చడం సాధ్యం కాదని, అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరవేసుకోవల్సిందేనని చంద్రబాబు చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తదుపరి అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసింది. ఆ తర్వాత దానిని కూడా తన క్రెడిట్ లో వేసుకోవడానికి ఆయన ఏమి చెప్పారంటే, తాను తెచ్చిన సంస్కరణల వల్లే అది సాధ్యమైందని ప్రచారం చేసుకున్నారు.అలా ఉంటుంది చంద్రబాబు తెలివి. ఈసారి కూడా అదే తరహాలో ప్రజలను మభ్యపెట్టేందుకు ఆయన చేసిన యత్నం వికటించి ప్రజలకు వాస్తవం తెలిసిపోయిందని అనుకోవాలి.నకిలీ వార్తల వెల్లువ అంటూ ఈనాడు దినపత్రిక(Eenadu Fke News) ఈ మధ్య ఒక సంపాదకీయం రాసింది. అందులో నకిలీ వార్తల గురించి గుండెలు బాదుకుంది. మంచిదే కాని తానేమి చేస్తున్నది మర్చిపోయి ఎదుటి వారిపై నిందించే రీతిలో ఆ సంపాదకీయం రాసుకుని ఆత్మవంచన చేసుకుందని చెప్పాలి. 'ఎన్నికలలో గెలిస్తే ప్రజా సంక్షేమానికి, సమ్మిళిత ప్రగతికి, ఎలాంటి కృషి చేస్తామో చెబుతూ ఓట్లు అడగడం నైతిక నిష్ట కలిగిన నాయకుల పద్దతి. అలాంటివారు అరుదైపోయి అబద్ధాలతో అధికారాన్ని గుప్పిట పడదామనుకునే జగత్ కిలాడీలతో రాజకీయాలు భ్రష్టు పడుతుండడం నేటి భారతం దుర్గతి. దానికి తగ్గట్లే పార్టీల నిర్వహణలోని ప్రధాన స్రవంతి మీడియా సంస్థల్లో కొన్ని బూటకపు వార్తా కథనాలను విచ్చలవిడిగా జనం మీదకు వదులుతున్నాయి. వ్యక్తిత్వ హననాలకు తెగపడుతున్నాయి. ఇలాంటి పెడపోకడలను అడ్డుకోకపోతే నకిలీ వార్తా సంస్థలను జవాబుదారి చేయకపోతే కపట నేతల స్వార్ధ ప్రయోజనాలకు ప్రజాస్వామ్యం బలి పశువు అవుతుంది"అ ని రాశారు. ఇది చదువుతుంటే ఏమనిపిస్తుంది? ఇక్కడ కూడా ఏ మాత్రం చిత్తశుద్ది లేకుండా ఎడిటోరియల్ రాశారని తెలిసిపోవడం లేదా!. ఒక పక్క తప్పుడు వార్తలనండి, నకిలీ వార్తలనండి వారే ఇష్టానుసారంగా పాఠకులపై రుద్దుతో పార్టీల మీడియా ఏదో చేస్తోందంటూ నిస్సిగ్గుగా రాసిందనిపించదా! విద్యుత్ ఛార్జీల విషయంలో జరిగిందేమిటి.ఎల్లో మీడియా రాసిందేమిటి? దానిని నకిలీ అంటారా? తప్పుడు వార్తలు అంటారా! కూటమి సర్కార్ కరెంటు ఛార్జీలు పెంచిందా? లేదా? అదనపు వసూళ్లకు పాల్పడ్డారా? లేదా? అన్నది చెప్పకుండా కథలు రాయడం టీడీపీ మీడియాది జగత్ కిలాడి తనం అవుతుందా? లేదా అన్నది వారే ఆలోచించుకోవాలి. అలాగే వీరు చెప్పే నీతిసూత్రం ప్రకారం టీడీపీ, జనసేన కూటమి నేతలే జగత్ కిలాడీలు అవ్వాలి కదా! ఆ మాటను ఎందుకు నేరుగా రాయలేకపోయారు!. ఎంతసేపు జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఈనాడు మీడియా సుద్దులు చెప్పడం ఆశ్చర్యమే. అబద్దాలతో అధికారం గుప్పిట పెడదామనుకుంటున్నారట. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం కూటమి ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమిటి? వాటిలో ఎన్ని నెరవేర్చారు? అవి అబద్దపు హామీలా? కాదా? అన్నదానిపై ఎన్నడైనా ఒక్క వార్త ఇచ్చారా? ఎన్నికలకు ముందు ఎన్ని రకాల అసత్యాలను ప్రచారం చేశారో ఈనాడు వంటి ఎల్లో మీడియాకు గుర్తు లేదేమో కాని, కాస్త రెగ్యులర్ గా ఫాలో అయ్యే పాఠకులందరికి తెలియకుండా ఉంటుందా! ఈనాడు మీడియా ఒక్కసారి తమను తాము అద్దంలో చూసుకుని ,ఆత్మవంచన చేసుకోకుండా ఆత్మపరిశీలన చేసుకుంటే వారికే తెలుస్తుంది ఎవరు నకిలీ వార్తలు రాస్తున్నారో,ఎవరు తప్పుడు కధనాలు ఇస్తున్నారో!.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Midhun Reddy: కేసు పెట్టి సాధించింది ఏం లేదు.. పైశాచికంగా వారు ఆనందపడ్డారు
-
మహిళలకు బాబు మరో భారీ షాక్..
-
Magazine Story: బాబు కుట్ర భగ్నం.. బయటపడ్డ బండారం
-
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనలో సున్నా వడ్డీ ఔట్... మహిళలను మోసం చేసిన సీఎం చంద్రబాబు
-
ఎంపీ మిథున్ రెడ్డి విడుదలపై కూటమి కుట్ర
-
ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదు
-
చంద్రబాబు ప్రభుత్వానికి ERC షాక్
-
ఆ చిన్న తప్పు వల్లే పోలీసులు ఇరుక్కున్నారు? అడ్వకేట్ బాల సంచలన నిజాలు
-
Big Question: లోకేశ్ పోలీసుల అసలు రంగు.. మఫ్టీలో వస్తారు.. మడతేస్తారు
-
ప్రజల సొమ్ము వెనక్కి ఇచ్చేయండి.. బాబుకి ‘కరెంట్’ షాక్
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) భారీ షాక్ ఇచ్చింది. విద్యుత్ ఛార్జీల పేరిట ఈ ఏడాదిన్నర కాలంలో అడ్డగోలుగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రజలకు రూ.923.55 కోట్లు వెనక్కి ఇవ్వాలంటూ బాబు సర్కార్‌ను ఈఆర్సీ ఆదేశించింది. 20024-2025 కాలానికి గానూ ట్రూ అప్ ఛార్జీలను డిస్కమ్‌లు వసూలు చేశాయి. ఈ చార్జీలపై ఈఆర్సీ విచారణ జరిపింది. అయితే డిస్కమ్‌ల లెక్కలు, విద్యుత్ కొనుగోలు వ్యయంలో తేడాలు గుర్తించింది. 2024-25 సంవత్సరానికి ట్రూ అప్ చార్జీలుగా డిస్కంలు ప్రతిపాదించిన రూ.2,758.76 కోట్లలో.. రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అదనంగా వసూలు చేసిన రూ.923.55 కోట్లను విద్యుత్ వినియోగదారులకు వెనక్కి ఇవ్వాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. APERC స్థాపన (1999) తర్వాత వినియోగదారులకు రిఫండ్ ఆదేశించిన ఘటన ఇదే తొలిసారి. ఈఆర్సీ మొట్టికాయలతో ప్రజల సొమ్మును ప్రభుత్వం వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు.. ‘‘ప్రభుత్వం ప్రజల సొమ్ము గుంజింది.. అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేసింది’’ అనే రాజకీయ ఆరోపణలను ఈఆర్సీ నిర్ణయం వాస్తవమని తేల్చింది. -
కూటమి వైఫల్యాలను బయటపెట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు


