సాక్షి కృష్ణా: ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఘంటసాలలో ప్రభుత్వం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయ్యింది.
ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం రైతులతో ముఖాముఖీ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే ఆ కార్యక్రమంలో రైతుల వద్దకు వెళ్లేందుకు అచ్చెన్న భయపడినట్లు ఉన్నారు. అందుకే అన్నదాతలకు బదులు టీడీపీ నేతలతో ముఖాముఖీ నిర్వహించారు.
ముఖాముఖిలో అయినపూడి యశోధర, దోనేపూడి విజయలక్ష్మి, బంజి పరాత్మరరావులు అచ్చెన్నతో మాట్లాడారు. బండి పరాత్మర రావు ఘంటసాల పీఏసీఎస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. యశోధర, విజయలక్ష్మిలిద్దరూ టీడీపీ నేతకు సంబంధించిన కుటుంబీకులు. అలా.. ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం నిర్వహించామని చెబుతూ సొంతపార్టీ నేతలతోనే మాట్లాడి మంత్రి అచ్చెన్న నవ్వులపాలయ్యారు.


