సాక్షి, వైఎస్సార్: జిల్లాలోని సుండుపల్లె మండలంలో టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. రాయవరం సర్పంచ్ షరీఫ్ ఇంటిపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు వర్గీయులు దాడి చేశారు. పచ్చ నేతల దాడిలో సర్పంచ్ షరీఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, అతడిని ఆసుపత్రికి తరలించారు.
అనంతరం, సర్పంచ్ షరీఫ్ మాట్లాడారు. తన సోదరుడు, మండల మైనారిటీ నాయకుడు రఫీక్‌కు ఉన్న ఆదరణను ఒర్వలేకనే చప్పిడి బ్రదర్స్ అనుచరులు దాడి చేశారని ఆరోపించారు. తమపై దాడి చేసేందే కాకుండా.. అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలు ఎదగడం ఇష్టం లేకనే తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. తమను టీడీపీ గుర్తించలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సర్పంచ్ ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు.


