‘నా ఇంటిపై దాడికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణం’ | YSRCP Leader Ambati Rambabu Slams Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘నా ఇంటిపై దాడికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణం’

Feb 23 2026 5:59 PM | Updated on Feb 23 2026 6:02 PM

YSRCP Leader Ambati Rambabu Slams Chandrababu Govt

గుంటూరు: తన ఇంటిపై జరిగిన దాడికి చంద్రబాబు, లోకేష్‌ ఆదేశాలే కారణమని మరోసారి పునరుద్ఘాటించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాయంత్రం ఐదునుంచి రాత్రి పన్నెండు గంటలవరకూ తన ఇంటిపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, ఇది చంద్రబాబు, లోకేష్‌ల కుట్ర కాదా? అని ప్రశ్నించారు. 

ఈ రోజు(సోమవారం, ఫిబ్రవరి 23వ తేదీ) మీడియాతో మాట్లాడిన అంబటి.. ‘ రాజమండ్రి జైలు నుంచి విడుదలైనప్పటినుంచి వైఎ‍స్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి సంఘీభావం ప్రకటించారు. వారందరికీ నా ధన్యవాదాలు. నేను జైలులో ఉన్నప్పుడు మా అధినేత జగన్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. 18 రోజులు జైలులో ఉండి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు వివరించే ప్రయత్నం చేశాను.

నన్ను అరెస్టు చేసి తీసుకెళ్ళిన తర్వాత నా ఆఫీసు, ఇల్లు తగలబెట్టాలని నిర్ణయించుకున్నారు. మా ఇంట్లోనుంచి నా భార్య, కూతుర్లు వెనుకనుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు సీఎం చంద్రబాబే బాధ్యుడు. ఏడు గంటలు పోలీసులు  నిర్వీర్యంగా ఉండడానికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణం. మీరు కాదని చెప్పండి.. ఆవేశంలో దాడులు చెయ్యడం చూశాం. కానీ సాయంత్రం ఐదునుంచి రాత్రి పన్నెండు గంటలవరకూ పోలీసులు పట్టించుకోలేదు. ఇది మీ కుట్ర కాదా చంద్రబాబు.మాజీ మంత్రి ఇంటిపై దాడి చేస్తుంటే ఎందుకు నిర్యీర్యంగా ఉన్నారో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement