విజయవాడ: రాజమండ్రిలో కల్తీ పాల ఘటన కారణంగా పలువురు మృతిచెందిన అనంతరం జరిగిన పరిణామాలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పాలతోనే డయాలసిస్ సమస్యలు వచ్చాయన్నారు చంద్రబాబు.
ఈ ఘటన కారణంగా నలుగురు చనిపోయారని, ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. మరో 8 మందికి చికిత్స కొనసాగుతోందన్నారు.


