సాక్షి, కృష్ణా జిల్లా: ఆక్వా రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని.. ఫీడ్ ధర పెంచి రైతుల నడ్డి విరిచిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రొయ్యల కంపెనీల గూడు పుఠాణిని రైతులు పసిగట్టారు.. అందుకే రైతులు పోరాటం మొదలుపెట్టారు. రొయ్యల మేత తయారీ దారులంతా చంద్రబాబు చందాదారులే. ధరలు పెంచే ప్రసక్తే లేదని మంత్రి అచ్చెన్నాయుడు కబుర్లు చెప్పాడు. కేజీకి 12 రూపాయలు పెంచి 2 రూపాయల తగ్గించారు’’ అని దుయ్యబట్టారు.
‘‘రొయ్యల రైతుకు అండగా నిలిచేందుకు ఈనెల 15వ తేదీన జగన్ భీమవరం వెళ్తారు. హెలీకాప్టర్‌కు పర్మిషన్ లేదంటున్నారు. రొయ్యల రైతు కోసం బెజవాడ నుంచి భీమవరానికి జగన్ రైలెక్కి వెళ్తారు. వైఎస్ జగన్‌ను ఆపలేరు.. కష్టం చెప్పుకోవడానికి వచ్చే రైతులను ఆపలేరు’’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని మేల్కొలపడానికి ఒక్కోసారి యుద్ధం తప్పదన్నారు.


