లెజెండరీ గాయని జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి | Ys Jagan Condoles The Death Of Legendary Singer Janaki | Sakshi
Sakshi News home page

లెజెండరీ గాయని జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Jul 11 2026 9:12 PM | Updated on Jul 11 2026 9:24 PM

Ys Jagan Condoles The Death Of Legendary Singer Janaki

సాక్షి, తాడేపల్లి: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్.జానకి మరణం పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన ఎస్. జానకి సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్‌ జగన్ పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని కొనియాడారు.

తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఎస్.జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని వైఎస్‌ జగన్ అన్నారు. ఆమె పాడిన పాటలు, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎస్. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన వైఎస్‌ జగన్.. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కాగా, ప్రముఖ దిగ్గజ నేపథ్య గాయని ఎస్.జానకి మైసూరులోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో మృతి చెందారు. “దక్షిణ భారత కోకిలగా ఆమె ప్రత్యేక గుర్తించారు. 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఎస్. జానకి.. ఆరు దశాబ్దాలకు పైగా సినీ గాన సేవ చేశారు. 17 భాషల్లో 48 వేలకుపైగా పాటలు ఆలపించిన గానకోకిల.. మధురమైన గాత్రంతో కోట్లాది అభిమానుల మనసు గెలుచుకున్నారు. గ్రామీణ జానపదం నుంచి శాస్త్రీయ, మెలోడీ, భక్తి గీతాల వరకు విశేష ప్రతిభ కనపరిచారు. భారతీయ సినీ సంగీత రంగానికి ఎస్. జానకి సేవలు చిరస్మరణీయం. ఎస్. జానకి మృతితో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది. గానకోకిల ఎస్. జానకికి సినీ, సంగీత ప్రముఖులు నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement