కుప్ప​కూలిన విమానం, 10 మంది దుర్మరణం | Bahamas plane crash kills 10 Flamingo Air flights grounded amid probe | Sakshi
Sakshi News home page

కుప్ప​కూలిన విమానం, 10 మంది దుర్మరణం

Jul 11 2026 11:53 AM | Updated on Jul 11 2026 12:01 PM

Bahamas plane crash kills 10 Flamingo Air flights grounded amid probe

Bahamas plane crash బహామాస్ 53వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ విమానం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.  శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో బహామాస్ ప్రభుత్వం 'ఫ్లెమింగో ఎయిర్' (Flamingo Air) విమానాల సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది.

ద్వీపసమూహ దేశమైన బహామాస్ రాజధాని నసావుకు పశ్చిమంగా జలాల్లో ఉన్న నార్త్ ఆండ్రోస్ (North Andros) ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. నసావు నుంచి శాన్ ఆండ్రోస్ వెళ్తుండగా ఈ ట్విన్-ఇంజిన్ (సెస్నా 402) విమానం ప్రమాదానికి గురైంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న నాసావుకు పశ్చిమాన ఉన్న నార్త్ ఆండ్రోస్‌లోని అటవీ ప్రాంతంలో,  విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ప్రమాదం జరిగిన సమయంలో ఒకరు ప్రాణాలతో బయటపడినట్లు బహామాస్ ప్రధాన మంత్రి ఫిలిప్ బ్రేవ్ డేవిస్ మొదట తెలిపినప్పటికీ, ఆ తర్వాత సదరు వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు నిర్ధారించారు. బహామాస్ 53వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో ఆ దేశంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఇదీ చదవండి: మటన్ వర్సెస్ చికెన్ : కుర్చీలు విరిగాయ్‌, తలలు పగిలాయ్‌!
ఇదీ చదవండి: ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ వినూత్న ప్రయోగం : 100 గొర్రెలతో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement