భారత వాయుసేన విమాన ప్రమాదం.. ఐదుగురు మృతి | Indian Air Force plane crashes in Assam | Sakshi
Sakshi News home page

భారత వాయుసేన విమాన ప్రమాదం.. ఐదుగురు మృతి

Jun 13 2026 11:33 AM | Updated on Jun 13 2026 3:59 PM

Indian Air Force plane crashes in Assam
ఎయిర్ ఫోర్స్ బేస్ లో కుప్పకూలిన విమానం

ఢిల్లీ: దేశంలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అస్సాంలో శనివారం ఉదయం  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎఎన్-32 ట్రాన్స్పోర్ట్ విమానం కూలిపోయింది. ల్యాండింగ్ చేస్తుండగా ఈ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విమానం క్రాష్ అయిన తర్వాత మంటలు చెలరేగాయి. జోర్హాట్  ఎయిర్ బేస్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు అధికారులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో మరొకరు గాయపడటంతో అతడికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంపై భారత వాయుసేన అధికారికంగా స్పందిస్తూ.. దర్యాప్తునకు ఆదేశించామని, పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మరిన్ని వివరాలు అందిస్తామని తెలిపింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement