మిస్ టీన్ యూనివర్స్ ఇండియా విజేతగా ప్రసుచి పాండా | Prasuci Panda on winning Miss Teen Universe India 2026 | Sakshi
Sakshi News home page

మిస్ టీన్ యూనివర్స్ ఇండియా విజేతగా ప్రసుచి పాండా

Jul 28 2026 11:49 AM | Updated on Jul 28 2026 11:59 AM

Prasuci Panda on winning Miss Teen Universe India 2026

మిస్‌ టీన్‌ యూనివర్స్‌ ఇండియాగా ఒడిశాకు చెందిన ప్రసుచి పాండా కిరీటాన్ని దక్కించుకుంది. ఈ ఘన విజయం అనంతరం తొలిసారిగా భువనేశ్వర్‌కు వచ్చిన ఆమె అక్కడ స్థానిక మీడియాతో ముచ్చటించారు. ఇది తనకు ఎంతో భావోద్వేగంతో కూడిన క్షణంగా అభివర్ణించింది. అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఒక గౌరవం, గొప్ప బాధ్యతగా పేర్కొంది. 

ఇది తన ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని అన్నారు. కచ్చితంగా తాను  తన తల్లిదండ్రులు, ఒడిశా రాష్ట్రం, గర్వపడేలా కృషి చేస్తానని చెప్పారామె. అసలు  ఇలా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం అనేది తన చిరకాల కోరిక అని, అందువల్ల నాదేశం మిస్‌ టీన్‌ యూనివర్సిటీ కిరీటాన్ని దక్కించుకునేలా తనవంతుగా పూర్తి అంకితభావంతో పనిచేస్తానని అన్నారామె. కాగా, టీనేజర్ల కోసం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీలలో ఒకటైన 'మిస్ టీన్ యూనివర్స్' అంతర్జాతీయ పోటీలో వచ్చే ఏడాది భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది ప్రసుచి. 

ఆమె ఎవరంటే..
ధరణిధర్‌ పాండా, స్వప్న రాణి పాండాల కుమార్తె. ఆమె కుటుంబం ఒడిశాలోని గంజాం జిల్లా బెర్హంపూర్‌లోని హిల్పట్నాకు చెందినది. చదువుకునే రోజుల్లోనే ఆమెకు మోడలింగ్‌ పట్ల అమితాశక్తి ఉంది. అదే ఆమెను తన కలలను సాకారం చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్లేలా ప్రేరేపించింది. అక్కడ ఆమె యువ మోడల్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

అయితే ప్రసూచి తన నాలుగేళ్ల వయసులోనే ఈ శిక్షణ ప్రారంభించి, 2026లో వృత్తిపరంగా ర్యాంప్‌వాక్‌లో అడుగుపెట్టింది. ఆమె నిరంత పట్టుదల, అంకితభావం, ఈ ప్రతిష్టాత్మకమైన మిస్‌టీన్‌ యూనివర్స్‌ ఇండియా 2026 కిరీటాన్ని దక్కించుకునేలా చేశాయి.

(చదవండి: కంగనా రనౌత్ వైరల్ కేన్సర్ స్టోరీ..నిజంగానే అధిక ప్రోటీన్‌ ప్రమాదకరమా?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement