అందమైన బుగ్గల కోసం..కుసుమ పూల రసం | Beauty Tips: Fabulous Ways to Get Chubby Cheeks Naturally | Sakshi
Sakshi News home page

అందమైన బుగ్గల కోసం..కుసుమ పూల రసం

Jul 26 2026 9:04 AM | Updated on Jul 26 2026 9:08 AM

Beauty Tips: Fabulous Ways to Get Chubby Cheeks Naturally

‘లూబ్రిటీ ఎలక్ట్రిక్‌ మజిల్‌ స్టిమ్యులేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ స్కిన్‌కేర్‌ డివైజ్‌’– చర్మ సంరక్షణ కోసం తాజాగా అందుబాటులోకి వచ్చిన పరికరం ఇది. ఇందులోని రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీ చర్మం లోపలి పొరల్లో కొలాజెన్‌ ఉత్పత్తిని ప్రేరేపించి, చర్మం బిగుతు సడలిపోకుండా చేస్తుంది. ఇక ఎలక్ట్రికల్‌ మజిల్‌ స్టిమ్యులేషన్‌ థెరపీ.. అతి తక్కువ విద్యుత్‌ ప్రేరణల ద్వారా చర్మ కండరాలను బలోపేతం చేసి ముఖంపై ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. 

ఈ డివైస్‌ ఇన్‌బిల్ట్‌ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది గనుక దీనిని ప్రయాణాల్లో కూడా సులభంగా వాడుకోవచ్చు. అంతేకాకుండా క్లినిక్‌లలో లభించే ఖరీదైన ట్రీట్‌మెంట్‌లతో పోలిస్తే, ఇది చాలా తక్కువ ధరకే లభిస్తుండటం విశేషం. బ్యూటీ పార్లర్లు, క్లినిక్‌ల చుట్టూ తిరిగే పనిలేకుండా, ఇంట్లోనే కూర్చుని ప్రొఫెషనల్‌ స్థాయి చర్మ సంరక్షణను పొందేందుకు ఈ హ్యాండ్‌హెల్డ్‌ పరికరం ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

డార్క్‌ సర్కిల్స్‌కి ఇలా చెక్‌ పెట్టేయండి!
కీరదోసలో చర్మాన్ని చల్లబరచడమే కాకుండా చర్మాన్ని బిగుతుగా చేసే గుణాలు కూడా ఉంటాయి. చల్లటి కీరదోస ముక్కలను కళ్లపై 10–15 నిమిషాల పాటు ఉంచడం వల్ల కళ్ల అలసట తగ్గి, రక్తప్రసరణ మెరుగవుతుంది. వాడేసిన గ్రీన్‌ టీ లేదా బ్లాక్‌ టీ బ్యాగ్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచి, చల్లబడిన తర్వాత కళ్లపై పెట్టుకోవాలి. టీలో ఉండే కెఫీన్, యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల కింద ఉండే రక్తనాళాలను సంకోచింపజేసి, వాపును, నలుపును తగ్గిస్తాయి. 

అలాగే బంగాళాదుంపలో సహజసిద్ధమైన బ్లీచింగ్‌ గుణాలు ఉంటాయి. ఇది చర్మంపై ఉన్న నలుపును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. బంగాళదుంప రసంలో దూదిని ముంచి, కళ్ల కింద అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. హోం రెమెడీస్‌తో పాటు రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. 

శరీరంలో నీటి శాతం తగ్గినా కళ్ల కింద చర్మం నిర్జీవంగా మారుతుంది. కాబట్టి రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. అలాగే నిద్రపోయేటప్పుడు ఒకటి లేదా రెండు దిండ్లను తల కింద ఉంచుకోవడం వల్ల కళ్ల కింద ద్రవాలు చేరకుండా నిరోధించవచ్చు. దీనివల్ల పొద్దున్నే లేచేసరికి కళ్లు ఉబ్బినట్లు ఉండవు. 

చక్కటి బుగ్గల కోసం..
బుగ్గలకు సహజమైన, ఆరోగ్యకరమైన రంగును అందించడానికి ఉపయోగించే మేకప్‌లో ఫేస్‌ బ్లష్‌ కూడా ముఖ్యమైనది. ఇందుకోసం వేల సంవత్సరాల క్రితం ప్రాచీనా చైనాలో మహిళలు సహజసిద్ధమైన పూల రసంతో తమ బుగ్గలను ఎరుపు రంగులోకి మార్చుకునేవారు. క్రీస్తుపూర్వం 16 నుంచి 11వ శతాబ్దానికి చెందిన ‘షాంగ్‌ రాజవంశం’ కాలంలో ‘హాంగ్‌–లాన్‌ హువా’ (కుసుమ పువ్వుల) రసాన్ని గడ్డకట్టించి బ్లష్‌గా ఉపయోగించేవారు. దీనిని అప్పట్లో ‘యాన్‌–ఝీ’ అని పిలిచేవారు. ముఖానికి దోర గులాబీ రంగు మేకప్‌ లుక్‌ తీసుకురావడానికి, లిప్‌ కలర్‌ తయారుచేయడానికి మహిళలు దీనిని విరివిగా వాడేవారట! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement