breaking news
Chubby babies
-
అందమైన బుగ్గల కోసం..కుసుమ పూల రసం
‘లూబ్రిటీ ఎలక్ట్రిక్ మజిల్ స్టిమ్యులేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ స్కిన్‌కేర్ డివైజ్’– చర్మ సంరక్షణ కోసం తాజాగా అందుబాటులోకి వచ్చిన పరికరం ఇది. ఇందులోని రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీ చర్మం లోపలి పొరల్లో కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించి, చర్మం బిగుతు సడలిపోకుండా చేస్తుంది. ఇక ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్ థెరపీ.. అతి తక్కువ విద్యుత్ ప్రేరణల ద్వారా చర్మ కండరాలను బలోపేతం చేసి ముఖంపై ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ డివైస్ ఇన్‌బిల్ట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది గనుక దీనిని ప్రయాణాల్లో కూడా సులభంగా వాడుకోవచ్చు. అంతేకాకుండా క్లినిక్‌లలో లభించే ఖరీదైన ట్రీట్మెంట్లతో పోలిస్తే, ఇది చాలా తక్కువ ధరకే లభిస్తుండటం విశేషం. బ్యూటీ పార్లర్లు, క్లినిక్‌ల చుట్టూ తిరిగే పనిలేకుండా, ఇంట్లోనే కూర్చుని ప్రొఫెషనల్ స్థాయి చర్మ సంరక్షణను పొందేందుకు ఈ హ్యాండ్‌హెల్డ్ పరికరం ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.డార్క్ సర్కిల్స్‌కి ఇలా చెక్ పెట్టేయండి!కీరదోసలో చర్మాన్ని చల్లబరచడమే కాకుండా చర్మాన్ని బిగుతుగా చేసే గుణాలు కూడా ఉంటాయి. చల్లటి కీరదోస ముక్కలను కళ్లపై 10–15 నిమిషాల పాటు ఉంచడం వల్ల కళ్ల అలసట తగ్గి, రక్తప్రసరణ మెరుగవుతుంది. వాడేసిన గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ బ్యాగ్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచి, చల్లబడిన తర్వాత కళ్లపై పెట్టుకోవాలి. టీలో ఉండే కెఫీన్, యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల కింద ఉండే రక్తనాళాలను సంకోచింపజేసి, వాపును, నలుపును తగ్గిస్తాయి. అలాగే బంగాళాదుంపలో సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇది చర్మంపై ఉన్న నలుపును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. బంగాళదుంప రసంలో దూదిని ముంచి, కళ్ల కింద అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. హోం రెమెడీస్‌తో పాటు రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. శరీరంలో నీటి శాతం తగ్గినా కళ్ల కింద చర్మం నిర్జీవంగా మారుతుంది. కాబట్టి రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. అలాగే నిద్రపోయేటప్పుడు ఒకటి లేదా రెండు దిండ్లను తల కింద ఉంచుకోవడం వల్ల కళ్ల కింద ద్రవాలు చేరకుండా నిరోధించవచ్చు. దీనివల్ల పొద్దున్నే లేచేసరికి కళ్లు ఉబ్బినట్లు ఉండవు. చక్కటి బుగ్గల కోసం..బుగ్గలకు సహజమైన, ఆరోగ్యకరమైన రంగును అందించడానికి ఉపయోగించే మేకప్‌లో ఫేస్ బ్లష్ కూడా ముఖ్యమైనది. ఇందుకోసం వేల సంవత్సరాల క్రితం ప్రాచీనా చైనాలో మహిళలు సహజసిద్ధమైన పూల రసంతో తమ బుగ్గలను ఎరుపు రంగులోకి మార్చుకునేవారు. క్రీస్తుపూర్వం 16 నుంచి 11వ శతాబ్దానికి చెందిన ‘షాంగ్ రాజవంశం’ కాలంలో ‘హాంగ్–లాన్ హువా’ (కుసుమ పువ్వుల) రసాన్ని గడ్డకట్టించి బ్లష్‌గా ఉపయోగించేవారు. దీనిని అప్పట్లో ‘యాన్–ఝీ’ అని పిలిచేవారు. ముఖానికి దోర గులాబీ రంగు మేకప్ లుక్ తీసుకురావడానికి, లిప్ కలర్ తయారుచేయడానికి మహిళలు దీనిని విరివిగా వాడేవారట! -
పేరు మారిస్తే.. ఫేట్ మారుద్ది!
ఇది కూడా పేరు తెచ్చిన ప్రాబ్లమే. అక్కడ పిల్లాడి పేరు అయితే, ఇక్కడ భార్య పేరు.. అంతే తేడా. ఓ వ్యక్తి తన భార్య పేరును ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో ‘చబ్బీ’అని సేవ్ చేసినందుకు ఆమె విడాకులు తీసుకుంది. తుర్కియేలోని ఉసక్ నగరానికి చెందిన భార్యాభర్తల మధ్య ఈ పేరు పంచాయితీ వచ్చింది. భర్త ఆమె పేరును తన ఫోన్లో ‘టొంబెక్’అని సేవ్ చేసుకున్నాడు. అంటే చబ్బీ(బొద్దుగా) అని అర్థం. ఇది చూసిన ఆమె భర్తపై తీవ్రంగా మండిపడి విడాకుల కోసం కోర్టుకెళ్లింది. తన పేరు అలా పెట్టుకోవడం తీవ్ర అవమానకరమని, ఇక అతడితో కలిసి ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. వాదనలు విన్న న్యాయమూర్తి.. వారికి విడాకులు ఇవ్వడంతోపాటు ఆమె మానసిక క్షోభకు పరిహారం చెల్లించాలని అతడిని ఆదేశిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థంచగా.. మరికొందరు చబ్బీ అని ముద్దుగా పెట్టుకున్నాడేమో అని జాలిపడ్డారు. చూశారా.. పేరులో ఎంతుందో? భర్తలూ.. జర భద్రం మరి..! -
చబ్బీ చార్మ్
చిక్కిన అందానికి ఏ డ్రెస్ వేసినా చక్కగానే ఉంటుంది. కాని కాస్త బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మలకే డ్రెస్సింగ్ కేర్ తప్పని సరి. దాచాలంటే దాగని శరీరాకృతిని కాస్ట్యూమ్స్‌తో కవర్ చేసుకోవాలనుకుంటారు. అందుకే అన్ని కోణాల్లో ఆలోచించి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటారు. మనసుకు నచ్చిన డిజైన్ కనిపించిన మన కు నప్పదని కాదనుకుంటారు. ఇలాంటి వారి కోసం ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త డిజైన్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుత లైఫ్‌స్టైల్.. అమ్మాయిలను వద్దన్నా బొద్దుగా మార్చేస్తోంది. దీంతో పెళ్లికో.. పేరంటానికో.. వెళ్లాలంటే ఎలాంటి దుస్తులు ధరించాలో తెలియక గజగామినిలు తికమకపడుతున్నారు. బొద్దుగా కాకుండా.. ముద్దుగా చూపించే ఆహార్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి అతివల కోసమే ఫ్యాషన్ డిజైనర్లు సరికొత్త ఫార్ములాలను పరిచయం చేస్తున్నారు. అంతేకాదు.. బొద్దుగుమ్మలు ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించాలో.. ఏ ఏ రంగులు సూటవుతాయో.. ఇలా సూచిస్తున్నారు. ఫికర్ మత్.. మేని ఛాయ బంగారంలా మెరిసిపోతున్న చబ్బీ బేబీలు ముదురు రంగులు వేస్తే బెటర్. లైట్ కలర్స్ అయితే మీ లావుతనాన్ని హైలైట్ చేస్తాయి. కాళ్లు కాస్త లావుగా ఉంటే డార్క్ కలర్ బాటమ్ వేసి లైట్ కలర్ టాప్ వేసుకుంటే సరి. అయితే టాప్స్ మాత్రం నడుం కింది భాగం వరకూ ఉండేలా చూసుకుంటే మంచిది. చేతులు చబ్బీగా ఉంటే మాగ్జిమమ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లేదా ఫుల్ హ్యాండ్స్ ప్రిఫర్ చేయాలి. మరో విషయం వేసుకునే డ్రెస్‌పైన గాని, కట్టుకునే చీరపైన కాని పెద్దపెద్ద పూలు, పెద్ద డిజైన్ ఉంటే అవి మిమ్మల్ని హైలైట్ చేస్తాయి. చిన్న చిన్న పూలు, చుక్కలు ఉండేవి వేసుకుంటే అవి హైలైట్ అయ్యి మీ ఆకారాన్ని దాచేస్తాయి. ఫ్యాషన్ మస్త్.. అడ్డగీతల టాప్‌లు, షర్ట్లు, ప్యాంట్లు వేసుకుంటే ఉన్నదానికంటే ఇంకాస్త ఎక్కువ లావుగా కనిపిస్తారు. నిలువు గీతల కాస్ట్యూమ్స్ కాస్త సన్నగా, పొడుగ్గా కనిపించేలా చేస్తాయి. ఫ్యాషన్ లుక్ కోరుకునే ‘మంద’గత్తెలు హిప్స్ కింది వరకూ కవర్ చేసే పొడువాటి షర్ట్, మ్యాచింగ్‌గా క్వాలిటీ స్కిన్నీ లెగ్గిన్ వేసుకుంటే అదిరేటి లుక్ వస్తుంది. టాప్, షర్ట్‌లకు సైడ్ కటింగ్స్ లేకుండా చూసుకోవాలి. ఈ కాస్ట్యూమ్స్ ఏ మాత్రం ట్రాన్స్పరెంట్గా లేకుండా చూసుకోవాలి సుమీ. ఈ డ్రెసింగ్‌కు మార్కెట్లో దొరికే షగ్స్ ్రలేదా పలుచటి ఓవర్ జాకెట్ వేసుకుంటే స్టైలిష్ లుక్ సొంతం చేసుకోవచ్చు. చీరకట్టయితే మోచేతుల వరకూ జాకెట్ ఉంటే ఫ్యాషనబుల్‌గా ఉంటుంది. సాధ్యమైనంత వరకూ స్లీవ్‌లెస్‌లు, మెగా స్లీవ్స్ అవాయిడ్ చేయండి. డ్రెసింగ్తోనే సరిపెట్టకుండా.. కాస్త బిగ్‌సైజ్ ఇయర్ టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకుంటే మరీ మంచిది. అన్నింటికన్నా కాన్ఫిడెంట్ ఉండటం ముఖ్యం. - శిరీష చల్లపల్లి


