పేరు మారిస్తే.. ఫేట్‌ మారుద్ది! | Wife divorce Number as Chubby Husband | Sakshi
Sakshi News home page

పేరు మారిస్తే.. ఫేట్‌ మారుద్ది!

Nov 30 2025 9:24 AM | Updated on Nov 30 2025 9:30 AM

Wife divorce Number as Chubby Husband

ఇది కూడా పేరు తెచ్చిన ప్రాబ్లమే. అక్కడ పిల్లాడి పేరు అయితే, ఇక్కడ భార్య పేరు.. అంతే తేడా. ఓ వ్యక్తి తన భార్య పేరును ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ‘చబ్బీ’అని సేవ్‌ చేసినందుకు ఆమె విడాకులు తీసుకుంది. తుర్కియేలోని ఉసక్‌ నగరానికి చెందిన భార్యాభర్తల మధ్య ఈ పేరు పంచాయితీ వచ్చింది. భర్త ఆమె పేరును తన ఫోన్‌లో ‘టొంబెక్‌’అని సేవ్‌ చేసుకున్నాడు. అంటే చబ్బీ(బొద్దుగా) అని అర్థం. ఇది చూసిన ఆమె భర్తపై తీవ్రంగా మండిపడి విడాకుల కోసం కోర్టుకెళ్లింది. తన పేరు అలా పెట్టుకోవడం తీవ్ర అవమానకరమని, ఇక అతడితో కలిసి ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. వాదనలు విన్న న్యాయమూర్తి.. వారికి విడాకులు ఇవ్వడంతోపాటు ఆమె మానసిక క్షోభకు పరిహారం చెల్లించాలని అతడిని ఆదేశిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థంచగా.. మరికొందరు చబ్బీ అని ముద్దుగా పెట్టుకున్నాడేమో అని జాలిపడ్డారు. చూశారా.. పేరులో ఎంతుందో? భర్తలూ.. జర భద్రం మరి..!  

Advertisement
 
Advertisement
Advertisement