Divorce
-
అలా విడిపోవడం చాలా బాధాకరం..నిహారిక కామెంట్స్ వైరల్
నటిగానే కాకుండా నిర్మాతగానూ దూసుకెళ్తున్నారు మెగా డాటర్ నిహారిక. సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసుకొని.. చిన్న బడ్జెట్‌తో మంచి చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఆమె బ్యానర్లో వచ్చిన తొలి చిత్రం కమిటీ కుర్రోళ్ళు సూపర్ హిట్ అయింది. తాజాగా రాకాస అనే హర్రర్ కామెడీ చిత్రాన్ని నిర్మించింది. సంగీత్ శోభన్ హీరో. ఏప్రిల్ 3న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్‌లో నిహారిక బిజీ అయిపోయింది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విడాకుల విషయంపై స్పందించారు.నాన్నకే చెప్పా.. నిహారిక పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంది. 2020లో చైతన్య జొన్నలగడ్డ అనే అబ్బాయిని ఈమె పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల కలిసి కాపురం చేసిన తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో 2023లో ఈ జంట విడిపోయింది.అయితే విడిపోవాలనే నిర్ణయం తీసుకున్న వెంటనే నిహారిక ఈ విషయాన్ని ముందుగా నాన్న నాగబాబుతో పంచుకుందట. ‘రిలేషన్షిప్ నుంచి బయటకు రావాలని అనుకున్నప్పుడు ముందుగా మా నాన్నకు ఈ విషయాన్ని చెప్పా. ఆయన విషయం మొత్తం విని సైలెంట్ అయ్యారు. నేను సంతోషంగా లేననే విషయం వాళ్లకు కూడా తెలుసు. జీవితంలో సంతోషంగా లేకపోతే బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదని నాన్నగారే సలహా ఇచ్చారు’ అని నిహారిక చెప్పారు.విడిపోవాలని పెళ్లి చేసుకోరు..చాలా మంది ‘ఈ మధ్య విడాకులు కామన్ అయిపోయాయి’ అంటున్నారు. కానీ గతంలోనూ భార్యభర్తలు మధ్య విబేధాలు, గొడవలు జరిగేవి. కానీ తిరిగి ఇంటికి వెళ్తే..మా నాన్న పోషించగలరా అన్న భయంతో అలాగే కొనసాగేవారు. అప్పట్లో ఒక మహిళ తన అవసరాల కోసం కూడా అబ్బాయిపై ఆధారపడేది కానీ ఇప్పట్లో అమ్మాయిలు వాళ్లకేం కావాలో వాళ్ళు సంపాదించుకుంటున్నారు, బాగా చూసుకునే పేరెంట్స్ ఉంటున్నారు. ఎవ్వరూ కూడా విడిపోవాలని పెళ్లి చేసుకోరు. మా మధ్య వచ్చిన విభేదాలు సవరించలేనివి అనిపించింది అందుకే విడాకులు తీసుకున్నాం. పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఒకరినొకరు బాగా కొట్టుకొని విడిపోతే అది తొందరగా మరచిపోతారు కానీ ఇలా విడిపోతే ఆ బాధ నుంచి బయటపడటం చాలా కష్టం’ అని నిహారిక అన్నారు. విడాకుల తర్వాత మాజీ భర్తలో టచ్‌లో ఉన్నారా అని యాంకర్ అడగగా.. ‘అలాంటిదేమి లేదు. ఇంతవరకు మేము మళ్లీ కలుసుకోలేదు. ఫోన్ కాంటాక్ట్ కూడా లేదు’ అని నిహారిక చెప్పుకొచ్చింది. -
భార్య సంగీతతో మరో చిక్కు..? విజయ్‌కు షాక్ తగలనుందా?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ దాఖలు చేయబోయే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే పట్టుదలతో విజయ్ ఉండగా.. అయితే, ఆయన అసలు ఎన్నికల్లో నిలబడగలరా? అంటూ డీఎంకేలోని న్యాయ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీంతో అప్రమత్తమైన విజయ్.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించేంత తీవ్ర వ్యవహారంగా మారిందిఎన్నికల కేసుల్లో అనుభవం ఉన్న కొందరు డీఎంకే న్యాయవాదులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. "భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, నామినేషన్ దాఖలు చేసే ప్రతి అభ్యర్థి తన ఆస్తుల వివరాలను దాచకూడదు. సమగ్రమైన అఫిడవిట్‌ను సమర్పించడం తప్పనిసరి. ఆ అఫిడవిట్లో అభ్యర్థి తన పేరుతో ఉన్న చరాస్తులు, స్థిరాస్తులే కాకుండా.. భార్య, కుమారులు, కుమార్తెల పేరు మీద ఉన్న ఆస్తులు, బ్యాంకు ఖాతాల నిల్వలు, ఆదాయపు పన్ను వివరాలన్నింటినీ సమర్పించాలి.ఇందులో ఎలాంటి తప్పులు ఉండకూడదు. ఈ అఫిడవిట్‌ను ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉంచుతారు. ఎవరైనా ఇందులో తప్పుడు సమాచారం, ఆస్తులను దాచడం వంటివి గుర్తిస్తే.. ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించే అధికారం ఎన్నికల అధికారికి ఉంటుంది. అయితే, ప్రస్తుతం.. విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారం విజయ్ నామినేషన్ దాఖలు చేయడంలో అడ్డంకిగా మారవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, ఆమె పేరు మీద ఏ ఆస్తులు ఉన్నాయి? బ్యాంకు నిల్వలు ఎంత? ఏవైనా అప్పులు ఉన్నాయా? వంటి ప్రశ్నలకు విజయ్ దగ్గర స్పష్టమైన సమాధానాలు ఉన్నాయా? అనే సందేహాలు న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.విజయ్, ఆయన భార్య గత కొన్నేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఈ కాలంలో ఆమె తన పేరు మీద, పిల్లల పేరు మీద గానీ ఏవైనా ఆస్తులు కొన్నారా? అప్పులు చేశారా? విదేశాల్లో పెట్టుబడులు పెట్టారా? వంటి వివరాలు విజయ్‌కు తెలిసే అవకాశం లేదు. తన భార్యతో సంప్రదిస్తేనే విజయ్ తన నామినేషన్లో సరైన వివరాలను పొందుపరచగలరు. కానీ, ప్రస్తుతం వారద్దరూ మాట్లాడుకునే పరిస్థితిలో లేరని తెలుస్తోంది.అందుకే విజయ్ నామినేషన్ చట్టపరమైన చిక్కులు కలగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ నామినేషన్ దాఖలును మా సీనియర్ లాయర్లు నిశితంగా గమనిస్తారు, దీనిపై ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయి’’ అని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. దీనిపై విజయ్‌కు చట్టపరమైన సమస్యలను ఎలా ఎదుర్కోవాలి?. భార్యతో విడిగా ఉంటున్నందున కొత్తగా కొన్న ఆస్తుల వివరాలు వెల్లడించలేనని చెప్పడానికి చట్టపరమైన వెసులుబాటు ఉందా? అని దానిపై విజయ్ సీనియర్ న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు సమాచారం. -
కాంగ్రెస్‌తో బలవంతపు పెళ్లి
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీని బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచి్చందని మాజీ ప్రధానమంత్రి, జేడీ (ఎస్) అధినేత హెచ్.డి.దేవెగౌడ అన్నారు. ఆ బంధం సరిగ్గా సాగకపోవడంతో నచ్చక విడాకులు తీసుకున్నానని చెప్పారు. దేవెగౌడ్ కాంగ్రెస్‌తో ప్రేమాయణం సాగించి, మోదీని పెళ్లి చేసుకున్నారంటూ బుధవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఖర్గే చేసిన వ్యాఖ్యపై దేవెగౌడ ‘ఎక్స్’లో స్పందించారు. ఖర్గే మాట్లాడినప్పుడు సభలో లేనని పేర్కొన్నారు. 2018లో కాంగ్రెస్ నాయకత్వం గులాం నబీ ఆజాద్‌ను తన వద్దకు రాయబారానికి పంపించిందని గుర్తు చేసుకున్నారు. తన తనయుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినప్పటికీ తాను అంగీకరించలేదని వెల్లడించారు. మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రిని చేయాలంటూ సూచించానని స్పష్టం చేశారు. కుమారస్వామి విషయంలో ఆజాద్ పట్టుబట్టారని అన్నారు. కానీ, 2019లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను పక్కనపెట్టి బీజేపీలో చేరిపోయారని చెప్పారు. వారిని బీజేపీలోకి ఎవరు పంపించారో అందరికీ తెలుసని ఉద్ఘాటించారు. ఫిరాయింపులను ప్రోత్సహించిన వ్యక్తిని కాంగ్రెస్ పెద్దలు ఆనాడు అడ్డుకోలేదన్నారు. కాంగ్రెస్ కూటమిని తాను వదిలేయలేదని, వారే వెళ్లిపోయారని స్పష్టంచేశారు. విడాకులు ఇవ్వడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితిని వారే సృష్టించారని దేవెగౌడ తేలి్చచెప్పారు. -
హన్సిక విడాకులు.. మాజీ వదిన షాకింగ్ పోస్ట్!
దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్న బ్యూటీ హన్సిక మోత్వానీ వ్యక్తిగత జీవితంపై ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తన భర్త సోహైల్ నుంచి ఆమె విడాకులు తీసుకోవడమే ఈ చర్చకు కారణం. 2022లో సోహైల్‌ను పెళ్లి చేసుకున్న ఆమె నాలుగేళ్ల పాటు కలిసి కాపురం చేసి..ఇటీవల విడిపోయారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత హన్సిక పర్సనల్ లైఫ్‌పై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హన్సిక మాజీ వదిన ముస్కాన్ నాన్సీ చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అదంతా ఒక నకిలీ ప్రపంచం అంటూ చేసిన వ్యాఖ్యలపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.ముస్కాన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. ‘దయచేసి నన్ను ఇతరుల జీవితాల్లో జరిగే డ్రామాల్లోకి లాగవద్దు. నాకు ఎలాంటి పెయిడ్ పీఆర్ టీమ్స్ లేవు. ఎవరిదో ఫేక్ ప్రపంచంతో నన్ను ముడిపెట్టడం ఆపేయండి. కాలమే అన్ని నిజాలను బయటపెడుతుంది. అంతా సమయమే నిర్ణయిస్తుంది. సబ్ సమయ్ కా ఖేల్ హై. పీస్, లవ్ అండ్ కర్మ’ అని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఎవరి పేరు నేరుగా చెప్పకపోయినా, ఈ పోస్ట్ హన్సిక విడాకులను ఉద్దేశించేనని నెటిజన్లు అంటున్నారు.వాస్తవానికి హన్సికకు, ముస్కాన్‌కు మధ్య గతంలోనే విభేదాలు ఉన్నాయి. హన్సిక వల్లే తన సంసార జీవితం నాశనం అయిందని ముస్కాన్ ఆరోపించింది. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీతో ముస్కాన్ పెళ్లి జరిగింది. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని అత్త, ఆడపడుచు హన్సిక వేధించారని ముస్కాన్ అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.వీరిద్దరి జోక్యం వల్లే తన కాపురం కూలిపోయిందని, మానసిక ఒత్తిడి కారణంగా తనకు 'బెల్స్ పాల్సీ' కూడా వచ్చిందని ఆమె గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులోనే ఉంది.ఈ కేసును కొట్టివేయాలని హన్సిక వేసిన పిటిషన్‌ను గత సెప్టెంబర్‌లో బాంబే హైకోర్టు తిరస్కరించడం గమనార్హం.ముస్కాన్ నాన్సీ విషయానికొస్తే.. ఈమె ఒక బుల్లితెర నటి. తొడి ఖుషి తొడె ఘమ్ సీరియల్లో సహాయక నటిగా యాక్ట్ చేసింది. ఈ ధారావాహికతో విశేష గుర్తింపు తెచ్చుకున్న నాన్సీకి మాతా కీ చౌకి సీరియల్ ఆఫర్ వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. అదాలత్, ఫియర్ ఫైల్స్, క్రైమ్ పెట్రోల్ షోలలో పాల్గొంది. భారత్ కా వీర్ పుత్ర: మహారాణ ప్రతాప్, ఏజెంట్ రాఘవ్- క్రైమ్ బ్రాంచ్ షోలలో నటించింది. 2020లో హన్సిక సోదరుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొద్ది రోజులకే విబేధాలు రావడంతో విడి విడిగా ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటోంది. -
ఆశను కోల్పోవద్దు.. విడాకుల తర్వాత హన్సిక
సౌత్ ఇండియా ప్రముఖ నటి హన్సిక మోత్వాని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2022లో సోహైల్‌ను పెళ్లి చేసుకున్న ఆమె సుమారు నాలుగేళ్ల తర్వాత విడిపోయారు. అయితే, విడాకుల తర్వాత తొలిసారి సోషల్‌మీడియాలో ఆమె ఒక పోస్ట్ చేసింది. 'చర్ది కలా' ఆల్వేస్ అని పంజాబీ భాషలో కొటేషన్ షేర్ చేసింది. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికటీ ధైర్యంగా ముందుకు సాగాలని అర్థం వచ్చేలా తెలిపింది. ఎలాంటి పరిస్థితిలు వచ్చినా సరే ఆశను కోల్పోవద్దని పేర్కొంది.ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను రాజస్థాన్‌లో హన్సిక పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్‌గా జరిగింది. సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయితే, వివాహం అయిన ఆరు నెలల నుంచే వారిద్దరి మధ్య వబేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో గతేడాది ఆమె వారి పెళ్లి ఫోటోలను ఇన్‌స్టా నుంచి తొలగించడంతో విడాకుల నిజమేనని నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఫైనల్‌గా ఈ ఏడాది మార్చి 11న వారికి విడాకులు కోర్డు మంజూరు చేసింది. -
శిఖరాగ్రాన విడాకులు...
‘ఆల్పైన్ డివోర్స్’... ప్రస్తుతం ఈ పదం ట్రెండ్ అవుతోంది. భార్యాభర్తలు విడిపోయే ఒక విచిత్ర పద్ధతి ఇది. నేటి యువత పెళ్లిలోగాని, ప్రేమలో గాని బ్రేకప్‌కు ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. తమ బ్రేకప్‌లో ప్రకృతిని భాగం చేస్తున్నారు. దూరంగా ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ తమ భాగస్వామికి విడాకులు ఇస్తున్నారు.ఆల్పైన్ డివోర్స్... ఎలా పుట్టింది? జీవిత భాగస్వామితో కలిసి దూరంగా అడవికో, పర్వతాల వైపుకో వెళ్తారు. అక్కడ ఆనందంగా గడుపుతున్న సమయంలో ’నీతో ఇక నేను కలిసి ఉండలేను’ అని చెప్పి వచ్చేస్తారు. ఇదే ‘ఆల్పైన్ డివోర్స్’. భాగస్వామిని దూరంగా తీసుకెళ్లి, అక్కడ వదిలేసి రావడం ఇందులో కీలకమైన విషయం. రాబర్ట్ బార్ రాసిన ‘యాన్ ఆల్ఫైన్ డివోర్స్’ కథతో ఈ పదం ట్రెండ్ అయ్యింది. ఓ భర్త తన భార్యను పర్వతం అంచుల్లోకి తీసుకెళ్లి, అక్కడినుంచి తోసేసి చంపాలనుకోవడం ఇందులో కథాంశం. టిక్‌టాక్ ద్వారా ఈ పదంపాపులర్ అయ్యింది.కారణాలేంటి?ఆల్పైన్ డివోర్స్‌కు కారణాలేంటి? అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనేది మానసిక విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. తమ భాగస్వామి తమను మోసం చేస్తున్నారన్న అనుమానం ఉన్నవారు, ఎలాగైనా తనను వదిలేసుకోవాలని భావించేవారు ఇటువంటి డివోర్స్కుపాల్పడుతున్నారని, కొందరి మానసిక ఆందోళన కూడా కారణమని అంటున్నారు. దంపతుల మధ్య అన్యోన్యత దూరమవడం ఈ ఆల్పైన్ డివోర్స్ను ప్రోత్సహిస్తోందని నిపుణులు అంటున్నారు. ఒకరి అవసరాలు మరొకరు గుర్తించకపోవడం, ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గిపోవడం, నమ్మకం లేకపోవడం వంటివి పెరిగినప్పుడు, ఆ బంధం హింసకు దారితీయకుండా ఆల్పైన్ డివర్స్ను ఆశ్రయిస్తున్నారు. కొట్టుకుంటూ, తిట్టుకుంటూ బంధంలో ఉండిపోకుండా దూరమవుతున్నారు.దూరం కావాలనుకుంటే ఇలాగా? భార్యాభర్తలు విడిపోవాలనుకోవడం సహజమే, కానీ దీనికోసం ఇలాంటి విధానం వాడుకోవడం మంచిదేనా అని చర్చ జరుగుతోంది. దూరంగా తీసుకెళ్లి అక్కడ వదిలేయడం వల్ల మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతుందని, భద్రత అంశాలపై ఆందోళన తప్పదని అంటున్నారు. ఇలా ప్రవర్తిస్తున్నవారి మానసిక ఆరోగ్యానికీ చికిత్స అవసరం అంటున్నారు. విడాకులను చట్టబద్ధంగా ΄÷ందడమే మేలని, ఇలా అసంబద్ధంగా ΄÷ందడం సరికాదని వివరిస్తున్నారు. -
క్రికెటర్ అమిత్ మిశ్రాపై గృహహింస కేసు
భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రాపై గృహహింస కేసు నమోదైంది. ఈ అమిత్ మిశ్రా అందరికీ తెలిసిన టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కాదు. ఇతను ఉత్తరప్రదేశ్‌కు చెందిన 34 ఏళ్ల పేసర్ అమిత్ మిశ్రా. ఈ అమిత్ మిశ్రా భారత్ తరఫున ఎప్పుడూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఐపీఎల్లో మాత్రం ఆడాడు.2013-14 రంజీ సీజన్లో ఉత్తర్‌ప్రదేశ్ తరఫున రెండో మ్యాచ్‌లోనే 7 వికెట్లు తీసి గుర్తింపు పొందిన ఈ అమిత్ మిశ్రాను 2014 ఐపీఎల్ ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఆతర్వాత గుజరాత్ లయన్స్‌లో చేరినా, కెరీర్ పెద్దగా ముందుకు సాగలేదు. 2018లో ఆంధ్రపై చివరి మ్యాచ్ ఆడిన తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మిశ్రా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం పొందాడు. ఈ అమిత్ మిశ్రాపై అతని భార్య గరిమా తివారి గృహహింస ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీవ్ర గృహహింస, వేధింపులు, దౌర్జన్యం అలాగే ఆత్మహత్యకు ప్రేరేపించే పరిస్థితులు సృష్టించాడని ఫిర్యాదులో పేర్కొంది. మోడల్ అయిన గరిమాకు 2019లో ఇన్స్టాగ్రామ్ ద్వారా అమిత్ మిశ్రాతో పరిచయం ఏర్పడింది. 2021లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. గరిమా ఆరోపణల ప్రకారం.. పెళ్లి తర్వాత అమిత్ మిశ్రా, అత్తమామలు నిరంతరం వేధింపులకు గురి చేశారు. రూ.10 లక్షలు, హోండా సిటీ కారు రూపంలో కట్నం కోరారని, ఆమె కుటుంబం రూ.2.5 లక్షలు ఇచ్చినా, మరింత డబ్బు కోసం వేధింపులు కొనసాగించారని తెలిపారు. మిశ్రా తరచూ మద్యం తాగి వచ్చి దుర్భాషలాడేవాడని, తిండి కూడా పెట్టకుండా వేధించేవాడని పేర్కొన్నారు. తాను మోడలింగ్ చేసిన సంపాదించిన డబ్బును కూడా బలవంతంగా లాక్కునేవాడని, అతని కారణంగా మోడలింగ్ కెరీర్‌ను కూడా వదిలేయాల్సి వచ్చిందని ఆరోపించారు. ఈ వేధింపుల కారణంగా ఫినైల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించానని ఆవేదన చెందారు. కాగా, గరిమా అమిత్ మిశ్రాపై ఇప్పటికే పలు కేసులు వేసింది. ఏప్రిల్ 21, 2025న గృహహింస కేసు, ఏప్రిల్ 23న నెలకు రూ.50,000 భరణం, రూ.1 కోటి పరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా, మిశ్రా ప్రభావం వల్ల కేసులు ముందుకు సాగలేదని ఆరోపించారు. ప్రస్తుతం వేసిన కేసు విచారణ దశలో ఉంది. -
విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్
తమిళ స్టార్ హీరో విజయ్ గురించి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇతడి భార్య సంగీత.. కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేయడం, త్రిషతో విజయ్‌కి రిలేషనే ఉందనే రూమర్స్ ఓ వైపు చక్కర్లు కొడుతుండగానే ఓ పెళ్లికి ఆమెతోనే కలిసి రావడం లాంటివి హాట్ టాపిక్ అయిపోయాయి. అలానే విడాకులు మంజూరు అయ్యేంతవరకు తనని ఇంట్లోనే ఉండనివ్వాలని చెప్పి సంగీత మరో పిటిషన్ వేయడం, భరణంగా రూ.250 కోట్లు ఇవ్వనున్నాడనే కామెంట్స్ చర్చనీయాంశమైపోతున్నాయి. ఇలాంటి టైంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్.. తన విడాకులపై తొలిసారి స్పందించాడు.(ఇదీ చదవండి: బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయ్.. తన టీవీకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ఇవ్వబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. వీటితో పాటు తన విడాకుల వ్యవహారం గురించి కూడా పరోక్షంగా విజయ్ మాట్లాడారు.'నా జీవితంలో జరుగుతున్న పలు సంఘటనల గురించి మీరు కంగారు పడకండి. వాటి గురించి ఆలోచించి మీరు సమయాన్ని వృథా చేసుకోవద్దు. వాటిని నేను పరిష్కరించుకుంటాను. నా సమస్యల గురించి ఆలోచిస్తూ మీరు ఒత్తిడికి లోనవడం నన్ను మరింతగా బాధపెడుతోంది' అని విజయ్.. తన విడాకుల గురించి ఇన్ డైరెక్ట్‌గా మాట్లాడారు. ఇప్పుడీ వ్యాఖ్యలు, వీడియో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!)Recently, there have been a few problems happening. I see that you are getting hurt while fighting for it. I’m getting hurt seeing you guys getting hurt. I’ll take care of the problems. Don’t get hurt. Nothing to worry about..- #ThalapathyVijay's speech pic.twitter.com/8QFSWVjklU— Laxmi Kanth (@iammoviebuff007) March 7, 2026 -
విడాకుల వ్యవహారం.. భార్య సంగీతకి రూ.250 కోట్లు ఆఫర్ చేసిన విజయ్!
-
పెళ్లి వేడుకలో విజయ్, త్రిష.. వీడియో వైరల్
కోలీవుడ్ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్, త్రిష కలిసి ఒక పెళ్లి వేడుకకు తాజాగా హాజరయ్యారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో వారిద్దరూ సరదాగ పలకరించుకున్నారు. వీరిద్దరి గురించి కొద్దిరోజుల క్రితం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ముందుగా త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలని, తన కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలని ఆయన విమర్శించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కొద్దిరోజల గ్యాప్‌లోనే విజయ్ సతీమణి సంగీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. విజయ్ మరో మహిళతో సాన్నిహిత్యంగా ఉన్నారని అందుకే విడాకులు కావాలంటూ పేర్కొంది. అయితే, ఈ కథలో త్రిష పేరు ప్రధానంగా వైరల్ అయింది. ఇప్పుడు విజయ్, త్రిష కలిసి చెన్నైలో జరిగిన ఒక పెళ్లికి వెళ్లడంతో వీడియో వైరల్ అవుతుంది.#Thalapathy @TVKVijayHQ President #Vijay and #Trisha attend #KalpathiSSuresh - #MeenakshiSuresh 's son wedding reception @actorvijay @trishtrashers pic.twitter.com/iQOQet9Z0A— Nikil Murukan (@onlynikil) March 5, 2026 -
రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్
చెన్నై: తమిళ స్టార్ హీరో ,టీవీకే అధినేత విజయ్ దళపతి భార్య సంగీత సోర్నలింగంతో సెటిల్మెంట్కు రెడీ అవుతున్నారా? 27 ఏళ్ల వివాహ జీవితం తర్వాత తన భర్త నుండి విడాకులకు దరఖాస్తు చేసుకున్నారన్న వార్త అటు సినీ అభిమానుల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీసింది. ముఖ్యంగా తన భర్త విజయ్‌కు నటితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగా విడాకులు కోరుతున్నట్టు పేర్కొనడం మరింత దిగ్బ్రాంతి రేపింది.తాజాగా విజయ్ దళపతి కేసును పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.రూ. 250 కోట్ల భరణం ఆఫర్తాజా నివేదిక ప్రకారం, విజయ్ దళపతి ఈ విషయాన్ని కోర్టులో పరిష్కరించుకోవాలని ఆలోచిస్తున్నారు. తమిళనాట తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకుంటున్న విజయ్ తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం రాకుండా ఈ వివాదానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని భావిస్తున్నాడట. ఈ నేపథ్యంలో సంగీతతో విడాకుల వివాదాన్ని కోర్టు బయటే చక్కదిద్దుకునే పనిలో విజయ్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సామరస్య పరిష్కారం కోసం భార్యతో దీని గురించి పలు చర్చలు మొదలు పెట్టారట. తన భార్యకు రూ. 250 కోట్ల భరణం ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. సంగీత, ఇద్దరు పిల్లలు జాసన్ సంజయ్, దివ్య సాషాలకు ఈ సెటిల్మెంట్ మొత్తం చెల్లించాల్సి ఉంది. విజయ్ తన కుటుంబ గౌరవాన్ని కాపాడే నిమిత్తం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని కోరుకుంటున్నాడట. ఇరు పక్షాలు పరస్పర ఒప్పందం కుదుర్చుకుంటే విడాకుల పిటిషన్ ఉపసంహరించు కోనుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్‌కు విడాకుల నోటీసులువిజయ్-సంగీత వైవాహిక జీవితంవిజయ్ సంగీతను మొదటిసారి 1996లో కలిశాడు. ఆమె శ్రీలంక హిందూ, బ్రిటన్‌లో పెరిగింది. అప్పటికే స్టార్‌హీరోగా పేరుతెచ్చుకున్న విజయ్‌కి సంగీత పెద్ద అభిమాని. ఆమె UKలోని తన ఇంటిని వదిలి చెన్నైలో తన అభిమానిని కలవడానికి వచ్చేసింది. అది ప్రేమకు దారి తీసింది. చివరకు ప్రత్యేక వివాహ చట్టం కింద వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. గత 27 ఏళ్లుగా అన్యోన్య కాపురం తరువాత సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. సంగీత విడాకుల పిటిషన్ కాపీ ప్రకారం, విజయ్ దళపతి వివాహేతర సంబంధం ఉన్న నటితో విదేశాల్లో చక్కర్లు కొట్టాడనీ, అలాగే ఆ నటి తన సోషల్ మీడియా హ్యాండిల్లో తమ విహారయాత్ర చిత్రాలను షేర్ చేస్తూనే ఉందని ఆమె పిటిషన్లో పేర్కొంది. ఇది తనకు తన పిల్లలకు తీవ్ర బాధ కలిగించిందని కూడా ఆమె పేర్కొంది. అంతేకాదు ఈ వివాదం తరువాత విజయ్ కుమారుడు సోషల్‌మీడియాలో ఆయనను అన్‌ఫాలో చేయడం కూడా వార్తల్లో నిలిచింది.ఇదీ చదవండి: మూడు రోజులు ఫ్రీ ఫుడ్ : పోటెత్తిన జనం -
కుటుంబంలో సంక్షోభం.. కుర్రాళ్లకు సందేశం
చెన్నై: విడాకుల వార్తల నడుమ టీవీకే అధినేత విజయ్ విజయ్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టు చర్చనీయాంశంగా మారింది. తన పాతికేళ్ల ఏళ్ల వైవాహిక బంధం కోర్టు మెట్లెక్కిన వేళ.. విజయ్ తన వ్యక్తిగత వేదన కంటే రేపటి పౌరుల భవిష్యత్తుకే ప్రాధాన్యతనిచ్చారు. 12వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన పంచుకున్న ఒక సందేశం ఇప్పుడు వైరల్‌గా మారింది.‘తమిళనాడు, పుదుచ్చేరిలో 12వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న నా ప్రియమైన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు శుభాకాంక్షలు. రేపటి సంపన్నమైన సమాజాన్ని నిర్మించబోతున్న మీరందరూ, ఈ పరీక్షను ఎటువంటి ఆందోళన లేకుండా, భయం లేకుండా, ధైర్యంతో ఎదుర్కోండి. ఉన్నత విద్యలో మీరు రాణించాలని ముందుస్తు (అడ్వాన్స్) శుభాకాంక్షలు.. మంచే జరుగుతుంది!.. విజయం నిశ్చయం!’ అని దానిలో విజయ్ పేర్కొన్నారు. 1996లో విజయ్‌కు ఒక అభిమానిగా పరిచయమై, 1999లో అర్ధాంగిగా మారిన సంగీతతో విజయ్ వైవాహిక ప్రయాణం ఆదర్శప్రాయంగా సాగింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ జంట మధ్య 2021 నుండి విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ నటితో సంబంధమే ఈ విడాకులకు కారణమని సంగీత తన పిటిషన్లో పేర్కొన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. தமிழ்நாடு மற்றும் புதுச்சேரியில் 12ஆம் வகுப்புப் பொதுத் தேர்வு எழுதும் என் அன்புத் தம்பிகளுக்கும் தங்கைகளுக்கும் வாழ்த்துகள்.நாளைய வளமான சமுதாயத்தை உருவாக்க உள்ள நீங்கள் அனைவரும் இந்தத் தேர்வினைப் பதற்றமின்றி, அச்சமின்றி, துணிவுடன் எதிர்கொள்ளுங்கள். உயர்கல்வியில் சிறந்து…— TVK Vijay (@TVKVijayHQ) March 2, 2026సినిమాలకు గుడ్ బై చెప్పి ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) ద్వారా ప్రజా సేవకు అంకితమైన తరుణంలో పలు వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి. రాజకీయంగా పార్టీని బలోపేతం చేస్తూ, సభ్యత్వ నమోదులో బిజీగా ఉన్న విజయ్.. ప్రస్తుత పరీక్షల వేళ విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోస్తున్నారు. ‘భయం వద్దు.. విజయం మీదే’ అంటూ ఆయన ఇచ్చిన పిలుపు వెనుక, తన వ్యక్తిగత వైఫల్యాల నీడలు పడకుండా చూసుకోవడం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనం.ఈ సంక్షోభం విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు, మరోవైపు ప్రత్యర్థుల విమర్శలు వచ్చే అవకాశం ఉన్నా.. విజయ్ మాత్రం ప్రజాక్షేత్రంలోనే తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు. తన చుట్టూ జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోకుండా, విద్యార్థుల పరీక్షల పై దృష్టి సారించడం ద్వారా తన ప్రాధాన్యతలు ఏంటో విజయ్ స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ‘ఆస్పత్రి మాఫియా’ ఇక లగెత్తాల్సిందే! -
‘జీతం తక్కువ… భరణం ఎక్కువ!’.. ‘సుప్రీం’లో భర్త వాదనలు హాట్ టాపిక్!
ఢిల్లీ: యువర్ హానర్. నేను కార్మికుడిని. నా జీతం నెలకు రూ.9వేలు. అలాంటిది భరణం కింద నా భార్యకు నెలకు రూ.12వేలు ఎలా ఇవ్వాలి. మీరే నాకు న్యాయం చేయాలి అంటూ ఓ భర్త సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపించారు. అయితే, భర్త వాదనలపై ‘సుప్రీం’ ద్విసభ్య ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒకేసులో భార్య, భర్తకు కింది కోర్టు విడాకులు మంజూరు చేసింది. అదే సమయంలో భరణం కింద భర్త.. భార్యకు రూ.6 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన తీర్పుపై భార్య అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.నా భర్త నుంచి విడాకులు కోరుకుంటున్నాను. కానీ నాకు ఇచ్చే భరణం సరిపోదు. పోషణ నిమిత్తం జీవితాంతం నెలకు రూ.12,000 భరణంతో పాటు ప్రతి సంవత్సరం ఐదు శాతం, ఆరు శాతం పెంచాలి. లేదంటే ఒకేసారి రూ.30 లక్షలు చెల్లించాలి’ అని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది.ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం భర్త వాదనలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైనా ఇంత తక్కువ వేతనం పొందడం నమ్మశక్యం కాదని వ్యాఖ్యానించింది. కనీస వేతనానికి తగ్గకుండా చెల్లించే పరిస్థితి ఉండగా.. ఒక సంస్థ ఇంత తక్కువ వేతనం ఇస్తుందా అని ప్రశ్నించింది. భర్త తరఫు న్యాయవాది జార్జ్ పోథన్,తన క్లయింట్ నిజాయితీగా ఆదాయాన్ని వెల్లడిస్తున్నాడని, దానికి సంబంధించిన అఫిడవిట్ కూడా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడని వాదించారు. బెంచ్ ఆ వాదనను ఖండించింది. భర్తకు భరణం చెల్లించే స్థోమత లేకపోతే భార్యను తనతో ఉంచుకుని, ఆమెకు వంట చేసి కుటుంబాన్ని చూసుకోవాలని హితువు పలికింది. అందుకు స్పందించిన భర్త.. భార్య తన తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసిందని వాపోయారు. భర్త వ్యాఖ్యలపై జస్టిస్ మెహతా కఠినంగా స్పందించారు. భార్యకు పోషణ ఖర్చు ఇవ్వడం భర్త బాధ్యత. అవసరమైతే అప్పు చేయాలి. సహాయం తీసుకుని బాధ్యతను నెరవేర్చాలని స్పష్టం చేశారు. తన సంస్థ తనకు అంతే జీతం ఇస్తుందని భర్త చెప్పిన అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసననం పరిశీలిస్తుంది. ఉద్యోగులకు చెల్లించే జీతాలపై తమకు స్పష్టత ఇవ్వాలని సదరు సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది. -
నచ్చినవాడితో జీవితం పంచుకుంటా.. త్రిష ఓల్డ్ కామెంట్స్ వైరల్
కోలీవుడ్ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్- సంగీత విడాకులు వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి హీరోయిన్ త్రిష పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఓ నటితో విజయ్‌కు వివాహేతర సంబంధం ఉందని, అందుకే విడాకులు ఇప్పించాలంటూ సంగీత కోర్టుని ఆశ్రయించింది. దీంతో సంగీత ఆరోపిస్తున్న నటి త్రిషనే అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ సందర్భంగా త్రిష, విజయ్ కలిసి కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లిన ఫోటోలు, తిరుప్పాచ్చి, గిల్లి వంటి సినిమాల ప్రమోషన్ సమయంలో చేసిన వ్యాఖ్యలను మళ్లీ వైరల్ చేస్తున్నారు. దీంతో పాటు పెళ్లి గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో త్రిష చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది.వీడియోలో ఏముంది?త్రిష గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఇలా మాట్లాడింది. ‘మీ పెళ్లి ఎప్పుడని చాలా మంది అడుగుతుంటారు. ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేను. ఎందుకంటే.. సరైన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను. నాకు నచ్చిన వ్యక్తి దొరకకపోతే పెళ్లి జరగకపోయినా నాకు అభ్యంతరం లేదు. పెళ్లి అనేది కేవలం సమాజం కోసం చేసే నిర్ణయం కాదు. జీవితాంతం కలిసి ఉండగలిగే వ్యక్తిని నమ్మకం కలిగినప్పుడు మాత్రమే ఆ నిర్ణయం తీసుకోవాలి. నేను పెళ్లి చేసుకుంటే మళ్లీ విడాకుల కోసం వెళ్లాలనుకోవడం లేదు. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకోను. నా స్నేహితుల్లో చాలామంది ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని, అఇష్టంగా జీవితాలను కొనసాగిస్తున్నారు. కానీ, నేను అలాంటిది జీవితాన్ని కోరుకోవడం లేదు. సరైన వ్యక్తి కోసం వేచి ఉంటాను. అలాగే.. ఇష్టంలేని వ్యక్తితో కలిసి బతకడం కంటే ఒంటరిగా ఉండటమే మంచిది. నేను ప్రేమలో పడాలని అనుకోవడం లేదు. కానీ, నాకు జీవిత భాగస్వామి కావాలి. నచ్చిన వాడితో నా జీవితాన్ని పంచుకోవాలి. అలాంటి వ్యక్తి కావాలి’ అని త్రిష అన్నారు. "I know a lot of persons, my friends who are in an unhappy marriage. I don't want that. I would rather wait and do it with the right person" pic.twitter.com/HWitHecwGw— Trollywood 𝕏 (@TrollywoodX) February 28, 2026 -
విజయ్‌కు మరో ఎదురుదెబ్బ, జ్యోతిష్కుడి సంచలన అంచనాలు
టీవీకే పార్టీ అధ్యక్షుడు, అగ్రహీరో దళపతి విజయ్‌కు మరో బ్యాడ్ న్యూస్ తప్పదా. భార్య సంగీతసోర్నలింగంతో విడాకుల వార్తల మధ్య, మరో ఎదురు దెబ్బ తగలనుందా? తమిళనాట సీఎం కావాలని కలలు కంటున్న విజయ్ రాజకీయ భవిష్యత్తుపై జ్యోతిష్కుడి సంచలన అంచనాలు వైరల్‌గా మారాయి. ఏమిటా అంచనాలు? ఈ కథనంలో తెలుసుకుందాం. తమిళనాడు ప్రస్తుతం కీలకమైన ఎన్నికల సీజన్ కు సిద్ధమవుతున్న వేళ, అందులోనూ విజయ్ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న సమయంలో విజయ్ చుట్టూ ఉన్న వివాదాల తుఫాను విజయ్ ఇమేజ్‌కు కళంకంగా మారింది.ఇదీ చదవండి : ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్‌కు విడాకుల నోటీసులు27 నంబరు గండంనటన నుంచి రాజకీయ అరంగేట్రం చేసింది మొదలు వరుస కష్టాలు తప్పడం లేదు. మరీ ఆయన జీవితంలో27 నంబరు కలిసి రావడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగాతమిళనాడులోని కరూర్ జిల్లాలో విజయ్ పార్టీ (TVK) సభ సందర్బంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన గత ఏడాది సెప్టెంబర్ 27న జరిగింది.భార్య సంగీత తమిళనాడు చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకుల పిటిషన్‌ను దాఖలు చేసిన ఫిబ్రవరి 27న వెలుగులోకి వచ్చింది. దీంతో 27 ఏళ్ల వైవాహిక బందం సంక్షోభంలో పడింది.ఇటీవలి చిత్రం జన నాయగన్ ఆలస్యం , కోర్టు పోరాటం తర్వాత, విజయ్ భార్య విడాకుల కోసం దాఖలు చేయడంతో, విజయ్ కష్టాలు అంతులేనివిగా కనిపిస్తున్నాయి. ఇది చాలదన్నట్టు దళపతి విజయ్ భవిష్యత్తుపై జ్యోతిష్కుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ సూపర్ స్టార్ కు మరో ఎదురుదెబ్బ తగులుతుందని అంచనా వేశారు. ఇదీ చదవండి: ప్రియుడి మోసం: ఇదే అదునుగా అగంతకుడి దారుణ హత్యాచారం జ్యోతిష్కుడు ప్రశాంత్ కిని విజయ్ రాజకీయ గమనం గురించి చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. “2030 తర్వాత దళపతి విజయ్ రాజకీయాల్లో గొప్ప విజయం సాధిస్తాడు. కానీ ఈసారి మాత్రం తమిళ రాజకీయాల్లో ఆయన ఉనికి చాటుకుంటాడు అంతే….!! ఆయన ఖచ్చితంగా తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారు, కానీ ఈసారి కాదు….!! (sic).”మరొక పోస్ట్‌లో, “దళపతి విజయ్ ఈసారి తమిళనాడు ముఖ్యమంత్రి కాలేరు….!! అని పేర్కొన్నాడు. ఎం. జి.రామచంద్రన్, జయలలిత మాదిరిగానే చరిత్ర పునరావృతం కావచ్చని వ్యాఖ్యానించడం వైరల్‌గా మారింది. -
విజయ్‌తో విడాకులు.. సంగీత ఎవరో తెలుసా..?
నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ దంపతులు విడిపోయేందుకు సిద్ధమయ్యారు. ఆయన నుంచి విడాకులు కోరుతూ తన సతీమణి సంగీత కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈమేరకు తమిళనాడులోని చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో ఆమె పిటిషన్ వేశారు. 2021లో ఓ నటితో విజయ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తనకు తెలిసిందని ఆమె పేర్కొన్నారు. అందుకే తనతో విడాకులు కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. సంగీత దాఖలు చేసిన పిటిషన్ ఏప్రిల్ 20న విచారణకు రానుంది.సంగీత ఎవరు..?సంగీత శ్రీలంక తమిళ మూలానికి చెందినది. యునైటెడ్ కింగ్డమ్లో పుట్టి పెరిగిన ఆమె 1999లో విజయ్‌తో వివాహం చేసుకుంది. పెళ్లికి ముందు ఆమె శ్రీలంక సంతతికి చెందిన బ్రిటిష్ పౌరురాలిగా గుర్తింపు పొందింది. శ్రీలంకకు చెందిన ఒక తమిళ పారిశ్రామికవేత్త కుమార్తెగా ఆమె లండన్‌లో స్థిరపడింది. కొన్ని మీడియా నివేదికలు ఆమెను గృహిణిగా ఉన్నారని చెబుతున్నప్పటికీ.. మరికొన్ని ఆమెకు వ్యాపార రంగంలో రాణిస్తున్నారని కథనాలు ఉన్నాయి.1996లో విజయ్ నటించిన 'పూవే ఉనక్కగా' చిత్రం సంచలన విజయం సాధించింది. తెలుగులో శుభాకాంక్షలు పేరుతో రిలీజ్ అయింది. విజయ్ సినిమాలు చూసి అతడికి వీరాభిమానిగా మారిపోయిన సంగీత ఆయనను చూడటానికే 1996లో లండన్ నుంచి చెన్నై వచ్చింది. విశ్వప్రయత్నాలు చేసి విజయ్ను కలిసింది. ‘నన్ను చూడటానికి లండన్ నుంచి వచ్చారా’ అని విజయ్ ఆశ్చర్యపోయాడు. అంత దూరం నుంచి వచ్చినందుకు సంగీతను ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. విజయ్ పేరెంట్స్‌కు ఆమె బాగా నచ్చేసింది. అప్పుడప్పుడూ సంగీత తన పేరెంట్స్‌తో ఈ హీరో ఇంటికి వచ్చేది. విజయ్ పేరెంట్స్ ఆమెను పెళ్లిచేసుకోమన్నారు. ఆపై వారు చొరవ తీసుకుని సంగీతను తమ కొడుకును వివాహం చేసుకుంటారా అని అడిగారు. అలా వారిద్దరూ 1999లో హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. ఈ జంట 2000 సంవత్సరంలో తమ మొదటి బిడ్డకు, 2005లో రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత, వారి పిల్లలు విజయ్‌తో పాటు వెట్టైకారన్, తేరి వంటి చిత్రాల్లో కూడా కొద్దిసేపు తెరపై కనిపించారు. సుమారు 27ఏళ్ల తర్వాత ఈ జంట ఇప్పుడు విడాకులు తీసుకోనున్నడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. -
భార్య ఉండగా మరో పెళ్లి చేసుకున్న అనిల్..!
జగిత్యాలక్రైం: భార్య, మూడేళ్ల కూతురు ఉండగా విడాకులు తీసుకోకుండానే మరో యువతిని ప్రేమ పేరుతో వివాహం చేసుకున్న వ్యక్తిపై ఆమె కుటుంబ సభ్యులు దాడిచేసిన ఘటన శుక్రవారం రాత్రి జగిత్యాల పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో సఖీ కేంద్రం వద్ద జరిగింది. వివరాలు.. మల్యాల మండలం లంబాడిపలి్లకి చెందిన అనిల్, ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోగా, వీరికి మూడేళ్ల కూతురు ఉంది. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుండగా, అనిల్ కరీంనగర్ మండలానికి చెందిన యువతిని ప్రేమపేరుతో వంచించి ఈనెల 21న పెళ్లి చేసుకున్నాడు. విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలియడంతో మల్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అనిల్‌ను, పెళ్లి చేసుకున్న యువతిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కాగా, అనిల్‌కు భార్య, కూతురు ఉందని తెలియడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని పోలీసులు జగిత్యాల సఖీ కేంద్రానికి తరలించారు. శుక్రవారం సాయంత్రం సఖీ కేంద్రానికి యువతి కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకోగా కేంద్రం నిర్వాహకులు ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా అనిల్ వెళ్లి గొడవకు పాల్పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు అనిల్‌పై దాడి చేశారు. పట్టణ సీఐ కరుణాకర్, ఎస్సై సదాకర్, కుమారస్వామి ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన అనిల్‌ను జగిత్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. అనిల్ తల్లి దేవమ్మ ఫిర్యాదు మేరకు ఆరుగురితో పాటు, మరికొంత మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పట్టణసీఐ తెలిపారు. కాగా, కులాంతర వివాహం చేసుకోవడం వల్లే దాడి జరిగిందని వదంతులు రావడంతో పోలీసులు అప్రమత్తమై లోతైన విచారణ చేపట్టగా అసలు విషయాలు వెలుగుచూశాయి. అనిల్‌కు భార్య, కూతురు ఉండగా ప్రేమ వివాహం చేసుకోవడం చట్టరీత్య నేరం కావడంతో యువతికి సఖీ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. -
విజయు ఎఫైర్ ఉంది.. విడాకులు కోరిన దళపతి భార్య
-
ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్‌కు విడాకుల నోటీసులు
చెన్నై: తమిళ నటుడు, టీవీకే చీఫ్‌కు విజయ్‌కు భారీ షాక్ తగిలింది. పాతికేళ్లకు పైగా వివాహం బంధం తర్వాత ఆయన భార్య సంగీత సోర్నలింగం విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఒక నటితో విజయ్ వివాహేతర సంబంధమే విడాకులకు కారణమంటూ పిటిషన్లో పేర్కొనడం సంచలనం రేపుతోంది.సంగీత దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధంలో ఉన్నాడని సంగీత ఆరోపించింది. 2021లో ప్రతివాదికి నటితో అక్రమ సంబంధం ఉందని ఆమె పేర్కొంది. అయితే సంబంధాన్ని ముగించాలని హామీ ఇచ్చిన తర్వాత కూడా విజయ్‌లో మార్పులేదని పాత ధోరణే కొన సాగుతోందనేది సంగీత ప్రధాన అరోపణ. అదే భర్తనుంచి చట్టబద్ధంగా విడిపోవాలనే తన నిర్ణయానికి పునాది వేసింది. ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 27(1)(a) మరియు 27(1)(d) కింద సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. జీవిత భాగస్వామి వివాహేతర సంబంధంలో ఉన్నట్టు లేదా అవతలి వ్యక్తి పట్ల క్రూరంగా ప్రవర్తించినట్లు తేలితే, ప్రత్యేక వివాహ చట్టం, 1954 విడాకులకు అనుమతిస్తుంది. సంగీత పిటిషన్ ఈ రెండు చట్టపరమైన కారణాలను విచారిస్తోంది. ఈ విషయం ప్రస్తుతం జిల్లా కోర్టు ముందు ఉంది. కాగా విజయ్,సంగీత తమ విభేదాలను బహిరంగంగా అంగీకరించనప్పటికీ గత రెండేళ్లుగా విజయ్ నుండి విడిగా నివసిస్తున్న సంగీత ఫిబ్రవరి 24న చెంగల్పట్టు మహిళా కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. కోర్టు ఆమె విజ్ఞప్తిని అంగీకరించి కేసును కుటుంబ సంక్షేమ కమిటీకి బదిలీ చేసింది.వారి సుదీర్ఘ మౌనం అభిమానులు, మీడియాలో నిరంతర ఊహాగానాలకు ఆజ్యం పోసింది. 1999 ఆగస్టులో ప్రేమవివాహం చేసుకున్న ఈ జంటకు జాసన్ సంజయ్ (25) , దివ్య షాషా (20) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమా నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా ఎంట్రీ ఇచ్చి ఇటీవల తమిళగ వెట్రి కజగం(TVK) పార్టీని ప్రారంభించిన విజయ్ కెరీర్, ప్రజా జీవితంలో ఈ పరిణామం కీలకమైంది అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు విజయ్ బృందం లేదా సంగీత ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదవండి: పట్టపగలే భార్య ప్రియుడి హత్య, భార్యకు వార్నింగ్,షాకింగ్ వీడియో -
చిమ్మచీకటి.. ఒళ్లంతా గాయాలు
పెద్దపల్లిరూరల్: భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలు విడాకుల దాకా వచ్చాయి. సుమారు పన్నెండేళ్లపాటు సంసారం సాఫీగానే సాగినా.. ఆ తర్వాత తలెత్తిన విభేదాలు దంపతుల మధ్య చిచ్చుపెట్టాయి. ఈ నేపథ్యంలో రెండురోజుల క్రితం కోర్డు విచారణకు వచి్చన మొదటి భార్య పద్మను పెద్దపల్లి బస్టాండ్ నుంచి నమ్మించి తన వెంట తీసుకెళ్లిన భర్త వెంకటేశ్.. కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్‌ఖాన్‌పేట మైసమ్మగుడి ప్రాంతంలో బండరాయితో మోదీ, తీవ్రంగా గాయపర్చి చనిపోయిందనుకుని వెనుదిరిగాడు. ఈ విషయాన్ని పెద్దపల్లి ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు. వివరాలు.. చిమ్మచీకటి.. మరునాడు రోజంతా.. ఈనెల 19న పెద్దపల్లి కోర్డుకు కేసు విచారణకు హాజరైన దంపతులు పద్మ – వెంకటేశ్ విచారణ ముగిసిన తర్వాత వెలుపలకొచ్చారు. పద్మ తన తండ్రి మల్లయ్యతో కలిసి వచ్చింది. తిరుగు ప్రయాణంలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ వెళ్లేందుకు బస్సు ఎక్కించిన మల్లయ్య.. పనినిమిత్తం ఆయన కాల్వశ్రీరాంపూర్ వెళ్లాడు. ఈ విషయాన్ని పసిగట్టిన వెంకటేశ్.. బస్సు వెనకాలే వెళ్లి అక్కడ నుంచి పద్మను మాట్లాడాలంటూ కిందకు దించాడు. ఆ తర్వాత కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్‌ఖాన్‌పేట ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చేందుకు నిశ్చయించుకున్నాడు. కోర్టులో పెట్టిన కేసు వాపస్ తీసుకోవాలని పద్మను బెదిరిస్తూ విచక్షణారహితంగా కొట్టి పెద్దబండ రాయితో మోదాడు. తీవ్రగాయాలతో స్పృహతప్పి పడిపోయిన పద్మ చనిపోయిందనుకుని నిశ్చయించుకున్న వెంకటేశ్.. అక్కడి నుంచి వెనుదిరిగాడు. అప్పటికే రాత్రంతా కటికచీకట్లో నరకయాతన అనుభవించిన పద్మ.. మరుసటి రోజు అవే ముళ్లపొదల్లో నిస్సహాయ స్థితిలో పడిఉంది. మల్లయ్య ఫిర్యాదుతో పోలీసులు విచారించగా.. పద్మపై దాడికి పాల్పడ్డాడని అంగీకరించి ఘటనా స్థలాన్ని చూపడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అచేతనావస్థలో ఉన్న పద్మను శుక్రవారం రాత్రి పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. హత్యాయత్నం కేసు.. అరెస్టు భర్త చేతిలో తీవ్రంగా గాయపడి కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నూనె పద్మను ఆమె భర్త వెంకటేశ్ హతమార్చేందుకు యతి్నంచాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి నిందితుడు వెంకటేశ్‌ను అరెస్టు చేసినట్టు ఎస్సై లక్ష్మణ్‌రావు వివరించారు. -
గాడి తప్పుతున్న యువత
టీటీసీ పూర్తి చేసిన సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి.. పొరుగు మండలంలోని పశు వైద్యశాలలో కాంపౌండర్‌గా పనిచేస్తున్న గోరంట్ల మండలానికి చెందిన యువకుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న ఇరువైపులా కుటుంబ పెద్దలు గత ఏడాది నవంబర్‌లో ఇద్దరికీ పెళ్లి చేశారు. కొద్ది రోజులు కాపురం అన్యోన్యంగా సాగింది.ఈ లోపు వెలువడిన డీఎస్పీ ఫలితాల్లో ఆమె అర్హత సాధించకపోవడంతో భర్త మాట్లాడడం మానేశాడు. చివరకు కనిపించకుండా పోయాడు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ధర్మవరం పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. అక్కడ పోలీసులు స్పందించపోవడంతో ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమంలో ఎస్సీ వద్ద తన గోడు వెల్లబోసుకుంది. ... ఈ పరిస్థితి ఆమె ఒక్కరిదే కాదు... ప్రేమ వివాహం చేసుకున్న 70 శాతం మంది వివిధ కారణాలతో పోలీసులనో.. న్యాయస్థానాన్నో ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఇరువైపులా కుటుంబ పెద్దలకు మనో వేదన మిగులుతోంది. పుట్టపర్తి టౌన్: పాతికేళ్ల క్రితం వరకూ పిల్లలు తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే నడిచేవారు. పెళ్లిళ్లు కూడా ఎక్కువ భాగం తల్లిదండ్రుల నిర్ణయం మేరకే జరిగేవి. పెళ్లి తర్వాత వారిద్దరి మధ్య ఏదైనా సమస్య తలెత్తితే ఇరు కుటుంబాల పెద్దలు కూర్చొని సమస్యకు పరిష్కారం చూపేవారు. పిల్లలకు సర్ది చెప్పి వారి మధ్య మనస్పర్థలు తొలగించి ఒక్కటి చేసేవారు. అయితే ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. సెల్‌ఫోన్ మాయలో పడి ఒకరినొకరు అర్థం చేసుకోలేక విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. సర్దిచెప్పబోయే తల్లిదండ్రులను సైతం ధిక్కరిస్తున్నారు. ప్రతి వందలో 30 వివాదాస్పదమే.. అగ్ని సాక్షిగా జీవితమంతా కలసి ఉంటామని ఒక్కటవుతున్న జంటలు పెళ్లైన ఆరు నెలలు, ఏడాది గడవక ముందే మనస్పర్దలతో రోడ్డున పడుతున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాదనలకు దిగుతున్నారు. ఒకరి నిర్ణయాలు మరొకరు గౌరవించక పోవడం, మొండిగా వ్యవహరిస్తుండడంతో పరిస్థితి విషమించి చివరకు విడాకుల వరకూ వెళుతోంది. ప్రతి వంద జంటల్లో 30 వరకు ఇలాంటి కేసులే ఉంటున్నాయి. ఇటీవల జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదికకు అందుతున్న వినతులే ఇందుకు నిదర్శనం. పెద్దలు నచ్చచెప్పే ప్రయత్నాలకు అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ తదితర సామాజిక మాధ్య మాలకు అలవాటు పడిన జంటలు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు కనీసం ఒక గంట పాటు సమయం కూడా కేటాయించకపోవడమే ఇందుకు కారణమని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. సత్యసాయి జిల్లాలో రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించిన జంటలు 32విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన దంపతుల సంఖ్య 67విడాకుల పిటీషన్లలో ప్రేమ వివాహాలు 70%తల్లిదండ్రులు దృష్టి సారించాలి ఆధునిక సాంకేతికతను సరైన మార్గంలో పిల్లలు వినియోగించుకునేలా తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. ఈ క్రమంలోనే పిల్లల ప్రవర్తననూ గమనిస్తూ ఉండాలి. ఏమి చేస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారనే విషయాలు గమనిస్తూ ఉండాలి. ఒక్కసారి ప్రేమలో పడితే తర్వాత వారు బయటపడడం కష్టం. పెద్దలను ఎదరించి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ మేజర్లు కావడంతో చట్టం కూడా అంగీకరిస్తుంది. ఆ తర్వాత చిన్నపాటి విషయంలోనూ ఏకీభవించకుండా మనస్పర్థలు చోటు చేసుకుని విడిపోయే వరకూ దారి తీస్తుంది. ఇలాంటి కేసులే ఎక్కువగా వస్తున్నాయి. – సతీష్ కుమార్, ఎస్పీ -
భర్త అసౌకర్యం కంటే భార్య సౌకర్యానికే ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: వైవాహిక వివాదాల కేసుల్లో భర్తకు కలిగే అసౌకర్యం కంటే భార్య సౌకర్యానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. విడాకుల నిమిత్తం భర్త పిటిషన్ దాఖలు చేసిన ప్రదేశానికి వెళ్లడానికి భార్యకు తగినంత ఆర్థిక స్తోమత లేనప్పుడు, ఆ పిటిషన్‌ను తనకు సౌకర్యంగా ఉండే చోటుకు బదిలీ చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన బదిలీ పిటిషన్‌ను అనుమతించవచ్చని హైకోర్టు తెలిపింది. వైవాహిక వివాదాల కేసుల్లో బదిలీ పిటిషన్లను పరిశీలించేటప్పుడు కోర్టులు ఇరుపక్షాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను, వారి జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.రెండు వేర్వేరు విడాకుల కేసుల్లో ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వేణుతురుమల్లి గోపాలకృష్ణారావు ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. తన భర్త మోహన మురళీ దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను రేపల్లె నుంచి ఒంగోలుకు బదిలీ చేయాలని కోరుతూ భార్య రాజేశ్వరి దాఖలు చేసిన పిటిషన్‌ను, అలాగే తన భర్త పవన్ దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను తిరుపతి నుంచి ఆదోనికి బదిలీ చేయాలని ఐశ్వర్య అనే మరో మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి అనుమతించారు. కాగా, విడాకుల కోసం పిటిషన్లు దాఖలు చేసిన భర్తలను తప్పనిసరిగా కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనంటూ ఒత్తిడి చేయవద్దని న్యాయమూర్తి సూచించారు. భర్తల తరఫున న్యాయవాదులు హాజరవుతున్నంత కాలం వారి వ్యక్తిగత హాజరు అవసరం లేదని పేర్కొన్నారు. అయితే క్రాస్ ఎగ్జామినేషన్ లేదా ఇతర ప్రత్యేక పరిస్థితుల్లో వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. -
‘వృద్ధాప్యంలో విడాకులేంటి?’.. చివాట్లు పెట్టిన కోర్టు
వారిది అరవై ఏళ్లకు సమీపించిన వైవాహిక జీవితం.. ముగ్గురు పిల్లలు.. మనవలు.. మనవరాళ్లు.. ఇన్ని దశాబ్దాల ప్రయాణం తర్వాత వారు విడిపోతామంటే కోర్టు ఒప్పుకుంటుందా? ‘భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు సహజం.. వాటిని క్రూరత్వం అని పిలవలేం’ అంటూ రాజస్థాన్ హైకోర్టు ఒక వృద్ధ దంపతుల విడాకుల పిటిషన్‌ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.భరత్‌పూర్‌కు చెందిన ఈ జంటకు 1967, జూన్ 29న వివాహం జరిగింది. దాదాపు 46 ఏళ్ల పాటు (2013 వరకు) ఎలాంటి తగాదాలు లేకుండా వీరి సంసారం సాఫీగానే సాగింది. అయితే ఆస్తి పంపకాలు, వ్యక్తిగత ఆరోపణల నేపథ్యంలో 2014లో భర్త విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. ఫ్యామిలీ కోర్టు విడాకులకు నిరాకరించడంతో, ఆయన హైకోర్టును ఆశ్రయించారు.తన భార్య తనపై తప్పుడు వరకట్న వేధింపుల కేసు పెట్టిందని, దీనివల్ల సమాజంలో తన ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆయన ఆరోపించారు. అలాగే, ఆస్తిని పెద్ద కొడుకుకే ఇవ్వాలని ఆమె పట్టుబడుతోందని, తనపై అక్రమ సంబంధాల ఆరోపణలు చేస్తూ, మానసికంగా వేధిస్తోందని పేర్కొన్నారు.అయితే తన భర్త .. అతని తమ్ముడి మాటలు విని ఆస్తిని వృథా చేస్తున్నారని భార్య వాదించింది. ఆయనకు వేరే మహిళతో సంబంధం ఉందని, అందుకే తనను వదిలించుకోవాలని చూస్తున్నారని ఆరోపించింది. వివాదంలో ఉన్న ఆస్తిని తన సొంత డబ్బుతో కొనుగోలు చేసినట్లు ఆమె స్పష్టం చేసింది.జస్టిస్ సుదేష్ బన్సాల్, జస్టిస్ అనిల్ కుమార్ ఉప్మాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును నిశితంగా పరిశీలించి తన అభిప్రాయం వ్యక్తం చేసింది. దశాబ్దాల పాటు కలిసి ఉన్న దంపతుల్లో వయస్సుతో పాటు సహనం, అవగాహన పెరగాలి కానీ ఇలాంటి చిన్న కారణాలతో విడిపోకూడదు. కుటుంబంలో ఆస్తి తగాదాలు రావడం సహజం, అంతమాత్రాన అది విడాకులు ఇచ్చేంత ‘క్రూరత్వం’ కిందకు రాదు. ఈ వయస్సులో విడాకులు మంజూరు చేస్తే కేవలం ఆ దంపతులకే కాకుండా, వారి పిల్లల గౌరవానికి భంగం కలుగుతుంది అని పేర్కొంది. చిన్నపాటి మనస్పర్థలను విడాకుల వరకు తీసుకెళ్లడం సరికాదని చెబుతూ, భర్త దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. 58 ఏళ్ల బంధాన్ని గౌరవించాలని ఆ వృద్ధ దంపతులకు హితవు పలికింది.ఇది కూడా చదవండి: ప్రియంకా చోప్రా భారత్‌కు గర్వకారణం: శశి థరూర్ -
నటితో విడాకులు.. చాలా హ్యాపీగా అనిపించింది: డైరెక్టర్ కామెంట్స్
కోలీవుడ్ డైరెక్టర్ ఆర్ పార్తీబన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన వ్యక్తిగత లైఫ్ గురించి తాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నటి సీతను పెళ్లాడిన ఆయన.. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. ఈ సందర్భంగా తమ వైవాహిక బంధం, విడాకుల గురించి చెప్పుకొచ్చారు. సీతతో విడిపోయినందుకు తానెప్పుడు బాధపడలేదని అన్నారు. నిజం చెప్పాలంటే ఆమెతో విడాకుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. అయితే తనతో ఉన్న 12 సంవత్సరాల నా జీవితం అత్యంత మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని వెల్లడించారు. ఎందుకంటే ఈ రోజుల్లో పురుషులు, మహిళలు వివాహం కంటే స్వతంత్రంగా ఉండటాన్నే ఇష్టపడతారని పార్థీబన్ అన్నారు. ఏ స్త్రీ కూడా వివాహం పేరుతో పరిమితులు ఉండే జీవితాన్ని కోరుకోదని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారని ఆర్ పార్థీబన్ పేర్కొన్నారు. ఈ కామెంట్స్ఆర్ పార్తీబన్ కెరీర్..కాగా.. ఆర్ పార్తీ బన్ 1990లో నటి సీతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. ఒక కుమారుడిని దత్తత తీసుకున్నారు. 2001లో పార్తీబన్- సీత విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి పార్తీబన్ ఒంటరిగానే ఉంటున్నాడు. సీత మరొకరిని పెళ్లి చేసుకోగా తర్వాతి కాలంలో ఆయనకు సైతం విడాకులు తీసుకుంది. ఇక ఆర్ పార్తీబన్ సినిమాల విషయానికి వస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్ 1, పొన్నియన్ సెల్వన్ 2 వంటి పలు చిత్రాల్లో నటించాడు. అంతేకాకుండా సుడల్ 1 వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేశాడు. I have never worried about separation with my ex wife Seetha, to be honest I'm very happy about it. The 12 years with her is the Sweetest memory of my life.These days men & women prefer independence over Marriage. No woman wants a restricted life in the name of Marriage.… pic.twitter.com/LfgirOi8Eh— Kolly Censor (@KollyCensor) February 10, 2026 -
భారత్‌లో సాక్ష్యాల సేకరణకు సాయం కోరిన వెంబు భార్య
జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు, ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్ మధ్య సాగుతున్న విడాకుల వివాదం ఇప్పుడు మద్రాస్ హైకోర్టుకు చేరింది. అమెరికా కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ విచారణకు సంబంధించి భారతదేశంలో ఉన్న సాక్ష్యాలను సేకరించేందుకు న్యాయపరమైన సహాయం కావాలని కోరుతూ ప్రమీల దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.మద్రాస్ హైకోర్టులో పిటిషన్కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టు జారీ చేసిన ‘లెటర్స్ రోగేటరీ’(లెటర్స్ రోగేటరీ అనేది అంతర్జాతీయ న్యాయ ప్రక్రియలో ఒక దేశపు కోర్టు, మరొక దేశపు కోర్టుకు పంపే అధికారిక అభ్యర్థన పత్రం)ను గౌరవించి దాన్ని అమలు చేసేలా భారత అధికారులను ఆదేశించాలని ప్రమీలా శ్రీనివాసన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సరిహద్దు వ్యాజ్యాల్లో మరో దేశంలోని సాక్ష్యాలను లేదా సాక్షుల స్టేట్మెంట్లను సేకరించడానికి ఉపయోగించే అధికారిక అభ్యర్థనే ఈ లెటర్స్ రోగేటరీ.ఈ కేసులో శ్రీధర్ వెంబుతో సహా పలువురు కీలక సాక్షులు ప్రస్తుతం భారతదేశంలోనే ఉన్నందున వారి నుంచి సాక్ష్యాలను సేకరించి అమెరికా కోర్టుకు సమర్పించడానికి స్థానిక కోర్టు కమిషనర్‌ను నియమించాలని ఆమె కోరారు.వివాదం నేపథ్యం..1993లో వివాహం చేసుకున్న ఈ జంట మధ్య 2020 నుంచి విభేదాలున్నాయి. కాలిఫోర్నియా కోర్టులో సాగుతున్న ఈ విడాకుల విచారణలో ప్రమీల కొన్ని ఆరోపణలు చేశారు. కంపెనీలో తన వాటాను తగ్గించే ఉద్దేశంతో శ్రీధర్ వెంబు జోహో సంస్థకు చెందిన ఆస్తులను తన కుటుంబ సభ్యులకు అక్రమంగా బదిలీ చేశారని ఆమె ఆరోపించారు. 2020లో భారతదేశానికి మకాం మార్చిన తర్వాత తనకు దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను శ్రీధర్ వెంబు గతంలోనే బహిరంగంగా ఖండించారు. ఆస్తుల వివరాలను దాయడం లేదా నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆస్తుల బదిలీ జరగలేదని వాదిస్తున్నారు.సాక్ష్యాల సేకరణ ఎందుకు కీలకం?వీరి విడాకుల ప్రక్రియలో భాగంగా వైవాహిక ఆస్తుల పంపకం, ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన అంశాలు సంక్లిష్టంగా మారాయి. భారతదేశంలో నివసిస్తున్న సాక్షుల స్టేట్మెంట్లు లేకుండా కాలిఫోర్నియా కోర్టు ఒక నిర్ణయానికి రావడం కష్టమని ప్రమీల తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. గతంలో కూడా భారత న్యాయస్థానాలు అంతర్జాతీయ సహకారంలో భాగంగా ఇటువంటి విదేశీ అభ్యర్థనలను అంగీకరించిన సందర్భాలను వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.హైకోర్టు స్పందనప్రమీలా శ్రీనివాసన్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న మద్రాస్ హైకోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ శ్రీధర్ వెంబుకు నోటీసులు జారీ చేసింది. భారతీయ చట్టాలకు లోబడి సాక్ష్యాల నమోదుకు స్థానిక కమిషనర్‌ను నియమించవచ్చా అనే అంశాన్ని కోర్టు పరిశీలించనుంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
‘క్షమించండి.. నా మాజీ భర్త గురించే అలా మాట్లాడాను’
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ క్షమాపణలు చెప్పారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకి లేదని స్పష్టం చేశారు. దయచేసి తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని.. పురుషులందరినీ తక్కువ చేసేలా తాను మాట్లాడానంటూ వదంతులు ప్రచారం చేయవద్దని కోరారు. అసలేం జరిగిందంటే...విడాకులు.. వివాదాలుగత కొన్ని రోజులుగా మేరీ కోమ్ (Mary Kom) వ్యక్తిగత జీవితం గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మేరీ కోమ్- కరుంగ్ ఓన్‌కోలర్ కోమ్ అనూహ్య రీతిలో విడిపోవడం.. అనంతరం పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడం ఇందుకు కారణం.గల్లీల్లో చాలా మంది ఉన్నారువిడాకుల గురించి అధికారిక ప్రకటన చేసిన తర్వాత చాన్నాళ్లు మౌనంగా ఉన్న మేరీ కోమ్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాజీ భర్తను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన కోసం కెరీర్ త్యాగం చేశానని కరుంగ్ అంటున్నాడని.. దేశంలో గల్లీల్లో చాలా మంది ఫుట్‌బాల్ ఆడుతుంటారని ఎద్దేవా చేశారు.సంపాదన లేని భర్తఅంతేకాదు.. కరుంగ్ చిల్లగవ్వ కూడా సంపాదించలేదని.. తనపై ఆధారపడి బతికాడని మేరీ కోమ్ తన మాజీ భర్తను నిందించారు. ఈ నేపథ్యంలో కరుంగ్ సైతం ఘాటుగా స్పందించాడు. తన భార్య బాక్సింగ్ ప్రయాణం సజావుగా సాగేందుకు తాను ఎన్నో త్యాగాలు చేశానని.. ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా కెరీర్‌ను వదిలేశానని చెప్పాడు.సంచనల ఆరోపణలునలుగురు పిల్లల ఆలనాపాలనా కూడా తానే చూసుకొన్నానని.. ఇంటి బాధ్యతలన్నీ తానొక్కడినే నెరవేర్చానని కరుంగ్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. గతంలో ఓ జూనియర్ బాక్సర్తో వివాహేతర సంబంధం కొనసాగించిన మేరీ కోమ్.. ఆ తర్వాత తమ అకాడమీలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. వారిద్దరి వాట్సాప్ చాట్లు కూడా తన దగ్గర ఉన్నాయని తెలిపాడుఅయితే, మేరీ కోమ్ ఫుట్‌బాల్ ప్లేయర్లు, భార్య కెరీర్లో ఎదిగేందుకు వీలుగా ఇంటి పట్టున ఉండి కుటుంబాన్ని చక్కదిద్దే భర్తలను తక్కువ చేసి మాట్లాడిందంటూ భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో మేరీ కోమ్ తన వ్యాఖ్యలపై స్పష్టతనిస్తూ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు.హుందాగానే ప్రవర్తించాను‘‘నా పెళ్లి పూర్తిగా చేదు అనుభవాన్ని మిగిల్చిందని నేను చెప్పను. చాలా ఏళ్ల పాటు అంతా సజావుగా సాగిపోయింది. అయితే, ఒక్కసారి నమ్మకం కోల్పోయిన తర్వాత అంతా మారిపోయింది 2025 ఏప్రిల్‌లో నా విడాకుల గురించి ప్రకటించినపుడు కూడా నాకై నేను నేరుగా మీడియాతో మాట్లాడలేదుఎల్లప్పుడూ నేను హుందాగానే ప్రవర్తించాను. నా మాటలు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం అయ్యాయి. ఇది దురదృష్టకరం. యూత్ ఫుట్‌బాల్‌కు నేను ఎంతమాత్రం వ్యతిరేకం కాదు. ఫుట్‌బాల్ సంస్కృతిని నేను కించపరచలేదు.నేనొక బాక్సర్‌ని. అయినప్పటికీ నాకు ఫుట్‌బాల్ ఆడటం అంటే ఎంతో ఇష్టం. నా వ్యాఖ్యలతో క్రీడలను, క్రీడాకారులను కించపరచాలని అనుకోలేదు. ప్రతి ఒక్కరి ప్రయాణం గల్లీ నుంచే మొదలవుతుంది. కఠిన శ్రమ, అంకితభావంతో పనిచేస్తే సునిల్ ఛెత్రి, భాయ్‌చుంగ్ భుటియా లాంటి వాళ్లు పుట్టుకొస్తారు.పురుష సమాజానికి క్షమాపణలునా కోసం తన కెరీర్ త్యాగం చేశానని నా మాజీ భర్త అన్నాడు. అతడు షిల్లాంగ్‌లో ఫుట్‌బాల్ ఆడేవాడు. ఆ తర్వాత ఆటను వదిలేసి ఢిల్లీకి వచ్చిన తర్వాతే నన్ను కలిశాడు అదే విధంగా.. నా భర్తకు సంపాదన లేదని నేను అన్న మాటలను.. పురుష సమాజాన్ని కించపరచాలని మాట్లాడినట్లు అన్వయించుకుంటున్నారు.నా ఈ మాటలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని చేతులు జోడించి అర్థిస్తున్నా. ఇది కేవలం మా మధ్య జరిగిన విషయానికి సంబంధించినది మాత్రమే. చాలా ఏళ్ల పాటు అనుభవించిన బాధ, డిప్రెషన్.. ద్రోహం కారణంగా నాలో పెల్లుబుకిన అసహనం అది. అంతేకానీ మగవాళ్లను తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు’’ అని మేరీ కోమ్ స్పష్టతనిచ్చారు.చదవండి: చక్కటి సంసారం.. ‘వివాహేతర సంబంధం’ చిచ్చు.. ఆఖరికి! View this post on Instagram A post shared by Dr Mangte Mary Kom (@mcmary.kom) -
ఆ ఆస్తిలో వారికి కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది!
నేను నా భార్యతో విడాకులు తీసుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. పిల్లలు నా మాజీ భార్య వద్దనే ఉంటారు. అయితే మా నాన్న గారు ఇటీవలే చనిపోయారు. ఆయన ద్వారా నాకు వచ్చిన ఆస్తిలో నా పిల్లలకి వాటా ఇవ్వాల్సి వస్తుందా?– కృష్ణమూర్తి, విశాఖపట్నంమీ తండ్రిగారి దగ్గర నుంచి మీకు సంక్రమించిన ఆస్తి మీ తండ్రి గారి స్వార్జితమైవుండి, వీలునామా ప్రకారం మీకు సంక్రమించి వుంటే, సదరు ఆస్తిలో మీకు తప్ప మరెవరికీ ఎటువంటి హక్కు ఉండదు. మీ తదనంతరం వీలునామా రాయకపోతే మాత్రమే అది మీ పిల్లలకి చెందుతుంది. మీ తండ్రిగారు ఒకవేళ వీలునామా రాయకుండా మరణించినట్లయితే తన స్వార్జితం మొత్తం క్లాస్–1 వారసులు; అంటే చనిపోయిన వ్యక్తి సంతానానికి (ఎంత మంది వుంటే అన్ని భాగాలు), భార్యకి – తల్లిగారికి సమానమైన హక్కు ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ అది మీ తండ్రి గారికి కూడా వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అయివుంటే, కేవలం అలాంటి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి వరకు మాత్రమే మీ పిల్లలకు హక్కు ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మీ పిల్లలు మీ వద్ద ఉంటున్నారా లేదా విడిపోయిన మీ మాజీ భార్య వద్ద ఉంటున్నారా అనేది అప్రస్తుతం. అలాగే మీ తండ్రి గారికి ఎంతమంది సంతానం వున్నారో మీరు చెప్పలేదు. ఒకవేళ మీతోపాటు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, మీ తల్లిగారు, అలాగే మీ తండ్రిగారి తల్లిగారు (మీ నాన్నమ్మ) ఉంటే వారికి కూడా మీతోపాటు సమానమైన వాటా లభిస్తుంది.స్త్రీల హక్కులను గౌరవిస్తూ వారికి రావలసిన న్యాయమైన వాటాని స్వచ్ఛందంగా ఇచ్చే పురుషులు తక్కువే! అందుకని తమ న్యాయమైన వాటా కోసం వేల సంఖ్యలో స్త్రీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ‘తనకు పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇచ్చాము, కాబట్టి అక్కాచెల్లెళ్లకు ఇచ్చేది ఏమీ లేదు’ అనే ధోరణి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అది తప్పు! హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ తర్వాత కొడుకులకు–కూతుళ్లకు ఆస్తిలో సమానమైన హక్కు ఉంటుంది. ఒకవేళ మీకు గనక అక్క చెల్లెళ్లు ఉంటే వారికి చెందవలసిన న్యాయమైన వాటాను వారు అడగకముందే వారికి ఇచ్చేయండి. మీ పిల్లలకి మీ స్వార్జితం – మీ తండ్రిగారి స్వార్జితం ఇవ్వాలి అని నిబంధన లేదు కానీ, వారు మైనర్లు అయితే మాత్రం వారికి చట్టరీత్యా మీనుంచి మెయింటెనెన్స్ పోందే హక్కు వుంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comమెయిల్ చేయవచ్చు. -
ఆమెకు బ్రేకప్ చెప్పిన టీమిండియా స్టార్!
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ మరోసారి వార్తల్లోకెక్కాడు. అతడి ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న ఆర్జే మహ్వశ్తో చహల్‌కు విభేదాలు తలెత్తాయనేది ఆ వార్తల సారాంశం. కొరియోగ్రాఫర్, యూట్యూబర్ ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చహల్.అయితే, వివాహమైన కొన్ని నెలలకే తమ మధ్య గొడవలు జరిగాయని.. విడాకులు తీసుకోవడమే ఉత్తమమని భావించినట్లు కోర్టును ఆశ్రయించింది ఈ జంట. గతేడాది అధికారికంగా వీరికి విడాకులు మంజూరయ్యాయి.ఆర్జేతో చెట్టాపట్టాల్‌కానీ అంతకంటే ముందు నుంచే చహల్.. ఆర్జే మహ్వశ్ (RJ Mahvash)తో కలిసి చక్కర్లు కొడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా ఆమెతో కలిసి మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫొటోలు షేర్ చేసి తమ మధ్య స్నేహ బంధం ఉందని చహల్ స్పష్టం చేశాడు.కాపురాన్ని ఆమే కూల్చేసిందని.. ఈ ఘటన తర్వాత కొన్నాళ్లకే చహల్- ధనశ్రీలకు విడాకులు మంజూరు కావడంతో.. అప్పటిదాకా ధనశ్రీని తిట్టినవారంతా ఆర్జే మహ్వశ్పై దృష్టి సారించారు. చహల్ కాపురాన్ని ఆమే కూల్చేసిందని.. భార్యభర్తల మధ్య దూరి విడాకులకు కారణమైందని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.మరోవైపు.. చహల్‌కు మద్దతుగా పరోక్షంగా ధనశ్రీని టార్గెట్ చేస్తూ మహ్వశ్ సైతం పోస్టులు పెట్టింది. దీంతో నెటిజన్లు మరోసారి ‘‘హోం బ్రేకర్’’ అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల చహల్ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఓ అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపిస్తే చాలు వదంతులు వ్యాప్తి చేస్తారు.ఏడుస్తూ కూర్చోలేము కదా!అంతమాత్రాన మేము ఏడుస్తూ కూర్చోలేము కదా!.. జనాలు ఏమనుకుంటున్నారో అదే అనుకోనివ్వండి. మాకేం తేడా ఉండదు. మా కాపురాన్ని కూల్చిందని ఆమెను ఆడిపోసుకున్నారు. ఇంకా ఎన్నెన్నో మాటలు అన్నారు. ఓ మహిళను ఎన్ని రకాలుగా కించపరచవచ్చో అన్ని రకాలుగా మాట్లాడారు.యుజీ ఆమెతో ఎందుకు ఉన్నాడని చాలా మంది అన్నారు. కష్టకాలంలో నాకు సహాయంగా నిలబడ్డ నా స్నేహితురాలిని అలా నిందించడం నాకు బాధ కలిగించింది. ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్లినా మా ఫొటోలు మాత్రమే క్రాప్ చేసి రూమర్స్ వ్యాప్తి చేశారు. అందుకే కలిసి బయటకు వెళ్లడం కూడా మానేశాము’’ అని చెప్పుకొచ్చాడు.ఒకరినొకరు అన్‌ఫాలోమరోవైపు.. ఆర్జే మహ్వశ్ సైతం అబ్బాయితో కలిసి బయటకు వెళ్తే చాలు డేటింగ్ అంటున్నారని.. అసలు మనం ఏ కాలంలో ఉన్నామంటూ మండిపడింది. పరోక్షంగా చహల్‌తో తనకు స్నేహం మాత్రమే ఉందని స్పష్టం చేసింది. అయితే, తాజాగా వీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం గమనార్హం.నేను ఎవరినీ నమ్మనుదీంతో చహల్- మహ్వశ్ మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు చహల్ ఇన్‌స్టా స్టోరీలో.. ‘‘నేను ఎవరినీ నమ్మను’’ అని పోస్ట్ పెట్టడం ఇందుకు బలమిచ్చింది. మరో స్టోరీలో ‘‘బాధ, ఆశల వలయంలో చిక్కుకుపోకుండా.. బంధాల్లో మునిగిపోకుండా.. కోపం, భయాన్ని వదిలేసి ముందుకు సాగేవాడే తెలివైన మనిషి’’ అన్న భవద్గీత పంక్తులను కూడా చహల్ షేర్ చేయడం విశేషం.చదవండి: చక్కటి సంసారం.. ‘వివాహేతర సంబంధం’ చిచ్చు.. ఆఖరికి! -
విడాకులంటే మాటలు కాదు డబ్బులు!
విడాకుల కల్చర్ రోజుకు రోజుకు పెరుగుతోంది. సామాన్యులు, సంపన్నులు అనే బేధం లేకుండా విడిపోతున్న జంటలు నానాటికీ ఎక్కువవుతున్నాయి. ఆలుమగల మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడినప్పుడు విడాకులు అనివార్యమవుతున్నాయి. సామాజిక కట్టుబాట్లకు భయపడి మిడిల్‌క్లాస్ జంటలు ఫ్యామిలీ కోర్టు మెట్లు ఎక్కేందుకు జంకుతున్నాయి. కానీ ఎగువ మధ్య తరగతి, సంపన్నులు మాత్రం 'డోంట్ కేర్' అంటున్నారు. కలిసి కలహించుకునే కంటే.. విడిపోయి ఎవరిదారి వారు చూసుకుని హాయిగా ఉండాలన్న ఉద్దేశంతో విడాకులకు మొగ్గు చూపిస్తున్నారు. డివోర్స్‌కు దారి తీస్తున్న కారణాలు చాలానే ఉన్నాయి. సరే వాటి గురించి పక్కన పెడదాం.ఇప్పుడీ విడాకుల గురించి మాట్లాడుకోవడానికి ప్రధాన కారణం జోహూ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు, ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్. వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుని అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టుకెక్కారు. భార్యాభర్తలు విడాకుల కోసం కోర్టుకెళ్లడం పెద్ద విషయం కాదు గానీ.. న్యాయస్థానం వేసిన ఆర్డరే ఆసక్తికర అంశంగా మారి పతాక శీర్షికలకు ఎక్కింది. విడాకుల విషయం తేలేంతవరకు 1.7 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 15 వేల కోట్ల రూపాయలు తమ వద్ద డిపాజిట్ చేయాలని కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది. ఇది విన్నవారంతా.. 'ఆ' అంటూ నోరెళ్ల బెడుతున్నారు. బిలియనీర్ల విడాకులు అంటే ఆ మాత్రం ఉంటుందిలే అని కొంతమంది సమాధానపడుతున్నారు. బిల్ గేట్, జెఫ్ బెజోస్ డివోర్స్ ఉదంతాలను ఉదాహరణగా చూపుతున్నారు. బెజోస్, స్కాట్ డివోర్స్జెఫ్ బెజోస్, మెకెంజీ స్కాట్ దంపతుల విడాకుల వ్యవహారం చరిత్రలోనే అత్యంత ఖరీదైన డివోర్స్గా ప్రాచుర్యం పొందింది. తమ పాతికేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్టు 2019, జనవరిలో వీరు ప్రకటించారు. బెజోస్ నుంచి విడిపోయినందుకు మెకెంజీ స్కాట్.. అమెజాన్ స్టాక్‌లో దాదాపు 4 శాతం వాటాను దక్కించుకున్నారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అప్పటి లెక్కల ప్రకారం ఈ వాటా విలువ 38 బిలియన్ అమెరికన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 3 లక్షల 20 వేల కోట్ల రూపాయలు. కాగా, మెకెంజీ స్కాట్.. గతేడాది చివరిలో 19 బిలియన్ డాలర్లను సేవాకార్యక్రమాలకు విరాళం ఇచ్చారని ఫోర్బ్స్ తెలిపింది.బిల్‌గేట్స్, మిలిందా విడాకులుమైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, మిలిందా ఫ్రెంచ్ గేట్స్ తమ 27 ఏళ్ల వివాహ బంధానికి 2021, ఆగస్టు నెలలో ముగింపు పలికారు. మనోవర్తి కింద మిలిందాకు బిల్‌గేట్స్ 7.9 బిలియన్ డాలర్లు (దాదాపు 65 వేల కోట్ల రూపాయలు) చెల్లించినట్టు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. జెఫ్రీ ఎప్స్టీన్ తో బిల్‌గేట్స్ (Bill Gates) ఉన్న 'పాత పరిచయమే' తమ విడాకులకు ప్రధాన కారణమని మిలిందా 'సీబీఎస్ మార్నింగ్'తో చెప్పారు.ఆ డబ్బును ప్లాస్టిక్ సర్జరీలకు వాడొద్దుఫ్రెంచ్-అమెరికన్ ఆర్ట్ డీలర్ అలెక్ వైల్డెన్‌స్టెయిన్ కూడా విడాకుల కోసం భారీ మొత్తాన్నే వెచ్చించారు. తన భార్య జోసెలిన్ నుంచి 1999లో విడాకులు తీసుకున్నారు. జోసెలిన్ను 2.5 బిలియన్ డాలర్లు భరణంగా చెల్లించాలని అలెక్ను అప్పట్లో కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఏడాదికి 13 మిలియన్ డాలర్ల చొప్పున 13 ఏళ్లు చెల్లించాలని తీర్పు చెప్పింది. భరణంగా వచ్చిన డబ్బును ప్లాస్టిక్ సర్జరీ కోసం వినియోగించరాదని జోసెలిన్కు కోర్టు షరతు విధించింది. కాగా, ఆమె విలాసవంతమైన జీవితమే విడాకులకు కారణమన్న వాదనలు ఉన్నాయి.మీడియా మొఘల్ కాస్ట్లీ డివోర్స్మీడియా దిగ్గజం రూపర్ట్ ముర్డోక్ (Rupert Murdoch) నాలుగుసార్లు విడాకులు తీసుకున్నారు. 1999లో తన రెండో భార్య అన్నా డిపెస్టర్ నుంచి ఆయన విడిపోయి 32 ఏళ్ల తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. దీని కోసం 1.7 బిలియన్ డాలర్లు (సుమారు 14 వేల కోట్ల రూపాయలు) చెల్లించారు. అంతేకాదు అన్నా డిపెస్టర్ నలుగురు పిల్లలకు తన మీడియా సామ్రాజ్యంలో వాటా ఇచ్చేందుకు కూడా అంగీకరించారు. అన్నా డిపెస్టర్ నుంచి విడిపోయిన 17 రోజులకే వెండి డెంగ్‌ను రూపర్ట్ ముర్డోక్ మూడో పెళ్లి చేసుకోవడం గమనార్హం.చదవండి: ఇక్కడ మనుషులను తాకితే ఫైన్ వేస్తారు! పైన చెప్పుకున్న వారే కాదు ఎలాన్ మస్క్-జస్టిన్, దిమిత్రి రైబోలోలెవ్-ఎలీనా, కాన్యే వెస్ట్- కిమ్ కర్దాషియాన్, బెర్నీ ఎలెన్స్టోన్-స్లావికా, స్లీవ్ వీన్-ఎలైన్ తదితర జంటల విడాకులు కూడా అత్యంత ఖరీదైన వాటిలో ఉన్నాయి. -
సంపాదనలేని భర్త వద్దు.. భార్యే నా ATM?.. అసలేం జరిగింది?
ఢిల్లీ.. 2000 సంవత్సరం.. విమాన ప్రయాణం.. ఆమె లగేజీ, డాక్యుమెంట్లు పోయాయి.. ఇంతలో అతడు వచ్చాడు.. ఆమెకు సాయం చేశాడు.. ఇద్దరి మాటలు కలిశాయి.. మనసులు కలవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఐదేళ్ల స్నేహం తర్వాత 2005లో ఆ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది.వారి దాంపత్యానికి గుర్తుగా 2007లో కవల కుమారులు జన్మించారు. 2013లో మరో కుమారుడు.. 2018లో ఓ ఆడబిడ్డను దత్తత తీసుకున్నారు. వారిద్దరు వారికి నలుగురు.. చక్కటి సంసారం. ఆమె భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్. అతడు కరుంగ్ ఓన్‌కోలర్.. ఫుట్‌బాల్ ఆటగాడు. న్యాయవాది కూడా!బాక్సర్‌గా భార్య ఎదుగుదల కోసం తన కెరీర్‌ను పణంగా పెట్టానంటాడు కరుంగ్. మేరీ సైతం గతంలో భర్త ప్రోత్సాహంతో ఇక్కడిదాకా వచ్చానని చెప్పింది. అయితే, విధికి కన్నుకుట్టిందో ఏమో.. 2013 నుంచి వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. చినికి చినికి గాలివానలా మారి వ్యవహారం విడాకుల దాకా వచ్చింది.వివాహేతర సంబంధం మచ్చకోమ్ చట్టాల ప్రకారం తాము విడిపోయినట్లు మేరీ కోమ్ గతేడాది ఓ ప్రకటన విడుదల చేసింది. ఓన్కోలర్తో విడిపోయినట్లు తన న్యాయవాది ద్వారా ప్రకటన చేసింది. ఇక అప్పటి నుంచి ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయి ఎందరికో ఆదర్శంగా నిలిచిన మేరీ కోమ్ వ్యక్తిత్వంపై వివాహేతర సంబంధం మచ్చ పడింది.అయితే, ఈ విషయం గురించి ఓన్‌కోలర్ నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ తన గురించి మేరీ లోక్ అదాలత్‌లో మోసగాడు అని ముద్ర వేసిన తర్వాతే తాను అసలు విషయం చెప్పాల్సివస్తోందంటూ అతడు సంచలన ఆరోపణలు చేశాడు. ఇటీవల మాట్లాడుతూ.. 2013లో ఓ జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు వివాహేతర సంబంధం ఉండేదని అతడు ఆరోపించాడు.సాక్ష్యంగా మెసేజ్లుఆ తర్వాత రాజీ పడినా.. 2017లో మరో వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగించిందని ఓన్‌కోలర్ ఆరోపణలు చేశాడు. వాళ్లిద్దరి సంబంధానికి సాక్ష్యంగా తన వద్ద వాట్సాప్ మెసేజ్‌లు ఉన్నాయని తెలిపాడు. ఆమెను తాను మోసం చేశానని.. ఆస్తి కొట్టేశానని మేరీ కోమ్ చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా అతడు ఈ మేరకు సమాధానం ఇచ్చాడు.మేరీ కోమ్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని.. అయితే, తనపై అభాండాలు వేస్తే మాత్రం ఊరుకునేది లేదన్నాడు. ఆధారాలు ఉంటేనే తన గురించి మాట్లాడాలని మేరీ కోమ్కు హితవు పలికాడు. కాగా 2022లో తాను గాయపడినపుడు ఓన్‌కోలర్ నిజ స్వరూపం బయటపడిందని మేరీ కోమ్ ఇటీవల తెలిపింది. తాను పోటీలలో పాల్గొని సంపాదించినంత వరకు అంతా సజావుగా సాగిందని.. ఎప్పుడైతే తాను గాయపడ్డానో అప్పటి నుంచి తానొక భ్రమలో బతుకుతున్న విషయం స్పష్టంగా తెలిసిందని వాపోయింది.సంపాదన లేకుండా నాపై ఆధారపడిఅప్పుడే తనకు నిజం తెలిసిందని.. అందుకే భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు మేరీ కోమ్ తెలిపింది. అంతేకాదు.. తన దగ్గర కోట్ల రూపాయలు కాజేసి.. భూమి కొనుకున్నాడని.. మణిపూర్‌లోని తన ఆస్తిపై లోన్లు తెచ్చుకున్నాడని ఆరోపించింది. తాను ఇలా మాట్లాడినందుకు కొంతమంది తనను దురాశ కలిగిన వ్యక్తిగా అభివర్ణిస్తున్నారని.. తనకు ఏడ్చే వెసలుబాటు కూడా లేదా అని ఆవేదన వ్యక్తం చేసింది.తాను కష్టపడి బాక్సింగ్ ద్వారా కుటుంబాన్ని పోషిస్తే.. అతడు మాత్రం ఎలాంటి సంపాదన లేకుండా తనపై ఆధారపడి బతికేవాడని మేరీ కోమ్ మాజీ భర్తపై మండిపడింది. తనకు తెలియకుండానే తన బ్యాంకు ఖాతాలోని డబ్బులను ఖాళీ చేశాడని ఆరోపించింది. ఇందుకు ఓన్‌కోలర్ కూడా గట్టిగానే బదులిచ్చాడు.పిల్లలకు తల్లినయ్యానుపెళ్లికి ముందు తాను ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఉండేవాడినని.. అయితే, మేరీ కోమ్ కోసం తాను తన కెరీర్‌నే వదులుకున్నానని పేర్కొన్నాడు. ఆమె బాక్సింగ్‌తో బిజీగా ఉంటే.. తానే పిల్లల్ని పెంచి పెద్ద చేశానని.. ఇంటి బాధ్యతలు చూసుకున్నానని చెప్పుకొచ్చాడు.పిల్లలకు స్నానం చేయించడం దగ్గర నుంచి అన్నీ తానే చేసేవాడినని.. తల్లిలా వారిని పెంచానని గుర్తు చేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు తనను కనీసం పిల్లల్ని కూడా చూడనివ్వడం లేదంటూ ఆవేదన చెందాడు. మేరీ కోమ్, పిల్లల మీద ప్రేమతో మాత్రమే ఇవన్నీ చేశానని.. తనకు డబ్బు, పేరు అక్కర్లేదని పేర్కొన్నాడు.సంపాదనలేని భర్త వద్దా? భార్యే నా ATM?మేరీ కోమ్- ఓన్‌కోలర్ వివాదంలో కొంతమంది ఆమెకు మద్దతుగా నిలిస్తే.. మరికొందరు అతడికి సపోర్టు చేస్తున్నారు. భార్యను ప్రోత్సహించిన భర్తకు సంపాదన లేదన్న కారణం చూపి అవమానించడం సరికాదని కొందరు అంటుంటే.. భార్యను ATMలా వాడుకునేవాళ్లు చాలా మందే ఉంటారని మరికొందరు వాదిస్తున్నారు.ఏదేమైనా మేరీ కోమ్ వంటి దిగ్గజ బాక్సర్ రింగ్‌లో సత్తా చాటినా.. కారణం ఎవరైనా వ్యక్తిగత జీవితంలో ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కోవడం బాధాకరమని ఇంకొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగాలని.. పద్దెమినిదేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ ఇద్దరు ఇలా రచ్చకెక్కడం ఏమీ బాగాలేదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. -
లాయర్‌తో వివాహేతర సంబంధం! భర్తను సర్వం దోచేసి..
గుంటూరు రూరల్: భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనపై, తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తూ, తనను జైలుకు పంపి, ఇబ్బందులకు గురిచేస్తోందనే మానసిక వేదనకు గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ వంశీధర్ తెలిపిన, మృతుడు వీడియో ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయిన సమాచారం మేరకు.. ఏటీ అగ్రహారానికి చెందిన వెంకటేశ్వర్లు కారు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. మొదటి భార్య మృత్యువాతకు గురవ్వటంతో అడవితక్కెళ్లపాడు టిడ్కో హౌస్‌లలో నివాసం ఉండే వెంకటరమణను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు కుమార్తె లాయర్ డిగ్రీ పూర్తి చేసుకుని వేముల బాలాజీ అనే వ్యక్తి వద్ద ప్రాక్టీస్‌కు చేరింది. కుమార్తె ప్రాక్టీస్‌కు వెళుతున్న సమయంలో ఆమెకు తోడుగా వెళ్లే వెంకటరమణ, బాలాజీ లాయర్‌తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయమై వెంకటేశ్వర్లు, వెంకటరమణల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉండేవి. వివాదాల నేపథ్యంలో వెంకటరమణ, లాయర్ బాలాజీలు ఇరువురు తనపై గతంలో తొమ్మిదికి పైగా అక్రమ కేసులు బనాయించి, తనను జైలుకు కూడా పంపారని వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు ముందు చేసిన వీడియో ద్వారా తెలిపాడు. తనపై కేసులు మోపటంతోపాటు తన అన్నదమ్ములు, మొదటి భార్య బిడ్డలపై కూడా అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారని వాపోయాడు. లాయర్ బాలాజీ అండతో తనను తన భార్య చిత్రహింసలకు గురిచేస్తోందని, తాను కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతో పేరేచర్లలోని జగనన్న కాలనీలో ఇంటిని కొనుక్కున్నానని, అయితే అందులోకి కూడా తనను వెళ్లకుండా చేసి ఆ ఇంటిని లాయర్, తన భార్య గెస్ట్ హౌస్‌గా వాడుకుంటున్నారని వీడియో ద్వారా వాపోయాడు. గతంలో తనపై పెట్టిన కేసుల్లో జైలు నుంచి వచ్చాక రాజీ కోసం ప్రయత్నించి తన సొంత ఇంటిని అమ్మి డబ్బులు కూడా తన భార్య వెంకటరమణకు ఇవ్వడం జరిగిందని తెలిపాడు. అనంతరం మళ్లీ తనకు ఫోన్ చేసి రూ. 20 లక్షలు ఇస్తే డైవోర్స్ ఇస్తాను, తనపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటానని ఆ లాయర్, తన భార్య వేధిస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన చావుకు కారణం లాయర్ బాలాజీ, భార్య వెంకటరమణలే కారణమని పేపర్‌పై రాసి, వీడియోద్వారా తెలిపాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఘటనకు కారణమైన వెంకటరమణను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. లాయర్ బాలాజీ పరారీలో ఉన్నాడని అతడిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని సీఐ తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
రెండో పెళ్లి.. రూ.36 లక్షలతో భర్త జంప్
కర్ణాటక: విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడి, కూతురు పుట్టిన తరువాత రూ.36 లక్షల డబ్బుతో ఉడాయించిన ఘరానా భర్త ఉదంతమిది. బెంగళూరులో బనశంకరిపోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ యువతి భర్తకు అనారోగ్యం కారణంగా 2021లో విడాకులు తీసుకుని విడిగా ఉంటోంది. తరువాత మోసగాడు మోహన్‌రాజ్ పరిచయమై ప్రేమించింది, 2022లో వివాహం చేసుకున్నారు. తరువాతి ఏడాది వారికి కూతురు పుట్టింది. మోహన్‌రాజ్‌ను నమ్మిన ఆమె అడిగినంత డబ్బు ఇచ్చింది. కొత్తగా ఇల్లు కట్టిస్తానని చెప్పడంతో బంగారం కుదువ పెట్టి డబ్బులు ఇచ్చింది, ఇలా రూ.36 లక్షల వరకూ జేబులో వేసుకున్నాడు. గతేడాది ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి జాడ లేదు. దీంతో కంగుతిన్న బాధితురాలు మోసపోయినట్లు గుర్తించింది. తనకు న్యాయం చేయాలని బనశంకరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
జోహో ఫౌండర్ విడాకులు: తెరపైకి రూ.15వేల కోట్ల వివాదం!
జోహో ఫౌండర్.. టెక్ దిగ్గజం 'శ్రీధర్ వెంబు'.. ఆయన భార్య 'ప్రమీలా శ్రీనివాసన్' విడాకుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఓ వ్యాపారవేత్త వ్యక్తిగత జీవితం, కంపెనీ ఆస్తుల మధ్య జరుగుతున్న ఈ వివాదం ప్రస్తుతం.. కార్పొరేట్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.శ్రీధర్ వెంబు తన వద్ద ఉండే.. జోహో కంపెనీ షేర్స్ భార్యకు (ప్రమీలా శ్రీనివాసన్) తెలియకుండా.. బంధువులకు బదిలీ చేశారనేది ఆరోపణ. కంపెనీలో ఆమెకు రావాల్సిన వాటా.. రాకుండా చేయడానికే ఈ విధమైన బదిలీలు జరిగాయని అమెరికా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే రూ.15వేల కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలు, బాండ్ల బదిలీ అంశం తెరపైకి వచ్చింది.ఒకప్పుడు ఆదర్శ దంపతులుగా అనోన్య జీవితం సాగించిన శ్రీధర్ వెంబు, ప్రమీలా శ్రీనివాసన్ కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. ఈ తరువాత శ్రీధర్ వెంబు ఇండియా వచ్చేసారు. ఇప్పుడు వీరిమధ్య ఆస్తుల పంపకం, నమ్మకద్రోహం అనే అంశాలపై తీవ్రమైన చర్చ జరుగుతోంది.ప్రమీలా శ్రీనివాసన్ చేస్తున్న ఆరోపణలను శ్రీధర్ వెంబు ఖండించారు. నేను ఎప్పుడూ భార్య, బిడ్డకు (కుమారుడు) అన్యాయం చేయలేదు. నా ప్రతిష్టను దెబ్బతీయడానికి, కేవలం డబ్బు కోసం జరుగుతున్న డ్రామా అని అన్నారు. నేను బదిలీ చేసిన షేర్స్ అన్నీ.. చట్టబద్ధంగా జరిగినవే అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వివాదం జోహో కంపెనీ ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది.ఆటిజంతో బాధపడుతున్న తన కుమారుని భవిష్యత్తు కోసం నేను పోరాడుతున్నాను అని.. మరోవైపు ప్రమీలా శ్రీనివాసన్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఒక కంపెనీ అధినేత జీవితం.. సంస్థ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందనే దానికి ఇది ఒక ఉదాహరణ అని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: H-1B వీసా కొత్త ఫీజులు.. మార్చి 1 నుంచి అమల్లోకి! -
భర్త వివాహేతర సంబంధం.. కత్తితో వివాహిత హల్చల్
రామన్నపేట: భార్యాభర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగా తనకు, తన పిల్లలకు ఆస్తిలో వాటా ఇవ్వాలని భర్త దుకాణం ఎదుట భార్య కత్తితో హల్చల్ చేసింది. ఈ ఘటన వరంగల్ నగరంలో బుధవారం చోటుచేసుకుంది. నగరానికి చెందిన జ్యోత్స్నకు మెరుగు శ్రీకాంత్ అనే వ్యక్తితో 20 ఏళ్లక్రితం వివాహమైంది. భర్తకు వరంగల్ చౌరస్తాలో జ్యువెలరీ దుకాణం ఉంది. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 8 ఏళ్ల కిత్రం విడిపోయారు. విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం కోర్టు వాయిదా ఉండగా జ్యోత్స్న హాజరు కాలేదు. బుధవారం తన భర్త దుకాణం వద్దకు అకస్మాత్తుగా కత్తితో వచ్చి తనకు రావాల్సిన ఆస్తితో పాటు పిల్లలను తనకు ఇవ్వాలని హల్చల్ చేసింది. తన భర్త వేరే మహిళతో సహజీవనం సాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇంతెజార్గంజ్ పోలీసులు అక్కడికి చేరుకుని సదరు వివాహితకు నచ్చజెప్పి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించగా, ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని వారు తెలపడంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ మహిళను కుటుంబ సభ్యులతో పంపించారు. -
భార్య వంట చేయకపోతే విడాకులా?
-
భార్యకు వంటరాదని విడాకులా?
సాక్షి, హైదరాబాద్: భార్య వంట చేయలేదని చెప్పి భర్త విడాకులు కోరడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న ప్పు డు భార్య వంట చేసేందుకు ఆస్కారం ఉండకపోవచ్చునని చెప్పింది. అంతేకాకుండా వంట చేయకుండా తన తల్లికి ఆమె సహకరించడం లేదని చెప్పి భార్య క్రూరత్వానికి పాల్పడిందనే భర్త వాదనను తోసిపుచ్చింది. వివరాలు ఇలా...ఎల్ఎల్బీ గ్రాడ్యుయేట్..సాఫ్ట్వేర్ ఉద్యోగినిని 2015, మేలో వివా హం చేసుకున్నారు. వైద్య సమస్యల కారణంగా 2017లో ఆమెకు గర్భస్రావమైంది. ఆ తర్వాత గృహ కలహాలతో 2018, అక్టోబర్ నుంచి ఇద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో విడాకులు కోరుతూ భర్త మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టులో దావా వేశారు. జిల్లా కోర్టు విడాకులకు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ భర్త హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మా సనం విచారణ చేపట్టింది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భార్య తనకు వంట చేయడంలో విఫలమైందని, తన తల్లికి రోజువారీ పనుల్లో సహకరించడం లేదన్న అతని ఆరోపణను తప్పుబట్టింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని కావడంతో విభిన్న పనివేళల దృష్ట్యా ఆమె వంట చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించలేమని, దానిని క్రూరత్వంగా పేర్కొనలేమని అభిప్రాయపడింది. చిన్న చిన్న సమస్యలతో విడాకుల వరకు వెళ్లవద్దని సూచిస్తూ.. అప్పీల్‌ను కొట్టివేసింది. -
భార్యకు వంటరాదని విడాకులా? : హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: భార్య వంట చేయలేదని చెప్పి భర్త విడాకులు కోరడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు భార్య వంట చేసేందుకు ఆస్కారం ఉండకపోవచ్చునని చెప్పింది. అంతేకాకుండా వంట చేయకుండా తన తల్లికి ఆమె సహకరించడం లేదని చెప్పి భార్య క్రూరత్వానికి పాల్పడిందనే భర్త వాదనను తోసిపుచ్చింది. వివరాలు ఇలా...ఎల్ఎల్బీ గ్రాడ్యుయేట్..సాఫ్ట్వేర్ ఉద్యోగినిని 2015, మేలో వివాహం చేసుకున్నారు. వైద్య సమస్యల కారణంగా 2017లో ఆమెకు గర్భస్రావమైంది. ఆ తర్వాత గృహ కలహాలతో 2018, అక్టోబర్ నుంచి ఇద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో విడాకులు కోరుతూ భర్త మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టులో దావా వేశారు. జిల్లా కోర్టు విడాకులకు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ భర్త హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మా సనం విచారణ చేపట్టింది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భార్య తనకు వంట చేయడంలో విఫలమైందని, తన తల్లికి రోజువారీ పనుల్లో సహకరించడం లేదన్న అతని ఆరోపణను తప్పుబట్టింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని కావడంతో విభిన్న పనివేళల దృష్ట్యా ఆమె వంట చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించలేమని, దానిని క్రూరత్వంగా పేర్కొనలేమని అభిప్రాయపడింది. చిన్న చిన్న సమస్యలతో విడాకుల వరకు వెళ్లవద్దని సూచిస్తూ.. అప్పీల్‌ను కొట్టివేసింది. -
భార్యతో తెగదెంపులు, మళ్లీ కలిసే ప్రసక్తే లేదు: నటుడు
పెళ్లి చేసుకునేటప్పుడు ఒకరి చేయి మరొకరు జీవితాంతం విడవమని చెప్తుంటారు. కానీ ఇప్పుడంతా రివర్స్‌లో జరుగుతోంది. చాలామంది దంపతులు కొన్ని నెలలకే విడిపోతుంటే మరికొందరు మాత్రం పెళ్లయిన దశాబ్దాల తర్వాత కూడా విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. మలయాళ బుల్లితెర జంట మను వర్మ- సింధు వర్మ ఈ కోవలోకే వస్తారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులకు దరఖాస్తు చేశారు.మళ్లీ కలిసే ప్రసక్తే లేదుఈ విషయం గురించి మను వర్మ మాట్లాడుతూ.. నేను, నా భార్య కొంతకాలంగా విడివిడిగా జీవిస్తున్నాం. చట్టపరంగా విడాకులు ఇంకా మంజూరు కానప్పటికీ మేము మళ్లీ కలిసే అవకాశాలు చాలా తక్కువ. మళ్లీ జంటగా జీవితాన్ని కొనసాగించే అవకాశం, ఆలోచన ఎంత మాత్రం లేదు. మాకంటే ఎక్కువ ప్రేమించుకున్నవాళ్లు, జంటగా కలిసున్నవాళ్లు కూడా విడిపోయిన సంఘటనలు కోకొల్లలు. లోపించిన సఖ్యతమూడేళ్ల క్రితం మేమిద్దరం ప్రేమగానే కలిసిమెలిసున్నాం. కానీ కొంతకాలానికే అంతా రివర్స్ అయిపోయింది. మా మధ్య సఖ్యత లేనప్పుడు కష్టంగా కలిసుండటం కన్నా విడివిడిగా జీవించడమే మంచిది. విదేశాల్లో దంపతులు విడిపోయినా వారి మధ్య స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అది కేరళలోనూ అవలంబిస్తే బాగుంటుంది. ముగ్గురు పిల్లలుఇక్కడ విడిపోయిన జంట మళ్లీ తారసపడ్డారంటే ఒకరిని మరొకరు ఎద్దేవా చేసుకుంటూ అవతలి వారి పరువు తీయడానికే ప్రయత్నిస్తుంటారు. మాకు ముగ్గురు పిల్లలు సంతానం. పెద్దవాడు అమెరికాలో ఐటీ ఇంజనీర్ కాగా రెండో కొడుకు బెంగళూరులో ఉంటున్నాడు. మాకో కూతురుంది. తనకు ఆరోగ్య సమస్యలున్నాయి అని చెప్పుకొచ్చాడు. సీరియల్స్, సినిమాదివంగత నటుడు జగన్నాథ వర్మ కుమారుడే మను వర్మ. మను వర్మ.. కాదమట్టతు కథనార్, పోక్కాలం వరవై, కుంకుమచెప్పు వంటి పలు సీరియల్స్‌లో నటించాడు. అలాగే మమ్ముట్టి 'నీలగిరి', జయరామ్ 'నరనాతు తంపురాన్' సినిమాల్లోనూ తళుక్కుమని మెరిశాడు. సింధు వర్మ విషయానికి వస్తే ఎటో జన్మ కల్పనయిల్, పంచాంగి వంటి సీరియల్స్ చేసింది. మమ్ముట్టి 'సీబీఐ 5: ద బ్రెయిన్', 'అర్థం' చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది.చదవండి: మూడో భార్యగా వస్తావా? నెలకు రూ.11 లక్షలు: నటికి ఆఫర్ -
భర్తను జట్టుపట్టిలాగి, చితక్కొట్టిన భార్య : వైరల్ వీడియో
కర్నాటకలోని ఓ ఫ్యామిలీ కోర్టు ఆవరణలో వింత సంఘటన చోటు చేసుకుంది. చుట్టుపక్కల ప్రజలు చూస్తుండగానే ఒక మహిళ మాజీ భర్తను కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. అయితే ఆమె పదే పదే కొడుతున్నా జుట్టు పట్టిలాగినా, దుర్భాషలాడినా ఎగిరి తన్నినా, నవ్వుతూనే ఉండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. అసలేం జరిగిందంటే.ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆమె భర్తకు ఉద్యోగం లేదు. ఏమైందో ఏమో తెలియదు కానీ విడాకుల కోసం ఇద్దరూ కోర్టుకెక్కారు. విడాకులు మంజూరయ్యాయి. భరణం కోసం కూడా కేసు వేసింది. ఇక్కడే భర్త కపట తెలివితేటల్ని ప్రదర్శించాడు. అయితే విడాకులు మంజూరు అయితే భరణం చెల్లించాల్సి వస్తుందన్న కుట్రతో తన పేరిట ఉన్న ఆస్తులన్నింటిని తన తల్లి పేరు మీదు ముందుగానే బదలాయించేశాడు. ముందు అనుకున్న ప్లాన్ప్రకారమే తనకు ఎలాంటి ఆస్తులు, ఆదాయం లేదు కాబట్టి, భరణం ఇవ్వలేనని వాదించాడు. అతడి వాదనలను విశ్వసించిన కోర్టు భార్యకు షాకిచ్చింది. తనకు భరణం రాకుండా చేశాడనే ఆగ్రహంతో భార్య చేశాడని, కోర్టు బయటే భర్తను కొట్టింది. చెంపలు వాయించేసింది. జుట్టు పట్టుకొని కొట్టింది. దుర్భాషలాండింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే తాను అనుకున్నది సాధించిన అతగాడు మాత్రం ఏదో గొప్ప విజయం సాధించిన వాడిలాగా నవ్వుతూ ఉండటం ఈ వీడియోలో రికార్డైంది.ఇదీ చదవండి: ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యంఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. భర్తనుంచి విడి పోయిన మహిళల దీన పరిస్థితికి ఇది నిదర్శమని నెటిజన్లు కొందరు వ్యాఖ్యానించారు. ఇది అన్యాయం అని మరికొందరు భర్తపై మండిపడ్డారు. మరోవైపు మహిళలకు భరణంపై ఉండే ప్రేమకు ఇది నిదర్శమన కొందరు, దాడి చేసిన దోషిని శిక్షించాలని ఒకరు, ప్లాన్ ఏ ఎదురు దెబ్బ తగిలితే, ప్లాన్ బీ ఏమీ లేనప్పుడు అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి, బళ్లారికి చెందిన టెకీ దుర్మరణంShe took a divorce chasing alimony.The husband had already transferred all his property to his mother’s name — the wife got nothing. 😁After the divorce, the guy is smiling even while getting beaten.On behalf of all men — salute to you! 😂😜pic.twitter.com/YEGociB8Hr— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) December 29, 2025 -
‘నా భర్తపై వేరొకరి కన్ను.. అందుకే నాకు విడాకులు’
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమాద్ వసీం విడాకులు తీసుకున్నాడు. భార్య సానియా అష్ఫక్‌తో వైవాహిక బంధం నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఇమాద్ వసీం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో సానియా అష్ఫక్ సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చింది.నా ముగ్గురు పిల్లలకు తల్లి మాత్రమే ఉందితన భర్తను వేరొకరు పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. అందుకే తమకు విడాకులు అయ్యాయని సానియా ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘తీవ్ర దుఃఖంలో మునిగిపోయి నేను ఈ నోట్ రాస్తున్నాను. నా కాపురం కూలిపోయింది. నా పిల్లలు తండ్రి లేనివాళ్లు అయ్యారు. వాళ్ల నాన్న వారిని విడిచిపెట్టాడు. నా ముగ్గురు పిల్లలకు ఇప్పుడు తల్లి మాత్రమే ఉంది.ఐదు నెలల పసిబిడ్డ.. ఇంత వరకు తండ్రి ఆ పసికందును ఎత్తుకోనేలేదు. ఈ విషయాలన్నీ పంచుకోకూడదు అనే అనుకున్నాను. అయితే, నేను నిశ్శబ్దంగా ఉంటే.. దానిని నా బలహీనత అనుకుంటున్నారు.ప్రతీ ఇంట్లో మాదిరే భార్యాభర్తలుగా మా మధ్య కొన్ని విభేదాలు ఉన్న మాట వాస్తవం. అయినప్పటికీ బంధాన్ని నిలబెట్టుకోవాలని నేను భావించాను. భార్యగా, తల్లిగా నా వంతు పాత్రను చక్కగా పోషించాను. నా కాపురాన్ని నిలబెట్టుకునేందుకు వంద శాతం ప్రయత్నించాను.నా భర్తను వేరొకరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారుకానీ మూడో వ్యక్తి రాకతో నా ఇల్లు ముక్కలైంది. ఆమె నా భర్తను పెళ్లి చేసుకోవాలని భావించింది. అందుకే.. అంతంత మాత్రంగా ఉన్న మా బంధం విచ్ఛిన్నమై విడాకులకు దారితీసింది’’ అని సానియా అష్ఫక్ సోషల్ మీడియా వేదికగా తన బాధను పంచుకుంది.చట్టపరంగా చర్యలు తీసుకుంటాఇందుకు బదులుగా.. ‘‘ప్రతీసారి ఘర్షణ పడేకంటే కూడా విడాకులు తీసుకోవడమే ఉత్తమమని భావించి.. డివోర్స్ కోసం అప్లై చేశాను. ఇక నా పిల్లలు.. నేను ఎప్పటికీ తండ్రినే. వారి బాధ్యత మొత్తం నాదే. ఇలాంటి సమయంలో నా గౌరవం, గోప్యతకు భంగం కలగకుండా సహకరిస్తారని ఆశిస్తున్నా.కొంతమంది తప్పుడు ప్రచారం చేసే పనిలో ఉన్నారు. దయచేసి వారిని నమ్మకండి. నా పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’’ అని ఇమాద్ వసీం పేర్కొన్నాడు. కాగా 37 ఏళ్ల ఇమాద్ వసీం బౌలింగ్ ఆల్‌రౌండర్.పాకిస్తాన్ తరఫున 55 వన్డేలు, 75 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఇమాద్ వసీం.. వన్డేల్లో 986, టీ20లలో 554 పరుగులు చేశాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖాతాలో వన్డేల్లో 44, టీ20లలో 73 వికెట్లు ఉన్నాయి. ఇక 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇమాద్ వసీం.. ప్రస్తుతం ఫ్రాంఛైజీ క్రికెట్లో కొనసాగుతున్నాడు.చదవండి: అలా ప్రేమ పుట్టింది.. ఆస్తి భర్త కంటే వంద రెట్లు ఎక్కువే!.. అయితేనేం.. -
మరో అమ్మాయితో నా భర్త డేటింగ్.. వదిలిపెట్టను : స్టార్ హీరో భార్య
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో గోవిందా, ఆయన భార్య సునీత ఆహుజా విడాకులు తీసుకోబోతున్నారనే వార్త గత కొంతకాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం వీరిద్దరు సపరేట్గా ఉంటున్నారు. కానీ అధికారికంగా విడాకులు అయితే తీసుకోలేదు. కోర్టు ద్వారా గోవిందాకు నోటీసులు అందించారని..త్వరలోనే విడాకులు తీసుకునే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భర్త గోవిందాపై సునీత(Sunita Ahuja) సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తకు మరొక అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని.. డబ్బుల కోసమే ఆమె ఆయనకు దగ్గరైందని ఆరోపించారు.తాజాగా ఆమె ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల రూమర్స్‌పై స్పందించారు. ‘మేమిద్దరం సపరేట్గా ఉంటున్న విషయం నిజమే. గోవిందా(Govinda) మరోక అమ్మాయితో డేటింగ్లో ఉన్నాడు. ఆ అమ్మాయి అతన్ని ప్రేమించడం లేదు.. డబ్బుల కోసమై దగ్గరైంది. ఆమె హీరోయిన్ అయితే కాదు. హీరోయిన్లు ఇతరుల కాపురాల్లో చిచ్చు పెట్టేంత చెడ్డవాళ్లు కాదు’ అని సునీత చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ..గోవింద జీవితంలో ముగ్గురే మహిళలు కీలకంగా ఉండాలని కోరుకున్నాం. ఆమె తల్లి, భార్య, కూతురు.. ఈ ముగ్గురు మహిళలే ఆయన జీవితంలో ఉండాలకున్నాం. కానీ నాలుగో మహిళ రావడం జీర్ణించుకోలేకపోయామని సునీత ఎమోషనల్ అయ్యారు. ఇప్పటికైనా గోవింద తన చుట్టు ఉన్న చెంచాలను వదిలేసి.. వర్క్‌పై ఫోకస్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాగా.. సునీతా అహుజా, గోవిందల పెళ్లి 1987లో జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు యశ్, కూతురు పేరు టీనా. గత ఏడాదిగా వీరిద్దరు వేరు వేరుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విడాకుల రూమర్స్ వినిపిస్తున్నా.సునిత మాత్రం గోవిందా ఎప్పటికీ తనవాడే అని.. వదిలేసే ప్రసక్తే లేదన్నారు. -
దారి కాచి మరీ భువనేశ్వరిని కాల్చి చంపిన భర్త
నీతో కలిసి జీవించలేను విడాకులు ఇవ్వమని నోటీసులిచ్చిన భార్యను అత్యంత దారుణంగా కాల్చి చంపాడో భర్త. వైవాహిక విభేదాలతో ఆమె భర్తను విడాకులు అడిగింది. అదే ఆమె చేసిన నేరం. బెంగళూరులోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.బాధితురాలిని భువనేశ్వరి (39)గా గుర్తించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బసవేశ్వర నగర్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఈమె భర్త, నిందితుడు బాలమురుగన్ (40) ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఒక పనిచేసేవాడు. వీళ్లిద్దరూ తమిళనాడులోని సేలం జిల్లాకు చెందినవారు. వీరికి 2011లో వివాహమైంది. 2018లో బెంగళూరుకు మకాం మార్చారు. వీరికిద్దరు సంతానం. అయితే గత నాలుగేళ్లుగా బాలమురుగన్‌కు ఉద్యోగం లేదు. నెమ్మదిగా తగాదాలు మొదలయ్యాయి. దీంతో భార్యపై అనుమానం మొదలైంది. భువనేశ్వరి చట్టబద్ధంగా విడిపోవాలని కోరింది, దానిని బాల మురుగన్ వ్యతిరేకించాడు దీంతో వేరే బ్రాంచ్‌కు ఉద్యోగాన్ని బదిలీ చేయించుకున్న భువనేశ్వరి గత ఏడాదికాలంగా 12 ఏళ్ల కొడుకు, ఎనిమిదేళ్ల కూతురితో కలిసి రాజాజీ నగర్లో వేరుగా నివాసముంటోంది. బాలమురుగన్ కేపీ అగ్రహారలో ఒంటరిగా ఉంటున్నాడు. వారం రోజుల క్రితం భువనేశ్వరి బాలమురుగన్‌కు విడాకుల నోటీసు పంపింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్అటు ఉద్యోగం లేదు, ఇటు భార్యతో గొడవలు, అనుమానం, విడాకుల నోటీసులు దీంతో భార్యపై ఆగ్రహం పెంచుకున్న బాలమురుగన్ ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం పన్నారు. భార్య కదలికలను పసిగట్టి, సరిగ్గా ఆమె ఆఫీసునుంచి ఇంటికి వచ్చే సమయంలో కాపుగాసి ఆమెను అడ్డుకున్నాడు. మంగళవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో, రాజాజీనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని 1వ ప్రధాన రోడ్డులో చాలా సమీపంనుంచి ఆమెపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పిస్టల్‌తో సహా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.హొయసల పెట్రోల్ సిబ్బంది గాయపడిన భువనేశ్వరిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అప్పటికేఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా వినిపించిన కాల్పులను భయాందోళనలు రేకెత్తించాయి. జనం పరుగులు తీశారు. రెండు బుల్లెట్లు భువనేశ్వరి తలపై దూసుకుపోగా, మిగిలిన రెండు బుల్లెట్లు ఆమె చేతికి తగిలాయి. నిందితుడు తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించాడని, ఇదే గొడవలకు దారితీసిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని, అతనికి ఆయుధం ఎలా వచ్చింది, దానికి లైసెన్స్ ఉందా? తదితర వివరాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
పెళ్లైన లెక్చరర్ మాయలో 19 ఏళ్ల కూతురు..!
మా అమ్మాయికి నాలుగేళ్ల వయసున్నప్పుడు నా భార్య చనిపోయింది. అప్పటినుంచి అన్నీ నేనే అయి మా అమ్మాయిని గారాబంగా పెంచుకున్నాను. ఇప్పుడు మా అమ్మాయికి 19 ఏళ్లు. హైదరాబాద్‌లో హాస్టల్లో ఉంటూ ఇంజినీరింగ్ చేస్తోంది. అక్కడ తను చదువుకునే కాలేజీ లెక్చరర్‌తో రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉందని, ఆ లెక్చరర్‌కి ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారని, అతను తన భార్యకు విడాకులు ఇచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడని తెలిసింది. అంతేకాదు, నేను కనక తన మాట కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని చెబుతోందని కూడా తెలిసింది. నాకు నా కూతురు తప్ప వేరే లోకం లేదు. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా చెప్పగలరు.– రామరాజు, భీమవరంమీ సమస్య చదువుతుంటే మనసు కలచి వేస్తోంది. మీరు వయసులో ఉన్నప్పుడే భార్య చనిపోయినా మళ్లీ పెళ్లి చేసుకోకుండా మీ కూతురే ప్రపంచంగా బతికారు. అలాంటి అమ్మాయి ఈ రోజు ఇలా ప్రవర్తిస్తుంటే జీర్ణించుకోవడం కష్టమే. అయితే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇటువంటి సందర్భాలలో మీరు భావోద్వేగానికి లోనై అమ్మాయి మీద అరవడం, కోప్పడి మీవైపు లాక్కోవాలనుకోవడం సరైన పద్ధతి కాదు. మీరు ఎంత బలంగా తనని మీవైపు లాక్కోవాలనుకంటే తను అంతకన్నా బలంగా మీకు దూరంగా జరిగే ప్రమాదం ఉంది. ఆ వయసులో ఆకర్షణలు, ప్రేమ భావాలు సహజం. కానీ ఇప్పటికే వివాహమై, కుటుంబ బాధ్యతలతో ఉన్న వ్యక్తితో జీవితం ప్రారంభించాలనుకోవడం ఆమె అపరిపక్వతను సూచిస్తుంది. మందుగా మీ కుమార్తెను నిందించకుండా ఒత్తిడి లేకుండా ఫ్రశాంతంగా మాట్లాడండి. ఆమెను మీరు అర్థం చేసుకున్నారు అన్న భావన కలిగేలా నెమ్మదిగా విషయాలను వివరించండి. సాధ్యమైనంత వరకు మూడోవ్యక్తి ద్వారా ప్రాఫెషనల్ కౌన్సెలింగ్ చేయించడం మంచిది. క్లినికల్ సైకాలజిస్టులు ఎలాంటి పక్షపాతం లేకుండా వాస్తవాలు చూపించి ఆమెకు స్వతంత్రంగా ఆలోచించడానికి దారి చూపగలరు. అదే సమయంలో మీరు మీ అమ్మాయి ప్రేమించిన వ్యక్తి చెడ్డవాడని ఆమెతో పదే పదే అనడం వల్ల ఆమె మిమ్మల్ని అ΄ార్థం చేసుకుని మీకు మరింత దూరం అవుతుంది. వీలయితే ఆ కాలేజీ యాజమాన్యంతో మాట్లాడండి. ఒకవైపు ఇవన్నీ చేస్తూనే మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. తను ఆత్మహత్య ఆలోచనలు చేస్తోంది కాబట్టి అసలు ఒంటరిగా వదలకండి. జీవితంలో ఒకోసారి అన్ని సమస్యలకు పరిష్కారాలు మన చేతిలో ఉండచకపోవచ్చు. కాలాన్ని మించిన వైద్యుడు, అనుభవాన్ని మించిన గురువు లేడనే సత్యాన్ని గ్రహించండి. మనసు కవి ఆత్రేయ గారన్నట్టు ‘‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలే దని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని’’ అన్న తాత్త్విక ధోరణి ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరి అనిపిస్తుంది. మీరు మనసు గట్టి చేసుకుని ధైర్యంగా ఉండండి. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
విడాకులపై ఢిల్లీ హైకోర్టులో కీలక తీర్పు
పరస్పర అంగీకారంతో విడాకులపై (Mutual Consent Divorce) ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కీలక తీర్పునిచ్చింది. విడాకుల కోసం మొదటి మోషన్ దాఖలు చేయడానికి ఒక సంవత్సరం విడిగా జీవించాల్సిన షరతు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ కాలాన్ని సెక్షన్ 14(1) ప్రొవైజో ఆధారంగా కోర్టు (ఫ్యామిలీ కోర్టు లేదా హైకోర్టు) మాఫీ చేయవచ్చని తెలిపింది.అలాగే, ఆరు నెలల కూలింగ్-ఆఫ్ పీరియడ్ (ఫస్ట్ మోషన్ – సెకండ్ మోషన్ మధ్య) కూడా స్వతంత్రంగా మాఫీ చేయవచ్చని పేర్కొంది. విడాకులు కోరుతున్న దంపతులను బలవంతంగా వివాహ బంధంలో ఉంచడం కోర్టు ధర్మం కాదని వెల్లడించింది.ఇలా చేయడం విడిపోవాలని నిశ్చయించుకున్న వారి ఆత్మగౌరవం మరియు స్వేచ్ఛకు విరుద్ధవుతుందని వ్యాఖ్యానించింది. శిక్షా కుమారి వర్సెస్ సంతోష్ కుమార్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఫుల్ బెంచ్ (జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ అనూప్ జైరామ్ భంభాని, జస్టిస్ రేణు భట్నాగర్) ఈ తీర్పు వెలువరించింది. -
ఫస్ట్ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులు
పెళ్లయిన మూడు రోజులకే నవ వధువు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తర ప్రదేశ్‌లో గోరఖపూర్‌లో ఈ ఘటన జరిగింది. శారీరకంగా అసమర్థుడైన వ్యక్తితో తాను జీవితాన్ని గడపలేను అంటూ కొత్త పెళ్లికూతురు లీగల్ నోటీసు పంపించింది.వరుడు సహజన్వాలోని రైతు కుటుంబానికి చెందిన ఏకైక కుమారుడు. వయస్సు 25. జిఐడిఎలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బేలియాపర్లోని బంధువుల ద్వారా ఈ వివాహం నిశ్చయమైంది. బంధు మిత్రులు సమక్షంలో నవంబర్ 28న వీరి వివాహం జరగింది. సాంప్రదాయం ప్రకారం మరుసటి రోజు అత్తవారింటికి సాగనంపారు. సాధారణంగా పెళ్ళిళ్లలో జరిగే తంతు ప్రకారం డిసెంబర్ 1న మూడో రోజు ఫస్ట్ నైట్ కార్యక్రమానికి ముహర్తం పెట్టారు. కానీ ఆ రాత్రే ఆమెకు చేదు అనుభవాన్ని మిగిలుస్తుందని ఆమె ఊహించి ఉండదు. పెళ్లయిన మొదటి రాత్రి కోటి ఆశలతో గదిలోకి అడుగుపెట్టిన ఆమెకు స్వయంగా భర్తే బాంబు పేల్చాడు. తాను వైవాహిక సంబంధాలకు శారీరకంగా అసమర్థుడిని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో ఆమె హతాశురాలైంది. తరువాత ఇంట్లోని పెద్దలకు అసలు విషయం చెప్పింది. వెంటనే ఆమెను తిరిగి పుట్టింటికి తీసుకువచ్చారు. క్షణం ఆలస్యం చేయకుండా లీగల్ నోటీసు పంపింది.డిసెంబర్ 3న బేలియాపర్లో ఇరుపక్షాలు కలుసుకున్నాయి. వరుడి పరిస్థితిని దాచిపెట్టారని వధువు కుటుంబం ఆరోపించింది. అంతే కాదు ఇది అతని రెండవ విఫల వివాహమని, రెండేళ్ల క్రితం మొదటి వధువు నెల రోజుల్లోనే విడిచిపెట్టి వెళ్లిపోయిందని కూడా వారు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలుఇరుపక్షాల సమ్మతితో, వరుడికి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు అతడు శారీరంగా అసమర్థుడని, "తండ్రి కాలేడు" అనివైద్యపరీక్షలు కూడా నిర్ధారించాయి. దీంతో పెళ్లి బహుమతులు ఖర్చులన్నింటినీ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీన్ని వారు తిరస్కరిండంతో వధువు కుటుంబం సహజన్వా పోలీసులను ఆశ్రయించి, అన్ని బహుమతులు మరియు నగదును తిరిగి ఇవ్వాలని కోరింది. పోలీసుల జోక్యంతో, ఇరు పక్షాల మధ్య రాజీ కుదిరింది. వరుడి కుటుంబం రూ. 7 లక్షలు, అన్ని పెళ్లి బహుమతులను ఒక నెలలోగా తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది. బంధువుల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారని సహజన్వా ఎస్హెచ్ఓ మహేష్ చౌబే వెల్లడించారు.ఇదీ చదవండి: ఇండిగో బాధితులకు స్వల్ప ఊరట,ఆఫర్ ఏంటంటే.. -
ఉల్లి, వెల్లుల్లి తెచ్చిన తంటా, 11 ఏళ్ల బంధానికి స్వస్తి
ఆరోజు గుజరాత్ హైకోర్టు గది నిశ్శబ్దంగా ఉంది.. కానీ అక్కడున్న ప్రతి ఒక్కరి చెవుల్లో రెండు పేర్లే మారుమోగుతున్నాయి.. అవి ఉల్లి, వెల్లుల్లి. దశాబ్దానికి పైగా సాగిన వైవాహిక బంధం, విడాకులకు దారి తీయడానికి కారణం ఈ రెండు వంట గది పదార్థాలే అంటే ఎవరైనా నమ్ముతారా?.. వంట గదిలో మొదలైన ఈ ’ఘాటైన’ పోరు, దశాబ్దానికి పైగా సాగిన బంధానికి విడాకులతో తెరదించింది. 2002లో ఒక్కటైన ఓ జంటకు.. అప్పటి వరకూ తమ భోజన అలవాట్లలోని తేడా ఒక సమస్యగా అనిపించలేదు. భార్య స్వామినారాయణ్ భక్తురాలు కావడంతో, మత నిబంధనల ప్రకారం ఉల్లి, వెల్లుల్లిని దూరంగా ఉంచేది. కానీ, భర్త, అత్తగారు మాత్రం వాటిని యథావిధిగా తీసుకునేవారు. మెల్లగా.. ఈ ’రుచుల’ తేడా వారి బంధంలో చిచ్చు పెట్టింది. ఆలుమగల బంధంలో చీలిక తెచ్చింది. ఇంట్లో వేర్వేరుగా వంట చేసు కోవడం సర్వసాధారణమైంది. దాంతో ఆ ఇంట్లో ఆనందానికి బదులు అశాంతి పెరగడం మొదలైంది. అది ఉద్రిక్తతకు దారితీయడంతో భార్య బిడ్డను తీసుకుని అత్తారింటిని వీడింది. 2013లో భర్త ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేస్తూ, ఆమె రాజీ పడకపోవడం క్రూరత్వమని వాదించాడు. సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత, 2024లో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భర్త భార్యకు భరణం చెల్లించాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ భార్య గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులో జరిగిన విచారణలో భార్య తరపు న్యాయవాది వాదిస్తూ.. మతపరమైన ఆహార నియమాలను భర్త పట్టించుకోకుండా, వాటి ప్రభావాన్ని పెంచి చూపారని వాదించారు. కాగా, తాము, తమ తల్లి ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఉల్లి, వెల్లుల్లి లేని వంటలు వండి పెట్టినా.. ఆమె వైఖరి మారలేదని, అందుకే సమస్య కొనసాగిందని భర్త వివరించారు. ఒకానొక దశలో ఉద్రిక్తత కారణంగా ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానని తెలిపారు. ఇదీ చదవండి: పెళ్లి వేడుకలో అపశృతి : ఒక్కసారిగా కూలిన పైకప్పుపదకొండేళ్ల బంధానికి బీటలు ఒక చిన్న ఆహారపు అలవాటు..వ్యక్తిగత నమ్మకంగా మొదలై, రెండు కుటుంబాలను విడదీసింది. చివరికి, దశాబ్దానికి పైగా సాగిన బంధం.. శూన్యమైన అంగీకారంతో ముగిసింది. ఆ రోజు కోర్టు గదిలో ఒక్కసారిగా ఉద్వేగం అలముకుంది. అర్థంపర్థం లేని పోరాటంతో ఇద్దరు దంపతులు కోల్పోయిన 11 ఏళ్ల విలువైన జీవితం.. అక్కడున్న వారి మనసుల్ని భారంగా మార్చింది. విడాకులకు సరే.. అయితే, హైకోర్టులో వాదనల సందర్భంగా భార్య అనూహ్యనిర్ణయం తీసుకుంది. తాను విడాకులను వ్యతిరేకించడం లేదని కోర్టుకు తెలియజేసింది. దాంతో భర్త కూడా..చెల్లించాల్సిన భరణం మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో.. కోర్టులో జమ చేయడానికి అంగీకరించారు. దంపతుల మధ్య పరస్పర అంగీకారం కుదరడంతో, హైకోర్టు భార్య పిటిషన్‌ను కొట్టివేసింది.ఫ్యామిలీ కోర్టిచ్చిన విడాకుల ఉత్తర్వును సమర్థించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విదేశాలలో తీసుకున్న డివోర్స్ భారత్‌లో చెల్లుతుందా..?
నేను గత 8 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాను. ఇక్కడే కలిసిన ఒక అమ్మాయిని ఇండియాకు వచ్చి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాను. కోవిడ్ సమయంలో నాకు–తనకు మనస్పర్ధలు రావడంతో ఒక సంవత్సరం ప్రయత్నం చేసి విడిపోవాలి అనుకున్నాము. అయితే ఈలోగా తను అమెరికాలోనే డివోర్స్ కోసం దాఖలు చేసుకుంది. నేను కూడా నా వాదనలు వినిపించాను, డివోర్స్‌కు అంగీకరించాను. అమెరికా కోర్టు డివోర్స్ మంజూరు చేసింది. అందులో భాగంగానే మాకు ఉన్న ఆస్తులను, అప్పులను కూడా అమెరికా కోర్టు పంచి ఇచ్చింది. అదే సమయంలో నేను ఇండియాలోని ఒక లాయర్‌ను సంప్రదించగా అమెరికా డివోర్స్ భారతదేశంలో చెల్లవు అని హైదరాబాదులో కూడా 13(1)కింద డివోర్స్‌కు పిటిషన్ వేయించారు. నేను పిటిషన్ వేసిన తర్వాత అమెరికాలో డివోర్స్ వచ్చింది. ఇప్పుడు నా మాజీ భార్య మరలా హైదరాబాద్ కోర్టు ముందుకు వచ్చి (జీపీఏ ద్వారా) నా డివోర్స్ పిటిషన్ కొట్టి వేయాలని కోరుతూ, భారీగా భరణం కూడా డిమాండ్ చేస్తోంది. అంతేకాక, ఒకపక్క డివోర్స్ వేసి మరోపక్క నా మీద, నా కుటుంబం మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టి నానా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పుడు మేము విడిపోయినట్లేనా? లేక ఇంకా డివోర్స్ తీసుకోవాలా? దయచేసి వివరించగలరు. – మద్దెల శేఖర్, హైదరాబాద్మీ కేసు వివరాలు బాధాకరంగా ఉన్నాయి. విదేశాలలో తీసుకున్న డివోర్స్ కానీ, మరేదైనా కోర్టు తీర్పు గాని భారతదేశంలో చెల్లుతుందా లేదా అనే విషయాన్ని సివిల్ కోడ్ లోని సెక్షన్ 13 నిర్ణయిస్తుంది. మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే ఆవిడే డివోర్స్ కేసు వేసి, గృహహింస ఆరోపణలు చేసి, అందులో మీరు పాల్గొన్నాక అమెరికా కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి, ఆ తీర్పు భారతదేశంలో ఖచ్చితంగా చెల్లుతుంది. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ ఎన్నో హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాలలో ఫారిన్ డివోర్స్ ఆర్డర్లు ఇండియాలో ఏ పరిణామాలలో చెల్లుతాయో, ఎటువంటి పరిణామాలలో చెల్లవో వివరిస్తూ చాలా సుదీర్ఘమైన జడ్జిమెంట్లను ఇచ్చాయి. నిజానికి మీరు ఇండియాలో మరొకసారి డివోర్స్ కేసు వేయవలసిన అవసరం కూడా లేదు. కేవలం అమెరికా డివోర్స్ను ధ్రువీకరించుకోవడానికి భారతదేశ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసుకుంటే సరిపోతుంది. అక్కడ డివోర్స్ తీసుకుని మరీ ఇక్కడ మీరు వేసిన డివోర్స్ డిస్మిస్ చేయాలి అనే తన ధోరణిని కోర్టు సమర్థించదు. ఇప్పటికయినా మించిపోయింది లేదు. సరైన న్యాయ సలహా తీసుకొని (అవసరమైతే మీరు వేసిన డివోర్స్ విత్ డ్రా చేసుకొని మరీ) ఫారిన్ డివోర్స్ ఆర్డరు ధ్రువీకరణకు పిటిషన్ దాఖలు చేసుకోండి. మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద పెట్టిన క్రిమినల్ కేసులు కూడా కోర్టు కొట్టేసే ఆస్కారాలే ఎక్కువ! ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తే హైకోర్టును కూడా మీరు ఆశ్రయించవచ్చు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత మాత్రమే ఎలాంటి చర్య తీసుకోవాలనేదీ అర్థమవుతుంది కనుక, పత్రాలు అన్నీ తీసుకుని ఎవరైనా నిపుణులైన అడ్వొకేట్‌ను కలిస్తే మంచిది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )(చదవండి: జేఈఈ ప్రిపరేషన్ నుంచి రాష్ట్రపతి మెడల్ వరకు..! ఎన్డీఏ చరిత్రలో సరికొత్త మైలు రాయి..) -
సమంత రెండో పెళ్లి.. నాగచైతన్య పాత వీడియో వైరల్
డేటింగ్ వార్తలకు తెరదించుతూ సమంత- రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో ఉన్న లింగభైరవి దేవి సన్నిధిలో యోగ సంప్రదాయం ప్రకారం ‘భూత శుద్ధి వివాహం’ ద్వారా సామ్-రాజ్ ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. అటు సామ్(Samantha)కి, ఇటు రాజ్‌కి ఇది రెండో పెళ్లి. 2017లో సమంత.. నాగ చైతన్య(Naga Chaitanya)ను ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత 2021లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకున్నప్పటికీ.. సామ్ మాత్రం ఒంటరిగా ఉంది. రాజ్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చినా.. ఆమె స్పందించలేదు. ఇప్పుడు సడెన్‌గా పెళ్లి చేసుకొని అందరికి షాకిచ్చింది. (చదవండి: సమంత రెండో పెళ్లి.. అలా చేసుకున్న స్టార్ హీరోయిన్స్ వీళ్లే..!)ఇదిలా ఉంటే.. సామ్ పెళ్లి చేసుకున్న ఫోటోలు బయటకు రాగానే.. సోషల్ మీడియా నాగచైతన్యకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. గతంలో ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చైతన్య విడాకుల విషయంపై ఎమోషనల్‌గా మాట్లాడారు.‘నా జీవితంలో ఏదైనా జరిగింది(విడాకులు).. అలా చాలా మంది జీవితాల్లో కూడా జరిగింది. కానీ నన్ను ఒక్కడినే క్రిమినల్‌గా ఎందుకు చూస్తున్నారో అర్థం కాలేదు. మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం.ఈ విడాకుల బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుండే బ్రోకెన్ ఫ్యామిలీ నుండి వచ్చాను. అందుకే ఒక బంధాన్ని బ్రేక్ చేసుకునే సమయంలో ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించాను. వెయ్యి సార్లు ఆలోచించాకే ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం. ఆ సమయంలో మాకు ప్రైవసీ ఇవ్వాలి అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు అది హెడ్ లైన్‌గా అయిపోయి.. గాసిప్లా మార్చేసి.. చివరకు ఆ టాపిక్‌ని ఒక ఎంటర్టైన్మెంట్లా మార్చేశారు. నేను చాలా సార్లు ఆలోచించాను. బయటకు వచ్చి దాని గురించి మాట్లాడితే.. దాని మీద కూడా ఇంకొన్ని ఆర్టికల్స్ పుడతాయి. అందుకే మాట్లాడలేదు. రాసేవాళ్లే దీనికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలి’ అని చైతూ చెప్పుకొచ్చాడు. The moment he's speaking with a well-disciplined expression I'm came here from a broken family, Naaku thelusu aa pain ento.Hatts off to your Maturity levels 📈 #NagaChaitanya ❤️🩹🛐 pic.twitter.com/8aYYqCU9HX— Amoxicillin (@__Amoxicillin_) December 1, 2025 -
పేరులో ఏముంది? విడాకుల వరకూ తీసుకెళ్లింది
కసి ఉండటానికి కారణాలు అవసరం లేదు కానీ, విడిపోవడానికి చాలా వెతుక్కోవచ్చు. తమ పిల్లాడికి పేరు పెట్టే విషయంలో ఏకాభిప్రాయం లేక చైనాలో ఓ జంట విడాకుల కోసం కోర్టుకెక్కింది. షాంఘైలోని పుడాంగ్ న్యూ ఏరియాలో ఓ జంటకు 2023లో వివాహమైంది. మరుసటి ఏడాది బాబుకు జన్మనిచ్చారు. అయితే, ఆ పిల్లాడి నామకరణం పెద్ద రణంగా మారింది. నేను చెప్పిన పేరే పెట్టాలని ఇరువురూ పట్టుబట్టారు. చివరకు కలిసి ఉండలేం అని కోర్టుకెక్కారు. కేసు పూర్వాపరాలు చూసిన న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. బాబుకు ఏడాది వయసు దాటినా ఇంకా జనన ధ్రువీకరణ పత్రం లేకపోవడం, పేరు పెట్టకపోవడం వల్ల టీకాలు వేయడానికీ కుదరకపోవడం మైనర్ హక్కుల ఉల్లంఘనే అని హెచ్చరించారు. భావోద్వేగ సంఘర్షణలలో పిల్లలను బేరసారాలుగా ఉపయోగించకూడదని మందలించారు. నిర్దిష్ట కాలవ్యవధిలోగా పేరు పెట్టే విషయంలో ఏకాభిప్రాయానికి రావాల్సిందేనని చెకప్పారు. ఈ కేసు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పేరులో ఏముంది అని అంటారు.. కానీ ఎంత ఉందో చూశారా? -
పేరు మారిస్తే.. ఫేట్ మారుద్ది!
ఇది కూడా పేరు తెచ్చిన ప్రాబ్లమే. అక్కడ పిల్లాడి పేరు అయితే, ఇక్కడ భార్య పేరు.. అంతే తేడా. ఓ వ్యక్తి తన భార్య పేరును ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో ‘చబ్బీ’అని సేవ్ చేసినందుకు ఆమె విడాకులు తీసుకుంది. తుర్కియేలోని ఉసక్ నగరానికి చెందిన భార్యాభర్తల మధ్య ఈ పేరు పంచాయితీ వచ్చింది. భర్త ఆమె పేరును తన ఫోన్లో ‘టొంబెక్’అని సేవ్ చేసుకున్నాడు. అంటే చబ్బీ(బొద్దుగా) అని అర్థం. ఇది చూసిన ఆమె భర్తపై తీవ్రంగా మండిపడి విడాకుల కోసం కోర్టుకెళ్లింది. తన పేరు అలా పెట్టుకోవడం తీవ్ర అవమానకరమని, ఇక అతడితో కలిసి ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. వాదనలు విన్న న్యాయమూర్తి.. వారికి విడాకులు ఇవ్వడంతోపాటు ఆమె మానసిక క్షోభకు పరిహారం చెల్లించాలని అతడిని ఆదేశిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థంచగా.. మరికొందరు చబ్బీ అని ముద్దుగా పెట్టుకున్నాడేమో అని జాలిపడ్డారు. చూశారా.. పేరులో ఎంతుందో? భర్తలూ.. జర భద్రం మరి..! -
నా భర్తొక నార్సిసిస్ట్, తీవ్ర హింస, రూ. 50 కోట్లు చెల్లించాలి: మాజీ మిస్ ఇండియా
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ రన్నరప్ సెలీనా జైట్లీ (Celina Jaitly) విడాకులకు సిద్దమైంది. భర్త పీటర్ హాగ్ (Peter Haag-48)పై గృహ హింస కేసు దాఖలు చేసి, అతని వల్ల కోల్పోయిన ఆదాయం రూ. 50 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు నవంబర్ 21న ముంబై కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆస్ట్రియన్ వ్యాపారవేత్త అయిన హాగ్ కు నోటీసు జారీ అయినట్టు తెలుస్తోంది.తన భర్త తనను తాను గొప్పగా ఊహించుకుంటాడని (నార్సిసిస్ట్), స్వార్థపరుడని సెలీనా ఆరోపించారు. పిల్లల పట్ల ప్రేమలేదని తన పిటిషన్లో పేర్కొన్నారు. తనను తీవ్ర భావోద్వేగ, శారీరక, లైంగికంగా వేధింపులకు గురిచేశాడని తెలిపారు. అంతేకాదు ఆస్ట్రియాలో విడాకుల కోసం దాఖలు చేశాడని కూడా ఆమె ఆరోపించింది. ఈ కారణంగానే తాను ఇంట్లోనుంచి పారిపోయి భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.ఈ నేపథ్యంలోనే సెలీనా తనకు నెలకు రూ. 10 లక్షల భరణం కోరింది. ముంబైలోని తన నివాసంలోకి ప్రవేశించకుండా అతడిని నిరోధించాలని కోర్టును అభ్యర్థించింది. ప్రస్తుతం ఆస్ట్రియాలో హాగ్‌తో నివసిస్తున్న వారి ముగ్గురు పిల్లల కస్టడీ కూడా తనకు రావాలని పిటిషన్లో కోరింది. పిల్లలు పుట్టిన తరువాత ఏదో ఒక సాకుతో తనను పనిచేసుకోనీయకుండా అడ్డుపడ్డాడని.. తన ఆర్థిక స్వేచ్ఛను, గౌరవాన్ని హరించాడని ఆరోపించింది. అప్పుడప్పుడు చిన్న, చిన్న ప్రాజెక్టులను మాత్రమే చేయగలిగానని వెల్లడించింది.ఇదీ చదవండి: లైంగిక సమస్య : లోన్ తీసుకుని మరీ రూ. 48 లక్షలు, కట్ చేస్తే!కాగా, 2010లో నటి సెలినా జైట్లీ హగ్‌ను పెళ్లాడింది. వీరికి విన్స్టన్, విరాజ్, ఆర్థర్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. మార్చి 2012లో మగపిల్లలు (ట్విన్స్) పుట్టారు. తిరిగి ఏదేళ్ల తరువాత మళ్లీ ఇద్దరు కవల అబ్బాయిలకు జన్మనిచ్చింది, వారిలో ఒకరు హైపోప్లాస్టిక్ గుండె కారణంగా మరణించారు. మాజీ మిస్ ఇండియా చమిస్ యూనివర్స్ రన్నరప్‌గా నిలిచిన సెలీనా.. నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, మనీ హై తో హనీ హై, గోల్మాల్ రిటర్న్స్, థాంక్యూ లాంటి సినిమాలతో పాపులర్ అయింది. మరోవైపు గత వివాహ వార్షికోత్సవం సందర్భంగా హాగ్ కోసం సోషల్ మీడియాలో సుదీర్ఘమైన రొమాంటిక్ పోస్ట్ కూడా పెట్టింది. ఇంతలోనే ఈ విడాకుల వార్త అభిమానుల్లో అందోళన రేపింది. -
ఇదెక్కడి దురాచారం?
న్యూఢిల్లీ: ఇస్లాం మతాచారం ప్రకారం భర్త నెలకోసారి చొప్పున తలాక్ చెబుతూ మూడు నెలల వ్యవధిలో భార్యకు విడాకులిచ్చే తలాక్ ఏ హసన్ పద్ధతిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. దాని రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి నివేదించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇలాంటి విడాకుల పద్ధతిని నాగరిక సమాజం అంగీకరించడం సహేతుకమేనా అంటూ పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఇస్లాంలో ఎన్ని విడా కుల పద్ధతులు ఉన్నదీ లిఖితపూర్వకంగా తమకు కూలంకషంగా వివరించాల్సిందిగా ఇరు పక్షాలకూ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ‘మేమేదో ఒక ప్రబలమైన మతాచారాన్ని రద్దు చేయబో తున్నామని భావించరాదు. కానీ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే తలాక్ ఏ హసన్ వంటి దురాచారాలను సరిదిద్దేందుకు కోర్టులు తప్పక జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది‘ అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.ఇదేం దుస్థితి?తలక్ ఏ హసన్ బాధితురాలైన బేనజీర్ హీనా అనే ఢిల్లీకి చెందిన పాత్రికేయురాలు ఈ సందర్భంగా తన వాదనను స్వయంగా ధర్మాసనానికి వినిపించారు. ‘ఈ పద్ధతిలో భర్త నేరుగా భార్యకు తలాక్ చెప్పే పని కూడా లేదు. ఆయన తరఫు లాయర్, లేదా మరే ఇతర వ్యక్తి అయినా భార్యకు నెలకోసారి తలాక్ చెప్పవచ్చు. దేశ రాజధానిలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే ఇక మారుమూల ప్రాంతాలకు చెందిన ముస్లిం మహిళలు ఇలాంటి దురాచారాలకు ఇంకెంతగా బలవుతున్నదీ అర్థం చేసుకోవచ్చు‘ అని ఆవేదన వెలిబుచ్చారు. ఆమె మాజీ భర్త తరఫు లాయర్ తలాక్ ఏ హసన్ ను సమర్థిస్తూ వాదనలు వినిపించబోగా జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఏ విధంగా చూసినా ఇదసలు మహిళల గౌరవాన్ని కాపాడే చర్యేనా? 2025లో కూడా ఇలాంటి వాటిని అనుమతించడం ఏ మేరకు సబబు? వీటిని మీరెలా సమర్థిస్తారు?‘ అని ప్రశ్నించారు. ‘తలాక్ కోసం లాయర్ ను సంప్రదించగలిగిన వ్యక్తి, అదే విషయమై నేరుగా భార్యతో మాట్లాడేందుకు ఇబ్బందేమిటన్నది అర్థం కావడం లేదు. ఇకముందు బహుశా లాయర్లే విడాకులు ఇచ్చేస్తారు కాబోలు!‘ అంటూ దుయ్యబట్టారు. ‘తన హక్కుల కోసం కోర్టు మెట్లెక్కిన హీనా ధైర్యానికి సెల్యూట్. తనో జర్నలిస్టు గనుక ఇక్కడిదాకా రాగలిగింది. అంతటి అవగాహన, వెసులుబాటు లేని పేద, అణగారిన ముస్లిం మహిళల పరిస్థితి ఏమిటి? ఇలాంటి అన్యాయపు మతాచారాలకు మౌనంగా బలి కావాల్సిందేనా?‘ అంటూ ఆవేదన వెలి బుచ్చారు. తర్వాతి విచారణకు మాజీ భర్త హాజర య్యేలా చూడాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఇస్లాంలో అత్యంత ప్రబలంగా ఉన్న ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని 2917లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇవ్వడం తెలిసిందే. -
విడాకుల వార్తలు.. స్పందించిన ప్రముఖ బుల్లితెర నటి!
ఈ రోజుల్లో విడాకులు అనే పదం కామన్ అయిపోయింది. కొందరైతే చిన్న చిన్న కారణాలకే బైబై..టాటా చెప్పేస్తున్నారు. విడాకులు అనేది కేవలం ఒక్క సినీ ఇండస్ట్రీకే కాదు.. సామాన్యుల్లోనూ ఇలాంటి పరిస్థితులు సాధారణమైపోయాయి. కాకపోతే సినిమా వాళ్లకు సంబంధించి ఎక్కువగా ఇలాంటివి వినిపిస్తుంటాయి. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి ఐశ్వర్య శర్మపై విడాకులు తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. తన భర్త నీల్ భట్‌తో ఆమె త్వరలోనే విడిపోతున్నట్లు పలు కథనాలు వెలువడ్డాయి.దీంతో తనపై వస్తున్న విడాకుల వార్తలపై బుల్లితెర నటి స్పందించింది. నా జీవితం గురించి వాస్తవాలు తెలియకుండా ఎలా పడితే అలా రాస్తున్నారని మండిపడింది. ఈ వార్తలను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకు నిశ్చితార్థం నుంచే ఇలాంటి ట్రోల్స్ వస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తన గురించి ప్రచారంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది.ఐశ్వర్య శర్మ ఇన్‌స్టాలో రాస్తూ.. "ప్రజలు నా జీవితం గురించి ఒక్క వాస్తవం కూడా తెలియకుండానే అంచనా వేస్తున్నారు. కర్మ అనేది ఒకటుంది కదా. ఏదైనా నమ్మే ముందు నాతో పనిచేసిన వారిని, నా సహ నటులను, నిర్మాతలను నా గురించి అడగండి. సెట్లో ఎవరినైనా ఎప్పుడైనా బెదిరించడం.. అగౌరవపరిచడం చేశానేమో చెప్తారు. సెట్లో కేవలం నా పనిపైనే శ్రద్ధపెడతా. ఇక్కడ నేను బెదిరింపులకు గురవుతున్నానని ఎవరూ చెప్పరు. అది అందరికీ ఎందుకు కనిపించదు? నా నిశ్చితార్థం అయినప్పటి నుంచి ట్రోలింగ్‌కు గురవుతున్నా. అయినా వాటిని చిరునవ్వుతోనే అంగీకరించా. కానీ ఎవరూ దాని గురించి మాట్లాడరు. నేను మాట్లాడే ప్రతిసారీ వక్రీకరించి వ్యూస్ కోసం నా పేరును ఉపయోగిస్తారు. కానీ మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు.. నేను నెగెటివ్‌ను ప్రోత్సహించకూడదని నిర్ణయించుకున్నా' అని తెలిపింది.తనపై వస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఐశ్వర్య శర్మ స్పష్టం చేసింది. నా జీవితంలో ఎవరినీ ఎప్పుడూ వేధించలేదని.. స్వలాభం కోసం అబద్ధాలు వ్యాప్తి చేసే వ్యక్తులు తమ కర్మ గురించి ఆలోచించాలని హితవు పలికింది. మీకు వ్యక్తిగతంగా తెలియని వ్యక్తి గురించి తప్పుగా చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించాలని కోరింది. నేను మౌనంగా ఉంటే మీ ఇష్టం మొచ్చినట్లు రాసుకోండని కాదు.. నా స్వంత వైఖరితో గౌరవాన్ని కాపాడుకుంటానని ఐశ్వర్య శర్మ తెలిపింది. కాగా.. ఐశ్వర్య, నీల్ భట్ 'ఘుమ్ హై కిసికే ప్యార్ మే' అనే సీరియల్ సెట్లో కలుసుకున్నారు. ఇందులో ఆమె పాఖి అనే పాత్ర పోషించింది. ఆ తర్వాత ఈ జంట 2021లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత 'స్మార్ట్ జోడి', 'బిగ్ బాస్ 17' వంటి రియాలిటీ షోలలో కనిపించారు. అయితే వీరిద్దరు జంటగా బయట ఎక్కడా కనిపించకపోవడంతో విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య శర్మ స్పందించింది. -
ఐ బొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్.. వచ్చింది విడాకుల కోసం కాదు!
ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు బయటికొస్తున్నాయి. విదేశాల నుంచి ఇండియాకు వస్తున్న రవిని పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇది కాస్తా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రవి అరెస్ట్‌తో సినీ ఇండస్ట్రీతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. అయితే తన భార్యతో విడాకుల కేసు కోసమే ఇండియాకు వస్తుండగా రవి అదుపులోకి తీసుకున్నారని వార్తలొచ్చాయి. అందరూ అదే నిజమనుకున్నారు.కానీ తీరా చూస్తే ఈ విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు రవి విడాకుల కోసం ఇండియాకు రాలేదని తెలుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్న ఆస్తుల విక్రయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని టాక్. అంతేకాకుండా అతను 2022లోనే ఓ ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. భారత పౌరసత్వాన్ని వదులుకొని రూ.80 లక్షలు చెల్లించి కరేబియన్ సిటిజన్‌షిప్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా.. 2022 నుంచి కరేబియన్ దీవుల్లోనే నివాముంటున్నారు. అయితే టెక్నాలజీని వాడుకోవడంలో కింగ్ అయిన ఇమ్మడి రవి.. పైరసీ సైట్ ఐ బొమ్మను స్థాపించాడు. దాదాపు కొన్ని వేల సినిమాలను ఐ బొమ్మ ద్వారా అందుబాటులో ఉంచాడు. ఓటీటీ కంటెంట్‌ను డీఆర్ఎం టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేసి అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. మూవీరూల్జ్ ద్వారా కంటెంట్ తీసుకుని హెచ్డీ ఫార్మాట్లోకి మార్చి ఐబొమ్మ సైట్లో అప్లోడ్ చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. -
మూడో భర్తతో విడిపోయిన హీరోయిన్... సింగిల్‌గా ఉన్నానంటూ..
హీరోయిన్ మీరా వాసుదేవన్ (Meera Vasudevan) మరోసారి విడాకులు తీసుకుంది. ఈమె గతేడాది మూడో పెళ్లి చేసుకుంది. కెమెరామెన్ విపిన్ పుత్యాంగంతో ఏడడుగులు వేసింది. అయితే ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. భేదాభిప్రాయాలతో ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఓ పోస్ట్ పెట్టింది. 'నేను మీరా వాసుదేవన్.. 2025 ఆగస్టు నుంచి సింగిల్‌గానే ఉంటున్నాను. ప్రస్తుతం నేను చాలా అందమైన, ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను' అని రాసుకొచ్చింది. తన పెళ్లి ఫోటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది.పర్సనల్ లైఫ్మీరా వాసుదేవన్.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కుమారుడు విశాల్ అగర్వాల్‌ను 2005లో పెళ్లి చేసుకుంది. మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. దీంతో ఐదేళ్లకే విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్ కొక్కెన్‌ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా బాబు పుట్టాడు. కొన్నాళ్లకు ఈ జంట కూడా విడిపోయింది.2016లో విడాకులు తీసుకున్నారు. కుడుంబవిలక్కు సీరియల్ షూటింగ్లో కెమెరామెన్ విపిన్‌తో లవ్‌లో పడింది. కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డారు. ఈ క్రమంలో 2024 మేలో కోయంబత్తూరు వేదికగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కానీ, ఈ మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.సినిమామీరా వాసుదేవన్ 2001లో సీరియల్ ద్వారా బుల్లితెరపై నటిగా పరిచయమైంది. గోల్మాల్ అనే తెలుగు చిత్రంతో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అంజలి ఐ లవ్యూ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. మలయాళ, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. View this post on Instagram A post shared by Meera Vasudevan (@officialmeeravasudevan) చదవండి: ఇమ్మూతో తనూజ పంచాయితీ... ఇలాగైతే టైటిల్ గెలవడం కష్టమే! -
రూ.6 లక్షల జాబ్ ఔట్.. వెంటనే డైవోర్స్!
బంధాలు, ప్రేమానురాగాలు అంతా ఒక బూటకం అన్నాడో సినీ కవి. కానీ చైనాకు చెందిన ఈ భార్యా బాధితుడి వేదన వింటే అది అక్షర సత్యం అనిపించక మానదు. నెలకు రూ. లక్షల్లో జీతమొచ్చే ఉద్యోగం అలా పోయిందో లేదో ఇలా తన భార్య తనకు విడాలిచ్చి వెళ్లిపోయిందని గోడు వెళ్లబోసుకోవడంతో ఇటీవల చైనా అంతటా వైరల్‌గా మారాడు.163.కామ్ ప్రకారం.. కియాన్ కియాన్ అనే 43 ఏళ్ల లా గ్రాడ్యుయేట్ ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలో పనిచేసేవాడు. నెలకు 50,000 యువాన్లు అంటే రూ.6.23 లక్షలు జీతం. కానీ వివాహం తన జీవితాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందంటున్నాడు.ఆమె విలాసవంతమైన ఖర్చుల కోసం పాపం ఉన్న ఒక్క ఫ్లాటునూ అమ్ముకోవాల్సి వచ్చింది. విడాకుల సమయానికి తనకంటూ ఎలాంటి ఆస్తి లేకుండా పోయిందని వాపోయాడు. పాపం మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తమ ఏడేళ్ల సహవాసంలో వాళ్లు దగ్గరైంది 7-8 సార్లు మాత్రమే అంటే ఎవరూ నమ్మరేమో..కియాన్ తన సంపాదనలో ఎక్కువ భాగం తన భార్య కోసమే ఖర్చు చేశాడు. కారణాలు తెలియదు కానీ, పాపం కియాన్ భారీ జీతమొచ్చే ఉద్యోగాన్ని ఐదేళ్ల క్రితం పోగొట్టుకున్నాడు.అప్పటి నుండి డెలివరీ రైడర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పుడతడి జీతం నెలకు 10,000 యువాన్లు అంటే రూ.1.24 లక్షలే.తన భార్య చాలా సౌందర్యవతి అని చెప్పుకొచ్చిన కియాన్.. తన జీతం తగ్గిపోగానే ఆమె విడాకులు కోరిందని ఘొల్లుమన్నాడు. ‘నేను ప్రేమిస్తున్నది నీ డబ్బునే కానీ, నిన్ను కాదు’ అని ఆమె తెగేసి చెప్పిందని వాపోయాడు.ఇంతా చేస్తున్న ఆమె ఏదైనా పనిచేస్తుందా అంటే అదీ లేదు. కియాన్ కియాన్ సంపాందించిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతూ వచ్చేది.వామ్మో ఇవేమీ ఖర్చులుఆమె పెట్టే ఖర్చుల గురించి వింటే అవాక్కవాల్సిందే. ఆమె దుస్తులు కొన్నప్పుడల్లా ఒక్కోటి మూడు రంగులలో కొనేదట. ఒకసారి ఆమె ఒక్కొక్కటి 15,000 యువాన్లు (రూ.1.87 లక్షలు) పెట్టి రెండు డిజైనర్ బ్యాగులను కొనిందని వాపోయాడు కియాన్.మరో విస్తుపోయే విషయం ఏమిటంటే.. కియాన్ భార్య చేతులు, కాళ్ళకు కూడా ఖరీదైన ఫేషియల్ క్రీములను వాడేదట. ఇక సన్నగా ఉండటానికి ఖరీదైన సప్లిమెంట్లను తీసుకునే ఆమె చాలాసార్లు కాస్మొటిక్ చికిత్సలూ చేయించుకుందట. ఇంత చేసినా ఇప్పటికీ తన మాజీ భార్య అంటే తనకు ద్వేషం లేదంటున్నాడు అమాయక కియాన్కియాన్. -
కలలో అలా.. విమానం ఎక్కాలంటేనే భయపడ్డా: సుమ కనకాల
తనకు వచ్చిన కలలు ఒక్కోసారి నిజం అవుతాయని అంటున్నారు ప్రముఖ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala). తాజాగా ఆమె ఓ పాడ్ కాస్ట్లో పాల్గొని..తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు వచ్చిన కలలు చాలా వరకు నిజమవుతాయని, ఓ సారి రాజీవ్‌కి యాక్సిడెంట్ అయినట్లు కల వస్తే.. నిజంగానే అది జరిగిందని చెప్పుకొచ్చింది. ‘కొన్ని సార్లు నాకు వచ్చిన కల నిజమవుతుంటాయి. ఓ సారి రాజీవ్‌కి షూటింగ్లో కాలు విరిగినట్లు కల వచ్చింది. అప్పట్లో ఫోన్లు లేవు..ల్యాండ్లైన్లోనే మాట్లాడాలి. ఒక రోజంతా ఫోన్ చేసినా.. ఆయన కాంటాక్ట్‌లోకి రాలేదు. మరుసటి రోజు ఉదయం ఫోన్ చేసి ‘నువ్వు బాగానే ఉన్నావా?’అని అడిగా. ‘ఎందుకు అలా అడుగుతున్నావ్? అని ఆయన అన్నారు. అప్పుడు నాకు వచ్చిన కల గురించి చెబితే..నిజంగా ఆ రోజు యాక్సిడెంట్ జరిగి..కాలు విరిగిందని చెప్పాడు. షూటింగ్లో భాగంగా కారు డ్రైవ్ చేస్తుంటే..చెట్టుని ఢీకొట్టింది’ అని చెప్పాడు. అలాగే ఓసారి గుడికి వెళ్లినట్లు కల వచ్చింది.. అనుకోకుండా మరుసటి రోజు మేం అదే గుడికి వెళ్లాం. కొన్నేళ్ల క్రితం నేను ఎక్కిన విమానం కూలినట్లు కల రావడంతో.. కొన్నాళ్ల పాటు విమానం ఎక్కాలంటే భయపడ్డాను. ఇవి నమ్మాలో లేదో తెలియదు కానీ..ఒక్కోసారి వచ్చిన కలలు నన్ను ఇలా భయపెడతాయి’ అని సుమ చెప్పుకొచ్చింది. అలాగే తనపై వచ్చిన విడాకుల రూమర్స్‌పై కూడా సుమ స్పదించారు. ‘మా 25 ఏళ్ల వివాహ బంధంలో ఎన్నో ఒడుదుడుకులను చూశాం. భార్యబర్తల అన్నాక..ఏదోఒక అంశంపై మనస్పర్థలు రావడం సహజం. జీవితం ఎవరికీ సాఫీగా సాగదు. ఒక సమయంలో మీమిద్దరం విడాకులు తీసుకున్నట్లు వార్తలు రాశారు. దాన్ని మేమిద్దరం ఖండించినా కూడా పుకార్లు ఆగలేదు. మేమిద్దరం కలిసి రీల్స్ చేసినా కూడా.. ‘ఏంటి ఇంకా కలిసే ఉన్నారా? విడిపోలేదా?’ అని కామెంట్స్ చేశారు. అప్పట్లో అవి చూసి బాధపడ్డాం కానీ ఇప్పుడు అయితే పట్టించుకోవడమే లేదు’ అని సుమ చెప్పుకొచ్చారు. -
భరణం కోసం రుణం
సాక్షి, అమరావతి: ఎన్నో ఆశలతో మూడుముళ్ల బంధంతో ఒకటైనవారు మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఎక్కువకాలం కలిసి జీవించలేక విడిపోతున్నారు. విడాకులకు సంబంధించిన న్యాయప్రక్రియ కోసం సగటున వీరు రూ.5 లక్షలు వరకు ఖర్చు చేస్తున్నారు. విడాకుల తర్వాత పురుషుల ఆర్థికస్థితి ఒక్కసారిగా కుప్ప కూలిపోతున్నట్లు వన్ ఫైనాన్స్ మ్యాగజైన్ తాజా సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా విడాకులు తీసుకున్న 1,258 జంటల ఆర్థిక స్థితిగతులను చూస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించిన సర్వేలో వెల్లడైన కొన్ని ముఖ్యాంశాలు..» 38 శాతం మంది పురుషులు వారి వార్షిక ఆదాయమంతా భరణం కోసం వెచ్చిస్తున్నారు. » 42 శాతం మంది భరణం చెల్లించడం కోసం అప్పులు చేస్తున్నారు. » 29 శాతం మంది పురుషుల ఆస్తి మొత్తం భరణం చెల్లింపుల తర్వాత మైనస్‌లోకి జారిపోతోంది. » 26 శాతం మంది మహిళలు భరణంగా వారి భర్త నుంచి ఆస్తి తీసుకుంటున్నారు. » ఆస్తులు లేకపోయినా మెయింటెనెన్స్ చెల్లించాల్సిన పరిస్థితిని వీరు ఎదుర్కొంటున్నారు. » 56 శాతం మంది మహిళలు విడాకులు తీసుకోవడంలో అత్తమామలను ప్రధాన కారణంగా చూపుతున్నారు. » 43 శాతం మహిళలకు సంబంధించిన ఆర్థిక అంశాలు, గొడవలు ప్రారంభమై విడాకులు తీసుకోడానికి కారణమవుతున్నాయి. పురుషుల విషయంలో ఇది 42 శాతంగా ఉంది. » 23 శాతం మహిళలు విడాకుల తర్వాత అప్పటికి వారు ఉంటున్న ప్రదేశాన్ని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. » 30 శాతం మంది మహిళలు విడాకుల తర్వాత ఉద్యోగాలను వదిలేస్తున్నారు. ఆరోగ్య బీమా తరహాలో ఆర్థిక ప్రణాళికలు!విడాకుల తర్వాత తాము నిర్మించుకున్న ఆర్థిక ప్రపంచం ఒక్కసారిగా కుప్ప కూలిపోయిందని, చివరకు అప్పులు చేసి జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పలువురు పురుషులు పేర్కొనడం గమనార్హం. ఆరోగ్య బీమా తరహాలో ‘అనుకోని పరిస్థితుల్లో విడాకుల వరకూ వెళ్లాల్సి వస్తే’ అని ఆలోచిస్తూ దానికి అనుగుణంగా ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఇది తప్పుడు కేసు అనుకోవడానికి వీలు లేదు!
మరొకరితో పారిపోయి, అతను మోసం చేసిన తర్వాత మరలా నాతో ఉంటాను అని వచ్చేసిన భార్యని నేను తిరస్కరించాను. డివోర్స్ కేసు వేశాను. అందుకు కక్ష సాధింపుగా నాపైన, వృద్ధులైన నా తల్లిదండ్రులపై కూడా తప్పుడు డీ.వీ.సీ – 498– ఎ (గృహ హింస) కింద కేసులు వేసింది. అందులో భాగంగా మెయింటెన్స్ కూడా వేసింది.. మా మీద సమాజంలో లేనిపోని ప్రచారాలు చేసి మమ్మల్ని క్షోభకు గురిచేయడమేగాక హైదరాబాద్ లో మా నాన్నగారు స్వార్జితంతో సంపాదించిన ఇంట్లో అద్దెకు ఉంటున్నవారిని బలవంతంగా ఖాళీ చేయించి తాను దౌర్జన్యంగా ఆ ఇంట్లో ఉంటోంది. 7 సంవత్సరాల తర్వాత తను వేసిన కేసులు అన్నీ తప్పు అని కోర్టు కేసులు కొట్టివేసింది. డివోర్స్ వచ్చేసింది. పూర్తి జడ్జిమెంటు రావాల్సి ఉంది. నాకు జరిగిన అన్యాయానికి, మా మీద వేసిన తప్పుడు కేసులకు గాను నేను – నా తల్లిదండ్రులు పరువు నష్టం దావా వేయవచ్చా? మా నాన్నగారి ఇంట్లోనుంచి తనను ఎలా పంపించాలి? – రాజగోపాల్, సూర్యాపేటభారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 498 ఎ (85 బిఎన్) వివాహిత మహిళపై గృహహింసకు పాల్పడిన భర్త, అతని కుటుంబ సభ్యులపై కఠినచర్యలు తీసుకునే ఉద్దేశంతో రూపొందించిన చట్టం. కానీ చాలామంది మహిళలు తమ వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగా ఈ చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారని అనేక సందర్భాలలో పలు హైకోర్టులతో సహా సుప్రీంకోర్టు సైతం పేర్కొంది. అందుకని ఇలాంటి కేసులలో సాధారణంగా అరెస్ట్ కూడా చేయడానికి వీలులేదు అని ఎన్నో నిబంధనలను సుప్రీంకోర్టు సూచించింది. వివాహ బంధాన్ని అంతం చేయాలి అనుకున్నప్పుడు స్త్రీలకు తగిన భరణం ఇవ్వకపోవడం, వారి హక్కులను గౌరవించకపోవడం వలన తప్పని పరిస్థితులలో చాలామంది స్త్రీలు రాజీ కుదుర్చుకోవడానికి (సెటిల్మెంట్) ఒక సాధనంగా ఈ చట్టాన్ని ఉపయోగించుకోవడం చాలా కేసులలో గమనిస్తున్నాము. మీ కేసులో జడ్జిమెంట్ ఇంకా రాలేదని అన్నారు. జడ్జిమెంట్ రాకుండా కేవలం కేసు కొట్టేశారు కాబట్టి ఇది తప్పుడు కేసు అని అనుకోవడానికి వీలులేదు. సరైన సాక్ష్యాధారాలు లేనందువల్ల కేసు కొట్టేసి ఉంటే పరువు నష్టం వేయడానికి కుదరక పోవచ్చు. కానీ మీ భార్య ఉద్దేశపూర్వకంగా మీ మీద తప్పుడు కేసులు, అభియోగాలు మోపిందనే వ్యాఖ్యలు జడ్జిమెంట్‌లో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా దావా వేయవచ్చు. ఇందుకు వీలుందా లేదా అనే విషయాన్ని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. మరో విషయం... మీ తండ్రిగారు సంపాదించిన ఇంటిలో మీ భార్య ఉండడానికి వీల్లేదు. అయితే డి.వి.సి చట్టం కింద తనకు గృహ వసతి (రెసిడెన్స్ ఆర్డర్స్) ఏమైనా ఉంటే మాత్రం మీ భార్య అలాంటి ఆర్డర్ అమలులో ఉన్నంతవరకు అక్కడ ఉండవచ్చు. అయితే మీ తల్లిదండ్రులు ఒకవేళ ‘తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007’ కింద కేసు వేసి తమ ఇంటిని తిరిగి కోరితే మీ మాజీ భార్యని బయటికి పంపవచ్చు. అయితే మీరు తనకి ప్రత్యామ్నాయ వసతి కల్పించాల్సిందిగా కోర్టు మిమ్మల్ని ఆదేశించవచ్చు. ఏది ఏమైనా మీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలి అంటే మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ ఆమె మీ మీద మోపిన అభియోగాలలో కొంచెం నిజం వున్నా, మీరు కూడా కక్ష సాధింపులకి దిగటం అంత సమంజసం కాదేమో ఆలోచించుకోండి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )(చదవండి: ఎప్పటికీ 'రియల్ హీరో'..! 61 ఏళ్ల వయసులో చలాకీగా పుష్ అప్లు..) -
‘ఖులా’ ద్వారా పెళ్లి రద్దు
ఇస్లామాబాద్: మహిళల హక్కుల విషయంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. ‘ఖులా’ద్వారా వివాహాన్ని రద్దు చేసుకొనే అధికారం మహిళలకు సైతం ఉందని తేలి్చచెప్పింది. భర్త శారీరకంగానే కాకుండా.. మానసికంగా కూడా వేధింపులకు గురిచేస్తే విడాకులు తీసుకోవచ్చని స్పష్టంచేసింది. ఖులా అనేది ఇస్లామిక్ ధర్మంలో ఒక భాగం. పురుషులకు తలాక్ హక్కు ఉన్నట్లుగానే మహిళలకు ఖులా హక్కు ఉంది. ఖులా హక్కును పాక్ సుప్రీంకోర్టు గుర్తించింది. మహిళా న్యాయమూర్తులైన జస్టిస్ ఆయేషా ఎం.మాలిక్, జస్టిస్ నయీం అఫ్గాన్‌తో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెబ్సైట్లో శుక్రవారం పొందుపర్చారు. భర్త మానసికంగా వేధిస్తుండడంతో ఓ మహిళ అతడితో వివాహాన్ని రద్దుచేసుకున్నారు. అయితే, షెషావర్ హైకోర్టు ఆమె నిర్ణయాన్ని తిరస్కరించింది. వివాహాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకోవడం కుదరదని, అందుకు భర్త అంగీకారం కూడా ఉండాలని పేర్కొంది. దాంతో పెషావర్ హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దాంతో బాధితురాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. పెషావర్ హైకోర్టు ఉత్తర్వును తప్పుపట్టింది. ఖులా అనేది మహిళల హక్కు అని, విడాకులు పొందాలనుకుంటే భర్త అంగీకారం అవసరం లేదని స్పష్టంచేసింది. క్రూరత్వం అనేది భౌతికమైన హింస రూపంలోనే కాకుండా మానసికంగానూ ఉండొచ్చని వెల్లడించింది. మానసికంగా హింసిస్తున్న భర్త నుంచి ఖులా ద్వారా విడిపోవచ్చని, అతడితో జరిగిన పెళ్లిని రద్దు చేసుకోవచ్చని ధర్మాసనం తీర్పు వెలువరించింది. -
భారీ ఎత్తున భరణం గుంజి, అతడితో పెళ్లి.. నా మాజీ భార్య భర్తపై కేసు వేయొచ్చా?
నా భార్య మరొకరితో సంబంధం పెట్టుకొని నా నుంచి విడాకులు తీసుకుంది. విడాకుల కేసులో నేను తనకు ఫలానా వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది అని పేరుతో సహా చెప్పినప్పటికీ, తనకు అలాంటివేమీ లేవని కోర్టును నమ్మించింది. దాంతో నేను పదిలక్షల రూపాయలు భరణంగా చెల్లించవలసి వచ్చింది. మా విడాకులు అయిన 7 నెలలకే తను అదే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తను నా భార్యగా ఉన్నప్పుడు వారు కలిసి తీసుకున్న ఫోటోలు కొన్ని పెళ్లి వీడియోలో పెట్టి ఇంటర్నెట్లో కూడా పెట్టుకున్నారు. నన్ను మానసిక క్షోభకి గురి చేసినందుకు నేను నా మాజీ భార్య ప్రస్తుత భర్తపై కేసు వేయవచ్చా? ఎందుకంటే, ఇటీవలే పేపర్లో తైవాన్‌లో భార్య ప్రియుడిపై భర్త కోర్టులో దావా వేయగా కోర్టు అతనికి పరిహారం కూడా చెల్లించమని చెప్పిందని ఒక వార్త చదివాను. మనదేశంలో కూడా అలా చేసే వీలుందా? – సంపత్, హైదరాబాద్ రెండు వారాల క్రితం ఇలాంటి ఒక కేసు గురించి మన పత్రికలో కూడా సమాధాన రూపంగా చె΄్పాను. వివాహేతర సంబంధాలు చట్టరీత్యా నేరాలుగా పరిగణించక పోయినప్పటికీ, సివిల్ దావాలు/పరిహారాలు కోరడానికి భారతీయ చట్టాలలో ఎటువంటి అడ్డంకీ లేదు. మారుతున్న సామాజిక పరిణామాల దృష్ట్యా, వివాహేతర సంబంధాలు ఇకపై సివిల్ కోర్టుకు చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు మీ మాజీ భార్య ప్రియుడి మీద (ప్రస్తుతం ఆమె భర్త) ఖచ్చితంగా కేసు వేయవచ్చు. పరిహారం కూడా కోరవచ్చు. ఇటీవలే ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో ఒక భార్య తన భర్త ప్రియురాలిపై వేసిన దావా చెల్లుతుంది అని పేర్కొంది. అయితే మీరు కేసు వేసిన తర్వాత, మీ మాజీ భార్యకి, తన భర్తకి సంబంధం ఉండేదనే విషయాన్ని ఖచ్చితమైన సాక్ష్యాధారాలతో రుజువు చేయవలసి ఉంటుంది. కోర్టును ఎవరు ఆశ్రయిస్తే వారే తమ పక్షం వాదనని వాస్తవాలేనని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది! కేవలం గతంలో వారిద్దరూ కలిసి తీసుకున్న కొన్ని ఫొటోల ఆధారంగా మాత్రమే మీరు కేసు గెలవడం కొంత కష్టమే! అయితే, అసలు మీ మాజీ భార్యకు అతనితో పెళ్లికి ముందు పరిచయమే లేదు అతను ఎవరో నాకు తెలియదు’’ వంటి సమాధానాలు చెప్పి ఉన్నట్లయితే, మీ డైవర్స్ కేసులో జరిగిన వాదోపవాదాలను ఆధారంగా తీసుకొని మీ తరఫు సాక్ష్యాలుగా కూడా కోర్టు ముందు ఉంచవచ్చు. చదవండి: ఆ టైంలో హెల్ప్ అడగడం తప్పుకాదు, మీకోసం మీరు ఏడ్వండి : సారాఇవన్నీ ఒకవేళ రుజువు అయినట్లయితే మీకు మానసిక క్షోభ కలిగించినందుకు గాను, ఆర్థికంగా కూడా మీరు నష్టపోయినందుకు గాను, మీరు తగిన పరిహారం పొందే అవకాశం లేకపోలేదు. మీరు కేసు వేయాలి, తగిన సాక్ష్యాధారాలతో రుజువు చేయగలను అనుకుంటే, మీ మాజీ భార్యని కూడా కేసులో పార్టీ చేయండి. ఇంతవరకు ఇలాంటి కేసులు లేకపోయినప్పటికీ, ఇటీవలే మన భారతీయ కోర్టులు ఇచ్చిన తీర్పుల ఆధారంగా మీ కేసు విచారణకు మాత్రం అర్హత సాధించింది. కేసు గెలవడం ఓడిపోవడం తర్వాత సంగతి. అన్ని సాక్ష్యాధారాలు, ముఖ్యంగా మీ డైవర్స్ కేసులో మీ మాజీ భార్య ఇచ్చిన వాంగ్మూలాలు/ క్రాస్ ఎగ్జామినేషన్‌లో తను చెప్పిన సమాధానాలు వంటివి నిక్షిప్తపరిచి ఒక లాయర్‌ను సంప్రదిస్తే మీకు ఉపశమనం లభించవచ్చు. ఇదీ చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..! – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. -
భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడిని.. ఎవరూ రావొద్దని వార్నింగ్!
టీమిండియా మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ (Yograj Singh)తన విడాకులకు గల కారణాన్ని వెల్లడించాడు. తాను పెట్టిన కఠినమైన నిబంధనల వల్లే.. షబ్నమ్ (Shabnam)తో తన పెళ్లి పెటాకులైందంటూ కుండబద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌కు ఆడిన యోగ్రాజ్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.యువీ భవిష్యత్తు కోసమేభారత్కు తొలి వరల్డ్‌కప్ అందించిన కపిల్ దేవ్ (Kapil Dev) వల్లే తన కెరీర్ నాశనమైందని భావించిన యోగ్రాజ్.. తన కుమారుడి రూపంలో టీమిండియాకు అత్యుత్తమ ఆల్‌రౌండర్‌ను అందించాలని భావించాడు. ఇందుకోసం క్రమశిక్షణ పేరిట తన కొడుకు యువరాజ్ సింగ్ (Yuvraj Singh) పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించానని యెగ్రాజ్ ఇటీవలే వెల్లడించాడు.ఒకానొక దశలో తన తల్లి యువీ మానసిక స్థితి గురించి చాలా భయపడిపోయిందని.. మనుమడి పట్ల దయ చూపాలని కోరిందని యోగ్రాజ్ తెలిపాడు. అయినా తన మనసు కరగలేదని.. యువీ భవిష్యత్తు కోసమే కఠినంగా ఉన్నానంటూ తనను తాను సమర్థించుకున్నాడు. తాజాగా ఎస్ఎమ్టీవీకి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో యువీ తల్లి షబ్నమ్తో తన విడాకులకు గల కారణం గురించి వెల్లడించాడు.ఒక రకంగా ఇంట్లో పెట్టి తాళం వేసినట్లు చేశా‘‘విదేశీయుల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో నేను చదువుకున్నా. మా నాన్న క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. నేను అదే మిగిలిన వాళ్లపై ప్రయోగించాను. నా భార్య షబ్నమ్తోనే ఇది మొదలుపెట్టాను.నా అనుమతి లేకుండా బయటకు వెళ్లవద్దని ఆదేశించా. ఒక రకంగా ఇంట్లో పెట్టి తాళం వేసినట్లు చేశా. ఇక తన కుటుంబ సభ్యులు ఎవరూ మా ఇంటికి రావొద్దని హెచ్చరించా. ఒకవేళ ఎవరైనా దారి తప్పి వచ్చినా వాళ్లు నాకు ఎలాంటి సలహాలు ఇవ్వద్దని కచ్చితంగా చెప్పేశా.వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పామాకు కుమారుడు జన్మించిన తర్వాత.. నాలో దాగి ఉన్న కసినంతా బయటకు తీసి.. నా కొడుకుని లెజెండ్‌గా తీర్చిదిద్దుతా అని మా అమ్మకు చెప్పాను. నన్ను తప్పుగా చూపించే ప్రయత్నం చేసిన కపిల్ దేవ్ వంటి వాళ్లపై ప్రతీకారం తీర్చుకునేందుకు నా కుమారుడిని అస్త్రంగా వాడుకోవాలని నిర్ణయించుకున్నా.అందుకే కష్టపెట్టైనా సరే వాడిని అత్యుత్తమ ఆల్‌రౌండర్‌ని చేశా. ఏదేమైనా పితృస్వామ్య భావజాలం గల నాతో షబ్నమ్ ఇమడలేకపోయింది. యువీ, తన తల్లి నన్ను విడిచిపెట్టి వెళ్లిన రోజు.. నా జీవితంలో తొలిసారిగా ఏడ్చాను.నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతా. నాకు నటన రాదు. అందుకే నా పరిస్థితి ఇలా అయింది. మా వాళ్లు నన్ను ఓ పిచ్చోడు అనుకున్నారు’’ అని యోగ్రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.యువీ తల్లిని పెళ్లి చేసుకుని తప్పు చేశాఇక గతంలో ఇదే విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘యువీ తల్లిని పెళ్లి చేసుకుని తప్పు చేశా. నేనొక రైతుని. ఆమె వ్యాపార కుటుంబం నుంచి వచ్చింది. నాకున్న మగ అహంకారంతో ఆమెను పంజరంలో బంధించినట్లు చేశా.అది ఆమెకు నచ్చలేదు. అయినా సర్దుకుపోయేది. కానీ ఒకానొక దశలో మా ఇద్దరికీ అస్సలు పడలేదు.అందుకే విడిపోవాల్సి వచ్చింది’’ అని యెగ్రాజ్ సింగ్ తెలిపాడు. కాగా షబ్నమ్- యోగ్రాజ్లకు యువరాజ్ సింగ్‌తో పాటు జొరావర్ సంతానం. విడాకుల తర్వాత యోగ్రాజ్ నీనా బుంధేల్ అనే నటిని పెళ్లి చేసుకోగా.. వీరికి కుమారుడు, కుమార్తె జన్మించారు. చదవండి: ‘యువీ గనుక తన పిల్లల్ని.. నాకు అప్పగిస్తే వారికీ అదే ‘గతి’ పట్టిస్తా’ -
నాలుగున్నరేళ్ల కాపురం.. మోసగాడినే అయితే..
తన మాజీ భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma)ను ఉద్దేశించి టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal) ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తన పేరు వాడుకోనిదే ఒకరికి పూట గడవదని అనిపిస్తే.. వారు అలా చేయడాన్ని తాను తప్పుపట్టనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.ప్రేమ పాఠాలు..అసలు విషయం ఏమిటంటే.. యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ వద్ద డాన్స్ పాఠాలు నేర్చుకునే క్రమంలో చహల్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాల సమ్మతితో వీరిద్దరు 2020లో పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. ఎక్కడికైనా జంటగా వెళ్తూ అన్యోన్యంగా కనిపించే ఈ జోడీ.. 2025లో విడాకులు తీసుకుని అభిమానులకు షాకిచ్చారు.ఈ సందర్భంగా తాము 2022 నుంచే విడిగా ఉంటున్నట్లు న్యాయస్థానానికి తెలపడం గమనార్హం. అయితే, విడాకుల తర్వాత పరస్పర ఆరోపణలతో ఇద్దరూ రచ్చకెక్కారు. అధికారికంగా విడాకులు మంజూరు కావడానికి ముందే.. బాలీవుడ్ నటి, ఆర్జే మహ్వశ్తో చహల్ చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు.అతడే వదిలిపెట్టాడుఅంతేకాదు.. ధనశ్రీ రూ. 4 కోట్ల భరణం తీసుకున్న నేపథ్యంలో.. ‘‘ఎవరి తిండి వారే సంపాదించుకోవాలి’’ అనే కోట్ ఉన్న షర్ట్ వేసుకుని కోర్టుకు వచ్చాడు చహల్. ఈ పరిణామాల నేపథ్యంలో ధనశ్రీ స్పందిస్తూ.. తాను విడాకులు తీసుకోవాలని అనుకోలేదని.. అతడే తనను వదిలిపెట్టాడంటూ చహల్‌పై ఆరోపణలు చేసింది. ఏదేమైనా చహల్ సంతోషంగా ఉంటే చాలని పేర్కొంది.పెళ్లైన రెండు నెలల్లోనేతాజాగా ఓ రియాలిటీ షోలో పాల్గొన్న ధనశ్రీ.. తోటి కంటెస్టెంట్‌తో మాట్లాడుతూ.. పెళ్లైన రెండు నెలల్లోనే చహల్ తనను మోసం చేశాడని.. అయినా తాను సర్దుకుపోయినట్లు తెలిపింది. ఈ వ్యాఖ్యలు వైరల్ కాగా.. చహల్ తాజాగా హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ధనశ్రీ వ్యాఖ్యలను ఖండించాడు.‘‘ఒకవేళ ఏదైనా బంధంలో ఓ వ్యక్తి రెండు నెలల్లోనే మోసగాడని తెలిస్తే.. అయినా అతడితో కలిసి ఎవరైనా జీవిస్తారా?.. నా దృష్టిలో ఇది ముగిసిన అధ్యాయం. అయిందేదో అయిపోయింది. నేను జీవితంలో ముందుకు సాగుతున్నాను.నాలుగున్నరేళ్ల కాపురం.. మోసగాడినే అయితే..కానీ కొందరు అదే పట్టుకుని వేలాడుతున్నారు. అయినా, మేము నాలుగున్నరేళ్ల పాటు వివాహ బంధంలో ఉన్నాము. కలిసి కాపురం చేశాం. ఒకవేళ నేను నిజంగా మోసగాడినే అయితే.. ఆ వ్యక్తి అంతకాలం నాతో ఎలా కలిసి ఉంటారు?.. నా పేరు చెప్పుకోనిదే ఒకరికి పూట గడవదు అంటే అలాగే చేసుకోనివ్వండి.వారి మాటలు నాపై ఎలాంటి ప్రభావం చూపలేవు. ఈ విషయంపై నేను స్పందించడం ఇదే ఆఖరిసారి. ముగిసిన అధ్యాయం గురించి మరోసారి మాట్లాడను. నేను ఒక క్రీడాకారుడిని. మోసగాడిని కాదు’’ అని చహల్.. ధనశ్రీకి ఘాటు కౌంటర్ ఇచ్చాడు.టీమిండియా తరఫున 2016లో అరంగేట్రం చేసిన చహల్.. ఇప్పటి వరకు 72 వన్డేల్లో 121, 80 టీ20లలో 96 వికెట్లు పడగొట్టాడు. ఈ రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ చివరగా.. 2023లో టీమిండియాకు ఆడాడు. ఇక ఐపీఎల్లో 174 మ్యాచ్‌లలో కలిపి 221 వికెట్లు తీసిన చహల్... అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు.చదవండి: తిట్టకు అమ్మా!.. ఏదో ఒకరోజు ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తా.. కట్‌చేస్తే.. -
విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు, కొడుక్కి పాలాభిషేకం
విడాకులు (Divoce) అంటేనే అదేదో వినకూడని మాటలాగా, కళంకం అన్న భావన మన సమాజంలో పాతుకుపోయింది. కానీ మనస్ఫర్తలతో, ఒకర్నొకరు ద్వేషించుకుంటూ, తీవ్ర ఒత్తిడిలో జీవించడం కంటే.. అభిప్రాయాలు కలవన్నప్పుడు, విభేదాలు తారాస్థాయికి చేరినప్పుడు.. స్త్రీపురుషులిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవడమే మేలు అనేది నేటి మాట. విడాకులు అనేవి అటు మహిళలకుగానీ, ఇటు పురుషులకు గానీ జీవితంలో ఒక ముగింపు కాదని ఒక కొత్త ప్రారంభమని తెలియజేసే ఘటనలో గతంలో కూడా చూశాం. గతంలో యూపీకి చెందిన అనిల్ కుమార్ అనే రిటైర్డ్ ఉద్యోగి, విడాకులు తీసుకున్న తన కూతురు ఉర్విని బారాత్ ఊరేగించి, ఘనంగా ఇంటికి స్వాగతం పలికిన ఘటన నెట్టింట తెగ సందడి చేసింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఉదంతం పలువుర్ని ఆలోచింప జేస్తోంది. విడాకులిచ్చిన కొడుక్కి పాలాభాషేకం, కొత్తబట్టలిచ్చి.. కొత్త జీవితానికి నాంది పలకమని ఆశీర్వదించింది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు హాట్ టాపిక్. స్టోరీ ఏంటి అంటే..ఢిల్లీకి చెందిన డీకే బిరాదర్, భార్యకు విడాకులిచ్చాడు. ఆ తర్వాత అతని తల్లి కొడుక్కి పాలాభిషేకం చేసింది. పాత ఆలోచనలను మర్చిపొమ్మనే సంకేతంగా శుద్ధిగా సంకేతంగా భావించే పాలతో కొడుకుని శుద్ధి చేసింది. అనంతరం కొత్త పెళ్లి కొడుకులా ముస్తాబయ్యాడు అతను. బట్టలు, షూ, వాచీ.. ఇలా అన్నీ కొత్తవే అతనికిచ్చింది. అంతేకాదు ‘హ్యాపీ డివోర్స్’ కేక్ కట్ చేసి పెద్ద సంబరమే చేసుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కేక్ పై భార్యకు భరణంగా ఇచ్చింది కూడా రాయడం. అంటే ‘120 గ్రాముల బంగారం, 18 లక్షల డబ్బుతో లభించిన అని అర్థం వచ్చేలా ‘హ్యాపీ డివోర్స్’ అని రాసి ఉండటం గమనార్హం. ఈ కేక్ కట్ చేసి తల్లికి తినిపించి, తానూ తినిపించాడు సంతోషంగా. ఈ వీడియో ఇన్‌స్టాలో వైరల్ అయ్యింది.చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ? Man celebrates divorce with ritual, sweets, and a cake reading “Happy Divorce 120g gold 18L cash.” sharing a caption: “I’m single, happy, free my life, my rules.” Urges others to celebrate themselves.pic.twitter.com/Rrhhlpqoqx— Ghar Ke Kalesh (@gharkekalesh) October 7, 2025 ‘‘120 గ్రాముల బంగారం, రూ.18 లక్షలు తీసుకోలేదు. కానీ నేను ఇచ్చాను.. ఇప్పుడు సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నాను’’అని పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. వెడ్డింగ్ స్వీట్స్ టూ డివోర్స్ ట్రీట్స్ అని కొందరు, ఏమైనా గానీ మొత్తానికి బతికే ఉన్నాడు అనికొందరు కమెంట్ చేశారు. జీవితంలోతీవ్ర ఒత్తిడితో సఫర్ అయ్యి, చివరకు ఆ ఒత్తిడి నుండి ఉపశమనం వచ్చినపుడు జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. బహుశా విడాకుల తర్వాత ఈ బ్రో ఒత్తిడి తగ్గిపోయి ఉండవచ్చు -అందుకే నిజంగా సంతోషంగా ఉన్నాడని మరొకరు వ్యాఖ్యానించారు. -
షోయబ్ మాలిక్ విడాకుల వార్తలు;.. సానియా మీర్జా పోస్ట్ వైరల్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) మూడో వివాహ బంధం కూడా చిక్కుల్లో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. మూడో భార్య, నటి సనా జావెద్ (Sana Javed)తో విడాకులు తీసుకోవడానికి షోయబ్ సిద్ధపడ్డాడనేది వాటి సారాంశం.మనసు స్వచ్ఛంగా ఉన్నపుడు..ఈ నేపథ్యంలో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ‘‘మనసు స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉన్నపుడు.. దానిని బయటకు చూపించేందుకు ఎలాంటి కృత్రిమ ఫిల్టర్ల అవసరం ఉండదు’’ అంటూ సానియా తన కుమారుడు ఇజహాన్, స్నేహితులతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది.కాగా టెన్నిస్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన హైదరాబాదీ సానియా మీర్జా.. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను 2010లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందే ఆయేషా సిద్ధిఖీ అనే మహిళతో షోయబ్‌కు వివాహం కాగా.. 2006లోనే విడాకులు తీసుకున్నాడు.షోయబ్‌కు సానియా విడాకులుఅయితే, సానియా మీర్జాతోనూ షోయబ్ బంధం ఎక్కువకాలం నిలవలేదు. 2023లో తాను షోయబ్‌కు విడాకులు ఇచ్చినట్లు సానియా మీర్జా గతేడాది ప్రకటించింది. అయితే, అంతకంటే ముందే నటి సనా జావెద్‌ను పెళ్లాడిన ఫొటోలను షోయబ్ సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.ఇక సనాకు ఇది రెండో వివాహం కాగా.. షోయబ్‌కు మూడోది. అయితే, పెళ్లికి ముందే వీరిద్దరు తమ పాత బంధాలను కొనసాగిస్తూనే.. ‘రిలేషన్షిప్’లోనే ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సనా తన భర్తకు, షోయబ్ తన భార్యకు విడాకులు ఇచ్చి 2024లో అధికారికంగా పెళ్లి చేసుకున్నారు.ఆ ఫొటోలతో వదంతులకు చెక్అయితే, సనా- షోయబ్ మధ్య కూడా సఖ్యత చెడినట్లు ఇటీవల వదంతులు వ్యాపించాయి. ఓ కార్యక్రమంలో ఇద్దరూ ఒకే సోఫాలో కూర్చునప్పటికీ దూరం దూరంగా ఉండటం.. షోయబ్ ఆటోగ్రాఫులు ఇస్తున్నపుడు సనా ముఖం తిప్పేసుకోవడం ఇందుకు ఊతమిచ్చాయి.దీంతో సనా- షోయబ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ కథనాలు వచ్చాయి. అయితే, భర్త షోయబ్‌తో కలిసి అమెరికాలో విహరిస్తున్న ఫొటోలను పంచుకోవడం ద్వారా సనా జావెద్ ఈ వదంతులకు చెక్ పెట్టింది. ఇద్దరూ కలిసి హాలీవుడ్ యూనివర్సల్ స్టూడియోస్‌ను సందర్శించిన ఫొటోలను సనా షేర్ చేసింది. షోయబ్ కూడా ఇవే ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘తనతో కలిసి ఇలా విహరించడం ఎల్లపుడూ సంతోషమే’’ అని పేర్కొన్నాడు.సానియా మీర్జా పోస్ట్ వైరల్ఇదిలా ఉంటే.. సానియా- షోయబ్‌లకు సంతానంగా కుమారుడు ఇజహాన్ జన్మించాడు. సానియా తన కుమారుడితో కలిసి ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తోంది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో పదమూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు కలిగి ఉన్న సానియా మీర్జా ఎప్పటికప్పుడు ఫొటోలు పంచుకుంటూనే ఉంటుంది. అయితే, శనివారం ఆమె పంచుకున్న ఫొటోలకు ఇచ్చిన క్యాప్షన్.. షోయబ్ మూడో పెళ్లి పెటాకులు అన్న వార్తల వేళ నెటిజన్లను ఆకర్షిస్తోంది.చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) వివాహం గురించి మరోసారి వార్తల్లో నిలిచాడు. ముచ్చటగా చేసుకున్న మూడో పెళ్లి కూడా ముక్కలు కానుందా? తాజా వార్తలు ఈ ఊహాగానాలనే బలపరుస్తున్నాయి. భార్య, నటి సనా జావేద్ (Sana Javed)తో విభేదాల కారణంగా విడాకుల బాట పట్టినట్టు వార్తలొస్తున్నాయి.భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza)తో 14 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికి సనా జావేద్‌ను వివాహం చేసున్నాడు షోయబ్. అప్పటినుంచి చెట్టాపట్టా లేసుకుని తిరిగిన వీరిద్దరూ ఇటీవలదూరంగా ఉంటున్నారట. తాజా మీడియా నివేదిక ప్రకారం, మనస్పర్థలతో షోయబ్-సనా జంట విడాకులకు సిద్దమవుతోంది. View this post on Instagram A post shared by Voice Of Netizens (@voiceofnetizens) ఇటవలి ఒక సందర్భంగా షోయబ్ ఆటోగ్రాఫ్‌లు ఇస్తుండగా సనా మొఖం తిప్పుకోవడం, ఒకరికొకరు మాట్లాడుకోకుండా సీరియస్‌గా ఉండటం ఒకే సోఫాలో కూర్చున్నప్పటికీ దూరం దూరంగా ఉన్న వీడియో వైరల్ అయింది. దీంతో మూడో పెళ్లి ముచ్చట కూడా మూణ్నాళ్లే.. ఇద్దరి మధ్య మాటల్లేవా అంటూ కొందరు, భార్యభర్తల మధ్య ఇలాంటివి మామూలే అని కొందరు నెటిజన్లు కమెంట్స్ చేశారు. అయితే, అటు షోయబ్ గానీ, ఇటు సనా గానీ ఈ విషయంపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు కాగా షోయబ్ మాలిక్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను 2010 ఏప్రిల్ 12న, హైదరాబాద్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి కొడుకు (ఇజాన్) పుట్టాడు. విభేదాల కారణంగా 2023లో విడిపోయిన సంగతి తెలిసిందే. -
అదంతా పీఆర్ స్టంట్.. నోరు విప్పుతానని చాహల్ భయపడ్డారు: ధనశ్రీ వర్మ
ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను పెళ్లాడారు. 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన వీరిద్దరు మనస్పర్థలు రావడంతో ఈ ఏడాది తమ బంధానికి ఎండ్ కార్డ్ పడేశారు. ఫిబ్రవరి అఫీషియల్‌గా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి యుజ్వేంద్ర చాహల్ ప్రముఖ ఆర్జే మహ్వశ్తో డేటింగ్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి.అయితే ఇవన్నీ పక్కనపెడితే ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోన్న చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడాకుల సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. చాహల్‌ను తాను మోసం చేశానంటూ పలు కథనాలొచ్చాయి. తాజాగా వీటిపై ధనశ్రీ వర్మ రియాక్ట్ అయింది. ఇదంతా నెగెటివ్ పీఆర్లో భాగంగానే చేశారని విమర్శించింది. ఓ ఎపిసోడ్లో మరో కంటెస్టెంట్ అర్బాజ్ పటేల్ చాహల్‌ను ధనశ్రీ మోసం చేసిందని తాను విన్నానని ఆమెతో చెప్పాడు.దీనిపై ధనశ్రీ స్పందిస్తూ.. 'అలాంటి వాళ్లు నా గురించి ఇలాంటి చెత్త మాటలు వ్యాప్తి చేస్తారు. నేను నోరు తెరుస్తానేమోనని భయపడుతున్నాడు. నా నోరు మూయించడానికే ఇదంతా చేస్తున్నారు. అసలేం జరిగిందో నిజమైన వివరాలు చెబితే.. ఈ షో మీకు మరోలా అనిపిస్తుంది. ఆర్జే మహ్వశ్తో రిలేషన్‌పై ధనశ్రీ మాట్లాడింది. నాకు చాహల్‌తో విడాకులు అయిపోయాయి. అతని గాసిప్స్ గురించి నాకు అక్కర్లేదు. నా లైఫ్‌లో అదొక ముగిసిన అధ్యాయం. పెళ్లి అనే బంధంలో ఉన్నప్పుడు బాధ్యాతాయుతంగా ఉండాలి. ఇతరుల గౌరవాన్ని కూడా మనం కాపాడేలా వ్యవహరించాలి. మన ఇమేజ్ కోసం మరొకరిని ఎందుకు తక్కువ చేయాలి? మీరు నా గురించి ఎంత నెగెటివ్‌గా మాట్లాడినా దాంతో మీకెలాంటి ఊపయోగం లేదు. మీ టైమ్ వేస్ట్ తప్ప' అని పంచుకుంది. -
'అందుకే చాహల్‌ను అగౌరవపరచలేదు'.. మాజీ భార్య ధనశ్రీ వర్మ
కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ గురించి పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే క్రికెటర్ చాహల్ పెళ్లాడిన ఆమె.. కొన్నేళ్లకే వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పడేసింది. 2020లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చాహల్, ఆర్జే మహ్వశ్తో డేటింగ్లో ఉన్నట్లు కథనాలొచ్చాయి. వీరిద్దరు తమ వస్తున్న రూమర్స్‌పై ఇప్పటి వరకు స్పందించలేదు.అయితే చాహల్‌తో విడాకుల తర్వాత మాజీ భార్య ధనశ్రీ వర్మ ఈ విషయంపై మాట్లాడింది. రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్లో పాల్గొన్న ధనశ్రీ వర్మ విడాకుల తర్వాత తనను చాలా అగౌవరంగా మాట్లాడారని గుర్తు చేసుకుంది. అయితే తాను తిరిగి చాహల్ పట్ల అగౌరవపరిచేలా వ్యవహరించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఎందుకంటే ఒకప్పుడు అతను నా భర్త కావడం వల్లే తనకు గౌరవం ఉందని పేర్కొంది.మీరు బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు.. ఇతరులను గౌరవించడం కూడా మీ చేతుల్లో ఉంటుందని ధనశ్రీ వర్మ అన్నారు. ఒక మహిళగా నాకు ఈ విషయాలు చెప్పే హక్కు లేదా? అని ప్రశ్నించారు. అతను నా భర్త.. నేను వివాహం చేసుకున్నప్పుడు కూడా చాహల్‌ను గౌరవించానని తెలిపింది. మన ఇమేజ్ కోసం ఇతరులను తక్కువ చేయాల్సిన అవసరం లేదన్నారు. నాపై ఎంత నెగెటివ్ ప్రచారం చేసినా.. ఎంత బ్యాడ్‌గా చెప్పినా.. మీ టైమ్ వేస్ట్ తప్ప ఎలాంటి ఫలితం ఉండదని ధనశ్రీ వర్మ పేర్కొన్నారు. -
రెండో భర్తతో విడాకులు.. ఆ విషయంలో వదిలిపెట్టేది లేదన్న బుల్లితెర నటి!
బాలీవుడ్ బుల్లితెర నటి దల్జీత్ కౌర్ చెప్పాల్సిన పనిలేదు. సినీ కెరీర్ కంటే వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మొదటి భర్తతో విడిపోయినా ఆమె.. రెండో పెళ్లి కూడా కలిసిరాలేదు. వ్యాపారవేత్త నిఖిల్ పటేల్‌ను రెండో పెళ్లి చేసుకోగా.. ఆతర్వాత విభేదాలు రావడంతో విడిపోయారు. 2023లో వీరిద్దరు పెళ్లి పీటలెక్కగా కొన్ని నెలలకే విడిపోతున్నట్లు ప్రకటించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దల్జీత్ కౌర్ తన విడాకులపై మరోసారి మాట్లాడింది. తన మాజీ భర్త నిఖిల్ పటేల్‌పై విమర్శలు చేసింది. విడిపోయాక తన లైఫ్‌లో ఎదుర్కొన్న భావోద్వేగ పరిస్థితులను పంచుకుంది. ఈ విషయంలో నిఖిల్ పటేల్ తనకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది. ఈ విషయంలో మాత్రం తాను మౌనంగా ఉండనని స్పష్టం చేసింది. అతను క్షమాపణ చెప్పేవరకు పోరాటం చేస్తానని దల్జీత్ కౌర్ తెలిపింది.దల్జీత్ కౌర్ మాట్లాడుతూ.. 'పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ నా లైఫ్‌లో మళ్లీ ఇలా జరగడం చాలా కోపం తెప్పించింది. ఈ విషయంలో తాను మౌనంగా ఉండనన్న విషయం నిఖిల్ తెలుసుకోవాలి. అతను నాకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఈ విషయంలో నా ఊపిరి ఉన్నంత వరకు పోరాడతా. నాకు అతని వద్ద నుంచి క్షమాపణ రావాలి. దానికోసం ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్తా ' అని అన్నారు.కాగా.. నిఖిల్‌తో పెళ్లి తర్వాత కెన్యా వెళ్లిన ఆమె కేవలం పది నెలలకే ఇండియాకు తిరిగొచ్చింది. తన కుమారుడితో సహా వచ్చిన తర్వాత అతనిపై తీవ్ర విమర్శలు చేసింది. నిఖిల్ తనను మోసం చేశాడని ఆరోపణలు చేసింది. అతనికి మరొకరితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని..తనను మానసిక వేధింపులకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత నిఖిల్ తన స్నేహితురాలు సఫీనా నాజర్‌తో కూడా ముంబయిలో కనిపించారు.2009లో మొదటి పెళ్లి..కాగా చూపులు కలిసిన శుభవేళ (ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూ) ఫేమ్ దల్జీత్.. 2009లో నటుడు షాలిన్ బానోత్‌ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా జైడన్ అనే కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత జంట మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఓ పార్టీలో నిఖిల్ అనే వ్యక్తిని కలిసింది. ఇతడు కూడా మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కావడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. -
15 ఏళ్ల వివాహ బంధానికి బుల్లితెర నటి గుడ్ బై..!
సినీ ఇండస్ట్రీలో విడాకులు అనే పదం కామన్‌గా అయిపోయింది. కొన్నేళ్ల పాటు కలిసి ఉన్న జంటలు అభిమానులకు సడన్‌గా ఇలాంటి షాక్‌లు ఇస్తుంటారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి సింపుల్ కౌల్ తన వివాహా బంధానికి ఎండ్ కార్డ్ పడేసింది. 15 ఏళ్ల తర్వాత తన భర్త, వ్యాపారవేత్త రాహుల్ లూంబాతో విడిపోతున్నట్లు ప్రకటించింది.(ఇది చదవండి: చెఫ్‌గా మారిన శోభిత ధూళిపాళ్ల.. నాగచైతన్య కామెంట్ చూశారా?)భర్తతో విడాకులపై సింపుల్ కౌల్ మాట్లాడుతూ.. "అవును మేమిద్దరం ఇటీవలే విడిపోయాం. మేము పరస్పరం చాలా పరిణతి చెందిన మనుషులం. నా జీవితంలో చాలా సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నా. ఇకపై మేమిద్దరం పరస్పర నిర్ణయంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం' అని తెలిపింది. గత ఇంటర్వ్యూలో సింపుల్ కౌల్ మాట్లాడుతూ.."అతను విదేశాల్లో ఎక్కువ రోజులు ఉంటారు. కొన్నిసార్లు నేను అతనిని మిస్ అవుతూ ఉంటా. కానీ మా మధ్య మంచి అవగాహన ఉంది. మా బంధం చాలా బలంగా ఉంటుంది. అందుకే మా జీవితాన్ని సమతుల్యంగా చేసుకున్నా. ఆయన లేనప్పుడు నా కెరీర్‌పై కూడా దృష్టి పెట్టగలుగుతున్నా. మా ఇద్దరికీ సంతోషకరమైన పనితో పాటు జీవితంలో సమానంగా ఎదుగుతున్నాం" అని తెలిపింది.కాగా.. సింపుల్ కౌల్, రాహుల్ లూంబా 2010లో వివాహం చేసుకున్నారు. కుస్సుమ్తో తన కెరీర్ ప్రారంభించిన సింపుల్ కౌల్ పలు బాలీవుడ్ సీరియల్స్‌లో మెప్పించింది. అంతేకాకుండా 'శరరత్', 'తారక్ మెహతా కా ఊల్తా చాష్మా', 'యే మేరీ లైఫ్ హై' వంటి అనేక ప్రముఖ రియాలిటీ షోలలో కనిపించింది. సింపుల్ కౌల్ చివరిసారిగా 2022లో జిద్ది దిల్ మానే నా అనే సీరియల్లో కనిపించారు. అయితే విడిపోవడానికి గల కారణాన్ని ఆమె వెల్లడించలేదు. View this post on Instagram A post shared by Simple Kaul (@simplekaul) -
మాటలు..బంధానికి బీటలు
అ..అతడు.. ఆ.. ఆమె.. ఇద్దరూ పక్కపక్కనే ఉండే అక్షరాలు. నూరేళ్ల జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాల్సిన ఆలుమగలు. ఒకరికొకరం అనుకుంటూ ముందుకు నడవాల్సిన వారి మధ్య దూరం పెరుగుతోంది. కలిసి నడవాల్సిన పాదాలు తడబడుతున్నాయి. సర్దుకుపోలేమంటూ విడిపోయేందుకు సిద్ధపడుతున్నారు. మనస్సును మరింతగా మురిపించాల్సిన గిల్లికజ్జాల స్థానంలో అనుమానపు బీజాలు పడుతున్నాయి. చిలిపి చేష్టలు..అల్లరిగా గడపాల్సిన భార్యభర్తలు తమ జీవితాలను అల్లరిపాలు చేసుకుంటున్నారు. పని ఒత్తిడిలో మాటలు దూరమై.. కాపురాలు కాలదన్నుకునేంతవరకు వెళుతున్నారు. సరిదిద్దే పెద్దలు లేక ఎడముఖం..పెడముఖంగా సాగుతున్నారు. చివరకు ఈ కాపురం మావల్ల కాదంటూ విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు అర్బన్: పెళ్లంటే.. ప్రీ వెడ్డింట్ షూట్. ఎంగేజ్మెంట్ షూట్. బ్యాచ్‌లర్ పార్టీ. సంగీత్, మెహందీ.. ఆకాశమంత పందిరి.. మేళ తాళాలు. మూడుముళ్లు. మరి ఆ మూడు ముళ్లు పడిన మూడు నెలల తరువాత..? విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం. ఎంత వైభవంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయో.. అంతే తొందరగా విడాకులకు సైతం ఉబలాట పడుతున్నారు. విడిపోయాక.. అదే జంట వాళ్లతోనే ప్రేమలో కూడా పడుతున్నారు. ఒకప్పుడు మహానగరాల్లో మాత్రమే కనిపిస్తున్న ఈ పోకడ.. ఇప్పుడు చిత్తూరు లాంటి నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. అర్థం కావడంలేదు ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకుంటున్న యువతరానికి వైవాహిక బంధం అంత సులువుగా అర్థం కావడంలేదు. ప్రేమ, పెళ్లి వరకు ఉంటున్న ఆసక్తి.. పెళ్లి తరువాత కొనసాగనంటోంది. ప్రేమికులుగా ఉన్నపుడు బాధ్యత ఉండదు. మూడుముళ్లు పడేటప్పుడు వరి్ణంచడానికి వీలుకాని మధుర క్షణాలు.. అటు తరువాత నిలకడగా ఉండడంలేదు. దీనికి కారణం ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడమేనని మానసిక వైద్య నిపుణులు, మధ్యవర్తిత్వం చేసే కౌన్సెలర్లు స్పష్టం చేస్తున్నారు.పెళ్లయిన కొత్త జంటలో ఒకరు ఉద్యోగం చేస్తుంటే, మరొకరు ఇంట్లో ఒంటరిగా ఉండలేక.. కుటుంబ సభ్యులతో మనస్తత్వం కలవక.. విడాకులవైపు అడుగులు వేస్తున్నారు. ఒకవేళ ఇద్దరూ ఉద్యోగులైతే ఇక్కడ కూడా చాలా జంటల్లో సమస్య తలెత్తుతోంది. ఇంటి పనుల్లో ఇద్దరి మధ్య సమన్వయం కుదరకపోవడం, పనిచేసే ఆఫీసులో ఎదురయ్యే ఒత్తిడి, సమస్యలు భాగస్వామిపై చూపించేసి.. ఇక కలిసి ఉండలేమని నెలల్లోనే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఒక్క చిత్తూరు నగరంలోనే గత ఎనిమిది నెలల్లో 183 మంది విడాకుల కోసం కోర్టు మెట్లక్కారు. ఇందులో పెళ్లయిన సంవత్సరంలోపు విడాకుల కోరుకుంటున్న వారి సంఖ్య 32 శాతం ఉండడం వివాహ బంధంపై ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. విడగొడుతున్న ‘సెల్’ భూతం దంపతులు విడిపోతుండటానికి ప్రధాన కారణం మాత్రం సెల్‌ఫోన్‌గా తెలుస్తోంది. కొత్తగా పెళ్లయిన జంటలు అర్థరాత్రి వరకు సోషల్ మీడియాలో గడుపుతుండడం, తన భాగస్వామిని పట్టించుకోకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడడం, కొందరు అవధుల్లేని విశృంఖల కోరికలు కోరడం లాంటివి అవతలి వ్యక్తికి జీవితంపై విరక్తి పుట్టిస్తోంది. ఇటీవల చిత్తూరు పోలీసుల వద్దకు కౌన్సెలింగ్‌కు వచ్చిన ఓ జంట ‘మాకు పెళ్లయ్యి 38 రోజులయ్యింది. నా భర్త వేకువజామున 3 గంటల వరకు కూడా పబ్జీ ఆడుకుంటున్నాడు. ఒక రోజు, రెండు రోజులు.. కానీ ప్రతిరోజూ ఇదే తంతు. ఇతనితో కలిసి ఉండడం నావల్ల కాదు..’ అంటూ 22 ఏళ్ల యువతి తన ఆవేదనను వ్యక్తం చేయడం అక్కడున్న కౌన్సెలర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. పడకగదిలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లడం తమ ప్రేమానురాగాలు, దాంపత్యజీవితాన్ని మూడో వ్యక్తికి చూపించడమే అవుతుందని చాలా మందికి అర్థం కావడంలేదు. విడిపోయి ఒక్కటిగా..!చిత్తూరు నగరానికి చెందిన శుభ ప్రభుత్వ ఉద్యోగి. భర్త లలిత్ అసిస్టెంట్ బ్యాంకు మేనేజర్.. రెండేళ్లపాటు సాగిన వీళ్ల దాంపత్యానికి ఇటీవల గుడ్‌బై చెప్పి, విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న మూడు నెలల తరువాత తరచూ ఈ జంట కలుస్తుండడం, సినిమాలు, షాపింగ్‌లకు వెళ్లడం.. అటు తరువాత ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోవడం. ఇటీవల ట్రెండ్‌లోకి వచ్చిన ఈ పద్ధతులను క్యాజువల్, నాన్–కమిటెడ్ రిలేషన్, వన్నైట్ స్టాండ్, షార్ట్‌టెర్మ్, లో–ఇంటిమెసీ రిలేషన్íÙప్ లాంటి రకరకాల సహ జీవన విధానాలు సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ తెలుస్తున్నాయి. పెళ్లి లాంటి బంధాలకన్నా.. మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతూ, తమకు కావాల్సిన బంధాలను కొనసాగిస్తున్నారు. సర్దుకుంటున్న వాళ్లు చాలా తక్కువ.. విడాకుల కోసం న్యాయస్థానం మెట్లకెక్కుతున్న జంటలకు మేము కౌన్సెలింగ్ ఇస్తుంటాం. ఈ మధ్య ఒకటి గమనించాం. దంపతులు సర్దుకోవడం, మళ్లీ కలిసి ఉండడం అనే ప్రస్తావనను ఏమాత్రం ఒప్పుకోనంటున్నారు. ఆర్థిక స్తిరత్వం ఉన్నవాళ్లు అస్సలు కలిసి ఉండడానికి ఇష్టపడడంలేదు. మారుతున్న తరాలకు మధ్య స్వేచ్ఛ, ఒంటరితనం, నచ్చినట్టు బతకడం, భర్త–భార్య ఒకరినొకరు ప్రశ్నించకుండా ఉండాలనుకోవడం లాంటివి ఎక్కువగా కోరుకుంటున్నారు. – చక్రవర్తిరెడ్డి, న్యాయవాది, చిత్తూరు చట్టపరంగానే.. వివాహ బంధం గొప్పదే. కానీ ఒకరిపై ఒకరికి తప్పకుండా గౌ రవం, నమ్మకం ఉండాలి. అవిలేకుండా చాలా మంది విడిపోవడానికి మొగ్గు చూపిస్తున్నా రు. ఇంట్లో గొడవ అని వచ్చే దంపతులకు మంచీ– చెడు చెప్పి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. ఇక కలిసి ఉండలేము, కేసులు పెట్టండి అని కొందరు వస్తుంటారు. మెయింటెనన్స్, భరణం కోసం వచ్చేవాళ్లకు చట్టపరంగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నాం. – టి.సాయినాథ్, డీఎస్పీ, చిత్తూరు -
పొద్దున మూడింటిదాకా పబ్జీ.. పెళ్లయిన నెలకే విరక్తి చెందిన భార్య
అ..అతడు.. ఆ.. ఆమె.. ఇద్దరూ పక్కపక్కనే ఉండే అక్షరాలు. నూరేళ్ల జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాల్సిన ఆలుమగలు. ఒకరికొకరం అనుకుంటూ ముందుకు నడవాల్సిన వారి మధ్య దూరం పెరుగుతోంది. కలిసి నడవాల్సిన పాదాలు తడబడుతున్నాయి. సర్దుకుపోలేమంటూ విడిపోయేందుకు సిద్ధపడుతున్నారు. మనస్సును మరింతగా మురిపించాల్సిన గిల్లికజ్జాల స్థానంలో అనుమానపు బీజాలు పడుతున్నాయి. చిలిపి చేష్టలు..అల్లరిగా గడపాల్సిన భార్యభర్తలు తమ జీవితాలను అల్లరిపాలు చేసుకుంటున్నారు. పని ఒత్తిడిలో మాటలు దూరమై.. కాపురాలు కాలదన్నుకునేంతవరకు వెళుతున్నారు. సరిదిద్దే పెద్దలు లేక ఎడముఖం..పెడముఖంగా సాగుతున్నారు. చివరకు ఈ కాపురం మావల్ల కాదంటూ విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు అర్బన్: పెళ్లంటే.. ప్రీ వెడ్డింట్ షూట్. ఎంగేజ్మెంట్ షూట్. బ్యాచ్‌లర్ పార్టీ. సంగీత్, మెహందీ.. ఆకాశమంత పందిరి.. మేళ తాళాలు. మూడుముళ్లు. మరి ఆ మూడు ముళ్లు పడిన మూడు నెలల తరువాత..? విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం. ఎంత వైభవంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయో.. అంతే తొందరగా విడాకులకు సైతం ఉబలాట పడుతున్నారు. విడిపోయాక.. అదే జంట వాళ్లతోనే ప్రేమలో కూడా పడుతున్నారు. ఒకప్పుడు మహానగరాల్లో మాత్రమే కనిపిస్తున్న ఈ పోకడ.. ఇప్పుడు చిత్తూరు లాంటి నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. అర్థం కావడంలేదు ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకుంటున్న యువతరానికి వైవాహిక బంధం అంత సులువుగా అర్థం కావడంలేదు. ప్రేమ, పెళ్లి వరకు ఉంటున్న ఆసక్తి.. పెళ్లి తరువాత కొనసాగనంటోంది. ప్రేమికులుగా ఉన్నపుడు బాధ్యత ఉండదు. మూడుముళ్లు పడేటప్పుడు వరి్ణంచడానికి వీలుకాని మధుర క్షణాలు.. అటు తరువాత నిలకడగా ఉండడంలేదు. దీనికి కారణం ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడమేనని మానసిక వైద్య నిపుణులు, మధ్యవర్తిత్వం చేసే కౌన్సెలర్లు స్పష్టం చేస్తున్నారు. పెళ్లయిన కొత్త జంటలో ఒకరు ఉద్యోగం చేస్తుంటే, మరొకరు ఇంట్లో ఒంటరిగా ఉండలేక.. కుటుంబ సభ్యులతో మనస్తత్వం కలవక.. విడాకులవైపు అడుగులు వేస్తున్నారు. ఒకవేళ ఇద్దరూ ఉద్యోగులైతే ఇక్కడ కూడా చాలా జంటల్లో సమస్య తలెత్తుతోంది. ఇంటి పనుల్లో ఇద్దరి మధ్య సమన్వయం కుదరకపోవడం, పనిచేసే ఆఫీసులో ఎదురయ్యే ఒత్తిడి, సమస్యలు భాగస్వామిపై చూపించేసి.. ఇక కలిసి ఉండలేమని నెలల్లోనే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఒక్క చిత్తూరు నగరంలోనే గత ఎనిమిది నెలల్లో 183 మంది విడాకుల కోసం కోర్టు మెట్లక్కారు. ఇందులో పెళ్లయిన సంవత్సరంలోపు విడాకుల కోరుకుంటున్న వారి సంఖ్య 32 శాతం ఉండడం వివాహ బంధంపై ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తోంది.విడగొడుతున్న ‘సెల్’ భూతం దంపతులు విడిపోతుండటానికి ప్రధాన కారణం మాత్రం సెల్‌ఫోన్‌గా తెలుస్తోంది. కొత్తగా పెళ్లయిన జంటలు అర్థరాత్రి వరకు సోషల్ మీడియాలో గడుపుతుండడం, తన భాగస్వామిని పట్టించుకోకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడడం, కొందరు అవధుల్లేని విశృంఖల కోరికలు కోరడం లాంటివి అవతలి వ్యక్తికి జీవితంపై విరక్తి పుట్టిస్తోంది. ఇటీవల చిత్తూరు పోలీసుల వద్దకు కౌన్సెలింగ్‌కు వచ్చిన ఓ జంట ‘మాకు పెళ్లయ్యి 38 రోజులయ్యింది. నా భర్త వేకువజామున 3 గంటల వరకు కూడా పబ్జీ ఆడుకుంటున్నాడు. ఒక రోజు, రెండు రోజులు.. కానీ ప్రతిరోజూ ఇదే తంతు. ఇతనితో కలిసి ఉండడం నావల్ల కాదు..’ అంటూ 22 ఏళ్ల యువతి తన ఆవేదనను వ్యక్తం చేయడం అక్కడున్న కౌన్సెలర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. పడకగదిలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లడం తమ ప్రేమానురాగాలు, దాంపత్యజీవితాన్ని మూడో వ్యక్తికి చూపించడమే అవుతుందని చాలా మందికి అర్థం కావడంలేదు. సర్దుకుంటున్న వాళ్లు చాలా తక్కువ.. విడాకుల కోసం న్యాయస్థానం మెట్లకెక్కుతున్న జంటలకు మేము కౌన్సెలింగ్ ఇస్తుంటాం. ఈ మధ్య ఒకటి గమనించాం. దంపతులు సర్దుకోవడం, మళ్లీ కలిసి ఉండడం అనే ప్రస్తావనను ఏమాత్రం ఒప్పుకోనంటున్నారు. ఆర్థిక స్తిరత్వం ఉన్నవాళ్లు అస్సలు కలిసి ఉండడానికి ఇష్టపడడంలేదు. మారుతున్న తరాలకు మధ్య స్వేచ్ఛ, ఒంటరితనం, నచ్చినట్టు బతకడం, భర్త–భార్య ఒకరినొకరు ప్రశ్నించకుండా ఉండాలనుకోవడం లాంటివి ఎక్కువగా కోరుకుంటున్నారు. – చక్రవర్తిరెడ్డి, న్యాయవాది, చిత్తూరు చట్టపరంగానే.. వివాహ బంధం గొప్పదే. కానీ ఒకరిపై ఒకరికి తప్పకుండా గౌ రవం, నమ్మకం ఉండాలి. అవిలేకుండా చాలా మంది విడిపోవడానికి మొగ్గు చూపిస్తున్నా రు. ఇంట్లో గొడవ అని వచ్చే దంపతులకు మంచీ– చెడు చెప్పి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. ఇక కలిసి ఉండలేము, కేసులు పెట్టండి అని కొందరు వస్తుంటారు. మెయింటెనన్స్, భరణం కోసం వచ్చేవాళ్లకు చట్టపరంగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నాం. – టి.సాయినాథ్, డీఎస్పీ, చిత్తూరు -
వినాయకుడి సాక్షిగా విడాకులపై హన్సిక క్లారిటీ
కొన్నేళ్ల ముందు సెలబ్రిటీలు ఎవరైనా సరే విడాకులు తీసుకుంటే సోషల్ మీడియాలో ఫొటో లేదంటే నోట్ పెట్టేవారు. కానీ రీసెంట్ టైంలో మాత్రం ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడం లాంటివి చేస్తున్నారు. గత కొన్నిరోజుల నుంచి ఇలానే హీరోయిన్ హన్సిక విడాకుల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈమె కూడా పెళ్లి ఫొటోలన్నీ తీసేయడంతో ఇవి నిజమేనని అందరూ అనుకుంటున్నారు.ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా పూజ చేసిన హన్సిక.. భర్త లేకుండానే కనిపించింది. అలానే ఫొటోలు పోస్ట్ చేయగా ఇందులోనూ ఒంటరిగానే కనిపించింది. మెడలో తాళిబొట్టు కూడా లేదు. దీంతో విడాకులు కచ్చితమే అని ఈమెనే పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లయింది. ప్రస్తుతం ఈమె తల్లితో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఆరో నెల గర్బిణితో నటుడి రెండో పెళ్లి.. ఇప్పుడు మరో ట్విస్ట్)2022 డిసెంబర్లో సోహైల్ కతూరియా అనే బిజినెస్‌మ్యాన్‌ని హన్సిక పెళ్లి చేసుకుంది. సోహైల్‌కు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితోనే అతడికి ఇంతకుముందు వివాహమైంది. కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు హన్సిక నుంచి కూడా విడిపోయినట్లు కనిపిస్తున్నాడు. హన్సిక-సోహైల్ తమ పెళ్లి వేడుకని 'లవ్ షాదీ డ్రామా' పేరుతో డాక్యుమెంటరీ సిరీస్ చేసి ఓటీటీలోనూ రిలీజ్ చేయడం విశేషం.హన్సిక కెరీర్ విషయానికొస్తే 'దేశముదురు' సినిమాతో హీరోయిన్గా మారిన ఈమె.. తెలుగు, తమిళంలో చాలా మూవీస్ చేసింది. ప్రస్తుతానికి కొత్త చిత్రాలేం చేస్తున్నట్లు లేదు. మధ్యలో ఒకటి రెండు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించింది.(ఇదీ చదవండి: హీరోయిన్ తో నిశ్చితార్థం చేసుకున్న హీరో విశాల్) -
ఆమెతో పెళ్లి, విడాకులు.. తొలిసారి స్పందించిన షమీ
టీమిండియా ఉత్తమ ఫాస్ట్బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు మహ్మద్ షమీ (Mohammed Shami). ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ కుడిచేతివాటం పేసర్ దేశీ క్రికెట్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ జాతీయ జట్టులోకి వచ్చాడు. అంచెలంచెలుగా ఎదిగి భారత పేస్ విభాగంలో కీలక ఆటగాడిగా మారాడు.అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 64 టెస్టులు, 108 వన్డేలు, 25 టీ20 మ్యాచ్‌లు ఆడిన షమీ.. ఆయా ఫార్మాట్లలో 229చ 206, 27 వికెట్లు కూల్చాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా టీమిండియాకు చివరగా ఆడిన షమీ.. ప్రస్తుతం దులిప్ ట్రోఫీ-2025 టోర్నీతో బిజీగా ఉన్నాడు.సాఫీగా సాగని వ్యక్తిగత జీవితంఆట పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న 34 ఏళ్ల షమీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్లో చీర్ లీడర్‌గా పనిచేసిన హసీన్ జహాన్ (Hasin Jahan)ను ప్రేమించిన షమీ 2014లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది.అయితే, కొన్నేళ్ల క్రితం వీరి బంధం బీటలు వారగా.. హసీన్ జహాన్ షమీపై సంచలన ఆరోపణలు చేసింది. షమీ స్త్రీలోలుడని, మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేస్తాడని.. తనపై గృహహింసకు పాల్పడ్డాడంటూ తీవ్ర ఆరోపణలతో అతడిని కోర్టు మెట్లు ఎక్కించింది. అంతేకాదు.. భరణంగా నెలకు రూ. 10 లక్షలు చెల్లించేలా తీర్పునివ్వాలని న్యాయస్థానానికి విన్నవించుకుంది.తొలిసారి స్పందించిన షమీఈ క్రమంలో ఇటీవలే కోల్‌కతా కోర్టు ఈ విషయంలో తీర్పునిచ్చింది. నెలకు రూ. 4 లక్షలు భరణంగా చెల్లించాలని షమీని ఆదేశించింది. ఈ పరిణామాల గురించి షమీ తొలిసారి స్పందించాడు. ‘‘ఆ విషయాన్ని వదిలేయడమే మంచిది. గతం గురించి నేనెప్పుడూ ఆలోచించను.జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయంలో ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదు. నన్ను నేను కూడా నిందించుకోను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం కేవలం క్రికెట్ మీద మాత్రమే ఉంది. నాకు వివాదాల్లో తలదూర్చడం ఏమాత్రం ఇష్టం లేదు’’ అని షమీ పేర్కొన్నాడు.వివాదాలకు నేను దూరంఈ సందర్భంగా.. భార్య ధనశ్రీ వర్మతో ఇటీవల విడాకులు తీసుకున్న టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ గురించి షమీకి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘దాని గురించి విచారణ చేయడం మీ పని. మమ్మల్ని చావు అంచులదాకా తీసుకువెళ్లాలని మీరు ఎందుకు అనుకుంటారు? నాణేనికి మరోవైపు కూడా చూడండి. ముందుగానే చెప్పాను.. నా దృష్టంతా ఆట మీదనే.. వివాదాలకు నేను దూరం’’ అని షమీ కుండబద్దలు కొట్టాడు. చదవండి: టాలీవుడ్ హీరోయిన్‌తో పృథ్వీ షా ప్రేమాయణం..! -
'ఆ దేవుడు దిగి వచ్చినా మమ్మల్ని విడదీయలేడు'.. విడాకులపై గోవిందా భార్య
గత కొంతకాలంగా బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా ఆయన భార్యతో విడిపోతున్నారంటూ రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో చాలాసార్లు ఈ టాపిక్ తెరపైకి వచ్చినా.. ఆయన భార్య సునీతా వాటిని కొట్టిపారేసింది. ఇటీవల మరోసారి ఈ జంట విడాకులకు సిద్ధమయ్యారంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత వీటిని గోవిందా తరఫు లాయర్ ఖండించారు. వీరిద్దరి విడాకులకు సంబంధించి ఏ కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేయలేదని అభిమానులకు వెల్లడించారు.ఇవాళ వినాయక చవితి సందర్భంగా తమపై వస్తున్న విడాకుల రూమర్లకు చెక్ పెట్టారు గోవిందా దంపతులు. గణనాథునికి సతీసమేతంగా పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా గోవిందా భార్య సునీతా అహుజా తమపై వస్తున్న విడాకుల రూమర్స్‌పై స్పందించారు. ఆ దేవుడు కూడా తమను వేరు చేయలేడంటూ కామెంట్స్ చేసింది. అలాంటి వార్తలు నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. దీంతో వీరిద్దరిపై వస్తున్న డివోర్స్ రూమర్స్‌కు ఇక చెక్ పడినట్లే.విడాకుల వార్తలపై సునీతా మాట్లాడుతూ.. "ఏదైనా జరిగి ఉంటే ఈరోజు మేము చాలా దగ్గరగా ఉండేవాళ్లం కాదు. మా మధ్య మరింత దూరం ఉండేది. పై నుంచి దేవుడు దిగి వచ్చినా మమ్మల్ని ఎవరూ విడదీయలేరు. నా గోవిందా నా వాడు మాత్రమే, మరెవరికి ఆయన హృదయంలో స్థానం లేదు. కాదు. మేము నోరు తెరిచి చెప్పే వరకు దయచేసి మా గురించి వచ్చే వార్తలను నమ్మొద్దు" అని హితవు పలికింది. కాగా.. గోవింద భార్య సునీతా అహుజా తన యూట్యూబ్ ఛానెల్లో ఓ భావోద్వేగ వీడియోను షేర్ చేయడంతో విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. సునీత ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేసినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.కాగా.. గోవిందా కూలీ నంబర్ 1, హీరో నంబర్ 1, హసీనా మాన్ జాయేగి, హద్ కర్ ది ఆప్నే, జోడి నంబర్ 1 లాంటి చిత్రాల్లో నటించారు. ఆయన చివరిసారిగా 'రంగీలా రాజా' అనే చిత్రంలో కనిపించారు. #WATCH | Mumbai | Denying rumours of filing for divorce from husband actor Govinda, Sunita Ahuja says, "If something had happened, then we would have been so close today. There would have been a distance between us. No one can separate us, not even if God comes from above... My… pic.twitter.com/Aj5NmlbGNV— ANI (@ANI) August 27, 2025 -
వయసులో తన కంటే పెద్దదైన మహిళను పెళ్లాడిన నటుడు!
ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ తన కంటే వయసులో పెద్దదైన సానియా చందోక్‌ను పెళ్లాడబోతున్నాడు. ఈ విషయంలో తండ్రి బాటలో పయనిస్తున్నాడు. సచిన్ కూడా తన కంటే వయసులో పెద్ద అయిన అంజలిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా మంది ప్రముఖులు ఇదే విధంగా పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 56 ఏళ్ల క్రితం ఓ నటుడు తన కంటే వయసులో 15 ఏళ్లు పెద్దదైన మహిళను పెళ్లాడాడంటే నమ్మగలరా? ఆ నటుడు ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే మీకు బాలీవుడ్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా మొదటి వివాహం గురించి చెప్పాల్సిందే!ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా (Naseeruddin Shah) భార్య రత్న పాఠక్ అని చాలా మందికి తెలుసు. కానీ ఆయన మొదటి భార్య పర్వీన్ మురాద్ గురించి ఎక్కువ మందికి తెలియదు. నటుడిగా నిలదొక్కుకోకముందే ఆయన పెళ్లయిపోయి, విడాకులు కూడా తీసేసుకున్నారు. మొదటి భార్యకు భరణం చెల్లించడానికే 12 ఏళ్ల పాటు కష్టాలు పడ్డారట షా.బాలీవుడ్ షాదీస్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. నసీరుద్దీన్ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు పర్వీన్‌ను మొదటిసారి కలిశారు. అప్పటికి అతడి వయసు 19 ఏళ్లు. 34 ఏళ్ల పర్వీన్ అప్పటికే భర్త నుంచి విడాకులు తీసుకుని తన పిల్లలతో కలిసి జీవిస్తోంది. విద్యార్థిగా ఉన్న షా.. 1969లో సంప్రదాయబద్దంగా పర్వీన్‌ను పెళ్లిచేసుకున్నాడు. సంవత్సరం లోపు వీరికి కూతురు పుట్టింది. ఆమెకు హీబా అని పెట్టుకున్నారు. తర్వాత వీరి వివాహ బంధానికి బీటలు వారాయి.విడాకుల కష్టాలుపర్వీన్ను షా పెళ్లిచేసుకోవడం మొదటి నుంచి నసీరుద్దీన్ కుటుంబానికి ఇష్టం లేదు. విడాకులు తీసుకుని పిల్లలు ఉండడం, వయసులో ఎక్కువ వ్యత్యాసం కారణంగా వీరి వివాహాన్ని ఆమోదించలేదు. ఫలితంగా షా, పర్వీన్ కాపురంలో కలతలు రేగాయి. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. విడాకులు ఇవ్వడానికి పర్వీన్ కుటుంబం భారీగా భరణం చేయడంతో షా ఒప్పుకున్నారు. నటన కొనసాగిస్తూనే భార్యకు భరణం చెల్లించారు. మసూమ్ చిత్రంతో బ్రేక్ రావడంతో తన మాజీ భార్యకు పూర్తిగా భరణం చెల్లించేశారని, దీనికి దాదాపు 12 సంవత్సరాలు పట్టిందని పలు మీడియా నివేదికలు వెల్లడించాయి.రత్న పాఠక్‌తో రెండో పెళ్లి1975లో థియేటర్లో పనిచేస్తున్న సమయంలో నసీరుద్దీన్ షాకు రత్న పాఠక్ (Ratna Pathak) పరిచయం అయ్యారు. వారి మధ్య స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అప్పటికింకా చట్టబద్దంగా షా మొదటి వివాహం రద్దు కాలేదు. రత్న పాఠక్‌ను పెళ్లి చేసుకునే అవకాశం లేకపోవడంతో ఆమెతో సహజీవనం సాగించారు. దాదాపు ఏడేళ్ల పాటు వీరి లివింగ్ రిలేషన్షిప్ కొనసాగింది. 1982లో వీరిద్దరు వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరికి ఇమాద్ షా, వివాన్ షా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తమ వివాహబంధానికి 40 దశాబ్దాలు పూర్తైనా షా, పాఠక్ తమ నటనా జీవితాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు.చదవండి: హీరో నాని ఎంత మందికి ఐలవ్యూ చెప్పాడో తెలుసా?దిగ్గజ నటుడుఉత్తరప్రదేశ్లోని బారబాంకీ పట్టణానికి చెందిన నసీరుద్దీన్ షా.. చదువు పూర్తైన తర్వాత నటనలోకి అడుగుపెట్టారు. రాజేంద్ర కుమార్, సైరా బాను నటించిన అమన్ (1967) సినిమాతో తెరంగ్రేటం చేశారు. నిషాంత్, జునూన్, స్పర్శ్, ఆక్రోస్, మసూమ్, మిర్చ్ మసాలా, త్రికాల్, అర్థ్ సత్య, హమ్ పాంచ్ తదితర సినిమాల్లో నటించి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగానూ ఆయన రాణించారు. ఉత్తమ నటుడిగా మూడు సార్లు జాతీయ, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. -
హన్సికపై విడాకుల రూమర్స్.. హీరోయిన్ రియాక్షన్ ఇదే!
ఇటీవల హీరోయిన్ హన్సిక మోత్వానిపై వ్యక్తిగత జీవితంపై కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. ఆమె త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ కథనాలు వస్తున్నాయి. ఈ నెల ఆగస్టు 9న తన పుట్టినరోజు సందర్భంగా చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. ఈ ఏడాది తనకు చాలా స్పెషల్ అని..ఎన్నో పాఠాలు నేర్పిందంటూ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది. కాగా సోహల్‌కు ఇది రెండో పెళ్లి కావడంతో మనస్పర్థలు వచ్చాయని సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలైంది. దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.(ఇది చదవండి: విడాకుల బాటలో హన్సిక.. కారణం ఇదేనా?)తాజాగా హన్సికి మోత్వానీ ఇండోనేషియాలోని బాలిలో చిల్ అవుతూ కనిపించింది. తన ఫ్రెండ్‌తో కలిసి వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్‌పై వస్తున్న వార్తలు చూసి నవ్వుతూ కనిపించింది. తన వ్యక్తిగత జీవితంపై నెటిజన్స్ కామెంట్స్ చూస్తూ నవ్వుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. నా జీవితంపై ప్రజల అభిప్రాయాన్ని నేను చదివినప్పుడు అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ వీడియోతో తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టేసినట్టే కనిపిస్తోంది. అయితే విడాకుల రూమర్స్‌పై ఇప్పటివరకు హన్సిక కానీ, ఆమె భర్త సోహెల్ కూడా స్పందించలేదు. తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి హన్సిక పెళ్లి ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయడంతో రూమర్స్ మొదలయ్యాయి.కాగా.. 2022 డిసెంబర్లో హన్సిక తన ప్రియుడు సోహైల్‌ని వివాహం చేసుకుంది. సోహల్‌కు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితో ఆయనకు ఇంతకుముందే పెళ్లై విడాకులు తీసుకున్నాడు. వీరి వివాహాన్ని ‘లవ్ షాదీ డ్రామా’ అనే పేరుతో డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా విడుదల చేశారు. -
‘ఆ మాట వినగానే గట్టిగా ఏడ్చేశా.. అతడే ముందుగా వెళ్లిపోయాడు’
టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal) గత కొన్నాళ్లుగా వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma)తో విడాకుల నేపథ్యంలో ఆర్జే మహ్వశ్ (RJ Mahvash)తో అతడు తరచూ కలిసి కనిపించడం డేటింగ్ వదంతులకు ఊతమిచ్చింది. ధనశ్రీతో విడిపోయే ముందు నుంచే వీరిద్దరు చెట్టాపట్టాలు వేసుకుని జంటగా కనిపించడంతో చహల్‌పై ట్రోల్స్ వచ్చాయి.మానసికంగా కుంగిపోయా..ఇటీవల ఈ విషయంపై స్పందిస్తూ.. మహ్వశ్ తనకు స్నేహితురాలు మాత్రమే అని చెప్పిన చహల్.. తన వైవాహిక జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను మనస్ఫూర్తిగా ధనశ్రీని ప్రేమించానని.. అయినప్పటికీ పరిస్థితి విడాకుల దాకా వచ్చిందని పేర్కొన్నాడు. మానసికంగా తీవ్రంగా కుంగిపోయి ఆత్మహత్య ఆలోచనలు కూడా చేశానని వెల్లడించాడు.ఆ మాట వినగానే ఏడ్చేశాఈ నేపథ్యంలో చహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ తాజాగా విడాకుల అంశంపై స్పందించింది. హ్యూమన్స్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘విడాకుల కోసం మేము మానసికంగా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాము. కానీ.. ఆరోజు జడ్జిగారు తీర్పు ఇస్తున్నపుడు నేను భావోద్వేగాలను అదుపుచేసుకోలేకపోయాను.అందరి ముందే గట్టిగా ఏడవడం నాకింకా గుర్తుంది. అసలు అప్పుడు నా మనసులో ఎలాంటి అలజడి చెలరేగుతుందో వేరెవరూ అర్థం చేసుకోలేరు. నేను అలా ఏడుస్తూ ఉండిపోయానంతే. అయినా ఇది జరిగిపోయిన విషయం.అతడే వదిలేశాడుఅతడే (చహల్) ముందుగా వైవాహిక జీవితం నుంచి బయటకు వెళ్లిపోయాడు’’ అంటూ ధనశ్రీ వర్మ తన ఆవేదనను పంచుకుంది. ఇక విడాకుల మంజూరు సందర్భంగా చహల్.. ‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ అనే కోట్ రాసి ఉన్న టీ షర్టు ధరించడం గురించి ధనశ్రీకి ప్రశ్న ఎదురైంది.డ్రామాలు అవసరమా?ఇందుకు బదులిస్తూ.. ‘‘కచ్చితంగా ఇలాంటి విషయాల్లో ఎదుటి వాళ్లు మనల్ని నిందిస్తారు. ఇలాంటి టీ- షర్టు స్టంట్ ఉంటుందని నాకు ముందుగానే తెలుసు. ఈ విషయంలో తప్పంతా నాదేనని చిత్రీకరించేందుకు వాళ్లు సిద్ధంగా ఉంటారనీ తెలుసు.అయినా.. వాట్సాప్‌లో నాకు ఆ మెసేజ్ పెట్టి ఉంటే సరిపోయేది కదా!.. ఈ టీ-షర్టు డ్రామా ఎందుకు?’’ అంటూ ధనశ్రీ చహల్‌కు కౌంటర్ ఇచ్చింది. ఇక తన వైవాహిక జీవితంలో భాగస్వామికి ఎల్లవేళలా మద్దతుగా ఉన్నానని ధనశ్రీ స్పష్టం చేసింది.‘‘నా జీవిత భాగస్వామికి ఎల్లప్పుడూ అండగా ఉన్నాను. ప్రతీ చిన్న, పెద్ద విషయంలో అతడికి తోడుగా ఉన్నాను. మా అన్యోన్యత గురించి అందరికీ తెలుసు. అందుకే విడిపోతున్నామని తెలిసినపుడు నా మనసు అంతగా వేదనకు గురైంది’’ అని ధనశ్రీ తాను చహల్ పట్ల ప్రేమ, అంకితభావంతో మెలిగానని పేర్కొంది.కాగా కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను 2020లో చహల్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పెళ్లైన రెండేళ్లకే విభేదాలు తలెత్తగా ఈ ఏడాది మార్చిలో అధికారికంగా విడిపోయారు. భరణంగా రూ. 4 కోట్ల 75 లక్షలుఈ క్రమంలో కోర్టుకు హాజరైన చహల్.. ‘‘ఆర్థికంగా స్వతంత్రంగా ఉండండి.. మీ బాగోగులు మీరే చూసుకోండి.. ఆర్థిక సాయం, బహుమతుల కోసం ఇతరులపై ఆధారపడకండి’’ అన్న కొటేషన్ ఉన్న నలుపు రంగు టీ- షర్టు ధరించాడు. భరణంగా మాజీ భార్యకు రూ. 4 కోట్ల మేర చెల్లించేందుకు అంగీకరించిన చహల్ ఈ చర్య ద్వారా పరోక్షంగా ధనశ్రీకి కౌంటర్ ఇచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.చదవండి: అక్కకు బెస్ట్ ఫ్రెండ్.. అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్ ఏజ్ గ్యాప్ ఎంతంటే? -
కాపురం చేస్తూనే.. రెండో పెళ్లికి సిద్ధం
తూర్పు గోదావరి: ఓ మహిళతో కాపురం చేస్తూనే.. పెళ్లి పేరుతో మరో యువతిని మోసం చేసేందుకు యత్నించి, తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. సీఐ బీఎన్ పట్నాయక్ వివరాల మేరకు, గోపాలపురం మండలం భీమోలుకు చెందిన యువతికి, దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన పాలి వీరవెంకట సత్యనారాయణతో ఇటీవల వివాహం కుదిరింది. సోమవారం తెల్లవారుజామున స్థానిక ఫంక్షన్ హాల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం వధువు ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు చేశారు. మరో గంటలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు కనిపించడంలేదంటూ వధువు బంధువులకు రాత్రి ఏడు గంటల సమయంలో సమాచారం వచ్చింది. దీంతో కంగారు పడిన ఆమె బంధువులు అసలు వివరాలు సేకరించారు. అంతకు ముందే సత్యనారాయణకు పెళ్లయి, కాపురం చేస్తున్నాడని, అందుకే పెళ్లికి రాకుండా అదృశ్యమైనట్టు సమా చారం అందింది. దీంతో వధువు కుటుంబానికి న్యా యం చేయాలంటూ ఆమె బంధువులు ఆందోళన చేశా రు. సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ పట్నాయక్ తెలిపారు. -
విడాకుల రూమర్స్.. హన్సిక ఆసక్తికర పోస్ట్
హీరోయిన్ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఆమె భర్తకు దూరంగా ఉందని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హన్సిక తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా పుట్టిన రోజు (ఆగస్ట్ 9) వేడుకలు జరుపుకున్న ఆమె.. ఈ ఏడాది తనకు చాలా స్పెషల్ అని..ఎన్నో పాఠాలు నేర్పిందని అన్నారు.‘ఈ ఏడాది(2025) నేను అడగకుండానే నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నాలో నాకు తెలియనంత బలం ఉందని తెలిసేలా చేసింది. ఈ పుట్టినరోజున మీ అందరి శుభాకాంక్షలతో నా హృదయం ఉప్పొంగిపోతోంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్కోసారి చిన్న విషయాలు కూడా ఎంతో ఆనందాన్నిస్తాయి. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని హన్సిక ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీంతో మరోసారి హన్సిక విడాకుల విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.2022 డిసెంబర్లో హన్సిక తన ప్రియుడు సోహైల్‌ని వివాహం చేసుకుంది. సోహల్‌కు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితో ఆయనకు ఇంతకుముందే పెళ్లై విడాకులు తీసుకున్నాడు. వీరి వివాహాన్ని ‘లవ్ షాదీ డ్రామా’ అనే పేరుతో డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా విడుదల చేశారు. పెళ్లయిన రెండేళ్లకే హన్సికకు, భర్తకు మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దీంతో ఇద్దరు విడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం వైరల్ అవుతోంది. సోహల్‌ది పెద్ద కుటుంబం అని, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
విడాకుల బాటలో హీరోయిన్ సంగీత..!
-
ఈ పక్షుల విడాకుల గురించి ముందే తెలిసిపోతుంది!
మనుషుల సామాజిక సంబంధాలు, భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాలు, అలకల గురించి మనకు చాలానే తెలుసు. మరి పక్షుల సంగతి? అనుబంధాలు, ఆప్యాయతలు సరే...వాటిలో కూడా కయ్యాలు, విడిపోవడాలు ఉంటాయా? వాటి సంకేతాలు ఏమిటి?... మొదలైన కోణాలలో ‘గ్రేట్ టిట్’ పక్షులపై అధ్యయనం జరిగింది. ‘యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకులు ‘యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్’ సమన్వయంతో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనం ద్వారా తెలిసిన కీలక విషయం... ‘ఒక పక్షుల జంట విడిపోవడానికి సంబంధించిన సంకేతాలు బ్రీడింగ్ సీజన్ కంటే చాలా ముందుగానే కనిపిస్తాయి’ గతంతో పోల్చితే పక్షుల జంట తక్కువ సమయం మాత్రమే కలిసి ఉండడం, ఎప్పుడో ఒకసారి కలుసుకోవడం... మొదలైనవి అవి విడిపోబోతున్నాయి అని చెప్పడానికి సంకేతాలు. పక్షుల ప్రపంచంలో కొన్ని జంటల అనుబంధాలలో మార్పు రాకుండా, విడిపోకుండా ఉండగలగడానికి కారణం ఏమిటి? కొన్ని జంటలు మాత్రం బ్రీడింగ్ సీజన్‌కు ముందు ఎందుకు విడిపోతాయి? అనే విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ నాన్–బ్రీడింగ్ సీజన్లో పక్షి జంటల ప్రవర్తన ఆధారంగా భవిష్యత్ కాలంలో అవి కలిసి ఉండబోతున్నాయా? విడిపోబోతున్నాయా? అనేది స్పష్టంగా చెప్పవచ్చు అంటున్నారు పరిశోధకులు. (చదవండి: వాట్ ఏ క్రియేటివిటీ..! చీరల దుకాణంలో చాట్‌జీపీటీ తరహాలో..) -
విడాకుల బాటలో మరో సీనియర్ హీరోయిన్!
సినీరంగంలో సెలబ్రిటీస్ పెళ్లి పెద్ద వార్త అయితే విడిపోవడం కూడా పెద్ద వార్తగా మారుతోంది. ఇటీవల ధనుష్, రవిమోహన్ వారి సంసార జీవితం విడాకులకు దారి తీయడం పెద్ద సంచలనానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇలా మరికొన్ని సినీ జంటల్లో విడిపోయిన వారు ఉన్నారు. కాగా తాజాగా మరో సినీ జంట ఈమధ్య ఏర్పడ్డ అభిప్రాయభేదాలు విడాకుల వైపు దారితీస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆ జంటే ఫరెవర్ బహుభాషా నటి సంగీత, గాయకుడు, నటుడు క్రిష్. తమిళం, మలయాళం, కన్నడం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి ప్రముఖ కథానాయికిగా పేరుగాంచిన నటి సంగీత. తెలుగు తమిళం భాషల్లో ప్రముఖ నటుల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట మలయాళ చిత్రంతో తన నట జీవితాన్ని ప్రారంభించిన సంగీత ఆ తర్వాత కన్నడం, తెలుగు, తమిళ భాషల్లో నటించారు. ముఖ్యంగా తమిళంలో విక్రమ్ సరసన నటించిన పితామగన్ చిత్రం సంగీతకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అలా కథానాయకిగా నటిస్తున్న సమయంలోనే 2009లో గాయకుడు క్రిష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. ప్రస్తుతం 46 ఏళ్ల సంగీత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు. కాగా పదహారేళ్లు సాఫీగా, సుఖసంతోషాలతో సాగిన వీరి వివాహ జీవితంలో ఇప్పుడు ముసలం పుట్టిందని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మనస్పర్థల కారణంగా సంగీత, క్రిష్ విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇన్‌స్టాలో పేరు మార్పుసంగీత తన ఇన్‌స్టా ఖాతాలో పేరు మార్చడం ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లైయింది. గతంలో ఇన్‌స్టాలో సంగీత క్రిష్ అని ఉండేది. కానీ ఇప్పుడు సంగీత యాక్ట్‌గా బయో మారింది. దీంతో వీరి మధ్య నిజంగానే మనస్పర్థలు వచ్చాయంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ విడాకుల ప్రచారంలో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై సంగీతగానీ, క్రిష్‌గానీ స్పందిస్తే గాని నిజం బయటపడే అవకాశం ఉంది.సంగీత సినీ కెరీర్ విషయానికొస్తే.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ టాలెంటెడ్ నటి.. మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో మహేశ్ బాబుకు అత్త పాత్ర.. రష్మిక మందన్నాకు తల్లిగా సంగీత నవ్వులు పూయించింది. ఆ తర్వాత మసూద తో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. ప్రస్తుతం కొన్ని రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. -
విడాకుల రూమర్స్.. పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన స్టార్ హీరోయిన్
సౌత్ ఇండియా పాపులర్ హీరోయిన్ హన్సిక(Hansika Motwani) విడాకులు తీసుకోనున్నట్లు కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై ఆమె భర్త సోహైల్ కొద్దిరోజుల క్రితం స్పందిస్తూ.. అందులో నిజం లేదని తేల్చిపారేశాడు. అయినప్పటికీ రూమర్స్ మాత్రం తగ్గలేదు. ఇలాంటి సమయంలో హన్సిక తమ పెళ్లి ఫోటోలను సోషల్‌మీడియా ఖాతల నుంచి తొలగించేసి అశ్చర్య పరిచింది. దీంతో వారి విడాకుల అంశం నిజమనేలా సంకేతాన్ని ఇచ్చింది.2022లో సోహైల్‌తో హన్సిక వివాహబంధంలోకి అడుగుపెట్టింది. అయితే, కొద్దిరోజులుగా భర్తతో మనస్పర్థలు తలెత్తాయని, దీంతో ఇద్దరు విడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సోహల్‌ది పెద్ద కుటుంబం అని, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ నుంచి పెళ్లి ఫోటోలను తొలగించేసింది. దీంతో వారు త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు బలంగా వార్తలు వస్తున్నాయి.సోహైల్‌కు రెండో పెళ్లిసోహైల్, హన్సిక చిన్ననాటి స్నేహితులు.. రింకీ బజాజ్ అనే యువతిని సోహైల్ మొదట పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి హన్సిక కూడా హాజరైంది. కానీ ఆ బంధం ఎంతోకాలం నిలవకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సోహైల్‌తో కనెక్ట్ అయిన హన్సిక అతడిని వివాహం చేసుకుంది. జైపూర్‌లో జరిగిన ఈ పెళ్లి విశేషాలను లవ్ షాదీ డ్రామా వీడియో పేరిట ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. అందులో హన్సిక.. సోహైల్ గతం గురించి చెప్తూ ఎమోషనలైంది. సోహైల్ గతం గురించి తెలుసు, కానీ.. అతడి విడాకులతో తనకు సంబంధం లేదని ఏడ్చేసింది. -
భర్తతో విడాకులు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సైనా నెహ్వాల్
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) అభిమానులకు శుభవార్త చెప్పింది. భర్త పారుపల్లి కశ్యప్ (Parupalli Kasyap)తో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ.. ‘‘దూరం దగ్గర చేసింది’’ అని క్యాప్షన్ ఇచ్చింది. తద్వారా తాము తిరిగి కలిసిపోయామనే సంకేతాలు ఇచ్చింది.కాగా భర్త పారుపల్లి కశ్యప్‌తో తాను విడిపోతున్నట్లు (Divorce) సైనా నైహ్వాల్ గత నెలలో ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జూలై 13న సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.ఆలోచించే విడాకుల నిర్ణయం‘‘జీవితం మనల్ని ఒక్కోసారి వేర్వేరు దిశల్లో ప్రయాణించేలా చేస్తుంది. సుదీర్ఘ చర్చలు, ఆలోచనల అనంతరం నేను, కశ్యప్ విడిపోవాలని నిశ్చయించుకున్నాం. ఈ బంధంలో నాకెన్నో మధురానుభూతులు ఉన్నాయి. ఇకపై కూడా మేము స్నేహితుల్లా కొనసాగుతాం’’ అని సైనా నోట్ విడుదల చేసింది.ఊహించని ట్విస్ట్అయితే, తాజాగా శనివారం పారుపల్లి కశ్యప్‌తో కలిసి దిగిన ఫొటోలను సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘‘కొన్నిసార్లు దూరమే.. మన సన్నిహితులతో కలిసి ఉండటం ఎంత విలువైనదో నేర్పుతుంది. మేము కలిసి ఉండేందుకు మరో ప్రయత్నం చేస్తున్నాం’’ అని రెండు హార్ట్ ఎమోజీలతో సైనా క్యాప్షన్ జతచేసింది. కాగా భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ దగ్గర శిక్షణ తీసుకున్న సైనా, కశ్యప్ చాలా ఏళ్లపాటు ప్రేమించుకున్నారు. 2018లో పెళ్లి బంధంతో ఒక్కటైన వీరు అన్యోన్యంగా ఉండేవారు. కెరీర్ పరంగానూ ఒకరికొరు అండగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేసేవాళ్లు. అయితే, సైనా విడాకుల ప్రకటన చేయగా.. కశ్యప్ మాత్రం అపుడు స్పందించలేదు.ఇక ఇప్పుడు భార్యతో కలిసి పోస్ట్ షేర్ చేస్తూ తమ రీయూనియన్‌ని మాత్రం తెలియజేశాడు. కాగా లండన్ ఒలింపిక్స్-2012లో మహిళల సింగిల్స్ విభాగంలో సైనా కాంస్యం గెలవగా.. అదే ఎడిషన్‌లో కశ్యప్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు.చదవండి: నిప్పుతో చెలగాటం ఆడటమే.. వరల్డ్‌కప్ గెలిస్తే ధోని గొప్పవాడు అయిపోతాడా? View this post on Instagram A post shared by SAINA NEHWAL (@nehwalsaina) -
‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’
న్యూఢిల్లీ: భారత లెగ్‌స్పిన్నర్ యుజువేంద్ర చహల్, ధనశ్రీ వర్మ ఇటీవలే అధికారికంగా విడిపోయారు. అయితే విడాకులకు ముందు తాను తీవ్ర మానసిక వేదనను అనుభవించానని చహల్ చెప్పాడు. కొందరు తనను మోసగాడిగా చిత్రీకరించారని, తాను ఎప్పుడూ మోసం చేయలేదని...తాను ప్రేమించిన వ్యక్తి పట్ల విధేయతతోనే ఉన్నానని అతను పేర్కొన్నాడు. ‘నా విడాకుల తర్వాత నన్ను కొందరు మోసగాడు అన్నారు. కానీ నేను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదు. నేను ఇష్టపడిన వ్యక్తి కోసం ఎంతో ఎక్కువ విధేయతను ప్రదర్శించాను. మనసారా ప్రేమించాను’ అని చహల్ వ్యాఖ్యానించాడు. ధనశ్రీతో విడాకుల దాకా పరిస్థితి వచ్చినప్పుడు మానసికంగా బాగా దెబ్బ తిన్నానని అతను గుర్తు చేసుకున్నాడు. ‘నేను ఎలాంటి వేదనను అనుభవించానో నా సన్నిహితులకు బాగా తెలుసు. జీవితం పట్ల అలసిపోయినట్లు అనిపించింది. రోజులో రెండు గంటలు మాత్రమే పడుకుంటే రెండు గంటల పాటు ఏడుస్తూనే ఉండేవాడిని. ఇది దాదాపు నలభై రోజులు సాగింది. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించా’ అని ఈ స్పిన్ బౌలర్ వెల్లడించాడు. అధికారికంగా విడాకులు తీసుకునే వరకు బయటపడవద్దని...అప్పటి వరకు కలిసే ఉన్నట్లుగా బయట కనిపించేందుకు తాము ప్రయతి్నంచినట్లు అతను చెప్పాడు. మరో వైపు ఇతర అమ్మాయిలతో తనకు ఏదో బంధం ఉన్నట్లుగా వచి్చన వదంతులు మరింతగా బాధపెట్టాయని చహల్ వివరించాడు. ‘ఎవరితోనైనా కనిపిస్తే చాలు సంబంధం అంటగట్టేస్తూ వచ్చారు. నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మహిళలను ఎలా గౌరవించాలో నాకు తెలుసు’ అని చహల్ చెప్పాడు. చహల్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో నార్తాంప్టన్‌షైర్ తరఫున ఆడుతున్నాడు. -
హన్సిక డివోర్స్ లో నిజమెంత..!
-
నటి హన్సిక డివోర్స్..?
-
విడాకుల బాటలో హన్సిక.. కారణం ఇదేనా?
అందానికి మారు పేరు హన్సిక(Hansika Motwani). ఈ ముంబై బ్యూటీ హిందీ, తెలుగు, తమిళం పలు భాషల్లో కథానాయకిగా నటించి పైస్థాయికి చేరుకుంది. అలా అర్ధ సెంచరీకి పైగా చిత్రాలు చేసిన హన్సిక ముఖ్యంగా తమిళంలో ధనుష్, విజయ్, సూర్య, శివకార్తికేయన్, సిద్ధార్థ్ వంటి ప్రముఖ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. కాగా కథానాయకిగా బిజీగా ఉన్న సమయంలోనే 2022లో సోహల్ కత్తూరియా అనే వ్యాపార వేత్తని పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఆడంబరంగా జరిగింది. కాగా సోహల్‌కు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితో ఆయనకు ఇంతకుముందే పెళ్లై విడాకులు తీసుకున్న వ్యక్తి కావడం గమనార్హం. కాగా పెళ్లయిన రెండేళ్లకే హన్సికకు, భర్తకు మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దీంతో ఇద్దరు విడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం వైరల్ అవుతోంది. సోహల్‌ది పెద్ద కుటుంబం అని, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈవ్యవహారంపై ముంబైలోని మీడియా హన్సిక వర్గాన్ని సంప్రదించగా వారు అవునని కానీ కాదని కానీ స్పందించలేదని సమాచారం. అయితే సోహెల్ మాత్రం స్పందిస్తూ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. అయితే ఆయన హన్సిక కలిసి ఉంటున్నారా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఏదేమైనా పెళ్లికి ముందు నటించడానికి అంగీకరించిన కొన్ని చిత్రాలను పూర్తి చేయడానికి హన్సిక సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ఆమె టీవీ కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతగా, పాల్గొంటూ, వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగానే ఉన్నారు. -
శృంగారానికి భార్య నిరాకరించడం క్రూరత్వమే
ముంబై: భర్తతో శృంగారానికి భార్య నిరాకరించడం, అతడిని బహిరంగంగా అవమానించడం, మానసికంగా వేధించడం ముమ్మాటికీ క్రూరత్వమే అవుతుందని బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి సందర్భాల్లో భార్యతో విడాకులు తీసుకొనే హక్కు అతడికి ఉంటుందని స్పష్టంచేసింది. భార్య చేతిలో వేధింపులకు గురైన భర్తకు విడాకులు మంజూరు చేస్తూ పుణే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమరి్థంచింది. పుణేకు చెందిన యువతీ, యువకుడు 2013లో పెళ్లి చేసుకున్నారు. 2014లో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. తనకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఆ యువకుడు పుణే ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. భార్య తనతో శృంగారానికి ఒప్పుకోవడం లేదని, బంధువులు, స్నేహితుల ముందు అవమానిస్తోందని, దివ్యాంగురాలైన తన సోదరిని వేధిస్తోందని పేర్కొన్నాడు. అతడి వాదనను పరిగణనలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ 2015లో ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ యువకుడి భార్య బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనకు విడాకులు అవసరం లేదని, భర్త నుంచి ప్రతినెలా రూ.లక్ష ఇప్పించాలని పేర్కొంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ రేవతి మోహితే, జస్టిస్ నీలా గోఖలేతో కూడిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. భార్య పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. బంధువులు, స్నేహితుల ముందు భర్తను అవమానించడం, అతడితో శృంగారానికి ఒప్పుకోకపోవడం, దివ్యాంగురాలైన సోదరిని వేధించడం వంటివి అతడిని మానసికంగా తీవ్ర అశాంతికి గురి చేశాయని పేర్కొంది. దంపతులు ఇక కలిసి ఉండేందుకు ఆస్కారం లేదని, వారికి విడాకులు మంజూరు చేయడం సమంజసమేనని తేల్చిచెప్పింది. -
సెలబ్రిటీ జంటలు అందుకే విడిపోతున్నారా?
-
పెళ్లి తర్వాత మాత్రం కలిసి ఉండలేకపోతున్నారు
-
విడాకుల తర్వాత కొత్త ప్రయాణం.. మళ్లీ పెళ్లి చేసుకోని తారలు వీళ్లే!
బాలీవుడ్ నటీనటులకు ప్రేమ, పెళ్లి, విడాకులు సర్వసాధారణం అనే టాక్ బయట ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎంతో మంది స్టార్స్ కొన్నాళ్లకే విడిపోయారు. పలువురు విడాకులు తీసుకొని మరోపెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని గడుపుతున్నారు. అయితే రూపాయికి ఇంకో వైపు ఉన్నట్లుగా.. బాలీవుడ్ తారల్లో మరో కోణం కూడా ఉంది. విడాకులు తీసుకున్న తర్వాత..మరో పెళ్లి చేసుకొని తారలు కూడా ఉన్నారు. పెళ్లి బంధానికి స్వస్తి చెప్పి.. సింగిల్‌గానే ఉంటూ కెరీర్‌పై దృష్టిసారించిన కొంతమంది బాలీవుడ్ స్టార్స్‌పై ఓ లుక్కేద్దాం. మనీషా కొయిరాలామనీషా కొయిరాలా, 1990లలో తన అందం, నటనతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన నటి. 'దిల్ సే', 'ఒకే ఒక్కడు' వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఆమె, 2010లో నేపాలీ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ను వివాహం చేసుకుంది. అయితే, వివాహం జరిగిన ఆరు నెలలకే వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దీంతో 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మనీషా మరో పెళ్లి చేసుకోకుకండా ఒంటరిగానే ఉంటుంది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో కొనసాగుతూ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. పూజా భట్పూజా భట్, 'దిల్ హై కి మాంతా నహీ', 'సడక్' వంటి చిత్రాలతో పాపులర్ అయిన నటి మరియు నిర్మాత. ఆమె 2003లో వ్యాపారవేత్త మనీష్ మఖీజాను వివాహం చేసుకుంది, కానీ 2014లో వారు విడిపోయారు. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకోకుండా.. ఒంటరిగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె సినిమా నిర్మాణం, దర్శకత్వంలో బిజీగా ఉన్నారు. చిత్రాంగద సింగ్చిత్రాంగద సింగ్, 'హజారోం ఖ్వాహిషే ఐసీ', 'దేశీ బాయ్జ్' వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి. ఆమె 2001లో గోల్ఫర్ జ్యోతి రంధావాను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, 2013లో వారు విడిపోయారు, 2014లో విడాకులు ఖరారయ్యాయి. చిత్రాంగద తన కెరీర్‌పై దృష్టి సారించి, సినిమాల్లో నటిస్తూ, సింగిల్ మదర్‌గా తన కుమారుడిని పెంచుతోంది. ప్రస్తుతం వరకు ఆమె మళ్లీ వివాహం చేసుకోలేదు, తన వృత్తి, కుటుంబంపై దృష్టి పెట్టింది.కరిష్మా కపూర్'రాజా హిందుస్థానీ', 'దిల్ తో పాగల్ హై' వంటి చిత్రాలతో 90లలో స్టార్డమ్ సంపాదింకున్న నటి కరిష్మా కపూర్. ఆమె 2003లో వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను వివాహం చేసుకుంది, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, వైవాహిక సమస్యల కారణంగా 2014లో విడిపోయి, 2016లో విడాకులు తీసుకుంది. కరిష్మా ప్రస్తుతం సినిమా నిర్మాణంలో నిమగ్నమై, తన పిల్లల సంరక్షణపై దృష్టి సారిస్తూ సింగిల్‌గా జీవిస్తోంది. ఆమె మళ్లీ వివాహం చేసుకోలేదు.రేఖాబాలీవుడ్ దిగ్గజ నటి రేఖా, తన అద్భుతమైన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఆమె 1990లో వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్‌ను వివాహం చేసుకుంది, కానీ ఈ వివాహం కేవలం ఒక సంవత్సరం మాత్రమే కొనసాగింది. ముఖేష్ 1991లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ తర్వాత రేఖ మళ్లీ వివాహం చేసుకోలేదు. వీరితో పాటు పలువురు బాలీవుడ్ తారలు విడాకుల తర్వాత ఒంటరి జీవితాన్నే గడుపుతున్నారు. -
ప్రేమతో టై... పెళ్లితో బ్రేక్!
మైదానంలో అలరించిన భారత క్రీడాకారులు పతకాలు, ట్రోఫీలతో పాటు అభిమానుల మనసుల్ని గెలుస్తారు. అలాగే తమ మనసు గెలిచిన వారితో మనసారా ఒక్కటవుతారు. టోరీ్నల్లో లాగానే మొదట పరిచయంతో ప్రేమపెళ్లికి ‘క్వాలిఫై’ అవుతారు. తర్వాత ‘మెయిన్ రౌండ్’లో ప్రేమించుకుంటారు. ‘ఫైనల్’కు వచ్చేసరికి పెళ్లి చేసుకుంటారు. అయితే ఇక్కడితోనే ‘పెళ్లి’ టైటిల్‌కు శుభం కార్డు పడుతుందనుకుంటే తప్పులో కాలేసినట్లే! కొన్నాళ్లకు, కొన్నేళ్లకు కొన్ని క్రీడా జంటలకు ‘విడాకులు’తో అశుభం కార్డు పడుతోంది. అలా ఈ కోవలో ఒక్క‘టై’.. ‘బ్రేక్’ చేసుకున్న జంటల కథలు...క్రీడాకారుల విజయాలు వార్తలవడం సహజం. విజయవంతమైన క్రేజీ స్టార్ల ప్రేమలు కూడా హాట్ న్యూస్లే! తర్వాత ఫారిన్ ట్రిప్పులు, చెట్టాపట్టాల్ అన్నీ కూడా మీడియా కంటపడకుండా ఉండవు. చివరకు పెళ్లి ముచ్చట ఇవన్నీ బాగానే ఉన్నా... కొందరి ‘ప్రేమ–పెళ్లి–విడాకుల’ తంతు పరిపాటిగా మారడమే క్రీడాకారుల దాంపత్య బంధాన్ని పలుచన చేస్తున్నాయి. తాజాగా వెటరన్ బ్యాడ్మింటన్ స్టార్ల జోడీ సైనా నెహా్వల్, పారుపల్లి కశ్యప్ తాము విడిపోతున్నట్లు ప్రకటించింది. గతంలో పాపులర్ షట్లర్లు గుత్తా జ్వాల, చేతన్ ఆనంద్‌లు బ్యాడ్మింటన్ కోర్టులో జోడీ కట్టి... తర్వాత పెళ్లి పీటలెక్కారు. కొన్నాళ్లకే కోర్టుకెక్కి విడాకులు తీసుకున్నారు. అయితే ఇటీవల ‘టై బ్రేక్’ జోడీల సంఖ్య ఎక్కువవుతోంది. వారి వివరాలివే...హార్దిక్ పాండ్యానటాషాభారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సెర్బియన్ మోడల్ నటాషా స్టాంకోవిచ్ మనసుపడి మనువాడాడు. 2020లో కోవిడ్ సమయంలో ప్రపంచం మొత్తం లాక్డౌన్ అయిన సమయంలో తొలుత పెళ్లి చేసుకున్నారు. మళ్లీ 2023లో హిందూ, సెర్బియా మతాచారాల ప్రకారం మళ్లీ పెళ్లాడారు. కానీ ఇంతలా ఇష్టపడ్డ సెర్బియన్ నెచ్చెలితో పెళ్లి ముచ్చట కొన్నాళ్లకే ముగిసింది. 2024లో ఇద్దరు విడాకుల ప్రకటన చేశారు. ధావన్ అయేషాభారత క్రికెటర్ శిఖర్ ధావన్ సరిహద్దులు దాటిన ప్రేమ తదుపరి పెళ్లినాటి ప్రమాణాలు కూడా కొన్నేళ్ల తర్వాత గుదిబండగా మారడంతో చివరికి చెరోదారి చూసుకోవాల్సి వచి్చంది. మెల్బోర్న్లో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన అయేషా ముఖర్జీతో మొదలైన పరిచయం కొన్నాళ్లకే ప్రణయానికి దారితీసింది. ధావన్ కంటే అయేషా ఏకంగా 12 ఏళ్లు పెద్ద వయసు్కరాలు. అయితే ఈ వయస్సు ప్రేమకి, పెళ్లికి అడ్డంకి కాలేదు. 2012లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట పెళ్లి తర్వాత మనస్పర్థలతో 2023లో విడిపోయింది.చహల్ ధనశ్రీ భారత క్రికెట్లో మణికట్టు స్పిన్నర్‌గా బక్కపలుచని యోధుడు యజువేంద్ర చహల్ కొన్నాళ్లు వెలుగు వెలిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఐపీఎల్లో తమ జట్లకు చిరస్మరణీయ విజయాలు అందించిన చహల్... సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మతో ప్రేమలో పడ్డాడు. వీరిజంట నెట్టింట ‘మూడు రీల్స్... ఆరు జిగేల్స్’గా తెగ హల్చల్ చేసింది కొన్నాళ్లు! కానీ చిత్రంగా పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటగానే చెదిరిపోయింది. ప్రేమ బాసలు, పెనవేసుకున్న ఊసులతో 2020లో మ్యారేజ్ చేసుకున్న చహల్–ధనశ్రీ వర్మ రెండేళ్లకే విడిపోయారు. 2022లో డివోర్స్ కార్డ్ వేశారు.షమీ హసీన్ జహన్ భారత సీనియర్ సీమర్ మొహమ్మద్ షమీ ప్రేమ పెళ్లి ముచ్చట వివాదాలు, ఆరోపణలతో నాలుగేళ్లకే క్లీన్»ౌల్డయ్యింది. తనకు పరిచయమైన హసీన్ జహన్‌తో కొంతకాలం ప్రేమాయణం జరిపిన తర్వాత 2014లో ఇద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే హసీన్ రచ్చకెక్కి మరీ గృహహింస కేసులు పెట్టి చివరకు 2018లో విడిపోయారు.సైనా కశ్యప్సింధు మేనియా ముందువరకు సైనానే సూపర్‌స్టార్‌గా వెలుగొందింది. కామన్వెల్త్ క్రీడల్లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచింది. ఎన్నో సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచింది. ఒకప్పుడు క్రీడా వార్తల్లో టెన్నిస్‌లో సానియా మీర్జా, బ్యాడ్మింటన్‌లో సైనాల విజయాలే పతాక శీర్షికలయ్యేవి. 2012–లండన్ ఒలింపిక్స్‌లో సైనా కాంస్య పతకం గెలుచుకుంది అంతగా పాపులారిటీ సంపాదించుకున్న ఆమె... గోపీచంద్ అకాడమీలో శిక్షణ సందర్భంగా పారుపల్లి కశ్యప్‌ను ప్రేమించింది. వీరి ప్రేమాయణం 2018లో మూడుముళ్ల బంధంగా మారింది. ఏడడుగులు నడిచిన ఈ జంట ఏడేళ్లు పూర్తయ్యేసరికి తమ బంధానికి బైబై చెప్పింది. -
రహస్య రికార్డింగులు సాక్ష్యాలే
న్యూఢిల్లీ: జీవిత భాగస్వాములతో సంభాషణను రహస్యంగా రికార్డు చేయడం విడాకులతో పాటు అన్నిరకాల వైవాహిక వివాదాల్లోనూ సాక్ష్యాలుగా చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ధర్మాసనం సోమవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. సదరు సంభాషణలకు సాక్ష్యాల చట్టంలోని 122వ సెక్షన్ కింద రక్షణ ఉంటుందని, కనుక వాటిని న్యాయ వివాదాల్లో ఉపయోగించడాన్ని అనుమతించలేమని పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. వాటిని సాక్ష్యాలుగా అనుమతిస్తే వైవాహిక బంధాన్ని, కుటుంబంలో సామరస్యాన్ని దెబ్బతీస్తాయని, భాగస్వామిపై గూఢచర్యానికి దారి తీస్తాయని హైకోర్టు వెలువరించిన అభిప్రాయాలతో ధర్మాసనం విభేదించింది. ‘‘ఇలాంటివి చెల్లుబాటయ్యే వాదనలు కావన్నది మా అభిప్రాయం. భార్యాభర్తలు పరస్పరం తరచూ ఇలా సంభాషణను గుట్టుగా రికార్డు చేయడం వంటి పనులకు పాల్పడుతున్నారంటేనే ఆ బంధం బీటలు వారిందని, వారి మధ్య విశ్వాసం సన్నగిల్లిందని అర్థం. కనుక అలాంటి పరిస్థితుల్లో గోప్యంగా రికార్డు చేసిన భాగస్వామి తాలూకు సంభాషణను సాక్ష్యంగా అంగీకరించడం అసమంజమేమీ కాదు. ఎందుకంటే అది వైవాహిక సమస్యల తాలూకు ఫలితమే తప్ప వాటికి కారణం కాదు’’ అని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. ‘‘122వ సెక్షన్ పేర్కొంటున్న గోప్యత హక్కు భార్యాభర్తల సంభాషణలకు కూడా వర్తిస్తుందన్నది నిజమే. కానీ అది సంపూర్ణమైనది కాదు. ఈ అంశాన్ని ఆ సెక్షన్‌కు ఇచ్చిన మినహాయింపులతో కలిపి చూడాల్సి ఉంటుంది’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఇలాంటి విషయాల్లో గోప్యత హక్కు కంటే కూడా సక్రమ విచారణ హక్కుదే పై చేయి అవుతుంది. వైవాహిక బంధం విచి్ఛన్నమయ్యే స్థితికి చేరినప్పుడు భాగస్వాములకు తమ వాదనను రుజువు చేసే సాక్ష్యాలు సమరి్పంచే హక్కును గోప్యత తదితరాలను ప్రాతిపదికగా చూపి కాలరాయలేం’’ అని స్పష్టం చేసింది. 2017 నాటి ఓ విడాకుల కేసులో భార్యకు తెలియకుండా భర్త జరిపిన ఆమె సంభాషణల రికార్డులను సాక్ష్యంగా అనుమతిస్తూ పంజాబ్‌లోని భటిండా ఫ్యామిలీ కోర్టు ఇచి్చన తీర్పును పునరుద్ధరించింది. -
22 ఏళ్ల బంధానికి గుడ్ బై.. డైెరెక్టర్‌తో బుల్లితెర నటి విడాకులు!
ప్రముఖ బుల్లితెర నటి వివాహా బంధానికి గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్లో అనే సీరియల్స్‌లో నటించిన నటి పల్లవిరావు తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. పెళ్లైన దాదాపు 22 ఏళ్ల తర్వాత తన భర్త, దర్శకుడు సూరజ్ రావుతో బంధానికి ముగింపు పలకనున్నట్లు వెల్లడించింది. ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించడానికే తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ విషయాన్ని రెండు వారాల క్రితమే పోస్ట్ చేసింది.పాండ్యా స్టోర్‌తో అనే సీరియల్లో పల్లవిరావు బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. పల్లవి 2009లో హిందీ సీరియల్ యహాన్ మే ఘర్ ఘర్ ఖేలీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పునర్ వివాహ ఏక్ నయీ ఉమీద్, మెయిన్ లక్ష్మీ తేరే అంగన్ కీ, బిట్టో, పాండ్యా స్టోర్, కహానీ హుమారే మహాభారత్ కీ వంటి సీరియల్స్‌లో మెప్పించింది. అంతేకాకుండా పల్లవి ఫియర్ ఫైల్స్, సావధాన్ లాంటి వాటిలో కొన్ని ఎపిసోడ్లలో కూడా కనిపించింది. పల్లవి బుల్లితెర నటిగానే కాకుండా యాడ్స్‌లోనూ నటించింది. అనేక టీవీ సీరియల్స్‌లో అతిథి పాత్రలో అలరించింది.కాగా.. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు 21 ఏళ్ల కుమార్తె, 18 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఈ జంట 2003లో వివాహం చేసుకున్నారు. అయితే విడాకులపై నటి భర్త సూరజ్ రావు ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. -
Divorce: సైనా అలా.. పారుపల్లి కశ్యప్ ఇలా!.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్
Saina Nehwal- Parupalli Kashyap Divorce: భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్స్ పతక విజేత సైనా నెహ్వాల్ (Saina Nehwal) తన భర్త పారుపల్లి కశ్యప్ (Parupalli Kashyap)తో విడిపోతున్నట్లు ప్రకటించింది. తాము సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆదివారం రాత్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.ప్రకటన విడుదల చేసిన సైనాఈ మేరకు.. ‘‘జీవితం మనల్ని ఒక్కోసారి వేర్వేరు దిశల్లో ప్రయాణం చేయిస్తుంది. సుదీర్ఘ చర్చలు, ఆలోచనల తర్వాత.. నేను కశ్యప్ పారుపల్లి విడిపోవాలని నిర్ణయించుకున్నాం.శాంతియుత జీవనం, ఎదుగుదల, మానసిక ప్రశాంతత మా ఇరువురికీ ముఖ్యమని భావించి వేర్వేరు దారుల్లో ప్రయాణించాలని భావించాము. మా ఇద్దరి బంధానికి సంబంధించి నాకెన్నో మధురానుభూతులు ఉన్నాయి. ఇక ముందు కూడా స్నేహితుల్లా ముందుకు సాగుతాం.ఇలాంటి క్లిష్ట సమయంలో మా గోప్యత, గౌరవానికి భంగం కలగకుండా మా నిర్ణయాన్ని గౌరవించాలని కోరుకుంటున్నా’’ అని సైనా నెహ్వాల్ ఇన్‌స్టా స్టోరీ ద్వారా తమ విడాకుల విషయాన్ని వెల్లడించింది.బెస్టెస్ట్ అంటూ కశ్యప్ స్టోరీఅయితే, అదే సమయంలో పారుపల్లి కశ్యప్ మాత్రం విడాకుల గురించి ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. అంతేకాదు.. సైనా కంటే ముందే ఓ పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇందులో కశ్యప్ తన స్నేహితులతో కలిసి వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను రీషేర్ చేస్తూ.. ‘‘బెస్టెస్ట్’’ అంటూ స్టోరీ పెట్టాడు.కపుల్ గోల్స్ సెట్ చేసిన క్రీడా జంట.. అంతలోనే..అయితే, సైనాతో ఉన్న పాత ఫొటోలన్నీ కూడా పారుపల్లి కశ్యప్ అలాగే ఉంచాడు. ఆమెతో కలిసి టూర్లకు వెళ్లిన ఫొటోలన్నీ తన సోషల్ మీడియా అకౌంట్లో అలాగే అట్టిపెట్టుకున్నాడు. కాగా భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ దగ్గర శిక్షణ తీసుకున్న సైనా, కశ్యప్ చాలా ఏళ్లపాటు ప్రేమించుకున్నారు. 2018లో పెళ్లి బంధంతో ఒక్కటైన వీరు అన్యోన్యంగా ఉండేవారు. కెరీర్ పరంగానూ ఒకరికొరు అండగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేసే వాళ్లు.కానీ అకస్మాత్తుగా ఇలా సైనా నుంచి విడాకుల ప్రకటన రాగా.. కశ్యప్ మాత్రం ఇంకా స్పందించకపోవడం గమనార్హం. కాగా సైనాకు ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు భర్త కశ్యప్‌తో పాటు టూర్లకు వెళ్లే సైనా.. మరికొన్ని సార్లు తన తల్లిదండ్రులతో కలిసి ప్రయాణాలు చేసేది. ఇందుకు సంబంధించిన జ్ఞాపకాలను ఫొటోల రూపంలో తన సోషల్ మీడియాలో షేర్ చేసేది సైనా. ఇక భర్తతో ఉన్న మధురానుభూతులను కూడా కెమెరాతో ఒడిసిపట్టి అభిమానులతో పంచుకునేది. చివరగా ఈ ఏడాది మేలో సైనా, కశ్యప్ సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ సంతోషంగా గడిపిన క్షణాలను సైనా షేర్ చేసింది. అయితే, వీరి మధ్య విభేదాలు, విడాకులకు గల కారణం ఏమిటో మాత్రం తెలియదు.కెరీర్లో బెస్ట్కాగా సైనా లండన్ ఒలింపిక్స్-2012లో మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం గెలవగా.. అదే ఎడిషన్‌లో కశ్యప్ మెన్స్ సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా కశ్యప్ చరిత్ర సృష్టించాడు. -
భార్య విడాకులు.. పాలతో స్నానం చేసిన భర్త
-
భర్తతో సైనా నెహ్వాల్ విడాకులు
-
ఏడేళ్ల వివాహ బంధానికి, 20 ఏళ్ల స్నేహానికి ముగింపు.. సైనా, కశ్యప్ జంట విడాకులు (ఫొటోలు)
-
వివాహబంధానికి సైనా, కశ్యప్ గుడ్‌బై
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా సైనా తమ విడాకుల విషయాన్ని ఆదివారం రాత్రి పోస్ట్ చేసింది. ‘జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశలకు తీసుకెళుతుంది. ఎంతో ఆలోచించి, సుదీర్ఘంగా చర్చించుకున్న తర్వాత నేను, కశ్యప్ విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాం. పరస్పర అవగాహనతో సహృద్భావ వాతావరణంలో మా విడాకులు తీసుకుంటున్నాం. కశ్యప్‌తో నాకు ఎన్నో తీపి గుర్తులున్నాయి.ఇకపై మిత్రులుగా ఉంటాం. మా నిర్ణయాన్ని అందరు స్వాగతిస్తారని, ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకున్న సైనా, కశ్యప్‌లు 2018లో పెళ్లి చేసుకున్నారు. సైనా రెండుసార్లు కామన్వెల్త్ చాంపియన్‌గా నిలిచింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. -
ప్రియుడితో భార్య జంప్.. పాల స్నానంతో భర్త సంబరాలు
భార్య నుంచి విడాకులు పొందానన్న ఆనందంతో ఓ భర్త సంబరాలు చేసుకున్నాడు.. అక్కడితో ఆగలేదు.. ఇక తాను స్వేచ్ఛాజీవినంటూ 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. విడాకులను నాలుగు బకెట్ల పాల స్నానంతో వేడుక చేసుకున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అస్సాంలోని నల్బాడీ జిల్లాలోని ముకల్మువా ప్రాంతానికి చెందిన మాణిక్ అలీకి భార్యతో విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ భార్యభర్తలకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఇంటికి చేరుకున్న భర్త.. పాలతో స్నానం చేసి సంతోషంతో ఎగిరి గంతేశాడు.తన భార్యకు ఓ ప్రియుడు ఉన్నాడంటూ చెప్పుకొచ్చిన మాణిక్ అలీ.. తనతో పెళ్లై ఓ బిడ్డ జన్మించినా కానీ.. ఆమె తీరు మారలేదని.. తన ప్రియుడితో వివాహేతర బంధం కొనసాగించిందని తెలిపాడు.. తనను, తన బిడ్డను వదిలేసి ఆమె ప్రియుడితో వెళ్లిపోయిందని.. ఇలా.. ఒక్కసారి కాదు రెండు సార్లు అలాగే వెళ్లిపోయిందన్నాడు.మొదటిసారి తప్పు చేసినప్పుడు తన బిడ్డ కోసం ఆమెను క్షమించానని చెప్పాడు. మా కుటుంబం శాంతి కోసం తాను మౌనంగా ఉన్నానని.. మళ్లీ అదే తప్పు చేయడంతో భరించలేక విడాకులు తీసుకున్నానని మాణిక్ అలీ తెలిపారు. విడాకులు తీసుకున్నాక.. కొత్త జన్మ ఎత్తినట్లుగా ఉందని.. ఈ రోజు నుండి తాను విముక్తి పొందానని.. కొత్త జీవితం ప్రారంభానికి గుర్తుగా పాలతో స్నానం చేశానంటూ మాణిక్ అలీ చెప్పాడు. -
భర్తతో గొడవలు.. నయనతార విడాకులు
-
నయనతార దంపతులపై విడాకుల రూమర్స్.. గట్టిగానే ఇచ్చిపడేసిందిగా!
కోలీవుడ్ స్టార్ జంట నయనతార- విఘ్నేశ్ శివన్‌పై కొద్ది రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరు త్వరలోనే తమ వివాహాబంధానికి గుడ్ బై చెప్పనున్నారని టాక్ వినిపించింది. ఈ స్టార్ కపుల్ గురించి పలు వెబ్‌సైట్స్‌లో కథనాలొచ్చాయి. దీంతో నయనతార తమపై వస్తున్న రూమర్స్‌కు గట్టి రిప్లై ఇచ్చింది. తన భర్తతో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేసింది. 'మాపై సిల్లీ న్యూస్ వచ్చినప్పుడల్లా మా రియాక్షన్ ఇలానే ఉంటుంది' అని ఘాటుగానే బదులిచ్చింది.కాగా.. పెళ్లి బంధం గురించి నయనతార కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఈ రూమర్స్‌కు కారణమైంది. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు.. నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే కొద్ది సేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. కానీ అంతలోనే నెట్టింట స్క్రీన్‌షాట్స్ దర్శనమిచ్చాయి. ఆ పోస్ట్ వల్లే నయన్- విఘ్నేశ్ దంపతులు విడిపోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో కోలీవుడ్‌లో వీరిద్దరి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇక నయనతార సినిమాలపరంగా చూస్తే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మెగా 157లో కనిపించనుంది. అంతేకాకుండా యశ్ హీరోగా వస్తోన్న టాక్సిక్ మూవీలోనూ కనిపించనుంది. కాగా.. నయనతార సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరికి ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టుకున్నారు. -
జయం రవితో విడాకుల వివాదం.. ఆర్తి తొలిసారి ఎమోషనల్ పోస్ట్!
కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం గత కొద్దికాలంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దాదాపు 16 ఏళ్ల వివాహాబంధానికి ముగింపు పలికేందుకు వీరిద్దరు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని గతేడాది చివర్లో సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు జయం రవి. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. తాము విడిపోవడానికి కారణం మూడో వ్యక్తేనని ఆయన భార్య ఆర్తి ఆరోపించింది. పరోక్షంగా సింగర్ కెన్నీషాను ఉద్దేశించి విమర్శలు చేసింది. ప్రస్తుతం విడాకుల వ్యవహారం కోర్టులో ఉండడంతో కోర్టు విచారణకు హాజరవుతున్నారు.అయితే తాజాగా జయం రవి భార్య ఆర్తి చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. నా చుట్టూ ఉన్న ప్రతిదీ పెరుగుతూనే ఉంది అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. తన ఇద్దరు పిల్లలు, పెట్ డాగ్‌తో ఉన్న వరుస ఫోటోలను షేర్ చేసింది. కొన్ని హృదయాలకు ఎక్కడ ఉండాలో తెలుసంటూ రాసుకొచ్చింది.ఆర్తి తన ఇన్‌స్టాలో రాస్తూ.. "కొన్ని సాయంత్రాలు, కొన్ని పెరుగుతున్న విషయాల మధ్య సూర్యాస్తమయం.. గట్టిగా పట్టుకునే రెండు చేతులు.. ఎలాంటి మాటలు లేకున్నా దగ్గరగా ఉండే హృదయం.. ప్రతిదీ సంపూర్ణంగా అనిపించేలా చేసే నిశ్శబ్ద ప్రేమ ' అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. జయం రవితో విడాకుల వివాదం ప్రేమ, హృదయం అంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది. ఇది చూసిన హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా స్పందించింది. చాలా అందంగా ఉంది.. ఆర్తు అంటూ కామెంట్ చేసింది. కాగా.. 16 ఏళ్ల క్రిత రవి, ఆర్తి పెళ్లి చేసుకోగా..వీరికి ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ ఉన్నారు. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) -
రెండో భర్తతోనూ విడాకులు.. అందుకేనన్న బాలీవుడ్ నటి!
పలు సూపర్ హిట్ సినిమాల్లో మెప్పించిన బాలీవుడ్ నటి చాహత్ ఖన్నా. తన అందం, అద్భుతమైన నటనతో అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్లో ద ఫిలిం, థాంక్యూ, ప్రస్థానం, యాత్రిస్ సినిమాలతో పాటు బుల్లితెరపై కాజల్, ఖుబూల్ హై వంటి సీరియల్స్‌లో చాహత్ నటించింది. అయితే 2006లో భరత్ నర్సింగనిని పెళ్లాడిన ముద్దుగుమ్మ.. నాలుగు నెలలకే విడాకులిచ్చింది. ఆ తర్వాత 2013లో ఫర్హాన్ మీర్జాను పెళ్లాడగా 2018లో అతనితో కూడా తెగదెంపులు చేసుకుంది. రెండుసార్లు పెళ్లి చేసుకోగా రెండుసార్లూ విడాకులే తీసుకుంది చాహత్ ఖన్నా. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె రెండోసారి విడాకులు తీసుకోవడంపై మాట్లాడింది. కేవలం తన పిల్లల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని అంటోంది.రెండోసారి విడాకుల గురించి చాహత్ మాట్లాడుతూ.. 'నేను ఎప్పుడూ నాకు సరైనది అనిపించిన దాన్నే చేశా. దానికే కట్టుబడి ఉంటా. ఏదైనా తప్పని అనిపిస్తే అలాంటి పని చేయను. ఎవరైనా తప్పు చేస్తుంటే కూడా చెప్పే ధైర్యం నాకు ఉంది. ప్రపంచం ఏమి చెప్పినా నేను ఎప్పుడూ తప్పును సమర్ధించను. మీకు ఆ రకమైన నమ్మకం, ధైర్యం, ఆత్మగౌరవం ఉండాలి. కేవలం ఒక మహిళగా మాత్రమే కాదు, ఒక మనిషిగా.. ఏదైనా కరెక్ట్ కాదనిపిస్తే అందులో భాగం కాలేను. అలాంటి వాటికి నేను దూరంగా వెళ్తాను. అలాగే మనం పిల్లల కోసం ఆలోచిస్తూ మనకు సరిగాలేని వివాహ బంధంలో ఉండిపోకూడదు. ఎందుకంటే పిల్లలు మనకంటే ఎక్కువగా ప్రభావితమవుతారు. అది కలిగించే నష్టం మీకు కూడా తెలియదు. వారు పెద్దయ్యాక వారి స్నేహితుల నుంచి విన్నప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. అందుకే నా కుమార్తెల కోసం నేను దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నా' అని తెలిపింది. -
'నేను ఏం మాట్లాడిన అలానే తీసుకుంటారు'.. విడాకుల రూమర్స్‌పై అభిషేక్ బచ్చన్!
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్-ఐశ్వర్య జంటపై గత కొన్ని నెలలుగా రూమర్స్ వస్తూనే వినిపిస్తున్నాయి. వీరిద్దరు విడాకుల తీసుకోబోతున్నారంటూ చాలాసార్లు కథనాలొచ్చాయి. గతంలో ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి చాలాసార్లు కనిపించడంతో ఈ రూమర్స్ ఎక్కువయ్యాయి. అంతేకాకుండా ఐశ్వర్య బర్త్ డే ఆలస్యంగా విష్ చేయడం.. ఆమెతో అభిషేక్ బచ్చన్ ఎక్కువగా కనిపించకపోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై అభిషేక్ ఇప్పటివరకు స్పందించలేదు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అభిషేక్ బచ్చన్.. తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించారు. సోషల్ మీడియాలో తన గురించి జరుగుతున్న తప్పుడు సమాచారంపై తాను ఎందుకు స్పందించలేదనే విషయాన్ని వెల్లడించారు. నెగెటివ్ వార్తలు రాయడం అనేది ఈ రోజుల్లో కొత్త ట్రోలింగ్ ట్రెండ్ అని అభిషేక్ అన్నారు. తాను ఏం మాట్లాడిన ప్రజలు నెెగెటివ్గానే తీసుకుంటారని స్పష్టం చేశారు.అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. "గతంలో నా గురించి వచ్చిన కథనాలేవీ నన్ను ఎలాంటి ప్రభావితం చేయలేదు. ఎందుకంటే ఈ రోజు నాకు ఒక కుటుంబం ఉంది. నేను ఏదైనా మాట్లాడితే అది వారిని చాలా బాధ పెడుతుంది. నేను ఏం చెప్పినా ప్రజలు దాన్ని నెగెటివ్‌గానే తీసుకుంటారు. ఎందుకంటే నెగెటివ్ వార్తలే ఎక్కువగా అమ్ముడవుతాయి. అలాంటి ప్రతికూలతను బయటపెట్టే వ్యక్తులు తమ మనస్సాక్షితో జీవించాలి. ఇక్కడ మనందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఇది ఒక కొత్త ట్రోలింగ్ ఫ్యాషన్. మీరు సోషల్ మీడియాలో ఏదైనా చెప్పే బదులు.. డైరెక్ట్‌గా నాతో వచ్చి చెప్పడానికి మీకు అనుమతి ఇస్తా. కానీ నా ఎదురుగా వచ్చి చెప్పడానికి మీకు ధైర్యం ఉండదు. ఎవరైనా నా ఎదురుగా వచ్చి మాట్లాడితే వారిని స్వయంగా నేనే గౌరవిస్తా" అని అన్నారు. కాగా.. అభిషేక్ ప్రస్తుతం కాళిధర్ లపతా చిత్రంలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మధుమిత దర్శకత్వం వహించారు. మరోవైపు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 13 ఏళ్ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఉన్నారు. -
మొదటి భార్యతో విడాకులు.. మద్యానికి బానిసయ్యా: అమిర్ ఖాన్
ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఆమిర్‌ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్ ఫిల్మ్ ‘తారే జమీన్ పర్’ (2007)కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కించారు. ఈ మూవీ జెనీలియా కీలక పాత్రలో నటించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమిర్ ఖాన్.. తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన భార్య రీనా దత్తాతో విడిపోయాక ఎదుర్కొన్న పరిస్థితిని వివరించారు. ఆ టైమ్‌లో తీవ్రమైన ఒత్తిడి, బాధకు గురయ్యానని వెల్లడించారు. దీంతో మద్యానికి బానిసైనట్లు తెలిపారు. నా సినిమా లగాన్ విజయం సాధించినప్పటికీ.. జీవితంలో ఏదో కోల్పోయినట్లు అనిపించదన్నారు. అది తన జీవితంలో చీకటిదశ అని పేర్కొన్నారు.అమిర్ ఖాన్ మాట్లాడుతూ.. 'రీనాతో నేను విడిపోయినప్పుడు ఆ రోజు సాయంత్రంమే మద్యం ఫుల్ బాటిల్ తాగాను. ఆ తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు ప్రతిరోజూ మద్యం తాగాను. ఆ సమయంలో ఎప్పుడూ నిద్రపోలేదు. అధిక మద్యం సేవించడం వల్ల నేను స్పృహ కోల్పోయేవాడిని. ఒక సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించా. ఆ సమయంలో ఎవరినీ కలవడానికి ఇష్టపడలేదు. అదే ఏడాది నా సినిమా లగాన్ రిలీజైంది. అప్పట్లో నన్ను మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని పిలిచారు. అది నాకు చాలా వ్యంగ్యంగా అనిపించింది' అని పంచుకున్నారు.కాగా.. ఆమిర్, రీనా చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అంతేకాదు అమిర్ ఖాన్ తన రక్తంతో ఆమెకు ఒక లేఖ కూడా రాశాడు. రీనా మొదట అమిర్ ప్రేమను అంగీకరించలేదు.. కానీ తరువాత ఓకే చెప్పి.. ఇద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా రీనా దత్తా ఆమిర్ మొదటి చిత్రం 'ఖయామత్ సే ఖయామత్ తక్'లో కూడా ఒక చిన్న పాత్ర పోషించింది. వీరి వివాహమైన 16 ఏళ్ల తర్వాత విడిపోయారు. ఈ జంటకు జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత.. ఆమిర్ 2005లో చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. ఈ జంట 16 సంవత్సరాల తర్వాత 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆమిర్ ప్రస్తుతం తన చిరకాల స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో రిలేషన్లో ఉన్నారు. -
వారు విడిపోయి వీరికి... 'ఒడి'పోయి
విడాకులు కేవలం ఇద్దరు పెద్దల మధ్యే కాదు, ఆ కుటుంబంలో ముఖ్యంగా ఐదారేళ్ల వయసు పిల్లలపైనా తీవ్ర భావోద్వేగాల గందరగోళాన్ని, ఆరోగ్య నష్టాన్ని కలిగిస్తాయని, ఆయుష్షునూ తగ్గిస్తాయని నివేదికలు తెలుపుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లల ఐదారేళ్ల వయస్సులో విడిపోతే, ఆ పిల్లలకు ఆయుష్షు తగ్గే అవకాశాలు పెరుగుతాయంటోంది ఒక అధ్యయనం. ఈ పరిశోధనను మిడ్ అట్లాంటిక్‌లోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నిర్వహించింది. ప్రొఫెసర్ నోలన్ పోప్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మెర్సెడ్ నుండి ఆండ్రూ సి. జాన్స్ స్టన్, అమెరికా జనగణన బ్యూరోకి చెందిన మ్యాగీ ఆర్. జోన్స్ సంయుక్తంగా ఈ ఫలితాలను వివరించారు.జీవనశైలిలో తీవ్ర మార్పులుచిన్నవయస్సులో తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలు జీవితాంతం అనేక ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారని పరిశోధకులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు దూరమైన పిల్లల్లో తక్కువ ఆదాయం, చిన్న వయస్సులోనే గర్భం ధరించడం, జైలు శిక్షలు, త్వరగా మరణించే ప్రమాదాలు .. వంటివి ఉన్నాయి. ఇవన్నీ కుటుంబంలో విడాకుల కారణంగా ఏర్పడ్డ అగాథాల మూలంగా జరుగుతున్నాయని పరిశోధకులు వివరించారు. విడాకుల తర్వాత తల్లిదం డ్రులు వేరు వేరు చోట్ల నివసించాల్సి వస్తుంది. ఆదాయం తగ్గిపోతుంది. ఒంటరిగా పిల్లల్ని పెంచాల్సిన తల్లిదండ్రులు ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తుంది. తరచూ నివాసం మారుతుంది. తక్కువ ఆర్థిక అవకాశాలు ఉన్న పేద ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ పిల్లల జీవితంలో సామాజిక, ఆర్థిక సవాళ్లకు దారితీస్తాయి. 1988 నుండి 1993 మధ్యకాలంలో జన్మించిన 50 లక్షల మందికి పైగా పిల్లలపై వారు గణాంకాలను విశ్లేషించారు. ఫెడరల్ ట్యాక్స్ రికార్డులు, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, జనగణనా బ్యూరో డేటా ఆధారంగా వారు ఈ విశ్లేషణ చేశారు.వ్యాధుల పాలయ్యే ప్రమాదంకొందరు పిల్లలు తమ వల్లే తల్లిదండ్రులు విడిపోయారేమో అనే ఆలోచనను పెంచుకుంటారు. ఇది వారిలో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవ్వచ్చు. తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న పిల్లలలో 16 శాతం అధిక స్థాయి సి–రియాక్టివ్ ప్రోటీన్ ఉందని అధ్యయనం. ఈ ప్రొటీన్ వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్, టైప్– 2 డయాబెటిస్ వంటి వ్యాధులకు లోన య్యే రిస్క్ ఎక్కువ ఉందని గుర్తించారు.మానసిక అనారోగ్యంపిల్లలు తల్లిదండ్రుల మధ్య ప్రేమ, సహకారం చూసి పెరుగుతారు. ఆ మద్దతు వారికి ధైర్యాన్నిస్తుంది. కానీ విడాకుల సమయంలో వారిలో భయాలు, అనిశ్చితి, ఒంటరితనం మొదలై మనోవేదన ఎక్కువవుతుంది. ఒక అధ్యయనంలో విడాకులు తీసుకున్న, విడిపోయిన లేదా మరణించిన తల్లిదండ్రులలో ఇద్దరు పిల్లలు కౌమారదశలో ఉంటే వారిలో ఒకరికి మానసిక రుగ్మత ఉందని తేలింది. విపరీతమైన భావోద్వేగాలుతిండి తినడంలో మార్పులు, నిద్రలో ఆటుపోట్లు, శరీర బలహీనత .. వంటి లక్షణాలు పిల్లల్లో బయటపడతాయి. ఇది వారి చదువు పై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఏకాగ్రత లోపించటం, స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోవటం, ఇంటి నుంచి వెళ్లిపోవడం.. వంటివీ కనిపించవచ్చు.సమాజంలో ప్రవర్తనకొన్ని సందర్భాల్లో పిల్లలు అతి శాంతంగా మారిపోతారు. లేదంటే మొండిగా ప్రవర్తించవచ్చు. స్నేహితులు, బంధువులతో సంబంధాలు దెబ్బతింటాయి. తల్లిదండ్రుల మధ్య విభేదాలు చూసిన పిల్లలు తమ భవిష్యత్తు సంబంధాలపై నమ్మకాన్ని కోల్పోతారు. విడాకులు అనివార్యమైతే, పిల్లలపై ఆ ప్రభావం పడకుండా తల్లిదండ్రులు పరస్పర సహకారంతో ముందడుగు వేయాలి. భార్యాభర్తలుగా విడిపోయినా తల్లిదండ్రులుగా ప్రేమ, మద్దతు, మార్గదర్శకం పిల్లలకు ఇవ్వాలి. ఇద్దరిదీ సమాన బాధ్యతఐదారేళ్ల వయసు పిల్లలకు తల్లిదండ్రుల సమస్య ఏంటో అర్థం కాదు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి, దంపతులు తమ జీవితంలో సర్దుబాట్ల చేసుకోవాలి. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకొని, ధైర్యమివ్వాలి. విడాకుల అనంతరం పిల్లలు ఇద్దరిలో ఎవరి దగ్గర ఉన్నా మరొకరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఇవి పిల్లల భవిష్యత్తుకు పెద్ద అవరోధమని గ్రహించాలి. మారుతున్న కాలానికి తగినట్టు బంధాలను అర్థం చేసుకుంటూ సామాజికంగానూ బంధుమిత్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అండగా ఉండాలి. విడాకులకు ముందు తల్లిదండ్రులుగా ఎలా ఉన్నారో, ఆ తర్వాత కూడా ఇద్దరూ పిల్లల పట్ల సమాన బాధ్యత తీసుకో వాలి. విడాకులకు ముందు మానసిక నిపుణుల సూచనలు అవసరం. – డా. సునీత, సైకాలజిస్ట్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఏడడుగులు తడబడి... విడివడి
మన దగ్గర ‘పెళ్లి పుస్తకం’ అమ్మాయి సహనం, సైలెన్స్.. అబ్బాయి ఆజ్ఞ, అధికారంతో రాసి ఉంది! కుటుంబ పరువు, ప్రతిష్ఠల మధ్య బైండ్ అయిపోయింది! అందుకే కలహాలు, కలతలున్నా ఆ కాపురం సాగిపోతూనే ఉండింది! కానీ దాన్నిప్పుడు అమ్మాయిలు ప్రేమ, కంపాటబిలిటీతో తిరగరాసేందుకు ప్రయత్నిస్తున్నారు. గౌరవం, భావోద్వేగాలతో బంధించాలనుకుంటున్నారు. అయితే ఆ ప్రయాణంలో విడాకుల అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాన్ని గమనిస్తున్న పెద్దలకు మన వివాహ వ్యవస్థ కూలిపోతున్నట్టనిపించవచ్చు! కానీ.. ఒక వ్యవస్థను పునర్నిర్మించడంలో అలాంటివి సాధారణమే అంటున్నారు సామాజిక విశ్లేషకులు. ఆ తడబాట్లు సర్దుకుని పెళ్లిపుస్తకంలో కొత్త పేజీలుగా మారుతాయని చెబుతున్నారు! సుచరిత బిజినెస్ ఎనలిస్ట్. పెళ్లయి రెండేళ్లవుతోంది. భర్త సాఫ్ట్వేర్. పెళ్లయిన వెంటనే యూకేలో మంచి జాబ్ ఆఫర్ వస్తే.. పెళ్లిని నిలబెట్టుకోవడం కోసం ఆ జాబ్ ఆఫర్‌ని వద్దనుకుంది. ఓ స్టార్టప్ ప్లాన్ చేసుకుని ఈ రెండేళ్లలో దాన్ని బాగా డెవలప్ చేసుకుని ఆంట్రప్రెన్యూర్‌గా స్థిరపడే దశకు చేరుకుంది. ఆ క్రమంలో పిల్లలనూ అప్పుడే వద్దనుకుంది. భర్త మాత్రం పిల్లలు కావాలనుకుంటున్నాడు. ఈ మధ్యే అతనికి అమెరికాలో మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. సుచరితనూ తీసుకుని అమెరికా వెళ్లిపోతే పిల్లల కోసం కన్విన్స్ అవుతుందనుకుని ఆ జాబ్‌కు ఓకే చేసి ఇక్కడున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, సుచరిత ముందు తన ప్రపోజల్ పెట్టాడు. తను స్టార్టప్‌ను వదిలేసి వచ్చే సమస్యే లేదని స్పష్టం చేసింది. చర్చలు, వాదనలు జరిగాయి. ‘పెళ్లయిన కొత్తలోనే ఇప్పుడు నీకొచ్చిన జాబ్ ఆఫర్ కన్నా రెట్టింపు శాలరీతో మంచి ఆఫర్ నాకు వచ్చింది. కానీ మన పెళ్లిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ జాబ్‌ను వద్దనుకున్నాను. ఇప్పుడు నా స్టార్టప్ క్లిక్ అయ్యింది. ఇంత ఎఫర్ట్నీ తుంగలో తొక్కి నీతో రమ్మంటే రాలేను. కావాలంటే నువ్వు నా కంపెనీలో చేరు. ఇద్దరం కలిసి పనిచేద్దాం!’ అంది. ససేమిరా అన్నాడు. మన బంధానికన్నా నీకు ఆ స్టార్టప్పే ఎక్కువ? నీ కెరీర్ కోసం మదర్‌హుడ్‌ని కూడా పణంగా పెడతావా?’ అంటూ నిలదీశాడు. ఆ మాటలకు, ఆ ఆలోచనా ధోరణికి విస్తుపోయింది సుచరిత.‘నేనేం పిల్లలను వద్దనుకోవట్లేదు. నీ అమెరికా జాబ్ కోసం నా కెరీర్‌ను వదలను అంటున్నాను. నువ్వు ఇక్కడే ఉండు.. పిల్లల కోసమూ ప్లాన్ చేసుకుందాం’ అంది. రాజీకి రాలేదు అతను. అయితే విడాకులు కావాలంది సుచరిత. ఆమె నిర్ణయానికి అటు పెద్దలు, ఇటు పెద్దలు హతాశులయ్యారు. మూర్ఖత్వంతో కాపురాన్ని కూల్చుకుంటున్నావంటూ తిట్టారు. అయినా చలించలేదు సుచరిత. కూతురి తీరుకు ఏడుస్తున్న తల్లిని ‘నన్నెవరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు నువ్వు అపార్థం చేసుకోవడమే పెయిన్‌గా ఉందమ్మా! బాగా చదువుకోవాలి, నీ కాళ్లమీద నువ్వు నిలబడాలి, కోట్ల ఆస్తి ఉన్న భర్త దొరికినా సరే.. నీకంటూ రూపాయి సంపాదించుకున్నప్పుడే నీకు ధైర్యం, గౌరవమని నువ్వు చెప్పిన మాటల్ని నువ్వే మరచిపోయావా? ఆ గోల్ కోసం నేను పడ్డ కష్టాన్ని నువ్వూ ఇగ్నోర్ చేయడమేంటమ్మా..’ అంటూ బాధపడింది. అమ్మకు అర్థమైంది, అలాగని కూతురిని పూర్తిగా సమర్థించలేకపోయింది.ఎందుకంటే.. ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని చిన్నప్పటి నుంచీ నూరిపోసిన ఆ తల్లి ఆడపిల్లకు కాపురం కూడా అంతే ముఖ్యం, అవసరమైతే అంతకన్నా ముఖ్యమనే సంప్రదాయ విలువలకు కండిషనింగ్ అయి ఉంది. ఆ భావజాలం కూతురి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడానికి అడ్డం పడుతోంది. తన పెంపకం పట్ల అపరాధ భావాన్నీ కలిగిస్తోంది. ఆమే కాదు ఆడపిల్లల చదువును, ఉన్నతిని కాంక్షించి ఆ దిశగా వాళ్లను తీర్చిదిద్దిన చాలామంది తల్లిదండ్రులదీ అదే భావన. పెళ్లిని నిలుపుకోవడం కోసం చదువును, కెరీర్‌ను ఆడపిల్లలే పణంగా పెట్టాలనుకుంటారు. ఎందుకంటే ఎంతకాదన్నా మన దగ్గర పెళ్లి సఫరింగ్నే గ్లోరిఫై చేస్తోంది కాబట్టి అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు. బాధ పడుతున్నా.. హింసను ఎదుర్కొంటున్నా, మానసిక దూరం పెరుగుతున్నా, భావోద్వేగాలు నిర్లక్ష్యం అవుతున్నా ఆలుమగలు కలిసి ఉండాలనే నేర్పుతోంది కుటుంబం. కానీ..చదువు, లోకజ్ఞానం, సాధికారత ఇచ్చిన ధైర్యంతో అలాంటి కాపురంలో కొనసాగడం కన్నా విడాకులతో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు సుచరితలాంటి అమ్మాయిలు. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేని పెళ్లిని పెళ్లిగానే చూడట్లేదు. విడాకులను పెద్దవాళ్లు పరువుప్రతిష్ఠలకు ముడిపెడతారు. ఆ భావన నుంచి బయటపడాలి. భరిస్తూ కలిసి బతకడంలో అర్థం లేదు. విడిపోయినా ఆత్మగౌరవంతో బతకడంలోనే ఆనందముందని గ్రహించాలని కోరుకుంటున్నారు. అందుకే ఏమైనా సరే సహనంతో సర్దుకుపోవాలంటూ పిల్లలను బలవంత పెట్టకూడదని మానసిక, న్యాయ నిపుణులూ చెబుతున్నారు. ఇది సంప్రదాయాన్ని మంటగలుపుతున్న మార్పు కాదు. పరిణామ క్రమమని అంటున్నారు సామాజిక విశ్లేషకులు. విడాకులకు కారణాలు.. మునుపటిలా ఆడవాళ్ల పని, మగవాళ్ల పనంటూ బాధ్యతలను జెండర్ కోణంలో చూడట్లేదు. ఇంటా, బయటా స్త్రీ, పురుషుల విధుల్లో మార్పులొచ్చాయి. మారిన ఈ విలువలను జీర్ణించుకోలేని కాపురాలు విడాకుల బాట పడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, ఆర్థిక సమస్యలు, బంధంలో భావోద్వేగాల సమన్వయం లోపించడం, నమ్మకం లేకపోవడం, అభద్రత, అస్తవ్యస్త పనివేళలు, మద్యం, ధూమపానం మొదలైనవీ విడాకులకు ప్రధాన కారణాలే అంటున్నాయి అధ్యయనాలు. ఈ మధ్య కాలంలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, లక్నో వంటి నగరాల్లో విడాకుల దరఖాస్తులు మూడింతలయ్యాయి. పురుషాధిపత్య సమాజాలుగా పేరొందిన ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో విడాకుల సంఖ్య, వేరు పడిన సంసారాల సంఖ్యా తక్కువగా ఉన్నాయి.పెళ్లి, పిల్లలు,పేరెంటింగ్, విడాకులు, ఆందోళన వంటివన్నీ మనదాకా వస్తేగానీ తెలియవు. కాలం కలిసి వచ్చినప్పుడు అంతా బ్రహ్మాండంగా సాగుతూ మనంత తెలివిగల వాళ్లు లేరనిపిస్తుంది. కాలం ఎదురు తిరిగినప్పుడే అసలు సినిమా కనిపిస్తుంది.– కరీనా కపూర్భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మంచి, చెడు రెండిటికీ కమ్యూనికేషన్ ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది. అనుబంధం బలపడుతుంది. అలాగే ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఆ బంధంలోకి భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మంచి, చెడు రెండిటికీ కమ్యూనికేషన్ ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది. అనుబంధం బలపడుతుంది. అలాగే ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఆ బంధంలోకి మూడోవ్యక్తి దూరకూడదు. ఆ జంటే పరిష్కరించుకోవాలి.మూడోవ్యక్తి దూరకూడదు. ఆ జంటే పరిష్కరించుకోవాలి.– విద్యా బాలన్ – సరస్వతి రమ -
నాకు కష్టమొచ్చింది.. ఇక ఈ ట్రైన్ ఎందుకు?.. అందులో ఉన్న మీరెందుకు?
మనిషికొక్క తీరు.. మనకి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా అధిగమించాలనేది కొంతమంది ఆలోచిస్తే, ఆ సమస్యనే తన చుట్టంగా చేసుకుని బాధపడే వాళ్లు మరికొందరు. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలయ్యే వాళ్లు ఇంకొందరు. ఇది చాలా ప్రమాదం. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలవ్వాలని కోరుకుంటారు.కానీ ప్రపంచంలోని సమస్యతో మాత్రం వీరికి అవసరం ఉండదు. ఇలాంటి వాళ్లు చాలా సందర్భాల్లో ఏం చేస్తున్నామనే విచక్షణ మరిచిపోతారు. ఏదైనా చిన్నపాటి కష్టం వస్తే చాలు.. మన చుట్టూ ఉన్న వాళ్లు ఎంత సుఖంగా ఉన్నారో అనే భ్రాంతిలో ఉండి వారికి తీవ్ర నష్టం చేయడానికి యత్నించడంలో ముందుంటారు. ఈ తరహాలోనే తన భార్య తనకు విడాకులు ఇచ్చిందనే కారణంతో మొత్తం ట్రైన్నే తగలబెట్టాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. తన వెంట బ్యాగులో తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాను ఒక్కసారిగా ట్రైన్లో చల్లుకుంటా వచ్చి ఒక్కసారిగా నిప్పంటించాడు. అసలు ఏం జరుగుతుందనే ప్రయాణికులు తేరుకుని పరుగులు తీసే లోపే ఆ ట్రైన్ లోపల ఒక్కసారిగా భగ్గుమంది. భార్య విడాకులిచ్చిందనే ఫ్రస్టేషన్లో..ఈ ఘటన దక్షిణాకొరియా దేశంలో చోటు చేసుకంది. ఇటీవల సియోల్‌కు చెందిన వాన్ అనే వ్యక్తికి భార్యతో విడాకులయ్యాయి. దీన్ని భరించలేకపోయాడు. సుమారు 67 ఏళ్ల వయసులో తనకు విడాకులు మంజూరు కావడాన్ని వాన్ తట్టుకోలేకపోయాడు. ఇక తాను ఎందుకు అనుకున్నాడు. అలా అనుకుంటూనే ట్రైన్ ఎక్కాడు. అప్పటికే ఓ పెట్రోల్ డబ్బా బ్యాగ్‌తో పాటు వెంట తెచ్చుకున్నాడు. అయితే ఆ ట్రైన్ కోచ్‌లో జనం కాస్త సంతోషంగా కనిపించారు. తనకు కష్టం వచ్చింది.. వీరి ముఖాల్లో నవ్వులు పూస్తున్నాయి అనుకున్నాడో ఏమో కానీ.. ఒక్కసారిగా పెట్రోల్ డబ్బా బయటకు తీశాడు. పెట్రోల్ డబ్బా బయటకు తీసిన క్షణంలోనే అనుమానం వచ్చిన ఆ కోచ్‌లోని ప్రయాణికులు పరుగులు తీశారు. పెట్రోల్ మొత్తం కోచ్ అంతా చల్లడం.. ఆపై నిప్పంటించడం జరిగిపోయాయి. సముద్రగర్భంలోని టన్నెల్లో రైలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో 22 మంది ఆస్పత్రి పాలు కాగా, మరొక 129 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిందితుడు వాన్ కూడా గాయపడటంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కారణంగా 240,000 యూఎస్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.వాన్‌పై హత్యాభియోగాలుఈ దారుణానికి పాల్పడ్డ వాన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కదులుతున్న ట్రైన్లో ఘటన జూన్ 9న జరగ్గా, ఇది ఆలస్యంగా వెలుగుచూసింది. వాన్‌పై హత్యాయత్నం అభియోగాలతో పాటు పలు సెక్షన్లు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న వాన్.. భార్యతో విడాకులు మంజూరు అయినందుకే ఇలా చేశానని స్పష్టం చేశాడు. ట్రైన్లో పెట్రోల్ పోసిన ఘటన వీడియో వైరల్‌గా మారింది.서울지하철 5호선 방화범 CCTV사망자 없는게 기적이네요 pic.twitter.com/IQMowGZkWH— 브이몬 (@XXV_mon) June 25, 2025 -
నిహారిక విడాకులు.. తప్పు మాదే..
-
భార్య ‘ఖులా’ విడాకులు కోరవచ్చు
సాక్షి, హైదరాబాద్: ఖులా విడాకులు కోరే సంపూర్ణ హక్కు ముస్లిం భార్యకు ఉంటుందని, భర్త డిమాండ్‌ను అంగీకరించాల్సిన అవసరం లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. వివాహ రద్దుపై న్యాయస్థానం ముద్ర మాత్రమే వేస్తుందని, దానికి కట్టుబడటం ఇరుపక్షాలపై ఉంటుందని స్పష్టం చేసింది. తన భార్యతో వివాహాన్ని రద్దు చేయడంలో సదా ఈ హక్ షరాయ్ కౌన్సిల్ నిర్ణయాన్ని సమర్థించిన కుటుంబ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ చాంద్రాయణగుట్టకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు ధర్మాసనం సమగ్ర తీర్పును వెలువరించింది. భార్య వివాహ బంధాన్ని కొనసాగించకూడదనుకుని ముఫ్తీని సంప్రదించి ప్రైవేట్‌గా పరిష్కరించుకునే విధానమే ‘ఖులా’. షరియత్ ఆధారంగా ముఫ్తీ సలహా (ఫత్వా) ఇస్తారు. ఒకవేళ ప్రైవేట్‌గా పరి ష్కారం కాకపోతే.. వ్యాజ్యం దాఖలైతే న్యాయమూర్తి షరియత్ ఆధా రంగా తీర్పు ఇవ్వవలసి ఉంటుంది. ఈ కేసులో భర్త వేధింపులు భరించలేక భార్య ఖులా కోరారు. భర్త అంగీకరించకపోవడంతో సదా ఈ హక్ షరాయ్ కౌన్సిల్ ద్వారా ఖులానామా (విడాకుల పత్రం) పొందారు. దీనిని భర్త ఫ్యామిలీ కోర్టులో సవాల్ చేసినా ఊరట దక్కలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఖులా ద్వారా విడాకులు పొందవచ్చన్న ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. మెహర్ (కట్నం) మొత్తాన్ని, అందులో కొంత భాగాన్ని తిరిగి ఇవ్వడంపై చర్చలు జరపడం తప్ప ఆమె డిమాండ్‌ను తిరస్కరించే హక్కు భర్తకు లేదని కోర్టు అభిప్రాయపడింది. -
మూడు ముళ్లెందుకు గుచ్చుకుంటున్నాయి?
‘మగాళ్లు, ఆడాళ్లు ఇద్దరూ సమానమే.. కానీ మగాళ్లు ఇంకొంచెం ఎక్కువ సమానం!’ ‘రాధాగోపాలం’ సినిమాలో డైలాగ్! ‘భార్యభర్తలిద్దరూ సమానమే అయితే భర్త ఇంకొంచెం ఎక్కువ సమానం’ అని సంసారంలో ఉన్న మాటను ఇప్పటి తరం అంటే అమ్మాయిలు అంగీకరించే పరిస్థితిలో లేరు! ఈ మాట వినపడగానే పెద్దలు, సంప్రదాయవాదులు అందుకే మనమూ పాశ్చాత్యుల్లా విడాకులకు తెగబడుతున్నాం అనేస్తారు ఘాటుగా!ఇంతకీ ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దగ్గర విడాకుల సంఖ్య ఎంతో తెలుసా.. కేవలం ఒక్క శాతమే! అంతదానికే ఇంత ఘాటా? అంటే కుటుంబ వ్యవస్థకు పునాది వివాహ వ్యవస్థగా మన్ననలు అందుకుంటున్న దేశం కదా! అలాంటి సమాజంలో ప్రపంచంతో పోలిస్తే తక్కువే అయినా విడాకుల సంఖ్య పెరుగుతుండటం, అందుకు అనుమతులు వస్తుండటం ఆందోళన కలిగించే అంశమే కదా! ఈ నేపథ్యంలో మన పెళ్లి వ్యవస్థ బీటలు వారుతోందా? నివారోణాపాయం ఏంటి... వంటి అంశాల మీద నేటి నుంచి వరుస కథనాలు. ఈ రోజు.. పెళ్లి, అది ప్రమోట్ చేస్తున్న, డిమాండ్ చేస్తున్న అంశాలేంటో చూద్దాం! ఇదివరకు.. ఆడపిల్లకు ఉత్తరం చదివే అక్షరజ్ఞానం ఉంటే సరిపోతుందని అంతవరకే అనుమతించారు. తర్వాత ఆ ఆలోచన కాస్త మారి అమ్మాయి తన పిల్లలకు చదువు చెప్పుకునేంత జ్ఞానం సంపాదించాలని ఆ అనుమతిని కాస్త సడలించారు. ఇప్పుడు అమ్మాయిలు ప్రొఫెషనల్ డిగ్రీలు, పీహెచ్‌డీలూ చేసి, అబ్బాయిలు ఏయే రంగాల్లో ఉన్నారో ఆయా రంగాల్లో తమ ఉనికినీ చాటుకుంటున్నారు. అబ్బాయిలతో సమానంగా శ్రమించి సమాన వేతనాల కోసం డిమాండ్ చేస్తున్నారు. సమానత్వ సాధనలో ఇది శుభపరిణామం. కానీ ఇదే పెళ్లిని బ్రేక్ చేస్తోందని సంప్రదాయ వాదుల భావన. ఎందుకంటే...అక్షరజ్ఞానం నుంచి ఆఫీస్‌లకు చేరుకునేదాకా ఆడవాళ్ల ప్రగతిని ఆంక్షలు, హద్దులతో అయినా అంగీకరించిన సమాజం కనీసం స్థాయిలో డొమెస్టిక్ లేబర్‌లో పురుషుల భాగస్వామ్యాన్ని అంగీకరించలేకపోతోంది. ఆ ప్రగతికి సమాన నిష్పత్తిలో డొమెస్టిక్ లేబర్‌లో పురుషుల పాత్ర పెరగలేదు. అంటే పెళ్లి ఆ బాధ్యతను పూర్తిగా ఇంకా స్త్రీల భుజాన్నే మోపుతోంది. భార్యాభర్తలు పేరెంట్స్‌గా మారినా భర్త మీద పెద్దగా భారం పడట్లేదు. తల్లయిన భార్యకు మాత్రం క్రమంగా విశ్రాంతి తగ్గిపోతోందని, పిల్లలు పుట్టగానే నిద్ర నుంచి కెరీర్ వరకు తల్లే త్యాగం చేయాల్సి వస్తోందని అధ్యయనాల సారం. పేరెంటింగ్ సమస్య కాదు. మ్యారేజ్‌లో పేరెంటింగ్‌ని కేవలం తల్లి బాధ్యతలా పరిగణించడమే సమస్య, ఆ మాటకొస్తే పెళ్లిలోని ప్రేమ, విధేయత, కమిట్మెంట్తో కూడా ప్రాబ్లం లేదు. పెళ్లి నిర్మాణమే అసలుప్రాబ్లం’ అంటున్నారు ఈతరం అమ్మాయిలు. అందుకే సాధికారత సాధించిన యువతలు ఆర్థిక, సామాజిక భద్రతకో, ఓ ఇంటి వారవడం కోసమో పెళ్లి చేసుకునే స్థితిలో లేరు. పురుషులతోపాటు స్త్రీలకూ అంతేప్రాధాన్యం, గౌరవం ఇస్తూ భాగస్వామ్యానికి అసలైన నిర్వచనంగా ఉండే బంధాన్ని కోరుకుంటున్నారు. ఆ ఫ్రేమ్‌లో లేని పెళ్లిని త్యజించడానికి సిద్ధపడుతున్నారు. ఆనందం పంచలేని బంధానికి విడాకులనివ్వడానికీ వెనుకాడటం లేదు. సంప్రదాయం కన్నా మానసిక ఆరోగ్యం, భద్రతకేప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్ని కుటుంబం గ్రహించాలి. పిల్లల పెంపకం నుంచే జాగ్రత్త వహించాలి. చదువు విషయంలో అమ్మాయి, అబ్బాయి పట్ల చాలావరకు సమానత్వం చూపిస్తున్న తల్లిదండ్రులు ఇంటి పనుల విషయంలోనూ ఆ సమానత్వాన్ని ప్రదర్శించాలి. ఎందుకంటే అక్కడ అమ్మాయిలకు వెసులుబాటు దొరికితేనే వారి సాధికారతకు సార్థకత చేకూరుతుంది. ఇప్పటికిప్పుడు తల్లిదండ్రులు డొమెస్టిక్ లేబర్‌లోనూ అబ్బాయిలకు వాటా ఇస్తే భవిష్యత్ తరానికి అది నార్మలైజ్ అవుతుంది. సమాజంలో జరుగుతున్నదాన్ని అందరికీ ఆపాదించలేం. ఎవరి జీవితం వాళ్లది.. ఎవరి ఎక్స్‌పీరియెన్స్ వాళ్లది. పెళ్లి విషయంలోనూ అంతే! పెళ్లి కావాలనుకున్నా వద్దనుకున్నా అది వాళ్ల వ్యక్తిగత చాయిస్. అలాగే విడాకుల విషయంలోనూ అంతే! కలిసి ఉందామనుకున్నా, వద్దనుకున్నా ఆ జంట నిర్ణయం. అయితే ఆ చాయిస్‌కి కానీ, నిర్ణయాలకు కానీ సమాజంలో స్పేస్ ఉండాలి. – ఐశ్వర్య రాయ్ బచ్చన్‘నాకిప్పుడు 59 ఏళ్లు. శారీరకంగా, మానసికంగా నానా అవస్థలు పడుతూ సినిమాల్లో పనిచేస్తున్నాను. పెళ్లి పేరుతో నా జీవితంలోకి వచ్చిన భాగస్వామి ఏ కారణంతో విడిపోయినా భరణం కింద నా కష్టార్జితంలో సగానికి ఎసరుపెడుతుంది. యంగ్ ఏజ్‌లో పెళ్లయితే పర్లేదు.. అవతలి వాళ్లు మనోవర్తి కింద ఎంత డబ్బు తీసుకున్నా మళ్లీ సంపాదించుకోగలమనే నమ్మకం ఉంటుంది. కానీ ఈ వయసులో? అదంతా ఎక్కడ పెట్టుకోను? అందుకే ఇలా గడచిపోతోంది గడచిపోనివ్వండి’ – సల్మాన్ ఖాన్, బాలీవుడ్ నటుడు– సరస్వతి రమ -
వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన ప్రముఖ బుల్లితెర జంట
ఇటీవల సినీ ఇండస్ట్రీలో విడాకుల వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ నటీనటులు సైతం తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా మరో జంట తమ పెళ్లి బంధానికి ఎండ్ కార్డ్ పడేసింది. ప్రముఖ సీరియల్ నటి లతా సబర్వాల్.. తన భర్త సంజీవ్ సేథ్తో విడిపోతున్నట్లు ప్రకటించారు. సుదీర్ఘమైన చర్చల తర్వాత నేను.. నా భర్త విడిపోవాలని నిర్ణయించుకున్నాం. నాకు అందమైన కొడుకును ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. అతని భవిష్యత్తు బాగుండాలని శుభాకాంక్షలు' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాదాపు పెళ్లైన 16 ఏళ్లకు తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ విషయంపై ఎటువంటి ప్రశ్నలు అడగకుండా తనను, తన కుటుంబాన్ని గౌరవించాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించింది. వీరిద్దరు బుల్లితెర నటీనటులు కాగా.. 'యే రిష్టా క్యా కెహ్లతా హై' సీరియల్ సెట్స్‌లో కలుసుకున్నారు. ఈ సీరియల్ బాలీవుడ్లో అత్యంత ఆదరణ దక్కించుకున్న వాటిలో ఒకటిగా నిలిచింది. ఇందులో భార్య, భర్తల పాత్రల్లో వీరిద్దరు నటించారు. అంతేకాకుడా ఈ జంట 2013లో 'నాచ్ బలియే 6' అనే డ్యాన్స్ షోలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రేమలో పడిన జంట 2009లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంటకు 2013లో ఓ కుమారుడు జన్మించారు. మరోవైపు సంజీవ్ సేత్ గతంలోనే నటి రేషమ్ టిప్నిస్ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2004లో ఈ జంట విడిపోయారు. అయితే పలు సీరియల్స్‌లో తనదైన నటనతో మెప్పించిన లతా సబర్వాల్ 2021లో నటనకు గుడ్‌బై చెప్పేసింది. ఆమె సీరియల్స్‌తో పాటు 'వివా', 'ఇష్క్ విష్క్' వంటి చిత్రాలలో కూడా కనిపించింది. -
డివోర్సీ క్యాంప్స్
విడాకులు తీసుకున్న స్త్రీల గురించి వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉంటాయి. తప్పు ఎవరిదైనా వీరినే సందేహంగా చూస్తారు. విడాకుల తర్వాతి జీవితం పురుషుడికి ఉన్నంత సులువుగా స్త్రీకి లేదు. వారికంటూ స్నేహబృందం కష్టమే. అందుకే కేరళకు చెందిన రాఫియా తాజాగా నిర్వహించిన ‘డివోర్సీ క్యాంప్’ అందరి దృష్టినీ ఆకర్షించింది. విడాకులు పొందిన స్త్రీల బృందం రెండు రోజులపాటు స్నేహితులుగా మారి తమ మనోభావాలు పంచుకోవడమే ఈ క్యాంప్స్ లక్ష్యం. మొదటిది సక్సెస్ కావడంతో రాబోయే రెండు నెలల్లో మరో నాలుగు క్యాంప్స్ నిర్వహించనుంది రాఫియా.‘మేము కలిసేది మా బాధలు, పాత కథలు చెప్పుకుని ఏడ్వడానికి కాదు. మేము మర్చి పోయిన నవ్వును తిరిగి పొందడానికి’ అంటుంది రాఫియా అఫి. 30 ఏళ్ల ఈ డివోర్సీది కేరళలోని ఇడుక్కి. వారం క్రితం ఈమె పదిహేను మంది డివోర్సీ మహిళలతో ఇడుక్కీకి సమీపంలో ఉండే వాగమాన్ అనే అందమైనచోట రెండు రోజుల ‘డివోర్సీ క్యాంప్’ నిర్వహించింది. బహుశా దేశంలో ఇలాంటి మాట వాడుతూ స్త్రీల బృందం కలవడం ఇదే మొదటిసారి కావచ్చు. ఈ పదిహేనుమందిలో ఎక్కువమంది విడాకులు పొందినవారు... మిగిలిన వారు పొందేందుకు పోరాటం చేస్తున్నవారు. వీరిలో ఒకరిద్దరు తమ పిల్లలతో వచ్చారు కూడా. మాకంటూ స్పేస్ కావాలి‘సమాజంలో విడాకులను ఇప్పటికీ వ్యక్తిగత వైఫల్యంగా చూస్తారు. విడాకులు పొందిన స్త్రీని చూస్తూ ఆమెకు చేతగాక కాపురాన్ని పాడు చేసుకుందని భావిస్తారు. కుటుంబ సభ్యులు మొదలు అందరూ సానుభూతిగా చూస్తుంటారు. వివాహం లో ఉన్నప్పుడు ఉన్న స్నేహాలన్నీ చెదిరి పోతాయి. విడాకుల వల్ల స్త్రీకి ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎంతో నష్టమున్నా ఇలాంటి పరిస్థితుల వల్ల ఎంతో ఒత్తిడి ఉంటుంది. మమ్మల్ని జడ్జ్ చేయని విధంగా మాకంటూ మేము ఒక స్పేస్‌ను హాయిగా గడిపేలా ఈ డివోర్సీ క్యాంప్ ఉపయోగపడుతోంది’ అంది రాఫియా.బ్రేక్ ఫ్రీ స్టోరీస్రాఫియాకు ఇన్‌స్టాలో ‘కుక్ ఈట్ బర్న్’ అనే అకౌంట్ ఉంది. అందులో ఆమె సరదా వీడియోలు పెట్టేది. ‘కాని నా విడాకుల గురించి మాట్లాడటానికి సందేహించిదాన్ని. విడాకులు పొంది తర్వాతి జీవితం విషయంలో లోలోపల ఆందోళనగా ఉన్నదాన్ని నేనొక్కదాన్నే అనుకున్నాను. నా ఇన్‌స్టాలో నా విడాకుల గురించి మాట్లాడటం మొదలుపెటాక నేనే కాదు.. నాలా ఉన్న స్త్రీలు ఎందరో ఉన్నారని వారి రెస్పాన్స్‌ను బట్టి అర్థమైంది. కేరళలో విడాకులు పొందిన స్త్రీలతో ‘బ్రేక్ ఫ్రీ స్టోరీస్’ పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ పెడితే మానసిక ఓదార్పు మాత్రమే గాక లీగల్ సమస్యలకు ఇతరత్రా ఇష్యూస్‌కు ఒక స పోర్ట్ ఉంటుందని ప్రయత్నించాను. కొద్దిరోజుల్లోనే వందమంది మహిళలు చేరారు. వారిలో కొంతమందితో క్యాంప్ నిర్వహించాలని అనుకున్నాను. మొదటి ప్రయత్నంగా వాగమాన్ లో రెండురోజుల క్యాంప్ ఉందని చె΄్పాను. పదిహేను మంది వచ్చారు’ అని తెలిపింది రాఫియా.క్షణాల్లో ఆత్మబంధువులుడివోర్సీ క్యాంప్‌కు వచ్చిన పదిహేను మంది మహిళలు అంతకు ముందు ఎటువంటి పరిచయం లేని వాళ్లు. కాని కలిసీ కలవగానే వీరంతా స్నేహితులై పోయారు. ఎడతెగని మాటలు... నవ్వులు... కొన్ని కన్నీళ్లు... ఆటలు... నృత్యాలు... ప్రకృతి తుళ్లిపడే కేరింతలు... మేమందరం ఒకేలాంటి సమస్యలో ఉన్నవాళ్లం అన్న భావన వారిని ఒక్కటి చేసి మానసిక బలం ఇచ్చింది. ‘వీరిలో చాలామందికి సొంత కుటుంబ సభ్యుల నుంచీ స పోర్ట్ లేదు. విడాకుల సమయంలో స్త్రీలకు ఇతరుల మద్దతు లేకున్నా తల్లిదండ్రుల మద్దతు తప్పనిసరి. అదృష్టవశాత్తు నాకు ఉంది’ అని తెలిపింది రాఫియా. ‘‘ఈ క్యాంప్‌లో అందరం కలిసి అనుకున్నమాట– విడాకుల తర్వాత కూడా మంచి జీవితాన్ని సాధించవచ్చుననే’’ అంది రాఫియా. ఇకపై నిర్వహించబోయే డివోర్సీ క్యాంపుల్లో థెరపీ, లీగల్ అడ్వయిజ్, ఫైనాన్షియల్ స పోర్ట్, సమాజాన్ని ఎదుర్కోవాల్సిన తీరు గురించి ఎక్స్‌పర్ట్‌లతో కౌన్సిలింగ్స్ ఉంటాయని చెబుతోంది రాఫియా. ఆశ్చర్యం ఏమిటంటే ఈ క్యాంప్ అయిన వెంటనే రాఫియా ఫోన్ ఎడతెగక మోగుతోంది. అలెప్పీ, వాయనాడ్లాంటి చోట్ల ఆమె ఈ క్యాంప్‌లను ΄్లాన్ చేసింది. అక్కడికి ఇప్పటికే వచ్చేవారు సిద్ధమయ్యారు కూడా.కొసమెరుపు: విడాకులు పొందిన, పొందే క్రమంలో ఉన్న పురుషులు కూడా ఆమెకు ఫోన్ చేస్తున్నారు... ఇలాంటి క్యాంపులు నిర్వహించమని. ‘ఆ సంగతి కూడా ఆలోచిస్తాను’ అంటోంది రాఫియా. -
రెండుసార్లు విడాకులు.. ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం?: హీరో
పెళ్లైన దంపతులను నిండునూరేళ్లు కలిసి జీవించమని పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. కానీ, ఈ కాలంలో నూరేళ్లు బతకడం కష్టమే అయితే, అంతవరకు కలిసి జీవించడం పెద్ద సవాల్‌గా మారింది. ఎన్నో జంటలు ఆడంబరంగా వివాహం చేసుకోవడం తర్వాత విడాకులు తీసుకోవడం పరిపాటిగా మారింది. సినీ ఇండస్ట్రీలో ఈ ధోరణి కాస్త ఎక్కువే కనిపిస్తుంది.నిందలు- బాధలుఅయితే విడాకులు తీసుకోవడం ఈజీ అయినా, ఆ బాధను మర్చిపోవడం అంత తేలిక కాదంటున్నాడు హీరో ప్రోసెంజిత్ చటర్జీ (Prosenjit Chatterjee). ఇతడు సహనటి దెబశ్రీ రాయ్ (Debashree Roy)ను పెళ్లాడాడు. వివాహమైన కొంతకాలానికే విడిపోయారు. ఈ విషయం గురించి ప్రొసెంజిత్ తాజాగా టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అప్పుడు మా వయసు పెద్దదేం కాదు. విడిపోయినప్పుడు ఒకరినొకరు నిందించుకున్నాం.టాప్ 10 నటుల్లో నేను లేనుకానీ ఆ బాధ నుంచి బయటపడలేకపోయాను. పనిపై దృష్టి సారించలేకపోయాను. కొంత డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. సరిగ్గా అదే సమయంలో బెంగాల్లో టాప్ 10 నటుల గురించి ఓ వార్త రాశారు. టాప్ 10 జాబితాలో ఎక్కడా నా పేరు లేదు. అది నన్ను మరింత బాధలోకి నెట్టేసింది. నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. తిరిగి ఆఫీస్‌కు వెళ్లి ఒకేసారి తొమ్మిది సినిమాలు సంతకం చేశాను. ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే ఒరిగేదేం లేదు.ప్రొసెంజిత్ చటర్జీ- దెబశ్రీ రాయ్మూడు పెళ్లిళ్లుబాధగా అనిపించినప్పుడల్లా నా తోటకి వెళ్లేవాడిని. ఎవరితోనూ మాట్లాడకుండా కాసేపు ప్రశాంతంగా కూర్చునేవాడిని అని చెప్పుకొచ్చాడు. దెబశ్రీకి విడాకులు ఇచ్చాక ప్రొసెంజిత్ మరోసారి ప్రేమలో పడ్డాడు. అపర్ణ గుహ తకుర్తను పెళ్లాడాడు. వీరికి ప్రేరణ అనే కూతురు పుట్టింది. తర్వాత ఈ జంట మధ్య కూడా విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. నటి అర్పితా పాల్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు. కెరీర్బాలీవుడ్ నటుడు బిస్వజిత్ చటర్జీ కుమారుడే ప్రొసెంజిత్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ప్రొసెంజిత్ హీరోగా, విలన్‌గా అనేక సినిమాలు చేశాడు. బెంగాలీ, హిందీలో అనేక చిత్రాల్లో నటించాడు. దోసర్ మూవీకి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. చివరగా ఖాకీ: ద బెంగాల్ చాప్టర్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించాడు. ప్రస్తుతం మాలిక్ అనే మూవీ చేస్తున్నాడు. పులకిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రాజ్ కుమార్ రావు, మానుషి చిల్లరి, మేధా శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ జూలై 11న విడుదల కానుంది. చదవండి: అఖిల్ అక్కినేని రిసెప్షన్.. ఈ విషయం గమనించారా? -
భర్త కర్కశత్వం.. భార్య హతం
యశవంతపుర(కర్ణాటక): ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తివేటుకు బలి చేశాడు కర్కోటక భర్త. ఈ ఘటన చిక్కమగళూరు తాలూకా కైమరా చెక్‌పోస్టు వద్ద జరిగింది. అవినాశ్(32) కీర్తి(26)లు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రెండన్నరేళ్ల చిన్నారి ఉంది. వీరి సంసారం సవ్యంగా సాగుతుండగా ఇటీవల కలతలు ఏర్పడ్డాయి. విడాకులు ఇవ్వాలని అవినాశ్ ఒత్తిడి చేసేవాడు. భార్య నాలుగు నెలల గర్భిణిగా ఉండగా అబార్షన్ చేయించినట్లు తెలిసింది. కొంతకాలంగా పుట్టింటిలో ఉన్న కీర్తి బట్టలు తీసుకురావటానికి బుధవారం భర్త వద్దకు వచ్చింది. ఆ సమయంలో అవినాశ్ కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. చుట్టు పక్కలవారు గమనించి బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ మృతి చెందింది. అవినాశ్ అక్క వల్లనే తమ కుమార్తె కాపురంలో కలతలు ఏర్పడ్డాయని మృతురాలి తల్లిదండ్రులు చిక్కమగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పరారీలో ఉన్న అవినాశ్ కోసం గాలింపు చేపట్టారు. -
జయం రవి విడాకుల కేసు.. అన్ని పోస్టులు డిలీట్ చేసిన భార్య!
కోలీవుడ్ హీరో జయం రవి ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల కొద్ది రోజులుగా ఆయన భార్య, జయం రవి ఒకరిపై ఒకరు పెద్దఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. తనను వేధింపులకు గురి చేశారంటూ జయం రవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ తర్వాత ఆయన భార్య ఆర్తి సైతం మూడో వ్యక్తి ప్రమేయం వల్లే విడాకులకు దారితీసిందని ఆరోపించింది. విడాకుల విషయంలో ఇప్పటికే వీరిద్దరు కోర్టుకు కూడా హాజరవుతున్నారు.ఈ నేపథ్యంలోనే జయం రవి భార్య ఆర్తి ఓ బిగ్ షాకిచ్చింది. ఈ వివాదం గురించి చేసిన పోస్టులన్నింటినీ తన సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. దంపతులు ఒకరిపై ఒకరు పరువు నష్టం కలిగించే పోస్టులను పెట్టవద్దని హైకోర్టు ఆదేశించండంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రవి తన భార్య ఆర్తితో పాటు అత్త సుజాతకు నోటీసులు పంపారు. తమ విభేదాల గురించి మాట్లాడటం మానేయాలని వారిద్దరికీ లీగల్ నోటీసు పంపారు. అంతేకాకుండా నటుడికి పరువు నష్టం కలిగించే పోస్టులను తొలగించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పంపించారు.అదేవిధంగా ఆర్తి సైతం.. రవి మోహన్‌కు లీగల్ నోటీసులు పంపింది. ఆర్తితో పాటు అత్త సుజాతపై పోస్టులు చేయకుండా ఆపేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆర్తి హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపింది. న్యాయ వ్యవస్థ పరువు నష్టం నుంచి రక్షణ కల్పించడం.. అన్నింటికంటే ముఖ్యంగా న్యాయాన్ని కాపాడిందని ఆమె పోస్ట్‌కు క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. కాగా.. జయం రవి, ఆర్తి 16 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ ఉన్నారు. -
నేను పూర్తిగా మారిపోయా.. విడాకుల అంశంపై ధనశ్రీ తొలిసారి
టీమిండియా క్రికెటర్ చాహల్-ధనశ్రీ వర్మ విడాకుల అంశం ఇప్పటికీ ఏదోలా చర్చకు కారణమవుతూనే ఉంది. 2020లో ఈ జంట పెళ్లి చేసుకోగా కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. కానీ ఏడాదిన్నర క్రితం విడాకుల రూమర్స్ వచ్చాయి. కట్ చేస్తే ఈ ఏడాది మార్చిలో అధికారికంగా విడిపోయారు. అప్పటినుంచి సైలెంట్‌గానే ఉన్న ఈమె.. ఇప్పుడు తొలిసారి మీడియాతో మాట్లాడింది. విడాకుల తర్వాత తాను చాలా మారిపోయినట్లు చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: Spirit: రూ. 20 కోట్లు డిమాండ్ చేసిన దీపికా.. త్రిప్తికి ఎంత ఇస్తున్నారంటే?) 'ట్రోలింగ్ నన్నేం బాధపెట్టదు. ఎందుకంటే నాకు మనోబలం ఎక్కువ. బయట సమస్యలు నన్నేం చేయలేవు. నెగిటివిటీ, బహిరంగ విమర్శలు.. నన్ను ఎప్పుడూ బాధించలేదు. నేను చాలా కష్టపడే మనిషిని. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నన్ను నేను ప్రేమించుకోవడం, క్రమశిక్షణ, వ్యాయామం, మంచి ఫుడ్‌తో పాటు నన్ను ప్రేమించే, గౌరవించే వ్యక్తులు నా చుట్టూ ఉన్నారు' అని ధనశ్రీ వర్మ చెప్పుకొచ్చింది.రీసెంట్ టైంలో ఎదురైన పరిస్థితులు నన్ను దృఢంగా మార్చాయి. నా తల్లిదండ్రులు ఎంత బలమైన కూతుర్ని పెంచారో తెలిసొచ్చింది. ఇప్పుడు నాపై వస్తున్న పుకార్ల గురించి క్లారిటీ ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడేం చెప్పినా అది మరింత చర్చకు కారణమవుతాయి. అలానే ప్రేమ అనేది జీవితంలో చాలా విలువైన అంశం అని ధనశ్రీ చెప్పింది.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' కాజల్)చాహల్‌తో విడాకులు తీసుకోవడం ఏమో గానీ ధనశ్రీపై చాలా విమర్శలు వచ్చాయి. రూ.60 కోట్ల భరణం తీసుకుందని అన్నారు. కానీ అదంతా పుకారే అని తేల్చారు. మరోవైపు చాహల్‌తో చెట్టాపట్టాలేసుకున్న తిరుగుతున్న ఆర్జే మహ్వశ్ అనే అమ్మాయి కూడా అప్పుడప్పుడు పరోక్షంగా ధనశ్రీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసేది. ఇప్పుడు వాటిపైనే స్పందించిన ధనశ్రీ.. అలాంటివే పట్టించుకోనని క్లారిటీ ఇచ్చేసింది.ప్రస్తుతం తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో హీరోయిన్గా చేసిన ధనశ్రీ వర్మ.. హిందీలో భోల్ చుక్ మాఫ్ అనే మూవీలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. అంతకు ముందు ఈమె యూట్యూబర్‌గా చాలా ఫేమస్.(ఇదీ చదవండి: ప్రియురాలితో అఖిల్ పెళ్లికి సిద్ధమయ్యాడా?) -
మనసు విప్పి మాట్లాడుకోండి
న్యూఢిల్లీ: మనసు విప్పి చర్చించుకుంటే పరిష్కారం కాని సమస్యంటూ ఉండదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘‘మీకు మూడేళ్ల కొడుకున్నాడు. వైవాహిక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడంలో భేషజాలెందుకు? గతమొక చేదుమాత్ర అనుకుని మర్చిపొండి. భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఓ కప్పు చాయ్ తాగుతూ మాట్లాడుకుంటే ఏదైనా సాధ్యమే. ఈ రాత్రి కలిసి భోంచేయండి. విభేదాలను సామరస్యంగా మాట్లాడుకుని పరిష్కరించుకోండి’’ అని విడాకుల కోసం తమను ఆశ్రయించిన ఓ జంటకు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ధర్మాసనం సూచించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
జయం రవి విడాకుల కేసు.. ఆయన భార్య ఆర్తి మరో పిటిషన్
కోలీవుడ్ స్టార్ జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుతుతోంది. ప్రస్తుతం వీరిద్దరి పంచాయతీ కోర్టులో ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాత్రం ఆగడం లేదు. ఇటీవల ఓ పెళ్లిలో జయంరవి.. ఆయన గర్ల్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న సింగర్ కెన్నీషా హాజరు కావడంతో వీరి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. జయం రవి తాను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని.. పంజరం నుంచి బయటపడ్డానని చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు.తాజాగా ఆయన భార్య సైతం తామిద్దరం మూడో వ్యక్తి వల్లే విడిపోవాల్సి వచ్చిందని మూడు పేజీల లేఖను విడుదల చేసింది. మా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ప్రమేయం ఉందనడానికి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది.ఒకవైపు వీరిద్దరు విడాకుల కోసం కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు. అంతలోనే ఆర్తి మరో కీలక నిర్ణయం తీసుకుంది. తనకు నెలకు రూ.40 లక్షల భరణం చెల్లించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే వీరిద్దరు ఇటీవల విడాకుల కేసులో కోర్టుకు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆర్తి భరణం కోరుతూ పిటిషన్ వేయడంతో కోలీవుడ్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారింది -
జయం రవిని ఎప్పుడూ అల్లుడిలా చూడలేదు.. సీన్ లోకి ఎంటరైన అత్త
తమిళ హీరో జయం రవి విడాకుల పంచాయతీ రోజుకో టర్న్ తీసుకుంటోంది. ఇతడు గతేడాది తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత అంతా సైలెంట్. కానీ రీసెంట్ గా ఓ నిర్మాత కూతురి పెళ్లిలో సింగర్ కెనీషాతో ఈ హీరో కనిపించాడు. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్స్ వచ్చాయి.(ఇదీ చదవండి: కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ట్రైలర్ రిలీజ్) జయం రవి.. మరో అమ్మాయితో కనిపించేసరికి మాజీ భార్య ఆర్తికి ఎక్కడో మండింది. దీంతో తన భర్తకు అసలు బాధ్యత లేదని, పిల్లల్ని పట్టించుకోవట్లేదని పెద్ద పోస్ట్ పెట్టింది. దీని తర్వాత కెనీషా కూడా పరోక్షంగా ఆర్తిని కౌంటర్ చేస్తూ పోస్టులు పెట్టింది. ఇదే విషయమై స్పందించిన జయం రవి.. కెనీషా, ఆర్తి గురించి క్లారిటీ ఇచ్చేశాడు.ఇప్పుడు ఈ విడాకుల పంచాయతీలోకి జయం రవి అత్త, ఆర్తి తల్లి సుజాత విజయ్ కుమార్ ఎంటరైంది. తన అల్లుడు చాలా అబద్ధాలు మాట్లాడుతున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. ఇతడితో సినిమాలు నిర్మించేందుకు ఏకంగా రూ.100 కోట్ల అప్పులు చేశానని చెప్పి షాకిచ్చింది.'జయం రవి ఎన్నో అబద్ధాలు చెబుతున్నారు. అందుకే నేను మాట్లాడాల్సి వస్తోంది. తను ఎంకరేజ్ చేయడం వల్లే నేను నిర్మాతగా మారాను. ఇతడు హీరోగా.. అడంగ మరు, భూమి, సైరన్ సినిమాల్ని నిర్మించాను. ఈ మూవీస్ కోసం రూ.100 కోట్లు అప్పుగా తెచ్చా. ఇందులో 25 శాతం రెమ్యునరేషన్ గా తనకే ఇచ్చాను. ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి'(ఇదీ చదవండి: 'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్) 'జయం రవిని నేను ఎప్పుడూ అల్లుడిలా చూడలేదు. కొడుకుగా భావించాను. అతడు ఎప్పుడూ బాధపడకూడదని అనుకున్నాను. అప్పుల వల్ల ప్రశాంతత లేని జీవితాన్ని గడిపాను. వడ్డీలు కట్టుకునేదాన్ని. ఈ క్రమంలోనే సాయం చేస్తానని మాటిచ్చాడు కానీ చేయలేదు''సానుభూతి పొందడం కోసం జయం రవి ఇప్పుడు చేసే ఆరోపణలు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. హీరో అనే భావన పోతోంది. అతడు ఎప్పుడూ ఓ హీరోగానే ఉండాలని కోరుకుంటున్నాను' అని సుజాత విజయ్ కుమార్ చెప్పుకొచ్చింది. మరి ఈ విషయంలో నెక్స్ట్ ఎవరి నుంచి రెస్పాన్స్ వస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
జూమ్ కాల్‌తో భార్య రెండో పెళ్లి గుట్టురట్టు.. నాలుగేళ్ల కోర్టు పోరాటంలో భర్త విజయం
సాక్షి, బెంగళూరు: భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ నాలుగేళ్ల కోర్టు పోరాటంలో ఓ భర్త విజయం సాధించాడు. అంతేకాదు భర్త నుంచి తనకు రూ.3 కోట్ల భరణం కావాలన్న భార్య డిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. కోర్టు ఖర్చుల కింద రూ.30వేలు ఇస్తే సరిపోతుందంటూ భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పును వెలువరించింది.కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ దంపతులకు 2018లో వివాహం జరిగింది. అయితే, ఏ చీకు చింతా లేని దాంపత్య జీవితంలో వివాహానికి ముందు భార్య నెరిపిన ప్రేమాయణం చిచ్చుపెట్టింది.వివాహం తర్వాత భార్య.. భర్తతో అన్యోన్యంగా మెలుగుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా అదే భార్య ప్రేమ పేరుతో ప్రియుడికి దగ్గరైంది. భర్తకు తెలియకుండా అతన్ని రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తతో కలిసి జీవించేది. డబ్బులు అవసరం అయినప్పుడల్లా రెండో భర్తకు డబ్బులు పంపిస్తుండేది. దీంతో భార్య చేస్తున్న ఖర్చులపై మొదటి భర్తకు అనుమానం మొదలైంది. ఇదే విషయంపై భార్యను నిలదీయాలని అనుకున్నాడు.కానీ అలా చేయలేదు. భార్య గుట్టు రట్టు చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. తన స్నేహితుడి సాయంతో భార్యకు జూమ్ ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఆ జూమ్ ఇంటర్వ్యూలో తనకు అన్వేక కారణాల వల్ల మొదటి వివాహం జరిగిందని, ఇప్పుడు ఆ వివాహ బంధానికి ముగింపు పలికి రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు.ఈ పరిణామం తరువాత ఆర్టీఐ ద్వారా.. తన భార్యకు రెండో వివాహం ఎప్పుడు జరిగిందో తెలుసుకున్నాడు. మ్యారేజీ సర్టిఫికెట్లు, పాన్ కార్డ్‌లతో పాటు ఇతర ఆధారాల్ని సేకరించాడు. వాటి ఆధారంగా 2023 మార్చి నెలలో భార్య తన ప్రియుడిని రెండో వివాహం చేసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే మంగళూరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. భార్య నుంచి విడాకులు కోరాడు. భార్య మానసిక హింస, వివాహం నిబంధనలను ఉల్లంఘించడం, ప్రతిష్టకు భంగం కలిగించిందని ఆరోపించాడు. ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆధారాల్ని కోర్టుకు అందించాడు. విచారణ చేపట్టిన కోర్టు విడాకుల విషయంలో భార్య నిర్ణయం తెలపాలని ఆదేశించింది. దీంతో భార్య.. భర్తపై గృహ హింస, డౌరీ హింస, గర్భం తొలగించమని బలవంతం చేశారని ఆరోపించింది. అంతేకాదు భరణం కింద రూ.3 కోట్లు, నెలకు ఖర్చుల కింద రూ.60వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. 2025,ఏప్రిల్ 23న భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేసింది. భార్య అడిగిన భరణాన్ని తిరస్కరించింది. న్యాయవాద ఖర్చుల నిమిత్తం రూ.30వేలు ఇవ్వాలని ఆదేశించింది. -
'పంజరం నుంచి బయటపడ్డా'.., భార్య ఆర్తికి జయం రవి కౌంటర్
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే తన భార్య ఆర్తితో ఆయన విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల పంచాయితీ కోర్టులో ఉంది. అయితే జయం రవి కుటుంబానికి దూరంగా సింగిల్‌గానే ఉంటున్నారు. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో జయం రవి సందడి చేశారు. అదే పెళ్లికి ఆయన గర్ల్ ఫ్రెండ్‌గా భావిస్తోన్న సింగర్ కెన్నీషా కూడా హాజరైంది. దీంతో మరోసారి వీరిద్దరి పంచాయతీ హాట్‌టాపిక్‌గా మారింది. ఇది చూసిన జయం రవి భార్య ఓ రేంజ్లో విమర్శలు చేసింది. తనని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని.. పిల్లల్ని పట్టించుకోనివాడు అసలు తండ్రేనా అంటూ చాలా పెద్ద నోట్ రిలీజ్ చేసింది. దీనిపై తాజాగా నటుడు జయం రవి స్పందించారు. దీనిపై దాదాపు నాలుగు పేజీల లేఖ రిలీజ్ చేశాడు. భార్య ఆర్తిని వేధించానన్న ఆరోపణలను ఖండిస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై మౌనంగా ఉండడం తన మనుగడ కోసం ఒక వ్యూహమని పేర్కొన్నాడు.రవి తన లేఖలో రాస్తూ.. "నా గత వివాహ బంధాన్ని వ్యక్తిగత లాభం కోసం, కీర్తి కోసం సానుభూతిగా మార్చుకోవడాన్ని నేను అనుమతించను. ఇదేం ఆట కాదు.. నా జీవితం. నేను చట్టపరమైన ప్రక్రియకు పూర్తిగా కట్టుబడి ఉన్నా. సరైన సమయంలో సత్యం గెలుస్తుందని నమ్ముతున్నా. ఈ విషయంలో నేను గౌరవంగా ముందుకు వెళ్తా. ఆర్తితో ఉన్నప్పుడు పంజరంలో ఉన్నట్లు అనిపించింది. చివరకు బయటకు వెళ్లడానికి నిర్ణయించుకున్నా. నేను శారీరక, మానసిక, భావోద్వేగ, ఆర్థిక వేధింపుల నుంచి బయటపడ్డాను. గతంలో నా తల్లిదండ్రులను కూడా కలవలేకపోయా. అయినప్పటికీ నా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించా. కానీ చివరికీ దూరంగా వెళ్లాలనేది తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు. చాలా బరువైన హృదయంతోనే ఇది రాస్తున్నా" అని ప్రస్తావించారు.(ఇది చదవండి: కుట్ర చేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు.. స్టార్ హీరో భార్య సంచలన పోస్ట్)జయం రవి లేఖలో రాస్తూ..' నన్ను స్పష్టంగా చెప్పనివ్వండి. ఇలాంటి కల్పిత వాదనలను నేను ఖండిస్తున్నా. నేను ఎప్పటిలాగే నా మాటపై నిలబడతా. నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకముంది. ఆర్తి తన పిల్లలను సానుభూతి కోసం ఉపయోగించుకుంటోంది. ఆర్థిక లాభం కోసం, ప్రజల నుంచి సానుభూతిని పొందడానికి నా పిల్లలను ఒక సాధనంగా ఉపయోగించుకోవడం చాలా బాధగా ఉంది. అయితే మేము విడిపోయినప్పటి నుంచి ఉద్దేశపూర్వకంగా పిల్లలకు నన్ను దూరం చేసింది. ఇన్నేళ్లు నన్ను వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు ఏకంగా ఛాతిలో కత్తితో పొడిచినందుకు సంతోషంగా ఉంది. నా నుంచి ఇదే మొదటిది.. చివరిదీ కూడా. ప్రేమతో జీవించండి.. జయం రవిని జీవించనివ్వండి' అని వివరించారు.కాగా.. జయం రవి గతేడాది సెప్టెంబర్ 9న తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఆర్తితో తన బంధానికి ముగింపు పలకనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఆ తర్వాత తన అనుమతి లేకుండా ఎలా ప్రకటిస్తారని ఆర్తి ఖండించింది. తాజాగా సింగర్ కెనిషాతో రవి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం కోలీవుడ్‌లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. View this post on Instagram A post shared by Ravi Mohan (@iam_ravimohan) -
భార్యతో విడాకులు తీసుకుంటున్నానని చెప్పి..!
బంజారాహిల్స్(హైదరాబాద్): నా తల్లితో ఆస్తి గొడవలు ఉన్నాయి..నా భార్య నాతో సఖ్యంగా ఉండదు..అందుకే విడాకులు తీసుకుంటున్నాం..అందుకు సంబంధించిన విడాకులు పత్రాలు ఇవిగో అంటూ వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. చివరకు సదరు వైద్యుడి అసలు నిజ స్వరూపం తెలియడంతో తాను మోసపోయానని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన భరత్ గెరా నగరంలోని కొండాపూర్ ప్రైమ్ స్ప్లైండర్లో ఉంటూ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని డెరెడియా లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో హెచ్ఆర్ ఆపరేషనల్ హెడ్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఓ వైద్యురాలితో అతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో గత ఏప్రిల్‌లో భరత్ సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తనకు గతంలోనే వివాహం జరిగిందని, తన భార్యతో గొడవల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. న్యాయవాది ఎదుట ఇద్దరూ సంతకం చేసిన పత్రాలను కూడా ఆమెకు చూపించాడు. తన తల్లికి తనకు ఆస్తి గొడవలు ఉన్నాయని, తల్లి, సోదరుడు ఢిల్లీలో ఉంటారని చెప్పాడు. ఈ క్రమంలో మార్చి 31న కంపెనీ పనిపై చంఢీఘడ్ వెళుతున్న భరత్ సదరు వైద్యురాలిని కూడా తీసుకెళ్లి అక్కడ హోటల్ రూంలో బస చేశారు. ఆ సమయంలో భరత్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత భరత్‌ను కంపెనీ యాజమాన్యం ఉద్యోగంలో నుంచి తొలగించగా, అతడితో పాటు సదరు యువతి కూడా ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇద్దరూ కలిసి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెట్టుబడి నిమిత్తం ఆమె నుంచి భరత్ రూ.2.5 లక్షలు తీసుకున్నాడు. అంతేగాక భరత్ సదరు యువతి ఫోన్లో లోకేషన్‌ను ట్రాక్ చేసి ఆమె ఎక్కడికి వెళ్తుందని ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె భరత్‌తో మాట్లాడేందుకు అతని ఇంటికి వెళ్లగా అతడి భార్య ఇంట్లో ఉండటాన్ని చూసి షాక్‌కు గురైంది. ఆరు నెలల గర్భవతిగా ఉన్న అతని భార్య కూడా వైద్యురాలిని అసభ్యంగా దూషించడమేగాక వివాహితుడితో ఎందుకు సంబంధం కొనసాగిస్తున్నావంటూ నిలదీసింది. ఆ తర్వాత భరత్, అతని భార్య పూణెకు మకాం మార్చారు. కొన్ని రోజుల తర్వాత గర్భం దాల్చిన బాధితురాలు భరత్ తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని మోసం చేశాడంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్టార్ జంటపై విడాకుల రూమర్స్.. తన భర్తపై పూర్తిగా నమ్మకముందన్న భార్య!
బాలీవుడ్ స్టార్ నటుడు గోవిందపై గత కొన్ని నెలలుగా విడాకులు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. చాలా సార్లు ఆయన భార్య సునీతా అహుజా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం కలిసే ఉన్నామని.. ఎవరూ కూడా తమను విడదీయలేరని పేర్కొంది. గోవింద రాజకీయాల్లోకి ఉండడం వల్లే తాము దూరంగా ఉంటున్నట్లు తెలిపింది.తాజాగా మరోసారి తమపై వస్తున్న విడాకుల వార్తలపై ఆయన భార్య సునీతా అహుజా స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన భర్తపై అపారమైన నమ్మకం ఉందని తెలిపింది. ఎలాంటి తెలివితక్కువ మహిళ మమ్మల్ని వేరు చేయలేదని స్పష్టం చేసింది. గోవింద నేను లేకుండా జీవిస్తాడని అనుకోవడం లేదు.. తన కుటుంబాన్ని ఎలాంటి తెలివితక్కువ మహిళ కోసం వదిలి వెళ్లడని సునీతా వెల్లడించింది.ఇప్పటికైనా రూమర్స్‌ను వ్యాప్తి చేయవద్దని ఆమె మీడియాను కోరింది. గోవిందతో తన వివాహం గురించి చర్చించడానికి ఏదైనా ఉంటే నేరుగా తన వద్దకు వచ్చి అడగాలని అహుజా అన్నారు. ఇలాంటి వాటిని ఎప్పటికీ అంగీకరించనని,.. ఎవరికైనా ధైర్యం ఉంటే నన్ను నేరుగా అడగాలని తెలిపింది. ఇలాంటివి ఎప్పుడైనా జరిగితే, మీడియాతో మొదట మాట్లాడే వ్యక్తిని నేనే.. ఆ దేవుడు నా కుటుంబాన్ని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయడని నమ్మకముందని పేర్కొంది. కాగా.. గోవింద, సునీత 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి యశ్వర్ధన్ అహుజా, టీనా అహుజా అనే ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. -
కుట్ర చేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు.. స్టార్ హీరో భార్య సంచలన పోస్ట్
తమిళ హీరో జయం రవి.. భార్య ఆర్తికి గతేడాది విడాకులు ఇచ్చేశాడు. దాదాపు 18 ఏళ్ల బంధాన్ని తెగదెంపులు చేసుకున్నాడు. కెన్నీషా అనే సింగర్ తో సదరు హీరో డేటింగ్ చేస్తున్నాడని, అందుకే భార్యకు విడాకులు ఇచ్చేశాడనే రూమర్స్ వచ్చాయి. తాజాగా నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి పెళ్లి జరగ్గా.. జయం రవి కెన్నీషాతో కలిసి జంటగా వచ్చాడు.(ఇదీ చదవండి: బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే) ఉదయం నుంచి జయం రవి-కెన్నీషా కలిసున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. సరిగ్గా ఈ టైంలో మాజీ భార్య ఆర్తి చాలా పెద్ద పోస్ట్ పెట్టింది. జయం రవిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనని ఇంటి నుంచి తరిమేశారని, జయం రవికి అసలు పిల్లలు బాధ్యత అనేదే లేదని ఆవేదన వ్యక్తం చేసింది.'ఏడాది పాటు మౌనాన్ని కవచంలా మోస్తున్నాను. నా కొడుకులు ప్రశాంతంగా ఉండాలి కాబట్టే ఇవన్నీ భరిస్తున్నాను. నాపై లేనిపోని ఆరోపణలు చాలా చేశావ్. అయినా సరే నేను నోరు మెదపలేదు. ఎందుకంటే నా కొడుకులు.. తల్లిదండ్రులు విడిపోయారనే బాధని అనుభవించకూడదు కాబట్టి. అంతే తప్ప నా దగ్గర నిజం లేదని కాదు. ఇప్పుడు ప్రపంచమంతా ఫొటోలు చూస్తోంది. కానీ మా మధ్యలో జరిగింది వేరు. విడాకుల ప్రక్రియ ఇంకా నడుస్తోంది. నాతో పాటు 18 ఏళ్లు సంసారం చేసిన వ్యక్తి.. ప్రేమ, నమ్మకంతో పాటు ప్రామిస్ చేసిన ప్రతి బాధ్యతని పక్కనబెట్టి నన్ను వదిలి వెళ్లిపోయాడు. నా బాధ్యత అని చెప్పిన ఆ వ్యక్తి.. నాకు ఆర్థికంగా అండగా నిలబడం, మాట సాయం గానీ చేయట్లేదు''ప్రస్తుతం మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారు. నాతో కలిసి ఇదే ఇంటిని నిర్మించిన సదరు వ్యక్తి.. బ్యాంక్ అధికారులతో కలిసి నేను బయటకు వెళ్లిపోయేలా చేశాడు. నేను డబ్బుల కోసమే ఈ విడాకుల డ్రామా ఆడుతున్నానని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఎప్పుడో నా స్వార్థం చూసుకునేదాన్ని. కానీ నేను అలా చేయలేదు. ప్రేమని పంచాను. నమ్మకం చూపించాను. ఇప్పుడదే నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది''ప్రేమించినందుకు పశ్చాత్తాపపడట్లేదు గానీ దాన్ని ఓ బలహీనతలా ఉపయోగించుకున్నందుకు బాధపడుతున్నాను. నా కొడుకుల వయసు 10, 14 ఏళ్లు. వాళ్లకు ఇప్పుడు కావాల్సింది భద్రత.. షాక్ కాదు, నిశ్బబ్దం కాదు. ఈ చట్టాల గురించి అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లలు వాళ్లు. సమాధానం లేని కాల్స్, రద్దయిన మీటింగ్స్.. ఇవన్నీ నాకు తగిలిన గాయాలు. నేను ఈరోజు మాట్లాడేది భార్యగా కాదు. అలా అని స్త్రీకి అన్యాయం చేసిన దానిలా కూడా కాదు. పిల్లల శ్రేయస్సు కోసం ఆలోచించే తల్లిగా మాత్రమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పటికీ ఫెయిల్యూర్ గానే మిగిలిపోతాను''నువ్వు ఏమైనా చేయొచ్చు గానీ నిజాన్ని తిరిగి రాయలేవు కదా. తండ్రి అంటే టైటిల్ కాదు అదో బాధ్యత. మా విడాకుల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నా పేరు వెనక రవి అని ఉంటుంది. మీడియా వాళ్లకు చెప్పేదేంటంటే నన్ను మాజీ భార్య అని సంభోదించొద్దు. మేం ఇంకా లీగల్ గా విడాకులు తీసుకోలేదు. ప్రతికారమో మరేదో కాదు,పిల్లల్ని కాపాడే తల్లిగా ఇది నా బాధ్యత. నేను ఏడవను. గట్టిగా అరిచి గోలపెట్టను. కానీ బలంగా నిలబడతా. నిన్ను ఇంకా నాన్న అని పిలుస్తున్న ఇద్దరబ్బాయిల కోసం నేను అస్సలు తగ్గను' అని ఆర్తి రవి రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) -
నటుడు రవి మోహన్‌తో జంటగా మళ్లీ కనిపించిన సింగర్
ప్రముఖ నటుడు రవి మోహన్ (జయం రవి) తన భార్యతో విడిపోయిన తర్వాత ప్రముఖ సింగర్‌తో డేటింగ్లో ఉన్నాడంటూ కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే, అందులో ఎలాంటి నిజం లేదని తాము స్నేహితులం మాత్రమే అంటూ ఇద్దరూ చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా వారిద్దరూ ఒక పెళ్లి వేడుకలో జంటగా కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. గతంలో వచ్చిన వదంతులు అన్నీ నిజమే కావచ్చని నెటిజన్లు ఇప్పుడు చెప్పుకొస్తున్నారు.వేల్స్ విశ్వవిద్యాలయం ఛైర్మన్ ఇషారి కె. గణేష్ కుమార్తె పెళ్లి చెన్నైలో జరిగింది. ఈ వేడుకలలో రవి మోహన్‌తో పాటుగా సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ కూడా జంటగా హాజరైంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో తమ మధ్య ఎలాంటి లవ్ లేదు.. కేవలం స్నేహం మాత్రమే అని చెప్పిన ఈ జంట ఇప్పుడు జంటగా కనిపించడంతో మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి. సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ వల్లనే రవి మోహన్ తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అవన్నీ పుకార్లు మాత్రమేనని, తాము స్నేహితులమని వారు చెప్పారు. తాము వృత్తిపరంగానే కలిశామని వారిద్దరూ ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. అనవసరంగా తన విడాకుల మధ్య మూడో వ్యక్తిని లాగుతున్నారంటూ జయం రవి అసహనం వ్యక్తం చేశాడు. తన విడాకుల వ్యవహారానికి సింగర్ కెనిషాతో ఎలాంటి సంబంధం లేదని గతంలోనే ఆయన చెప్పాడు.రవి మోహన్ విడాకులపై గతంలో సింగర్ ఏం చెప్పిందంటే..రవి మోహన్ విడాకుల విషయంలో అనవసరంగా తనను లాగుతున్నారని, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదని సింగర్, థెరపిస్ట్ కెనిషా ఫ్రాన్సిస్ గత ఇంటర్వ్యూలో చెప్పింది. జయం రవి మానసిక అనారోగ్యంతో బాధపడతున్నాడని, చికిత్స కోసమే తన వద్దకు వచ్చాడని అప్పట్లో ఆమె క్లారిటీ ఇచ్చింది. ఒక థెరపిస్ట్‌గా అతనికి చికిత్స అందించానని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని వెల్లడించింది. ‘ఆర్తి, ఆమె పెరెంట్స్ పెట్టిన టార్చర్ కారణంగా రవి చాలా మానసికంగా క్రుంగిపోయాడని చెప్పుకొచ్చింది. ఆయన తనకు స్నేహితుడు, క్లయింట్ కూడా.. అంతకు మించి ఏమి లేదని చెప్పింది. గతంలో ఏమీ లేదని చెప్పిన వారిద్దరూ ఇప్పుడు జంటగా పెళ్లిలో కనిపించడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.కాగా, జయం రవి, ఆర్తిగా వివాహం 2009 జూన్‌లో జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు ఇల్లలు. 15 ఏళ్లపాటు కలిసి కాపురం చేసిన ఈ జంట.. గత ఏడాదిలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు. Yes, It's Keneesha who is sitting behind #RaviMohan !!It's their life, let them live...pic.twitter.com/OeaDDBfZRP— AmuthaBharathi (@CinemaWithAB) May 9, 2025 -
పురుషులకు సరోగసి హక్కు ఉండద్దా !
పేరెంట్‌హుడ్‌ని ఆస్వాదించని వారెవరు? అమ్మా.. నాన్నా.. అని పిలిపించుకోవాలని ఉవ్విళ్లూరని వాళ్లెవరు? కానీ మన దేశంలోని సరోగసీ యాక్ట్ –2021 అందరికీ ఆ ఆవకాశాన్నివ్వట్లేదు. విడాకులు తీసుకున్న పురుషులకు, ట్రాన్స్పీపుల్కి సరోగసీ ద్వారా పేరెంట్ అయ్యే చాన్స్‌కి నో అంటోంది! దీన్నే సవాలు చేస్తూ కర్ణాటకకు చెందిన 45 ఏళ్ల డెంటల్ సర్జన్.. సరోగసీ ద్వారా ఒంటరి పురుషులకూ తండ్రి అయ్యే భాగ్యం కల్పించమంటూ సుప్రీంకోర్ట్‌లో దావా వేశాడు. ఇప్పుడది చర్చగా మారింది.. అడ్వకేట్లు, జెండర్ రైట్స్ కోసం పనిచేస్తున్న యాక్టివిస్ట్లూ దీనిమీద తమ అభిప్రాయాలను చెబుతున్నారు.సరోగసీ.. గర్భంలో బిడ్డను మోసే ఆరోగ్యపరిస్థితులు లేని వాళ్లకు ఆధునిక వైద్యశాస్త్రం అందించిన వరం! ఇది ఒంటరి పురుషులు, ట్రాన్స్ పీపుల్‌కీ పేరెంట్ అయ్యే అదృష్టాన్ని కలిగిస్తోంది. అలా బాలీవుడ్లో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ పెళ్లి చేసుకోకుండానే కవల పిల్లలకు తండ్రి అయ్యాడు. అలాగే నటుడు తుషార్ కపూర్ కూడా ఓ బిడ్డను కన్నాడు. అయితే అది 2021కి ముందు. ఈ చట్టం వచ్చాక పురుషులకు ఆ వెసులుబాటును తీసేసింది. ఒంటరి మహిళలు (విడాకులు పొందిన వారు, అలాగే వితంతువులు), స్త్రీ పురుషులు మాత్రమే పెళ్లి చేసుకున్న జంటలకూ మాత్రమే ఈ చట్టం పేరెంట్స్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనిమీద సమాజంలోని పురుషులు సహా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలోనూ అసంతృప్తి ఉంది. విడాకులు పొందిన స్త్రీకి సరోగసీ ద్వారా తల్లి అయ్యే హక్కు ఉన్నప్పుడు, విడాకులు పొందిన పురుషుడికి ఎందుకు ఉండకూడదు? ఇది చట్టం చూపిస్తున్న వివక్ష తప్ప ఇంకోటి కాదని కర్ణాటక డెంటల్ సర్జన్ వాదన. పిల్లల్ని కనాలా వద్దా అనే చాయిస్ స్త్రీకెప్పుడూ ఇవ్వని ఈ సమాజంలో.. ఒంటరి పురుషులు, ట్రాన్స్ పీపుల్ని అనుమతించడం లేదు సరికదా... పురుషుడు సంపాదించాలి, స్త్రీ ఇంటిని చూసుకోవాలనే లింగవివక్షను ప్రేరేపించే మూస ధోరణిని ప్రోత్సహిస్తోందని జెండర్ యాక్టివిస్ట్‌ల అభి్ప్రాయం. కారా (సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ) నివేదికలను బట్టి ఒంటరి పురుషులకు దత్తత తీసుకునేందుకు అనుమతించినవీ, అలాగే.. మగవాళ్లు కూడా పిల్లల్ని పెంచగలరని నిరూపించిన ఉదాహరణలున్నాయి. కాబట్టి డెంటల్ సర్జన్ పిటిషన్లో న్యాయం ఉందని అంటున్నారు యాక్టివిస్ట్‌లు. అంతేకాదు అతని ఈ ΄ోరాటం ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి ఒక ఊతమవుతుందని.. లింగ అసమానతలను రూపుమాపే ప్రయత్నానికీ ఒక అడుగు పడుతుందనే ఆశనూ వ్యక్తం చేస్తున్నారు. – సరస్వతి రమవివక్ష చూపిస్తోందిడైవర్స్ తీసుకున్న మగవారికి, ఒంటరి పురుషులకు, స్వలింగ సంపర్కులకు, ట్రాన్స్ జెండర్స్‌కి సరోగసి పద్ధతిలో పిల్లలని కనడాన్ని సరోగసీ చట్టం నిషేధించింది. ఈ చట్టంలోని సెక్షన్ ంలు ఈ నిబంధన విధించాయి. ఈ చట్టం ప్రకారం కేవలం విడాకులు పొందిన లేదా వితంతువులకు, హెటిరో సెక్సువల్ దంపతులకు మాత్రమే సరోగసీ ద్వారా పిల్లలని కనే హక్కు ఉంది. ఒంటరి పురుషుడికి ఆడపిల్లను దత్తత తీసుకునే వీలు లేనప్పటికీ, జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 57, హిందూ అడాప్షన్ – మెయింటెనెన్స్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఒంటరి/విడాకులు తీసుకున్న పురుషుడికి కూడా పిల్లలను దత్తత తీసుకునే హక్కు ఉన్నది. సరోగసీ చట్టం ఇందుకు భిన్నంగా ఉండటం రాజ్యాంగం కల్పించిన సమానత్వం, జీవించే స్వేచ్ఛ హక్కుల స్ఫూర్తికి వ్యతిరేకమే! ఇతర దేశాలు చాలామటుకు స్త్రీ పురుషుల మధ్య సరోగసీ పద్ధతిలో పిల్లల్ని కనటం పై సమాన హక్కులే కల్పించాయి. –శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాదిఆ అవకాశం, వాతావరణం ఉన్నాయా? ప్రతి ఒక్కరికీ పేరెంట్‌హుడ్‌ను ఆస్వాదించే హక్కు ఉంది. ఆ హక్కు కోసం కర్ణాటక డెంటల్ సర్జన్ న్యాయ ΄ోరాటంలో తప్పులేదు. స΄ోర్ట్ కూడా చేస్తాను. అయితే వ్యక్తిగతంగా మాత్రం అందులో నాకు భిన్నమైన అభి్ప్రాయం ఉంది. అడుగడుగునా అసమానతలు, వివక్ష, అభద్రతలున్న ఈ సమాజంలో పుట్టబోయే పిల్లలను భద్రంగా కాపాడుకోగలమా? మనముందున్న సెక్సువల్ ఐడెంటిటీలనే గుర్తించి, గౌరవించడానికి సిద్ధంగా లేము. ఈ నేపథ్యంలో పుట్టబోయే పిల్లల భవిష్యత్ ఏంటీ? వాళ్లు చక్కగా పెరిగే అవకాశం, వాతావరణం ఉన్నాయా అనే విషయంలోనే నా భయం, ఆందోళన అంతా! – బోయపాటి విష్ణు తేజ, చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్స్టీరియోటైప్స్ని బలపరుస్తోంది.. పేరెంట్‌హుడ్ అనేది ఒక జెండర్‌కి మాత్రమే పరిమితమైనది కాదు. పేరెంట్ అవ్వాలని ఆశపడేవాళ్లందరూ ఆ హక్కును వినియోగించుకునే అవకాశం ఉండాలి. కొంతమంది మగవాళ్లు పేరెంట్ కావాలనుకున్నా ఇలాంటి చట్టాల వల్ల పేరెంట్‌హుడ్ చాయిస్‌ని కోల్పోతున్నారు. స్టీరియోటైప్స్ కొన్నిటిని ఈ చట్టం బలపరుస్తోంది. సింగిల్‌గా ఉన్న ఆడవాళ్లకు, హెటరో సెక్సువల్ ఫ్యామిలీస్‌కి మాత్రమే వెసులుబాటు కల్పిస్తూ! సింగిల్ ఉమెన్‌కి ఎందుకిచ్చిందంటే కేర్ గివింగ్ అనే లక్షణం సహజంగానే వాళ్లకుంటుంది కాబట్టి అనే. అంటే ఈ రెండు స్టీరియోటైప్స్‌ని ఆ చట్టం బలపరుస్తున్నట్టే కదా! వివక్షే కాకుండా స్టీరియోటైప్స్నీ బలపరుస్తున్నట్టున్న ఈ చట్టాన్ని చాలెంజ్ చేయడం మంచిదే! పురుషుడు సంపాదిస్తాడు, స్త్రీ ఇల్లు చూసుకుంటుంది లాంటి జెండర్ రోల్స్‌ను ఈ చట్టం బలపరుస్తోంది. ఈ చట్టం వల్ల ఎల్‌జిబీటీక్యూ కమ్యూనిటీస్కీ నష్టమే! ఏమైనా ఈ చట్టంలో మార్పులు రావాలి. ఎక్స్΄్లాయిటేషన్ను ఆపేలా చట్టాలుండాలి కానీ.. పేరెంట్‌హుడ్ కావాలనుకునే వారిని నిరుత్సాహపరచేలా కాదు.– దీప్తి సిర్ల, దళిత్ అండ్ జెండర్ యాక్టివిస్ట్ -
‘మనీ మహిమ’తోనే చాలామంది విడాకులు!
మానవ సంబంధాల్లో డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేమగా మాట్లాడాలన్నా, అభిమానాన్ని ఎదుటివ్యక్తికి తెలియజేయాలన్నా డబ్బు అవసరం లేకపోవచ్చు.. కానీ ఆ ప్రేమను, అభిమానాన్ని కలకాలం నిలబెట్టుకోవాలంటే మాత్రం కచ్చితంగా డబ్బు కావాల్సిందే. ప్రస్తుత రోజుల్లో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతోంది. అందుకు చాలానే కారణాలుండొచ్చు.. అయితే దాంపత్య జీవితంలో భాగస్వామికి డబ్బు లేకపోవడం, అప్పులుండడం, ఖర్చు చేయలేకపోవడం.. వంటివి కూడా పచ్చని కాపురంలో చిచ్చు పెడుతోంది. కలకాలం సంతోషంగా జీవించాల్సిన జంటను ఈ డబ్బు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిస్తోంది. విడిపోయే జంటల జీవితాలను మనీ ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.రుణాలు..కొత్తగా పెళ్లయిన జంటను స్థిరమైన ఆర్థిక ఒత్తిళ్లు వేరు చేస్తున్నాయి. ఈ రోజుల్లో పెళ్లికి చాలా కుటుంబాలు భారీగానే ఖర్చు చేస్తున్నాయి. సంపన్నులకు డబ్బు ఖర్చయినా తిరిగి సంపాదిస్తారు. పేదవారు కూడా ఉన్నంతలో తూతూ మంత్రంగా పెళ్లి తంతు కానిస్తారు. కానీ సమస్య అంతా మధ్య తరగతి ప్రజలతోనే. బంధువుల్లో గొప్ప కోసమో.. మళ్లీ చేయని కార్యక్రమం అనో.. పెళ్లికి బాగానే డబ్బు ఖర్చు చేస్తారు. మధ్య తరగతివారికి సరైన సంపాదన ఉండకపోవడంతో దీనికోసం అప్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. వాటిని తీర్చేందుకు అదనపు కట్నం కోసం భాగస్వామిపై వేదింపులు సాగిస్తారు. అది చివరకు విడాకుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది.ఆర్థిక అస్థిరతపెళ్లైనప్పటి నుంచి వధువరులకు బాధ్యతలు పెరుగుతాయి. పెళ్లి తర్వాత పిల్లలు, వారి చదువులు, వాహనాల కొనుగోలు, ఆస్తులు కూడబెట్టడం.. వంటి కార్యకలాపాల కోసం చాలామంది అప్పులు చేస్తున్నారు. ఈఎంఐలు చెల్లించలేక మానసిక ఒత్తిడితో భాగస్వామితో సఖ్యతగా నడుచుకోకుండా చివరకు కాపురాన్ని కూల్చుకుంటున్నారు.దుబారా ఖర్చులు..పెళ్లికి ముందు చాలా మందికి దుబారాగా డబ్బు ఖర్చు చేసే అలవాటు ఉంటుంది. వివాహం తర్వాత కూడా అది కొనసాగితే అప్పులు తప్పవు. సంపాదన భారీ మొత్తంలో ఉన్న కుటుంబాలపై ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ మధ్య తరగతి కుటుంబాలపై ఈ వ్యవహార శైలి తప్పకుండా ప్రభావం చూపుతుంది. ఇది దంపతుల మధ్య గొడవలు జరిగేందుకు కారణమవుతుంది. ఇది కూడా విడాకులకు దారితీస్తుంది.ఇదీ చదవండి: వచ్చే మూడేళ్లలో ఒకే రంగంలో కోటిన్నర ఉద్యోగాలుమరేం చేయాలి..జల్సాలకు, దుబారా ఖర్చులకు అలవాటుపడే వారు, పెళ్లి కోసం అనాలోచితంగా చేసే భారీగా ఖర్చు చేసేవారు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది ఆ దంపతులు తమ వైవాహిక బంధాన్ని తెంచుకునేందుకు చాలాసార్లు కారణమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక సవాళ్లు అనివార్యమైనప్పటికీ సరైన ప్రణాళిక, పారదర్శకత, బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ వల్ల సమస్యలను గట్టెక్కవచ్చు. ఆ దిశగా దంపతులు ఆలోచించాలి. ఖర్చులు తగ్గించుకుని, అప్పులు చేయకుండా పెట్టుబడి, పొదుపుపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరెన్సీ నోటు కాపురాలను కలకాలం నిలబెడుతుంది.. అదే కాపురాలను చిదిమేస్తుందని గుర్తుంచుకోవాలి. -
ప్రాణాలు తీసిన పెంపుడు కుక్క..!
వెంగళరావునగర్(హైదరాబాద్): తాను పెంచుకుంటున్న శునకమే ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్న ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన డి.పవన్‌కుమార్ (37) తన స్నేహితుడు సందీప్‌తో కలిసి పదేళ్లుగా మధురానగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గదిలో నిద్రపోయాడు. పక్కనే అతని పెంపుడు కుక్క కూడా ఉంది. ఉదయం సందీప్ తలుపు తట్టగా పవన్ లేవలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారితో తలుపు పగులకొట్టి లోనికి వెళ్లి చూడగా పవన్ విగతజీవిగా కనిపించాడు. అతని మర్మాంగాలు రక్తంతో ఉన్నాయి. అతని పెంపుడు కుక్క నోటి నిండా రక్తం ఉంది. కుక్క అతడి మర్మాంగాలను గాయపర్చడం వల్లే మృతి చెంది ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. పవన్‌కుమార్‌కు గతంలో వివాహమైంది. భార్యతో విడాకులు కావడంతో నగరంలో ఉంటున్నాడు. స్నేహితుడు సందీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి నగలు స్త్రీ ధనమే
తిరువనంతపురం: పెళ్లి సమయంలో వధువుకు బహుమతిగా ఇచ్చే బంగారు నగలు, నగదుపై హక్కెవరిదనే అంశంపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వాటిని స్త్రీ ధనంగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అవి పూర్తిగా ఆ మహిళకే చెందుతాయని, చట్టబద్ధమైన పూర్తి హక్కులు ఆమెకే ఉంటాయని జస్టిస్ దివాన్ రామచంద్రన్, జస్టిస్ ఎంబీ స్నేహలతల ధర్మాసనం తెలిపింది. విడాకుల తర్వాత పెళ్లినాటి బంగారు నగలపై మహిళకు ఎలాంటి హక్కులేదంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎర్నాకులంలోని కలమసెర్రికి చెందిన మహిళ వేసిన పిటిషన్‌పై ఈ మేరకు తీర్పు వెలువరించింది.దురదృష్టవశాత్తూ భర్త, అత్తింటి వారు అలాంటి విలువైన ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకున్న అనేక సందర్భాలున్నాయని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అనధికారికంగా చేతులు మారే ఇటువంటి ప్రైవేటు ఆస్తులపై తమకు హక్కుందని ప్రకటించుకునేందుకు అవసరమైన పత్రాలు మహిళల వద్ద ఉండవని, ఇలాంటి సందర్భాల్లో కోర్టులు విచక్షణను ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపింది. 2010లో వివాహం సమయంలో పుట్టింటి వారు తమకు 63 సవర్ల బంగారంతోపాటు, రెండు సవర్ల గొలుసును, బంధువుల నుంచి అదనంగా మరో 6 సవర్ల ఆభరణాలు బహుమతిగా వచ్చాయని పిటిషనర్ తెలిపారు.వీటిలో మంగళసూత్రం, ఒక బంగారు గాజు, రెండు రింగులను మాత్రమే తనవద్ద ఉంచి మిగతా అన్నిటినీ భద్రత కోసమంటూ అత్తింటి వారు తీసుకున్నారని తెలిపారు. అదనంగా మరో రూ.5 లక్షలు డిమాండ్ చేయడంతో పుట్టింటికి వెళ్లగొట్టారని తెలిపారు. భర్త తన నగలను బ్యాంకులో ఉంచినట్లు తెలిపే పత్రాలను ఆమె కోర్టుముందుంచారు. పరిశీలించిన ధర్మాసనం 59.5 సవర్ల బంగారాన్ని లేదా మార్కెట్ విలువ ప్రకారం డబ్బు ఇవ్వాలని భర్తను ఆదేశించింది. బంధువులిచ్చిన నగలు, ఇతర విలువైన వస్తువులను కూడా ఇప్పించాలంటూ పిటిషనర్ చేసిన వినతిపై ధర్మాసనం.. తగు ఆధారాలు లేనందున తామేమీ చేయలేమని తెలిపింది. -
ఏడాదిన్నర క్రితమే విడాకులు.. డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ
న్యూఢిల్లీ: భారత దిగ్గజ బాక్సర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోమ్ (Mary Kom) తన వైవాహిక బంధం గురించి వస్తున్న వార్తలపై తొలిసారి స్పందించింది. తన భర్త కరుంగ్ ఓన్‌కోలర్ (Karong Onkholer Kom)తో దాదాపు ఏడాదిన్నరే క్రితమే విడిపోయినట్లు ఆమె ధ్రువీకరించింది. పెద్దల సమక్షంలో విడాకుల ప్రక్రియ కూడా పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించింది. కాగా ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ (Boxing World Champion)గా నిలిచిన 43 ఏళ్ల మేరీకోమ్ ఇటీవల తరచుగా వ్యక్తిగత అంశాలతో వార్తల్లో నిలిచింది. భర్తతో విడాకులతో పాటు హితేశ్ చౌధరీ అనే వ్యాపార్తవేత్తతో ఆమె బంధం గురించి కూడా తరచుగా కథనాలు వస్తున్నాయి. వీటన్నింటికి సమాధానమిస్తున్నట్లుగా తన లాయర్ ద్వారా మేరీ కోమ్ ఒక బహిరంగ ప్రకటనను విడుదల చేసింది. ‘కోమ్ చట్టాల ప్రకారం’ విడాకులు‘మేరీకోమ్‌కు, ఓన్కోలర్కు మధ్య ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు. 2023 డిసెంబర్ 20న ఇద్దరి అంగీకారంతో ‘కోమ్ చట్టాల ప్రకారం’ కుటుంబసభ్యులందరి మధ్య వీరిద్దరికి విడాకులు మంజూరయ్యాయి. పెళ్లి అంతా ముగిసిన గతం కాబట్టి దానిపై ఏమీ వ్యాఖ్యానించదల్చుకోలేదు.అవన్నీ వదంతులు మాత్రమేమరోవైపు హితేశ్‌తో గానీ మరో బాక్సర్ భర్తతో గానీ ఆమెకు వ్యక్తిగత సంబంధం ఉన్నట్లుగా వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదు. ఇకపై ఎవరూ దీనిని ప్రస్తావించరాదు. మేరీకోమ్ ఫౌండేషన్ వ్యవహారాలు చూసే వ్యక్తిగా హితేశ్‌తో వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉంది. ఇకపై మేరీకోమ్‌కు సంబంధించి ఎలాంటి తప్పుడు వార్తలు రాయరాదని, ప్రచారం కల్పించరాదని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని మేరీకోమ్ తరఫున ఆమె న్యాయవాది రజత్ మాథూర్ ప్రకటించారు. కాగా మణిపూర్‌కు చెందిన మేరీకోమ్, కరుంగ్ ఓన్‌కోలర్ వివాహం 2005లో జరిగింది. వీరిద్దరికి ముగ్గురు మగ పిల్లలుకాగా... 2018లో కరుంగ్ ఓన్‌కోలర్ ఒక పాపను దత్తత తీసుకున్నాడు. చదవండి: మా గురించి మీకేం తెలుసు?.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్ -
ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్
ప్రిన్స్ హ్యారీ (Prince Harry), మేఘన్ మార్కెల్ (Meghan Markle ) వివాహం ప్రపంచంలోనే అత్యధికమంది వీక్షించిన రాయల్ వెడ్డింగ్‌గా నిలిచింది. అయితేఈ దంపతులు విడిపోతున్నారనే ఊహాగానాలు బాగా వ్యాపించాయి. ఈ వార్తలను మేఘన్ మార్కెల్ తొలిసారి క్లారిటీ ఇవ్వడం విశేషం. తన భర్త మనసు చాలా మంచిదనీ, చాలా చాలా అందగాడని చెప్పుకొచ్చింది. ఇంకా వారి వివాహ బంధంపై ఆమె చెప్పిందో వివరాలను తెలుసుకుందాం. 2018, మే 19న యూకేలోని విండ్సర్ కాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌లో అత్యంత ఘనంగా వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బ్రిటిష్ రాచరికంలో సంచలన మార్పును ప్రకటించారు. 2020లో తాము తమ రాజ విధులనుండి తప్పుకున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ తరువాత ప్రిన్స్హ్యారీ, మేఘన్ విడిపోతున్నారనే వార్తలు జోరుగా వ్యాపించాయి. చాలా రోజుల తరువాత మేఘన్ మార్కెల్ భర్త ప్రిన్స్ హ్యారీతో తన అందమైన బంధాన్ని పంచుకుంది. తన స్నేహితురాలు, IT కాస్మెటిక్స్ CEO జామీ కెర్న్ లిమా పాడ్‌కాస్ట్‌లో ది జామీ కెర్న్ లిమా షో. చిట్-చాట్‌లో మేఘన్ మార్కెల్ మౌనం వీడి కొన్ని ఆసక్తికర సంగతులను పంచుకుంది. ఏడేళ్ల సుదీర్ఘ వివాహ బంధంలో తమ ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నామని తెలిపింది. అంతేకాదు తమ బంధాన్ని 1985 నాటి ప్రముఖ వీడియో గేమ్ సూపర్ మారియో బ్రదర్స్‌తో సరదాగా పోల్చారు. తన భర్త ప్రిన్స్ హ్యారీ చాలా, చాలా అందగాడని కితాబిచ్చింది. అతనికి చాలా మంచి హృదయం ఉన్నవాడని, తనను చాలా ప్రేమిస్తున్నాడని వెల్లడించింది. ఇద్దరం కలిసి ఒక అందమైన జీవితాన్ని నిర్మించు కున్నాం, ఇద్దరు అందమైన పిల్లలున్నారు. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ అంటూ చెప్పుకొచ్చింది.అదే పాడ్‌కాస్ట్‌లో, మేఘన్ మార్కెల్ డేటింగ్ , ప్రారంభ రోజులు ఎలా ఉన్నాయో కూడా వివరించింది. కాలక్రమేణా, ప్రతి సంబంధం అభివృద్ధి చెందుతుందని, అందుకే ఇదిఒకరికొకరు సహవాసాన్ని కొత్త మార్గంలో ఆస్వాదించడం లాంటిదని పేర్కొంది. హ్యారీతో ఆమె శాశ్వత ప్రయాణం ఇంకా కొనసాగుతుందా అని అడిగినప్పుడు 'అవును' అని స్పష్ట చేసింది మేఘన్.ఇదీ చదవండి: Akshaya tritiya 2025 దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి ‘‘ మీకో విషయం తెలుసా? మా బంధం ప్రారంభంలో సీతాకోక చిలుకల్లా విహరించాం. ఆరు నెలల డేటింగ్ తరువాత పెళ్లి అనే బంధంలోకి వెళ్లాం. ఈ ఏడేళ్ల కాలం ఒకరినొకరు కొత్త మార్గంలో ఆనందిస్తున్నాం. మరో విధంగా చెప్పాలంటే ఇది మాకు హనీమూన్ కాలంలా అనిపిస్తుంది." అని మేఘన్ మార్కెల్ చెప్పడం విశేషం.2016లో, ఈ జంట తొలి సారు కలుసుకున్నారు. 2018లో పెళ్లి తరువాత, 2019లో తొలి బిడ్డ ప్రిన్స్ ఆర్చీని, 2021లో తమ రెండవ బిడ్డ ప్రిన్సెస్ లిలిబెట్ను స్వాగతించారు. ప్రస్తుతం, రాజ దంపతులు పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నారు.చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర? -
తాగుడు అలవాటు.. ఎంత చెప్పినా మానలేదు.. అందుకే విడాకులు: నటి
బంధాన్ని తెంచుకోవడం అంత ఈజీ కాదు.. కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితులు తలకిందులైనప్పుడు చాలామంది ఆ బంధాన్ని కష్టంగా కొనసాగించడానికి బదులు తెంపుకోవడానికే ప్రయత్నిస్తారు. బుల్లితెర నటి శుభంగి ఆత్రే (Shubhangi Atre) కూడా అదే పని చేసింది. పరిస్థితి చేయిదాటిపోయిందని అర్థమయ్యాక భర్త పీయూశ్ పూరే (Piyush Poorey)తో విడాకులు ఇచ్చేసింది. ఇంతలోనే పీయూశ్ పూరే (ఏప్రిల్ 19న ) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశాడు.విడాకులకు కారణం..ఈ క్రమంలో శుభంగి.. తమ అన్యోన్య దాంపత్యం చెల్లాచెదురవడానికి గల కారణాన్ని వెల్లడించింది. నేను టీవీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాను కాబట్టి భర్తను వదిలేశాను అని చాలామంది అనుకుంటారు. అది నిజం కాదు. అతడికున్న తాగుడు వ్యసనం వల్లే విడిపోవాల్సి వచ్చింది. మందుకు బానిసవడం వల్ల అది కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.ఎంతో ప్రయత్నించా..మా బంధాన్ని కాపాడుకోవాలని చాలారకాలుగా ప్రయత్నించాను. కానీ పరిస్థితులు చేయిదాటిపోయాయి. అతడితో మందు మాన్పించేందుకు రిహాబిలిటేషన్ సెంటర్‌కు కూడా పంపించాను. అయినా తనలో మార్పు రాలేదు. ఇరు కుటుంబాలు తనను మార్చాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆ వ్యసనం.. అతడిని నాశనం చేసింది. మాపై కూడా ప్రభావం చూపింది.ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదువిడాకులు ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. 2018-2019 సమయంలో ఆ ఆలోచన మొదలైంది. చివరకు ఈ ఏడాది విడాకులు తీసుకున్నాం. డివోర్స్ అయ్యాక కూడా నేను అతడితో టచ్‌లోనే ఉన్నాను. ఇంతలోనే అతడు కాలం చేశాడు. త్వరలోనే నేను, నా కూతురు.. ఇండోర్‌లో ఉన్న పీయూశ్ కుటుంబాన్ని కలుస్తాం అని చెప్పుకొచ్చింది.సీరియల్స్‌తో ఫేమస్శుభంగి ఆత్రే- పీయూశ్ 2003లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2005లో కూతురు పుట్టింది. 2022 నుంచి దంపతులిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. కాగా శుభంగి ఆత్రే 2006లో కసౌజీ జిందగీకే సీరియల్‌తో నటప్రయాణం ఆరంభించింది. కస్తూరి, బాబ్జీ ఘర్ పర్ హైర్, హవన్ వంటి పలు సీరియల్స్ చేసింది. చదవండి: పాకిస్తాన్‌కు ఎప్పుడు వస్తున్నావ్? దద్దమ్మ అంటూ సింగర్ కౌంటర్ -
వాళ్ల విడాకులు.. నేను చాలా బాధపడ్డాను: శ్రుతిహాసన్
సెలబ్రిటీల మధ్య ప్రేమ, పెళ్లి, విడాకులు చాలా సాధారణం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇలాంటి న్యూస్ ఏదో ఒకటి వింటూనే ఉంటాం. విడాకులు తీసుకోవడం ఏమో గానీ వాళ్ల పిల్లలు చాలా బాధని అనుభవిస్తుంటారు. అలాంటి అనుభవాన్ని ఇన్నాళ్లకు హీరోయిన్ శ్రుతి హాసన్ బయటపెట్టింది. తన జీవితాన్ని మార్చేసిన సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా శ్రుతి హాసన్ అందరికీ తెలుసు. కమల్ తొలి భార్య సారికకు పుట్టిన కూతుళ్లలో శ్రుతి హాసన్ పెద్దది. 1988లో కమల్-సారిక పెళ్లి జరగ్గా.. 2004లో విడిపోయారు. దీంతో తల్లితో పాటు కూతుళ్లు శ్రుతి హాసన్, అక్షర హాసన్ ముంబై వెళ్లిపోయారు. ఆ విషయాల్నే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ పంచుకుంది.'నేను ఇండస్ట్రీకి రావడానికి ముందు నా జీవితంలో ఏం జరిగిందో చాలామందికి తెలియదు. నా తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం నన్ను చాలా బాధపెట్టింది. వాళ్లిద్దరూ విడిపోయాక నేను అమ్మతో ఉన్నాను. అప్పటివరకు ఉన్న జీవితం ఒక్కసారి మారిపోయింది'(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ) 'చెన్నై నుంచి ముంబై వచ్చేశాం. అప్పటివరకు బెంజ్ కార్లలో తిరిగిన నేను లోకల్ ట్రైన్ లో తిరిగాను. అలా రెండు రకాల జీవితాలు చూశాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాన్నతో ఉంటున్నాను. విదేశాల్లో సంగీతం నేర్చుకున్నాను. ప్రస్తుతం నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను' అని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.మ్యూజిక్ కంపోజర్, సింగర్ గా కెరీర్ ప్రారంభించిన శ్రుతి హాసన్.. 'అనగఅనగా ఓ ధీరుడు' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయింది. హిట్స్, ఫ్లాప్స్ ఈమె చాలానే ఉన్నాయి. రీసెంట్ టైంలో మాత్రం మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. ప్రస్తుతం రజనీకాంత్-లోకేశ్ కనగరాజ్ కాంబోలోని 'కూలీ' మూవీ చేస్తోంది.(ఇదీ చదవండి: రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్) -
Divorce: అక్కడ విడాకులంటే మహిళలకు పండగే పండగ!
సాధారణంగా విడాకులను (Divorce) ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక ఫెయిల్యూర్‌గానే పరిగణిస్తున్నారు. కాలమెంత మారినా విడాకులు తీసుకున్న మహిళను చిన్నచూపు చూసే ధోరణి మాత్రం పోలేదు. డైవోర్స్‌ని ఓ అవమానంగా, పరువు ప్రతిష్ఠలకు భంగంగా భావించే పరిస్థితే ఇంకా! అయితే వాయవ్య ఆఫ్రికా దేశమైన మారిటానియా (Mauritania) తీరు ఇందుకు భిన్నం. అక్కడ విడాకులు అంటే ఒక వేడుక. ఆ దేశంలోని మారి తెగలోని మాతృస్వామ్య పద్ధతులే ఇందుకు కారణం అంటారు పరిశీలకులు, విశ్లేషకులు. మారిటానియాలో ఒక వివాహిత ఎన్నిసార్లయినా విడాకులు తీసుకోవచ్చు. ఆ విడాకుల సందర్భాన్ని ఒక మెహెందీ, పాటలు, డాన్సులు, విందుతో ఒక సెలబ్రేషన్‌గా నిర్వహిస్తారు. దాని ఉద్దేశం.. ఆ అమ్మాయి మళ్లీ పెళ్లికి సిద్ధంగా ఉందని తెలియజెప్పడమేనట. అమ్మాయిలైతే విడాకులను తమకు దొరికిన స్వేచ్ఛలా భావిస్తారట. విడాకులు తీసుకున్న యువతులు తమ అభిరుచుల్లో ప్రావీణ్యాన్నిపెంపొందించుకునే ప్రయత్నం చేస్తారట. కొంతమంది పైచదువులు చదువుకుంటారు, కొంతమంది రాజకీయాల వైపు మళ్లుతారు, ఇంకొంతమంది ఆర్టిస్ట్‌లు అవుతారు.. ఇలా తమకు నచ్చిన రంగాన్ని ఎంచు కుంటారు. పిల్లలుంటే వాళ్ల సంరక్షణ తల్లి చాయిసే! చదవండి: స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్ఇంకో విషయం ఏంటంటే.. విడాకులు తీసుకున్న ఆడవాళ్లందరికీ ఒక మార్కెట్ ఉంటుంది. అందులో వాళ్లింటి సామాన్లన్నిటినీ అమ్మేస్తారు. ఒకరకంగా ఈ మార్కెట్‌ను వాళ్లు తమ స్వేచ్ఛకు ప్రతీకగా భావిస్తారు. పాత భారాన్నంతా దింపేసుకుని కొత్త జీవితానికి సిద్ధంగా ఉన్నామనే సూచననిస్తున్నట్టన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం.. మారిటానియాలో కొత్త పెళ్లికొడుకులు డైవోర్స్ అయిన మహిళలను చేసుకోవడానికే మొగ్గు చూపుతారు. ఎందుకంటే సంసారంలో వాళ్లు అనుభవజ్ఞులని. అందుకే పెళ్లికి అక్కడ విడాకుల వనితలకే డిమాండ్ ఎక్కువ. మరో ముఖ్యమైన సంగతేంటంటే.. విడాకుల వనితలు మాత్రం విడాకులు పొందిన పురుషులను చేసుకోరు. కొత్త పెళ్లికొడుకులనే చూస్తారు. విడాకులు పొందిన మగవాళ్లను ఫెయిల్యూర్ హజ్బెండ్స్గా పరిగణిస్తారట. -
కొడుకు తనకు పుట్టలేదంటున్నాడు నా భర్త : మెయింటెనెన్స్ వస్తుందా? రాదా?
నేను ఒక ప్రైవేట్ స్కూల్లో 14 వేల జీతానికి పనిచేస్తున్నాను. నాకు ఒక పాప. నా భర్తకి నెలకు 70 వేల జీతం. నాకు నయం చేయలేని వ్యాధి ఉంది. కొన్ని కారణాల వల్ల మేం గత రెండు సంవత్సరాలుగా విడి విడిగా ఉంటున్నాము. భర్తనుంచి మనోవర్తి రాలేదు. మెయింటెనెన్స్ కేసు వేయాలి అనుకుంటున్నాను. ఐతే, నా వ్యాధి – ఉద్యోగ రీత్యా నేను మెయింటెనెన్స్‌కు అర్హురాలిని కాదు అంటున్నారు. ఇది నిజమేనా? - సాధన (పేరు మార్చాం), హైదరాబాద్హెచ్.ఐ.వి. లాంటి నయం చేయలేని వ్యాధి ఉన్నాగానీ మెయింటెనెన్స్‌కు మీరు అర్హులే! మీకే కాదు, మీ పాపకి కూడా మెయింటెనెన్స్ వస్తుంది. భార్యను, పిల్లలను పోషించటం భర్త బాధ్యత. ఐతే మీ ఉద్యోగం రీత్యా మీ వరకు కొంత మెయింటెనెన్స్స తగ్గవచ్చు తప్ప, మీ కూతురికి తనకి సరిపడేంత మెయింటెనెన్స్ వస్తుంది. సెక్షన్ 144 బీఎన్ఎస్ ( పా సీ.ఆర్.పీ. సీ 125) ప్రకారం కేసు వేయండి. నాకు, నా మూడేళ్ల కొడుకుకి మెయింటెనెన్స్ కోరుతూ నా భర్త పై కేసు వేశాను. అతనికి నామీద అనుమానం చాలా ఎక్కువ. కాన్పుకి వచ్చిన తర్వాత తిరిగి తీసుకుని వెళ్ళలేదు. ‘‘కొడుకు కూడా నాకు పుట్టలేదు, నేను మెయింటెనెన్స్ కట్టను’’ అంటూ వాదిస్తున్నాడు. నా కొడుకు అతడికే పుట్టాడు అని రుజువు చేసుకోవాలి అని అంటున్నారు. నాకు ఏంటి ఈ పరీక్ష? పరిష్కారం చెప్పగలరు. – ఒక సోదరి, కర్నూలు మీరు ఎటువంటి పరీక్షలు చేయించుకోవలసిన అవసరం లేదు. బాబును అనవసర పరీక్షలకు తీసుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అభియోగం అతను మోపుతున్నాడు కదా. అతనిని రుజువు చేసుకోమని చెప్పాలి. వివాహ బంధంలో, కాపురం చేస్తున్న సమయంలో పుట్టిన పిల్లలకి తండ్రి ఆ భర్తే అని ఎవిడెన్స్ చట్టం లోని సెక్షన్ 112 కచ్చితంగా చెప్తుంది. మీరు గర్భం దాల్చిన సమయానికి మీకు, మీ భర్తకు వివాహ సంబంధం ఉన్నది అంటే చాలు. ఇదే విషయాన్ని ఇటీవలే సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. ఇలాంటి ఉపయోగాలు చేసిన భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలను చేసింది. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కోర్టు వారికి మధ్యంతర మెయింటెనెన్స్ కావాలి అని దరఖాస్తు పెట్టి కేసు వాదించండి. మీకు ఉచితమైన న్యాయం దొరుకుతుంది. – శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది మీకున్నన్యాయపరమైన సమస్యలు, సందేహాలకోస akshifamily3@gmail.com మెయిల్ చేయ వచ్చు. -
నాకు నువ్వు వద్దు!
నగరానికి చెందిన ఓ యువజంటకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. అన్యోన్యంగా సాగాల్సిన వీరి కాపురంలో పెళ్లయిన నెలరోజులకే చిచ్చు మొదలైంది. ఇంట్లో నెలకొన్న చిన్నచిన్న సమస్యలు వీరి గొడవకు ప్రధాన కారణంగా మారాయి. గొడవ పెద్దదై ఈ యువజంట పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కొద్దిరోజులుగా పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు.నగరానికి చెందిన యువకుడికి పొరుగు జిల్లాకు చెందిన యువతితో గతేడాది వివాహం జరిగింది. ఇద్దరూ ఉద్యోగులు కావడంతో కొన్నాళ్లకు ఆధిపత్య పోరు మొదలైంది. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి వారు జీవిస్తూ.. విడాకుల కేసు నమోదు చేసుకున్నారు. ఎందుకని ఆరా తీసిన పోలీసులు, న్యాయవాదులు ఆ జంట చెప్పిన కారణంతో అవాక్కయ్యారు. దీనికి పూర్తి కారణం ఇరువురి తల్లిదండ్రుల అతిజోక్యమేనని కౌన్సెలింగ్‌లో పోలీసులు నిర్ధారణకు వచ్చారు.ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరావిు..! అని ప్రమాణాలు చేసుకుని ఒకటవుతున్నారు. అగ్నిహోత్రం చుట్టూ.. ఏడడుగులు నడిచి.. మూడుముళ్లతో వివాహ బంధంలో అడుగిడుతున్నారు. జీలకర్ర.. బెల్లం తలపై పెట్టుకుని ఒకరికొకరు నూరేళ్లు కలిసుంటామని బాస చేసుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుని, జీవితంలో కష్టాసుఖాలను సమానంగా పంచుకోవల్సిన కొందరు కొత్త జంటలు ‘ఆధిపత్య’ పోరుతో ఆదిలోనే తమ నూరేళ్ల సంసార జీవితాన్ని ముక్కలు చేసుకుంటున్నారు. మూణ్నాళ్లకే ‘నాకు నువ్వు వద్దు’ అంటూ.. పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. కోర్టుల్లో విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో రోజురోజుకు ఠాణామెట్లు ఎక్కుతున్న జంటల సంఖ్య పెరుగుతుండగా.. జిల్లా కోర్టులోనూ విడాకుల కేసుల సంఖ్య అదేస్థాయిలో కొనసాగుతోంది. – కరీంనగర్క్రైంచిన్న చిన్న కారణాలతో..⇒నిండు నూరేళ్లు అన్యోన్యంగా జీవించాల్సిన కొన్ని జంటలు చిన్నచిన్న కారణాలతో మూడుముళ్ల బంధాన్ని తెంచుకుంటున్నాయి. ⇒బతుకుపోరులో.. ఉద్యోగాల వేటలో పెళ్లయిన వెంటనే దూర ప్రాంతాల్లో జీవిస్తూ.. వేరు కాపురాలు పెడుతున్నారు.⇒ ఉమ్మడి కుటుంబం ఊసే లేకపోతుండగా.. దంపతుల మధ్య అహం, అపార్థం, అనుమానాలు పెరుగుతున్నాయి. ⇒నాలుగు గోడల మధ్య సర్దుకుపోవాల్సిన విషయాలు రోడ్డెక్కుతున్నాయి.⇒ఇద్దరి మధ్య అగాథం పెరిగి, పోలీసుస్టేషన్, కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తున్నాయి.⇒పెద్దలు కుదిర్చినా.. ప్రేమించి పెళ్లి చేసుకు న్నా.. చాలా జంటల్లో అదే తీరు కనిపిస్తోంది.అవగాహన అవసరం⇒కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్య విబేధాలు వచ్చినప్పుడు ఇరువురి తల్లిదండ్రులు నచ్చజెప్పాలి. సమస్యను ఓపిగ్గా విని, పరిష్కారానికి కృషి చేయాలి.⇒అలా కాకుండా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల నే రెచ్చగొడుతుండడం బాధ కలిగించే అంశమని మహిళా పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు.⇒అనుమానం, హింస, దాంపత్య బంధం విలువ తెలియకపోవడం, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, హంగుఆర్భాటాలకు పోయి ఆర్థిక పరిస్థితి చితికిపోయి, చిన్న కారణాలతోనే విడాకుల వరకు వెళ్తున్నారని, ఆవేశంతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారని వివరించారు.⇒ప్రేమ వివాహం చేసుకున్న వారు సైతం చాలామంది కొన్నాళ్లకే ఠాణామెట్లు ఎక్కుతున్నారని తెలిపారు. ⇒విడాకులు తీసుకుంటున్న, పోలీసుస్టేషన్‌కు వస్తున్న జంటల్లో ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే ఉంటున్నారని ఓ సీనియర్ కౌన్సిలర్ పేర్కొన్నారు.ఆధిపత్య ధోరణి వద్దు దాంపత్య జీవితానికి విలువ తెలియక చాలా మంది విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వివాహం అనంతరం ఎలా వ్యవహరించాలి..? ఎలా ఉండాలనే విషయాలపై పెద్దలు అవగాహన కల్పించాలి. ఈ రోజుల్లో పెళ్లికి ముందే దాంపత్య జీవితంలో ఎలా ఉండాలనే విషయాలు తెలిపే ప్రి మారిటల్ కౌన్సెలింగ్ తప్పనిసరి అని నా భావన.– అట్ల శ్రీనివాస్‌రెడ్డి, సైకాలజిస్ట్తొందరపాటుతోనే..దంపతుల మధ్య గొడవలు వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ తరం పిల్లలకు దాంపత్య బంధం విలువ సరిగా తెలియడం లేదు. పెళ్లయ్యాక ఇద్దరూ ఉద్యోగాలు చేయడంతో స్వేచ్ఛాయుత వాతావరణానికి అలవాటు పడి ఒకరి మాట ఒకరు వినడం లేదు. చిన్న గొడవకే ఠాణాకు వస్తున్నారు. అనుమానం, తల్లిదండ్రుల మితివీురిన జోక్యం, దురలవాట్లు, గృహహింస, కుటుంబానికి సమయం ఇవ్వకపోవడం మా వద్దకు వచ్చే దంపతుల మధ్య గొడవకు ప్రధాన కారణాలు. – శ్రీలత, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ, కరీంనగర్ -
పెళ్లిళ్లు-పెటాకులు.. బలహీన పడుతున్న వివాహ బంధం.. అసలు కారణం ఇదేనా?
-
విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?
ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకునేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కారణం ఏదైనా విడాకులు వరకు వెళ్లిపోతున్నారు. డివోర్స్ తీసుకుంటే ఆ తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉన్నా.. క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది వినడానికి వింతగా అనిపించినప్పటికీ, ఈ కథనం చదివితే.. తప్పకుండా మీకే అర్థమవుతుంది.భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు (ఉద్యోగం చేసే వారైతే).. జాయింట్ అకౌంట్స్ మీద హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటివి తీసుకుని ఉంటే.. విడాకులు తరువాత ఈ ఖాతాలను క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఎలా అంటే.. జాయింట్ అకౌంట్స్ కింద తీసుకున్న లోన్‌కు ఇద్దరూ బాధ్యత వహించాలి. ఆలా కాకుండా అకౌంట్ క్లోజ్ చేస్తే లేదా లోన్ చెల్లింపులు ఆలస్యం చేస్తే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది.కలిసి ఉన్నప్పుడు ఇద్దరి సంపాదన తోడవుతుంటుంది. విడాకుల తరువాత ఎవరి దారి వారిదే. అలాంటి సమయంలో ఆర్ధిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఇది మీ ఈఎంఐల మీద ప్రభావం చూపిస్తుంది. ఇది కూడా సిబిల్ స్కోర్ తగ్గిపోవడానికి కారణమవుతుంది.ఇదీ చదవండి: ఫుడ్ ఆర్డర్‌తో పాటు ఓ స్లిప్ పంచుతున్న డెలివరీ బాయ్.. అందులో ఏముందంటే?విడాకులు మంజూరు చేసే సమయంలో లోన్స్ క్లియర్ చేయాల్సిన బాద్యతను మీ భాగస్వామికి కోర్టు అప్పగించినప్పటికీ.. లోన్ అగ్రిమెంట్స్ మీద ఇద్దరి సంతకాలు ఉంటాయి. అలాంటి సమయంలో మీ భాగస్వామి చెల్లింపులను ఆలస్యం చేస్తే.. ఆ ప్రభావం ఇద్దరిపైన పడుతుంది. ఇది సిబిల్ స్కోర్ తగ్గడానికి కారణమవుతుంది.జాయింట్ అకౌంట్స్ లేదా క్రెడిట్ కార్డులను విడాకులు తీసుకున్న వెంటనే క్లోజ్ చేసుకున్నట్లయితే.. అది మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి విడాకులు తీసుకున్న తరువాత కూడా ఇలాంటి ఆర్ధిక సంబంధ లావాదేవీల గురించి మాట్లాడుకుంటే.. సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోవచ్చు. -
విడాకులు తీసుకుంటాంలే.. హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ (ఫొటోలు)
-
బుల్లితెర జంటపై విడాకుల రూమర్స్.. నటుడు ఏమన్నారంటే?
సినీ తారలపై రూమర్స్ రావడం ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా డేటింగ్, బ్రేకప్, విడాకుల వార్తలు ఎక్కువ వింటుంటాం. ప్రస్తుత సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాటికి కొదువే లేదు. అయితే ఇలాంటి సినీ తారలు కూడా పెద్దగా పట్టించుకోరు. అలా ఓ బుల్లితెర జంటపై ఇటీవల కొన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్లో ప్రముఖ జంటగా గుర్తింపు తెచ్చుకున్న వివేక్ దహియా, దివ్యాంక త్రిపాఠి త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి.ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విడాకుల రూమర్స్‌పై నటుడు వివేక్ దహియా స్పందించారు. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు నవ్వుతూ సమాధానమిచ్చారు. అవన్నీ కేవలం ఊహగానాలేనని కొట్టిపారేశారు. వాటిని చూసి తాము నవ్వుకుంటున్నామని తెలిపారు. తన మ్యూజిక్ వీడియో ఇష్టం లాంఛ్ సందర్భంగా మీడియాకు క్లారిటీ ఇచ్చారు.వివేక్ దహియా మాట్లాడుతూ..' అలాంటి వార్తలు చూసి నేను, దివ్యాంక నవ్వుకుంటాం. ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తాం. ఇంకా చాలాసేపు మాట్లాడుకోవాలనుకుంటే అలాగే పాప్‌కార్న్ ఆర్డర్ చేసుకుని మరీ తింటాం. నేను కూడా యూట్యూబ్ వ్లాగింగ్ చేస్తా. కాబట్టి క్లిక్ బైట్ ఎలా పని చేస్తుందో నాకు బాగా తెలుసు. ఇవన్నీ నాకు బాగా అర్థమవుతాయి. మీరు ఏదైనా సంచలనాత్మకంగా ఉంచితేనే ప్రజలు వాటిని చూస్తారు. కానీ అందులో అసలు నిజం ఉండదు. అలాంటి అవాస్తవాలను మనం ప్రోత్సహించకూడదు' అని అన్నారు.కాగా.. ఫీల్ గుడ్ ఒరిజినల్స్ బ్యానర్‌పై సురభి చందనా నిర్మించిన 'ఇష్టం' అనే కొత్త మ్యూజిక్ వీడియోలో నటుడు అనైరా గుప్తా సరసన వివేక్ దహియా నటించారు. ఈ వీడియో ఏప్రిల్ 14న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో వివేక్ మాట్లాడారు. అంతకుముందు వివేక్ దహియా, నటి దివ్యాంక త్రిపాఠి 'యే హై మొహబ్బతే' సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత డేటింగ్ ప్రారంభించారు. అనంతరం 2016లో వివాహం చేసుకున్నారు. -
'ఇది తప్పనిసరి' .. విడాకులపై స్పందించిన మెలిండా గేట్స్..!
ప్రపంచ అపరకుభేరుడు, మైక్రోసాఫ్ట్ విండోస్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్ దంపతులు అధికారికంగా విడిపోయిన సంగతి తెలిసిందే. 1994లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో తమ 27 ఏళ్ల దాంపత్యానికి స్వస్థి చెబుతూ విడిపోయారు. అయితే దీన్ని అతిపెద్ద విచారంగా పేర్కొన్నారు బిల్‌గేట్స్. ఆ వ్యాఖ్యలపై ఎప్పుడు స్పందించలేదు మెలిండా ఫ్రెంచ్ గేట్స్. అయితే ఆమె తొలిసారిగా విడాకులు గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మెలిండా తన మాజీ భర్త బిల్‌గేట్స్ మాటలకు నేరుగా స్పందించకపోయినప్పటికీ..పరోక్షంగా సమాధానమిచ్చారు. "అత్యంత సన్నిహిత బంధంలో విలువలతో జీవంచలేని పరిస్థితి ఎదురైతే విడాకులు తప్పనిసరి అవసరంగా అభివర్ణించారు. అయితే బిల్‌గేట్స్ వ్యాఖ్యలపై మాట్లాడనని నిర్మోహటంగా చెప్పేశారు. ఎందుకంటే అతనికి తనకంటూ సొంత జీవితం ఉంది. ఇప్పుడు నా జీవితం నాకు ఉంది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను. నిజానికి విడాకులు అనేది భావోద్వేగ భారం అన్నారు." ఎందుకంటే ఆ సమయంలో తానెంతో తీవ్ర భయాందోళనలకు గురైనట్లు తెలిపారు. వివాహం విడిచిపెడుతున్నప్పుడు..చాలా కష్టంగా ఉంటుందన్నారు. ఆ సమయంలో జరిగే చర్చలన్నీ కఠినంగా ఉంటాయన్నారు. 2014లో గేట్స్‌తో కలిసి భోజనం చేస్తున్నప్పుడు అచ్చం అలాంటి భాధ, తీవ్ర భయాందోళనలు కలిగాయని అన్నారు. అలాంటి సమయంలో వెంటనే ఇది సరైనది కాదా అని సానుకూలంగా ఆలోచించి..త్వరితగతిన బయటపడాలి లేదంటే ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోతుందన్నారు. ఆ తర్వాత తాను నెమ్మదిగా దాని విలువ అర్థం చేసుకుని నిశబ్దంగా నిష్క్రమించానన్నారు. అలాగే ఇక్కడ భయాందోళనలకు గురవ్వడం అంటే తాను దెబ్బతిన్నట్లు కాదని కూడా చెప్పారు. ఇక్కడ తాను గుర్తించాల్సిన కొన్ని కష్టమైన విషయాలను ఎదుర్కొన్నానని అందువల్ల తనకు విడిపోవడం అనేది తప్పనిసరి అంటూ మెలిండా విడాకుల తీసుకోవడానికి గల కారణాలను వివరించారు. కాగా, ఈ జంటకు జెన్నిఫర్(28) రోరీ(25), ఫోబ్(22)లు ఉన్నారు. అంతేగాదు ఇద్దరు మనవరాళ్లు కూడా ఉన్నారు. ఇక బిల్‌గేట్స్ 2022 నుంచి మాజీ ఒరాకిల్ సీఈవో మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డ్‌తో డేటింగ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో లేటు వయసు విడాకులు ఎక్కువఅవుతున్నాయి. ఇన్నేళ్ల దాంపత్యం తర్వాత తాము ఏం కోల్పోయామో వెతుకుతూ విడిపోతున్నారు. మానసిక నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే..ఎంతోమంది సెలబ్రిటీలు, ప్రముఖులు పిల్లలు సెటిల్ అయిపోయాక విడిపోతున్నారు. మాకు స్పేస్ కావాలని కొందరూ..ఇనాళ్లు తన ఉనికే కోల్పోయానని కొందరూ అంటున్నారు. అన్నేళ్లు కలిసి ఉండటానికి.. బాధ్యతలు, పిల్లలు వంటి తదితర కారణాలే గానీ ఎప్పుడో వాళ్ల మధ్య బంధం విచ్ఛిన్నమైందని, అందువల్లే ఇలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఏదీఏమైనా..ఆ పరిస్థితి ఎదురవ్వక ముందే భాగస్వాముల్లో ఎవ్వరో ఒక్కరో దీన్ని గుర్తించి తమ బంధాన్ని కాపాడుకునే యత్నం చేయాలంటున్నారు. అలాగే మనతో సాగే సహచరులను నిర్లక్ష్యం చేస్తే..వాటి పర్వవసానం చివర్లో ఇలానే ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. నిజానికి వయసులో కంటే వృద్ధాప్యంలోనే తోడు ఉండాలని ఆ సమయంలోనే.. అసలైన దాంపత్యం ఇరువురి నడుమ ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. (చదవండి: ఒర్రీ వెయిట్‌లాస్ సీక్రెట్: వాంతులు చేసుకుంటూ బరువు తగ్గడమా..?) -
భారతీయ కుటుంబ వ్యవస్థలో అనూహ్య మార్పులు
బెంగళూరు: భారత సమాజంలో కుటుంబ వ్యవస్థ అనూహ్య మార్పులకు లోనవుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న అన్నారు. విడాకుల సంఖ్య కొంతకాలంగా క్రమంగా పెరిగిపోతోందంటూ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘రెండు దశాబ్దాలుగా 25–29 ఏళ్ల మధ్య వయసున్న యువతుల్లో అవివాహితుల సంఖ్య పెరుగుతోంది. మొత్తంగా అమ్మాయిల్లో సగటు వివాహ వయసు కూడా పెరుగుతోంది’’ అని నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ సమాచారాన్ని ఉటంకించారు. సుప్రీంకోర్టులో ఫ్యామిలీ కోర్టుల కమిటీకి చైర్పర్సన్ అయిన ఆమె ‘కుటుంబం: భారతీయ సమాజానికి పునాది’ పేరిట బెంగళూరులో జరిగిన దక్షిణాది ప్రాంతీయ సదస్సులో మాట్లాడారు. ‘పట్టణీకరణ, మహిళల్లో పెరిగిన ఆర్థిక స్వేచ్ఛ, అందరికీ విద్య అందుబాటులో రావడం వంటి కారణాలతో కుటుంబాల్లో మార్పులొస్తున్నాయి. విద్య, సాధికారతతో మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక స్వాతం్రత్యాన్ని సానుకూల దృక్పథంతోనే చూడాలి. వారు తమ కుటుంబానికి గాక దేశానికీ ఎనలేని సేవ చేస్తున్నారు’’ అని ఆమె అన్నారు. 40 శాతం పెళ్లిళ్లు విచ్చిన్నం కుటుంబ తగాదాల కేసులు పెరిగిపోతుండటం పట్ల జస్టిస్ నాగరత్న ఆవేనద వెలిబుచ్చారు. అందుకు మహిళలే కారణమన్న వాదనను ఆమె తోసిపుచ్చారు. సమాజ ధోరణి మారకపోవడం వంటివే అందుకు ప్రధానంగా కారణమని అభిప్రాయపడ్డారు. ‘‘సామాజిక, ఆర్థిక పరిస్థితులకు తగ్గట్లు మారనప్పుడే వైవాహిక వివాదాలు తలెత్తుతాయి. గత పదేళ్లుగా జరిగిన పెళ్లిళ్లలో 40 శాతం దాకా విచ్చిన్నమయ్యాయి. ఇంతగా కుటుంబ కలహాల కేసులు వచ్చిపడుతుండటం ఫ్యామిలీ కోర్టులకు తలకు మించిన భారం అవుతోంది. బ్రేక్‌ఫాస్ట్ సరిగా చేయలేదనో, ఫంక్షన్‌కు త్వరగా ముస్తాబు కాలేదనో కూడా కోర్టు దాకా వస్తున్నారు.ఇలాంటి గొడవల వల్ల అంతిమంగా అందరికంటే ఎక్కువగా నష్టపోయేది పిల్లలే. కుటుంబ వివాదాలకు ఫ్యామిలీ కోర్టుల కంటే కౌన్సిలింగ్, మధ్యవర్తిత్వం ఉత్తమం. ఇరుపక్షాలూ సంయమనంతో ప్రయత్నిస్తే సమస్య పరిష్కారమవుతుంది. ముందు భార్యాభర్తలు పరస్పరం అర్థం చేసుకుని గౌరవించుకోవాలి. భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవాలి. సమస్యను అవతలి వ్యక్తి దృక్కోణం నుంచి చూడాలి. ‘‘భార్య ఏమీ ఆశించకుండా ఇంటిల్లిపాది పనులూ ఒంటిచేత్తో చక్కబెడుతుందని భర్త గుర్తుంచుకోవాలి. ఆమెకు తగిన విలువ ఇస్తే పిల్లలూ మంచి వాతావరణంలో పెరుగుతారు’’ అంటూ హితవు పలికారు. -
Michelle Obama: ఏది మంచిది అనిపిస్తే అదే చేస్తా
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(barack obama) సతీమణి మిషెల్లీ విడాకుల ప్రచారంపై ఎట్టకేలకు పెదవి విప్పారు. గత కొంతకాలంగా దేశ మాజీ ప్రథమ పౌరురాలి హోదాలో ఆమె పలు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని బహిరంగంగా బరాక్ ఖండించినప్పటికీ.. మిషెల్లీ మాత్రం ఎక్కడా స్పందించకపోవడంతో ఆ అనుమానాలు కొనసాగుతూ వచ్చాయి.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన టైంలో, అంతకు ముందు మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు మిషెల్లీ ఒబామా(michelle obama) గైర్హాజరు అయ్యారు. మాజీ అధ్యక్షులు అయినప్పటికీ సతీసమేతంగా(ఫస్ట్ లేడీ కాబట్టి) హాజరు కావడం అక్కడి ఆనవాయితీ. అయితే బరాక్ ఒబామా ఒంటరిగా ఆ కార్యక్రమాలకు హాజరు కావడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రచారాన్ని ఒబామా గత నాలుగు నెలల కాలంలో విడాకుల రూమర్లను(Divorce Rumours) రెండుసార్లు ఖండించారు. ఇప్పుడు మిషెల్లీ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై స్పందించారు.నటి సోఫియా బుష్ నిర్వహించే పాడ్‌కాస్ట్‌లో మిషెల్లీ మాట్లాడుతూ.. విడాకుల ప్రచారాన్ని తోసిపుచ్చారు. తన గురించి ఆలోచించే సమయం తనకు ఇప్పటికి దొరికిందని.. అందుకే అధికారిక కార్యక్రమాలకు, రాజకీయపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారామె. ‘‘గత ఎనిమిదేళ్లలో నా జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. కుమార్తెలు పెద్దవాళ్లు అయ్యారు. నా గురించి ఆలోచించుకోవడానికి ఇప్పటికైనా నాకు సమయం దొరికింది. నాకు ఏది మంచో అదే చేయాలనుకుంటున్నా. అంతేకానీ ఇతరులు ఏమనుకుంటున్నారో అది చేయడం కాదు’’ అని అన్నారామె.ఇక్కడ.. ఒక మహిళకు ఉండే స్వేచ్ఛ కోణంలో ఎవరూ ఆలోచించలేకపోయారు. మహిళలుగా మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవే. ఆమె తన కోసం ఆలోచిస్తోందని, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రజలు గ్రహించలేకపోయారు. కేవలం భర్త నుంచి విడిపోతోందనే చర్చించుకున్నారు అని మిషెల్లీ అన్నారు.ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 3వ తేదీన హమిల్టన్ కాలేజీలో ఓ ఈవెంట్‌కు హాజరైన బరాక్ ఒబామా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడారు. రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షునిగా పదవిలో కొనసాగిన కాలంలో పని ఒత్తిడి కారణంగా భార్యతో సఖ్యత చెడిందని బరాక్ ఒబామా ఒప్పుకున్నారు. నాటి మనస్పర్ధలను తొలగించుకుంటూ నేడు ఆనందంగా జీవిస్తున్నామన్నారు. -
'అలాంటి వారు కుక్కలతో సమానం'.. గోవింద భార్య ఘాటు వ్యాఖ్యలు
బాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు గోవింద పేరు గత కొన్ని నెలలుగా ఎక్కువగా వినిపిస్తోంది. త్వరలోనే ఆయన తన పెళ్లి బంధానికి గుడ్ బై చెప్పనున్నారని ఇప్పటికే చాలాసార్లు వార్తలొచ్చాయి. అలాంటిదేమీ లేదని తనపై వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. అప్పట్లో బాలీవుడ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న గోవింద.. సునీతా అహుజాను పెళ్లాడిన సంగతి తెలిసిందే.తమపై వస్తున్న విడాకుల వార్తలపై ఆయన భార్య సునీతా అహుజా సైతం స్పందించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె మరోసారి వీటిపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూకు హాజరైన సునీతా అహుజా తన వివాహం గురించి జరుగుతున్న ఉహాగానాలు చూస్తుంటే కలతగా ఉందని తెలిపింది. ఇలాంటి నిరాధారమైన వాటిని వ్యాప్తి చేసేవారిని నమ్మవద్దని అభిమానులను కోరింది.సునీతా మాట్లాడుతూ..'అది పాజిటివ్ అయినా..నెగెటివ్ అయినా.. నేను పాజిటివ్‌గానే తీసుకుంటాను. మాపై ఇలాంటివీ సృష్టించేవారు కుక్కలతో సమానం. అందుకే అవి మొరుగుతాయి." అని కాస్తా గట్టిగానే ఇచ్చిపడేసింది. కాగా.. ఫిబ్రవరిలో వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని గోవింద తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. కానీ వీరికి అత్యంత సన్నిహితుడు కుటుంబ స్నేహితుడై లలిత్ బిందాల్ అనే వ్యక్తి సునీతా అహుజా దాదాపు ఆరు నెలల క్రితమే విడాకుల కోసం దాఖలు చేశారని చెప్పారు. ఆ తర్వాతే విడాకుల రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి.కాగా.. సునీతా అహుజాను మార్చి 1987లో గోవింద వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాదికే కుమార్తె టీనాకు ఆ జంట స్వాగతం పలికారు. వీరికి యశ్వర్ధన్ అనే కుమారుడు 1997లో జన్మించాడు. -
విడిపోయిన ప్రముఖ బుల్లితెర జంట.. వెల్లడించిన భర్త!
విడాకులు అనే పదం ఈ రోజుల్లోనే కామన్ అయిపోయింది. సినీ ఇండస్ట్రీలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. పెళ్లైన కొన్నేళ్లలోనే పెళ్లి బంధానికి ఎండ్ కార్డ్ పడేస్తున్నారు. అలా తాజాగా ప్రముఖ బుల్లితెర నటి తన వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్ బుల్లితెర నటి ముగ్ధా చాఫేకర్ విడాకులు తీసుకున్నట్లు తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె భర్త, నటుడు రవీశ్ దేశాయ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తనకు పెళ్లైన తొమ్మిదేళ్ల తర్వాత భర్త రవీశ్ దేశాయ్‌తో విడిపోయింది.రవీశ్ దేశాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. "చాలా ఆలోచనల తర్వాత, ముగ్ధ , నేను మా సొంత మార్గాల్లో ప్రయాణించేందుకు నిర్ణయించుకున్నాం. అందుకే భార్య,భర్తలుగా విడిపోవాలని డిసిషన్ తీసుకున్నాం. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పట్టింది. ఇప్పటివరకు పరస్పరం ప్రేమ, స్నేహం, గౌరవంతో కలిసి ప్రయాణించాం. ఆమెతో ఉన్న రోజులు జీవితాంతం గుర్తుంటాయి." అని పోస్ట్ చేశారు. ఈ సమయంలో తమకు గోప్యత కావాలని అభిమానలను అభ్యర్థించాడు. అభిమానులు, మీడియా మాపై దయతో మద్దతుగా ఉండాలని.. ఎటువంటి తప్పుడు కథనాలను నమ్మవద్దని నటి భర్త కోరారు.కాగా.. రవీశ్ దేశాయ్, ముగ్ధా చాఫేకర్ 2014లో సత్రంగి ససురల్ సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ సీరియల్లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత డిసెంబరు 2016లో ముంబయిలో జరిగిన గ్రాండ్ వేడుకలో వీరి వివాహం జరిగింది. ప్రముఖ టీవీ సీరియల్ కుంకుమ భాగ్య సీరియల్లో ప్రాచీ మెహ్రా కోహ్లి పాత్రకు గానూ ముగ్ధా చాఫేకర్ బాగా ఫేమస్ అయింది. అలాహే రవీశ్ దేశాయ్ మేడ్ ఇన్ హెవెన్, షీ (సీజన్ 2), స్కూప్ లాంటి వెబ్ సిరీస్‌ల్లో కనిపించారు. చివరిసారిగా స్పోర్ట్స్ డ్రామా విజయ్ 69లో కనిపించారు. -
అప్పుడు మనస్పర్ధలొచ్చాయి
వాషింగ్టన్: రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షునిగా పదవిలో కొనసాగిన కాలంలో పని ఒత్తిడి కారణంగా భార్యతో సఖ్యత చెడిందని బరాక్ ఒబామా ఒప్పుకున్నారు. నాటి మనస్పర్ధలను తొలగించుకుంటూ నేడు ఆనందంగా జీవిస్తున్నామన్నారు. భార్య మిషెల్‌తో జీవనప్రయాణంపై ఒబామా మీడియాతో మాట్లాడారు. హాలీవుడ్ నటి జెన్నీఫర్ అనీస్టన్తో వివాహేతర సంబంధం వంటి వార్తలను వదంతులుగా కొట్టిపారేశారు. భార్య మిషెల్ నుంచి విడాకులు తీసుకోబోతున్నారనేవి కూడా పూర్తిగా వదంతులేని స్పష్టంచేశారు. జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లోనూ, ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో భార్య మిషెల్‌తో రాకుండా ఒంటరిగా ఒబామా కనిపించిన నేపథ్యంలో మీడియా ఆయన విడాకుల అంశాన్ని మరోసారి ప్రస్తావించింది. దీంతో తాజాగా హామిల్టన్ కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో కాలేజీ అధ్యక్షుడు స్టీవెన్ టెప్పర్ అడిగిన ప్రశ్నలకు ఒబామా సమాధానాలిచ్చారు. ‘‘2020 నవంబర్‌లో నా ఆత్మకథ ఏ ప్రామిస్ట్ ల్యాండ్ మొదటి భాగాన్ని మార్కెట్లోకి తెచ్చాం. ఇప్పుడు రెండో భాగం పూర్తిచేసే పనిలో ఉన్నా. రోజూ పేజీల కొద్దీ రాస్తున్నా’’ అని అన్నారు. రాయడం ఇష్టపడతారా అన్న ప్రశ్నకు ‘‘అస్సలు ఇష్టంలేదు. కానీ రాయడం పూర్తయ్యాక మాత్రం రాశానన్న ఆనందంలో మునిగితేలుతా’’అని సరదాగా అన్నారు. ‘‘అధ్యక్షునిగా కొనసాగిన కాలంలో విధి నిర్వహణలో పడిపోయా. దాంతో సతీమణితో మనస్పర్ధలొచ్చాయి. ఇప్పుడు పరిస్థితి అంతా కుదుటపడింది. నాటి విబేధాల లోయలోంచి బయటపడ్డా’’అని చెప్పారు. 1980వ దశకంలో ఒక న్యాయసేవల సంస్థలో కొన్నాళ్లు కలిసి పనిచేసిన కాలంలో మిషెల్‌తో ఒబామాకు పరిచయం ఏర్పడింది. అది తర్వాత ప్రేమగా మారి 1992లో పెళ్లికి దారితీసింది. ఒబామా అధ్యక్షుడయ్యాక కొంతకాలం వాళ్ల మధ్య బేధాభిప్రాయాలు పొడచూపాయి. తమ వైవాహిక బంధంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయని మూడేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో మిషెల్ చెప్పారు. అప్పట్నుంచి వీళ్ల వివాహబంధంపై మీడియాలో ఎన్నో కథలు షికార్లు చేశాయి. అమెరికాలో ప్రఖ్యాత జ్యోతిష్యురాలు అమీ ట్రిప్ సైతం ఇదే విషయం అంచనావేశారు. ఒబామా దంపతులకు జూలై, ఆగస్ట్ నెలలు అత్యంత విషమకాలమని ఆమె అంచనా వేశారు. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారని అమీ ట్రిప్ చెప్పిన జోక్యం నిజం కావడం తెల్సిందే. పెళ్లి పెటాకులు అవుతుందన్న పుకార్లు పెరగడంతో ఒబామా జంట ఫిబ్రవరి 14న జంటగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టింది. వేలంటైన్స్‌డే గ్రీటింగ్స్ చెప్పి విమర్శించే వాళ్ల నోరు మూయించారు.


