
కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం గత కొద్దికాలంగా హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. దాదాపు 16 ఏళ్ల వివాహాబంధానికి ముగింపు పలికేందుకు వీరిద్దరు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని గతేడాది చివర్లో సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు జయం రవి. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. తాము విడిపోవడానికి కారణం మూడో వ్యక్తేనని ఆయన భార్య ఆర్తి ఆరోపించింది. పరోక్షంగా సింగర్ కెన్నీషాను ఉద్దేశించి విమర్శలు చేసింది. ప్రస్తుతం విడాకుల వ్యవహారం కోర్టులో ఉండడంతో కోర్టు విచారణకు హాజరవుతున్నారు.
అయితే తాజాగా జయం రవి భార్య ఆర్తి చేసిన ఇన్స్టా పోస్ట్ వైరల్గా మారింది. తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. నా చుట్టూ ఉన్న ప్రతిదీ పెరుగుతూనే ఉంది అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. తన ఇద్దరు పిల్లలు, పెట్ డాగ్‌తో ఉన్న వరుస ఫోటోలను షేర్ చేసింది. కొన్ని హృదయాలకు ఎక్కడ ఉండాలో తెలుసంటూ రాసుకొచ్చింది.
ఆర్తి తన ఇన్స్టాలో రాస్తూ.. "కొన్ని సాయంత్రాలు, కొన్ని పెరుగుతున్న విషయాల మధ్య సూర్యాస్తమయం.. గట్టిగా పట్టుకునే రెండు చేతులు.. ఎలాంటి మాటలు లేకున్నా దగ్గరగా ఉండే హృదయం.. ప్రతిదీ సంపూర్ణంగా అనిపించేలా చేసే నిశ్శబ్ద ప్రేమ ' అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్గా మారింది. జయం రవితో విడాకుల వివాదం ప్రేమ, హృదయం అంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది. ఇది చూసిన హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా స్పందించింది. చాలా అందంగా ఉంది.. ఆర్తు అంటూ కామెంట్ చేసింది. కాగా.. 16 ఏళ్ల క్రిత రవి, ఆర్తి పెళ్లి చేసుకోగా..వీరికి ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ ఉన్నారు.