సినిమాలు తీయడమంటే ఆషామాషీ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా బాక్సాఫీస్ వద్ద వైఫల్యం మూటగట్టుకోవడం తథ్యం. దీనివల్ల ఎక్కువ నష్టపోయేది నిర్మాతలే.. కొడితే కుంభస్థలాన్ని కొడతారు.. లేదంటేనేమో తీవ్ర నష్టాలు చూస్తారు. అలా తాను నిర్మాతగా తెరకెక్కించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదంటున్నాడు తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి.
ఆ నాలుగు ఫ్లాప్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. నా బ్యానర్‌లో సంగుతేవన్ అనే సినిమా స్టార్ట్ చేశాను. కానీ, అది మధ్యలోనే ఆగిపోయింది. దానివల్ల రూ.1.75 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత నాలుగు సినిమాలు తీశాను. అవే.. ఆరెంజ్ మిఠాయి, మేకు తొడర్చి మలై, జుంగ, లాభం. వీటిలో ఒక్కటి కూడా నాకు లాభాల్ని తెచ్చిపెట్టలేదు. కనీసం పెట్టిన పెట్టుబడి వెనక్కు తీసుకురావడంలో కూడా విఫలమయ్యాయి.
సినిమా
బాక్సాఫీస్ లెక్కలపరంగా అవి ఫ్లాప్ అయినప్పటికీ నాకు మాత్రం ఆ సినిమాలన్నీ ఇష్టం. కాబట్టి వాటిని నిర్మించినందుకు నేనేం బాధపడటం లేదు అన్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి నటుడిగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో ట్రైన్ మూవీ చేస్తున్నాడు. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్ చేస్తున్నాడు. ఇది కాకుండా పాకెట్ నోవెల్, జైలర్ 2, అరసన్‌తో పాటు మణిరత్నం మూవీ ఒకటి ఆయన చేతిలో ఉన్నాయి.
చదవండి: నాగార్జున వల్లే నా కూతురు సినిమాల్లోకి: ప్రియదర్శన్


