నభా నటేశ్ నాగబంధం.. నమోరే సాంగ్ రిలీజ్ | Nabha Natesh latest movie Nagabandham first song out now | Sakshi
Sakshi News home page

Nagabandham Movie: నభా నటేశ్ నాగబంధం.. నమోరే సాంగ్ రిలీజ్

Mar 15 2026 2:27 PM | Updated on Mar 15 2026 2:30 PM

Nabha Natesh latest movie Nagabandham first  song out now

విరాట్‌ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్‌ ప్రధానపాత్రల్లో వస్తోన్న తాజా నాగబంధం. ఈ మూవీకి అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్ చేశారు. నమో రే నమోరే అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు శ్రీ హర్ష లిరిక్స్‌ అందించగా.. జునైద్‌ కుమార్‌ కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌ను సింధూజ శ్రీనివాసన్, ఐశ్వర్య దరూరి
ఆలపించారు. 

ఈ మూవీని ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై కిషోర్‌ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజైన నమో రే పాటను అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ప్రతిబింబించే భారీ సెట్లో చిత్రీకరించారు. ఆ నారాయణుడిని కీర్తిస్తూ  సాగే ఈ ఆధ్యాత్మిక పాటకు వెయ్యి మంది డ్యాన్సర్స్‌ పాల్గొనగా.. భారతీయ నృత్య కళల వైవిధ్యం, ఐక్యతను ప్రతిబింబించేలా అద్భుతమైన విజువల్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement