విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్‌, ఎందుకో తెలుసా? | fight with husband Shikha Singh emotional interesting divorce | Sakshi
Sakshi News home page

విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్‌, ఎందుకో తెలుసా?

Jun 13 2026 3:18 PM | Updated on Jun 13 2026 5:03 PM

fight with husband Shikha Singh emotional interesting divorce

కలకాలం కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు విడిపోతున్న కేసులు ఎక్కువ అవుతున్నాయి. కేవలం స్వల్పవిభేదాలకే కోర్టుకెక్కుతున్నారు. చట్టబద్ధంగా విడాకులు తీసుకుంటున్నారు. కానీ ఈ విడాకులు అనేది కేవలం తల్లిదండ్రులుగా వారికే కాదు.. ఇరు కుటుంబాలకు, ముఖ్యంగా పిల్లలపై శాశ్వత ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రేమాభిమానాలకు, భావోద్వేగ బంధాలకు భంగం కలిగిస్తాయి.  ఈ క్రమంలో ఒక విడాకుల స్టోరీ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 

మనస్పర్దలతో భర్తపై వరకట్న వేధింపులు కేసు పెట్టింది శిఖా సింగ్‌. ఆమెకు 2020లో సౌరభ్‌తో వివాహం జరిగింది. ఆమె తన భర్తతో గొడవపడి, ఆ తర్వాత అతనిపై కట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ తర్వాత విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ కేసు దాదాపు ఐదేళ్లపాటు కొనసాగింది.  ఈ సమయంలో కుమార్తెకు అండగా నిలిచి ఆమె తండ్రి  న్యాయపరమైన ఖర్చుల కోసం ఉన్నదంతా ఖర్చు  చేసేశాడు. అటు కుమార్తె భవిష్యత్తు, ఇటు ఆర్థిక ఇబ్బందులు ఆ తండ్రిని మరింత ఒత్తిడిలోకి నెట్టాయి. దీంతో  ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా, ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. 

మామగారి అనారోగ్యం గురించి తెలుకున్న శిఖా భర్త  మెరుగైన వైద్యం కోసం అతడిని ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, ఆ ఖర్చులన్నింటినీ స్వయంగా భరించాడు. ఎంతో సపోర్ట్‌గా  నిలిచాడు. ఇక్కడే అల్లుడు.. కన్న కొడుకులా ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. 

దీంతో శిఖా మనసులో భర్త మీదున్న ద్వేషం పోయింది. మళ్లీ ప్రేమాభిమానాలు చిగురించాయి. ఇంతలో విడాకుల కేసు విచారణకు వచ్చింది. విడాకులు మంజూరయ్యాయి. తాను కష్టకాలంలో ఉన్నపుడు సౌరభ్ చూపిన ప్రేమ, మానవత్వాన్ని చూసి శిఖా చలించిపోయింది.  అంతే విడాకుల పత్రాలను చింపేసి భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లతోనే భర్తను ఆలింగనం చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట పలువుర్ని ఆకట్టుకుంటున్నాయి. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement