breaking news
emotional
-
నాన్నగారు మాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారా అని బాధ్యతతో కూడిన భయం వేస్తుంది
-
పావలా శ్యామల లేని లోటు ఎవరూ తీర్చలేనిది
-
నా తండ్రి చావుకు నేనే సాయం చేశా: ప్రముఖ నటుడు
ముంబై: ‘లాక్ అప్ 2’ రియాలిటీ షోకు చెందిన ప్రముఖ నటుడు రామ్ కపూర్ తన జీవితంలోని అత్యంత భావోద్వేగమైన క్షణాలను మీడియాతో పంచుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన తండ్రి తుదిశ్వాస విడిచే సమయంలో తాను ఆయన వెంటే ఉన్నానని, తండ్రి కోరిక మేరకు ఆయన అంతిమ క్షణాల్లో సహకరించానని రామ్ కపూర్ కంటతడి పెట్టుకుంటూ వెల్లడించారు. ఈ నిర్ణయం తన కుటుంబంతో ఉన్న సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన తెలిపారు.రామ్ కపూర్ తండ్రికి 63 ఏళ్ల వయసులో క్యాన్సర్ సోకగా, శస్త్రచికిత్స అసాధ్యం కావడంతో 18 సార్లు కీమోథెరపీ నిర్వహించారు. దాంతో కొంతకాలం వ్యాధి అదుపులో ఉన్నప్పటికీ, ఆయనకు 73 ఏళ్ల వయసులో క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టింది. తండ్రితో వ్యాపారంలో చేరకుండా, రామ్ కపూర్ తన సొంత దారిని ఎంచుకున్నారు. కుటుంబ వ్యాపారానికి దూరంగా ఉంటూ వినోద రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన భావించారు.కొవిడ్ మహమ్మారి సమయంలో సింగపూర్‌లో ఉన్న రామ్‌తో ఆయన తండ్రి మాట్లాడుతూ ‘నువ్వు నాకు చనిపోవడానికి సహాయం చేస్తావా?’ అని అభ్యర్థించారు. ఇకపై తీవ్ర అనారోగ్యంతో జీవించలేనని, తన చివరి క్షణాల్లో తన కొడుకు తన పక్కనే ఉండాలని ఆయన కోరుకున్నారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా వచ్చి, ఐసీయూలో తండ్రి చెయ్యి పట్టుకుని ఆయన చివరి క్షణాల్లో రామ్ తోడుగా నిలిచారు. తండ్రి అంత్యక్రియల సమయంలో ఎవరూ ఏడవకూడదని, అదే రోజు దహన సంస్కారాలు చేయాలని ఆయన కోరారు. ఒక కొడుకుగా తండ్రి కోసం తాను చేసిన గొప్ప పని అదేనని, మరణాన్ని అంత దగ్గర నుంచి చూసిన అనుభవం తన జీవిత దృక్పథాన్నే పూర్తిగా మార్చివేసిందని రామ్ కపూర్ పేర్కొన్నారు. -
మా నాన్నను బ్రతికించడం కోసం జగన్ గారు చేసిన ప్రయత్నం
-
ఆ రోజు భారతి గారు మమ్మల్ని పిలిపించినప్పుడు.. ముద్రగడ గిరిబాబు ఎమోషనల్ కామెంట్స్
-
వందే భారత్‌లో నాన్న ఫస్ట్ రైడ్... ఓ పుత్రుడి ఎమోషనల్ స్టోరీ
తమను ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాలు చేసి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల కన్నబిడ్డలు కృతజ్ఞతగా ఉండటం అనేది ఒక భావోద్వేగ అనుభూతి. అలా కన్నవారి పట్ల అమితమై ప్రేమానురాగాలు చూపించడం, సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించేలా చేయడంతోపాటు వారి చిన్న చిన్న కలల్ని గుర్తు పెట్టుకుని మరీ నెరవేర్చే పిల్లలు చాలామందే ఉన్నారు. అలా తన తండ్రిని తొలిసారి 'వందే భారత్' రైలులో తీసుకెళ్లి ఆనందింప చేసిన వీడియో ఒకటినెట్టింట విశేషంగా నిలుస్తోంది.'భుక్కడ్ ముసాఫిర్' అనే ఇన్స్టాగ్రామ్ ఐడీ ఉన్న ఒక ట్రావెలర్, ఇన్ఫ్లుయెన్సర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఆ వృద్ధుడైన తండ్రి ప్లాట్‌ఫామ్‌పై వేచి ఉండటం, రైలు ఎక్కి తన సీటులో కూర్చోవడం, రైలు కిటికీలోంచి అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ మురిసిపోవడం కనిపిస్తుంది. ఆయన ముఖంలోని నవ్వును చూసి కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషంగా కనిపించారు. ఈ సందర్భంగా కుమారుడు మాట్లాడుతూ "ఒకప్పుడు మా నాన్న రూ. 5 ఆదా చేయడం కోసం ఆటో ఎక్కకుండా ఆఫీసుకు నడిచి వెళ్లేవారు. అందుకే ఇప్పుడు నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఆయనకు సౌకర్యవంతమైన జీవితాన్ని అందించడానికి ఆ డబ్బును ఖర్చు చేస్తున్నాను" అని ఆ కుమారుడు వీడియో కింద రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Bhukkhad Musafir | Shrikant & Noopur ❤️ (@bhukkhad_musafir) ఇదీ చదవండి: రూ. 5 లక్షల వెండి పాత్ర పొరపాటున చెత్తలో.. చివరికినెటిజన్ల స్పందనఈ వీడియో చూసి నెటిజన్లు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. నిజమైన ఆనందం ఇదే... పిల్లల బాధ్యతలు నెరవేర్చడంలో తమ సంతోషాలను త్యాగం చేసిన తల్లిదండ్రులకు తిరిగి ఆ సుఖసంతోషాలను అందించడం లోనే నిజమైన గెలుపు ఉంది వ్యాఖ్యానించారు. రైలు టికెట్ ధర ఎంతో తండ్రికి తెలిస్తే తిడతారేమో అని కొందరు సరదాగా కామెంట్ చేయడం విశేషం.ఇదీ చదవండి: రెస్ట్ రూంలో కెమెరా : భారతీయ సంతతి వైద్యుడికి జైలువందే భారత్, రైల్వే రాయితీలు ఉండవా?వందే భారత్ రైళ్లలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా ఎటువంటి టికెట్ రాయితీలు ఉండవు. కరోనా సమయంలో ఇండియన్ రైల్వేస్ సీనియర్ సిటిజన్లకు ఇచ్చే సాధారణ రాయితీలను కూడా రద్దు చేసింది. అయితే, ఐఆర్సిటిసి (IRCTC)లో క్యాన్సర్, థాలసేమియా, గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు లేదా క్షయ (టిబి) వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న రోగులకు, అలాగే దివ్యాంగులకు 75శాతం వరకు టికెట్ రాయితీని అందిస్తోంది. కానీ, ఈ రాయితీలు వందే భారత్ రైళ్లకు వర్తించవు.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి -
మీకు దండం పెడుతున్న... ముద్రగడ మరణంపై బొత్స ఎమోషనల్
-
ఇచ్చిన మాట కోసం పేరునే మార్చుకున్న గొప్ప నాయకుడు ముద్రగడ పద్మనాభం
-
'అమ్ములు'కు కన్నీటి వీడ్కోలు..!
ప్రేమకు భాష ఉండదు.. బంధానికి రక్తసంబంధమే అక్కర్లేదు.. మనసుకు దగ్గరైన ప్రాణం దూరమైతే.. ఆ బాధ మనిషి దైనా, మూగజీవిదైనా ఒక్కటే. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఈ ఘటన అదేవిషయాన్ని గుర్తు చేసింది. 14ఏళ్లుగా తమ కుటుంబలో సభ్యురాలిగా, పిల్లలా, తోడుగా ఉన్న పెంపుడు శునకం ‘అమ్ములు’ అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. యజమానులు కన్నీరుమున్నీరయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. బిస్కెట్ వేసిన మమకారాణికి.. గోదావరిఖని గాం«దీనగర్‌కు చెందిన గుండేటి లక్ష్మీ–మల్లేశం దంపతులు 14 ఏళ్ల క్రితం పదిరోజుల వయసున్న కుక్కపిల్ల ఇంటి ముందు తిరుగుతుంటే.. బిస్కెట్లు వేశారు. ఈ మమకారాణికి పిల్లశునకం ఏకంగా ఇంట్లోకే వచ్చింది. అక్కున చేర్చుకున్న దంపతులు ‘అమ్ములు’ అని పేరు పెట్టారు. అప్పటినుంచి వారి కుటుంబంలో సభ్యురాలే అయింది. సంతోషం, బాధలు, పండుగల్లోనూ, ఒంటరితనంలోనూ అమ్ములు వారి వెంటే ఉండేది. వనదేవతలకు ఎత్తు బంగారం గతంలో ఒకసారి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అమ్ములు కోలుకోవాలని వనదేవతలకు మొక్కుకున్నారు. రెండుసార్లు ఎత్తు బంగారం సమర్పించారు. ఆ మొక్కు ఫలించి అమ్ములు కోలుకోవడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆరోగ్యం క్షీణించి.. తుదిశ్వాస విడిచి.. అమ్ములు వయసు మీద పడింది. నెలరోజుల క్రితం పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. లక్ష్మి–మల్లేశం దంపతులు చిన్నపిల్లను చూసుకున్నట్లు ప్రతిరోజూ అన్నం తినిపించారు. మందులు వేశారు. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రారి్థంచారు. అయినా విధి కరుణించలేదు. బుధవారం ఉదయం అమ్ములు తుదిశ్వాస విడిచింది. హిందూ సంప్రదాయంగా అంత్యక్రియలు అమ్ములు చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరు న విలపించారు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మూగజీవిపై చూపిన ప్రేమ, ఆప్యాయత, గౌరవం స్థానికులను కదిలించింది. పిల్లలు అమెరికాలో.. అమ్ములు తోడుగా.. క్యాండిల్స్ తయారు చేస్తూ జీవనం సాగిస్తున్న మల్లేశం–లక్ష్మి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరూ వివాహాల అనంతరం ఉద్యోగ రీ త్యా అమెరికాలో స్థిరపడ్డారు. పిల్లలు దూరంగా ఉండటంతో అమ్ములే తమకు ఓదార్పు, తోడు, ఆత్మీయతగా మారింది. ‘మా పిల్లలు దూరంలో ఉన్నా.. అమ్ములు మా పక్కనే ఉండేది. మా సంతోషాల్లోనూ, మా బాధల్లోనూ తోడుండేది. ఇప్పుడు ఇల్లు ఖాళీగా అనిపిస్తోంది. అమ్ములు లేనిలోటు ఎలా భర్తీ చేసుకోవాలో తెలియడం లేదు’ అని దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. కాశీలో కలుపనున్న అస్థికలు.. అమ్ములుతో తమ అనుబంధం మరణంతో ముగియదని భావిస్తున్న దంపతులు.. అస్థికలను భద్రపరుస్తామని తెలిపారు. అమ్ములు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ త్వరలో కాశీకి వెళ్లి గంగానదిలో అస్థికలను నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. ‘మా కుటుంబ సభ్యురాలిగా జీవించిన అమ్ములకు చేయాల్సిన చివరి ధర్మం అదే..’ అని దంపతులు భావోద్వేగంగా తెలిపారు. -
అతనొక బ్రాండ్.. ముద్రగడ మరణంపై మధుసూదన్ రెడ్డి ఎమోషనల్ రియాక్షన్
-
18 ఏళ్ల ఎన్ఆర్ఐ జీవితం నుంచి : మెటా టెకీ ఎమోషనల్ పోస్ట్ వైరల్
అమెరికాలో సుమారు రెండు దశాబ్దాలు గడిపిన తర్వాత ఒక టెకీ భారత దేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను చూసుకోవడం కోసం మాతృదేశానికి వచ్చానంటూ మెటా (Meta) ఇంజనీరింగ్ లీడర్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. తన 18 ఏళ్ల అమెరికా జీవితాన్ని డజనుకు పైగా సూట్‌కేసులలో సర్దేసి, బెంగళూరుకు మారిపోయినట్లు ఒక ఎయిర్పోర్ట్ ట్రాలీ ఫోటోను ఆయన షేర్ చేశారు.మెటాలో సీనియర్ ఇంజనీరింగ్ లీడర్‌గా పనిచేసిన బాలాజీ గురురాజన్, లింక్డ్ఇన్ పోస్ట్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన నిర్ణయంతో పెద్దవాళ్లైపోయిన తన కన్నవాళ్లకు దగ్గరగా ఉండటంతోపాటు, పిల్లలు తమ గ్రాండ్ పేరెంట్స్‌ను ఎక్కడో దూరం నుంచి చూస్తూ ఉండేకన్నా, ఉమ్మడి కుటుంబంలో కలిసి పెరిగే అవకాశం కల్పించాలని తాను కోరుకుంటున్నట్లు వివరించారు.18 ఏళ్ల ప్రయాణంమైక్రోసాఫ్ట్, లింక్డ్ఇన్, మెటా వంటి దిగ్గజ సంస్థలలో పనిచేసిన ఆయన, అమెరికా తనకు కెరీర్‌ను, మంచి స్నేహితులను ఇచ్చిందని చెబుతూ, అక్కడ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇపుడిక తన పుట్టిన నేల, చిన్న వయసులో చూసిన బెంగళూరు నగరంలో ఇప్పుడు పిల్లల స్కూళ్లు, ఇల్లు, నిత్య జీవితాన్ని మళ్లీ మొదటి నుండి ప్రారంభించడం ఒక సరికొత్త అనుభవమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గిందినెటిజన్ల స్పందనఈ పోస్ట్‌కు నెటిజన్ల నుండి భారీగా మద్దతు, ప్రశంసలు లభించాయి. ఒక యూజర్ స్పందిస్తూ, బెంగళూరులోని సాంకేతిక పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందని, ఇది "రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్" (ప్రతిభావంతులు తిరిగి స్వదేశానికి రావడం) కు సంకేతమని పేర్కొన్నారు.తల్లిదండ్రుల కళ్లలో కనిపించే ఆనందాన్ని డాలర్లతో కొనలేం మంచి నిర్ణయం తీసుకున్నారని కొంతమంది ఆయన నిర్ణయాన్ని అభినందించారు. అంతేకాదు గతంలోనే భారత్‌కు తిరిగి వచ్చిన పలువురు నెటిజన్లు ఆయనకు స్వాగతం పలుకుతూ, ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి కొన్ని చిట్కాలను కూడా పంచుకోవడం విశేషం.ఇదీ చదవండి: ఘనంగా పెళ్లి : రూ. కోటి నగలు, నగదుతో రాత్రికి రాత్రే వధువు జంప్ -
ఆఫీసా? రిసార్టా? రెండు నెలలకే ఇంటర్న్ కన్నీళ్లు
‘కార్పొరేట్ జీవితం అంటేనే ఒక యాంత్రికమైన నరకం.. అక్కడ స్నేహాలుండవు, కేవలం టార్గెట్లు మాత్రమే ఉంటాయి’ నేటి తరం యువతలో, ముఖ్యంగా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లోకి అడుగుపెట్టే విద్యార్థులలో ఉండే సాధారణ అభిప్రాయం ఇది. కానీ, ఒక రెండు నెలల అనుభవం ఆ ఆలోచనలను పూర్తిగా మార్చేయగలదా? అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ క్యాంపస్‌లో అడుగుపెట్టిన ఒక భారతీయ ఇంటర్న్‌కు సరిగ్గా ఇదే అనుభవం ఎదురైంది. కేవలం రెండు నెలల సమ్మర్ ఇంటర్న్‌షిప్ ముగించుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణమైన సదరు ఇంటర్న్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పంచుకున్న భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.రిసార్ట్‌ను తలపించే క్యాంపస్.. వీడలేని బంధాలుసాధారణంగా ఇంటర్న్‌షిప్ అంటే ప్రాజెక్టులు, కోడింగ్, డెడ్లైన్లతో ముగిసిపోతుందని భావిస్తారు. కానీ మైక్రోసాఫ్ట్‌లో గడిపిన కాలం తనకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిందని ఆ ఇంటర్న్ పేర్కొన్నారు. ‘మైక్రోసాఫ్ట్‌లో నా సమ్మర్ ఇంటర్న్‌షిప్ నిన్నటితో ముగిసింది. కేవలం రెండు నెలల కాలంలోనే ఒక చోటును వదిలి వెళ్లడం ఇంత కష్టంగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. నా టీమ్మేట్స్, తోటి ఇంటర్న్స్‌తో కలిసి చేసిన హంగామాను నేను ఎంతగానో మిస్ అవుతున్నాను. ఒక అందమైన రిసార్ట్‌ను తలపించే క్యాంపస్‌లో ఇంతటి అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం’ అని ఆ ఇంటర్న్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవగానే ముఖ్యంగా విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్ దీనికి కనెక్ట్ అయ్యారు. ‘చాలా రిలేటబుల్‌గా ఉంది. ఇటీవల నేను కూడా మూడు నెలల ఇంటర్న్‌షిప్ పూర్తి చేశాను, నాకూ ఇలాగే అనిపించింది’ అని ఒకరు కామెంట్ చేయగా.. మరికొందరు ‘మంచి వాతావరణం, తోడ్పాటు అందించే సహోద్యోగులు ఉంటే ఏ సంస్థ అయినా సొంత ఇల్లులాగే మారుతుంది’ అని అభిప్రాయపడ్డారు.my summer internship at microsoft ended yesterday. never thought leaving after just 2 months would hit this hard. gonna miss all the fun i had with my teammates and co-interns.so grateful to have worked with such amazing people on a campus that literally felt like a resort. i…— Ryuzaki (@ryuzaki2401) July 11, 2026కంపెనీల బ్రాండ్ వాల్యూ పెంచే సంస్కృతినేటి పోటీ ప్రపంచంలో ఐటీ కంపెనీలు కేవలం వ్యాపార లాభాలకే పరిమితం కావడం లేదు. ప్రతిభావంతులైన యువతను ఆకర్షించడానికి గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలు తమ ఆఫీస్ వాతావరణాన్ని అత్యంత ఆహ్లాదకరంగా మారుస్తున్నాయి. క్రీడలు, వినోదం, మెంటరింగ్ సిస్టమ్ (గైడెన్స్ ఇవ్వడం) వంటి వాటి ద్వారా ఉద్యోగులపై ఒత్తిడి లేకుండా చూస్తున్నాయి. ఈ మైక్రోసాఫ్ట్ ఇంటర్న్ కథనం నిరూపిస్తున్నది ఒక్కటే.. మంచి పని సంస్కృతి కేవలం ఉత్పాదకతను పెంచడమే కాదు, సంస్థ నుంచి బయటకు వచ్చే వ్యక్తులు జీవితాంతం ఆ బ్రాండ్‌కు అంబాసిడర్లుగా మారేలా బలమైన సానుకూల ముద్ర వేస్తుంది. నేటి స్టార్టప్‌లు, ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా ఈ తరహా మానవీయ పని సంస్కృతిని అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: బంగారం కొనాలా? వద్దా? -
హిట్ కొట్టేశాం నాన్న.. తండ్రిని పట్టుకుని ఏడ్చేసిన అఖిల్
-
మూడేళ్ల తర్వాత హిట్.. అఖిల్ ఫుల్ ఎమోషనల్
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ లెనిన్. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా జూలై 10న థియేటర్లలో విడుదలైంది. ఎప్పటి నుంచో హిట్ కోసం తంటాలు పడుతోన్న అఖిల్.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ నటించిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి.అందుకు తగ్గట్టుగానే లెనిన్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటోంది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన చిత్రానికి హిట్ టాక్ రావడంతో మూవీ టీమ్ సంబురాల్లో మునిగిపోయింది. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా అఖిల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి నాగార్జునను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కేక్ కట్ చేస్తుండగా నాగార్జున కాళ్లకు నమస్కరించిన అఖిల్.. ఆయనతో గట్టిగా కౌగిలించుకుని ఎమోషనలయ్యారు. ఈ వీడియోను సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ మూవీకి మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. A blockbuster on screen.A priceless moment off screen. ❤️A hug that spoke louder than words…#LENIN #BlockbusterLENINBook your tickets now 🎫 @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman @pramodactor1 @NavinNooli @artkolla… pic.twitter.com/YHgBKwEmBI— Sithara Entertainments (@SitharaEnts) July 10, 2026 -
20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి!
పుణే రియల్టర్ కేతన్ అగర్వాల్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లోనావాలా సమీపంలోని లోహగఢ్ కోట వద్ద గత నెలలో హత్యకు గురైన ఈ కేసుపై వేగంగా విచారణ, త్వరితగతిన ట్రయల్ జరిపించాలని కోరుతూ కేతన్ తండ్రి, విశాల్ అగర్వాల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, కేసుత్వరగా ముందుకు సాగేలా సహాయం చేయాలని కోరారు. కేతన్ అకాల మరణాన్ని తట్టుకోలేక, తాత గుండెపోటుతో మరణించిన తరువాత ఈ పరిణామం జరిగింది.బుధవారం రాష్ట్రపతి సెక్రటరీకి పంపిన ఒక భావోద్వేగ ఈమెయిల్లో, కేతన్ మరణం తర్వాత తమ కుటుంబం ఎదుర్కొంటున్న బాధను విశాల్ అగర్వాల్ పంచుకున్నారు. తన మనవడి మరణాన్ని తట్టుకోలేక కేవలం 20 రోజుల తర్వాత తన తండ్రి కూడా కన్నుమూయడంతో ఈ వేదనను తట్టుకోవడం తమవల్ల కావడంలేదని పేర్కొన్నట్లు ఐఏఎన్ఎస్ రిపోర్ట్ చేసింది. తానొక వ్యాపారవేత్తగానో, ప్రభావితవ్యక్తిగానో కాదు, ఎంతో బాధతో, ఆశతో ఇది రాస్తున్నాననంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక తండ్రిగా కొడుకుకు న్యాయం కోసం అర్ధిస్తున్నానంటూ వేడుకున్నారు. కేవలం 20 రోజుల్లోనే అటు కొడుకును, ఇటు తండ్రిని ఇద్దరినీ కోల్పోయి తన కుటుంబం చిన్నాభిన్నమైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.కేతన్ తాతయ్య అతడిని ఎంతగానో ప్రేమించేవారని, మనవడి మరణంతో ఆయన గుండె పగిలిపోయిందని అన్నారు. కేతన్ ఇక లేడని తెలిసి, తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, బీపీ పడిపోవడంతో గుండెపోటుతో చనిపోయారన్నారు. ఇది తమ కుటుంబానికి తీరని వేదనను మిగిల్చిందంటూ తమ మానసిక ప్రభావాన్ని,కేతన్ మరణం తర్వాత తమ జీవితాలు పూర్తిగా విషాదంగా మారిపోయాని విశాల్ అన్నారు. దారుణంగా హత్యకు గురైన కేతన్కు న్యాయం జరిగేది ఎపుడు? ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకొనేదాకా ఇదే ప్రశ్న తమమెదళ్లను తొలిచేస్తోందని పేర్కొన్నారు. తక్షణమే ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించేలా చూడాలని, దోషులుగా తేలిన వారికి చట్ట ప్రకారం కఠినమైన శిక్ష పడేలా చూడాలని విశాల్ అధికారులను కోరారు. తమ కుటుంబానికి ప్రత్యేక ట్రీట్మెంట్ అవసరంలేదు కానీ, అనవసర జాప్యం లేకుండా న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నా మన్నారు. లేదంటే తమలాంటి కుటుంబాలు బాధతో మరింత కుంగిపోతాయన్నారు. నా కొడుకును వెనక్కి తేలేం కానీ, కేతన్‌ను మళ్లీ వెనక్కి తీసుకురాలేం, కానీ దోషులు మాత్రం శిక్ష నుండి తప్పించుకోకూడదన్నారు. వారికి కఠినమైన శిక్ష పడినపుడు మాత్రమే తమకు మనశ్శాంతి దక్కడంతోపాటు, ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు తప్పవనే సందేశం సమాజంలో వెళుతుందని, దయచేసి తన కొడుకు కేసును కూడా మరో కేసులా మరుగున పడవేయవద్దని మార్చొద్దని, దీని వెనుక సర్వస్వం కోల్పోయిన ఒక కుటుంబం ఉంది అంటూ ఆవేదనతో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గిందికాగా పుణె సమీపంలోని లోహగఢ్ కోట వద్ద జూన్ 18న కేతన్ అగర్వాల్ (26) ఒక లోయలో పడి మరణించాడు. మొదట ఇది ట్రెక్కింగ్ ప్రమాదంగా భావించినప్పటికీ, విచారణలో ఇది హత్య కేసుగా మారింది. కేతన్ నిశ్చితార్థం చేసుకున్న సియా గోయల్, ఆమె, ప్రియుడిగా భావిస్తున్న చేతన్ బాబూలాల్ చౌదరి కలిసి ఈ హత్యకు ప్లాన్ చేశారని, అతడిని లోయలోకి తోసేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వీరిద్దరినీ అరెస్ట్ చేసి, హత్య , నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేశారు.ఇదీ చదవండి: 36 ఏళ్లలో 300 ఫైవ్ స్టార్ హోటళ్లలో జల్సాలు పైసా బిల్ కట్టలేదు : కట్ చేస్తే -
MISS YOU NANA.. YS జగన్ ఎమోషనల్
-
'తొలిసారి ఆ మాటలు విన్నా'.. రావు బహదూర్ హీరోయిన్ ఎమోషనల్
సత్యదేవ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ రావు బహదూర్. ఈ నెల 3న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జంటగా దీపా థామస్ హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీకి కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సక్కెస్ టాక్ రావడంతో మేకర్స్ ఫుల్ హ్యాపీ అయిపోయారు. హైదరాబాద్‌లో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు హీరోయిన్ దీపా థామస్ కూడా హాజరైంది. ఈ సందర్భంగా హీరోయిన్ భావోద్వేగానికి గురైంది. ఈ సినిమా చూసిన మా నాన్న తనను పొగిడారంటూ ఎమోషనలైంది. నా కెరీర్లో తొలిసారి అలాంటి మాటలు విన్నానని ఏడ్చేసింది. నేను కూడా ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూశా. వారి రెస్పాన్స్ చూసి ఎమోషనలయ్యా అంటూ రావు బహదూర్ సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతూ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది.దీపా థామస్ మాట్లాడుతూ..' నా పేరేంట్స్‌కు తెలుగు రాదు. వాళ్లు ఈ సినిమాని సబ్‌టైటిల్స్‌తో చూశారు. ఈ సినిమా చూసి మా నాన్న చెప్పారు. ఇంకా బాగా చేయాలని తొలిసారి నాన్న నాతో అన్నారు. ఇదే నా కెరీర్లో అత్యంత గొప్ప ప్రశంస. మన వీక్ పాయింట్ ఎవరికీ తెలియొద్దని మహాగారు చెప్పారు. అందుకే ఈరోజు నేను ఏడావలనుకోవడం లేదు' అంటూ ఫుల్ ఎమోషనలైంది. స్టేజీపై మాట్లాడుతూ దీపా థామస్ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.దీపా థామస్ కెరీర్..కేరళకు చెందిన దీపా థామస్ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. రావు బహదూర్‌తో గ్రాండ్ సక్సెస్ కొట్టేసింది. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మొదట మిస్ మిలీనియల్ అందాల పోటీలో టాప్ 10లో నిలిచింది. ఆ తర్వాత మిస్ సౌత్ ఇండియా పోటీలో సెకండ్ రన్నరప్ టైటిల్ గెలుచుకుంది. అలా రాక్ పేపర్ సీజర్స్ అనే వెబ్‌సిరీస్‌తో సినీ కెరీర్ ప్రారంభించింది. వైరస్ అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. 'హోమ్' సినిమాతో ఫేమస్ అయింది. మలయాళంలో పలు సినిమాలు చేసిన దీపా థామస్ తెలుగులో రావు బహదూర్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. -
ఇరాన్లో భావోద్వేగ దృశ్యాలు.. ఖమేనీకి కన్నీటి నివాళి
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తుదివీడ్కోలు కార్యక్రమానికి దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గ్రాండ్ మోసల్లా ప్రాంగణం కన్నీళ్లు, నినాదాలు, సంతాప సందేశాలతో శోకసంద్రంగా మారింది. ప్రార్థన మందిరం వద్ద నిశ్శబ్దం అలుముకోగా.. ఖమేనీ పార్థివదేహం రాకతో ఆ ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి.ఖమేనీ భౌతికకాయాన్ని జాతీయ జెండాతో కప్పి ప్రాంగణానికి తీసుకురాగా, ఆయన తలపై ఉండే నల్ల టర్బన్‌ను కూడా సంప్రదాయంగా ఉంచారు. కుటుంబ సభ్యుల పార్థివదేహాలను ప్రత్యేక పేటికల్లో ఆయన పక్కపక్కనే ఉంచారు. ఈ క్రమంలో అత్యంత భావోద్వేగ దృశ్యంగా ఆయన 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మది గోల్పాయెగాని చిన్న శవపేటికను ప్రత్యేకంగా ప్రదర్శించారు. జాతీయ జెండాతో కప్పిన ఆ చిన్న పేటిక పక్కనే ఆమె ఫోటోను ఉంచడంతో అక్కడున్నవారు తీవ్రంగా భావోద్వేగానికి లోనయ్యారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సహా పలువురు ఉన్నతాధికారులు భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక కన్నీరు పెట్టుకున్నారు.Un cadre du cercueil de la martyre Zahra Mohammadi Golpayegani, #petite-fille du Guide suprême martyr de la Révolution islamique, à la Mosalla de #Téhéran.#بدرقه_آقای_شهید_ایران#باید_برخاست#NousDevonsNousSoulever#MartyrKhamenei pic.twitter.com/8JemW4zW4A— Iran en France (@IRANinFRANCE) July 3, 2026ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అప్పటి నుంచి భద్రపరచిన భౌతికకాయాన్ని ఇప్పుడు ఆరు రోజుల పాటు జరిగే సంతాప కార్యక్రమాల కోసం ప్రజల సందర్శనార్థం ఉంచారు.టెహ్రాన్‌లోని గ్రాండ్ మోసల్లా వద్దకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. గేట్లు తెరవగానే భారీ జనసంద్రం లోపలికి ప్రవేశించింది. అమెరికాకు వ్యతిరేక నినాదాలతో పాటు ప్రతీకారాన్ని సూచించే ఎరుపు రంగు జెండాలు ప్రదర్శించారు. మరోవైపు.. ‘‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను హతమార్చాలని, అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని’’ వేలమంది నినాదాలు చేస్తూ.. ఫ్లకార్డులు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది.ఈ సంతాప కార్యక్రమానికి దాదాపు 100 దేశాల నుంచి ప్రతినిధులు హాజరైనట్లు సమాచారం. భారత్ సహా రష్యా, పాకిస్థాన్, టర్కీ తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం రెండు కోట్ల మంది వివిధ దశల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని అంచనా వేశారు. అధికారులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు.ఖమేనీ భౌతికకాయం టెహ్రాన్‌లో సోమవారం వరకు ఉంచి, అనంతరం ఖోమ్‌కు తరలించనున్నారు. మంగళవారం కర్బలా, నజాఫ్ వంటి పవిత్ర నగరాల మీదుగా ప్రయాణించి, చివరగా గురువారం ఆయన స్వస్థలమైన మష్హద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఆరు రోజుల సంతాప యాత్రతో ఇరాన్ అంతటా శోక వాతావరణం కొనసాగుతోంది. Mohammad Bagher Ghalibaf cries during the farewell ceremony of Ali Khamenei. pic.twitter.com/i4DC5OgM2y— Raz Zimmt (@RZimmt) July 3, 2026 -
అయ్యా నా కొడుకును చంపేశారయ్యా... జగన్ ముందు కన్నీరు పెట్టుకున్న క్రాంతి కుమార్ తల్లి
-
జబర్దస్త్ ఫైమా పెళ్లి.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో..!
జబర్దస్త్ కామెడీ షో క్రేజ్ తెచ్చుకున్న ఫైమా ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. తొమ్మిదేళ్ల ప్రేమ తర్వాత చివరికీ మూడుముళ్లతో ఒక్కటయ్యామని ఎమోషనలైంది. తన ప్రియుడు ప్రవీణ్‌తో ఏడడుగులు వేసింది. సంప్రదాయంగా జరిగిన వీరిద్దరి పెళ్లి వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెళ్లి వేడుకలో జబర్దస్త్ కమెడియన్స్ సందడి చేశారు. ఈ పెళ్లి జరిగి అప్పుడే వారం రోజులు పూర్తయింది. తాజాగా ఫైమా తన పెళ్లిలోని అరుదైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒకటే సందర్భం.. ఇద్దరు తల్లుల వేదన అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. మెట్టినింటికి వెళ్తున్న కూతురుని చూసి కన్నీళ్లు ఆపుకోలేక ఫైమా తల్లి కన్నీటి పర్యంతమైంది. తన కుమార్తెని హత్తుకుని బోరున ఏడుస్తూ కనిపించింది. ఫుల్ ఎమోషనల్‌గా ఉన్న వీడియోను ఫైమా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అమ్మ ప్రేమకు ఏది సాటి రాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by FAIMA (@faima_patas) -
కూతురి పెళ్లి.. కన్నీళ్లు పెట్టుకున్న ఖుష్బు
కోలీవుడ్ నటి ఖుష్బు సుందర్ కుమార్తె అవంతిక పెళ్లి ఇటీవలే గ్రాండ్‌గా జరిగింది. గోవాలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీతారలు సందడి చేశారు. చిరంజీవితో పాటు వెంకటేశ్, నాగార్జున, త్రిష, తమన్నా, రాధికా , సుహాసిని, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ ఈ పెళ్లికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన కూతురి మెడలో వరుడు తాళి కడుతున్న సమయంలో ఖుష్బు సుందర్ ఫుల్ ఎమోషనల్‌గా కనిపించింది. ఈ వీడియోలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై ఏడ్చేసింది. వారి చిన్న కుమార్తె ఆనందిత కూడా అక్క పెళ్లిని చూసి ఎమోషనలైంది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. ఖుష్బు- సుందర్‌ల పెద్ద కూతురు అవంతిక సుందర్.. శ్రవణ్ శ్రీనివాసన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుక జూన్ 25న గ్రాండ్‌గా జరిగింది. View this post on Instagram A post shared by Spize Events (@spizeweddingsandevents) -
రెండేళ్ల నిరీక్షణ.. సీఎం హామీతో తల్లి కన్నీళ్లు
యువ డాక్టర్ హత్యాచార కేసు దేశాన్ని కుదిపేసింది. రెండేళ్లు గడిచినా.. బాధితురాలి కుటుంబం న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో న్యాయం జరుగుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని విన్న బాధితురాలి తల్లి భావోద్వేగానికి గురయ్యారు. కళ్లలో నీళ్లు తిరిగాయి. “అధికారం కోసం కాదు.. నా కూతురికి న్యాయం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సభలో హృదయాలను కదిలించాయి.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చ సందర్భంగా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి Suvendu Adhikari మాట్లాడుతూ.. సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ (RG Kar) మెడికల్ కాలేజ్ వైద్యురాలి కేసు గురించి మాట్లాడారు..“ఆర్జీ కర్ కేసులో తప్పకుండా న్యాయం జరుగుతుంది. బెంగాల్ ప్రజలు అభయకు(బాధితురాలికి పెట్టిన పేరు) న్యాయం జరగాలని ఓటు వేశారు” అని సీఎం ప్రకటించారు.ఈ మాటలు విన్న వెంటనే బాధితురాలి తల్లి.. పానిహటి ఎమ్మెల్యే రత్నా దేవనాథ్ (Ratna Debnath) భావోద్వేగానికి గురయ్యారు. సభలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సమయంలో తోటి ఎమ్మెల్యేలు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.A deeply emotional scene in the Assembly. As Ratna Debnath broke down, CM @SuvenduWB Da’s message was clear: Bengal will do justice to victims of RG KAR & punish my culprits. pic.twitter.com/7L62uLGYLQ— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) June 23, 2026నా కూతురి కోసమే.. ఆర్జీ కర్ కేసులో న్యాయం కోసం వీధుల నుంచి న్యాయస్థానాల వరకు పోరాడిన రత్నా దేవనాథ్.. చివరకు రాజకీయాలనే మరో వేదికగా ఎంచుకున్నారు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పానిహటి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. మహిళల భద్రత, తన కుమార్తెకు న్యాయం అనే అంశాలనే ప్రధాన అజెండాగా తీసుకుని ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి తీర్థంకర్ ఘోష్‌పై 28,836 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రత్నా దేవనాథ్‌కు 87,977 ఓట్లు రాగా, ప్రత్యర్థి అభ్యర్థికి 59,141 ఓట్లు లభించాయి. రాజకీయాల్లోకి రావడంపై ఆమె అప్పట్లో స్పందిస్తూ.. “వ్యవస్థలో ఉండి పోరాడితేనే నా కూతురికి న్యాయం సాధించగలనని భావించాను” అని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి న్యాయం జరుగుతుందని ప్రకటించగానే, రెండేళ్లుగా తన గుండెల్లో దాచుకున్న బాధ ఒక్కసారిగా కన్నీటి రూపంలో బయటపడింది.ఆనాడు ఘోరంగా..2024 ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్& హాస్పిటల్లో.. విధుల్లో ఉన్న 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్ మృతదేహం ఆసుపత్రి ప్రాంగణంలో లభించింది. దర్యాప్తులో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైద్య వర్గాల్లో, మహిళా సంఘాల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. జస్టిస్ ఫర్ అభయ పేరిట వైద్య సిబ్బంది అంతా ఉద్యమంలో పాల్గొన్నారు. బాధితురాలి అసలు పేరును వెల్లడించకుండా నిరసనకారులు ఆమెను ‘అభయ’ (నిర్భయ, భయంలేని) అనే ప్రతీకాత్మక పేరుతో సంబోధించారు.కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది?ఈ కేసులో కోల్‌కతా పోలీసులకు చెందిన సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడిగా దోషిగా తేలాడు. అతడికి జీవిత ఖైదు విధించారు. అయితే ఈ ఘటన వెనుక మరింత పెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తులు ఇందులో భాగమయ్యారని, అప్పటి మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో నిజాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. బెంగాల్ పోలీసులు విఫలమయ్యారన్న విమర్శల నేపథ్యంలో.. కేసును సీబీఐకి అప్పగించారు. అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగుతూనే వస్తోంది.ముగ్గురు ఐపీఎస్‌లపై వేటుతాజాగా ఆర్జీకర్ కేసు స్టేటస్‌ను సీఎం సువేందు అధికారి అసెంబ్లీలో తెలియజేశారు. కేసు దర్యాప్తులో లోపాల కారణంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే ఘటన సమయంలో ఆసుపత్రి ప్రిన్సిపాల్‌గా ఉన్న సందీప్ ఘోష్(Sandip Ghosh) ను కూడా తొలగించినట్లు చెప్పారు. “ఈ కేసులో ఏదీ దాచిపెట్టం. పూర్తి నిజం బయటకు తీసుకొస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు.ఉపేక్షించేది లేదుఆర్జీ కర్ కేసుతో పాటు హన్స్‌ఖాలి, కామ్దుని, కస్బా లా కాలేజ్, రాంపూర్హాట్ వంటి పలు అత్యాచార, మహిళలపై దాడుల కేసులను ప్రస్తావించిన సీఎం.. తమ ప్రభుత్వం మహిళలపై నేరాల విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తోందని ప్రకటించారు. -
నాన్న నేర్పిన పాఠాలే నా బలం.. ఫాదర్స్ డే సందర్భంగా YS జగన్ ట్వీట్..
-
రాజకీయాల కోసం కాదు ఆ తల్లి కన్నీరుని చూసి గుండెమండి.. అంబటి రాంబాబు ఎమోషనల్
-
నీ కొడుకు చనిపోయాడు, ఆ రోజే చెప్పాడు ఇలా జరుగుతుంది అని కృష్ణ తల్లి
-
విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?
కలకాలం కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు విడిపోతున్న కేసులు ఎక్కువ అవుతున్నాయి. కేవలం స్వల్పవిభేదాలకే కోర్టుకెక్కుతున్నారు. చట్టబద్ధంగా విడాకులు తీసుకుంటున్నారు. కానీ ఈ విడాకులు అనేది కేవలం తల్లిదండ్రులుగా వారికే కాదు.. ఇరు కుటుంబాలకు, ముఖ్యంగా పిల్లలపై శాశ్వత ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రేమాభిమానాలకు, భావోద్వేగ బంధాలకు భంగం కలిగిస్తాయి. ఈ క్రమంలో ఒక విడాకుల స్టోరీ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మనస్పర్దలతో భర్తపై వరకట్న వేధింపులు కేసు పెట్టింది శిఖా సింగ్. ఆమెకు 2020లో సౌరభ్‌తో వివాహం జరిగింది. ఆమె తన భర్తతో గొడవపడి, ఆ తర్వాత అతనిపై కట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ తర్వాత విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ కేసు దాదాపు ఐదేళ్లపాటు కొనసాగింది. ఈ సమయంలో కుమార్తెకు అండగా నిలిచి ఆమె తండ్రి న్యాయపరమైన ఖర్చుల కోసం ఉన్నదంతా ఖర్చు చేసేశాడు. అటు కుమార్తె భవిష్యత్తు, ఇటు ఆర్థిక ఇబ్బందులు ఆ తండ్రిని మరింత ఒత్తిడిలోకి నెట్టాయి. దీంతో ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా, ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. మామగారి అనారోగ్యం గురించి తెలుకున్న శిఖా భర్త మెరుగైన వైద్యం కోసం అతడిని ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, ఆ ఖర్చులన్నింటినీ స్వయంగా భరించాడు. ఎంతో సపోర్ట్‌గా నిలిచాడు. ఇక్కడే అల్లుడు.. కన్న కొడుకులా ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. దీంతో శిఖా మనసులో భర్త మీదున్న ద్వేషం పోయింది. మళ్లీ ప్రేమాభిమానాలు చిగురించాయి. ఇంతలో విడాకుల కేసు విచారణకు వచ్చింది. విడాకులు మంజూరయ్యాయి. తాను కష్టకాలంలో ఉన్నపుడు సౌరభ్ చూపిన ప్రేమ, మానవత్వాన్ని చూసి శిఖా చలించిపోయింది. అంతే విడాకుల పత్రాలను చింపేసి భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లతోనే భర్తను ఆలింగనం చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట పలువుర్ని ఆకట్టుకుంటున్నాయి. Shikha Singh had a dispute with her husband and filed a false dowry case against him, demanding a divorce.The girl's father had exhausted all his money fighting the case for five years. When she suffered a heart attack, she had to be admitted to a government hospital due to… https://t.co/HAMEhtu6Mx— Sainidan. Ratnu. Ex. Adm.Judicial Officer (@Sainidan1) June 12, 2026 -
ఆ తల్లి బాధను చూసి తట్టుకోలేక ముర్ము ఏం చేసిందో చూడండి
-
సీఎం పదవి మళ్లీ మిస్: డీసీఎం
నాకు గతంలో 3 సార్లు సీఎం పదవి తప్పిపోయింది అని కొత్త డిప్యూటీ సీఎం పరమేశ్వర్ వాపోయారు. తుమకూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కావాలనే తన చిరకాల కోరిక ఇంకా అలాగే ఉందని ఉద్వేగానికి గురయ్యారు. 2013 ఎన్నికల్లో పార్టీ గెలిచినా, తాను ఓడిపోవడం వల్ల ముఖ్యమంత్రి పదవి తప్పిపోయిందని, ఆనాడు తాను గెలిచి ఉంటే సిద్ధరామయ్య సీఎం అయ్యేవారు కాదని తెలిపారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 స్థానాల్లో గెలుపొందినా మైత్రి సర్కార్ కారణంగా హెచ్డీ కుమారస్వామి సీఎం అయ్యారన్నారు. ఈసారి కూడా సీఎం పదవి తనకు రావాల్సి ఉన్నా, వివిధ రాజకీయ కారణాల వల్ల సాధ్యపడలేదని అన్నారు. ఇటీవల ఢిల్లీలో సీఎం పదవి ఇవ్వకపోతే వెంటనే చెప్పేయాలని, తనకు అవతల చాలా పనులు ఉన్నాయని హైకమాండ్‌కు చెప్పేశానన్నారు. -కర్ణాటక -
విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై వైఎస్ జగన్ ఎమోషనల్
-
Liveలో తల్లి కన్నీళ్ళు తుడిచిన కొడుకు ఆత్మ!
-
‘నాన్నా.. నీ కల నిజం చేస్తా’.. రాహుల్ భావోద్వేగ ట్వీట్!
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన తండ్రికి అత్యంత భావోద్వేగ భరిత నివాళులర్పించారు. గురువారం (మే 21, 2026) నాడు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా తన చిన్ననాటి అరుదైన ఫోటోను పంచుకుంటూ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా రాహుల్ ప్రతిజ్ఞ చేశారు.వీర్ భూమి వద్ద కుటుంబ సభ్యుల నివాళులురాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని ఆయన స్మారక స్థలం ‘వీర్ భూమి’ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పిల్లలు మిరాయా, రైహాన్ వాద్రాలతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అశోక్ గెహ్లాట్, పి. చిదంబరం, భూపిందర్ సింగ్ హుడా తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ‘ఎక్స్’ ద్వారా మాజీ ప్రధానికి నివాళులు అర్పించారు. पापा, आपने जिस कुशल, समृद्ध और मजबूत भारत का सपना देखा था, उसे साकार करने की जिम्मेदारी मैं पूरी करूंगा।आपकी सीख, आपके संस्कार और आपकी यादें हमेशा मेरे साथ रहेंगी। pic.twitter.com/uToSqMGdY3— Rahul Gandhi (@RahulGandhi) May 21, 2026నాన్న నేర్పిన సంస్కారమే నా ఊపిరి: రాహుల్తండ్రితో కలిసి ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ రాహుల్ గాంధీ హిందీలో ఒక హృదయపూర్వక సందేశాన్ని రాశారు. ‘నాన్నా.. మీరు కలలు గన్న నైపుణ్యం, సంపన్నతతో కూడిన బలమైన భారతదేశాన్ని నిర్మించే బాధ్యతను నేను పూర్తిగా భుజానికెత్తుకుంటాను. మీరు నేర్పిన పాఠాలు, మీ సంస్కారం, మీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి’ అని రాహుల్ పేర్కొన్నారు. ఈ పోస్ట్ తండ్రీకొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెబుతూ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. నవ భారత నిర్మాతకు ప్రముఖుల ప్రశంసలుకాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే రాజీవ్ గాంధీని ‘భారతదేశ అద్భుత పుత్రుడు’గా అభివర్ణించారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం, పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, దేశంలో టెలికాం, సమాచార సాంకేతిక విప్లవానికి పునాది వేయడం వంటి సంస్కరణలను ఆయన గుర్తుచేశారు. సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఆ కాలంలోనే 21వ శతాబ్దం గురించి మాట్లాడిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఇందిరా గాంధీ హత్యానంతరం 1984లో 40 ఏళ్ల వయసులో దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ, మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. -
గీ తల్లి ప్రేమ చూస్తే..దుఃఖం ఆగదు
-
బోరున ఏడ్చిన హీరో జయం రవి
-
పార్టీ కోసం కష్టబడ్డ మాలాంటి వాళ్ళను 2 ఆఫీస్ గేటు దగ్గరకు కూడా రానివ్వడం లేదు
-
ఫ్యాన్స్ కేరింతలు.. ఎమోషనల్ అయిన విజయ్
-
ప్రెస్ మీట్ మధ్యలో ఏడుస్తూ వెళ్లిపోయిన వర్మ...
-
విశ్వాసానికి మరణం లేదు: కన్నీరు పెట్టిస్తున్న శునకం!
మలప్పురం: మనిషికి, మూగజీవికి మధ్య ఉండే బంధం కేవలం అన్నం పెట్టే దగ్గరే ఆగిపోలేదు.. అది రెండు ఆత్మల అనుసంధానమని కేరళలోని మలప్పురం సాక్షిగా మరోసారి రుజువైంది. ఎడవన్న ప్రాంతానికి చెందిన అమీనా అనే వృద్ధురాలు, తన ఇంటి ముందుకు వచ్చే ఒక వీధి కుక్కకు రోజూ ప్రేమతో అన్నం పెట్టేది. ఈ నేపధ్యంలో ఆ మూగజీవికి ఆమె ప్రాణప్రదమైన స్నేహితురాలిగా మారిపోయింది. అమీనా చూపిన ఆదరణను ఆ మూగ జీవి గుండెల్లో పదిలంగా దాచుకుంది.ఒక రోజు అమీనా తన ఇంటి బయట అనారోగ్యంతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయినప్పుడు ఆ మూగజీవి విలవిల్లాడిపోయింది. తన ప్రాణదాత ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే తట్టుకోలేక, ఆ వీధి కుక్క ఆపకుండా అరుస్తూ, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించింది. దాని అరుపులు విని, స్థానికులు స్పందించే లోపే, అమీనా ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అయితే ఆ మూగ జీవి తనను ఆదుకున్న యజమాని ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది.అమీనా అంతిమ యాత్ర మొదలైనప్పుడు, ఆ కుక్క కూడా అందరితో కలిసి మౌనంగా అడుగులు వేసింది. మసీదు శ్మశానవాటిక వరకు ఆ భౌతికకాయాన్ని అనుసరిస్తూ వెళ్లి, అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండిపోయింది. స్థానికులు చెబుతున్న ప్రకారం.. ఆమె మరణానికి కొన్ని రోజుల ముందు నుంచే ఆ కుక్క శ్మశానవాటిక పరిసరాల్లో తచ్చాడుతూ కనిపించింది. బహుశా ఆ మూగజీవికి అమీనా దూరం కాబోతోందనే ముందస్తు సంకేతం అందిందేమోనని పలువురు కంటతడి పెట్టుకున్నారు.అంత్యక్రియలు ముగిసి రోజులు గడుస్తున్నా, ఆ శునకం తన యజమానిని మరువలేకపోతోంది. అమీనా కుటుంబ సభ్యులు ఎప్పుడు సమాధిని సందర్శించడానికి వచ్చినా, ఆ కుక్క అక్కడే ప్రత్యక్షమవుతోంది. ఎటువంటి అలికిడి చేయకుండా, ఆమె సమాధి పక్కనే గంటల తరబడి నిశ్శబ్దంగా కూర్చుని నిరీక్షిస్తోంది. తన ఆకలి తీర్చిన మనిషి తిరిగి రాదని తెలిసినా, ఆ సమాధి వద్ద అది చూపుతున్న స్వచ్ఛమైన ప్రేమ.. అందరికీ ఒక గొప్ప పాఠంలా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: ఈసీకి మహువా మోయిత్రా షాక్: బైక్ వద్దన్నారని.. -
ఈవెంట్లో పాయల్ రాజ్‌పుత్ కన్నీటి పర్యంతం.. వీడియో వైరల్
మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు పంజాబీలో చాలా సినిమాలు చేయడంతో పాటు హిందీ సీరియళ్లలో నటించారు. ఇటీవలే పంజాబీ ఫిల్మ్ ఖుష్ కబరీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది.తాజాగా పాయల్ రాజ్‌పుత్ ఫస్ట్ టైమ్(01-01-01) మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైంది. ఈ సినిమాతో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి హేమంత్ ఇప్పనపల్లి దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మూవీ ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు.పాయల్ కన్నీటి పర్యంతం..ఈ ఈవెంట్‌కు పాయల్ రాజ్‌పుత్ సినీ కెరీర్, ఆరోగ్య సమస్యల గురించి ప్రశ్నించారు. దీనికి పాయల్ స్పందించింది. తన అనారోగ్యంతో జైపూర్‌లో పది రోజులు చికిత్స తీసుకున్నానని వెల్లడించింది. ఆ సమయంలో మా ఫాదర్‌కు క్యాన్సర్ సోకిందని తెలిపింది. నా లైఫ్‌లో రియల్ హీరో మా నాన్నే అంటూ ఎమోషనలైంది. తన తండ్రిని తలచుకుని వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది. నా సినిమాలు చూడాలని నాన్న ఎప్పుడు ఆసక్తిగా ఎదురు చూసేవాడని తెలిపింది. నా చిత్రాలకు బిగ్గెస్ట్ క్రిటిక్ ఆయనేనని పాయల్ వెల్లడించింది. తన తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని వేదికపై బోరున ఏడ్చేసింది. దీంతో అక్కడి నుంచి వెంటనే లేచి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారంది. కాగా.. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్ పుత్ గతేడాది జూలై 28న క్యాన్సర్‌తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. Actress Payal Rajput gets emotional while answering and walks away pic.twitter.com/ysuvKFdaxZ— idlebrain.com (@idlebraindotcom) April 28, 2026 -
కావాలనే నా భర్తని.. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి భార్య ఎమోషనల్
-
రాజా శివాజీ ట్రైలర్ రిలీజ్.. జెనీలియా దంపతుల కన్నీళ్లు..!
బొమ్మరిల్లు మూవీతో టాలీవుడ్ ప్రియుల మనసు దోచుకున్న బ్యూటీ జెనీలియా. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ అక్కడే సెటిలైపోయింది. బాలీవుడ్ రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం ముంబయిలోనే ఉన్న జెనీలియా.. గతేడాది సితారే జమీన్ పర్, జూనియర్ చిత్రాల్లో మెరిసింది.జెనీలియా సంగతి పక్కన పెడితే ఆమె భర్త రితేశ్ దేశ్‌ముఖ్ చారిత్రక మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాజా శివాజీ పేరుతో వస్తోన్న చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను ముంబయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా రితేశ్ దేశ్ముఖ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా కోసం తాను పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాకుండా రితేశ్ తన తండ్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ను గుర్తుచేసుకున్నారు. ఇది చూసి పక్కనే ఉన్న జెనీలియా సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. వేదికపైనే చిన్న పిల్లలా ఏడ్చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా కన్నీళ్లు..చాలా రోజుల నిరీక్షణ తర్వాత 'రాజా శివాజీ' ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సందర్భంగా తన కల సాకారం చేసుకోవడంలో సాయపడిన చిత్ర బృందానికి రితేశ్ ధన్యవాదాలు తెలిపారు. వేదికపై రితేశ్ ఎమోషనల్ కావడంతో.. జెనీలియా దేశ్‌ముఖ్ భావోద్వేగానికి గురైంది. ఈ మాటలు విన్న సంజయ్ దత్ సైతం ఎమోషనల్‌గా కనిపించారు. ఈ కథను తీసుకురావడంలో తనకు మద్దతుగా నిలిచిన జెనీలియాకు సైతం రితేశ్ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమానికి సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్, మహేష్ మంజ్రేకర్, భాగ్యశ్రీ లాంటి స్టార్స్ హాజరయ్యారు. వీరంతా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. 'రాజా శివాజీ' చిత్రంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటించారు, ఆయన జీవ మహాల అనే పాత్రను పోషించారు. ఈ మూవీలో సచిన్ ఖేడేకర్, ఫర్దీన్ ఖాన్, జితేంద్ర జోషి, అమోల్ గుప్తే కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా మరాఠీ, హిందీ భాషల్లో ఓకేసారి తెరకెక్కించారు. ఈ హిస్టారికల్ మూవీ మే 1, 2026న థియేటర్లలో విడుదల కానుంది. #RiteishDeshmukh and #GeneliaDeshmukh share a heartfelt moment during a press interaction 🥺❤️#pinkvilla pic.twitter.com/Ixsxjc4p1m— Pinkvilla (@pinkvilla) April 20, 2026 -
ఆశా భోస్లే మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
బొత్స కంటతడిపై వెంకట్ రెడ్డి రియాక్షన్
-
భాష లేని బంధం.. బావురుమన్న వానరం!
దొడ్డబళ్లాపురం: కర్ణాటకలోని చెన్నపట్టణ తాలూకా బీవీహళ్లి నివాసి పార్వతమ్మ చాలా కాలంగా ఓ కోతికి రోజూ అన్నం పెట్టేది. ఆమె మంగళవారం మరణించగా కుటుంబీకులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. పార్వతమ్మపై అవ్యాజ ప్రేమ పెంచుకున్న ఆ వానరం యజమాని మృతదేహాన్ని పట్టుకుని మూగరోదన చేసింది. అందరినీ కదిలించిన ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.A touching final goodbye in Rayara Doddi, Channapatna near Bengaluru: A monkey hugs the body of an 85-year-old woman who regularly fed them, as if saying farewell. ❤️🥹pic.twitter.com/GN2GOWZsn7— Ghar Ke Kalesh (@gharkekalesh) April 1, 2026 -
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మృతి.. జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మార్స్ మృతి పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైంది. అతనితో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించింది. అతనితో ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతని మరణం పట్ల పలువురు బాలీవుడ్ సినీతారలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ రాస్తూ..'సినిమా సెట్లో బిజీగా ఉన్నప్పటికీ ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్లం. వానిటీ వ్యాన్‌లో ప్రవేశించిన ప్రతిసారీ కేవలం 20 నిమిషాలు మాత్రమే టైమ్ ఉందని ఆటపట్టించేదాన్ని. నీతో కలిసి పనిచేయడం ఆనందంగా అనిపించేది. నీతో కలిసి పనిచేసిన క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి. ఇక నుంచి నేను ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతాను. గత రెండు సంవత్సరాలుగా నా సృజనాత్మక ప్రయాణం ప్రారంభం నుంచి చివరి వరకు నీ ముఖాన్ని చూడటం నా జీవితంలో గుర్తుండిపోయే క్షణాల్లో ఒకటి. లవ్ యూ.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా…' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.అసలు మార్స్ పెడ్రోజో ఎవరు?మార్స్ పెడ్రోజో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక మంది స్టార్స్‌తో కలిసి పనిచేశారు. ఫిల్మ్ షూటింగ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్‌తో గుర్తింపు పొందారు. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలోని సృజనాత్మక నిపుణులతో కలిసి పనిచేశాడు, అతని నైపుణ్యాలు, సెట్లో తన వర్క్‌తో మరింత ఫేమస్ అయ్యాడు. అతని మరణ వార్త విన్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు పెడ్రోజోను గుర్తుచేసుకున్నారు. వరుణ్ ధావన్, నోరా ఫతేహి లాంటి స్టార్స్ పరిశ్రమకు చేసిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
ముక్కలైనా జీవితాన్ని మళ్లీ నిర్మించుకున్నా.. టాలీవుడ్ నటి ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ అభిమానులను అలరించిన నటీమణుల్లో హంసానందిని ఒకరు. మహారాష్ట్రలోని పుణెలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. 2004లో 'ఒక్కటవుదాం' అనే తెలుగు సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత అనుమానాస్పదం, అధినేత, ప్రవరాఖ్యుడు, ఈగ తదితర చిత్రాల్లో నటించింది. 'మిర్చి'లో స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత హంస నందిని.. భాయ్, రామయ్య వస్తావయ్యా, అత్తారింటికి దారేది, లెజెండ్, లౌక్యం, బెంగాల్ టైగర్, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు, జై లవకుశ చిత్రాల్లోని ప్రత్యేక గీతాలతో అలరించింది. 2018లో చివరగా గోపీచంద్ 'పంతం'లో కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది.తాజాగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన జీవితం ముక్కలైనా.. మళ్లీ నిర్మించుకున్నానని తెలిపింది. క్యాన్సర్‌తో పోరాడి తన జీవితాన్ని కొత్తగా నిర్మించుకున్న ప్రయాణం గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. తన లైఫ్‌లో ఎదుర్కొన్న అనుభవాలను తలచుకుని ఎమోషనలైంది.క్యాన్సర్ బారిన పడి..అయితే హంస నందిని సినిమాల్లో కనిపించకపోవడంతో అందరూ ఆమె గురించి మర్చిపోయారు. ఆ తర్వాత 2021 చివర్లో ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. తాను క్యాన్సర్ బారిన పడ్డాడని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడింది. View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) -
తన లవ్‌తో అమ్మ..అపుడు ఎంత ఏడ్చానో నాకే తెలియదు!
కనిపెంచిన బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడం,పెళ్లిళ్లు చేయడం చాలా కామన్. అదే సమయంలో ఒంటరి తల్లితండ్రుల కోసం ఆలోచించడం, వారికి మళ్లీ ప్రేమను పరిచయం చేయడం పెళ్లి చేయడం లాంటి ఘటనలు కూడా చూశాం.తల్లిగానీ, తండ్రి గానీ మళ్ళీ ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం అనేది ఏ బిడ్డకైనా చాలా అరుదైన, భావోద్వేగంతో కూడిన క్షణం. అలాంటి హృదయాన్ని హత్తుకునే వేడుక ఒకటి నెట్టింట సందడిగా మారింది.పూజా భట్నాగర్ అనే యువతికి తన తల్లి వివాహ వేడుకను కళ్ళారా చూసే అదృష్టం దక్కింది. ఆ అద్భుతమైన క్షణాలను ఆమె సోషల్ మీడియాలో పంచు కున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన తల్లిదండ్రుల మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా, పూజా తన తల్లి పెళ్లికి సంబంధించిన దృశ్యాలను ఒక వీడియో రూపంలో షేర్ చేసింది. తల్లి ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి కుమార్తెగా మెరిసిపోతూ కనిపించారు. అలాగే ఒక ఏడాది క్రితం వివాహ సమయంలో పూజ పోస్ట్ చేసిన మరొక వీడియోలో,సింగిల్ మదర్‌గా ఒంటరిగా తన తల్లి ప్రయాణం గురించి మాట్లాడింది. ఎంతో ధైర్యంగా ఒంటరిగానే తనను పెంచి ప్రయోజకురాల్ని చేసిందని గుర్తు చేసుకుంది. ఇలాంటి తన తల్లికి తన జీవితంలోని కీలక మలుపులో మద్దతు ఇవ్వడం తన బాధ్యత అనిఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది. కుమార్తె భావోద్వేగంఈ సందర్భంగా పూజ చాలా భావోద్వేగానికి లోనైంది. తల్లి వివాహం సందర్భంగా తాను అనుభవించిన అనుభూతుల గురించి వివరించింది. "ఆ రోజు నేను ఎన్ని ఆనంద బాష్పాలు కార్చానో ఎవరికీ తెలియదు. నా కళ్లముందే మా అమ్మ పెళ్లి జరగడం చూస్తుంటే నేను చాలా అదృష్టవంతురాలిని అనిపించింది. నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుందని అర్థమైంది." అని పేర్కొంది. ఈ జంటకు ఎవరి దిష్టి తగలకూడదని ఆకాంక్షిస్తూ "No Nazar" అని ఆమె పేర్కొన్నారు. అమ్మ తన ఆత్మబంధువును (Soulmate) పెళ్లి చేసుకోవడం చూస్తున్నారు" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేసింది.నెటిజన్లు స్పందనదీనిపై నెటిజన్లు కూడా ఆనందంగా కమెంట్స్ చేశారు. ఒక కూతురుగా తన తల్లి సంతోషం కోసం తీసుకున్న చొరవను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. View this post on Instagram A post shared by Pooja (Piyu) (@pooja_bhatnagar_) -
లొంగుబాటలో గణపతి..! కుమారుడి ఆడియో వైరల్
మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోయేందకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ పోలీసులతో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే నేపాల్ నుంచి గణపతి ఢిల్లీకి చేరినట్లు తెలుస్తోంది. వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గణపతి సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యులు సైతం కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గణపతి కుమారుడు విడుదల చేసిన భావోద్వేగ ఆడియో వైరల్‌గా మారింది.ఆడియోలో గణపతి కుమారుడు ఏమన్నారంటే..‘‘తండ్రి ప్రేమను తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి. తండ్రి ప్రేమ తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా "నాన్నా" అనే పదం కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని "నాన్నా" అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను. అనాలోచితంగా కానీ, అప్రమేయంగా కానీ మీరు గుర్తుకు వస్తే నా రుధిరం ఎర్రబడుతుంది. ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో పన్నెండు రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి, మీ బంధాల్లో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిస్టు అనే అంతలా ఎదిగి సమాంతర ప్రభుత్వమే నడపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు...మీ ప్రయాణంలో ఎంతో కఠోర శ్రమ ఉండి ఉండవచ్చు. నాన్నా! నా చిన్నతనం నుంచే మిమ్మల్ని చూడాలని, మీతో గడపాలని, నా కష్టసుఖాలు మీతో పంచుకోవాలని, మీ అండలో ఎదగాలని ఉండేది. మీ కోసం నా మనసు పడే ఆరాటం, నాలో ఉండే నా ఆవేదనతో నా కన్నులు ఎన్ని దిక్కులు చూసినా మీరు కనపడరు. నా హృదయ ఘోష మీకు వినపడదు. ప్రతీ కుటుంబపు చిరునవ్వు వెనుక కనబడని ఒక గొప్ప మనసున్న తండ్రి కష్టం దాగి ఉంటుందని పెరిగే కొద్దీ అర్థమైంది. ఆ విషయంలో నాకు తండ్రి లేని లోటును తెలియకుండా అన్నీ తానే అయి పెంచింది నన్ను కన్న తల్లి. అమ్మా! నీకు వందనం. నాన్నా! మీ వివాహం తర్వాత అమ్మతో మీరు గడిపిన మధుర క్షణాలను అప్పుడప్పుడూ తన గుండె చప్పుడుగా నాతో పంచుకునేది...ఈ జీవితానికి ఆ మధుర క్షణాలు చాలు అనుకుంటూ బరువెక్కిన హృదయంతో ఓ నిట్టూర్పు విడిచేది. మన బంధువులు కూడా మీరు మనసున్న మనిషి అని, మితభాషి అని, అమ్మతో అన్యోన్యంగా ఉండేవారని అంటూ ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయం మీ ఇద్దరి జీవితాలను జీవితకాలానికి ఎడబాటు చేసింది. మీరెంచుకున్న గమ్యం వైపు అడుగులు వేస్తూ అజ్ఞాత జీవితం ప్రారంభించాక అమ్మ ఎన్ని సంవత్సరాలు తన కన్నీటితో ఎన్ని మెత్తాలు తడిసిపోయాయో ఎవ్వరికీ తెలియదు. ఏ బట్ట కట్టిందో, ఏ తిండి తిన్నదో కూడా ఎవ్వరికీ తెలియదు. సమాజాన్ని ఎదురు పడలేక ఇంటి గడప దాటలేదు. నన్ను పెంచుకుంటూ తన బాధను మరిచింది...నాకు తెలిసి అమ్మ పుట్టినప్పటి నుంచి ఏ సుఖమూ అనుభవించలేదు. అమ్మ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా తన ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడుతూనే ఉంది. నాన్నా! మీరు ఎంచుకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నించడం లేదు. మంచో చెడో మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి దీర్ఘకాలిక పోరాటం చేయడం అంటే అది ఆత్మార్పణే. విప్లవం అంటే కష్టనష్టాలతో కూడుకున్న దారి. ఎన్నో త్యాగాలు, ఎంతో మంది యోధుల వీరమరణాలు. ఎందరో తమ తల్లిదండ్రులను, తమ కుటుంబాన్ని వదిలి ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ, ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయారంటే అది అసామాన్యమే.ఒకప్పటి పరిస్థితులతో పోల్చితే ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పే ఉంది. సమాజ అంతర్గతంగా సమస్యలు చాలానే ఉండవచ్చు. కానీ నేటితరం ఎంతో అవగాహనతో ఉంటూ సామాజిక మార్పులకు అనుగుణంగా ప్రపంచంతో అనుసంధానమై ఉంటున్నారు. నేటి తరం యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీవంటి వారి విజ్ఞానం, అనుభవం మార్గదర్శకాలుగా తోడైతే మన దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఓ కొత్త నవభారతాన్ని నిర్మిస్తారని నా నమ్మకం. మీకు చెప్పగలిగే స్థానంలో నేను లేకపోవచ్చు. కానీ ఇది నా అభిలాష’’ అంటూ గణపతి కుమారుడు ఎమోషనల్‌గా మాట్లాడారు. -
పిల్లాడే కాదు, మేమూ మిస్ అవుతాం: కాజల్ (ఫోటోలు)
-
భార్య, పిల్లలను హత్తుకొని ఎమోషనలైన కేజ్రీవాల్
-
న్యాయం గెలిచింది.. కంటతడి పెట్టిన కేజ్రీవాల్
-
మా పిల్లల్ని చాలా దారుణంగా చూశారు.. కూటమి పాలనలో కుల వివక్షత
-
బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశం
ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ ఎరిక్ డేన్ (Eric Dane) అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS) వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. అయితే అరుదైన వ్యాధితో చనిపోవడానికి ముందు తన ఇద్దరు కుమార్తెలు (బిల్లీ, జార్జియా) కోసం రాసిన భావోద్వేగపూరితమైన సందేశం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందేశాన్ని విన్న తరువాత కన్నీళ్లు పెట్టనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఎరిక్ డేన్ తన జీవితంలోని ఒడిదుడుకులు, ముఖ్యంగా మాదకద్రవ్యాలకు బానిసవ్వడం, డిప్రెషన్ వంటి సమస్యల నుండి కోలుకున్న తర్వాత ‘‘లెటర్స్ టు మై డాటర్స్" (Letters to My Daughters) అనే ప్రాజెక్ట్‌లో భాగంగా తీవ్రమైన భావోద్వేగంతో తన ఇద్దరు కుమార్తెలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా, తమకు తాము నిజాయితీగా ఉండాలని కోరారు. తాను పరిపూర్ణమైన తండ్రిని కాకపోవచ్చు, కానీ నా తప్పుల నుండి పాఠాలు నేర్చుకున్నానన్నారు. తన పిల్లలు కూడా తప్పులు చేయడానికి భయపడ కూడదని హితవు పలికారు. తను ఎప్పుడూ వారికి అండగా ఉంటానని, వారి ఎదుగుదలలో తండ్రిగా గర్వపడతానని చాలా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు. లోకం ఏమనుకున్నా సరే, తమ స్వంత వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని ఆయన వారికి సూచించారు.కన్నీళ్లు పెట్టించే ఎరిక్డేన్ ఏమోషనల్ మెసేజ్ ‘‘వర్తమానంలో జీవించండి.ఇప్పుడే, ఈ క్షణమే. మీ దగ్గర ఉన్నదల్లా ఈ వర్తమానమే. దానిని నిధిలా దాచుకోండి. ప్రతి క్షణాన్ని ప్రేమగా ఆస్వాదించండి. ప్రేమలో పడండి. అది కేవలం ఒక వ్యక్తితో కాకపోవచ్చు (అది కూడా మంచిదే అనుకోండి). కానీ ఏదో ఒక దానితో ప్రేమలో పడండి. మీ అభిరుచిని, మీ సంతోషాన్ని వెతుక్కోండి. మిమ్మల్ని ఉదయాన్నే నిద్రలేపేలా చేసే, రోజంతా ఉత్సాహంగా నడిపించే ఒక లక్ష్యాన్ని కనుగొనండి. అమ్మ, మీరు ఎన్నో ప్రదేశాలు చూశాం. ఎన్నో బీచ్‌ల్లో గంటల తరబడి సంతోషంగా గడిపాం. ఆ క్షణాలు ఎప్పటికీ నాతోనే.స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోండి. మీ మనస్తత్వానికి తగ్గ వ్యక్తులను వెతకండి, వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా ఉండండి. ఆపై వారికి అంకితమవ్వండి. ఎటువంటి తీర్పులు, షరతులు, ప్రశ్నలు ఉండని నిజమైన స్నేహితులు మీకు తిరిగి అంతే ప్రేమను ఇస్తారు. మీ స్నేహితుల్ని ప్రేమించండి.వాళ్లు మిమ్మల్ని ప్రేమిస్తారు..నవ్విస్తారు. సాయం చేస్తారు..మార్గనిర్దేశం చేస్తారు. కొంతమంది మిమ్మల్ని కాపాడతారు.మీలోని ప్రతి అణువుతో, ఆత్మగౌరవంతో పోరాడండి. మీకు అనారోగ్యం లేదా మరేదైనా సవాళ్లు ఎదురైనప్పుడు, పోరాడండి. ఎప్పుడూ వెనకడుగు వేయకండి. మీ చివరి శ్వాస వరకు పోరాడండి. ఈ వ్యాధి నా శరీరాన్ని నెమ్మదిగా హరిస్తోంది కావొచ్చు, కానీ నా ఆత్మస్థైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయ లేదు.మీరు దేనినైనా ఎదుర్కోగలరని, మీ జీవితం ముగిసిపోవచ్చని, నరకాన్ని కూడా గౌరవంగా ఎదుర్కోగలరని నేను నిరూపించానని ఆశిస్తున్నాను. మై డియర్ బిల్లీ, జార్జియా, మీరే నా హృదయం, మీరే నా సర్వస్వం. తలెత్తుకుని పోరాడండి. శుభరాత్రి. ఐ లవ్ యూ’’ అంటూ ఇచ్చిన సందేశం ఆయన మరణం తరువాత విడుదలైంది. ఇది పలువురి చేత కంటతడి పెట్టిస్తోంది.“I hope I've demonstrated that you can face anything, you can face the end of your days, you can face hell with dignity. Fight, girls, and hold your heads high. Billie and Georgia, you are my heart, you are my everything. Goodnight. I love you.Eric Dane leaves his daughters —… pic.twitter.com/kHA4UjW4yK— Netflix (@netflix) February 20, 2026 మరోవైపు డేన్ స్నేహితులు , మద్దతుదారులు ALS తో పోరాడుతూ మరణించిన డేన్ భార్య రెబెక్కా, ఇద్దరు టీనేజ్ కుమార్తెలు, బిల్లీ, జార్జియా కోసం GoFundMe ప్రచారం ప్రారంభించారు. లాస్ ఏంజిల్స్‌లోని "ఫ్రెండ్స్ ఆఫ్ ది డేన్ ఫ్యామిలీ" ‘ఇన్ హానర్ ఆఫ్ ఎరిక్ డేన్’ అనే పేరుతో ఈ ప్రచారానికి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే దాదాపు రూ.1.07 కోట్లనిధులను సేకరించారు. మొత్తం 2.27 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా అమెరికన్ టీవీ సిరీస్ గ్రేస్ అనాటమీ (Grey's Anatomy) లో డాక్టర్ మార్క్ “McSteamy” స్లోన్ పాత్రతో విశేష గుర్తింపు పొందిన ఎరిక్ డేన్ 53 ఏళ్లకే (2026 ఫిబ్రవరి 19న) చనిపోవడంతో హాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ అనేది ప్రొగ్రెసివ్ న్యూరోడీజెనరేటివ్ వ్యాధి.ప్రస్తుతం దీనికి చికిత్స లేదు.తన మరణానికి ముందు, ఎరిక్ డేన్ తాను మరణించిన తర్వాతే ఈ విషయం ప్రపంచంతో పంచుకుంటాడనే అవగాహనతో ఇంటర్వ్యూ ఇచ్చారు. ALS తో తన పోరాటం, వ్యసనంతో తన పోరాటాలు, రెబెక్కా గేహార్ట్తో ప్రేమతదితర విషయాలు పంచుకున్నాడు. ‘ఫేమస్ లాస్ట్ వర్డ్స్’ నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. -
ఇంటికి వచ్చి అలా అనడం తప్పు.. అంబటి కూతురు ఎమోషనల్
-
భయంకరమైన బూతులు.. భరించలేకపోయా..! కంటతడి పెట్టిన శ్రీ సత్య..
-
వారసుడొచ్చాడు మెగాస్టార్ ఎమోషనల్...
-
అతను కన్నీళ్లు పెట్టుకోవడం అదే మొదటిసారి: కీర్తి సురేశ్
హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవలే రివాల్వర్ రీటాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. లేడీ ఓరియంటేడ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం కీర్తి సురేశ్ తోట్టం అనే మూవీలో కనిపించనుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కీర్తి సురేశ్.. తన ప్రేమ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. పెళ్లి రోజు తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్ భావోద్వేగానికి గురయ్యాడని వెల్లడించింది. 15 ఏళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకోవడంతో తాను మరింత ఎమోషనల్ అయ్యాడని తెలిపింది. ఆంటోనీ కన్నీళ్లు పెట్టుకోవడం తాను చూడటం మొదటిసారని అన్నారు.కీర్తి సురేశ్ మాట్లాడుతూ..'మేము ఇలాంటి పెళ్లి గురించి కలలో కూడా ఊహించలేదు, ఎందుకంటే మేము పారిపోయి పెళ్లి చేసుకుందామని అక్షరాలా అనుకున్నాం. కానీ ఇలాంటి పెళ్లిని ఎప్పుడూ ఊహించలేదు. అది నిజం కావడంతో మాకు మాటలు రాని స్థితిలో ఉండిపోయాం. ఈ క్షణం కోసం 15 ఏళ్లుగా ఎదురుచూశాం. ఇదంతా కేవలం 30 సెకన్లలోనే ముగిసింది. నేను పూర్తిగా శూన్యంలోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో నాకు తాళి తప్ప అన్నీ శూన్యంగా అనిపించాయి. అది చాలా భావోద్వేగభరితమైన క్షణం. బహుశా అతను కన్నీళ్లు పెట్టుకోవడం కూడా నేను చూడటం అదే మొదటిసారి. ఇది ఒక అందమైన ప్రయాణం' అంటూ చెప్పుకొచ్చింది.కీర్తి సురేష్- ఆంటోనీ తట్టిల్ ప్రేమకథ..కాగా.. కీర్తి సురేశ్ సినీ పరిశ్రమలోకి ప్రవేశించడానికి ముందే ఆంటోనీ తట్టిల్ ప్రేమలో ఉంది. చిన్ననాటి స్నేహితుడైన 15 ఏళ్ల సుదీర్ఘ ప్రేమాయణం నడిచింది. ఈ జంట డిసెంబర్ 12, 2024న గోవాలో వివాహం చేసుకున్నారు. మొదట సాంప్రదాయ హిందూ వివాహం.. ఆ తర్వాత మలయాళీ క్రైస్తవ పద్ధతిలో ఒక్కటయ్యారు. -
మిస్ అయిన ఫోన్ దొరికితే...ఆ ఆనందం వేరే లెవల్!
స్మార్ట్‌ఫోన్ చేతిలో లేనిదే రోజుగడవని పరిస్థితి. అంత అలవాటైపోయిన మొబైల్ పోగొట్టుకుంటే మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. దాని మీద ఆశలు వదిలేసు కుంటాం. కానీ పోయిందనుకున్న ఫోన్ అనూహ్యంగా మళ్లీ మన చేతికి వస్తే భలే ఆనందంగా ఉంటుంది కదా. సరిగ్గా ఒక మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో ఆమె భావోద్వేగానికి లోనైంది. ఈ ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది.టీవల చెత్తలో దొరికిన 45 లక్షల బంగారం, కార్మికురాలు నిజాయితీగా తిరిగి వచ్చిన వైరల్ అయింది. ఇది కూడా అలాంటి హృదయానికి హత్తుకునే ఘటన లాంటిదే. ఇన్స్టాగ్రామ్ యూజర్ రఘు అహిర్వర్ ఈ మొత్తం ఉదంతానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. దీని ప్రకారం తాను, తన సోదరితో కలిసి గ్రామం నుండి ఇండోర్‌కు ప్రయాణిస్తున్నప్పుడు, సోదరి ఒక మొబైల్‌ను గుర్తించింది. అదృష్టవశాత్తూ అన్‌లాక్‌లోనే ఉంది. దీంతో వారు కాల్లిస్ట్లోకి వెళ్లి లాస్ట్ కాల్ చేసిన నంబరుకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అహిర్వర్ ఫోన్ పోగొట్టుకున్నమహిళను కలుసుకుని, ఆమెకు ఫోన్‌ను తిరిగి ఇచ్చాడు. దీంతో ఆమె తెగ సంతోష పడిపోయింది. పదే పదే అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అహిర్వర్కు బదులుగా, వేరే ఎవరికికైనా దొరికితే తన ఫోన్ తన చేతికి తిరిగి వచ్చేది కాదంటూ భావోద్వేగానికి లోనైంది. View this post on Instagram A post shared by Raghu Ahirwar (@raghuu_9997) ఫోన్ అన్‌లాక్‌లో ఉండటం చూస్తే పాపం.. వారికి ఫోన్ టెక్నాలజీ గురించి తెలియదని అర్థం అయిపోయిందని, వెంటనే వారికి ఫోర్ చేశామని అహిర్వర్ పేర్కొన్నారు. ‘‘దేవుడు మనకు ఈ మొబైల్ ఇవ్వడం మంచిది" అనే క్యాప్షన్‌తో ఆన్లైన్లో షేర్ చేసిన వీడియో నెటిజన్ల ప్రశంసలను దక్కించుకుంది. అతని నిజాయితీ పలువురి హృదయాలను గెలుచుకుంది."ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే, ప్రపంచం మెరుగుపడుతుంది" అని ఒకరు, విలువైన వస్తువులను తిరిగి ఇవ్వడం గ్రేట్ బ్రో అని ఒకరు, "నిజ జీవిత హీరో" అని మరికొందరు వ్యాఖ్యానించడం విశేషం. -
సంక్రాంతి సినిమా హిట్.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
మనశంకర వరప్రసాద్‌గారు మూవీ సూపర్ హిట్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. తన సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ ప్రయాణంలో తనకు ఎల్లప్పుడు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.మెగాస్టార్ తన పోస్ట్‌లో రాస్తూ..'మన శంకరవరప్రసాద్ గారు సినిమాపై ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ, అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞతతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే. నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది. ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్నవారందరిది' అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.మీరు వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే శక్తి. రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ, మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక్‌బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు హిట్ మెషీన్ అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు, సుస్మితలకు, అలాగే మొత్తం టీమ్ అందరికీ, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో... లవ్ యూ ఆల్.. ఇట్లు మీ చిరంజీవి' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మనశంకర వరప్రసాద్‌గారు జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించింది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించి అభిమానులను మెప్పించారు. తాజాగా ఈ మూవీ అత్యంత వేగంగా రూ.300 కోట్ల క్లబ్లో చేరిన రీజినల్ సినిమాగా రికార్డ్ సృష్టించింది. From the heart, with love & gratitude 🙏🏻 pic.twitter.com/LJ2g32x3qC— Chiranjeevi Konidela (@KChiruTweets) January 20, 2026 -
ప్రతి రోజు ఏడ్చేవాడిని.. వదిలేద్దామనుకున్నా: నవీన్ పొలిశెట్టి ఎమోషనల్
ఈ సంక్రాంతి టాలీవుడ్ సినీ ప్రియులను అలరించిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆడియన్స్‌ను విపరీతంగా అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్ సాధించింది.ఈ సినిమా రిలీజైన ఐదు రోజుల్లో వంద కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ విషయాన్ని హీరో నవీన్ పొలిశెట్టి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోయిందని నవీన్ రాసుకొచ్చారపు. ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపాడు. ఈ క్షణం కోసం చాలా సంవత్సరాలు పట్టిందని ఎమోషనల్ ట్వీట్ చేశారు.నవీన్ పొలిశెట్టి తన ట్వీట్లో రాస్తూ..'ముంబైలో నేను ఇచ్చిన ఆడిషన్లన్నింటి గురించి ఆలోచిస్తున్నా. ఎన్నోసార్లు వదిలేయాలనిపించింది. నా ప్రమాదం తర్వాత ఈ సినిమాలో ఎలా నటిస్తాను అని ప్రతిరోజూ ఏడ్చేవాడిని. కానీ ఈ రోజు అనగనగా ఒకరాజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. నా కళ్లలో ఆనంద భాష్పాలు తిరుగుతున్నాయి. ఈ క్షణం కోసం చాలా ఏళ్లు పట్టింది. నన్ను నమ్మి టికెట్ కొన్నందుకు ధన్యవాదాలు. థియేటర్లలో మేము చూస్తున్న మీ ప్రేమకు, ఉత్సాహానికి ధన్యవాదాలు. ఈ బ్లాక్‌బస్టర్ అందించిన మా నిర్మాతలకు నా హృదయపూర్వక అభినందనలు. మా లాంటి వారికి మీ మద్దతు, ప్రోత్సాహం ప్రాణం లాంటిది. ఈ విజయం మనందరిది. మీ ప్రేమ, మద్దతు ఇలాగే అందిస్తూ ఉండండి. మీకు మరింత వినోదాత్మక చిత్రాలను అందించడానికి నేను మరింత కష్టపడతా' అంటూ రాసుకొచ్చారు Thinking about all the auditions in Mumbai. Enno saarlu give up cheseyali anipinchindi. Even with this film I used to cry everyday after my accident wondering how I will write and act. Today #AnaganagaOkaRaju has grossed 100 crores worldwide. 🙏🏻🙏🏻🙏🏻My heart is filled with… pic.twitter.com/2GN9Kxl4FI— Naveen Polishetty (@NaveenPolishety) January 19, 2026 -
శాసన మండలిలో కవిత భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో కంటతడి పెట్టారు. ఇదే తన ఆఖరి హాజరు అంటూ ప్రకటించిన ఆమె.. సోమవారం మండలికి హాజరై పలు అంశాలపై భావోద్వేగంగా మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా ప్రజల కోసం నేను చేస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకున్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుపెడితే అమరజ్యోతి వరకు ప్రతిదాంట్లో అవినీతి జరిగింది. ఉద్యమకారులు, సూటిగా ప్రశ్నించేవారిపట్ల వివక్ష కొనసాగింది. కేసీఆర్‌పై కక్షతో బీజేపీ నన్ను జైల్లో పెట్టింది. ఈడీ, సీబీఐలపై పోరాడినా బీఆర్ఎస్ నాకు అండగా నిలవలేదు. పార్టీ మౌత్‌పీస్‌గా ఉన్న ఛానెళ్లు, పేపర్లు నాకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదు. నేను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు. కక్షగట్టి నన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. కేసీఆర్‌కు అవినీతి మరక అంటితే నేనే పోరాడా. అలాంటిది నా సస్పెన్షన్‌కు ముందు నా వివరణ కోరలేదు. నైతికత లేని బీఆర్ఎస్ నుంచి దూరమైనందుకు సంతోషిస్తున్నా అంటూ కంటతడి పెట్టారామె. ఇకనైనా తన రాజీనామా ఆమోదించండి అని మండలి చైర్మన్‌కు కవిత విజ్ఞప్తి చేశారు. అయితే.. పరిణామాలను తాను అర్థం చేసుకోగలనని, భావోద్వేగాలతో రాజీనామా చేస్తే ఆమోదించరన్న చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. రాజీనామాపై పునరాలోచన చేయాలని కవితకు సూచించారు. -
హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్
పాము తన బిడ్డలను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే తింటుంది. అదే తరహాలో మనిషీ ప్రవర్తిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా.. అదీ కొత్త ఏడాది తొలిరోజునే జరిగిన రెండు ఘటనలు ‘‘అయ్యో పాపం’’ అనుకునేలా చేశాయి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పిల్లల్ని పోషించలేనని మనోవేదనతో తల్లి పిల్లలకు విషం పెట్టగా.. ఏపీలో కన్న తండ్రి తన ముగ్గురు బిడ్డల విషయంలో అదే పని చేశాడు. ఈ రెండు ఘటనలపై హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఎమోషనల్ స్పందించారు.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పిల్లల్ని పోషించలేనని మనోవేదనతో పిల్లలతో సహా విషపూరిత ఆహారం తల్లి, కుమార్తె మృతి చెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఏపీలో కన్న తండ్రి ముగ్గురు బిడ్డలకు విషమిచ్చి.. తానూ బలవన్మరణం పొందారు. ఈ ఘటనలపై హైదరాబాద్ సీపీ సజ్జానార్ ఇవాళ (శుక్రవారం) ఎక్స్ వేదికగా స్పందించారు.నూతన సంవత్సర వెలుగులు చూడాల్సిన కళ్లు.. శాశ్వతంగా మూసుకుపోయాయి.. గోరుముద్దలు తినిపించాల్సిన చేతులే విషం కలిపాయని, గుండెలకు హత్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారని పేర్కొన్నారు. అమృతం లాంటి ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులే.. ఇలా మారితే ఆ పసి ప్రాణాలు ఎవరికి చెప్పుకోగలవు? అని ప్రశ్నించారు. నాన్న ఇచ్చిన పాలలో విషం ఉందని ఆ చిన్నారులకు ఏం తెలుసు? అమ్మ కొంగు ఉరితాడవుతుందని ఆ అమాయకులకు ఏం ఎరుక? అని ఆవేదన చెందారు. కష్టాలు సునామీలా వచ్చినా సరే.. ఎదురీదాలే తప్ప, ఇలా పసిమొగ్గలను చిదిమేయడం పిరికితనం, పాపం, క్షమించరాని నేరం.. నూతన సంవత్సర వెలుగులు చూడాల్సిన కళ్లు.. శాశ్వతంగా మూసుకుపోయాయి. గోరుముద్దలు తినిపించాల్సిన చేతులే విషం కలిపాయి. గుండెలకు హత్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారు. అమృతం లాంటి ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులే.. ఇలా మారితే ఆ పసిప్రాణాలు ఎవరికి చెప్పుకోగలవు?నాన్న ఇచ్చిన పాలలో విషం ఉందని… pic.twitter.com/LZCLiepwxs— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 2, 2026చనిపోవడానికి ఉన్న ధైర్యం.. బ్రతకడానికి, పోరాడటానికి ఎందుకు సరిపోవడం లేదు? అని సజ్జనార్ ప్రశ్నించారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు.. అది మీపై ఆధారపడిన వారికి తీరని ద్రోహం.. అని తెలిపారు. దయచేసి ఆలోచించండి.. క్షణికావేశంలో నూరేళ్ళ జీవితాన్ని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి. బ్రతికి గెలవండి.. పారిపోయి ఓడిపోవద్దు.. అని ట్వీట్లో పేర్కొన్నారు. న్యూఇయర్ రెజల్యూషన్గా.. నూతన సంవత్సరాన్ని వృద్ధాశ్రమంలో తన సిబ్బందితో గడిపిన నగర కమిషనర్.. ఈ ఉదయం మరో పోస్ట్ చేశారు. నూతన సంవత్సర వేడుకల భద్రతా ఏర్పాట్లలో నిన్నటివరకు పూర్తిగా నిమగ్నమైన ఈ పోలీస్ అధికారి.. ఈ రోజు తన సంకల్పాలను ప్రజలతో పంచుకున్నారు. ఆయన మాటల్లో.. జీవితం అనేది వృత్తి బాధ్యతలు మరియు వ్యక్తిగత కర్తవ్యాల మధ్య సమతుల్యం. పోలీస్ అధికారిగా తన ప్రధాన సంకల్పం నగరాన్ని మరింత సురక్షితంగా, భద్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే. ఈ ఏడాది సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు వంటి కొత్త తరహా నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, కఠినమైన అమలు చర్యలు తీసుకోవడం ప్రాధాన్యతగా ఉంటుందది. అదే సమయంలో పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, మానసిక ధైర్యం అత్యంత కీలకం. వారి సంక్షేమం నా ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుంది. ప్రజలతో నిరంతర సంబంధం కారణంగా వ్యక్తిగత సమయం తగ్గిపోతున్నా, చదువుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా వృత్తిలో సమకాలీనంగా ఉండాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపే సమయం అత్యంత ముఖ్యం. వారి సహకారం వల్లే సమాజానికి అంకితభావంతో సేవ చేయగలుగుతున్నాం. చివరగా.. శారీరక దృఢత్వం కోసం స్థిరమైన వ్యాయామ పద్ధతిని అవలంబించాలని, నిజాయితీగా చెప్పాలంటే ఈసారి జిమ్‌లో చేరతానంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారాయన. Having been fully engaged until yesterday with New Year security and arrangements alongside my dedicated and committed team, I felt today was the right moment to share my New Year resolutions with my extended family—you.Life, as we know, is a balance between professional… pic.twitter.com/WroFZxqDqu— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 2, 2026 -
మా అబ్బాయి కంటే.. జగనన్న ఓడిపోయాడని చాలా బాధపడ్డాం!
-
తోడులేని జీవితం మాకొద్దు!
కల్వకుర్తి టౌన్/ఉయ్యాలవాడ: జీవిత భాగస్వాముల హఠాన్మరణం వారికి అంతులేని మనోవేదన కలిగించింది. జీవితంపై ఏర్పడిన విరక్తి బలవన్మరణానికి పురికొల్పింది. తాము మాత్రమే కన్నుమూస్తే కన్నబిడ్డలు అనాథలు అవుతారన్న భయం వారిని సైతం కడతేర్చేలా చేసింది. భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ గృహిణి ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రమాత్రలు కలిపిన కేక్ తినగా వారిలో తల్లీబిడ్డ మృతిచెందారు. మరోవైపు కొన్ని నెలల కిందట భార్య బలవన్మరణానికి పాల్పడటంతో తట్టుకోలేకపోయిన భర్త తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి ఉరేసుకొని కన్నుమూశాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని వేర్వేరు ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకల వేళ రెండు కుటుంబాల్లో చోటుచేసుకున్న ఆత్మహత్యలు స్థానికంగా తీరని వేదన మిగిల్చాయి. భర్తలేని జీవితం వద్దనుకొని.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని తిలక్‌నగర్ కాలనీకి చెందిన భీంశెట్టి ప్రకాశ్ (47)కు భార్య ప్రసన్న (38), 8వ తరగతి చదువుతున్న కూతురు మేఘన (13), 10వ తరగతి చదువుతున్న కుమారుడు అర్షిత్ రామ్ ఉన్నారు. స్థానికంగా బుక్ సెంటర్ నిర్వహించే ప్రకాశ్.. నవంబర్ 14న గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో అతడి భార్య ప్రసన్న తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. తల్లిదండ్రులు ధైర్యం చెబుతూ ఆమె వద్దే ఉంటున్నప్పటికీ భర్త లేని జీవితం తనకు వద్దని ప్రసన్న నిర్ణయించుకుంది. అదే సమయంలో తన పిల్లలు ఇతరులకు భారం కావొద్దని భావించింది. బుధవారం ఉదయం తల్లిదండ్రులు స్థానికంగా ఉంటున్న కుమారుడి ఇంటికి వెళ్లడంతో చనిపోయేందుకు ఇదే సరైన సమయం అనుకుంది. వెంటనే నిద్రమాత్రలను పొడి చేసి కూల్ కేక్‌లో కలిపింది. ఇంటి తలుపులు గడియపెట్టి టీవీ చూస్తున్న పిల్లలతో కలిసి కేక్ కట్ చేసింది. అనంతరం తల్లి, కూతురు కేక్ తిని అపస్మారక స్థితికి వెళ్లగా కొడుకు మాత్రం అనారోగ్యం కారణంగా సరిగ్గా తినలేదు. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లలేదు. రోజూ మాదిరిగానే యోగక్షేమాలు తెలుసుకోవడానికి మధ్యాహ్న సమయంలో వచి్చన ప్రసన్న సోదరుడు చక్రి ఎంతసేపు తలుపు కొట్టినా ఎవరూ తీయలేదు. చివరకు గట్టిగా అరవడంతో అర్షిత్ రామ్ తేరుకొని తలుపు తీశాడు. వెంటనే ముగ్గురినీ 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే తల్లి, కూతురు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అర్షిత్ రామ్ చికిత్స పొందుతున్నాడు. 4 పేజీల సూసైడ్ నోట్.. ఆత్మహత్యకు ముందు ప్రసన్న పుస్తకంలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసింది. అందులో ‘నా చావుకు ఎవరూ కారణం కాదు. భర్త లేని జీవిత యుద్ధాన్ని చేయలేక చనిపోతున్నా. నేను చనిపోతే పిల్లలను ఎవరూ చూసుకోలేరని.. వారిని కూడా నాతో తీసుకెళ్తున్నా. నన్ను క్షమించండి. నా పెళ్లి చీర, పిల్లలకు ఇష్టమైన ఆకుపచ్చ దుస్తుల్లో దహన సంస్కారాలు నిర్వహించండి’అని ప్రసన్న రాసుకొచ్చింది. తమ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించవద్దని సూసైడ్ నోట్లో కోరింది. ఐదు నెలల క్రితం చిన్నారుల తల్లి బలవన్మరణం ఏపీలోని నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలోని తుడుమలదిన్నెకు చెందిన వేములపాటి సురేంద్ర (35), మహేశ్వరి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తీవ్ర అనారోగ్యం బాధతో గతేడాది ఆగస్టులో మహేశ్వరి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి పిల్లలు కావ్యశ్రీ (7), జ్ఞానేశ్వరి (5), సూర్య గగన్ (1)తో కలిసి జీవిస్తున్న సురేంద్ర మానసికంగా కుంగిపోయాడు. బుధవారం రాత్రి ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి ఆపై తానూ ఉరేసుకొని తనువు చాలించాడు. గురువారం ఉదయం 8 గంటలైనా ఇంటి తలుపులు తెరవకపోవడంతో సురేంద్ర తల్లి కృష్ణమ్మ వెళ్లి చూడగా కుమారుడు, మనవరాళ్లు, మనవడు విగత జీవులుగా కనిపించారు. -
ఉన్నావ్ కేసు.. సెంగార్ కూతురి ఎమోషనల్ పోస్టు
ఉన్నావ్ అత్యాచార కేసులో ఉత్తర ప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వారం తిరగకుండానే అతని బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం పక్కనపెట్టేసింది. దీంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో.. సెంగార్ కుమార్తె ఇషితా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిందిఇంతకాలం తమను శక్తివంతులమని విమర్శిస్తున్నవాళ్లు.. ఇప్పుడేం అంటారు అని ఓ ప్రశ్న సంధించారామె. ‘‘అధికారంలో ఉన్నవాళ్లమని.. పవర్ఫుల్ వ్యక్తులమంటూ ఇంతకాలం మమ్మల్ని నిందిస్తూ వచ్చారు. కానీ ఆ అధికారమే ఉంటే.. ఈ ఎనిమిదేళ్లుగా మాకు మాట్లాడే అవకాశం ఎందుకు దొరకలేదు?. పైగా అవమానాలు.. బెదిరింపులు.. ఆన్లైన్లో దాడులు ఎందుకు ఎదుర్కొంటున్నాం’’ అంటూ డాక్టర్ ఇషితా సెంగార్ భావోద్వేగంగా ఓ సందేశం ఉంచారు. నేను నోరు విప్పకుండానే.. నాపై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె అనే లేబుల్ పడిపోయింది. నాకు, నా కుటుంబానికి మానవత్వమే లేదని తిట్టారు. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కొందరు పోస్టులు చేశారు. నన్ను, నా సోదరిని అత్యాచారం చేయాలి.. చంపాలి అంటూ కామెంట్లు చేశారు. మా గౌరవాన్ని ఒక్కొక్కటిగా లాక్కొన్నారు. మమ్మల్ని అవమానించారు.. ఎగతాళి చేశారు. ఇది అన్యాయం అని నేను అనను. ఎందుకంటే.. ఉద్దేశపూర్వకంగానే ఈ భయాన్ని సృష్టించారు కాబట్టి. ఎనిమిదేళ్లుగా.. ఇది ప్రతీరోజూ జరుగుతోంది.కోర్టులో మా వాదనలకు అవకాశం లేకుండా పోయింది. న్యాయ వ్యవస్థతో పాటు జర్నలిజం.. ఆఖరికి మా గురించి తెలిసిన జనాలు కూడా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. అంతలా ఒత్తిళ్లు నెలకొంటున్నాయి. నాకు ఇంకెక్కడా చోటు కనిపించలేదు. అందుకే ఇక్కడ రాస్తున్నా. ఇంతకాలం భయంతో పరుగులు తీశాం. ఒక కార్యాలయం నుండి మరొకదానికి లేఖలు రాస్తూ, కాల్స్ చేస్తూ.. అలసిపోయి ఉన్నాం. అయినా ఆశను వదులుకోవడం లేదు.నా ఈ ప్రయత్నం.. ఎవరినో బెదిరించడానికో, సానుభూతి పొందడానికో కాదు. నేనూ ఈ దేశపు బిడ్డనే. మేం మనుషులమే. మేమూ న్యాయ్యాన్ని కోరుకుంటున్నాం. ఆ న్యాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్న ఓ కుమార్తె.. అంటూ పోస్ట్ చేశారామె. ToThe Hon’ble Authorities of the Republic of India,I am writing this letter as a daughter who is exhausted, frightened, and slowly losing faith, but still holding on to hope because there is nowhere else left to go.For eight years, my family and I have waited. Quietly.…— Dr Ishita Sengar (@IshitaSengar) December 29, 2025సెంగార్ మరో కూతురు ఐశ్వర్య కూడా గతంలో ఇదే తరహా ప్రకటనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉన్నావ్ బాధితురాలి క్యారెక్టర్ మంచిది కాదని.. తమ తండ్రిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు జరిగిన కుట్రలో ఆమె భాగమైందని.. అందుకే అత్యాచార ఆరోపణలు చేసిందని.. తమ తండ్రి అమాయకుడని.. మీడియాగోల తప్ప అసలు విచారణ జరగడం లేదని ఇద్దరు కూతుళ్లు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. 2017లో యూపీ ఉన్నావ్‌కు చెందిన 17 ఏళ్ల బాధితురాలిపై అప్పటి బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేశారని.. ఆపై తన అనుచరులతో గ్యాంగ్ రేప్ చేయించారని.. ఆమెను అమ్మేందుకు ప్రయత్నించారన్న అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ కేసుల విచారణ సమయంలో తన మనుషులతో సెంగార్ తన తండ్రిని చంపించాడని.. తనపైనా హత్యాయత్నం జరిగిందని.. ఆ దాడి నుంచి తాను తప్పించుకుంటే బంధువులిద్దరు మృతి చెందారని బాధితురాలు ఆరోపించింది. సీబీఐ దర్యాప్తు.. విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్ చివర్లో.. సెంగార్‌ను ఈ కేసుల్లో దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఆ సమయంలో సెంగార్ కుటుంబం కోర్టులో కన్నీటి పర్యంతం అయ్యింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో.. అదే ఏడాది ఆయన్ని బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది కూడా. అయితే ఈ ఏడాది డిసెంబర్ 23న ఢిల్లీ హైకోర్టు సెంగార్ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ కండిషనల్ బెయిల్ ఇచ్చింది. అయితే సెంగార్ మరో కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తుండడంతో వెంటనే రిలీజ్ కాలేదు. ఈలోపు.. బాధితురాలు, సీబీఐలు సుప్రీం కోర్టులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. ఈ పిటిషన్లను సోమవారం(డిసెంబర్ 29) విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని నిలిపివేసింది. -
స్టేజ్ పైనే ఏడ్చిన దర్శకుడు మారుతి.. ఓదార్చిన ప్రభాస్
-
ఈవెంట్లో కన్నీళ్లు పెట్టుకున్న సన్నీ డియోల్.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ప్రస్తుతం బోర్డర్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ ఏడాది జాట్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఆయన.. ఈ సినిమాతో హిట్ కొట్టేందుకు రెడీ అయ్యారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం నేపథ్య కథతోనే ఈ సినిమాని తెరకెక్కించారు. గతంలో 1997లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన బోర్డర్ చిత్రానికి సీక్వెల్ రూపొందించారు. తాజాగా ఈ మూవీ టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన సన్నీ డియోల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ధర్మేంద్ర మరణాన్ని తలచుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ టీజర్‌లోని డైలాగ్ చెబుతూ అభిమానులను అలరించారు. ఈవెంట్లో మాట్లాడుతూ.. ఆవాజ్ ఎక్కడి వరకు వెళ్లాలి? అని సన్నీ డియోలా అనడంతో.. ప్రేక్షకులు లాహోర్ వరకు అంటూ గట్టిగా అరిచారు. ప్రేక్షకుల స్పందనతో సన్నీ డియోల్ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ మూవీ వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. తొలి పార్ట్‌కి జెపి దత్తా దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని అనురాగ్ సింగ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో దిల్జిత్ దోసాంజ్, వరుణ్ ధావన్, అహన్ శెట్టి కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. వీరంతా దేశాన్ని రక్షించడానికి పోరాడే సైనికుల పాత్రలు పోషించారు. ఈ సినిమాలో మోనా సింగ్, సోనమ్ బాజ్వా, అన్య సింగ్, మేధా రాణా హీరోయిన్లుగా కనిపించనున్నారు.#SunnyDeol Gets Emotional At #Border2teaser Launch Event 🔥😭 pic.twitter.com/fn7dqfWc8J— Filmy_Duniya (@FMovie82325) December 16, 2025 -
మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నా.. జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటా ?
-
Karthika Nair : నాలో ఓ భాగం కోల్పోయా.. నటి రాధ కూతురు కార్తీక ఎమోషనల్ (ఫొటోలు)
-
ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)
-
మా అమ్మ చనిపోయారు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆవేదన
-
‘విమానం రాలేదు.. దయచేసి ఉద్యోగం తీసేయకండి’
భారత్‌లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అమలు చేసిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్డీటీఎల్) నిబంధనల కారణంగా పైలట్ల కొరతతో సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం కారణంగా గురువారం ఒక్కరోజే 500కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఈనేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈమేరకు ఢిల్లీకి చెందిన ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడు ఏడుస్తూ సర్వీసుల ఆలస్యం కారణంగా తన ఉద్యోగం కోల్పోతానని భయపడుతూ చేసిన పోస్ట్ కొద్ది సమయంలో వైరల్ అయింది. అందులో ప్రయాణికుడు ఏడుస్తూ ‘ప్రయాణం ఆలస్యం కారణంగా నన్ను ఉద్యోగం నుంచి తొలగించకూడదని దయచేసి నా బాస్‌కి చెప్పండి’ అని చెప్పడం గమనించవచ్చు.పుణెలో డాక్టర్ ప్రశాంత్ పన్సారే ‘గేట్ వద్ద సమస్య గురించి కమ్యునికేట్ చేయడానికి సిబ్బంది ఎవరూ కనిపించడం లేదు. బోర్డులో మాత్రం షెడ్యూల్ ప్రకారం విమాన సర్వీసులు చూపిస్తున్నాయి’ అని ఫిర్యాదు చేశారు.My @IndiGo6E flight is delayed for hours and passengers are stuck with no clear communication. I even have a video of people raising concerns. This needs urgent attention. #IndiGo #Delay #6E979 pic.twitter.com/iKKdGftKoo— Ayush Kuchya (@KuchyaAyush) December 3, 2025పైలట్ల కొరతే కారణండీజీసీఏ అమలు చేసిన కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనల కారణంగా పైలట్లకు వారంలో 36 గంటల నుంచి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి చేశారు. అలాగే, రాత్రి వేళల్లో ల్యాండింగ్ల సంఖ్యను ఆరు నుంచి రెండుకు తగ్గించారు. విమానయాన భద్రతను పెంచే లక్ష్యంతో తీసుకువచ్చిన ఈ మార్పులు ప్రత్యేకించి రాత్రి వేళల్లో అధిక విమానాలను నడిపే ఇండిగో ఆపరేషన్లపై తీవ్ర ప్రభావం చూపాయి. కొత్త నిబంధనల అమలుకు తగినంత మంది పైలట్లను నియమించుకోవడంలో ఇండిగో వైఫల్యం చెందిందని పైలట్ సంఘాలు ఆరోపించాయి. దీనివల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందని పేర్కొన్నాయి.ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభానికి కారణాలు ఇవేనా.. -
వల్లభనేని వంశీ ఎమోషనల్ వీడియో
-
సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత, కుమార్తె భావోద్వేగం
న్యూఢిల్లీ : మిజోరం మాజీ గవర్నర్, సీనియర్ న్యాయవాది స్వరాజ్ కౌశల్ (డిసెంబర్ 4 శుక్రవారం) కన్నుమూశారు ఆయనకు 73 సంవత్సరాలు. స్వరాజ్ కౌశల్ మాజీ విదేశాంగ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ భర్త . అలాగే బీజేపీ ఎంపి బన్సూరి స్వరాజ్ తండ్రి. లోధి రోడ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఢిల్లీ విభాగం ప్రకటించింది. కౌశల్‌కు ఛాతీ నొప్పి రావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ వైద్యులు ఆయన మరణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా, పలువురు బీజేపీ నేతలు ఆయన మరణంపై సంతాపం ప్రకటించారు.VIDEO | Delhi: Swaraj Kaushal, senior BJP leader and husband of the late former External Affairs Minister Sushma Swaraj, passed away on Thursday. Visuals from the cremation ground show his daughter and BJP MP Bansuri Swaraj performing rituals.(Full video available on PTI Videos… pic.twitter.com/bMzs5Nxaz8— Press Trust of India (@PTI_News) December 4, 2025తిరిగి అమ్మ దగ్గరికేబన్సూరి స్వరాజ్ తన తండ్రి మరణంపై ఒక భావోద్వేగ ట్వీట్ చేశారు. తండ్రిగారు ఇక లేరని చెప్పడానికి చింతిస్తున్నాను అంటూ ఇలా రాశారు ‘‘ మీ నిష్క్రమణ చాలా బాధిస్తోంది. మీరు ఇప్పుడు దేవుని సన్నిధిలో, శాశ్వత శాంతితో తల్లితో తిరిగి కలిశారనే ఈ నమ్మకం. అపరిమితమైన ఓర్పు నా జీవితానికి వెలుగు మీ కుమార్తె కావడం నా జీవితంలో గొప్ప గర్వం,, మీ వారసత్వం, మీ విలువలు , మీ ఆశీర్వాదాలు ముందుకు సాగే ప్రతి ప్రయాణానికి పునాదిగా ఉంటాయి." అంటూ బన్సూరి స్వరాజ్ తన తండ్రికి నివాళులర్పించారు.पापा स्वराज कौशल जी, आपका स्नेह, आपका अनुशासन, आपकी सरलता, आपका राष्ट्रप्रेम और आपका अपार धैर्य मेरे जीवन की वह रोशनी हैं जो कभी मंद नहीं होगी।आपका जाना हृदय की सबसे गहरी पीड़ा बनकर उतरा है, पर मन यही विश्वास थामे हुए है कि आप अब माँ के साथ पुनः मिल चुके हैं, ईश्वर के सान्निध्य… pic.twitter.com/imqpUb2DMS— Bansuri Swaraj (@BansuriSwaraj) December 4, 2025ఎవరీ స్వరాజ్ కౌశల్ జూలై 12, 1952న సోలన్‌లో జన్మించిన స్వరాజ్ కౌశల్ 1990లో 37 సంవత్సరాల వయసులో మిజోరాం గవర్నర్‌గా నియమితులయ్యారు. భారతదేశంలో నియమితులైన అతి పిన్న వయస్కుడైన గవర్నర్‌గా నిలిచారు. సుప్రీంకోర్టు ఆయనను కేవలం 34 ఏళ్ల వయసులో సీనియర్ న్యాయవాదిగా నియమించింది. స్వరాజ్ కౌశల్ - సుష్మా స్వరాజ్ 1975లో వివాహం చేసుకున్నారు. కౌశల్ పార్లమెంటులో హర్యానాకు ప్రాతినిధ్యం వహించారు. 1998 నుండి 2004 వరకు హర్యానా వికాస్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. -
బీజేపీ ఓటమిపై దీపక్ రెడ్డి ఎమోషనల్
-
అందెశ్రీ మృతిపై లైవ్ లో భావోద్వేగానికి లోనైన సింగర్స్..
-
జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు.. సింగర్ ఎమోషనల్ (ఫోటోలు)
-
హీరో మంచు మనోజ్ సతీమణి ఎమోషనల్.. ఆ ఒక్క పాటతో కన్నీళ్లు!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాలతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. భైరవం, మిరాయ్ చిత్రాలతో వెండితెరపై సందడి చేశారు. ఇటీవలే విడుదలైన మిరాయ్తో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో విలన్ పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. తేజ సజ్జా కీలక పాత్రలో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.అయితే హీరో మంచు మనోజ్ తాజాగా ఓ మూవీ ఈవెంట్‌కు ముఖ్య అథితిగా పాల్గొన్నారు. రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా సాంగ్‌ను లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమానికి సతీమణి భూమా మౌనికతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మంచు మనోజ్ అన్నారు. అంతేకాకుడా మౌనికతో తన ప్రేమ విషయాన్ని కూడా పంచుకున్నారు. రాజ్యాలేమీ లేకపోయినా.. రాణిలా చూసుకుంటానని మాటిచ్చానని తెలిపారు.అయితే ఈవెంట్‌కు హాజరైన మిట్టపల్లి సురేందర్ ఓ సాంగ్‌ను ఆలపించారు. 'రాజ్యమేదీ లేదుగానీ.. రాణిలాగా చూసుకుంటా.. కోట కట్టేలేనుకానీ.. కళ్లలో నిన్నే దాచుకుంటా' అంటూ మంచు మనోజ్, మౌనికలను ఉద్దేశించి రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలోని పాట పాడారు. భర్తను ప్రేమించే ప్రతి అమ్మాయి కోరుకునేది ఇదేనంటూ మాట్లాడారు. ఈ పాట విన్న భూమా మౌనిక తీవ్ర భావోద్వేగానికి గురైంది. వేదికపైనే కన్నీళ్లు ఆపులేకపోయింది. ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Celebrities Tollywood (@celebrities_tollywood_) -
వీధినపడ్డ డ్రైవర్ దస్తగిరి కుటుంబం
వికారాబాదు జిల్లా: బస్సు స్టీరింగ్ పట్టి కుటుంబాన్ని నడిపిన డ్రైవర్ దస్తగిరి మృతితో కుటుంబసభ్యులు దిక్కులేని పక్షులయ్యారు. మీర్జాగూడ బస్సు దుర్ఘటనలో దస్తగిరి దుర్మరణం చెందడంతో అతడి ఇద్దరు భార్యలు, పిల్లలు, వద్ధురాలైన తల్లి శోకసంద్రంలో మునిగిపోయారు. మొదటి భార్య రెండున్నరేళ్లుగా పిల్లలతో కలిసి యాలాల మండలం చెన్నారంలో తల్లి ఖాజాబీతో కలిసి ఉంటోంది. దస్తగిరి పెద్ద కొడుకు ఆహ్మద్ హైమద్ జినుగూర్తి మైనార్టీ గురుకులంలో ఆరో తరగతి చదువుతుండగా, చిన్న కొడుకు చెన్నారంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. దస్తగిరి కొన్నాళ్లుగా రెండో భార్య సాజిదాబేగం, తల్లి షౌకత్‌బేగంతో కలిగి తాండూరు మాణిక్‌నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అతడి అంత్యక్రియలు సోమవారం రాత్రి పాత తాండూరు నిర్వహించారు.తల్లిలేని పిల్లలయ్యారు తాండూరు: బస్సు ప్రయాణం నా భార్యను దూరం చేస్తుందనుకోలేదు. ముగ్గురు చిన్నారులు తల్లిలేని పిల్లలుగా మారారని మృతురాలు తబస్సుమ్ జహాన్ భర్త మహమ్మద్ మాజిద్ కంటతడి పెట్టుకున్నారు. తబస్సుమ్‌కు బీపీ ఉండటంతో నగరంలోని ఓ డాక్టర్ వద్ద అపాయింట్మెంట్ తీసుకున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలు మహమ్మద్ మాజిన్, మెహ్విష్ జహాన్, ఐదేళ్ల కుమారుడు ముక్రమ్‌తో కలిసి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ బస్సు ఎక్కాడు. ఆడవారికి కేటాయించిన సీట్లతో భార్య, కొడుకు ముక్రమ్ కూర్చున్నారు. పక్క సీట్లో నేను మరో ఇద్దరు పిల్లలు కూర్చున్నాం. వికారాబాద్ దాటాక ఇద్దరు పిల్లలు నిద్రపోయారు. తల్లి వద్ద కూర్చున్న ముక్రమ్ ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు తన వద్దకు వచ్చి ఒడిలో కూర్చున్నాడు. తర్వాత జరిగిన ప్రమాదంలో తబస్సుమ్ మరణించింది. మేము ప్రాణాలతో బయటపడ్డాం. స్థానికులు రక్షించారు. డాక్టర్ అపాయింట్మెంట్ 9 గంటలకు ఉండటంతో ఫస్ట్ బస్సులో బయలుదేరాం. -
బేటీకో చోడ్కే ఆవూంగా అని వెళ్లాడు
వికారాబాదు జిల్లా: బేటీకో సాసురాల్ కనే చోడ్కే షామ్ తక్ ఆవూంగా అంటూ ఇంట్లో నుంచి చెప్పి వెళ్లన నా భర్త ఇలా సాయంత్రం వరకు శవమై వస్తాడని అనుకోలేదని.. ఇప్పుడు నా గతి... నా పిల్లల గతి ఏంకాను అని మృతుడు షేక్ ఖాలీద్ భార్య రెహానాబేగం కన్నీరుమున్నీరైంది. మీర్జాగూడా వద్ద జరిగిన ప్రమాదంలో ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న షేక్ ఖాలీద్‌తో పాటు కూతురు సాలేహ, మనుమరాలు రెండు నెలల ఫాతిమా సంఘటనా స్థలంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే. వీరి మృతితో మంగళవారం కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య రెహానాను ‘సాక్షి’ పలకరించింది. ఆమె మాటల్లోనే.. ‘20 ఏళ్లుగా తాండూరు పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నాం. కొన్నాళ్ల క్రితం ఇందిరమ్మ కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకొని పిల్లలతో కలిసి ఉంటున్నాం. భర్త వెల్డర్‌గా పని చేస్తాడు. నేను బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మాకు నలుగురు సంతానం. పెద్ద కూతురు సాలేహా బేగంను పదో తరగతి వరకు చదివించి గతేడాది సెప్టెంబర్ 26న పెళ్లి చేశాం. ఇద్దరు కవలలు సమీర్, జమీర్ ప్రస్తుతం నంబర్ 2 ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. మరో కూతురు సాదియా బేగం తొమ్మిదో తరగతి చదువుతోంది. కూతురు సాలేహాకు ప్రసవం తర్వాత హైదరాబాద్ నుంచి తాండూరుకు తీసుకొచ్చాం. మనవరాలికి 40 రోజుల తర్వాత చేసే కార్యక్రమానికి పంపించాలని అత్తింటి వాళ్లు ఫోన్ చేయడంతో సోమవారం బస్సు ఎక్కారు. బిడ్డను విడిచి సాయంత్రం వరకు వస్తా అన్న మనిషి ఇలా ప్రాణం లేకుండా వస్తాడని అనుకోలేదు’ అంటూ కన్నీటిపర్యంతమైంది. -
నీకు భార్య, పిల్లలు ఉన్నారు కదా.. జోగి రమేష్ అరెస్ట్ పై భార్య ఎమోషనల్..
-
సార్.. మీరు వెళ్లొద్దు
నల్గొండ జిల్లా: మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో గల మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాద్యాయుడిగా పనిచేస్తున్న నన్నూరి వెంకట్‌రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. మీరు వెళ్లొద్దు సార్.. మాతోనే ఉండాలి అంటూ రోదించారు. హెచ్ఎం వారిని ఓదార్చి వెళ్లిపోయారు. గ్రామస్తులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటమ్మ, నూతన హెచ్ఎం వీరయ్య, కేజీబీవీ ఎస్ఓ వసంతకుమారి, ఉపాధ్యాయులు నిరంజన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
నోటికాడి ధాన్యం తడిసి ముద్దవటంతో బోరున ఏడ్చిన రైతు
-
Kurnool Bus Incident: మీ కాళ్లు మొక్కుతా.. నా కొడుకు శవాన్నైనా చూపించండి
-
నా బిడ్డను చంపేశారు కదరా! గుండెల్ని పిండేసే వీడియో
-
లొంగిపోయే ముందు ఆశన్న భావోద్వేగ వీడియో
-
అయ్యా మోదీ.. చేతులెత్తి మొక్కుతున్న.. రోజా ఎమోషనల్
-
మ్యాగీ పిచ్చి: ఎంగేజ్మెంట్ రింగ్ అమ్మి.. విషయం తెలిసి తల్లి భావోద్వేగం
టీనేజ్ పిల్లల చేష్టలు అమాయకంగా అనిపించినా, ఒక్కోసారి ప్రమాదకరంగా పరిణమిస్తాయి. అనుకున్నది దక్కించుకునేందుకు ఎలాంటి అకృత్యాలకైనా పాల్పడతారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని, కాన్పూర్‌లోని శాస్త్రి నగర్లో జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటే షాక్ అవ్వకతప్పదు 13 ఏళ్ల బాలుడు తన సోదరి నిశ్చితార్థ ఉంగరాన్ని ఎత్తుకుపోయాడు. ఇది దురాశతోనో , డబ్బులతో కాదు.. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ వస్తువుల పట్ల ఉన్న వ్యామోహం అంతా ఇంతా కాదు. ఈనేపథ్యంలో కేవలం మ్యాగీ నూడుల్స్ కోసం తనసోదరి ఎంగేజ్‌మెంట్‌ను రింగ్‌ను అమ్మేయాలని చూశాడు. కానీ దుకాణ యజమాని , ఆ కుర్రోడి తల్లికి ఫోన్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.విషయం తెలుసుకున్న తల్లి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.ఉంగరాన్ని కొట్టేసిన బాలుడు ఆభరణాల దుకాణానికి వెళ్లాడు. ఉంగరాన్ని తీసుకొని డబ్బులు ఇమ్మని అడిగాడు. దుకాణ యజమాని పుష్పేంద్ర జైస్వాల్ బాలుడి అమాయకత్వాన్ని చూసి అనుమానం వచ్చింది. కారణాలను ఆరాతీశాడు. మ్యాగీ కొనడానికి డబ్బుల్లేవని, అందుకే ఉంగరాన్ని తెచ్చానని ఆ బాలుడు అమాయకరంగా సమాధానం ఇచ్చాడు. చదవండి: ఈ 5 లక్షణాలుంటే చాలు! మీరిక ‘చిరంజీవే’వెంటనే ఆ ఆభరణాల వ్యాపారి వెంటనే ఆ బాలుడి తల్లికి సమాచారమిచ్చాడు. తన కుమార్తె నిశ్చితార్థం ఉంగరం చూసి తల్లి షాక్ అయ్యింది. వివాహం కొన్ని రోజుల్లోనే జరగాల్సి ఉందని, ఈ ఖరీదైన ఉంగరం పోయి ఉంటే చాలా సమస్యలెదుర్కోవాల్సి వచ్చేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నిజాయతీగా ప్రవర్తించిన నగల వ్యాపారికి తల్లి కళ్ల నిండానీళ్లతో ధన్యవాదాలు తెలిపింది.చదవండి : కేఎఫ్సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే!అయితే సరైన ధృవీకరణ లేకుండా మైనర్లు తెచ్చిన ఆభరణాలను తాము కొనుగోలుచేయమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆభరణాల వ్యాపారి నిజాయితీ ప్రశంసలు దక్కించుకుంది. -
జగనన్న నాకు అండగా ఉన్నారు.. మిథున్ రెడ్డి ఎమోషనల్
-
అన్నకు తమ్ముళ్ల వెన్నుపోటు..!
-
'కాలం గడిచే కొద్ది మరింతగా మిస్ అవుతున్నా'.. తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్
ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి తారకరత్న.. హీరోగానే కాకుండా విలన్‌గానూ అభిమానులను అలరించారు. టాలీవుడ్లో పలు సినిమాలతో ఫ్యాన్స్‌ను మెప్పించారు. కానీ ఊహించని విధంగా చిన్న వయసులోనే అభిమానులకు, ఇండస్ట్రీకి దూరమయ్యారు. గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు.అయితే తాజాగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి.. తారకరత్నను గుర్తు చేసుకుంది. నీతో ఉన్న రోజులు జీవితమంతా మర్చిపోలేనంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇటీవల మహాలయ అమావాస్య సందర్భంగా తన ముగ్గురు పిల్లలతో కలిసి తారకరత్నకు నివాళులర్పించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైంది.అలేఖ్య తన పోస్ట్‌లో రాస్తూ..'నా మనసులో భరించలేని బాధ ఉంది. అది ఎప్పటికీ మానిపోని గాయమని తెలుసు. నా మనసులోని ప్రతి విషయం ఎలా వక్రీకరించబడిందో చూసి నేను బాధపడ్డా. నీ కళ్లు శాశ్వతంగా మూసుకున్న తర్వాతే నీ కోరిక నెరవేరింది. అదే క్షణంలో మిగతావన్నీ కూడా నీతో పాటే వెళ్లిపోయాయి. ప్రస్తుతం నాకు బాధ కలిగించే రోజుల్లో.. నీ కథను తిరిగి వ్రాయడానికి చాలా ఆసక్తిగా ఉన్న ప్రపంచంలో ప్రయాణిస్తున్నా. కాలం గడిచే కొద్దీ మరింతగా నిన్ను మిస్ అవుతున్నా. కొన్ని రోజుల పాటు గాలి పీల్చుకోవడానికి చాలా బరువుగా అనిపిస్తోంది. దుఃఖం నా గొంతును చుట్టుకున్నట్లు, నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా.. అయినప్పటికీ నేను ఆశను వదులుకోను.. ఎందుకంటే నీ హృదయ స్పందన ఇప్పటికీ నా కోసం చేరుకునే చిన్న చేతుల ద్వారా బ్రతికే ఉంది.. నిన్ను ఎప్పటికీ గుర్తుచేస్తుంది' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్
ప్రతీ ఏడాది ముంబైలో జరిగి దసరా ఉత్సవాలు, దుర్గా పూజలో బాలీవుడ్ హీరోయిన్లు ఉత్సాహంగా పాల్గొనడం ఆనవాయితీ. ముఖ్యంగా కాజోల్ , రాణి ముఖర్జీ ఈ కార్యక్రమాల్లో ముందంజలో ఉంటూ బంధుజనంతో కలివిడిగా తిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కానీ ఏడాది ఉత్సవాల్లో వారిద్దరూ తీవ్ర భావోద్వాగానికి లోనయ్యారు. అటు తన తండ్రి తరువాత అయాన్ ముఖర్జీ దుర్గా పూజ ఉత్సవాల్లో తొలిసారి పాల్గొన్నారు. తమ సమీప బంధువు, అత్యంత ఆప్తుడైన నటుడు దేబ్ ముఖర్జీ ఈ ఏడాదితమ మధ్య లేకపోవడమే ఇందుకు కారణం. ఆయనను గుర్తు చేసుకుని ఆయన మేనకోడళ్ళు నటీమణులు కాజోల్ , తనీషా రాణీ ముఖర్జీ భావోద్వాగానికి లోనయ్యారు. ఈ దృశ్యలు ఆన్లైన్లో దర్శనిమిచ్చాయి. ప్రతి సంవత్సరం దుర్గా పూజ పండల్ ఘనంగా దేబ్ ముఖర్చీ ఈ ఏడాది లేరు. ప్రముఖ బాలీవుడ్ నటుడు చిత్రనిర్మాత,బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ తండ్రి దేబ్ ముఖర్జీ. ఫ్యామిలీ అంతా ప్రేమగా 'దేబు కాకా' అని పిల్చుకునే దేబ్ ముఖర్జీ మార్చి 14, 2025న కన్నుమూసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ ఏడాది తమ కుటుంబ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లి, ఉత్సవాలను కలిసి ప్రారంభించారు కాజోల్, రాణీ ముఖర్జీ తనీషా ముఖర్జీ తదితర కుటుంబ సభ్యులు నార్త్ బాంబే సర్బోజానిన్ దుర్గా పూజ పండల్‌ను ఆవిష్కరించారు.రాణి ముఖర్జీ కుటుంబం యొక్క దుర్గా పూజ 2025 కి సహ-నిర్వాహకురాలిగా ఉన్నారు.‘‘అయిగిరి నందిని’’అనే స్తోత్రం మధ్య కాజోల్, రాణి దుర్గా మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అమ్మవారిని చూడగానే ఇద్దరూ భక్తితో చేతులో జోడించి నమస్కరించారు. అనంతర అటు అమ్మవారి రూపాన్ని చూసి, ఇటు దివంగత దేబ్ ముఖర్జీని స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. VIDEO | Mumbai, Maharashtra: Actors Kajol and Rani Mukherjee witness the unveiling of the Goddess' idol at the North Bombay Sarbojanin Durga Puja Samiti. (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/EgP2o1xVOH— Press Trust of India (@PTI_News) September 27, 2025ఈ సందర్భంగా తనీషా మాట్లాడుతూ"మా కుటుంబానికి ఇది కొంచెం విచారకరమైన సమయం, కొంచెం ఉత్సాహంతో పాటు, ఈ సంవత్సరం మా కుటుంబంలో ముగ్గురు ఆప్తులను కోల్పోయాం. ప్రతి సంవత్సరం దుర్గా పూజను నిర్వహించే మా దేబు కాకా (దేబ్ ముఖర్జీ) ఇక లేరు, ఈసారి పూజకు హాజరు కావడం కొంచెం కష్టంగానే అనిపించింది. అయినా గానీ ఆయన కలను ముందుకు తీసుకెళ్తున్నందున చాలా ఆనందంగా కూడా ఉంది." అన్నారు. View this post on Instagram A post shared by Rohit Saraiya (@rohitsaraiya.official) -
డబ్బున్నోళ్లను ఏమి చేయలేరు.. పేదలపైనే వీళ్ళ ప్రతాపం.. కన్నీళ్లు పెట్టుకున్న వీధి వ్యాపారులు
-
కళ్ళ ముందే మా షాపులన్నీ బుల్డోజర్ తో నుజ్జు నుజ్జు చేసి..!
-
కనికరం లేదా చంద్రబాబు..?
-
‘నీ ఆశయాన్ని అంతం కానివ్వను’.. చార్లీ కిర్క్ భార్య భావోద్వేగ ప్రసంగం..
వాషింగ్టన్: ‘నీ ఆశయాన్ని అంతం కానివ్వను..ఈ దేశం ఇప్పటివరకు చూడని గొప్ప విషయంగా దానిని మారుస్తాను’ అంటూ డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ తన భర్తను గుర్తుచేసుకుంటూ భావోద్వేగంతో అన్నారు. బుధవారం యుటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో ఒక కార్యక్రమానికి హాజరైన రైట్ వింగ్ కార్యకర్త, డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. చార్లీ కిర్క్ హత్య అనంతరం అతని భార్య ఎరికా కిర్క్ తొలిసారిగా బహిరంగంగా మాట్లాడారు.తన భర్త పాడ్‌కాస్ట్‌ను హోస్ట్ చేసే కార్యాలయం నుండి ఎరికా కిర్క్ మాట్లాడుతూ.. తాను అమెరికాను, ఇక్కడి ప్రకృతిని, చికాగో కబ్స్‌ను అమితంగా ప్రేమిస్తున్నానని అన్నారు. తన భర్త చార్లీ తనను, పిల్లలను హృదయపూర్వకంగా ప్రేమించారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన భర్తను హత్య చేసినవారిని పట్టుకున్న చట్ట అమలు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నిందితుడు టైలర్ రాబిన్సన్ ను ఉద్దేశిస్తూ ఆమె ‘నాలో రగులుతున్న అగ్ని గురించి నీకు తెలియదు. ఈ వితంతువు రోదనలు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ నాదాలుగా ప్రతిధ్వనిస్తాయి’ అంటూ ఎరికా కిర్క్ కన్నీరు పెట్టుకున్నారు.ఎరికా 2021లో చార్లీ కిర్క్‌ను వివాహం చేసుకున్నారు. వారికి మూడేళ్ల కుమార్తె, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. తన భర్త ట్రంప్‌ను అమితంగా ఇష్టపడేవారని, తన భర్త అందించిన రేడియో షో, పాడ్‌కాస్ట్‌ను కొనసాగిస్తూ, తన భర్త ఆశయాలను సజీవంగా ఉంచుతానని ఆమె పేర్కొంటూ, ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మీరు ఆయనకు అండగా నిలిచారు. ఆయన కూడా మీ కోసం పనిచేశారు అని ఎరిక్ అధ్యక్షుడు ట్రంప్‌తో అన్నారు. -
మద్యానికి దూరంగా ఉంటా.. అలాంటిది చిత్రహింసలు పెడుతున్నారు.. చెవిరెడ్డి ఎమోషనల్..
-
‘మోదీ క్షమించినా.. బీహార్ వాళ్లను క్షమించదు’
తన మాతృమూర్తి హీరాబెన్‌పై అనుచిత వ్యాఖ్యల పేరిట వైరల్ అయిన వీడియోపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. తన తల్లికే కాదని.. దేశంలోని తల్లులందరికీ ఇది అవమానమేనని భావోద్వేగంగా మాట్లాడారు. బీహార్‌లో మహిళల కోసం బీహార్ రాజ్య జీవికా నిధి సాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ఆయన.. ఆ కార్యక్రమానికి హాజరైన 20 లక్షల మంది మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.చనిపోయిన నా తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. అయినా అందులోకి లాగారు. కేవలం నా తల్లినే కాదు.. దేశంలోని ప్రతీ తల్లినీ, సోదరినీ కాంగ్రెస్, ఆర్జేడీలు అవమానించాయి అని అన్నారాయన. ఈ మాటలు నా తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించాయి. మీరు కూడా ఈ మాటలు విన్న తర్వాత నాతోపాటు మీరూ ఎంతగా బాధపడి ఉంటారో నాకు తెలుసు అంటూ ఆయన భావోద్వేగంగా స్పందించారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా నా తల్లి కష్టపడడం ఆపలేదు. మా కోసం దుస్తులు తయారు చేయించేందుకు ప్రతి పైసా ఆదా చేసేది. దేశంలో కోట్లాది తల్లులు ఇలాగే త్యాగం చేస్తూ జీవిస్తున్నారు. తల్లి స్థానం దేవతలకంటే గొప్పది అని ప్రధాని అన్నారు. బీహార్‌లో కాంగ్రెస్–RJD వేదికపై వాడిన అసభ్య పదజాలం తన తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ కుటుంబాల్లో పుట్టినవారు పేద తల్లుల బాధను, వారి కుమారుల పోరాటాన్ని అర్థం చేసుకోలేరు. వీరంతా బంగారు, వెండి చెంచాలతో పుట్టినవారు. బీహార్‌లో అధికారాన్ని తమ కుటుంబాల స్వంతంగా భావిస్తున్నారు. కానీ మీరు ఒక పేద తల్లి కుమారుడిని ప్రధాన సేవకుడిగా ఆశీర్వదించారు. ఇది ‘నామ్‌దార్’లకు జీర్ణించుకోవడం కష్టమైంది అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, RJD నేత తేజస్వీ యాదవ్‌లపై విమర్శలు చేశారు.నాపై అసభ్య పదజాలం వాడిన జాబితా చాలా పొడవుగా ఉంది. నన్ను నీచ్, గంది నాళీ కీ కీడా, పాము అని అంటున్నారు. ఇప్పుడు ‘తూ’ అని కూడా సంబోధిస్తున్నారు.. అంటూ రాహుల్ గాంధీ ర్యాలీలో తనను ‘తూ’ అని పిలిచిన విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇలాంటి వ్యాఖ్యలకు మోదీ క్షమించినా.. బీహార్ ప్రజలు క్షమించబోరని అన్నారాయన.ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ బీహార్‌లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర సందర్బంగా.. దర్భంగలో మోదీ, ఆయన తల్లి హీరాబన్ను దూషించినట్లుగా ఓ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ ఘటనపై కేసు నమోదుకాగా.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు కూడా. -
నాకు తెలిసిన శక్తిమంతమైన మహిళ: పీవీ సింధు భావోద్వేగం (ఫొటోలు)
-
దివ్యాంగులు కన్నీటి పర్యంతం.. ఈ ఉసురు ఊరికే పోదు
-
తండ్రిని చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న కూతురు
-
'ప్రతి నిమిషం నా తోడుగా ఉంది మీరే'.. తల్లిదండ్రులతో సింగర్ మధుప్రియ (ఫొటోలు)
-
వేలాది లేఆఫ్‌లు.. ఎమోషనల్ అయిన మైక్రోసాఫ్ట్ సీఈవో
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో వేలాది లేఆఫ్‌లపై ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల ఎమోషనల్‌గా స్పందించారు. ఇటీవల కంపెనీలో ఇటీవల 9,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించడం తనను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని అంగీకరించారు. అయితే సంస్థ ఏఐ పరివర్తనకు ఈ కోతలు అవసరమని ఆయన పేర్కొన్నారు.కంపెనీ పరిణామాలపై ఆయన ఉద్యోగులకు లేఖలు పంపారు. "అన్నింటికంటే ముందుగా నేను నాపై ఎక్కువ భారం మోపుతున్న వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇటీవలి ఉద్యోగ తొలగింపుల గురించి మీలో చాలా మంది ఆలోచిస్తున్నారని నాకు తెలుసు" అంటూ సత్య నాదెళ్ల లేఖ మొదలు పెట్టారు. " ఈ నిర్ణయాలు మనం తీసుకోవాల్సిన అత్యంత క్లిష్టమైనవి. మన సహోద్యోగులు, సహచరులు, స్నేహితులు.. మనం ఎవరితో అయితే కలిసి పనిచేశామో, నేర్చుకున్నామో, లెక్కలేనన్ని క్షణాలను పంచుకున్నామో వారిని అవి ప్రభావితం చేస్తాయి" అంటూ రాసుకొచ్చారు.మైక్రోసాఫ్ట్ 2014 తర్వాత ఈ సంవత్సరం భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. దాని ప్రపంచ శ్రామిక శక్తిలో 7 శాతం మందికి ఉద్వాసన పలికింది. ఉద్యోగాల కోతలో అనిశ్చితి, అసంబద్ధత కనిపిస్తోందని అంగీకరించిన సత్య నాదెళ్ల కంపెనీ వృద్ధిపై కూడా దృష్టి సారించారు. "మార్కెట్ పనితీరు, వ్యూహాత్మక స్థానం, వృద్ధి ఇలా అంశాల్లో లక్ష్యంతో కూడిన చర్యల ద్వారా మైక్రోసాఫ్ట్ పురోగమిస్తోంది. మనం మునుపటి కంటే మూలధన పెట్టుబడులు ఎక్కువ పెడుతున్నాం. మన మొత్తం హెడ్ కౌంట్‌లో పెద్దగా మార్పేమీ లేదు. మన పరిశ్రమలో, మైక్రోసాఫ్ట్ లో కొంతమంది ప్రతిభ, నైపుణ్యానికి మునుపెన్నడూ చూడని స్థాయిలో గుర్తింపు, రివార్డులు లభిస్తున్నాయి. అదే సమయంలో లేఆఫ్‌లూ అమలు చేస్తున్నాం" అని వివరించారు. -
ఎప్పుడు నవ్వుతూ ఉండే రష్మి గౌతమ్ ఎమోషనల్ పోస్ట్.. కారణం..?
-
చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నా.. చెవిరెడ్డి కంటతడి
సాక్షి, విజయవాడ: కోర్టులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. జడ్జి ముందు తన వాదనలు వినిపించుకునే క్రమంలో చెవిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి, తన సోదరుడు మద్యం కారణంగానే చనిపోయారని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తాను మద్యం జోలికి వెళ్ల లేదు, వెళ్లబోనని భాస్కర్‌రెడ్డి చెప్పారు. చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నానని బాధగా ఉందని చెవిరెడ్డి అన్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్‌బుక్ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా కూటమి సర్కార్ పాలన సాగుతోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసింది. ఆ కుట్రలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయన్ని ఏ38గా చేర్చింది. -
Big Question: నా పిల్లల్ని కూడా.. డిబేట్ లో రోజా కంటతడి
-
నీకు సిగ్గుందా.. కొల్లు రవీంద్ర.. అన్నం తింటున్నావా లేక.. ఉప్పాల హారిక భావోద్వేగం
-
కోటన్నా అంటూ.. కంటతడి పెట్టిన బాబు మోహన్
-
జయం రవితో విడాకుల వివాదం.. ఆర్తి తొలిసారి ఎమోషనల్ పోస్ట్!
కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం గత కొద్దికాలంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దాదాపు 16 ఏళ్ల వివాహాబంధానికి ముగింపు పలికేందుకు వీరిద్దరు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని గతేడాది చివర్లో సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు జయం రవి. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. తాము విడిపోవడానికి కారణం మూడో వ్యక్తేనని ఆయన భార్య ఆర్తి ఆరోపించింది. పరోక్షంగా సింగర్ కెన్నీషాను ఉద్దేశించి విమర్శలు చేసింది. ప్రస్తుతం విడాకుల వ్యవహారం కోర్టులో ఉండడంతో కోర్టు విచారణకు హాజరవుతున్నారు.అయితే తాజాగా జయం రవి భార్య ఆర్తి చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. నా చుట్టూ ఉన్న ప్రతిదీ పెరుగుతూనే ఉంది అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. తన ఇద్దరు పిల్లలు, పెట్ డాగ్‌తో ఉన్న వరుస ఫోటోలను షేర్ చేసింది. కొన్ని హృదయాలకు ఎక్కడ ఉండాలో తెలుసంటూ రాసుకొచ్చింది.ఆర్తి తన ఇన్‌స్టాలో రాస్తూ.. "కొన్ని సాయంత్రాలు, కొన్ని పెరుగుతున్న విషయాల మధ్య సూర్యాస్తమయం.. గట్టిగా పట్టుకునే రెండు చేతులు.. ఎలాంటి మాటలు లేకున్నా దగ్గరగా ఉండే హృదయం.. ప్రతిదీ సంపూర్ణంగా అనిపించేలా చేసే నిశ్శబ్ద ప్రేమ ' అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. జయం రవితో విడాకుల వివాదం ప్రేమ, హృదయం అంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది. ఇది చూసిన హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా స్పందించింది. చాలా అందంగా ఉంది.. ఆర్తు అంటూ కామెంట్ చేసింది. కాగా.. 16 ఏళ్ల క్రిత రవి, ఆర్తి పెళ్లి చేసుకోగా..వీరికి ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ ఉన్నారు. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) -
నాలో ఏదైనా లోపం ఉందా..? మిత్రా శర్మ ఎమోషనల్
-
కాంతా లగా ఫేమ్ ఆకస్మిక మరణం.. ఆమెను తలచుకుని భర్త ఎమోషనల్!
'కాంతా లగా' అనే పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాలా (Shefali Jariwala). 2002లో వచ్చిన ఈ పాటతోనే మొదటి వైరల్ సెలబ్రిటీగా ఆమె గుర్తింపు పొందింది. ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్, రీల్స్ వంటివి లేకున్నా ఈ ఒక్క సాంగ్‌తో యూత్‌కు దగ్గరైంది. కానీ ఊహించని విధంగా ఆమె ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే తాజాగా ఆమె మరణాన్ని తలచుకుని భర్త పరాగ్ త్యాగి ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన భార్యతో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు.పరాగ్ తన పోస్ట్‌లో రాస్తూ.. 'షెఫాలి నువ్వు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతావు. నువ్వు ఒక నమ్మకమైన స్నేహితురాలు, నా ప్రియమైన భార్య. నువ్వు మా అందరిని అమ్మలా చూసుకున్నావ్. ఎల్లప్పుడూ ఇతరులకు మొదటి స్థానం ఇచ్చే నువ్వు గొప్ప అంకితభావం గల వక్తి. కేవలం ఆప్యాయతగల భార్య మాత్రమే కాదు.. సింబాకు అద్భుతమైన తల్లివి కూడా. నువ్వు ప్రేమించిన వారి వెంట నిలిచే నమ్మకమైన స్నేహితురాలివి. అందుకే షెఫాలి గుర్తింపునకు అర్హురాలు. ఆమె ప్రజలను అలరించిన విధానం మరిచిపోలేనిది. ఇప్పుడు మనతో లేకపోయినా తన ప్రేమను ఎప్పటికీ మరచిపోలేం. శాశ్వతంగా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.' అంటూ ఎమోనషల్ అయ్యారు. కాగా.. ఆమె మరణం తర్వాత ఐదు రోజులకు షెఫాలీ జరివాలా జ్ఞాపకార్థం ముంబయిలో ప్రార్థనా సమావేశం నిర్వహించారు. View this post on Instagram A post shared by Parag Tyagi (@paragtyagi) -
National Doctors day ముప్పు డప్పు కొట్టినా తప్పులు ఆగవా!
జీవితం ఒక సినిమా అయితే... దేవుడు రాసిన స్క్రిప్ట్‌ను కూడా మార్చి రాయగల రైటర్లు డాక్టర్లు. జీవితం ఒక మూవీ అయితే... పేషెంట్‌కు లైఫ్‌కో కొత్త డైరెక్షనిచ్చి హిట్ చేయగల టాప్ డైరెక్టర్లు డాక్టర్లు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... జీవితం... సినిమా కంటే విచిత్రమైనది. దాంట్లో లవ్, మదర్ సెంటిమెంట్, స్టడీస్‌లో సక్సెస్‌తో కెమెరా టిల్ట్ చేసి తలెత్తి పైకి చూడాల్సినంత అడ్మిరేషన్, ఎదురుగా మృత్యువు నిలబడ్డా చిరునవ్వుతో ఎదుర్కొనేంత హీరోయిక్ కరేజ్, హెల్మెట్లు లేకపోవడంతో జరిగే అనర్థాల స్టంట్స్... ఇలా ఎన్నో... ఎన్నెన్నో!! ఇన్ని ఎమోషన్స్‌ను మనతో పంచుకున్నారు నిష్ణాతులూ, లబ్ధప్రతిష్ఠులైన కొందరు డాక్టర్లు... నేడు డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ అనిరుథ్ కె. పురోహిత్ మాటల్లోనే...అదో అందమైన చలికాలపు ఉదయపు వేళ. కానీ ఆ ఆహ్లాదకరమైన ప్రాంతఃకాలం... శేఖర్ పాలిట రాబోయే రాత్రికి కాబోయే కాళరాత్రికి నాందీ సమయం. కారణం... ఆరోజు శేఖర్ చేసిన రెండు తప్పులు. మొదటి తప్పు హెల్మెట్ ధరించకపోవడమైతే... రెండోది స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా ఏమాత్రం స్లో చేయకపోవడం. దాంతో బండి మీది నుంచి పడి తలకు గాయంతో ఐసీయూలో బెడ్‌పై అచేతనంగా పడి ఉన్నాడు. శేఖర్ గురించి అతడి అన్న శ్రీధర్ చాలా బాధపడుతూ ఉండేవాడు. బహుశా శ్రీధర్‌కు 35 ఏళ్లూ, అతడి తమ్ముడు శేఖర్‌కు 30 ఏళ్లు ఉంటాయేమో. ప్రతిరోజూ కళ్ల నిండా నీళ్లతో, జోడించిన చేతులతో నా దగ్గరికి వచ్చి తమ్ముడి పరిస్థితి వాకబు చేస్తూ ఉండేవాడు. ‘‘ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్. నా తమ్ముడు బాగైతే చాలు’’ అనేవాడు. అంతటి దయ, గుండెనిండా ఆర్ద్రత ఉన్న ఆ అన్నను చూస్తే ఓ పక్క ఆనందం... మరో పక్క అతడి పరిస్థితికి బాధా ఉండేవి. ‘‘మీవాడుగానీ ఆ రోజు హెల్మెట్ పెట్టుకుని ఉంటే... ఇవ్వాళ ఈ పరిస్థితి వచ్చేదే కాదు’’ అంటూ ఉండేవాణ్ణి. ఒకరోజు పొద్దున్నే నేను నా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా. పక్క సందులోంచి ఒక వ్యక్తి తన బైక్‌ను చాలా రాష్‌గా డ్రైవ్ చేస్తూ ప్రధాన రోడ్డు మీదికి వస్తున్నాడు. ఎక్కడా స్లో చేయడమన్న మాటే లేదు. మెయిన్ రోడ్డులో వస్తున్న నేను వెంటనే నా కార్‌ను స్లో చేస్తూ... అతడు నన్ను గుద్దుకోకుండా నా కార్‌ను చాలా పక్కకు తీశా. ఒకవేళ నేనలా చేయకపోతే నన్నతడు తప్పక ఢీకొని ఉండేవాడు. తీరా చూస్తే అతడి బైక్ హ్యాండిల్ మీద హెల్మెట్ కూడా ఉంది. పరిశీలనగా చూస్తే అతడు మరెవరో కాదు... మా హాస్పిటల్ బెడ్ మీద యాక్సిడెంట్ అయి పడుకుని ఉన్న పేషెంట్ వాళ్ల అన్నే. కాస్తయితే ‘‘అదే బెడ్ పక్కన ఇతడూ తమ్ముడికి కంపెనీ ఇస్తూ పడుకునేవాడు కదా’’ అనిపించింది. మరో మాట అనిపించింది. తన సొంత తమ్ముడు చేసిన రెండు తప్పుల నుంచి ఏమీ గ్రహించకుండా శేఖర్ వాళ్ల అన్న శ్రీధర్ చేసింది మూడో తప్పు. అలాంటి యాక్సిడెంట్లో చనిపోయిన ఓ వ్యక్తి తాలూకు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్న మర్నాడే ఈ ఘటన జరగడంతో నాకీ విషయం స్ఫురణకు వచ్చింది. నన్ను మనసులో తొలిచేస్తున్న విషయమేమిటో తెలుసా... ‘‘ఇన్ని సంఘటనలు జరిగాక... జరుగుతున్న సంఘటనలను చూశాక... తమ ఇంట్లో కూడా ఇలాంటి విషాదాలు చోటు చేసుకున్న తర్వాత కూడా వీళ్లు మారరా’’ అంటూ బాధేసింది. నా అనుభవంలో చూసిన ఘటనలూ, ఆ టైమ్‌లో వచ్చే ఆలోచనలే నన్ను ఈ నాలుగు మాటలు రాసేలా పురిగొల్పాయి. డాక్టర్ అనిరుథ్ కె. పురోహిత్ సీనియర్ కన్సల్టెంట్న్యూరో – స్పైన్ సర్జన్,ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్-యాసిన్ -
మన మనో బలం ఎంత?
కొందరు ఎప్పుడూ ఆడుతూపాడుతూ, నవ్వుతూ, తుళ్లుతూ ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అలాగే కనిపిస్తుంటారు. పైగా ఆ పరిస్థితిని ఎదుర్కొనేంత ధైర్యాన్ని కనబరుస్తుంటారు. తమ మానసిక బలంతో సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. తాము విజయం సాధిస్తే మరీ మంచిది. ఒకవేళ సాధించలేకపాయినా తమ ప్రయత్నం మాత్రం మానరు. ఇక మరికొందరు చిన్న చిన్న సమస్యకే డీలాపడిపాతుంటారు. కిందా మీదా పడుతూ ఎంతో ప్రయాస పడుతున్నట్టుగా కనిపిస్తారు. వాళ్ల మాటల్లో ఆందోళన, నిరుత్సాహం, చిరాకు, చికాకూ అన్నీ కనిపిస్తుంటాయి. అందరూ మనుషులే.. అయితే వాళ్ల మధ్య ఈ వ్యత్యాసాలెలా కనిపిస్తున్నాయి? ఈ తేడాలెందుకున్నాయి? ఎందుకంటే ఒక్కొక్కరికి ఐక్యూలలో తేడాలున్నట్టే... వాళ్ల ఎమోషన్ కోషియెంట్ (ఈక్యూ)లలో ఉన్న తేడాల వల్ల. ఎమోషనల్ కోషియెంట్ అంటే ఏమిటి, అది ఎందుకు అవసరం, దాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి... వంటి అనేక అంశాలను తెలిపేదే ఈ కథనం. ఐన్‌స్టైన్ చాలా మేధావి అనీ, అతడి ఐక్యూ సాధారణ జనాల ఐక్యూ కంటే చాలా ఎక్కువనే మాట వినే ఉంటారు. ఐక్యూ వల్ల తెలివితేటలు బాగానే ఉండవచ్చు. కానీ జీవితంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైనది ఎమోషనల్ కోషియెంట్. అలాంటి ‘ఈక్యూ’ గురించి తెలుసుకుందాం.ఎమోషనల్ ఎపిడమిక్... ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా వంటి వాటి వల్ల అనేక చోట్ల ఒక్కసారిగా వ్యాధులు పెచ్చరిల్లి వ్యాప్తిచెందుతూ ఉంటే దాన్ని ఎపిడమిక్ అంటారు కదా. మరి ఇప్పుడున్న వాతావరణంలో ఎమోషన్ ఎపిడమిక్ అనే పరిస్థితి నెలకొని ఉందని అనుకోవచ్చు. అసలు ఎమోషనల్ ఎపిడమిక్ అంటే ఏమిటో చూద్దాం. ఈ మధ్యకాలంలో మన సమాజంలో అనేక రకాల మానవ సంబంధాలకు (రిలేషన్షిప్ప్రాబ్లమ్స్కు) సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయి. సంక్లిష్టమైన ఈ మానవ సంబంధాలతో వచ్చే మానసిక వేదనలూ, దౌర్బల్యాలూ, కుంగుబాట్ల వల్ల అనేక అనర్థాలూ చోటు చేసుకుంటున్నాయి. ఈ తరహా కుటుంబ కలహాలు... భార్యాభర్తలు, తల్లిదండ్రులు–పిల్లలూ, అన్నాచెల్లెళ్లూ, అక్కా తమ్ముళ్లూ... స్నేహితులూ, ఇతరుల మధ్య... దాదాపుగా ఇలాంటి సమస్యలు లేనివారంటూ ఉండరనే చెప్పవచ్చు. కాకపోతే వాటి తీవ్రతలోనే తేడా ఉంటే ఉండవచ్చుగానీ... సమస్యలంటూ లేనివారు ఉండరు. ఇలా అన్నిచోట్లా ఇలాంటి మానసిక సమస్యలు పెచ్చరిల్లి మానవ సంబంధాలు ప్రభావితం కావడాన్ని ‘ఎమోషనల్ ఎపిడెమిక్’గా చెప్పవచ్చు. ఈ ఎమోషనల్ ఎపిడమిక్‌కు కారణం... మనం, చదువుకూ, డబ్బుకూ ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఉద్వేగాలకు అతీతంగా స్థిరంగా ఉండటానికి... అంటే ‘ఎమోషనల్ డెవలప్మెంట్’కు ఇవ్వకపోవడమే. దాంతో క్షణికోద్రేకాలు... వాటి కారణంగా ఘర్షణలూ, కొన్నిసార్లు ఆత్మహత్యలు, హత్యల వంటివీ చోటు చేసుకుంటున్నాయి. దీనికి కారణం మనుషుల్లో ఐక్యూలాగా... ఈక్యూను అంటే ఎమోషనల్ కోషియెంట్ను కూడా పెంపోందించుకోవాలన్న దృష్టి కొరవడటం. అందుకే ఇప్పుడు స్కూలు పిల్లల చదువులలో ఐక్యూతో పాటు ఈక్యూనూ పెంచడంతోపాటు చిన్నప్పట్నుంచే పిల్లలకు ఈక్యూ కూడా పెంపోందేలా చూడటం అవసరం.భావోద్వేగ మేధాశక్తి అంటే ఏమిటి? ఏదైనా ఓ మానసిక స్థితి తాత్కాలికంగా కొనసాగడాన్ని ఉద్వేగం లేదా ఎమోషన్ అంటారు. అదే మానసిక స్థితి చాలా ఎక్కుసేపు కొనసాగితే దాన్ని ‘మూడ్’ అని వ్యవహరిస్తారు. ఉదాహరణకు బాధ పడటం ఒక మానసిక స్థితి. దాన్ని ఒక డిప్రెసివ్ ఎమోషన్‌గా చెప్పవచ్చు. అయితే అదే బాధ అలా దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉంటే దాన్ని ‘డిప్రెస్డ్ మూడ్’ అంటారు. రోజుల తరబడి అదే బాధ నిత్యం ఉంటే అది మూడ్ డిజార్డర్ అవుతుంది. బాధ, సంతోషం, దిగులు, ఆందోళన, భయం, కోపం, ప్రేమ, ఉత్సాహం... ఇవన్నీ మనందరిలోనూ రకరకాల సమయాల్లో కలిగే మానసిక స్థితులు. వాటినే భావోద్వేగ స్థితులుగా చెప్పవచ్చు. సరైన సమయంలో సరైన భావోద్వేగాలను సరైన రీతిలో ప్రదర్శించడాన్ని ‘భావోద్వేగ మేధాశక్తి’గా చెప్పవచ్చు. ఉదాహరణకు చాలా పెద్ద పోరబాటు జరిగినప్పుడు ఆ సమయంలో (అంటే తగిన సమయంలో) తగిన రీతిలో కోపం ప్రదర్శించినప్పుడు అది తనకూ, ఇతరులకు కూడా సక్రమంగా ఉపయోగపడుతుంది. అయితే అదే కోపాన్ని ఎప్పుడూ ప్రదర్శిస్తూ ఉంటే అది వారికి తీరని నష్టం కలగజేయవచ్చు. అతడితో పనిచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. అంటే... తన భావోగ్వేగ మేధాశక్తిని సమర్థంగా తగిన రీతిలో సరైన రీతిలో ఉపయోగపడేలా చేసుకోవడమే ఇక్కడ ప్రయోజన్ని ఇస్తుందని గుర్తించాలి. ఇలా ఎప్పుడు ఏ రకమైన ఉద్వేగాన్ని, ఎంత మేరకు, ఏ పరిమితుల్లో ఉపయోగించాలన్నదే ‘ఈక్యూ’గా చెప్పవచ్చు.భావోద్వేగ మేధాశక్తి (ఈక్యూ) ఉన్నవారి లక్షణాలివి... ఎప్పుడూ సంతోషంగా కనిపించడం... తమ భావోద్వేగాలను ఎప్పుడూ తమ అదుపులో ఉంచుకోవడం, ఇతరుల భావోద్వేగాలనూ గుర్తించగలగడం. వాటిని గుర్తెరిగి వాటికి అనుగుణంగా ప్రవర్తించడం.అవసరమైనప్పుడు ఇతరుల భావోద్వేగాలను సైతం తాను నియంత్రిస్తూ, వారిని సంతోషపరచడం లేదా పరిస్థితులు వారికి అనుగుణంగా ఉండేలా మార్చగలగడం. అవసరాన్ని బట్టి తన లక్ష్యం కోసం కొన్ని తన సుఖాలను తాత్కాలికంగా వాయిదా వేయడం. అలా తన తక్షణ సుఖాలను వాయిదా వేయడం వల్ల కూడా తాను సంతోషం పోందగలగడం. సమర్థమైన నాయకత్వ లక్షణాలూ అలాగే మంచి సంభాణాచాతుర్యం. ఓటమికి భయపడకపోవడం, కుంగిపోకుండా వాటిని ఎలా ఎదుర్కోవాలన్నది తక్షణం ఆలోచించగలగడం. ఈక్యూ తాలూకు లక్షణాల వల్ల కలిగే ఫలితాలు... ఇలాంటివారు గతంలో తమకు ఎదురైన అనుభవాలను ఒక పాఠంగా తీసుకుని ప్రస్తుతంలో జీవిస్తారు. జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా నడుపుతారు. దాంతో గెలుపూ, సంతోషం ఎప్పుడూ వాళ్లతోనే ఉంటాయి. అతడితో సమయం గడపడానికి అందరూ ఇష్టపడుతుంటారు. తనతో ఉన్నవారినీ సంతోషపెడుతూ ఈ ఈక్యూ ఎక్కువగా ఉన్నవారు ఇతరులకు మార్గదర్శకుడుగా ఉంటాడు. ∙సమర్థమైన నాయకుడిగా ఎదుగుతాడు. తొలుత కుటుంబానికీ, ఆ తర్వాత సమాజానికీ నేతృత్వం వహిస్తుంటాడు. ఈక్యూను (భావోద్వేగ మేధాశక్తిని) పెంచుకోవడం ఎలా...? ఈక్యూ (భావోద్వేగ మేధాశక్తి)ని అభివృద్ధి చేసుకోడానికి ముందర... ముఖ్యంగా అదెలా ఏర్పడుతుందో తెలుసుకోవాలి. భావోద్వేగ మేధాశక్తికి మొదటి పునాదులు అర్లీ ఛైల్డ్‌హుడ్ టైమ్‌లో పడి అప్పట్నుంచి 18 ఏళ్ల వయసు వరకు వేగంగా అభివృద్ధి చెందుతుంటుంది. ఆ తర్వాత కూడా ఈక్యూ పెరుగుతుంటుంది కానీ... అర్లీ ఛైల్డ్‌హుడ్ నుంచి 18 ఏళ్ల వరకు జరిగినంత వేగంగా ఆ అభివృద్ధి జరగదు. చిన్నప్పుడు తమ తల్లిదండ్రుల, సమాజంలోని ఇతరుల ప్రవర్తన, తాము ఎదిగిన పరిస్థితులు... ఇవన్నీ పిల్లల భావోద్వేగ మేధాశక్తిపై ప్రభావం చూపుతాయి. ∙మెదడులో చిన్నప్పుడు ΄్లాస్టిసిటీ అనే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అంటే... దాన్ని ఏరకంగా మలిస్తే మెదడులో స్వభావాలను ఏర్పరచుకునే తత్వం / పరిస్థితి ఆ రకంగా మారుతుందని చెప్పవచ్చు. ఈ స్వభావం లేదా గుణం మనం ఎదిగే కొద్దీ తగ్గుతూ పోతుంది. అందుకే ‘మొక్కై వంగనిది, మానై వంగునా’ అనే సామెత భావోద్వేగ మేధాశక్తి విషయంలో అక్షర సత్యమని చెప్పవచ్చు.ఎమోషనల్ ఇంటెలిజెన్స్... తల్లిదండ్రుల పాత్ర... తల్లిదండ్రులు కేవలం పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టినంత మాత్రాన సరిపోదని గుర్తించాలి. నిజానికి వారు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశమేమిటంటే... తమ పిల్లలు ఎదుటివారిలో మెలిగేప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ల ప్రవర్తనలో తేడాలుంటే ఎలా చక్కదిద్దాలి... అలాగే విపత్కర పరిస్థితుల్లో వాటిని ఎదుర్కొనేందుకు వాళ్లు అనుసరిస్తున్న పద్ధతులు లేదా వ్యూహమేమిటి, వాటిని పరిష్కరించడానికి వాళ్లు ఎదుర్కొంటున్న మార్గాలేమిటి అని చూడాలి. అవి చాలా చిన్న చిన్న అంశాలే కావచ్చు. ఉదాహరణకు ఏదైనా ఓ కారణంతో ఓ చిన్నారి తన హోమ్‌వర్క్ పూర్తిగా కంప్లీట్ చేయలేదు. ఆ వయసుకు అతడికి అదే విపత్కరమైన పరిస్థితి. దాన్ని అతడు ఎలా ఎదుర్కొంటున్నాడు అన్నది తల్లిదండ్రులు గమనించాలి. కడుపునొప్పి లేదా ఇతరత్రా వంక పెట్టి ఆ రోజుకు స్కూల్ మానేయాలని చూస్తున్నాడా లేదా తగిన (కన్విన్సింగ్) జవాబును సిద్ధం చేసుకుని పరిస్థితిని ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతున్నాడా అన్నది తల్లిదండ్రులు చూడాల్సిన అంశం. ఒకవేళ అతడు స్కూల్ మానాలని అనుకుంటే... అది సరికాదనీ... టీచర్ అడిగినప్పుడు ఈ సమాధానం చెప్పమనీ, ‘‘ముందు నువ్వు ఈ విషయం ఇలా చెప్పు. ఒకవేళ ఆయన వినకపోతే మేమూ స్కూల్‌కు వచ్చి కన్విన్స్ చేస్తా’’మంటూ పిల్లలను పరిస్థితి ఎదుర్కొనేందుకు సంసిద్ధం చేయాలి. ఇది చిన్నపిల్లల విషయంలో జరగాల్సిన పనికి ఓ ఉదాహరణ. పరిస్థితులను బట్టి ఇలాంటివే పిల్లలు ఎదుర్కొనేలా తలిదండ్రులు ధైర్య, స్థైర్యాలను తమ పిల్లల్లో పాదుకునేలా చూడాలి. నిజానికి చదువు కంటే... భవిష్యత్తులో ఎదురయ్యే అనేక రకాల సమస్యలను ఎదుర్కోడానికి ఇలాంటి పాఠాలే చాలా అవసరమని గుర్తించాలి. లోకంలోని అనేక పరిస్థితులను ఎదుర్కోడానికి ఐక్యూ కంటే కూడా ఈక్యూనే ప్రధానం. ఇక అవసరమైన చోట ఓపిగ్గా ఉండటాన్ని అభ్యాసం చేయించాలి. ఓరిమితో ఉండటం క్షమాగుణాన్నీ పెంపోందిస్తుంది. క్షమాగుణం వల్ల గొడవలు తగ్గి చాలా ప్రశాంతంగా హాయిగా జీవించడం సాధ్యమవుతుంది. ఎదుటివారిలో మంచి కనిపించినప్పుడు దాన్ని గుర్తించి అభినందించే మనస్తత్వాన్ని అభ్యాసం చేయిస్తే... ఈర్ష్య తగ్గి చాలా ప్రశాంతతతో జీవించే గుణం అలవడుతుంది. ప్రతికూల ప్రవర్తనలతో ఈక్యూ తగ్గిన సందర్భాల్లో... తల్లిదండ్రులు తమ పిల్లలను తరచూ తిడుతూ, ఇతరులతో పోల్చి వారిని నిందిస్తూ ఉంటే పిల్లలు కూడా తమ తప్పులకు ఇతరులను బాధ్యులు అనుకోవడం, అందుకు వారిని దూషించడం, నిందించడం నేర్చుకుంటారు. ఇది అదేపనిగా కొనసాగడం వల్ల ద్వేషించడాన్ని కొనసాగిస్తుంటారు. ఇక మరికొందరు పెద్దవాళ్ల చేత అదేపనిగా ఎగతాళికి గురవుతుంటే ఆ పిల్లలు బిడియస్తులుగా, పిరికివారుగా తయారవుతారు. మరికొందరు అవమానం కారణంగా నేరస్వభావాన్ని పెంచుకుంటారు. అందుకే పిల్లలకు ఈక్యూ నేర్పడంలో తల్లిదండ్రుల ప్రవర్తన చాలా కీలకం.భావోద్వేగ మేధాశక్తితో కలిగే ప్రయోజనాల్లో కొన్ని... భావోద్వేగ మేధాశక్తి ఉన్నవారికి మానసిక సమస్యలు చాలా తక్కువ. వారిలో శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా తక్కువ అని అధ్యయనాలు తెలుపుతున్నాయి. గుండె జబ్బులు ఉన్న వ్యక్తికి ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే గుండె పోటు వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ. అదే ఒకసారి గుండెపోటు వచ్చిన వ్యక్తికి డిప్రెషన్ ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలు 3.5 రెట్లు అధికం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మనం మనలోని ఉద్వేగ మేధాశక్తిని (ఈక్యూను) నిరంతర సాధనతో పెంచుకుంటూ ఉండటంతో పాటు... ఆ ప్రభావం ఎదుటివారికీ ప్రయోజనం కలిగేలా వ్యవహరించడం (దీన్నే మానసిక విశ్లేషకులు ‘విన్ – విన్ సిచ్యువేషన్’ అంటుంటారు) వల్ల మానవ సంబంధాలు మెరుగుపడటంతో పాటు మరింత మంచి సమాజం ఏర్పడుతుందన్నది చాలామంది మానసిక వైద్యులూ, శాస్త్రవేత్తల మాట. ఈక్యూ ఎందుకంటే... మేధాశక్తి (ఇంటెలిజెన్స్)ని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి విషయ సంబంధమైన పరిజ్ఞానం, తెలివితేటలు మొదలైన వాటికి సంబంధించినది. విషయసంబంధమైన మేధాశక్తిని ఇంటెలిజెన్స్ కోషియెన్స్ (ఐక్యూ) ద్వారా చెబుతారు. రెండోది భావోద్వేగ మేధాశక్తి. దీనినే ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ అంటారు. భావోద్వేగ మేధాశక్తి ద్వారా ఈక్యూను అంచనా వేస్తారు. ఒక వ్యక్తి సంతోషంగా జీవించడానికి, ఇతరులతో చక్కటి సంబంధాలను ఏర్పరచుకోడానికి భావోద్వేగ మేధాశక్తి ఎంతో కీలకం. మరెంతో అవసరం. తెలివితేటలు, చదువు, విషయపరిజ్ఞానం వంటి ఎన్నో అంశాలు ఉండి కూడా కొందరు సమస్యలను ఎదుర్కునేలా అంతగా మానసిక దృఢత్వం లేకపోవడానికీ, ఢక్కాముక్కీలు తిన్నవారిలా కాకుండా సమస్యకు తేలిగ్గా లొంగిపొయి, బెదిరిపోవడానికి కారణం ఈక్యూ తక్కువగా ఉండటమే. -
తాగడానికి చుక్క నీరు లేదు.. విశాఖ మహిళల ఆవేదన
-
'కన్నీళ్లు ఉప్పొంగే క్షణం': శుభాంశు తల్లిదండ్రుల భావోద్వేగం
శుభాంశు శుక్లా బృందం యాక్సియం-4 మెషిన్ ద్వారా అంతర్జాతీయ పరిశోదనా కేంద్రంలోకి విజయవంతంగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా పేరు దేశమంతటా మారుమ్రోగిపోతుంది. ఎక్కడ చూసినా.. ఈ అంశమే చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఆ బృందం 14 రోజుల పాటు చేయనున్న పరిశోధనల గురించే అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరి నోట చూసినా..శుభాంశు శుక్లా పేరే హాట్‌టాపిక్‌గా మారింది. 140 కోట్ల పై చిలుకు బారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ రోదసిలోకి దూసుకెళ్లిను శుభాంశు బృందం మిషన్ సక్సెస్ అవ్వాలన్నేదే దేశమంతటి ఆ కాంక్ష కూడా. ఈ క్రమంలో యావత్తు దేశం గర్వపడేలా చేసే కుమారుడిని కన్న తల్లిదండ్రుల భావోద్వేగం మాటలకందనిది. అంతరిక్షంలోకి అడుగుపెట్టి తమ కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులిద్దరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఏ పేరెంట్స్‌కి అయినా ఇది గర్వంతో ఉప్పొంగే క్షణం. లక్నోలోని తమ ఇంటి నుంచి తమ కుమారుడు శుభాంశు ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆక్సియమ్ మిషన్ 4 ఆకాశంలోకి ఎగిసిన విధానాన్ని వీక్షించారు. ముఖ్యంగా శుభాంశు తల్లి ఆశా శుక్లాకి అదంతా చూసి కన్నీళ్లు ఆగలేదు. అయితే అవి ఆనందంతో ఉప్పొంగిన ఆనందభాష్పాలని చెప్పారామె. తమ బంధువులు, సన్నిహితులు స్క్రీన్లకి అతుక్కుపోయి చూస్తున్న విధానం..పట్టరాని ఆనందాన్నిచ్చిందని అన్నారామె. మాటలే రానంతగా గొతు వణుకుతోందామెకు. అలాగే అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి చేరిన వెంటనే గ్రూప్ కెప్టెన్ శుభాంశు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ..‘‘అంతరిక్షం నుంచి మీ అందరికి నమస్కారం. ఈ యాత్ర చాలా అద్భుతంగా ఉంది. సుమారు 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షంలోకి తిరిగి వచ్చాం. ఈ అద్భుత యాత్రలో ప్రతి భారతీయుడూ నాకు తోడుగా ఐఎస్ఎస్లో ఉన్న భావనే కలుగుతోంది మీ అందరి ప్రేమ, ఆశీస్సులతోనే ఐఎస్ఎస్ చేరగలిగా. మనమంతా కలిసి ఈ యాత్రను మరింత ఉత్సాహభరితంగా మారుద్దాం. మీ అందరితో పాటు త్రివర్ణ పతాకం వెంట రాగా నాతోపాటు ఐఎస్ఎస్ చేరా. ఇది నా ఒక్కని ఘనత కాదు. భారతీయులందరి విజయం." అని అన్నారు. దానికి అతడి తల్లిదండ్రులు స్పందిస్తూ.. అది కేవలం తమ కుమారుడి దేశభక్తి మాత్రమే కాదు. అది చాలా వ్యక్తిగతమైనది. మా బిడ్డ ఇప్పుడు దేశ జెండా తోపాటు ఆ నక్షత్రాల మధ్య యావత్తు దేశ సామూహిక ఆకాంక్షలను తన భుజాలపై మోస్తున్నాడు. అని భావోద్వేగంగా అన్నారు.కాగా, తమ కుమారుడితో అంతరిక్షంలోనికి వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఫోన్లో సంభాషించినట్లు తెలిపారు. నాన్న నా గురించి బాధపడుతూ ఉండిపోవద్దు. దేనికోసం ఇక్కడికి వచ్చానో..ఆ మిషన్‌ని విజయవంతంగా పూర్తి చేస్తాను అని చెప్పినట్లు శుభాంశు తండ్రి అన్నారు. అలాగే ఆయన అక్క సుచి కూడా 30 సెకన్లపాటు శుభాంశుతో మాట్లాడినట్లు సమాచారం. ఇక శుభాంశు కూడా బాగానే ఉన్నాడని, అతడికి శుభాకాంక్షలు కూడా తెలిపామని చెప్పుకొచ్చారు కుటుంబసభ్యులు. #WATCH | Lucknow, Uttar Pradesh: Parents, relatives of IAF Group Captain & astronaut Shubhanshu Shukla, celebrate as #Axiom4Mission lifts off from NASA's Kennedy Space Centre in Florida, US. The mission is being piloted by India's IAF Group Captain Shubhanshu Shukla. pic.twitter.com/bNTrlAq72r— ANI (@ANI) June 25, 2025 (చదవండి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా క్యూట్ లవ్ స్టోరీ..! ప్రియతమ ఈ జర్నీలో..) -
జగన్ గొప్పతనం గురించి చెప్తూ.. లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న జూపూడి
-
అరెస్ట్ అయినందుకు బాధలేదు.. కానీ.. KSR ఎమోషనల్
-
నాకు పునర్జన్మనిచ్చింది వారే.. లైవ్ లో కన్నీరు పెట్టుకున్న కొమ్మినేని
-
కుప్పం మహిళ ఘటనపై విడదల రజిని ఎమోషనల్
-
తరాలు మారి.. అంతరాలు పెరిగి..
ఈ తరం యువతకు, నిన్నటి తరం వయోధికులకు నడుమ దూరం పెరుగుతోంది. పెద్దవాళ్లను బాగా చూసుకోవడమంటే వాళ్లకు కావలసిన వైద్య సదుపాయాలను కల్పించడం, సమయానికి మందులు, భోజనం వంటివి అందజేయడమే అనే భావన పెరిగిపోతోంది. తమ భావోద్వేగాలను పిల్లలతో పంచుకోవాలని పెద్దలు ఆశిస్తుండగా, యువత మాత్రం అందుకు సిద్ధంగా లేదు. ఈ నెల 15వ తేదీన అంతర్జాతీయ వయోధికుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా హెల్పేజ్ ఇండియా ‘ప్రస్తుత డిజిటల్ యుగంలో వృద్ధాప్యంపై యువత దృక్కోణం’అనే అంశంపై సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనంలో యువత, వయోధికుల అభిప్రాయాలను సేకరించారు. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 10 నగరాల్లో 5,798 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వేలోని ముఖ్యాంశాలు..⇒ సర్వేలో వృద్ధాప్యం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు 56 శాతం యువత ‘ఒంటరితనం’అని, మరో 48 శాతం ‘ఇతరులపై ఆధారపడేవారు’అని బదులిచ్చారు. అపార అనుభవం కలిగినవారు అని 51 శాతం యువత పేర్కొనగా, ‘గౌరవించవలసిన వాళ్లు’అని 43 శాతం మంది అభిప్రాయపడ్డారు. ⇒ సర్వేలో పాల్గొన్న వయోధికుల్లో 54 శాతం మంది తాము ఒంటరితనానికి గురవుతున్నట్లు చెప్పారు. 47 శాతం మంది తమ బాధలను పూర్తిగా అర్థం చేసుకోవడం లేదని వాపోయారు. ⇒ ఉమ్మడి కుటుంబాల్లో మాత్రం పెద్దవాళ్లకు, పిల్లలకు మధ్య అనుబంధాలు కొంతవరకు బలంగానే ఉన్నాయి. 49 శాతం యువత తమ తాత, ముత్తాతలతో ఎక్కువ సమయం గడుపుతున్నామని చెప్పారు. 50 శాతం మంది వృద్ధులు తమ కొడుకులతో ఎక్కువ అనుబంధాన్ని, 40 శాతం మంది తమ మనవళ్లతో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉన్నామని వెల్లడించారు. ⇒ చిన్న కుటుంబాల్లో వయోధికులకు సముచితమైన గౌరవం లభిస్తున్నట్లు సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న 75 శాతం వయోధికుల్లో 46 శాతం మంది కుటుంబం తమ మాట వింటుందని, మరో 28 శాతం మంది అప్పుడప్పుడు మాత్రమే వింటుందని తెలిపారు. ⇒71 శాతం వృద్ధులు సాధారణ మొబైల్ ఫోన్లు వాడుతుండగా, 13 శాతం మంది కంప్యూటర్లు, ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తున్నట్లు తేలింది. 66 శాతం వయోధికులు మొబైల్ ఫోన్‌ను ‘సాంకేతిక గందరగోళం’గా భావిస్తున్నారు. ⇒ 51 శాతం యువత, 45 శాతం వయోధికులు తరాల మధ్య అతిపెద్ద అంతరం ఉన్నట్లు పేర్కొన్నారు. 57 శాతం యువత, 49 శాతం వయోధికులు మాత్రం మనం ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చుననే ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉన్నారు. ⇒ సర్వేలో పాల్గొన్న 86 శాతం వయోధికులు కుటుంబమే తమకు అండగా ఉందని తెలిపారు.సంతోషకరమైన వృద్ధాప్యం కావాలి జీవితంలో ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం అనివార్యమైన దశ. పెద్దలను అర్ధం చేసుకోవడంలో యువత విఫలం కావడం వల్ల చాలామంది వయోధికులు సంతోషకరమైన వృద్ధాప్యానికి దూరమవుతున్నారు. కుటుంబ సంబంధాలు బలోపేతంగా ఉంటేనే ఆ సంతోషం లభిస్తుంది. – శ్యామ్, స్టేట్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్, హెల్పేజ్ ఇండియా -
నన్ను క్షమిస్తావు కదూ.. పూర్ణ ఎమోషనల్ పోస్ట్ (ఫోటోలు)
-
మాగంటి గోపీనాథ్ భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్
-
కొడుకు మృతిపై తల్లడిల్లిన తల్లి : కన్నీటి పర్యంతమైన డిప్యూటీ సీఎం
ఐపీఎల్ 2025లో టైటిల్ దక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవంలో తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బెంగళూరులోని విధాన సౌధా, చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సమయంలోఅనేక హృదయవిదారక దృశ్యాలు, కథనాలు అందర్నీ కలచి వేస్తున్నాయి. ముఖ్యంగా క్రికెట్ మీద పిచ్చితో, తమ అభిమాన క్రికెటర్లను చూడాలన్న ఆశతో వచ్చిన యువకులు ప్రాణాలు కోల్పోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురించేసింది. ఇది ఇలా ఉంటే "పోస్ట్‌మార్టం చేయకుండానే తన కొడుకు మృతదేహాన్ని ఇవ్వాలని బిడ్డను కోల్పోయిన తల్లి వేడుకుంది. దీనిపై ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ (DK Shivakumar) భావోద్వేగానికి లోనయ్యారు. తల్లి బాధను అర్థం చేసుకోగలం. కానీ అది చట్టపరమైన ప్రక్రియ అంటూ శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు.నిన్న బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన తండ్రిని ఓదార్చడం ఎవ్వరి తరమూ కాలేదు. ‘‘కనీసం నా కొడుకు మృతదేహాన్ని నాకు ఇవ్వండి. పోస్ట్‌మార్టం చేయవద్దు, ముక్కలుగా కోయవద్దు..’’ అంటూ అధికారులను వేడుకున్నాడు. తనకు తెలియకుండానే వచ్చాడు..ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎవ్వరొచ్చినా నా బిడ్డను తీసుకురాలేరు అంటూ కన్నీరుమున్నీరయ్యాడుకేంద్ర మంత్రి శోభా కరండ్లజే శివకుమార్ వెంటనే రాజీనామా చేయాలని తొక్కిసలాటపై దర్యాప్తు చేయడానికి హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో శివకుమార్ స్పందించారు. ఈ విషాదంపై బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కాగా సంఘటన జరిగిన వెంటనే డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పారు. 35వేల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేడియంలో భారీ జనసమూహం సరిపోలేదన్నారు. మరోవైపు ఊహించని దానికంటే సుమారు 8 లక్షల మంది జనం రావడంతోనే ప్రమాదం జరిగిందని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర తెలిపారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే ఈ విషయంపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించినట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ప్రకటించారు. -
‘నాన్నా.. ద్రోహం జరిగింది’: లాలూకు తేజ్ లేఖ
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav) మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయన తన తల్లిదండ్రులకు.. పార్టీలో తనకు జరిగిన ద్రోహంపై లేఖ రాసి, కలకలం సృష్టించారు. పార్టీ నుంచి తనకు బహిష్కరించిన కొన్నాళ్లు తేజ్ ప్రతాప్ లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.मेरे प्यारे मम्मी पापा....मेरी सारी दुनिया बस आपदोनों में ही समाई है।भगवान से बढ़कर है आप और आपका दिया कोई भी आदेश।आप है तो सबकुछ है मेरे पास।मुझे सिर्फ आपका विश्वास और प्यार चाहिए ना कि कुछ और।पापा आप नही होते तो ना ये पार्टी होती और ना मेरे साथ राजनीति करने वाले कुछ जयचंद जैसे…— Tej Pratap Yadav (@TejYadav14) May 31, 2025ఈ లేఖను తేజ్ ప్రతాప్ యాదవ్ తన తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ రాశారు. పార్టీలో తనకు జరిగిన ద్రోహం గురించి దానిలో వివరించారు. పార్టీలో జైచంద్ లాంటి ద్రోహులు తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. అయితే వీరినే మీరు నమ్ముతున్నారని లాలూపై ఆయన ఆరోపించారు. తనకు కావలసినది తల్లిదండ్రుల ప్రేమేనని పేర్కొన్నారు. ‘నా ప్రియమైన మమ్మీ, డాడీ... నా ప్రపంచం మొత్తం మీ ఇద్దరి చుట్టూనే తిరుగుతుంటుంది. మీరు నాకు దేవుడి కంటే గొప్పవారు. మీ ప్రతి మాట నాకు దేవుని ఆదేశం లాంటిది. మీరు నాతో ఉన్నప్పుడు నాకు అన్నీ ఉన్నాయి. నేను కోరుకునేది మీ నమ్మకం, ప్రేమ. ఇంకేమీ కాదు. నాన్నా.. మీరు లేకుంటే ఈ పార్టీ ఉండేది కాదు. కుట్రా రాజకీయాలు చేసే జైచంద్ వంటి దురాశపరులు కూడా ఉండేవారు కాదు. అమ్మానాన్నలిద్దరూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’ అని తేజ్ ఆ లేఖలో రాశారు. గతంలో తేజ్ ప్రతాప్.. అనుష్క యాదవ్(Anushka Yadav) అనే మహిళ పక్కన ఉన్న ఫేస్ బుక్ ఫోటోవైరల్గా మారింది. 12 ఏళ్లుగా వీరి మధ్య సంబంధం ఉంటుంటూ సోషల్ మీడియలో కథనాలు వచ్చాయి. ఇది పార్టీని అంతర్గతంగా ఇబ్బందులలోకి నెట్టివేసింది. ఈ నేపధ్యంలో తేజ్ ప్రతాప్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుండి బహిష్కరిస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి స్పందించిన తేజ్ ప్రతాప్.. తన ఫేస్బుక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని, ఆ ఫొటో నకిలీదని, తనను అప్రతిష్టపాలు చేసే ప్రచారంలో భాగంగా ఇలా చేశారని పేర్కొన్నారు. ఈ వివాదం బీహార్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.ఇది కూడా చదవండి: COVID-19: పిల్లలను స్కూళ్లకు పంపొద్దు: కర్నాటక ప్రభుత్వం -
‘శుభం’ మూవీ సక్సెస్ మీట్ లో సమంత సందడి (ఫొటోలు)
-
వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య ఎమోషనల్..
-
విద్యార్థిని మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి హరీష్ రావు
-
చిన్నారి కథ విని హరీష్‌రావు కంటతడి..
సాక్షి, సిద్ధిపేట: ఓ చిన్నారి కథ విని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు భావోద్వేగానికి గురయ్యారు. సిద్ధిపేటలో విద్యార్థుల కోసం లీడ్ ఇండియా ఆధ్వర్యంలో 'భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి' అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరీష్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి మాటలకు ఆయన చలించిపోయారు.. కంటతడి పెట్టారు.ఆ విద్యార్థిని మాట్లాడుతూ తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని.. తల్లే తనను కష్టపడి చదివిస్తోందని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ చిన్నారి మాటలు విన్న హరీష్‌రావుతో పాటు ఆ వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఆ బాలికను ఆత్మీయంగా దగ్గరికి తీసుకునన్న హరీష్‌రావు.. వేదికపై తన పక్కన కూర్చోబెట్టుకుని ఓదార్చారు. -
స్నేహానికి నిర్వచనంగా ఈ ముగ్గురు.. మహాతల్లి ఎమోషనల్ (ఫోటోలు)
-
తండ్రీకూతుళ్లను కలిపిన కాలం కథ
అందరి నాన్నల్లా అతడు కూడా తన కూతురిని అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. తన కూతురిని పైలట్ చేయాలనుకున్నాడు. కానీ కూతురు ఊహించని షాక్ ఇచ్చింది. తన అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దీంత తండ్రికూతుళ్ల మధ్య పూడ్చలేనంత దూరం పెరిగింది. అయితే కాలం (Time) ఎవరి కోసం ఆగదుగా, అది తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎంతటి గాయాన్నైనా కాలం నయం చేస్తుందంటారు. అంతేకాదు విడిపోయిన మనుషులను కూడా కాలం కలుపుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తండ్రి విషయంలోనూ అదే జరిగింది.అస్సలు ఊహించలేదు..ఆయన పేరు అశోక్ కేత్కర్. భారత వాయుసేనలో వింగ్ కమాండర్‌గా రిటైర్ అయ్యారు. విధి నిర్వహణలో ఆయన తన రెండు కాళ్లను కోల్పోయి చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. దీని కంటే కూడా తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కన్నకూతురు భార్గవి తనను కాదని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం కేత్కర్‌ను ఎక్కువ బాధ పెట్టింది. దీంతో కూతురికి కటీఫ్ చెప్పారు. ఇది జరిగిన ఐదేళ్ల తర్వాత ఒకరోజు కేత్కర్ విమానంలో ముంబై (Mumbai) నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనకు ముందుగా తెలియదు ఈ ప్రయాణం (Journey) తన జీవితంలో అత్యంత తీపి జ్ఞాపకం అవుతుందని. భూమాకాశాల మధ్యలో విధి ప్రత్యేక ‘నిధి’ని కానుకగా అందివ్వబోతోందని ఆయన అస్సలు ఊహించలేదు.విమానం గాల్లోకి లేవగానే ఓ చిన్నపిల్లవాడు కేత్కర్కు వచ్చి గ్లాసుతో మంచినీళ్లు అందించాడు. ఆ బుడ్డోడిని చూసి ఎంతో ముచ్చటపడ్డారు కేత్కర్. ఇంతలో మైక్ నుంచి మహిళా పైలట్ (Woman Pilot) మాటలు వినిపించాయి. కేత్కర్‌ను యుద్ధవీరుడిగా ప్రయాణికులకు పరిచయం చేసింది. తర్వాత మాటలు విని ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఎందుకంటే ఆ పైలట్ ఎవరో కాదు, ఆయన కూతురు భార్గవి. ‘సర్, మీరు బంధాలను తెంచుకున్న అమ్మాయి, మీ కూతురు భార్గవి ఈ విమానాన్ని నడుపుతోంది’ అనే మాటలు చెవిన పడగానే కేత్కర్ ఖిన్నుడయ్యారు.కేత్కర్ తేరుకునేలోపే కాక్‌పిట్ నుంచి బయటకు వచ్చిన భార్గవి, ఆయనకు ఎదురుగా నిలబడి సెల్యూట్ చేసింది. ‘నాన్నా.. నేను మీ కలను సాకారం చేశాను. మీరు అనుకున్నట్టుగానే పైలట్ అయ్యాను. దయచేసి నన్ను క్షమించండి’ అని వేడుకుంది. కూతురిని అలా చూడగానే ఆయన కరిగిపోయాడు. తన బిడ్డను ఆలింగనం చేసుకుని అప్యాయత కురిపించారు. ఇందాక మీకు మంచినీళ్లు ఇచ్చిన చిన్నారి ఎవరో కాదు తన కొడుకే అని భార్గవి చెప్పడంతో కేత్కర్ ఆనందంతో పొంగిపోయారు. ‘తాతయ్యా, నేను మీలాగే ఫైటర్ పైలట్ అవ్వాలనుకుంటున్నాను’ అని మనవడు అనడంతో ఆయన సంతోషం రెట్టింపయింది.‘బయట సూర్యుడు అస్తమించాడు. విమానం కిందకు దిగిపోయింది. కానీ అశోక్ కేత్కర్ జీవితం మళ్ళీ చిగురించింది’ అంటూ ఈ కథను ఎక్స్‌లో షేర్ చేశారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka). అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు ఆయన వెల్లడించలేదు. ఈ పోస్ట్‌కు 3 లక్షలకు పైగా వ్యూస్, 5 వేలకు పైగా లైకులు వచ్చాయి.నెటిజన్ల రియాక్షన్..హర్ష్ గోయెంకా పోస్ట్‌పై పలువురు నెటిజనులు స్పందించారు. ‘దర్శకుడు మణిరత్నం దీన్ని చదివితే, ఈ కథకు ఒక రూపాన్ని ఇచ్చి సినిమా తెరకెక్కిస్తార’ని ఒకరు కామెంట్ చేశారు. ‘ఆ తండ్రి గర్వం, బాధ తన కూతురి కౌగిలిలో కరిగిపోయాయి. ఒకప్పుడు వారిని విడదీసిన ఆకాశం ఇప్పుడు వారిని కలిపింది. అతడు కూతురిని కోల్పోయాడు కానీ హీరోని కనుగొన్నాడు!’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇది నిజంగా జరిగిందనడానికి నమ్మదగిన ఆధారాలు లేవని మరొక యూజర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సోర్టీ చాట్‌జీపీటీ రాసిందా అని ఒక నెటిజన్ వ్యంగ్యంగా అడిగారు. కొంతమంది అయితే స్టోరీలోని లొసుగులను ప్రశ్నించారు. ఎక్కువ మంది మాత్రం పాజిటివ్‌గా స్పందించారు. At Mumbai airport, a wheelchair-bound veteran, Wing Commander Ashok Ketkar, boarded a flight to Delhi. He had lost both legs in service, but what truly broke him was losing his daughter Bhargavi, who married against his wishes.He hadn’t spoken to her in 5 years.Mid-flight, an…— Harsh Goenka (@hvgoenka) March 26, 2025 -
కారు కొన్న కస్టమర్.. ఆనంద్ మహింద్రా ఎమోషనల్!
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా.. అబ్బురపరిచే, ఆలోచింపజేసే వీడియోలను, సమాచారాన్ని తన ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. ఈ సారి ఓ కస్టమర్ తమ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొన్న వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ఇది కేవలం వీడియో మాత్రమే కాదంటూ ఎమోషనల్ అవుతూ మూడు దాశాబ్దాల క్రితం నాటి కథను రాసుకొచ్చారు. ఇంతకీ ఆ కస్టమర్ ఎవరు.. ఎమోషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..ఆనంద్ మహీంద్రా ఇటీవల డాక్టర్ పవన్ గోయెంకా ప్రయాణంపై తన హృదయపూర్వక ఆలోచనలను పంచుకున్నారు. 1990ల ప్రారంభంలో గోయెంకా యూఎస్‌లో జనరల్ మోటార్స్‌లో మంచి హోదాతో కూడిన ఉద్యోగాన్ని విడిచి భారత్‌కు తిరిగి వచ్చేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఆనంద్ మహింద్రా ఆయన్ను కంపెనీ నాసిక్ ఫెసిలిటీలో ఆర్అండ్డీ డిప్యూటీ హెడ్‌గా మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం& ఎం) లో చేరేలా ఒప్పించారు.అప్పట్లో కంపెనీ ఆర్అండ్డీ విభాగం పరిస్థితిని చూసిన పవన్ గోయెంకా ఇక్కడ కొనసాగుతారా లేదా అన్న సందేహాలు ప్రారంభంలో ఉన్నప్పటికీ ఆయన కొనసాగారు. పరిశోధన, అభివృద్ధి బాధ్యతలు చేపట్టారు. ఐకానిక్ మహీంద్రా స్కార్పియో రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వం కంపెనీ ఉత్పత్తి శ్రేణిని రూపొందించడమే కాకుండా, భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో సృజనాత్మకతను కొనసాగించే ప్రపంచ స్థాయి ఆర్ & డి కేంద్రానికి పునాది వేసింది. ఆ తర్వాత గోయెంకా ఎంఅండ్ఎం లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో పదవి దాకా ఎదిగారు.గోయెంకా, ఆయన భార్య మమత ఇటీవల మహీంద్రా లేటెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఒకటైన ఎక్స్ఈవీ 9ఈ వాహనాన్ని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోనే ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. తన దృష్టిలో ఈ క్షణం కేవలం ఒక లావాదేవీ మాత్రమే కాదే.. అంత కంటే ఎక్కువ. మహీంద్రా ఆటోమోటివ్ ల్యాండ్ స్కేప్ ను మార్చడంలో కీలక పాత్ర పోషించిన గోయెంకా ఇప్పుడు తాను చేసిన ఆవిష్కరణలను స్వీకరిస్తున్నారు.2021లో పదవీ విరమణ చేసిన తరువాత, పవన్ గోయెంకా భారతదేశ అంతరిక్ష కార్యక్రమాలలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన అంతరిక్ష విభాగం సంస్థ ఇన్-స్పేస్ చైర్మన్‌గా కొత్త సవాలును స్వీకరించారు. భారతీయ పరిశ్రమకు ఆయన చేసిన విశేష సేవలు ఇటీవలే ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో గుర్తింపు పొందాయి. ప్రస్తుతం గోయెంకా ఐఐటీ మద్రాస్ లో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ గా, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్థానిక విలువ-యాడ్ అండ్ ఎక్స్ పోర్ట్స్ (స్కేల్ ) స్టీరింగ్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు.This is not just another video for me…When Pawan Goenka decided to return to India in the early ‘90s, leaving behind a job at General Motors, I managed to convince him to join @Mahindra_Auto at Nashik as Deputy Head of R&DHe often relates how when he first went to Nashik and… pic.twitter.com/auggd8gEQ9— anand mahindra (@anandmahindra) March 27, 2025 -
నా నియోజకవర్గం, నా ప్రజలు అనుకున్న.. విడదల రజిని ఎమోషనల్
-
ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసిన యాంకర్ రష్మీ..
-
ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ట్రూడో కంటతడి
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని హోదాలో చివరి ప్రసంగంలో తాను తెచ్చిన పాలసీతోపాటు అమెరికాతో నెలకొన్న ‘సుంకాల ఉద్రిక్తత’లపైన మాట్లాడారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కంటతడి పెడుతూ ప్రసంగించారు. తొమ్మిదేళ్లపాటు.. ప్రత్యేకించి కష్టకాలంలోనూ దేశ ప్రయోజనాలే ప్రాధాన్యంగా తాను పని చేశానంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.ప్రజా వ్యతిరేకత పెరిగిపోవడంతో ట్రూడో ఈ జనవరిలో కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ కొత్త నేతను ఎన్నుకునే దాకా ఆయన ఆ పదవిలో కొనసాగుతానని ప్రకటించారు. అయితే ఈ మధ్యలోనే డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టారు. కెనడాతో పాటు పలు దేశాలపై సుంకాలు విధించి వాణిజ్య యుద్ధానికి తెర తీశారు.ట్రంప్ చర్యలకు ప్రతిగా.. కెనడా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించింది. ప్రతీకార సుంకాల పరిణామాలపై ఇద్దరు నేతలు సుమారు గంటపాటు ఫోన్లో చర్చించారు. అనంతరం ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ప్రధాని పదవిలో కొనసాగేందుకే ట్రూడో వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వుతున్నారని అన్నారు. టారిఫ్ సంక్షోభాన్ని తన రాజకీయం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.అక్కడితో ఆగకుండా.. 51వ అమెరికా రాష్ట్రానికి గవర్నర్‌గా కొనసాగేందుకు ట్రూడో తహతహలాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు (కెనడాను అమెరికాలో విలీనం చేసి 51 రాష్ట్రంగా చేస్తామంటూ చేసిన ప్రకటనకు కొనసాగింపుగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు..). అయితే ట్రంప్ ఆరోపణలను తన చివరి ప్రసంగంలో ట్రూడో తోసిపుచ్చారు. కెనడా ప్రయోజనాల కోసం.. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకే ప్రతీకార సుంకాలను విధించినట్లు తెలిపారాయన. ఇలాంటి ఆరోపణలు తనను కుంగదీయలేవని.. కడదాకా కెనడియన్ల కోసం కష్టపడతానని పేర్కొంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదిలా ఉంటే.. మార్చి 9వ తేదీన లిబరల్ పార్టీ కొత్త నేతను ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. "We got you, even in the very last days of this government": In a rare display, Canadian PM Justin Trudeau gets emotional in press conference while talking about his policies amid Trump tariff war #Canada #CanadaPM #JustinTrudeau #Trudeau #tariffs #tariffwar pic.twitter.com/XRneiCENNN— News18 (@CNNnews18) March 7, 2025 VIDEO CREDITS: News18 -
పెంపుడు కుక్క హఠాన్మరణం.. మంత్రి కొండా సురేఖ కన్నీరుమున్నీరు
సాక్షి, వరంగల్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ పెంపుడు కుక్క గుండెపోటుతో మృతి చెందడంతో భావోద్వేగానికి లోనైనా మంత్రి.. కన్నీరుమున్నీరయ్యారు. గుండెపోటుతో చనిపోయిన హ్యాపీకి మంత్రి కొండా కుటుంబం.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హ్యాపీ హఠాన్మరణంతో సురేఖ కుటుంబీకులు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.గత కొన్నాళ్లుగా హ్యాపీతో మధుర అనుభూతులను మంత్రి సురేఖ, స్టాఫ్ పంచుకున్నారు. 2021లో కూడా కొండా సురేఖకు చెందిన ఓ పెంపుడు కుక్క మృతి చెందితే ఆ సమయంలోనూ ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Minister Konda Surekha breaks down in tears over sudden death of pet dog ‘Happy’pic.twitter.com/f87jhedaPA— Naveena (@TheNaveena) March 6, 2025 -
ప్రతిరోజు నీ ప్రేమలో.. భార్య గురించి మనోజ్ అలా (ఫొటోలు)
-
'మిస్ యూ మై సన్'.. ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ తీవ్ర భావోద్వేగం!
ప్రముఖ తెలుగు లేడీ కమెడియన్, కితకితలు హీరోయిన్ గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో గీతా సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సరిగ్గా రెండేళ్ల క్రితం చేతికి అందివచ్చిన కుమారుడిని కోల్పోయిన గీతాసింగ్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఫిబ్రవరి 18న తన కుమారుడి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించింది. తన కొడుకు తనతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటూ.. మిస్ యూ రా అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. (ఇది చదవండి: కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం)అయితే.. గీతాసింగ్ ఇప్పటివరకు అసలు పెళ్లే చేసుకోలేదు. తన సోదరుడి కుమారులను దత్తత తీసుకుని పోషిస్తున్నారు. వారిలో పెద్దబ్బాయి ఈ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇకపోతే కితకితలు, ఎవడిగోల వాడిది సినిమాలో గీతా సింగ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా చిత్రాలు చేసింది. ప్రస్తుతం మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది. View this post on Instagram A post shared by Geeta Singh (@kithakithalu_geetasingh) -
నందమూరి తారకరత్న వర్ధంతి.. పిల్లలతో కలిసి అలేఖ్యా రెడ్డి నివాళి (ఫొటోలు)
-
వీడియో: కన్నీళ్లను దిగమింగుకున్న ఆప్ నేత
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంపై ఆప్ నేత, ఆరోగ్య శాఖ మంత్రి(కాబోయే మాజీ) సౌరభ్ భరద్వాజ్ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ గ్రాండ్ విక్టరీ కైవసం చేసుకోగా, అరవింద్ కేజ్రీవాల్ సహా ఆప్ దిగ్గజాలంతా ఈ ఎన్నికలో ఓడిన సంగతి తెలిసిందే. అయితే.. ఓటమిని అంగీకరిస్తున్నట్లు చెబుతూనే సౌరభ్ భదర్వాజ్ కన్నీళ్లను దిగమింగుకున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భరద్వాజ్ బీజేపీ అభ్యర్థి షికా రాయ్ చేతిలో ఓడారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘ఆటలో గెలుపోటములు సహజమే. అలాగే రాజకీయాల్లో కూడా. నా.. పార్టీ ఓటమిని నేను అంగీకరిస్తున్నా. కానీ, కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే మాత్రం భరించలేకపోతున్నా’’ అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టబోయారాయన. అయితే వెంటనే పక్కకు వెళ్లి.. ఆ కన్నీళ్లను దిగమింగుకున్నారు.ఢిల్లీలో ఆప్ కోసం ప్రతీ కార్యకర్త కష్టపడ్డారని, వాళ్లను చూస్తే గర్వంగా ఉందని అన్నారాయన. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. Saurabh Bharadwaj of Aam Admi Party gets emotional when his cader visit him to console after losing in Delhi elections He couldn’t control from crying! He contested from Greater Kailash and lost by 3188 votes! Shika Rai won from this place!#saurabhbhardwaj #DelhiElection2025… pic.twitter.com/ktFqzvKUUg— North East West South (@prawasitv) February 10, 2025 గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి గత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో సౌరభ్ భరద్వాజ్ నెగ్గారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి.. బీజేపీ షికా రాయ్ చేతిలో మూడు వేల ఓట్ల ఆధిక్యంతో ఓడారు. షికా రాయ్‌కు 49,594 ఓట్లు పోలవ్వగా, భరద్వాజ్‌కు 46,406 ఓట్లు పడ్డాయి. అలాగే.. కాంగ్రెస్ అభ్యర్థి గర్విత్ సింఘ్వీకి 6,711 ఓట్లు పోలయ్యాయి. 2015 ఎన్నికల్లో బీజేపీ రాకేష్ కుమార్‌పై 14 వేల ఓట్లు, 2020 ఎన్నికల్లో 16 వేల ఓట్ల ఆధిక్యంతో భరద్వాజ్ గెలుపొందడం గమనార్హం. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో.. బీజేపీ 48 సీట్లు దక్కించుకుని అద్భుత విషయం సాధించింది. గత రెండు ఎన్నికల్లో 67, 62 సీట్లు సాధించిన ఆప్.. ఈసారి 22 స్థానాలకు పడిపోయింది. ఇక.. కాంగ్రెస్ జీరోకి పరిమితమైంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక.. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరే అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
ఆయనో స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్! మీనా పెళ్లిలో మాత్రం భావోద్వేగంతో..
సముద్రం సునామీగా ముంచెత్తి దాదాపు 6 వేల మందిని పొట్టనబెట్టుకుంది. అంతటి ప్రళయం నుంచి అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడినవాళ్లు కొందరే. అందులో రెండేళ్ల ఓ పసిప్రాణం కూడా ఉంది. పసికందుగా ఆమెను తన చేతుల్లోకి తీసుకున్న ఆ ఐఏఎస్ అధికారి.. ఇప్పుడు తండ్రి స్థానంలో ఆమెపై అక్షింతలు జల్లి దీవించి భావోద్వేగానికి లోనయ్యారు. హృదయాన్ని హత్తుకునే ఈ ఘటనలోకి వెళ్తే.. డిసెంబర్ 26, 2004 ముంచెత్తిన సునామీలో తమిళనాడుకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే. నాగపట్టణంలో సహాయక చర్యలు పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆఫీసర్‌గా పేరున్న రాధాకృష్ణన్‌కు అప్పగించింది. అప్పుడు ఆయన తంజావూరు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. డిసెంబర్ 28వ తేదీన కీచన్‌కుప్పం ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్న బృందాలకు.. శిథిలాల కింద ఓ పసికందు ఏడుపులు వినిపించాయి. దాదాపు రెండేళ్ల వయసున్న చిన్నారిని సురక్షితంగా బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. అదృష్టం కొద్దీ ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఆ సునామీ నుంచి బయటపడిన అతిచిన్న వయస్కురాలు కూడా ఆమెనే!. అయితే ఆమె తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియదు. అలాంటప్పడు చిన్నారి సంరక్షణ బాధ్యతలు ఎలా? అని అధికారులు ఆలోచన చేశారు.ఈలోపు.. విషయం తెలిసిన అప్పటి జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్-కృతిక దంపతులు ముందుకు వచ్చారు. ఆ చిన్నారికి మీనా అని పేరు పెట్టి.. అన్నై సత్య ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమె సంరక్షణ మొత్తం ఆ జంటే చూసుకుంటూ వచ్చింది. ఈలోపు రాధాకృష్ణన్‌కు ట్రాన్స్ఫర్ అయ్యింది. అయితే మరో ప్రాంతానికి బదిలీ అయినప్పటికీ.. రాధాకృష్ణన్ జంట మీనా సంరక్షణ బాధ్యతను మరిచిపోలేదు. వీలు చిక్కినప్పుడల్లా ఆమె దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అదే ఆశ్రమంలో సౌమ్య ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది. అలా.. ఏళ్లు గడిచిపోయాయి. సాధారణంగా 18 ఏళ్లు నిండిన తర్వాత.. వాళ్లకు ఆశ్రమంలో కొనసాగడానికి వీలు ఉండదు. ఆశ్రమంలో సౌమ్య, మీనాలకు మాత్రమే ఈ ఇబ్బంది ఎదురైంది. విషయం తెలిసి.. రాధాకృష్ణన్ ముందుకొచ్చారు. మీనా, సౌమ్య బాధ్యతలకు దాతల సహకారం తీసుకున్నారు. అలా.. వాళ్లిద్దరూ ఉన్నత చదువులు పూర్తి చేసుకున్నారు. అలా వాళ్లిద్దరికీ తండ్రికాని తండ్రిగా మారిపోయారు.రెండేళ్ల కిందట.. సౌమ్య ఓ టెక్నీషియన్‌ను వివాహం చేసుకుంది. ఆ వివాహానికి సౌమ్య తరఫున పెద్దగా రాధాకృష్ణన్ హాజరై ఆశీర్వదించారు. కిందటి ఏడాది సౌమ్య ఓ బిడ్డకు జన్మనిస్తే.. ఇంటికి పిలిపించుకుని మరీ మనవరాలిని దీవించారు. ఇక మీనా వయసు ఇప్పుడు 23 ఏళ్లు. నర్సింగ్ పూర్తి చేసుకుంది. మీనాను వివాహం చేసుకునేందుకు మణిమరన్ అనే బ్యాంక్ ఉద్యోగి ముందుకు వచ్చాడు. విషయం తెలిసి రాధాకృష్ణన్ సంతోషించారు. ఫిబ్రవరి 2వ తేదీన నాగపట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మీనా-మణిమరన్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు సౌమ్య తన భర్త, కూతురితో హాజరైంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ ప్రభుత్వంలో అదనపు చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దత్త పుత్రిక వివాహానికి స్వయంగా హాజరై తండ్రి స్థానంలో ఉండి తన బాధ్యతను నిర్వర్తించారు. ఆశ్రమంలో సౌమ్య-మీనాలు గడిపిన రోజులను, వాళ్ల స్నేహాన్ని, ఆశ్రమ నిర్వహణకు సహకరించిన సూర్యకళను ఆయన గుర్తు చేసుకున్నారు. అన్నింటికి మించి.. 2018లో గాజా తుపాన్ సమీక్ష కోసం వెళ్లినప్పుడు మీనా తనను ‘‘నాన్నా..’’ అని పిలవడాన్ని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వివరాలను ఆయనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం గమనార్హం. -
భూమనను పట్టుకొని ఏడ్చేసిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు
-
కుమార్తె స్నాతకోత్సవంపై భావోద్వేగ ట్వీట్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
-
నా భర్త వల్లే ఇది సాధ్యమైంది.. ఈ ఫొటో ఆయన కోసమే! (ఫోటోలు)
-
లావణ్య మృతదేహానికి అంత్యక్రియలు
సీతంపేట: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణించిన సూరిశెట్టి లావణ్య మృతదేహానికి స్థానిక జగన్నాథపురం శ్మశానంలో ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం అంత్యక్రియలు జరిగాయి. తెల్లవారు జామున 3 గంటలకు విశాఖ చేరిన మృతదేహాన్ని అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్లో సందర్శనార్థం ఉంచారు. లావణ్య భర్త, కుమార్తెలు, కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ తదితరులు లావణ్య మృతదేహం వద్ద నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దహన సంస్కారాల నిమిత్తం ప్రభుత్వ సాయాన్ని అర్బన్ ఎమ్మార్వో రమేష్‌బాబు అందించారు. బోరున విలపించిన∙కుమార్తెలు : మృతదేహం విశాఖ చేరడానికి కొద్దిసేపటి ముందు లావణ్య మృతి చెందిన విషయం ఆమె కుమార్తెలకు తెలిపారు. దీంతో కుమార్తెలిద్దరూ షాక్‌కు గురయ్యారు. తల్లిని విడిచి ఎప్పుడు ఒక్క క్షణం ఉండలేని పిల్లలు, తల్లి ఇక లేదన్న విషయాన్ని తట్టుకోలేక తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తిరుపతి వెళ్లే ముందు అమ్మ చెప్పిన మాటలు గుర్తుచేసుకుని బోరున ఏడ్చేశారు. -
రద్దీలో వద్దనుకున్నా.. అంతలో దుర్ఘటన
మద్దిలపాలెం: రద్దీగా ఉండడంతో క్యూలోంచి బయట వెళ్లిపోదాం అనుకున్నంతలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో తన భార్య రజని ప్రాణాలు కోల్పోయిందని భర్త గుడ్ల లక్ష్మారెడ్డి భోరుమంటూ విలపించారు. అప్పటి వరకూ ఇద్దరం కలిసి క్యూలో జాగ్రత్తగా వెళ్తున్న సమయంలో రద్దీ అధికమవ్వడంతోపాటు గేట్లు తెరిచారని, దీంతో జనం ఒక్కసారిగా క్యూలో కదలడం పలువురి ప్రాణాలు పోవడానికి కారణమయిందని మద్దిలపాలేనికి చెందిన మృతురాలు రజని భర్త లక్ష్మారెడ్డి వాపోయారు. రెండు గంటల తర్వాత జాడ తెలిసింది ‘తొక్కిసలాటలో తప్పిపోయిన రజని కోసం వెతుకుతున్నా. ఎక్కడా జాడలేదు. దీంతో ఏం చేయాలో తెలియలేదు. నా చేతిలో ఫోన్‌కూడా రజనీ బ్యాగులో ఉండిపోయింది. దీంతో అక్కడే వున్న ఆటో డ్రైవర్ ఫోన్ ద్వారా కాల్ చేస్తున్న పనిచేయలేదు. ఏం జరిగిందో తెలియదు. రెండు గంటల తర్వాత ఆస్పత్రిలో చేర్పింపిచారని సమాచారం అందింది. ఆ ఆస్పత్రి ఎక్కడుందో తెలియక ఆటో ద్వారా అక్కడి చేరుకున్నా. వెళ్లి చూసే సరికి విగత జీవిగా పడి ఉంది’అంటూ బోరున విలపించారు. అమెరికా నుంచి హుటాహుటిన వచ్చిన హర్షవర్ధన్ రెడ్డి.. తల్లి భౌతికకాయాన్ని చూసి సొమ్మసిల్లిపోయాడు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రజనీ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నేడు అంత్యక్రియలు అమెరికా నుంచి మృతురాలి తమ్ముడు శనివారం విశాఖ వస్తున్నారు. అతను రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని భర్త లక్ష్మారెడ్డి తెలిపారు. -
చాలా దారుణం.. టీటీడీ ఘటనపై వంగా గీత ఎమోషనల్
-
మనిషి మనిషికో ఇంటిమసీ అవసరం
అంజలి, కార్తీక్‌లకు పెళ్లయి మూడేళ్లవుతోంది. అంజలికి ప్రయాణాలంటే ఇష్టం. అడ్వంచర్ ట్రిప్స్ అంటే ప్రాణం. ఎప్పటికప్పడు కొత్త హాబీలను ప్రయత్నిస్తుంటుంది. కార్తీకేమో ఒక పరిశోధకుడు. మెదడుకు పదునుపెట్టే పుస్తకాలు చదవడం, సమకాలీన అంశాలపై లోతుగా చర్చించడం చాలా ఇష్టం. కార్తీక్ తనతో సంతోషంగా లేడని అంజలికి అనిపించేది. అంజలి తన ఆలోచనలను అర్థం చేసుకోవడంలో ఆసక్తి చూపడం లేదని కార్తీక్‌కు అనిపించేది. కానీ ఆ విషయం ఒకరికొకరు చెప్పుకోలేక మథనపడుతున్నారు. రవి సాఫ్ట్వేర్ ఇంజినీర్, మీరా స్కూల్ టీచర్. రవి తన ప్రేమను ముద్దులు, హగ్గులు, బెడ్ టైమ్‌లో వ్యక్తీకరించేవాడు. మీరా రోజువారీ విషయాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ ఉండేది. కానీ రవి తన మాటలు వినడంలేదని అనిపించేది. రవేమో మీరా తనను పట్టించుకోవడంలేదని భావించేవాడు. దీంతో ఇద్దరి మధ్య ఆత్మీయతానురాగాలు దూరమవుతున్నాయి. తరచూ గొడవలు పడుతున్నారు. ఇలాంటి సమస్య మీకూ ఎదురై ఉండవచ్చు. మీరూ మీ భాగస్వామి బాగానే ఉంటున్నా, ఏదో దూరం పెరుగుతోందని అనిపించవచ్చు. అందుకు కారణమేంటో తెలియక ఆందోళన పడుతూ ఉండవచ్చు. అందుకు ప్రధాన కారణం సాన్నిహిత్యం (intimacy) గురించి అవగాహన లేకపోవడమేనని చెప్పవచ్చు. శారీరక సాన్నిహిత్యం ఉంటే అన్నీ సర్దుకుంటాయని చాలామంది అనుకుంటారు. కానీ అంతకుమించి అవసరమైన సాన్నిహిత్యాలు కూడా ఉన్నాయి. వాటిని గుర్తించకపోవడం లేదా పరిష్కరించకపోవడం సమస్యలకు దారితీస్తుంది. దంపతులు పరస్పరం వారి అవసరాలను అర్థం చేసుకుని, సాన్నిహిత్య రకాల మధ్య సమతౌల్యాన్ని కలిగి ఉంటే, సంబంధం మరింత గాఢంగా ఉంటుంది. సమస్యలు తీవ్రమైనప్పుడు ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సహాయం తీసుకోవడం అవసరం. 1. భావోద్వేగ సాన్నిహిత్యంబంధానికి, అనుబంధానికి మూలస్తంభం emotional intimacy ఇద్దరి మధ్య భావాలు, అనుభవాలను నిరభ్యంతరంగా పంచుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు భావోద్వేగ సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అయితే, ఒక వ్యక్తి ఎమోషనల్‌గా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు మరో వ్యక్తి దూరంగా ఉంటే అది అసంతృప్తికి, ఒంటరితనానికి దారితీస్తుంది. మీరా సమస్య అదే. రవి తనతో ఎమోషనల్‌గా కనెక్ట్ కావడంలేదని బాధపడుతోంది. 2. శారీరక సాన్నిహిత్యంPhysical intimacy అంటే కౌగిలింతలు, ముద్దులు, లైంగిక సంబంధాల వంటివి. దీనికి ఎంత ప్రాధాన్యం ఇస్తారనేది వారి వారి స్థాయిల్లో ఉంటుంది. ఒకరికి శారీరక సాన్నిహిత్యం అవసరం ఎక్కువగా ఉంటే, మరొకరికి దాని ప్రాముఖ్యత తక్కువగా ఉండవచ్చు. అప్పుడు ఇద్దరి మధ్యా దూరం ఏర్పడుతుంది. ఉదాహరణకు రవికి ఫిజికల్ ఇంటిమసీ ముఖ్యమైతే, మీరాకు ఎమోషనల్ ఇంటిమసీ అవసరం. వారిద్దరి మధ్య దూరానికి అదే కారణం. 3. మేధో సాన్నిహిత్యంఆలోచనలు, అభిప్రాయాలు, లోతైన చర్చల ద్వారా ఏర్పడేదే intellectual intimacy ఇద్దరు వ్యక్తులు తమ అభిప్రాయాలను పంచుకుంటూ మానసికంగా కలిసి ఉంటే, వారి సంబంధం మరింత బలపడుతుంది. కానీ, ఒకరు మేధోపరమైన చర్చల పట్ల ఆసక్తి చూపితే, మరొకరు ప్రాక్టికల్ విషయాలకే ప్రాధాన్యం ఇస్తే, అది అసంతృప్తికి దారితీస్తుంది. అంజలి, కార్తీక్‌ల మధ్య సమస్య ఇదే. 4. అనుభవైక సాన్నిహిత్యంఒకే విధమైన అనుభవాలను పంచుకోవడం ద్వారాexperiential intimacy ఏర్పడుతుంది. ఉదాహరణకు, కలిసి ప్రయాణం చేయడం, వంట చేయడం లేదా ఇతర హాబీలను పంచుకోవడం. ఇది బంధంలో టీమ్‌వర్క్‌ను పెంపొందిస్తుంది. కానీ, ఒక వ్యక్తి బహుళ అనుభవాలకు ప్రాధాన్యమిచ్చి.. మరొకరు వ్యక్తిగత సమయాన్ని కోరుకుంటే సమస్యలు వస్తాయి.5. ఆధ్యాత్మిక సాన్నిహిత్యంకొందరికి మతపరమైన లేదాspiritual intimacy చాలా ముఖ్యమైనది. కలిసి ప్రార్థనలు చేయడం, ధ్యానం చేయడం లేదా జీవితంపై చర్చలు చేయడం ఈ బంధాన్ని బలపరుస్తాయి. అయితే, ఆధ్యాత్మిక లక్ష్యాల్లో భిన్నత్వముంటే సమస్యలు తలెత్తుతాయి. ఉదాహరణకు.. పరమ భక్తురాలికి నాస్తికుడు భర్తగా ఉంటే ఎలా ఉంటుందో మీరే ఊహించండి. 6. ఆర్థిక సాన్నిహిత్యండబ్బు సంబంధిత విషయాల్లో పారదర్శకత, పరస్పర నమ్మకం కలిగి ఉండటమే financial intimacy. ఒకరు ఆదా చేయడంలో ఆసక్తి చూపుతుండగా, మరొకరు ఖర్చుల పట్ల ఆసక్తి చూపితే అది విభేదాలకు దారితీస్తుంది. -
Sai Pallavi: నాకంటే ఎక్కువే ప్రేమిస్తున్నాడు.. ఎమోషనలైన హీరోయిన్ (ఫోటోలు)
-
తాళికట్టి.. తలంబ్రాలు పోసి.. భార్యను ముద్దాడి (ఫొటోలు)
-
షణ్ముఖ్ జస్వంత్ ' లీల వినోదం' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
శోభిత పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సమంత.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫొటోలు)


