బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ప్రస్తుతం బోర్డర్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ ఏడాది జాట్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఆయన.. ఈ సినిమాతో హిట్ కొట్టేందుకు రెడీ అయ్యారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం నేపథ్య కథతోనే ఈ సినిమాని తెరకెక్కించారు. గతంలో 1997లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన బోర్డర్ చిత్రానికి సీక్వెల్ రూపొందించారు. తాజాగా ఈ మూవీ టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన సన్నీ డియోల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ధర్మేంద్ర మరణాన్ని తలచుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ టీజర్‌లోని డైలాగ్ చెబుతూ అభిమానులను అలరించారు. ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఆవాజ్ ఎక్కడి వరకు వెళ్లాలి? అని సన్నీ డియోలా అనడంతో.. ప్రేక్షకులు లాహోర్ వరకు అంటూ గట్టిగా అరిచారు. ప్రేక్షకుల స్పందనతో సన్నీ డియోల్ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మూవీ వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. తొలి పార్ట్‌కి జెపి దత్తా దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని అనురాగ్ సింగ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో దిల్‌జిత్ దోసాంజ్, వరుణ్ ధావన్, అహన్ శెట్టి కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. వీరంతా దేశాన్ని రక్షించడానికి పోరాడే సైనికుల పాత్రలు పోషించారు. ఈ సినిమాలో మోనా సింగ్, సోనమ్ బాజ్వా, అన్య సింగ్, మేధా రాణా హీరోయిన్లుగా కనిపించనున్నారు.
#SunnyDeol Gets Emotional At #Border2teaser Launch Event 🔥😭 pic.twitter.com/fn7dqfWc8J
— Filmy_Duniya (@FMovie82325) December 16, 2025


