మలయాళ స్టార్ మోహన్‌లాల్, తెలుగు యంగ్ హీరో రోషన్ తండ్రి, తనయులుగా నటిస్తోన్న ద్విభాషా చిత్రం వృషభ. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి విడుదల కావాల్సిన ఈ ఫుల్ యాక్షన్ మూవీ క్రిస్‌మస్‌కు షిఫ్ట్ అయింది. ఈ సినిమాను మలయాళంతో పాటు.. తెలుగులోనూ ఓకేసారి తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని మైథలాజికల్ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాజుల కాలం నాటి విజువల్స్, యాక్షన్ సీన్స్ బాహుబలి తరహాలో మోహన్ లాల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. బీజీఎం కూడా ట్రైలర్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో అభిమానులను అలరించనున్నారు.
కాగా.. ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నేహా సక్సెనా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్, కనెక్ట్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా నిర్మించారు. ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న తమిళం, కన్నడ, హిందీలో విడుదల కానుంది.


