శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఐదు రోజులుగా జరుగుతున్న భవానీ దీక్ష విరమణలు సోమవారం మహా పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి.
మొత్తం 5.27లక్షల మంది భవానీలు దీక్షలను విరమించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
మంగళవారం భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లు యథావిధిగా కొనసాగుతాయని, మంగళవారం కూడా వచ్చే భవానీలకు అన్ని క్యూలైన్లలో ఉచితంగా అనుమతిస్తామని ఆలయ అధికారులు ప్రకటించారు.


