breaking news
Vrusshabha Movie
-
రూ.70 కోట్ల సినిమా.. 2.19 కోట్ల కలెక్షన్స్.. స్టార్ హీరోకి కోలుకోలేని దెబ్బ!
గతంలో స్టార్ హీరో సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా మినిమం కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎంత పెద్ద హీరో అయినా సరే..బలమైన కంటెంట్‌తో రాకపోతే ప్రేక్షకులు థియేటర్స్ వైపే వెళ్లడం లేదు. సూపర్ హిట్ టాక్ వస్తే తప్పా..సినిమాకు మినిమం కలెక్షన్స్ రావడం లేదు. తాజాగా మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ సినిమాకు దారుణమైన పరాజయం ఎదురైంది. ఆయన నటించిన వృషభ మూవీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ డిజాస్టర్‌గా నిలిచింది.దాదాపు 70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి మొత్తంగా రూ. 2.19 కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అంటే పెట్టిన పెట్టుబడికి కనీసం రెండు శాతం మాత్రం రికవరీ చేసింది. ఓవర్సీస్లో అయితే ఈ మూవీ 8 రోజుల్లో కేవలం రూ. 25 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇండియాలో రూ. 1.94 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగులో అయితే ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. తొలి రోజు రూ. 10 లక్షలు వస్తే..నాలుగో రోజు కేవలం రూ. లక్షకు మాత్రమే పరిమితమైంది. తెలుగు వెర్షన్లో మొత్తంగా రూ. 32 లక్షలు, మలయాళంలో రూ. 1.01 కోట్లు, హిందీలో రూ. 8 లక్షలు, కన్నడ వెర్షన్ దాదాపు రూ. 4 లక్షలు మాత్రమే సాధించింది. మొత్తంగా ఈ సినిమాకు దాదాపు రూ. 65 కోట్లకు పైనే నష్టం వచ్చేలా కనిపిస్తుంది.ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలి ఫిల్మ్స్ బ్యానర్‌తోపాటు కనెక్ట్ మీడియా, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహించారు. సమర్జీత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్, వినయ్ వర్మ, అలీ, అయప్ప పి.శర్మ, కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
మోహన్ లాల్ వృషభ మూవీ రివ్యూ.. ఆడియన్స్‌ను మెప్పించిందా?
టైటిల్: వృషభనటీనటులు: మోహన్ లాల్, సమర్జీత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, అజయ్ తదితరులుదర్శకత్వం: నందకిశోర్విడుదల తేదీ..డిసెంబర్ 25, 2025మలయాళ స్టార్ మోహన్ లాల్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. జనతా గ్యారేజ్ మూవీతో టాలీవుడ్ ప్రియుల గుండెల్లో నిలిచిపోయారు. ఈ ఏడాది తుడురమ్, ఎంపురాన్-2, హృదయపూర్వం చిత్రాలతో అలరించారు. తాజాగా మోహన్ లాల్ హిస్టారికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఓకేసారి తెలుగు, మలయాళ భాషల్లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.వృషభ కథేంటంటే..గత జన్మలు కూడా ఉన్నాయని మనందరం వింటుంటాం. అయితే ఆ జన్మలో మనం ఎలా పుట్టాం.. అసలేం జరిగింది కేవలం ఊహాజనితమే. అసలు గత జన్మలు ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదు. అయితే ఆ రెండు జన్మలను ఓకేసారి చూపిస్తూ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అందించే చిత్రమే మోహన్ లాల్ వృషభ.ఈ కథ రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్)కు ఓ మహిళ పెట్టే శాపంతో మొదలవుతుంది. గత జన్మలో జరిగిన సంఘటనలతో ఈ కథను ప్రారంభించాడు. బిజినెస్‌లో ఆదిదేవ వర్మ(మోహన్ లాల్) కింగ్. ప్రతి ఏడాది ఉత్తమ బిజినెస్‌మెన్‌గా అవార్డ్ ఆయనకు రావాల్సిందే. అలా ఇది నచ్చని మరో వ్యాపారవేత్త అవార్డ్ బహుకరించే రోజే ఆదిదేవ వర్మపై దాడికి ప్లాన్ చేస్తాడు. కానీ ఆది దేవ వర్మ కుమారుడు తేజ్(సమర్జీత్ లంకేశ్) ఎంట్రీతో ఆ ప్లాన్ తిప్పికొడతాడు. అలా వర్తమానంలో తండ్రీ, తనయులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తేజ్ పెళ్లి చేసుకోవాలనేది తండ్రి బలమైన కోరిక. ఈ విషయాన్ని పదే పదే తన కొడుకుతో చెబుతుంటాడు.అదే సమయంలో గత జన్మ అనుభవాలతో ఆది దేవ వర్మ సతమతమవుతుంటాడు. ఈ విషయం తెలుసుకున్న తేజ్ తండ్రి కోసం మంచి సైక్రియాటిస్ట్ను కలవాలనుకుంటాడు. ఇదే క్రమంలో దామిని(నయన్ సారిక) అతనికి పరిచయం అవుతుంది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అలా ఇద్దరు కలిసి ఆదిదేవ వర్మ సమస్యకు పరిష్కారం కోసం బయలుదేరతారు. నాన్నకు ఉన్న ప్రాబ్లమ్ గురించి ఇంట్లో పనిచేసే వంటమనిషి పప్పు.. తేజ్‌తో ఓ ఆసక్తికర విషయం చెబుతాడు. ఇది విన్న తేజ్ తండ్రికి చెప్పకుండానే వెంటనే సొంత గ్రామమైన దేవనగరికి బయల్దేరతాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. అసలు తేజ్ ఆ ఊరికి ఎందుకు వెళ్లారు? తండ్రి కోసం వెళ్లిన తేజ్ ఎందుకలా మారిపోయాడు. అసలు తండ్రీ, కొడుకుల మధ్య ప్రతీకారానికి కారణమేంటి? ఆది దేవ వర్మకు గత జన్మలో అసలేం జరిగింది? ఆ జ్ఞాపకాలు ఇంకా ఎందుకు వెంటాడుతున్నాయి? అసలు ఆ మహిళ పెట్టిన శాపం ఏంటి? అనేది తెలియాలంటే వృషభ చూడాల్సిందే.ఎలా ఉందంటే..మామూలుగా గత జన్మలో ఏం జరిగింది అనేది మొదట చూపించి కథను మొదలెడతాం. అలానే గత జన్మలో రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్)కు జరిగిన సంఘటనలను పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్లాడు. గత జన్మలో రాజా విజయేంద్ర వృషభ అసమాన యోధుడిగా తన రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. తన సామ్రాజ్యాన్ని, ప్రజల్ని కాపాడుకుంటూ ఉంటాడు అయితే వృషభ చేసిన పొరపాటు వల్ల ఓ మహిళ ఆయనకు శాపం పెడుతుంది. అదే శాపం వర్తమానంలోనూ ఆదిదేవ వర్మ(మోహన్ లాల్)ను వెంటాడుతుంది. అయితే కుమారుడి కోసం తాపత్రయ పడుతున్న ఆదిదేవకు..దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ పాతదే కావొచ్చు. కానీ స్క్రీన్ ప్రజెంట్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకుంది. తాను అనుకున్నట్లుగానే కథను ప్రేక్షకులను పరిచయం చేశాడు. ప్రారంభంలోనే రాజుకు పెట్టే శాపం రివీల్ చేసి ఆసక్తి క్రియేట్ చేశాడు. ఆ తర్వాత వర్తమానంలోకి తీసుకెళ్లాడు. తండ్రి, కుమారుల మధ్య బాండింగ్.. కొడుకు కోసం తండ్రి.. తండ్రి కోసం కుమారుడు పడే తపన చూపించాడు. అమ్మాయితో పరిచయం కావడం.. వెంటనే ఇద్దరి మధ్య లవ్.. చకాచకా ఓకే చెప్పడం.. అలా కథను చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. ఫస్ట్ హాప్ మొత్తం ఆదిదేవ వర్మ(మోహన్ లాల్), సమర్జీత్ లంకేశ్(తేజ్)ల బాండింగ్.. దామినితో లవ్‌లో పడడం అంతా రోటీన్‌గా సాగుతుంది. తేజ్ ఎప్పుడైతే తండ్రి సొంత గ్రామమైన దేవనగరి గ్రామానికి వెళ్లాడో అక్కడి నుంచే కథలో వేగం పుంజుకుంది. ఫస్ట్ హాఫ్‌లో కథ ప్రేక్షకుడి ఊహకందేలానే సాగుతుంది. కానీ అలా ప్రేక్షకుడు కథలో లీనమవ్వగానే.. ఇంటర్వెల్‌కు ముందు ఇచ్చే ట్విస్ట్ అస్సలు ఊహించలేరు. ఆ బిగ్ ట్విస్ట్ థియేటర్లో చూసి సగటు ప్రేక్షకుడు షాకవ్వాల్సిందే. అలా ప్రథమార్థాన్ని వర్తమానంతోనే ముగించాడు. సెకండాఫ్‌లో గత జన్మలో జరిగిన పరిణామాలు.. రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్) త్రిలింగ రాజ్యం గురించే ఉంటుంది. ఆ రాజ్యంలో జరిగే సంఘటనలు చుట్టే తిరుగుతుంది. కానీ త్రిలింగ రాజ్యంలోని స్ఫటిక లింగం దొంగతనం చేసేందుకు వచ్చిన హయగ్రీవా(సమర్జీత్ లంకేశ్) వస్తాడు. ఆ తర్వాత వృషభ రాజుకు.. హయగ్రీవాకు మధ్య జరిగే పోరాటం సెకండాఫ్‌లో హైలెట్. ఆ యుద్ధ ఫైట్ సీన్లో జరిగిన సంఘటన తర్వాతే ఈ కథ ఏంటనేది ప్రేక్షకుడికి అర్థమవుతుంది. అప్పటిదాకా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే. సెకండాఫ్‌లో అలీ కామెడీ కొద్దిసేపే అయినా నవ్వులు తెప్పించింది. ఇందులో గత జన్మకు.. వర్తమానానికి ముడిపెట్టడం వల్ల ప్రేక్షకుడిని కాస్తా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. గత జన్మ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ కథలో క్లైమాక్స్‌లో ఫుల్ ఎమోషన్ క్రియేట్ చేశాడు. తండ్రీ, తనయుల మధ్య పోరాటాన్ని భావోద్వేగానికి ముడిపెడుతూ మలిచిన తీరు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ఈ కథలో ప్రేక్షకుడి ఊహకందని బిగ్ ట్విస్ట్‌లు ఇచ్చాడు డైరెక్టర్. కథలో కొత్తదనం లేకపోయినా విజువల్స్, స్క్రీన్ ప్లేతో సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకున్నారు. ఆడియన్స్‌కు ఎక్కడా బోరింగ్ అనిపించకుండా కథను ముందుకు తీసుకెళ్లడం ప్లస్. భారీ ఫైట్స్ లేకున్నా..కథకు తగినట్లుగా ప్లాన్ చేశాడు.ఎవరెలా చేశారంటే..మోహన్ లాల్ ఆదిదేవ వర్మగా, రాజా విజయేంద్ర వృషభగా రెండు పాత్రల్లో తనలోని టాలెంట్‌తో ఆకట్టుకున్నారు. సమర్జీత్ లంకేశ్ యంగ్ హీరోగా అదరగొట్టేశాడు. గత జన్మ హయగ్రీవా పాత్రలో డిఫరెంట్‌గా కనిపించాడు. నయన సారిక తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్, వినయ్ వర్మ, అలీ, అయప్ప పి.శర్మ, కిషోర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. బీజీఎం అంత కాకపోయినా ఫర్వాలేదనిపించింది. సామ్ సీఎస్ నేపథ్యం సంగీతం బాగుంది. కృతి మహేశ్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా గ్రాండ్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ వీకెండ్లో ఓ డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే వృషభ చూడాల్సిందే. -
రాజుగా మోహన్ లాల్.. వృషభ ట్రైలర్ వచ్చేసింది!
మలయాళ స్టార్ మోహన్‌లాల్, తెలుగు యంగ్ హీరో రోషన్ తండ్రి, తనయులుగా నటిస్తోన్న ద్విభాషా చిత్రం వృషభ. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి విడుదల కావాల్సిన ఈ ఫుల్ యాక్షన్ మూవీ క్రిస్మస్కు షిఫ్ట్ అయింది. ఈ సినిమాను మలయాళంతో పాటు.. తెలుగులోనూ ఓకేసారి తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని మైథలాజికల్ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాజుల కాలం నాటి విజువల్స్, యాక్షన్ సీన్స్ బాహుబలి తరహాలో మోహన్ లాల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. బీజీఎం కూడా ట్రైలర్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో అభిమానులను అలరించనున్నారు. కాగా.. ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నేహా సక్సెనా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్, కనెక్ట్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా నిర్మించారు. ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న తమిళం, కన్నడ, హిందీలో విడుదల కానుంది. -
తండ్రీ కొడుకుల ఎమోషనల్ సాంగ్
మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్, తెలుగు యంగ్ హీరో రోషన్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్న చిత్రం 'వృషభ'.. తాజాగా ఈ మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్ విడుదల చేశారు. ఇందులో రాగిణి ద్వివేది, నేహా సక్సెనా తదితరులు నటించారు. దర్శకుడు నంద కిశోర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా నిర్మించారు. మలయాళం, తెలుగులో ఏక కాలంలో చిత్రీకరించిని ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న తమిళ్, కన్నడ, హిందీలో విడుదల కానుంది. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ పతాకంపై రానున్న ఈ మూవీని మూన్లైట్, థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ వంటి హాలీవుడ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన నిక్ తుర్లో ఈ చిత్రం కోసం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేయడం విశేషం. ఆయన చిత్రాలకు గతంలో ఆస్కార్ కూడా దక్కింది. -
మోహన్ లాల్ పాన్ ఇండియా మూవీ రిలీజ్.. దీపావళికి కాదు!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న ద్విభాషా చిత్రం వృషభ. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మలయాళంతో పాటు.. తెలుగులోనూ ఓకేసారి తెరకెక్కించడం విశేషం. ఈ పాన్ ఇండియా చిత్రంపై మోహన్ లాల్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ఫుల్ యాక్షన్ మూవీ దీపావళికి రిలీజ్ కావాల్సి ఉంది. మొదట అక్టోబర్ 23 రిలీజ్ చేస్తామని ప్రకటించారు.కానీ ఈ దీపావళికి థియేటర్లలో వృషభ రిలీజ్ కావడం లేదు. తాజాగా కొత్త రిలీజ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. వచ్చేనెల అంటే నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తుంటే ఈ మూవీని పురాణాల నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. విజువల్స్, యాక్షన్ సీన్స్ బాహుబలి తరహాలో మోహన్ లాల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో మోహన్ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్, కనెక్ట్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మించారు. The ground shakes. The sky burns. Destiny has chosen its warrior. #Vrusshabha arrives on 6th November! #RoarOfVrusshabha #VrusshabhaOn6thNovember#SamarjitLankesh @ursnayan @raginidwivedi24 @Connekktmedia @balajimotionpic #AbishekSVyasStudios @FilmDirector_NK #ShobhaKapoor… pic.twitter.com/emyiIFJ5uR— Mohanlal (@Mohanlal) October 9, 2025 -
మోహన్ లాల్ పాన్ ఇండియా మూవీ.. పవర్ఫుల్ టీజర్ వచ్చేసింది
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న ద్విభాషా చిత్రం వృషభ. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫుల్ యాక్షన్ మూవీ దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వృషభ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను మలయాళంతో పాటు.. తెలుగులోనూ ఓకేసారి తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.టీజర్ చూస్తుంటే ఈ మూవీని పురాణాల నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. విజువల్స్, యాక్షన్ సీన్స్ బాహుబలి తరహాలో మోహన్ లాల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. బీజీఎం కూడా టీజర్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో కనిపించనున్నారు. కత్తితో ఫైట్ చేస్తున్న సీన్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా.. ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్, కనెక్ట్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్ల నిర్మించారు. ఇంకెందుకు ఆలస్యం వృషభ టీజర్ చూసేయండి.


