మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్, తెలుగు యంగ్ హీరో రోషన్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్న చిత్రం 'వృషభ'.. తాజాగా ఈ మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్ విడుదల చేశారు. ఇందులో రాగిణి ద్వివేది, నేహా సక్సెనా తదితరులు నటించారు. దర్శకుడు నంద కిశోర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా నిర్మించారు. మలయాళం, తెలుగులో ఏక కాలంలో చిత్రీకరించిని ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న తమిళ్, కన్నడ, హిందీలో విడుదల కానుంది. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ పతాకంపై రానున్న ఈ మూవీని మూన్‌లైట్, థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ వంటి హాలీవుడ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన నిక్ తుర్లో ఈ చిత్రం కోసం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేయడం విశేషం. ఆయన చిత్రాలకు గతంలో ఆస్కార్ కూడా దక్కింది.


